చిత్రం.. భలే విచిత్రం!
అందమైన పక్షి గాలిలో
ఎగురుతున్నట్లు..
మనసుకు హత్తుకునేలా గీసిన చిత్రాలు చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ప్రపంచంలో అంతరించి పోతున్న అరుదైన పక్షి జాతుల్లో ఒకటి కలివికోడి. ఆ పక్షి ఉనికిని కనుగొనేందుకు అట్లూరు మండలం కొండూరు అటవీ బంగళా ఆవరణలో పరిశోధనా కేంద్రం ఏర్పాటైంది. అక్కడ కలివి కోడి చిత్రాలతోపాటు పలు రకాల పక్షుల చిత్రాలు, జంతువుల చిత్రాలు గోడపై గీశారు. అవి నిజమైన దృశ్యాన్ని తలపిస్తున్నాయి. ఈ పరిశోధనా కేంద్రంలో వాటిని తిలకించేందుకు జిల్లాలోని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను తీసుకొచ్చి వివరిస్తున్నారు.
– అట్లూరు
అడవిలో పక్షులు ఎగురుతున్నట్లు
పిల్లలతో ఉన్న పెద్దపులి
Comments
Please login to add a commentAdd a comment