రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్మాస్‌పేట సమీపంలో ఈనెల 13వ తేదీన మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు చదిపిరాళ్ల తులసీధర్ (57) ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. కడప టూటౌన్ ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు కమలాపురం టౌన్ సొసైటీకాలనీలో నివాసం ఉంటున్న చదిపిరాళ్ల తులసీధర్ గంగవరం స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈనెల 13న కడపలోని సింహపురికాలనీలో ఉన్న సోదరుడి ఇంటికి వెళ్లి తిరిగి తన ద్విచక్ర వాహనంలో కమలాపురం వెళుతుండగా అల్మాస్‌పేట సర్కిల్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి పడిపోయారు. తీవ్ర గాయాలతో కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment