మహబూబ్‌నగర్ ఇక కార్పొరేషన్
ఎన్నికల హామీ మేరకు పురపాలకం
అసెంబ్లీ ఎన్నికలు ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మద్దూరు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. మద్దూరు అనుబంధ గ్రామాలుగా ఉన్న భీంపూర్, నాగంపల్లి, సాపన్‌చెరవుతండాతో పాటు రెనివట్ల, వాల్యానాయక్‌తండా, అంబటోనివంపులను కూడా పురపాలికలో విలీనం చేశారు. 2023 లెక్కల ప్రకారం వీటన్నింటిలో కలిపి 12,595 మంది ఓటర్లు ఉన్నారు.
పురపాలికలుగా
దేవరకద్ర, మద్దూరు
● అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటనతో హర్షాతిరేకాలు
● ఉమ్మడి జిల్లాలో
20కి చేరిన మున్సిపాలిటీలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రం ఇక కార్పొరేషన్‌గా మారనుంది. అలాగే దేవరకద్ర గ్రామపంచాయతీతో పాటు నారాయణపేట జిల్లాలోని మద్దూరు సైతం మున్సిపాలిటీగా అవతరించనున్నాయి. ఈ మేరకు గతంలోనే అధికారులు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ మూడింటిని అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కాగా, ప్రస్తుతం మహబూబ్‌నగర్ పట్టణ పరిధిలోని 49 వార్డులలో సుమారు 2.88 లక్షల జనాభా ఉంది. కొత్తగా కార్పొరేషన్ అయ్యేందుకు మూడు లక్షల జనాభా అవసరం కావడంతో శివారులోని జైనల్లీపూర్, దివిటిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఈ రెండు కలుపుకొని డివిజన్లు 51కి చేరుతుంది. మొత్తం మీద కార్పొరేషన్ కానుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు నిధులు సమకూరి వివిధ అభివృద్ధి పనులు వేగంగా చేపట్టవచ్చు. ఆయా వార్డుల్లో రోడ్లు, డ్రెయినేజీ తదితర మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి.
● మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌ను మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 20కి చేరింది. వనపర్తి జిల్లాలో 5, జోగుళాంబ గద్వాలలో 4, నాగర్‌కర్నూల్‌లో 4, నారాయణపేటలో 4, మహబూబ్‌నగర్‌లో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి.
పన్నులు పెరుగుతాయని
ఆందోళన
ఇదిలా ఉండగా ఆయా గ్రామాల్లో ఇక ఆస్తిపన్ను, నల్లా బిల్లులు, భవన నిర్మాణ అనుమతికి చెందిన చార్జీలు పెరుగుతాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు ఈ గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కొనసాగుతుండగా.. ఇక నుంచి ఇది అమలు కాదని తెలుసుకున్న వారు ఏమి చేయాలోనని తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు గతంలోనే సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసినందున ఇదే అదనుగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఒకవేళ సర్పంచ్‌ల పదవీకాలం కొనసాగి ఉంటే ఎక్కడికక్కడ గ్రామసభలు ఏర్పాటు చేసి మున్సిపాలిటీలుగా మార్చవద్దని తీర్మానాలు చేసేవారు.
దేవరకద్ర పురపాలికలోని విలీన గ్రామాలు,
ఓటర్లు..
పెద్దగోప్లాపూర్ 593
మీనుగోనిపల్లి 707
నెరవేరిన దేవరకద్ర ప్రజల కల
ఐదు దశాబ్దాలుగా మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న దేవరకద్రకు మున్సిపాలీటీ హోదా లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్న పట్టణాలు కూడా మున్సిపాలిటీలుగా మారాయి. కానీ స్థానిక పాలకుల నిర్లక్ష్యం వల్ల దేవరకద్రకు ఆ అవకాశం దక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేవరకద్రను మున్సిపాలిటీగా మార్చడానికి నాలుగు గ్రామాలతో కలిపి ప్రతిపాదనలు చేశారు. అయితే ఇది కార్యరూపం దాల్చకుండానే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిది. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు చేయడంతో దేవరకద్రకు మున్సిపాలిటీ హోదా దక్కింది. మున్సిపాలిటీగా ప్రకటించినందుకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పట్టణ ప్రజల తరఫున సీఎం రేవంత్‌రెడ్డికి అసెంబ్లీలో కృతజ్ఞతలు తెలిపారు.
బలుసుపల్లి
643
చౌదర్‌పల్లి
1114
దేవరకద్ర
6315
Comments
Please login to add a commentAdd a comment