‘శుభమస్తు’లో బహుమతి స్కూటీల పంపిణీ
కడప కల్చరల్ : కడప నగరంలోని శుభమస్తు షాపింగ్‌మాల్‌లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలైన వారికి శుక్రవారం బహుమతులు అందజేశారు. కడపకు చెందిన కొనుగోలుదారులకు డిసెంబర్ 31 నుంచి ఈ నెల 17 వరకు మాల్‌లో కొనుగోలు సందర్భంగా ఇచ్చిన లక్కీ డ్రా కూపన్లను లాటరీ తీసిన అనంతరం వారికి ఎలక్ట్రిక్ స్కూటీలు బహుమతిగా అందజేసే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జరిగిన లక్కీ డ్రాలో కడపకు చెందిన రామకృష్ణ, నాగార్జున, గురవయ్య, నరసయ్యలు బహుమతులు గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమానికి మానస ఎండీ చిన్నపరెడ్డి, సిటీ కేబుల్ ఎండీ సూర్య నారాయణ, యోగివేమన యూనివర్సిటీ వీసీ కృష్ణారెడ్డి, వన్‌టౌన్ సీఐ రామకృష్ణ, మానస ఇన్ ఎండీ అనంతమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నపరెడ్డి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ ఏర్పాటుతో ప్రజలకు నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకు అందించడంతోపాటు స్థానిక యువతలో పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ లేకుండా వస్త్రాలను అందించడం పట్ల అభినందించారు. అనంతరం లయన్ క్లబ్ సభ్యులు వెంకటసుబ్బయ్య, మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్లు మడక వెంకటరమణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment