నంది పురస్కారాన్ని అందుకుంటున్న మల్లికార్జునరెడ్డి
కడప కల్చరల్: వైఎస్సార్ జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యులు మూల మల్లికార్జునరెడ్డి, నాటక రచయిత పల్లేటి లక్ష్మీకులశేఖర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది పురస్కారం లభించింది. సీపీ బ్రౌన్ బాషా పరిశోదన కేంద్రం సంచాలకులుగా, వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షులుగా జిల్లా వాసులకు సుపరిచితులైన ఆయనకు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ది సంస్థ శుక్రవారం గుంటూరులో నిర్వహించిన నంది నాటక పోటీలో ఈ అవార్డును బహూకరించింది.
● మూల మల్లికార్జునరెడ్డికి నాటక పోటీల చివరిరోజున బహుమతి ప్రధానోత్సవంలో భాగంగా చలనచిత్ర, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి నంది జ్ఞాపికతోపాటు రూ. 35 వేల నగదు బహుమతిని అందజేసి సత్కరించారు. న్యూఢిల్లీ యూజీసీ 2012లో ఇచ్చిన మేజర్ ప్రాజెక్టులో భాగంగా మల్లికార్జునరెడ్డి రాయలసీమ నాటక వికాసం పుస్తకాన్ని ప్రచురించగా దానికి ఈ వేదికపై ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. నటుడు, దర్శకుడిగా ఆయన యోగి వేమన విశ్వవిద్యాలయంలో రంగస్థల నాటక విభాగ అభివృద్ధికి కృషి చేశారు.
● నంది నాటక పోటీల్లో జిల్లాకు చెందిన సవేరా ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన శ్రీరామ పాదుకలు నాటకానికి ఉత్తమ ద్వితీయ నాటక రచనగా రచయిత పల్లేటి లక్ష్మీకులశేఖర్‌కు నంది పురస్కారం లభించింది. జిల్లా వాసులకు నంది పురస్కారాలు దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైవీయూ వీసీ చింతా సుధాకర్, ఎస్కే వర్సిటీ పూర్వ వీసీ ఆచార్య మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, వైవీయూ రిజిస్ట్రార్ వెంకటసుబ్బ య్య, ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి, రాయలసీమ టూ రిజం అండ్ కల్చరల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కొండూరు జనార్దన్‌రాజు, ఇంటాక్ జిల్లా కన్వీనర్ చిన్నపరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య అధ్యక్షులు పోతుల వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు షేక్ హుసేన్ సత్యాగ్ని, గానుగపెంట హనుమంతరావు, జింకా సుబ్రమణ్యం అవార్డు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment