వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం
కడప ఎడ్యుకేషన్ : అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో వైవీయూకు కాంస్య పతకం లభించింది. యోగివేమన క్రీడా బోర్డు కార్యదర్శి, వ్యాయాయ విద్య విభాగ అధిపతి కొవ్వూరు రామసుబ్బారెడ్డి శుక్రవారం క్రీడాకారుడిని అభినందించి, వివరాలు వెల్లడించారు. జలందర్‌లో జనవరి 15 నుంచి 21వ తేదీ వరకు యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీలలో యోగివేమన విశ్వ విద్యాలయ చాంపియన్ లిఫ్టర్ పోటీలలో దేవరకొండ ప్రేమ్‌సాగర్ 81 కేజీల విభాగంలో సత్తా చాటి వేమన విశ్వ విద్యాలయానికి కాంస్య పతకం సాధించి పెట్టారని తెలిపారు. ఈ క్రీడాకారుడు సీఎస్‌ఎస్‌ఆర్, ఎస్‌ఆర్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలల్లో విద్యను అభ్యసించారని చెప్పారు. ఈయన స్నాచ్‌నందు 140 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌స్థాయిలో 166 కేజీల బరువును ఎత్తి మొత్తం 306 కేజీలతో జాతీయ స్థాయిలో బ్రాంజి మెడల్ సాధించాడని చెప్పారు. ఇదే క్రీడాకారుడు దక్షణ, పశ్చిమ మండల విశ్వ విద్యాలయాల పోటీలలో విశ్వవిద్యాలయానికి కాంస్య పతకం సాధించి అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల పోటీలకు అర్హత సాధించాడన్నారు. ఈ సందర్భంగా వైవీయూ ఉపకులపతి, క్రీడాబోర్డు చైర్మన్ అచార్య కృష్ణారెడ్డి క్రీడాకారుడిని అభినందించి రాబోయే ఖేలో ఇండియా పోటీలకు వైవీయూ తరఫున భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. వైవీయూ కుల సచివులు ఆచార్య పుత్తపద్మ, ప్రధానాచార్యులు రఘనాధరెడ్డిలు క్రీడాబోర్డు, శిక్షకులు, టీమ్ మేనేజర్ ప్రసాద్‌రెడ్డిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment