మేయర్ ఇలా..అధికారులు అలా..
డాబాగార్డెన్స్: కాలుష్య రహిత నగరంగా విశాఖను తిర్చిదిద్దుదామని నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి కంకణం కట్టుకున్నారు. అందుకు ప్రతి సోమవారం వ్యక్తిగత వాహనాలు వీడి ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు. జీవీఎంసీ అధికారులు కూడా ఇలాగే రావాలని నిర్ణయించుకున్నారు. అయితే మేయర్ హరి వెంకటకుమారి మాత్రం మాట తప్పకుండా ప్రతి సోమవారం ఆర్టీసీ బస్సులోనే జీవీఎంసీకి చేరుకుంటున్నారు. అధికారులు మాత్రం వ్యక్తిగత వాహనాలు వీడడం లేదు. ప్రతి సోమవారం జీవీఎంసీ వాహనంలో ఇంటి నుంచి బయలుదేరి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటున్నారు. గేట్ ముందు వాహనం దిగి..ప్రధాన కార్యాలయం లోపలికి నడుచుకుంటూ విధులకు హాజరవుతున్నారు. తామంతా వ్యక్తిగత వాహనాల్లో రావడం లేదని బిల్డప్ ఇస్తూ ఇలా నాలుగు అడుగులు నడుస్తున్నారు. ఇది చూసిన జనం మాత్రం నవ్వుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment