నిధులు విడుదల చేయాలి
ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తే పంటల సాగుకు రైతులకు అండగా ఉంటుంది. ఆ నిధులను పంటల సాగుకు వినియోగించుకుని అప్పులు చేసుకోకుండా ఉండేందుకు వీలవుతుంది. ప్రభుత్వం స్పందించి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. – పోతిరెడ్డి భాస్కర్,
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి,
(సీపీఐ అనుబంధ, రైతు విభాగం)
పంట దెబ్బతిన్నా ఆదుకోలేదు
రబీ సీజన్‌లో ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ శనగలు చాలా చోట్ల సరిగా మొలకెత్తక పోవడంతో చాలా మంది రైతులు తమ పంటలను దున్నేశారు. కానీ వారిని ప్రభుత్వం ఏ విధంగా కూడా ఆదుకోలేదు. అదే గత ప్రభుత్వంలోనైతే అలాంటిదేమైనా విపత్తు జరిగిన తక్షణమే రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వడంతోపాటు పంటలు దెబ్బతింటే ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇచ్చేది. ఇప్పుడు అలాంటిదేమీ ఇవ్వడం లేదు. – దస్తగిరిరెడ్డి,
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి,
(సీపీఎం అనుబంధ రైతు విభాగం)
సకాలంలో వర్షాలు
ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో వర్షాలు కురిశాయి. దీంతో పంటల సాగు ఆశాజనకంగా ఉంది. గతేడాది కంటే ఈ ఏడాది సాగు ఇప్పటికే దాదాపు 50 వేల హెక్టార్లలో పెరిగింది. కానీ గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో వర్షాలు లేని కారణంగానే సాగు లక్ష్యం చేరుకోలేకపోయాం. కానీ ఈ ఏడాది రబీ సాగు లక్ష్యం మించి పంటలు సాగయ్యే అవకాశం ఉంది. రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. – అయితా నాగేశ్వరావు,
జిల్లా వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment