లోక కల్యాణార్థం.. లలితా పారాయణం
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో లోకకల్యాణార్థం ఆదివారం సామూహిక లలితా కోటినామ పారాయణం చేశారు. లలితాదేవి ఉత్సవ మూర్తికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సర్వమానవాళి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ 1000 మందిపైగా భక్తులతో 10 పర్యాయాలు సామూహిక లలితా పారాయణం చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం మధ్యాహ్నం 3 వరకు సాగింది. శ్రీ విద్యాపీఠం మౌనస్వామి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. భక్తులకు శ్రీకృష్ణాలయ యాదవ సేవాసంఘం అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, పారాయణ కమిటీ అధ్యక్షుడు బూతూరు వెంకట రామిరెడ్డి, ప్రొద్దుటూరుతోపాటు కడప, జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
సామూహికంగా
కోటి పర్యాయాలు పఠనం
Comments
Please login to add a commentAdd a comment