‘ఆశాల హామీలు అమలు చేయాలి’
క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి..
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగిన సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడల ముగింపు కార్యక్రమం గురువారం రాత్రి నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆటలతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ క్రీడాకారుడని వివరించారు. వనపర్తిలో విద్యా వికాసానికి తనవంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాకేంద్రంలో ఐటీ టవర్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.22 కోట్లు తన అభ్యర్థన మేరకు మంజూరు చేసిందని చెప్పారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. సీఎం కప్ పోటీలను గ్రామ, మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పూర్తి చేశామన్నారు. మొత్తం 36 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో 3,600 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు డిసెంబర్ 27 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని.. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని సూచించారు. అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు పతకాలు, జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, జీపీ కిరణ్‌కుమార్, డీపీఆర్వో సీతారాం, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
వనపర్తి రూరల్: కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో ఆశా కార్యకర్తలకు నిర్ణీత వేతనం రూ.18 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని.. వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆశా కార్యకర్తల సంఘం (సీఐటీయూ అనుబంధం) జిల్లా అధ్యక్షుడు బుచ్చమ్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయనతో పాటు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు, జిల్లా కార్యదర్శి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఆశాలకు ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. అధికారుల వేధింపులు ఆపాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా, అదనపు పనులకు అదనపు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనైనా నిర్ణీత వేతనం అమలు చేయాలని.. లేదంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 23న జిల్లా కేంద్రానికి ఆశా కార్యకర్తల బస్సుజాతా వస్తుందని.. విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు ఆశా కార్యకర్తలతో కలిసి బస్సుజాతా వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం నాయకులు భాగ్య, గిరిజ, సుజాత, ఇందిర, లక్ష్మీదేవి, జ్యోతి, చిట్టెమ్మ, అనిత, బాలమణి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment