ఎకై ్సజ్ దాడులు
బుట్టాయగూడెం: మండలంలోని బుద్దులవారిగూడెం సమీపంలోని పంట కాల్వలో నాటుసారా స్థావరాలపై పోలవరం ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కె.వీరబ్రహ్మం తెలిపారు. ఎస్సై జి.సునీల్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
20 లీటర్ల సారా స్వాధీనం
చాట్రాయి: నాటు సారా తయారీ కేంద్రాలపై దాడి చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ ఎస్సై మస్తానరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పోతనపల్లి శివారు తోటల్లో నాటు సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి 20 లీటర్ల సారాను, బైక్‌ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సారా తయారీదారుడు దారావతు కుమార్‌ని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించామన్నారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం బలుసుమూడిలో కొన్ని నెలల క్రితం జరిగిన చోరీ కేసులో నిందితుడు వీరవల్లి కృష్ణమోహన్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. టూటౌన్ సీఐ కాళీచరణ్ ఆదివారం వివరాలు వెల్లడించారు. భీమవరం బలుసుమూడిలో పాతర్లపల్లి మాలతి అనే మహిళ ఇంట్లో జూన్ 4వ తేదీన రాత్రి చోరీ జరిగింది. ఆమె ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.1.50 లక్షలు, 18 కాసుల బంగారు ఆభరణాలు అపహరించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఆమెతో సన్నిహితంగా ఉండే ఎల్‌వీఎన్ పురం గ్రామానికి చెందిన వీరవల్లి కృష్ణమోహన్ ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. క్రికెట్ బెట్టింగ్, ఇతర జూదాలకు అలవాటు పడిన కృష్ణమోహన్ దొంగలించిన డబ్బులు వ్యసనాలకు వాడుకోగా బంగారాన్ని విక్రయించేందుకు శనివారం రాత్రి భీమవరం వచ్చాడు. భీమవరం పాత బస్టాండ్ వద్ద ఉన్న నిందితుడిని గుర్తించిన ఎస్సై రెహమాన్ అరెస్ట్ చేసి, అతడి నుంచి 18 కాసుల బంగారం రికవరీ చేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ నయీమ్ అస్మిన్ నగదు అవార్డు ప్రకటించినట్లు సీఐ కాళీచరణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment