Personal Finance
-
అదానీ వారి క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్!
అదానీ గ్రూప్‌కు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అదానీ వన్ (Adani One).. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి ఎయిర్పోర్ట్ -లింక్డ్ ప్రయోజనాలతో దేశీయ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టింది. అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్, అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అనే రెండు ఆప్షన్లలో ఈ క్రెడిట్ కార్డు అందుబాటులో ఉంది.ఫీజు వివరాలుఅదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు వార్షిక ఛార్జీ రూ .5,000. దీనికి జాయినింగ్ బెనిఫిట్స్ రూ .9,000 ఉంటాయి. అలాగే అదానీ వన్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డు వార్షిక ధర రూ .750 కాగా జాయినింగ్ బెనిఫిట్స్ రూ .5,000.ప్రయోజనాలు (అపరిమిత అదానీ రివార్డు పాయింట్లు)అదానీ వన్, విమానాశ్రయాలు, గ్యాస్, విద్యుత్, ట్రైన్‌మ్యాన్ సహా అదానీ సంస్థలలో 7 శాతం వరకు తగ్గింపు.ఇతర స్థానిక, విదేశీ ఖర్చులపై 2 శాతం వరకు తగ్గింపుఎయిర్పోర్ట్ బెనిఫిట్స్ ప్రీమియం లాంజ్ లతో సహా దేశీయ లాంజ్ లకు సంవత్సరానికి 16 వరకు యాక్సెస్లుసంవత్సరానికి రెండు వరకు ఇంటర్నేషనల్ లాంజ్ విజిట్లు8 వరకు వాలెట్, ప్రీమియం ఆటోమొబైల్ పార్కింగ్ స్థలాలకు యాక్సెస్లుఇతర ప్రయోజనాలువిమానాలు, హోటళ్లు, విహార యాత్రలకు కూపన్లతో సహా రూ.9,000 వరకు వెల్మమ్ బెనిఫిట్.సినిమా టిక్కెట్లు ఒకటి కొంటే ఒకటి ఉచితం1 శాతం ఇంధన సర్ ఛార్జీ రద్దుఅదానీ వన్ రివార్డ్స్ అల్ట్రా లాయల్టీ స్కీమ్ కు ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ -
మహిళలకు శుభవార్త.. బ్యాంకుల్లో ప్రత్యేక స్కీమ్స్!
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) మహిళల కోసం, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ ఫౌండర్ల కోసం త్వరలోనే ప్రత్యేక ఆర్థిక పథకాలను ప్రారంభించనున్నాయి.ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ (ఈఎస్ఈ 7.0) సంస్కరణల ఎజెండాలో భాగంగా మహిళా కస్టమర్లకు మద్దతు ఇచ్చే వ్యూహాన్ని రూపొందించాలని ఆర్థిక సేవల విభాగం బ్యాంకులను కోరినట్లు ‘లైవ్ మింట్’ కథనం పేర్కొంది. ఈఎస్ఈ 7.0 రిస్క్‌ను అంచనా వేయడం, నిరర్థక ఆస్తుల నిర్వహణ, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై దృష్టి పెడుతుంది.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 31.2 కోట్ల మంది మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు వేశారని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏకు ఎక్కువ మంది మహిళలు ఓటేశారని సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ప్రత్యేక పథకాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది.మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక బ్యాంకింగ్ సేవలు, తమ వెంచర్లకు ఆర్థిక సహాయం కోరుకునే వారికి 'లోన్ మేళాలు' వంటివి తాజా ఈఎస్ఈ సంస్కరణల్లో ఉన్నాయి. మహిళా వ్యవస్థాపకులను స్టార్టప్ ఇంక్యుబేటర్లతో అనుసంధానం చేసి వారి వెంచర్లను విస్తరించడానికి సహాయపడే కార్యక్రమాలను కూడా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా నిర్వహించున్నారు. అయితే ఆర్థిక శాఖ నుంచి దీనిపై స్పందన రాలేదు. -
ఈపీఎఫ్ అకౌంట్లో తప్పులున్నాయా? ఇలా సులభంగా మార్చుకోండి..
సాధారణంగా ఉద్యోగం చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ అకౌంట్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. గతంలో ఉద్యోగులు తమ జాయింట్ డిక్లరేషన్ ఫారంను నింపి, దానిని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఏవైనా మార్పులు చేసుకోవాలనుంటే.. ఫిజికల్ ఫారమ్‌తో పనిలేకుండా.. ఆన్లైన్లో మార్చుకోవచ్చు. ఈ కథనంలో ఈపీఎఫ్ చందాదారులు ఆన్లైన్లో తమకు చెందిన 11 వ్యక్తిగత వివరాలను ఎలా మార్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఆన్లైన్లో మార్చుకోగలిన 11 వ్యక్తిగత వివరాలుపేరుజెండర్పుట్టిన తేదీతండ్రి / తల్లి పేరురిలేషన్షిప్వైవాహిక స్థితిజాయినింగ్ డేట్రీజన్ ఫర్ క్విట్టింగ్ డేట్ ఆఫ్ క్విట్టింగ్నేషనాలిటీఆధార్ఆన్లైన్లో ఎలా మార్చుకోవాలంటే?👉ఉద్యోగి ముందుగా ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్సైట్ ఓపెన్ చేయాలి👉హోమ్ పేజీలో మొదట కనిపించే 'సర్వీస్' ట్యాబ్ మీద క్లిక్ చేసిన తరువాత 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఆ తరువాత సర్వీస్ సెక్షన్ కింద కనిపించే 'మెంబర్ యూఏఎన్ / ఆన్లైన్ సర్వీస్' ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి.👉ఆలా క్లిక్ చేయగానే మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.👉కొత్త పేజీలో కుడివైపు కనిపించే బాక్సులలో 'యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా' వంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 👉ఇవన్నీ పూర్తి చేసిన తరువాత అసలైన ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది.👉ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అయినా తరువాత స్క్రీన్ మీద కనిపించే.. 'మేనేజ్' ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ మెంబర్ ఐడీ ఎంటర్ చేసిన తరువాత.. ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. వాటిని ఎంటర్ చేసుకోవాలి.👉అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.👉అన్ని సరిగ్గా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తరువాత రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుంది. ఆ తరువాత వివరాలు మీకు అందుతాయి.ఎంప్లాయర్ చేయాల్సింది..👉ఎంప్లాయ్ వివరాలను అందుకున్న తరువాత ఎంప్లాయర్.. ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్సైట్లో ఎంప్లాయర్ ఐడీతో ఎంటర్ అవ్వాలి. 👉మెంబర్ ట్యాబ్ మీద క్లిక్ చేసి.. జాయింట్ డిక్లరేషన్ చేంజ్ రిక్వెస్ట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఉద్యోగి అభ్యర్థను చెక్ చేసిన తరువాత ఎంప్లాయర్ అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు.👉ఎంప్లాయర్ ఉద్యోగి రిక్వెస్ట్ అంగీకరిస్తే.. అది ఈపీఎఫ్ఓకు చేరుతుంది. -
బ్యాంకు ఖాతాలో డబ్బు లేకపోయినా యూపీఐ చెల్లింపులు..!
బ్యాంకు ఖాతాలో డబ్బులుంటేనే యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. కానీ అకౌంట్లో నగదు లేకపోయినా చెల్లింపులు చేసే విధానాన్ని ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘యూపీఐనౌ పే లేటర్’ ద్వారా బ్యాంకులు ముందుగా మంజూరు చేసిన క్రెడిట్ లైన్ నుంచి డబ్బు ఖర్చు చేసే అవకాశాన్ని కల్పించింది.సాధారణంగా డెబిట్ కార్డు ద్వారా బ్యాంకు ఖాతాను యూపీఐ యాప్‌లకు లింక్ చేసి లావాదేవీలు చేస్తుంటాం. యూపీఐనౌ పే లేటర్ ప్రకారం ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌ని యూపీఐకి జత చేసుకునే వీలుంది. అసలు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అంటే ఏమిటి? దీన్ని ఉపయోగిస్తే వడ్డీ కట్టాలా..? వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్బ్యాంకులు ముందుగానే మంజూరు చేసే రుణ సౌకర్యాన్ని ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్ అంటారు. దీన్నే ప్రీ శాంక్షన్డ్ రుణాలు అని పిలుస్తారు. ఇది బ్యాంకులు కల్పించే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం వంటిదే. గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ అప్లికేషన్ల ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ క్రెడిట్ లైన్‌ను అందించటానికి బ్యాంకులు ముందుగా వినియోగదారుల అనుమతి తీసుకుంటాయి. బ్యాంకులు ఆమోదించిన తర్వాత యూపీఐ ద్వారా ఆ డబ్బును ఖర్చు చేయొచ్చు. ఈ డబ్బు వినియోగంపై నిర్దిష్ట పరిమితి ఉంటుంది. నిర్దేశించిన గడువులోపు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు క్రెడిట్ లైన్ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తే మరికొన్ని మాత్రం వడ్డీ వసూలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐఛార్జీలు ఎలా ఉంటాయి..?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన తర్వాత చాలా బ్యాంకులు తమ యూజర్లకు క్రెడిట్ లైన్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. క్రెడిట్ పరిమితి, క్రెడిట్ వ్యవధి, వడ్డీ రేటు వంటివి బ్యాంకులను బట్టి మారుతూంటాయి. ఉదాహరణకు..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ కస్టమర్‌కు రూ.50వేల క్రెడిట్ పరిమితిని అందిస్తోందనుకుందాం. సదరు కస్టమర్ క్రెడిట్ లైన్ నుంచి 10 రోజులకు గాను రూ.5వేలు ఖర్చు చేశారనుకుందాం. తీసుకున్న ఆ సొమ్ముకు గానూ బ్యాంకు సాధారణ వడ్డీ వసూలు చేస్తుంది. డబ్బువాడుకున్న రోజులకు గానూ వడ్డీని లెక్కించి ప్రీ-అప్రూవ్డ్ ఖాతా నుంచి కట్ చేసుకుంటుంది. అలా తీసుకున్న మొత్తం, వడ్డీ మొత్తాన్ని నెలాఖరులో చెల్లించాలి. -
జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐ
ఆధార్‌కార్డులోని వ్యక్తిగత వివరాలను జూన్ 14 లోపు అప్డేట్ చేయకపోతే కార్డు పని చేయదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (యూఐడీఏఐ) స్పష్టతనిచ్చింది. అలా వస్తున్న వార్తలను నమ్మకూడదని చెప్పింది.ఆధార్‌లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ 14 గడువు విధించినట్లు చెప్పింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు మార్చుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది.ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు ఉడాయ్ గతంలో 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని రెండుసార్లు పొడిగించి చివరగా జూన్ 14 గడువు విధించింది. ఆలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.ఉడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కూడా ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా తాజా గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్, పాన్/ఇ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది. -
పెరిగిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?
ఈక్విటీమార్కెట్లు మంగళవారం భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. స్థిరప్రభుత్వం ఏర్పడదేమోననే భయాలు మార్కెట్లను కుంగదీశాయి. దాంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీమార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు బంగారం ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,800 (22 క్యారెట్స్), రూ.72,870 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.700, రూ.760 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.790, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.860 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,450 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,580 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,950.. 24 క్యారెట్ల ధర రూ.73,020కు చేరాయి. మార్కెట్లో కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగి రూ.98,500కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఐటీఆర్ దాఖలు చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి
గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్) చేసే సమయం దగ్గర పడింది. జులై 31లోపు ఐటీఆర్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చివరి వరకు వేచిచూడకుండా ఆలోపే పూర్తి వివరాలతో రిటర్నులు దాఖలు చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలనే సందేహంతో ఉన్నారు. కొన్ని అంశాలు పాటించడం ద్వారా ఏ పద్ధతి ఎవరికి అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు.ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఎన్నో మార్పులు చేస్తోంది. ముందుగానే నింపిన ఐటీఆర్ ఫారం అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020 నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త పన్ను విధానం పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటును కల్పించింది. అయినప్పటికీ మొదటిసారి ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారికీ, పాతవారికీ కొంత ఆందోళన ఉండటం సహజమే. అయితే దీన్ని అధిగమించాలంటే కొన్ని అంశాలపై అవగాహన అవసరం.ఆదాయంఆర్థిక సంవత్సరం 2023-24లో రిటర్న్‌లు దాఖలు చేసేవారి మొత్తం ఆదాయం ఎంతనే విషయంలో స్పష్టత ఉండాలి. వేతనం ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం, ప్రయోజనాలు, వడ్డీ, డివిడెండ్లు ఇతర ఆదాయాలన్నింటినీ లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు మొత్తం ఆదాయం తెలుస్తుంది. ఇందులో నుంచి ఆదాయపు పన్ను చట్టం కల్పించిన మినహాయింపులను తీసివేస్తే పన్ను వర్తించే ఆదాయంపై స్పష్టత వస్తుంది.కొత్తదా..? పాతదా..?రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానంలో తమకు అనువైన దానిని ఎంచుకోవచ్చు. ఈ విధానాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి.పాత పన్ను విధానంలో చట్టం కల్పించిన కొన్ని మినహాయింపులను క్లెయిం చేసుకోవడం ద్వారా పన్ను ఆదా చేయొచ్చు. సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80ఈ, గృహరుణ వడ్డీ, ఇంటి అద్దె భత్యం లాంటివి ఇందులో క్లెయిం చేసుకునే వీలుంటుంది. ఇవి గణనీయంగా ఉన్నవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. రూ.7.50లక్షల లోపు ఆదాయం (ప్రామాణిక తగ్గింపు రూ.50వేలతో కలిసి) ఉన్న వారు ఈ పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పుడు ఎలాంటి పన్ను వర్తించదు. పన్ను చెల్లింపుదారులు తమకు ఏ పన్ను విధానం ఉత్తమమో తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను వెబ్సైట్లో ఉన్న కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకోవచ్చు.సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలివే..పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ముందు కొన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫారం-16, ఫారం 26ఏఎస్, వడ్డీ ఆదాయం, డివిడెండ్లకు సంబంధించిన వివరాలు, ఇంటి రుణం వడ్డీ, ఇతర పెట్టుబడుల ఆధారాలు దగ్గర ఉండాలి. ఫారం-16, రిటర్నులను దాఖలు చేసిన రశీదుతో పాటు పెట్టుబడులు, ఇతర పత్రాలన్నింటినీ కలిపి జాగ్రత్త చేసుకోవాలి. దీనివల్ల అవసరమైనప్పుడు వీటిని వెంటనే తీసుకునేందుకు వీలవుతుంది.ఫారం-16: మీ జీతభత్యాలు, మూలం వద్ద పన్ను తగ్గింపు (టీడీఎస్)కు సంబంధించిన వివరాలతో యాజమాన్యం అందించే పత్రం ఇది. దీని ఆధారంగానే ఉద్యోగులు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.ఫారం 26ఏఎస్: ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన అన్ని ఆదాయాలు, టీడీఎస్, మూలం వద్ద పన్ను చెల్లింపు (టీసీఎస్) వివరాలు ఇందులో తెలుస్తాయి. మీ ఫారం-16, ఫారం-26ఏఎస్‌లను పోల్చి చూసుకోవాలి.వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్): వేతనం, ఇతర మార్గాల్లో ఆర్జించిన ఆదాయాలతోపాటు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్, సెక్యూరిటీల లావాదేవీలు, విదేశీ చెల్లింపులు మొదలైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఏఐఎస్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఆదాయాల ఆధారంగానే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని ఫారం ముందుగానే కొంత మేర నింపి ఉంటుంది. -
ఆన్లైన్లో పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఇలా..
పర్మినెంట్ అకౌంట్ నంబర్ లేదా పాన్ కార్డు అనేది దేశంలో ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది పన్ను సంబంధిత ప్రయోజనాలకు, గుర్తింపు రుజువుగానూ పనిచేస్తుంది. ప్రతి పాన్ కార్డు ప్రత్యేకమైన పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్యను కలిగి ఉంటుంది. దీన్ని ఆదాయపు పన్ను శాఖ లామినేటెడ్ కార్డు రూపంలో జారీ చేస్తుంది.ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఏ ఉత్తరప్రత్యుత్తరాలపై పాన్ కార్డు నంబరును కోట్ చేయడం తప్పనిసరి. 2005 జనవరి 1 నుంచి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన చెల్లింపులకు చలాన్లపై పాన్ కోట్ చేయడం తప్పనిసరి. ఈ క్రింది ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లలో పాన్ ను కోట్ చేయడం కూడా తప్పనిసరి. దీని కోసం పాన్ కార్డును ఎప్పటికప్పుడు వెరిఫై చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్లో పాన్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియస్టెప్ 1: ఇన్కమ్ ట్యాక్స్ 'ఈ-ఫైలింగ్' పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.స్టెప్ 2: 'క్విక్ లింక్స్' సెక్షన్ నుంచి 'వెరిఫై యువర్ పాన్ డీటెయిల్స్' హైపర్ లింక్‌పై క్లిక్ చేయండి.స్టెప్ 3: పాన్, పూర్తి పేరు (పాన్ ప్రకారం), పుట్టిన తేదీ ఎంటర్ చేసి 'స్టేటస్'పై క్లిక్ చేయండిస్టెప్ 4: ఇమేజ్‌లో ఉన్న విధంగా క్యాప్చా ఎంటర్ చేసి మీ పాన్ వివరాలను ధ్రువీకరించడానికి 'సబ్మిట్' పై క్లిక్ చేయండి. -
బఫెట్ సంపద రహస్యం అదే
జెండరీ హెడ్జ్ ఫండ్ మేనేజర్ జిమ్ సిమన్స్ సంపద విలువ 31.4 బిలియన్ డాలర్లు. విఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ నెట్‌వర్త్ 139 బిలియన్ డాలర్లు. బఫెట్ కంటే సిమన్స్ సంపద 77 శాతం తక్కువ. వీరిద్దరి మధ్యనున్న సూక్ష్మ వైరుధ్యాన్ని ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా తెలుసుకోవాలి. జిమ్ సిమన్స్ స్థాపించిన హెడ్జ్ ఫండ్ ‘రెనైసెన్స్ టెక్నాలజీస్’ ఒకటి రెండేళ్లు కాదు.. 1988 నుంచి ఏటా 66 శాతం చొప్పున, నిరంతరాయంగా మూడు దశాబ్దాలకు పైనే ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచి్చపెట్టింది. అదే వారెన్ బఫెట్ స్థాపించిన బెర్క్‌షేర్ హాథవే ఏటా 19.8 శాతం కాంపౌండింగ్ వృద్ధినే నమోదు చేసింది. సిమన్స్ కంటే బఫెట్ సంపదే నాలుగు రెట్లు అధికం. ఏటా ఎంత అధికంగా రాబడి తెచ్చుకున్నారనే దానికంటే.. ఎంత ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టారు, వాటిని ఎంత కాలం పాటు కొనసాగించారు? అన్నవే సంపదను నిర్ణయిస్తాయని సిమన్స్–బఫెట్ జర్నీ చెబుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ వీలైనంత ముందుగా ఇన్వెస్ట్మెంట్ ఆరంభించి, దీర్ఘకాలం పాటు కొనసాగించినప్పుడే కాంపౌండింగ్ ప్రయోజనాన్ని గరిష్టంగా అందుకోగలరు. ఏటా 12 శాతం రాబడి సంపద సృష్టించాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని.. సంపాదనను తీసుకెళ్లి వృద్ధి చెందే చోట పెట్టడం. ఎంత ముందుగా ఆరంభిస్తే, దీర్ఘకాలంలో అంత అధికంగా ప్రయోజనం పొందొచ్చు. బఫెట్ పెట్టుబడుల ప్రయాణాన్ని గమనించినా ఇదే బోధపడుతుంది. ముందుగా మొదలు పెట్టడం వల్ల అప్పుడు కాంపౌండింగ్ ప్రయోజనం గరిష్ట స్థాయిలో పొందడానికి కావాల్సినంత వ్యవధి ఉంటుంది. 25 ఏళ్ల మహిమ ప్రతి నెలా రూ.1,000 చొప్పున తనకు 50 ఏళ్లు వచ్చే వరకు.. అంటే 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసిందని అనుకుందాం. అప్పుడు 25 ఏళ్లలో మహిమ అసలు పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది. ఏటా 12 శాతం రాబడి (ఈక్విటీలలో దీర్ఘకాల సగటు) అంచనా ప్రకారం సమకూరే మొత్తం రూ.18 లక్షలు. కేవలం వెయ్యి రూపాయలే.. 25 ఏళ్లలో రూ.18 లక్షలుగా మారడం కాంపౌండింగ్ వల్లే. ఇలా కాకుండా మహిమ కేసులో కాంపౌండింగ్ ప్రయోజనం తీసేసి చూస్తే.. అంటే అసలుతోపాటు, దానిపై వచి్చన వడ్డీని ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే సమకూరే మొత్తం రూ.7.5 లక్షలుగానే ఉండేది. మొత్తం రూ.18 లక్షల్లో మిగిలిన రూ.10.5 లక్షలు కేవలం కాంపౌండింగ్ వల్లే సమకూరినట్టు అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడికి ఇప్పుడేం తొందరొచి్చందిలే.. తర్వాత చూద్దామనుకుని, మహిమ పదేళ్లు ఆలస్యంగా తన 35వ ఏట నుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టి ఉంటే ఏమయ్యేది? పైన చెప్పుకున్నట్టు 50 ఏళ్ల వయసుకు రూ.18 లక్షలు రావాలంటే అప్పటి నుంచి 15 ఏళ్ల పాటు ప్రతి నెలా ఆమె రూ.1,700 ఇన్వెస్ట్ చేయాల్సిందే. పదేళ్లు వృధా చేయడం వల్ల 70 శాతం అదనపు పెట్టుబడి అవసరం అవుతుందని ఇక్కడి ఉదాహరణ చెబుతోంది. పెట్టుబడి విషయంలో కాలం వృధా అవుతున్న కొద్దీ కాంపౌండింగ్ ప్రయోజనం అదే స్థాయిలో కోల్పోతారు. కాంపౌండింగ్పెట్టుబడిపై వడ్డీ వస్తుందని తెలుసు. దీన్ని వడ్డీ రాబడిగా చెబుతారు. ఈ వడ్డీ కూడా తిరిగి పెట్టుబడిగా మారి దానిపైనా వడ్డీ సమకూరడమే కాంపౌండింగ్. దీన్నే చక్రవడ్డీ అని కూడా చెబుతారు. బ్యాంకులో వ్యక్తిగత రుణం, బంగారంపై రుణం తీసుకున్నప్పుడు ప్రతి నెలా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో ఒక నెల ఈఎంఐ చెల్లించడంలో విఫలమై, మరుసటి నెలలో చెల్లిస్తున్నప్పుడు నెల బకాయిపై వడ్డీని కూడా బ్యాంక్ రాబడుతుంది. దీన్నే వడ్డీ మీద వడ్డీగా చెబుతారు. రూ.100 ఇన్వెస్ట్ చేస్తే 10 శాతం రాబడి ప్రకారం ఏడాది తర్వాత రూ.110గా మారుతుంది. ఇందులో రూ.10 వడ్డీ రూపంలో సమకూరింది. రెండో ఏడాది రూ.110 కాస్తా రూ.121గా మారుతుంది. మొదటి ఏడాది వడ్డీ రూ.10పైనా రెండో ఏడాది రూపాయి వడ్డీ వచ్చినట్టు. ఇలా వడ్డీపై వడ్డీ రాబడి జమవుతుంది కనుకనే దీర్ఘకాలంలో భారీ మొత్తం సమకూరుతుంది. పెట్టుబడుల జర్నీ..బఫెట్ ప్రస్తుత వయసు 90 ఏళ్లు. ఆయన సంపద విలువ 139 బిలియన్ డాలర్లు. నిజానికి బఫెట్ సంపదలో 99 శాతం ఆయనకు 65 ఏళ్లు వచి్చన తర్వాత సమకూరిందేనని ప్రముఖ రచయిత మోర్గాన్ హౌసెల్ ‘ద సైకాలజీ ఆఫ్ మనీ’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఒకవేళ బఫెట్ 65 ఏళ్లకే రిటైర్ అయి ఉంటే నేడు ఆయన గురించి అంతగా మాట్లాడుకునే వాళ్లం కాదని ఓ ఇంటర్వ్యూలో భాగంగా హౌసెల్ పేర్కొన్నారు. బఫెట్ 30 ఏళ్ల వయసులో పెట్టుబడులు మొదలు పెట్టి, 60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకున్నాడన్నది చాలా మంది ఇన్వెస్టర్లకు తెలిసిన విషయం. కానీ, నిజానికి బఫెట్ 10 ఏళ్ల వయసులోనే పెట్టుబడి ఆరంభించారు. 30 ఏళ్ల నాటికి ఆయన 9.3 మిలియన్ డాలర్లు సమకూర్చుకున్నారు. వెనక్కి తీసుకోకుండా అలాగే జీవితకాలం పాటు కొనసాగించారు. సంపాదిస్తున్న మొత్తంలో కనీస అవసరాలకే తప్ప ఎప్పుడూ లగ్జరీ వ్యయాలకు పోలేదు. వీలైనంత పెట్టుబడి పెట్టడమే ఆయన చేసిన పని. నిజానికి దీన్నే బఫెట్ స్కిల్ (నైపుణ్యం)గా హౌసెల్ అభివర్ణిస్తారు. ఏటా 20 శాతం చొప్పున బఫెట్ సంపద కాంపౌండ్ అయింది. జిమ్ సిమన్స్ 1988 నుంచి పెట్టుబడులు ఏటా 66 శాతం చొప్పున వృద్ధి చెందేంత గొప్ప వ్యూహాలు అమలు చేసిననప్పటికీ.. తక్కువ సంపద కలిగి ఉండడానికి కారణం పెట్టుబడుల ప్రపంచంలోకి ఆలస్యంగా ప్రవేశించడమే. నిజానికి సిమన్స్ వార్షిక రాబడి 66 శాతంలో బఫెట్ వార్షిక రాబడి మూడింట ఒక వంతే. బఫెట్ ఎంతో ముందుగా మొదలు పెట్టడం వల్ల కాంపౌండింతో ఎక్కువ సంపద సమకూరింది. ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కానంత వార్షిక రాబడులను సిమన్స్ తెచ్చుకున్నా కానీ, ఆస్తుల్లో బఫెట్ కంటే దిగువన ఉండడానికి కారణం 50 ఏళ్లు వచి్చన తర్వాతే తన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఆరంభించడం. అందుకే ప్రతి ఇన్వెస్టర్ ముందుగా పెట్టుబడులు మొదలు పెట్టి, ఎక్కువ కాలం పాటు కొనసాగించడం ఆచరించాలని బఫెట్ విజయ గాధ తెలియజేస్తోంది. బఫెట్ మాదిరే సిమన్స్ కూడా 70 ఏళ్లపాటు ఏటా 66 శాతం చొప్పున రాబడులు తెచ్చుకుని ఉంటే.. ఆ మొత్తం కొన్ని వందల రెట్లు అధికంగా ఉంటుంది. బఫెట్ పంచ సూత్రాలు ⇥ పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టి ఉండాలి. అవసరమైతే ఎప్పటికీ కొనసాగించాలి. ⇥ నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఇక్కడ పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. మంచి కంపెనీని అద్భుతమైన ధరలో (చాలా ఖరీదైన వ్యాల్యుయేషన్‌లో) కొనడం కంటే.. అద్భుతమైన కంపెనీని సరసమైన ధరలో కొనుక్కోవాలి. ⇥ పెట్టుబడుల్లో ఉండే రిస్క్ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియనప్పుడే రిస్క్ ఎదురవుతుంది. ⇥ వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నారు. అసాధారణ యాజమాన్యం, అద్భుతమైన వ్యాపారంతో ఉంటే ఆ కంపెనీలో మీరు పెట్టే పెట్టుబడి కాల వ్యవధి జీవితకాలంగానే భావించాలి. ⇥ ఈక్విటీ మార్కెట్లో ఓపిక ఉన్నవారికే అధిక రాబడులు సొంతమవుతాయి. దూకుడైన ఇన్వెస్టర్ నుంచి ఓపికగా వేచి చూసే ఇన్వెస్టర్‌కు సంపదను బదిలీ చేసే విధంగా స్టాక్ మార్కెట్ పనితీరు ఉంటుంది. జిమ్ సిమన్స్ ఏమి చెప్పారంటే..?⇥ ఒక గొప్ప సిద్ధాంతం అందంగా ఎలా ఉంటుందో.. గొప్పగా, సమర్థవంతంగా పనిచేసే కంపెనీ కూడా అంతే అందంగా ఉంటుంది. ⇥ వీలైనంత వరకు మీ చుట్టూ తెలివైన, ఉత్తమమైన వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. వారు మీకంటే తెలివైన వారు అయితే ఇంకా మంచిది. ⇥ ఏదో ఒకటి వాస్తవికంగా చేయండి. మిగిలిన వారిని అనుసరించొద్దు. ఒకే సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ మంది ప్రయతి్నస్తుంటే మీరు దాన్ని చేయొద్దు. ⇥ అంత సులభంగా వదిలేసుకోవద్దు. దానికే కట్టుబడి ఉండాలి. అలా అని శాశ్వతంగా కాదు. కానీ, ఫలితమిచ్చేంత సమయం దానికి ఇవ్వాలి. ⇥ చివరిగా అదృష్టం కలసిరావాలి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ⇥ జేమ్స్ హారిస్ సిమన్స్ (జిమ్ సిమన్స్) గణితంలో దిట్ట. తనకున్న అసాధారణ ప్రతిభతో మార్కెట్ల తీరును కచి్చతంగా అంచనా వేసి, పెట్టుబడులపై అధిక ప్రతిఫలం పొందే దిశగా ఆయన అమలు చేసిన విధానాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి. 1980లోనే క్వాంట్ ఇన్వెస్టింగ్ విధానాన్ని ఆవిష్కరించి బఫెట్, జార్జ్ సోరోస్ వంటి దిగ్గజ ఇన్వెస్టర్లను అధిగమించారు. -
రిటైర్మెంట్ ఫండ్స్‌తో ఆర్థిక ప్రణాళిక ఇలా..
రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి పదవీ విరమణ అనంతరం ఆర్థిక అవసరాల కోసం నిధిని సమకూర్చుకునేందుకు, ఆర్థిక భద్రతను సాధించేందుకు, స్థిరంగా ఆదాయాన్ని పొందేందుకు ఉపయోగపడే మ్యూచువల్ ఫండ్ స్కీములు. సాధారణంగా వీటికి అయిదేళ్లు లేదా రిటైర్మెంట్ వయస్సు వరకు (ఏది ముందైతే అది) లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇంతకీ పదవీ విరమణ తర్వాత రోజుల కోసం ముందునుంచే ఎందుకు ప్లానింగ్ చేసుకోవాలి అంటే.. రిటైర్మెంట్ తర్వాత స్థిరంగా ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు ఉండవు. కాబట్టి పదవీ విరమణ తర్వాత కూడా ప్రస్తుత జీవన విధానం విషయంలో రాజీ పడకూడదనుకుంటే, ముందు నుంచే ఒక ప్రణాళిక వేసుకోక తప్పదు. మీ జీవితంలోని సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆర్థికంగా నిశ్చింతగా ఉండే విధంగా ఈ ప్లానింగ్ ఉండాలి. ఈ ప్రణాళిక అవసరాన్ని మరింతగా వివరించాలంటే, కొన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ మెరుగుపడటంతో మనుషుల జీవితకాలం కూడా పెరుగుతోంది. దీనితో మన దగ్గరున్న ఆర్థిక వనరులు అంత కాలానికి సరిపోకపోవడమనే రిస్కులు ఉంటున్నాయి. అందుకే వృద్ధాప్యంలో ఆర్థికంగా ఇబ్బందిపడకుండా ముందునుంచే ప్రణాళికలు వేసుకోవడం చాలా ముఖ్యం. ఇక సామాజిక వ్యవస్థ స్వరూపం కూడా మారుతోంది. రిటైర్మెంట్ అవసరాల కోసం భవిష్యత్ తరాలపై ఆధారపడే పరిస్థితులు ఉండటం లేదు. ఇవే కాకుండా ఇక ద్రవ్యోల్బణం అనేది ఒకటి ఉండనే ఉంది. ఎప్పటికప్పుడు అన్నింటి రేట్లూ, ఖర్చులూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ రకంగా చూసినా.. సరిగ్గా ప్లానింగ్ చేసుకోకపోతే పదవీ విరమణ తర్వాత కూడా పాత జీవన విధానమే కొనసాగించాలంటే కష్టమైపోతుంది. ఇక మరో విషయం ఏమిటంటే.. ఈ మధ్య రిటైర్మెంట్ నిర్వచనమే మారిపోతోంది. ఇప్పుడు రిటైర్మెంట్ అంటే ఒక కొత్త అడ్వెంచర్‌గా కూడా చూస్తున్నారు. బరువు బాధ్యతలు కొంత తగ్గి, కాస్త స్వేచ్ఛ లభిస్తుంది కాబట్టి ఇతరత్రా హాబీల వైపు మళ్లేందుకు కొంత అవకాశం లభిస్తుంది ఈ దశలో. మరి ఇలాంటి దశను ఆస్వాదించాలంటే తగినన్ని ఆర్థిక వనరులు ఉంటేనే సాధ్యపడుతుంది. ప్లానింగ్ ఇలా.. రిటైర్మెంట్ ప్లానింగ్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. వీలైనంత త్వరగా మొదలుపెట్టడమనేది ముఖ్యం. దీనివల్ల మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత సమయం లభిస్తుంది. కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందేందుకూ వీలుంటుంది. ఎన్నాళ్లకు ప్లానింగ్ చేసుకోవాలనేదీ చూసుకోవాలి. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి, 58 ఏళ్లకు రిటైర్ అయి, 80 ఏళ్ల వరకు జీవిస్తారనుకుంటే .. వారు 28 ఏళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది, రిటైర్మెంట్ తర్వాత 22 ఏళ్ల పాటు జీవితకాలం ఉంటుంది. ఇప్పుడు దీనికి అనుగుణంగా ప్రస్తుత, భవిష్యత్ ఖర్చుల లెక్క వేసుకోవాలి. ఇందుకోసం ధరల పెరుగుదల రేటునూ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు ప్రస్తుత ఖర్చులు నెలకు రూ. 50,000గా ఉంటే, 5.3 శాతం ద్రవ్యోల్బం రేటు అంచనాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు 20 ఏళ్ల తర్వాత నెలవారీ ఖర్చులు రూ. 1.4 లక్షల స్థాయిలో ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రిటైర్మెంట్ నిధికి రూపకల్పన చేసుకోవాలి. రిటైర్మెంట్ నిధి అనేది మీరు పదవీ విరమణ చేసే నాటికి కూడబెట్టుకోవాల్సిన మొత్తం. ఇది మీ పదవీ విరమణ అనంతరం ఎదురయ్యే ఖర్చులన్నింటికీ కనీసం సరిపోయే విధంగా ఉండాలి. సాధారణంగా అత్యవసర పరిస్థితుల కోసం 10–15 శాతం బఫర్ మొత్తాన్ని కూడా చేర్చుకోవడం మంచిది. దీన్ని చూసుకుని, అంత నిధిని పోగేసేందుకు మీరు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలనేది లెక్కించుకోవాలి. దీన్ని క్రమానుగతంగా, ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందుకోసం రిటైర్మెంట్ ప్లాన్లు అనువైనవిగా ఉండగలవు. ఫండ్స్ ప్రత్యేకతలు.. రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి ఓపెన్ ఎండెడ్, రిటైర్మెంట్ సొల్యూషన్–ఆధారిత స్కీములుగా ఉంటాయి. వీటికి ముందుగానే చెప్పుకున్నట్లు అయిదేళ్లు లేదా రిటైర్మెంట్ వయస్సయిన 58 ఏళ్ల వరకు లాకిన్ పీరియడ్ (ఏది ముందైతే అది) ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి పదవీ విరమణ అనంతరం ఇన్వెస్టర్లకు ఆర్థిక భరోసా కలి్పంచేందుకు, స్థిరమైన ఆదాయ మార్గాన్ని ఏర్పర్చేందుకు ఉపయోగపడతాయి. ఇవి అటు ఈక్విటీలు (65 శాతం – 80 శాతం వరకు), అటు ఫిక్సిడ్ ఇన్‌కం సెక్యూరిటీస్‌లోనూ (35 శాతం నుంచి 20 శాతం వరకు) ఇన్వెస్ట్ చేస్తాయి. తద్వారా డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్ ప్రయోజనాలు అందిస్తాయి. రిటైర్మెంట్ తర్వాత ఇన్వెస్టర్లు ఆటో సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్స్ ద్వారా వీటి నుంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇక వీటిలో ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయాలా లేక కొంచెం కొంచెంగానా అంటే.. సాధారణంగా పదవీ విరమణ అవసరాలకు సంబంధించి భారీ మొత్తాన్నే కూడబెట్టుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ ఫండ్స్‌లో క్రమానుగతంగా సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. కావాలనుకుంటే స్టెప్–అప్ సిప్ విధానాన్ని ఎంచుకుని వీలైనంతగా పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లొచ్చు. రిటైర్మెంట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్ అవసరాలపై స్పష్టత, ఫోకస్ వస్తుంది. అయిదేళ్ల లాకిన్ వ్యవధి కారణంగా పెట్టుబడి విషయంలో ఇన్వెస్టర్లు తమ లక్ష్యానికి కట్టుబడి ఉండేలా మరింత క్రమశిక్షణను నేర్పుతుంది. అంతేగాకుండా సుదీర్ఘ కాలం పాటు ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలను కూడా వారు పొందేందుకు తోడ్పడుతుంది. -
బంగారం, వెండి కొనచ్చా.. ధరలు ఎలా ఉన్నాయంటే..?
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు (జూన్ 2) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున తులం బంగారం రూ.210, వెండి కేజీకి ఏకంగా రూ.2000 తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగడంతో మరింత ఉపశమనం లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.66,500 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 72,550 వద్ద కొసాగుతున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,650, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.72,700 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,500లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.72,550 లుగా ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,100 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.73,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,550 వద్ద ఉంది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో క్రితం రోజున వెండి ధర కేజీకి రూ.2000 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.98,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
యూపీఐ సరికొత్త రికార్డ్.. రోజుకు రూ .65,966 కోట్లు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) నెట్వర్క్ సరికొత్త రికార్డులు సృష్టించింది. గడిచిన మే నెలలో లావాదేవీల పరిమాణం, విలువ రెండూ పెరిగాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఎన్పీసీఐ మే నెలలో 1400 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేయడం ద్వారా కొత్త మైలురాయిని సాధించింది. ఏప్రిల్ లో నమోదైన 1330 కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ఇక ఏప్రిల్‌లో రూ.19.64 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీ విలువ మేలో రూ.20.45 లక్షల కోట్లకు పెరిగిందని ఎన్పీసీఐ తెలిపింది.ఈ ఏడాది మే నెలలో నమోదైన యూపీఐ లావాదేవీలు గతేడాదితో పోలిస్తే 49 శాతం పెరిగాయి. ఈ మే నెలలో జరిగిన యూపీఐ సగటు రోజువారీ లావాదేవీ మొత్తం రూ .65,966 కోట్లు. రోజువారీగా సగటున 45.3 కోట్ల లావాదేవీలు జరిగనట్లుగా ఎన్పీసీఐ గణాంకాలు పేర్కొన్నాయి. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఎఫ్డీ.. వడ్డీ ఎంతంటే?
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త ఫిక్స్డ్ డిపాజిట్‌ను ప్రకటించింది. 666 రోజుల ఎఫ్డీని ప్రారంభించింది. ఇది రూ .2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ మొత్తాలపై సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం వరకు వడ్డీని అందిస్తుంది.666 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్ 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 7.95 శాతం ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తాయి. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వ్యక్తులను సూపర్ సీనియర్ సిటిజన్లుగా వ్యవహరిస్తారు.ఈ 666 రోజుల ఎఫ్డీపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సాధారణ కస్టమర్లకు 7.30 శాతం వడ్డీ లభిస్తుంది. సవరించిన వడ్డీ రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ రూపాయి టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తాయి. ఇవి జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్‌పై రుణం పొందే సౌలభ్యం, ప్రీమెచ్యూర్ విత్‌డ్రా సదుపాయం అందుబాటులో ఉంది.కస్టమర్లు, సాధారణ ప్రజలందరూ ఈ పెట్టుబడి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏ బ్రాంచిలోనైనా ఈ ఎఫ్డీని తెరవచ్చు. అలాగే బీఓఐ ఓమ్ని నియో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ ఎఫ్డీని తెరిచే అవకాశం ఉంది. -
తగ్గిన బంగారం, వెండి ధర.. ఎంతో తెలుసా..?
ఈక్విటీమార్కెట్లు ఇటీవల భారీగా పడిపోయాయి. దాంతో బంగారం ధరలు పుంజుకున్నాయి. శుక్రవారం మార్కెట్లో స్టాక్‌సూచీలు తీవ్రఒడిదుడుకులతో చివరకు స్వల్పలాభాలతో ముగిశాయి. దాంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వివిధ ప్రాంతాల్లో శనివారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66,500 (22 క్యారెట్స్), రూ.72,550 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.200, రూ.210 తగ్గింది.చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,200 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.66,650.. 24 క్యారెట్ల ధర రూ.72,700కు చేరాయి. మార్కెట్లో శనివారం కేజీ వెండి ధర ఏకంగా రూ.2000 తగ్గి రూ.98,000కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
EPF New rules: ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఊరట కల్పించింది. దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.ఆన్లైన్లో దాఖలు చేసిన క్లెయిమ్‌ల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి, క్లెయిమ్‌ను ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రం అప్లోడ్ చేయని కారణంగా తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్‌ల సంఖ్యను తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది.మరి క్లెయిమ్ వెరిఫై ఎలా?చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ చిత్రాలు అప్లోడ్ చేయని పక్షంలో క్లెయిమ్ ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి ఈపీఎఫ్‌వో అదనపు ధ్రువీకరణ పద్ధతులను ఉపయోగిస్తుంది. వీటిలో ఇవి ఉండవచ్చు..ఆన్లైన్ బ్యాంక్ కేవైసీ వెరిఫికేషన్: మీ బ్యాంక్ లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కేవైసీ వివరాలను నేరుగా తనిఖీ చేస్తుంది.డీఎస్సీ ద్వారా కంపెనీ వెరిఫికేషన్: డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్సీ) ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా వివరాలను మీ కంపెనీ ధ్రువీకరించవచ్చు.సీడెడ్ ఆధార్ నంబర్ వెరిఫికేషన్: మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్‌ను యూఐడీఏఐ ధ్రువీకరిస్తుంది. -
దిగివచ్చిన బంగారం, వెండి!
బంగారం కొనుగోలుదారులకు దాదాపు రోజుల తర్వాత భారీ శుభవార్త ఇది. గత ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (మే 30) భారీగా తగ్గాయి. 10 గ్రాములు (తులం) బంగారం రూ.440 మేర తగ్గి పసిడి ప్రియులకు భారీ ఊరట కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో..రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు తగ్గింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,850 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 తగ్గి రూ.72,910 వద్దకు క్షీణించింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 తగ్గి రూ.67,300 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.490 దిగొచ్చి రూ.73,420 వద్దకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.వెండి ధరదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు భారీగా రూ.1200 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,01,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
క్యాష్‌లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
ఆరోగ్య బీమా పాలసీదారు క్లెయిమ్ చేసిన గంటలోపే నగదు రహిత చికిత్సపై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి తుది బిల్లు వచ్చాక మూడు గంటల్లోపు అనుమతి ఇవ్వాలని తెలియజేసింది. బుధవారం ఈమేరకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. ఆరోగ్య బీమా ఉత్పత్తులపై ఉన్న 55కు పైగా ఆదేశాలను క్రోడీకరించి దీన్ని రూపొందించినట్లు పేర్కొంది.సర్క్యూలర్‌లోని వివరాల ప్రకారం..క్లెయిమ్ పరిష్కారాల కోసం పాలసీదారులు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. బీమా సంస్థలు, థర్డ్‌పార్టీ ఏజెన్సీలు తమకు అవసరమైన పత్రాలను పాలసీదారుల నుంచి కాకుండా నేరుగా ఆసుపత్రుల నుంచే సేకరించాలి. వయసు, ప్రాంతం, ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా బీమా పాలసీని అందించాలి. అవసరాన్ని బట్టి కొత్త పాలసీలను తీసుకొచ్చే అవకాశం బీమా సంస్థలకు ఉంది.ఐఆర్డీఏఐ చేసిన కొన్ని మార్పులు..డిశ్చార్జీకి మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం జరిగి ఆసుపత్రి ఏదైనా అదనపు ఛార్జీలు విధిస్తే ఆ మొత్తాన్ని కూడా బీమా సంస్థ భరిస్తుంది.చికిత్స సమయంలో పాలసీదారుడు మరణిస్తే వెంటనే క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి. తక్షణమే ఆసుపత్రి నుంచి మృత దేహాన్ని తమ బంధువులకు అప్పగించాలి.పాలసీదారులకు సహాయం చేయడానికి బీమా కంపెనీలు ఆసుపత్రిలో ఫిజికల్ మోడ్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయవచ్చు.ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్న పాలసీదారులు తమకు ఆమోదయోగ్యమైన క్లెయిమ్ పొందగలిగే పాలసీని ఎంచుకోవచ్చు.పాలసీ తీసుకునేందుకూ, పాలసీ పునరుద్ధరణ, సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితరాల కోసం అవసరమైన సాంకేతిక సేవలను అందించాలి.బీమా కంపెనీలు పాలసీ డాక్యుమెంట్‌తో పాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)ని కూడా అందించాలి. బీమా పాలసీ రకం, బీమా మొత్తం, కవరేజీ వివరాలు, మినహాయింపులు.. వంటివి సులభ పదాల్లో తెలియజేయాలి.పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే వారికి నో క్లెయిమ్ బోనస్ లేదా ప్రీమియం తగ్గించే అవకాశాన్ని కల్పించవచ్చు.ఇదీ చదవండి: పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్‌లుఇటీవల లోకల్ సర్కిల్ చేసిన సర్వేలో 43 శాతం బీమా పాలసీదారులు గత మూడేళ్లలో తమ బీమా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. చాలామంది పాలసీదారులు ఆసుపత్రిలో చేరిన చివరి రోజు వరకు తమ క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సర్వే తెలిపింది. -
వెండే బంగారమాయెగా..
న్యూఢిల్లీ: వెండి ధర దేశంలో సరికొత్త రికార్డులను చూస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కేజీ ధర క్రితం ముగింపుతో పోల్చితే బుధవారం రూ.1,150 ఎగిసి రూ.97,100కి ఎగసింది. ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 3,707 ఎగసి రూ.94,118కి చేరింది. చెన్నైసహా పలు నగరాలు, కొన్ని పట్టణాల స్పాట్ మార్కెట్లలో ఏకంగా రూ.లక్ష దాటినట్లు కూడా సమాచారం అందుతోంది. గడచిన పది రోజుల్లో వెండి ధర దాదాపు రూ.11,000 పెరిగింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు విలువైన మెటల్స్ ధర పెరగడానికి కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. ఢిల్లీలో పసిడి 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర క్రితంతో పోలి్చతే రూ.250 పెరిగి రూ.73,200కు చేరగా, ముంబైలో రూ.222 ఎగసి రూ.72,413కి చేరింది. -
పెరుగుతున్న బంగారం ధరలు.. రూ.లక్ష మార్కు చేరిన వెండి
కొంతకాలంగా ఈక్విటీమార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. దాంతో బంగారం ధరలు పడిపోయాయి. ఇటీవల మళ్లీ మార్కెట్లో అనిశ్చితులు నెలకొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు పడిపోతున్నాయి. దాంతో తిరిగి బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు సేఫ్డ్ అసెట్స్‌లో భాగంగా పసిడిని ఎంచుకుంటారు. కాబట్టి బుధవారం గోల్డ్రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో పసిడిధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.67,100 (22 క్యారెట్స్), రూ.73,200 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ.250, రూ.270 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.350, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.380 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.67,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.73,910 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ.67,250.. 24 క్యారెట్ల ధర రూ.73,350కు చేరింది.ఇదీ చదవండి: వ్యాధుల నియంత్రణకు ఏఐ సహాయంవెండి ధరలువెండి ధర మార్కెట్లో భారీగా పెరుగుతోంది. బుధవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పెరిగి రూ.1,02,200కు చేరింది. దాంతో లక్షమార్కును దాటినట్లయంది. వెండి తయారీలో ప్రధానపాత్ర పోషిస్తున్న, స్టాక్మార్కెట్లో లిస్ట్ అయిన ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ జింక్ స్టాక్ ధర నెల రోజులుగా భారీగా పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
అకౌంట్లపై అదనపు వసూళ్లు.. బ్యాంక్‌లకు ఆర్బీఐ వార్నింగ్..
ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు విధిస్తున్న బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది.బ్యాంకింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎస్ బ్యాంక్‌కు రూ. 91 లక్షల జరిమానా విధించింది. జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపైజీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాలపై ఛార్జీలు విధించడం, ఫండ్స్ పార్కింగ్, రూటింగ్ ట్రాన్సాక్షన్ వంటి అనధికారిక ప్రయోజనాల కోసం బ్యాంక్ ఖాతాదారుల పేరిట ఇంటర్నల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఎస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. కస్టమర్లు జీరో బ్యాంక్ అకౌంట్‌ను ఉపయోగిస్తూ.. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అకౌంట్ బ్యాలెన్స్ జీరోకి పడిపోయి.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయలేదని ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదు. సంబంధిత బ్యాంక్‌లు.. బ్యాంక్ అకౌంట్ సేవల్ని నిలిపివేయాలి. ఈ నిబంధనల్ని 2014 నుంచి ఆర్బీఐ అమలు చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.కోటి జరిమానామరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్‌కు సైతం ఆర్బీఐ రూ.కోటి జరిమానా విధించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పలు సంస్థలకు ప్రాజెక్ట్ లోన్స్ పేరిట లాంగ్ టర్మ్ రుణాల మంజూరులో ఐసీఐసీఐ అవకతవకలకు పాల్పడినందుకు భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. -
పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
ట్యాక్స్ పేయర్స్‌ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలెర్ట్ చేసింది. మే 31,2024 గడువులోపు పాన్ కార్డ్‌కు ఆధార్ కార్డ్‌ను జత చేయాలని సూచించింది. తద్వారా హైయ్యర్ ట్యాక్స్ డిడక్ట్ నుంచి ఉపశమనం పొందవచ్చని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.పన్ను చెల్లింపుదారులు మీ పాన్‌ను మే 31, 2024లోపు ఆధార్‌తో లింక్ చేయండి. మే 31లోపు మీ పాన్‌ను మీ ఆధార్‌తో లింక్ చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 206ఏఏ, 206సీసీ ప్రకారం మీరు అధిక పన్ను మినహాయింపు/పన్ను వసూలు నుంచి మినహాయింపు పొందవచ్చు. పాన్‌కు ఆధార్ లింక్ చేయకపోతే నిర్ణీత తేదీలోపు పాన్‌కు ఆధార్ జత చేయకపోతే పన్ను చెల్లింపుదారులు గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి, వారు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్లు 206ఏఏ, 206సీసీ ప్రకారం అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. Kind Attention Taxpayers, Please link your PAN with Aadhaar before May 31st, 2024, if you haven’t already, in order to avoid tax deduction at a higher rate.Please refer to CBDT Circular No.6/2024 dtd 23rd April, 2024. pic.twitter.com/L4UfP436aI— Income Tax India (@IncomeTaxIndia) May 28, 2024 -
తగ్గుముఖం పట్టిన బంగారం మళ్లీ ఇలా..
దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 27) స్వల్పంగా పెరిగాయి. వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు కాస్త ఎగిశాయి. తులం బంగారం (10 గ్రాములు) రూ.710 మేర పెరిగి పసిడి కొనుగోలుదారుల్లో మళ్లీ ఆందోళనలు పెంచుతోంది.తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.270 ఎగిసి రూ. 72,710 లను తాకింది.ఇతర నగరాల్లో.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,800 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 పెరిగి రూ.72,860 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ.72,710లకు ఎగిసింది.ఇక చెన్నైలో పసిడి ధరలు అత్యధికంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 పెరిగి రూ.67,200 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.710 పెరిగి రూ.73,310 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650 వద్దకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం రూ.270 ఎగిసి రూ.72,710 వద్దకు చేరింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు (మే 27) వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో ఈరోజు కేజీ వెండి ధర రూ.1,500 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,500లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ప్రీమియం భారమైతే.. పరిష్కారం?
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరోసారి ప్రీమియం బాదుడు షురూ చేశాయి. ‘కర్ణుడి చావుకి కోటి కారణాలన్నట్టు’.. బీమా సంస్థలు కూడా ప్రీమియం పెంచడానికి ఎన్నో కారణాలు చూపిస్తుంటాయి. లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవలే నిర్వహించిన ఒక సర్వేలో.. గడిచిన ఏడాది కాలంలో తమ వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం 25 శాతం పెరిగినట్టు 52 శాతం మంది చెప్పారు. హెల్త్ ఇన్సూరెన్స్ నూతన పాలసీల ప్రీమియం సైతం ఈ ఏడాది మొదటి మూడు నెలలల్లోనే 5.54 శాతం మేర పెరిగినట్టు బీమా పంపిణీ ప్లాట్‌ఫామ్ ‘పాలసీఎక్స్’ చెబుతోంది. రెక్కలు తొడిగిన పక్షి మాదిరిగా ఇలా ప్రీమియం గణనీయంగా పెరుగుతూ పోతుంటే కొత్తగా పాలసీ తీసుకునే వారికే కాదు, అప్పటికే పాలసీ తీసుకున్న వారిపైనా అదనపు భారం పడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రీమియం భారం కొంత తగ్గించుకునే మార్గాలేంటన్నది చూద్దాం. ప్రీమియం ఎందుకు పెరుగుతోంది..హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం గణనీయంగా పెరిగిపోవడానికి వైద్య ద్రవ్యోల్బణం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ద్రవ్యోల్బణం నిత్యావసరాలకు (వినియోగ ధరల, టోకు ధరల ఆధారిత) సంబంధించినది. ఇది 5–6 శాతం మధ్య ఉంటోంది. కానీ, వైద్య రంగంలో ద్రవ్యోల్బణం ఇంతకు రెట్టింపు 14–15 శాతంగా ఉంటోంది. చికిత్సల వ్యయాలు ఈ స్థాయిలో ఏటా పెరిగిపోతుండడంతో, బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్‌లు వస్తున్నాయి. దీంతో వాటిపై చెల్లింపుల భారం పడుతోంది. ‘‘వైద్య రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ వసతులు మెరుగుపడడం, ప్రాణాలను కాపాడే అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడం.. ఇవన్నీ వ్యయాలు పెరగడానికి దారితీస్తున్నాయి’’ అని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేశ్ జైన్ తెలిపారు. ఔషధాలు, ఇంప్లాంట్లు, ఇతరత్రా వ్యయాలు పెరగడం వల్లే ఆస్పత్రుల చికిత్సల ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్టు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, క్లెయిమ్స్ హెడ్ మనీష్ దొదేజా సైతం పేర్కొన్నారు. జీవనశైలి, ఇతర వ్యాధుల రిస్క్ పెరగడం కూడా అధిక క్లెయిమ్‌లకు దారితీస్తున్నట్టు చెప్పారు. ‘‘మనదేశం ప్రపంచ మధుమేహం రాజధానిగా మారుతోంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కేన్సర్ రిస్క్ సైతం పెరుగుతోంది’’అని ఇన్సూరెన్స్ సమాధాన్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు శిల్పా అరోరా తెలిపారు. కరోనా సమయంలో, ఆ తర్వాత కూడా ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. దీంతో బీమా సంస్థలకు పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ భారాన్ని దింపుకునేందుకు బీమా సంస్థలు విడతలవారీగా పాలసీదారులకు ప్రీమియం వాత పెడుతున్నట్టు విశ్లేషకులు చెబతున్నారు. కరోనా తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియం సవరణ ఇప్పడే మొదటిసారి కాదు. లోగడ ఒకటి రెండు సార్లు కూడా అవి సవరించాయి.అందరికీ కవరేజ్ లేకపోవడమూ కారణమే...ఇక మనదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అందరికీ లేకపోవడం కూడా ప్రీమియం అధికంగా ఉండడానికి మరొక కారణమంటున్నారు నిపుణులు. ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బీమా సంస్థలు వ్యయాలను మరింత మంది పాలసీదారులతో పంచుకోవడానికి వీలు ఏర్పడుతుంది. దీంతో విడిగా ఒక్కొక్కరిపై పడే ప్రీమియం భారం తగ్గుతుంది. ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ సైతం మరో పిడుగులాంటిదే. ఉదాహరణకు రూ.10వేల వార్షిక ప్రీమియంపై రూ.1,800 జీఎస్టీని కేంద్రం వసూలు చేస్తోంది. బీమా సంస్థలు వయసుల వారీగా ప్రీమియం పెంచుతుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 35 ఏళ్లు నిండి 36వ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు ప్రీమియం పెరిగిపోతుంది. అలాగే 45 ఏళ్లు నిండి 46లోకి ప్రవేశించినప్పుడు కూడా ప్రీమియం టారిఫ్‌లను బీమా సంస్థలు సవరిస్తుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు అధికమవుతుంటాయి. దీంతో చికిత్సల క్లెయిమ్‌ల రిస్క్ పెరిగిపోతుంటుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బీమా సంస్థల ముందున్న ఏకైక పరిష్కారం ప్రీమియం బాదుడే. ఇక బీమా పాలసీ తీసుకున్న వారు కూడా పెద్ద పట్టణాల్లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో చికిత్సలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పేరొందిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో సాధారణంగానే వైద్య చికిత్సల చార్జీలు ఎక్కుగా ఉంటాయి. దీంతో బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్ బిల్లులు వస్తున్నాయి. ఇది కూడా ప్రీమియం పెరిగేందుకు కారణమవుతోంది. ఇటీవలే బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐర్‌డీఏఐ) ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్‌ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. మారటోరియం పీరియడ్‌ను ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించింది. దీనివల్ల కూడా క్లెయిమ్‌లు పెరుగుతాయన్న అంచనాతో బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తున్నాయి. వచ్చే 12 నెలల కాలంలోనూ ప్రీమియంలు పెరుగుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అసలు హెల్త్ ప్లాన్ అవసరమా?హెల్త్ ప్లాన్ లేకపోతే ఆర్థికంగా కుటుంబం గుల్ల కాక తప్పదు. ప్రీమియం భారంగా మారిందని హెల్త్ ప్లాన్ ప్రీమియం కట్టడం మానేయవద్దు. ఎందుకంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. అదే సమయంలో అత్యాధునిక చికిత్సా విధానాలతో వ్యయాలు కూడా పెరిగాయి. హెల్త్ ప్లాన్ తీసుకోకపోతే.. అనుకోకుండా ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు లేదా రోడ్డు ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, రుణాలతో గట్టెక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకని ఆరోగ్య బీమా రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.– లోకల్ సర్కిల్స్ సర్వే వివరాలివి...→ 21 % మంది గడిచిన ఏడాదిలో తమ పాలసీ ప్రీమియం 50 శాతం కంటే ఎక్కువే పెరిగినట్టు చెప్పారు. 31 % మంది 25–50 % మధ్య ప్రీమియం గతేడాదితో పోలిస్తే పెరిగినట్టు తెలిపారు. → 15 శాతం మంది తమ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదన్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రూప్ హెల్త్ ప్లాన్‌లో ఉన్నవారే.→ మొత్తం 11,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. భారం ఎలా తగ్గించుకోవాలి? పోరి్టంగ్: ఆరోగ్య బీమా ఒకసారి కొనుగోలు చేసి మర్చిపోయే వస్తువు కాదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీ పాలసీలోని సదుపాయాలు ఉన్నాయా? అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. సహేతుక ప్రీమియంపై మరింత మెరుగైన ఫీచర్లను వేరొక బీమా సంస్థ ఆఫర్ చేస్తుంటే, అందులోకి మారిపోవడం మంచి నిర్ణయమే అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకోవచ్చు. కేవలం ప్రీమియం కొంత తక్కువగా ఉందని చెప్పి పోరి్టంగ్ ఆప్షన్‌ను పరిశీలించడం సరైనది కాదు. ప్రీమియంలో చెప్పుకోతగ్గ వ్యత్యాసానికి తోడు, కొత్త సంస్థ ప్లాన్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నప్పుడే పోరి్టంగ్ను పరిశీలించొచ్చు. పోరి్టంగ్తో వేరొక బీమా సంస్థకు మారిపోయిన తర్వాత.. అక్కడ కూడా పాలసీ రెన్యువల్ (పునరుద్ధరణ) సమయంలో ప్రీమియం పెంచరని చెప్పలేం. అన్ని బీమా సంస్థలూ తమ క్లెయిమ్, ప్రీమియం నిష్పత్తి ఆధారంగానే ప్రీమియం పెంపు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. కనుక ప్రీమియం పెంచినప్పుడల్లా దాన్ని తగ్గించుకునేందుకు కంపెనీని మారడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఒకేసారి మూడేళ్లు: ప్రీమియంను ఒకేసారి మూడేళ్లకు చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. ఇలా ఒకేసారి మూడేళ్లకు ప్రీమియం చెల్లిస్తే 10–15 శాతం ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల మూడేళ్ల పాటు ప్రీమియం పెంపు భారాన్ని తప్పించుకోవచ్చు. వయసువారీ శ్లాబు మారే ముందు మూడేళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లించడం వల్ల.. అక్కడి నుంచి మూడేళ్ల పాటు పెంపు లేకుండా చూసుకోవచ్చు. సూపర్‌టాపప్: ప్రస్తుత పాలసీలో ఎంత కవరేజీ ఉందన్నది ఒక్కసారి గమనించండి. ఒకవేళ రూ.10 లక్షల కవరేజీ ఉంటే, దాన్ని రూ.5 లక్షలకు తగ్గించుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.20–50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం మరో మార్గం. దీనివల్ల బేస్ ప్లాన్ ప్రీమియం తగ్గుతుంది. సూపర్ టాపప్ చౌకగా వస్తుంది. దీనివల్ల మొత్తం మీద ప్రీమియంలో 10–15 శాతం తగ్గుతుంది. ఫ్లోటర్ ప్లాన్: అవివాహితులు ఇండివిడ్యువల్ ప్లాన్ తీసుకుని ఉంటే.. వివాహం తర్వాత జీవిత భాగస్వామితో కలసి కొత్త ప్లాన్‌కు వెళ్లొద్దు. అప్పటికే ఉన్న ప్లాన్‌ను ఫ్లోటర్‌గా మార్చుకుని, జీవిత భాగస్వామిని చేర్చుకోవాలి. దీనివల్ల జీవిత భాగస్వామి ఒక్కరికే వెయిటింగ్ పీరియడ్ తదితర నిబంధనలు వర్తిస్తాయి. కొంత ప్రీమియం కూడా తగ్గుతుంది. గ్రూప్ ప్లాన్: ప్రీమియం భారంగా పరిణమిస్తే.. అప్పుడు పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ ప్లాన్ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. లేదంటే దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంక్‌లు గ్రూప్ హెల్త్‌ప్లాన్లను తమ కస్టమర్లకు తక్కువ ప్రీమియానికే ఆఫర్ చేస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. యాక్టివ్ హెల్త్ ప్లాన్: కొన్ని బీమా సంస్థలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే వారికి ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. రోజువారీ వ్యాయామం, నడక తదితర సాధనాలు చేయడం వల్ల అనారోగ్యం రిస్క్ తగ్గుతుందని తెలుసు. దీనివల్ల బీమా సంస్థలకు క్లెయిమ్‌ల రిస్క్ తగ్గుతుంది. పాలసీదారులను ఆరోగ్య సంరక్షణ దిశగా ప్రోత్సహించి, తమ క్లెయిమ్‌లను తగ్గించుకునేందుకు బీమా సంస్థలు ఇలాంటి ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో 50 శాతం వరకు ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. కోపే: బీమా ప్రీమియం కట్టలేనంత భారంగా మారిపోతే.. అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ రద్దు కావడం కంటే.. కో పే ఆప్షన్‌కు వెళ్లొచ్చు. ఉదాహరణకు 20 % కో పే ఎంపిక చేసుకుంటే.. ప్రీమియంలోనూ అంతే మేర డిస్కౌంట్ వస్తుంది. హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నప్పుడు వచ్చే బిల్లులో 80 శాతాన్నే బీమా సంస్థ చెల్లిస్తుంది. 20 శాతాన్ని పాలసీదారు సొంతంగా భరించాల్సి వస్తుంది. నో క్లెయిమ్ బోనస్: దాదాపు అన్ని బీమా సంస్థలు నో క్లెయిమ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే, మరుసటి సంవత్సరం రెన్యువల్ అనంతరం 10–100 శాతం వరకు ఏటా కవరేజీని పెంచుతుంటాయి. ఇలా గరిష్టంగా 100–200 శాతం వరకు కవరేజీ పెరుగుతుంది. ఉదాహరణకు రూ.10 లక్షల హెల్త్ ప్లాన్‌పై 50 శాతం నో క్లెయిమ్ బోనస్ ఆఫర్ ఉందనుకుంటే.. ఒక ఏడాదిలో క్లెయిమ్ లేకపోతే మరుసటి సంవత్సరం కవరేజీ రూ.15 లక్షలకు పెరుగుతుంది. రెండో ఏడాది కూడా క్లెయిమ్ లేకపోతే రూ.20 లక్షలకు పెరుగుతుంది. మూడో ఏడాది క్లెయిమ్ వస్తే, అప్పుడు పెరిగిన రూ.10 లక్షల నుంచి 50 శాతం అంటే రూ.5 లక్షలను తగ్గిస్తాయి. కానీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే సుప్రీమ్ ప్లాన్‌లో సమకూరిన నో క్లెయిమ్ బోనస్‌ను క్లెయిమ్ చేసుకున్నా డిడక్షన్ అమలు చేయడం లేదు. అంటే నో క్లెయిమ్ బోనస్ కూడా కవరేజీగానే మిగిలిపోతుంది. కనుక బేస్ కవర్ రూ.5 లక్షలు తీసుకోవడం ద్వారా ఈ ప్లాన్‌లో మెరుగైన కవరేజీని పొందొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. పెద్దలు ఉంటే వారిని ప్రత్యేక ప్లాన్ కింద వేరు చేయాలి. -
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేది ఆదాయపు పన్ను ఫైలింగ్‌కు అవసరమైన కీలకమైన గుర్తింపు పత్రం. ఇందులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం, తండ్రి పేరు, ఆధార్, లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా లేదా సంప్రదింపు సమాచారం వంటి వివరాలు సరైనవి ఉండడం చాలా అవసరం.ఈ వివరాల్లో ఏవైనా తప్పుగా ఉన్నా, మారినా వెంటనే సరిచేసి పాన్ కార్డును అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు మొదట ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే అదే వెబ్సైట్లోనే పాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక వేళ యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ ద్వారా చేసినట్లయితే ఆ వెబ్సైట్ ద్వారానే పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయాలి.NSDL e-Gov పోర్టల్‌లో.. స్టెప్ 1: NSDL e-Gov పోర్టల్‌ను ఓపెన్ చేయండిస్టెప్ 2: 'సర్వీసెస్' ట్యాబ్‌లోకి వెళ్లి డ్రాప్‌డౌన్ మెనూ నుంచి 'పాన్' ఎంచుకోండి.స్టెప్ 3: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ డేటా' అనే విభాగం కోసం స్క్రోల్ చేసి 'అప్లై' మీద క్లిక్ చేయండి.స్టెప్ 4: అవసరమైన వివరాలతో ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయండిస్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, ఈ-మెయిల్ ద్వారా టోకెన్ నంబర్ వస్తుంది. ఈ టోకెన్ నెంబరు సెషన్ సమయం ముగిసినట్లయితే ఫారం డ్రాఫ్ట్ వెర్షన్ కు తీసుకెళ్తుంది. ఇక్కడ 'కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్' పై క్లిక్ చేయాలి.స్టెప్ 6: ఈ-కేవైసీ, ఈ-సైన్ (పేపర్ లెస్) ద్వారా డిజిటల్ గా సబ్మిట్ చేయండిస్కాన్ చేసిన ఇమేజ్ లను ఈ-సైన్ ద్వారా సబ్మిట్ చేయండిఅప్లికేషన్ డాక్యుమెంట్ లను భౌతికంగా ఫార్వర్డ్ చేయండి అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.ఆధార్ ఓటీపీ ద్వారా ఆన్లైన్లో ప్రక్రియను పూర్తి చేయడానికి, 'ఈ-కేవైసీ & ఈ-సైన్ (పేపర్‌లెస్) ద్వారా డిజిటల్‌గా సబ్మిట్ చేసే మొదటి ఆప్షన్‌ను ఎంచుకోండి.స్టెప్ 7: అప్డేట్ చేసిన పాన్ కార్డు కొత్త ఫిజికల్ కాపీ మీకు అవసరమని సూచించండి. దీనికి నామమాత్రపు ఛార్జీలు వర్తించవచ్చు.స్టెప్ 8: మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేయండి.స్టెప్ 9: అవసరమైన వివరాలను అప్డేట్ చేసి, సంబంధిత దిద్దుబాటు లేదా అప్డేట్ ఎంచుకోండి. 'కాంటాక్ట్ ఇతర వివరాలు' పేజీకి వెళ్లడానికి 'నెక్ట్స్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 10: కొత్త చిరునామా, అప్డేటెడ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాను నమోదు చేయండి.స్టెప్ 11: పాన్ కాపీతో పాటు అప్డేట్ చేసిన వివరాలకు సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్లను జతచేయండి.స్టెప్ 12: మీ పేరును పేర్కొనడం ద్వారా డిక్లరేషన్ విభాగాన్ని పూర్తి చేయండి.స్టెప్ 13: మీ ఫోటో, సంతకం కాపీని జతచేసిన తర్వాత 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 14: ఫారం ప్రివ్యూను సమీక్షించుకుని, మీ ఆధార్ నంబర్ మొదటి ఎనిమిది అంకెలను నమోదు చేయండి.స్టెప్ 15: పాన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పేజీకి వెళ్లండి. వివిధ పేమెంట్ గేట్ వేల ద్వారా పేమెంట్ చేయవచ్చు. విజయవంతంగా చెల్లించిన తరువాత, చెల్లింపు రశీదు జారీ అవుతుంది.స్టెప్ 16: పాన్ కార్డ్ అప్డేట్ / కరెక్షన్ ప్రక్రియను ఖరారు చేయడానికి, 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి. నియమనిబంధనలను అంగీకరించి 'అథెంటికేట్' మీద క్లిక్ చేయడం ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.స్టెప్ 17: మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి.స్టెప్ 18: తర్వాత స్క్రీన్‌పై ఈ-సైన్‌తో 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.స్టెప్ 19: నియమనిబంధనలను అంగీకరించి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, 'సెండ్ ఓటీపీ' పై క్లిక్ చేయండి.స్టెప్ 20: వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి. అక్నాలెడ్జ్ మెంట్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకోండి. ఈ ఫైలును తెరవడానికి పాస్ వర్డ్ DD/MM/YYYY ఫార్మెట్ లో మీ పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.UTIITSL పోర్టల్‌లో ఇలా..స్టెప్ 1: UTIITSL వెబ్‌సైట్‌ను తెరవండిస్టెప్ 2: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్' ట్యాబ్‌ను ఎంచుకుని ‘క్లిక్ టు అప్లయి’ మీద క్లిక్ చేయండిస్టెప్ 3: 'అప్లయి ఫర్ చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్ డీటెయిల్స్' ట్యాబ్‌ను ఎంచుకోండిస్టెప్ 4: డాక్యుమెంట్ సబ్మిషన్ విధానాన్ని ఎంచుకుని, మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి, పాన్ కార్డ్ మోడ్‌ను ఎంచుకుని, 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేయండి.స్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. 'ఓకే' మీద క్లిక్ చేయండి.స్టెప్ 6: ఎక్కడెక్కడ అప్డేట్స్ అవసరమో అక్కడ కచ్చితమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి 'నెక్ట్స్ స్టెప్' పై క్లిక్ చేయండిస్టెప్ 7: మీ ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా అప్డేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి తదుపరి దశకు వెళ్లండి.స్టెప్ 8: పాన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ స్టెప్ బటన్ క్లిక్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.స్టెప్ 9: అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.స్టెప్ 10: ఫారంలోని వివరాలను సమీక్షించి, 'మేక్ పేమెంట్' బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా చెల్లింపు కొనసాగించండి.స్టెప్ 11: నచ్చిన ఆన్లైన్ పేమెంట్ మోడ్‌ను ఎంచుకుని పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి. విజయవంతంగా పేమెంట్ చేసినప్పుడు ఒక సక్సెస్ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. ఈ ఫారాన్ని ప్రింట్ తీసుకోవడం మంచిది.సాధారణంగా పాన్ కరెక్షన్ ప్రక్రియలకు 15 రోజులు పడుతుంది. మీ పాన్ కార్డు పోస్ట్ ద్వారా పంపిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నోటిఫికేషన్ వస్తుంది.ఆఫ్‌లైన్‌లో పాన్ అప్డేట్ ఇలా..» ఇంటర్నెట్ నుంచి పాన్ కార్డు కరెక్షన్ ఫామ్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి.» ఫారం అన్ని విభాగాలను కచ్చితంగా పూర్తి చేసి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి» అవసరమైన డాక్యుమెంట్లతో నింపిన ఫారంను సమీపంలోని పాన్ సెంటర్లో సబ్మిట్ చేయాలి.» సబ్మిట్ చేసి, రుసుము చెల్లించిన తర్వాత, కేంద్రం నుంచి అంగీకార స్లిప్ పొందండి.» 15 రోజుల వ్యవధిలో, ఈ అంగీకార స్లిప్‌ను ఎన్ఎస్డీఎల్ ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్‌కు పంపండి.కావాల్సిన డాక్యుమెంట్లుపాన్ కార్డు డూప్లికేట్ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి గుర్తింపు రుజువులు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఆస్తిపన్ను రశీదులు, యుటిలిటీ బిల్లులు వంటి చిరునామా రుజువులు. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, మెట్రిక్యులేషన్ మార్క్ షీట్ తదితరాల ఆధారాలు. -
ఫుల్ వ్యాలిడిటీ.. ఈ రీచార్జ్ ప్లాన్ల గురించి తెలుసా?
దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్టెల్ 30, 60, 90 రోజుల వ్యాలిడిటీతో రీచార్జ్ ప్లాన్లను అందిస్తోంది. నెలంతా కచ్చితమైన వ్యాలిడిటీని ఇచ్చే ప్లాన్ల కోసం వినియోగదారుల నుంచి అభ్యర్థనలు రావడంతో 30, 60, 90 రోజుల ప్లాన్లను ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది.ఇంతకుముందు 28, 56 లేదా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి.30 రోజుల ప్లాన్లుఎయిర్టెల్లో మొత్తం మూడు 30 రోజుల ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్లు వరుసగా రూ.199, రూ.296, రూ.489 ధరల శ్రేణిలో లభిస్తాయి. ఈ అన్ని ప్లాన్లతో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను పొందవచ్చు.రూ.199 ప్లాన్‌లో 3 జీబీ డేటా, రూ.296 ప్లాన్‌లో 25 జీబీ డేటా, రూ.489 ప్లాన్‌లో 50 జీబీ డేటా లభిస్తుంది. ఇక రూ.296, రూ.489 ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా ఆఫర్ కూడా ఉంది.60 రోజుల వాలిడిటీతో..ఎయిర్ టెల్ రూ.519 ప్లాన్ 60 రోజుల వాలిడిటీని అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత 5జి డేటా, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.90 రోజుల ప్లాన్లు90 రోజుల ప్లాన్ ధర రూ.779. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితో పాటు అపరిమిత 5 జి డేటా, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ కూడా పొందవచ్చు.