అందని బిల్లులు.. నిలిచిన నిర్మాణాలు
కొత్త పురపాలికల్లో అసంపూర్తిగా వైకుంఠధామాలు
కల్పించాల్సిన సౌకర్యాలు..
వైకుంఠధామాల్లో వేచి ఉండే గదులు, సెక్యూరిటీ గది, యాష్ రూంతో పాటు సీటింగ్ గ్యాలరీ నిర్మించాలి. రెండు బర్నింగ్ ప్లాంట్లు, పూజా మండపం, టాయిలెట్లు, స్నానపు గదులు ఉండాలి. అంతేగాకుండా ఆహ్లాదానికి పచ్చదనం, మధ్యలో పార్క్ ఏర్పాటు చేస్తారు. చుట్టూ ప్రహరీ లేదా ఫెన్సింగ్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం సంకల్పించింది.
బిల్లుల చెల్లింపులు ఇలా..
అమరచింత పురపాలికలో 50 శాతం పనులు పూర్తయినా ఒక్క రుపాయి కూడా చెల్లించలేదు. పెబ్బేరులో కూడా అదే పరిస్థితి. ఆత్మకూర్‌లో రూ.45 లక్షలు, కొత్తకోటలో రూ.30 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లించారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసి పెండింగ్ బిల్లుల కోసం పట్టుబడుతున్నారు. కొత్త ప్రభుత్వమైనా బకాయి బిల్లులు చెల్లిస్తే మిగిలిన పనులు నెలరోజుల్లో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
అమరచింత: పట్టణాల్లో స్థల ప్రభావంతో మృతదేహాల ఖననానికి ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన గత ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఆధునిక హంగులతో వైకుంఠధామాల నిర్మాణానికి పూనుకుంది. ఒక్కో నిర్మాణానికి రూ.కోటి విడుదల చేసి టెండర్ ప్రక్రియ చేపట్టి పనులు అప్పగించింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించినా.. సకాలంలో బిల్లులు అందకపోవడంతో నిలిపివేశారు. ఆయా మున్సిపాలిటీల్లో పనులు 65 శాతం నుంచి 70 శాతం వరకు పూర్తవగా.. ప్రభుత్వం మారడంతో పూర్తిగా మరుగునపడినట్లయింది. పాలకులు, అధికారులు స్పందించి అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
జిల్లాలో కొత్తగా ఏర్పడిన పురపాలికలు అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్‌లో రెండేళ్ల కిందట వైకుంఠధామాల నిర్మాణాలకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టెండర్ ప్రక్రియలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభించినా.. దఫాల వారీగా బిల్లులు వస్తాయన్న ఆశతో పనుల్లో వేగం పెంచారు. కానీ కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో పెట్టుబడి భారంగా మారి పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. కొత్తకోట, అమరచింత, ఆత్మకూర్‌లో 75 శాతం పనులు పూర్తవగా.. పెబ్బేరులో 30 శాతం కూడా పనులు జరగలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో 50 శాతం పనులు మాత్రమే జరిగాయని తెలుస్తోంది.
జిల్లాలో ఇలా..
రూ.కోటితో నిర్మాణానికి పూనుకున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం
బిల్లులు అందక పనులు నిలిపిన కాంట్రాక్టర్లు
కనిపించని పురోగతి
Comments
Please login to add a commentAdd a comment