విద్యార్థులు ఉన్నత లక్ష్యం నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా చదవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాఠ్య పుస్తకాలతో పాటు సామాజిక అవగాహన పెంపొందించే సాహిత్యాన్ని చదవాలని.. వాటి ద్వారా సంస్కారం, మానవ విలువలు అలవడతాయన్నారు. మానవతా విలువలు పెంపొందించేందుకు బాల సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుడు కిరణ్‌కుమార్ కృషి అభినందనీయమని కొనియాడారు. ‘అవ్వాతాతలకు ఉత్తరాలు రాద్దాం.. రండి’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్ రాసిన ‘గోటిలాట’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐ కృష్ణ, ఎస్‌ఐ శ్రీనివాసులు, హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment