కృష్ణమ్మ తగ్గుముఖం
● వేగంగా ‘వెనక్కి’..
రోజురోజుకు తగ్గిపోతున్న బ్యాక్ వాటర్
మూడు మోటార్లతోనే..
కేఎల్‌ఐ ప్రాజెక్టులో రిజర్వాయర్ల కొరతతో పాటు మోటార్ల సమస్య కూడా సాధారణ అంశంగా మారింది. ప్రాజెక్టులో మొదటి లిఫ్టు అయిన ఎల్లూరు పంప్‌హౌజ్‌లో ఐదు మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో మూడు మాత్రమే పనిచేస్తున్నాయి. మరో రెండు మోటార్లు మరమ్మతుకు గురయ్యాయి. పలు కారణాల వల్ల మరమ్మతు పనులు పూర్తి కావడం లేదు. ఐదు మోటార్లను వినియోగంలోకి తీసుకువస్తే మరిన్ని నీళ్లను ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంటుంది.
కొల్లాపూర్: కృష్ణానదిలో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నెలరోజుల కనిష్టానికి నీటిమట్టం చేరుకుంది. జనవరి నెలాఖరులో ఉండే లెవల్‌కు డిసెంబర్‌లోనే శ్రీశైలం బ్యాక్‌వాటర్ తగ్గిపోయింది. రాయలసీమలోని సాగు, తాగునీటి ప్రాజెక్టులకు విరివిగా నీటిని తరలిస్తుండటంతో పాటు, శ్రీశైలం డ్యాం వద్ద విద్యుదుత్పత్తి, కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టడంతో కృష్ణానదిలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది.
ఈ ఏడాది 23 టీఎంసీలు
కేఎల్‌ఐ ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు కేఆర్‌ఎంబీ అనుమతులు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 23 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ప్రాజెక్టులోని మూడు మోటార్ల ద్వారా ఎత్తిపోతలు సాగుతున్నాయి. రోజూ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. మరో 17 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేందుకు వెసులుబాటు ఉన్నప్పటికీ చాలినన్ని రిజర్వాయర్లు లేకపోవడంతో నీటి ఎత్తిపోతలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
నెలరోజుల కనిష్ట స్థాయికి శ్రీశైలం జలాశయ నిల్వలు
ప్రస్తుతం 863 అడుగుల మేర నీటిమట్టం
సాగునీటితో పాటు మిషన్ భగీరథ పథకానికి వినియోగం
నీటినిల్వకు అదనపు రిజర్వాయర్ల నిర్మాణమే పరిష్కార మార్గం
Comments
Please login to add a commentAdd a comment