త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలి
విశాఖ సిటీ: ప్రజాదర్బార్‌లో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి 21 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్‌తో కలిసి అర్జీల పరిష్కారంపై సమీక్షించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదుల్లో విభాగాల వారీగా ఎన్ని పరిష్కారమయ్యాయని తెలుసుకున్నారు. ప్రజాదర్బార్‌లో వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తేనే సంస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఫిర్యాదుదారుడికి నిర్ధిష్ట కాల పరిమితిలో సమాధానం ఇచ్చే విధంగా ఉద్యోగులు బాధ్యత వహించాలని సూచించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ మాట్లాడుతూ అర్జీదారులు పలుమార్లు సంస్థ సంస్థ చుట్టూ తిరగకుండా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ జాయింట్ కమిషనర్ కె.రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, ఎస్టేట్ అధికారి దయానిధి, చీఫ్ ఇంజనీర్ భవానీశంకర్, సీయూపీ శిల్ప, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ హరిప్రసాద్, డీఎఫ్‌ఓ శివాని, ల్యాండ్ అక్వెజిషన్ అధికారి వేణుగోపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment