కడప అర్బన్: పోలీసు ఉద్యోగాల నియామకంలో దళా రుల మాటలు నమ్మిమోసపోకండని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా, రిక్రూట్‌మెంట్లు అయినా పారదర్శకంగా నిర్వహిస్తారని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. దేహదారుఢ్య పరీక్షలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు, పరీక్షలు నిర్వహించే ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసే వారి సమాచారాన్ని డయల్ 100కు గానీ, డయల్ 112 గానీ లేదా స్థానిక పోలీసు వారికి తెలియజేస్తే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment