రేపు ఏపీజీఈఏ జిల్లా మహాసభ
కడప రూరల్ : కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశానికి ఉద్యోగులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రఘురామ నాయుడు, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment