వేంపల్లె : వేంపల్లె పట్టణం వడ్డె వీధిలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. మూడు రోజుల క్రితం ఇంటివద్ద గొడవ చేస్తున్నారని, వడ్డెర వీధికి చెందిన గౌరీ అనే మహిళ భర్త మల్లికార్జునపై ఫిర్యాదు చేశారు. పోలీసులు మల్లికార్జున ఇంటి వద్దకు వెళ్లగా గొడవకు దిగి విధులకు ఆటంకం కలిగించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రంగారావు వెళ్లగా ఆయనపై ఎదురు తిరిగారు. ఈ ఘటనపై కానిస్టేబుల్ నజీర్ ఫిర్యాదు మేరకు మల్లికార్జున, శివలపై కేసు నమోదు చేశారు. గురువారం వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా.. మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో వారిని జైలుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment