రిజర్వాయర్లేవి?
ఎత్తిపోతలు సరే..
ఆర్డీఎస్కు ప్రత్యామ్నాయంగా రూపకల్పన చేసిన తుమ్మిళ్ల
ఎత్తిపోతల పథకం వెక్కిరిస్తూనే ఉంది. మొత్తం 57,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యంతో ఈ పథకానికి రూ.1,197.77 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రూ.829.36 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం తుంగభద్ర నదికి సంబంధించి సుంకేసుల బ్యాక్ వాటర్ నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని పంప్‌హౌస్‌కు తరలించి.. అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి ఆర్డీఎస్
కాల్వలో డీ–23 వద్ద వదులుతున్నారు. అప్రోచ్ కెనాల్,
పంప్ హౌస్, డెలివరీ సిస్టర్న్ నిర్మాణాలు మాత్రమే పూర్తి కాగా.. నిర్మించాలనుకున్న మూడు ప్రధాన రిజర్వాయర్ల నిర్మాణాల ఊసే లేకుండా పోయింది. ఫలితంగా లక్ష్యంలో సగం ఎకరాలకు కూడా
నీరందని పరిస్థితి.
వెక్కిరిస్తున్న ‘తుమ్మిళ్ల’..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: చెంతనే కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నా.. ఉప్పొంగి ప్రవహిస్తున్నా.. ఆ నీటిని ఒడిసిపట్టుకోలేని దుస్థితి పాలమూరుది. నదీ నీటి మట్టం కంటే ఎక్కువ ఎత్తులో ఉండడమే ఇందుకు కారణం కాగా.. ఎత్తిపోతల పథకాలకు అంకురార్పణ జరిగింది. 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎత్తిపోతల పథకాల్లో భాగంగా చేపట్టాల్సిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాలు ఇప్పటికీ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. కొన్నింటిని నిర్మించినప్పటికీ.. నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో ఆయకట్టు చివరి వరకు ఒక్క పంటకు సైతం పూర్తిస్థాయిలో నీరందడం లేదు. ప్రధానంగా కల్వకుర్తి, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాల్లో పలు రిజర్వాయర్ల నిర్మాణాలు అటకెక్కగా.. వాటి పరిధిలోని ఆయకట్టు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కేఎల్‌ఐ.. ప్రతిపాదనలకే పరిమితం
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్‌ఐ)లో ఇప్పటివరకు నాలుగు రిజర్వాయర్లు నిర్మించారు. ఎల్లూరు 0.35 టీఎంసీలు, సింగోటం 0.55 టీఎంసీలు, జొన్నలబొగుడ 2.14 టీఎంసీలు, గుడిపల్లిగట్ట 0.96 టీఎంసీలు.. అన్ని కలిపి దాదాపు నాలుగు టీఎంసీల నిల్వ సామర్థ్యం గలవి ఉన్నాయి. కృష్ణానదికి సాధారణంగా 60 వరద రోజులు కాగా.. ఒక్కోసారి ఎక్కువ నమోదు కావొచ్చు. మొత్తం నాలుగు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్లలో 40 టీఎంసీలను ఎత్తిపోసేలా సమర్థవంతమైన నిర్వహణ కుదరడం లేదు. దీంతో కల్వకుర్తి కింద ప్రస్తుతం మూడు లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోంది. ఈ ఎత్తిపోతల కింద నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండడంతో 47 అదనపు రిజర్వాయర్లను నిర్మించాలని అధికారులు చేసిన ప్రతిపాదనలు అటకెక్కాయి.
ప్రతిపాదనలను దాటని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణం
వరదలు వస్తున్నా కృష్ణా, తుంగభద్ర నీటిని ఒడిసిపట్టుకోలేని దుస్థితి
భారీ సామర్థ్యం గల జలాశయాలు
లేక నెరవేరని లక్ష్యం
పాలమూరులో పూర్తిస్థాయిలో
వినియోగంలోకి రాని ఆయకట్టు
కేఎల్‌ఐ, తుమ్మిళ్ల పెండింగ్
ప్రతిపాదనలపె రైతుల ఎదురుచూపులు
జీఓ దాటని ‘మల్లమ్మకుంట’..
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా మల్లమ్మకుంట (1.03 టీఎంసీలు), జూలకల్ (టీఎంసీ), వల్లూరు (1.02 టీఎంసీలు) రిజర్వాయర్లను నిర్మించాలని ప్రతిపాదించారు. పాలకులు పట్టించుకోకపోవడంతో ఇవి అటకెక్కాయి. 2023 ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, జీఓ విడుదల చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. భూసేకరణ సమస్యతో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణంపై ఇప్పటివరకు మరో అడుగు ముందుకుపడలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ వైపు పల్లం ఉండడంతో వరద వచ్చిన సమయంలోనూ తెలంగాణ వైపు ఎత్తిపోతలకు తిప్పలు తప్పకపోవడంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల నిర్వహణ అస్తవ్యస్తంగా మారినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment