Market
-
శ్రావణంలో తొలి షాక్! ఒక్కసారిగా ఎగిసిన బంగారం ధరలు
శ్రావణ మాసంలో పపిడి ప్రియులకు తొలి షాక్ ఎదురైంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. శుభకార్యాల సీజన్ శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పెరగకుండా, తగ్గుతూ, స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు నేడు (ఆగస్టు 9) భారీగా పెగిగాయి.తెలుగు రాష్ట్రాల్లో పెరుగుదల ఇలా..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.750 పెరిగి రూ.64,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.820 ఎగిసి రూ. 70,090 లను తాకింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు పెరిగాయి.ఇతర నగరాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.750 పెరిగి రూ.64,400 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 820 పెరిగి రూ.70,240 లకు హెచ్చింది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం రూ.750 ఎగిసి రూ.64,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.820 రూ.70,090 వద్దకు చేరింది.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు భారీగా ఎగిశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం వెండి రేటు కేజీకి రూ.1500 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.88,000 లను తాకింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు @ 10 కోట్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) మరో ఘనతను సాధించింది. రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య 10 కోట్లను తాకింది. ప్రధానంగా గత ఐదేళ్లలోనే కోటి మంది కొత్తగా రిజిస్టర్ అయ్యారు. వెరసి గత ఐదేళ్లలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు మూడు రెట్లు పెరిగారు. డిజిటైజేషన్లో వేగవంత వృద్ధి, ఇన్వెస్టర్లకు అవగాహన పెరుగుతుండటం, నిలకడైన స్టాక్ మార్కెట్ల పురోగతి, ఆర్థిక వృద్ధిలో అందరికీ భాగస్వామ్యం(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) తదితర అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. గురువారానికల్లా(ఆగస్ట్ 8) యూనిక్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 10 కోట్ల మైలురాయికి చేరినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం క్లయింట్ల ఖాతాల(కోడ్స్) సంఖ్య 19 కోట్లను తాకినట్లు తెలియజేసింది. క్లయింట్లు ఒకటికంటే ఎక్కువ(ట్రేడింగ్ సభ్యులు)గా రిజిస్టరయ్యేందుకు వీలుండటమే దీనికి కారణం. 25ఏళ్లు.. నిజానికి ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 4 కోట్ల మార్క్‌కు చేరుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 2021 మార్చిలో ఈ రికార్డ్ సాధించగా.. తదుపరి రిజి్రస్టేషన్ల వేగం ఊపందుకోవడంతో సగటున ప్రతీ 6–7 నెలలకు కోటి మంది చొప్పున జత కలిసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. ఈ ట్రెండ్ కొనసాగడంతో గత 5 నెలల్లోనే కోటి కొత్త రిజి్రస్టేషన్లు నమోదైనట్లు వెల్లడించింది. క్లయింట్ల కేవైసీ విధానాలను క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు అవగాహనా పెంపు కార్యక్రమాలు, సానుకూల మార్కెట్ సెంటిమెంటు తదితర అంశాలు ఇందుకు తోడ్పాటునిచి్చనట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ వివరించారు. -
ప్రతికూలంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాలు వెలువడిన నేపథ్యంలో బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ప్రతికూలంగా స్థిరపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 581.79 పాయింట్లు లేదా 0.73 శాతం క్షీణించి 78,886.22 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 180.50 పాయింట్లు లేదా 0.74 శాతం పడిపోయి 24,117 వద్ద ముగిసింది.నిఫ్టీ50లోని 50 స్టాక్స్‌లో 39 దిగువన ముగియడంతో, ఎల్టీఐ మైండ్‌ట్రీ, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్ 4.9 శాతం వరకు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్‌లోని 30 భాగస్వామ్య స్టాక్‌లలో 25 రెడ్‌లో స్థిరపడ్డాయి. ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టెల్ టాప్ డ్రాగ్లుగా ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)Money Mantra -
దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆగష్టు నెల ప్రారంభం నుంచి పడుతూ లేస్తూ ఉన్న బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 8) బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63500 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 69270 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు.తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ,ముంబైలలో స్థిరంగా ఉన్న బంగారం ధరలు చెన్నైలో మాత్రం పెరిగాయి. దీంతో చెన్నైలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 200 (22 క్యారెట్స్), రూ. 210 (24 క్యారెట్స్) పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63500 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 69270 వద్దకు చేరాయి.దేశ రాజధాని నగరంలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 63650 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69420 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయని స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలోని కొన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. బుధవారం రూ. 500 తగ్గిన పసిడి.. గురువారం కూడా రూ. 500 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 86500లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
Stock Market: బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: బ్యాంకులు, మెటల్, ఐటీ, ఆయిల్ షేర్లకు కనిష్ట స్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మూడు రోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు లభించింది. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఏడు నెలల కనిష్టానికి చేరుకోవడంతో దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలకు దీటుగా సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపడుతున్నారు. ఫలితంగా సెన్సెక్స్ 875 పాయింట్లు పెరిగి 79,468 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 305 పాయింట్లు బలపడి 24,298 వద్ద నిలిచింది. ఉదయం భారీ లాభాలతో మొదలైన సూచీలు రోజంతా స్థిరంగా ముందుకు కదలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1046 పాయింట్లు పెరిగి 79,639 వద్ద, నిఫ్టీ 345 పాయింట్లు బలపడి 24,338 వద్ద గరిష్టాలు అందుకున్నాయి. ఇళ్ల క్రయ విక్రయాలపై చెల్లించే దీర్ఘకాల మూలధన లాభాల పన్నుకు సంబంధించి సడలింపుతో రియలీ్టతో పాటు అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, క్యాప్ సూచీలు 2.63%, 2.39 శాతం లాభపడ్డాయి. ఆర్థిక అస్థిర పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకు వడ్డీరేట్లను పెంచదంటూ బ్యాంక్ ఆఫ్ జపాన్ డిప్యూటీ గవర్నర్ వ్యాఖ్యలతో పాటు అమెరికాలో మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. ఈఏడాది జూలై 23 కంటే ముందు ఇళ్ల క్రయ విక్రయాలపై చెల్లించే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కు సంబంధించి ఉన్న కొత్త, పాత విధానాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించడంతో రియల్టీ షేర్లు ర్యాలీ చేశాయి. ఒమెక్స్ 5%, ఒబేరాయ్ రియల్టీ , డీఎల్ఎఫ్ 3% రాణించాయి. అన్సల్ ప్రాపర్టీస్, మెక్రోటెక్, గోద్రెజ్ ప్రాపరీ్టస్ 2%, అజ్మీరా రియల్టీ 1%, మహీంద్రా లైఫ్‌స్పేస్ అర శాతం చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్ ర్యాలీతో ఒక్కరోజులో రూ.8.97 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.448 లక్షల కోట్లకు చేరింది.తొలి త్రైమాసికంలో నికరలాభం 37% వృద్ధి చెందడంతో తో వేదాంత షేరు బీఎస్ఈలో 4.50% పెరిగి రూ.432.50 వద్ద స్థిరపడింది. -
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 874.94 పాయింట్లు లేదా 1.11% పెరిగి 79,468.01 వద్ద, నిఫ్టీ 322.70 పాయింట్లు లేదా 1.34% ఎగిసి 24,315.25 స్థాయిలకు చేరుకున్నాయి.నిఫ్టీ లిస్టింగ్‌లో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటర్స్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, టైటాన్ కంపెనీల షేర్లు టాప్ లూజర్స్ జాబితాలోకి చేరాయి.గడిచిన మూడు సెషన్‌ల్లో మార్కెట్ భారీగా పతనమైంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారు ఎలాంటి భయాలకు లోనుకాకుండా వాటిని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లోని ఒడిదొడుకులను ఒక అవకాశంగా తీసుకుని మంచి స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
డబుల్ జోష్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. క్రితం రోజున భారీగా తగ్గిన బంగారం, వెండి రేట్లు నేడు (ఆగస్టు 7) కూడా గణనీయంగా క్షీణించాయి. పసిడి, వెండి ధరల్లో వరుస తగ్గింపులతో కొలుగోలుదారుల్లో డబుల్ జోష్ కనిపిస్తోంది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.400 తగ్గి రూ.63,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.440 తగ్గి రూ. 69,270 వద్దకు వచ్చింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.400 క్షీణించి రూ.63,650 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 440 తగ్గి రూ.69,420 లకు దిగొచ్చింది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.700 తగ్గి రూ.63,300 వద్దకు, 24 క్యారెట్ల బంగారం అయితే రూ.760 తరిగి రూ.69,060 వద్దకు వచ్చి చేరింది.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో నేడు వెండి రేటు కేజీకి రూ.500 మేర తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.87,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం పరిశ్రమకు కొత్త సంఘం!
భారత బంగారం పరిశ్రమకు సంబంధించి కొత్త అసోసియేషన్ ఏర్పాటు కానుంది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ గోల్డ్ ఎక్సలెన్స్ అండ్ స్టాండర్డ్స్ (ఐఏజీఈఎస్) పేరుతో అసోసియేషన్ ఏర్పాటవుతోంది. ఈ పరిశ్రమకు స్వీయ నియంత్రణ సంస్థ (ఎస్ఆర్ఓ)గా ఇది బాధ్యతలు నిర్వహిస్తుంది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఎస్ఆర్ఓకు తగిన మద్దతు, సహాయ సహకారాలను అందిస్తుంది. ఇటు ప్రభుత్వానికి అటు వినియోగదారుకు పరిశ్రమ పట్ల విశ్వసనీయత, పారదర్వకత పెంపొందించడం లక్షంగా తాజా అసోసియేషన్ పనిచేస్తుంది.ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ ప్రాంతీయ సీఈఓ (ఇండియా) సచిన్ జైన్ మాట్లాడుతూ..‘బంగారం పరిశ్రమలో వినియోగదారులకు విశ్వసనీయతను పెంచడమే కొత్త సంఘం లక్ష్యం. ఈ ఏడాది డిసెంబరు లేదా జనవరి 2025 నాటికి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ), ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జువెలరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (జీజేసీ) జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ)సహా ఇతర జాతీయ పరిశ్రమ సంఘాలు కొత్త సంఘం ఏర్పాటులో భాగమవుతున్నాయి’ అన్నారు. అసోసియేషన్ కార్యకలాపాల ఫ్రేమ్‌వర్క్‌ను సంస్థ ఏర్పడిన తర్వాత ప్రకటిస్తారని సచిన్ చేప్పారు. సంస్థ సభ్యత్వాలను కూడా అప్పుడే నిర్ణయిస్తారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊహకందని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు! -
'తాత చేసిన పనికి కోటీశ్వరురాలైన మనవరాలు'
కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. చాలామంది జీవితాలను తలకిందులు చేసిన కరోనా లాక్డౌన్ ఓ మహిళను మాత్రం కోటీశ్వరురాలిని చేసింది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.బెంగళూరులో నివాసముంటున్న ప్రియా శర్మ 2020 కరోనా సమయంలో ముంబై వెళ్లిపోయింది. ఆ సమయంలో చాలా రోజులు ఇంట్లోనే కాలం గడపాల్సి వచ్చింది. ముంబైలో వ్యాపారవేత్తగా ఉన్న ఆమె తాత ఇష్టాలను, ఇతర విషయాలను తెలుసుకోవడం ప్రారంభించింది. సరిగ్గా అలాంటి సమయంలోనే.. ఆమె తాత 2014లో లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీలో 500 షేర్లు కొనుగోలు చేసినట్లు, ఆ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు ఆమె కంటపడ్డాయి.ఇదీ చదవండి: ఒకేసారి 10 రోజుల సెలవు.. ఆనందంలో 50వేల ఉద్యోగులుప్రియా శర్మకు దొరికిన ఆ పత్రాలే ఆమెను కోటీశ్వరురాలిని చేశాయి. 16 సంవత్సరాల వ్యవధిలో ఈ షేర్లు 4,500కి పెరిగాయి. వాటి విలువ ఏకంగా రూ. 1.72 కోట్లకు పెరిగింది. అయితే ఈ డబ్బును పొందటం చాలా కష్టంతో కూడుకున్న పని అయిపోయింది. చాలారోజులు పట్టించుకోకుండా వదిలేసినా ఈ స్టాక్స్ కోసం ప్రియా.. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీని లేఖ రాసింది. ఆ తరువాత చాలా నిబంధనలను దాటుకుంటూ ముందుకు వెల్లాల్సి వచ్చింది. మొత్తం మీద తాత చేసిన పని మనవరాలిని కోటీశ్వరురాలిని చేసింది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో మొదలైనప్పటికీ.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 166.33 నష్టంతో 78,593.07 వద్ద, నిఫ్టీ 63.05 పాయింట్ల నష్ఠంతో 23,992.55 వద్ద నిలిచాయి.బ్రిటానియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, లార్సెన్ & టూబ్రో కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఊహకందని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు!
శ్రావణమాసం వచ్చేసింది.. బంగారం ధరలు భారీగా పెరుగుతాయి అనుకున్న సమయంలో, ఊహకందని రీతిలో గోల్డ్ రేటు తగ్గింపోయింది. ఈ రోజు పసిడి ధర గరిష్టంగా రూ. 870 తగ్గింది. దీంతో గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 6) బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 63900 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 69710 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.800, రూ. 870 తగ్గింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.చెన్నైలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64000 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 69820 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 700, రూ. 760 తగ్గింది.దేశ రాజధాని నగరంలో బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64050 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69860 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 800, రూ. 870 తగ్గింది.వెండి ధరలుబంగారం మాదిరిగానే దేశంలో వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. సోమవారం రూ. 200 పెరిగిన వెండి ధర మంగళవారం (ఆగష్టు 6) రూ. ఏకంగా రూ. 3200 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 82500లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
Stock Market: బేర్ విశ్వరూపం
ముంబై: అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్ కరెన్సీ యెన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్ స్ట్రీట్ సోమవారం బేర్ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం. రోజంతా నష్టాల కడలిలో ... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఏకంగా 3% నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,394 పాయింట్ల నష్టంతో 78,588 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు క్షీణించి 24,303 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు సాహసించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కొట్టిమిట్టాడాయి. ఒకదశలో సెన్సెక్స్ 2,686 పా యింట్లు క్షీణించి 78,296 వద్ద, నిఫ్టీ 824 పాయింట్లు కుప్పకూలి 23,893 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. → బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. సరీ్వసెస్ సూచీ 4.6%, యుటిలిటీ 4.3%, రియల్టీ 4.2%, క్యాపిటల్ గూడ్స్ 4.1%, ఇండస్ట్రీయల్ 4%, విద్యుత్ 3.9%, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ 3.75% చొప్పున క్షీణించాయి. → సెన్సెక్స్ సూచీలో హెచ్‌యూఎల్(0.8%,) నెస్లే (0.61%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ఇందులో టాటా మోటార్స్ 7%, అదానీ పోర్ట్స్ 6%, టాటాస్టీల్ 5%, ఎస్బీఐ 4.50%, పవర్ గ్రిడ్ 4% షేర్లు అత్యధికంగా పడ్డాయి. → చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 4%, 3.6% చొప్పున క్షీణించాయి. → బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన మొత్తం 4,189 కంపెనీల షేర్లలో ఏకంగా 3,414 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. → రిలయన్స్ 3% పడి రూ. 2,895 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 4.50% పతనమై రూ.2,866 కనిష్టాన్ని తాకింది. మార్కెట్ క్యాప్ రూ. 70,195 కోట్లు ఆవిరై రూ. 19.58 లక్షల కోట్లకు తగ్గింది. → మార్కెట్లో ఒడిదుడుకులు సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 42.23 శాతం పెరిగి 20.37 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 61% ఎగసి 23.15 స్థాయిని తాకింది. లేమాన్ బ్రదర్స్, కోవిడ్ సంక్షోభాల తర్వాత ఈ సూచీ కిదే ఒక రోజులో అత్యధిక పెరుగుదల.2 రోజుల్లో రూ.19.78 లక్షల కోట్ల ఆవిరి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు హరించుకుపోయాయి. శుక్రవారం కోల్పోయిన రూ.4.46 లక్షల కోట్లను కలిపితే గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్లకు మొత్తం రూ.19.78 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ. 441.84 లక్షల కోట్లకు పడింది.84 దిగువకు రూపాయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టంఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ మారకంలో 37 పైసలు క్షీణించి 84 స్థాయి దిగువన 84.09 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 83.78 వద్ద మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, దలాల్ స్ట్రీట్ భారీ పతన ప్రభావంతో ఇంట్రాడే, జీవితకాల కనిష్టం 84.09 వద్ద స్థిరపడింది. ‘అమ్మో’రికా! ముసిరిన మాంద్యం భయాలు.. ఉద్యోగాల కోత.. హైరింగ్ తగ్గుముఖం.. మూడేళ్ల గరిష్టానికి నిరుద్యోగం.. 4.3%కి అప్ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల ఎఫెక్ట్... ఫెడ్ రేట్ల కోత సుదీర్ఘ వాయిదా ప్రభావం కూడాఅమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచమంతా తుమ్ముతుందనే నానుడిని నిజం చేస్తూ, ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్ తయారీ, నిర్మాణ రంగంలో బలహీనతకు గత వారాంతంలో విడుదలైన జాబ్ మార్కెట్ డేటా ఆజ్యం పోసింది. జూలైలో హైరింగ్ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్ తగ్గాయి. మరోపక్క, జూన్‌లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూలైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్‌తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కూడా అగ్గి రాజేసింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. వెరసి, గత శక్రవారం అమెరికా మార్కెట్లు కకావికలం అయ్యాయి. నాస్డాక్ 2.4% కుప్పకూలింది. డోజోన్స్ 1.5%, ఎస్అండ్పీ–500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించాయి. కాగా, గత నెలలో ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన నాస్డాక్ అక్కడి నుంచి 10% పైగా పతనమై కరెక్షన్లోకి జారింది. ఆసియా, యూరప్ బాటలోనే సోమవారం కూడా అమెరికా మార్కెట్లు 3–6% గ్యాప్ డౌన్‌తో మొదలై, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ స్టాక్స్.. ట్రిలియన్ డాలర్లు ఆవిరి రెండో త్రైమాసిక ఫలితాల నిరాశతో నాస్డాక్లో టాప్–7 టెక్ టైటాన్స్ (యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్వీడియా, టెస్లా, మెటా) షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. ఏఐపై భారీగా వెచి్చస్తున్న మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి కంపెనీలకు ఆశించిన ఫలితాలు రావడం లేదనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇక బలహీన ఆదాయంతో అమెజాన్ షేర్లు 10% క్రాష్ అయ్యాయి. ఫలితాల నిరాశతో ఇంటెల్ షేర్లు ఏకంగా 26% కుప్పకూలాయి. 1985 తర్వాత ఒకే రోజు ఇంతలా పతనమయ్యాయి. కంపెనీ ఏకంగా 15,000 మంది సిబ్బంది కోతను ప్రకటించడంతో జాబ్ మార్కెట్లో గగ్గోలు మొదలైంది. వెరసి, షేర్ల పతనంతో టాప్–7 టెక్ షేర్ల మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. కాగా, సోమవారం ఈ షేర్లు మరో 6–10% కుప్పకూలాయి. ఎకానమీ పరిస్థితి బయటికి కనిపిస్తున్న దానికంటే చాలా బలహీనంగా ఉందని సీఈఓలు సిగ్నల్స్ ఇస్తున్నారు. యుద్ధ సైరన్..: పశ్చిమాసియాలో హమాస్ చీఫ్ హనియేను ఇజ్రాయిల్ తుదముట్టించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించడంతో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేస్తోంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సద్దుమణగక ముందే మరో వార్ మొదలైతే క్రూడ్ ధర భగ్గుమంటుంది. బ్యారల్ 100 డాలర్లను దాటేసి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుంది. వెరసి ఎకానమీలు, మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్.. సునామీ అమెరికా దెబ్బతో ఆసియా, యూరప్ మార్కెట్లన్నీ సోమవారం కూడా కుప్పకూలాయి. జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 13.5 శాతం క్రాష్ అయింది. 1987 అక్టోబర్ 19 బ్లాక్ మండే (14.7% డౌన్) తర్వాత ఇదే అత్యంత ఘోర పతనం. నికాయ్ ఆల్ టైమ్ హై 42,000 పాయింట్ల నుంచి ఏకంగా 31,000 స్థాయికి దిగొచి్చంది. గత శుక్రవారం కూడా నికాయ్ 6% క్షీణించింది. ముఖ్యంగా జపాన్ యెన్ పతనం, ద్రవ్యోల్బణం 2% లక్ష్యంపైకి ఎగబాకడంతో అందరికీ భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు బాటలో వెళ్తోంది. గత బుధవారం కూడా రేట్ల పెంపు ప్రకటించింది. దీంతో డాలర్‌తో ఇటీవల 160 స్థాయికి చేరిన యెన్ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు పుట్టించింది. జపాన్, అమెరికా ఎఫెక్ట్ మన మార్కెట్ సహా ఆసియా, యూరప్ సూచీలను కుదిపేస్తోంది.ఫెడ్ రేట్ల కోతపైనే ఆశలు.. కరోనా విలయం తర్వాత రెండేళ్ల పాటు ఫెడ్ ఫండ్స్ రేటు 0–0.25% స్థాయిలోనే కొనసాగింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగబాకి, 2022 జూన్‌లో ఏకంగా 9.1 శాతానికి చేరడంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్ల పెంపును మొదలెట్టింది. 2023 జూలై నాటికి వేగంగా 5.25–5.5% స్థాయికి చేరి, అక్కడే కొనసాగుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం ఈ ఏడాది గతేడాది జూన్‌లో 3 శాతానికి దిగొచి్చంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో (క్యూ2) యూఎస్ జీడీపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ, ఫెడ్ మాత్రం రేట్ల కోతను సుదీర్ఘంగా వాయిదా వేస్తూ వస్తోంది. గత నెలఖర్లో జరిగిన పాలసీ భేటీలోనూ యథాతథ స్థితినే కొనసాగించింది. అయితే, తాజా గణాంకాల ప్రభావంతో సెప్టెంబర్‌లో పావు శాతం కాకుండా అర శాతం కోతను ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ రేట్ల కోత విషయంలో ఫెడ్ సుదీర్ఘ విరామం తీసుకుందని, దీనివల్ల ఎకానమీపై, జాబ్ మార్కెట్‌పై ప్రభావం పడుతోందనేది వారి అభిప్రాయం. అధిక రేట్ల ప్రభావంతో మాంద్యం వచ్చేందుకు 50% అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ అంటోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మార్కెట్ క్రాష్.. సెన్సెక్స్ 2,222 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్న బెంచ్ మార్క్ సూచీలు ఏమాత్రం కోలుకోలేపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో భారీ నష్టాల ప్రభావంతో భారతీయ మార్కెట్లు భారీగా వెనక్కి తగ్గాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 2,222.55 పాయింట్లు లేదా 2.74% క్షీణించి 78,759.40 వద్దకు పడిపోయింది. నిఫ్టీ కూడా 667.75 పాయింట్లు లేదా 2.70% శాతం నష్టపోయి 24,049.95 వద్దకు క్షీణించింది.రంగాలవారీగా అన్ని సూచీలు రెడ్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50లో టాటా మోటార్స్ టాప్ లూజర్‌గా ఉండగా, టాటా స్టీల్, మారుతీ, అదానీ పోర్ట్స్, ఎస్బిఐ మరియు జెఎస్డబ్ల్యు స్టీల్ భారీగా క్షీణించాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆర్థిక మాంద్యం భయాలు..రూ.8 లక్షల కోట్ల సంపద ఆవిరి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతుందనే భయాలు అధికమవుతున్నాయి. ఇటీవల గ్లోబల్‌గా స్టాక్‌మార్కెట్ ట్రెండ్ గమనిస్తే ఆ అనుమానం మరింత బలపడుతుంది. అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిన వడ్డీరేట్లు, తగ్గిన ఆర్థిక శక్తి వెరసి మాంద్యం భయాలు అధికమవుతున్నాయి. దాంతో ఇటీవల ప్రపంచ స్టాక్‌మార్కెట్లు భారీగా పడుతున్నాయి. అభివృద్ధి చెందిన అమెరికా మార్కెట్లకుతోడు యూరప్, ఆసియా మార్కెట్లు భారీగా క్షీణిస్తున్నాయి. మార్కెట్ సోమవారం(మధ్యాహ్నం 1:21 వరకు) నిఫ్టీ దాదాపు 713 పాయింట్లు, సెన్సెక్స్ అయితే ఏకంగా 2300 పాయింట్లు పడిపోయింది. అంటే సుమారు రూ.8 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.మాంద్యంలోకి జపాన్..జపాన్ ఆర్థిక వృద్ధి రేటు 2023 చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్ మధ్య)లో 0.4%, అంతకుముందు జులై–సెప్టెంబర్‌లో 2.9%, 2024 మొదటి త్రైమాసికంలో 0.5 శాతం క్షీణించింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మందగిస్తే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని గుర్తుగా భావిస్తారు. దీంతోపాటు, జపాన్ కరెన్సీ యెన్ కూడా బలహీనపడింది. ఫలితంగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న జపాన్ క్రమంగా దాని స్థానాన్ని కోల్పోతోంది.బ్రిటన్‌లో ఇలా..పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం బ్రిటన్ను కలవరపెడుతున్నాయి. దేశం మాంద్యంలోకి వెళ్లిపోతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధికమవుతున్న నిరుద్యోగం కారణంగా బ్రిటన్ ఇప్పటికే మాంద్యంలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ గతంలో నివేదించింది. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 0.1 శాతం పడిపోయింది. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం 4.7 శాతం ఉండగా 2026 నాటికి ఇది 5.1 శాతానికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది.ఆర్థిక సంక్షోభంలో చైనా..చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిందనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే విపరీతమైన నిరుద్యోగం ఉంది. ఇటువంటి పరిస్థితిలో చైనా నేపాల్ నుంచి శ్రీలంక వరకు తన ఉనికిని విస్తరిస్తోంది. ఇందుకు ఆర్థిక సహకారాన్ని అందించడమే కాకుండా, తన ప్రత్యర్థి అమెరికా వైపు స్నేహాన్ని నటిస్తోంది. చైనా ప్రాపర్టీ రంగంలో భారీగా క్షీణించింది. మీడియా నివేదికల ప్రకారం దేశంలో కోట్లాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చైనా నేషనల్ బ్యూరో ఆప్ స్టాటిస్టిక్స్(ఎన్బీఎస్) సీనియర్ అధికారి హె కెంగ్ గతంలో తెలిపారు. ఈ సంఖ్య ఎంత ఉందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరని, కానీ ఈ ఇళ్లలో కోట్ల మంది ప్రజలు నివసించవచ్చన్నారు. చైనాలోని డాంగ్-గ్వాన్ అనే నగరంలో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య కోట్లుల్లో ఉందని కెంగ్ తెలిపారు. ఎన్బీఎస్-చైనా గతంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 64.8 కోట్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. ప్రాజెక్టులు పూర్తయినా, వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేదు.ఇదీ చదవండి: రూ.652 కోట్లతో మొండి బాకీల కొనుగోలు!మన మార్కెట్లపై ప్రభావం ఎంతంటే..భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా గుర్తింపు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలను నిరుద్యోగం, శ్రామికశక్తి, వనరులు, ముడిసరుకులు..వంటి ఎదోఒక సమస్య ప్రధానంగా వెంటాడుతోంది. అయితే భారత్‌లో ఇలాంటి సమస్యలున్నా వాటి ప్రభావం చాలా తక్కువ. ఇది ఇండియా ఆర్థిక వృద్ధికి బలం చేకూరుస్తోంది. తాత్కాలికంగా దేశీయ మార్కెట్లు పడినా దీర్ఘకాలికంగా రెట్టింపు లాభాలను తీసుకొస్తాయి. ఇలా మార్కెట్లు పడిన ప్రతిసారి మదుపర్లు నష్టాలను పట్టించుకోకుండా మంచి కంపెనీలను ఎంచుకుని పెట్టుబడిని కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ జీడీపీ మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతం వృద్ధి నమోదు చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 8.2 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
శ్రావణమాసం.. అక్కడ మాత్రమే పెరిగిన బంగారం ధరలు
ఆషాడం ముగిసింది.. శ్రావణ మాసం వచ్చేసింది. ఇక బంగారం పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. దీంతో నిన్నటి ధరలే ఈ రోజు కొనసాగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు (ఆగష్టు 5) బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.చెన్నైలో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 200 (22 క్యారెట్స్), రూ. 220 (24 క్యారెట్స్) పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 కాగా, 24 క్యారెట్స్ తులం పసిడి ధర రూ. 70580 వద్దకు చేరాయి.దేశ రాజధాని నగరంలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64850 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70730 వద్ద ఉంది.వెండి ధరలుదేశంలోని కొన్ని ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. ఆదివారం స్థిరంగా ఉన్న సిల్వర్ సోమవారం రూ. 200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 85,700లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న పసిడి ధరలు ఆదివారం (ఆగష్టు 4)న స్థిరంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.👉విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.👉చెన్నైలో కూడా పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64500 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 70360 వద్ద ఉన్నాయి.👉దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64850 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70730 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం మాదిరిగానే దేశంలో వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. శనివారం గరిష్టంగా రూ. 1700 తగ్గింది. అయితే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి కేజీ వెండి ధర రూ. 85500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
తులం బంగారం కేవలం రూ.63.. మరి ఇప్పుడో..!
భారతదేశంలో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నేడు ఒక తులా బంగారం కొనాలంటే రూ. 70వేలుకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. అయితే 1964 లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 63.25 రూపాయలు మాత్రమే. 60ఏళ్ళల్లో బంగారం ధరలు గణనీయంగా పెరగటానికి కారణం ఏమి? రాబోయే రోజుల్లో పసిడి ధరలు తగ్గే అవకాశం ఏమైనా ఉందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.బంగారం ధర పెరగటానికి కారణంబంగారం ధరలు 1964తో పోలిస్తే 2024లో వెయ్యి రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. దీనికి కారణం దేశంలో బంగారం కొనేవారి సంఖ్య ఎక్కువ కావడం, నిల్వలు తగ్గడం అని తెలుస్తోంది. భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగల వంటి శుభకార్యాలకు బంగారం ఎక్కువగా ధరిస్తారు. దీంతో పసిడికి డిమాండ్ భారీగా పెరిగింది.బంగారం ధరలు పెరగటానికి, తగ్గటానికి మార్కెట్ ప్రభావం కూడా కారణం. రాజకీయ అంశాలు, ప్రభుత్వ విధానాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, కోవిడ్ 19 వ్యాప్తి, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా బంగారం పెరిగాయి.గతంలో బంగారాన్ని ఆభరణాలుగా మాత్రమే ఉపయోగించేవారు, కానీ నేడు గోల్డ్ అంటే ఒక ఆస్తిగా భావిస్తున్నారు. దీంతో దీనిపైన చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. క్లిష్ట పరిస్థితులలో ఆర్థిక సంక్షోభం నుంచి బంగారం కొంత ఉపశమనం కలిగిస్తుందని భావించి చాలామంది బంగారం కోనేస్తుంటారు.రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా?బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తగ్గుతున్న బంగారం ధరలు మరికొన్ని రోజుల్లో భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే బంగారం కొనుగులు చేయడానికి సన్నద్ధమవ్వాలని, రాబోయే రోజులు ఇది మంచి లాభాలను తెచ్చిపెడుతుందని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు జతీన్ త్రివేది అన్నారు.1964 నుంచి 2024 వరకు బంగారం ధరలు»1964: రూ.63.25»1966: రూ.83.75»1974: రూ.506.00»1979: రూ.937.00»1980: రూ.1,330.00»1985: రూ.2,130.00»1988: రూ.3,130.00»1992: రూ.4,334.00»2003: రూ.5,600.00»2005: రూ.7,000.00»2007: రూ.10,800.00»2008: రూ.12,500.00»2010: రూ.18,500.00»2020: రూ.48,651.00»2023: రూ.65,330.00»2024: రూ.71,510.00 -
నిరసనకు సిద్ధమైన సెబీ ఉద్యోగులు!
భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిరసన సెగ ఎదుర్కోబోతోంది. సంస్థలో ఏ, బీ, సీ గ్రేడ్లలో పనిచేసే సుమారు 700 మంది ఉద్యోగులు సోమవారం ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయం, సెబీ భవన్ వన్ వద్ద నిరసనకు సిద్ధమైనట్లు ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదించింది.సంస్థ నాయకత్వంపై గత రెండున్నర సంవత్సరాలుగా ఉద్యోగులలో పెరుగుతున్న అసంతృప్తే ఈ నిరసనకు కారణంగా తెలుస్తోంది. ఇక నిరసనకు ఆజ్యం పోసిన ప్రధాన అంశాలు మరికొన్ని ఉన్నాయి. సెబీ అందిస్తున్న అలవెన్సులు, ఆర్బీఐ అధికారులకు అందించే వాటి స్థాయిలో లేవనే అసంతృప్తి సెబీ అధికారుల్లో ఉంది.దీంతోపాటు కీ రిజల్ట్ ఏరియాస్ (KRA) అప్లోడ్ చేయడానికి ప్రవేశపెట్టిన కొత్త సిస్టమ్‌తో కొంత మందికి అలవెన్స్‌లు ఆగిపోయే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల అసంతృప్తులను చల్లార్చేందుకు క్షమాపణలు కోరుతూ సెబీ నాయకత్వం ఈమెయిల్ పంపినప్పటికీ ఉద్యోగులు నిరసనను విరమించుకోలేదని తెలిసింది. -
తగ్గిన బంగారం, వెండి: ఎంతంటే?
మూడు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు శనివారం (ఆగష్టు 3) స్వల్పంగా తగ్గాయి. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూసేద్దాం.విజయవాడ, హైదరాబాద్‌లలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 64700 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 70580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 మాత్రమే తగ్గింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా ఉన్నాయి.చెన్నైలో పసిడి ధరలు నేడు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64500 కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ పసిడి ధర రూ. 70360 వద్ద ఉన్నాయి.దేశ రాజధాని నగరంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. దీంతో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 64850 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70730 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 100 తగ్గింది.వెండి ధరలుబంగారం మాదిరిగానే దేశంలో వెండి ధరలు కూడా టగ్గాయి. శుక్రవారం రూ. 100 పెరిగిన వెండి ధర శనివారం (ఆగష్టు 3) గరిష్టంగా రూ. 1700 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 85500కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
గోల్డ్ బాండ్స్.. లక్కీ చాన్స్!
ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. బడ్జెట్లో మోదీ సర్కారు బంగారంపై గురి పెట్టింది. అనూహ్యంగా దిగుమతి సుంకాన్ని సగానికిపైగా తగ్గించడంతో కొత్తగా సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ)లో పెట్టుబడి పెట్టేవారికి ధర భారీగా దిగొచి్చంది. మరోపక్క, పాత బాండ్ల చెల్లింపులపై (రిడెంప్షన్లు) భారాన్ని కూడా ప్రభుత్వం తగ్గించుకుంటోంది. తాజా నిర్ణయంతో గోల్డ్ బాండ్ స్కీమ్ మరింత ఆకర్షణీయంగా మారుతుందంటున్నారు విశ్లేషకులు!బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ఈ ఏడాది బడ్జెట్లో 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా రూ. 5,000 మేర పడిపోయాయి. దీంతో గత కొద్ది రోజులుగా బంగారం షాపులు కళకళలాడిపోతున్నాయి. మళ్లీ ధర పెరిగిపోతుందేమోనన్న ఆత్రుతతో పసిడి ప్రియులు ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా పుత్తడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో డిమాండ్ పుంజుకుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. ధర భారీగా తగ్గడం వల్ల ఈ ఆరి్థక సంవత్సరంలో కొత్తగా విడుదల చేసే గోల్డ్ బాండ్లకు కూడా గిరాకీ ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో భౌతిక రూపంలో బంగారం డిమాండ్‌ను తగ్గించడంతో పాటు ప్రజల పొదుపు మొత్తాలను పసిడిలోకి కాకుండా ఆరి్థకపరమైన సాధనాల్లోకి మళ్లించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015లో గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా వీటి ద్వారా ప్రభుత్వం రూ. 72,274 కోట్ల నిధులను సమీకరించింది. అప్పట్లో గ్రాము రూ.3,100... 2015 నుంచి 2017 వరకు మూడేళ్లలో జారీ చేసిన గోల్డ్ బాండ్లకు గ్రాము రేటు రూ.3,100 నుంచి రూ.3,500 స్థాయిలో ఉంది. తాజా బడ్జెట్‌కు ముందు గ్రాము మేలిమి బంగారం ధర రూ.7,200 పలికింది. గోల్డ్ బాండ్ గడువు వ్యవధి (మెచ్యూరిటీ) 8 ఏళ్లు. అంటే, గతంలో జారీ చేసిన బాండ్ల గడువు తీరుతుండటంతో ఇప్పుడు ప్రభుత్వం తిరిగి చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. రేటు రెట్టింపునకు పైగా పెరిగిపోవడంతో ప్రభుత్వ ఖజానాపై భారం కూడా భారీగా ఉంటుంది. దిగుమతి సుంకం తగ్గింపుతో ఒక్కో గ్రాముపై రేటు భారీగా దిగొ చ్చింది. అంతర్జాతీయంగా పసిడి ధరల ట్రెండ్ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే, బాండ్ రిడెంప్షన్లపై సర్కారు చెల్లింపులు తగ్గుతాయి. 130 శాతం రాబడి... గోల్డ్ బాండ్ల గడువు తీరిన తర్వాత, రిడెంప్షన్ తేదీకి ముందు 24 క్యారెట్ల బంగారం 3 రోజుల సగటు ధర ప్రకారం రూపాయిల్లో చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ బాండ్ స్కీమ్ కింద ఎనిమిదేళ్ల క్రితం 2016 ఆగస్ట్‌లో జారీ చేసిన సిరీస్–1 బాండ్ల గడువు ఈ నెలలోనే ముగుస్తుంది. అప్పట్లో ఒక్కో గ్రాముకు రూ.3,119 చొప్పున ఇన్వెస్టర్లు చెల్లించారు. దీనికి వార్షికంగా 2.75 శాతం వడ్డీ కూడా జమవుతుంది (ప్రస్తుతం వడ్డీ 2.5 శాతంగా ఉంది). తాజా రేటు ప్రకారం రూ. 6,900–7,000 స్థాయిలో రిడెంప్షన్ ధర ఉండొచ్చని అంచనా. దీని ప్రకారం చూస్తే, వడ్డీ కూడా కలిపితే ఇన్వెస్టర్లకు 130 శాతం లాభాలు వస్తున్నట్లు లెక్క. అయితే, ప్రభుత్వ గ్యారంటీ ఉండటం, వార్షికంగా 12–13 శాతం రాబడులు పక్కాగా లభిస్తుండటంతో గోల్డ్ బాండ్లకు వన్నె తగ్గదని నిపుణులు అంటున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్సెప్టెంబర్లో మరో విడత! బడ్జెట్లో సుంకం కోత నిర్ణయం నేపథ్యంలో తాజా గోల్డ్ బాండ్ల జారీని ప్రభుత్వం వాయిదా వేస్తూ వచి్చంది. చివరిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్జీబీలను జారీ చేశారు. గత రెండు ఆరి్థక సంవత్సరాల్లో ఏటా నాలుగు సార్లు చొప్పున ఎస్జీబీలను కేంద్రం అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి విడత బాండ్లను సెపె్టంబర్లో జారీ చేయొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నారు. గ్రాము ధర ప్రస్తుత ట్రెండ్ ప్రకారం రూ. 7,000కు అటుఇటుగా నిర్ణయించే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్ల నుంచి భారీ గా డిమాండ్ ఉంటుందని రిద్దిసిద్ధి బులియన్స్ ఎండీ పృధ్విరాజ్ కొఠారి అభిప్రాయపడ్డారు. ఈ ఆరి్థక సంవత్సరంలో మూడు విడతల్లో బాండ్ల జారీ ఉంటుందని అంచనా. తద్వారా ప్రభుత్వం రూ.18,500 కోట్లను సమీకరించే అవకాశం ఉంది. అమెరికాలో వడ్డీరేట్ల కోత సంకేతాలు, భౌగోళిక–రాజకీయ ఉద్రికతలతో అంతర్జాతీయంగా బంగారం ధరలు మరింత ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. -
వేగంగా అనుమతులు
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లకు అనుమతులను వేగవంతం చేసే దిశగా కొత్త విధానంపై పనిచేస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. ముందుగా రూపొందించిన టెంప్లేట్‌లోని ఖాళీలను నింపడం ద్వారా కంపెనీలు ఐపీవో పత్రాలను సులభంగా సమరి్పంచొచ్చని చెప్పారు. అలాగే, కంపెనీలు సమరి్పంచిన ఐపీవో పత్రాలను వేగంగా తనిఖీ చేసేందుకు కృత్రిమ మేథ ఆధారిత టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ నాటికి దీన్ని సిద్ధం చేస్తామన్నారు. ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ఐపీవో ప్రక్రియను వేగవంతం చేయడం తన ముందున్న కీలక లక్ష్యంగా పేర్కొన్నారు. ఎనిమిది ఐపీవో దరఖాస్తుల అనుమతులకు గరిష్ట గడువు అయిన మూడు నెలలు దాటినట్టు వివరించారు. న్యాయపరమైన జోక్యం, నిబంధనల అమలు లేమిని కారణాలుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఐపీవో విషయంలో సంక్లిష్ట ముసాయిదా పత్రాల దాఖలు ప్రకియ ఉన్నట్టు చెప్పారు. దీన్ని సులభతరం చేసేందుకు టెంప్లేట్‌ను తీసుకొస్తామన్నారు. ఈ విధానంలో కేవలం ఖాళీలు నింపడం ద్వారా ఐపీవో డాక్యుమెంట్‌ను సిద్ధం చేసుకోవచ్చని చెప్పారు. నిరి్ధష్ట అంశాల్లో వైరుధ్యాలను, సంక్లిష్టతలను వివరించేందుకు ప్రత్యేక కాలమ్ ఉంటుందన్నారు. కాకపోతే కొత్త విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్నది ప్రకటించలేదు. రైట్స్, ప్రిఫరెన్షియల్కూ కొత్త విధానంలిస్టెడ్ కంపెనీలు సైతం వేగంగా నిధులు సమీకరించేందుకు కొత్త విధానంపై సెబీ కసరత్తు చేస్తోంది. రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కలయికతో ఇది ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 42 రోజుల సమయం తీసుకుంటుండగా, 23 రోజులకు తగ్గించనున్నట్టు సెబీ చైర్పర్సన్ తెలిపారు. సెబీ అనుమతులు, మర్చంట్ బ్యాంకర్ల అవసరాన్ని తొలగించనున్నట్టు, నిధుల సమీకరణకు సంబంధించి కేవలం రెండు పేజీల డాక్యుమెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. దీనివల్ల మర్చంట్ బ్యాంకర్ల ఫీజుల బెడద తొలగిపోతుందన్నారు. ఈ ఆవిష్కరణను అమల్లోకి తీసుకురావడానికి ముందు సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఐపీవో పత్రాలు వెనక్కి.. మర్చంట్ బ్యాంకర్లకు వైపు నుంచి ప్రయోజనాల వైరుధ్యం, డైరెక్టర్లు మోసాల్లో నిందితులుగా ఉన్నప్పుడు, ఇష్యూకి సంబంధించి ఉద్దేశ్యాలు స్పష్టంగా లేనప్పుడు ఐపీవో పత్రాలను వెనక్కి తిప్పి పంపాలని సెబీ నిర్ణయించినట్టు మాధవి పురి బుచ్ తెలిపారు. నష్టాల్లోని కంపెనీలు లిస్ట్ అయ్యే విషయంలో వెల్లడించాల్సిన సమాచారాన్ని క్రమబదీ్ధకరించడంపైనా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు నెలలో పరిష్కారాలను తీసుకొస్తామన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (ఇని్వట్‌లు), రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లు (రిట్లు) పనితీరు పోల్చి చూసుకునేందుకు వీలుగా బెంచ్‌మార్క్ ఏజెన్సీని రూపొందిస్తున్నట్టు తెలిపారు.గ్యారంటీ హామీలతో జాగ్రత్త ఇన్వెస్టర్లకు హెచ్చరిక కాగా రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ తరఫున ఓ అ«దీకృత వ్యక్తి ఇస్తున్న హామీపూర్వక రిటర్నుల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరించాలని ఇన్వెస్టర్లకు నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. ‘‘మా రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ ఒకరికి సంబంధించి అ«దీకృత వ్యక్తి అమిత్ లిహారే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై గ్యారంటీ రాబడులను ఆఫర్ చేస్తున్నట్టు మా దృష్టికి వచి్చంది. ఈ తరహా హామీపూర్వక రాబడులపై కమీషన్లను సైతం తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంటున్నట్టు తెలిసింది’’అని సెబీ తెలిపింది. సంబంధిత ట్రేడింగ్ సభ్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. భారీ రాబడులు ఇస్తామంటూ హామీలు గుప్పించే గుర్తింపు లేని సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించడం గమనార్హం. -
మార్కెట్‌కు మాంద్యం భయం
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు శుక్రవారం ఒకశాతం మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 886 పాయింట్లు క్షీణించి 81 వేల దిగువన 80,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 293 పాయింట్లు పతనమై 25వేల స్థాయిని కోల్పోయి 24,718 వద్ద నిలిచింది. ఇటీవల వెల్లడైన దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం, దలాల్ స్ట్రీట్ వరుస రికార్డు ర్యాలీతో అధిక వాల్యుయేషన్ల ఆందోళన పరిణామాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణ వైపు పురిగొల్పాయి. ఒక దశలో సెన్సెక్స్ 999 పాయింట్లు క్షీణించి 80,869 వద్ద, నిఫ్టీ 324 పాయింట్లు కుప్పకూలి 24,686 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. రియలీ్ట, మెటల్, ఆటో, ఐటీ, కమోడిటీ, టెక్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల భారీ పతనంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.58% 1.19 శాతం నష్టపోయాయి. సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.4.46 కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలోని మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.457 లక్షల కోట్లకు దిగివచి్చంది.ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం అమెరికాలో జూలై తయారీ రంగ పీఎంఐ, ఉద్యోగ ఉద్యోగ కల్పన గణాంకాలు నిరాశపరచడంతో ఆర్థిక మాంద్య భయాలు తలెత్తాయి. అలాగే ఫెడరల్ రిజర్వ్ సెపె్టంబర్లో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలను బలహీనపరిచింది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలైన టెస్లా, ఆల్ఫాబెట్, ఎన్విడీయా, మైక్రోసాఫ్ట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు అంచనాలకు అందుకోలేకపోవడం ఆగ్నికి ఆజ్యం పోశాయి. నాస్డాక్ 3% క్షీణించి 16,683 వద్ద ట్రేడవుతోంది. టెక్ కంపెనీల షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ సూచీ జూలై 10న జీవితకాల గరిష్టం (18,671) నుంచి ఏకంగా 10%పైగా కుప్పకూలింది. డోజోన్స్ ఇండెక్స్ 2.5% నష్టపోయి 39,430 వద్ద కదలాడుతోంది. అమెరికా మార్కెట్ల నష్టాల ప్రభావంతో ఆసియా, యూరప్ మార్కెట్లూ డీలా పడ్డాయి. బ్యాంక్ ఆఫ్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో జపాన్ సూచీ నికాయ్ 6% క్షీణించింది. తైవాన్ ఇండెక్స్ 5%, కోప్సీ సూచీ 4%, హాంగ్‌కాంగ్ సూచీ 2% కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలతో చైనా షాంఘై సూచీ ఒకశాతం నష్టపోయింది. ఇక మధ్య ప్రాచ్యంలో విస్తరిస్తున్న యుద్ధ భయాలతో యూరప్ మార్కెట్లూ 2.50% నుంచి రెండుశాతం పైగా నష్టపోయాయి. -
15 వేల మంది తొలగింపు ప్రకటన.. షేర్లు భారీ పతనం
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పోరేషన్ భారీగా నష్టపోయింది. భారీ వృద్ధి అంచనాతో 15,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆ కంపెనీ షేర్లు 40 సంవత్సరాలలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి.శుక్రవారం న్యూయార్క్‌లో ట్రేడింగ్ ప్రారంభించిన తర్వాత షేర్లు 26% పైగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 32 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం, కనీసం 1982 నుంచి కంపెనీ స్టాక్ అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని ఇది సూచిస్తోంది.ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాలు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లుగా ఉంటాయని కంపెనీ గురువారం తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం విశ్లేషకులు సగటున 14.38 బిలియన్ డాలర్లు అంచనా వేశారు. కానీ ఇంటెల్ ఒక్కో షేరు 3 సెంట్ల చొప్పున నష్టపోయాయి. ఇంటెల్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 15% మందికిపైగా తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇంటెల్ తాజాగా తెలిపింది.