వాస్తవానికి కేకే లైన్ రెండు డివిజన్లకు సరిహద్దు మధ్య భాగంగా ఉంది. ఈ లైన్ సింహభాగం కార్యకలాపాలన్నీ విశాఖపట్నం డివిజన్ పరిధిలోనే ఉంటాయి. అయితే కేకే లైన్‌లో సరకు రవాణా ఎక్కువగా జరుగుతుంటుంది. దీనికి సంబంధించిన రవాణా వసూళ్లన్నీ కిరండూల్ సెక్షన్‌లో నిర్వహిస్తారు. అక్కడ చార్జీల చెల్లింపులు జరిగిన తర్వాత గూడ్స్ రైళ్లు విశాఖపట్నం వైపు సరకుతో వస్తాయి. ఈ లెక్కన చూస్తే రెండు డివిజన్లకు ఆదాయం చెందాల్సి ఉంటుంది. కానీ, పంపకాలు ఉన్నాయా లేదా అనే దానిపై రైల్వే బోర్డు స్పష్టత ఇవ్వలేదు. అలాగే కేకేలైన్‌లో ఎక్కువ కొండ చరియలు విరిగిపడుతుంటాయి. ఈ నిర్వహణ బాధ్యతలు ఎవరు చేపడతారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, కేకే లైన్ పరిధిలో విధులు నిర్వర్తించే వారి పరిస్థితి దయనీయంగా మారనుంది. బదిలీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సెలవులు దొరికే పరిస్థితులు కూడా ఉండబోవని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment