పోలీసుల అదుపులో గోల్డ్ నిందితుడు!
తాడేపల్లిగూడెం: విజయవాడ, నరసాపురం, తాడేపల్లిగూడెం పట్టణంలో 12 మందికి పైగా జ్యూయలర్ దుకాణాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం, వెండి, వజ్రాలు, తీసుకెళ్లి కనిపించకుండా పోయిన పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి పట్టణ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. నిందితుని తాలూకా సామాజిక వర్గ పెద్ద ఒకరు నిందితుడిని శుక్రవారం రాత్రి పట్టణ పోలీసుల వద్ద సరెండర్ చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా నిర్ధారించలేదు. ఈ నేపథ్యంలో నిందితునికి చెందినదిగా చెబుతున్న ఎన్టీఆర్ చౌక్ ఎదురుగా ఉన్న మన్వి జ్యూయలర్స్ దుకాణాన్ని ఆదివారం పట్టణ సీఐ పర్యవేక్షణలో మధ్యవర్తుల సమక్షంలో తాళాలు తెరిచి లోపల ఉన్న వస్తువులను పరిశీలించినట్టుగా సమాచారం. సోదాల అనంతరం దుకాణానికి పోలీసులు తాళాలు వేసేశారు. నిందితుని బంధువుల ఇళ్ల దగ్గర నుంచి సుమారు ఏడు కిలోలు బంగారు ఆభరణాలు, 250 కిలోలు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. జిల్లా ఎస్పీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడిస్తారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment