‘నా పంటను దున్నేశారు’
బ్రహ్మంగారిమఠం : ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సొంత పంచాయతీ పలుగురాళ్ళపల్లె సమీపంలోని బొగ్గులవారిపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ వర్గీయుడు శీలం సిద్దారెడ్డికి చెందిన పైరు ఉన్న భూమిని శుక్రవారం ఎర్రంపల్లెకు చెందిన సిద్దయ్య యాదవ్ మేకల పుల్లయ్య యాదవ్‌లు దున్నినట్లు బాధితుడు తెలిపారు. శుక్రవారం సిద్దారెడ్డి విలేకరులతో తన గోడు వెల్లబోసుకున్నాడు. పలుగురాళ్ళపల్లె పొలం సర్వే నంబర్ 825లో 2.50 ఎకరాలు తమ పిత్రాజితం భూమి అని పేర్కొన్నారు. సర్వే నంబర్ 826లో 2 ఎకరాలు ఎర్రంపల్లెకు చెందిన లగసాని వీరయ్య దగ్గర అదే గ్రామానికి చెందిన మేకల పోలయ్య కొనుగోలు చేశాడన్నారు. దాదాపు 5 ఏళ్ల నుంచి తనకు ఉన్న భూమిలో అర్ధం ఆయన భూమి ఉందంటూ.. తనపై దౌర్జన్యం చేస్తూ వస్తుంటే అడ్డుకుంటూ వస్తున్నామన్నారు. సర్వే చేయించుకోవాలని తెలిపినా వినడం లేదని, ఇప్పటికే సర్వే కోసం మేకల పుల్లయ్యకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. అయినా రాకుండా ఉన్నారన్నారు. ప్రస్తుతం తాను పంటను వేశానన్నారు. టీడీపీ అధికారంలో ఉందని, ఎమ్మెల్యే తమ్ముడు పుట్టా ఆనంద్ చెప్పాడని శుక్రవారం ఉదయం.. తాము లేని సమయంలో పైరు ఉన్న పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసి అడ్డుకోవడానికి తాము అక్కడికి వెళ్లే లోపు కొంత దున్నేసి వెళ్లిపోయారని వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పొలం ఎవరిది ఎంత వరకు అనేది సర్వే చేయించుకోవాలని సిద్దారెడ్డి కోరారు.
రిమ్స్‌లో గుర్తు తెలియని
మృతదేహాలు
కడప అర్బన్ : కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. వారి ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాసులు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment