కార్యకర్తలకు అండగా ఉంటాం
వీరవాసరం : వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు భరోసానిచ్చారు. వీరవాసరం మండలం నౌడూరు జంక్షన్‌లో ఆదివారం నిర్వహించిన మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేసిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటం చేయడానికి పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. పార్టీకి ప్రజలంతా ఎప్పుడు అండగా ఉంటారని వారి అభిమానం ఎప్పుడూ జగన్‌మోహన్ రెడ్డిపైనే ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో 300 పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, భీమవరం జెడ్పీటీసీ కాండ్రేకులు నరసింహరావు, భీమవరం ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, వైఎస్‌ఆర్‌సీపీ భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, రూరల్ అధ్యక్షుడు జెల్లా కొండయ్య, పార్టీ సీనియర్ నాయకులు చినిమిలి వెంకట్రాయుడు, కామన నాగేశ్వరరావు, రాయిపోలు శ్రీనివాసమూర్తి, పెనుమాల నరసింహస్వామి, కోడే యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి
Comments
Please login to add a commentAdd a comment