TS Special
-
బోట్ల దుర్ఘటన మీ దృష్టికి రాలేదా!?
సాక్షి, అమరావతి: విశాఖలో మత్స్యకారుల బోట్లు అగ్నికి అహుతైన ఘటన మీ దృష్టికి రాలేదా పురందేశ్వరిగారూ? అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశి్నంచారు. గతంలో అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు.. వాళ్లంతా మీకు ఓట్లు వేసిన వారే.. వ్యక్తిగతంగానైనా, పార్టీ పరంగానైనా గంగపుత్రులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు రాకపోవడం దురదృష్టకరమని శనివారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. బాధితులకు బోటు విలువలో 80 శాతం ఆర్థిక సాయం అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందన్నారు. కేంద్ర నిధులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అంటున్న పురందేశ్వరిగారూ.. మరి కేంద్రానికి నిధులు రాష్ట్రాల నుంచి కాక ఆకాశం నుంచి వస్తాయా చెల్లెమ్మా? అని ప్రశ్నించారు. మీ నాన్న ఎన్టీఆర్ కేంద్రం ఒక మిథ్య అనేవారు.. కానీ, మీరు మాత్రం అంతా రివర్స్‌లా ఉన్నారు.. అవునులే.. తండ్రిని విభేదించిన పార్టీతోనే అంటకాగుతున్నారుగా అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు బీజేపీలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టీడీపీ భజన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైలులో ఉన్న టీడీపీ జిల్లా నాయకులను పురందేశ్వరి సలహా మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులు పరామర్శించి సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లిందన్నారు. ఇక రాష్ట్రంలో పలుచోట్ల ఈనాడు పత్రికను ఉచితంగా ఇళ్ల ముందు వేస్తున్నారని.. బలవంతంగా ఎల్లో స్టెరాయిడ్స్ ఎక్కించే ప్రయత్నమా డ్రామోజీ? అని విజయసాయిరెడ్డి అందులో ప్రశ్నించారు. చంద్రబాబు ‘అనుకూల’ మీడియా ఏది రాసినా, చూపినా ప్రజలు నమ్మడం లేదన్నారు. -
రిస్క్ వద్దు.. కారు ముద్దు
సాక్షి, యాదాద్రి, సాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి మహబూబాబాద్ /నెక్కొండ/బచ్చన్నపేట: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రిస్‌్కలో పడుతామని, సీఎం కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సేఫ్‌గా ఉంటుందని మంత్రి తన్నీరు హరీ‹Ùరావు వ్యాఖ్యానించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం చీకటిమామిడిలో కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. భువనగిరి పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ప్రసంగించారు. 80 సీట్లు గెలిచి బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పా రు. యాసంగిలో రైతు బంధు అమలు చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వగానే కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని హరీశ్ అన్నారు. బ్యాంకులకు సెలవులు పూర్తికాగానే మంగళవారం రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుందని చెప్పా రు. కాంగ్రెస్‌కు చాన్స్ ఇస్తే ఆరు గ్యారంటీలకు బదులు, వాళ్లకు వాళ్లు తన్నుకుని ఆరుగురు ముఖ్యమంత్రులు అవుతారని ఎద్దేవా చేశారు. ఎన్నో మంచి పనులు చేసిన కేసీఆర్‌ను సాదుకుందామా, రాజకీయంగా సంపుకుందామో ప్రజలు తేల్చుకోవాలన్నారు. కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, భువనగిరి, ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థులు ఫైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతా పాల్గొన్నారు. కర్ణాటకలో కరెంటు బంద్ అయింది. ఆరు గ్యారంటీలని కాంగ్రెస్ నేతలు ఊర్లపొంటి తిరుగుతున్నారు.. ఆరునెలల క్రితం కర్ణాటకకు పోయి ఐదు గ్యారంటీలిస్తామని అక్కడ రాహుల్ గాం«దీ, ప్రియాంకగాంధీ చెప్పారు. నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్న కరెంట్ బందయ్యింది. ఐదు గ్యారంటీలను గాలికొదిలేసింది... హామీలిచ్చిన ప్రియాంక, రాహుల్‌లు ఆ రాష్ట్రానికి వెళ్లడం లేదు. అలాంటివాళ్లు తెలంగాణలో అధికారం ఇస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంటే నమ్మాలా? 12 సార్లు రైతుబంధు ఇచ్చిన కేసీఆర్ కావాలా లేక మాట తప్పే కాంగ్రెస్ కావాలో ఆలోచించుకోవాలి’అని హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, నెక్కొండ, పాలకుర్తి, బచ్చన్నపేటలలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు శంకర్‌నాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను గెలిపించాలని కోరుతూ శనివారం రోడ్‌షోలు, కార్నర్‌మీటింగ్‌లలో ఆయన ప్రసంగించారు. పాలిచ్చే గేదెవంటి బీఆర్ఎస్ పారీ్టకి కాకుండా పనిచేయని దున్నపోతు వంటి కాంగ్రెస్‌కు గడ్డి వేస్తే ఫలితం ఉండదు’అని అన్నారు. ప్రాజెక్టులు రేవంత్ నెత్తిపై కట్టాలా మూడు గంటల కరెంట్ చాలని చెప్పిన రేవంత్ ఇప్పుడు ప్రాజెక్టులు ఇసుకపై కట్టారని అనడం అయన అవగాహనా రాహిత్యానికి నిదర్శమని హరీశ్ ధ్వజమెత్తారు. నదులపై ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఇసుకపై కాకుండా రేవంత్ నెత్తిపై కట్టాలా అని అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం రైతుబంధు అందిస్తుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బిచ్చం వేస్తుందని, రైతులను బిచ్చగాళ్లుగా మాట్లాడిన రేవంత్‌కు, కాంగ్రెస్ పారీ్టకి ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని పిలుపు నిచ్చారు. సోమవారం నుంచి రైతు ఖాతాల్లో డబ్బులు పడతాయని హరీశ్ చెప్పారు. డబ్బులు పడిన మెస్సేజీ శబ్దం టింగ్. టింగ్ మంటూ వస్తుందన్నారు. ఆ శబ్ధం విన్న రైతులు ఆదే ఊపుతో 30వ తేదీ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అనుమతి ఇస్తే రుణమాఫీ కూడా పూర్తి చేస్తామన్నారు. ఒకే రోజు.. ఆరు జిల్లాలు.. ఏడు సభలు హరీశ్‌రావు శనివారం ఒక్కరోజు ఆరు జిల్లాల్లో ఏడు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించి రికార్డు సృష్టించారు. ఒక్కరోజే మహబూబాబాద్, వరంగల్, పాలకుర్తి, జనగామ, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం హెలికాప్టర్లోనే చేశారు. -
పెరిగిన నేర చరితులు!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నేర చరితులు పెరిగారు. నేర చరిత్ర, పెండింగ్ కేసులు ఉన్న వారికి ఎన్నికల్లో సీట్లు కేటాయించవద్దని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ రాజకీయ పార్టీలు అది పాటించక పోవడం గమనార్హం. మొత్తం 2,290 మంది అభ్యర్థుల్లో 23 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా అఫిడవిట్లలో పేర్కొన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. 2018 ఎన్నికలలో 1,777 మంది అభ్యర్థులకు గాను 21 శాతం (368) మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉండగా, ఈ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్నవారు 521 మంది ఉన్నారని ఏడీఆర్ వివరించింది. 353 మంది అభ్యర్థులపై సీరియస్ క్రిమినల్ కేసులు (5 ఏళ్లు అంతకు మించి శిక్షపడే కేసులు) ఉండగా, ఈ సంఖ్య 2018లో 321గా ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి వారిపై పెండింగ్ కేసులు, విద్యార్హతలు, ఆర్థిక స్థితిగతులు, వయసులు, మహిళలు, పురుషుల సంఖ్య వంటి వివరాలతో నివేదిక రూపొందించినట్టు ఏడీఆర్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్లు రాకేశ్ దుబ్బుడు, వై.రాజేంద్రప్రసాద్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్‌లో ఎక్కువ.. అన్ని ప్రధాన పార్టీలు క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులకు టికెట్లు (14% నుంచి 72% వరకు) ఇచ్చాయి. అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 85 (72%) మంది, బీజేపీ నుంచి 79 (71%) మంది, అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి 57 (48%) మంది, బీఎస్పీ నుంచి 40 (37%) మంది, సీపీఐ(ఎం) నుంచి 12 (63%) మంది, ఏఐఎంఐఎం నుంచి ఐదుగురు (56%), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 10 (24%) మంది క్రిమినల్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని ఏడీఆర్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంస్థలు వెల్లడించాయి. కోటీశ్వరులూ పెరిగారు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. మొత్తం అభ్యర్థుల్లో 25 శాతంమంది కోటీశ్వరులు కాగా, రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 41.48% ఉన్నారు. ఇక ముగ్గురుకు మించి అభ్యర్థులపై క్రిమినల్ కేసు లు ఉన్నట్లయితే అటువంటి నియోజకవర్గాలను రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా గుర్తించారు. 2018లో రెడ్ అలర్ట్ నియోజకవర్గాలు 78 ఉండ గా, ప్రస్తుత (2023) ఎన్నికల్లో ఇవి 96కు పెరిగాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మహిళలకు ఆయా పార్టీలు ఇచ్చే సీట్ల సంఖ్య పెరిగే అవ కాశం ఉంటుందని అంచనా వేసినా అది జరగ లేదు. అన్ని పార్టీల్లో కలిపి పోటీలో ఉన్న (2,290 మంది) అభ్యర్థుల్లో 10% మంది మా త్రమే మహిళా అభ్యర్థులు కావడం గమనార్హం. ప్రధాన పార్టీలదే హవా ప్రదాన పార్టీలన్నీ సంపన్న అభ్యర్థులకే అత్యధికంగా సీట్లు కేటాయించాయి. 2,290 మంది అభ్యర్థులలో 580 (25%) మంది కోటీశ్వరులు ఉన్నారు. బీఆర్ఎస్కు చెందిన 114 (96%) మంది, కాంగ్రెస్‌కు చెందిన 111 (94%) మంది, బీజేపీకి చెందిన 93 (84%)మంది రూ. కోటి కంటే ఎక్కువ ఆస్తులను ప్రకటించారు. 25 మంది తమకు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదని ప్రకటించడం గమనార్హం. అస్తుల్లో వివేక్ ఫస్ట్ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేకానంద్ తన ఆస్తుల విలువ రూ.606+ కోట్లుగా ప్రకటించి తొలి స్థానంలో నిలిచారు. రూ.458+ కోట్లతో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి, రూ.433 కోట్లతో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సీఎం కేసీఆర్ తన సంపద రూ.58+ కోట్లుగా, ఈటల, కేటీఆర్‌లు రూ.53+ కోట్లుగా, రేవంత్‌రెడ్డి రూ.30+ కోట్లుగా ప్రకటించారు. కాగా, 979 (43%) మంది తమ విద్యార్హతలను 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్లు ప్రకటించగా, 1,143 (50%) మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నట్లు ప్రకటించారు. -
పేరు మారినంత మాత్రాన వీరి బుద్ధి మారదు: పీఎం మోదీ ఫైర్
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ నేడు కామారెడ్డికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక, కామారెడ్డిలోని డిగ్రీ కాలేజీ మైదానంలో బీజేపీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ‘పేరు మారినంత మాత్రాన వీరి బుద్ధి మారదు. యూపీఏ ఇండియా కూటమిగా మారింది. టీఆర్ఎస్ హఠాత్తుగా బీఆర్ఎస్గా మారింది. ఇండియా కూటమి అంటూ మళ్లీ మోసం చేసేందుకు జతకట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వారి పిల్లల కోసం చూసుకుంటారు. బీజేపీ మాత్రం ప్రజల పిల్లల కోసం ఆలోచిస్తుంది. కేసీఆర్, రేవంత్ ఇద్దరూ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. అవినీతి, కుటుంబ పాలనను ఓడించే అవకాశం వచ్చింది. ఆ ఇద్దరూ తమ నియోజకవర్గాల్లో ఓడిపోతామని తెలిసే రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో విజయ కోసం ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతారు.’ ‘బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి లభించాలి. బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు. బీజేపీ చెప్పింది చేసి చూపిస్తుంది. వాగ్దానం ఇచ్చామంటే అది అమలై తీరుతుంది. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణే మా లక్ష్యం. మహిళల రిజర్వేషన్లు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, అయోధ్య రామమందిర నిర్మాణం వంటి హామీలు నెరవేర్చాం. నిజామాబాద్‌లో పనుపు బోర్దు ఏర్పాటు చేస్తున్నాం.. గిరిజన యూనివర్సిటీ హామీని నిలబెట్టుకున్నాం. ఇచ్చిన హమీలను నిలబెట్టుకుంటున్నాం. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించాం. తెలంగాణలో మాదిగ సమాజానికి తీరని అన్యాయం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని వేశాం. బీఆర్ఎస్ దళితుడిని సీఎంని చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. గ్యారంటీలను పూర్తి చేయడమే మోదీ గ్యారంటీ. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చాం. సీఎంను చేసి తీరుతాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీల కోసం ఏం చేయలేవు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణ రైతుల కష్టాలు బీఆర్ఎస్కు పట్టడం లేదు. నీటి ప్రాజెక్టులు అవినీతితో నిండిపోయాయి. రైతుల సంక్షేమం కోసమే బీజేపీ ప్రాధాన్యతనిస్తుంది. ప్రాజెక్ట్‌ల నిర్మాణం బీఆర్ఎస్కు ఏటీఎంలా మారింది. తెలంగాణ రైతుల కోసం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని నిర్ణయించాం. తెలంగాణ అభివృద్ధికి ఖర్చు కావాల్సిన డబ్బులు బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. రైతులకు అదనంగా ఆదాయం వచ్చేందుకు కృషి చేస్తున్నాం. పథకాలన్నీ బీఆర్ఎస్కు ఏటీఎంలా మారాయి. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను బీఆర్ఎస్ మోసం చేసింది. పేపర్ లీకేజీలతో నిరుద్యోగ యువత దగా పడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ తీరుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పేదలు ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉచిత రేషన్‌ను మరో ఐదేళ్లు ఇస్తున్నాం. ఇద్దరు ఎంపీలు ఉన్న బీజేపీని ఇప్పుడు 300 స్థానాల్లో గెలిపించి ఆశీర్వదించారు. మేము తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రియాంకకు చరిత్ర తెలియకపోవడం దురుదృష్టకరం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పీవీ మనందరం అభిమానించే గొప్ప వ్యక్తి అని, మట్టిలో పుట్టిన మాణక్యమని తెలిపారు. తన జీవితమంతాకాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తని పేర్కొన్నారు. అలాంటి నిరాడంబరమైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి ఉన్న పీవీ నర్సింహరావుకు 1996లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ నిరాకరించి ఘోరంగా అవమానించారని కేటీఆర్ ప్రస్తావించారు., ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని అనుమతించలేదని గుర్తు చేశారు.చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: మోదీకి కేసీఆర్, ఓవైసీ స్నేహితులు: రాహుల్ గాంధీ #WATCH | Hyderabad: On Former PM PV Narasimha Rao, Telangana Minister and BRS MLA KT Rama Rao says, "It's truly unfortunate that Priyanka Gandhi does not seem to have any information on the history of the injustice meted out to late PM PV Narasimha Rao. He is someone we all look… pic.twitter.com/mjMOSdew3j— ANI (@ANI) November 25, 2023 #WATCH | Telangana Minister and BRS MLA KT Rama Rao says, "Rahul Gandhi is jobless today because he lost his job in 2014. He and his party both lost their job in 2014. That's why today he remembered unemployment... I want to ask if Rahul Gandhi has ever written a single entrance… pic.twitter.com/7PkNPpajrx— ANI (@ANI) November 25, 2023 -
ప్రజలు కోరుకుంది ఇలాంటి తెలంగాణ కాదు: రాహుల్ గాంధీ
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో ప్రజాపాలన కనిపించడం లేదని.. కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని.. కాంగ్రెస్‌తోనే రాష్ట్రం మళ్లీ కోలుకోలగదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం బోధన్‌లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోంది. ధరణి పేరుతో ఎమ్మెల్యేలకు భూములు అప్పజెప్తున్నారు. దళిత బంధు పథకంలో తీవ్ర అవినీతి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమీషన్ ఇవ్వకుంటే దళిత బంధు రాదు. తెలంగాణలో భూ, ఇసుక, వైన్స్ మాఫియా పెరిగింది. ఆ వచ్చే డబ్బంతా కేసీఆర్ ఇంటికే చేరింది. .. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని కేసీఆర్ సర్కార్ ఎస్సీల కోసం ఖర్చు చేయలేదు. కుటుంబ, అవినీతి పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది అని రాహుల్ గాంధీ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ రూ.1200గా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిలిండర్ ధర తగ్గిస్తాం. కాంగ్రెస్ గెలిచాక.. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తాం. కేసీఆర్ కారు పంక్చర్ అయ్యింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్‌లో చేరిన మండవ బోధన్ కాంగ్రెస్ విజయభేరి సభలో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఆదిలాబాద్ ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఇసుకలో.. మైనింగ్‌లో.. ఎటు నుంచి చూసినా కేసీఆర్ ప్రజా ధనాన్ని దోచుకునే పనిలో ఉన్నారు. ధరణి తెలంగాణలో దొరలు మీ భూములు లాక్కుంటున్నారు. తెలంగాణ మంతత్రులందరూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. 8,000 మంది రైతులు దొరల తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజలు ఆశించింది ఇలాంటి తెలంగాణ కాదు. ఎవరి భూములు వారికి ఇచ్చేదే ప్రజా తెలంగాణ. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్ని మళ్లీ దళితుల అభివృద్ధి అని గండికొట్టారు. మీ స్వప్నాన్ని కేసీఆర్, మంత్రులు నాశనం చేశారు. మీ చేతుల్లో తెలంగాణ గ్యారెంటీ కార్డు పెట్టాం. ఇవి గ్యారెంటీలు కావు(కాంగ్రెస్ గ్యారెంటీ ప్రతిని చూపిస్తూ..) చట్టంగా అమలు చేయబోతున్నాం. తొలి కేబినెట్లోనే వీటిని చట్టాలుగా మారుస్తాం. -
జనసేనలా మాది పావలా బేడ పార్టీ కాదు.. పవన్‌పై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
సాక్షి, అనకాపల్లి: పవన్‌లా మాది ప్యాకేజీ పార్టీ కాదంటూ వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఆయన పెందుర్తిలో మీడియాతో మాట్లాడుతూ.. జనసేనలా మాది పావలా బేడ పార్టీ కాదని, పేదల పక్షాల నిలిచే పార్టీ వైఎస్సార్సీపీ అని పేర్కొన్నారు. షూటింగ్ లేనప్పుడు రాష్ట్రానికి వచ్చే పవన్‌కు, ప్రజల కోసం పోరాటం చేసే వైఎస్సార్సీపీకి చాలా తేడా ఉంది. మరో 20 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా జగన్ ఉంటారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలో ఉంటేనే కదా పవన్‌కు అభివృద్ధి గురించి తెలుస్తుంది. బీసీలకు పావులుగా వాడుకున్న టీడీపీకి పుస్తకాలు వేసే అర్హత లేదు. బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా? బీసీలకు మేలు చేసేవారైతే మాలా ధైర్యంగా యాత్రలు చేయగలరా?. అధికారంలోకి వస్తానని పవన్ పగటి కలలు కంటున్నారు’’ అంటూ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. చదవండి: సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు! -
మోదీ-కేసీఆర్ ఫెవికాల్ బంధం బయటపడిందిలా..: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో డబ్బు సంచులతో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని.. ఓటుకు పదివేలు ఇచ్చి నగదు బదిలీ పథకం మొదలైందని, ఈ ఓట్ల కొనుగోలు రాజకీయానికి బీజేపీ సహకారం అందిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రైతు బంధు నిధుల జమకు సీఈసీ అనుమతులు ఇవ్వడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్-బీజేపీలపై తీవ్ర విమర్శలే గుప్పించారాయన. ‘‘కేసీఆర్, మోదీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది. ఇక్కడ ప్రధానంగా నేను మూడు అంశాలను ప్రస్తావిస్తున్నా. రైతు బంధు, వివేక్.. పొంగులేటి ఇంట్లో ఐటీ దాడులు, గోయల్ ఇంట్లో 300 కోట్లను సీజ్ చేయకపోవడం.. కాంగ్రెస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేయడం. .. 2018లో జూన్ లో రైతు బంధు పథకం ప్రారంభించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 2018లో షెడ్యూల్ వచ్చాక రైతు బంధు విడుదల చేశారు. ఆనాడు ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2023 ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోగా రైతు బంధు వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరాం. కానీ పోలింగ్ నాలుగు రోజులు ఉండగా రైతు బంధు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బీఆరెస్ కు సహకరించింది. .. అలా బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది. ఎన్నికల ముందు రైతు బంధు వేయడంతో.. రైతులకు నష్టం జరుగుతోంది. కౌలు రైతులు, రైతు కూలీలైతే పూర్తిగా నష్టపోతున్నారు. బీఆర్ఎస్ ఇచ్చే రైతు బంధుతో రైతులు ప్రలోభాలకు గురి కావొద్దు. రైతులు ఆందోళన చెందొద్దు. కేసీఆర్ ఇచ్చేవి తీసుకోండి. కాంగ్రెస్ వచ్చాక.. మేం ఇవ్వాల్సింది మేం ఇస్తాం. .. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. 2018లాగే ఇప్పుడూ కేసీఆర్ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆరెస్ ఓటమి ఖాయం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసాను పూర్తిగా అమలు చేస్తుంది. .. వివేక్ బీజేపీలో ఉండగా రాముడికి పర్యాయపదంగా ఆయన్ను చూపించారు. కానీ కాంగ్రెస్ లో చేరాక బీజేపీ కి ఆయన రావణాసురుడిగా కనిపించారు. బీజేపీ, బీఆరెస్ కలిసి ఆయన్ని అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువైన పాపానికి రఘురామ్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు బంధుత్వం కూడా బీఆరెస్ దృష్టిలో నేరంగా కనిపిస్తోంది. సీనియర్ నేత ఆర్. సురేందర్ రెడ్డిపై ఇప్పటివరకు వేలెత్తి చూపిన వారు లేరు. ఒప్పందంలో భాగంగానే బీజేపీ, బీఆరెస్ వారిని టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతల ఫోన్స్ కూడా ఎత్తడం లేదు. ఈడీలు, ఇన్ కమ్ టాక్స్ లు కేవలం కాంగ్రెస్ పైనే పనిచేస్తాయా?. జరుగుతున్న పరిణామాలను తెలంగాణ సమాజం గమనించాలి. బీఆరెస్, బీజేపీ ప్రసంగాలకు , జరుగుతున్న తతంగాలకు పోలిక లేదు. కాంగ్రెస్ గెలుస్తుందనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో బీఆరెస్ ఓట్ల కొనుగోలుకు బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తోంది. జరుగుతున్న పరిణామాలను గమనించి తెలంగాణ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి అని తెలంగాణ ప్రజల్ని రేవంత్ కోరారు. -
సీపీఎం పోటీ చేయని చోట కాంగ్రెస్‌కు మద్దతు: సీతారాం ఏచూరి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం విమర్శించారు. తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్, బీజేపీతో కలుస్తుందని చెప్పారు. యాంటీ బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఎం పోటీలో లేని చోట ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్‌కే తమ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఇస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమని ఏచూరి తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో కొంత బలం ఉన్నా.. ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బంది అయ్యాయని విమర్శించారు. బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందని మండిపడ్డారు. బీజేపీకి అతిపెద్ద మిత్రపక్షాలు ఈడీ, సీబీఐ అని.. ఆ మిత్రులతో కలిసి బీజేపీ దేశంలో ఏదైనా చేయగలదని ధ్వజమెత్తారు. ‘ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై అకౌంటబిలిటీ కనిపించడం లేదు. టన్నెల్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు?. ఆ ఘటనకు భాధ్యత ఎవరు వహించాలి?. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు మోదీ పాల్పడుతున్నారు అయినా ఈసీఐ నోటీసులు ఇవ్వదు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా కాంగ్రెస్ నష్టం లేదు అనే భావనలో కాంగ్రెస్ ఉంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. ఒకటి, రెండు సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీది. పొలిటికల్ బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలు లీగల్‌గా అవినీతికి పాల్పడుతున్నాయి, పొలిటికల్ పార్టీల ఖర్చుపై పరిమితం పెట్టాలి. ఇండియా కూటమి ఏర్పడిన ఉద్దేశంతోనే ముందుకు వెళ్తోంది. మణిపూర్ ఘటన వెనుక రాజకీయ కుట్రకోణం ఉంది. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని కోరుతున్నాం’ అని ఏచూరి పేర్కొన్నారు. చదవండి: మోదీ-కేసీఆర్ ఫెవికాల్ బంధం బయటపడిందిలా..: రేవంత్‌రెడ్డి -
కేసీఆర్ లక్ష్యం కేటీఆర్‌ను సీఎం చేయడమే!: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం 1200 మంది బలిదానంతో ఏర్పడితే.. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి తప్ప మరేం చేయలేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మిగులు ఆదాయం ఉన్న ఈ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో దివాలా తీసింది. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఉద్యోగాలు భర్తీ చేయలేదు. లక్ష రుణమాఫీ చేయలేదు. నిరుద్యోగ భృతికి యువత నోచుకోలేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్య గాలికి వదిలేశారు. ప్రతీ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హామీ నెరవేరలేదు. గ్రానైట్ కుంభకోణంలో వందల కోట్ల అవినీతి జరిగింది. సెప్టెంబర్ 17 నిర్వహణపై మాట ఇచ్చి తప్పారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణలో పేదలు, రైతులు, విద్యార్థులు నిరాశలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలని బలంగా అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఈ మూడు ఒక్కటే. ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో వస్తారు.. ఎన్నికలయ్యాక కలిసిపోతారు. కాంగ్రెస్‌కు ఓటేసినా.. బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటేసినట్లే. బీజేపీ పాలనలో అవినీతి ఉండదు. గత తొమ్మిదేళ్లలో బీజేపీ నెరవేర్చిన హామీలను చూడండి. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం. విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకం. మీ ఓటు మీ ఎమ్మెల్యేను ఎన్నుకోవడం కోసం మాత్రమే కాదు.. భారత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తించాలి అని తెలంగాణ ఓటర్లను అమిత్ షా కోరారు. హలాల్ బ్యాన్పై నిషేధం తీసుకోలేదు హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో అమిత్ షా మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. కొల్లాపూర్‌లో మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీజేపీ ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ.. వాల్మీకి బోయలను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిర్వాసితులకు పరిహారం, భూమి ఇస్తాం. మాదిగ రిజర్వేషన్ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. బీజేపీ చెప్పిన ప్రకారం.. హమీలన్నీ నెరవేరుస్తాం. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం. కేసీఆర్‌కు యువతపై ప్రేమ లేదు. ఆయన ప్రేమంతా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడంపైనే. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తే.. వాళ్లు బీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే.. వాళ్లు రేపు బీఆర్ఎస్లోకే వెళ్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీ కారకులపై చర్యలు తీసుకుంటాం. -
ఓటు విలువ.. వీళ్ల ఓటమి ఎన్నికల చరిత్రకెక్కింది!
ఒక్కటి.. చాలా చాలా చిన్న అంకె. అందుకునేమో చాలామంది దానిని తేలికగా తీసుకుంటారు. కానీ, గెలుపోటముల విషయానికొచ్చేసరికి మాత్రం ఆ ‘1’ ఎంతో ఎంతో కీలకంగా మారుతుంటుంది. పరీక్షల్లో ఒక్క మార్కు, ఆటలో ఒక్క పరుగు, ఎన్నికల్లో ఒక్క ఓటు.. అంతెందుకు చరిత్రలో ఒక్క ఓటుతో ప్రభుత్వం కుప్పకూలడం కూడా చూశాం. ఎన్నికల్లోనూ ఒక్క ఓటుతో ఓడిన నాయకుల చరిత్రను ఒక్కసార తిరగేస్తే.. ఓటు విలువేంటో కచ్చితంగా తెలియడం ఖాయం. ►2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు. సంతేమరహళ్లి నియోజకవర్గంలో జనతాదళ్(సెక్యులర్)-JDS అభ్యర్థి ఏఆర్ కృష్ణమూర్తి .. కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ ధ్రువనారాయణ్ చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ధ్రువనారాయణ్‌కు 40,572 ఓట్లు.. కృష్ణమూర్తికి 40,751 ఓట్లు పోలయ్యాయి. ►2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు. నాథ్‌ద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషి బీజేపీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్ చేతిలో ఒక్క ఓటు తేడాతో ఓడారు. సీపీ జోషికి 62,216 ఓట్లు పోల్‌కాగా.. జోషికి 62,215 ఓట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ ఓటమి గురించి చర్చ జరిగింది. ఎందుకంటే సీపీ జోషి అప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉండడం మాత్రమే కాదు.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ ఎన్నికపై జోషి కోర్టుకు ఎక్కారు. ప్రత్యర్థి చౌహాన్ భార్య రెండు పోలింగ్ బూత్‌లలో ఓటేసినట్లు ఆరోపించారు. రాజస్థాన్ హైకోర్టు జోషికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. సుప్రీం కోర్టులో మాత్రం వ్యతిరేక ఫలితం దక్కింది. కొసమెరుపు ఏంటంటే.. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన నియోజకవర్గంలో తానే గెలుపును చవిచూడలేకపోయారాయన. ఫలితంగా.. రెండోసారి అశోక్ గెహ్లాట్ సీఎం పదవి చేపట్టారు. జోషి ఎన్నిక వ్యవహారంలో ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ ఉంది. సీపీ జోషి తల్లి, సోదరి, ఆఖరికి ఆయన కారు డ్రైవర్ కూడా అనివార్య కారణాల వల్ల ఓటు వేయలేకపోయారు. ఇక కర్ణాటకలో ఓడిన కృష్ణమూర్తి విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. ఆయన కారు డ్రైవర్ ఆయనకు ఓటేయలేదు. ఓటేసేందుకు కృష్ణమూర్తిని డ్రైవర్ అనుమతి అడిగినా.. పోలింగ్ రోజు కావడంతో కుదరని డ్యూటీలోనే ఉంచారట కృష్ణమూర్తి. ఫలితం.. ఒక్క ఓటు ఆయన్ని ఓటమిపాలుజేసింది. అందుకే రాజకీయ ప్రత్యర్థులెవరికీ కూడా ఇలాంటి ఓటమి రాకూడదని తాను కోరుకుంటున్నట్లు ఆయన చెబుతూ వచ్చేవారు. ►సింగిల్ డిజిట్ ఓట్లతోనూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. 2018 మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తుయివావ్ల్ నిజయోకవర్గంలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ఎల్ పియాన్మావాయి కేవలం మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రత్యర్థి మిజోరాం నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి లాల్‌చాందమా రాల్తేకు 5,207 ఓట్లు రాగా.. పియాన్మావాయికి 5,204 ఓట్లు పోలయ్యాయి. దీంతో రీకౌంటింగ్‌కు ఆయన పట్టుబట్టినా.. అక్కడా అదే ఫలితం వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాదు.. లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండుసార్లు ఇలా సింగిల్ డిజిల్ ఓటములు ఎదురైన సందర్భాలు నమోదు అయ్యాయి. 1989లో అనకాపల్లి(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) నిజయోకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ తొమ్మిది ఓట్ల తేడాతో నెగ్గారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో.. బీహార్ రాజ్‌మహల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సోమ్ మారండి కేవలం 9 ఓట్ల తేడాతోనే నెగ్గారు. 192 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది మంది ఎంపీలు లోక్‌సభకు కేవలం సింగిల్ లేదంటే డబుల్ డిజిట్ ఓట్లతో నెగ్గారనేది ఎన్నికల సంఘం లెక్క. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. ఒక్కోసారి ఒక్క ఓటుతోనూ అభ్యర్థుల తలరాతలు తారుమారు అవుతుంటాయి. రాజ్యాంగం 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ అందించిన హక్కు.. ఓటేయడం. ఆ ఓటు హక్కు అందరూ సక్రమంగా వినియోగించుకుని ఉంటే.. చారిత్రక ఓటముల్లోకి పైన నేతల పేర్లు ఎక్కి ఉండేవి కావేమో!. -
చిన్న చిన్న లోపాలపై రాద్ధాంతం తగదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిన్నరేళ్లలో తగిన న్యాయం చేసిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో.. తొమ్మిదిన్నరేండ్ల తెలంగాణ ప్రస్థానం పేరిట మీడియాకు ప్రజంటేషన్ ఇచ్చారాయాన. ఈ సందర్భంగా.. తెలంగాణ అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకూ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు. నేడు తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో తెలంగాణ ఉంది. సాగు నీటి ప్రాజెక్టుల కోసం లక్ష 70 వేల కోట్లు ఖర్చు పెట్టిన కొత్త ప్రోజెక్ట్ లు కట్టాం. దీంతో తెలంగాణ పల్లెల్లో కరువు పూర్తిగా కనుమరుగు అయ్యింది. శిథిలావస్థలో పాఠశాలలు ప్రస్తుతం కొత్త బడులు కట్టించాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం. అందరికీ వైద్యం అందుబాటులో ఉంచాం. రైతు బంధు ద్వారా 70 లక్షల మందికి రూ. 73,000 వేల కోట్లు ఇచ్చాం. దేశంలో రైతును రాజును చేసింది తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం. రోజులో 24 గంటల కరెంట్ ఇచ్చేది దేశంలో కేవలం తెలంగాణ మాత్రమే. రైతు వేడుకలు నిర్మించి రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం. రైతులకు 5లక్షల రైతు భీమా అందిస్తున్నాం. తెలంగాణలో కేజీ టూ పీజీ విద్యను అందిస్తాం. ‘పలకతో రండి.. పట్టా పోండి’.. ఇదే మా విద్యా విధానం.. ప్రతిపక్షాల విమర్శలపై.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను.. అనవసరమైన రాద్ధాంతంగా కొట్టిపారేశారు కేటీఆర్. ‘‘సముద్ర మట్టానికి ఎత్తులో నీటిని తీసుకురావటం కష్టమైన పని. అందుకే లిఫ్ట్ ఇరిగేషన్ తోనే ఎత్తులో ఉన్న తెలంగాణకు నీటిని తీసుకురావాలనే ఆలోచనతోనే కాళేశ్వరం కట్టింది. ప్రాజెక్టులు కట్టాక.. చిన్న చిన్న లోపాలు సహజమే. ప్రతిపక్షాలు వాటి మీద రాద్ధాంతం చేయడం తగదు. కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. అది కేవలం ఒక్క ప్రాజెక్ట్ కాదు. అందులో మూడు బ్యారేజ్ లు ఉన్నాయి. ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు రెండు పంటల నీళ్ళు అందిస్తున్నాం. దాని సామర్థ్యం 160 టీఎంసీలు, పైగా 1,531 కిలోమీటర్ల గ్రావేటి కెనాల్ ఉంది. గతంలో ఇతర రాష్ట్రాల్లో కట్టిన ప్రాజెక్టుల విషయంలోనూ ఇలాగే జరిగిన సందర్భాలు అనేకం. కాబట్టి అనవసరంగా విమర్శలు చేయడం సరికాదు. ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా లక్ష్మి బ్యారేజ్ మరమ్మత్తు పూర్తి చేస్తాం.. .. ప్రచారాల్లో ధరణి తీసేస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. పట్వారీ వ్యవస్థ తీసుకొస్తే మళ్ళీ దళారీ వ్యవస్థ వచ్చినట్లే!. ప్రతిపక్షాలు పట్వారీ వ్యవస్థ తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. తెలంగాణ సమాజం ఇది గమనించాలి.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలపై నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎవరైనా సరే లెక్కలతో రండి. నేను చర్చకు సిద్దం. గాలి మాటలు మాట్లాడొద్దు. మా ప్రభుత్వం లక్షా 60 వేల ఉద్యోగాలిచ్చింది. మొత్తంగా.. నీళ్లు, నిధులు, నియామకాలకు తగిన న్యాయం చేసింది కేసీఆర్ సారరథ్యంలోని మా ప్రభుత్వం’’ అని కేటీఆర్ ప్రసంగించారు. -
ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా?
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపరిమళ్‌ను ప్రశ్నించారు. బుధవారం తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లిన ముఖ్యమంత్రికి చైర్పర్సన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఈ సారి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని గెలిపిస్తారా అని చైర్‌పర్సన్‌ను అడగగా.. ఖచ్చితంగా గెలిపిస్తాం సార్ అని ఆమె సమాధానం ఇచ్చారు. కాగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి, చైర్పర్సన్ స్వప్నకు మధ్య గొడవ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాటన్నింటిని పక్కనపెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చైర్‌పర్సన్‌ను సముదాయించారు. దీంతో ఎమ్మెల్యే గెలుపే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం సైతం చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో వర్షం.. రానున్న మూడు రోజుల పాటు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం పడుతోంది. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, కర్మన్‌ఘాట్, చంపాపేట్, సంతోష్‌నగర్, ఉప్పల్, తార్నాక, మెహదీపట్నం, అమీర్‌పేట, ఎస్సానగర్, కూకట్పల్లి, బేగంపూట, సికింద్రాబాద్‌లో మోస్తరు వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలకు బయలుదేరిన విద్యార్థులు, వాహనదారులు వర్షానికి ఇబ్బందులు పడ్డారు. కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం నుంచి ఈ నెల 26 వరకు వానలు పడే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బందిని జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. -
కేసీఆర్ చదివిన బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది
సాక్షి, జగిత్యాల: దీర్ఘకాలిక లక్ష్యాలతో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాలను జోడుగుర్రాల్లా పరిగెత్తించడమే కాంగ్రెస్ లక్ష్యమని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సాక్షితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇందిరమ్మ పాలనను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక్షస పాలనగా అభివర్ణించారు. కానీ, ఆయన చదువుకున్న బడి కూడా ఇందిరమ్మ పాలనలోనే కట్టింది. నాకు ఇవే చివరి ఎన్నికలంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆ మాట నేనెప్పుడూ అనలేదు. ఇంకా రెండేళ్లు ఎమ్మెల్సీ ఉంది కదా.. మళ్లీ ఎమ్మెల్యే బరిలోకి ఎందుకు దిగుతున్నానంటూ కొందరు నాపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య తేడాల్ని గుర్తించాలివాళ్లు.. అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలకు కౌంటర్ ఇచ్చారాయన. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడేవాళ్లకు.. పొలాస అగ్రికల్చర్ కాలేజ్, జేఎన్టీయూ, న్యాక్ వంటి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారాయన. వైఎస్సార్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉంటూ జగిత్యాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారాయన. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసి తీరుతామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి పది నుంచి పదకొండు సీట్లు కాంగ్రెస్‌వేనని ధీమా వ్యక్తం చేశారు జీవన్‌రెడ్డి. -
పవన్‌ను నమ్మితే నట్టేట ముంచుతాడు
సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్‌ను నమ్ముకుంటే తమలాగే అందరినీ నట్టేట ముంచి, రోడ్డున పడేస్తారని జనసేన పార్టీలో కీలక నేతలు పసుపులేటి సందీప్, ఆయన తల్లి పసుపులేటి పద్మావతి చెప్పారు. పవన్‌కు సందీప్ పర్సనల్ సెక్రటరీగా పని చేశారు. పద్మావతి ఆ పార్టీ రాయలసీమ రీజియన్ సమన్వయకర్తగా ఎనలేని సేవలందించారు. వారు బుధవారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ మాటల మాయలో పడి ఆయన కోసం, జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి సీఎం జగన్ ఎంత మేలు చేస్తున్నారో అర్థమైందని అన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు పేద, బడుగు వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిçÜ్తున్నాయని, అందుకే వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. తల్లిదండ్రులు ఎవరూ వారి పిల్లలను పవన్ వెంట పంపవద్దని సూచించారు. అన్యాయాన్ని ప్రశి్నస్తానని, రాజకీయాల్లో మార్పు తేస్తానని చెప్పే పవన్‌లో నిలకడలేదన్నారు. ధైర్యం ఉంటే తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ మాటలతో మభ్యపెడతారని సందీప్ చెప్పారు. ఆయన్ని నమ్ముకుని ఢిల్లీ లీడర్ కావాలనుకున్న తాను గల్లీకి కూడా కాకుండా పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కోట రుక్మిణి అనే మహిళ మాట మీద తనను, అమ్మ (పద్మావతి)ని పవన్ రోడ్డుకీడ్చారని చెప్పారు. పవన్‌కు రుక్మిణి అంటే భయమని తెలిపారు. నాదెండ్ల మనోహర్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. పవన్ అహంకారి అని, ఆయన లేకుండా నాదెండ్ల మనోహర్ కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదనుకుంటారని అన్నారు. నాదెండ్ల మనోహర్ హవాలా డబ్బును పార్టీ ఆఫీసుకు పంపి మారుస్తారని చెప్పారు. హైదరాబాదులో భూ కబ్జాలో ఏ 1 గా ఉన్న వ్యక్తిని పార్టీ కమిటీలో పెట్టారన్నారు. పవన్ టీడీపీ కోసమే పని చేస్తున్నారని, ఏపీ రాజకీయాల్లో మాట తప్పారని చెప్పారు. టీడీపీ పంచన చేరి కేడర్ని మోసం చేశారని తెలిపారు. పవన్ రాయలసీమలో బలిజల్ని తొక్కేస్తున్నారని ఆరోపించారు. మహిళా నేతలకు గౌరవం లేదు: పద్మావతి గతంలో జనసేన పార్టీ రాయలసీమ కన్వినర్‌గా పనిచేసిన పసుపులేటి పద్మావతి మాట్లాడుతూ.. చిరంజీవి అభిమానిగా ప్రజారాజ్యంతో 2009లో రాజకీయాల్లోకి వచ్చానని, 2014లో జనసేనకు అండగా నిలబడ్డానని చెప్పారు. మహిళా నేతలకు జనసేనలో గౌరవం లేదన్నారు. ఈ అంశంపై ఎక్కడైనా ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. పవన్ నిలకడలేని మనిషి అని, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో తెలియదని తెలిపారు. టీడీపీ – జనసేన కలిసి పనిచేయడాన్ని ప్రజలు ముఖ్యంగా జన సైనికులు ఎవ్వరూ అంగీకరించడంలేదని చెప్పారు. టీడీపీ నేతలు కూడా జనసేన కార్యకర్తలను అవమానిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన – టీడీపీ విజయం సాధించే ప్రసక్తేలేదని, వాటికి ఓటమి తప్పదని అన్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ మరోసారి విజయం సాధించడం ఖాయమని చెప్పారు. -
హంగ్ కోసం బీజేపీ యత్నం
‘రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈసారి ఇక్కడ పప్పులు ఉడకడం లేదని పసిగట్టింది. దీంతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని చూస్తోంది. దాని ఫలితంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తోంది. వచ్చే ఐదేళ్లలో సంకీర్ణంతో బలోపేతం కావాలనుకుంటోంది. ప్రజలు మజ్లిస్‌కు 9, బీఆర్ఎస్కు 110 సీట్లలో సంపూర్ణ మద్దతు ఇచ్చి.. కేసీఆర్ మామకు అధికారం కట్టబెట్టాలి’ అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. బధవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, హైదరాబాద్ కాంగ్రెస్‌తోనే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. కేంద్రంలో వరుసగా గెలుస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఎంపీల బలం 50కి పడిపోయింది. మోదీ ప్రధాని కావడానికి ఆయనే కారణం. తమ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి కోపమంతా మజ్లిస్‌పై ప్రదర్శిస్తున్నారు. ఓట్లు చీల్చుతున్నామని అపవాదు అంటకడుతున్నారు. అమేథీలో మజ్లిస్ పోటీ చేయకపోయినా స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. తాత ముత్తాత, నానమ్మ సీట్లను కూడా కాపాడుకోలేకపోయారు. కేరళలోని వయనాడ్‌లో ముస్లిం లీగ్ సహకారంతో 30 శాతం ముస్లిం ఓట్లతో రాహుల్ గెలిచారు. శివసేనతో అధికారం పంచుకున్నప్పుడు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది. ఎంఐఎం, బీఆర్ఎస్ కోసం తలుపులు మూసేశామని రాహుల్ చెబుతున్నారు. ఇండియా కూటమిలో మేము ఎలా భాగస్వాములం అవుతాం. అజహరుద్దీన్.. అసమర్థ రాజకీయవాది అజహరుద్దీన్ మంచి క్రికెటరే.. కానీ, రాజకీయాల్లో అసమర్థుడు. యూపీలోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రజలు గెలిపిస్తే అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆ తర్వాత రాజస్తాన్‌కు పంపిస్తే అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి ముఖం చూపించలేదు. సొంతగడ్డపై కేటీఆర్ ఆయనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు అప్పగిస్తే దాని స్థాయి దిగజార్చారు. ఆయన అవినీతిపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే తప్పేంటి? అసమర్థ నేత కాబట్టి ఆయనపై బలమైన మజ్లిస్ అభ్యర్థిని రంగంలోకి దింపాం. కాంగ్రెస్ చీఫ్ పక్కా ఆర్ఎస్ఎస్వాది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలో ఏబీవీపీలో పనిచేశారు. కార్వాన్లో కిషన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతుగా గుడిమల్కాపూర్‌లో ప్రచారం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఆయనను టీడీపీకి పంపిస్తే ఆ పార్టీ అడ్రస్ తెలంగాణలో గల్లంతైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచనతో కాంగ్రెస్‌లో చేరారు. మోహ¯న్ భగవత్ రిమోట్ కంట్రోల్‌తోనే గాంధీభవన్ పనిచేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే. హైదరాబాద్‌లో మజ్లిస్ బలంగా ఉంది కాబట్టి తెలంగాణలో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించారు. కానీ కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్‌గడ్‌లలో ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలి? అక్కడ ముస్లింలు లేరా..? లేక వారి అభివృద్ధిపై చిత్తశుద్ది లేదా? బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తులేదు బీఆర్ఎస్తో మజ్లిస్‌కు ఎలాంటి పొత్తు లేదు. ఫ్రెండ్లీ పార్టీ మాత్రమే. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధం ఉంది. మేము ఎవరికీ బీ–టీమ్ కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోంది కాబట్టి సమర్థిస్తున్నాం. బీజేపీతో కేసీఆర్‌కు సంబంధం ఉంటే.. తొమ్మిదిన్నరేళ్లలో మైనారిటీల కోసం పెద్దఎత్తున బడ్జెట్ కేటాయింపు జరిగేదా? 201 మైనార్టీ గురుకులాల ఏర్పాటు చేసేవారా? ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తోపాటు ఏటా రూ.650 కోట్లు ముస్లింల విద్య కోసం ఖర్చు పెట్టేవారా? కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. భైంసా ప్రశాంతంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మతఘర్షణలు జరుగుతాయి. మత సామరస్యం దెబ్బతీంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల. మతప్రాతిపదిక రిజర్వేషన్ కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన చేసినవి కావు. ముస్లిం సామాజిక వర్గంలో ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన వారికి మాత్రమే అమలు చేస్తున్నారు. అదీ పీఎస్ కృష్ణన్, మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్ అమలవుతోంటే బీజేపీకి వచ్చిన ఇబ్బందేంటి? తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి మోదీ ప్రభుత్వానికి పంపితే మంజూరు చేయలేదు. బీజేపీ ఇప్పుడు దీన్ని రద్దు చేస్తామని చెబుతోంది. పాఠ్యపుస్తకాల్లో గాం«దీని అవమానపర్చి.. గాంధీని చంపిన గాడ్సే గురించి చదివిస్తున్నారు. -
కారుకు తోడుగా ‘రైతుబంధువులు’
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతుబంధు సమితి సభ్యులు ఇప్పుడు బీఆర్ఎస్కు ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఊరూరా రైతులను కలుస్తూ ఈ సమితులు పార్టీ గెలుపునకు వ్యూహరచన చేస్తున్నాయి. రైతుబంధు పంపిణీ, రైతుబీమా పథకంలో రైతులను చేర్పించడంలో కీలకంగా వ్యవహరించిన సమన్వయ సమితులు... ఇప్పుడు ఆయా సాయాలను గుర్తుచేస్తూ రైతులను పార్టీ వైపు తిప్పేందుకు పని చేస్తున్నాయి. విత్తనం వేసింది మొదలు పంట పండాక మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు సమితులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ చెక్కుల పంపిణీ, రైతుబీమాలో రైతుల చేరిక వంటి సందర్భాల్లో ఈ సభ్యులు అంతా తామై వ్యవహరించారు. చెక్కుల పంపిణీకి, బీమా పథకంలో చేరికకు సంబంధించి ఎవరు నిజమైన రైతులో కాదో నిర్ధారించింది కూడా వీళ్లే. ఇంతలా గ్రామస్థాయిలో రైతులతో మమేకమై పనిచేసిన ఈ సమితులు ఇప్పుడు రైతులకు అందిన లబ్ధిని వివరిస్తూ, ఓట్లుగా మలిచేందుకు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే రైతుబంధు సొమ్ము రూ.75 వేల కోట్లు రైతులకు చెల్లించినట్లు వారు ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. 1.61 లక్షల మంది సభ్యులు... రైతుబంధు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమితుల్లోని సభ్యులు ప్రభుత్వపరంగా నామినేట్ పదవుల్లో ఉన్నట్టు. రాష్ట్రంలోని 10,733 గ్రామాల్లోనూ రైతు సమన్వయ సమితులు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 15 మంది చొప్పున అన్ని గ్రామాల్లోనూ 1.61 లక్షల మంది సభ్యులను నియమించారు. దాంతోపాటు ప్రతీ గ్రామానికి ఒక సమన్వయకర్త ఉంటారు. ఆపై 24 మందితో మండల సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. అలా అన్ని మండలాలకు 13,416 మందిని నియమించారు. ప్రతీ మండలానికి మళ్లీ ఒక మండల రైతు సమితి సమస్వయకర్తను నియమించారు. వీరందరితో కలిపి జిల్లా సమన్వయ సమితిని ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాకు 24 మంది చొప్పున జిల్లా సమితి సభ్యులను నియమించారు. దీనికి జిల్లా సమన్వయకర్త ఉంటారు. అనంతరం రాష్ట్రస్థాయిలోనూ సమన్వయ సమితి పనిచేస్తుంది. రాష్ట్ర రైతుబంధు సమితికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చైర్మన్‌గా నియమించి, కేబినెట్ హోదా కల్పించారు. అంతకుముందు దీనికి గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చైర్మన్లుగా పనిచేశారు. నామినేట్ పదవులు కావడంతో వారంతా సుశిక్షితులైన సైన్యంగా బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు వీరందరినీ సమన్వయం చేసుకుంటూ తాటికొండ రాజయ్య పర్యవేక్షిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రతీ 32 మంది రైతులకు ఒక రైతు సమన్వయ సమితి సభ్యుడున్నారు. ఆయా రైతులందరినీ సమన్వయపరిచి బీఆర్ఎస్కు ఓటేసేలా వీరంతా కసరత్తు చేస్తున్నారు. కాగా, ప్రసుతం వీరికి రెమ్యునరేషన్ లేదు. వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నట్లు ఒక్కో సభ్యునికి నెలకు రూ.500 నుంచి రూ. వెయ్యి వరకు రెమ్యునరేషన్ రాబోయే రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. -బొల్లోజు రవి -
రంగారెడ్డిలో ఢీ అంటే ఢీ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఎనిమిది సెగ్మెంట్లు ఉన్నాయి. రాజేంద్రనగర్, చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్, మేడ్చల్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం జీహెచ్ఎంసీ పరిధి చుట్టూ విస్తరించి ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరూ బీఆర్ఎస్లో చేరిపోయారు. ఇప్పుడు ఆ ఎనిమిదికి ఎనిమిది చోట్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను ఢీకొంటోంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్లల్లో బీజేపీ పటిష్టంగా ఉండటంతో త్రిముఖ పోరు నెలకొంది. మిగతా చోట్ల బీఆర్ఎస్– కాంగ్రెస్‌ల మధ్య ద్విముఖ పోటీ కనిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో సానుకూలత మెండుగానే ఉన్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి కనిపిస్తోంది. ఎమ్మెల్యేల అనుచరుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎంతమేర తనకు అనుకూలంగా మలుచుకుంటుందనే విషయంపై ఫలితాల సరళి ఆధారపడ్డట్టు స్పష్టమవుతోంది. చేవెళ్ల త్రిముఖ పోటీలో గట్టెక్కేదెవరు? గత ఎన్నికలకు భిన్నంగా చేవెళ్లలో త్రిముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్య బీఆర్ఎస్ నుంచి మరోసారి పోటీ చేస్తూ హ్యాట్రిక్ విజయం కోసం యత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయిన కేఎస్ రత్నం ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి షాబాద్ మండలానికి చెందిన యువ నేత భీమ్ భరత్‌ను బరిలోకి దింపింది. కాలె యాదయ్య తీరు, ఆయన అనుచరులపై ఆరోపణలు, కుటుంబ సభ్యులకు ఎక్కువ పదవులు ఇప్పించుకోవటం వంటి అంశాలు బీఆర్ఎస్కు ప్రతికూలంగా మారాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధినే యాదయ్య నమ్ముకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఎమ్మెల్యేపై అసంతప్తిని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ కొంత బలంగా ఉండటం, గతంలో జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేసిన రత్నంకు స్వతహాగా ఉన్న కేడర్ ఇప్పుడు క్రియాశీలంగానే పనిచేస్తోంది. దీంతో ఆయన కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. పరిగి వారిమధ్యే పోరు బీఆర్ఎస్ – కాంగ్రెస్‌ల నుంచి గత ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థులే మళ్లీ ఈసారి బరిలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డిని బీఆర్ఎస్ మరోసారి బరిలో దింపింది. సీనియర్ నేత హరీశ్వర్‌రెడ్డి తనయుడుగా ఆయనకు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. ఇటీవలే హరీశ్వర్‌రెడ్డి చనిపోవటంతో కొంత సానుభూతి ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇక సీనియర్ నేత, గతంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టి.రామ్మోహన్‌రెడ్డిపై పార్టీ మరోసారి నమ్మకాన్ని ఉంచింది. బీజేపీ నుంచి మారుతీకిరణ్ పోటీలో ఉన్నారు. కానీ ఇక్కడ పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యనే ఉంది. ఈసారి రామ్మోహన్‌రెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉండటం, నియోజకవర్గ పరిధిలోని కుల్కచర్ల డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావటం (ప్రస్తుత తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి), మరికొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్‌లోకి రావటంతో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ పరిగి నియోజకవర్గానికి పక్కనే ఉండటం కూడా ఆ పార్టీలో కొంత సానుకూలత కనిపించటానికి కారణమైంది. బీజేపీ అభ్యర్థి చీల్చే ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వికారాబాద్ ద్విముఖ పోరు గత ఎన్నికల్లో విజయం సాధించిన మెతుకు ఆనంద్‌ను మరోసారి బీఆర్ఎస్ బరిలో దింపగా, కాంగ్రెస్ పార్టీ కూడా గత అభ్యర్థి గడ్డం ప్రసాద్కుమార్నే పోటీకి నిలిపింది. ఆ ఎన్నికల్లో దాదాపు మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ ఈసారి గట్టి పోటీనిస్తుండటంతో ఈ ఎన్నిక ఆసక్తిగా మారింది. మాజీ మంత్రి, స్థానికుడైన సీనియర్ నేత చంద్రశేఖర్ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారి జహీరాబాద్ నుంచి పోటీలో నిలిచారు. ఆయన కాంగ్రెస్‌లోకి రావటంతో ఆయన వెంట కాంగ్రెస్‌లోకి వచ్చిన వికారాబాద్ కేడర్ బలం ఇప్పుడు గడ్డంప్రసాద్కుమార్కు కలిసి రానుంది. స్థానికంగా బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నా.. పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యలోనే కేంద్రీకృతమైనట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే ఆనంద్ పనితీరుపై కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. గడ్డం ప్రసాద్‌కుమార్ కాంగ్రెస్ హయాంలో మంత్రి హోదాలో వికారాబాద్‌ను పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉండటాన్ని ఆనంద్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహేశ్వరం ముక్కోణపు పోటీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి తర్వాత బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి దక్కించుకున్న సబితారెడ్డి ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేస్తుండగా, బీజేపీ అభ్యర్థిగా శ్రీరాములు యాదవ్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంత్రి సబిత, మిగతా ఇద్దరు అభ్యర్థుల నుంచి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. ఏడు నెలల క్రితంహస్తం గూటికి చేరిన బడంగ్‌పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా కేఎల్ఆర్ దక్కించుకున్నారు. దీంతో స్థానికంగా పట్టున్న పారిజాత తీవ్ర అసంతృప్తికి గురైనా, అనంతరం కొంత సయోధ్యతో ప్రచారంలో పాల్గొంటుండటం కేఎల్ఆర్కు కలిసివచ్చే అంశం. సబితారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరటం జనంలో కొంత అసంతృప్తికి కారణమైంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డి నుంచి సబితకు పూర్తిస్థాయి సహకారం అందటం లేదంటున్నారు. మరోవైపు, బీజేపీ అభ్యర్థి శ్రీరాములుయాదవ్ ఇక్కడ పెద్దసంఖ్యలో ఉన్న తన సామాజిక వర్గం ఓట్లపై గురిపెట్టారు. ఈ విషయంలో ఆయనకు సానుకూలత కనిపిస్తోంది. ఫలితంగా ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. ఇబ్రహీంపట్నం టఫ్ ఫైట్ గత ఎన్నికల్లో కేవలం 376 ఓట్లతో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి నుంచి టఫ్ ఫైట్ ఎదురైంది. ఎమ్మెల్యేపై స్థానికంగా వ్యతిరేకత కనిపిస్తున్నా.. ఆయన మాత్రం ప్రభుత్వ పథకాలు, స్థానికంగా జరిగిన పురోగతిని వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన సానుభూతి, స్థానికంగా కాంగ్రెస్‌కు నమ్మకమైన ఓటు బ్యాంకు ఉండటం మల్రెడ్డి రంగారెడ్డికి కలిసిరానున్నాయి. అసైన్మెంట్ భూములను వెనక్కు తీసుకుంటున్న అంశం కొన్ని ప్రాంతాల్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. అంతర్గత రోడ్లు సరిగా లేకపోవటం, నిరుద్యోగ అంశంపై జనంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి అంశాలను కాంగ్రెస్ అభ్యర్థి అందిపుచ్చుకుని ప్రచారంలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా దయానంద్ గౌడ్ పోటీలో ఉన్నా.. పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యే కనిపిస్తోంది. రాజేంద్రనగర్ త్రిముఖ పోరులో గెలుపెవరిదో? బీఆర్ఎస్ అభ్యర్థి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ ముదిరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలో నిలిచి గెలుపు అంచుల వరకు వచ్చిన మజ్లిస్ పార్టీ ఈసారి ముస్లిమేతర అభ్యర్థి స్వామియాదవ్‌ను పోటీలో నిలిపింది. మజ్లిస్ అగ్రనేతలు స్థానికంగా ప్రచారంపై పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఇక ఈ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీ డివిజన్ మైలార్దేవుపల్లి కార్పొరేటర్ తోక శ్రీనివాసరెడ్డిని బీజేపీ బరిలో నిలిపింది. నియోజవర్గ పరిధిలో మూడు జీహెచ్ఎంసీ డివిజన్లకు బీజేపీ కార్పొరేటర్లున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి గట్టిపోటీదారుగా మారిపోయారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నమ్ముకుని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బలాన్ని, బీసీ సామాజిక వర్గాల అండనే నమ్ముకున్నారు. మజ్లిస్ నుంచి నాన్ మైనారిటీ నేత బరిలో ఉండటంతో ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మేడ్చల్మెరిసేది ఎవరో..? మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఓ పక్షం రోజుల క్రితం వరకు మల్లారెడ్డికి కొంత అనుకూల వాతావరణం ఉన్నా, పది రోజుల్లో బీఆర్ఎస్ నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలో నేతలు కాంగ్రెస్‌లోకి మారటం ఆయనపై ప్రభావాన్ని చూపుతోంది. బోడుప్పల్ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు, ఘట్కేసర్ నుంచి ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. మేడ్చల్, శామీర్‌పేటల్లోని కొందరు సర్పంచులు, ఓ వైస్ ఎంపీపీ కూడా పార్టీ కండువా మార్చుకోవటం కాంగ్రెస్‌కి కలిసి వచ్చింది. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల కొంత సానుకూల ధోరణికి ఈ నేతల మార్పులు తోడు కావటంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరిగింది. కానీ ప్రచారంలో ఇంకా జోరుపెంచాలి. ఇక మంత్రిగా తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మల్లారెడ్డి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మల్లారెడ్డి మాట తీరు, ఆయన వ్యవహారంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి అనుచరులపై ఉన్న ఆరోపణలు కూడా ఆయనకు కొంత ప్రతికూలంగా మారేలా ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి దయానంద్ గౌడ్ పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తోంది. తాండూరు ఇద్దరి మధ్యనే తీవ్రపోటీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన పైలట్ రోహిత్‌రెడ్డి ఆతర్వాత బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు కారు గుర్తుపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి బీఆర్ఎస్నే అంటిపెట్టుకుని ఉన్నా పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తారన్న ప్రచారం జరిగింది. కానీ, ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇచ్చి పార్టీ మారకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడింది. ఆయన తన సోదరుడు నరేందర్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కొడంగల్‌లో ప్రచారానికే పరిమితమయ్యారు. కుల్కచర్లకు చెందిన డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తాండూరు అభ్యర్థిగా నిలబెట్టింది. గతంలో ఇది కాంగ్రెస్ పార్టీ స్థానం కావటం, ప్రభుత్వంపై స్వతహాగా ఉండే వ్యతిరేకత, ఎమ్మెల్యే అనుయాయులపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కలిసి వస్తుందని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. ఇక్కడి నుంచి పోటీకి బీజేపీ నేతలు సిద్ధపడ్డా, పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ నుంచి నేమూరి శంకర్‌గౌడ్ పోటీలో ఉన్నారు. దీంతో బీజేపీ నేతలు కొందరు కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీఎస్పీ నుంచి చంద్రశేఖర్ ముదిరాజ్ పోటీ పడుతున్నారు. తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. స్థానికంగా అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.. -ఉమ్మడి రంగారెడ్డి గ్రామీణ నియోజకవర్గాల నుంచి గౌరీభట్ల నరసింహమూర్తి -
సేమ్ నేమ్ బ్యాలెట్ గేమ్!
సాక్షి, హైదరాబాద్: యాదృచ్చికమో..ఉద్దేశపూర్వకమో.. తెలియదు కానీ ఎన్నికలు ఏవైనా సరే.. ఇంటి పేరు సహా ఒకే పేరు ఉన్న వేర్వేరు అభ్యర్థులు పోటీ చేయడం రివాజుగా మారింది. పేరు మాత్రమే కాకుండా ఇంటి పేర్లు కూడా ఒకేలా ఉండటంతో ఓటర్లలో నిరక్షరాస్యులు, అవగాహన కొందరు ఓటర్లలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.ఈనెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోని చాలా నియోజక వర్గాలలో ఈ సమస్య కనిపిస్తోంది. ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులను పోలిన వారే ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులను పోలిన పేర్లున్న వారే స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల అలయెన్స్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ పార్టీ (ఏడీఆర్) పేరుతోనూ ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీల నేతలు.. పోటీ చేసే పార్టీ గుర్తు, అభ్యర్థి ఫొటోతో పాటు పేరును కూడా తెగ ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను గందరగోళానికి గురి చేయడమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. ఒకే పేరు కలిగి పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో కొన్ని ఎల్బీనగర్: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (బీఆర్ఎస్), దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి (స్వతంత్ర), డి.సుధీర్‌రెడ్డి (స్వ) మహేశ్వరం: కె.లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), కె.లక్ష్మారెడ్డి (జన శంఖారావం), పి.సబిత (బీఆర్ఎస్), ఎం.సబిత (స్వ) మునుగోడు: కె.ప్రభాకర్‌రెడ్డి (బీఆర్ఎస్), కె.ప్రభాకర్‌రెడ్డి (ఏడీఆర్) మిర్యాలగూడ: బి.లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), బి.లక్ష్మారెడ్డి (స్వ) అచ్చంపేట: జి.బాలరాజు (బీఆర్ఎస్), జి.బాలరాజు (ఏడీఆర్) దేవరకద్ర: ఏ.వెంకటేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్), ఏ.వెంకటేశ్వర్‌రెడ్డి (స్వ) గద్వాల: సరిత (కాంగ్రెస్), జి.సరిత (నవతరం కాంగ్రెస్), సరిత (స్వ) సనత్‌నగర్: శ్రీనివాస్‌యాదవ్ (బీఆర్ఎస్), ఉప్పలపాటి శ్రీనివాస్ (యుగ తులసి) జహీరాబాద్: ఏ.చంద్రశేఖర్ (కాంగ్రెస్), చంద్రశేఖర్, ఎం.చంద్రశేఖర్, ఎడ్ల చంద్రశేఖర్ (స్వ) ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (బీఆర్ఎస్), కె.కిషన్‌రెడ్డి (ఏడీఆర్) ఉప్పల్: బండారి లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్), మన్నె లక్ష్మారెడ్డి (ఏడీఆర్) పరిగి: కొప్పుల మహేశ్‌రెడ్డి (బీఆర్ఎస్), బి.మహేశ్‌రెడ్డి (ఏడీఆర్) కొడంగల్: పట్నం నరేందర్‌రెడ్డి (బీఆర్ఎస్), ప్యాట నరేందర్ రెడ్డి (స్వ) నారాయణపేట: ఎస్.రాజేందర్‌రెడ్డి (బీఆర్ఎస్), కె.రాజేందర్ రెడ్డి (స్వ) మహబూబ్‌నగర్: వి.శ్రీనివాస్‌గౌడ్ (బీఆర్ఎస్), ఎం.శ్రీనివాసులు (స్వ) కొల్లాపూర్: బి.హర్షవర్ధన్ రెడ్డి (బీఆర్ఎస్), కె.హర్షవర్ధన్ రెడ్డి (స్వ) హుజూర్నగర్: ఎస్.సైదిరెడ్డి (బీఆర్ఎస్), టి.సైదిరెడ్డి (ఏడీఆర్) ఖమ్మం: పువ్వాడ అజయ్ (బీఆర్ఎస్), ఏ.అజయ్ (స్వ), కె.అజయ్ (స్వ) ముషీరాబాద్: ముఠాగోపాల్ (బీఆర్ఎస్), ఎం.గోపాల్ (ఏఐహెచ్‌సీపీ) (నోట్: స్వతంత్రులు (స్వ), అలయెన్స్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఎన్నికలు బహిష్కరిస్తూ తీర్మానం కొత్తగూడెంరూరల్: తమ సమస్యలు పరిష్కరించనందున నాలుగు గ్రామ పంచాయతీల ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తామంటున్నారు. ఈ మేరకు వారు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కొత్త చింతకుంట, లక్ష్మీపురం, బొజ్జలగూడెం, బంగారుచెలక గ్రామస్తులు ఈ మేరకు తీర్మానం చేశారు. సర్వే నంబర్ 286, 381 అసైన్మెంట్ భూ హక్కుదారుల పేర్లను ధరణిలో చేర్చాలని, వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని, గిరివికాస్ పథకంలో అర్హులైన రైతులందరికీ వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహలక్ష్మి పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఎన్నో రోజులుగా పోరాడుతున్నా ఎవరూ పట్టించుకోనందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు. -
ఫొటో పంపు.. పైసలు తీసుకో!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పెట్టిన ప్రతీ పైసాకు ఫలితం దక్కేలా జాగ్రత్త వహిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి ప్రచారం చేయాలని స్థానిక నాయకులు, కార్యకర్తలను పురమాయిస్తున్నారు. కొందరు ప్రచారం చేయకున్నా చేసినట్టు చెబుతూ అభ్యర్థుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వీటిని నివారించేందుకు ‘ఫొటో పంపు, పైసలు తీసుకో’ అనే పద్ధతి అనుసరిస్తున్నారు. ప్రతిరోజూ ఎంతమంది వచ్చారో, ఫొటోలు, వీడియోలు తీసి వాట్సాప్ చేయాలనే నిబంధన విధిస్తున్నారు. వీటిని పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. ఉదాహరణకు ఓ వాడలో వంద మంది ప్రచారం నిర్వహించామని సంబంధిత ఇన్చార్జ్ చెబితే ఆ వంద మంది తప్పనిసరిగా ఫొటో, వీడియోల్లో కనిపించాలి. ఒకవేళ తక్కువ మంది కనిపిస్తే ఆ మేర డబ్బులు ఇవ్వడం లేదు. ఇక బైక్ ర్యాలీలు, ఆటోలు, ప్రచార రథాలు గ్రామాలు, పట్టణాల్లో తిరిగే సమయంలో మీటర్ రీడింగ్‌లను ఫొటో తీసి పంపి, రాత్రి వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేశారో లేదో చెక్ చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ఎన్నికల్లో తీసుకున్న డబ్బుల ప్రకారం తప్పనిసరిగా పనిచేయాలి వస్తోంది. -
తెలంగాణలో అధికారంలోకి వస్తాం
సూర్యాపేట: తెలంగాణలో ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ నాయకత్వంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సూర్యాపేట మండలంలోని గాం«దీనగర్‌లో బహుజన రాజ్యాధికార సభ నిర్వహించారు. ఈ సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. అన్నీ సంపన్న వర్గాల కోసం నడుస్తున్న పార్టీలని అన్నారు. కానీ బీఎస్పీ ఒక్కటే బహుజన వర్గాల కోసం ప్రజల విరాళాలతో పనిచేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకుని నడుస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీ అని చెప్పారు. దేశంలో మిగిలిన పార్టీలన్నీ ఓట్ల ముందు తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. ఇది గమనించిన వట్టె జానయ్య యాదవ్ లాంటి వారు బహుజన జెండాను ఎత్తుకోవడం ఆహా్వనించదగిన పరిణామమని అన్నారు. వట్టె జానయ్యపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని.. అది బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు జరిపించిన వ్యూహాత్మక దాడి అని ఆరోపించారు. ‘మేము తక్కువగా చెప్పి.. ఎక్కువగా పనిచేస్తాం’అని పేర్కొన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 1,300 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తోందన్నారు. అమరవీరుల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో కూడా కేసీఆర్‌కు తెలియకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో గడీల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. సభలో సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్యయాదవ్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాళేశ్వరం చూపించి ఓట్లడుగు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/గజ్వేల్/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల కట్టిన కాళేశ్వరం కూలిపోతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేడిగడ్డ కుంగింది.. అన్నారం పగిలింది. కేసీఆర్.. నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి ఓట్లడుగు.. నేను శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ చూపించి ఓట్లడుగుతా. నీకు చేతనైతే రా..’అంటూ సవాల్ విసిరారు. ‘నేను ఏకలింగాన్ని, బుక్కెడు బువ్వోన్ని’అంటూ గజ్వేల్‌కు వచ్చిన కేసీఆర్, ఇప్పుడు ఎట్లుండో ప్రజలకు తె లుసునని అన్నారు. బక్కోడ్ని అని చెప్పుకునే కేసీఆర్ రూ.లక్ష కోట్లు దిగమింగడంతో పాటు, 10 వేల ఎకరాలు ఆక్రమించుకున్నారని, వందల ఎకరాలున్న ఫామ్‌హౌస్ చుట్టూ కాళేశ్వరం కాల్వలు నిర్మించుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.లక్ష కోట్ల అవినీతి సొమ్ము కక్కిస్తామని అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూ రల్ నియోజకవర్గంలోని దర్పల్లి, సిద్దిపేట జిల్లా గజ్వే ల్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సభల్లో ఆయన ప్రసంగించారు. అందుకే కామారెడ్డికి కేసీఆర్ ‘కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావని కేసీఆర్ అంటున్నారు. నిజామాబాద్ సాక్షిగా కేసీఆర్‌కు చెబుతున్నా.. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా తగ్గకుండా 80 సీట్లు వస్తాయి. కేసీఆర్ ఓటమి భయంతో ఆగమవుతున్నారు. గజ్వేల్‌లో ఓడిపోతాననే భయంతోనే కామారెడ్డిలో పోటీ చేయడానికి వచ్చారు. కానీ కామారెడ్డిలోనూ ముఖ్యమంత్రికి అసలైన వేట తప్పదు. కన్యాకుమారి వెళ్లినా.. శంకరగిరి మాన్యాలకు వెళ్లినా పట్టుకొని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు..’అని రేవంత్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి వస్తే అండగా ఉంటాం ‘బక్కటోన్ని అని చెప్పుకునే కేసీఆర్ తింటే బకాసురుడు, పడుకుంటే కుంభకర్ణుడు. ప్రజాధనాన్ని లూటీ చేసి, భూములను కాజేశారు. నేను గజ్వేల్ వస్తున్నానని తెలిసి కొడంగల్‌కు పోయిన కేసీఆర్.. రేవంత్ నోరు తెరిస్తే కంపుకొడుతది అనడం విడ్డూరంగా ఉంది. మనమిద్దరం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయించుకుంటే ఎవరి నోరు కంపు కొడుతుందో తెలుస్తుంది. నేను సుక్క ముట్టెటోన్ని కాదు.. నీకు సుక్క లేంది నడవదు.. ఇలాంటి మతిలేని మాటలు మాట్లాడొద్దు. కాంగ్రెస్ వస్తే మల్లన్నసాగర్ నిర్వాసితులకు అండగా ఉంటాం. పోడు భూములకు పట్టాలు ఇస్తాం. తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులిచ్చి సీసీరోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులు చేపడతాం. గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు రుణమాఫీ చేస్తాం. నన్ను అసెంబ్లీకి పంపి ఇందిరమ్మ రాజ్యం వచ్చేలా చేయాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి. భూములు గుంజుకునే దోపిడీ దొరల రాజ్యాన్ని ప్రజలు సాగనంపాలి..’అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ మాదిరిగా సంక్షేమం ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో దళితులు, గిరిజనులకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. అదే మాదిరిగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తాం’అని రేవంత్ హామీ ఇచ్చారు. -
గట్టిపోటీ... అధిక సీట్లు...
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ రాష్ట్రంలో కమలదళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 25 నుంచి 30 సీట్లలో బీజేపీ నిర్ణయాత్మకంగా వ్యవహరించడంతో పాటు వాటిలో అధిక స్థానాలు గెలుచుకోవడంపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఆ స్థానాల్లో పార్టీ అగ్రనేతలు విస్తృత ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఎస్సీ వర్గీకరణ, బీసీ సీఎం నినాదంతోపాటు కీలక స్థానాల్లో ప్రచారం చివరి రోజుల్లో అగ్రనేతల విస్తృత ప్రచారం పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి వస్తుందని రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు. త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఆయా వర్గాల ఓట్లు చీలితే పలుచోట్ల బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్న నమ్మకాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అగ్రనేతలంతా ఇక్కడే... ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, ప్రమోద్ సావంత్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ముఖ్య నేతలు విస్తృత పర్యటనలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ హైదరాబాద్‌లోనే మకాం వేసి సంస్థాగతంగా పార్టీ యంత్రాంగం ఏ మేరకు ఎన్నికల యాజమాన్య నిర్వహణ చేస్తోందో లోతుగా సమీక్షిస్తున్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్, రాష్ట్ర సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్‌తో సంతోష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ఒక్కొక్క లోక్‌సభ నియోజకవర్గానికి ఒక ముఖ్యనేతను ఇన్చార్జిగా నియమించి, పోలింగ్ ముగిసేదాకా అన్ని అంశాలను సమన్వయం చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ప్రధాని సుడిగాలి పర్యటనపై ఆశలు ప్రచారపర్వం ముగిసేలోగా పీఎం మోదీ వరుసగా మూడురోజులు...ఆరుసభల్లో పాల్గొనడంతో పాటు చివర్లో హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. 25న కామారెడ్డి (కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ) నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), రంగారెడ్డి జిల్లా(మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, కల్వకుర్తి,), 26న తూఫ్రాన్ (గజ్వేల్, దుబ్బాక, మేడ్చల్, మెదక్, నరసాపురం), నిర్మల్ (నిర్మల్, ముథోల్, బాల్కొండ, ఖానాపూర్), 27న మహబూబాబాద్ (మహబూబాబాద్, ములుగు, తదితర ఎస్టీ స్థానాలు) కరీంనగర్ (కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, వేములవాడ, చొప్పదండి, కోరుట్ల) ఇలా ఆయా ఉమ్మడి జిల్లాలు, నియోజకవర్గాల పరిధిలోని వివిధ వర్గాల ఓటర్లపై ప్రభావం చూపేలా మోదీ ప్రచార కార్యక్రమాలను ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. బీసీ, ఎస్సీల అండపై అంచనాలు..ఎస్టీలకు హామీ? అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలను దీటుగా ఎదుర్కోవడంతో పాటు ఆ పార్టీలకు చెక్ పెట్టేలా బీసీ నేతను సీఎంను చేస్తామన్న ప్రకటన తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కాస్త అలస్యంగా ప్రకటించినా..ఈ నినాదాన్ని బీజేపీ తన ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకోగలిగింది. బీసీ సీఎం నినాదంతో పాటు ఎస్సీ ఉపకులాల వారీగా రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ మద్దతు ప్రకటన మేలు చేస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఎస్టీల జనాభాకు అనుగుణంగా 9 నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామనే హామీ కూడా బీజేపీ నేతలు త్వరలోనే ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఓ అంచనా ప్రకారం బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు... ♦ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని... ముథోల్, నిర్మల్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్ ♦ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో... కామారెడ్డి, నిజామాబాద్ (అర్బన్), ఆర్మూరు, జుక్కల్ ♦ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్ల, మానకొండూరు ♦ ఉమ్మడి వరంగల్ జిల్లాలో... వరంగల్ (ఈస్ట్), పరకాల, ములుగు, మహబూబాబాద్ ♦ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో... మహేశ్వరం, ఎల్బీనగర్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ♦ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో... కల్వకుర్తి, మహబూబ్‌నగర్, మక్తల్ ♦ ఉమ్మడి మెదక్ జిల్లాలో... దుబ్బాక, పటాన్ చెరు, నరసాపూర్, ♦ నల్లగొండ జిల్లాలో... సూర్యాపేట, మునుగోడు ♦ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో... గోషామహల్. అంబర్‌పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి -
ప్రజల కోసం పోరాడుతున్నాం.. మద్దతివ్వండి
కరీంనగర్ టౌన్: నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని రెండుసార్లు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడుతున్న బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. బుధవారం కరీంనగర్‌లోని రేకుర్తి, మంకమ్మతోటలో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ 2,40,000 ఇళ్లు ఇస్తే కేసీఆర్ ఒక్కఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా కేసీఆర్ మాత్రం 100 గదులతో ప్రగతి భవన్ కట్టుకున్నారని దుయ్యబట్టారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు ప్రశ్నించిన పాపానికి కేసీఆర్ కొడుకు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేశారని, పేపర్ లీకేజీలపై తాను కొట్లాడితే... తన ఇంటిపై వందల మంది పోలీసులతో దాడి చేయించి అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.