విలియంకు స్టేషన్ బెయిల్
ఆకివీడు : పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని చినమిల్లిపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ విలియం కేరీని శుక్రవారం భీమవరం వన్‌టౌన్ పోలీసులు పిలిపించి విచారించారు. సాయంత్రం వరకు స్టేషన్‌లో ఉంచి సెక్షన్ 41ఏ కింద కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్‌పై రాత్రి విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ లీగల్ టీమ్ తనకు సహకారం అందించిందని విలియం కేరీ తెలిపారు.
నిత్యాన్నదానానికి కూరగాయల వితరణ
నూజివీడు: మండలంలోని దేవరగుంటకు చెందిన నక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి నూజివీడు నుంచి 12 టన్నుల కూరగాయలు పంపారు. టీటీడీ నుంచి వచ్చిన ప్రత్యేక వాహనంలో కూరగాయలను లోడ్ చేసి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వాహనాన్ని తిరుమలకు పంపించారు. అనేక మంది భక్తులు ప్రతినెలా తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానానికి కూరగాయలను వితరణగా అందజేస్తున్నారన్నారు.
నేటి నుంచి రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
ఆకివీడు : స్వీయ రక్షణకు కరాటే ఆయుధం లాంటిదని తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ చైర్మన్ మహ్మద్ జహంగీర్ చెప్పారు. ఈ నెల 24న రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఆకివీడులో నిర్వహిస్తున్న సందర్భంగా శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కరాటే క్రీడ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాల్సి ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపై కసరత్తు జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వచ్చే నెలలో కరాటే పోటీలు జరుగుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ విధంగా పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసిందన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం కరాటే గుర్తింపునకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందన్నారు. తమ అసోసియేషన్ సభ్యుడు షేక్ ఎజ్‌దాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఆకివీడులో నిర్వహిస్తున్నట్లు జహంగీర్ చెప్పారు. పోటీలకు జడ్జిగా ఆర్.వెంకటేశ్వరరావు ఉంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment