బైరెటీస్‌ను కొల్లగొడుతున్న టీడీపీ నేతలు
పులివెందుల రూరల్ : పులివెందుల నియోజకవర్గంలోని టిఫిన్ బైరెటీస్‌ను టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆరు నెలల వ్యవధిలోనే అరాచకాలు ఎక్కువయ్యాయని, తనపైన అవినీతి ఆరోపణలు నిరూపిస్తే దేనికై నా సిద్ధమని పేర్కొన్నారు. శుక్రవారం పులివెందుల పట్టణంలోని భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, బయపురెడ్డి, చిన్నప్ప, వరప్రసాద్, హాలు గంగాధరరెడ్డి, రసూల్, వేల్పుల గ్రామంలోని రైతులు, నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డి మాట్లాడుతూ ‘నిజాయితీగా బతుకుతుంటే నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారా, నీవు మోసం చేయడం వల్లే ఏజెంట్‌గా తొలగించారు’ అని టీడీపీ నాయకుడు పేర్ల పార్థసారథిరెడ్డిపై మండి పడ్డారు. వ్యవస్థలన్నీ నాశనం చేసి దోచుకో, దాచుకో అన్న రీతిలో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. ‘టిఫిన్ బైరెటీస్ ఏజెంట్‌గా పార్థసారథిరెడ్డి ఉన్నది వాస్తవమేనని, కానీ ఆయన నట్టు, బోల్టులను అమ్ముకుని మోసం చేయడం వల్లనే ఏజెంట్‌గా తప్పించి 2015లో నన్ను పెట్టారు’ అని, ఎరగ్రుంట్ల ఖనిజ వనరుల శాఖ వారే ఏజెంట్‌గా జారీ చేసిన నియామక పత్రాన్ని మీడియాకు చూపించారు.
కోట్ల సరుకు చోరీపై ఫిర్యాదు
‘ఆ తర్వాత టిఫిన్ కంపెనీ దివాలా తీయడంతో అప్పుల వాళ్లంతా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లారని, అక్కడ ఆ ట్రిబ్యునల్ తీర్మానం చేసి ఏజెంట్‌గా వాసుదేవన్‌ను నియమించారని, వాసుదేవన్‌నే 2019లో నన్ను కేర్ టేకర్‌గా నియమించారు’ అన్నారు. బెంగళూరుకు చెందిన ఎంబీసీ గ్రూప్ కంపెనీ హక్కులను పొందిందని ఆ కంపెనీ డైరెక్టర్ ధర్మలింగం నన్ను కేర్ టేకర్ ఏంజెంట్‌గా కొనసాగించారన్నారు. అందుకు సంబంధించిన నియామక పత్రాలను మీడియాకు చూపించారు. ఈ నెల 13 ,14వ తేదీన రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువ చేసే ఖనిజాల సరుకును దొంగలించారని, అందుకు సంబంధించి కంపెనీ ఏజెంట్ అయినందున ఆ దొంగతనం గురించి పోలీసు అధికారులకు, మైన్స్ అధికారులకు, అలాగే కంపెనీ వారికి తెలియజేశానన్నారు. వాస్తవాలు తెలియకుండా ఇష్టమొచ్చినట్లు మీడియా ముందు మాట్లాడటం మంచిది కాదన్నారు. వేల్పులలో నేను రెండు మైన్సులు చేసిన మాట వాస్తవమే అని, కానీ లీజు ఉన్న మైన్స్‌లను మేము చేశామన్నారు. వేల్పులలో మైన్స్ యజమానులైన సుకర్ బాషా, విశ్వంశెట్టిలను బెదిరించి రూ.50 లక్షలు దోచుకున్నారని చెప్పడం అవాస్తవమన్నారు. అలాగే అశోక్ కంపెనీ వారితో రూ.30 కోట్లు తీసుకున్నానని చెప్పడం కూడా అవాస్తమేనని, వీటిపై నేను ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు.
అధికారుల నుంచి స్పందన కరువు
మా తండ్రి మరణం ప్రమాదమని నాకు, మా కుటుంబ సభ్యులకు తెలుసు అని.. మా తండ్రిని కోడిని కోసినట్లు కోశారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. కుటుంబంలో విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే స్వార్థపరుడు పార్థ అని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కోట్ల రూపాయలు విలువ చేసే ఖనిజాలన్నీ దొంగలించబడ్డాయని, వాటిని ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. బైరెటీస్‌ను కాపాడేందుకు అనేక సార్లు అధికారులకు రక్షణ కల్పించాలని వినతి పత్రాలు పెట్టామని, కానీ ఎవరూ స్పందించలేదన్నారు. రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన సరుకును కూటమి నాయకులు రాత్రికి రాత్రే తరలించారన్నారు. ఎంబసీ గ్రూప్ ద్వారా ఎంత స్టాక్ వచ్చిందనే విషయాన్ని కూడా కోర్టుకు తెలిపామన్నారు.
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి
వేముల మండలంలో నేను దోచుకుని ఉంటే నా వెంట ప్రజలు ఉండేవారు కాదని, ఎప్పుడు నా వెంటే ఉంటారన్నారు. వేల్పులలో నాలుగు సార్లు సర్పంచ్‌గా గెలిచామని, ఇప్పటికీ మా గ్రామంలో నేను సూచించిన వ్యక్తి సర్పంచ్‌గా, ఎంపీటీసీగా గెలుస్తున్నారని, ఇదే నా వెంట ప్రజలు ఉన్నారనడానికి నిదర్శనమన్నారు. వైఎస్ కుటుంబ సభ్యులు చాలా మంచివారని, వారి కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధమన్నారు. నెలలో 20 రోజులు కుటుంబానికి దూరంగా ఉండి పనులు చేసుకుంటున్నానని, నా టర్నవర్ రూ.110 కోట్లు ఉందని, నాది తెరిచిన తెల్లని కాగితమని, ఎప్పుడైనా విచారణ చేయించుకోవచ్చని, నా వద్ద అన్నింటికీ ఆధారాలు ఉన్నాయన్నారు. ఇప్పటికై నా వాస్తవాలు తెలుసుకుని అసంబద్ధమైన మాటలు మాట్లాడడం సరికాదని, హత్య రాజకీయాలను మానుకోవాలన్నారు.
నాపై అవినీతి ఆరోపణలు నిరూపిస్తే
దేనికై నా సిద్ధం
కూటమి ప్రభుత్వంలో అరాచకాలు
ఎక్కువయ్యాయి
టిఫిన్ మైన్స్ నుంచి రూ.15 కోట్ల
సరుకు చోరీ
పార్థసారథిరెడ్డిపై వైఎస్సార్‌సీపీ
నాయకుల ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment