Tollywood
-
ఓటీటీలో 'తండ్రీకూతురు' సినిమా స్ట్రీమింగ్
సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటించిన చిత్రం 'లగ్గం'. తెలంగాణ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్ల తంతును చూపిస్తూ.. రమేష్ చెప్పాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని వేణుగోపాల్ రెడ్డి నిర్మాతగా తక్కువ బడ్జెట్లో ఉన్నతంగా నిర్మించారు. అక్టోబర్ 25న ఏషియన్ సురేష్ ద్వారా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. ఆ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది.'లగ్గం' సినిమాలో సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్‌తో పాటు రోహిణి, చమ్మక్ చంద్ర వంటి వారు నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా విడుదల సమయంలో భారీగా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో మూవీ మెప్పించలేదు.కథ ఏంటంటే?సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్)ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.ప్రతి ఆడపిల్ల కథ ఇంతేనేమో..'ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో.. ఈ ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా..' అనే పాటను చరణ్ అర్జున్ చాలా అద్భుతంగా రచిస్తే.. సింగర్ చిత్ర అందరి గుండెల్ని పిండేసేలా ఆలపించారు. లగ్గం చిత్రంలోని ఈ పాటకు యూట్యూబ్‌లో కూడా మంచి వ్యూస్ వచ్చాయి. -
'మెకానిక్ రాకీ' 2.O ట్రైలర్.. భారీగానే ప్లాన్ చేసిన విశ్వక్
'మెకానిక్ రాకీ'గా విశ్వక్సేన్ వస్తున్నాడు. మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించగా రామ్ తాళ్లూరి నిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక ట్రైలర్ విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే, తాజాగా రెండో ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. వరంగల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో 'మెకానిక్ రాకీ'కి మరింత బజ్ క్రియేట్ అయింది.మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. గతంలో విశ్వక్ చెప్పినట్లుగా సినిమా విడుదల సమయంలో మరో ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఆయన అన్నట్లుగానే తాజాగా రిలీజ్ చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుండగా ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం కోసం విశ్వక్ భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. -
అత్యాచారం కేసులో నటుడు సిద్ధిఖీకి ఊరట
మలయాళ నటుడు సిద్ధిఖీకి భారీ ఊరట లభించింది. అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటులతో పాటు దర్శకులు కూడా నటీమణులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని జస్టిస్ హేమ కమిటీ చేసిన రిపోర్ట్‌తో అక్కడి నటీమణులు చాలామంది గతంలో తమకు జరిగిన అన్యాయాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో కొందరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు.2016లో నటిపై అత్యాచారంమలయాళ నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలతో సిద్ధిఖీపై కేసు నమోదైంది. 2016లో తిరువనంతపురంలోని మస్కట్ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ముందుగా ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తానని ఫేస్బుక్ ద్వారా తనకు సిద్ధిఖీ పరిచయం అయ్యాడని, ఆపై తన కోరికను తీర్చాలని బలవంతం చేసినట్లు పేర్కొంది. అందుకు తాను నిరాకరించడంతో ఒక పథకం ప్రకారం తనను హోటల్‌కు రప్పించి సిద్ధిఖీ అత్యాచారం చేసినట్లు రేవతి తెలిపింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది. అయితే, చాలారోజులుగా పరారీలో ఉన్న ఆయనకు తాజాగా బెయిల్ లభించింది. సిద్ధిక్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ, నటుడు ఎలాంటి తప్పు చేయలేదని, ఫిర్యాదుదారు అభియోగాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఫిర్యాదుకు ఎనిమిదేళ్లు ఎందుకు: కోర్టుసిద్ధిఖీకి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరును జస్టిస్ బేలా త్రివేది, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తాజాగా తీర్పు వెల్లడించింది. అయితే, ఈ కేసులో సిద్ధిఖీపై ఫిర్యాదు చేయడానికి ఎనిమిదేళ్ల జాప్యం ఎందుకు అయిందని కోర్టు ప్రశ్నించింది. ఈ కారణంతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ, అవసరమైతే పోలీసుల విచారణకు సిద్ధిఖీ సహకరించాలని సూచించింది. ఈ క్రమంలో తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్ కోర్టులో డిపాజిట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఫిర్యాదు విషయంలో ఆలస్యానికి బాధితురాలి తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ ఇలా మాట్లాడారు. హేమా కమిటీ నివేదికను విడుదల చేయడం ఆపై కేరళ హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే అత్యాచార బాధితురాలికి ఫిర్యాదు చేయడానికి ధైర్యం వచ్చిందని వారు అన్నారు. -
వివాదంలో నయన్.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్
గత రెండు మూడు రోజులుగా నయనతార-ధనుష్ వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 3 సెకన్ల ఫుటేజీ కోసం రూ.10 కోట్లు డిమాండ్ చేయడం ఏంటా అని నయన్ అడగడంతో ధనుష్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. మరోవైపు ఈమె అభిమానులు.. తామేం తక్కువ కాదన్నట్లు పాత విషయాల్ని తవ్వి తీస్తూ ఏందిరి ఈ పంచాయతీ అనేలా చేస్తున్నారు.ఈ కాంట్రవర్సీ అలా ఉంచితే నయనతార జీవితం, పెళ్లి గురించి తీసిన డాక్యుమెంటరీ 'నయనతార: బియాండ్ ద లైఫ్ స్టోరీ' నెట్‌ఫ్లిక్స్ సోమవారం రిలీజైంది. ఏదో అంతంత మాత్రంగానే ఉందనే రివ్యూస్ వచ్చాయి. అయితే ఈ డాక్యుమెంటరీ చూసిన మహేశ్ బాబు.. మూడు లవ్ ఏమోజీలతో ఇన్ స్టాలో స్టోరీ పెట్టాడు. దీంతో నెటిజన్లు ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)నయన్ డాక్యుమెంటరీ మహేశ్‌కి అంత నచ్చేసిందా? షూటింగ్ లేకపోయేసరికి ఫుల్ ఖాళీగా ఉన్నట్లున్నాడు? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సినిమాలే కాకుండా డాక్యుమెంటరీలని కూడా వదలకుండా రివ్యూస్ ఇచ్చేస్తున్నాడుగా అనే ఫన్నీ సెటైర్లు నుంచి స్వయంగా అతడి అభిమానుల నుంచే వస్తున్నాయి.ప్రస్తుతం రాజమౌళి సినిమా మేకోవర్ అవుతున్న మహేశ్ బాబు.. మొన్నటివరకు గడ్డంతో కనిపించాడు. తాజాగా కీరవాణి కొడుకు ప్రీ వెడ్డింగ్‌లో క్లీన్ షేవ్‌తో దర్శనమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!) -
ఓటీటీలో డార్క్ కామెడీ సినిమా
కోలీవుడ్‌లో దాదా, స్టార్ వంటి సినిమాలతో పాపులర్ అయిన కవిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం బ్లడీ బెగ్గర్. దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన చిత్రం దీపావళి సందర్భంగా తమిళ్లో విడుదలైంది. అక్కడ మంచి విజయం సాధించడంతో నవంబన్ 7న తెలుగులో కూడా విడుదలైంది. దాదా సినిమాతో టాలీవుడ్లో కూడా కాస్త గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ చిత్రాన్ని ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటన వచ్చేసింది.బ్లడీ బెగ్గర్ సినిమా కోసం నిర్మాత నెల్సన్ దిలీప్‌కుమార్ రూ. 5 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. అయితే, ఈ సినిమా కేవలం తమిళ్లోనే సుమారు రూ. 20 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ హక్కుల్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా కాస్త ఎక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఈ చిత్రాన్ని నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్కి తీసుకురానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగులో కూడా అదే రోజు అందుబాటులో ఉండనుంది. డార్క్ కామెడీ మూవీని చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ పేర్కొంది.కథేంటి?కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ? -
తప్పులు దిద్దుకుని జీబ్రా చేశాను : ఈశ్వర్ కార్తీక్
సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా, ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిక్కీనాటో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జీబ్రా’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈశ్వర్ కార్తీక్ మాట్లాడుతూ–‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత 32 కంపెనీల్లో ఉద్యోగం చేశాను. అయితే నా ఇష్టం సినీ రంగంవైపు ఉందని గ్రహించి సినిమాల్లోకి వచ్చాను. కీర్తీ సురేష్‌గారితో ‘పెంగ్విన్ ’ సినిమా తీశాను. ఆ మూవీ రిలీజ్ తర్వాత నా రచన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో గ్రహించి, తప్పులు దిద్దుకుని ‘జీబ్రా’ చేశాను. ఫైనాన్షియల్ క్రైమ్స్ నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుంది. నేను బ్యాంకు ఉద్యోగిగా చేసిన సమయంలో అక్కడ జరిగే కొన్ని తప్పులను గమనించాను. ఆ అనుభవాలను కూడా ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాను. సత్యదేవ్, ధనంజయగార్లు బాగా నటించారు. సత్యరాజ్, ప్రియభవానీ పాత్రలూ ఆసక్తిగా ఉంటాయి. రవి బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు. త్వరలో నా కొత్త చిత్రం ప్రకటిస్తాను’’ అన్నారు. -
పోలీస్ విచారణకు హాజరుకాని రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీస్ కేసు నమోదైంది. లెక్క ప్రకారం ఈరోజు (నవంబర్ 19) విచారణకు హాజరు కావాలి. అయితే తాను సినిమా షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేనని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్సెపెక్టర్ శ్రీకాంత్ బాబుకి వాట్సాప్‌లో వర్మ మెసేజ్ పెట్టారు. విచారణకు సహకరిస్తానని, కాకపోతే నాలుగైదు రోజుల తర్వాత విచారణకు వస్తానని చెప్పారు. అయితే వర్మ నిజంగానే షూటింగ్ బిజీలో ఉన్నారా లేదా అనేది తెలుసుకుంటానని సీఐ అన్నారు.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)ఇకపోతే సోమవారం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులో అరెస్ట్ నుంచి రక్షణల్పించాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలన్న పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కొన్నిరోజులు క్రితం కేసు నమోదైంది. 'వ్యూహం' మూవీ ప్రమోషన్స్‌లో చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. (ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!) -
OTT: యానిమేటడ్ ఫాంటసీ మూవీ ‘విష్’ రివ్యూ
మనకందరికీ విషెస్ ఉంటాయి. మన విష్ తీరాలని మనం ప్రతిరోజూ దేవుడిని కోరుకుంటాం. ఒకవేళ మన విష్ తీర్చే విజార్డ్ మనకు దొరికితే సూపర్ గా వుంటుంది కదా. అలాంటి కాన్సెప్ట్ తో తీసిన సినిమానే ఈ విష్. వాల్ట్ డిస్నీ ప్రొడ్యూస్ చేసిన ఈ యానిమేటడ్ ఫాంటసీ మూవీ హాట్ స్టార్ ప్లాట్ ఫాంలో స్ట్రీం అవుతోంది. క్రిస్బక్, ఫాం అనే ఇద్దరు డైరెక్టర్స్ ఈ మూవీని కలిసి తీశారు. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే మెడిటేరియన్ సీ లోని ఓ ఐలాండ్ లో కింగ్ డమ్ ఆఫ్ రోజాస్ అనే రాజ్యం వుంటుంది. ఆ రాజ్యానికి రాజు మాగ్నిఫికో, రాణి అమాయ. మాగ్నిఫికో రాజు తన మంత్రశక్తితో నెలకోసారి తన ప్రజలకు సంబంధించి ఒక్క విష్ ను తీరుస్తూవుంటాడు. అది కూడా ఓ పెద్ద ఉత్సవం లా చేసి ఎవరికైతే విష్ కావాలో వాళ్ళని మాగ్నిఫికో ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటాడో వారి విష్ ను మాత్రం తీరుస్తాడు. అలాంటి టైంలో ఈ సినిమా హీరోయిన్ ఆషా తన తాత సబినో100th బర్త్ డే కి తాత విష్ కింగ్ గ్రాంట్ చేయాలని ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అవుతుంది. అయితే రాజు మాగ్నిఫికోకి తన తాత విష్ ను గ్రాంట్ చేయమని కోరుతుంది. దానికి మాగ్నిఫికో ఒప్పుకోడు. ఆషా ఈ విషయంలో బాగా బాధ పడి ఆకాశం లో వున్న స్టార్ ను తన విష్ ను గ్రాంట్ చేయమని ప్రే చేస్తుంది. అనుకోకుండా ఆషా కోసం స్టార్ ఒక బాల్ రూపంలో వచ్చి మాజిక్ చూపిస్తుంది. ఇంక మిగతా స్టోరీ అంతా స్టార్ మాజిక్ తో కింగ్ మాగ్నిఫికో ని ఆషా ఎలా ఎదుర్కుంటుందనేదే ఈ విష్ మూవీ. స్టన్నింగ్ మాజిక్ ఎఫెక్ట్స్ తో సూపర్ గ్రాండ్ విజువల్స్ తో విష్ మూవీ మీకు ఈ వీక్ సూపర్ ఎంటర్ టైనర్. గో అండ్ వాచిట్. - ఇంటూరు హరికృష్ణ -
రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!
హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి గురించి ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. బిజినెస్‌మ్యాన్, ఫ్యామిలీ ఫ్రెండ్.. ఇలా గతంలో చాలాసార్లు పలువురి గురించి అన్నారు. కానీ ఆ వ్యక్తుల పేరు, డీటైల్స్ లాంటివేం రాలేదు. రీసెంట్గా గత రెండు మూడు రోజుల నుంచి కూడా కీర్తి సురేశ్ పెళ్లంటూ తెగ హడావుడి మొదలైంది. తొలుత ఇది కూడా ఎప్పటిలాంటి రూమర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం నిజంగానే పెళ్లి చేసుకోబోతుందని క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)ఒకప్పటి హీరోయిన్ మేనక, నిర్మాత సురేశ్ కుమార్ ముద్దుల కూతురు అయిన కీర్తి సురేశ్.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా ఈమె చేతిలో రెండు తమిళ, ఓ హిందీ మూవీ ఉన్నాయి.పెళ్లి విషయానికొస్తే కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. కొచ్చికి చెందిన ఇతడినే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11-12 తేదీల్లో గోవాలో కీర్తి-ఆంటోని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఇవన్నీ అనధికారికంగా వినిపిస్తున్న విషయాలు. త్వరలో ఈ విషయమై కీర్తి సురేశ్ అధికారిక ప్రకటన ఇవ్వనుంది.(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది) -
అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?
మెగాహీరో రామ్ చరణ్ సోమవారం రాత్రి కడప వెళ్లారు. పెద్ద దర్గాను సందర్శించుకున్నారు. సాధారణంగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ ప్రస్తుతం చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. అయినా సరే పెద్ద దర్గాను దర్శించుకోవడం వెనక ఓ కారణముంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇలా చేసినట్లు స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఇది సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ప్రస్తుతం మ్యూజిక్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఈయన మూడు నెలల క్రితం రామ్ చరణ్‌ని పెద్ద దర్గాను సందర్శించాలని కోరారు. ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నా సరే చరణ్.. రెహమాన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది)కడప దర్గాలో 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్ జరిగింది. ఈ దర్గాకు రెహమాన్.. ప్రతి ఏడాది తప్పనిసరిగా వస్తుంటారు. ఈ సంవత్సరం జరిగే ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ని తీసుకొస్తానని అక్కడి వాళ్లకు మాటిచ్చారట. అలా ఏఆర్ రెహమాన్ ఆహ్వానం మేరకు ఓ వైపు బిజీ షెడ్యూల్, మరోవైపు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. 'ఏఆర్ రెహమాన్.. ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని మూడు నెలల ముందే చెప్పారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్‌తోపాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు)#ARRahman గారు ఈ దర్గాలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలంటూ మూడు నెలల ముందే ఆహ్వానించారు. వస్తానని ఆయనతో అన్నాను. ఆయనకు ఇచ్చిన మాట కోసం, మాలలో ఉన్నా కూడా ఈ దర్గాకు వచ్చాను. - @AlwaysRamCharan pic.twitter.com/4l7CSysAtq— Rajesh Manne (@rajeshmanne1) November 18, 2024 -
లవ్ యాక్షన్ డ్రామా
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. కాగా ఈ సినిమాలోని ‘బుజ్జితల్లి..’ అనేపాట లిరికల్ వీడియోను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.‘‘ఈపాట రాజు (ఈ సినిమాలో నాగచైతన్యపాత్ర పేరు) హృదయంలో ఓ భాగం’’ అంటూ ‘బుజ్జితల్లి’పాటను ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాగచైతన్య. ‘‘ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ‘తండేల్’ రూపొందుతోంది. లవ్, యాక్షన్ డ్రామా అంశాలు ఉన్నాయి. నాగచైతన్య, సాయి పల్లవిల కెమిస్ట్రీ, స్వచ్ఛమైన భావోద్వేగాలు అద్భుతంగా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. -
గ్రూప్ గేమ్ ఆడినోళ్లను మడతెట్టేశారు.. గౌతమ్‌పై ప్రేరణ కుళ్లు
బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చి వారితో నామినేషన్స్ వేయించాడు. వచ్చిన ప్రతిఒక్కరూ నిఖిల్ గ్యాంగ్పైనే విరుచుకుపడ్డారు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (నవంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..గౌతమ్‌పై ప్రేరణ కుళ్లుగత వారం అవినాష్, తేజ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీరికి బదులు గౌతమ్ ఉండాల్సిందని ప్రేరణ అభిప్రాయపడింది. వచ్చినవారమే గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది.. ఇప్పుడు ఏకంగా స్ట్రాంగ్ ప్లేయర్ అయి కూర్చున్నాడు. అదెలాగో నాకర్థం కావట్లేదు. ఈ వారం గౌతమ్, విష్ణుప్రియ, యష్మిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నాను. అంతా రివర్స్‌లో జరుగుతోంది అని నబీల్‌తో ముచ్చట్లు పెట్టింది.వచ్చావా అక్క..తర్వాత బిగ్‌బాస్ ఆసక్తికర ఘట్టానికి తెరదీశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి ఇద్దర్ని నామినేట్ చేస్తారన్నాడు. మొదటగా సోనియా.. ప్రేరణను నామినేట్ చేసింది. వచ్చావా అక్క అని ప్రేరణ అనడంతో గొడవ పీక్స్‌కు వెళ్లింది. నాకు అక్క కాదు, నిఖిల్‌కు అక్కవి అని ప్రేరణ సంజాయిషీ ఇవ్వడంతో సోనియాకు మరింత తిక్క రేగింది. అతడికి అక్కను అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అంటూ గట్టిగా నిలదీసింది. అందుకు బదులుగా దాదాపు మూడునాలుగుసార్లు ప్రేరణతో సారీ చెప్పించుకుంది.తేజది తప్పయినప్పుడు యష్మిది కూడా తప్పేగా?అనంతరం నా పెద్ద కొడుకు నిఖిల్‌ను నామినేట్ చేస్తున్నా అంటూ నైస్‌గా మొదలుపెట్టి వైల్డ్‌గా మారిపోయింది. అప్పట్లో పృథ్వీని చిన్న కారణంతో నామినేట్ చేశావు. ఎప్పుడైనా కరెక్ట్ కారణంతో ఎవర్నైనా నామినేట్ చేశావా? యష్మి, ప్రేరణను ఎందుకు నామినేట్ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవిక్షన్ షీల్డ్గేమ్లో తేజ ముందుగా ఎగ్ వేశాడని అతడిని వరస్ట్ కంటెస్టెంట్ అన్నావు.. మరి తేజ ఎగ్ వేసేవరకు ఆగి కావాలని యష్మి మరో గుడ్డు వేసింది. ఆమె చేసింది తప్పని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని నిలదీసింది.ఆమె ముందు మాట్లాడు.. నిఖిల్‌కు సలహాఅతడి లవ్‌ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి నీపై ఫీలింగ్స్ చూపించింది.. ఒక మహిళకు గౌరవమిచ్చేవాడివే అయితే.. ఆమె రిలేషన్షిప్ కోసం హౌస్‌కు రాలేదు, ఆమె ఏం చేస్తే అది పడటానికి రాలేదు అని తన వెనకాల మాట్లాడాల్సిన అవసరం లేదు. అవన్నీ తన ముందే చెప్పాలని గద్దించింది. తన మీద ఇష్టం లేనప్పుడు ఆమె జోలికి వెళ్లకూడదు అని తేల్చేసింది.ఏడ్చేసిన యష్మిసోనియా మాటలతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు క్లారిటీగా చెప్పుంటే నీ జోలికే వచ్చేదాన్ని కాదని నిఖిల్‌పై మండిపడింది. నిఖిల్‌తో ఒక కలగన్నానే తప్ప తనపై నాకు పెద్ద ఫీలింగ్సే లేవని ప్లేటు తిప్పేసింది యష్మి. చివరగా సోనియా.. నువ్వు నీలా ఉండు నిఖిల్, నువ్వు గెలిస్తే సంతోషపడే మొదటి వ్యక్తిని నేనే అంటూ అతడి తలపై గాజు బాటిల్ పగలగొట్టింది.బేబక్కపై సెటైర్లుతర్వాత బేబక్క హౌస్‌లోకి వచ్చి అవతలివాళ్లను తక్కువ చేయడం నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో అతడు.. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇక్కడిదాకా ఉంచారు. మీకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేశారంటూ సెటైర్లు వేశాడు. చీఫ్‌గా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయలేదంటూ బేబక్క.. నిఖిల్‌ను నామినేట్ చేసింది.గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్అనంతరం శేఖర్ బాషా హౌస్‌లో అడుగుపెట్టాడు. ప్రేరణలో చిన్నపిల్లల మనస్తత్వం ఎంతో నచ్చేవి. కానీ రానురానూ రూడ్‌గా మారిపోయింది.. కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తోందంటూ ఆమెను నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్ అని సలహా ఇచ్చాడు. యష్మిని సైతం గ్రూపిజం కనిపిస్తోందంటూ నామినేట్ చేశాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మాట అన్నారు: మూవీ ఈవెంట్లో హరీశ్ రావు
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు. పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన పేరు మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను హైదరాబాద్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా అని. కేసీఆర్ పల్లెలను, హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు. సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో, దమ్ము ధైర్యంతో ఈ సినిమా తీశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు. -
కడప దర్గాను సందర్శించిన రామ్‌చరణ్
ప్రముఖ హీరో రామ్‌చరణ్ కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించాడు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆయన సోమవారం నాడు పెద్ద దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాడు. అలాగే ముషాయిరా (కవి సమ్మేళనం) కార్యక్రమంలోనూ ముఖ్య అతిథిగా పాల్గొననున్నాడు.ఇకపోతే కడప పెద్ద దర్గా ఉత్సవాలకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ క్రమం తప్పకుండా వెళ్తుంటారు. ఈ ఏడాది జరిగే 80వ ముషాయిరా గజల్ ఈవెంట్లో ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారట! దీనికి చరణ్‌ను ఆహ్వానించగా తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చినట్లు సమాచారం. ఈ మాట నిలబెట్టుకోవడానికే చరణ్ నేడు కడపకు వెళ్లినట్లు తెలుస్తోంది.చరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరగా ఆచార్యలో కీలక పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది.చదవండి: బంగారపు టూత్‌బ్రష్‌తో గేమ్ ఛేంజర్ హీరోయిన్ -
దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్'
చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా రానిస్తున్న ఒక బ్యూటీపై ప్రొడ్యూసర్ భార్య నోరుజారి పలు వ్యాఖ్యలు చేయడంతో విమర్శలపాలయింది. ప్రస్తుతం ఈ ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీపై 'కంగువా' సినిమా ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా సతీమణి నేహా జ్ఞానవేల్ నోరుజారి చేసిన కామెంట్లతో చిక్కుల్లో పడింది. సూర్య, దిశా పటానీ జంటగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలైంది. అయితే, ఊహించినంత విజయాన్ని అయితే ఈ చిత్రం దక్కించుకోలేదు. సినిమాకు డివైడ్ టాక్ రావడంతో బిగ్ ఓపెనింగ్స్ రాలేదు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకు తీవ్రమైన నిరాశ మిగిలింది.కంగువా సినిమాతో కోలీవుడ్‌లో దిశా పటాని ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సూర్య సరసన మెరిసిన ఈ బ్యూటీ అక్కడ మంచి మార్కులే కొట్టేసింది. అయితే, సినిమాలో కొంత సమయం మాత్రమే దిశా పటాని కనిపించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. కేవలం పాటల కోసమే ఆమెను దర్శకుడు తీసుకున్నారా అనేలా ఉంది. సీన్స్ విషయంలో కూడా తక్కువే ఉన్నాయి. బికినీలో అందాల్ని ఆరబోసిన ఈ బ్యూటీ గ్లామర్‌కు కోలీవుడ్ ఫిదా అయిపోయింది. అయితే, ఒక మీడియా సమావేశంలో చిత్ర మేకర్స్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. కంగువాలో దిశా పటాని పాత్ర చాలా తక్కువగా ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అందుకు చిత్ర నిర్మాత సతీమణి నేహా జ్ఞానవేల్ ఇలా చెప్పుకొచ్చారు. 'దిశా పటానీని కేవలం గ్లామర్ కోసం మాత్రమే కంగువా సినిమాలోకి తీసుకున్నాం. దీంతో ఏంజెలా పాత్రకు సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఆమె క్యారెక్టర్‌ను పరిమితం చేశాం. ' అని చెప్పారు.హీరోయిన్ దిశా పటాని గురించి నేహా జ్ఞానవేల్ చేసిన కామెంట్లకు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరు కూడా ఒక మహిళనే కదా... ఇలా ఒక హీరోయిన్ గురించి తక్కువ చేసి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మగవారు మాత్రమే ఇలాంటి కామెంట్లు చేస్తారని ఇప్పటి వరకు అనుకున్నామని ఆమె తీరును తప్పుపడుతున్నారు. కంగువా సినిమా కోసం సుమారు రూ. 350 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పటి వరకు కేవలం రూ. 90 కోట్లు మాత్రమే వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
అలా అయితేనే సినిమాలు చేసేందుకు ముందుకు రండి: ఆర్పీ పట్నాయక్
కిట్టు తాటికొండ, కష్మీరా,రోహిత్, వైశాలి, సునీల్ రావినూతల, శ్రీ గోపి చంద్ కొండ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'కరణం గారి వీధి'. ఈ చిత్రాన్ని సౌత్ బ్లాక్ బస్టర్ క్రియేషన్స్ బ్యానర్‌పై అడవి అశోక్ నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం హేమంత్, ప్రశాంత్ తెరకెక్కిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో కంప్లీట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ - 'కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పోస్టర్, టైటిల్ డిజైన్ చాలా కొత్తగా అనిపించింది. కొత్త టాలెంట్ ఎంత ఎక్కువగా వస్తే ఇండస్ట్రీకి అంత మంచిది. ఈ టీమ్ కూడా మంచి ప్రయత్నం చేసి ఉంటారని ఆశిస్తున్నా. ఈ సినిమా టీమ్‌కు మంచి పేరు రావాలి. కొత్త ఫిలిం మేకర్స్‌కు నాదొక చిన్న సలహా. సినిమా మీద కనీస అవగాహన, ప్యాషన్ ఉనప్పుడే సినిమాలు చేసేందుకు ముందుకు రండి. అప్పుడే మీరు చేసే సినిమా బాగుంటుంది'అని అన్నారు.నిర్మాత అడవి అశోక్ మాట్లాడుతూ..' మా కరణం గారి వీధి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన ఆర్పీ పట్నాయక్‌కు థ్యాంక్స్. ఆయన మ్యూజిక్‌తో పాటు ఆయన తెరకెక్కించిన సినిమాలంటే మాకు ఇష్టం. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లోకి తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ - 'పల్లెటూరి నేపథ్యంగా సాగే కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మనం నిజ జీవితంలో చూసే వాస్తవిక ఘటనలు ఉంటాయి. కరణం గారి వీధి సినిమాను అందరికీ నచ్చేలా రూపొందిస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసి మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం' అని అన్నారు.దర్శకుడు ప్రశాంత్ మాట్లాడుతూ..' లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా కరణం గారి వీధి సినిమాను రూపొందిస్తున్నాం. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉంటూ మంచి కామెడీతో మీరంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఆర్పీ సార్ తమ టైమ్ కేటాయించి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం' అని అన్నారు. -
గ్రూప్ గేమ్ బండారం బయటపెట్టిన బాషా.. నిఖిల్‌కు పెద్ద మైనస్
నిఖిల్ అంటే ఇష్టమని అతడి వెంట తిరిగింది యష్మి. తనకు అలాంటి ఫీలింగ్స్ లేవని నిఖిల్ క్లియర్‌గా చెప్పకుండా చెప్పీచెప్పినట్లు చెప్పి తప్పించుకున్నాడు. పైగా యష్మి.. గౌతమ్ షర్ట్ వేసుకున్నప్పుడు అలగడం, వేరే ఎవరితోనైనా డ్యాన్స్ వేస్తే కుళ్లుకోవడం, తనను హత్తుకుని ముద్దుపెట్టడం వంటివి చూసినప్పుడు నిఖిల్‌కు కూడా ఆమె అంటే ఇష్టముందేమో అన్న సంకేతాలు కనిపించాయి.ముసుగులో గుద్దులాటఈ ముసుగులో గుద్దులాట దేనికి? అసలు నీ అభిప్రాయమేంటి? అని నిఖిల్‌ను ముఖం పట్టుకుని అడిగేసింది సోనియా. అందుకతడు ఆ మ్యాటర్‌ను ఎప్పుడో కట్ చేశానని, యష్మిపై తనకలాంటి ఉద్దేశమే లేదన్నాడు. అయితే యష్మి మాత్రం అది అబద్ధమని, తనకు ఏదీ క్లారిటీగా చెప్పలేదని వాదించింది. దీంతో నిఖిల్‌కు ఈ ఎపిసోడ్ కొంత మైనస్‌గా మారేట్లు కనిపిస్తోంది.పురుగుల్ని చూసినట్లు చూస్తావుఇక బేబక్క.. మనుషుల్ని చాలా తక్కువ చేసి చూస్తుంటావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆర్జే శేఖర్ బాషా.. ప్రేరణను నామినేట్ చేస్తూ అదిరిపోయే పాయింట్లు చెప్పాడు. అవతలివారిని కించపరిచేట్లుగా మాట్లాడతావ్.. కొన్నిసార్లు కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తావు.. పానీపట్టు టాస్క్‌లో నిఖిల్ నిన్ను, యష్మిని రఫ్‌గా హ్యాండిల్ చేశాడు. ఆ పాయింట్‌తో నువ్వు నిఖిల్‌ను నామినేట్ చేయొచ్చు. కానీ అది వదిలేసి నీ టీమ్ మెంబర్ అయిన గౌతమ్‌ను ఎందుకు నామినేట్ చేశావు? అని ప్రశ్నించాడు.నిఖిల్‌కు లేని బాధ నీకెందుకు?అటు యష్మిని సైతం నామినేట్ చేస్తూ.. అవినాష్.. రోహిణిని సేవ్ చేసి నిఖిల్‌ను నామినేట్ చేశాడు. అక్కడ నిఖిలే లైట్ తీసుకున్నాడు, కానీ నువ్వెందుకు బాధపడ్డావు? మీ ముగ్గురూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని జనాలకు తెలిసిపోయింది అంటూ యష్మిని నామినేట్ చేశాడు. మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు
టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్‌లో కూడా ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తుందనే చెప్పాలి. తెలుగులో సలార్, కల్కి, దేవర చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే వీటికి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. తమిళ చిత్రాలు విషయానికొస్తే భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన భారతీయుడు – 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ చిత్రానికి 3వ సీక్వెల్‌ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా తాజాగా విడులైన సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. కంగువ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ నిర్మాణానికి కూడా కొంత సమయాన్ని తీసుకుంటున్నట్లు నిర్మాత చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన భారతీయుడు చిత్రం 1996లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అది తెర రూపం దాచడానికి 28 ఏళ్లకు పైగా పట్టింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా భారతీయుడు – 3 చిత్రాన్ని కూడా ఏకకాలంలో రూపొందించారు. అయితే భారతీయుడు – 2 చిత్రం విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పార్ట్ – 3 విడుదల సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి దర్శకుడు శంకర్, నటుడు కమలహాసన్ సిద్ధంగా లేరని తెలిసింది. అదేవిధంగా భారతీయుడు– 2 మాదిరిగా పార్ట్- 3 కాకూడదని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని నటుడు కమలహాసన్ దర్శకుడు శంకర్‌కు సూచించినట్లు సమాచారం. శంకర్ కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రూ.100 కోట్లు ఉంటేనే..భారతీయుడు – 3 చిత్రం కోసం ఆయన నిర్మాణ సంస్థ లైకాకు మరో రూ.100 కోట్లు బడ్జెట్‌ను సమకూర్చమని చెప్పినట్లు సమాచారం. కాగా శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెరపైకి రానుంది. ఆ తర్వాత భారతీయుడు– 3 చిత్ర రీషూట్‌కు శంకర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. -
కిరణ్ అబ్బవరానికి సారీ చెప్పిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' ట్రైలర్ ఆదివారం రిలీజైంది. అలా విడుదల చేశారో లేదో ఇలా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ట్రైలర్ అదరిఇపోయిందంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే క మూవీతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం సైతం వైల్డ్ఫైరూ.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్ అంటూా ట్వీట్ చేశాడు.తప్పకుండా చూస్తా..దీనికి బన్నీ స్పందిస్తూ.. థాంక్యూ మై బ్రదర్.. అలాగే నువ్వు హిట్ అందుకున్నందుకు శుభాకాంక్షలు. బిజీగా ఉండటం వల్ల క సినిమా చూడలేకపోయాను. అందుకు క్షమించు. తప్పకుండా నీ సినిమా చూసి నీకు కాల్ చేస్తాను అని రిప్లై ఇచ్చాడు.బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా 'క'ఇకపోతే కిరణ్ అబ్బవరం క మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. సుజీత్, సందీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, శివకార్తికేయన్ అమరన్ సినిమాలతో పోటీపడిన కిరణ్.. బ్లాక్‌బస్టర్ హిట్టు అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. Thank u my brotherrrr 🖤🖤🖤 . Andddd Congratulations… Sorry could not see the film in this busy time . Will def watch and call you 🖤— Allu Arjun (@alluarjun) November 18, 2024 -
అగ్గి రాజేసిన సోనియా.. నిఖిల్ వల్ల బ్యాడ్ అయ్యానన్న యష్మి
ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ వెరైటీగా ప్లాన్ చేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హౌస్‌లోకి రప్పించి.. ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు. అలా మొదటగా సోనియా ఆకుల హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే నిఖిల్ బ్యాచులో పుల్లలు పెట్టింది. పృథ్వీని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావ్ అంటూ ప్రేరణను నామినేట్ చేసింది.సిల్లీ రీజన్స్‌తో నామినేషన్ఇక నిఖిల్‌ను అయితే ఓ ఆటాడేసుకుంది. మొదట్లో పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావ్? అని అడిగింది. అందుకతడు నిర్లక్ష్యంగా ఉన్నందుకు చేశానన్నాడు. అది విని అవాక్కైన పృథ్వీ.. ఆ కారణంతో నామినేట్ చేశావా? అని నోరెళ్లబెట్టాడు. మంచి పాయింట్లతో ఎప్పుడైనా నామినేట్ చేశావా? అని నిఖిల్‌ను నిలదీసింది. ఇక యష్మితో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి తన మనసులో ఫీలింగ్ చెప్పింది.. కానీ నువ్వు అంటూ సోనియా మాట్లాడుతుండగా.. మధ్యలో నిఖిల్ అందుకున్నాడు. నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదుతన ఫీలింగ్ చెప్పగానే అక్కడే కట్ చేసేశాను అని క్లారిటీ ఇచ్చాడు. అది అబద్ధమని యష్మి గట్టిగా అరిచింది. క్లారిటీగా తనకు చెప్పుంటే నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదంది. అతడి వల్ల తాను బ్యాడ్ అయ్యానంది. అలా సోనియా నిఖిల్ నెత్తిపై బాటిల్ పగలగొట్టి నామినేట్ చేసింది. మరి హౌస్‌లోకి ఇంకా ఎవరెవరు వచ్చారు? ఎవర్ని నామినేట్ చేశారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ అడ్వకేట్ మరో నోటీసు
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ లాయర్ మరో నోటీసు పంపారు. నయనతారపై తెరకెక్కించిన డాక్యుమెంటరీలో తమ సినిమాకు సంబంధించిన ఫుటేజీని తొలగించాలని ఆయన కోరారు. ఈమేరకు ఇప్పటికే నోటీసులు కూడా పంపడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. 24 గంటల్లో ఆ ఫుటేజీని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ధనుష్ లాయర్ మరోసారి హెచ్చరిస్తూ నయన్‌కు నోటీసులు పంపారు.నయనతార డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన 'నేనూ రౌడీనే' సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియోను ఆమె ఉపయోగించుకుంది. దీంతో ధనుష్ కాపీరైట్ చట్టం కింద నయన్‌పై రూ. 10 కోట్లు నష్టపరిహారం కేసు వేశారు. అయితే, తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుండంతో అందులో ఈ సినిమా నుంచి తీసుకున్న ఫుటేజీ కూడా ఉంది. దీంతో ధనుష్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆమెతో పాటు నెట్‌ఫ్లిక్స్‌కు హెచ్చరికతో ధనుష్ అడ్వకేట్ నోటీసు జారీ చేశారు.ధనుష్ లాయర్ తాజాగా నయన్ అడ్వకేట్‌కు ఒక లేఖ ఇలా రాశారు 'నా క్లయింట్‌కు హక్కులు కలిగి ఉన్న సినిమాలోని వీడియోను నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించారు. ధనుష్ అనుమతి లేకుండా అలా చేయడం చట్టరిత్యా నేరం. 24 గంటల్లో దానిని తొలగించాలి. ఈ విషయంలో మీ క్లయింట్‌కు (నయనతార) సలహా ఇవ్వండి. లేని పక్షంలో మీ క్లయింట్‌కు వ్యతిరేకంగా నా క్లయింట్ చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రూ. 10 కోట్ల నష్టపరిహారం విషయంలో నయనతారతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.' అని ప్రకటన ముగించారు. దీంతో నయనతారకు పుట్టినరోజు కానుకను ధనుష్ ఇలా ప్లాన్ చేశాడా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.Dhanush has given them 24 hours to remove the contents of NRD movie from the documentary. If not, then #Nayanthara, @VigneshShivN and @NetflixIndia will have to face legal actions, and will also be subjected to a 10cr damage pay. But Couples can’t tolerate this appeal . So they… pic.twitter.com/JpMfotdT7E— Dhanush Trends ™ (@Dhanush_Trends) November 17, 2024 -
ఈ సినిమా గిట్ట ఆడకపోతే.. ఇలాంటి మాటలు వద్దు ఇక: విశ్వక్ సేన్ కామెంట్స్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మాస్ యాక్షన్‌తో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో హిట్ కొట్టిన యంగ్ హీరో మళ్లీ అలరించేదుకు రెడీ అయ్యాడు. యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో గుంటూరు కారం భామ మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మేకర్స్ మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వరంగల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా హిట్ కొట్టినా.. ఫ్లాఫ్ అయినా నేను సినిమాలు తీయడం ఆపేది లేదని ఛాలెంజ్ విసిరారు.విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'మీకు ఎప్పటిలాగే ఛాలెంజ్ విసరాలా? ప్రతి సినిమాకు ఛాలెంజ్ కావాలా? మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమా గిట్ట ఆడకపోతే షర్ట్ లేకుండా చెక్‌పోస్ట్‌లో తిరుగుతా.. ఫిల్మ్ నగర్లో ఇల్లు ఖాళీ చేస్తా.. ఇకపై ఇలాంటివీ నేను మాట్లాడదలచుకోవట్లేదు. సినిమా హిట్ అయినా.. ఫ్లాఫ్ అయినా నా చొక్కా నా ఒంటిమీదనే ఉంటది.. నా ఇల్లు జూబ్లీహిల్స్లోనే ఉంటది.. నేను ఇంకో సినిమా చూస్తా. అది ఉన్నా.. దొబ్బినా మళ్లీ మళ్లీ సినిమా తీస్తా. పూరి జగన్నాధ్ రాసినట్టు, రవితేజ అన్న చెప్పినట్లు మాకు తెలిసిందల్లా ఒక్కటే.. సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టిన ఈ మూవీ తీసినం' అంటూ మాట్లాడారు. కాగా.. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. -
'రికార్డుల్లో పుష్ప పేరు ఉండడం కాదు.. పుష్ప పేరు మీదే రికార్డులు ఉంటాయి'
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే వినిపిస్తోంది. కేవలం వినిపించడమే కాదు..డైలాగ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఆదివారం పుష్ప-2 ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ మొదలైంది. బన్నీ ఫ్యాన్స్ సందడి అయితే అంతా ఇంతా కాదు. ఏ నగరంలో చూసిన టపాసులు పేలుస్తూ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే యూట్యూబ్‌లో ఎప్పుడు లేని రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.అయితే ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప రాజ్.. మరో క్రేజీ రికార్డ్ నమోదు చేశాడు. బిహార్‌లో పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ఏకంగా 2.6 లక్షల మంది లైవ్‌లో వీక్షించారు. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా ఈ రికార్డ్‌ను సాధించలేదు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పుష్ప టీమ్ ట్విటర్లో పంచుకుంది. దీంతో పుష్ప-2 రికార్డులు చూస్తుంటే ఏ ఇండియన్ సినిమాకు ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు. కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు నమోదు చేసింది. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న పుష్ప-2 ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే. His arrival means one thing - the existing records tumble 💥💥#Pushpa2TheRuleTrailer launch event registers the highest number of live viewers for an event with 2.6 LAKH concurrent viewers❤🔥❤🔥#RecordBreakingPushpa2TRAILER 🌋🌋▶️ https://t.co/FKXAngle5q… pic.twitter.com/vuCpMypShD— Pushpa (@PushpaMovie) November 18, 2024 -
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' విడుదలకు లైన్ క్లియర్
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' సినిమా విడుదలపై మరోసారి అధికారిక ప్రకటన వచ్చేసింది. కంగనా లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కోసం ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాస్తవంగా ఈ చిత్రం గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ చిక్కుల వల్ల పలు ఇబ్బందలు రావడంతో రిలీజ్ విషయంలో పలుమార్లు వాయిదా పడుతూనే వస్తుంది.ఎట్టకేలకు ఎమర్జెన్సీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 17న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో తమ వర్గాన్ని తక్కువ చేసి చూపించారని కొందరు సిక్కులు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడంతో విడుదల విషయంలో చిక్కులు వచ్చాయి. వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఎఫ్‌సీని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించడంతో మరోసారి ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఎట్టకేలకు కోర్టు నుంచి కూడా అడ్డంకులు లేకపోవడంతో 2025 జనవరి 17న ఈ చిత్రం విడుదల కానుంది.1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది. ఈ సినిమా పలుమార్లు విడుదల (2023 నవంబరు 24, 2024 జూన్ 14, 2024 సెప్టెంబర్ 6) వాయిదా పడింది. ఈ చిత్రం కోసం నిర్మాతగా మారిన కంగనా రనౌత్ తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నారు. -
పుష్ప 2 ట్రైలర్‌పై దర్శకధీరుడు 'రాజమౌళి' కామెంట్స్
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసిన కూడా ఇప్పుడు పుష్పగాడి రూల్ నడుస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ప్రతి సినిమా అభిమాని అల్లు అర్జున్ గురించే చర్చించుకుంటున్నారు. పట్నాలో జరిగిన ట్రైలర్ ఈవెంట్‌కు కోసం ఆయన ఫ్యాన్స్భారీగా తరలి వచ్చారు. దీంతో బీహార్ షేర్ అంటూ బన్నీని ప్రశంసిస్తున్నారు. అయితే, ట్రైలర్‌ను చూసిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి పుష్ప యూనిట్‌ను అభినందించారు.పుష్ప ట్రైలర్‌పై చాలామంది సినిమా ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి చేసిన ట్వీట్ బన్నీ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతుంది. 'పట్నాలో పుష్ప వైల్డ్‌ఫైర్ మొదలైంది. అదీ దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది. డిసెంబర్ 5న విస్పోటనం చెందుతుంది. పార్టీ కోసం ఎదురుచూస్తూ ఉండలేకపోతున్నాం పుష్ప' అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే, అల్లు అర్జున్ కూడా జక్కన్నకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తప్పకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. సినిమా విడుదలకు ముందు పుష్పరాజ్ పలు రికార్డ్స్ సొంతం చేసుకుంటున్నాడు. ప్రీసేల్ బిజినెస్‌లో సత్తా చాటిన పుష్ప ఇప్పటికే సుమారు రూ. 1000 కోట్ల వ్యాపారం చేసిందని టాక్ వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా 40 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రంగా పుష్ప నిలిచింది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లలో ఈ చిత్రం విడుదల కానుంది.