Market
-
చెలరేగిన బుల్!
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు ఆర్జించాయి. అన్ని రంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు గడిచిన రెండు నెలల్లో అతిపెద్ద ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1,331 పాయింట్లు పెరిగి 80,437 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 397 పాయింట్లు లాభపడి 24,541 వద్ద నిలిచింది. ఈ ముగింపు రెండు వారాల గరిష్టం కావడం విశేషం. సూచీలు 2% ర్యాలీతో స్టాక్ మార్కెట్లో రూ.7.30 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.451.59 లక్షల కోట్ల(5.38 ట్రిలియన్ డాలర్లు) కు చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా..! సెన్సెక్స్ ఉదయం 649 పాయింట్లు లాభంతో 79,755 వద్ద, నిఫ్టీ 191 పాయింట్లు పెరిగి 24,335 వద్ద మొదలైంది. రోజంతా లాభాల్లో కొన సాగాయి. ఐటీతో పాటు అన్ని రంగాల షేర్లూ రాణించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,412 పాయింట్లు ర్యాలీ చేసి 80,518 వద్ద, నిఫ్టీ 295 పాయింట్లు పెరిగి 24,531 వద్ద గరిష్టాలు తాకాయి.లాభాలు ఎందుకంటే ⇒ అమెరికా రిటైల్ అమ్మకాలు పెరగడం, నిరుద్యోగ క్లెయిమ్స్ డేటా తగ్గడంతో ఆర్థిక మాంద్యం భయాలు సన్నగిల్లాయి. అలాగే జూలై సీపీఐ ద్రవ్యోల్బణ డేటా అంచనాలకు తగ్గట్లు నమోదు కావడంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అంచనాలు పెరిగాయి. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ 103 స్థాయి నుంచి 102.81 స్థాయికి దిగివచి్చంది. ఇటీవల భారీగా పతనమైన జపాన్ కరెన్సీ యెన్ స్థిరత్వాన్ని ప్రదర్శించింది. దీంతో యూఎస్ మార్కెట్లు గురువారం 2% ర్యాలీ చేశాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 3–1% చొప్పున లాభపడ్డాయి. అమెరికాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లోని సానుకూల ధోరణి దేశీయ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చాయి. ⇒ సెన్సెక్స్, నిఫ్టీ ఇటీవల తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాయి. ఆగస్టు నెలలో 2.5 శాతం దాకా నష్టపోయాయి. దీంతో కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్ల చేపట్టడం సూచీలకు కలిసొచి్చందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ⇒ బ్లూచిప్ షేర్లు టీసీఎస్ (3%), ఐసీఐసీఐ (2%), ఇన్ఫీ (2%), ఐటీసీ (2%) హెచ్డీఎఫ్సీ (1.50%), రిలయన్స్ (1%) రా ణించి ర్యాలీకి దన్నుగా నిలిచాయి.⇒బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 3%, రియల్టీ 2.50%, ఆటో, కమోడిటీ, విద్యుత్, ఫైనాన్సియల్ సర్వీసెస్ సూచీలు రెండుశాతం చొప్పున రాణించాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 2%, 1.75 శాతం రాణించాయి. ⇒సెన్సెక్స్ సూచీలో 30 షేర్లన్నీ లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. నిఫ్టీ సూచీలో 50 షేర్లలో దివీస్ ల్యాబ్స్ (0.50%), ఎస్బీఐ లైఫ్ (0.10%), డాక్టర్ రెడ్డీస్ (0.01%) మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 47 షేర్లూ లాభపడ్డాయి. ⇒ఎలక్ట్రిక్ బైక్స్‌లో 3 మోడళ్లను ఆవిష్కరించడంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ షేరు 20% ర్యాలీ చేసి రూ.133 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. -
బంగారం దిగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి నాలుగు నెలల్లో.. ఏప్రిల్ నుంచి జూలై వరకు 12.64 బిలియన్ డాలర్ల (రూ.1.05 లక్షల కోట్లు సమారు) విలువైన బంగారం దిగుమలు నమోదయ్యాయి. 2023 ఏప్రిల్–జూలై మధ్య దిగుమతులు 13.2 బిలియన్ డాలర్లతో పోలి్చనప్పుడు 4.23 శాతం తగ్గాయి. ఒక్కజూలై నెల వరకే చూస్తే పసిడి దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023 జూలైలో 3.5 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదు కావడం గమనించొచ్చు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశి్చతులకు తోడు, అధిక ధరలే బంగారం దిగుమతులపై ప్రభావం చూపించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పండుగల సీజన్ నేపథ్యంలో సెపె్టంబర్ నుంచి దిగుమతులు పెరగొచ్చని, దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడం సైతం ఇందుకు మద్దతుగా నిలుస్తుందని ఓ జ్యుయలరీ వర్తకుడు అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి ఇటీవలి బడ్జెట్లో భాగంగా కేంద్రం తగ్గించడం తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023–24) మొత్తం మీద బంగారం దిగుమతులు 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మన దేశానికి దిగుమతి అవుతున్న బంగారంలో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచి వస్తుంటే, యూఏఈ 16 శాతం, దక్షిణాఫ్రికా 10 శాతం వాటా కలిగి ఉన్నాయి. మన దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5 శాతంగా ఉంది. గణనీయంగా వెండి దిగుమతులు ఏప్రిల్ నుంచి జూలై మధ్య మన దేశం నుంచి 9.1 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలు, ఆభరణాల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 7.45 శాతం తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 648 మిలియన్ డాలర్ల విలువైన వెండి దిగుమతులు జరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 215 బిలియన్ డాలర్లతో పోల్చి చూసినప్పుడు రెండు రెట్లు పెరిగాయి. యూఏఈతో 2022 మే 1 నుంచి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచి్చంది. దీంతో ఆ దేశం నుంచి బంగారం, వెండి దిగుమతులు పెరిగిపోయాయి. దీనిపై పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తం అవుతుండంతో కొన్ని నిబంధనలను సమీక్షించాలని భారత్ కోరుతోంది. పెరిగిన వాణిజ్య లోటు ఏప్రిల్ నుంచి జూలై వరకు దేశ వాణిజ్య లోటు 85.58 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క జూలై నెలకే 23.5 బిలియన్ డాలర్లుగా వాణిజ్యలోటు నమోదైంది. చైనా తర్వాత బంగారం వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద దేశంగా ఉంది. ప్రధానంగా జ్యుయలరీ పరిశ్రమ నుంచి బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటోంది. -
దూసుకెళ్లిన మార్కెట్లు.. సెన్సెక్స్ 1330 పాయింట్లు అప్
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో దూసుకెళ్లాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మరింత లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్1,330.96 పాయింట్లు లేదా 1.68 శాతం పెరిగి 80,436.84 వద్ద ముగియగా, నిఫ్టీ 397.40 పాయింట్లు లేదా 1.65 శాతం పురోగమించి 24,541.15 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని 50 భాగాలలో 47 లాభాల్లో ముగిశాయి. విప్రో, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ లీడ్‌లో ఉన్నాయి. ఇక బీఎస్ఈ స్పేస్‌లో టెక్ మహీంద్రా, మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్ అత్యధిక లాభాలను అందుకున్నాయి.స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్‌లు వరుసగా 1.93 శాతం, 1.86 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, మీడియా, రియాల్టీ సూచీల సారథ్యంలో అన్ని రంగాల సూచీలు లాభాలతో స్థిరపడ్డాయి. ఇవి ఒక్కొక్కటి 2 శాతానికి పైగా ముగిశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరలక్ష్మి వ్రతం రోజున పసిడి ధరల్లో కదలిక
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 16) స్వల్పంగా పెరిగాయి. తెలుగువారికి ముఖ్యమైన వరలక్ష్మి వ్రతం రోజున పసిడి ధరలు పెరగడం కొనుగోలుదారులకు కాస్తంత నిరాశను కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.100 పెరిగి రూ.65,650 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగి రూ. 71,620 లకు ఎగిసింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గుముఖం పట్టాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.100 ఎగిసి రూ.65,800 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 110 పెరిగి రూ.71,770 లకు చేరింది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.65,650 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 పుంజుకుని రూ.71,620 వద్దకు చేరింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు పెరిగాయి. హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజు శుక్రవారం వెండి రేటు కేజీకి రూ.500 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.89,000 లను తాకింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
అక్కడ మాత్రమే తగ్గిన బంగారం.. మళ్ళీ పెరిగిన వెండి
ఆగష్టు 14న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు గురువారం (ఆగష్టు 15) స్థిరంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.👉విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65550 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 71510 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.👉చెన్నైలో కూడా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65550 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 71510 వద్ద ఉన్నాయి.👉 ఒక్క ఢిల్లీలో మాత్రమే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 100 తగ్గింది. అయితే 24 క్యారెట్ల బంగారం మాత్రం నిన్నటి ధరలతోనే కొనసాగుతోంది. కాబట్టి దేశ రాజధానిలో బంగారం ధరలు వరుసగా రూ. 65,600 (22 క్యారెట్ల 10గ్రా), రూ. 71660 (24 క్యారెట్ల 10గ్రా) వద్ద ఉన్నాయి.వెండి ధరలుబంగారం స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం రూ. 500 పెరిగింది. దీంతో బుధవారం రూ. 83000 వద్ద కేజీ వెండి ధర గురువారం రూ. 83500లకు చేరింది. ఇదే ధరలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఇప్పుడు బంగారం కొనొచ్చా!.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
కేంద్ర బడ్జెట్ ప్రకటించిన రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు తెగ సంబరపడిపోయారు. గోల్డ్ రేట్లు ఇక తగ్గుముఖం పడతాయని చాలామంది భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనుకున్నదొకటి.. అయినది ఒకటి మాదిరిగా అయిపోయింది. ఆగష్టు ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం రూ. 70వేలు దాటేసింది.బంగారం కొనుగోలు సురక్షితమైన పెట్టుబడిగా భావించి చాలామంది ఇన్వెస్టర్లు గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆగష్టు 9 నుంచి 13 వరకు బంగారం ధరలు గరిష్టంగా రూ. 2350 (10 గ్రా) పెరిగింది. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు మళ్ళీ భారీగా పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుఎస్‌లో వడ్డీ రేట్ల తగ్గింపుపై పెరుగుతున్న అంచనాలు, డాలర్ ఇండెక్స్‌లో మృదుత్వం, బంగారానికి దేశంలో పెరుగుతున్న డిమాండ్ వంటివన్నీ గోల్డ్ రేట్లు పెరగటానికి కారణమవుతున్నాయని కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా అన్నారు.గంటల వ్యవధిలోనే బంగారం ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. వారంలో రెండు రోజులు స్వల్ప తగ్గుదలను నమోదు చేస్తున్న బంగారం ధరలు.. మిగిలిన రోజులు పెరుగుదల వైపే అడుగులు వేస్తున్నాయి. కాబట్టి బంగారం కొనాలనుకునే వారు కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. -
ఐటీ షేర్ల మెరుపులు.. ఫ్లాట్‌గా మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు.. ఐటీ, టెక్నాలజీ షేర్లపై మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతో బుధవారం ఇంట్రా-డే డీల్స్‌లో లాభాల్లో స్థిరపడ్డాయి.సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 149.85 పాయింట్లు లేదా 0.19% లాభపడి 79,105.88 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 4.20 పాయింట్లు లేదా 0.017% పెరిగి 24,143.20 వద్ద సెషన్‌ను ముగించింది.నిఫ్టీ లిస్టింగ్‌లో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బీపీసీల్ టాప్ గెయినర్స్‌గా మెరిశాయి. దివిస్ ల్యాబ్స్, హీరో మోటర్ కార్ప్, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, ఓన్ఎన్జీసీ షేర్లు టాప్ లూజర్స్‌గా భారీ నష్టాలను చవిచూశాయి.గమనిక: రేపు భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ముంబయి-ఢిల్లీ టికెట్ కంటే తులం బంగారం చీప్!
భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. పెళ్లిళ్లు, పండగలు, పుట్టినరోజు, పెళ్లి రోజు..ఇలా ప్రత్యేక దినాల్లో మరింత స్పెషల్‌గా ఆత్మీయులకు ఆనందాన్ని పంచేందుకు బంగారాన్ని కొంటూంటారు. అంతేకాదు గోల్డ్‌ను స్థిరంగా వృద్ధి చెందే సురక్షితమైన పెట్టుబడిగా భావించి అందులో ఇన్వెస్ట్ చేస్తారు. చైనా తర్వాత బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే భారత్ పసిడి ప్రయాణం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా...1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది.1947లో రూ.88.62 రెట్టింపు అయింది.1947లో ముంబయి నుంచి ఢిల్లీ వెళ్లే టికెట్ ధర కంటే 10 గ్రాముల బంగారం ధర తక్కువ.స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.1950-60 దశాబ్దంలో బంగారం దాదాపు 12 శాతం ఎగిసింది.1970లో 10 గ్రాముల బంగారం సగటు ధర రూ.184కు చేరింది.1980లో రూ.1,330కు, 1990 నాటికి రూ.3,200 దాటింది.2001 ఏడాదికి సుమారు 15శాతం చొప్పున పెరిగింది.2008-2009లో ఆర్థిక సంక్షోభం మార్కెట్లను కుదిపేసినప్పటికీ 2000-2010 మధ్య కాలంలో బంగారం ధర రూ 4,400 నుంచి రూ.18,500 వరకు పెరిగింది.2021లో సగటు బంగారం ధర 10 గ్రాములకు రూ.48,720.2023లో రూ.60వేల వద్ద రికార్డు స్థాయిని బ్రేక్ చేసింది.2024 మేలో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా గరిష్ఠంగా రూ.76,450ను తాకింది. ప్రస్తుతం ఈరోజు(ఆగస్టు 14, 2024) రూ.71,150గా ఉంది.బంగారం ధరను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర ప్రభావంభౌగోళిక, రాజకీయ అనిశ్చితులుఆర్థికమాంద్యం భయాలుఆర్థిక, రాజకీయ పరిస్థితులుప్రభుత్వ విధానాలుడాలర్ విలువద్రవ్యోల్బణంభారత్ దిగుమతి చేసుకునే బంగారంలో దాదాపు 44 శాతం స్విట్జర్ల్యాండ్ నుంచే వస్తోంది. తర్వాత యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి సుమారు 11 శాతం పసిడి దిగుమతి అవుతుంది. తర్వాత స్థానంలో సౌత్ ఆఫ్రికా, గినియా ఉంటాయి.ఇదీ చదవండి: పెరుగుతున్న సౌర విద్యుత్ సామర్థ్యంఎక్కువ కొనుగోలు చేసేది ఎప్పుడంటే..పెళ్లిళ్లుపుట్టినరోజుపెళ్లిరోజుదీపావళిఆక్షయ తృతియదంతేరాస్ఇతర ప్రత్యేక రోజులు, పండగలు -
ఆరు రోజుల తర్వాత ‘స్వర్ణోత్సాహం’!
వరుసగా పెరుగుతున్న ధరలతో దిగాలుపడ్డ పసిడి ప్రియులకు కాస్తంత ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 14) స్వల్పంగా తగ్గాయి. దాదాపు ఆరు రోజుల తర్వాత పసిడి ధరల్లో తగ్గుదల కనిపించడం కొనుగోలుదారులకు ఉత్సాహాన్ని ఇస్తోంది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.100 తగ్గి రూ.65,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.110 కరిగి రూ. 71,510 లకు తగ్గింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గుముఖం పట్టాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.100 తక్కువై రూ.65,700 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 110 తగ్గి రూ.71,660 లకు దిగివచ్చింది. అలాగే చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం రూ.100 తరిగి రూ.65,550 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.71,510 వద్దకు చేరింది.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు చెప్పుకోదగ్గ స్థాయిలో దిగివచ్చాయి. హైదరాబాద్‌లో బుధవారం వెండి రేటు కేజీకి రూ.500 తగ్గింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.88,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఫస్ట్‌క్రై లిస్టింగ్: సచిన్‌కు రూ. 3.35కోట్ల లాభం
ఫస్ట్‌క్రై మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ షేర్లు మంగళవారం దలాల్ స్ట్రీట్ అరంగేట్రంలో పెట్టుబడిదారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దీంతో ఒక్కసారిగా సచిన్ టెండూల్కర్, రతన్ టాటాతో సహా ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు భారీ లాభాలను పొందారు.బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ మొదటిరోజే 40 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయ్యాయి. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇప్పటికే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. షేర్లు భారీగా పెరగటంతో ఆయన ఒక్కరోజులోనే 3.35 కోట్లకు పైగా లాభం పొందారు. సచిన్ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్‌లో అక్టోబర్ 2023లో రూ. 10 కోట్ల పెట్టుబడులు పెట్టారు. సచిన్ ఒక్కో షేరుకు రూ.487.44 వెచ్చించారు. ఆ షేర్లే ఇప్పుడు భారీగా పెరిగాయి. సచిన్ ఏకంగా కోట్ల లాభాలను పొందగలిగారు.రతన్ టాటా కూడా రూ.5.50 కోట్లు లాభం పొందారు. 2016లో 77900 ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.84.72 చొప్పున కొనుగోలు చేసేందుకు కంపెనీలో రూ.66 లక్షలు పెట్టుబడి పెట్టారు. లిస్టింగ్‌లో తన పెట్టుబడి రూ.5 కోట్ల మార్కును తాకింది.బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ ఐపీఓ ఆగష్టు 6 - ఆగస్ట్ 8 మధ్య నడిచింది. ఫస్ట్‌క్రై పేరెంట్ 32 షేర్ల లాట్ సైజుతో ఒక్కో షేరుకు రూ. 440-465 ధర బ్యాండ్‌లో షేర్లను అందించింది. కంపెనీ తన ఐపీఓ నుంచి మొత్తం రూ. 4,193.73 కోట్లను సేకరించింది. ఇది మొత్తం 12.22 రెట్లు కంటే ఎక్కువ. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 692.89 పాయింట్ల నష్టంతో 78,956.03 వద్ద, నిఫ్టీ 208.00 పాయింట్ల నష్టంతో 24,139.00 వద్ద ముగిశాయి.టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, నెస్లే, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
ఆగష్టు 9 నుంచి పెరుగుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 1040 పెరిగింది. దీంతో బంగారం ధరలు మళ్ళీ యధాస్థానానికి చేరుతున్నాయి. ఈ కథనంలో దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 12) గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65650 కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 71620 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 950, రూ. 1040 పెరిగింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉంటాయి.తెలుగు రాష్ట్రాలలో మాదిరిగానే చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 950, రూ. 1040 పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65650 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 71620 వద్దకు చేరాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 65800 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71770 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలకంటే కూడా ఈ రోజు ధరలు వరుసగా రూ. 950, రూ. 1040 పెరిగిందని స్పష్టమవుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉందని అవగతమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా ఈరోజు రూ. 1000 పెరిగింది. సోమవారం రూ. 600 తగ్గిన వెండి ధర మంగళవారం రూ. 1000 పెరిగి రూ. 83500 (కేజీ)కు చేరింది. మారుతున్న పరిణామాలు చూస్తుంటే.. బంగారం వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమైపోతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 56.98 పాయింట్ల నష్టంతో 79,648.92 వద్ద, నిఫ్టీ 20.50 పాయింట్ల నష్టంతో 24,347.00 పాయింట్ల వద్ద నిలిచాయి.ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బ్రిటానియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇవే..
బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా గరిష్టంగా తులం ధర రూ.270 పెరిగింది. దీంతో పసిడి ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 12) గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 పెరిగింది.తెలుగు రాష్ట్రాలలో మాదిరిగానే చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 250, రూ. 270 పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 70580 వద్దకు చేరాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 64850 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70730 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలకంటే కూడా ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 పెరిగిందని స్పష్టమవుతోంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. ఆదివారం స్థిరంగా ఉన్న వెండి.. సోమవారం రూ. 600 తగ్గి, కేజీ సిల్వర్ ధర రూ. 82500లకు చేరింది. మారుతున్న పరిణామాలు చూస్తుంటే.. బంగారం వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమైపోతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
‘బహిరంగ విచారణ జరగాలి’
సెబీ చీఫ్ మాధబి పురి బచ్, తన భర్త ధవల్ బచ్‌ల పెట్టుబడులపై పారదర్శకంగా, బహిరంగ విచారణ జరగాలని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కోరింది. బెర్ముడా, మారిషస్‌లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ సంస్థల్లో పెట్టుబడిపెట్టి కృత్రిమంగా వాటి విలువను పెంచారని ప్రధానంగా హిండెన్‌బర్గ్ ఆరోపించింది. దానిపై సెబీ చీఫ్ ఇటీవల స్పందిస్తూ హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. భర్తతోకలిసి షోకాజు నోటీసులు జారీ చేసింది.ఈ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ తన ఎక్స్ ఖాతాలో తాజాగా కొన్ని కీలక అంశాలను లేవనెత్తింది.సెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ 10 ఆగస్టు 2024న విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2015లో మాధబి దంపతులు సింగపూర్‌లో నివసించారు. సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె హోల్ టైమ్ మెంబర్‌గా ఉండేవారు. ఆ సమయంలోనే తన భర్త చిన్ననాటి స్నేహితుడైన అనిల్ అహుజా అనే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ద్వారా ఇన్వెస్టింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని హైలెట్ చేస్తూ బచ్ పెట్టుబడులను బహిరంగంగానే నిర్ధారిస్తున్నారని హిండెన్‌బర్గ్ చెప్పుకొచ్చింది. ఇలా బచ్ ఇన్వెస్ట్మెంట్లపై తమ ఒరిజినల్ నివేదికలోనూ తెలిపామని హిండెన్‌బర్గ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది.SEBI Chief Madhabi Puri Buch and her husband Dhaval Buch releases a statement in the context of allegations made by Hindenburg on 10th Aug 2024 against them."The investment in the fund referred to in the Hindenburg report was made in 2015 when they were both private citizens… pic.twitter.com/g0Ui18JVNT— ANI (@ANI) August 11, 2024Buch’s response now publicly confirms her investment in an obscure Bermuda/Mauritius fund structure, alongside money allegedly siphoned by Vinod Adani. She also confirmed the fund was run by a childhood friend of her husband, who at the time was an Adani director.SEBI was…— Hindenburg Research (@HindenburgRes) August 11, 2024ఇదీ చదవండి: మెరుగైన సమాచార లభ్యతపై దృష్టిమాధబి స్థాపించిన రెండు కన్సల్టింగ్ కంపెనీల్లో తాను 2017లో సెబీలో చేరిన తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయాయని హిండెన్‌బర్గ్ తెలిపింది. తర్వాత ఆమె భర్త 2019 నుంచి వాటిని నిర్వహిస్తున్నట్లు చెప్పింది. అగోరా అడ్వైజరీ లిమిటెడ్(ఇండియా) అనే సంస్థలో తాజా షేర్ హోల్డింగ్ జాబితా ప్రకారం మార్చి 31, 2024 నాటికి మాధబి 99 శాతం వాటా కలిగి ఉన్నారని పేర్కొంది. ఇప్పటికీ ఆ సంస్థ కన్సల్టింగ్ ఆదాయాన్ని సృష్టిస్తోందని చెప్పింది. సింగపూర్ రికార్డుల ప్రకారం మార్చి 16, 2022 వరకు బచ్ ‘అగోరా పార్ట్నర్స్ సింగపూర్’లో 100 శాతం వాటాదారుగా కొనసాగారని తెలిపింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రెండు వారాల తర్వాత ఆమె షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.Buch’s statement also claims that the two consulting companies she set up, including the Indian entity and the opaque Singaporean entity “became immediately dormant on her appointment with SEBI” in 2017, with her husband taking over starting in 2019.Per its latest shareholding… pic.twitter.com/gh7jS3zJKZ— Hindenburg Research (@HindenburgRes) August 11, 2024 -
మెరుగైన సమాచార లభ్యతపై దృష్టి
సెక్యూరిటీస్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు మెరుగైన, సరైన సమాచారం లభించేలా చూడటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పర్ఫార్మెన్స్ వేలిడేషన్ ఏజెన్సీ (పీవీఏ), డేటా బెంచ్‌మార్కింగ్ ఇన్స్టిట్యూషన్ (డీబీఐ) అనే రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు (ఐఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్ఏ), ఆల్గోరిథం ప్రొవైడర్లు తాము అందించే సర్వీసుల పనితీరుకు సంబంధించి తెలియజేసే వివరాలను పీవీఏ నిర్ధారిస్తుంది. ఇక, వివిధ అసెట్ క్లాస్‌లకు సంబంధించి ప్రామాణికంగా ఉన్న, పోల్చి చూసుకోతగిన డేటాను అందించే సెంట్రల్ రిపాజిటరీగా డీబీఏ పని చేస్తుంది. 2023–24 వార్షిక నివేదికలో సెబీ ఈ విషయాలు వెల్లడించింది. మరోవైపు, ఇన్వెస్టర్లు చెల్లించే ఫీజులు కచ్చితంగా రిజిస్టర్డ్ ఐఏలు, ఆర్‌ఏలకే అందే విధంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సెబీ పేర్కొంది.ఇదీ చదవండి: అంతర్జాతీయ పరిణామాలు కీలకంఅన్రిజిస్టర్డ్ సంస్థలను ఇన్వెస్టర్లు గుర్తించేందుకు, వాటికి దూరంగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడగలదని సెబీ తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగానికి పెట్టుబడుల లభ్యతకు తోడ్పడే విధానాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. ఈ విషయంలో మార్కెట్ వర్గాల అవసరాలను తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్), ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల (ఇన్వీట్స్) కోసం అడ్వైజరీ కమిటీ వేస్తున్నట్లు పేర్కొంది. వీటితో పాటు స్వచ్ఛంద డీలిస్టింగ్ నిబంధనలను సమీక్షించడం తదితర చర్యలు కూడా తీసుకోనున్నట్లు సెబీ తెలిపింది. -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం
సెబీ చైర్పర్సన్ మాధవీ పురీ బచ్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేనందున ఈ వారం స్టాక్ సూచీలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాలు విడుదల చేసే స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి విలువ, క్రూడ్ కదలికలు తదితర సాధారణ అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుందంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న(గురువారం) ఎక్స్చేంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగురోజులకు పరిమితం కానుంది. నిపుణులు అంచనాల ప్రకారం..ప్రపంచ మార్కెట్ల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. క్రూడాయిల్ ధరలు తగ్గడం కలిసొచ్చే అంశమే. క్యూ1 ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పాటు అధిక వాల్యుయేషన్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వృద్ధి ఆధారిత షేర్లకు బదులుగా వాల్యూ స్టాకులను కొనుగోలు చేయడం మంచిది. నిఫ్టీ ఎగువ సాంకేతికంగా 24,400 వద్ద కీలక నిరోధం కలిగి ఉంది. ఆ స్థాయిని చేధిస్తే తిరిగి 25,000 పాయింట్లను అందుకోవచ్చు. దిగువ స్థాయిలో 24,000 వద్ద తక్షణ మద్దతు కలిగి ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా మాంద్య భయాలు, యెన్ అనూహ్య ర్యాలీ, లాభాల స్వీకరణతో పాటు ఆర్బీఐ కఠినతర వైఖరి అమలు యోచనల నేపథ్యంలో గతవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,276 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హిండెన్‌బర్గ్ – సెబీ వివాదం సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్, ఆమె భర్త ధావల్ బచ్‌లకు అదానీకి చెందిన విదేశీ ఫండ్లలో వాటాలున్నట్లు హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దలాల్‌స్ట్రీట్ స్పందన కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయ జూలై రిటైల్ ద్రవ్యోల్బణ డేటా పాటు జూన్ పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. భారత జూలై డబ్ల్యూపీ(హోల్‌సేల్) ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు అమెరికా ద్రవ్యల్బోణ డేటా ఆగస్టు 14న(బుధవారం) వెల్లడి కానుంది. అదేరోజున యూరోజూ క్యూ2 వృద్ధి డేటా, జూన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, బ్రిటన్ జూల్ ద్రవ్యోల్బణం, రిటైల్ ప్రైజ్ ఇండెక్స్ డేటా వెల్లడి కానుంది. ఆగస్టు 15న చైనా, జపాన్, అమెరికా బ్రిటన్ల జూన్ మాసపు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు, నిరుద్యోగ డేటాలు విడుదల కానున్నాయి. వారాంతాపు రోజున ఆగస్టు 9 వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ ప్రకటించనుంది. ఆదే రోజున బ్రిటన్ జూలై రిటైల్ అమ్మకాలు, యూరోజోన్ జూన్ వాణిజ్య లోటు గణాంకాలు విడుదల కానున్నాయి. చివరి దశకు ఫలితాల సీజన్ కార్పొరేట్ ఫలితాల సీజన్ చివరి దశకు చేరింది. నిఫ్టీ 50 సూచీలోని 50 కంపెనీల్లో 46 కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను విడుదల చేశాయి. వొడాఫోన్ ఐటీ, హిందాల్కో, హీరో మోటోకార్ప్, నైకా, హెచ్ఏఎల్, అపోలో హాస్పిటల్ ఈ వారం ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. వాటితో పాటు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, బజాజ్ హిందుస్థాన్ షుగర్స్, బలరామ్‌పుర్ చినీ మిల్స్, డూమ్స్ ఇండస్ట్రీస్, హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, హిందుస్థాన్ కాపర్ కంపెనీలూ ఇదే వారంలో తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. క్యూ1 ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పాటు అధిక వాల్యుయేషన్ల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వృద్ధి ఆధారిత షేర్లకు బదులుగా వాల్యూ స్టాకులను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. -
హిండెన్‌బర్గ్ ఆరోపణలు... నిరాధారం
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ కొట్టిపారేశారు. అదానీ గ్రూప్ సైతం బచ్‌తో తమకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని స్పష్టంచేసింది. కాగా, అదానీ మార్కెట్ అక్రమాల్లో సెబీ చీఫ్ బచ్‌తో పాటు ఆమె భర్త ధవళ్ బచ్‌కు ప్రమేయం ఉందంటూ హిండెన్‌బర్గ్ పెద్ద బాంబ్ పేలి్చన సంగతి తెలిసిందే. బెర్ముడా, మారిషస్‌లలోని అదానీ డొల్ల కంపెనీల్లో వారిద్దరూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. ఆ డొల్ల కంపెనీల నిధులనే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ దొడ్డిదారిన భారత్‌కు తరలించి అదానీ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించారనేది హిండెన్‌బర్గ్ ఆరోపణ. స్వయంగా మార్కెట్ నియంత్రణ సంస్థ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడంతో దేశవ్యాప్తంగా పెను దుమారం చెలరేగింది. దీంతో బచ్ దంపతులు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. హిండెన్‌బర్గ్ తాజా నివేదికలో చేసిన ఆరోపణలన్నీ ‘‘నిరాధారమైనవి, ఊహాగానాలు’’ అంటూ తీవ్రంగా ఖండించారు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం... హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తీవ్ర ఆరోపణలను కొట్టిపారేస్తూ... ‘‘మా జీవితం, పెట్టుబడులు తెరిచిన పుస్తకం. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గతంలో చేసిన ఏ ఆరోపణలపైన అయితే సెబీ చట్టపరమైన చర్యలు చేపట్టి, షోకాజ్ నోటీసులు జారీ చేసిందో, అదే సంస్థ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం‘ అని బచ్ దంపతులు పేర్కొన్నారు. తమ ఆర్థికపరమైన డాక్యుమెంట్లన్నింటీనీ నిస్సంకోచంగా బయటపెట్టేందుకు సిద్ధమని, అలాగే ప్రైవేటు పౌరులుగా ఉన్నప్పటి కాలానికి సంబంధించిన ఆర్థిక వివరాలన్నింటినీ ఏ ప్రభుత్వ సంస్థ కోరినా ఇస్తామని వారు తేల్చిచెప్పారు. కాగా, అదానీల అక్రమాల్లో స్వయంగా సెబీ చీఫ్‌కు సంబంధాలుండటం వల్లే తాము బయటపెట్టిన అవకతవకలపై లోతుగా విచారణ చేపట్టేందుకు సెబీ నిరాకరించిందని హిండెన్‌బర్గ్ పేర్కొనడం గమనార్హం. మరోపక్క, అదానీ గ్రూప్‌పై ఆరోపణలన్నింటినీ తాము సక్రమంగా దర్యాప్తు చేశామని సెబీ స్పందించింది. విచారణ దాదాపు కొలిక్కి వచి్చందని తెలిపింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను చైర్పర్సన్ మాధవీ పురి బచ్ ఎప్పటికప్పుడు బహిర్గతం చేశారని కూడా పేర్కొంది. హిండెన్‌బర్గ్ ఏం చేస్తుంది?హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల తరఫున గొంతెత్తే చిన్న రీసెర్చ్ సంస్థ. కొంతమంది రీసెర్చర్ల సహకారంతో 2017లో దీన్ని నాథన్ ఆండర్సన్ నెలకొల్పారు. బాగా పేరొందిన కంపెనీల్లో అకౌంటింగ్ అవకతవకలు, ఇతరత్రా కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలను గుర్తించేందుకు ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగించి అధ్యయనం చేస్తుంది. గతంలో కూడా నికోలా, క్లోవర్ హెల్త్, బ్లాక్ ఇంక్, కాండీ, లార్డ్స్టౌన్ మోటార్స్ వంటి కంపెనీలను ఇది టార్గెట్ చేసింది. బిజినెస్ మోడల్ ఇదీ.. అవకతవకలపై రీసెర్చ్ నివేదికలను క్లయింట్లకు ఇస్తుంది. నివేదికను పబ్లిక్‌గా బహిర్గతం చేయడానికి ముందే క్లయింట్లు, హిండెన్‌బర్గ్ కూడా ఆయా కంపెనీల షేర్లలో షార్ట్ పొజిషన్లు (ముందుగా షేర్లను అమ్మేసి, బాగా పడిన తర్వాత తిరిగి కొనుగోలు చేయడం ద్వారా సొమ్ము చేసుకోవడం) తీసుకుంటారు. రిపోర్ట్ వెలువడిన తర్వాత సదరు కంపెనీ షేర్లు భారీగా పడిపోవడంతో ఇరువురికీ భారీగా లాభాలొస్తాయి. అదానీ షేర్ల విషయంలో కూడా ఇదే జరిగింది. కాగా, అదానీ ఉదంతంలో తమకు కేవలం 4.1 మిలియన్ డాలర్లు మాత్రమే లభించాయని, రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా తమ రీసెర్చ్, విచారణ కోసం వెచి్చంచిన భారీ మొత్తంతో పోలిస్తే తమకు పెద్దగా ఒరిగిందేమీ లేదని హిండెన్‌బర్గ్ చెప్పడం విశేషం! బ్లాక్‌స్టోన్‌లో ధవళ్ పదవిపై...బ్లాక్‌స్టోన్ రియల్టీ కార్యకలాపాలతో ధవళ్ బచ్‌కు ఎలాంటి సంబంధం లేదని బచ్ దంపతుల ప్రకటన పేర్కొంది. సెబీ చైర్‌పర్సన్‌గా బచ్ నియామాకానికి ముందే 2019లో ధవళ్ బచ్ను బ్లాక్‌స్టోన్ తమ సీనియర్ అడ్వయిజర్‌గా నియమించుకుందని ప్రకటన స్ప ష్టం చేసింది. సప్లయి చైన్ మేనేజ్మెంట్లో ధవళ్ నైపుణ్యం ఆధారంగానే ఆయనకు ఆ పదవి దక్కిందని పేర్కొంది. రియల్టీ, రీట్‌లపై సెబీ తీసుకున్న నిర్ణయాలు, సంప్రదింపుల ప్రక్రియ అనంతరం బోర్డు ఆమోదం మేరకే జరిగాయని, చైర్పర్సన్ ఒక్కరే ఆ నిర్ణయాలు తీసుకోలేదని కూడా వారు వివరణ ఇచ్చారు. బచ్‌పై ఆరోపణలు ఇవీ... ‘2017లో సెబీలో హోల్‌టైమ్ మెంబర్‌గా బచ్ నియమాకానికి ముందే 2015లో బచ్ దంపతులు ఈ అదానీ డొల్ల కంపెనీల్లో (బెర్ముడాకు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) ఇన్వెస్ట్ చేశారు. సింగపూర్‌లోని ఐపీఈ ప్లస్ ఫండ్ 1లో (ఇది మారిషస్ ఆఫ్‌షోర్ ఫండ్) వారు తొలుత ఖాతా తెరిచారు. దీనికి సంబంధించిన సంస్థలు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో ట్రేడింగ్ చేస్తుండేవి. ఇండియా ఇన్ఫోలైన్ (ఐఐఎఫ్ఎల్) మేనేజ్ చేసిన ఈ వెల్త్ మేనేజ్మెంట్ ఫండ్స్‌లో వినోద్ అదానీకి కూడా పెట్టుబడులు ఉన్నాయి. అందులో ఆయన డైరెక్టర్ కూడా. 2022లో బచ్ సెబీ చైర్పర్సన్ అయ్యారు. దీంతో అదానీకి చెందిన మారిషస్, ఇతరత్రా డొల్ల కంపెనీలపై దర్యాప్తును సెబీ పెద్దగా పట్టించుకోలేదు. అదానీ గ్రూప్‌నకు పవర్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లలో ఇన్వాయిస్లను పెంచి చూపడం ద్వారా విదేశీ డొల్ల కంపెనీలకు పక్కదారి పట్టించిన నిధులను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ భారత్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగించుకున్నారు’ అని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. కాగా, తమ ఐపీఈ ప్లస్ ఫండ్ 1 అదానీ గ్రూప్ షేర్లలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదని 360 వన్ (గతంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్) స్పష్టం చేసింది. 2013 అక్టోబర్–2019 అక్టోబర్ మధ్య నిర్వహించిన తమ ఫండ్‌లో బచ్ దంపతులు చేసిన పెట్టుబడులు మొత్తం నిధుల్లో 1.5 శాతం కంటే తక్కువేనని, పెట్టుబడి నిర్ణయాల్లో ఇన్వెస్టర్ల ప్రమేయం ఏదీ లేదని కూడా పేర్కొంది.దురుద్దేశపూరితం: అదానీ హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణలను అదానీ గ్రూప్ కూడా తీవ్రంగా తోసిపుచ్చింది. ‘చట్టాలు, వాస్తవాలను బేఖాతరు చేస్తూ, స్వలాభం కోసం ముందుగానే ఒక నిర్ణయానికి వచి్చ, బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని దురుద్దేశపూరితంగా, ఊహాజనితంగా, తారుమారు చేసే విధంగా మార్చిన నివేదిక’ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించిన సమాచారంలో అదానీ గ్రూప్ పేర్కొంది. మా ప్రతిష్టను దిగజార్చే ఈ ఉద్దేశపూర్వక ప్రయత్నంలో పేర్కొన్న వ్యక్తులతో గానీ, అంశాలతో గానీ అదానీ గ్రూప్‌నకు ఎలాంటి వ్యాపారపరమైన సంబంధాలు లేవని స్పష్టం చేసింది. పారదర్శకతకు తాము కట్టుబడి ఉన్నామని, చట్టపరమైన, నియంత్రణ సంస్థల నిబంధలనకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని తేలి్చచెప్పింది. ‘పూర్తిగా దర్యాప్తు చేసిన, నిరాధారమని నిరూపితమైన, 2023లో సుప్రీం కొట్టేసిన అవే ఆరోపణలను హిండెన్‌బర్గ్ పదేపదే తిరగదోడుతోంది. భారతీయ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ, తప్పుదోవ పట్టించేలా ఆ సంస్థ కావాలనే ఈ ఆరోపణలు గుప్పిస్తోంది’ అని పేర్కొంది.జరిగింది ఇదీ... అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ కంపెనీలకు భారీ వాటాలపై పెద్దయెత్తున ఆరోపణలు రావడంతో సెబీ 2020 అక్టోబర్‌లో దర్యాప్తు మొదలుపెట్టింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు నిజమైన పబ్లిక్ షేర్‌హోల్డర్లా.. లేదంటే ప్రమోటర్లకు సంబంధించి బినామీలుగా వ్యవహరిస్తున్నారా అనేది తేల్చడమే ఈ దర్యాప్తు ప్రధానోద్దేశం. కాగా, గతేడాది జనవరిలో హిండెన్‌బర్గ్ తొలిసారిగా అదానీ అక్రమాలపై విడుదల చేసిన నివేదిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకోవడమే కాకుండా, అకౌంటింగ్ మోసాలకు కూడా పాల్పడిందని ఆరోపణలు గుప్పించింది. దీంతో అదానీ షేర్లు కుప్పకూలడం, 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరయ్యేందుకు దారితీసింది. కాగా, షేర్ల ధరల భారీ పతనం, అవకతవకలపై సుప్రీం కోర్టు సెబీతో మరో దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు నియంత్రణపరమైన ఉల్లంఘనల నిగ్గు తేల్చాల్సిందిగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, అన్నీ సక్రమంగానే ఉన్నాయంటూ కమిటీ నివేదిక ఇవ్వడం గమనార్హం. దీంతో సెబీ చేస్తున్న దర్యాప్తు సరిపోతుందని, సీబీఐ, సిట్ వంటి సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని సుప్రీం స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత కోల్పోయిన మార్కెట్ విలువను అదానీ గ్రూప్ షేర్లు పూర్తిగా తిరిగి చేజిక్కించుకుని దూసుకుపోతుండం విశేషం. గత నెలలో కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను సైతం హిండెన్‌బర్గ్ ఈ వివాదంలోకి లాగింది. అదానీ డొల్ల కంపెనీలతో ఆ బ్యాంకుకు సంబంధాలున్నాయని ఆరోపించింది. అయితే, కోటక్ బ్యాంక్ కూడా దీన్ని ఖండించింది. కాగా, వాస్తవాలను దాచిపెడుతూ, సంచలనం కోసమే హిండెన్‌బర్గ్ అదానీపై అరోపణలు చేసిందని, అదానీ షేర్ల పతనం ద్వారా లాభపడేందుకు అది న్యూయార్క్ హెడ్జ్ ఫండ్‌తో కుమ్మక్కయిందని పేర్కొంటూ గత నెల 26న సెబీ హిండెన్‌బర్గ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఏకంగా సెబీ చీఫ్‌నే ఈ వివాదంలోకి లాగడం కొత్త ట్విస్ట్. -
హిండెన్‌బర్గ్‌కు మాధబి పురి షోకాజు నోటీసులు
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి పురికి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్‌పై అమెరికా షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలపై మాధబిపురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్‌లు సంయుక్తంగా హిండెన్ బర్గ్‌కు నోటీసులు జారీ చేశారు. భారత్ చట్టాల్ని ఉల్లంఘించి హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిందని, అందుకే ఈ షోకాజు నోటీసులు జారీచేసినట్లు ధవల్ బచ్ దంపతులు తెలిపారు. హిండెన్ బర్గ్ ఆగస్ట్ 10న సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ట్వీట్ చేసింది. ఆ మరుసటి రోజే అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన ఆఫ్‌షోర్ సంస్థల్లో మాధబి పురికి, ఆమె భర్త ధవల్ బచ్ దంపతులకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపిస్తూ ట్వీట్ చేసింది. SEBI Chief Madhabi Puri Buch and her husband Dhaval Buch releases a statement in the context of allegations made by Hindenburg on 10th Aug 2024 against them."The investment in the fund referred to in the Hindenburg report was made in 2015 when they were both private citizens… pic.twitter.com/g0Ui18JVNT— ANI (@ANI) August 11, 2024 ఆ ట్వీట్‌కు మాధబి పురి స్పందించారు. హిండెన్ బర్గ్ తమ వ్యక్తిగత పరువుకు భంగం కలిగేలా వ్యహరిస్తోందని మండిపడ్డారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్‌లో పేర్కొన్న ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం సెబీలో చేరడానికి రెండేళ్ల ముందు అంటే 2015లో జరిగిందని గుర్తు చేశారు. ఆ ఫండ్స్‌లో తాము పెట్టుబడులు పెట్టడానికి కారణం..ఆ ఫండ్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్(సీఐఓ) అనిల్ అహుజా తన స్నేహితుడని ధవల్ బచ్ తెలిపారు. అనిల్ అహుజా నా చిన్న నాటి స్నేహితుడు. పైగా ఇన్వెస్ట్మెంట్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. సిటీ బ్యాంక్, జేపీ మోర్గాన్, 3ఐ గ్రూప్ పీఎల్సీ వంటి సంస్థల్లో పనిచేశారు’ అని చెప్పారు. -
హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే?
రెండు రోజులుగా పెరుగుదల దిశగా సాగుతున్న బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ కథనంలో దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 11) గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64450 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70310 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.తెలుగు రాష్ట్రాలలో మాదిరిగానే చెన్నైలో కూడా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. అంటే నిన్నటి ధరలే ఈ రోజు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64450 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 70310 వద్దకు చేరాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 64600 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70460 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా ఏ మాత్రం పెరగలేదు, తగ్గలేదు. శనివారం రూ. 100 పెరిగిన వెండి ధర.. ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దీంతో వెండి రేటు రూ. 83100 దగ్గరే ఆగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
ఇన్వెస్టర్లను భయపెడుతున్న నాలుగు పదాల ట్వీట్
ఇటీవల కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' చేసిన ఓ ట్వీట్ చాలామందిలో ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి? దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో 'సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా' అని ట్వీట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. హిండెన్‌బర్గ్ మరోసారి భారతీయ మార్కెట్లలో బాంబు పేల్చనుందా.. అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఏ కంపెనీ మీద నివేదికల విడుదల చేస్తుందో అని చర్చించుకుంటున్నారు.హిండెన్‌బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూప్ తమ కంపెనీ కంపెనీ షేర్స్ కృత్రిమంగా పెంచినట్లు ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో అదానీ గ్రూప్ షేర్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ఆరోపణలు సరైనవి కాదని, అదానీ గ్రూప్ ఖండించింది. ఆ తరువాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది. మొత్తానికి అదానీ గ్రూప్ మళ్ళీ యధాస్థితికి వచ్చింది.ఇప్పుడు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన నాలుగు పదాల ట్వీట్.. మళ్ళీ అదానీ గ్రూపును ఉద్దేశించి చేసిందా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ ట్వీట్ అంతరార్ధం మాత్రం అవగతం కావడం లేదు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది 2017లో ప్రారంభమైన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ. ఈ కంపెనీలో ప్రస్తుతం 10మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.Something big soon India— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024 -
ఇలాగే కొనసాగితే బంగారం కొనడం కష్టమే!
ఆగష్టు నెల ప్రారంభం నుంచి పడుతూ లేస్తూ ఉన్న బంగారం ధరలు రెండు రోజులుగా మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు పసిడి ధరలు గరిష్టంగా రూ.220 పెరిగింది. దీంతో బంగారం ధరలలో స్వల్ప కదలికలు ఏర్పడ్డాయి. ఈ కథనంలో దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 10) గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయనేది వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64450 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70310 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది.తెలుగు రాష్ట్రాలలో మాదిరిగానే చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 200, రూ. 220 పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64450 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 70310 వద్దకు చేరాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 64600 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70460 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలకంటే కూడా ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగిందని స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత పెరిగాయి. శుక్రవారం రూ. 1500 పెరిగిన వెండి, శనివారం రూ. 100 పెరిగింది. దీంతో వెండి రేటు రూ. 83100కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
AMFI: ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.37,113 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కొనసాగుతోంది. జూలైలోనూ రూ.37,113 కోట్ల మేర ఈక్విటీ పథకాల్లో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే జూన్ నెలలో వచి్చన రూ.40,608 కోట్లతో పోల్చి చూస్తే మాత్రం 9 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. అయినప్పటికీ నెలవారీ పెట్టుబడుల్లో ఇది రెండో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి జూలై నెలలో రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పరిశ్రమ నుంచి (అన్ని రకాల పథకాలు) రూ.43,637 కోట్లు నికరంగా బయటకు వెళ్లడం గమనార్హం. దీంతో జూలై చివరికి అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.65 లక్షల కోట్లకు చేరుకుంది. జూన్ చివరికి ఇది రూ.61.15 లక్షల కోట్లుగా ఉంది. సిప్ పెట్టుబడుల జోరు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.23,332 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జూన్ నెలలో రూ.21,262 కోట్ల సిప్ పెట్టుబడులతో పోలి్చతే 10 శాతం మేర పెరిగాయి. మొత్తం సిప్ నిర్వహణ ఆస్తులు (పెట్టుబడులు) రూ.13,09,385 కోట్లకు చేరాయి. పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు ఇది నిదర్శనమని, క్రమపద్ధతిలో సంపద సృష్టించుకునేందుకు సాయపడుతుందని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌ను నమ్మకమైన పెట్టుబడుల విభాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల ఆర్థిక వ్యూహాల్లో మ్యూచువల్ ఫండ్స్ కీలకంగా మారాయి’’అని వెంకట్ తెలిపారు. విభాగాల వారీగా.. → లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.670 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఇవి రూ.970 కోట్లుగా ఉన్నాయి. → లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,622 కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవే పథకాలు రూ.2,912 కోట్లను ఆకర్షించాయి. → మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి జూన్ నెలలో వచి్చన రూ.2,528 కోట్లతో పోలి్చతే.. జూలైలో రూ.1,644 కోట్లకు పరిమితమయ్యాయి. → స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,109 కోట్లు వచ్చాయి. జూన్‌లో వచి్చన రూ.2,263 కోట్లతో పోలి్చతే తగ్గాయి. → మల్టీక్యాప్ ఫండ్స్ రూ.7,085 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఈ పథకాల్లోకి రూ.4,709 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. → వ్యాల్యూ ఫండ్/కాంట్రా ఫండ్స్‌లోకి రూ.2,171 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.18,386 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఇవే ఫండ్స్‌లోకి రూ.22,352 కోట్లు వచ్చాయి. ముఖ్యంగా జూలై నెలలో ఈ విభాగంలో 9 కొత్త ఎన్‌ఎఫ్‌వోలు (నూతన పథకాలు) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లను సమీకరించాయి. → ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.3053 కోట్లు వచ్చాయి. → డెట్ (స్థిరాదాయ) పథకాల నుంచి జూన్ నెలలో రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లగా.. జూలై నెలలో రూ.1.2 లక్షల కోట్లు తిరిగొచ్చాయి. త్రైమాసికం చివరి నెలలో డెట్ పథకాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సహజంగా కనిపిస్తుంటుంది. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.70,061 కోట్లు వచ్చాయి. ఎన్‌ఎఫ్‌వోల అండ.. జూన్ నెలతో పోలి్చతే జూలైలో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గాయి. మరీ ముఖ్యంగా నూతన పథకాల లిస్టింగ్ (ఎన్‌ఎఫ్‌వోలు), సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచాయి. ఏక మొత్తంలో పెట్టుబడులు ఎక్కువగా ఎన్‌ఎఫ్‌వోల రూపంలో వచ్చాయి.– మనీష్ మెహతా, కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ హెడ్ (సేల్స్) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 789.28 పాయింట్ల లాభంతో.. 79,675.50 వద్ద, నిఫ్టీ 250.50 పాయింట్ల లాభంతో 24,367.50 వద్ద ఉన్నాయి.ఐషర్ మోటార్స్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్ సంస్థలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)