పీఠాధిపతి అక్బర్ బుఖారి కన్నుమూత
కడప కల్చరల్ : కడపకు చెందిన ఆస్థానె–యే–బుఖారియా పీఠాధిపతి అల్ హాజ్ సయ్యద్ షా అక్బర్ బుఖారి సాహెబ్ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. నగరంలోని రహమతుల్లా వీధిలోగల అంజదియ మస్జిద్‌లో అసర్ నమాజ్ తర్వాత నమాజ్ ఏ జనాజా ప్రార్థన చేసి, అనంతరం అంతక్రియలు నిర్వహించారు. జిల్లాలోని ముస్లిం ధార్మిక పీఠాలలో సౌమ్యుడిగా, ధార్మిక వేత్తగా మంచి పేరుగల అక్బర్ బుఖారి మరణ విషయం తెలుసుకున్న పలువురు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ధార్మిక, ఇస్లామిక్ కార్యక్రమాల నిర్వహణలో ఆయన ప్రధానపాత్ర వహించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకుశాంతి కలగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నామన్నారు. మత గురువులు, మౌల్వీలు, ముఫ్తీలు, ముస్లిం ప్రముఖులు, రాజకీయ నాయకులు, బుఖారియ పీఠం సభ్యులు, బంధువులు తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment