Market
-
ఫెడ్‌వైపు ఇన్వెస్టర్ల చూపు
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులు తదితర అంశాలు ఈ వారం మార్కెట్ల కదలికలపై ప్రభావం చూపనున్నాయి. వీటికితోడు ఆగస్టు డెరివేటివ్ సిరీస్ ముగింపు సైతం కీలకంకానున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. గడిచిన వారంలో జాక్సన్ హోల్ వద్ద యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ పలు అంశాలపై చేసిన ప్రసంగానికీ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వచ్చే నెల(సెప్టెంబర్)లో నిర్వహించనున్న పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపునకు వీలున్నట్లు పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో వారాంతాన యూఎస్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. లాభాలతో ముగిశాయి. ఈ బాటలో దేశీయంగానూ సెంటిమెంటు మెరుగుపడే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. మరింత పురోగతిస్టాక్ ఆధారిత కదలికల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు మరింత పురోగమించే వీలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే నెలవారీ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల గడువు ముగియనున్న కారణంగా మార్కెట్లు కొంతమేర ఆటుపోట్లను చవిచూడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. భవిష్యత్‌లో వడ్డీ రేట్ల తగ్గింపు బాటలో సాగేందుకు తగిన విధంగా సన్నద్ధమవుతున్నట్లు పావెల్ సంకేతాలిచ్చినట్లు తెలియజేశారు. దీంతో నేడు(సోమవారం) మార్కెట్లు పావెల్ ప్రసంగానికి అనుగుణంగా రియాక్ట్కానున్నట్లు అంచనా వేశారు. పాలసీ సర్దుబాట్లకు తగిన సమయం ఆసన్నమైనట్లు పావెల్ పేర్కొనడం గమనార్హం! వచ్చే సమావేశంలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనున్నట్లు పలువురు నిపుణులు ఊహిస్తున్నారు. ఉపాధి గణాంకాలు బలహీనపడిన నేపథ్యంలో వేగవంత చర్యలకు వీలున్నట్లు భావిస్తున్నారు. మాంద్యానికి చెక్ఈ నెల మొదట్లో యూఎస్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడనున్నట్లు చెలరేగిన ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. అయితే ఫెడ్ చైర్మన్ పావెల్ సమీప భవిష్యత్‌లో ఇందుకు అవకాశాలు తక్కువేనంటూ అభిప్రాయపడ్డారు. అయితే వడ్డీ రేట్లను అధిక స్థాయిలో తగ్గించే అవకాశాలు తక్కువేనని యాక్సిస్ సెక్యూరిటీస్ పీఎంఎస్ విభాగం ఇన్వెస్ట్మెంట్ చీఫ్ నవీన్ కులకర్ణి పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా పాలసీ సర్దుబాట్లకు వీలున్నట్లు తెలియజేశారు. గత వారమిలాగత వారం సెన్సెక్స్ నికరంగా 649 పాయింట్లు జమ చేసుకుంది. 81,086 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 282 పాయింట్లు బలపడి 24,823 వద్ద స్థిరపడింది. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.1,609 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ.13,020 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. -
పెట్టుబడులకు ‘రుణ’ పడదాం!
ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. రుణం తీసుకోవడమే ఎక్కువ మంది అనుసరించే మార్గం. అవసరాన్ని వెంటనే గట్టెక్కడమే ముఖ్యంగా చూస్తుంటారు. వడ్డీ రేటు గణనీయంగా ఉండే క్రెడిట్‌కార్డు రుణాలే కాదు, వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తుంటారు. దీంతో అప్పటికి అవసరం తీరుతుందేమో కానీ, ఆ తర్వాత ఆర్థికంగా భారాన్ని మోయాల్సి వస్తుంది. కొందరు స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉంటే వాటిని ఉపసంహరించుకుంటారు. కానీ, వీటికంటే మెరుగైన ఆప్షన్ ఉంది. స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించాల్సిన అవసరం లేకుండా, వాటిపై చౌక వడ్డీకే రుణం పొందొచ్చు. దీనివల్ల పెట్టుబడుల వృద్ధి ప్రయోజనాన్ని కోల్పోవాల్సిన అవసరం ఏర్పడదు. పైగా రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. – సాక్షి, బిజినెస్‌డెస్క్ ఫండ్స్/స్టాక్స్.. మ్యూచువల్ ఫండ్స్‌పై రుణం పొందడాన్ని లోన్ ఎగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ (ఎల్ఏఎంఎఫ్)గా.. షేర్లపై రుణం పొందడాన్ని లోన్ ఎగైనెస్ట్ సెక్యూరిటీస్ (ఎల్ఏఎస్)గా చెబుతారు. ఇవి సెక్యూర్డ్ రుణాలు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు/õÙర్లు లేదా బాండ్లు తదితర సెక్యూరిటీలను తనఖా పెట్టుకుని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలు మంజూరు చేస్తాయి. కనుక రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండాల్సిన అవసరం లేదు. స్వల్పకాల అవసరాల కోసం ఈ రుణాలు తీసుకోవచ్చు. వీటిపై 9–11 శాతం మధ్య వడ్డీ రేటు అమలవుతుంటుంది. మిరే అస్సెట్ సంస్థ 10.5 శాతం వార్షిక వడ్డీ రేటును అమలు చేస్తోంది. డిజిటల్‌గా, నిమిషాల వ్యవధిలోనే రుణం పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. అర్హతలు..⇒ సెబీ అనుమతించిన కంపెనీల షేర్లకే రుణాలు పరిమితం. దాదాపు అన్ని బ్లూచిప్ షేర్లకు, టాప్–250 షేర్లకు రుణాలు లభిస్తాయి. డీలిస్ట్ అయిన వాటికి అవకాశం లేదు. ఏఏ షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం లభిస్తుందో.. ప్రతి బ్యాంక్, ఎన్బీఎఫ్సీ ఒక జాబితాను నిర్వహిస్తుంటాయి. ⇒ ఒక్కసారి వీటిపై రుణం తీసుకున్నారంటే, అవి తనఖాలోకి వెళ్లినట్టు అర్థం చేసుకోవాలి. కనుక రుణం తీర్చే వరకు వాటిని విక్రయించలేరు. ⇒ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ విలువలో నిర్ణీత శాతం వరకే రుణం లభిస్తుంది. ఇక్కడ కూడా లోన్–టు–వేల్యూ (ఎల్టీవీ) వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఆర్బీఐ నిర్దేశించిన ఎల్టీవీ 75 శాతంగా ఉంది. చాలా సంస్థలు ఈక్విటీ ఫండ్స్‌పై 50– 60% మేరకే రుణం ఇస్తున్నాయి. మిరే అస్సెట్ సంస్థ 45 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తోంది. రుణం ఇచ్చే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ విడిగా రుణగ్రహీత తిరిగి చెల్లింపుల సామర్థ్యాలను అంచనా వేసుకున్న తర్వాత ఇంతకంటే తక్కువే మంజూరు చేయవచ్చు. ⇒పెట్టుబడుల విలువలో రుణం 50 శాతం మించకుండా ఉంటేనే నయం. ఎందుకంటే తనఖాలో ఉంచిన షేర్లు, సెక్యూరిటీలు, ఫండ్స్ యూనిట్ల విలువను రుణం ఇచి్చన సంస్థలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాయి. ముఖ్యంగా మార్కెట్లు కరెక్షన్కు లోనైతే ఈ పనిని వెంటనే చేస్తాయి. అప్పుడు లోన్–టు–వేల్యూని మించి రుణం విలువ పెరిగిపోతుంది. దీంతో అదనపు సెక్యూరిటీలు/ఫండ్స్ యూనిట్లను తనఖా ఉంచాలని అవి కోరతాయి. లేదా నగదు సర్దుబాటు చేయాలని కోరతాయి. లేదంటే అదనపు వడ్డీని విధిస్తాయి. లేదా తనఖాలో ఉంచిన వాటిని వెంటనే విక్రయించి సొమ్ము చేసుకుంటాయి. రుణం తీసుకున్న వ్యక్తి స్పందన ఆధారంగా ఈ చర్యలు ఉంటాయి. ⇒ ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఈ రుణం మంజూరు అవుతుంది. ఉదాహరణకు తనఖా పెట్టిన సెక్యూరిటీలు, ఫండ్స్ యూనిట్లపై రూ.5 లక్షల రుణానికి ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం లభించిందని అనుకుందాం. అప్పుడు రూ.2 లక్షలే వినియోగించుకుంటే ఆ మొత్తంపైనే వడ్డీ పడుతుంది. ఎన్ని రోజులు వినియోగించుకుంటే, అంతవరకే వడ్డీ పడుతుంది. కాకపోతే తీసుకున్న రుణంపై వడ్డీని ప్రతినెలా చెల్లించాల్సిందే. ⇒ రుణంపై కనిష్ట, గరిష్ట పరిమితులను బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు అమలు చేస్తున్నాయి. ⇒ వ్యక్తిగత రుణాలను ముందస్తుగా తీర్చివేస్తే ప్రీక్లోజర్ చార్జీలను బ్యాంక్‌లు వసూలు చేస్తుంటాయి. కానీ, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ రుణాలపై ప్రీ క్లోజర్ చార్జీల్లేవు. ⇒ వ్యక్తిగత రుణాల మాదిరే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌పై రుణాలను ఎందుకు వినియోగించుకోవాలనే విషయంలో షరతులు ఉండవు. చట్టవిరుద్ధమైన, స్పెక్యులేటివ్ అవసరాలకే వినియోగించుకోకూడదు. ⇒ తనఖాలోని షేర్లు, స్టాక్స్‌కు సంబంధించి డివిడెండ్లు, బోనస్, ఇతరత్రా ప్రయోజనాలు ఇన్వెస్టర్‌కే లభిస్తాయి. ⇒ గడువు ముగిసిన తర్వాత షేర్లు, ఫండ్స్ యూనిట్లపై రుణాన్ని పునరుద్ధరించుకోవచ్చు. ⇒ రుణంపై వడ్డీ, అసలు చెల్లింపుల్లో విఫలమైతే తనఖాలో ఉంచిన సెక్యూరిటీలు, స్టాక్స్‌ను విక్రయించే అధికారం రుణం ఇచి్చన సంస్థలకు ఉంటుంది. విక్రయించగా వచి్చన మొత్తాన్ని రుణంతో సర్దుబాటు చేసుకుంటాయి. మిగులు ఉంటే రుణగ్రహీతకు చెల్లిస్తాయి. ఇంకా బకాయి మిగిలి ఉంటే రుణగ్రహీత నుంచి రాబట్టేందుకు తదుపరి చర్యలు తీసుకుంటాయి.డెట్ ఫండ్స్‌పై వద్దు.. డెట్ ఫండ్స్‌లో రాబడులు 6–8 శాతం మధ్యే ఉంటాయి. వీటిపై రుణం తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ 10–12 శాతం మధ్య ఉంటుంది. దీనికి బదులు ఆ పెట్టుబడులను విక్రయించుకోవడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. కేవలం ఈక్విటీ ఫండ్స్, స్టాక్స్‌పై రుణానికే పరిమితం కావాలి. ఎందుకంటే, ఈక్విటీ ఫండ్స్, స్టాక్స్‌లో దీర్ఘకాలంలో రాబడులు 15 శాతం స్థాయిలో ఉంటాయి. కనుక వడ్డీ చెల్లింపులు పోను ఎంతో కొంత మిగులు ఉంటుంది. చార్జీలు.. సకాలంలో చెల్లింపులు చేయనప్పుడు పీనల్ చార్జీలు విధిస్తాయి. అలాగే, సెక్యూరిటీ ఇన్వొకేషన్ చార్జీ, కలెక్షన్ చార్జీ, లీగల్ చార్జీ, స్టాంప్ డ్యూటీ, చెక్ బౌన్స్ చార్జీలు కూడా ఉంటాయి. రుణ కాల పరిమితి సాధారణంగా ఒక ఏడాది ఉంటుంది. తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. దీనిపైనా చార్జీలు విధిస్తాయి. రుణం తీసుకోవడానికి ముందే ఈ చార్జీల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఇతర ఆప్షన్లు బంగారం, ప్రాపర్టీ (ఇల్లు లేదా స్థలం), జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లపైనా సెక్యూర్డ్ రుణాలు పొందొచ్చు. కాకపోతే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై డిజిటల్‌గా, వేగంగా రుణం లభిస్తుంది. కనుక ఇది అత్యవసర నిధిగానూ అక్కరకు వస్తుంది. తక్కువ రేటుకే రుణం తీసుకోవాలని భావిస్తే, భిన్న సంస్థల మధ్య వడ్డీ రేటును పరిశీలించాలి. అలాగే, బంగారం, జీవిత బీమా ప్లాన్లు ఉంటే వాటి రేట్లను విచారించి, చౌక మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. వ్యక్తిగత రుణం చివరి ఎంపికగానే ఉండాలి.విక్రయించడం మార్గం కాదు.. రిటైల్ ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో పెద్ద మొత్తంలో ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుండటం చూస్తున్నాం. ఈక్విటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారిలో 59 శాతం మంది 24 నెలలకు మించి కొనసాగిస్తున్నారు. మిగిలిన వారు ఆ లోపే విక్రయిస్తున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా చేయడం దీర్ఘకాల లక్ష్యాలకు విరుద్ధం.పెట్టుబడులు ఉపసంహరించుకోకుండా, ఓవర్‌డ్రాఫ్ట్ రుణ సదుపాయం ద్వారా స్వల్పకాల అవసరాలను అధిగమించడమే మంచి ఆప్షన్ అవుతుంది. మిరే అస్సెట్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ డేటా ప్రకారం.. ఫండ్స్, షేర్లపై రుణాలను 30 శాతం మంది వ్యాపార అవసరాల కోసం, 19 శాతం మంది ఇంటి నవీకరణ కోసం, 18 % మంది పిల్లల స్కూల్/కాలేజీ ఫీజుల కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఎస్బీఐ యోనో నుంచే.. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ సైతం మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై రుణం ఇస్తోంది. అది కూడా యోనో యాప్ నుంచే దరఖాస్తు చేసుకుని, డిజిటల్‌గా రుణాన్ని పొందొచ్చు. క్యామ్స్ వద్ద నమోదైన అన్ని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు) మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై, ఆకర్షణీయమైన రేట్లకే రుణాన్ని ఇస్తున్నట్టు ఎస్బీఐ చెబుతోంది. గతంలో కేవలం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ పథకాలపై, అది కూడా బ్యాంక్ శాఖకు వెళ్లి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు యోనో నుంచి పది నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రుణం విలువపై 0.50 శాతం ప్రాసెసింగ్చార్జీ, జీఎస్టీ చెల్లించుకోవాలి. -
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి. దేశవ్యాప్తంగా క్రితం రోజున పెరుగుదల నమోదు చేసిన పసిడి ధరలు నేడు (ఆగస్టు 25) స్థిరంగా కొనసాగుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,950 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 73,040 వద్ద నిలకడగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.67,100 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,190 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ ఈరోజు ఎలాంటి కదలికా లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.93,000 వద్ద నిలకడగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మారుతీ సుజుకీ నెక్సా విస్తరణ
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ నెక్సా ఔట్లెట్లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. బెంగళూరులో 500వ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 150 స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇందులో 100 కేంద్రాలు చిన్న నగరాల్లో రానున్నాయని వెల్లడించింది. నెక్సా సేల్స్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు చాలా దూకుడుగా ప్లాన్ చేశామని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు పెద్ద ఎత్తున వెళ్లాలన్నది తమ ప్రణాళిక అని వెల్లడించారు. నెక్సాలో లభించే మోడళ్లకు ఈ నగరాల నుంచి మంచి డిమాండ్ ఉందన్నారు. కార్యక్రమంలో మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నొబుటాకో సుజుకీ కూడా పాల్గొన్నారు.నెక్సా వాటా 37 శాతం.. మారుతీ సుజుకీ 2015 జూలైలో నెక్సా ఔట్లెట్లకు శ్రీకారం చుట్టింది. ఏడాదిలోనే 94 నగరాల్లో 100 నెక్సా షోరూంలను నెలకొలి్పంది. ప్రస్తుతం ఇగ్నిస్, బలీనో, ఫ్రాంక్స్, సియాజ్, జిమ్నీ, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా, ఇని్వక్టో మోడళ్లను నెక్సా షోరూంలలో కంపెనీ విక్రయిస్తోంది. సంస్థ మొత్తం విక్రయాల్లో నెక్సా వాటా 37 శాతం ఉంది. 2023–24లో 54 శాతం వృద్ధితో నెక్సా షోరూంల ద్వారా 5.61 లక్షల కార్లు రోడ్డెక్కాయి. నెక్సా స్టూడియో పేరుతో చిన్న కేంద్రాలను కంపెనీ ఏర్పాటు చేస్తోంది. సంస్థ ఖాతాలో అరీనా, నెక్సా, కమర్షియల్ ఔట్లెట్ల సంఖ్య ప్రస్తుతం 3,925కు చేరుకుంది. ఇవి దేశవ్యాప్తంగా 2,577 నగరాలు, పట్టణాల్లో విస్తరించాయి. -
భారత్‌లో ఎలక్ట్రిక్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) అమ్మకాలు భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఏడు నెలల కాలంలో ఒక మిలియన్ యూనిట్ల విక్రయాల మార్కును చేరుకోవడం విశేషం. 2024 జనవరి–జూలైలో దేశవ్యాప్తంగా 10,75,060 ఈవీలు రోడ్డెక్కాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదైంది. 2023 జనవరి–జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైతో ముగిసిన ఏడు నెలల్లో ఈ–టూ వీలర్స్ 29 శాతం దూసుకెళ్లి 6,34,770 యూనిట్లు నమోదయ్యాయి. ఈ–త్రీ వీలర్స్ 26 శాతం ఎగసి 3,77,439 యూనిట్లను తాకాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ (కార్, ఎస్యూవీ, ఎంపీవీ) రిటైల్ అమ్మకాలు 21 శాతం అధికమై 56,207 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ–కమర్షియల్ వెహికిల్స్ ఏకంగా 190 శాతం వృద్ధి చెంది 6,308 యూనిట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో అత్యధికంగా 2,13,036 ఎలక్ట్రిక్ వెహికిల్స్ కస్టమర్ల చేతుల్లోకి చేరాయి. జూలైలో 1,78,948 యూనిట్లు రోడ్డెక్కాయి. ఈ ఏడాది 2 మిలియన్లపైనే.. ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి 2024లో ఎలక్ట్రిక్ వాహనాల రిటైల్ అమ్మకాలు 20 లక్షల యూనిట్లను దాటడం ఖాయంగా కనిపిస్తోందని పరిశ్రమ ఆశాజనకంగా ఉంది. 2023లో ఈవీల విక్రయాలు దేశవ్యాప్తంగా 50 శాతం వృద్ధితో 15.3 లక్షల యూనిట్లను నమోదు చేశాయి. 2022లో ఈ సంఖ్య 10.2 లక్షల యూనిట్లు మాత్రమే. మొత్తం వాహన రంగంలో ఎలక్ట్రిక్ విభాగం 2023లో 6.38 శాతానికి చేరింది. 2021లో ఇది 1.75 శాతమే. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఈ– టూ వీలర్స్, ఈ– త్రీ వీలర్స్ వాటా ఏకంగా 95 శాతంపైమాటే. ఇక ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్‌ను (ఈఎంపీఎస్) 2024 సెపె్టంబర్ వరకు పొడిగించింది. వాస్తవానికి ఈఎంపీఎస్ సబ్సిడీ పథకం జూలై 31న ముగియాల్సి ఉంది. మౌలిక వసతులు ‘చార్జింగ్’.. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ మౌలిక వసతుల మార్కెట్ దేశంలో ఊహించనంతగా వృద్ధి చెందుతోంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పబ్లిక్ చార్జింగ్ కేంద్రాల సంఖ్య భారత్‌లో 2022 ఫిబ్రవరిలో 1,800 ఉంది. 2024 మార్చి నాటికి ఈ సంఖ్య ఏకంగా 16,347కు చేరిందని ప్రొఫెషనల్ సరీ్వసుల్లో ఉన్న ఫోరి్వస్ మజర్స్ నివేదిక వెల్లడించింది. పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన పెరగడం, అధికం అవుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా ఈవీల డిమాండ్ దేశంలో దూసుకెళుతోంది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు భారత్‌లోని మొత్తం ప్రయాణికుల వాహనాల మార్కెట్లో దాదాపు మూడింట ఒక వంతు ఉంటాయని అంచనా. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా బలమైన మౌలిక సదుపాయాల విస్తరణ కీలకం. 2030 నాటికి భారత రోడ్లపై 5 కోట్ల ఈవీలు పరుగెడతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. 40 వాహనాలకు ఒక కేంద్రం చొప్పున లెక్కిస్తే ఏటా భారత్‌లో 4,00,000 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఫోరి్వస్ మజర్స్ తెలిపింది. -
ప్చ్.. బంగారం ముందే కొనుంటే బావుండు!
దేశంలో రెండురోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు ఎగిశాయి. దేశవ్యాప్తంగా శనివారం (ఆగస్టు 24) పసిడి ధరలు మోస్తరుగా పెరిగాయి. శ్రావణమాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల నిమిత్తం బంగారం కొనేవారు ధరల తగ్గింపు కోసం ఆసక్తి చూస్తున్నారు. రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు ఈరోజు పెరగడంతో ముందే కొనుంటే బావుండు అని నిట్టూరుస్తున్నారు.ఎక్కడెక్కడ ఎంత పెరిగిందంటే..తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర రూ.350 పెరిగి రూ.66,950 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.390 పెరిగి రూ. 73,040 వద్దకు ఎగిసింది.ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. ఇక ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.350 పెరిగి రూ.67,100లకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 పెరిగి రూ.73,190 లను తాకింది.భారీగా వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్‌లో శనివారం వెండి కేజీకి రూ.1300 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.93,000 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..
శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 33.02 పాయింట్ల లాభంతో 81086.21 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11.70 పాయింట్ల లాభంతో 24823.20 వద్ద స్థిరపడ్డాయి.బజాజ్ ఆటో, కోల్ ఇండియా, టాటా మోటార్స్, సన్ ఫార్మా, భారతి ఎయిర్టెల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), విప్రో, దివీస్ ల్యాబ్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఏషియన్ పెయింట్స్ మొదలైన సంస్థలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
డబుల్ హ్యాపీ.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియుల ఆనందం కొనసాగింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం (ఆగస్టు 23) పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది.తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర రూ.200 తగ్గి రూ.66,600 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220 క్షీణించి రూ. 72,650 వద్దకు దిగివచ్చింది.ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.200 తరిగి రూ.66,750లకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి రూ.72,800 లకు వచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు రెండు రోజుల తర్వాత దిగివచ్చాయి. రెండు రోజుల నుంచి స్థిరంగా ధరలు నేడు కాస్తంత తగ్గాయి. హైదరాబాద్‌లో శుక్రవారం రూ.300 మేర క్షీణించింది. ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.91,700 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 147.89 పాయింట్ల లాభంతో 81035.20 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 24810.20 వద్ద స్థిరపడ్డాయి.గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్ మొదలైన కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. విప్రో, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భలే.. బంగారం తగ్గిందోచ్! ఎంతంటే..
దేశంలో ఈరోజు బంగారం కొనేవారికి శుభవార్త. పలు ప్రాంతాలలో గురువారం (ఆగస్టు 22) పసిడి ధరలు దిగివచ్చాయి. క్రితం రోజున గణనీయంగా పెరిగిన పుత్తడి రేట్లలో నేడు కాస్త తగ్గుదల కనిపించింది. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర బంగారం ధర తగ్గిందో ఇక్కడ తెలుసుకుందాం..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పుత్తడి తులం (10 గ్రాములు) ధర రూ.300 తగ్గి రూ.66,800 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు కూడా రూ.330 క్షీణించి రూ. 72,870 వద్దకు దిగివచ్చింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే స్థాయిలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఈరోజు బంగారం ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.300 తరిగి రూ.66,950లకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.72,970 లకు వచ్చింది. కాగా దేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం ఈరోజు ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.92,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. రోజంతా ఒడిదుడుకులకు లోనైన భారతీయ బెంచ్ మార్క్ సూచీలు ఎఫ్ఎంసీజీ షేర్ల కారణంగా పుంజుకుని సానుకూలంగా స్థిరపడ్డాయి.326 పాయింట్ల బ్యాండ్‌లో దూసుకెళ్లిన బీఎస్ఈ సెన్సెక్స్ 103 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 80,905 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 71 పాయింట్లు లేదా 0.29 శాతం పెరిగి 24,770 వద్ద స్థిరపడింది.టైటాన్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఈరోజు సెన్సెక్స్‌లో 1 శాతం నుంచి 2.5 శాతం వరకు పెరిగి టాప్ గెయినర్లుగా ఉన్నాయి.మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ ఎం, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్ 1.6 శాతం వరకు దిగజారి నష్టాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. -
ఊరించి.. ఊపందుకున్న బంగారం!
దేశంలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి. బుధవారం (ఆగస్టు 21) పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. క్రితం రోజున స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు కూడా దిగివస్తాయని కొనుగోలుదారులు ఆశించారు. కానీ మళ్లీ పెరుగుదల బాట పట్టడంతో నిరాశ తప్పలేదు.తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 పెరిగింది. దీంతో ఇది రూ.67,100 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు రూ.550 పెరగడంతో రూ. 73,200 వద్దకు ఎగిసింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.67,250, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.73,350 లుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం ఈరోజు ఎటువంటి కదలిక లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.92,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
విదేశాల్లో మేడిన్ ఇండియా టూవీలర్ల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారైన ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో 12.48 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. దేశీయంగా అమ్మకాలు తగ్గుతున్న నేపథ్యంలో తయారీ కంపెనీలకు కాస్త ఊరట కలిగించే విషయం. అలాగే టూవీలర్ల తయారీ విషయంలో భారత్ అనుసరిస్తున్న నాణ్యత, భద్రత ప్రమాణాలకు ఈ గణాంకాలు నిదర్శనం. 2024 జూలైతో ముగిసిన నాలుగు నెలల్లో మోటార్‌సైకిళ్లు 13 శాతం వృద్ధితో 10,40,226 యూనిట్లు వివిధ దేశాలకు సరఫరా అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా ఏకంగా 83 శాతానికి ఎగసింది. స్కూటర్ల ఎగుమతులు 21 శాతం అధికమై 2,06,006 యూనిట్లుగా ఉంది. టూవీలర్స్ ఎగుమతుల్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, ఇండియా యమహా మోటార్, హీరో మోటోకార్ప్, సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా టాప్‌లో కొనసాగుతున్నాయి. అగ్రస్థానంలో బజాజ్.. ద్విచక్ర వాహనాల ఎగుమతుల్లో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 5 శాతం వృద్ధితో ఏప్రిల్–జూలైలో 4,97,114 యూనిట్లు నమోదు చేసింది. ఇందులో 4,97,112 యూనిట్లు మోటార్‌సైకిళ్లు ఉండడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కో 14 శాతం వృద్ధితో 3,13,453 యూనిట్లతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ 76 శాతం దూసుకెళ్లి 1,82,542 యూనిట్లు, ఇండియా యమహా మోటార్ 28 శాతం అధికమై 79,082 యూనిట్లు, హీరో మోటోకార్ప్ 33 శాతం ఎగసి 73,731 యూనిట్లను విదేశాలకు సరఫరా చేశాయి. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 30 శాతం క్షీణించి 64,103 యూనిట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ 2 శాతం వృద్ధితో 28,278 యూనిట్లు, పియాజియో వెహికిల్స్ 56 శాతం దూసుకెళ్లి 9,673 యూనిట్ల ఎగుమతులను సాధించాయి. బైక్స్‌లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో, హోండా, స్కూటర్స్‌లో హోండా, టీవీఎస్ మోటార్, ఇండియా యమహా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. -
మరింత చెరకుతోనే అనుకున్న లక్ష్యం
ముంబై: పెట్రోల్‌లో 20% మేర ఇథనాల్ మిశ్రం లక్ష్యాన్ని 2025 సరఫరా సంవత్సరంలోనే సాధించాలంటే అందుకు మరింత చెరకు వినియోగించాల్సి ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీనివల్ల మిల్లర్లకు నగదు ప్రవాహాలు మెరుగవుతాయని పేర్కొంది. నవంబర్ నుంచి అక్టోబర్ వరకు ఇథనాల్ సరఫరా సంవత్సరంగా (ఈఎస్‌వై) పరిగణిస్తుంటారు. ఈ ఏడాది అక్టోబర్ వరకు.. ఈఎస్‌వై 2025 సీజన్ పరిధిలోకి వస్తుంది. ఈఎస్‌వై 2025 నాటికి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ను కలపాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ‘‘ఇందుకు ఏటా 990 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. ఇందుకు చెరకుతోపాటు, గ్రెయిన్(ధాన్యాలు)ను సైతం వినియోగించుకోవడం ద్వారానే సరఫరా మెరుగుపడుతుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో వివరించింది. ధాన్యం ద్వారా వార్షిక ఇథనాల్ ఉత్పత్తి గణనీయంగా పెరిగి వచ్చే సీజన్ నాటికి 600 కోట్ల లీటర్లకు చేరుకుంటుందని క్రిసిల్ తెలిపింది. ప్రస్తుత సీజన్లో ఇది 380 కోట్ల లీటర్లుగా ఉంటుందని అంచనా. మిగిలిన మేర చెర కు వినియోగం ద్వారా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మిల్లుల్లో గణనీయమైన త యారీ సామర్థ్యం కారణంగా అది సాధ్యమేనని అభిప్రాయపడింది. చక్కెర నిల్వలను ఇథనాల్ త యారీకి మళ్లించకుండా, ఎగుమతులు చేయకుండా కేంద్రం నిషేధం విధించడంతో నిల్వలు పెరగడా న్ని క్రిసిల్ నివేదిక ప్రస్తావించింది. ఈ నిల్వలను ఇథనాల్ తయారీకి అనుమతించాలని సూచించింది. పెట్రోల్ దిగుమతులు తగ్గించుకోవచ్చు.. 20 శాతం ఇథనాల్‌ను కలపడం ద్వారా పెట్రోల్ దిగమతులపై ఆధారపడడాన్ని భారత్ తగ్గించుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఈఎస్‌వై 2021 నుంచి ఏటా పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 2–3 శాతం మేర పెరుగుతూ వస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఇథనాల్ తయారీకి ఆహార ధాన్యాల వినియోగంపై కేంద్రం ఎలాంటి నియంత్రణలు విధించలేదు. కాకపోతే డిమాండ్–సరఫరా అంచనాల ఆధారంగా ఎంత మేర చెరకును ఇథనాల్ కోసం వినియోగించుకోవాలన్నది సీజన్‌కు ముందు నిర్ణయిస్తుంది. గతేడాది వర్షాలు సరిగ్గా లేకపోవడంతో ఈ ఏడాది సీజన్లో చెరకు ఉత్పత్తిపై ప్రభావం పడింది’’అని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. దీంతో ఈ సీజన్లో చెరకు ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి 250 కోట్ల లీటర్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది. ధాన్యాల ద్వారా ఇథనాల్ తయారీ 40 శాతం పెరగడంతో ఈఎస్‌వై 2024 సీజన్లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 14 శాతానికి చేరినట్టు వివరించింది. చెరకు నుంచి ఇథనాల్ తయారీ తగ్గడాన్ని ఇది భర్తీ చేసినట్టు తెలిపింది.భారీ స్థాయిలో చెరకు అవసరంఈఎస్వై 2025 సీజన్లోనే పెట్రోల్‌లో 20 % ఇథనాల్ లక్ష్యాన్ని సాధించాలంటే 4 మి లియ న్ టన్నుల చక్కెర తయారీకి సరిపడా చెరకును ఇథనాల్ కోసం కేటాయించాల్సి ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ తెలిపారు. ఈఎస్‌వై 2025 సీజన్లో స్థూల చక్కెర ఉత్పత్తి 33.5 మిలియన్ టన్నులుగా ఉంటుందని, చక్కెర వినియోగం 29.5 మిలియన్ టన్నుల స్థాయిలో ఉండొచ్చని క్రిసిల్ నివేదిక పేర్కొంది. ఈ సీజన్ చివరికి చక్కెర నిల్వలు మెరుగైన స్థాయి లో ఉంటాయంటూ.. ఇథనాల్ తయారీకి సరిపడా చెరకును అనుమతించాలని సూచించింది. దీంతో చక్కెర నిల్వలనూ తగిన స్థాయిలో వినియోగించుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. -
పసిడి రికార్డుల పరుగు అంతర్జాతీయ అంశాల దన్ను
న్యూఢిల్లీ: బంగారం ధరలు అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా మంగళవారం పరుగుపెట్టాయి. అంతర్జాజీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ కాంట్రాక్ట్ పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర ఒక దశలో చరిత్రాత్మక రికార్డు 2,570.2 డాలర్ల స్థాయిని తాకింది. ఈ వార్త రాస్తున్న రాత్రి 9 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలి్చతే 20 డాలర్ల లాభంతో పటిష్టంగా 2,562 డాలర్ల పైన ట్రేడవుతోంది. అమెరికా మాంద్యం భయాలు, ఫెడ్ వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణం.దేశంలోనూ దూకుడే.. ఇక అంతర్జాతీయ అంశాల దన్నుతో దేశీయంగా కూడా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పూర్తి 99.9 స్వచ్ఛత ధర రూ.1,400 పెరిగి రూ.74,150కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇదే స్థాయిలో పెరిగి రూ.73,800 స్థాయిని చూసింది. వెండి కేజీ ధర సైతం రూ.3,150 ఎగసి రూ.87,150కి చేరింది. ముంబైలో 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు రూ.837, రూ.834 చొప్పున పెరిగి వరుసగా రూ.71,945, రూ.71,657కు చేరాయి. వెండి ధర రూ.2,030 పెరిగి రూ.85,321కు పెరిగింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 378.18 పాయింట్ల లాభంతో 80,802.86 వద్ద, నిఫ్టీ 126.20 పాయింట్ల లాభంతో 24,698.85 వద్ద ముగిశాయి.ఎస్‌బఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, భారతి ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, అపోలో హాస్పిటల్ మొదలైన సంస్థలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తగ్గిన బంగారం, పెరిగిన వెండి: ఈ రోజు ధరలు ఇవే
ఆగష్టు 17న భారీగా పెరిగిన బంగారం ధరలు రెండు రోజులు స్థిరంగా ఉండి, ఈ రోజు (మంగళవారం) స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో పసిడి ధరలలో కొంత మార్పు సంభవించింది. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా గోల్డ్ రేటు ఈ రోజు రూ. 100 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 120 (24 క్యారెట్స్ 10 గ్రా) తగ్గింది. దీంతో ఈ ప్రాంతాల్లో తులం బంగారం ధర రూ. 66600 & రూ. 72650 వద్ద ఉన్నాయి.ఇక చెన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రేటు రూ. 66600, 24 క్యారెట్ల 10 గ్రా బంగారం ధర రూ. 72650గా ఉంది. నిన్న, మొన్న స్థిరంగా ఉన్న బంగారం రెండు రోజుల తరువాత కొంత తగ్గుముఖం పట్టింది.దేశ రాజధానిలో కూడా 10 గ్రా 22 క్యారెట్స్ & 24 క్యారెట్స్ గోల్డ్ రేట్లు వరుసగా రూ. 100, రూ. 120 తగ్గింది. దీంతో పసిడి ధరలు రూ. 66750 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 72800 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం రేటు.. ఈ రోజు మాత్రం స్వల్పంగా మాత్రమే తగ్గింది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. వెండి మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తోంది. దీంతో సిల్వర్ రేటు మళ్ళీ గరిష్టాలకు చేరింది. ఈ రోజు (ఆగష్టు 20) కేజీ వెండి రేటు రూ. 1000 పెరిగి రూ. 87000 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
సెబీ చీఫ్‌పై కేంద్రం దర్యాప్తు..?
సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల ఆధారంగా కేంద్ర ఆర్థికశాఖ దర్యాప్తు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు అధికారులు తెలిపారు. ఈ సంఘంలో సెబీ ప్రతినిధులు సైతం ఉండబోతున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.బెర్ముడా, మారిషస్‌లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ సంస్థల్లో సెబీ చీఫ్ మాధబి, ఆమె భర్త పెట్టుబడిపెట్టి కృత్రిమంగా వాటి విలువను పెంచారని ప్రధానంగా హిండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. మాధబి స్థాపించిన రెండు కన్సల్టింగ్ కంపెనీల్లో తాను 2017లో సెబీలో చేరిన తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయాయని హిండెన్‌బర్గ్ తెలిపింది. తర్వాత ఆమె భర్త 2019 నుంచి వాటిని నిర్వహిస్తున్నట్లు చెప్పింది. అగోరా అడ్వైజరీ లిమిటెడ్(ఇండియా) అనే సంస్థలో తాజా షేర్ హోల్డింగ్ జాబితా ప్రకారం మార్చి 31, 2024 నాటికి మాధబి 99 శాతం వాటా కలిగి ఉన్నారని పేర్కొంది. ఇప్పటికీ ఆ సంస్థ కన్సల్టింగ్ ఆదాయాన్ని సృష్టిస్తోందని చెప్పింది. సింగపూర్ రికార్డుల ప్రకారం మార్చి 16, 2022 వరకు బచ్ ‘అగోరా పార్ట్నర్స్ సింగపూర్’లో 100 శాతం వాటాదారుగా కొనసాగారని తెలిపింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రెండు వారాల తర్వాత ఆమె షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!ఇదిలాఉండగా, సెబీ చీఫ్ ఇటీవల స్పందిస్తూ హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. భర్తతోకలిసి షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగడంతో సెబీ తాజాగా దర్యాప్తునకు ఆమోదిస్తున్నట్లు సమాచారం. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం బలమైన ప్రారంభాన్ని అందుకున్న దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 అన్ని సెక్టార్లలో బలహీనమైన ట్రేడింగ్‌తో ఫ్లాట్‌గా ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 12 పాయింట్లు లేదా 0.02 శాతం క్షీణించి 80,425 వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 31.5 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 24,573 వద్ద ముగిసింది.బెంచ్‌మార్క్‌ల లాభాల్లో హిందాల్కో, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఎల్టీఐఎండీట్రీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్ 1.8 శాతం నుంచి 4 శాతం వరకు లాభపడ్డాయి. మహీంద్రా&మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, టాటా మోటార్స్ 2.5 శాతం వరకు పడిపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బంగారం నేడు ఎంత పలుకుతోందంటే..
దేశంలో పసిడి కొనుగోలుదారులకు ఊరట కొనసాగింది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు సోమవారం (ఆగస్టు 19) పెరుగుదల లేకుండా స్థిరంగా కొనసాగాయి. బంగారం ధరలు నిలకడగా ఉండటం ఇది వరుసగా రెండో రోజు.బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 72,770 వద్ద నిలకడగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరల్లో ఈరోజు ఎటువంటి మార్పు కనిపించలేదు. 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,850, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,920 లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ ఈరోజు ఎటువంటి కదలిక లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.91,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ప్రపంచ పరిణామాలే దిక్సూచి!
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు ఈవారం అంతర్జాతీయ సంకేతాలను అందిపుచ్చుకుంటూ పరిమిత శ్రేణిలో సానుకూల ధోరణితో స్థిరీకరణ దిశగా సాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక అమెరికా ఫెడ్ ఎఫ్ఓఎంసీ మినిట్స్, జాక్సన్ హోల్ ఆర్థిక సదస్సులో చైర్మన్ జెరోమ్ పావెల్ వాఖ్యలతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ఈ వారం ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుందంటున్నారు. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లకు స్వల్పకాలంలో ప్రధాన అడ్డంకిగా మారాయి. లాభాలు కొనసాగితే నిఫ్టీ ఎగువ స్థాయిలో 24,700, ఆపై 25,850 స్థాయిలను పరీక్షించవచ్చు. ముఖ్యంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందితే మరోసారి 25,000 స్థాయిని అందుకునే అవకాశం లేకపోలేదు. దిగువ స్థాయిలో 24,300–24,200 పరిధిలో తక్షణ మద్దతు ఉంది’’ అని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. గత వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. సెన్సెక్స్ సెన్సెక్స్ 731 పాయింట్లు, నిఫ్టీ 174 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా ఆర్థిక భయాలు తగ్గడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలతో వారాంతాపు రోజైన శుక్రవారం సూచీలు దాదాపు 2 శాతం ర్యాలీ చేశాయి. ఎఫ్ఓఎంసీ వివరాలపై కన్ను... అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూలైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) 21న (బుధవారం) విడుదల కానున్నాయి. ఆర్థిక వ్యవస్థ సహా మందగిస్తున్న ధరల నేపథ్యంలో 2024 ద్వితీయార్ధంలో రేట్ల తగ్గింపునకు సంకేతాలిచ్చిన ఫెడ్ రిజర్వ్ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలపై దృష్టి అమెరికా మిస్సోరి రాష్ట్రంలోని కాన్సాస్ సిటీలో ఫెడరల్ రిజర్వ్ జాక్సన్ హోలీ ఎకనమిక్ సింపోజియం (ఆర్థిక సదస్సు) 23న (శుక్రవారం) జరగనుంది. ఇందులో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసగించనున్నారు. ఆర్థిక మాంద్యం భయాలు సన్నగిల్లడంతో పాటు జూలై సీపీఐ ద్రవ్యోల్బణ డేటా అంచనాలకు అనుగుణంగా వెలువడింది. ఈ నేపథ్యంలో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలపై పావెల్ అభిప్రాయం కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు జపాన్ జూన్ మెషనరీ ఆర్డర్లు సోమవారం, యూరోజోన్ జూలైన ద్రవ్యోల్బణ డేటా మంగళవారం, జపాన్ జూలై వాణిజ్య లోటు గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. మరుసటి రోజు గురువారం దేశీయ హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడి కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జపాన్ జూలై ద్రవ్యోల్బణ డేటా పాటు భారత ఆర్బీఐ ఆగస్టు 16తో ముగిసిన వారపు ఫారెక్స్ నిల్వలు ప్రకటించనుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక గణాంకాలపై మార్కెట్ వర్గాలు ఫోకస్ చేయనున్నాయి.రూ.21,201 కోట్ల అమ్మకాలుభారత మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆగస్ట్ ప్రథమార్థంలో రూ.21,201 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. యెన్ ఆధారిత ట్రేడింగ్ భారీగా తగ్గడం, అమెరికాలో ఆర్థిక మాంద్య భయాలు, చైనా ఆర్థిక మందగమన ఆందోళనలు భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు ఇందుకు ప్రధాన కారణాలు. ఇదే సమయంలో (ఆగస్టు 1–17 మధ్య) డెట్ మార్కెట్లో రూ.9,112 కోట్ల పెట్టుడులు పెట్టారు. కాగా దేశీయంగా క్యూ1 ఆర్థిక ఫలితాలపై సానుకూల అంచనాలు, పాలసీ సంస్కరణలు, ఆర్థిక వృద్ధిపై ఆశలతో ఎఫ్ఐఐలు జూలైలో రూ.32,365 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘‘వేల్యుయేషన్ పరంగా భారత ఈక్విటీ మార్కెట్ అంత్యంత ఖరీదైనగా మారడంతో ఎఫ్ఐఐలు ఇక్కడి విక్రయాలు జరిపి చౌకగా మార్కెట్లలో కొనుగోళ్లు చేపడుతున్నారు. అమెరికా మాంద్య భయాలు తగ్గి బుల్లిష్ వైఖరి నెలకొన్న నేపథ్యంలోనూ ఈ పరిస్థితి మారడం లేదు’’ జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. -
బంగారం మళ్లీ పెరిగిందా.. తగ్గిందా?
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు రెండు రోజులుగా చుక్కలనంటాయి. ఆదివారం (ఆగస్టు 18) పసిడి రేట్లు శాంతించాయి. మళ్లీ పెరగకుండా స్థిరంగా కొనసాగడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.66,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 72,770 వద్ద స్థిరంగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.66,850, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.72,920 లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ ఈరోజు ఎటువంటి కదలిక కనిపించలేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.91,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం.. భారీ నిరాశ!
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (ఆగస్టు 17) భారీగా పెరిగాయి. పసిడి ధరల్లో క్రితం రోజున స్వల్ప కదలిక కనిపించగా నేడు ఒక్కసారిగా ఎగిశాయి. వెండి ధరలు సైతం ఒక్కసారిగా దూసుకెళ్లి కొత్త మార్కును తాకాయి. దీంతో ఈరోజు ఆభరణాలు కొనాలనుకున్నవారికి నిరాశ తప్పలేదు.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరీశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.1050 పెరిగి రూ.66,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.1150 ఎగిసి రూ. 72,770 లను తాకింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే రీతిలో ధరలు పెరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలో అయితే 22 క్యారెట్ల బంగారం రూ.1050 ఎగిసి రూ.66,850 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ. 1150 పెరిగి రూ.72,920 లకు చేరుకుంది.వెండి ధరల్లో కొత్త మార్క్దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు అమాంతం పెరిగాయి. హైదరాబాద్‌లో రెండో రోజులుగా కేజీకి రూ.500 చొప్పున పెరిగిన వెండి ధర శనివారం ఏకంగా రూ.2000 ఎగిసింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.91,000 లను తాకింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రికార్డులు
న్యూయార్క్: అంతర్జాతీయంగా న్యూయార్క్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర కొత్త రికార్డు స్థాయిలను చూసింది. చురుగ్గా ట్రేడవుతున్న డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్స్ (31.1గ్రా) ధర ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోల్చితే 40 డాలర్లు పెరిగి 2,534 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 2,538 డాలర్లనుసైతం చూసింది. అమెరికా ఫెడ్ ఫండ్ రేటు కోత అంచనాలకుతోడు భౌగోళిక ఉద్రిక్తతలు ప్రత్యేకించి పశి్చమాసియా పరిణామాలు దీనికి నేపథ్యం. -
చెలరేగిన బుల్!
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు ఆర్జించాయి. అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు గడిచిన రెండు నెలల్లో అతిపెద్ద ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1,331 పాయింట్లు పెరిగి 80,437 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 397 పాయింట్లు లాభపడి 24,541 వద్ద నిలిచింది. ఈ ముగింపు రెండు వారాల గరిష్టం కావడం విశేషం. సూచీలు 2% ర్యాలీతో స్టాక్ మార్కెట్లో రూ.7.30 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.451.59 లక్షల కోట్ల(5.38 ట్రిలియన్ డాలర్లు) కు చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా..! సెన్సెక్స్ ఉదయం 649 పాయింట్లు లాభంతో 79,755 వద్ద, నిఫ్టీ 191 పాయింట్లు పెరిగి 24,335 వద్ద మొదలైంది. రోజంతా లాభాల్లో కొన సాగాయి. ఐటీతో పాటు అన్ని రంగాల షేర్లూ రాణించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,412 పాయింట్లు ర్యాలీ చేసి 80,518 వద్ద, నిఫ్టీ 295 పాయింట్లు పెరిగి 24,531 వద్ద గరిష్టాలు తాకాయి.లాభాలు ఎందుకంటే ⇒ అమెరికా రిటైల్ అమ్మకాలు పెరగడం, నిరుద్యోగ క్లెయిమ్స్ డేటా తగ్గడంతో ఆర్థిక మాంద్యం భయాలు సన్నగిల్లాయి. అలాగే జూలై సీపీఐ ద్రవ్యోల్బణ డేటా అంచనాలకు తగ్గట్లు నమోదు కావడంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అంచనాలు పెరిగాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ 103 స్థాయి నుంచి 102.81 స్థాయికి దిగివచి్చంది. ఇటీవల భారీగా పతనమైన జపాన్ కరెన్సీ యెన్ స్థిరత్వాన్ని ప్రదర్శించింది. దీంతో యూఎస్ మార్కెట్లు గురువారం 2% ర్యాలీ చేశాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 3–1% చొప్పున లాభపడ్డాయి. అమెరికాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల ధోరణి దేశీయ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చాయి. ⇒ సెన్సెక్స్, నిఫ్టీ ఇటీవల తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాయి. ఆగస్టు నెలలో 2.5 శాతం దాకా నష్టపోయాయి. దీంతో కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్ల చేపట్టడం సూచీలకు కలిసొచి్చందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ⇒ బ్లూచిప్ షేర్లు టీసీఎస్ (3%), ఐసీఐసీఐ (2%), ఇన్ఫీ (2%), ఐటీసీ (2%) హెచ్డీఎఫ్సీ (1.50%), రిలయన్స్ (1%) రా ణించి ర్యాలీకి దన్నుగా నిలిచాయి.⇒బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 3%, రియల్టీ 2.50%, ఆటో, కమోడిటీ, విద్యుత్, ఫైనాన్సియల్ సర్వీసెస్ సూచీలు రెండుశాతం చొప్పున రాణించాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 2%, 1.75 శాతం రాణించాయి. ⇒సెన్సెక్స్ సూచీలో 30 షేర్లన్నీ లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. నిఫ్టీ సూచీలో 50 షేర్లలో దివీస్ ల్యాబ్స్ (0.50%), ఎస్బీఐ లైఫ్ (0.10%), డాక్టర్ రెడ్డీస్ (0.01%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 47 షేర్లూ లాభపడ్డాయి. ⇒ఎలక్ట్రిక్ బైక్స్‌లో 3 మోడళ్లను ఆవిష్కరించడంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ షేరు 20% ర్యాలీ చేసి రూ.133 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.