వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలి
పెబ్బేరు రూరల్: రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం పెబ్బేరు మార్కెట్‌యార్డు, కంచిరావుపల్లిలోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ధాన్యం సేకరణ నిబంధనల ప్రకారం జరగాలని.. తేమ, తాలు, చెత్త లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. సేకరించిన ధాన్యం వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment