విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. హనుమకొండ వడ్డేపల్లిలోని యూనియన్ కార్యాలయం (పల్లా రవీందర్‌రెడ్డి భవన్)లో శుక్రవారం యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇనుగాల శ్రీధర్ మాట్లాడారు. అనంతరం యూనియన్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుండా శ్రీనివాస్, కార్యదర్శిగా మచ్చిన బుచ్చయ్యగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నీలారపు శ్రీనివాస్, శైలేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా జి.రోహిత్, ఆర్.హేమంత్‌కుమార్, సీహెచ్.భద్రయ్య, కోశాధికారిగా పంచగిరి శ్రీనివాస్, అడిషనల్ సెక్రటరీగా ఎండీ.ఖాజా, ఆర్గనైజింగ్ కార్యదర్శిలుగా రాఘవేందర్, ఆర్.సౌమ్య, జాయింట్ సెక్రటరీలుగా జి.స్వరూప, పి.రాజు, పి.సాయి, మహిళా ప్రతినిధిగా ఆర్.స్వప్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సమావేశంలో టీఎస్‌ఈఈయూ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి, హనుమకొండ జిల్లా కార్యదర్శి చిట్ల ఓదెలు, నాయకులు రవికుమార్, సోమయ్య పాల్గొన్నారు.
టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment