ఎరువుల వాడకంపై అవగాహన ఉండాలి
వరంగల్: జిల్లాలోని రైతులు తమ పొలాల్లో వేసిన పంటలకు ఎరువులు వాడే విధానంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) కె.అనురాధ అన్నారు. సోమవారం అరెపల్లి సమీపంలోని రైతు శిక్షణ కేంద్రంలో ఎరువుల వాడకంపై అవగాహన కల్పించే వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు అవగాహన కల్పించే స్పిక్ కంపెనీ వాహనం ద్వారా జిల్లాలోని గ్రామాల్లోకి వెళ్లి ఆడియో వీడియో ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రైతులకు ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తే పెట్టుబడులు సైతం తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు డాక్టర్ ఎ.అవినాశ్, డాక్టర్ రవీందర్‌రెడ్డి, ఏఓ (టెక్నికల్)దయాకర్, కంపెనీ సేల్స్ ఆఫీసర్ రమణారెడ్డి, తిరుమల్‌రా వు, పవన్‌రెడ్డి, ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment