Discrimination
-
నా దారి రహదారి
అవని నుంచి అంతరిక్షం వరకు మహిళలు అసాధారణ విజయాలు సాధించి తమ సత్తా చాటుతున్నా.... ఇంకా లింగవివక్షతతో కూడిన బోలెడు ఆశ్చర్యాలు మిగిలే ఉన్నాయి. ఫిలింనగర్ బస్తీలో మక్కల మాధవి బస్ డ్రైవర్‌గా స్టీరింగ్ పట్టినప్పుడు... ‘ఇదేందీ!’ అని ఆశ్చర్యపోయిన వాళ్లే ఎక్కువ. ‘పెద్ద బస్పు నడపడం నీ వల్ల ఏమవుతుందమ్మా!’ అని నిరాశ పరిచిన వారే ఎక్కువ. అయినా సరే...‘నా దారి రహదారి’ అంటూ మాధవి దూసుకువెళుతూ తన డ్రైవింగ్ స్కిల్స్‌తో శభాష్ అనిపించుకుంటోంది...హైదరాబాద్ ఫిలింనగర్‌లోని గౌతమ్‌నగర్ బస్తీలో నివసించే మక్కల మాధవి భర్త రాజేష్ ‘జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్’ బస్సు డ్రైవర్‌గా గత పది సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఇదే బస్సులో మాధవి అటెండర్‌గా పని చేసేది. భర్త బస్సు నడుపుతున్న తీరు చూసి డ్రైవింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. స్కూల్ మైదానంలో భర్త ద్వారా డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకొని ఏడాది క్రితం నుంచే బస్సు నడపడం మొదలుపెట్టింది. స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్‌తోపాటు టీచర్లు కూడా ఆమె పట్టుదలకు ఫిదా అయ్యారు. ప్రోత్సహించారు. పూర్తి అనుభవం వచ్చాకే స్కూల్ బస్సు నడుపుతానని జేహెచ్‌పీఎస్ యాజమాన్యానికి తెలియజేసింది.డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన మాధవిని చూసి ‘బక్కపల్చగా ఉన్న ఈమె బస్సు ఏం నడుపుతుంది!’ అని అధికారులు వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా బస్సు నడపడానికి తిరస్కరించారు. అయితే మాధవి ఏమాత్రం నిరాశ పడలేదు. మూడోసారి వెళ్ళి ఒకసారి తాను బస్సు నడపడం చూడాలని, నచ్చకపోతే లైసెన్స్ ఇవ్వొద్దని వేడుకుంది. ఎత్తు, ఒంపుల్లో బస్సును నడిపించి ఎలాగైనా అనర్హురాలిగా చేసి పంపాలనుకున్న అధికారులు మాధవి బస్సు నడిపించే తీరు చూసి ఆశ్చర్యపోయారు. అభినందించారు. పరీక్షలో పాస్ కావడంతో మాధవికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేశారు. స్కూల్ యాజమాన్యం కూడా ఆమెను మరింత ప్రోత్సహిస్తూ పిల్లలను తీసుకురావడం, ఇంటి దగ్గర దింపేందుకు బస్సు నడిపే బాధ్యతను అప్పగించింది. గో ఎ హెడ్డ్రైవింగ్ చేస్తానని చెప్పినప్పుడు నా భర్త కాస్త భయపడ్డాడు. అయితే నాకు నేర్పించే క్రమంలో గ్రౌండ్లో నా డ్రైవింగ్ చూసి ఆయనకు భయం పోయింది. దీంతో మెల్లమెల్లగా ప్రతిరోజూ అదే గ్రౌండ్లో రెండు గంటలపాటు డ్రైవింగ్ప్రాక్టిస్ చేసేదాన్ని. బస్సు డ్రైవింగ్ పూర్తిగా వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్కూల్ యాజమాన్యం, టీచర్లు వెన్ను తట్టి ప్రోత్సహించడం, బస్సు నడుపుతున్నప్పుడు గో ఏ హెడ్ అని పిల్లలు అరవడం నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది.– మక్కల మాధవి – పురుమాండ్ల నరసింహారెడ్డి,సాక్షి, హైదరాబాద్ -
National Girl Child day 2025 సమాన అవకాశాలేవీ?
స్త్రీని ఆదిశక్తిగా, చదువుల తల్లిగా, అన్నపూర్ణగా పేర్కొనే భారతీయ సంస్కృతికి భిన్నంగా ఆమె శక్తిహీనురాలిగా, నిస్సహాయురాలిగా అణిగిమణిగి సర్దుకు పోయే జీవితం గడపవలసిన దుర్భర పరిస్థితి కొనసాగుతోంది. ఈ వివక్ష పుట్టుకతోనే ఆరంభమవుతుంది. వివక్ష, హింస, లైంగిక వేధింపులు, సరైన విద్య, వైద్య సదుపాయాలు అందుకోలేకపోవడం వంటి సవాళ్లు–ఇబ్బందు లను బాలికలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమాజంలో ఉన్న బాలికలకు సాధికారత కల్పించడం, వారిని రక్షించడం ప్రధాన అంశాలుగా జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి మన దేశంలో జరుపుతున్నారు. బాలికల స్థితిని మెరుగుపరచడంలో దేశం పురో గతి సాధించిన మాట నిజమే. కాని, అది తగినంత కాదు. ఇప్పటికీ విద్య, పోషకాహారం, ఆరోగ్యం వంటి రంగాలలో అసమానతలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించే విధంగా జాతీయ బాలికా దినోత్సవ సందర్భాన్ని వినియోగిస్తోంది. లింగ వివక్షకు సంబంధించిన సమస్యలపై పని చేయడం, బాలికల ఆరోగ్యం, పోష కాహారం, లింగ నిష్పత్తి అంతరాన్ని తగ్గించడం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం; అవకాశాల పరంగా అసమానతలను తొల గించడం; ఆడపిల్లలందరికీ వారి హక్కులు, అర్హమైన గౌరవం, విలువలు లభి స్తాయని నిర్ధారించడం; కొత్త అవకాశాలను అందించడం, ఎదగడానికి వీలు కల్పించడం వంటివి ఈ లక్ష్యాలు. ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’, ‘బాలికాసమృద్ధి యోజన, ‘లాడ్లీ’ పథకం, మాధ్యమిక విద్య కోసం బాలికలకు జాతీయ ప్రోత్సాహకాల వంటి పథకాలను ప్రభుత్వాలు ఎన్ని తీసు కొస్తున్నా... ఆడపిల్లలు తగినంతగా అభివృద్ధి చెందకపోవడం వెనుక ఉన్న కారణాలను అన్వేషించాలి.ఇవీ చదవండి: National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..!National Girl Child Day 2025: అమ్మాయిలకు హెల్తీ ప్లేట్! – డా‘‘ హెచ్. అఖ్తర్ బాను ‘ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్, కర్నూలు(నేడు జాతీయ బాలికా దినోత్సవం) -
ఏపీలో గవర్నమెంటు స్కూలు పిల్లలపై వివక్ష ఎందుకు?. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
చీర, గాజులా..?! తీరు మారదా? మాట వరుస మారదా?
ఇటీవల ఒక నాయకుడు మరో నాయకుడిని దూషించాడు. ఆ దూషణ మహిళలను కించపరిచే అర్థంలో సాగింది. అసమర్థతకు సమానార్థకంగా చీర, గాజులను ప్రస్తావించాడు. దూషణలో ఒక కులాన్ని ప్రస్తావిస్తే కేసు పెట్టడానికి చట్టాలున్నాయి. స్త్రీల గౌరవానికి భంగం కలిగే ఇలాంటి వ్యాఖ్యలకు గట్టి చట్టాలెక్కడ? సమాజంలో నెలకొని ఉన్న వివక్షపూరిత భావజాలానికి అడ్డకట్ట ఎప్పుడు? ఈక్వాలిటీ అంటే ఇదేనా? రాజ్యాంగం స్త్రీపురుషులిద్దరికీ సమానమైన గౌరవాలనే చెప్పింది. వివక్షకు తావులేని నిబంధనలున్నా వివక్ష తప్పలేదు. ఐక్యరాజ్య సమితి 1975 ఉమెన్స్ ఇయర్‌గా ప్రకటించి, అధ్యయనానికి కమిటీని వేసింది. ఆ కమిటీ 1977లో ‘టూవార్డ్స్ ఈక్వాలిటీ’ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం కోసం ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాం కదా, ఇంకా ఏం కావాలి అనే అభి్ర΄ాయంలో ఉన్న మన పాకుల కళ్లు తెరిపించింది ఆ నివేదిక. దీనికి కొనసాగింపుగా 1985 వరకు మహిళాభివృద్ధి కోసం పని చేయాలని కూడా సూచించింది ఐక్యరాజ్య సమితి. మహిళ సాధికారత సాధనలో ముందడుగు వేస్తున్న క్రమంలో 2001 సంవత్సరాన్ని ‘ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఇయర్’గా ప్రకటించింది మన భారత ప్రభుత్వం. ఇన్ని జరుగుతున్నా సమాజం మాత్రం పితృస్వామ్య భావజాలం నుంచి బయటపడడం లేదు. ఒక మగవాడు సాటి మగవాడిని మాటలతో దాడి చేయాల్సి వచ్చినప్పుడు ‘చీర కట్టుకో, గాజులు వేసుకో’అంటున్నారు. ఎదుటి వ్యక్తి మీద అసమర్థత, అనైతికత ఆరోపణలు చేయడానికి స్త్రీత్వాన్ని ఆపాదించడం, స్త్రీల వస్త్రధారణతో గేలి చేయడం వంటి ప్రాక్టిస్ ఏ మాత్రం సరికాదు. ప్రజాజీవితంలోకి వచ్చే వాళ్లు ముందు దయచేసి రాజ్యాంగాన్ని చదవాలి. - ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి (రిటైర్డ్), వరంగల్ మౌనంగా ఉంటే మరింత దిగజారుతుంది! ‘ఇక్కడెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు’ అనే మాట సమాజంలో వినిపిస్తూనే ఉంది. మగవాళ్ల నుంచే కాదు మహిళల నుంచి కూడా. ‘తాము అసమర్థులం కాదు, సమర్థులమే’ అని చెప్పుకోవడానికి మగవాళ్లు గాజులు, చీరలను మాట్లాడుతుంటారు. నిరక్షరాస్యుల్లో తరచూ వినిపిస్తుంటే చదువుకున్న వాళ్లలో అరుదుగా వినిపిస్తుంటుంది. అంతే తేడా. మరికొందరు ఎదుటి వారి మీద దుమ్మెత్తి పోయడానికి, అసమర్థుడివని దెప్పి పొడవడానికి, ‘నీకు చీర, గాజులు పంపిస్తా’ అనడాన్ని కూడా చూస్తున్నాం. మగవాళ్లు ఇలా అన్నప్పుడు ఆడవాళ్లు మౌనంగా ఉంటే ఆ మాటలను, వారి భావాన్ని, అభి్ర΄ాయాన్ని సమ్మతించి నట్లవుతుంది. అందుకే మహిళలు ప్రతిస్పందించాలి. మహిళ మౌనం వహిస్తే పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉంది. తప్పు చేసిన వాళ్లను ఒకప్పుడు గుండు గీయించి, సున్నం బొట్లు పెట్టి ఊరంతా తిప్పేవాళ్లు. ఇలా నోటి దురుసుగా మాట్లాడిన వాళ్ల వ్యాఖ్యలను ఖండించి, తగిన విధంగా తిప్పికొడుతూ ఉండాలి. అప్పుడే సమాజంలో తరతరాలుగా పాతుకు΄ోయిన ఇలాంటి మాటలకు అడ్డుకట్ట పడుతుంది. – ఎం. అమ్మాజీ, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ మాట వెనక్కి తీసుకోవాలి! ఇలాంటి మాటలు ఏ మాత్రం సమ్మతించదగినవి కావు. మగవాళ్లు ఒకరినొకరు తిట్టుకోవడానికి ‘... కొడకా’ అంటూ ఆడవాళ్లనే నిందిస్తారు. వాటి మీద మా తరమంతా పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. స్త్రీల కట్టు, బొట్టుతో గేలి చేయడమూ ఎక్కువైంది. ఒక మగవాడు మరో మగవాడిని అవహేళన చేయాలంటే స్త్రీలతో పోల్చడం, స్త్రీలలాగ వస్త్రధారణ చేసుకోమని గేలిచేయడం అంటే వాళ్ల దృష్టిలో చేతకానివాళ్లకు ప్రతీక స్త్రీలే అనే అభిప్రాయం స్థిరంగా ఉందని అర్థం. ఆ మాటలను వెనక్కి తీసుకోమని డిమాండ్ చేయాలి. మాట వెనక్కి తీసుకునే వరకు పోరాడాలి. ప్రొఫెసర్ గూడూరు మనోజ (రిటైర్డ్), హైదరాబాద్ ఇదీ చదవండి: వంటిట్లోని స్క్రబ్బర్, స్పాంజ్లతో ముప్పు : టాయిలెట్ కమోడ్‌కు మించి బ్యాక్టీరియా -
‘నో ఇంగ్లీష్.. నో హిందీ.. ఓన్లీ కన్నడ’.. మహిళ ట్వీట్ వైరల్
బెంగళూరు : కర్ణాటకలోని ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకే 100 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందంటూ సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు రావడంతో సిద్ధరామయ్య ఆ ట్వీట్‌ను తొలగించారు. అయినప్పటికీ దుమారం కొనసాగుతూనే ఉంది.ఈ తరుణంలో బెంగళూరులోని ఓ కార్పొరేట్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తాను ‘కన్నడ భాష విషయంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాను. అందుకే బెంగళూరు వదిలి వెళ్లిపోతున్నాను’ అంటూ చేసిన థ్రెడ్ పోస్ట్‌కి 14 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయి.పంజాబ్‌కు చెందిన షానీనాని ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఏడాదిన్నపాటు ఉన్నారు. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ లిమిటెడ్ సంస్థలో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటీవ్‌గా విధులు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాదిన్నర కాలంలో బెంగళూరులో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.నాకు పెళ్లైంది. ఏడాది పాటు పంజాబి సంప్రదాయ వస్త్రదారణలో ఆఫీస్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నా వస్త్రదారణ చూసిన వారు నేను పంజాబీ అని గుర్తించేవారు. ఆఫీస్ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఆటో ఎక్కాల్సి వచ్చినా, లేదంటే ఇతర వస్తువులు కొనుగోలు చేసిన మార్కెట్ రేటు కంటే తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. కొన్నిసార్లు మొహం మీదే కన్నడ నేర్చుకోమని వివక్షచూపుతూ మాట్లాడేవారు.ఓరోజు నా ఆఫీస్‌లో కరెంట్యింది. వెంటనే ఆఫీస్‌లోని ఎలక్ట్రిక్ విభాగానికి నేరుగా ఫిర్యాదు చేశా. అక్కడ కూడా నాకు చేదు అనుభవమే ఎదురైంది. అందులో ఓ ఉద్యోగికి సమస్యను పరిష్కరించాలని హిందీ, ఇంగ్లీష్‌లో అడిగా. నో హిందీ,నో ఇంగ్లీష్.. ఓన్లీ కన్నడ.. కన్నడలో మాట్లాడండి. మీసమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో కంగుతినట్లు చెప్పారు.ఇలా వర్ణించలేని ఇబ్బందులు ఎదుర్కొన్నాని, అందుకే బెంగళూరు వదిలి గురుగ్రామ్ వెళ్లినట్లు చెప్పారు. నేను నా ఇంటికి వచ్చా. సంతోషంగా ఉన్నాను. ఇన్ని రోజులు ఎన్నో అవమానాల్ని ఎదుర్కొన్నాను. మంచి ఆహారం తింటాను, నేను కోరుకున్న చోటికి వెళ్లగలుగుతున్నాను అని వ్యాఖ్యానించారు. కాగా, చాలా మంది నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు కన్నడ నేర్చుకుంటే తప్పేముంది.’ అని కామెంట్లు చేస్తున్నారు. -
Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది!
స్త్రీలు సాంకేతికంగా కూడా సాధికారిత సాధించాలనే లక్ష్యంతో వారికి ఉచితంగా కోడింగ్ పాఠాలు నేర్పుతోంది ఢిల్లీవాసి 23 ఏళ్ల జష్నిత్ అహుజా. కోడింగ్ తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. ఈ రకంగా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆశాజ్యోతిగా మారింది జప్నిత్. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు ఉచితంగా డిజిటల్ పాఠాలు నేర్పింది. వంద మంది వాలంటీర్ల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీకి చెందిన జప్నిత్ అహుజాకు కోడింగ్ అంటే చాలా ఆసక్తి. దాంతో కోడింగ్ నేర్చుకోవడం మీదనే దృష్టిపెట్టింది. అదే సమయంలో ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. అదేమంటే, కోడింగ్ రంగంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనీ, ఆ ఉన్న వారిలో కూడా చాలామందికి దానిపై తగినంత పరిజ్ఞానం లేదనీ. మిగిలిన వారితో పోల్చితే కోడింగ్ తెలిసిన వాళ్లకి ఉద్యోగావకాశాలు కాసింత ఎక్కువగానే దొరుకుతాయి. అయితే ఆ రంగంలో పురుషులదే పై చేయి. దాంతో సాంకేతికపరంగా ఏమైనా ఉద్యోగాలు ఉంటే కోడింగ్‌లో వారే ముందుకు దూసుకుపోవడం వల్ల ఆ ఉద్యోగాలు కూడా వారే ఎక్కువగా దక్కించుకోగలుగుతున్నారు. ఇప్పటిదాకా స్త్రీలు ఎన్నో రంగాలలో పట్టుదలతో కృషి చేసి, పై చేయి సాధించగలుగుతున్నప్పుడు కోడింగ్‌లో మాత్రం పట్టు ఎందుకు సాధించకూడదు... అని ఆలోచించింది. అంతే... ముందు తాను ఆ రంగంలో బాగా కృషి చేసింది. పట్టుదలతో కోడింగ్ నేర్చుకుంది... ఆ రకంగా అందులో చకచకా పై మెట్టుకు చేరిపోగలిగింది. తనలాగే మరికొందరు ఆడపిల్లలకు కూడా కోడింగ్ నేర్పితేనో... అనుకుంది. అలా అనుకోవడం ఆలస్యం... ఇతర ఆమ్మాయిలను కొందరిని పోగు చేసి తనకు తెలిసిన దానిని వారికి ఉచితంగా పాఠాలు నేర్పడం ఆరంభించింది. అలా తన 16వ ఏట ఆమె ‘గో గర్ల్’ అనే సంస్థను స్థాపించింది. అయితే భాష సమస్య రాకుండా వారికి వచ్చిన స్థానిక భాషలోనే ఉచితంగా కోడింగ్‌ను నేర్పడం ఆమె ప్రత్యేకత. తోటి ఆడపిల్లలను సాంకేతికంగా ఎదిగేలా చేయడం కోసం ఎంచుకున్న లక్ష్యం, అందుకు ఆమె చేసిన కృషీ వృథా పోలేదు. చాలామంది అమ్మాయిలు ఆమె దగ్గర కోడింగ్ నేర్చుకుని మంచి ఉద్యోగావకాశాలను సాధించుకోగలిగారు. అలా తనకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తన వయసు ఆడపిల్లలకే కాదు, తల్లి వయసు స్త్రీలకు కూడా కోడింగ్ నేర్పడం మొదలు పెట్టింది. అలా తనకు 23 ఏళ్లు వచ్చేసరికి చిన్న, పెద్ద కలిసి దాదాపు రెండు వేల మందికి పైగా ఆమె వద్ద కోడింగ్ నేర్చుకుని సాంకేతికంగా అభివృద్ధి చెంది, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆరవ తరగతి చదివేటప్పుడే కోడింగ్ రంగంలో సాధించిన ప్రావీణ్యం బాల మేధావిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మానాన్న ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేలోగా వారికోసం ఎదురు చూస్తూ రకరకాల వెబ్సైట్లకు రూపకల్పన చేసేదానిని. అప్పుడు నాన్న నాతో.. ‘ఈ పిచ్చి పిచ్చి వెబ్సైట్లు కాదు బేబీ... నువ్వు నాసా సైంటిస్ట్‌గా ఎదగాలి. తలచుకుంటే నీకదేమీ ఒక లెక్కలోనిది కాదు’ అని చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలా ఎయిత్ క్లాస్‌కు వచ్చేసరికి పెద్దయ్యాక నేను చేయవలసింది ఉద్యోగం కాదని... సాంకేతికంగా అభివృద్ధి చెందడం, దానిద్వారా నేను నేర్చుకున్న పాఠాలను పదిమందికీ చెప్పడంలోనే ఎంతో థ్రిల్ ఉందనీ అర్థమైంది. నా దగ్గర కోడింగ్ పాఠాలు నేర్చుకున్న వారే తమంతట తాము స్వచ్ఛందంగా ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ‘కోడింగ్ ఫర్ ఉమెన్ బై ఉమెన్’ కాన్సెప్ట్ మాకు బాగా ఉపకరించింది. అంతేకాదు, డిజిటల్ జెండర్ గ్యాప్ అనే వివక్షను పూడ్చాలన్న నా స్వప్నం సాకారం అయ్యేందుకు ఉపకరించింది. ఏమైనా పిల్లలు గ్యాడ్జెట్స్‌తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లు వాటితో ఏం చేస్తున్నారో... తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. దానిని వారు మంచికే ఉపయోగిస్తున్నారు అని గుర్తించగలిగితే ఆ దిశగా వారిని ప్రోత్సహించడం మంచిది. నా తల్లిదండ్రులు కోడింగ్‌పై నాకున్న ప్యాషన్‌ను గుర్తించకుండా ఏవో పిచ్చి ఆటలు ఆడుతున్నాను అనుకుని దానికి అడ్డుకట్ట వేసి ఉంటే నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేదానిని కాను’’ అని ఆమె చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి. ∙కోడింగ్‌లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు -
Nishtha Satyam: సత్య నిష్ఠతో...
వివక్ష అనేది ఎక్కడో ఉండదు. మన చుట్టూనే పొంచి ఉంటుంది. అలాంటి వివక్షను సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది నిష్ఠా సత్యం. స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై నిష్ఠగా పనిచేస్తోంది... బాలీవుడ్ సినిమా ‘మొహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాట యువ గళాల్లో ఎక్కువగా వినిపిస్తున్న కాలం అది. అందరిలాగే తాను కూడా ఆ పాట హమ్ చేస్తోంది నిష్ఠ. ఆమె తండ్రికి విపరీతమైన కోపం వచ్చి ‘నువ్వు ఎలాంటి పాట పాడుతున్నావో తెలుసా’ అంటు తిట్టాడు. చిన్నపాటి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. ‘సరదాగా రెండు లైన్లు పాడినందుకు ఇంత రాద్ధాంతమా?’ అనుకుంది నిష్ఠ. ఒకవేళ ఈ పాట అబ్బాయి పాడి ఉంటే ఇలాగే జరిగి ఉండేదా? ‘జరగదు’ అని బలంగా చెప్పవచ్చు. ఈ సంఘటన ఒక్కటే కాదు పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న కాలంలోనూ లింగవివక్షను ఎదుర్కొంది నిష్ఠ. మల్టీనేషనల్ కంపెనీ కేపీఎమ్‌జీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఎకానమిస్ట్‌గా పనిచేసిన నిష్ఠా సత్యం ఐక్యరాజ్య సమితిలోకి అడుగు పెట్టింది. ఐక్యరాజ్యసమితిలో పాట్నర్‌షిప్ అడ్వైజర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన నిష్ఠ డిప్యూటీ హెడ్ హోదాలో పనిచేసింది. ఆ తరువాత యూఎన్ ఉమెన్ మిషన్ హెడ్– తిమోర్–లెస్తే బాధ్యతలు చేపట్టింది. ‘రెండు విధాలుగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించాలి. ఒకటి డిఫాల్ట్ సెట్టింగ్ రెండోది డిజైన్ సెట్టింగ్. డిజైన్ సెట్టింగ్ అనేది పురుషుల నుంచి వచ్చింది. వారికి అనుకూలమైనది’ అంటుంది నిష్ఠ. స్మార్ట్ ఫోన్ల సైజ్ నుంచి పీపీయీ కిట్స్ వరకు మార్కెట్లో ఉన్న ఎన్నో వస్తువుల డిజైన్లు మహిళలకు అనుకూలంగా లేకపోవడంలోని వివక్షను ప్రశ్నిస్తుంది నిష్ఠ. ‘సాంస్కృతిక సందర్భాలు వివిధ మార్గాలలో మహిళలను శక్తిమంతం చేస్తాయి. సాధికారతకు సంబంధించి మన ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దడంలో అర్థం లేదని తిమోర్–లెస్తే మహిళల నుంచి నేర్చుకున్నాను’ అంటుంది నిష్ఠా సత్యం. -
నవ భారతంలోకి ముందడుగు
దేశంలో మహిళలు ఇప్పటికీ అర్ధ బానిసత్వంలోనే ఉన్నారు. పితృస్వామ్యం, సంకుచిత సామాజిక, సాంస్కృతిక విలువలు, లింగ వివక్ష వంటివి మహిళల వెనుకబాటుతనానికి కారణాలు. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందక పోవడానికి కారణం, పితృస్వామ్యం. ఈ పరిస్థితి మారాలి. మహిళతో పాటు నిరుద్యోగి, రైతు, కార్మికుడు, యువత కూడా జీవన సంక్షోభంలో ఉన్నారు. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాద భావనలు కూడా సంక్షోభంలో పడ్డాయి. అందుకే 2024 సంవత్సరంలో ప్రజలు ఆత్మగౌరవంతో, అభ్యుదయ భావాలతో నడవాలి. గిరిజనులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛగా జీవించగలిగే నూత్న భారత నిర్మాణం కోసం కలిసికట్టుగా పనిచేయాలి. భారతదేశం లౌకిక దేశం. భారతాన్ని వర్ణ భారతంగా మార్చాలన్నది పెద్ద వ్యూహం. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక, లౌకిక రాజ్యాంగంగా రూపుదిద్దారు. దాని పునాదులను కదపటం ఎవరి వల్లా కాదు. అంబేడ్కర్ రాజ్యాంగ రూపకల్పనలో ఫ్రెంచి విప్లవంలోని వాల్టేర్, రూసో భావాలను తీసు కున్నారు. నిజానికి ఆయన రాజ్యాంగం పునాదుల పునర్నిర్మాణం నుండి ప్రారంభమైంది. రాజ్యాంగం ప్రకారం, ఆరు సంవత్సరముల వయసు పూర్తి అగు వరకు బాల బాలికల ఆరోగ్య పరిరక్షణకు, విద్యా వసతులు కల్పించటానికి ప్రభుత్వం కృషి చేయాలి. 14 సంవత్సరాల వయసు వచ్చువరకు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య నేర్పాలి. అయితే ఈనాటికీ బాల బాలికలకు పౌష్టిక ఆహారం పెట్టలేని స్థితిలో మనం ఉన్నాము. పసిపిల్లలకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. పిల్ల లకు పౌష్టికాహారం కావాలి, ఆరోగ్య పరిరక్షణ కావాలి, పర్యావరణ పరిరక్షణ కావాలి. పురిటిలోనే శిశువులు చనిపోతున్న పరిస్థితులు పెరుగుతున్నాయి. ఒక శిశువుని పెంచి పోషించాలంటే పేదరాలైన తల్లి వల్ల కాదు. దానికి ప్రభుత్వపు, సమాజపు బాధ్యత కూడా కావాలి. నిజానికి ఒక శిశువు మరణిస్తే ఆ దేశానికి భవిష్యత్తు మరణించినట్టే. రాను రాను భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దానికి కారణం విపరీతంగా రేట్లు పెరిగిపోవడమే. 2019 జనవరి నుండి 2022 మే వరకు కూరగాయలు, పాలు, బెల్లం,దుంపలు, వంటనూనె, గుడ్లు, పంచదార ఉత్పత్తి, సరఫరా తగ్గు ముఖం పట్టాయి. బియ్యం, పప్పులు, ఉప్పులు కొనుక్కోలేని స్థితికి సామాన్యులు నెట్టబడుతున్నారు. కారణం కూరగాయలు రైతులకు గిట్టుబాటు కావడం లేదు. ఎరువులు, విత్తనాల ధరలు ఎక్కువవు తున్నాయి. అకాల వర్షాలకు రైతు కుదేలవుతున్నాడు. కాళ్ళు సన్నగా, కడుపులు బోలుగా, భుజాన కండలేక 40 కోట్ల మంది ఈసురోమంటున్నారు. ఇంక స్త్రీల విషయానికి వస్తే పురుషులు తినినంత కూడా తినలేక పోతున్నారు. వాళ్లు అర్ధ బానిసత్వంలోనే ఉన్నారు. వారితో ఆరు గాలం పనిచేయించుకుంటున్నారు. మహిళల్లో సగం మంది కూడా ఉద్యోగినులు లేరు. పితృస్వామ్యం, సంకుచిత సామాజిక, సాంస్కృతిక విలువలు, అల్ప విద్యాస్థాయి, తగు ఆస్తులు లేకపోవడం, లింగ వివక్ష, మహిళలపై నేరాలు, ఘోరాలు అత్యధికంగా ఉండడం వంటివి మహిళల వెనుకబాటుతనానికి కారణాలుగా చెప్పక తప్పదు. ఎన్సీ ఆర్బి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నివేదిక (డిసెంబర్ 2023) ప్రకారం, మహిళల పట్ల జరుగుతున్న నేరాలు 2021లో కంటే, 2022లో 4 శాతం అధికంగా సంభవించాయి. 2022లో మహిళలకు వ్యతిరేకంగా 4,45,000 నేర ఘటనలు జరిగాయి. కుటుంబ సభ్యుల క్రూరత్వం, దౌర్జన్యాలు ఈ నేరాలలో అత్యధికం. ప్రతీ జీవన వ్యవ హారంలోనూ, మరీ ముఖ్యంగా ఆదాయంలో లింగ వ్యత్యాసం, వివక్ష తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలలో పట్టణ మహిళల భాగస్వామ్యం 24.0 శాతం కాగా, పురుషుల శాతం 73.8 శాతంగా ఉన్నది. 2004–2005, 2011–2012 సంవత్సరాల మధ్య కార్మిక శ్రేణుల నుంచి దాదాపు రెండు కోట్ల మంది మహిళలు వైదొలిగారని ప్రపంచ బ్యాంకు నివేదికలు వెల్లడించాయి. ఈ అంతరాలను విస్మరించడమంటే, మహిళలు ఇంకా పలు దశా బ్దాల పాటు అణచివేతకు గురికావడమే అని నిష్కర్షగా చెప్పక తప్పదు. భారతదేశం పితృస్వామ్య వ్యవస్థా నిర్మాణంతో ఉంది.అంటే ప్రతీ అంశంలోనూ పురుషుడిదే ఆధిపత్యం. అందుకే ఆడశిశువు భ్రూణ హత్యలు ఎక్కువగా జరిగాయి. ఫలితంగా చాలామంది పురు షులకు ఇప్పుడు పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకడం లేదు. కొందరు ఎదురు కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకుంటున్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలికలు, యువతులను అపహరించడం, వారిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి వ్యభిచార వృత్తిలోకి దింపడం ఎక్కువవుతోంది. స్త్రీలను అవమానించడం, అను మానించడం, అపహాస్యం చేయడం, అత్యాచారం చేయడం, అణచి వేయడం నిత్యాచారమైంది. భారతదేశం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందక పోవడానికి కారణం, పితృస్వామ్యం. ముందుగా స్త్రీకి మనం పౌష్టికాహారం పెట్టగలగాలి. స్త్రీల పేరు మీద భూములకు పట్టా లివ్వాలి. బస్సుల్లోనే కాక రైళ్ళల్లోనూ, విమానాల్లోనూ ఉచిత సేవలు అందించాలి. అప్పుడు అన్ని చోట్లకీ ఆమె ప్రయాణించగలుగుతుంది. ప్రస్తుతం బంగారు నిల్వలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి, మూడు శవర్లు బంగారం ప్రతీ స్త్రీకి ఇవ్వాలి. ఇకపోతే నిరుద్యోగుల సంఖ్య భారతదేశంలో పెరిగిపోతోంది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’ నివేదిక 2023 ప్రకారం, 25 సంవ త్సరాల లోపు వయసు పట్టభద్రులలో నిరుద్యోగితా రేటు 42.3 శాతం. 30 నుంచి 34 సంవత్సరాల వయసు పట్టభద్రులలో ఇది 9.8 శాతం. ఈ నిరుద్యోగిత పరిస్థితులు సమాజంపై విషమ ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతర్గత వలసలు, అంతకంతకూ పెచ్చరిల్లుతోన్న నేరాలు, హింసాకాండ, మాదకద్రవ్యాల వినియోగం నిరుద్యోగిత పర్యవసానాలే అనడంలో సందేహం లేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్న పాలకపక్షం హామీ కేవలం ఒక ఎన్నికల జుమ్లా (వంచన) అని తేలిపోయింది. నిరుద్యోగులు ఎక్కువ మంది ఆత్మహ త్యలు చేసుకుంటున్నారు. ఎంఏ, ఎంఎడ్, బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీఎడ్‌లు చేసి కూడా ఉపాధి పనులకు వెళ్తున్నారు. సింగపూర్‌లోని హ్యూమన్ క్యాపిటల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్, మరికొన్ని సంస్థలు కలిసి ఏటా విశ్వ ప్రతిభా పోటీతత్వ సూచీ(జీటీసీఐ)ని వెలువరిస్తుంటాయి. విద్య, నైపుణ్య శిక్షణ, అవకాశాల లభ్యత, ప్రభుత్వాల చేయూత వంటి ప్రమాణాల ఆధారంగా ‘జీటీసీఐ’ని రూపొంది స్తాయి. 2023 సూచీలో 134 దేశాలకు గాను ఇండియాకు 103వ స్థానం దఖలుపడింది. అయినా, ప్రపంచంలో అతిపెద్ద ప్రతిభా కర్మా గారం ఇండియాయేనని ప్రభుత్వ వర్గాలు ఊదరగొడుతున్నాయి. ఆర్థిక సాంఘిక సాంస్కృతిక విద్యా సాంకేతిక రంగాలు సంక్షోభంలో ఉన్నాయి. శిశువు, స్త్రీ, నిరుద్యోగి, రైతు, కార్మికుడు, యువత జీవన సంక్షోభంలో ఉన్నారు. భారత రాజ్యాంగం సమర్పించిన స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమత, మమత, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సామ్యవాదం కూడా సంక్షోభంలో పడ్డాయి. అందుకే 2024 సంవత్సరంలో ప్రజలు సామర్థ్యాన్ని పెంచుకొని, చైతన్యవంతంగా ఉత్పత్తిని పెంచుకోవాలి. సామరస్యతను పెంచుకొని ఆత్మగౌరవంతో, అభ్యుదయ భావాలతో నడవాలి. అంబేడ్కర్, ఫూలే, బుద్ధుని ఆశయా లతో సంపద అందరికి పంపిణీ అయ్యే విధానంతో సాగాలి. మొత్తం భారతదేశం 2025 జనవరి 1 కల్లా సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలి. పారిశ్రామిక విప్లవంలో ముందడుగు వేయాలి. గిరిజనులు, దళితులు, బహుజనులు, ప్రజాస్వామ్యవాదులు స్వేచ్ఛగా జీవించ గలిగే నూత్న భారత నిర్మాణం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలి. నదులను అనుసంధానం చేసుకొని ఎక్కువ ఎగుమతులు చేయగలిగిన స్థాయిలో ఉత్పత్తిని పెంచుకోవాలి. సాంకేతిక పరిజ్ఞా నాన్ని మరింతగా పెంచుకోవాలి. చంద్రుడినే కాదు, అనేక గ్రహాలను అధీనం చేసుకునే స్థాయికి ఎదగాలి. భౌతిక, రసాయన శాస్త్ర అధ్యయన విస్తృతి పెరగాలి. నోబెల్ బహుమతి పొందగలిగే స్థాయిలో విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను పెంచాలి. అన్ని దిశలా అన్ని రంగాల్లో భారతీయులందరం భాగస్వాములై భారత భాగ్యోదయా నికి కృషి చేద్దాం. చరిత్రను పాలకులు కాదు, ప్రజలే మారుస్తారు. చరిత్ర నిర్మాణానికి ముందుకు నడుద్దాం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
San Rechal Gandhi : అందమైన విజయం
పాండిచ్చేరికి చెందిన సాన్ రేచల్ గాంధీ తన శరీరం రంగు కారణంగా వివక్షత, అవహేళనలను ఎదుర్కొంది. బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు బంధువులు, కుటుంబ సభ్యులకు నుంచి కూడా వెక్కిరింపులు ఎదుర్కొంది. ఈ వెక్కిరింపులు తట్టుకోలేక తన స్కిన్ కలర్ మార్చుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్‌ను వాడేది. అయితే ఆ ప్రయత్నాలేవీ ప్రయత్నించలేదు. ఒకానొక దశలో రేచల్‌కు విసుగొచ్చి ‘ఇదంతా ఏమిటి!’ అనుకుంది. ‘నేను నల్లగా ఉండడం వల్ల ఎవరికీ నష్టం లేదు’ అనుకుంటూ తన రంగును ప్రేమించడం మొదలు పెట్టింది. ఇలా ఉంటే మాత్రమే, ఈ రంగులో ఉంటేనే అందాల పోటీల్లో విజేతలు అవుతారనే స్టీరియోటైప్ ఆలోచనలను బ్రేక్ చేయాలి, సెల్ఫ్–యాక్సెప్టెన్స్‌ను ప్రమోట్ చేయాలని అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అయితే కొన్ని పోటీల్లో స్కిన్ కలర్ కారణంగా రిజెక్ట్ చేశారు. అయినా పట్టువదలకుండా అందాల పోటీల్లో పాల్గొనేది. ఎన్నో బ్యూటీ టైటిల్స్ కూడా గెలుచుకుంది. గత సంవత్సరం ‘మిస్ పాండిచ్చేరి’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘ఒక డార్క్–స్కిన్ మోడల్‌ను టీవీలో చూసిన తరువాత నాకు కూడా మోడలింగ్ చేయాలనిపించింది’ అంటున్న రేచల్ ఒక జువెలరీ బ్రాండ్‌కు మోడలింగ్ చేసింది. మోడల్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తాజా విజయానికి వస్తే సౌత్ ఆఫ్రికాలో జరగనున్న ‘మిస్ ఆఫ్రికా గోల్డెన్’లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది. -
పాకిస్తాన్‌పై పీఓకే కన్నెర్ర
కోట్లి (పీఓకే): పాకిస్తాన్‌పై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) వాసులు కన్నెర్రజేస్తున్నారు. దశాబ్దాలుగా పాక్ తమపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ మండిపడుతున్నారు. చివరికి కరెంటు బిల్లుల మదింపులో కూడా ఈ వివక్ష భరించలేనంత ఎక్కువగా ఉందంటూ వాపోతున్నారు. ‘మా ప్రాంతం నుంచే ఏకంగా 5,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. దాన్నంతటినీ తరలించుకుపోయి దేశమంతటికీ వాడుకుంటున్నారు. బిల్లుల విషయానికి వచ్చేసరికి ప్రధాన భూభాగంలో వారికి తక్కువగా, మాకు భరించలేనంత ఎక్కువగా వేస్తున్నారు. ఇది మా పట్ల సహించరాని అన్యాయం‘ అంటూ ఆక్రోశిస్తున్నారు. అది కాస్తా కొద్ది రోజులుగా ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. భారీ కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కోట్లి జిల్లాలోనే కేవలం ఒక్క నెలలో రూ.139 కోట్ల బిల్లులు వచ్చాయని ప్రముఖ స్థానిక నేత తౌకీర్ వాపోయారు. ‘అందులో కేవలం రూ.19 కోట్ల బిల్లులు కట్టారు. వచ్చే నెల నుంచి అవి కూడా కట్టేది లేదు‘ అని అన్నారు. తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. -
రాష్ట్రంలో విద్యపై కేంద్రం వివక్ష!
సాక్షి, హైదరాబాద్: విద్య విషయంలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. జాతీయ సంస్థల కేటాయింపులో ప్రతి సారీ రాష్ట్రానికి మొండిచేయి చూపుతోందన్నారు. ‘విద్య, వైద్య రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పురోగతి’పై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చకు ఆమె బదులిచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2020 వరకూ విద్యపై రూ.96 వేల కోట్లు ఖర్చు చేసిందని కాగ్ వెల్లడించింది. ఈ ఏడాది రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణ వచ్చాక 1,342 గురుకులాలు ఏర్పాటు చేశాం. ఉన్నత విద్యకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం. ఫలితంగా రాష్ట్రంలో విద్యార్థుల ప్రవేశాల రేటు 36.2 శాతం ఉంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ..’అని సబిత తెలిపారు. -
ఐఐటీ బాంబేలో కొత్త వివాదం.. నాన్ వెజిటేరియన్లు వేరే చోట కూర్చోవాలంటూ..
ముంబయి: ఐఐటీ బాంబేలో ఆహార అలవాట్లపై వివక్ష చూపుతున్నారనే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. హాస్టల్ క్యాంటీన్లో నాన్‌వెజ్ భుజించే ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానపరిచారని ఓ స్టుడెంట్ తెలిపాడు. హాస్టల్ క్యాంటీన్ 12లో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు చెప్పాడు. క్యాంటీన్లో శాఖాహారం తినే వారికి మాత్రమే ఇక్కడ కూర్చోవాలి అంటూ పోస్టర్లు కూడా అంటించినట్లు వెల్లడించాడు. ఆ ప్రదేశాల్లో నాన్ వెజిటేరియన్లు ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నాడు. హాస్టల్లో తినే ఆహారం ఆధారంగా ఏమైనా విభజన ఉందా? అనే అంశంపై ఆర్టీఐలో సమాధానం కోరినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే.. ఈ ప్రశ్నకు ఫుడ్ ఆధారంగా ఎలాంటి వివక్ష లేదని యాజమాన్యం నుంచి బదులు సమాధానం కూడా వచ్చిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ ఈ విధంగా వివాదం కొనసాగుతోందని తెలిపాడు. ఈ రకమైన వివక్ష తమకు అవమానకరమని కొంత మంది విద్యార్థులు ట్విట్టర్లో పోస్టు చేశారు. అంబేద్కర్ పెరియార్ పూలే స్టడీ సర్కిల్(ఏపీపీఎస్సీ) విద్యార్థులు ఈ అంశంపై స్పందించారు. ఆహారం ఆధారంగా ఎలాంటి విభజన లేదని ఆర్టీఐలో సమాధానం వచ్చినప్పటికీ కొందరు ఈ రకమైన వివక్షను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'విజిటేరియన్స్ ఓన్లీ' అనే పోస్టర్లని క్యాంటీన్ గోడలకు అంటించారని తెలిపారు. Even though RTIs and mails for hostel GSec shows that there is no institute policy for food segregation, some individuals have taken it upon themselves to designate certain mess areas as "Vegetarians Only" and forcing other students to leave that area.#casteism #Discrimination pic.twitter.com/uFlB4FnHqi — APPSC IIT Bombay (@AppscIITb) July 29, 2023 తాము ఉన్నత వర్గాలమని చూటుకోవడానికే కొందరు ఈ రకమైన వివక్ష చూపుతున్నారని విద్యార్థులు చెప్పారు. అట్టడుగు వర్గాల విద్యార్థులను అవమానపరచడమేనని అన్నారు. ఈ అంశంపై ఐఐటీ డైరక్టర్ నుంచి గానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నాన్వెజిటేరియన్ విద్యార్థులు ప్రత్యేక ప్లేట్లను ఉపయోగించాలనే ఘటనలు 2018లోనూ జరిగినట్లు చెప్పారు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
మాది దిగువ వీధి కాదు..ఇందిరా నగర్
‘కీజ తెరు’ అనంటే తమిళంలో ‘దిగువ వీధి’ అని అర్థం. ప్రతి ఊరిలో దిగువ వీధి ఉంటుంది. దిగువ వీధిలో ఎవరుంటారో ఊరి వారికి తెలుసు. దళితులు. వారు నివసించే ప్రాంతాన్ని ఆ విధంగా గుర్తిస్తారు. ‘ఇలా పేరులో వివక్షను తొలగించండి’ అని తమ వాడ పేరును మార్చడానికి సంవత్సరం పాటు పోరాడింది అనసూయ అనే అమ్మాయి. దిగువ వీధికి బదులుగా వారి వీధి మొన్నటి జూలై 1న ‘ఇందిరా నగర్’ అయ్యింది. వివక్ష గుర్తులను చెరిపే పోరాటం కొనసాగిస్తానని అంటోంది అనసూయ. తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ పదవి స్వీకరించాక 2022 అక్టోబర్‌లో గ్రేటర్ చెన్నై అంతటా కులాలను సూచించే వీధుల పేర్లను, భవంతుల పేర్లను తొలగించవలసిందిగా ఆదేశించాడు. దేశంలో అన్నిచోట్ల ఉన్నట్టే తమిళనాడులో కూడా ఊళ్లలోని కొన్ని వీధులను కులాల పేర్లతో పిలవడం వాడుకలో ఉంది. సామాజిక స్పృహ పెరిగాక ఈ ధోరణి తగ్గినా చైతన్యం ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా దళితుల విషయంలో. వీరికి ఆలయాల ప్రవేశంలోగాని, ఊరి కట్టుబాట్లలో ప్రాధాన్యం ఇవ్వడంలోగాని వివక్ష పాటిస్తున్నారనే ఎన్నో వార్తలు తమిళనాడు నుంచి వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అనసూయ శరవణ ముత్తు అనే 28 ఏళ్ల సివిల్ ఇంజినీర్ తన ఊరిలోని తన వాడకు మర్యాదకరమైన పేరు సాధించడంలో విజయం పొందింది. ఆది ద్రావిడార్ తెరు తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఆనందవాడి అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో 1994లో దళితులకు పట్టాలిచ్చారు. 2000 సంవత్సరానికి 100 కుటుంబాలు అక్కడ ఇళ్లు కట్టుకుని తమ పేటకు ‘ఇందిరా నగర్’ అని పేరు పెట్టుకున్నారు. అయితే వారు పెట్టుకునే పేరు వారు పెట్టుకోగా ఊరు వారిని తాను ‘ఎలా గుర్తించాలనుకుంటున్నదో’ అలా గుర్తించి ఆ పేటను ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘పార తెరు’, ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘కీజ తెరు’, ‘దళిత కాలనీ’... ఇలా పిలవడం మొదలెట్టింది. ఇవన్నీ కూడా దళితులు నివసించే ప్రాంతాన్ని సూచించేవే. ‘నా చిన్నప్పుడు స్కూల్లో మా పేట పేరు చెప్పిన వెంటనే నేనెవరో పోల్చుకునేవారు. అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను’ అని ఇదే ప్రాంతం, సామాజిక వర్గం నుంచి చదువుకుని సివిల్ ఇంజనీర్ అయిన అనసూయ శరవణముత్తు అంది. ‘నేను కాలేజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెళ్లిపోయాను. 2022లో తిరిగి వస్తే ఇంకా కులాన్ని సూచించే పేరుతోటే నా పేటను పిలుస్తున్నారు. ఇది ఎంతమాత్రం కుదరదు అని నిశ్చయించుకున్నాను’ అంది అనసూయ. అందరితో పోరాడి... ఇందిరా నగర్ అనే పేరును రెవిన్యూ వారు ఏ మాత్రం పట్టించుకోకుండా ‘దిగువ వీధి’ అనే పేరుతోనే వీరి పేటను రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అలాగే రేషన్ కార్డుల్లో, ఆధార్ కార్డుల్లో, ఓటర్ కార్డుల్లో, చివరకు పాస్‌పోర్టుల్లో కూడా ఇందిరా నగర్ అని తప్ప రకరకాల వివక్ష పేర్లతో ఇక్కడ నివసిస్తున్న దళితుల గుర్తింపు కార్డులు నమోదై ఉన్నాయి. దాంతో అనసూయ 2022 ఆగస్టు నుంచి పోరాటం మొదలెట్టింది. ‘మొదట కలెక్టర్ చుట్టూ తిరిగాను. తిప్పించుకుని తిప్పించుకుని అక్టోబర్ నాటికి అఫీషియల్‌గా రికార్డుల్లో మార్చారు. కాని అసలు సమస్య పంచాయతీతో వచ్చింది. ఆనందవాడి పంచాయతీ మా పేటను దిగువ వీధి అని పిలవకూడదనే తీర్మానం చేయడానికి ఏమాత్రం ముందుకు రాలేదు. నేను పోరాడితే ఫిబ్రవరిలో తీర్మానం చేశారు. ఆ తర్వాత పంచాయితీ పెద్దలొచ్చి మా పేట ముందు బోర్డు పెట్టే కార్యక్రమంలో పాల్గొనమని ఎన్నిసార్లు తిరిగినా రాలేదు. దాని కోసం మళ్లీ పోరాడాల్సి వచ్చింది. చివరకు మొన్న జూలై 1న పంచాయతీ పెద్దలంతా వచ్చి బోర్డును నిలబెట్టి వెళ్లారు’ అని తెలిపింది అనసూయ. వివక్షాపూరితం వెనుకబడ్డ, దళిత వర్గాలను సులువుగా గుర్తించేందుకు ఎప్పటి నుంచో వారు నివసించే ప్రాంతాలకు వివక్షాపూరితమైన పేర్లు పెట్టే ఆనవాయితీ ఉందని ఈ ఉదంతం విన్నాక అనసూయను అభినందిస్తూ విల్లుపురం ఎంపీ రవికుమార్ అన్నారు. ‘నువ్వు ఎక్కడుంటావు అనే ప్రశ్నతో ఎదుటివారి కులం ఏమిటో ప్రాంతాన్ని బట్టి అర్థమవుతుంది. దీంతో వివక్ష మొదలవుతుంది. ఇలాంటి వివక్షాపూరితమైన పేర్లను రాష్ట్రమంతా తొలగించాలి’ అని రవికుమార్ అన్నారు. అనసూయలాంటి అమ్మాయిలు పూనుకుంటే అదెంత సేపు? -
అమెరికాలో ఎవరు మనోళ్లు.. ఎవరు పరాయి వాళ్లు?
* మనలో మనకే ఇంత వివక్షా? * "మనోళ్లు "" మనోళ్ళని " చిన్నచూపు చూస్తారా ? (చాలా కాలంగా అమెరికాలో స్థిరపడి అక్కడి సమాజాన్ని నిశితంగా పరిశీలించిన ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇస్తుంటే , ఆ వ్యక్తి నాతో పంచుకొన్న సమాచారం ఇది) ఓ కుటుంబం ముప్పై అయిదేళ్ల క్రితమే అమెరికా కు వలసపోయారు. అక్కడే ఉన్నత విద్య, ఉద్యోగం, పిల్లలు. ముందుగా వీసా .. అటుపై గ్రీన్ కార్డు .. అటుపై అమెరికా పౌరసత్వం . వారి పిల్లలు అక్కడే పుట్టారు- జన్మతః అమెరికా పౌరసత్వం. మరో కుటుంబం.. వీరు ఇటీవలే అమెరికాకు వెళ్లారు . ఇంకా వీసా పైనే వున్నారు. వారికో అమ్మాయి / అబ్బాయి. వీరిని పెళ్లి చేసుకొంటారా ? పెళ్లి దాక ఎందుకు ? వారు వీరిని చిన్న చూపు చూస్తారు. దగ్గరకు కూడా రానివ్వరు. ఎందుకంటారా? వివరంగా మీరే చదవండి. ముప్పై / నలభై ఏళ్ళ క్రితం అమెరికాకు వలస పోయి, ఇప్పుడు ఆ దేశ పౌరసత్వాన్ని సాధించిన వారు మేమే గొప్ప, ఉన్నతం అనుకొంటారు. చదువుకునేందుకు లేదా ఉద్యోగం చేసేందుకు వచ్చే వారిని చిన్న చూపు చూస్తారు. ఇలాంటి వారికి తమ అబ్బాయి / అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడరు. సంబంధాలు చేసుకోరు. పెద్ద వారికంటే, అక్కడే పుట్టి అమెరికా పౌరసత్వాన్ని జన్మతః సాధించుకొన్న రెండవ తరం వారికి జాత్యహంకార భావన చాలా ఎక్కువ . తాము" బ్రౌన్ తోలు కలిగిన శ్వేత జాతీయులు "అనుకొంటారు. అదేంటి?" బ్రౌన్ తోలు కలిగిన తెల్ల జాతివారు"? అనుకొంటున్నారా ? అవునండీ .. తమ తల్లితండ్రులు" ఆసియా నుండి వలస వచ్చారు కాబట్టి తమకు ఇంకా బ్రౌన్ స్కిన్ ఉందని .. తాము వాస్తవంగా అంటే ఆలోచనల్లో ఆంగ్లం మాట్లాడే పద్దతిలో శ్వేతజాతీయులం అని వారు నమ్ముతారు. చదవండి: భారతీయ అమెరికన్ల విలువ పెంచిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక వీసాపై వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తున్న భారతీయులంటే వారికి చిన్న చూపు. కాలేజీలు, ఆఫీస్‌లలో ఈ బ్రౌన్ తోలు తెల్ల దొరలు , సాధారణ వీసాల వారితో కలవరు, దగ్గరకు రానివ్వరు. ఇక పెళ్లిళ్ల విషయానికి వస్తే బ్రౌన్ తోలు తెల్ల దొరలు , తమలాంటి బ్రౌన్ తోలు తెల్లదొరలనే పెళ్లి చేసుకొంటారు. వీసా వారు తక్కువ జాతివారు ; వారితో పెళ్లి సమస్యే లేదు . అక్కడి మ్యారేజ్ బ్యూరోల్లో " బ్రౌన్ తోలు తెల్ల దొరలకు" వేరే బ్యూరో .. "వీసా వారికి" వేరే బ్యూరో ఉంటుంది . నేను ఒక ప్రశ్న అడిగాను. "అదేంటి అమెరికా దేశాన్ని జాతుల సంగమ దేశంగా పిలుస్తారు కదా ? అక్కడ జాతుల పేరు చెప్పడమే తప్పు . పైగా జాతి అంతరాలు మరచి పెళ్లిళ్లు కూడా చేసుకొంటున్నారు అనుకొంటున్నారా ? అవునండీ .. అది అసలే కాపిటలిస్ట్ దేశం . ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందట. ఆ దేశంలో అత్యుత్తమ జాతి ఏది ? శ్వేత జాతి కదా ? రెండో స్థానం బ్రౌన్ తోలు తెల్ల దొరలు / దొరసానులు . అంటే ఇండియా చైనా లాంటి దేశాల నుండి వలస వచ్చిన తల్లితండ్రులకు పుట్టి జన్మతః ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన వారు . ఇక అట్టడుగు స్థాయిలో ఉన్న వారు వీసాపై వచ్చి చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు. శ్వేత జాతి అమ్మాయి, రెండో కేటగిరీకి చెందిన వారినో పెళ్లి చేసుకుంటుందా ? మామూలుగా అయితే జరగదు కానీ.. ఒక లెక్క ప్రకారం జరిగే ఛాన్స్ ఉంది. ఆఫ్రికా / ఇండియా మూలం కలిగిన వ్యక్తి బాగా డబ్బు సంపాదించాడు. తెల్ల అమ్మాయికి ఉద్యోగం లేదు. లేదా తక్కువ జీతం వచ్చే ఉద్యోగం . ఇప్పుడు తాను, తన జాతి పరమైన ఉన్నత స్థానాన్ని ట్రేడింగ్ చేసుకొంటుంది . స్టార్ స్టేటస్ పొందిన నల్ల / బ్రౌన్ జాతి మూలాల్ని కలిగిన యువకుడ్ని పెళ్లి చేసుకొంటే .. వీడికి తెల్ల అమ్మాయి దొరికింది అనే తృప్తి. ఆమెకు కాష్ ఫ్లో .. రేపు పెళ్లి పెటాకులు అయితే .. కావాలని పెటాకులు చేసుకొన్నా.. సగం జీతం .. ఆస్థి లో సగం . దెబ్బకు రెండు పిట్టలు . జాతులు కలిసిపోయి కొత్త తరం మానవాళి రూపొందడం ఉత్తుత్తి మాటే .. అక్కడ సరి కొత్త జాతులు వెలుస్తున్నాయి. చర్మం రంగు .. గ్రీన్ కార్డు / పొరసత్వం , శాలరీ ప్యాకేజీ వీటి ఆధారంగా సరి కొత్త జాతులు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో తిరకాసు. దక్షిణ భారతీయులు కొంత లిబరల్ అట. ఉత్తర భారత దేశ మూలాలు కలిగిన వారైతే మహా ముదుర్లు అట . మనిషి ..మానవత్వం ..మట్టి.. మశానం..అన్ని ఉత్తుత్తి మాటలే .నువ్వు అమెరికన్ సిటిజానా ? లేక ఆకు పచ్చ కార్డు ? ఆకు పచ్చ కార్డు అయితే ఇక్కడ "ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన జనాలు" అంటారే .. అలాగే ట్రీట్ చేస్తారట . దీనికి తోడు నీ శాలరీ ప్యాకేజీ ఏంటి ? బ్యాంకు బాలన్స్ ఎంత ? .. అక్కడితో అయిపోయిందా ? చదివింది ఎక్కడ ? నువ్వు వీసా పైన ఉన్నా.. ఐఐటీ సరుకైతే కాస్త గౌరవం . అదే చైనా కోళ్లఫారాల సరుకంటే మాహా చిన్న చూపంట.ఇలాంటి వారికి ఏదో పేర్లు వున్నాయి. ఇక్కడి మీడియాకు ఎవరైనా చెప్పండయ్యా బాబు .. " మనోళ్లు " మనోళ్లు " అని రాస్తుంటే / చెబుతుంటే ఏదో ఫీలింగ్ వస్తోంది. చివరాకరికి మనోళ్లు కేటగిరీ అయితే .. జో బిడెన్ .. బరాక్ ఒబామా .. చైనా లో ఫుట్ పాత్ పై వస్తువులు అమ్ముకొనే చున్ వన్ ఉఛ్ .. మెక్సికో నుంచి వలస వచ్చి అమెరికా ఇళ్లల్లో పని చేసుకొనే ఇసాబెల్లా .. కెరిమెన్ .. అందరూ.. అందరూ.. అందరూ మనోళ్లే . వారిది మనది హోమో సేపియన్స్ అనే ఒకటే జాతి . కానీ మనోళ్లు అనే ఫీలింగ్ లేని వారిని.. కనీస మానవ విలువలు లేని వారిని ఎగేసుకొని మనోళ్లు మనోళ్లు అనడం పరమ అసహ్యంగా ఉంటుందా ? ఉండదా ? ఇంత ఆత్మ న్యూనత.. ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంటో ? వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక పరిశోధకులు -
బ్రిటన్ స్కూళ్లల్లో భారతీయ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నారా?
1 ." మీరు స్వస్తిక్ గుర్తును పవిత్రంగా భావిస్తారు. అంటే మీరు నాజీలను సమర్థించేవారు". 2 . " మీరు 330 మిలియన్ దేవతల్ని పూజిస్తారు . అందులో కోతి, ఏనుగు లాంటి జంతువులు కూడా ఉన్నాయి" 3 ." మీరు సతి సహగమన ఆచారాన్ని పాటించారు ". 4 ." మీ కుల వ్యవస్థ వల్లే హిట్లర్ అలా అయ్యాడు" బ్రిటన్ పాఠశాలల్లో భారతీయ మూలాలు కలిగిన విద్యార్థుల్ని బెదిరిస్తూ / గేలి చేస్తూ తోటి విద్యార్థులు అన్న మాటలివి. హెన్రీ జాక్సన్ సొసైటీ బ్రిటన్ లో నివసిస్తున్న వెయ్యి మంది తల్లితండ్రుల్ని ఇంటర్వ్యూ చేసి వెలికి తెచ్చిన కొన్ని అంశాలు ఇవి. ఇలాంటి బుల్లియింగ్ వల్ల తమ పిల్లలు పాఠశాలలకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు అని ఆ తల్లితండ్రులు చెప్పుకొచ్చారు. ఇది కేవలం బ్రిటన్ పాఠశాలలకు పరిమితమయిన అంశం కాదు. మాయ మర్మం తెలియని వయసులో చుట్టూరా ఉన్న సమాజం, మీడియా నాటిన విష బీజాల కారణం గా నేటి విద్యార్థుల్లో కుల / మత/ ప్రాంత / వర్ణ విద్వేషలు పెచ్చరిల్లు తున్నాయి. ఒక పక్క ప్రపంచం కుగ్రామంగా మారుతున్న వైనం . గ్రామాలు/ పట్ఠణాలు / రాష్ట్రాలు / దేశాలు లాంటి ఎల్లలు దాటి సముద్రాలు దాటి ఖండాలు దాటి తల్లితండ్రులు వలసపోతున్నారు. ఎక్కడో సెటిల్ అవుతున్నారు . అక్కడ పుట్టిన పిల్లలు తమ పూర్వీకుల సంస్కృతిని అది మంచో చెడో తరువాత .. పూర్తిగా ఒంట బట్టించుకోలేరు .. అక్కడి సమాజం లో పూర్తిగా కలవాలంటే ఇదిగో ఇలాంటి ఆటంకాలు / అవాంతరాలు. విద్వేషం .. నేటి సార్వ జనీన జీవన విధానం అయిపోయింది . అవతలి వారి పై కులం/ మతం / వర్ణం / జాతి /పుట్టుక లాంటి వాటి ఆధారంగా విద్వేషాన్ని పెంచుకోవడం .. ఆస్ట్రేలియా నుంచి కెనడా దాకా ఇదే తంతు. లాక్ డౌన్ కాలం లో ఇంటికే పరిమితం కావడం వల్ల జనాల్లో సంకుచిత స్వభావం బలపడిపోయింది . దీనికి తోడు ఆర్థిక మాంద్యం .. కొరతలు .. ద్రవ్యోల్భణం .. ఉద్యోగాలు కోల్పోవడం .. నిరుద్యోగిత .. బలహీనతల్ని రెచ్చగొట్టే సోషల్ మీడియా .. యు ట్యూబ్ వీడియోలు .. అన్నింటికీ మించి మానవ బలహీనతల్ని కనిపెట్టి కాష్ చేసుకొనే రాజకీయ రాబందులు... వందేళ్ల క్రితం ఇప్పుడు మనకు కరోనా వచ్చినట్టే స్పానిష్ ఫ్లూ వచ్చింది. అటు పై మొదటి ప్రపంచ యుద్ధం. అటు పై పదేళ్ల పాటు ప్రపంచ మాంద్యం .. కొరతలు .. దీన్ని ఆసరాగా చేసుకొని నాజిజం, ఫాసిజం , స్టాలినిజం .. ఇలా ప్రపంచం లో అనేక ప్రాంతాల్లో నిరంకుశ రాజ్యాలు వచ్చాయి . మానవాళి పెను మూల్యం చెల్లించుకొంది . బుద్ధి ఉన్నవాడు చరిత్ర నుంచి పాఠాల్ని గ్రహిస్తాడు . డిజిటల్ యుగం లో చరిత్ర పాఠాలు గాలికి పోయాయి . మానవాళి నేడు ఉపద్రవం వైపు వడివడిగా అడుగులేస్తోంది. ప్రేమ .. సహానుభూతి .. ఓర్పు ఇవే మానవాళిని రక్షించగల మందులు . సర్వే జనా సుఖినోభవంతు ! వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
సంకల్ప బలమే సబల విజయం
కోపం వస్తే కొందరు ఏంచేస్తారు? దగ్గర్లో ఉన్న వస్తువును నేలకేసి బాదుతారు. మరింత ముందుకు వెళ్లి తమకు తాము హాని చేసుకుంటారు. ప్రతికూలత ప్రతిధ్వనించే కోపాన్ని శక్తిగా మలుచుకుంటే అద్భుతాలు సాధించలేమా! ‘అప్నా క్లబ్’ కో–ఫౌండర్, సీయీవో శ్రుతి విజయగాథ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది... శ్రుతికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అయితే అది అకారణ కోపం మాత్రం కాదు. ‘నీకు ముగ్గురూ ఆడపిల్లలేనా. అయ్యో!’ అని తన తండ్రి దగ్గర ఎవరో వాగినప్పుడు... ‘ఈ అమ్మాయిలకు మ్యాథ్స్ బొత్తిగా రాదు’ ‘కాలేజీలో సైన్స్ జోలికి వెళ్లవద్దు. ఏదైనా తేలికపాటి సబ్జెక్ట్ తీసుకోండి’ అని క్లాసు టీచర్ ఉచిత సలహాలు ఇచ్చినప్పుడు... ‘అలా గట్టిగా నవ్వుతావేమిటీ? ఆడపిల్లను అనే విషయం మరిచావా’ అని బంధువు ఒకరు అన్నప్పుడు... ఆమెకు కట్టలు తెచ్చుకునేంత కోపం వచ్చేది. అయితే ఆ కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తనకు తెలుసు. ‘ఆడపిల్లలకు మ్యాథ్స్ రాదు’ అని వెక్కిరింపు శ్రుతిలో పట్టుదలను పెంచి ఐఐటీ–దిల్లీ వరకు తీసుకెళ్లింది. అయితే అక్కడ కూడా లింగవివక్ష రకరకాల రూపాల్లో వెక్కిరించేది. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు ‘ఇక్కడ ఆడవాళ్లకు ఏం పని?’ ‘స్కోర్ జీరో బ్యాచ్’ ఇలా ఎన్నో వెక్కిరింపులు వినిపించేవి. తన స్నేహితులతో కలిసి ఎన్నో కప్పులు గెలుచుకొని ఆ వెక్కిరింపులకు గట్టి సమాధానం చెప్పింది శ్రుతి. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగప్రస్థానం మొదలైంది. అయితే అక్కడ కూడా ఏదో రకమైన వివక్షత కనిపించేది. ఆ తరువాత కాలంలో... ఉద్యోగం వద్దనుకొని ఒక స్వచ్ఛంద సంస్థలో చేరింది శ్రుతి. అక్కడ మనసు ప్రశాంతంగా అనిపించింది. తన గురించి తాను తీరిగ్గా ఆలోచించుకునే అవకాశం వచ్చింది. ‘ప్రయాణించడానికి దారులు ఎన్నో ఉన్నాయి. సాధించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి’ అనే ఎరుక ఆమెలో కలిగింది. ‘నువ్వు ఎంబీఏ చేస్తే రాణించగలవు’ అని అక్కడ ఒకరు సలహా ఇచ్చారు. అలా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్‌బీఎస్)లో చేరింది. ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత ‘సైర్’ పేరుతో టూర్ అండ్ ట్రావెల్ స్టార్టప్‌ను ఆరంభించింది. ఈ స్టార్టప్ నష్టాలు మిగల్చడంతో పాటు విలువైన పాఠాలు నేర్పింది. ఆ పాఠాల వెలుగులో మరో ప్రయాణం మొదలుపెట్టింది శ్రుతి. చిన్న పట్టణాలలో ప్రజలు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్) ప్రాడక్ట్స్ కొనడానికి ఆసక్తిగా ఉన్నారనే విషయం అర్థమైన తరువాత మనీష్ కుమార్‌తో కలిసి ‘అప్నాక్లబ్’ అనే ఎఫ్ఎంసీజీ ప్లాట్‌ఫామ్‌ను బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ఒక రేంజ్లో సక్సెస్ అయింది. శ్రుతిలో ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ప్రపంచానికి తెలిసాయి. ‘అప్నాక్లబ్’ బ్యాకర్స్ జాబితాలో టైగర్ గ్లోబల్, ట్రూ స్కేల్ క్యాపిటల్, వైట్‌బోర్డ్ క్యాపిటల్... మొదలైన సంస్థలు ఉన్నాయి. ‘శ్రుతి గొప్ప సంకల్పబలం ఉన్న వ్యక్తి’ అని ప్రశంసిస్తున్నారు వైట్‌బోర్డ్ క్యాపిటల్ పార్ట్నర్ అన్షు ప్రషర్. నిజమే కదా... ‘ఆడపిల్లలకు లెక్కలు రావు’ అనే వెక్కిరింపును సవాలుగా తీసుకొని సంకల్పబలంతో గణితంలో ప్రతిభ ప్రదర్శించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకునే రోజుల్లో అదృశ్య వివక్షను ఖాతరు చేయకుండా ముందడుగు వేయడానికి ఆ సంకల్పబలమే ఉపయోగపడింది. స్టార్టప్ యాత్రలో కూడా కామెంట్స్ రూపంలో లింగవివక్షత కనిపించినా, ధైర్యం కోల్పోకుండా ఉండడానికి ఆ సంకల్ప బలమే ఉపయోగపడింది. ఎక్కడో మొదలైన సంకల్పబలం ‘అప్నా క్లబ్’ వరకు తనతోనే ఉంది. చీకటి కమ్ముతున్నప్పుడు వెలుగును ఆయుధంగా ఇచ్చింది. ఓటమి వెక్కిరించినప్పుడు గెలుపును ఆయుధంగా ఇచ్చింది. ‘కోపం ఉన్న ఆడవాళ్లను జనాలు అసౌకర్యంగా చూస్తారు. మగవాళ్ల విషయానికి వస్తే యాంగ్రీ యంగ్‌మెన్ అని మురిసిపోతారు’ అంటూ నవ్వుతుంది శ్రుతి. తనను ‘ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడం కంటే ‘ఎంటర్ప్రెన్యూర్’గా పిలిపించుకోవడానికే శ్రుతి ఇష్టపడుతుంది. చిన్నప్పుడు తండ్రి ఒకరోజు అడిగాడు... ‘మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు స్కోర్ చేయాలో తెలుసా?’ ‘నన్ను నమ్మండి’ అన్నది శ్రుతి. అప్పటినుండి తనపై తనకు ఉన్న నమ్మకాన్ని, ఇతరులకు తనపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు శ్రుతి. -
‘సాగు’లో లింగవివక్ష మూల్యం 81.84 లక్షల కోట్లు!
మహిళలపట్ల వివక్ష వల్ల సామాజికంగా వాటిల్లే నష్టానికి వెలకట్టలేం. అయితే వ్యవసాయం, ఆహార శుద్ధి, నిల్వ, పంపిణీ (అగ్రి ఫుడ్ సిస్టమ్స్) రంగాల్లో లింగవివక్ష వల్ల ఎంత నష్టం వాటిల్లుతున్నదో తెలుసుకొనేందుకు ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఇటీవల అధ్యయనం చేసింది. లింగవివక్ష కారణంగా ఏటా లక్ష కోట్ల డాలర్ల (రూ. 81,84,550 కోట్లు) సంపదను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోల్పోతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. వ్యవసాయ రంగంలో మహిళల స్థితిగతులపై 2010 విరామం తర్వాత ఎఫ్ఏఓ వెలువరించిన తొలి అధ్యయన నివేదిక ఇదే. వ్యవసాయంతోపాటు ఈసారి ఆహార శుద్ధి, రవాణా, నిల్వ, పంపిణీ రంగాల్లో రైతులుగా, కూలీలుగా, ఉద్యోగినులుగా, వ్యాపారవేత్తలుగా, చిరు వ్యాపారులుగా పనిచేసే మహిళల స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక విడుదల చేయటం గమనార్హం. వివక్షను రూపుమాపితే రైతుల ఆదాయం పెరుగుతుంది వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలపట్ల లింగ వివక్షను నిర్మూలిస్తే ఆహారోత్పత్తి పెరిగి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరుతుంది. పేదరికం, ఆకలి తగ్గుతుంది. 4.5 కోట్ల మంది నిరుపేదలకు అదనంగా ఆహార భద్రత కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఎఫ్ఏఓ తేలి్చచెప్పింది. అంతేకాదు.. వాతావరణ మార్పులు, కోవిడ్ మహమ్మారి వంటి విపత్కర పరిస్థితులను దీటుగా తట్టుకోవాలన్నా లింగవివక్షను రూపుమాపాల్సిన అవసరం ఉందని ఎఫ్ఏఓ నివేదిక స్పష్టం చేసింది. లింగ వివక్షను తగ్గించి మహిళా సాధికారతను పెంచే పథకాల వల్ల సగానికి సగం చిన్న రైతులకు మేలు జరుగుతుంది. 5.8 కోట్ల మంది ఆదాయం పెరుగుతుంది. మరో 23.5 కోట్ల మందికి విపత్తులను తట్టుకొనే శక్తి పెరుగుతుందన్నది తమ అంచనా అని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు తెలిపారు. ఏ ముప్పు అయినా మహిళలనే ముందు దెబ్బతీస్తుంది. కోవిడ్ మహమ్మారి వచి్చన మొదటి ఏడాదిలో ఆహార శుద్ధి, పంపిణీ రంగంలో 22% మహిళల ఉద్యోగాలు పోతే, 2% పురుషుల ఉద్యోగాలు పోయాయి. కరువు కాటకాలు, ఉష్ణోగ్రతలు పెచ్చుమీరిన సంక్షోభ కాలాల్లో వ్యవసాయ–ఆహార రంగాల్లో పనిచేసే మహిళల బిడ్డల పోషణ, ఇంటి పనికి అదనంగా దూరం వెళ్లి నీళ్లు తెచ్చే భారం పెరిగిపోతోంది. అల్ప, మధ్య తరహా ఆదాయ దేశాల్లో మొబైల్ ఇంటర్నెట్ సదుపాయం విషయంలో లింగ వివక్ష 25% నుంచి 16 శాతానికి తగ్గినట్లు గుర్తించారు. గత పదేళ్లుగా అనేక దేశాల్లో మహిళలకు అనుకూల విధానాలు వస్తున్నప్పటికీ వ్యవసాయం–ఆహార రంగాల్లో పెద్ద మార్పు కనిపించట్లేదు. 68 దేశాల్లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 75% విధానాల్లో మహిళల ప్రాధాన్యతను గుర్తించినప్పటికీ లింగవివక్షను తగ్గించే ప్రయత్నాలు 19% విధానాల్లోనే కనిపించింది. విధాన నిర్ణేతలు క్షేత్రస్థాయిలో లింగవివక్షను తగ్గించేందుకు మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని ఎఫ్ఏఓ సూచించింది. గొడ్డు చాకిరీ.. 18% తక్కువ ఆదాయం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, ఆహార వ్యవస్థలపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య 400 కోట్లు. ఏటా 1,100 కోట్ల టన్నుల ఆహారోత్పత్తి జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సగటున 36% మంది మహిళలకు, 38% మంది పురుషులకు ఉపాధి కల్పిస్తున్న రంగం ఇది. అయితే ఆఫ్రికా దేశాల్లో 66% మంది మహిళలకు వ్యవసాయమే ఉపాధి. చిన్న, సన్నకారు రైతులకు నిలయమైన భారత్ తదితర దక్షిణాసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువ. ఈ దేశాల్లో 71% మంది మహిళలు (మహిళా రైతులు, కూలీలు, ఉద్యోగినులు) వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్నారు. అలాగే పురుషులు 47% మంది ఉపాధి పొందుతున్నారు. అయితే కూలికి వెళ్లే వారిలో పురుషులకన్నా మహిళల సంఖ్యే తక్కువ. గత పదేళ్లలో పొలం పనులపై ఆధారపడే వారి సంఖ్య 10% తగ్గినట్లు ఎఫ్ఏఓ.నివేదిక చెబుతోంది. వ్యవసాయ–ఆహార వ్యవస్థల్లో ఉపాధి పొందుతున్న మహిళల పని పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. గొడ్డు చాకిరీ చేసినా పని భద్రత లేదు. పార్ట్‌టైమ్ పనులు, కొన్నాళ్లు మాత్రమే ఉండే పనులు, తక్కువ నైపుణ్యం అవసరమైన పనులే మహిళలకు ఇస్తున్నారు. అందువల్ల పురుషులకన్నా 18% తక్కువగా వారి ఆదాయం ఉంటోంది. కౌలు రైతులకు మరీ కష్టం.. భూమిని కౌలుకు తీసుకున్న మహిళా రైతులు తీవ్ర అభద్రతకు గురవుతున్నారని ఎఫ్ఏఓ పేర్కొంది. 46 దేశాల్లో గణాంకాలను పరిశీలిస్తే 40 దేశాల్లో పురుష రైతులకు ఎక్కువ భూమి హక్కులు ఉన్నాయి. అదేవిధంగా కౌలు నిబంధనలు కూడా వారికి అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు మహిళా రైతులకు రుణ సంస్థల నుంచి పరపతి అందట్లేదు. శిక్షణా అవకాశాలు మహిళలకు అంతగా అందుబాటులో ఉండట్లేదు. అన్నిటికన్నా మించి పురుషులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సాంకేతికతలు, యంత్రాలనే మహిళలు ఉపయోగించాల్సి వస్తోంది. ఈ అసమానతల వల్ల సమాన విస్తీర్ణంలో పంటలు సాగు చేసిన పురుషులకన్నా మహిళలు సాగు చేసిన పొలాల్లో ఉత్పాదకత 24% తక్కువగా వస్తున్నట్లు ఎఫ్ఏఓ నివేదిక తెలిపింది. ఇప్పుడు మహిళల కోసం వ్యవస్థలు పనిచేయాలి వ్యవసాయ, ఆహార రంగాల్లో లింగ అసమానతలను స్థానికంగా ఎక్కడికక్కడ పరిష్కరించి మ హిళలకు సాధికారత కలి్పస్తే పేదరికాన్ని అంతం చేయడం, ఆకలి కేకలులేని ప్రపంచాన్ని సృష్టించ డం వంటి లక్ష్యాల సాధన కృషిలో ప్రపంచం ముందుకు దూసుకుపోతుంది. వ్యవసాయ, ఆహార వ్యవస్థల్లో మహిళలు అనాదిగా పనిచేస్తున్నారు. వారి కోసం ఈ వ్యవస్థలు పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది. – డా. క్యూ డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) చదవండి: కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే -
జుట్టుపైనా వివక్ష! క్రౌన్ యాక్ట్ బిల్లుకు ఆమోదం, వారికి ఆనందానికి అవధుల్లేవ్
‘అది జుట్టా, కలుపు మొక్కా?’ అని ఒకరు, ‘గొర్రె బొచ్చుకు, వారి జుట్టుకు ఏమన్నా తేడా ఉందా?’ అని మరొకరు ‘నల్ల జుట్టుంటే ఉద్యోగానికేం పనికొస్తారు?’ జుట్టుపై అమెరికన్ల వివక్షాపూరిత వ్యాఖ్యలివి! జాతి వివక్ష, మత వివక్ష, కుల వివక్ష గురించి విన్నాం. కానీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో మాత్రం తలపై జుట్టు దగ్గర్నుంచి కాలి గోళ్ల దాకా అక్కడ అన్నింటా వివక్ష రాజ్యమేలుతోంది. నల్ల జుట్టుపై వివక్షను నిషేధిస్తూ టెక్సాస్ హౌస్ తాజాగా బిల్లును ఆమోదించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయంగా మారింది... జుట్టు నల్లగా, పొడవుగా, రింగులు తిరిగి ఉంటే అమెరికన్లు సహించలేరు. కొప్పు బాగా కుదిరితే చక్కగా ఉంటుందంటాం. కానీ నల్లజాతి అమ్మాయిలు రకరకాల హెయిర్ స్టైల్స్‌తో కొప్పును గొప్పగా ప్రదర్శించడం కూడా అమెరికన్లకు కంటగింపు వ్యవహారమే. స్కూళ్లు, పని ప్రాంతాలు, నలుగురు కలిసే చోట... ఇలా అంతటా ఈ వివక్ష తీవ్ర రూపు దాల్చి కన్పిస్తుందక్కడ. ఆఫ్రో, బ్రయిడ్స్, డ్రెడ్‌లాక్స్, కార్న్‌రోస్ హెయిర్ స్టైల్స్ చేసుకునే వారిపై వివక్ష పెరిగిపోతుండటంతో టెక్సాస్‌లో ప్రతినిధుల సభ కల్పించుకోవాల్సి వచ్చింది. నల్లజుట్టుపై వివక్ష పనికిరాదంటూ క్రౌన్ యాక్ట్ బిల్లును ఆమోదించింది. జుట్టుపై వివక్ష తగదంటూ డెమొక్రాట్ సభ్యురాలు రెట్టా బోవర్స్ తొలుత గళమెత్తారు. ఎవరి జుట్టు ఎలా ఉంటే అలానే ఉండనివ్వాలి. మార్చుకొమ్మని శాసించే హక్కు ఎవరికీ ఉండదు’’అన్నారామె. బోవర్స్ తొలిసారి ఈ బిల్లును ప్రతిపాదించినప్పుడు ఇదంత అవసరమా అని అంతా కొట్టిపారేసారు. కానీ ఇప్పుడది 143–5 ఓట్లతో నెగ్గడంతో ఆమె ఆనందం అవధులు దాటింది. బిల్లు ఎలా వచ్చిందంటే.. హ్యూస్టన్‌లో బార్బర్స్ హిల్ హైస్కూలులో అధికారులు డెండ్రే ఆర్నాల్డ్ అనే విద్యార్థిపై చూపిన వివక్ష ఈ బిల్లుకు కారణమైంది. ఆర్నాల్డ్ ఏడో తరగతి నుంచి జుట్టు పెంచుకుంటున్నాడు. అది ట్రినిడాడియన్ల సంస్కృతిలో భాగం. కానీ జుట్టు కత్తిరించుకోకుంటే గ్రాడ్యుయేషన్ క్లాసులకు అనుమతించేది లేదని స్కూలు అధికారులు తేల్చి చెప్పారు. అబ్బాయి తల్లిదండ్రులు కాళ్లావేళ్లా పడ్డా లాభం లేకపోయింది. ఇదంతా 2020లో జరిగింది. ఆర్నాల్డ్ కథ ఇంటర్నెట్లో వైరలైంది. అతనికి ప్రఖ్యాత టీవీ షో ది ఎలెన్ డిజెనరస్లో పాల్గొనే అవకాశం వచ్చింది. హెయిర్ లవ్ అనే షార్ట్ ఫిల్మ్ తీసిన దర్శకుడు మాథ్యూ ఎ చెర్రీ ఆ అబ్బాయిని ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌కు కూడా ఆహ్వానించాడు. మరెందరో విద్యార్థులను జుట్టు పొడవుగా ఉందంటూ స్కూలు నుంచి తీసేసిన ఉదంతాలు వెలుగులోకి రావడంతో ఈ వివక్షను నిషేధిస్తూ చట్టం చేయాల్సి వచ్చింది. ఈ వివక్ష ఇప్పటిది కాదు! అమెరికాలో నల్ల జుట్టుపై వివక్ష 18వ శతాబ్దం నుంచీ ఉంది. ఆఫ్రికన్ల జుట్టు గొర్రె బొచ్చులా ఉంటుందని అప్పట్లోనే హేళన చేసేవారు. తర్వాత రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకునే నల్లజాతి మహిళలు ఉద్యోగాలకు పనికి రారన్న అభిప్రాయం అమెరికన్లలో పెరిగింది. జుట్టు ఎక్కువున్న వారికి వృత్తిపరమైన లక్షణాలేవీ ఉండవని, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే సామర్థ్యముండదని అడ్డమైన వాదనలు తెరపైకి తెచ్చారు. తెల్ల జుట్టు వాళ్లకే ఉద్యోగాల్లో ప్రాధాన్యమిచ్చేవారు. ఇంటర్వ్యూ ఉంటే హెయిర్‌స్టైల్ మారాల్సిందే! డోవ్, లింక్డిన్ సంస్థలు ఇటీవల జుట్టు వివక్షపై సంయుక్త అధ్యయనం చేశాయి. నల్లజాతి యువతుల్లో మూడింట రెండొంతుల మంది ఇంటర్వ్యూలకి వెళ్లినప్పడు హెయిర్ స్టైల్స్ మార్చుకుంటున్నట్టు తేలింది. నల్లటి కురులున్న 25–34 మధ్య వయసు వారిలో 20 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. టీవీ షోలు, సోషల్ మీడియాలోనూ నల్ల జుట్టుపై విషం కక్కడం పరిపాటిగా మారింది. ఒబామా భార్యకూ తప్పలేదు! అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మహిళ మిషెల్‌కు కూడా జుట్టు వివక్ష తిప్పలు తప్పలేదు. ఒబామా అధ్యక్షుడిగా ఉండగా ఆమె తన రింగుల జుట్టును సాఫీగా ఉండేలా చేయించుకున్నారట. ఈ విషయం గతేడాది ఓ కార్యక్రమంలో ఆమే స్వయంగా చెప్పారు. ‘‘వైట్‌హౌస్‌లో ఉండగా ఒబామా పాలనపై కాకుండా నా జుట్టుపై ఎక్కడ చర్చ జరుగుతుందోనని హెయిర్‌స్టైల్ మార్చుకున్నా. ఒక నల్లజాతి కుటుంబం శ్వేతసౌధంలో ఉండటాన్ని సగటు అమెరికన్లు అంతగా జీర్ణించుకోలేరు. దానికి తోడు నా జుట్టుపైనా వివాదం రేగడం ఎందుకని భావించా’’అన్నారు. అమెరికా సమాజంలో జుట్టు వివక్ష ఎంతలా వేళ్లూనుకుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్లో మతోన్మాదుల రాక్షసకాండ.. విషవాయువుల ప్రయోగం
నాగరిక ప్రపంచంలో వివక్షకు తావులేదు. ఆడ, మగ అనే తేడా చూపడం నైతిక సూత్రాల ప్రకారమే కాదు, చట్ట ప్రకారమూ ముమ్మాటికీ నేరమే. బాలికలకు విద్యను నిరాకరించడం, వారికి చదువుకొనే అవకాశాలు దూరం చేయడం రాక్షసత్వమే అనిపించుకుంటుంది. ఇస్లామిక్ దేశమైన ఇరాన్లో ఇప్పుడు అచ్చంగా అలాంటిదే జరుగుతోంది. కేవలం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని విష వాయువుల ప్రయోగానికి పాల్పడుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు దుండగుల దుశ్చర్యపై బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతోందో తెలియక వణికిపోతున్నారు. సమాజంలో అశాంతి నెలకొంటోంది. విష వాయువుల ప్రయోగాల గుట్టును రట్టు చేస్తామని, దోషులను కచ్చితంగా శిక్షిస్తామని ఇరాన్ ప్రభుత్వం హామీ ఇవ్వడం కొంత ఊరట కలిగిస్తోంది. రగిలిన ఉద్యమం.. ఇరాన్లో 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మహిళలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. బాలికలు, యువతులపై ఆంక్షలన్నీ దాదాపుగా తొలగిపోయాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి నిర్భయంగా చదువుకుంటున్నారు. పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్ తరహా పరిస్థితులు ఇరాన్లో లేవు. బాలికల విద్యాభ్యాసాన్ని, మహిళలు ఉద్యోగాలకు వెళ్లడాన్ని తాలిబన్ ప్రభు త్వం నిషేధించడం పట్ల ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పద్ధతి మార్చుకోవాలని, మహిళలపై ఆంక్షలు ఎత్తివేయాలని తాలిబన్ పాలకులను హెచ్చరించింది కూడా. అలాంటిది ఇరా న్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. తలపై బురఖా సక్రమంగా ధరించనందుకు 22 ఏళ్ల మహసా అమీనీ అనే యువతిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధించారు. చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. మూడు రోజులపాటు కోమాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన అమీనీ సెప్టెంబర్ 16న మృతి చెందింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు, యువతులు, బాలికలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. నైతిక నియమావళి పేరిట తమను అణగ దొక్కుతున్నారని, గొంతు నొక్కు తున్నారని, హక్కులు హరిస్తున్నారని ఆరోపిస్తూ నెలల తరబడి ఆందోళన కొనసాగించారు. నైతిక పోలీసు వ్యవస్థను రద్దు చేయాలని నినదించారు. వారి ఆందోళన మహోగ్ర ఉద్యమంగా మారింది. మహిళల ఉద్యమం పట్ల ప్రభుత్వం దిగివచ్చింది. వారి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మహిళలంతా శాంతించాలని కోరింది. ముష్కరుల ఉద్దేశం అదేనా! మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉద్యమించడం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, దిగి వచ్చేలా చేయడం మతోన్మాదులకు, పిడివాదులకు కంటగింపుగా మారింది. బాలికలను విద్యాసంస్థ లకు వెళ్లకుండా, చదువుకోకుండా చేయడమే లక్ష్యంగా కుతంత్రానికి తెరలేపారు. భయభ్రాంతులకు గురిచేసి, ఇళ్లకే పరిమితం చేయడానికి విష వాయువుల ప్రయోగం అనే దొంగదారిని ఎంచుకున్నారు. విద్యార్థినులెవరూ రాకపోతే పాఠశాలలు మూతపడతాయన్నది వారి ఉద్దేశం. ముసుగులు ధరించి, తరగతి గదుల్లోకి హఠాత్తుగా ప్రవేశించడం, విష వాయువులు వదిలి, క్షణాల్లో మాయం కావడం.. కుట్ర మొత్తం ఇలా సాగింది. జరిగింది ఇదీ.. ► ఇరాన్లో 30 ప్రావిన్స్‌లు ఉండగా, 21 ప్రావిన్స్‌ల్లో 50కి పైగా పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు జరిగాయి. ► గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటిదాకా 50కి పైగా పాఠశాలల్లో 700 మంది విద్యార్థినులు ఈ ప్రయోగాల బారినపడినట్లు ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. అయితే, ఇప్పటివరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ► బాధితుల్లో శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ► తలనొప్పి, వికారం, వాంతులు, తల తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. బాధితులు కాళ్లు, కడుపులో నొప్పితో విలవిల్లాడారు. ► కొందరిలో అవయవాలు తాత్కాలికంగా మొద్దుబారిపోయినట్లు వెల్లడయ్యింది. ► దుండుగులు ప్రయో గించిన వాయువులు ► కుళ్లిన నారింజ పండ్ల వాసన, క్లోరిన్ వాసన, టాయ్లెట్లు శుభ్రం చేసుకొనే రసాయనాల వాసన వచ్చినట్లు బాధితులు చెప్పారు. ► ఫాతిమా రెజై అనే 11 బాలిక విష ప్రయోగం కారణంగా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇన్ఫెక్షన్ వల్లే మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు, చికిత్స అందించిన డాక్టర్ చెప్పారు. క్షమించరాని నేరం ఇరాన్ పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు అంతర్జాతీయంగా సంచలనాత్మకంగా మారాయి. బాలికలపై విష వాయువులు ప్రయోగించడం క్షమించరాని నేరమని ఇరాన్ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ చెప్పారు. గుర్తుతెలియని ముష్కరులు ఉద్దేశపూర్వ కంగానే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోందని, వారిని బంధించి, చట్టం ముందు నిలబెడతామని, కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. బాలికలపై ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏకంగా మానవత్వంపై జరిగిన నేరమేనని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తేల్చిచెప్పారు. డ్రెస్ కోడ్ ఉల్లంఘిస్తే శిక్షించాల్సిందే ఇరాన్ న్యాయ వ్యవస్థ అధినేత ఘోలామ్హుస్సేన్ మొహసెనీ ఏజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన మహిళలను కఠినంగా శిక్షించాలని అన్నారు. మహిళలు హిజాబ్ తొలగించడం ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల, దాని విలువల పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించడంతో సమానం అవుతుందని చెప్పారు. అలాంటి అసాధారణ చర్యలకు పాల్పడేవారు శిక్షకు గురికాక తప్పదని స్పష్టం చేశారు. -
క్షణ క్షణం వివక్షను ఎదుర్కొంటున్న మహిళ: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: కంపెనీల ప్రకటనలు మొదలు కొని సినిమాల వరకూ మహిళను వివక్షతో చిత్రీకరించడాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు నిరసించాలని, అలాంటి ప్రకటనలు, సినిమాలను తిరస్కరించడం, తమ అభ్యంతరాలను స్పష్టంగా చెప్పడం అవసరమని తెలంగాణ గవర్నర్, పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నా.. విస్తృత స్థాయిలో సమాజంలో మాత్రం వివక్ష కొనసాగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రింట్, వీడియో, సినిమాల్లో లింగ వివక్ష, మహిళలను నిర్దిష్ట దృక్కోణం (స్టీరియో టైపింగ్)లో చూపడాన్ని నియంత్రించడం, రూపుమాపడం లక్ష్యంగా ఇండియన్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) శుక్రవారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘‘వాయిస్ ఆఫ్ ఛేంజ్’’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళలు నిత్యం వివక్షకు గురవుతూనే ఉన్నారని, ప్రతిక్షణం మహిళను నిర్దిష్ట దృక్కోణంతో చూపుతున్నారని ఈ సందర్భంగా గవర్నర్ సోదాహరణంగా వివరించారు. మహిళలు గవర్నర్లు కారని.. వయసు మీరిన పురుషులే అవుతారన్నట్టుగా ఎనిమిదేళ్ల బాలిక చెప్పడాన్ని తాను ఒక విమానాశ్రయంలో విన్నానని తెలిపారు. ఆఖరుకు మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కొన్ని పోటీల్లో బహుమతులుగా వంట పాత్రలు ఇస్తున్నట్లు ప్రకటించారని.. వారి దృష్టిలో ఆడవారంటే వంటిల్లుకు మాత్రమే పరిమితం అని వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పుడు పురుషుల కంటే మహిళ పైలట్లే ఎక్కువగా ఉన్నారని విమానయాన శాఖ మంత్రి తనతో చెప్పినప్పుడు ఎంతో సంతోషించానని, దురదృష్టవశాత్తూ సమాజంలో చాలామంది పాత, మూస పద్ధతుల్లోనే మహిళలను చూస్తున్నారని అన్నారు. సమాజంలో పదిరెట్లు ఎక్కువ కష్టం మాది... ప్రకటనల్లో లింగ వివక్షను ప్రస్తావిస్తూ.. ‘‘ఒక దాంట్లో మహిళ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను చూపారు. ఫర్వాలేదని అనుకుంటూండగానే.. ఆమె ఓ పురుషుడి బనియన్ చూసి తన్మయంతో ఊగిపోతున్నట్లు చూపారు. ఆఖరుకు పురుషుడి లోదుస్తుల ప్రకటనకూ మహిళను స్టీరియోటైపింగ్ చేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తంజావూర్ మెడికల్ కాలేజీలో గైనకాలజిస్టుగా ఉండగా... కవలల తల్లి మగబిడ్డకు చనుబాలు, ఆడబిడ్డకు పలచన చేసిన ఆవుపాలు ఇచ్చిన సంఘటన తాను గమనించానని అన్నారు. ఇలాంటి అంశాల విషయంలో సమాజం మైండ్‌సెట్ మారాలని.. ప్రకటనలు తయారు చేసే వారు కూడా ఈ మార్పునకు తమవంతు సాయం అందించాలని కోరారు. మీడియా, అడ్వర్టైజ్మెంట్ రంగాల వారు ఇలాంటి అంశంపై చర్చించడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఐఏఏను ప్రశంసించారు. సమాజంలో మహిళలు అన్ని విషయాల్లోనూ పురుషుల కంటే పది రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని ఈ పరిస్థితిలో మార్పు రావాలని, ఇకపై లింగ వివక్ష, స్టీరియోటైపింగ్ విషయాల్లో అందరూ తమ అభ్యంతరాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మాత్రమే ఈ మార్పు సాధ్యమని వివరించారు. ‘నిర్భయ’ తరువాత కొంత మార్పు... ప్రకటనలు, సినిమాలు, ఇతర కంటెంట్లలో మహిళ వివక్ష, స్టీరియోటైపింగ్ నిర్భయ ఘటన మారిందని, బాధితుల పేర్లు ప్రస్తావించకపోవడం మొదలుకొని, వారినే దోషులుగా చూపడం వరకూ మీడియా సంయమనంతో వ్యవహరిస్తోందని పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ.ఎల్.శారద తెలిపారు. డిజిటల్ మాధ్యమం కారణంగా మహిళల అంశాలపై వివరంగా చర్చించే అవకాశం లభిస్తోందని, ప్రకటనలు ఇతర కంటెంట్లలో మహిళలను కించపరచడం తగ్గిందని, యువతకు సంబంధించిన ప్రకటనలో అందరినీ కలుపుకుపోయేలా కంటెంట్ ఉంటోందని ఆమె వివరించారు. ఈ మార్పు భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్న ఆశాభావాన్ని డాక్టర్ ఏఎల్ శారద వ్యక్తం చేశారు. అంతకుముందు యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్స్ నిపుణులు గీతాంజలి మాస్టర్ మాట్లాడుతూ ప్రకటనల్లో లింగవివక్ష, స్టీరియోటైపింగ్‌లపై యునిసెఫ్ జరిపిన పరిశోధన వివరాలను వెల్లడించారు. సమావేశంలో యాక్సెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ చారులత రవికుమార్ ‘రెస్పాన్సిబుల్ కమ్యూనికేషన్’ అన్న అంశంపై ప్రసంగిస్తూ కంటెంట్‌లో ఇప్పటికే సున్నితంగా.. పరోక్షంగా లింగవివక్ష కొనసాగుతోందని వివరించారు. ఐఏఏ ఇండియ ఛాప్టర్ అధ్యక్షులు అవినాశ్ పాండే, ఐఏఏ విమెన్స్ ఎంపవర్మెంట్ కమిటీ ఛైర్పర్సన్ నీనా ఎలవియా జైపూరియా, ‘సాక్షి’ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘జెండర్ కాన్షస్ అండ్ పర్పస్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్’ ‘జెండర్ కాన్షస్ క్రియేటివిటీ ఇన్ కమ్యూనికేషన్స్’, ‘కాన్షస్ క్రియేటివిటీ ఇన్ ఫిల్మ్స్, ఓటీటీ, అండ్ అడ్వర్టైజింగ్’ అంశాలపై ప్యానెల్ డిస్కషన్ నడిచింది. యాంకర్ స్వప్న సమన్వయకర్తగా వ్యవహరించగా సినీ నటుడు అవసరాల శ్రీనివాస్, దర్శకులు నందినీ రెడ్డి, వైల్యులు ప్రణతి రెడ్డి, ఐపీఎస్ అధికారిణి శిఖా గోయెల్ తదితరులు పాల్గొన్నారు. కాస్మోస్ మాయా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో మేఘ తాత ఒక ప్యానెల్ డిస్కషన్‌కు సమన్వయ కర్తగా వ్యవహరించారు. చదవండి: అసెంబ్లీలో కేటీఆర్, ఈటల మధ్య ఆసక్తికర సన్నివేశం.. -
నిర్లక్ష్యానికి గురవుతున్న బాలికా విద్య
జాతీయ బాలికా దినోత్సవం ఏటా జనవరి 24న జరుపుకుంటున్నాం. దీని ప్రధాన ఉద్దేశాలు... బాలికలు ఎదుర్కొంటున్న అసమానతలు, అత్యాచారాలపై అవగాహన కల్పించడం,; విద్య, ఆరోగ్యం, పోషణ ప్రాముఖ్యాన్ని తెలియజేయడం. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి బాలికా దినోత్సవం జరపాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపునందుకుని భారత్ 2008 నుండీ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ఆడ, మగ – ఇద్దరికీ సమాన హక్కులు కల్పించింది. కానీ లింగవివక్షతో గర్భంలో ఉండగానే స్కానింగ్లతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడపిల్ల అని తేలగానే ఇప్పటికీ గర్భస్రావం చేయిస్తున్నారు. మన సాంకేతిక పరిజ్ఞాన పురోభివృద్ధిని ఆడ శిశువుల అంతానికి ఉపయోగించడం దారుణం. 2011 జనాభా లెక్కల ప్రకారం వెయ్యి మంది మగ పిల్లలకు 946 మంది ఆడపిల్లలు ఉన్నారు. దీంతో దేశంలో ఇప్పుడు మగ పిల్లలకు వివాహాలు చేయడానికి ఆడపిల్లలు దొరకని దుఃస్థితి వచ్చింది. చట్టాలు ఎన్ని ఉన్నా బాలికల పట్ల జరిగే అన్యాయం జరుగుతూనే ఉంది. 2015 లో ‘బేటీ బచావో, బేటీ పఢావో’, ‘షాదీ ముబారక్’ వంటి పథకాలు బాల్య వివాహాలను కొంతవరకు తగ్గించాయి. స్త్రీ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం అంతా విద్యా వంతులు అవుతారని భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అన్నారు. ఆనాటి నుండి నేటి వరకూ బాలికల విద్య నిర్లక్ష్యానికి గురి అవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 82 శాతం మగవారు, 65 శాతం బాలికలు అక్షరాస్యులుగా ఉన్నారు. మిగతా 35 శాతం బాలికలు బడికి దూరంగానే ఉన్నారు. 2009 విద్యాహక్కు చట్టం ఫలితంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో వెనుకబడిన తరగతుల బాలికలు చదువుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. అయినప్పటికీ పల్లెటూర్లలో బాలికల అక్షరాస్యత తక్కువగానే ఉంది. ఏ లక్ష్యాలపై అవగాహన కల్పించడానికి బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నామో... వాటిని సాకారం చేయడంలో సమాజంలోని అన్ని వర్గాలకూ బాధ్యత ఉంది. (క్లిక్ చేయండి: మన క్రీడాకారిణులకు బాసట ఏది?) – సయ్యద్ షఫీ, హనుమకొండ (జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం) -
ధర్మాన మాటల్ని వక్రీకరించి.. సోషల్ మీడియాలో గోల..
ఇన్నాళ్లకొకరు (ధర్మాన ప్రసాదరావు) ఉత్తరాంధ్ర వివక్ష మీద గొంతు విప్పి మాటాడేరు. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటు చేయకుంటే కనీసం మా ఉత్తరాంధ్ర ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. అలా అయితే ఉత్తరాంధ్రకు గల సహజవనరుల సాయంతో, ఆర్థిక కేటాయింపులతో, పాలనా ఏర్పాటుతో... ఏ నగరానికీ లేని ఓడరేవు, విమానాశ్రయం; భారీ, మధ్యతరగతి పరిశ్రమలతో మహానగరంగా ఎదగాల్సిన విశాఖను రాజధానిగా చేసి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేస్తామని రాజకీయ ప్రకటన చేశారు. విశాఖను పాలనా రాజధాని చేయాలన్నదే ప్రసాదరావు కోరుకునేది. అది మరింత బలంగా విన్పించడానికి విశాఖను పాలనా రాజధానిగా చేయకపోతే, కనీసం ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనన్నారు తప్పా ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలనేమీ అనలేదు. అయినా ప్రసాదరావు మాటల్ని వక్రీకరించి, ఒక్కదాన్నే పట్టుకొని సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. నిజానికి ప్రసాదరావు ఉత్తరాంధ్రను రాష్ట్రంగా చేయాలని డిమాండ్ చేస్తే బాగుండేది. అయినా, ఈ సందర్భంలో ప్రసాదరావు ఆమాత్రం అనడం ఘనతే! ఇప్పటిదాకా ఇలాంటి ప్రకటనలు ఉత్తరాంధ్ర పౌరసమాజం నుండి అరాకొరా (కె.ఎస్.చలం, నల్లి ధర్మారావు, అట్టాడ అప్పల్నాయుడు తది తరులు) వచ్చేయి తప్పా రాజకీయశక్తుల నుంచి రాలేదు. పాలకవర్గ పార్టీల నుంచీ రాలేదు, కమ్యూనిస్టు, విప్లవకారుల నుంచీ రాలేదు. చాలా ఆశ్చర్యంగా ధర్మాన ప్రసాదరావు ప్రకటనపై విచ్చిన్నకారుడు, సమైక్య వ్యతిరేకి వంటి వ్యక్తిగత దాడి మాత్రమే కాక ప్రసాదరావు రాజకీయ ప్రయాణాన్నీ, ఆ ప్రయాణంలో ఉత్తరాంధ్రకు అతను చేసినదేమిటీ, ఇపుడెందుకిలా ప్రకటించాడంటూ... ఉత్తరాంధ్రేతరులే కాక ఉత్తరాంధ్రులూ ప్రశ్నిస్తున్నారు. విచిత్రంగా ఒక్క నల్లి ధర్మారావు తప్పా, ఉత్తరాంధ్ర గురించి తొలినాడు గొంతు విప్పిన కె.ఎస్. చలం గానీ ఇంకెవరుగానీ ఇపుడేమీ మాటాడడం లేదు. స్పందనా రాహిత్యం ఉత్తరాంధ్ర స్వభావంలోకి ఇంకిపోయినట్టుంది. తొలి తరం రచయితలు తప్పా వర్తమాన రచయితలెవరికీ ఉత్తరాంధ్ర జీవన సంక్షోభానికి కారణమయిన రాజకీయార్థిక విషయాలమీద అవగాహనా లేదు, ఆసక్తీ లేదు. అణు విద్యుత్ వ్యతిరేక పోరాటం, నిర్వాసితుల పోరాటాలు, విశాఖ ఉక్కు కర్మాగార కార్మిక పోరాటం వంటివాటిని వీరు సాహిత్యీకరించలేదు. అటు రచయితలుగానీ, ఇటు మేధావులుగానీ ఉత్తరాంధ్ర వివక్షమీద ప్రాంతీయవాద దృష్టితో స్పందించటం లేదు. విశాఖలో స్థిరపడిన (వ్యాపారాలు, ఉద్యోగాలు, రాజకీయాలు చేసి) వారు ఉత్తరాంధ్ర గురించి వ్యాఖ్యానిస్తుంటారు, ఉత్తరాంధ్రుల తరఫున బాధ్యత తీసుకుంటారు. రాజకీయాల్లో, సాహిత్య, సాంస్కృతికాంశాల్లో ఉత్తరాంధ్రపై వివక్ష చూపి, ‘వెనక బడిన జిల్లా’ అనే టాగ్ తగిలించి సానుభూతి చూపుతారు ఉత్తరాంధ్రేతరులు. పాతిక లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా ఎనిమిదిలక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పటికీ సాగునీరు అందుతోంది. నాగావళి, వంశధార వంటి పద్దెనిమిది నదులూ, అధిక వర్షపాతం వల్ల అయిదువందల టీఎంసీల నీరు లభ్యమవుతున్నా... సాగునీరందించే ప్రాజెక్టులు పూర్తికాక పోవటంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతోన్నవి. వ్యవసాయాధార పరిశ్రమలు లేక, ఉన్నవి మూత పడి ఇటు రైతులూ, అటు కార్మికులూ నష్ట పోతున్నారు. ఉపాధుల్లేక ఏటా ఏభయి వేలమంది ఇక్కడినుంచి వలసలు పోతున్నారు. వలసల నివారణకుగానీ, వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకుగానీ, విశాఖ వంటి నగరంలోని పరిశ్రమలను అభివృద్ధి చేయడానికిగానీ ప్రత్యేక రాజకీయ నిర్ణయాలు, ఆర్థిక కేటాయింపులూ, అధికార యంత్రాంగమూ ఉండాలి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు ఒనగూరలేదు. ప్రత్యేక రాష్ట్ర మయితే ఒనగూరే అవకాశాలుంటాయి, ఒనగూరకపోతే కనీసం వీటికోసం తమదయిన ప్రాంతంలో ప్రజలు ఉద్యమించగలరు. పాలనా యంత్రాంగాన్ని ప్రభావితం చేయగలరు. సమగ్ర ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రమనేది ఉపకరిస్తుందే తప్పా నష్టపెట్టదు. గనక ధర్మాన ప్రసాదరావేమీ విచ్చిన్నకారుడు కాడు, వారి ప్రకటనేమీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రీడలో భాగం కాదు. ఉత్తరాంధ్రుల లోలోపలి భావాన్నే ప్రసాదరావు పలికేరు. ఇపుడు కాకపోతే మరొకప్పుడయినా ఉత్తరాంధ్ర తన లోలోపలి ఆకాంక్షను కోటిగొంతులతో బహిరంగ పరచగలదు! (క్లిక్ చేయండి: అనూహ్య వ్యూహం ‘గృహ సారథి’) – వంశధార సూరి, శ్రీకాకుళం -
ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?
కొంతమంది నియోదళిత్ మేధావులకు, వామపక్షీయులకు ప్రతి విషయాన్నీ కులం లేదా మత కోణంలో చూసే ధోరణి గత 30 సంవత్సరాలుగా అలవాటైంది. అకడమిక్స్‌లో కూడా ఈ ధోరణి రావడం ప్రమాదకరం. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, క్రిష్టియన్లు, అగ్ర వర్ణాల వారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. 130 కోట్ల జనాభాలో, దాదాపుగా 30 కోట్ల మంది దళితులు ఉన్న భారతదేశంలో... కేవలం కొన్ని సంఘటలను చూపించి రిపోర్టులు తయారు చేసి, దేశమంతా వివక్షత ఉందని చెప్పడం ఎంతమాత్రమూ శాస్త్రీయం కాదు. అధర్మమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో దారుణమైన వివక్ష నేటికీ కొనసాగుతోంది. మన నియోదళిత్ మేధావులు వాటిని ఏమాత్రం ప్రస్తావిం చకుండా భారతదేశానికీ, హిందూమతానికీ వ్యతిరేకంగా పని చేసే కొన్ని సంస్థల రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. రాజీవ్ మల్హోత్ర, అరవిందన్ నీలకంఠన్ రాసిన ‘బ్రేకింగ్ ఇండియా – వెస్ట్రన్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద్రవిడియన్ అండ్ దళిత్ ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకంలో ఇటువంటి విదేశీ సంస్థలూ, అధ్యయన కేంద్రాలూ, ఎన్జీఓలూ వంటివి భారతదేశాన్ని, హిందూమతాన్ని విచ్ఛిన్నం చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఒక బహిరంగమైన కుట్ర బట్టబయలైంది. ఇక ప్రపంచంలోని వివక్షకు వస్తే మొదటగా అమెరికాలో ఉన్న నల్లజాతీయులపై వివక్ష నేటికీ కొనసాగుతోంది. అయినా వారికి భారతదేశంలో దళితులలాగా రాజ కీయాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు లేవు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వివక్ష (అపారై్థడ్) 1992 వరకు చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా జరిగింది. ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికాలో వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడగలేదు. 1883 వరకు అమెరికాల్లో నల్ల జాతీయులు బానిసలుగా ఉండేవాళ్ళు, 1970 వరకు అమెరికాలో నల్లజాతీయులకు ఓటు హక్కులేదు. ఇప్పటికీ యూఎస్‌తో సహా అనేక దేశాల్లో జాతి, మతపరమైన వివక్ష ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1930లలో భారత్‌లో షెడ్యూల్డ్ కులాల వివక్షమీద అంబేడ్కర్ పోరాటం చేస్తున్న సమయంలోనే అమెరికాలో కూడా వివక్ష మీద పోరాటం జరుగుతోంది. ప్రముఖ అమెరికన్ నల్లజాతీయుల నాయకులు చానీతో బియాస్, బెంజమిన్ మేస్ లాంటి వారు భారతదేశానికి వచ్చి గాంధీని కలిసి వివక్షతపై చర్చలు జరిపారు. 1938లో హోవర్డ్ తురిమెన్ అనే ప్రముఖ నల్ల మతాధికారి అమెరికాకు వచ్చి పోరాటం సాగించాలని గాంధీని కలిసి విన్నవించారు. ప్రముఖ నల్ల జాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్... గాంధీజీనే ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికాలో అపార్థైడ్కు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా తదితరులు కూడా మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకున్నారు. ఇక్కడ నియో దళిత మేధావులు, వామపక్ష వాదులు దాచి పెట్టేదేమిటంటే... పైన పేర్కొన్న నాయకులు ఎవ్వరూ కూడా అంబేడ్కర్‌ను కలవలేదు. వీరెవ్వరు కూడా ఆయా దేశాల్లో రిజర్వేషన్లు కోరలేదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనే యూనివర్సల్ ప్రిన్సిపుల్‌కు రిజర్వేషన్లు అనేవి బద్ధ వ్యతిరేకం కాబట్టి. దేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో కొన్ని శతాబ్దాల కాలం వెనుకబడింది. 1951 నాటికి అక్షరాస్యత కేవలం 16.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, కాబట్టి కేవలం దళితులే కాదు అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వెనకబడే ఉన్నారు. దళితుల పరిస్థితి ఇంకా దయనీయమనే చెప్పాలి. అయితే ల్యాండ్ సీలింగ్ వల్ల వచ్చిన భూమిలో 46 శాతం దళితులకే వచ్చింది. అయినా ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. (క్లిక్ చేయండి: నిరసనకారులకు గుణపాఠమా?!) - డాక్టర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం -
బహుజన బతుకమ్మ ఆడదాం
మన సమాజపు ఆవరణలోని పునాది ఉపరితలాల్లో పరివ్యాప్తి చెంది, సమాజపు లోతుల్లోకి పాతుకుపోయిన కులవివక్ష, లింగ వివక్ష గురించి మాట్లాడుకోవడానికి మున్నూట ఆరవై ఐదు రోజులు సరిపోవు. అలాంటి వివక్షకు గురవుతున్న బహుజన సమాజపు స్త్రీలు అచ్చంగా ఆడి పాడేదే బతుకమ్మ పండుగ. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ, తదనంతర విప్లవోద్యమంలోనూ, అలాగే స్వరాష్ట్ర సాధన పోరాటంలోనూ బతుకమ్మ ఒక ఉద్యమ పతాకగా మన చేతికందింది. నిషేధాలకు గురై కూడా కొనసాగుతున్న అంటరానితనం, అన్ని రంగాల్లో ప్రబలిన కులవివక్ష, పితృస్వామ్యం, బతుకమ్మ పండుగల్లోనూ వ్యక్తమవుతుంది. ప్రజలంతా జరుపుకునే పండుగల్లోనూ ఊరూ–వాడల్ని విభజించే కుల వివక్షకు వ్యతిరేకంగా ‘కల్సి ఆడుదాం– కల్సి పాడుదాం–కల్సి పోరాడుదాం’ అంటూ తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బహుజన బతుకమ్మ ద్వారా పండుగల్లోని అసమానతలను, వివక్షను సరిచేస్తూ దీన్నొక పంటల పండుగగా జరుపుతున్నాం. అందుకే ‘బహుజన బతుకమ్మ కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఉద్యమం’ అంటూ చాటుతున్నాం. బతుకమ్మ బహుజన సాంప్రదాయం. పురాణ ఇతి హాసాల్లో బతుకమ్మ గురించి ఏమి చెప్పినా బతుకమ్మ మాత్రం తెలంగాణ పంటల పండుగ. మత కోణం నుండి దీనిని బ్రాహ్మణీకరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దూరంగా నిశ్చేష్ఠులై ఉండలేము కదా! తెలంగాణ ఉత్పత్తి విధానంలోని నవధాన్యాల సంస్కృతిని ఎత్తిపడ్తూ దానితో ముడిపడ్డ పంటలనూ, ఆ పంటలకు నీరిచ్చే చెరువులూ, కుంటలనూ; వాటికి ఆదరువైన గుట్టలూ, కొండలనూ కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అలా ప్రతి ఏటా వర్తమాన సమస్యలతో జోడించి బహుజన బతుకమ్మను కొనసాగిస్తున్నాం. నా అనుభవంలో ఏ కులానికి ఆ కులం కలిసి ఆడు కోవడం, బతుకమ్మను నీళ్లల్లో వేసి సాగనంపి మాలో మేమే సద్దులు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళం. నా చిన్నతనంలో కుల వాడలు, వెలివాడలు స్పష్టంగా ఉన్న కాలంలో కుర్మోళ్ల బతుకమ్మ, రెడ్డోళ్ల బతుకమ్మ అంటూ పోటీపడేవాళ్ళం. నిన్న మొన్నటిదాకా కూడా దళితుల బతుకమ్మ ఊర్లోళ్ళ బతుకమ్మతో కలిపి ఆడుకోవడం అనేది లేకుండా పోయిన విషయం మన గమనంలో ఉంది. గడిచిన 12 ఏళ్ల అనుభవంలో దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేస్తూ ఊరుతోపాటు ఆడి పాడి వారితో కలిసి ఒకే చెరువులో నిమజ్జనం చేయడమే ఒక విప్లవాత్మక చర్యగా ప్రజలు భావించారు. ఇక గర్భగుడిలోకి దళితుల ప్రవేశం గురించి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందేమో! ఇంకా కొన్ని గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి అమలు జరుగుతోంది. ఇప్పటికీ భూమిలేని దళితులు కోకొల్లలు. వారికి కనీస భూమి ఇవ్వాలి. వారు ఊరుతో కలిసి ఆడుకొని, సహపంక్తి భోజనాలు చేసుకుని ఆత్మ గౌరవంగా పండుగ చేసుకునేలా ప్రజలు ఐక్యతను చాటాలి. - విమలక్క ప్రజా గాయని -
కలలు కల్లలు.. కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఉన్నత ప్రమాణాలున్న విద్యాసంస్థల్లో పెరిగిçపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి. ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఈ సంస్థలు బ్రిలియంట్ విద్యార్థుల బలవన్మరణాలతో వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ సంస్థల్లో ప్రవేశించిన విద్యార్థులు, వారి తల్లితండ్రుల కలలు కల్లలు చేస్తున్నాయి. బంగారు భవిష్యత్తును ఊహించుకుని ఆ సంస్థల్లో అడుగిడుతున్న విద్యార్థులు అక్కడ ఒత్తిడి, వివక్ష, బెదిరింపులు, సరైన మార్గదర్శనం లేక బలవంతంగా తనువులు చాలిస్తున్నారు. కట్టడి నుంచి ఒక్కసారిగా స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటూ కన్నవారికి శోకం మిగిలిస్తున్నారు. ఇక్కడ విజయం సాధించకపోతే భవిష్యత్తు లేదన్నట్లుగా కుంగిపోతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లతోపాటు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో రాత్రింబవళ్లు కష్టపడితే గానీ సీటు రాదు. మంచి ర్యాంకులతో చేరుతున్న విద్యార్థులు అక్కడికెళ్లిన తరువాత సామాజిక పరిస్థితులు, విద్యా విధానం పూర్తి భిన్నంగా ఉండటంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. సహచరæ విద్యార్థులతో పోల్చుకుని కూడా నిరాశా నిస్పృహల్లోకి వెళ్తున్నారు. దీంతో వారు ఆత్మహత్యల వైపు మళ్లుతున్నారు. ఏనిమిదేళ్లలో 130 మంది దేశవ్యాప్తంగా గత ఎనిమిదేళ్లలో 130 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థుల బాగోగులను చూడాల్సిన ఆయా సంస్థల్లోని అధ్యాపకుల సరైన పర్యవేక్షణ లేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఇలా బలవన్మరణాలు చేసుకుంటున్న వారిలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులే ఉండటం గమనార్హం. ఇంటర్మీడియెట్ వరకు అధ్యాపకులు పూర్తిస్థాయిలో వారికి ప్రతీ అంశంలో సహకారం అందిస్తారు. అయితే, ప్రీమియర్ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు అవసరమైన మానసిక ధైర్యం, అక్కడ ఎలా మసలుకోవాలి లాంటి వాటి గురించి వివరించకపోవడం వల్ల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్న అభిప్రాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచి్చన వారు ఈ సంస్థల్లో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. 2014 నుంచి ఇప్పటివరకు ఐఐటీల్లో 38 మంది, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 39 మంది, ఎన్ఐటీల్లో 32 మంది, ఐఐఎంలలో ఐదుగురు, ఐఐ ఎస్సీ అండ్ ఐఐఎస్ఈఆర్లో తొమ్మిది మంది, ట్రిపుల్ ఐటీల్లో నలుగురు, కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చే విద్యాసంస్థల్లో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇటీవలే ఐఐటీ హైదరాబాద్‌లో... ఇటీవలే హైదరాబాద్ ఐఐటీకి సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం విదితమే. ఇక్కడ ఎంటెక్ చదువుతున్న రాహుల్ హాస్టల్ గదిలోనే మంచానికి ఉరేసుకోగా.. ఈ మధ్యనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థి సంగారెడ్డిలో లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైకి చెందిన మరో ఐఐటీ విద్యార్థి కూడా హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. కుల వివక్ష నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కొన్ని ఘటనలు సంచలనంగా మారుతుంటే.. మరికొన్ని కేసులు పెద్దగా పట్టించుకోకుండానే ముగిసిపోతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులుగా గుర్తించిన వారిపై చర్యలు లేకుండా ముగుస్తున్నాయి. గత ఏప్రిల్‌లో ఖరగ్‌పూర్ ఐఐటీలో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ బోధించే ప్రొఫెసర్ దళితులను, ఆదివాసీ విద్యార్థులను అవమానించేలా మాట్లాడటంతో పెద్దఎత్తున నిరసన పెల్లుబుకడంతో ఆ ప్రొఫెసర్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. సాధారణ విద్యార్థుల ఆత్మహత్యలూ ఎక్కువే.. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2017లో 9,905 మంది, 2020లో 12,526 మంది, 2021లో 13,089 మంది విద్యార్థులు బలవన్మరణం పొందారు. గతేడాది 18 ఏళ్లలోపు వయసున్నవారు 10,732 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలవడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారే ఇందులో అధికంగా ఉండటం గమనార్హం. విద్యార్థుల ఆత్మహత్యలు మహారాష్ట్ర (1,834)లో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ (1,308), తమిళనాడు (1,246), కర్ణాటక (855), ఒడిశా (834) నిలిచాయి. మొత్తం విద్యార్థుల బలవన్మరణాల్లో గ్రాడ్యుయేట్, ఆపైస్థాయి వారి శాతం 4.6గా ఉంది. మరో విద్యార్థి ఇలా కావొద్దు బలవన్మరణం వల్ల తల్లిదండ్రులకు శోకం మిగల్చడం తప్ప... సాధించేది ఏమీ ఉండదు. ప్రతిభ ఉన్న విద్యార్థులే ఇలాంటి విద్యాసంస్థల్లో చేరుతారు. వారికి సరైన మార్గదర్శనం ప్రొఫెసర్లు చేయాలి. మా అబ్బాయి రాహుల్ ఆత్మహత్య చేసుకునే రకం కాదు. అంతకు ముందే పుట్టిన రోజు జరుపుకున్నాడు. షిర్డి వెళ్లి వచ్చాం. ఎక్కడా డిప్రెషన్‌కు గురైనట్లు కనిపించలేదు. ప్రొఫెసర్ల ఒత్తిడి ఉండొచ్చని భావిస్తున్నా. ఏదైనా లోతుగా విచారణ జరపాలని జిల్లా ఎస్పీని కోరా. ల్యాప్‌టాప్ ఇప్పటి వరకు మాకు ఇవ్వనేలేదు. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దు. ఇది లేకపోతే భవిష్యత్తు లేదనే భావన విరమించుకోండి. –ఐఐటీ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తండ్రి మధుసూధన్‌రావు మానసిక ధైర్యం ప్రధానం విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉండాలి. ఇంటర్ వరకు ఉన్న వాతావరణానికి æఐఐటీ, ఎన్ఐటీల్లో వాతావరణం భిన్నంగా ఉంటుంది. విద్యా బోధనలో మార్పులు ఉంటాయి. స్వేచ్ఛ ఉంటుంది. స్వతంత్రంగా నేర్చుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఎప్పుడూ చదువు కోసమేకాకుండా.. వారు మానసికంగా దృఢంగా ఉండేలా ధైర్యం చెప్పాలి. సహచర విద్యార్థులు కూడా తోటి విద్యార్థులు డిప్రెషన్లో ఉన్నట్టు తెలియగానే ధైర్యం చెప్పాలి, అధికారుల దృష్టికి తీసుకురావాలి. అప్పుడు సరైన కౌన్సెలింగ్ తీసుకుని ధైర్యం నింపేందుకు వీలవుతుంది. – ఎన్వీ రమణారావు, ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ క్యాంపులు అవసరం వివిధ సాంస్కృతిక నేపథ్యాల్లో పెరిగిన వాతావరణానికి.. ఐఐటీల్లోని వాతావరణం పూర్తిభిన్నంగా ఉండటంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇతర నేపథ్యం నుంచి వచి్చన సహచర విద్యార్థులతో కలవలేకపోవడం, వారితో పోల్చుకుని కుంగుబాటుకు గురికావడం, తక్కువ మార్కులొస్తే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సరైన ప్లేస్మెంట్లు రావనే భయాలు, బాగా మార్కులు తెచ్చుకుని పెద్ద పెద్ద ప్యాకేజీలు తెచ్చుకోవాలనే తల్లితండ్రుల అంచనాలు చేరుకోకపోవడం వంటివి ప్రభావం చూపిస్తున్నాయి. ఉన్నత చదువు, సంబంధిత అంశాల ఒత్తిళ్లతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అన్ని విద్యాసంస్థల్లో ‘మెంటల్ హెల్త్ అవేర్నెస్’క్యాంపులు నిర్వహించాలి. విద్యార్థులు ఒత్తిడికి లోనైనప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి? సహ విద్యార్థులు, ఇతరుల ద్వారా ఆయా దశలను ఎలా గుర్తించాలనే దానిపై పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలి. ఐఐటీలు, ఎన్ఐటీల వంటి చోట్ల సైకాలజిస్టులను పెట్టినా.. ఒత్తిళ్లు, ఇతర అంశాలపై సరైన అవగాహన కలి్పంచడం లేదు. క్లాస్‌లు జరిగేప్పుడు, డైనింగ్, టీవీ హాల్ తదితర చోట్ల జనరల్ అంశాలపైనా అవగాహన కల్పించాలి. –వీరేందర్, సైకాలజిస్ట్ చదవండి: మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే.. -
పరాన్నజీవులూ, వెళ్లిపొండి.. అమెరికన్ జాత్యహంకార వ్యాఖ్యలు
లండన్: అమెరికాలో భారతీయ మహిళలపై జాత్యహంకార వివక్ష ఘటన మరవకముందే పోలండ్‌లోనూ అలాంటి ఉదంతమే వెలుగు చూసింది. రాజధాని వార్సాలో ఓ షాపింగ్ మాల్ వద్ద అమెరికా పర్యాటకుడు ఒక భారతీయుడిని జాత్యహంకార ప్రశ్నలతో వేధిస్తూ తీసిన వీడియో వైరల్‌గా మారింది. ‘‘నేను అమెరికా పౌరుడిని. అందుకే అమెరికాలో మాత్రమే ఉంటాను. అమెరికా మీ వాళ్లతో నిండిపోతోంది. నువ్వెందుకు పోలండ్ వచ్చావు? పోలండ్‌ను సైతం భారతీయులతో నింపేస్తారా? మీ సొంత దేశానికి పోరెందుకు? మా దేశాలను ఎందుకు ముంచెత్తుతున్నారు? మీకు భారతదేశముందిగా. మీ దేశాన్ని ఎందుకు సుసంపన్నం చేసుకోరు? కష్టపడి సంపన్నంగా మార్చుకున్న మా దేశాలకు ఎందుకొస్తున్నారు? పోలండ్‌లోనూ స్థిరపడటం ఈజీ అనుకుంటున్నారా? మీ సొంత దేశానికెందుకు వెళ్లరు? మీరంతా మా జాతిని నాశనం చేస్తున్నారు. నువ్వో ఆక్రమణదారువు. పరాయిదేశంలో బతికే పరాన్నజీవివి. ఇక్కడి నుంచి వెళ్లిపో. మీరు మా యూరప్‌లో ఉండొద్దు. పోలండ్ పోలిష్ జాతీయులదే’’ అంటూ వాగ్వాదానికి దిగాడు. అతన్ని ‘గోయిమ్ టీవీ’ అనే విద్వేష గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న జాన్ మినడియో జూనియర్‌గా గుర్తించారు. -
జార్ఖండ్‌లో దారుణ కుల వివక్ష.. 50 దళిత కుటుంబాలను తరిమేసి..
మేదినీనగర్(జార్ఖండ్): సమ సమాజం దిశగా ముందడుగేయాల్సిన భారతావనిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కులానికి చెందిన 50 దళిత కుటుంబాలను కొందరు ఊరిలో నుంచి తరిమేశారు. ఈ దళిత కుటుంబాల ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇళ్లలోని వస్తువుల అన్నింటినీ వాహనాల్లోకి ఎక్కించి, వీరిని సమీప అడవిలోకి తరిమేశారు. జార్ఖండ్‌లోని పలామూ జిల్లాలోని మరుమటు గ్రామంలో ఈ వివక్షాపూరిత ఘటన జరిగింది. ఘటనపై రాష్ట్ర గవర్నర్ రమేశ్ స్పందించారు. రెండ్రోజుల్లో నివేదిక సమరి్పంచాలని పలాము డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముషార్ కులానికి చెందిన 50 కుటుంబాలు మరుమటు గ్రామంలో నివసిస్తున్నాయి. సోమవారం హఠాత్తుగా కొందరు వీరు ఉండే ప్రాంతానికి వచ్చి అందరినీ చితకబాది ఇంటిసామగ్రిని బయటపడేసి ఇళ్లను ధ్వంసంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, మేదినీనగర్ సబ్ డివిజినల్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ షా, సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్(ఎస్డీపీవో) సుర్జీత్ కుమార్‌లు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు మళ్లీ ఊరిలో వారి స్థలాల్లోనే నివాస సౌకర్యాలు కలి్పస్తామని, ప్రస్తుతం తాత్కాలిక శిబిరాల్లో ఉంచామని అధికారులు తెలిపారు. చదవండి: అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం -
75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!
జెండా పండుగ అయిపోయింది.. ఇక ఆ రంగు లైట్లు ఆర్పేసి ఇటు రండి.. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి ఇంద్రా మేఘ్వాల్ చిత్రపటం వద్ద పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో... చీకట్లు చూద్దాం. ఒక గ్లాసుడు నీళ్లు.. పోయిన చిన్న ప్రాణం. అగ్రవర్ణం దాహార్తికి చిన్నబోయిన త్రివర్ణాలు కనిపిస్తాయి. ఇది ‘..అనుకోని సంఘ టన’ అని సర్దిచెప్పుకునే లోపే.. ‘కాదు.. అనునిత్యమే’ అన్నమాట రీసౌండ్‌లా ‘జనగణమన’కన్నా ఎక్కువ శబ్దంతో మన చెవుల్లో మారుమోగుతుంది. – ఇదీ సామాజిక భారతం రోడ్లపై వేలాది జెండాల ప్రదర్శనలు, వాట్సాప్ డీపీలు, ధగధగా మెరిసే కాంతుల అలంకరణలు, గొప్పగా సంబురాలు.. వీటన్నిటి మధ్య బిల్కిస్ బానో సామూహిక అత్యాచార దోషులకు స్వాతంత్య్ర దినోత్సవం ఇచ్చిన స్వేచ్ఛా వాయువులు. వారి మెడలో పూలదండలు, పంచుకున్న మిఠాయిలు.. అమృతోత్సవాలను చేదెక్కించ లేదూ! – ఇదీ రాజకీయ భారతం ‘కలకత్తా ఫుట్‌పాత్‌లపై ఎందరో గాలివానల్లో తడుస్తున్నారు వాళ్లను అడగండి పదిహేను ఆగస్టు గురించి ఏమంటారో..’ .. 1947లో స్వాతంత్య్రం వచ్చిన రోజున మాజీ ప్రధాని వాజ్‌పేయి రాసుకున్న కవిత ఇది.. ఉత్సవాలు జరిగిన మరునాడే (ఆగస్టు 16న) వాజ్‌పేయి వర్ధంతి జరిపినవారిలో ఎవరైనా.. ఆయన గుర్తుగానైనా.. ఫుట్‌పాత్‌లపై ఉన్న వారిని అడిగి ఉంటారా ‘..ఆగస్టు 15 గురించి ఏమంటారూ’ అని.. – వృద్ధిరేటు 75 ఏళ్లుగా పెరిగీ పెరిగీ హైరైజ్ భవనాల్లో చిక్కుకునిపోయిందని, అక్కడి నుంచి ఫుట్‌పాత్ దాకా రాలేదని తెలిసేది కదా! – ఇదీ ఆర్థిక భారతం ‘..దేశభక్తి, అఖండత అని ఒకటే అంటున్నారు.. మేం దేశభక్తి ఎలా చాటుకోవాలి? మా ఇంటిపై జెండా ఎగురవేసే కదా..? మరి జెండా ఎగురవేయడానికి మాకు ఇల్లు ఏది?..’ ..ఇది ఏ సామాన్యుడో అన్నది కాదు.. గరీబోళ్ల సీఎం టంగుటూరి అంజయ్య 1970లో అన్నమాట! మరి ‘ఇంటింటికీ జెండా పండుగ’.. అంటూ జెండాలు పంచిన నాయకులకు ఈ ప్రశ్న ఏమైనా ఎదురై ఉంటుందా.. బధిర శంఖారావంలా! – ఇదీ నేటి జన భారతం హుందాతనం, ఆత్మగౌరవం, సమన్యాయం.. చైతన్యం, సమున్నత మానవ విలువలు, సామాజిక న్యాయం, లౌకిక భావన, సౌభ్రాతృత్వం.. ఆదా యాల్లో, అంతస్థుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో.. సమానత్వం తెచ్చుకుందాం అని 75 ఏళ్ల క్రితం రాసుకున్న రాతలు రాజ్యాంగం పుస్తకాన్ని దాటి బయటికి రానట్టున్నాయ్.. – ఇదీ గణతంత్ర భారతం ... వీటన్నింటినీ అంబేద్కర్‌కు వదిలేసి మన నేతలు ఏం చేస్తున్నారో చూడండి. ► గాంధీ, గాడ్సేల ఎత్తును భారతీయత స్కేలుతో కొలిచి.. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువని తేల్చు కునే పనిలో తీరిక లేకుండా మునిగిపోయారు. ► ఇన్నేళ్లూ నెహ్రూ, గాంధీల పాలనలోనే భారతావని నడిచినా.. ఇప్పుడు క్విట్ ఇండియా స్ఫూర్తిగా దేశాన్ని ఏకం చేస్తామంటూ అదే గాంధీలు కొత్తగా ‘జోడో యాత్రలు’ చేస్తున్నారు. ► గాంధీ, నెహ్రూలపై విద్వేషం చిమ్ముతూ కొందరు.. నెహ్రూ కూడళ్లలో జనగణమన పాడుతూ గాంధీకి వెకిలి మకిలి పూస్తే జాగ్రత అని హెచ్చరిస్తూ మరికొందరు.. 75 ఏళ్ల తర్వాత కూడా అవే పేర్లు, అదే స్మరణ, అదే రాజకీయం.. ► 75 ఏళ్ల క్రితం గీసిన విభజన రేఖలు.. ఇప్పుడా దూరాన్ని మరింత పెంచాయి. రెండు వర్గాల మధ్య అపనమ్మకాన్ని, అగాధాన్ని ఎగదోస్తూ.. ‘లౌకికం’ అన్న మాటను ఫక్తు రాజకీయం చేశాయి. మన మట్టి మీదే పుట్టి పెరిగినా.. త్రివర్ణ పతాకం చేతపట్టి మేమూ భారతీయులమే అని చెప్పుకోవాల్సిన దుఃస్థితికి తెచ్చాయి. ► దేశ విభజన నాటి హింసాకాండ, విధ్వంసాలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మానిపోతున్న గాయాలను కెలుకుతూ విభే దాలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. నాటి దాష్టీకాన్ని నేటికీ అంటగడుతూ.. విచ్ఛిన్నకర శక్తులంటూ పాత కాలపు చర్చను లేవదీస్తూనే ఉన్నాయి. .. ఇదీ 75 ఏళ్ల భారతం.. స్వేచ్ఛ వచ్చిందనుకున్న తొలిరోజున ఉన్నకాడే.. ఇప్పటికీ ఉన్నామని చెప్పకనే చెబుతున్న తీరు.. ఇది స్వప్నం.. స్వాతంత్య్రోత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో యువతతో నడిచిన ఓ చిట్‌ఛాట్ ఇది. ‘..నేను పుణెలో చదివా, నాలుగేళ్లు బెంగళూరులో, ఇప్పుడు తిరువనంతపురంలో ఉద్యోగం. రేపు ఎక్కడికి వెళ్తానో తెలియదు. నన్ను ఏ ప్రాంతం వాడని అడక్కండి..’ ‘..ఇదిగో వీడు అబ్దుల్లా.. అమెరికా నుంచి ఈమధ్యే దిగుమతి అయ్యాడు, ఢిల్లీ వాడే అనుకోండి. ఈ అమ్మాయి సారిక, వీడి ఫియాన్సీ. వాళ్లు రాజు, అభిషేక్, శ్రవణ్.. మేమంతా హాస్టల్ మేట్స్.. మమ్మల్ని ఏ కులం, ఏ మతం అని ప్రశ్నించకండి. అవన్నీ పాలిటిక్స్ కోసమే.. మేం భారతీయులం..’ ... కెరీర్ గోలలో కొట్టుకుపోతూ దేశం గురించి పట్టించుకోవడం లేదని యువతపై వేస్తున్న అపవాదు నిజం కాదనిపిస్తోంది. వీరిని చూస్తుంటే.. కులం, ప్రాంతం, మతం హద్దులు చెరిపేసుకుని.. అన్ని వర్ణాలనూ త్రివర్ణంలో కలుపుకొని పోతారనే ఆశలు ఇంకా మిణుకుమిణుకుమంటున్నాయి. ఇది నిజం... అట్టడుగు వర్గాలను అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టి ఆనందపడ్డా, వారి పరిస్థితి ఉన్నకాడే ఉన్నదనడానికి ఇదొక్క ‘చిత్రం’ చాలదా! -
లింగ సమానత్వం: స్కూల్లో ఏం చెబుతున్నారు?!
‘ఆడ–మగ సమానత్వం ఎప్పుడు సాధ్యమౌతుంది?!’ ‘ఇప్పట్లో అయితే కాదు..’ అనేది ప్రపంచంలోని అన్ని సమాజాల్లో బలంగా పాతుకుపోయిన ఒక ఆలోచన. కానీ, సాధనతో అన్నీ సమకూరుతాయనేది మనందరికీ తెలిసిందే. ఆ నమ్మకంతోనే ఐక్యరాజ్యసమితి 2030 సంవత్సరానికి గడువును నిర్ణయించింది. లింగ సమానత్వం అనేది ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు. శాంతియుత, సంపన్నమైన, స్థిరమైన ప్రపంచానికి అవసరమైన పునాది. లింగ సమానత్వంలో పిల్లల వైఖరిని రూపొందించడంలో తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తారు. జెండర్ రోల్స్ పట్ల పిల్లల ప్రవర్తనలో మార్పులు తీసుకురావడానికి టీచర్ల శిక్షణ కచ్చితంగా సహాయపడుతుంది. అయితే, ‘అమ్మాయిలా ఏడుస్తున్నావేంటి?’ అని అబ్బాయిలను.. ‘ఏంటా వేషాలు, నువ్వేమైనా అబ్బాయివా?’ అంటూ అమ్మాయిలను.. జెండర్ రోల్‌ని ప్రధానంగా చూపుతూ ఉపయోగించే భాష వల్ల పిల్లల మైండ్సెట్లలో ‘వివక్ష’ ముద్రించుకుపోతున్నది కూడా వాస్తవం. మహిళల హక్కులను ప్రోత్సహించే సామాజిక మార్పును తీసుకురావడానికి విద్య అత్యంత శక్తిమంతమైన సాధనాల్లో ఒకటి. టీచర్లు విద్యావ్యవస్థకు మూల స్తంభం కాబట్టి, పాఠశాల స్థాయి నుంచే మార్పుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే, తరగతి గదుల్లో పాత మూస పద్ధతిలో భాషను ఉపయోగించకుండా, ప్రణాళికాబద్ధమైన శిక్షణ ద్వారా టీచర్లు లింగ అసమానతలను తొలగించడానికి కృషి చేయవచ్చు. తమకు తెలియకుండానే.. కొన్ని లింగ అవగాహన చర్చల ఆధారంగా లింగ వివక్షకు దూరంగా అందరూ ఆలోచించాలని ఆశించడం వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలుండవు. పిల్లల బాల్యం నుంచే ఈ విషయాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లింగ మూస పద్ధతులను నివారించడంలో టీచర్లు కీలకపాత్ర పోషిస్తారన్నది తెలిసిందే. నిజానికి టీచర్లు విద్యార్థుల పట్ల మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నప్పటికీ, వారి సాధారణ బోధనలో తరచూ తమకు తెలియకుండానే జెండర్ లైన్స్‌ను ఉపయోగిస్తుంటారు. మారుతున్న సమాజ ధోరణులు, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని టీచర్లు ‘లింగ’ భాషను మార్చుకోవడం కూడా తప్పనిసరి అని అంగీకరిస్తున్నారు ఉపాధ్యాయులు. ఆ దిశగా తామూ ముందడుగు వేస్తున్నామంటున్నారు. శిక్షణ అవసరం లింగ వివక్షలో టీచర్లు ప్రాథమికాంశాలను లోతుగా తెలుసుకుంటే పిల్లల మెదళ్లలో లింగసమానత్వాన్ని పెంపొందించడానికి శ్రద్ధ వహిస్తారు. తరగతి గదిలో ‘జెండర్’ భాషను వాడకుండా మానవసంబంధాలలోనూ, సామాజిక పరమైన పరివర్తన తీసుకురావడానికి, లింగ వివక్ష తగ్గించడానికి టీచర్లకు నైపుణ్యం అవసరం. లింగ సమానత్వానికి అన్ని స్థాయిలలో, అన్ని దశలలోనూ శిక్షణ అవసరం. మూస పద్ధతులకు స్వస్తి తరగతి గదిలో అబ్బాయిలు, అమ్మాయిలకు ఒకే విధమైన బోధన అందించేటప్పుడు ‘జెండర్’ గురించి ప్రస్తావన వస్తే మధ్యలో తటస్థ పదాలను ఉపయోగించడం ముఖ్యం. అంటే, కథనాలలో పాత్రలను ఉదాహరణగా తీసుకుంటున్నప్పుడు గత కాలపు మూస లక్షణాలను ఉపయోగించకూడదు. ఉదాహరణకు: ‘అబ్బాయిలు ధైర్యంగా’, ‘బలంగా ఉన్నారు. ‘అమ్మాయిల్లా ఏడ్వకండి’, ‘అమ్మాయిలు సున్నితమైనవారు,’... ఇలాంటివి. వాటిని వీలైనంతవరకు తొలగించడమే మంచిది. పాఠంలోనూ, సాధనలోనూ అబ్బాయిలు–అమ్మాయిలు సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా చదువు ఉండాలి. వీటిని తరగతి గదుల్లోనే కాదు ఇతర నైపుణ్యాలను పెంచే కార్యక్రమాల్లోనూ భాగం చేయచ్చు. అలాగే, కుటుంబ సభ్యుల మాటల్లోనూ, రోజువారీ పనుల్లోనూ ఈ లింగ నిబంధనలు పిల్లల మనస్సుల్లో బలంగా నాటుకుపోతాయి. అందుకని, పాఠశాలలు, కుటుంబాలు పిల్లలను లింగ సమానత్వంవైపు మళ్లించేందుకు కృషి చేయాలి. సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి కావల్సిన మార్పును తీసుకు రావాలంటే అన్ని స్థాయిలలో అందరూ కృషి చేయడమే దీనికి సరైన పరిష్కారం. అవగాహన వర్క్‌షాప్స్ చాలావరకు ఇంటి దగ్గరే వివక్ష ఉంటుంది. చదువు అంటే తరగతి గదిలోనే కాదు ఎన్సిసి వంటి వాటిల్లోనూ అమ్మాయిలను పంపించేందుకు తల్లిదండ్రులు ముందుకురావాలి. పిల్లలను వయసుకు తగినట్టు గైడ్ చేయాలని మా టీచర్స్‌కి చెబుతుంటాం. కానీ, జెండర్ ని దృష్టిలో పెట్టుకొని కాదు. స్కూల్ పరిధులు దాటి కూడా పిల్లల నైపుణ్యాలు ఉండాలి. వివిధ రకాల వర్క్‌షాప్స్‌కి అటెండ్ అవ్వాలి. అందుకే.. ఆటలు, ఇంటర్‌స్కూల్ కాంపిటిషన్స్, ఇతర విద్యార్థులతో కలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాం. పిల్లలను వేదికల మీద మాట్లాడనివ్వాలి. గెస్ట్ లెక్చరర్స్‌తో క్లాసులు ఇప్పించాలి. ఇవన్నీ కూడా అమ్మాయిలు–అబ్బాయిలు ఇద్దరూ సమానంగా పాల్గొనేవే. ఇలాంటప్పుడు వారిలోని ప్రతిభనే చూస్తారు తప్ప, వివక్ష అనేదానికి చోటుండదు. దీని వల్ల సమానత్వం అనేది దానికదే వస్తుంది. – సంగీతవర్మ, ప్రిన్సిపల్, రిచ్మండ్ హైస్కూల్, హైదరాబాద్ ఇద్దరూ విద్యార్థులే! ఈ మధ్య కాలంలో స్కూల్లో ఏ కార్యక్రమాల్లో అయినా అమ్మాయిలే ముందంజలో ఉంటున్నారు. తరగతిగది వరకే కాకుండా ఇతర ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటాం. కాకపోతే, గ్రామీణ స్థాయిలో అమ్మాయిలనే ఎక్కువ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. సమానత్వం ఇంటి నుంచే మొదలవ్వాలి. తరగతిలో టీచర్‌కి అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ విద్యార్థులే. – శైలజా కులకర్ణి, టీచర్, జడ్పిహెచ్ఎస్, కల్హర్, సంగారెడ్డి సున్నితత్త్వాన్ని ఇద్దరికీ నేర్పాలి.. ‘నువ్వేమైనా అబ్బాయివా?’ అని అమ్మాయిలను. ‘నువ్వేమైనా అమ్మాయివా?’ అని అబ్బాయిలను మాటలు అనకూడదు. నాకంటే వాళ్లు ఎక్కువ, వీళ్లు తక్కువ అనే ఆలోచన కూడా రాకూడదు. సున్నితత్త్వాన్ని ఇద్దరికీ నేర్పించాలి. ఇద్దరికీ ఎదుటివారికి గౌరవం ఇవ్వడం నేర్పాలి. ఇద్దరికీ ధైర్యం నేర్పాలి. ఇద్దరికీ చదువు నేర్పాలి. ప్రపంచంలో అందరికీ సమానహక్కులు ఉన్నాయి. అన్నింటా సమానత్వం ఉండాలి. ఎదిగే క్రమంలో పడే ‘మాటలు’ వారి మనసులో బలంగా ముద్రవేస్తాయి. మాటల ద్వారా కూడా ఇద్దరినీ వేరుగా చూడకూడదు. వీరే కాదు ఇప్పుడు ట్రాన్స్జెండర్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. ఎవరినీ చులకన చేయకూడదు. మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమెన్ సేఫ్టీ, గర్ల్ సేఫ్టీ అని ఉంటాయి. ఎందుకో కూడా వాటిని వివరించగలగాలి. పీరియడ్స్ సమయంలో సెన్సిటైజ్ విషయంలో ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. అబ్బాయిలకు కూడా ఇలాంటి విషయంలో అవగాహన కలిగించాలి. ఎదిగేక్రమంలో శరీరాకృతులు వేరుగా ఉంటాయి కానీ, మేధోపరంగా ఇద్దరూ ఒకటే. అవగాహన కల్పించడమే ముఖ్యం. – మేఘన ముసునూరి, ప్రిన్సిపల్, ఫౌంటెన్హెడ్ గ్లోబల్ స్కూల్ హైదరాబాద్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మహిళలు, బాలికలపై అన్ని రకాల వివక్ష, హింస, హానికరమైన పద్ధతులను అంతం చేయడం ద్వారా 2030 వరకు లింగసమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఎస్డిజి 5. మహిళల పూర్తి భాగస్వామ్యం, రాజకీయ, ఆర్థిక నిర్ణయాధికారం అన్నిస్థాయిలలో నాయకత్వానికి సమాన అవకాశాల కోసం పిలుపునిచ్చింది. 2015లో ఐక్యరాజ్యసమితి చేసిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఇది 5వది. – నిర్మలారెడ్డి -
సాధికారతే సౌందర్యం
మహిళలు... మౌనం వీడాలి... గొంతు విప్పాలి. చెప్పాలనుకున్నది... చెప్పగలగాలి. వాళ్లకు... ఓ ఆలంబన కావాలి. వినడానికి ఒకరున్నారనే భరోసానివ్వాలి. సాధికార సాధనలో ఒకరిది తొలి అడుగైతే మరొకరిది వందో అడుగు... అంతే. గమ్యం వేల అడుగుల దూరాన ఉంది. ఆ లక్ష్యాన్ని దగ్గర చేస్తోంది మమత‘సేవ’ ‘సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలి. తనకు గౌరవప్రదమైన స్థానాన్నిచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలి’... ఇదీ ఆమె ఫిలాసఫీ. మరి ఆ తిరిగి ఇవ్వడంలో ‘మీ ప్రాధాన్యం మహిళలకే... ఎందుకలా?’ అని అడిగిన వాళ్లకు ఆమె చెప్పే సమాధానం ఒక్కటే. ‘‘తరతరాల వివక్షకు తలొగ్గి మగ్గిపోయింది మహిళ. సమానత్వ పోరాటంలో అనుక్షణం అలసి పోతోంది. ఇంటి నాలుగ్గోడలు ఆమెను అర్థం చేసుకుంటాయి. కానీ ఆమె మనసులో ఆవేదనను బయటకు తెలియనివ్వకుండా అడ్డుకుంటాయి కూడా. మహిళ గొంతు విప్పడానికి సాహసం చేయలేని నిస్సహాయ స్థితిలోనే ఉంది నేటికీ. ఆమె ఎదగడానికి నిచ్చెన వేసే వాళ్లు ఉండరు. సాధికారత సాధనలో భాగంగా చెమటోడ్చి ఒక్కో సోపానాన్ని తనకు తానే నిర్మించుకుంటోంది. నా మాటలను నమ్మలేకపోతే నేను దత్తత తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చూడండి. ఆడపిల్ల పరిస్థితి అర్థమవుతుంది. ఒక్క పూట అయినా అన్నం దొరుకుతుందని బడికి వచ్చే అభాగ్యులు కనిపిస్తారు. చేనేత కుటుంబాల్లో ఆడవాళ్లను చూడండి, రంగులద్ది అద్ది అరచేతులు రంగుమారిపోయి ఉంటాయి. ఇక వేలాది రూపాయలు పెట్టి ఆ చీరలను ధరించగలిగిన సంపన్న వర్గాల మహిళలను కదిలించి చూడండి, జానెడు పొట్ట ఆకలి తీర్చడానికి పట్టెడన్నం ఎప్పుడు తినాలో తెలియని ఎదురు చూపులే ఉంటాయి. ఇంట్లో మగవాళ్లందరూ భోజనం చేసిన తర్వాత మాత్రమే ఆడవాళ్లు భోజనం చేయాలనే నియమాన్ని పాటిస్తున్న కుటుంబాలు మన దేశంలో ఇప్పటికీ ఉన్నాయంటే నమ్ముతారా?’’ అన్నారామె ఆవేదనగా. మహిళలంతా విజేతలే మమతా త్రివేది పూర్వీకులు వారణాసి నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఎం.ఎ సైకాలజీ చేసిన మమత... తన మామగారు ఆర్.పి. త్రివేది స్థాపించిన పబ్లికేషన్ వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. భర్త, కొడుకు చార్టెడ్ అకౌంటెంట్లు. కూతురు యూఎస్‌లో స్థిరపడింది. ఎంప్టీనెస్ అనేటంతటి పెద్ద పదం కాదు కానీ, కుటుంబ బాధ్యతలన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఏర్పడే ఒకలాంటి శూన్యత చాలామందికి ఎదురవుతుంది. కొద్ది సంవత్సరాలుగా ఒకే మూసలో సాగుతున్న డైలీ రొటీన్ కొంతమందిలో బోర్‌కు దారి తీస్తుంది.ఆ స్థితిలోనే జీవితానికి కొత్త అర్థాన్ని చెప్పుకోగలగాలి. అదే చేశారు మమత. ‘‘మా అమ్మాయి ప్రోత్సాహంతో నలభై ఏడేళ్ల వయసులో మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాను. మేకప్, హై హీల్స్ ధరించడం కొత్తగా అనిపించింది. ‘బ్యూటీ’ అనే పదానికి అసలైన అర్థం అప్పుడే తెలిసింది. మేని ఛాయ, ఎత్తు, లావు... ఇవేవీ కాదు. పరిస్థితికి తగినట్లు తనను తాను మార్చుకోగలిగిన నేర్పు, మార్పును స్వీకరించగలిగిన వైనం వంటి అనేక అంశాల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. సాధికారతను మించిన సౌందర్యం మరొకటి ఉండదు. స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయి పోటీల్లో నాకు ‘మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ వరల్డ్ (2017)’ కిరీటం దక్కింది. కానీ ఆ పోటీలకు ముప్పైకిపైగా దేశాల నుంచి వచ్చిన మహిళల్లో ప్రతి ఒక్కరూ విజేతలే అని చెప్పాలి. ప్రతి ఒక్కరిలో ఒక గొప్పతనం ఉంది. నిజానికి నేను అసలైన ప్రపంచాన్ని చూసింది అప్పటి నుంచే. ప్రతి మహిళకూ జీవితంలో పోరాటం ఉంటుంది. జీవితంతో పోరాడి నిలబడడమే గొప్ప విజయం. అప్పటి వరకు ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదు. ఇల్లు, పబ్లికేషన్ వ్యాపారం, పిల్లలు... ఇదే లోకంగా జీవించాను. ఈ పోటీల్లో టాస్కుల్లో భాగంగా నా గురించి రాసి ఎఫ్బీలో పోస్ట్ చేయాల్సి వచ్చింది. నా సోషల్ మీడియా జర్నీ అలా మొదలైంది. మిసెస్ ఏసియా ఇంటర్నేషనల్ వరల్డ్ విజేత మమతా త్రివేది అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ! బ్యూటీ విత్ హార్ట్... కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆత్మహత్యల నివారణ కోసం పని చేస్తున్నాను. ‘సేవ (ఎస్ఈడబ్లు్యఏ, సొసైటీ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్)’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి మహిళల సాధికారత కోసం పని చేస్తున్నాను. హైదరాబాద్ సమీపంలోని షాద్‌నగర్ దగ్గర బాలానగర్ ప్రభుత్వ పాఠశాల, హైదరాబాద్, బర్కత్‌పురాలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత చేసుకున్నాను. ప్రభుత్వ స్కూళ్లలో ఎన్‌రోల్‌మెంట్‌ను ఒకసారి పరిశీలించండి. అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. ఆడపిల్లలను చదివిస్తున్నారని సంబర పడితే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. మగపిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తూ ఆడపిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తున్నారు. పైగా వాళ్లను టెన్త్ తర్వాత చదివించరు. ఎనిమిదో తరగతి నుంచే డ్రాపవుట్లు మొదలవుతుంటాయి. పెళ్లి చేసేయడం అన్నింటికీ పరిష్కారం అన్నట్లు ఉంటాయి పేరెంట్స్ ఆలోచనలు. ఆ ఆడపిల్లలు ఎంత చురుగ్గా ఉంటారంటే... క్షణాల్లో చక్కగా బొమ్మలు వేసే వాళ్లున్నారు. వాళ్లకు చాక్లెట్ తయారీ, పెయింటింగ్, ప్రింటింగ్ వంటి మాకు తెలిసిన స్కిల్స్ నేర్పిస్తున్నాం. ఎనభై శాతం మార్కులతో పాసైన అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ల కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషనల్ అడాప్షన్ చేస్తున్నాం. వీవర్స్ కుటుంబం నుంచి కూడా విద్యాదత్తత చేసుకున్నాం. తొలి అడ్డంకి గడప లోపలే ఎవరైనా ఏదో ఒక ప్రత్యేకత సాధించాలంటే కుటుంబం ప్రోత్సాహం తప్పనిసరి. చాలామంది ఆడవాళ్లకు ఇంట్లో సాటి ఆడవాళ్ల నుంచే మద్దతు కరవవుతోంది. తొలి అడ్డంకి ఇంట్లోనే ఎదురవుతోంది. ఈ విషయంలో మహిళలు ఇంట్లో వాళ్లతో పోరాడడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఇంట్లో వాళ్లను కన్విన్స్ చేసుకోవడమే కరెక్ట్. ఆ తొలి మెట్టులో విజయం సాధించగలిగితే ఇక ఆమె ప్రస్థానంలో ఎదురీతలు పెద్దగా ఉండవు. అందుకు నేనే ఉదాహరణ’’ అన్నారు మమతా త్రివేది. ఆమె చేస్తున్న సేవలో తొలి ప్రయోజకులుగా మహిళలు కనిపిస్తున్నప్పటికీ ఆ ఫలితం కుటుంబానికి ఉపయోగపడుతుందంటారామె. అందుకే సమాజానికి తాను తిరిగి ఇస్తున్న ప్రయోజనాలకు వారధులుగా మహిళలనే ఎంచుకున్నానన్నారు. తరాల కలనేత పోచంపల్లికి వెళ్లి చేనేతకారుల కుటుంబాలను చూస్తే కన్నీరు వస్తుంది. భార్యాభర్త నెలంతా కష్టపడితే వాళ్లకు వచ్చేది పదిహేను వేల రూపాయలే. వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న చీరలు మార్కెట్లో ఏ ధరకు అమ్ముడవుతాయో కూడా వాళ్లకు సరైన అంచనా లేదు. వాళ్లకు తగినంత పని కల్పించడానికి, మంచి రాబడినివ్వడానికి గాను... నేను నిర్వహిస్తున్న బ్యూటీ కాంటెస్ట్‌లలో తప్పనిసరిగా ట్రెడిషనల్ వేర్ ఉండేటట్లు చూస్తున్నాను. ఇటీవల ర్యాంప్ వాక్ కూడా అక్కడే ఏర్పాటు చేశాను. ఆగస్టు ఏడవ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా మరో కార్యక్రమం నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాను. నాకు స్వతహాగా కూడా చేనేత చీరలంటే చాలా ఇష్టం. నేను కట్టుకున్న ఈ చీరను చూడండి. అరవై ఏళ్ల నాటిది. మా అత్తగారి చీర. ఇప్పటికీ అదే మెరుపు. అందుకే ఈ కళను బతికించుకోవాలి. – మమతా త్రివేది, ఫౌండర్, సొసైటీ ఫర్ ఎంపవరింగ్ ఉమెన్ రీజనల్ డైరెక్టర్, మిసెస్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు : నోముల రాజేశ్ రెడ్డి -
విద్యార్థిపై జాత్యహంకార దాడి.. పక్కాగా ప్లాన్ చేసి, సీట్లో ఆల్కహాల్ పోసి నిప్పు
మెక్సికో: స్థానిక భాష మాట్లాడినందుకు 14 ఏళ్ల విద్యార్థికి తరగతి గదిలోనే నిప్పంటించారు తోటి విద్యార్థులు. ఈ దారుణ ఘటన మెక్సికో క్వెరెటరో రాష్ట్రంలో జూన్‌లో జరిగింది. తీవ్ర గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించగా.. చాలా రోజుల చికిత్స అనంతరం ఈ వారమే డిశ్ఛార్జి అయ్యాడు. జాతి వివక్ష వల్లే తన కుమారుడిపై దాడి జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు విద్యార్థులు సహా పాఠశాల సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. దాడి జరిగిన ఈ విద్యార్థి పేరు జువాన్ జమొరానో. క్వెరెటరోలోని హైస్కూళ్లో చదవుతున్నాడు. అయితే ఇతను మెక్సికో సంప్రదాయ తెగ అయిన ఒటోమి కుటుంబం నుంచి వచ్చాడు. ఈ విషయం తెలిసి తోటి విద్యార్థులు అతడ్ని వివక్షపూరితంగా చూస్తున్నారు. ఓ రోజు ఇద్దరు విద్యార్థులు జువాన్ కూర్చొనే సీట్లో ఆల్కహాల్ పోశారు. అది చూసుకోకుండా అతను అలానే కూర్చుకున్నాడు. ప్యాంట్ తడిచాక విషయాన్ని గమినించి వెంటనే పైకి లేచాడు. ఆ సమయంలో ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు జూవన్కు నిప్పంటించారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. టీచర్ కూడా వేధిస్తోంది పాఠాలు చెప్పే టీచర్ కూడా తమ బిడ్డను వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు జువాన్ తల్లిదండ్రులు. ఒటోమి భాష మాట్లాడితే తోటి విద్యార్థులు జువాన్‌తో గొడవపడేవారని, అతడ్ని వేధించేవారని తెలిపారు. అందుకే స్కూళ్లో ఆ భాష మాట్లాడాలంటేనే అతను భయంతో వణికిపోయేవాడని వివరించారు. అధ్యక్షుడి రియాక్షన్ మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుల్ లోపెజ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. అవసరమైతే ఈ కేసును దేశ అటార్నీ జరనల్ కార్యాలయం తమ చేతుల్లోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒటోమి భాష మాట్లాడటమే జువాన్ చేసిన నేరమా అని, జాతివివక్షను అంతం చేయడం అందరి బాధ్యత అని లోపెజ్ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. 12.6కోట్ల జనాభా ఉన్న మెక్సికోలో జాతి వివక్ష దాడులు సాధారణం అయిపోయాయి. ఈ దేశంలో దాదాపు 2.3 కోట్ల మంది సంప్రదాయ తెగలకు చెందినవారున్నారు. వీరిలో 73లక్షల మంది స్థానిక భాషే మాట్లాడుతారు. దాదాపు 40 శాతం మంది సంప్రదాయ తెగలు తమను వివక్షతో చూస్తున్నారని ఫిర్యాదు చేశారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చదవండి: ప్రధాని నివాసం వద్ద వేల మంది నిరసనకారులు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం -
పాత వీడియోతో.. వివాదంలో రిషి సునాక్!
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటిష్ పొలిటీషియన్ రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నారు. పీపుల్స్ ఛాయిస్‌గా ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది అక్కడ . ఈ తరుణంలో.. ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్ కావడమే కాదు.. విమర్శలకు తావు ఇస్తోంది. ఆయన చేసినవి వర్గీకరణ, వివక్షకు సంబంధించిన వ్యాఖ్యలు కావడమే విమర్శలకు ప్రధాన కారణం. కేవలం ఏడు సెకండ్ల నిడివి ఉన్న వీడియోనే హైలెట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు కొందరు. తనకు రాజకుటుంబానికి చెందిన వాళ్లు, ఉన్నత వర్గాలకు చెందిన వాళ్లే స్నేహితులుగా ఉన్నారని, వర్కింగ్ క్లాస్ నుంచి స్నేహితులెవరూ లేరంటూ చాలా క్యాజువల్‌గా సమాధానం ఇచ్చాడు రిషి సునాక్. 2001లో బీబీసీ డాక్యుమెంటరీ కోసం చేసిన ఇంటర్వ్యూలో రిషి సునాక్ పైవ్యాఖ్యలు చేశాడు. "I have friends who are aristocrats, friends who are upper class and friends who are working class....well not WORKING CLASS!" The 'People's Chancellor' in the making, 2001 🙄@PeterStefanovi2@campbellclaret@allthecitizens@reece_dinsdale pic.twitter.com/t372I9A9F8 — Kathryn Franklin (@DerbyDuck) March 27, 2022 ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండడంపై.. పీపుల్స్ ఛాన్స్లర్ ఇతనేనా? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. శ్రమ జీవి వర్గాన్ని గౌరవించలేనివాడు ప్రధాని పదవికి ఎలా అర్హుడు అవుతాడంటూ నిలదీస్తున్నారు మరికొందరు. అయితే పనిమాలా కొందరు ఈ పని చేస్తుండడంతో.. రిషికి మద్దతుగా నిలుస్తున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే.. కన్జర్వేటివ్ పార్టీ తరపున రిచ్మండ్(యార్క్స్) పార్లమెంట్ సభ్యుడైన సునాక్ రిషి.. ఎక్స్‌చెకర్ ఛాన్స్లర్ పదవికి రాజీనామా సైతం చేశారు. దీంతో ప్రధాని రేసులో ఈయన పేరే ప్రముఖంగా ఉంది అక్కడ. -
50 ప్లస్..: టెక్నాలజీ రంగంలో వయసు వివక్ష
పని ప్రదేశాల్లో స్త్రీ–పురుష వివక్ష తెలిసిందే. పెరిగే వయసు కూడా స్త్రీని వివక్షకు లోనయ్యేలా చేస్తుందా?! ‘అవును’ అంటున్నాయి ఇటీవలి నివేదికలు. వయసు అనేది ఒక అంకె మాత్రమే అయినా అంకెల్లో జీతం అందుకోవాలంటే మాత్రం నిత్యం సవాళ్లను అధిగమించాల్సిందే! తనను తాను నిరూపించుకోవాల్సిందే!! ఉద్యోగ నియమాకాల్లోనే కాదు పనిచేసే చోట స్త్రీలు వయస్సు సంబంధిత వివక్ష ఎదుర్కొంటున్నారని ఆర్ప్(అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్స్) సంస్థ సర్వే స్పష్టం చేసింది. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు తమ వయస్సు కారణంగా చేస్తున్న ఉద్యోగాలను వదిలేస్తున్నారని లేదంటే తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని ఈ సంస్థ వెల్లడించింది. అమెరికాలో ఈ వివక్ష 30 శాతం ఉంటే ఆసియా– ఆఫ్రికా మహిళల్లో 60 శాతంగా ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఆర్ప్ సంస్థ అమెరికా, ఆసియా, ఆఫ్రికన్ మహిళలతో నిర్వహించిన పోల్‌లో 50 ఏళ్ళ పైబడిన ఉద్యోగులైన 6,643 మంది ఫొటోలను తీసుకుంది. ఆ ఫొటోల్లో వారు నిరాశ, దిగులు, విలువైన జీవితాన్ని కోల్పోయినవారిగా కనిపించారు. యాౖ¿ñ ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న ఉద్యోగునులైన మహిళలల్లో వృద్ధాప్యం అనే మాట విరివిగా వినిపించింది. జాతి/రంగు/బరువు/లింగ, సామాజిక తరగతి ఆధారంగా ఈ వివక్ష స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆరోగ్యంపై ప్రభావం యాభై ఏళ్లు దాటిన మగ ఉద్యోగులతో పోల్చితే వయసు వివక్ష కారణంగా మహిళలు ఎక్కువ శాతం ఆందోళన, డిప్రెషన్, మానసిక క్షోభ, ఊబకాయం, అధిక రక్తపోటు.. వంటి వాటికి సంబంధించిన లింక్‌లను ఓపెన్ చేసి, పరిశోధించినట్లుగా గుర్తించారు. ఈ కారణంగా ఈ వయసు వారిలో అధికబరువు పెరుగుతుందని, ఇది కూడా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్రహించారు. మిగతా వాటికన్నా టెక్నాలజీ రంగంలోనే ఈ ప్రభావం ఎక్కువ ఉందని గుర్తించారు. సామర్థ్యంపై తక్కువ అంచనా! ప్రఖ్యాత బహుళజాతి కంపెనీలో పనిచేసి, ప్రస్తుతం ఇంటి వద్ద ఉన్న 56 ఏళ్ల ఆమె (పేరు రాయడానికి ఇష్టపడలేదు) మాట్లాడుతూ ‘వయసు కారణంగానే జాబ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింద’ని తెలియజేశారు. ఉద్యోగినిగా కంపెనీ కి అందించిన తన సమర్థతనూ వెలిబుచ్చారు. ‘టెక్నాలజీ రంగంలో చాలా వరకు మగవారికి, యువతకే ప్రాధాన్యం ఉంటుంది. వయసు గురించి చర్చించాల్సిన అవసరం లేనప్పటికీ కంపెనీ యాజమాన్యం, వస్తున్న నవతరం కూడా 50 ప్లస్ వారికి టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో సరిగా తెలియదని అనుకుంటున్నారు. ఉద్యోగనియామకాల్లోనూ ఎక్కువ వయసు ఉన్నవారిని కోరుకోవడం లేదన్నది వాస్తవం’ అంటారు ఆమె. సమాజ ప్రభావం ‘ఇన్నాళ్లూ ఉద్యోగం చేశారు. సొంత ఇల్లు ఉంది, పిల్లలు స్థిరపడ్డారు. విశ్రాంతి తీసుకోవచ్చు కదా’ అని 50 ప్లస్ వారి పట్ల ఒక జాలితో కూడిన కన్సర్ చూపిస్తుంది సమాజం. అందువల్ల కూడా మహిళలు త్వరగా ఉద్యోగం నుంచి తప్పుకుంటారు’ అంటారు కార్పొరేట్ కంపెనీలకు అర్హత గల ఉద్యోగులను నియమించే ప్రతిభ. ఈ వయసు మహిళలు ఒక సౌకర్యవంతమైన జీవనాన్ని కోరుకుని, ఇంటికి పరిమితం అవుతున్నారంటారు. కాస్మొటిక్ సర్జరీలు.. మహిళలు అనుభవించే ఒత్తిడిలో ఎక్కువ భాగం యవ్వనంగా కనిపించాల్సిన అవసరానికి సంబంధించే ఉంటుందని యాంటీ ఏజింగ్ పరిశోధకుడు, బ్రేకింగ్ ది ఏజ్ కోడ్ రచయిత టెక్కా లెవీ అంటారు. కాస్మెటిక్ ప్రక్రియలు, సోషల్ మీడియా నుంచి కూడా ఈ వయసు వాళ్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పోల్‌లో పాల్గొన్నవారిలో సగానికి పైగా మేకప్‌కి సంబంధించిన ఒత్తిడిని తెలియజేశారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి 35 శాతం మంది ఆసక్తి చూపారు. ఏ రంగంలోనైనా తమకు తాముగా నిలబడటానికి ప్రతి దశలోనూ ప్రయత్నం చేస్తున్న మహిళలు ఉన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ తమని తాము నిరూపించుకుంటున్నారు. అయినప్పటికీ ఎన్నో బాధ్యత లు, అవకాశాలు, సౌకర్యాల దృష్ట్యా మగవారితో పోల్చితే ప్రపంచ మహిళ వయసు రీత్యా వివక్ష ఎదుర్కొంటున్నదన్నది వాస్తవం. కారణాలతో ఆగిపోకూడదు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను సమర్థవంతంగా నడుపుతున్న వారిలోనూ యాభై ఏళ్ల పైబడిన మహిళలున్నారు. సవాల్‌గా తీసుకుంటే వయసు అనేది పెద్ద విషయం కాదు. కంపెనీలు కూడా సమర్థంగా పనిచేసేవారిపైనే దృష్టిపెడతాయి. ఎప్పుడూ నైపుణ్యాలు పెంచుకోవడం, తమని తాము అప్‌గ్రేడ్ చేసుకోవడంపై దృష్టి పెడితే ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. పిల్లల విషయంగానో, ఆరోగ్యం బాగోలేదనో, సౌకర్యంగా ఉండచ్చు కదా అనో.. చాలా మంది యాభైలలో ఉన్నవారు జాబ్ మానేస్తారు. లేదంటే సెలవులు ఎక్కువ పెట్టేస్తుంటారు. దానికి ‘వయసు’ కారణం చూపడం మాత్రం సరికాదు. – ప్రతిభ పులిజాల, మీ స్కూల్ (మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్) ఛాలెంజ్ తప్పదు యాభై ఏళ్ల తర్వాత టెక్నాలజీ రంగంలో మహిళలకు పురుషులతో పోల్చితే ఉద్యోగావకాశాలు తక్కువే. ఈ వివక్ష ప్రపంచవ్యాప్తంగా ఉంది. యాభై ఏళ్ల తర్వాత మంచి హోదాలో ఉన్నవారు ఇప్పటికీ పది శాతం మహిళలే ఉన్నారు. వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. యాభై ఏళ్ల వయసులోనూ మంచి ప్రాజెక్టులు రాబట్టడానికి నేను ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే, ఇంకా కంపెనీని నిర్వహించగలుగుతున్నాను. వివక్ష ఉందని వెనకడుగు వేయకుండా తమని తాము నిరూపించుకుంటూ, సొంతంగా ప్రణాళిక లు వేసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడం, బాధ్యతలు తీరి తమకి తాముగా కొత్త మార్గాన్ని వేసుకోవడానికి మాత్రం ఇది అత్యుత్తమమైన వయసు. – ప్రీతి మాలిక్, కార్పొరేట్ మేనేజ్మెంట్ – నిర్మలారెడ్డి -
కులరహిత సమాజం కోసం...
ఎడ్మండ్ బర్క్ అనే ఐరిష్ తత్వవేత్త ‘నిజమైన మతమే సమాజానికీ, మానవీయ ప్రభుత్వానికీ పునాది’ అని పేర్కొన్నాడు. ఉదాహరణకు చైనాలో కమ్యూనిజం విజయం సాధించడానికి బుద్ధిజం కారణమని చెప్పవచ్చు. హిందూ దేశంగా ప్రసిద్ధిగాంచిన భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు గడిచిపోయినప్పటికీ కుల అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా సామాజిక సంబంధాల్లో మార్పు లేకుండా ఉండటానికి హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థే కారణం. ఎందుకంటే కులాలు జన్మించినవే హిందూ మతానికి చెందిన శాస్త్రాల నుండి కనుక. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగబద్ధంగా సమస్త హక్కులను కల్పించి కుల నిర్మూలన, సమ సమాజ స్థాపనే రాజ్యాంగం లక్ష్యంగా నిర్ధారించారు. ఆర్థిక, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో సంస్కరణలు చేయడం వల్ల మాత్రమే సమాజంలో మార్పు తేలేం. మతంతో సంబంధం లేని సామాజిక సంస్కరణలు తేవడం వలన సమాజంలో కొంత మార్పును మాత్రమే తేగలం. అదే మతంతో ముడిపడి ఉన్న సంస్కరణలైతే అత్యధిక మార్పులు తేవచ్చు. అయితే ఇందుకోసం మత సంస్కరణ జరగాలి. మత సంస్కరణలు చెయ్యలేని సందర్భంలో మతంతో ముడిపడి ఉన్న సమస్యలను రాజ్యాంగ సవరణల ద్వారా అధిగమించవచ్చు. ఫలితంగా సామాజిక దొంతర మారే అవకాశం లభిస్తుంది. రాజ్యాంగ సవరణలు ద్వారా అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మన కుల వ్యవస్థను పోలిన జాతి వివక్షను నిషేధించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసు కోవాలి. దక్షిణాఫ్రికాలో 1948లో అక్కడి నేషనల్ పార్టీ వారు తెలుపు–నలుపు ప్రజల మధ్య జాతి వివక్షను చట్టబద్ధమైనదిగా మార్చారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం అమలు చేసిన విధానానికి మద్దతు పలు కుతూ కొంతమంది క్రైస్తవులు బైబిల్‌ను దుర్వినియో గించారు. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు అని బైబిలు చెప్పినప్పటికీ కొందరు శ్వేత జాతి మత పెద్దలు వారి ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలా చేశారు. అయితే అక్కడి ప్రభుత్వం మత సంస్కరణలు చేయలేని పరిస్థితుల్లో 1994లో రాజ్యాంగ సవరణల ద్వారా సమాజంలో వర్ణవివక్ష లేని సమాజాన్ని స్థాపించింది. అమెరికాలో కూడా 1865లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతి ఆధారిత బానిసత్వాన్ని తొల గించి అందరూ సమానులే అని నిర్ధారించి తద నంతరం అనేక సవరణల ద్వారా సమ సమాజాన్ని స్థాపించారు. (క్లిక్: సామాన్య శూద్రుడికి సెయింట్‌హుడ్) దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్నా, పరువు హత్యల పేరున కులాంతర వివాహం చేసుకున్న దంపతులను హత్య చేస్తున్నారు. ఇలాంటి హత్యలు దేశంలో మానవ జాతికే కళంకం తెస్తున్నాయి. ఇలాంటి తరుణంలో... మన దేశంలో హిందూ మతంలో సంస్కరణలు, హిందూ మత గ్రంథాల సవరణలు సాధ్యమయ్యేపని కాదు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యంగ పీఠిక, అధికరణల మేరకూ; సుప్రీంకోర్టు 2011లో కె.కె. భాస్కరన్ వర్సెస్ స్టేట్ అఫ్ తమిళనాడు, నందిని సుందర్ వర్సెస్ స్టేట్ అఫ్ ఛత్తీస్‌గఢ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం... దేశంలో పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. తద్వారా రాజ్యాంగంలో ‘ఆర్టికల్ 17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. అది సాధ్యం కానిపక్షంలో ‘కులాంతర వివాహాల పరిరక్షణ’ చట్టాన్ని ఏర్పాటు చేసి పక డ్బందీగా అమలు చెయ్యాలి. ప్రాథమిక విద్యాభ్యాసం నుండి విద్యార్థులకు దేశాన్ని పీడిస్తున్న కుల సమస్యను నిర్మూలించడానికి తగు విధానాలను నేర్పించాలి. లేనట్లయితే రాజ్యాంగ లక్ష్యమైన కులరహిత సమాజాన్ని స్థాపించడం అసాధ్యం. (క్లిక్: మతాలు కాదు... మనిషే ప్రధానం) - కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
వివక్షపై.. నమ్రత పిడికిలి
ఇటీవల ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ దివ్యాంగ పిల్లవాడిని విమానంలో ఎక్కడానికి అనుమతించలేదు. ‘‘ప్రత్యేక అవసరాలు కలిగిన ఇతనివల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడతారు’’ అని సాకును చూపిస్తూ పిల్లవాడిని విమానంలోకి ఎక్కడానికి నిరాకరించింది. ఈ సంఘటనను చూసిన వారంతా..ఇంత చిన్నచూపా? ఇదేం పని? అంటూ విమర్శిస్తూనే వారి అమానుషత్వాన్ని తీవ్రంగా ఖండించారు. అయితే 35 ఏళ్ల నమ్రత మాత్రం అందరిలా ‘అయ్యోపాపం’ అనో, పిడికిళ్లు బిగించో ఊరుకోలేదు. దివ్యాంగులను విమాన సిబ్బంది అలా ఎలా అడ్డుకుంటారు? ఇది సరైంది కాదంటూ ఏకంగా ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. ‘‘నాకు ఒక చెవి వినపడదు. చుట్టూ ఉన్నవారు నన్ను ఎంత అవహేళనగా చూస్తారో ఆ బాధ నాకు తెలుసు’’ అని చెబుతూ తనలా సమాజంలో వివక్షకు గురవుతోన్న ఎంతోమంది అట్టడుగు వర్గాల వారి తరపున నిలబడి పోరాడుతోంది నమ్రత. మేఘాలయకు చెందిన అమ్మాయి నమ్రతాశర్మ. గోర్ఘా కమ్యునిటీలో ఎనిమిదో తరానికి చెందిన అమ్మాయి. నాగాలాండ్‌లో పుట్టడడం వల్ల నమ్రతకు నేపాలీ కూడా మాట్లాడం వచ్చు. మేఘాలయలో పోస్ట్రుగాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత గ్రామీణాభివద్ధి సెక్టార్లో ఉద్యోగం రావడంతో బీహార్ వెళ్లింది. ఉద్యోగం వల్ల వినికిడి పోయింది... ఎవరికైనా ఉద్యోగం వస్తే కష్టాలన్నీ పోయి సంతోషంగా అనిపిస్తుంది. నమ్రతకు మాత్రం ఉద్యోగంతో పెద్ద కష్టమే వచ్చింది. మేఘాలయాలో పెరిగిన నమ్రత ఉద్యోగరీత్యా బీహార్‌కు వచ్చింది. అక్కడి వాతావరణం మేఘాలయకు పూర్తి భిన్నంగా ఉండడంతో ఆమెకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఉద్యోగ విషయంలో అంతా బాగానే ఉన్నప్పటికీ వేడి ఎక్కువగా ఉండడం వల్ల తరచూ డీహైడ్రేషన్‌కు గురయ్యేది. ప్రారంభంలో సర్దుకున్నప్పటికీ క్రమంగా తన చెవి నరాలు ఎండిపోయి వినికిడి శక్తిని కోల్పోయింది. తనతో ఎవరు మాట్లాడినా సరిగా వినిపించేది కాదు. దీంతో తన సహోద్యోగులంతా ‘హే చెవిటిదానా’ అని పిలిచి పెద్దగా నవ్వుకునేవారు. నమ్రత మాటల్లో నేపాలీ యాస ధ్వనించడంతో ‘ఏ నేపాలీ’ అని కూడా ఆమెను కించపరిచేవారు. ఇలా పదేపదే జరగడంతో నమ్రతకు చాలా బాధగా అనిపించేది. గొంతుకగా నిలవాలని కొంతమంది తనకు సాయం చేస్తామని చెప్పి ఆమె మీద జోకులు వేసి నవ్వుకోవడాన్ని భరించలేని నమ్రతకు... ‘‘నాకు ఒక్క చెవి వినపడకపోతేనే ఇలా గేలిచేస్తున్నారు. కొంతమందికి పూర్తిగా వినపడదు. అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటీ?’’ అనిపించింది. ఇలా అవమానాలు ఎదుర్కొంటోన్న వారికి సాయపడాలని నిర్ణయించుకుంది. దళిత, ఆదివాసి మహిళలు, అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు ఎవరైతే వినికిడి శక్తిని కోల్పోయారో, మాట్లాడలేరో, అలాంటి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి గొంతుకగా నిలబడుతోంది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకోసం నమ్రత వేసిన పిటిషన్ ఇది తొలిసారి కాదు. గతంలో కూడా నమ్రత బెంగళూరులో ఉన్నప్పుడు.. అక్కడ ఉన్న ఒకే ఒక డెఫ్ ఇన్స్టిట్యూట్ ‘టెక్నికల్ ట్రై నింగ్ స్కూల్’ను మెట్రో నిర్మాణంలో భాగంగా కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ స్కూలును కూల్చవద్దని పిటిషన్ వేసింది. దీనికి అక్కడి స్థానికులు కూడా మద్దతు తెలపడంతో స్కూలు కూల్చడాన్ని మెట్రో అధికార యంత్రాంగం వాయిదా వేసింది. ఆ తర్వాత ‘పాతాల్‌లోక్’ వెబ్ సిరీస్ లో ఈశాన్య దేశాల ప్రజలను కించపరిచే విధంగా మాటలు ఉన్నాయని, వాటిని తొలగించాలని పిటిషన్ వేసింది. ఇలా సమాజంలో ఎదురయ్యే అనేక వివక్షలను గొంతెత్తి ప్రశ్నిస్తూ ఎంతోమందికి కనివిప్పు కలిగిస్తూ సమాజాభివద్ధికి తనవంతు సాయం చేస్తోంది నమ్రత. మానవత్వం చూపాలి మనుషులమని మర్చిపోయి ప్రవర్తించడం చాలా బాధాకరం. మనుషుల్లో కొంతమంది పొడవుగా, మరికొంతమంది పొట్టిగా, వివిధ రకాల రంగూ, రూపురేఖలతో విభిన్నంగా ఉంటారు. అంతమాత్రాన వాళ్లు మనుషులు కాకుండా పోరు. ఎటువంటి లోపాలు, అంతరాలు ఉన్నప్పటికీ వాళ్లు మనలాంటి మనుషులని గుర్తించాలి. వికలాంగుల పట్ల వివక్ష చూపకూడదు. మానవత్వం చూపాలి. – నమ్రతా శర్మ -
ఆమెకు వివక్షత వేధింపులే వరంగా మారాయి...ఏకంగా రూ. 72 లక్షలు గెలుపొందింది
కంపెనీల్లో కొంతమంది సహోద్యోగులతో తొందరగా కలవలేక ఇబ్బంది పడుతుంటారు. అలాగే సహోద్యోగులు కొంతమంది తమ తోటి ఉద్యోగులు అనే భావం లేకుండా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అందులోనూ మహిళలైతే ఇలాంటి సమస్యలు మరింతగా ఎదుర్కొంటారు. కొంతమంది తమ కంటే బాగా పనిచేస్తుందన్న అక్కసుతో లేక తమ కంటే తక్కువ కులం అనో తమతో కలవనీకుండా దూరం పెడతూ ఆవేదనకు గురయ్యేలా చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక ఆమె ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంది. ఐతే ఆమె పోరాడి అందుకు ప్రతిగా పరిహారాన్ని కూడా అందుకుంది. వివరాల్లోకెళ్తే....లండన్‌లోని స్ట్రాట్ఫోర్డ్లో ఆస్పర్స్ క్యాసినో అనే గేమింగ్ కంపెని ఉంది. 51 ఏళ్ల రీటా లెహెర్ అనే అమె ఆ కంపెనీ క్వాషియర్గా పనిచేస్తోంది. ఐతే ఆమె ఆఫ్రికన జాతికి చెందని మహిళ. దీంతో ఆకంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఆమెను దూరం పెట్టేవారు. ఆఫీసులో జరిగే ఎలాంటి ఫంక్షన్లకి, పార్టీలకి ఆమెని పిలిచేవారు కాదు. రీటాకి గేమింగ్ కంపెనీలో 22 ఏళ్ల అనుభవం ఉంది. ఆమె ఆ కంపెనీలో హై-ఎండ్ డీలర్‌గా, షాప్ మేనేజర్‌గా కూడా విధులు నిర్వర్తించింది. కానీ ఆమెకు కంపెనీలో సహోద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి తగిన గుర్తింపు గానీ గౌరవం గానీ లేదు. అంతేకాదు ఆమె ప్రమోషన్ కోసం చేసుకున్న దరఖాస్తులను కూడా పదేపదే తిరస్కరింపబడేవి. దీంతో ఆమె చాలా ఏళ్లు విసిగిపోయి ఒక దశలో కంపెనీకి రిజైన్ చేసి వెళ్లిపోవాలనుకుంది కూడా. ఇక ఈ జాతి వివక్షతకు చెక్‌పెట్టాని నిర్ణయించుకుని పై అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కంపెనీ ప్యానెల్ ఈ విషయమై పూర్తిగా విచారణ జరిపింది. రీట్ జాతి వివక్షతకు గురిఅవ్వడమే కాకుండా సహోద్యోగులు ఆమె పట్ల నడుచుకున్న తీరు, ఆమె పడిన మానసిక క్షోభను అర్థం చేసుకుంది. సహోద్యోగులు, అధికారులు ఒక ఉద్యోగిని వివక్షతకు గురిచేస్తే ఆ ఉద్యోగి పనిపై తీవ్రప్రభావం పడుతుందని, తన చుట్టు ఉన్న వాతావరణం బాగుంటేనే ఆ ఉద్యోగి నూతనోత్సహంతో పనిచేయగలుగుతుందని ఇది సహించలేనిదని తెలిపింది. రీటా ఎదుర్కొన్న వివక్ష వేధింపులకు పరిహారంగా ఆమెకు సుమారు రూ 72 లక్షలు అందజేయనున్నట్లు కూడా ప్రకటించింది. (చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని) -
ఆరెస్సెస్ అలాంటిది కాదని ఆయనకు చెప్పా: గడ్కరీ
పుణే: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికరమైన ఓ ఘటనను మీడియాతో పంచుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా, ఆరెస్సెస్‌పై వ్యాఖ్యలు చేయడంతో.. దానికి ప్రతి సమాధానం ఇచ్చి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నేను మహారాష్ట్ర మంత్రిగా ఉన్నా. ఔరంగాబాద్‌లో ఆరెస్సెస్ చీఫ్, దివంగత కేబీ హెగ్డేవార్ పేరు మీద ఓ ఆస్పత్రిని ప్రారంభించాం. దాని ప్రారంభోత్సవానికి రతన్ టాటాను ఆహ్వానించాం. సంతోషంగా ఆయన వచ్చారు. అయితే కార్యక్రమం మొదలయ్యే టైంలో.. ఈ ఆస్పత్రి కేవలం హిందూ కమ్యూనిటీ కోసమేనా? అని అడిగారు, ఎందుకలా అడిగారు? అని నేను అన్నాను. దానికి ఆయన.. ఇది ఆరెస్సెస్ వాళ్లకు చెందింది కదా అన్నారు. అప్పుడు నేను ఇది అన్నీ కమ్యూనిటీలకు చెందిన ఆస్పత్రి అని, ఆరెస్సెస్‌కు అలాంటి వివక్ష ఏం ఉండదని చెప్పారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఈ విషయమై చాలాసేపు సంభాషణ జరిగింది. చివరికి నా వివరణతో ఆయన సంతోషించారు అని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. ఆరెస్సెస్ ఇప్పటికీ అలాంటి వివక్షకు దూరంగానే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం పుణేలో అప్లా ఘర్ సేవా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో గడ్కరీ పై ఘటనను గుర్తు చేసుకున్నారు. అలాగే దేశం ఆదివాసీల దీనస్థితిపైనా సంఘీభావం వ్యక్తం చేసిన ఆయన.. ఆరోగ్య, విద్యా రంగాల్లో వాళ్లకు అందుతున్న వసతుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు గడ్కరీ. -
వివక్ష కాదు వైద్యం కావాలి
భారతదేశంలో ప్రతి పదిమంది స్త్రీలలో ఒకరు క్షయ వ్యాధి బారిన పడుతున్నారని అంచనా. పురుషుడికి ఆ వ్యాధి వస్తే వైద్యం దొరుకుతుంది. కాని స్త్రీకి వస్తే దానిని గుర్తించడంలో ఆలస్యం. వైద్యంలో నిర్లక్ష్యం. వ్యాధి వచ్చిందని తెలిస్తే వివక్ష. దానిని సాకుగా తీసుకుని వదిలిపెట్టే భర్తలు, గదిలో పెట్టే కుటుంబాలు ఉన్నాయి. స్త్రీ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం. ఆమె దగ్గుతూ వుంటే అది పోపు వల్ల వచ్చిన దగ్గు అనుకోకండి. వెంటనే వైద్యం చేయించండి. ఇది జరిగింది. పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. మరో పదిరోజుల్లో పెళ్లి అనగా ఆ అమ్మాయికి టీబీ బయటపడింది. డాక్టర్లు వెంటనే వైద్యం మొదలెట్టాలని, ఆరునెలలు తప్పనిసరిగా నాగా పడకుండా మందులు వాడాలని చెప్పారు. దాంతో ఆ అమ్మాయికి, ఆమె కుటుంబానికి గుండెల్లో రాయి పడింది. ఎందుకంటే ఆమెకు టి.బి. అని తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది. ఒకవేళ పెళ్లయినా ఆ మందులు అందరి ముందు వాడితే జబ్బు సంగతి బయటపడుతుంది. పెళ్లి ఆగడానికి లేదు. అలాగని ముందుకు వెళ్లడానికీ లేదు. డాక్టర్లు చెప్పింది ఏమిటంటే– మందులు సక్రమంగా వాడితే హాయిగా మునుపటి జీవితం గడపవచ్చు అని. అమ్మాయి ధైర్యం చేసింది. పెళ్లి చేసుకుంది. కాని ఆరు నెలల పాటు ఏదో వ్రతం చేసినట్టుగా ఎంతో జాగ్రత్తగా అత్తమామల దృష్టి భర్త దృష్టి పడకుండా మందులు వాడింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యవంతురాలైంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఇదే పని అత్తమామల ఆదరంతో కూడా చేయవచ్చు. అలాంటి ఆదరం మగవాడికి దొరికినట్టుగా స్త్రీకి దొరకదు. అదే ఈ జబ్బులో ఉన్న అనాది వివక్ష. 2020లో మన దేశంలో పదిహేను లక్షల మంది టీబీతో మరణించారు. వీరిలో 5 శాతం మంది స్త్రీలు. వీరంతా 30 నుంచి 69 మధ్య వయసు ఉన్నవారు. అంతే దాదాపుగా గృహిణులు, తల్లులు, అమ్మమ్మలు, అవ్వలు. వీరు ఈ మరణాలకు ఎలా చేరుకుని ఉంటారు. తెలియనితనం వల్ల, కుటుంబ నిర్లక్ష్యం వల్ల, ఒకవేళ జబ్బు సంగతి తెలిస్తే సక్రమంగా మందులు తెచ్చివ్వకపోవడం వల్ల, కసురుకుంటూ చిన్నబుచ్చుతూ వారిని మానసికంగా కుంగదీయడం వల్ల, అందరికీ దూరం చేయడం వల్ల... ఇలా అన్నీ ముప్పిరిగొని ప్రాణాలు పోయే స్థితికి వచ్చి ఉంటారు. టీబీ పై స్త్రీ విజయం సాధించాలంటే 2021 డిసెంబర్లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ‘విమెన్ విన్నింగ్ ఎగనెస్ట్ టీబీ’ అనే పేరుతో ఒక పార్లమెంటరీ సమావేశం నిర్వహించింది. స్త్రీలు టీబీపై విజయం సాధించడానికి కలుగుతున్న ఆటంకాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో స్త్రీ స్థానం ఆమెకు తన జబ్బు మీద పోరాడటానికి తగినంత శక్తి, సమయం ఇవ్వడం లేదన్న అభిప్రాయం వెల్లడైంది. స్త్రీలు టిబిపై విజయం సాధించాలంటే ముందు ప్రజా ప్రతినిధులు, పాలనా వ్యవస్థ ఎడతెగని ప్రచార, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఒకసారి టీబీ బయటపడ్డాక అలాంటి మహిళా పేషెంట్లు ఉన్న ఇళ్లను గుర్తించి వారికి వైద్య సహాయం మాత్రమే కాదు మానసిక నిబ్బరం కలిగించే కౌన్సిలింగ్ వ్యవస్థ బలపడాలి. ఈ వ్యవస్థ ఆ మహిళలకే కాదు కుటుంబానికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. మరొకటి– పౌష్టికాహారం. రెగ్యులర్‌గా మందులు వాడుతూ, విశ్రాంతి తీసుకుంటూ, తగిన పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే టీబీ సులభంగా నయం అయిపోతుంది. కాని భారతీయ కుటుంబాలలో ఇంటి చాకిరీ అంతా స్త్రీలే చేయాలి. విశ్రాంతి అనేది దొరకదు. ఇక అందరూ తిన్నాక ఆమె తినాలి. మరీ విషాదం ఏమిటంటే స్త్రీకి ప్రత్యేకంగా పౌష్టికాహారం ఇవ్వడం ఆమెను గొప్ప చేయడంగా కూడా భావిస్తారు. కాని ఇవన్నీ తప్పు. ఇలాంటి అవివేక ఆలోచనల వల్లే స్త్రీలు టీబీ కోరల నుంచి సులభంగా బయటకు రాలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘నిక్షయ్ పోషణ్ యోజన’ కింద టీబీ సోకిన పేషెంట్స్‌కు పౌష్టికాహారం కోసం నెలకు 500 ఇస్తుందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. సమాజం బాధ్యత కొన్ని కుటుంబాలు కలిసి ఒక సమాజాన్ని ఏర్పరుస్తాయి. టీబీని సాకుగా చేసుకుని స్త్రీలను ఇబ్బంది పెట్టడాన్ని సమాజం అంగీకరించరాదు. కుటుంబంకాని, సమాజం కాని వెలి, వివక్షను పాటించక టీబీ ఉన్న స్త్రీల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఇది సులభంగా తగ్గిపోయే జబ్బు అన్న అవగాహన కలిగించి పేషెంట్స్‌కు ధైర్యం చెప్పాలి. వారు మందులు తీసుకునేలా చూడాలి. అలాంటి స్త్రీలను ఇదే సాకుగా వదిలించుకోవాలని చూసే మగాళ్లకు బుద్ధి చెప్పాలి. దగ్గు మొదలైనా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లని, చూపించుకోవడానికి డబ్బులివ్వని మగవారిని మందలించాలి. ఆర్థికంగా ఆధారపడే స్త్రీకి తండ్రి, భర్త, కుమారుడి నుంచి సరైన వైద్యం ఇప్పించడానికి ఇరుగు పొరుగు చొరవ చూపాలి. స్త్రీల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సందర్భంగా ప్రతి కుటుంబం అక్కర చూపుతుందని ఆశిద్దాం. -
వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాలనా విధానాల్లో స్పష్టంగా వివక్ష, వివాదకర అంశాలు ఉన్న సందర్భాల్లోనే కోర్టులు కలగజేసుకోవాలని, విధానాలు సవ్యంగా ఉన్నపుడు జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. బోనస్ మార్కుల విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎన్హెచ్ఎం, ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం విచారించింది. ‘ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ పూర్తిచేసుకుని రాజస్తాన్ గ్రామీణ, ఎడారి ప్రాంతాల్లో పనిచేసిన ఆ సిబ్బందికి అదనపు పరిజ్ఞానం, అనుభవం ఉంటుంది. అందుకే వారికి అదనంగా బోనస్ మార్కులు ఇవ్వడం సబబే. ఇలాంటి పరిపాలనా విధానాల్లో కలగజేసుకోవడంలో కోర్టులు తొందరపాటు పనికిరాదు. వివాదాలు ఉంటేనే న్యాయం అందించేందుకు నెమ్మదిగా జోక్యం చేసుకోవాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనవసర వ్యాఖ్యలొద్దు న్యూఢిల్లీ: ఏదైనా కేసుపై విచారణ జరిపేటప్పుడు దానితో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయద్దని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టులు పరిధులను అతిక్రమించరాదని, వాద, ప్రతివాదుల మధ్య వివాదాలకు తలెత్తేలా వ్యవహరించరాదని, అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ టెండర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ ఫ్రిట్జ్ వెర్నర్ లిమిటెడ్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు కనీసం రిట్ పిటిషన్ అర్హతను కూడా నిర్ణయించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. కేసుతో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికింది. -
కారుణ్యమూర్తి
అది దేశరాజధాని నగరం ఢిల్లీలో ఓ చిన్న కాలనీ. పేరు ఆనంద్ పర్బత్ కాలనీ. మొత్తం 52 కుటుంబాలు నివసిస్తాయి. సమాజం నుంచి అనధికార వెలివేతకు గురయిన కుటుంబాలే అవన్నీ. తమ ప్రమేయం లేకనే వివక్షను ఎదుర్కొంటున్న జీవితాలవి. ఒక్కో కుటుంబానిది ఒక్కో దీనగాధ. అందుకు అనిత జీవితమే ఓ ఉదాహరణ. పని ఎవరిస్తారు? అనిత సూర్యోదయానికి ముందే నిద్రలేస్తుంది. ఇంటి పనులు, వంట చేసి పెడుతుంది. ముగ్గురు పిల్లలను నిద్రలేపి తాను ఎనిమిదన్నరకంతా బయటపడుతుంది. రోజూ ఇదే ఆమె దినచర్య. ఆమె డ్యూటీకి వెళ్లినట్లు ఆ వెళ్లడం ఉద్యోగానికి కాదు, రోడ్డు సిగ్నళ్ల దగ్గర యాచన కోసం. దీనమైన ఆమె ముఖం చూసి ఒక రూపాయి ఇచ్చే వాళ్లు ముఖం చిట్లించి ‘పని చేసుకోవచ్చు కదా! ఒళ్లు వంచి పని చేయాలనుకుంటే స్వీపర్ ఉద్యోగం వంటిదేదో రాకపోతుందా’ అని చిరాకు పడుతుంటారు. ‘ఆ పని కూడా ఎవరూ ఇవ్వకపోవడం వల్లనే ఇలా’ అంటూ ఒంటి మీద మచ్చలను చూపిస్తుంది అనిత. ‘చెప్పండి... నాకు పని ఎవరిస్తారు?’ అని అడుగుతుంది దీనంగా. ‘సిగ్నళ్ల దగ్గర రోజంతా యాచిస్తే ఎంత వస్తుంది’ ఎవరో అడుగుతారు కొంత సానుభూతితో. ‘వంద రూపాయలు వచ్చిన రోజు నలుగురమూ కడుపు నిండా తింటాం’ అని ఆవేదనగా చెబుతుంది అనిత. ఆమె ఇంకా చాలా చెప్తోంది... పాదాలరిగిపోయాయి! ‘‘మా లాంటి వాళ్ల కోసం ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందట. కానీ మా పేర్లు రాసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులెవరూ రారు. మేమే పెన్షన్ కోసం అప్లయ్ చేయడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే అంటరాని వారిని చూసినట్లు చూస్తారు. అలా చూసినా సరే... చీదరతోనైనా త్వరగా పని చేసి పంపించేస్తారా అంటే అదీ ఉండదు. తిరిగి తిరిగి మా కాళ్లరిగిపోతాయి. అసలే అనారోగ్యంతో అరిగిపోయిన పాదాలు మావి. వయసు మీరిన వాళ్లకయితే వేళ్లు కూడా ఊడిపోయి ఉంటాయి. వేళ్లు ఊడిపోయిన చేతులతో దణ్ణం పెట్టి వేడుకున్నా సరే... కనికరించాలనే కరుణ ఉండదు. రోజులు లెక్కపెట్టుకుంటన్న మా బతుకులకు ఆసరాగా ఉంటోంది జయ దీదీ. మా బతుకుల్లో కొండంత అండగా ఉంది’’ అని చెబుతోంది అనిత. వేరే బెంచీ! ‘లెప్రసీ వ్యాధిగ్రస్థులను మాత్రమే కాదు, ఆ ఇంట్లో వాళ్లను కూడా సమాజం చూపులతోనే దూరం పెట్టేస్తుంది. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అందుకే లెప్రసీ బాధితుల కోసం పని చేయడానికి ముందుకు వచ్చా’నని చెప్పింది జయారెడ్డి. ‘‘నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మా అమ్మానాన్నలకు ఈ వ్యాధి సోకింది. గాయాలకు డ్రెస్సింగ్ చేసుకోవడం లో వాళ్లకు సహాయం చేసేదాన్ని. మా పేరెంట్స్ తరచూ హాస్పిటల్‌కు వెళ్లాల్సి రావడం గురించి మా టీచర్‌కు తెలిసిన తర్వాత ఆమె నన్ను క్లాసులో అందరితో కలిసి కూర్చోనివ్వలేదు. నాకు వేరే బెంచీ, ఆ బెంచీ మీద మరెవరూ కూర్చోరు. మా పేరెంట్స్‌ను తాకిన నా నుంచి బ్యాక్టీరియా క్యారీ అవుతుందని, నాతో ఆడుకుంటే, నాకు దగ్గరగా మసలితే మిగిలిన వాళ్లకూ సోకుతుందనే అపోహతోనే నన్ను వెలివేశారు. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవడంతో మా పేరెంట్స్ కోలుకున్నారు. లెప్రసీ వ్యాధిగ్రస్తుడికి మందులు అందిస్తున్న జయారెడ్డి కానీ ఆ తర్వాత మా నాన్న ఈ వ్యాధిగ్రస్థుల కోసం పని చేయడానికే తన జీవితాన్ని అంకితం చేశారు. వీళ్లకు పెన్షన్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డుల కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి సాధించేవారు. హాస్పిటల్లో మందులిచ్చే సమయం తెలుసుకుని పేషెంట్లను తీసుకుని వెళ్లడం, వాళ్లను ఓ చెట్టుకింద కూర్చోబెట్టి ఆయన క్యూలో నిలబడి మందులు తీసుకునేవారు. అలా ఓ పదేళ్లపాటు పని చేసిన తర్వాత ఆయన కాలం చేశారు. ఆయన పోయి ఇరవై ఏళ్లయింది. నాన్న వదిలిన పనిని నేను అందుకున్నాను. నేను ఈ కాలనీ వాసులతో చొరవగా మెలగడాన్ని గమనించిన ఓ ఎన్జీవో నన్ను గౌరవవేతనంతో వాలంటీర్‌గా చేర్చుకుంది. లెప్రసీని పారదోలడానికి ఓ తపస్సు జరుగుతోంది. కానీ అది ఇంకా పూర్తికాలేదు. సరైన వైద్యంతో మామూలు మనుషులైన వాళ్లకు స్వయం ఉపాధి కల్పిస్తే సమాజంలో గౌరవంగా జీవించగలుగుతారనేది నా ఆశ. ఆ రోజు ఎప్పుడు వస్తుందో...’’ అని అర్ధోక్తిలో ఆగిపోయిందామె. ఇది 21వ శతాబ్దం... లెప్రసీపై పోరాటం ఇంకా ముగిసిపోకపోవడం నిజంగా దురదృష్టకరం. -
నా జీవితకాలమంతా వర్ణ వివక్ష ఎదుర్కొన్నా.. అది కూడా మన దేశంలోనే...
I have been colour discriminated all my life: భారత క్రికెట్ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్, వ్యాఖ్యాత లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన జీవితకాలమంతా వర్ణ వివక్షకు గురైనట్లు ట్వీట్ చేశారు. ‘నా రంగుతో నేను వివక్షకు గురయ్యాను. విమర్శలూ ఎదుర్కొన్నాను. నా జీవితమంతా ఇలానే గడిచింది కాబట్టే నన్నేమీ అది బాధించలేదు. దురదృష్టవశాత్తూ ఇది మన దేశంలోనే జరిగింది’ అని ఆయన పోస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల శివరామకృష్ణన్ భారత్ తరఫున 1983 నుంచి 1987 మధ్య కాలంలో 9 టెస్టులు ఆడి 26 వికెట్లు, 16 వన్డేలు ఆడి 15 వికెట్లు తీశారు. చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం.. ఇక భారత జట్టుకు..! -
పొలం అమ్ముకొని సినిమా తీశా.. ఇండస్ట్రీలో వివక్ష బాధాకరం
సాక్షి, హన్మకొండ చౌరస్తా: ప్రసుత్త సమాజంలో కొందరు కులపిచ్చితో పరువు హత్యలకు పాల్పడుతుంటే.. సినిమా పరిశ్రమలోనూ కొత్త నటులపై వివక్ష కొనసాగుతోందని, ఈక్రమంలో పొలం అమ్ముకొని తీసిన సినిమా విడుదలకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడం బాధాకరమని యువ నటుడు, ‘‘ఊరికి ఉత్తరాన’’ హీరో వనపర్తి నరేందర్ అలియాస్ నరేన్ అన్నారు. డబ్బు, బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే ఫిలిం ఇండస్ట్రీలో స్థానం ఉంటుందనే భావన కలిగేలా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 19న విడుదలైన సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా సినిమా యూనిట్ వరంగల్‌కు వచ్చింది. ఈ సందర్భంగా సినీ హీరో నరేన్ ‘సాక్షి’తో పంచుకున్నారు. మాది వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం, రేబల్లె గ్రామానికి చెందిన వనపర్తి కొమురమ్మ, వెంకటయ్య దంపతుల కుమారుడు నరేన్. హనుమకొండలో డిగ్రీ పూర్తి చేశాక, ఎంసీఏ కోసం 2003లో హైదరాబాద్ వెళ్లి.. కృష్ణానగర్‌లో గది అద్దెకు తీసుకుని చదువుతూ అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడు. ఎలాగైనా సినిమా తీయాలన్న నా కోరికతో ఊరిలో ఉన్న మూడెకరాల పొలం, రెండు ప్లాట్లు అమ్ముకొని జబర్తస్త్ ఫణీ, ఉదయ్‌తో కలిసి నాన్న వెంకటయ్య గణేష్‌రెడ్డి బీవీఎం నిర్మాతలుగా ఊరికి ఉత్తరాన సినిమా రూపొందించాడు. మూడు దశాబ్దాల క్రితం ఓ గ్రామంలో జరిగిన ప్రేమ వివాహం యువకుడి హత్య తమ కథావస్తువుగా రూపొందించామని నరేన్ తెలిపారు. సినిమా షూటింగ్ ఎక్కువ శాతం వరంగల్‌లోని పర్వతగిరి మండలం వడ్లకొండ గడీ, ఖిలావరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో తీశామన్నాడు. సినిమా విడుదలకు ఒక్క డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదని తప్పనిసరి పరిస్థితుల్లో మరో రూ.60లక్షల తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 100 థియేటర్లలో స్వతహాగా ఈ నెల 19న విడుదల చేశాం. -
ఈ రంగాలపై మక్కువ చూపుతున్న మగువలు
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ, ఆపరేషన్స్ తదితర విభాగాల్లో మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని, కీలక విధులు నిర్వహించాలని మహిళలు భావిస్తున్నారు. అదే సమయంలో మహిళా సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల ఆయా రంగాలు గణనీయంగా ప్రయోజనం పొందగలవని పురుషులు కూడా అభిప్రాయపడుతుండటం గమనార్హం. జీఈ, అవతార్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో జీఈ కోసం అవతార్ ఈ సర్వే నిర్వహించింది. 500 మంది ప్రొఫెషనల్స్ (మహిళలు, పురుషులు) ఇంజినీరింగ్ విద్యార్థినులు, ఆపరేషన్స్.. తయారీ.. ఇంజినీరింగ్ సర్వీసుల సంస్థల్లో బిజినెస్, మానవ వనరుల విభాగాల అధిపతులు ఇందులో పాల్గొన్నారు. పురోగతికి సామర్థ్యాలపై అపోహలే అడ్డంకి.. సర్వే ప్రకారం ఇంజినీరింగ్ సర్వీసులు, ఆపరేషన్స్, తయారీ వంటి రంగాల్లో ప్రస్తుతం 12 శాతం మందే మహిళలు ఉన్నారు. సామర్థ్యాలపై గల అపోహలే ఈ రంగాల్లో తమ కెరియర్ పురోగతికి అవరోధాలుగా ఉంటున్నాయని 63 శాతం మంది మహిళలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సామర్థ్యాల మదింపు ప్రక్రియలో పక్షపాత ధోరణులు కూడా కారణమని మరికొందరు పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ నియంత్రణలే ఆయా విభాగాల్లో మహిళల వృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయని 54 శాతం మంది పురుషులు, సూపర్వైజర్ల నుంచి మద్దతు లేకపోవడం కారణమని 51 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. లింగవివక్ష వివిధ విభాగాల్లో లింగ వివక్షకు తావులేకుండా పరిస్థితి మెరుగుపర్చాల్సిన అవసరాన్ని ఈ సర్వే తెలియజేస్తోందని జీఈ దక్షిణాసియా ఐఅండ్‌డీ కౌన్సిల్ లీడర్ శుక్ల చంద్రా తెలిపారు. అటు, పెద్ద సంస్థలు ఈ దిశగా చర్యలు తీసుకుంటే మరింత మంది మహిళలు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి విభాగాలను ఎంచుకునేందుకు, తయారీ.. ఇంజినీరింగ్ రంగాల్లో కెరియర్ ఏర్పర్చుకునేందుకు ప్రోత్సాహం లభించగలదని అవతార్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ సౌందర్య రాజేశ్ తెలిపారు. చదవండి:అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!! -
ఆర్థిక వివక్ష విసురుతున్న సవాలు
సమాజం తాను ఏ రకంగా రూపుదిద్దుకోదలిచిందో నిర్ణయించుకొని, అందుకు తగిన లక్ష్యాలను విద్యా రంగానికి నిర్దేశిస్తుంది. విద్యా లక్ష్యాలను సమాజం నిర్దేశిస్తే, సమాజ నిర్మాణాన్ని విద్య ప్రభావితం చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన విద్య కాలక్రమేణా లింగ, కుల, మత, వర్ణ వివక్షత చవి చూసింది. కొన్ని వర్గాలకే పరిమితమైన వేద కాలం నాటి నుంచి నేటి అందరికీ విద్య వరకు సమాజాన్ని మాత్రమే కాకుండా తనను తానూ సంస్కరించుకుంటూ వచ్చింది. సామాజిక వివక్షలెన్నింటినో అధిగమించి సామాజిక వికాసానికి దోహదపడిన విద్య ఇప్పుడు ఆర్థిక వివక్ష (పెట్టుబడి) విసురుతున్న సవాలును స్వీకరించే మలుపు వద్ద నిలిచి, వేచి ఉంది. అనాదిగా సమాజం విద్యను, విద్య నేర్పే గురువును అత్యున్నత స్థానంలో నిలుపుతూ వచ్చింది. కానీ, నేడు సమాజానికి, ప్రభుత్వ విద్యకు మధ్య ఘర్షణను నెలకొల్పడం జరుగుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో ఎందుకు చదివించరని, ఆదాయం సమకూరే ఇతర పనులు ఎందుకు చేస్తున్నట్లనే ప్రశ్నలు అందులో భాగమే. సమాజం మొత్తం డబ్బు చుట్టూ, విలాసవంతమైన జీవితం కోసం పరిగెడుతూ తనను మాత్రం అందుకు అతీతంగా జీవిం చాలంటే ఎలా సాధ్యమని ఉపాధ్యాయుడి వాదన. సమాజానికి, ఉపాధ్యాయుడికి మధ్య జరుగుతున్న ఈ సంభాషణను రెండు వర్గాలకు చెందకుండా, మూడో పక్షంగా బయట నుంచి చూసినప్పుడు మాత్రమే నిజానిజాలను విశ్లేషించడం సాధ్యం. ప్రభుత్వవిద్య పరిరక్షణ సమాజానికి సంబంధం లేనిదిగా మారితే, ఉపాధ్యాయునికి అప్రధానమైనదిగా మారింది. విద్య పరాయీకరణ (ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ)ను ఈ రెండు విషయాలే సులభతరం చేస్తున్నాయి. వీట న్నింటినీ బట్టి పెట్టుబడి ఎంతటి బలమైన బంధాలు, అనుబంధాల మధ్యనైనా ఘర్షణ సృష్టించగలదని స్పష్టమవుతోంది. అది నేర్పుతున్న భావజాలం విద్యను, సమాజాన్ని కూడా మింగే శక్తిమంతమైనదని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్పష్టతను అర్థం చేసుకోగలిగే వివేచన, అవకాశం, అవసరం ఉపాధ్యాయులకే ఎక్కువగా ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితం అందరికీ విద్య అనే జనామోదిత నినాదంతో జిల్లా ప్రాథమిక విద్యా పథకం (డీపీఈఎఫ్) పేరుతో విద్యా రంగంలోకి ప్రపంచ బ్యాంకు ప్రవేశించింది. దాని ద్వారా అమెరికా, బ్రిటన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుండి విదేశీ పెట్టుబడి ప్రవాహం మొదలైంది. సేవ, సాయం పేరుతో ఎల్లలు దాటిన ద్రవ్యం వామన పాదంలా మారి సంప్రదాయ, ప్రభుత్వ విద్యా వ్యవస్థలన్నిటినీ అణగదొక్కిన స్థితి కళ్ళ ముందు ఉంది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ ఆవాస ప్రాంతంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ ఉపాధ్యాయ పోస్టులనే నేడు హేతుబద్ధీకరణ పేరుతో మిగులుగా ముద్ర వేస్తున్నారు. నాడు ఏర్పాటైన ఏక గదితో కూడిన ఏకోపాధ్యాయ పాఠశాలలే నేడు మూసివేతకు గురవుతున్నాయి. ఇవే ప్రభుత్వ విద్యా వ్యవస్థ అప్రతిష్ఠ మూటగట్టుకోవడానికి మూల కారణం. ఇవే పదిహేనేళ్ల తర్వాత అంటే సుమారు 2010 నుండి ఊపందుకున్న విద్యా వ్యాపారానికి, బోధనా దుకాణాలకు పెట్టుబడి వ్యూహకర్తలు వేసిన పునాదిరాళ్లు. ఒక్క ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాల కంటే పక్కనే 10 మంది ఉపాధ్యాయులున్న ప్రైవేట్ బడి వైపు తల్లిదండ్రుల దృష్టి మరల్చింది. దానికి తోడు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్న ఆంగ్ల మాధ్యమం ఆకర్షణ మంత్రంగా మారింది. మాతృభాషలో విద్యా బోధనను ప్రైవేట్ వ్యవస్థలో అమలు చేయకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం కొనసాగించింది. ఇవన్నీ ప్రభుత్వ బడి, ఉపాధ్యాయుల మీద కావల్సినంత దుష్ప్రచారం చేయడానికి భూమికను అందించాయి. విద్య తనను తాను కాపాడుకోవడానికి సంఘటిత ఉపాధ్యాయ శక్తి కోసం ఎదురుచూస్తుందనేది కళ్ళ ముందున్న వాస్తవం. సంఘటితంగా ఉద్యమించి, విద్యా వినాశకర వ్యూహాలను చిత్తు చేయకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని, చరిత్ర దోషులుగా నిలబెడుతుందనేది కూడా స్పష్టం. దోషులుగా కాకుండా పెట్టుబడి చెరలో చిక్కిన విద్యను విడుదల గావించిన మహోద్యమకారులుగా నిలిచిపోగల అరుదైన అవకాశం ఈ తరానికి ఉంది. బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ, పెట్టుబడి అనర్థాల పట్ల ప్రజలను చైతన్యం చేస్తూ, ఆ ప్రజలను పోరాటాలలో భాగస్వామ్యం చేయాల్సి ఉంది. అంటే మండల, జిల్లా, రాజధాని కేంద్రాలతో పాటు ప్రతీ గ్రామాన్ని ఒక విద్యా ఉద్యమ క్షేత్రంగా మార్చాలి. అప్పుడు మాత్రమే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. అది మాత్రమే చరిత్ర సృష్టించగలదు. ప్రభుత్వ విద్యను పరిరక్షించగలదు. - చుంచు శ్రీశైలం ఉపాధ్యాయులు -
International Day of Older Persons: అమ్మానాన్నలకు ఏం చేస్తున్నాం?
చెట్లు ఎదిగి నీడనిస్తాయి. ఎదిగి ఎదిగి ఫలాలూ పూలు ఎరగని స్థితికి వస్తాయి. అప్పుడు ఏం జరగాలి? అవి ఇచ్చిన విత్తనాలు నీడ అవ్వాలి. అవి ఇచ్చిన నీడ నీడ అవ్వాలి. అవి ఇచ్చిన గాలి ప్రాణవాయువు కావాలి. అమ్మానాన్నలు పిల్లలకు చాలా ఇస్తారు. పిల్లలు? వారికి తోడునివ్వాలి. నీడనివ్వాలి. మాటనివ్వాలి. నవ్వునివ్వాలి. అంతకు మించి వేరే ఏం అక్కర్లేదు. అరిగిపోని కరిగిపోని ‘ప్రేమ’ను పంచడానికి కూడా ఎందుకు వారిని ముఖం వాచేలా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం’ సందర్భంగా ఒక థీమ్‌ను ప్రతిపాదిస్తుంది ఐక్యరాజ్య సమితి. 2021కి కూడా నిర్ణయించింది. అది ‘డిజిటల్ ఈక్విటి ఫర్ ఆల్ ఏజెస్’. అంటే డిజిటల్ మాధ్యమాలను, పరికరాలను ఉపయోగించే, పొందే హక్కు అందరికీ సమానమే అని అర్థం. మరోమాటలో చెప్పాలంటే వయోవృద్ధులకు డిజిటల్ పరికరాలు, మాధ్యమాలను ఉపయోగించే... వాటిని పొందే వీలు కల్పించమని సూచన. ఇంట్లో అందరికీ ఫోన్లు ఉంటాయి. అమ్మమ్మకు ఉండదు. ఇంట్లో అందరూ టీవీ చూస్తారు. కాని రిమోట్‌ను నానమ్మకు ఇవ్వరు. యూట్యూబ్‌లో, ఫేస్బుక్లో, ఓటిటిలలో ఎన్నో చూడదగ్గ విషయాలు ఉంటాయి. కాని అవి ఉన్నట్టు తాతయ్యకు అస్సలు తెలియదు. ‘నీకు అవన్నీ అర్థం కావులే తాతయ్య’ అని చెప్పేస్తాం. ఆ మాట చెప్పాల్సింది తాతయ్య కదా. ఇవి మాత్రమేనా? బిపి మిషిన్, గ్లూకోమీటర్, డిజిటల్ థర్మామీటర్ ఇవన్నీ పొందే హక్కు, ఉపయోగించే హక్కు ఇంటి వృద్ధులకు ఉంది. వారు తాము కోరిన చోటుకు వెళ్లి రావడానికి వీలుగా క్యాబ్స్ బుక్ చేసుకునే యాప్స్ వారి ఫోన్లో ఉండాలి. రైలు, ఫ్లైట్, బస్ టికెట్లు బుక్ చేసుకునే పరిజ్ఞానం వారికి తెలియచేయాలి. వారికి కావల్సిన వస్తువులు అమేజాన్ నుంచో మరో ఆన్లైన్ షాపింగ్ సైట్ నుంచో తెప్పించుకునే వీలు వారికి ఉండాలి. వీటిలో ఎన్ని ఇంట్లోని అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలకు ఏర్పాటు చేసి ఉన్నామో చెక్ చేసుకుంటే, ప్రతిదానికి వారు కొడుకూ కోడలి వైపో మనవల వైపో చూడాల్సి వచ్చేలా చేసి ఉంటే వారి పట్ల వివక్ష సాగించినట్టే అని చెబుతోంది ఐక్యరాజ్యసమితి ఈ థీమ్‌తో. ఎందుకు ఈరోజు? గమనించండి మీ ఇంటి పెద్దవారిని అని చెప్పడానికి 1991 నుంచి ‘అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం’ మొదలైంది. వారికి ఏం కావాలి.. వారు దేనికి బాధ పడుతున్నారు... వారికి ఆనందం కలిగించే విషయాలు ఏమిటి... వారి ఆరోగ్య సమస్యలు ఏమిటి... ఆర్థిక ఆందోళనలు ఏమిటి... ముచ్చట పడుతున్న కోరికలు ఏమిటి... ఇవన్నీ కనుక్కోవడానికి ప్రత్యేకం ఈ రోజన్నా పిల్లలు ప్రయత్నిస్తారని ఈరోజును ఏర్పాటు చేశారు. ప్రతి అక్టోబర్ 1న వృద్ధుల సంక్షేమాన్ని పట్టించుకోవడమే కాదు వారి పై ఏదైనా పీడన జరుగుతుంటే దానిని తొలగించాల్సిన, వారు వేదన అనుభవిస్తుంటే దానిని దూరం చేయాల్సిన బాధ్యతను కూడా ఈ రోజు గుర్తెరగాలి. అమ్మా నాన్నలకు ఏం చేస్తున్నాం? ‘నీకేం కావాలి’ అని తండ్రి, ‘పిల్లలకు ఇది కావాలట చూడండి’ అని తల్లి.. పిల్లల అవసరాల కోసమే జీవిస్తారు. పిల్లల సంతోషం కోసం వారు చేసే త్యాగాలు... పిల్లలు నిద్రపోయాక వారి భవిష్యత్తు కోసం చేసే మంతనాలు, ఆర్థిక సమస్యలు పిల్లల దృష్టికి రాకుండా పడే తపనలు... ఇవన్నీ గుర్తుండాలి సంతానానికి. ఇంతా వారు చేసేది ఎందుకు? పిల్లలు ఏదో నిధి తెచ్చిస్తారని కాదు. వారికి నిధి ఎందుకు? వయసు మీద పడ్డాక నిధిని ఏం చేసుకుంటారు. వారికి కావాల్సింది పిల్లల ప్రేమ నిధి. పిల్లల సమక్షంలో ఉండే నిధి. రోజూ వారిని కళ్లారా చూసుకునే నిధి. అది రకరకాల కారణాల వల్ల నేటి ఇంటి పెద్దలు పొందలేకపోతున్నారు. కొందరు బలవంతంగా పిల్లలకు దూరం చేయబడుతున్నారు. కొందరిని పిల్లలతో పాటు ఉండేందుకు అలమటించేలా చేస్తున్నారు. మన ఒడిలో పిల్లలు వచ్చిన వెంటనే మనల్ని ఒడిలో ఉంచి పెంచిన అమ్మానాన్నల పట్ల తెలియకనే అలక్ష్యం వచ్చేస్తోంది. ఇది వారికి బయటకు చెప్పని వేదన కలిగిస్తుందని ఎందుకు తెలుసుకోము. తెలుసుకున్నా తెలియనట్టు నటిస్తున్నాము. కనపడండి... చిన్న కోరికలు తీర్చండి చిన్నచిన్న కోరికలు ఉంటాయి తల్లిదండ్రులకు. ఫలానా ఊరు చూసి రావాలని, ఫలానా వస్తువు కొనుక్కోవాలని, ఫలానా కూర ఇష్టంగా వొండుకుని తినాలని, ఫలానా స్నేహితురాలిని కలవాలని... అంతెందుకు... ఉదయాన్నే లేచి వాకింగ్ చేయాలనుకునే తల్లికి కొత్త షూస్ తెచ్చిస్తే, పుట్టినరోజునాడు తండ్రికి మంచి ఫోన్ ప్రెజెంట్ చేస్తే, తల్లిదండ్రులఫొటోలన్నీ ఒక ఆల్బమ్‌గా చేసి ఇస్తే, పెరడులో వారికి ఇష్టమైన మొక్కను తెచ్చి నాటితే, మనవలతో హాయిగా గడిపేలా చేస్తే... అవన్నీ వారు గొప్పగా భావించే కానుకలే. ‘మీకేం కావాలో అడగొచ్చు కదా’ అనే పిల్లలు ఉంటారు కాని సహజంగా తల్లిదండ్రులు అడగరు. ఎందుకులే పిల్లల ఆరాటాల్లో వారు ఉంటారు అని. పిల్లలు పుడితే అమ్మానాన్నలను పిలుద్దాం అని నగరాల్లో, అమెరికాలో ఉన్న కొడుకులు, కూతుళ్లు అనుకోవడం ఆనవాయితీగాని పిల్లలు పుట్టేలోపు తల్లిదండ్రులను తీసుకొచ్చి అన్నీ తిప్పి చూపిద్దాం అనుకునేవారు ఎంతమంది? ఇప్పుడు తల్లిగాని తండ్రిగాని కోరుకుంటున్న కోరిక నెలలో ఒకసారైనా పిల్లలు కనిపిస్తే బాగుండు అనేది. ఒకే ఊళ్లో ఉన్నా ఒకే రాష్ట్రంలో ఉన్నా ఒకే దేశంలో ఉన్నా పిల్లలు ఒకచోట తల్లిదండ్రులు ఒకచోట బతకాల్సిన పరిస్థితిని మన ‘నాగరికత’ తెచ్చి పెట్టింది. కాని రెగ్యులర్‌గా వెళ్లి తల్లిదండ్రులను చూడవద్దు అని ఏ నాగరికతా చెప్పదు. ‘అమ్మకో నాన్నకో బాగలేదు’ అని ఫోన్ వస్తే తప్ప కదలని సంతానం మీరైతే ఇవాళ మీరు తప్పనిసరిగా మీ ఆత్మశోధన చేసుకోవాలి. తల్లిదండ్రుల సంతోషానికి నిజంగా ప్రయత్నిస్తున్నారా చెక్ చేసుకోవాలి. వారి కోసం కచ్చితంగా మీరు ఇవాళ సంకల్పం తీసుకోవాలి. తీసుకోండి ప్లీజ్. ‘నీకేం కావాలి’ అని తండ్రి, ‘పిల్లలకు ఇది కావాలట చూడండి’ అని తల్లి.. పిల్లల అవసరాల కోసమే జీవిస్తారు. పిల్లల సంతోషం కోసం వారు చేసే త్యాగాలు... పిల్లలు నిద్రపోయాక వారి భవిష్యత్తు కోసం చేసే మంతనాలు, ఆర్థిక సమస్యలు పిల్లల దృష్టికి రాకుండా పడే తపనలు... ఇవన్నీ గుర్తుండాలి సంతానానికి. చదవండి: సెల్ఫీ అడిక్షన్ పెరుగుతోందా.. ఈ ఏడు జాగ్రత్తలు అవసరం -
అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్లపై వివక్ష నిత్యకృత్యం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాకు వలస వచ్చిన వారిలో భారతీయ అమెరికన్లదే రెండోస్థానం. అయినప్పటికీ వారిపై వివక్ష, వేధింపులు కొనసాగుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. అమెరికాలో భారతీయ అమెరికన్లను వివక్షను ఎదుర్కోవడం నిత్యం సర్వసాధారణంగా మారిందని పేర్కొంది. ‘సోషల్ రియాలిటీస్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్’ పేరిట 2020లో కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్ హాప్కిన్స్–ఎస్ఏఐఎస్, యూనివర్సిటీ పెన్సిల్వేనియా సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే నివేదికను బుధవారం విడుదల చేశారు. సర్వేలో భాగంగా అమెరికాలో నివసించే 1,200 మంది భారతీయ అమెరికన్లను గత ఏడాది సెపె్టంబర్ 1 నుంచి 20వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా ప్రశ్నించారు. అమెరికా గడ్డపై తాము వివక్షను ఎదుర్కొంటున్నామని ప్రతి ఇద్దరిలో ఒకరు చెప్పారు. ప్రధానంగా తమ చర్మం రంగుకు సంబంధించి అవహేళనకు గురవుతున్నామని తెలిపారు. భారతదేశంలో పుట్టి అమెరికాకు వచి్చన వారు మాత్రమే కాకుండా అమెరికాలోనే పుట్టిన భారత సంతతి ప్రజలకు కూడా ఇదే రకమైన చేదు అనుభవాలు ఎదురవుతుండడం గమనార్హం. భారతీయ తండ్రి–అమెరికా తల్లికి, భారతీయ తల్లి–అమెరికా తండ్రికి పుట్టిన వారు సైతం కొన్ని సందర్భాల్లో శ్వేత జాతిæఅమెరికన్ల నుంచి వివక్షను చవిచూడాల్సి వస్తోంది. వదలని కుల జాడ్యం భారతీయ అమెరికన్ల జీవితాల్లో మతం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. నిత్యం ఒక్కసారైనా ప్రార్థన చేస్తామని 40% మంది చెప్పారు. వారంలో ఒక్కసారైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటామని 27% మంది తెలిపారు. భారతీయ అమెరికన్లను తమ కులం గుర్తింపును వదులుకోవడం లేదు. సగం మంది హిందూ ఇండియన్ అమెరికన్లు తమ కులాన్ని సూచించే ఆనవాళ్లను కొనసాగిస్తున్నారు. అమెరికాలో పుట్టిన వారి కంటే ఇండియాలో పుట్టిన భారతీయ అమెరికన్లలో ఈ ధోరణి ఎక్కువ. అక్కడి మొత్తం హిందువుల్లో ప్రతి 10 మందిలో 8 మంది తమ కులంపై మమకారం చాటుకుంటున్నారు. ఇండియన్ అమెరికన్ అని చెప్పుకోవడం కూడా చాలామంది గర్వకారణంగా భావి స్తున్నారు. మొత్తం అమెరికా జనాభాలో ఇండియన్ అమెరికన్లు 1 శాతం కంటే ఎక్కువే ఉన్నారు. రిజిస్టరైన ఓటర్లలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నారు. 2018 నాటి గణాంకాల ప్రకారం అమెరికాలో 42 లక్షల మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. -
వ్యాక్సిన్ పాస్‌పోర్టు సరైంది కాదు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడానికి వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని తీసుకురావాలనే కొన్ని దేశాలు ప్రతిపాదనల్ని జీ–7 సదస్సు వేదికగా భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది అత్యంత వివక్షాపూరిత చర్యగా అభివర్ణించింది. వ్యాక్సిన్ పాస్‌పోర్టు వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకు నష్టం వాటిల్లుతుందని సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–7 దేశాల సదస్సుకు ఈ ఏడాది భారత్‌ను అతిథిగా ఆహ్వానించారు. జీ–7 ఆరోగ్య మంత్రుల సమావేశంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన హర్షవర్ధన్ అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యాక్సిన్ కొరతని ఎదుర్కొంటున్నాయని చెప్పారు. భారత్‌లో కేవలం 3 శాతం మంది ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రతిపాదల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు టీకాల సరఫరా, పంపిణీ, రవాణా, సామర్థ్యం వంటి అంశాల్లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని అమల్లోకి తీసుకువస్తే అది వివక్ష చూపించడమే’’ అని ఆయన గట్టిగా చెప్పారు. కాగా ఈ సదస్సులో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలందరికీ టీకాలు ఇవ్వడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాలను మంత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వ్యాక్సిన్ పాస్‌పోర్టు అంటే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి వ్యాక్సిన్ పాస్‌పోర్టు విధానాన్ని అమలు చేయాలని అంతర్జాతీయంగా ప్రతిపాదనలు వస్తున్నాయి. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారు తాము వ్యాక్సిన్ తీసుకున్నామని ధ్రువపత్రం చూపించాలి. అయితే ఇది డిజిటల్ రూపంలో ఉంటుంది. ఇప్పటికే కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు తయారుచేసిన యాప్‌లలో ప్రజలు వ్యాక్సినేషన్ వివరాలను పొందుపరచాలి. విదేశీ ప్రయాణం సమయంలో ఆ దేశాలు ఈ యాప్‌ల ద్వారా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి వ్యాక్సిన్ తీసుకున్నారో లేదో తెలుసుకుంటాయి. కరోనాని కట్టడి చేయాలంటే ఈ విధానాన్ని అమలు చేయాలని అమెరికా, కొన్ని యూరప్ దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. అదే జరిగితే భవిష్యత్‌లో వ్యాక్సిన్ పాస్‌పోర్టు ఉంటేనే విదేశీ ప్రయాణాలు సాధ్యమవుతాయి. -
Covid Vaccination in India: వ్యాక్సిన్‌లోనూ వివక్ష..!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మనకు శ్రీరామరక్ష కాగా, ఆ వ్యాక్సిన్ అందించడంలోనూ మహిళల పట్ల వివక్షే కొనసాగుతోంది. దేశంలో మగవారితో పోల్చితే మహిళలు తక్కువగా వ్యాక్సిన్లు పొందుతున్నట్టుగా ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య అంతరం జాతీయస్థాయిలో చూస్తే 4% కాగా, కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి చోట్ల పురుష–స్త్రీ నిష్పత్తి అంతరం 10 శాతానికి పైగా ఉన్నట్టు వెల్లడవుతోంది. ఇక నాగాలాండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో మాత్రం ఈ తేడా 14% వరకు ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల నమోదు సంఖ్య తక్కువగానే ఉన్నా వ్యాక్సినేషన్ విషయంలో మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు ఆయా గణాంకాలను బట్టి ప్రస్ఫుటమైంది. నాగాలాండ్‌లో ఈ తేడా 14.6%, జమ్మూ,కశ్మీర్లో 13.76%, యూపీ, పంజాబ్, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో 10–13% మధ్యలో ఉండగా, చండీగడ్‌లో 11% ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే లింగబేధం లేకుండా వ్యాక్సిన్.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత పట్టిపీడిస్తుండడంతో కరోనా నుంచి రక్షణ పొందేందుకు టీకా వేయించుకునేందుకు వ్యాక్సిన్ స్లాట్లు బుక్ చేసుకునేందుకు ఇటీవలి కాలంలో ఎక్కడ లేని రద్దీ పెరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మగవారు–ఆడవారు అనే లింగవివక్ష మరింతగా తెరపైకి వచ్చింది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కొన్ని సందర్భాల్లో మగవారి కంటే ఎక్కువ లేదా వారిలో సమానంగా వ్యాక్సిన్లు వేసిన పరిస్థితి నెలకొంది. కేంద్రపభుత్వ ఆధ్వర్యంలోని ‘కోవిన్’ పోర్టల్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 17.78 కోట్ల మందికి (గురువారం నాటికి)వ్యాక్సిన్లు వేయగా వారిలో 7.3 కోట్ల మంది పురుషులు, 6.5 కోట్ల మంది మహిళలు, 19వేల మంది ఇతరులున్నారు. తాజా గణాంకాల ప్రకారం (శుక్రవారం నాటికి) చూస్తే... ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 75,70,522 మంది వ్యాక్సినేషన్ వేయగా వారిలో 54,74,395 మందికి మొదటి డోస్, 20,96,127 మందికి రెండో డోస్ వేశారు. వీరిలో పురుషులు, మహిళల సంఖ్య సమానంగా ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే మొత్తం 55,13,261కి వ్యాక్సిన్లు వేశారు. అందులో 44,49,899 మందికి మొదటి డోస్, 10,63,362 మందికి రెండో డోస్ వేయించుకున్నారు. వీరిలో స్త్రీ, పురుషుల సంఖ్య సమానంగానే ఉంది. చదవండి: Corona: పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవే.. Black Fungus: బ్లాక్ ఫంగస్‌పై ఆందోళన వద్దు -
ఆ హీరోయిన్స్‌తో పోలుస్తూ అవమానించేవారు: చాందిని
చాందిని చౌదరి.. ఒకప్పడు యూట్యూబ్ స్టార్‌గా రాణించిన ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్గా ఎదిగింది. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ తీసి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బ్రహ్మోత్సవం, లై వంటి చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఆమె హీరోయిన్గా నటించిన ‘కలర్ ఫొటో’ మూవీ గతేడాది విడుదలైన సంగతి తెలిసిందే. థియేటర్లో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైంది. అయినప్పటికి ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుని సక్సెస్ బాట పట్టింది. అంతేగాక ఇందులో తన నటనకు ప్రశంసలు కూడా అందుకుంది. అదే సమయంలో ఈ మూవీతో పాటు ఆమె తొలిసారి హీరోయిన్గా నటించిన ‘సూపర్ ఓవర్’ చిత్రంలో కూడా ఓటీటీలోనే విడుదలైంది. రెండు ఒకే సమయంలో వచ్చినప్పటికి చాందినికి కలర్ ఫొటో మూవీయే మంచి విజయాన్ని అందించింది. అంతేగాక హీరోయిన్గా కూడా ఈ మూవీ గుర్తింపును ఇచ్చింది. అంతటి సక్సెస్‌ను అందుకున్న ఈ భామ పలు ఛానల్స్‌కు ఇంటర్య్వూలు ఇస్తూ గతేడాదిఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాందిని మాట్లాడుతూ.. ‘ఇక్కడ తెలుగు హీరోయిన్స్, బయటి హీరోయిన్స్ కంటే రెట్టింపు కష్టపడాలి. అయినా వారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం లేదు. నేను కనీసం కొన్ని సినిమాల్లోనైన నటించగలిగాను, నా కంటే ముందుగా పరిశ్రమకు వచ్చి ఇంకా అవకాశాలు దొరకని వారున్నారు. ఎన్నో ఏళ్లుగా తెలుగమ్మాయిలు అవకాశాల కోసం ఎదురుచుస్తూనే ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. కేరీర్ ప్రారంభంలో ఏమైనా వివక్షకు గురయ్యారా అని అడగ్గా.. ‘ప్రస్తుతానికైతే నాకు నటిగా, హీరోయిన్గా అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఇలాంటి వాటి గురించి నేను అంతగా మాట్లాడలేకపోవచ్చు. ఇంకా అవకాశాలు లేక వివక్షకు గురవుతున్నవారు మీ ప్రశ్నకు సరైనా సమాధానం ఇవ్వగలరనుకుంటున్నా’ అంటూ వివరించింది. అయితే హీరోయిన్ అయ్యాక మాత్రం కొన్ని అవమానాలు ఎదుర్కొన్నానని, బయట హీరోయిన్స్‌తో పోలుస్తూ తనని ‘నువ్వు ఏమంత కలర్ లేవు’ అంటూ విమర్శించేవారని వెల్లడించింది. అంతేగాక ఇప్పటికి సమాజంలో వర్ణ వివక్ష ఉండడం చూసి ఆశ్చర్యం వేసిందని ఆమె పేర్కొంది. -
బాలికలు ఎక్కువగా సర్కారు బడులకే!
హైదరాబాద్: రాష్ట్రంలో చదువుకుంటున్న బాలికల్లో ఎక్కువ శాతం మంది ప్రభుత్వ పాఠశాలలకే వెళుతున్నారు. ముఖ్యంగా 11–16 ఏళ్ల మధ్య వయసున్న వారిలో మూడింట రెండొంతుల మంది ప్రభుత్వ బడుల్లోనే చదువుతున్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు మగ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో 75% మంది బాలురు ఉండగా.. కేవలం 25% వరకే బాలికలు ఉంటున్నారు. అయితే ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే బాలికల్లో 46 శాతం మందిని ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సోషియో ఎకనామిక్ ఔట్‌లుక్‌లోనే ఈ వివరాలన్నీ స్పష్టమయ్యాయి. భద్రత, ఆర్థిక పరిస్థితులతోనూ.. బాలికల విద్య విషయంగా ఇంకా వివక్ష కొనసాగుతున్న పరిస్థితి ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొడుకును చదివిస్తే తమను చూసుకుంటాడని, కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందన్న తల్లిదండ్రుల ఆలోచనా ధోరణితోపాటు భద్రత, ఆర్థిక ఇబ్బందులు వంటివి దీనికి కారణమని చెబుతున్నారు. బాలికలను దూరంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లకు పంపడం భద్రం కాదన్న ఆలోచనలు ఇంకా ఉన్నాయని అంటున్నారు. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరో ఒకరిని మాత్రమే బాగా చదివించే పరిస్థితి ఉన్నవారు.. కొడుకును మాత్రం ప్రైవేటు స్కూళ్లకు పంపి, బాలికలను ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. నివేదికలోని కొన్ని ప్రధాన అంశాలివీ.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కలిపి 60,06,344 మంది విద్యార్థులు చదువుతుండగా.. అందులో బాలురు 30,82,741 మంది, బాలికలు 29,23,603 మంది ఉన్నారు. మొత్తం విద్యార్థుల్లో ప్రభుత్వ స్కూళ్లలో 27,71,536 మంది (46.1 శాతం) చదువుతుండగా... 32,24,173 మంది (53.7 శాతం) ప్రైవేటు స్కూళ్లలో.. మదర్సాలు, ఇతర పాఠశాల్లో 10,635 మంది (0.2 శాతం) చదువుతున్నారు. తల్లిదండ్రులు 7 నుంచి 10 ఏళ్లలోపు బాలికలలో.. 50.5 శాతం మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తుంటే.. 46.4 శాతం మందినే ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. 0.7 శాతం మందిని ఇతర పాఠశాలల్లో చదివిస్తుండగా.. 2.4 శాతం మంది బడి బయట ఉన్నారు. బాలురలో 45.8 శాతం మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తుంటే.. 49.8 శాతం మందిని ప్రైవేటు స్కూళ్లలో.. 0.2శాతం మందిని ఇతర పాఠశాలల్లో చదివిస్తున్నారు. 4.2 % బాలురు బడి బయటే ఉన్నారు. 11 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసున్న బాలికల్లో.. 67 శాతం మందిని ప్రభుత్వ స్కూళ్లలో, 25 శాతం మందిని ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. మరో 1.6 శాతం మంది బాలికలను ఇతర పాఠశాలల్లో చదివిస్తుండగా.. 6.5 శాతం మంది బడి బయటే ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో బాలికలంటే 10 శాతం ఎక్కువ మంది బాలురను చదివిస్తున్నారు. విద్యా బోధనను అందిస్తున్న ప్రభుత్వ టీచర్లలో 24,285 మంది (17.2 శాతం) పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తుండగా.. 1,16,796 మంది (82.8 శాతం) గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు. మొత్తం టీచర్లలో 78,817 మంది (55.9 శాతం) పురుషులు ఉండగా.. 62,264 మంది (44.1శాతం) మహిళా టీచర్లు ఉన్నారు. వివక్ష తగ్గడం లేదు బాలికలకు చదువుపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. దీనికి తల్లిదండ్రుల ఆలోచనా ధోరణితోపాటు పలు కారణాలు కూడా ఉన్నాయి. దూరంగా ఉన్న ప్రైవేటు స్కూళ్లకు పంపడం ఒక సమస్య అయితే.. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి మరో ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో బాలికల చదువుపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బాలికలకు నాణ్యమైన విద్య అందేలా.. ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చెయ్యాలి. నాగటి నారాయణ, తల్లిదండ్రుల సంఘంఅధ్యక్షుడు -
లింగ వివక్ష చూపే ఆర్టీసీ సర్క్యులర్ రద్దు
సాక్షి, అమరావతి: రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులేనని, కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయ బేధాలు చూపడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మహిళల పట్ల వివక్ష చూపేలా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నందున.. ఆర్టీసీ ఎండీ 2003లో జారీచేసిన సర్క్యులర్‌ను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. కారుణ్య నియామకం కోసం మహిళ చేసుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని శ్రామిక్ లేదా ఆమెకు తగిన పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మపాళేనికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ నేనావత్ శ్రీనివాస్ 2007 ఫిబ్రవరి 16న మరణించారు. కారుణ్య నియామకం కింద తనకు కండక్టర్, అటెండర్, శ్రామిక్ లేదా ఇతర ఏదైనా పోస్టు ఇవ్వాలంటూ 2007 ఆగస్టులో శ్రీనివాస్ భార్య లక్ష్మి ఆర్టీసీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. 2003లో ఆర్టీసీ ఎండీ ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం మహిళలు శ్రామిక్ పోస్టుకు అర్హులు కాదని అధికారులు తెలిపారు. మూడు సెంటీమీటర్ల ఎత్తుకు సంబంధించి మినహాయింపు ఇచ్చేందుకు అధికారులు తిరస్కరించడంతో ఆమెను కండక్టర్ పోస్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే సమయంలో కొందరికి క్లీనర్లుగా పోస్టులు ఇచ్చారు. దీనిపై లక్ష్మి 2013లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల తుది విచారణ జరిపి తీర్పు చెప్పారు. ఓ ఉద్యోగి మృతి చెందితే అతడి కుటుంబసభ్యులు కారుణ్య నియామకం కోసం పెట్టుకునే దరఖాస్తులను మొదట్లో గ్రేడ్ 2 డ్రైవర్, గ్రేడ్ 2 కండక్టర్, క్లీనర్ (శ్రామిక్) పోస్టులకు పరిగణనలోకి తీసుకునే వారని న్యాయమూర్తి తెలిపారు. శ్రామిక్, మెకానిక్, చార్జ్‌మెన్ పోస్టులను పురుషులకే పరిమితం చేస్తూ 2003 మే 26న ఆర్టీసీ ఎండీ ఇచ్చిన సర్క్యులర్ మహిళల పట్ల వివక్ష చూపడమేనని, అందువల్ల దాన్ని రద్దుచేస్తున్నామని చెప్పారు. కారుణ్య నియామకం కోసం లక్ష్మి పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని, శ్రామిక్ లేదా ఆమెకు తగిన పోస్టు ఇచ్చే విషయంలో ఆరు వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. -
రుణాల మంజూరులో తెలంగాణపై వివక్ష
సాక్షి, హైదరాబాద్: చిరు వ్యాపారులకు ఆర్థిక ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ప్రవేశపెట్టిన రుణాల మంజూరు ప్రక్రియ రాష్ట్రంలో మందకొడిగా సాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఈ రుణాలివ్వాలని నిర్ణయించగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రానికి ముద్ర రుణ యూనిట్ల మంజూరు తక్కువగానే కనిపిస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలకు మంజూరు చేసిన యూనిట్లతో పోలిస్తే రాష్ట్రానికి ముద్ర రుణాల విషయంలో కేంద్రం వివక్ష కనపరుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో కేవలం 40 లక్షల మందికే ఈ రుణాలు అందాయి. తెలంగాణకు చాలా తక్కువ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు చాలా తక్కువ ముద్ర రుణాలు మంజూరు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర జనాభా 3.85 కోట్లకుపైగా ఉండగా ఇప్పటివరకు కేవలం 40.90 లక్షల యూనిట్లే మంజూరు చేశారు. మనకంటే కేవలం 80 లక్షల జనాభా ఎక్కువగా ఉన్న ఒడిశాలో ఏకంగా 1.60 కోట్లకుపైగా ముద్ర రుణాలు వచ్చాయి. కర్ణాటకలో 2.45 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 2.19 కోట్లు, మహారాష్ట్రలో 1.93 కోట్లు, మధ్యప్రదేశ్‌లో 1.49 కోట్లు, రాజస్తాన్‌లో 98 లక్షలు, మన జనాభాతో సమానంగా ఉన్న జార్ఖండ్‌లో 62 లక్షల యూనిట్లు మంజూరు చేశారు. దేశవ్యాప్త గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 24 కోట్లకుపైగా యూనిట్ల ముద్ర రుణాలను డిసెంబర్ 31 వరకు మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో రాష్ట్రానికి కేవలం 40లక్షల యూనిట్లే మంజూరవగా మరో 28 లక్షల మంది చిరువ్యాపారులు ఈ రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దేశ సగటు 17.86 ఉండగా, తెలంగాణలో మాత్రం ప్రతి 100 మందిలో కేవలం 10.62 శాతం మందికి మాత్రమే ఈ రుణాలందాయి. కాగా, మన రాష్ట్రంలో ముద్ర రుణాల కోసం బ్యాంకులకు వెళుతున్న చిరు వ్యాపారులు నిరాశతో వెనుదిరిగాల్సి వస్తోందని ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. తమకు ఇచ్చిన లక్ష్యం అయిపోయిందని, అంతకు మించి తాము మంజూరు చేయలేమని బ్యాంకర్లు చెపుతున్నారని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని చిరువ్యాపారులను ఆదుకునేందుకు వీలున్నన్ని ముద్ర రుణాలు మంజూరు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ముద్ర రుణాలు ఎక్కువగా మంజూరయిన రాష్ట్రాలివే రాష్ట్రం జనాభా మంజూరైన రుణ యూనిట్లు అస్సాం 3,56,07,039 74,87,345 కర్ణాటక 6,75,62,686 2,45,02,287 కేరళ 3,56,99,443 84,01,668 ఒడిశా 4,63,56,334 1,63,01,350 పుదుచ్చేరి 14,13,542 6,80,997 తమిళనాడు 7,78,41,267 3,05,13,243 త్రిపుర 41,69,794 15,59,460 పశ్చిమ బెంగాల్ 9,96,09,303 2,41,95,057 (నోట్: ఈ వార్తకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్రానికి రాసిన లేఖ బిట్‌ను యాడ్ చేసుకోగలరు.) ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో.. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముద్ర రుణాలు ఎక్కువగా మంజూరైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ జనాభా దాదాపు 10 కోట్లు కాగా అందులో 2.41 కోట్ల యూనిట్ల ముద్ర రుణాలిచ్చారు. అలాగే లెఫ్ట్ ఫ్రంట్ పాలనలోని కేరళలో కూడా 3.5 కోట్ల జనాభాకు 84 లక్షలకుపైగా యూనిట్లు మంజూరయ్యాయి. తమిళనాడులో 7.78 కోట్ల జనాభాకు 3.05 కోట్ల యూనిట్ల రుణాలిచ్చారు. పుదుచ్చేరి జనాభా 14.13 లక్షలు కాగా అక్కడ 6.80 లక్షలు, 3.5కోట్ల జనాభా ఉన్న అసోంలో 74 లక్షల ముద్ర యూనిట్లు మంజూరవ్వడం గమనార్హం. -
అమెరికన్ కంపెనీలపై వివక్ష లేదు
న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్ సంస్థలపై రెండు శాతం పన్ను విధింపు విధానంతో అమెరికన్ కంపెనీల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. దీనిపై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) నివేదికలో పొందుపర్చిన అంశాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ స్పష్టం చేశారు. ఈ–కామర్స్ సరఫరాలపై భారత్ రెండు శాతం డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ విధించడం అమెరికన్ కంపెనీల పట్ల వివక్ష చూపటమేనని, ఇది అంతర్జాతీయ పన్ను సూత్రాలకు విరుద్ధమని యూఎస్టీఆర్ గత నెల ఒక నివేదికలో పేర్కొంది. దీనిపైనే తాజాగా వాధ్వాన్ స్పందించారు. విదేశీ సంస్థలు .. బిలియన్ల డాలర్ల కొద్దీ ఆదాయాలు పొందుతున్న దేశాల్లో పన్నులు చెల్లించడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) దేశాలు కూడా ఇదే దిశగా చర్యలు తీసుకుంటున్నాయని వాధ్వాన్ వివరించారు. ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థల రూపంలో ఆయా రంగాల్లో ఆధిపత్యం ఉన్నందునే కొన్ని దేశాలు ఇలాంటి పన్నులను వ్యతిరేకిస్తున్నాయని ఆయన చెప్పారు. మినీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు.. అమెరికా, భారత్ మధ్య ప్రతిపాదిత మినీ వాణిజ్య ఒప్పందంపై స్పందిస్తూ .. పలు అంశాలపై ఇరు దేశాల చర్చలు కొనసాగుతూనే ఉంటాయని, వీటికి ముగింపు ఉండదని వాధ్వాన్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా పెంచుకునే దిశగా ప్రతిబంధకంగా ఉన్న కొన్ని వివాదాలను పరిష్కరించుకోవడంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) కింద తమ ఎగుమతులకు ప్రాధాన్యత హోదాను పునరుద్ధరించాలని అమెరికాను భారత్ కోరుతోంది. మరోవైపు, వ్యవసాయం, తయారీ, డెయిరీ, వైద్య పరికరాలు తదితర విభాగాల్లో తమ కంపెనీలను మరింత విస్తృతంగా అనుమతించాలని అమెరికా కోరుతోంది. -
అంతా ఒక్కటే.. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్
జో బైడెన్ బుధవారం ప్రెసిడెంట్ సీట్లో కూర్చోవడంతోనే పదిహేడు సంతకాలు పెట్టారు. వాటిల్లో ఒక సంతకం ట్రాన్స్జెండర్లది. ‘మనషులంతా ఒక్కటే. నో ఆడ, నో మగ, నో ట్రాన్స్‌జెండర్. వివక్ష పాటించరాదు’ .. అని సైన్ చేసేశారు. అయితే ఇందుకు అందరూ ఓకే. ఒక్క అథ్లెట్లే.. నాట్ ఓకే. ‘‘ట్రాన్స్ ఉమన్ రన్నర్‌ని మామూలు ఉమన్ రన్నర్‌తో పోటీకి దింపితే గెలిచేది ట్రాన్స్ ఉమనే. వాళ్లు బలంగా ఉంటారు. అప్పుడది అథ్లెట్స్ మధ్య పోటీ అవదు. శారీరకంగా బలమైనవాళ్లకు, వారికన్నా బలహీనమైన వాళ్లకు మధ్య పోటీ అవుతుంది’ అని వారి వాదన. బైడన్ ఏమంటారు! తన ఆర్డర్‌ను వెనక్కు తెప్పించి, ‘అథ్లెట్స్ తక్క’ అని రీ ఆర్డర్ పాస్ చేస్తారా? బైడెన్ దగ్గరకు వాషింగ్టన్ వెళ్లేముందొకసారి ఇండియాలోని గోపాల్‌పూర్‌కి వెళదాం. ఆరేళ్లు వెనక్కి. 2014 లోకి. ఏ గోపాల్పూర్ అంటే ఒడిశా జైపూర్ జిల్లాలో ఉన్న గోపాల్పూర్. స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఊరు. ఊహు. తనక్కడ లేదు! పంజాబ్‌లో ఉందట.. ట్రైనింగ్ సెంటర్లో. గ్లాస్గోవ్ కామన్వెల్త్ గేమ్స్‌కి ప్రాక్టీస్ చేస్తోంది. అప్పటికి ఆమె వయసు 18. పెద్దయ్యాక ఆడబోతున్న తొలి పెద్ద గేమ్! ఆ ముందు నెలలోనే తైవాన్ వెళ్లి ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఆడొచ్చింది. 200 మీటర్ల పరుగు పందెంలో, 400 మీటర్ల రిలేలో గోల్డ్ మెడల్స్ కొట్టుకొచ్చింది. ‘‘వారెవ్వా అమ్మాయీ..’’ అంది ఇండియా. ఇంకా అంటూనే ఉంది, అంతలోనే ద్యుతీకి ఢిల్లీ నుంచి పిలుపు.. అర్జెంటుగా ఢిల్లీ వచ్చెయ్యమని! పిలిచింది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్. ద్యుతీ కాలు నిలవలేదు. ట్రైనింగ్‌కి బెంగళూరు పంపడానికి ఢిల్లీ రమ్మన్నారనుకుంది. పంజాబ్‌లో బస్సెక్కి, ఐదు గంటలు ప్రయాణించి ఢిల్లీ చేరుకుంది. ‘‘డాక్టర్ని కలువమ్మా.. ’’ అని ఫెడరేషన్ డాక్టర్ దగ్గరకు పంపించారు డైరెక్టర్. ద్యుతీ డౌట్ పడలేదు. ఫిట్నెస్ పరీక్షలు అనుకుంది. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసి, మూడో రోజు బెంగళూరు పంపించారు. అయితే ప్రాక్టీస్ కోసం కాదు. మరికొన్ని పరీక్షల కోసం. ద్యుతీకి క్రోమోజోమ్ ఎనాలిసిస్ టెస్ట్ చేశారు. ఎం.ఆర్.ఐ. తీశారు. గైనకాలజికల్ ఎగ్జామ్స్ చేశారు. తర్వాత హార్మోన్ పరీక్షలు! ద్యుతీ క్లిటారిస్‌ను కదలించి చూశారు. ఆ ప్రకంపనల్ని నోట్ చేశారు. వెజీనా గోడల్ని పరీక్షించి చూశారు. ప్యూబిక్ హెయిర్ సాంద్రత గుణాన్ని పట్టి పట్టి చూశారు. బ్రెస్ట్ దగ్గరికి వచ్చారు. నొక్కి చూశారు. సైజ్ చుట్టుకొలత తీసుకున్నారు! అవన్నీ కామన్ పరీక్షలేనేమో అనుకుంది ద్యుతీ. రిపోర్ట్స్‌లో ‘అన్ కామన్’ అని వచ్చింది! ద్యుతీలో స్త్రీ పాళ్లు తక్కువగా పురుషపాళ్లు ఎక్కువగా ఉన్నాయని వచ్చింది. మగాళ్లలో ఉండే టెస్టోస్టెరోన్ హార్మోన్ ఆడవాళ్లలో లీటరు రక్తానికి 1.0–3.3 నానోమోల్స్ మధ్య మాత్రమే ఉండాలి. ద్యుతీలో 10 నానోమోల్స్‌కి మించి ఉన్నాయి. దానర్థం ఆమె మహిళ కాదు!! మహిళలతో పోటీ పడటానికి లేదు. పైకి మహిళే కనుక మగాళ్లతోనూ ఆమెను పోటీ పడనివ్వడానికి లేదు. అయ్యో.. ద్యుతీ కెరీర్ అంతమైపోయినట్లేనా? ఆమె కెరీర్ సంగతి తర్వాత, ఆమెతో పోటీ పడితే అమ్మాయిల కెరీర్ అంతమైపోయినట్లేనని అథ్లెట్స్ ఫెడరేష¯Œ ఆలోచనలో పడిపోయింది. 150 సెంటీ మీటర్ల ఎత్తు మాత్రమే.. అంటే 4 అడుగుల 9 అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న ద్యుతీ రన్నింగ్‌లో అంత శక్తిమంతమైన అడుగు ఎలా వేయగలుగుతోంది అనే సందేహం తీర్చుకునేందుకే ఫెడరేషన్ ఆమెకు టెస్టోస్టెరోన్ టెస్ట్‌లు చేయించింది. చేయించాక, ఆడవాళ్లతో ద్యుతీ పోటీ పడడం సబబేనా అనే తర్కంలో పడిపోయింది. తర్వాతేమైంది! భారీ అడుగు : భారతీయ స్ప్రింటర్, 100 మీటర్ల పరుగు ఈవెంట్లో ప్రస్తుతం మన నేషనల్ చాంపియన్ ద్యుతీ చంద్ ద్యుతీ చంద్కి ఇప్పుడు 24 ఏళ్లు. ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు సాధించాక గ్లాస్గోవ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడలేకపోయినా ఆమె 2016లో, 2017లో, 2018లో ఆడింది. పతకాలు సంపాదించింది. 2019లో ఇటలీ వెళ్లి సమ్మర్ యూనివర్సియాyŠ 100 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ గెలుచుకొచ్చింది. ఇవన్నీ కూడా ‘సోర్ప్›్ట కోర్టు’లో కేస్ వేసి, టెస్టోస్టెరాన్ రూల్స్ అన్యాయం అని వాదించి, కేసు నెగ్గి, ఆడి, సాధించింది. ఆ తర్వాత 2019 లో తొలిసారి తను ఎల్జీబీటీ (ట్రాన్స్‌జెండర్) సభ్యురాలినని బాహాటంగా ప్రకటించుకుంది. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్‌కి కూడా వెళుతోంది. అక్కడా ఆడవాళ్లతోనే తను ఆడుతుంది. అయితే ఇది అన్యాయం అనే వాళ్లు అంటూనే ఉన్నారు. ద్యుతీ తనను ట్రాన్స్ ఉమెన్ గా ప్రకటించుకున్నాక కూడా మహిళల కేటగిరీలో ఆమెకు చోటు ఇవ్వడం ఏమిటని వారి వాదన. ఈ వాదనకు బలం ఉన్నా, వాదనగా నిలబడే బలం మాత్రం లేదు. ఐ.ఎ.ఎ.ఎఫ్. (ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కౌన్సిల్) 2019 అక్టోబర్ నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త ట్రాన్స్‌జెండర్ నిబంధనల ప్రకారం ట్రాన్స్ ఉమన్ మహిళలు తమ రక్తంలో లీటరుకు 5 నానోమోల్స్‌కు మించి టెస్టోస్టెరోన్ లేదని (ఈవెంట్లో పాల్గొనడానికి ముందు పన్నెండు నెలల నుంచి) రుజువు చేసి సంతకం పెట్టి ఇస్తే చాలు. ఆటకు అర్హులే. మరి ఒలింపిక్స్ నాటికి ద్యుతీ చంద్ టెస్టోస్టెరోన్ 5 నానోమోల్స్‌కి మించి ఉంటే? ఆమె ఆడలేకపోవచ్చు. ఇప్పుడు బైడన్ దగ్గరికి వద్దాం. ‘మనుషులంతా ఒక్కటే. ఎవరినీ లైంగిక వివక్షతో చూడకూడదు’ అని బుధవారం ఆయన ఆర్డర్ పాస్ చేసినప్పటి నుంచి అగ్రరాజ్యంలో ట్రాన్స్‌జెండర్ ల విజయోత్సవాలు జరుగుతున్నాయి. ‘మా మంచి ప్రెసిడెంట్’ అని బైడెన్‌కు ట్రాన్స్‌జెండర్ లు పూల గుచ్ఛాలు పంపుతున్నారు. వాళ్ల సంతోషానికి, బైడెన్ సమభావనకు ఎవరూ అడ్డు పడటం లేదు కానీ, ‘‘మహిళల స్పోర్ట్ ఈవెంట్‌కి ట్రాన్స్ మహిళల్ని అనుమతించకండి. వాళ్లు బలంగా ఉంటారు. వాళ్లతో పోటీ పడితే మేము ఓడిపోతాం’’ అని క్రీడారంగంలోని అమెరికన్ మహిళలు బైడెన్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ‘కరెక్టే’ అని రిపబ్లికన్లు మద్దతు ఇస్తున్నారు. ఏ రంగంలోనైనా తొలి ట్రాన్స్ అవడం నిజంగా గొప్ప సంగతే. ఇండియానే తీసుకుందాం. తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయవాది సత్యశ్రీ షర్మిల. తొలి ట్రాన్స్‌జెండర్ జడ్జి జోయితా మండల్. తొలి ట్రాన్స్‌జెండర్ పోలీస్ ఆఫీసర్ ప్రీతికాయషిని. తొలి ట్రాన్స్‌జెండర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మానవీ బందోపాధ్యాయ్. ఎన్నికల్లో నిలబడిన తొలి ట్రాన్స్‌జెండర్ ముంతాజ్. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి ట్రాన్స్‌జెండర్ షబ్మమ్ మౌసీ. తొలి ట్రాన్స్‌జెండర్ సిపాయి షబీ. తొలి ట్రాన్స్‌జెండర్ మెడికల్ అసిస్టెంట్ జియా దాస్. వీళ్లందరివీ గొప్ప అచీవ్మెంట్స్. కానీ భౌతిక శక్తి అవసరమైన క్రీడా పోటీలలో మహిళల కేటగిరీలోకి ట్రాన్స్ ఉమన్‌ని అనుమతించి, వారు గెలిచినప్పుడు ‘తొలి ట్రాన్స్ ఉమన్ రన్నర్’ అని అనడం వారి విజయానికి సంపూర్ణతను ఇచ్చినట్లవుతుందా? బహుశా బైడెన్ ఆర్డర్ నుంచి ట్రాన్స్‌జెండర్ లు తమకు తాముగానే క్రీడారంగాన్ని మినహాయించుకోడానికి త్వరలోనే ముందుకు రావచ్చు. వారి గౌరవం కోసం వాళ్లు. -
బతుకునిచ్చిన బతుకమ్మలు
ఆడపిల్ల కదా.. ఎప్పటికైనా ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందే.. ఇదీ అప్పుడూ.. కొన్నిచోట్ల ఇప్పుడూ ఆడపిల్లలపై ఉన్న అభిప్రాయం.. కానీ.. ఈ మహిళలంతా వివక్షను జయించారు. తాము పుట్టే నాటికి ఎంత వివక్ష ఉండేదో కానీ.. నేడు వారే ఇంటికి పెద్దదిక్కయ్యారు. తల్లిదండ్రులకు అంత్యకాలంలో ఊతకర్రయ్యారు. తోడబుట్టిన వారికి ఆసరాగా నిలిచారు. వీరంతా కుటుంబపోషణ కోసం ఎంచుకున్న పనుల వెనుక ఓ బాధ్యత ఉంది. అసాధారణ బతుకు పోరాటం ఉంది. వివక్షకు గురికాకుండా.. జీవితాలను గెలిచి, నిలిచిన నాటి బాలికలు.. నేటి మహిళల బతుకు పాఠాలు.. నేడు జాతీయ బాలికాదినోత్సవం సందర్భంగా.. – సాక్షి, నెట్వర్క్ ఇద్దరూ ఇద్దరే ఒకరు పూలమ్మ.. మరొకరు ఆదిలక్ష్మి.. మగవాళ్లు చేసే పనిని అవలీలగా చేసేస్తారు. బాధ్యతలే వాళ్లను విభిన్న వృత్తులవైపు నడిపించాయి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జీడి పూలమ్మకు చిన్నతనంలోనే వివాహమైంది. 14 ఏళ్ల కిందట భర్త మరణించాడు. మనసంతా శూన్యం.. ఎదురుగా ఇద్దరు పిల్లలు.. ధైర్యంగా వంటింట్లోంచి బయటకొచ్చింది. పంక్చర్లు వేయడాన్నే వృత్తిగా మలుచుకుంది. ఆ పని చేస్తూనే కుమార్తెకు పెళ్లి చేసింది. కుమారుడిని చదివిస్తోంది. రోజూ రూ.600 వరకు సంపాదిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి 3వ తరగతి వరకే చదువుకుంది. భర్త కష్టంతో కుటుంబం గడవదనే ఆలోచనతో.. సంసార చక్రంలో తానూ భాగస్వామైంది. భర్త చేసే పంక్చర్లు, వెల్డింగ్ పనిలో పట్టు సాధించింది. స్థానిక వార్డు సభ్యురాలు కూడా అయిన ఆమె మగవారికి ధీటుగా వాహనాలకు గ్రీస్, పంక్చర్, టైర్ పౌడర్, బోల్ట్ సెట్టింగ్, ప్యాచ్, ఫిల్టర్ క్లీనింగ్, గాలి చెకింగ్, వెల్డింగ్ పనులు చకచకా చేసేస్తుంది. తమ ఇద్దరి సంపాదనతో కుటుంబం హాయిగా నడిచిపోతోందని అంటోంది. పనులు చేస్తున్న ఆదిలక్ష్మి; లారీ టైరుకు పంక్చర్ చేస్తున్న పూలమ్మ కష్టాలు.. ముక్కలు ముక్కలు చికెన్‌ను ముక్కలుగా కట్‌చేస్తున్న ఈ ఫొటోలోని మహిళ పేరు జరీనా. భర్త అబ్దుల్ కరీం నడుపుతున్న చికెన్ సెంటర్, హోటల్‌తో సంసారం సాఫీగా గడిచిపోయేది. ఉన్నట్టుండి కరీం అనారోగ్యం బారినపడ్డాడు. చూస్తూ కూర్చుంటే.. కుటుంబం గడవదని భావించిన జరీనా.. తన భర్త చేసే పనినే తానెంచుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తూ కుటుంబాన్ని నిలబెట్టుకుంది. పెద్ద కొడుకు అల్తాఫ్హుస్సేన్ ఏడో తరగతి చదువుతూనే పంప్ మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రెండో కొడుకు సల్మాన్‌కు ఎంఎల్టీ శిక్షణనిప్పిస్తోంది. ఇలా ఇంటికొక్కరుంటే చాలు! అమ్మానాన్నా ఇద్దరూ కూలీలే. ఆరుగురు ఆడపిల్లలు. తల్లిదండ్రులు ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా.. నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లడమే గగనం.. దీంతో ‘నేనున్నా’నంటూ తల్లిదండ్రులతో పాటూ తానూ కుటుంబభారాన్ని పంచుకుంది అరుణ. ఇద్దరు అక్కలకు, చెల్లికి పెళ్లి చేసింది. మరో ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన అరుణ.. కూలి పనులకు వెళ్తుంది. సొంతంగా కొంత భూమి కొని, కొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తోంది. పురుషులతో సమానంగా నాగలి దున్నడం, ట్రాక్టర్ తోలడం చేస్తుంది. ఇంత కష్టం చేస్తూనే అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. మొదట్లో ఆశ కార్యకర్తగా పనిచేసినా.. వచ్చే జీతం కుటుంబపోషణకు సరిపోక.. ‘సాగు’లోకి దిగింది. తల్లిదండ్రులను కూలి పనులకు వెళ్లొద్దంది. తమకు కొడుకులు లేరనే బాధలేదని అరుణ తల్లిదండ్రులు అంటున్నారు. అరుణ లాంటి వారు ఇంటికొక్కరున్నా చాలని గంగారం గ్రామస్తులు అంటున్నారు. నేనే అబ్బాయినై ఇంటిల్లిపాదినీ పోషిస్తానని అరుణ చెబుతోంది. బుజ్జమ్మ..ఒంటరి పోరు! జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బుజ్జమ్మ అలియాస్ రాజేశ్వరి పదమూడో ఏటనే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పటికే పెద్దక్క అనారోగ్యంతో మరణించింది. రెండో అక్కకు పెళ్లయి ఇద్దరు కుమార్తెలు, కొడుకు పుట్టాక.. అక్కాబావలిద్దరూ అనారోగ్యంతో చనిపోయారు. మరో ఏడాదికి ఇంటికి పెద్దదిక్కనుకున్న అన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇక మిగిలింది.. చెల్లెలు రమ, రెండో అక్క పిల్లలు అరుణశ్రీ, మనోజ్, వర్ష.. ఈ పరిస్థితుల్లో బుజ్జమ్మ ఇంటి బాధ్యతను భుజానికెత్తుకుంది. మొదట్లో బీడీలు చుట్టింది. మిషీన్ కుట్టడం నేర్చుకుంది. రెక్కలు ముక్కలు చేసుకుని చెల్లెలు రమకు పెళ్లి చేసింది. అక్క పిల్లలు ఆదరణకు దూరమవుతారనే భయంతో పెళ్లి వద్దనుకుంది. ఏడాది క్రితం అక్క కుమార్తె అరుణశ్రీకి అన్నీతానై వివాహం చేసింది. మిగతా మనోజ్, వర్షను డిగ్రీ, ఇంటర్ చదివిస్తోంది. మూడేళ్ల క్రితం బుజ్జమ్మ ఆశ కార్యకర్తగా వైద్యారోగ్య శాఖలో చేరింది. మరోపక్క బీడీలు చుడుతూ, మిషీన్ కుడుతూ ఇప్పటికీ అక్క పిల్లలిద్దరే తన రెండు కళ్లుగా జీవిస్తోంది. మా ఇంటి ‘భాగ్య’రేఖ చేనేత కష్టాలకు ఎదురీదలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బీడీలు చుడుతూ బిడ్డల్ని కడుపున పెట్టుకుని చూసుకున్న అమ్మ అనారోగ్యానికి బలైపోయింది. అప్పటికి పదిహేనేళ్లు భాగ్యకు. అమ్మ చివరిసారిగా తమ్ముడు నవీన్, చెల్లెలు స్రవంతి చేతుల్ని తన చేతుల్లో పెట్టడం భాగ్యకు ఇప్పటికీ గుర్తే. ఆ బాధ్యతే.. ముందుకు నడిపించింది. మొండి ధైర్యంతో కుటుంబభారాన్ని భుజానికెత్తుకుంది. అందరూ అయ్యో పాపం.. అన్నవాళ్లే కానీ.. ఎవరూ ఆదుకున్నది లేదు. చదువాగిపోయింది. కానీ తమ్ముడు, చెల్లి చదువాగిపోకూడదని వారి కోసం బీడీలు చుట్టింది. ఆమె కష్టం గురించి తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ సుల్తానియా.. భాగ్యకు హోంగార్డుగా అవకాశమిచ్చారు. ఆమె కష్టార్జితంతోనే స్రవంతి ఎంబీఏ పూర్తిచేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంటే, నవీన్ ఎంబీఏ ఫైనలియర్లో ఉన్నాడు. ప్రస్తుతం సంబంధాలు వస్తున్నా.. చెల్లెలు, తమ్ముడు స్థిరపడ్డాకేనంటోంది. రాత మార్చిన ‘గీత’ తలరాత బాగాలేదని చింతిస్తూ కూర్చోలేదు సావిత్రి.. కల్లుగీత వృత్తిని చేపట్టి రాతను మార్చుకుంది. మెదక్ జిల్లా రేగోడ్‌కు చెందిన సావిత్రి టెన్త్ వరకు చదివింది. చిన్న వయసులోనే సాయాగౌడ్‌తో వివాహమైంది. ఐదేళ్లకే భర్త హఠాన్మరణం.. అప్పటికి సావిత్రి నిండు గర్భిణి. పెద్దమ్మాయి భవాని పుట్టుకతోనే దివ్యాంగురాలు. తలవని తలంపుగా మామ మంచానపడ్డాడు. ఈ పరిస్థితుల్లో ఆ ఇంటికి తానే పెద్దదిక్కుగా మారింది. భర్త కల్లు గీతవృత్తిని దగ్గర్నుంచి పరిశీలించిన ఆమె ఆ వృత్తినే చేపట్టింది. అధికారుల సాయంతో లైసెన్స్ పొందింది. రోజూ పది కిలోమీటర్ల మేర తిరుగుతూ ఈత చెట్లెక్కి కల్లుగీస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే తొలి మహిళా కల్లుగీత కార్మికురాలీమె. -
అడుగడుగునా వివక్ష
లైంగిక వేధింపులకు సంబంధించిన ఉదంతాలు వెల్లడైనప్పుడు సమాజంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. కారకులపై చర్యకు అందరూ డిమాండ్ చేస్తారు. కానీ లింగ వివక్ష అలా కాదు. చాలా సందర్భాల్లో అది బాధితులకు తప్ప కనబడదు. వారు ఫిర్యాదు చేస్తే తప్ప ఎవరి దృష్టీ పడదు. ఒక్కోసారి ఫిర్యాదు చేసినా చివరకు అది వివక్షగా పరిగణనలోకి రాకపోవచ్చు. బాధితులు దాన్ని సరిగా చెప్పలేకపోవచ్చు. లింగ వివక్ష బాహాటంగా కనబడినప్పుడు సైతం బాధితులకు అండగా నిలిచే ధోరణి అన్నిచోట్లా వుండదు. అసలది పెద్దగా చర్చకు రాదు. మంగళవారం జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ చాలా నిర్మొహమాటంగా మాట్లాడి మంచి పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న అవమా నాలనూ, అవరోధాలనూ చెప్పారు. అడుగు ముందుకు పడుతున్నా, ఆధునికత విస్తరిస్తున్నా, అభివృద్ధి సాధిస్తున్నామని అనుకుంటున్నా మారనిది ఈ లింగ వివక్ష. పిండ దశతో మొదలుపెట్టి అన్ని స్థాయిల్లో, అన్ని రంగాల్లో ఇది తప్పడం లేదు. సౌమ్యా స్వామినాథన్ వంటివారు మాట్లాడటం వల్ల ఇలాంటి వివక్ష ఎదుర్కొంటున్నవారు ఆ విషయాన్ని సూటిగా చెప్పగలిగే, గట్టిగా ప్రశ్నించగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని తెచ్చుకుంటారు. ఆమె చెప్పిన విషయాలు వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)లో పనిచేసినప్పుడు తాను ఎదు ర్కొన్న వివక్ష గురించి ఆమె చెప్పారు. ఐసీఎంఆర్ మన దేశంలో జీవ వైద్య పరిశోధనలో సర్వో న్నతమైన సంస్థ. 1911లో భారతీయ పరిశోధనా నిధి సంఘం(ఐఆర్‌ఎఫ్‌ఏ)గా ఆవిర్భవించిన ఆ సంస్థ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో ఐసీఎంఆర్గా రూపుదిద్దుకుంది. అది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య పరిశోధనా విభాగం సారథ్యంలో పనిచేస్తుంది. గర్భధారణ, తల్లీబిడ్డల ఆరోగ్యం, అంటురోగాలు, పౌష్టికాహార లోపాలు, కేన్సర్, గుండె సంబంధ వ్యాధులు, మధుమేహం, మానసిక ఆరోగ్యం, ఔషధాలు వగైరాల్లో ఐసీఎంఆర్ పరిశోధనలు చేస్తుంది. సమాజ ఆరోగ్య పరిరక్షణకు అవలంబించాల్సిన ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందిస్తుంది. సగటు మనుషుల్లో కనబడే కుల, మత, ప్రాంత, జెండర్ వివక్షలవంటివి ఇలాంటిచోట తావుండదని అందరూ అను కుంటారు. ఆశిస్తారు. విద్యాపరంగా, మేధోపరంగా ఇక్కడివారు ఉన్నతంగా వుంటారని భావిస్తారు. అయితే సౌమ్య వెల్లడించిన అంశాలు ఇందుకు విరుద్ధంగా వున్నాయి. కమిటీ సమావేశాల్లో ఎప్పుడూ పురుషాధిక్యత రాజ్యమేలుతుందని, పరిశోధనకు సంబంధించి చెప్పేవి పూర్తిగా వినకుండానే కొట్టిపారేయడం లేదా ఆ ఆలోచనను హేళన చేయడం తనకు తరచు ఎదురయ్యేదని ఆమె చెప్పిన మాటలు విషాదం కలిగిస్తాయి. ఇందువల్ల రెండోసారి ఏదైనా ప్రతిపాదించదల్చుకున్నప్పుడు, ఒక అభిప్రాయం చెప్పదల్చుకున్నప్పుడు సంకోచం ఏర్పడేదని కూడా ఆమె చెప్పారు. ఇలాంటిచోట కొత్త ఆలోచనలకూ, సృజనకూ తావుంటుందా? స్వాతంత్య్ర వచ్చి ఏడు పదులు దాటుతున్నా మన దేశంలో అక్షరాస్యతలో బాలికల శాతం తక్కువే. పాఠశాల విద్యలో చేరిన ఆడపిల్లల్లో ఎక్కువ శాతం అనేకానేక అవాంతరాల వల్ల మధ్యలోనే చదువు చాలించుకుంటారు. ఉన్నత చదువులకు వెళ్లేసరికి అది మరింతగా తగ్గుతుంది. గతంతో పోలిస్తే శాస్త్ర పరిశోధనా రంగంలో ఇప్పుడు మహిళల శాతం బాగా పెరిగినా అదింకా ఉండవలసినంతగా లేదు. ఇప్పుడే ఇలావుంటే ఆమె కెరీర్లో అడుగుపెట్టేనాటికి ఎలాంటి స్థితి వుండేదో సులభంగానే అంచనా వేసుకోవచ్చు. మన సమాజంలో కుటుంబం సహాయసహకారాలు, ప్రోత్సాహం లేకపోతే ఆడపిల్లలు అన్నివిధాలా ఎదగటం చాలా కష్టం. భారత హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన ఎంఎస్ స్వామినాథన్ కుమార్తెగా మాత్రమే కాదు... సాయుధ దళాల వైద్య కళాశాలలో, ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌లో ఉన్నత చదువులు చదివిన ఆమెకు సైతం పనిచేసేచోట వివక్ష తప్పలేదంటే బాధాకరమే. చదువుకునే రోజుల్లో ఎదురుకాని పరిస్థితులు పనిచేసేచోట వున్నాయని ఆమె అంటున్నారు. మహిళా పరిశోధకులు తమ పరిశోధనాంశాలకు గ్రాంట్లు తెచ్చుకోవాలన్నా, వారి పరిశోధనా ఫలితాలు ప్రతిష్టాత్మక పత్రికల్లో ప్రచురింపజేసుకోవాలన్నా సమస్యలెదురవుతుంటా యన్నది ఆమె మరో ఆరోపణ. ఇవి ఇప్పుడు ఏమాత్రం తగ్గలేదు సరిగదా... మరింతగా పెరిగా యంటున్నారామె. ప్రపంచ ఆరోగ్య రంగంలో పనిచేసే కిందిస్థాయి సిబ్బందిలో 70 శాతం వరకూ మహిళలే. కానీ ఆ రంగం తీరుతెన్నులను నిర్ణయించాల్సిన సారథ్య బాధ్యతల్లో వారు 25 శాతం మించరని ఈమధ్య బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే మహిళలు వున్నారని ఆ అధ్యయనం తెలిపింది. అచ్చం సౌమ్యా స్వామినాథన్ తరహాలోనే అమెరికాలోని ఎంఐటీలో సైన్స్ చరిత్రను బోధించే మహిళా శాస్త్రవేత్త అభా సూర్ కొన్నేళ్లక్రితం భారత్‌లోనూ, ఇతరచోట్లా అమల వుతున్న లింగ వివక్షపై ఒక పుస్తకమే రాశారు. 60వ దశకంలో లేజర్ కిరణాల గురించి పరిశో ధించేటపుడు లింగ వివక్షతోపాటు, కుల వివక్ష కూడా వుండేదని ఆమె అన్నారు. మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సీవీ రామన్ బెంగళూరు ఐఐఎస్సీ సారథిగా వున్నప్పుడు మహిళా శాస్త్రవేత్తలకు ఎదురైన ఇబ్బందుల్ని తెలిపారు. తరతమ భేదాలతో దాదాపు అన్ని రంగాల్లో పనిచేసే మహిళలకూ ఇలాంటి వివక్ష ఏదో ఒక దశలో ఎదురవుతోందన్నది వాస్తవం. కనుకనే ఇప్పుడు సౌమ్య ప్రస్తావించిన అంశాలను ఐసీఎంఆర్ మాత్రమే కాదు...అన్ని సంస్థలూ సీరియస్‌గా తీసుకుని తమ నిర్వహణా పద్ధతులనూ, విధానాలనూ సమీక్షించి సరిదిద్దుకోవాలి. వివక్ష ఏ రూపంలో వున్నా రూపుమాపాలి. -
‘నా పేరు ‘ఐసిస్’ కాదు’
వాషింగ్టన్: జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తర్వాత అమెరికాలో జాత్యంహకారానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయిన సంగతి తెలిసిందే. అయినప్పటకి కూడా అక్కడ ఇంకా కొంత మందిలో మార్పు రావడం లేదంటున్నారు నెటిజనులు. తాజాగా స్టార్‌బక్స్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే.. ఇది నిజమనిపిస్తుంది. కాఫీ కప్పు మీద ముస్లిం మహిళ పేరును ‘ఐసిస్’ అని రాసి విమర్శలు ఎదుర్కొంటోంది స్టార్‌బక్స్ యాజమాన్యం. వివరాలు.. ఆయేషా అనే ఓ ముస్లిం మహిళ ఈ నెల 1న అమెరికాలోని మిన్నెసోటా సెయింట్ పాల్లోని స్టార్‌బక్స్ బరిస్టాలో కాఫీ ఆర్డర్ చేసింది. తీరా కాఫీ కప్పు అందుకున్న ఆమె ఒక్క క్షణం షాక్‌కు గురయ్యింది. ఎందుకుంటే స్టార్ బక్స్ సిబ్బంది ఆయేషా పేరుకు బదులుగా ‘ఐసిస్’ అని కాఫీ కప్పు మీద రాశారు. (ఇక నుంచి ‘గ్లో అండ్ లవ్లీ’) దీని గురించి ఆయేషా మాట్లాడుతూ.. ‘ముఖానికి మాస్క్ ఉండటంతో సరిగా వినపడదనే ఉద్దేశంతో నా పేరును చాలా సార్లు రిపీట్ చేశాను. అయినా వారు ‘ఐసిస్’ అని రాశారు. ఆయేషా అనే పేరు కొత్త కాదు. తరచుగా వినే పేరే. కావాలనే వారు ఇలా చేశారు. కప్పు మీద ఐసీస్ అని చూడగానే నాకు చాలా కోపం వచ్చింది. అవమానంగా భావించాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల ప్రతిష్టను దిగజార్చే సంఘటన. ఈ రోజుల్లో కూడా జనాల ప్రవర్తన ఇలా ఉందంటే నాకు నమ్మశక్యంగా లేదు. ఇది సరైంది కాదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆయేషా. అంతేకాక దీని గురించి మేనేజర్‌ను ప్రశ్నించింది. వారు ఈ సంఘటనను చిన్న తప్పిదంగా పరిగణించారు. ఆయేషాకు మరో కప్పు కాఫీ, 25 డాలర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ ఈ చర్యలు ఆమె కోపాన్ని తగ్గించలేకపోయాయి. (హారియట్ టబ్‌మన్ బానిసల ప్రవక్త) దాంతో ఆయేషా స్టార్‌బక్స్ షాప్ మీద డిస్క్రిమినేషన్ సూట్ దాఖలు చేసింది. దాంతో సదరు షాప్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని తెలిపింది. ‘ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నాం. అయితే ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని మా నమ్మకం. ఇక మీదట ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాము. ఇందుకు కారణమైన సిబ్బంది మీద చర్యలు తీసుకుంటాము’ అని తెలిపారు. -
ఉద్యమ నినాదం.. 8.46
మినియాపోలిస్/వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి, వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ‘8.46’అన్న అంకె నినాదంగా మారుతోంది. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌ను మే 25న మినియాపోలీస్ పోలీసు అధికారి డెరెక్ చెవెన్ నేలకు అదిమిపెట్టి ఉంచిన సమయం 8 నిమిషాల 46 సెకన్లు అని విచారణ సందర్భంగా తెలియడంతో ఉద్యమకారులు ఆ అంకెను నినాదంగా మార్చారు. ఈ సమయాన్ని ఇంత కచ్చితంగా ఎలా నిర్ధారించారన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ ఆందోళనకారుల్లో మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది. బోస్టన్, టాకోమా, వాషింగ్టన్లలో జరిగిన ప్రధర్శనలు 8.46 నిమిషాలపాటు జరగడం.. హ్యూస్టన్‌లో చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించే వాళ్లు చేతుల్లో మైనపు వత్తులు పెట్టుకుని అంతే సమయం మోకాళ్లపై పాకుతూ నిరసన వ్యక్తం చేయడం ఈ అంకెకు ఏర్పడిన ప్రాధాన్యానికి సూచికలు. టెలివిజన్ చానళ్లు వయాకామ్‌సీబీఎస్ గతవారం ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పిస్తూ 8.46 నిమిషాలపాటు ప్రసారాలు నిలిపివేసింది. గూగుల్ సీఈఓ నివాళి 8 నిమిషాల 46 సెకన్లపాటు మౌనం వహించడం ద్వారా ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు రాసిన లేఖలో కోరారు. జాతివివక్షపై జరిగే పోరుకు గూగుల్ సుమారు రూ.210 కోట్లు విరాళంగా ఇవ్వనుందన్నారు. జాతి అసమానతల నివారణ కోసం పనిచేస్తున్న సంస్థలకు కోటీ ఇరవై లక్షల డాలర్ల నగదు సాయం అందిస్తామని, సంస్థలు జాతి వివక్షపై పోరాడేందుకు, కీలకమైన సమాచారం అందించేందుకు 2.5 కోట్ల డాలర్ల విలువైన ప్రకటనలను గ్రాంట్ రూపంలో ఇస్తామని పిచాయ్ వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సెంటర్ ఫర్ పోలీసింగ్ ఈక్విటీ అండ్ ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్‌కు పది లక్షల డాలర్ల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తరువాత అమెరికా వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజకీయంగా చురుకుగా మారారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒబామా మరోసారి ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తూండటం గమనార్హం. ‘సమాజంలోని సమస్యలను ఎత్తి చూపడం ద్వారా అధికారంలో ఉన్న వారిపై ఒత్తిడి పెంచాలి. అదే సమయంలో ఆచరణ సాధ్యమైన చట్టాలు, పరిష్కార మార్గాలు సూచించాలి’’అని అన్నారు. గాంధీ విగ్రహం ధ్వంసం అమెరికాలో జరుగుతున్న ఆందోళనల్లో భారతీయ దౌత్య కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం ధ్వంసమైంది. జూన్ 2వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని దౌత్యకార్యాలయ సిబ్బంది భావిస్తున్నారు. ఈ అంశంపై అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు సమాచారం అందించామని, స్థానిక పోలీసు అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారని అధికారులు తెలిపారు. శాంతి, అహింసలకు మారుపేరుగా భావించే గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై భారత్‌లో అమెరికా రాయబారి కెన్ జుస్టర్ క్షమాపణలు కోరారు. ఫ్లాయిడ్‌కు కరోనా? ఫ్లాయిడ్ రెండు నెలల క్రితం కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. హెన్నిపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ చేసిన శవపరీక్ష నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. మినసోటా ఆరోగ్య శాఖ అధికారులు ఫ్లాయిడ్ నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారని కరోనా సోకినట్లు ఏప్రిల్ 3న నిర్ధారించారని ఆండ్రూ బేకర్ అనే ప్రఖ్యాత మెడికల్ ఎగ్జామినర్ తెలిపినట్లు కథనం తెలిపింది. అయితే అతడి మరణానికి కరోనాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఫ్లాయిడ్‌కు కరోనా సోకినట్లు తనకు సమాచారం లేదని కుటుంబసభ్యుల కోరిక మేరకు శవపరీక్ష నిర్వహించిన మైకెల్ బాడెన్ తెలిపారు. అంత్యక్రియల నిర్వాహకులకు ఈ విషయం చెప్పలేదని దీంతో చాలామంది ఇప్పుడు కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారని అన్నారు. -
మరోసారి చిక్కుల్లో విప్రో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో మరోసారి చిక్కుల్లో పడింది. తమపై జాతి వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ అయిదుగురు మాజీ ఉద్యోగులు సంస్థపై దావా వేశారు. 2020 మార్చి 30 న న్యూజెర్సీ జిల్లా కోర్టులో వీరు తాజా క్లాస్ యాక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. దక్షిణ ఆసియన్లు, భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, విప్రో అనుసరిస్తున్న ఈ వివక్ష కారణంగా తాము ఉద్యోగాలు కోల్పోయామని వాదించారు. అమెరికాలో ఉన్న దక్షిణ ఆసియన్లు, భారతీయులు కానివారికి అప్రైజల్ స్కోర్క్ ఇవ్వడంలేదని, అలాగే వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన వీరిలో అధిక సంఖ్యలో ఉద్వాసనకు గురవుతున్నారని ఆరోపించారు. దక్షిణ ఆసియన్లు, భారతీయులం కాదనే నెపంతో సంస్థ తమపై 'జాతి వివక్ష' చూపిస్తోందని అమెరికాలోని ఐదుగురు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులపై పదోన్నతులు, జీతం పెంపు, తొలగింపు నిర్ణయాలకు సంబంధించి తేడాలు చూపిస్తోందన్నారు. దీని ఫలితంగా తాము ఉద్యోగాల్ని కోల్పోయామని పేర్కొన్నారు. నియామకం, పదోన్నతి ఇతర నిర్ణయాల్లో వివక్షత లేని పద్ధతిని అవలంబించాలనే ఆదేశాలతో పాటు, ఫెడరల్ రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారం , చట్టవిరుద్ధమైన విధానాలలో పాల్గొనకుండా శాశ్వత నిషేధానికి అనుగుణంగా దావాను 'క్లాస్ యాక్షన్' గా వర్గీకరించాలని కోర్టును కోరారు. గత పదేళ్లుగా విప్రోలో పని చేసిన ఐదుగురు మాజీ ఉద్యోగులు నలుగురు కాకేసియన్ మూలానికి , మరొకరు హిస్పానిక్ మూలానికి చెందినవారుగా భావిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామంపై వ్యాఖ్యానించేందుకు విప్రో తిరస్కరించింది. కాగా గత సంవత్సరం డిసెంబరులో ఆఫ్రికాకు చెందిన అమెరికా ఉద్యోగి ఇలాంటి దావావేయడంతో, పరిహారం ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. (ప్రతీరోజు 20 లక్షల మందికి ఆహారం : విప్రో) చదవండి : జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే! -
పాక్ క్రికెట్లో వివక్ష
మర్యాదస్తుల క్రీడగా అందరూ చెప్పుకునే క్రికెట్లో మళ్లీ చాన్నాళ్లకి తుపాను రేగింది. పాకిస్తాన్ క్రికెట్ టీంలో బాగా ఆడి, మంచి స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న డేనిష్ కనేరియాపై అప్పటి కెప్టెన్‌తోపాటు, తోటి ఆటగాళ్లు కొందరు వివక్ష ప్రదర్శించేవారని ఒక టీవీ షోలో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ బాంబు పేల్చాడు. అతడు కేవలం హిందువు కావడం వల్లే ఈ వివక్ష ఉండేదని కూడా అన్నాడు. అయితే ఆ బాంబు తాలూకు చప్పుళ్లు పాకిస్తాన్ మాటేమో గానీ...మన దేశంలో బాగానే వినబడ్డాయి. వర్తమాన పరిస్థితుల్లో అది సహజం కూడా. అసలు అలాంటివారి కోసమే తాము పౌరసత్వ చట్టాన్ని సవరించామని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పగా, ఉత్తరప్రదేశ్ మంత్రి కనేరియాకు నేరుగా ఒక ఆఫర్ ఇచ్చారు. ఇక్కడకు వస్తానంటే పౌరసత్వం కల్పిస్తామని అభయమిచ్చారు. అయితే షోయబ్, కనేరియా మాదిరే క్రికెట్లో కీర్తిప్రతిష్టలు ఆర్జించి, ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని పీఠంపై వున్న ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఇంతవరకూ మాట్లాడలేదు. ఈ విషయంలో చెప్పేదేమీ లేదని పాక్ క్రికెట్ బోర్డు చేతులు దులుపుకుంది. ఇలాంటివి జరగకుండా చూస్తామని మాటవరసకైనా అనలేదు. పైగా షోయబ్, కనేరియాలిద్దరూ ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు కదా అంటూ తర్కం లేవనెత్తుతోంది. కనేరియా ఆడుతున్నప్పుడు ఇంజమామ్–ఉల్– హక్, రషీద్ లతీఫ్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసుఫ్‌లు కెప్టెన్లుగా పనిచేశారు. వీరిలో ఇంజమామ్, యూనిస్‌ఖాన్, మహమ్మ ద్ యూసుఫ్‌లు తనను ప్రోత్సహిం చేవారని కనేరియా అంటున్నాడు కనుక రషీద్‌పైనే సహజంగా అందరికీ అనుమానాలు వస్తాయి. ఎటూ కనేరియా త్వరలో ఆ పేర్లు బయటపెడతానంటున్నాడు కనుక ఆ కెప్టెన్, ఇతర ఆటగాళ్లెవరో తేలిపోతుంది. వివక్ష ఒక మతానికి, కులానికి, దేశానికి లేదా జాతికి పరిమితమైన దురాచారం కాదని, ఇది అన్నిచోట్లా వ్యాపించివున్నదని గతంలో సైతం చాలాసార్లు వెల్లడైంది. నువ్వా నేనా అన్నట్టు ఆట సాగుతున్నప్పుడు ప్రత్యర్థి టీంల మధ్య స్పర్థలు పెరగడం, ఆవేశంతో ఎదుటివారిని జాతి పేరుతో, మతం పేరుతో దూషించడం, వారి ముఖకవళికలను హేళన చేయడం వంటివి క్రికెట్ అభిమానులు తరచు చూస్తున్నదే. దక్షిణాఫ్రికాకు చెందిన బేసిల్ డి అలివేరాను పూర్తి స్థాయి శ్వేత జాతీయుడు కాదన్న కారణంతో 1960లో క్రికెట్ టీంలోకి తీసుకోలేదు. దాంతో అతను అలిగి ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత అక్కడి టీం తరఫున దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు కూడా ఆనాటి దక్షిణాఫ్రికా ప్రధాని జాన్ వోర్స్టర్ బేసిల్ గురించి అవమానకరంగానే మాట్లాడారు. తమ టీం కెన్యాపై ఓడినప్పుడు బ్రియాన్ లారా 1996లో కెన్యా ఆటగాళ్లతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికా టీంపై చేసిన జాతిపరమైన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పదేళ్లక్రితం సిడ్నీ టెస్ట్‌లో సైమండ్స్‌ని హర్భజన్ సింగ్ కోతి అంటూ వెక్కిరించడం, అప్పట్లో అది భారత్, ఆస్ట్రేలియా టీంల మధ్య పెను వివాదం సృష్టించడం ఎవరూ మరిచిపోరు. అయితే ఆటలో ఉత్కంఠ పెరిగి, నువ్వా నేనా అన్నట్టు సాగుతుండగా ఆటగాళ్లు ఆవేశానికి లోనై అప్పటికప్పుడు ఏదో అనడం వేరు. కనేరియాకు జరిగింది ఇది కాదు. పాక్ ఆటగాళ్లలో కొందరు అతనితో కలిసి భోంచేసేందుకు సిద్ధపడేవారు కాదని, కనేరియాను వేరేచోటకు వెళ్లమనేవారని షోయబ్ వెల్లడించాడు. కేవలం తాను అన్య మతస్తుడిననే ఇలా ప్రవర్తించేవారని కనేరియా కూడా చెబుతున్నాడు. నిజానికి మన దేశంలో దళితులకు, ఇతర కులాలకు ఇది నిత్యానుభవం. అన్య మతస్తులపై కత్తులు నూరేవారు అన్నిచోట్లా వున్నారు. కానీ అలాంటి ఉన్మాదులు క్రీడాప్రపంచంలోకి సైతం చొరబడ్డారని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. దాదాపు 87 ఏళ్ల చరిత్రవున్న మన క్రికెట్ టీంలో ఆధిపత్య కులాలకు చెందినవారే కనిపిస్తారన్న ఫిర్యాదు చాలా తరచుగా దళిత వర్గాల నుంచి వినబడుతుంటుంది. దళిత ఆటగాళ్లు ఇంతవరకూ కేవలం నలుగురు మాత్రమే వున్నారని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దళిత కులాలవారు క్రికెట్ చూడరని, ఆడరని ఎవరూ అనుకోరు. మరి ఆ వర్గాలవారు టీంలో ఎందుకు కనబడరన్నది జవాబులేని ప్రశ్న. 1993లో టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టిన వినోద్ కాంబ్లీ మంచి ఆటగాడిగా రాణించాడు. కులం కారణంగా తనను పక్కనబెట్టారని కాంబ్లీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ దళితుడన్న కారణంతో అతనికి అన్యాయం చేశారని మొన్నటివరకూ బీజేపీ ఎంపీగా వున్న ఉదిత్ రాజ్ ఆరోపించారు. క్రికెట్లో సైతం రిజర్వేషన్లు వచ్చినప్పుడే దళితులకు, వెనకబడిన కులాలకు అందులో చోటు దక్కుతుందని రిపబ్లికన్ పార్టీకి చెందిన కేంద్రమంత్రి రాందాస్ అథ్వాలే కూడా చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వున్నప్పుడు క్రీడల్లో ఎందుకుండరాదన్నది ఆయన ప్రశ్న. క్రికెట్ టీముల్లో ఇంతవరకూ ఆడినవారు ఆధిపత్య కులాలవారే అయినా వారంతా డబ్బూ, పలుకుబడీ వున్న కుటుంబాల నుంచో, రాజకీయ నాయకుల కుటుంబాలనుంచో రాలేదని వాదించే వారున్నారు. అందులో అవాస్తవం లేకపోవచ్చు. కానీ దళితులు ఎందుకు రాలేకపోయారన్న ప్రశ్నకు జవాబులేదు. దక్షిణాఫ్రికా జాత్యహంకారంతో తన టీంలో శ్వేతజాతీయులకే చోటిస్తున్న దని నిర్ధారణయ్యాక ఆ దేశాన్ని ఐసీసీ 1970లో సస్పెండ్ చేసింది. ఇందువల్ల పొలాక్, రాబిన్ స్మిత్, టోనీ గ్రెగ్ వంటి మంచి ఆటగాళ్లు వేరే దేశాల టీంలకు వలస పోవలసివచ్చింది. 90వ దశకంలో దక్షిణాఫ్రికాలో జాత్యహంకార ప్రభుత్వం అంతరించినప్పటినుంచీ నల్లజాతీయులు కూడా ఆ టీంలో ఆడగలుగుతున్నారు. ఇప్పుడు కనేరియా ఉదంతంలో పాక్‌పై నాలుగు రాళ్లేయడం మాటెలా వున్నా మన క్రికెట్‌కు, ఇతర క్రీడలకు అలాంటి మచ్చ రాకుండా ఏం చేయగలమో చూడవలసిన అవసరం వుంది. -
లింగ సున్నితత్వ విద్య అవసరం
బాలికలపై, మహిళలపై మగవారు అత్యాచారాలు, దురాగతాలకు ఎందుకు పాల్పడతారు? వారికి ‘అలా ప్రవర్తించకూడదు’ అని బాల్యంలో బలంగా మనసులో నాటుకోవడంలేదు. దానికి భిన్నమైన భావనలు నాటుతున్నారు. దీనికి దీర్ఘకాలిక పరిష్కారం చూడాలి. అది బడి లోనే సాధ్యం. విద్యా కాలం దాటేలోపుగానే వారిలో లింగ సున్నితత్వం ఏర్పరచాలి. ఇందుకు ఒక చిన్న పుస్తకం కావాలి. ప్రాథమిక తరగతులకు ఇరవై పేజీలు ఉంటే సరిపోతుంది. ఆరో తరగతి నుంచీ అటూఇటుగా ముప్పై, నలభై పేజీలు చాలు. ఈ పుస్తకాన్ని మొదటి సబ్జెక్టుగా పెట్టాలి. అన్ని పరీక్షలకన్నా ముందు ఒక ఇరవై మార్కులకి ఈ పరీక్ష జరగాలి. ఈ పరీక్ష ఉత్తీర్ణత ప్రధానమైనదిగా కాక, భాగస్వామ్య ప్రధానంగా సాగాలి. పుస్తకంలో పేజీలు ఒకటి బాలుర కోసం, పక్కనే ఇంకొకటి బాలికల కోసం వుండాలి. అంటే, ఒక పేజీ సమాజంలో ఎదిగే బాలుడిని లక్ష్యంగా చేసుకుని తయారు చేయాలి, ఒక పేజీ బాలికల గురించి. ఉదాహరణకి, ఆరో తరగతిలో ఒక పేజీలో, ‘ఒసే, ఏమే, అది, ఇది అని నీ తరగతిలో బాలికలను పిలవకూడదు. వారి పేర్లతోనే వారిని పిల వాలి’ అని రెండు వాక్యాలు ఇవ్వాలి. దాని గురించి చిన్న చర్చ. ‘అది’ ‘ఇది’ అని తరగతిలో వేటిని పిలుస్తాము? బాలికలకీ ఆ వస్తువులకీ తేడాలు ఏమిటి? బాలిక వస్తువు కాదు, ఒక మనిషి అని చెప్పాలి. అక్కడే ఒక బొమ్మ, వస్తువులకీ; ప్రాణం, అనుభూతులు గల బాలికకూ తేడా చూపేవిధంగా పెట్టాలి. పేజీ చివర, చిన్న ఖాళీ పంక్తులలో, వారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులు ఎవరు? పై సంబోధనలు చేసేది ఎవరిని? ఎందుకు? ఈ అలవాటు ఎందుకు మానెయ్యాలి? అని స్పందన పత్రం రాయాలి. ఇలాగే, ఎనిమిదో తరగతి పిల్లవాడికి, ‘మగ పిల్లలకి మీసాలు రావడం సహజం. వాటిని మెలి తిప్పడంలో ఏవిధమైన ప్రత్యేకతా లేదు. అలాగే, తొడ కొట్టడం వల్ల కొత్త బలం రాదు. బల ప్రదర్శనా పోటీలో కూడా, విజేత హుందాగా గెలవాలి. పురుషత్వం ఒక సహజమైన అంశం. అది గొప్పా కాదు, తక్కువా కాదు’ అని రాయాలి. ఇంకా, నీ చెల్లీ/అక్కా, నువ్వూ ఒక్కసారే భోజనం చేస్తు న్నారా? మీ అమ్మా నాన్నా ఒకే విధంగా ఆహారం తీసుకుంటున్నారా? ముందు ఎవరు తింటున్నారు? ఎందుకు? ఎలా వుంటే బావుంటుంది? అని ప్రశ్నించవచ్చు. అదే పుస్తకంలో బాలికలకు కూడా వాళ్లకి నేర్పవలసిన సంగతులు వుండాలి. ఉదాహరణకు ఒరే, పోరోయ్ అని కాకుండా బాలురని పేరుతో పిలవాలి. ఇంటి విషయాల్లో బాలికలు అన్ని రకాలుగా సమాన భాగస్వాములు. తల్లి, తండ్రి, రోజంతా పని చేసిన తరువాత; పిల్లలు బడి సమయం పూర్తి అయిన తరువాత, విశ్రాంతి కోసం చేరే స్థలాన్ని ‘ఇల్లు’ అంటాము. మీ ఇల్లు మీ కుటుంబం మొత్తానిది. దాని బాధ్యతలు కూడా అందరివీ. ఒక పేజీలో వంట ఇంట్లో పని చేస్తున్న మొత్తం కుటుంబ సభ్యుల చక్కని పెయింటింగ్/ఫొటో ప్రచురించాలి. ఇల్లు భవిష్యత్తులో నేను ‘పూర్తి’ సమయం ఉండవలసిన స్థలం అనే భావన నుంచి బాలికలు బైటికి రావాలి. బాలురు కూడా, ఇల్లు స్త్రీకి చెందినది అనే భావన నుంచి బైటికి రావాలి. ఇలా ఒక పుస్తకం చేసి, దాన్నొక వేడుకగా పిల్లలకి ఇద్దాం. పెద్ద ఖర్చు కూడా కాదు. వచ్చే విద్యా సంవత్సరంనుంచీ ప్రభుత్వం విద్యా రంగంలో మార్పులు తేబోతోంది కాబట్టి, లింగ సున్నితత్వం విద్యా ప్రణాళికలో చేర్చడానికి ఇదే సరైన సమయం. ఈ పుస్తకాన్ని పిల్లలకు వారి వారి సొంత భాషలోనే అందించాలి. ఇక్కడ నేను వ్యక్తీకరించినవి ప్రాథ మిక భావనలు. వీటిని మరింత మెరుగు చేసుకుని ఒక చక్కని సమాజాన్ని నిర్మించుకోవడానికి పిల్లలకోసం కొన్ని రంగు బొమ్మల పేజీలు ముద్రించగలం కదా. ఎమ్మెస్కే. కృష్ణ జ్యోతి వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్ మొబైల్: 91107 28070 -
ఈ అసమానతలు ఇంకా ఎన్నాళ్లు?
భారతదేశం నానాటికీ ఆర్ధికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా దిగజారడానికి కారణం అవిద్య, అరాచకత్వం, మతతత్వం, స్త్రీ అణచివేత, కులతత్వం, అస్పృశ్యతాచరణ కొనసాగడమే. మోదీ మాటల్లో అంకెలు కనబడుతున్నంత పెద్దగా అభివృద్ధి లేదు. విపరీతమైన ముస్లిం ద్వేషం, అస్పృశ్యుల మీద తీవ్రమైన దాడులు, రాజ్యాంగ నిరసన, ప్రజాస్వామ్య లౌకికవాద భావజాలానికి గొడ్డలి పెట్టుగా మారాయి. భారతదేశంలో మానవ వనరులకు, ప్రకృతి వనరులకు, వ్యవసాయ భూములకు, విద్యావేత్తలకు, విద్యార్జనాపరులకు కొదవలేదు. వృత్తికారులు, దళితులు, ఆదివాసీయులు, ముస్లింలు, ఉత్పత్తి కారకులు వీరిని కులమత భావాలతో నిర్లక్ష్యం చేయడం వల్ల రాను రాను నిరాశా నిస్పృహలు కలుగుతున్నాయి. అలా కలిగించడమే ప్రభుత్వ ధ్యేయంగా మనకు కనిపిస్తుంది. ఆది భారతీయులైన ఆదివాసులు భారతదేశ ఉత్పత్తి రంగానికి పట్టుగొమ్మలు. అయితే భారత ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవన వ్యవస్థల మీద గొడ్డలి వేటు వేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో మల్టీనేషనల్ కంపెనీలకు ఆదివాసీలు తరాలుగా చేసుకుంటున్న భూములను, ఆవాసాలను ధారాదత్తం చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్లు భారతదేశానికి రాకపూర్వం ఆదివాసీలు స్వతంత్రులుగా ఉండే వారు. వారి భూములను, ఆవాసాలను బ్రిటిష్ వాళ్ళు ఆ తరువాత నల్లదొరలు కొల్లగొట్టడం ప్రారంభించారు. కొండలను, నదులను రక్షించే సంస్కృతి వారిది. కొండలను తవ్వి పడేసి, నదులను కల్మషం చేసే సంస్కృతి పాలక సంస్కృతి, ఈనాడు గంగా, యమునా నదులన్నీ కల్మషమైపోయి వున్నాయి. డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ ప్రధానంగా రాజ్యాంగ నిర్మాణ సభ్యుడయిన జైపాల్ సింగ్ ముండా కృషివలన ఆదివాసుల హక్కులు, వాటి రక్షణకు సంబంధించిన నిబంధనలన్నింటిని రాజ్యాంగంలోని 5వ షెడ్యూలులో చేర్చి, కట్టుదిట్టం చేశారు. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికీ 1965–66 వరకు భారత పాలక వర్గాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోగా, ఆదివాసుల పట్ల బాధ్యతా రాహిత్యాన్ని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. పర్యావరణ పరిరక్షణలో అద్వితీయమైన కార్యాచరణ రూపొందించిన ఆది వాసుల్ని మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత మరిం తగా అణగదొక్కడమే గాక వారిని హిందుత్వీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం భారతదేశంలో ఉపాధి కూలీలుగా వున్న దళితులకు భూమి హక్కు ఇవ్వడం లేదు. మోదీ ప్రభుత్వంలో దళితులకు ఒక్క ఎకరం భూమి కూడా పంచకపోగా, లక్షలాది ఎకరాల దళితుల భూమిని భూస్వాములు, పారిశ్రామిక వేత్తలు కొల్లగొట్టారు. ఇకపోతే అన్ని విశ్వవిద్యాలయాల్లో దళిత, ఆదివాసీ, ముస్లిం విద్యార్థుల మీద తీవ్రమైన దమనకాండ జరుగుతుంది. భావజాల పరంగా, భౌతి కంగా విశ్వహిందూ పరిషత్ వారు దళిత విద్యార్థులను హింసిస్తున్నారు. దళితుల హక్కుల్ని కాలరాసే క్రమంలో హిందువులు కాని వారు భారతీయులు కాదని రెచ్చగొట్టి అగ్రవర్ణ విద్యార్థుల్లో హింసా ప్రవృత్తిని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల దళిత విద్యార్థులు సివిల్స్ రాత పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించినా వారిని ఇంటర్వూ్యల్లో తప్పించే అగ్రవర్ణ ప్యానల్స్‌ని రూపొందిస్తున్నారు. దళిత విద్యార్థులను ఇంటర్వూ్యల్లో తప్పించి, మీరు అత్యున్నత అధికార పదవులకు పనికి రారు అనే మనుస్మృతి సూత్రాలను ఆచరణలో పెడుతున్నారు. ఈ విషయాన్ని అఖిల భారతీయ దళిత్ అండ్ ముస్లిం ఫ్రంట్ యు.పి.యస్.సి. అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. అత్యధిక మార్కులు సంపాదించిన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం విద్యార్థులను కుల ద్వేషంతో వర్ణ ద్వేషంతో ఎలా తప్పించిందో ఆ వివరాలన్నీ సమాజం ముందుకు తెచ్చింది. భారత్‌లో ప్రజలందరిని, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక విద్యారంగాల్లో సమపాళ్ళతో చూడవలసిన అవసరం వుంది. ఉత్పత్తి శక్తులపైన బహుజనులను నిర్లక్ష్యం చేయడం వలన దేశం అభివృద్ధి చెందదు. నిన్నటి వరకు సుజనా చౌదరి, రమేష్‌ల మీద సీబీఐ దాడులు నిర్వహించి, ఈ రోజున వారిని బీజేపీలోకి తీసుకోవడంతో బీజేపీ అవినీతి రాజకీయాలకు పతాకలెత్తుతున్నట్టు అర్థం అవుతోంది. అవినీతి కులాధిపత్య కోణంలో ఫిరాయింపుల ప్రోత్సాహంలో కూరుకుపోయిన చంద్రబాబు పరిస్ధితి ఈనాడు ఏమైందో.. అదే రేపు అవినీతి దళిత వ్యతిరేక పాలక వర్గాలకు గుణపాఠం అవుతుంది. నిరక్షరాస్యత దళితుల్లో నేటికీ 70% ఉంది. అనేక గ్రామాల్లో వారిని నీళ్లకోసం చెరువుల్లోకి రానివ్వడం లేదు. దళితులపై అత్యాచారాలు ముమ్మరం అవుతున్నాయి. లౌకిక, సామాజిక శక్తులన్నీ ఏకమై తమ హక్కుల కోసం దేశ ఆర్థిక అభివృద్ధి కోసం పోరాడాల్సిన సందర్భమిది. అప్పుడే అంబేడ్కర్ ఆశయాలు నెరవేరతాయి. వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మొబైల్ : 98497 41695 డా: కత్తి పద్మారావు -
బిల్లుల చెల్లింపుల్లో ఏమిటీ వివక్ష?
సాక్షి, అమరావతి:వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన బిల్లుల చెల్లింపుల్లో వివక్ష చూపడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆర్థిక శాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. బిల్లుల చెల్లింపుల్లో పక్షపాతంతో వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కేటాయింపులు లేని అంశాలకు బిల్లులు చెల్లిస్తూ కేటాయింపులున్న రంగాలకు నిలిపివేయడంపై ప్రశ్నించారు. చివరి మూడు నెలలు ఇష్టారాజ్యం.. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఓట్ల పథకాలు / కమీషన్లు వచ్చే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లకు మాత్రమే ఆర్థిక శాఖ బిల్లులు చెల్లించడాన్ని ‘సాక్షి’ గతంలోనే వెలుగులోకి తేవడం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన విధంగా కాంట్రాక్టులు, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడ్డ బిల్లులు మాత్రమే చెల్లిస్తూ మిగతావాటిని ఆర్థిక శాఖ నిలిపివేస్తోంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు సకాలంలో బిల్లులు సమర్పించలేదంటూ రెగ్యులర్ ఉద్యోగుల వేతనాలను సైతం నిలుపుదల చేసింది. ఉద్యోగ సంఘాలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వేతనాలు నిలిపివేయడంపై వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సీఎస్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక ఏడాది ముగిసే చివరి మూడు నెలలు అంటే జనవరి నుంచి మార్చి వరకు ఇష్టానుసారంగా బిల్లుల చెల్లింపులు జరిగాయని, ప్రాధాన్య అంశాలను విస్మరించారని సీఎస్ తప్పుబట్టారు. రాష్ట్రం వాటా విడుదల చేయకపోవడంతో భారీ నష్టం ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా ఇతర రంగాలకు నిధులు మళ్లించడంపై ఆర్థిక శాఖ అధికారులను సీఎస్ నిలదీశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు విడుదలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో భారీగా నిధులు కోల్పోవాల్సి వచ్చిందని, ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారంటూ సీఎస్ ఆర్థిక శాఖ అధికారులను నిలదీశారు. తాత్కాలిక ప్రాతిపదికన బిల్లులు చెల్లించడంతోపాటు పక్షపాతంతో చెల్లింపులు జరపడంపై ఆర్థికశాఖను సీఎస్ వివరణ కోరారు. తప్పనిసరిగా చెల్లించాల్సిన బిల్లులను కూడా నిలుపుదల చేయడం అంటే పరిస్థితిని ఎంత దిగజార్చారో అర్థం అవుతోందా? అని సీఎస్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాజకీయాలతో సంబంధం లేకుండా నిబంధనల మేరకు ప్రాధాన్యత ప్రకారం బిల్లులు చెల్లించే ఆనవాయితీకి ఎందుకు తిలోదకాలు ఇవ్వాల్సి వచ్చిందని ఆర్థిక శాఖ అధికారులను సీఎస్ ప్రశ్నించారు. ఉద్యోగుల వేతనాలకు ఎసరు ఓట్ల పథకాలు, కమీషన్లు వచ్చే బిల్లులు చెల్లించడం కోసం వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వ్యక్తిగత ఖాతాల్లోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంది. ఫలితంగా రెండు నెలలుగా అందులో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌లో ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన బిల్లులు పాసైనప్పటికీ చెల్లింపులు జరగకుండా నిలిచిపోయినవి రూ.11,108.61 కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఇందులో వేతనాలతోపాటు కార్పొరేషన్లు, ఇతర ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన బిల్లులున్నాయి. చెల్లింపుల్లో తేడాకు కారణాలేంటి? బిల్లుల చెల్లింపులో వ్యత్యాసాలకు కారణాలను రికార్డు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. చట్టబద్ధంగా చేయాల్సిన చెల్లింపులకు, జీఎస్టీ, ఆదాయపు పన్ను, జ్యుడీషియరీ డిపాజిట్, టీఆర్ఆర్–27, రుణాల రీ పేమెంట్స్, వడ్డీల రీ పేమెంట్స్, వేతనాలు, పెన్షన్లు, అంతర్ ప్రభుత్వం అండ్ ఏజీ పేమెంట్స్, సీపీఎస్, స్థానిక సంస్థల నిధులు, డైట్ చార్జీలు, రేషన్, మెడిసిన్, మెడికల్ చికిత్సల బిల్లులు, మంచినీరు, ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రాధాన్య క్రమంలో చెల్లించాలని సీఎస్ పేర్కొన్నారు. పనుల బిల్లులను క్షుణ్నంగా అధ్యయనం చేసిన తరువాతే విడుదల చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపుల జరిగితే వాటిని నమోదు చేయడంతో పాటు ఆడిట్ నిర్వహించాలని సూచించారు. తొలుత వేతనాలకు చెందిన బిల్లులన్నింటినీ చెల్లించాలని సీఎస్ ఆదేశించారు. -
శ్రమలోనేనా సమానత్వం?
చేనేత వస్త్రాల తయారీలో పురుషులతో సమానంగా శ్రమిస్తున్న మహిళలకు సమానమైన వేతనం లభించకపోగా, ఆర్థికంగా ఇక్కట్లపాలైన కొన్ని చేనేత కుటుంబాలను మహిళలే నడిపించవలసి వస్తోంది! ప్రభుత్వం చొరవ తీసుకుని చేయూతనిస్తే తప్ప మహిళా చేనేత కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవం, తగిన విలువ లభించని పరిస్థితి నెలకొని ఉంది. పడుగు పేకల మేలు కలయికతో అందమైన, ఆకర్షణీయమైన వస్త్రాలు రూపుదిద్దుకుంటాయి. అలాగే స్త్రీ, పురుషులు ఇద్దరు ప్రత్యేకశ్రద్ధతో చేనేత రంగంలో తమ శక్తియుక్తులను, వృత్తినైపుణ్యాన్ని మేళవించి అపురూప కళాఖండాలతో వస్త్రాలను తయారు చేస్తారు. అయితే ఇద్దరి శ్రమ సమానమే అయినప్పటికీ మహిళా కళాకారులకు మాత్రం సరైన గుర్తింపు, వేతనాలు లభించడం లేదు. అన్నిరంగాల్లో మాదిరిగానే చేనేత రంగంలో కూడా మహిళలు వివక్షకు గురవుతున్నారు. చేనేత వస్త్రాల తయారీలో 60 శాతం పనులలో స్త్రీల భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుంది. ఆ స్థాయిలో వారికి గుర్తింపు రావడం లేదు. వేతనాల్లో కూడా వివక్ష కొనసాగుతోంది. కుటీర పరిశ్రమగా ఈ రోజు చేనేత నిలదొక్కుకుందంటే దాంట్లో మహిళల పాత్రే అధికం. కూలీ గిట్టుబాటు కాక బతుకుదెరువు కోసం మగవారు ఇతర ప్రాంతాలకు వలసపోతే ఇంటి వద్ద ఉండి కుటీర పరిశ్రమను నిలబెట్టుకున్న ఘనత మహిళలదే. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేతలు పేర్గాంచినవి కాగా.. ఈ ప్రాంతాలకు అనుబంధంగా పలు గ్రామాల్లో చేనేత కార్మికులు.. ప్రధానంగా మహిళా కార్మికులు ఆ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎనభై ఏళ్ల వృద్ధమహిళలు సైతం జీవనాధారం కోసం రోజువారి కూలీ రూ.100 గిట్టుబాటు కాకున్నా పొట్టకూటి కోసం శ్రమిస్తున్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లకు తాళలేక భర్త ఆత్మహత్యలు చేసుకుంటే మహిళలే వృత్తిపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. తమ పిల్లల భవిష్యత్‌ను భుజాన వేసుకుని కుటుంబ బాధ్యతను మోస్తూ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ఒక్క పోచంపల్లిలోనే చేనేత మగ్గాలు వేసే వారి సంఖ్య 225 వరకు ఉంటుంది. ఇక్కడ సుమారు వెయ్యికి పైగా చేనేత మగ్గాలు ఉన్నాయి. చేనేత వృత్తిలో చీరలు, ఇతర రకాల వస్త్రాలను తయారు చేయడం కోసం మగ్గం నేయడం, అచ్చులు అతకడం, చిటికీలు కట్టడం, ఆసులు పోయడం, కండెలు చుట్టడం, సరిచేయడం, రంగులు అద్దడం, రబ్బర్లు చుట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిపనుల్లో మహిళల భాగస్వామ్యం ఉంది. సంప్రదాయంగా వస్తున్న చేనేత వృత్తిలో భర్తకు తోడుగా భార్య కచ్చితంగా తన సహకారాన్ని అందిస్తుంది. అయితే మహిళలకు రావాల్సినంత గుర్తింపు, వేతనాలు అందడం లేదు. సహకార సంఘాల్లో సభ్యత్వాలు, గుర్తింపు కార్డులు అందరికీ ఇవ్వడం లేదు. అందుకే మహిళల భాగస్వామ్యంతో కొనసాగుతున్న ఈ పరిశ్రమలో మహిళలకు మరింత ఆర్థిక చేయూతనివ్వడానికి ప్రభుత్వం మహిళా సొసైటీలను ఏర్పాటు చేయాలని చేనేత కళాకారులు కోరుతున్నారు. అలాగే మహిళలకు వృత్తిపరమైన ప్రత్యేక శిక్షణను ఇస్తూ స్వయంకృషితో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మగ్గమే జీవనాధారం భూదాన్ పోచంపల్లి మండలం భద్రావతి కాలనీకి చెందిన చేనేత కార్మికురాలు బత్తుల అనితకు మగ్గమే జీవనాధారం అయింది. నిరుపేద చేనేత కుటుంబమైన బత్తుల అంబరుషి, అనిత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అనిత భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం, పిల్లల చదువులు అనితపై పడ్డాయి. అ«దైర్యపడకుండా తనకు తెలిసిన వృత్తి.. మగ్గాన్ని నమ్ముకుంది. కూలీ మగ్గం నేయగా వచ్చిన ఆదాయంతో పిల్లలను చదివిస్తోంది. ప్రస్తుతం కుమారుడు శివ డిగ్రీ చదువుతుండగా, కుమార్తె పాలిటెక్నిక్ చేస్తోంది. అనిత రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. నెల రోజులు కష్టపడి చీరెలు నేస్తే రూ.10వేలు ఆదాయం వస్తుంది. కిరాయి ఇంట్లో ఉంటుంది. రెండు రోజులకు నాలుగొందలు బాల్యం నుంచి చేనేత వృత్తి తెలుసు. మగ్గం నేస్తూ, చిటికీ కట్టడం, ఆసుపోయడం లాంటి పనులు చేస్తాను. ప్రస్తుతం కూలీకి అచ్చు అతుకుతున్నాను. ఒక అచ్చు అతకడానికి రెండు రోజులు సమయం పడుతుంది. దీనికి రూ. 400 కూలీ లభిస్తుంది. ఇలా నెలలో రూ. 4వేల వరకు సంపాదిస్తాను. నా భర్త కూడా చేతకాక, చేతనై కూలీకి మగ్గం నేస్తున్నాడు. ఒకరికొకరం చేదోడువాదోడుగా పని చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నాం. – రాపోలు ప్రమీల, పోచంపల్లి వృద్ధాప్యంలోనూ తప్పని పని భర్త, కుమారుడు, ఇద్దరు వివాహిత కుమార్తెలు ఇదీ మా కుటుంబం. అయితే చేతికంది వచ్చిన కుమారుడు తొమ్మిదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో నా భర్త కూలీ మగ్గం నేస్తున్నాడు. నేను కూడా మాస్టర్ వీవర్ వద్ద రోజువారీ కూలీగా చిటికీలు కడుతున్నాను. నెలంతా పనిచేస్తే రూ. 6 వేల వరకు ఆదాయం వస్తుంది. ఈ వృద్దాప్యంలో కూడా ఇద్దరం పనిచేసుకుంటూనే జీవనాన్ని సాగిస్తున్నాం. – చిందం భద్రమ్మ, భూదాన్ పోచంపల్లి – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
రజకుల్ని బాదిపడేస్తున్న బాబు
తెలుగుదేశం పార్టీకి 35 ఏళ్ళుగా ఓట్లేస్తున్న రజకుల్ని ఆర్థికంగా, సామాజి కంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళడానికి కనీస ప్రయత్నం చేయని చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి రజకులు వందేళ్ళు వెనక్కిపోయారు. బాబు పాలనలో రజకుల స్థితి కార్పొరేట్ సంస్థల దగ్గర బట్టలుతికే కూలీల స్థాయికి పడిపోయింది. ఎన్టీఆర్ ప్రభుత్వం 1985లో రజకుల్ని ఎస్సీ జాబి తాలో చేర్చాలని కేంద్రానికి ఇచ్చిన సిఫారసుకు కృతజ్ఞతగా రజకులు టీడీపీకి ఓటు బ్యాంకయ్యారు. 1995లో జరిగిన వెన్నుపోటు కుట్ర ద్వారా బాబు సీఎం అయ్యాక రజకులు అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురయ్యారు. దేశమంతా బట్టలుతికేది రజకులైతే, తిరుమల తిరుపతి దేవస్థానంలో బట్టలు ఉతికేది బాబు బంధువులు. టీటీడీలో బట్టలుతికే కాంట్రాక్టును తన బంధువుల ఏజెన్సీకి కట్టబెట్టి, బాబు రజకుల నోట్లో మట్టి కొట్టారు. 35 ఏళ్ళుగా ఓట్లేస్తున్న రజకులపట్ల అభిమానం గానీ, కృతజ్ఞతగానీ, ఎస్సీ ఇన్‌క్లూజన్ హామీ అమలు చెయ్యాలన్న సంకల్పం గానీ బాబుకు లేదు. మెజారిటీ రజకులు తన ప్రత్యర్థి పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నా వైఎస్సార్ ఏనాడూ రజకుల పట్ల వివక్ష చూపలేదు. వైఎస్సార్ రజక సామాజిక వర్గానికి చెందిన బసవరాజు సారయ్య, పాండు, రాజారత్నంలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. 2004 ఎన్నికల్లో వైఎస్సార్ రజకులకు ఎస్టీ ఇన్‌క్లూజన్ హామీ ఇచ్చి, సీఎం అయ్యాక కేంద్రానికి సిఫారసు కూడా చేశారు. వైఎస్ మరణం రజకుల ఎస్టీ రిజర్వేషన్ మీద తీవ్ర ప్రభావం చూపింది. వైఎస్సార్‌లానే వైఎస్ జగన్ కూడా రజకులకు ప్రాధాన్యత ఇచ్చారు. 2019లో అధికారంలోకి వస్తే రజకులకు ఎమ్మెల్సీ ఇస్తామని, ఎస్సీ జాబితాలో చేరుస్తామని, ఇనాం/ మాన్యం భూముల్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పని వైఎస్ జగన్ పక్షాన ఉండాల్నో, రజకుల్ని నమ్మించి మోసం చేసిన బాబు పక్షాన నిలవాల్నో.. తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. దేశం శాస్త్ర, సాంకేతిక పరంగా పరుగెడుతుంటే, చాకలోళ్ళు కాబట్టి చాకిరేవులోనే ఉండాలన్న ఫ్యూడల్ తత్వంతో రజక బిడ్డలకు ఇస్త్రీ పెట్టెలు ఇచ్చిన బాబు పాలన కావాల్నో, ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చి రజక బిడ్డల్ని ఇంజనీర్లని, ఉన్నత విద్యావంతుల్ని చేసిన రాజన్న రాజ్యం రావాల్నో తేల్చుకోవాల్సిందీ, తమ బిడ్డల తలరాతలు రాసుకోవాల్సిందీ రజకులే. -పొటికలపూడి జయరాం, రాష్ట్ర అధ్యక్షులు, రజక రిజర్వేషన్ పోరాట సమితి మొబైల్ : 85000 16809 -
శ్రీ సౌమ్యరామ
ఎంత కోపం వచ్చినప్పటికీ, రాముడు విచక్షణ కోల్పోయిన సందర్భాలు లేవు. తనను అరణ్యవాసం చేయమన్న కైకను ఎందరు ఎన్ని విధాల దూషించినప్పటికీ, తాను మాత్రం తూలనాడలేదు రాముడు. దశరథుడు, కౌసల్య, లక్ష్మణుడు, అయోధ్యాపురవాసులు ఆఖరికి కన్నకొడుకయిన భరతుడు కూడా కైకను నిందిస్తారు. అయినా రాముడు వారందరినీ వారిస్తూ ‘‘ఇప్పటివరకూ కైక నన్ను కన్నకొడుకు కన్నా ఎక్కువగా ఆదరించింది. ఇప్పుడు మాత్రమే ఆమె ఇలా ప్రవర్తిస్తోందంటే దైవ నిర్ణయమే తప్ప వేరు కాదు. దశరథుడు కూడా ధర్మానికి, ఇక్ష్వాకువంశ రాజుల సత్యనిష్ఠకు కట్టుబడి కైక కోరికలకు తలవంచాడే తప్ప, వాంఛకు వశుడై కాదు. తల్లిదండ్రుల మాటను గౌరవించాల్సిన ధర్మం నా మీద ఉంది కాబట్టి తనకు పెద్దకొడుకుగా రాజ్యాధికారం ఉన్నా, అరణ్యవాసమే మిన్న’’ అని అడవులకు వెళ్లాడు. భరతుడు రాముని అయోధ్యకు తీసుకురావడానికి తన మాతలతో, వశిష్టాది గురువులతో, పెద్ద సైన్యంతో అడవికి వస్తున్నప్పుడు, లక్ష్మణుడు అనుమానించి, కోపోద్రిక్తుడై భరతుడి మీద యుద్ధానికి సిద్ధపడినప్పుడు, రాముడు భరతుని పట్ల కోపం తెచ్చుకోకుండా అతని నిజాయితీని సరిగ్గా అంచనా వేశాడు. అధర్మం ఎవరు చెప్పినా రామునికి కోపం వస్తుంది. ‘తండ్రి అయినా సరే, చనిపోయిన దశరథుని మాట మన్నించనక్కరలేదు’ అని జాబాలి అనే పురోహితుడు చెప్పినప్పుడు, రామునికి కోపం వచ్చింది. కానీ తొందరపడకుండా శాంతవాక్యాలతోనే జాబాలిని ఖండించాడు.ఇక సుగ్రీవుడు తనకు రాముడిచ్చిన గడువు పూర్తయినప్పటికీ, భోగాలలో మునిగి తేలుతూ, సీతాన్వేషణ ఇంకా మొదలుపెట్టక పోవడంతో రామునికి కోపం వస్తుంది. కానీ దానిని అణచుకుంటాడు. ‘‘మిత్రుడు కాబట్టి మెల్లగా చెప్దాము, ఒక అవకాశం ఇద్దాము. అయినా వినకపోతుంటే అప్పుడు ‘వాలి వెళ్లిన దారిలోనే నిన్నూ పంపిస్తాము’ అని’’ చెప్పి రమ్మని లక్ష్మణుని పంపిస్తాడు. అదే వాలి విషయానికి వచ్చేసరికి అతడు అధర్మాన్నే అనుసరించాడు కాబట్టి హెచ్చరికలు లేకుండా శిక్షిస్తాడు. ఇక్కడ సుగ్రీవునిది కర్తవ్య నిర్వహణా లోపం, వాలిది అధర్మం. కర్తవ్య నిర్వహణలో పొరపాటు సహించవచ్చు కాని, అధర్మాన్ని మాత్రం సహించకూడదని రాముడు తన చేతల ద్వారా చెప్పాడు. పై మూడు సంఘటనలలో రాముడు ఎవరిమీద కోపం తెచ్చుకోకూడదో, కోపం వచ్చినా దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో చెప్తున్నాడు. మనం శ్రీరామచంద్రమూర్తి నుండి నేర్చుకోవలసినది అదే. – డి.వి.ఆర్. -
నీతులకూ చేతలకూ పొంతన లేని వ్యవస్థ మనది
మనది వేదభూమి, మనది పుణ్యభూమి అని గొప్పలు చెప్పుకుంటూ గర్విస్తుంటాం. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అంటూ సూక్తిముకావళిని వల్లిస్తూ నిశ్చింతగా బతికేస్తుంటాం. ‘ఆకాశంలో సగం’ అంటూ అతివలను ఆకాశానికెత్తేస్తుంటాం. ఇలాంటి మాటలన్నీ వినడానికి సంగీతం కంటే శ్రావ్యంగా చాలా బాగుంటాయి. ఇవన్నీ నిజాలనుకుంటే మాత్రం అంతకంటే అమాయకత్వం ఉండదు. నీతులకూ చేతలకూ ఏమాత్రం పొంతన లేని వ్యవస్థ మనది. అంతర్జాతీయ సర్వేలలో మహిళలకు రక్షణ కరువైన దేశాల్లో మన పవిత్ర భారతదేశం అగ్రస్థానంలో నిలవడమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. ఆరేళ్ల కిందట దేశ రాజధానిలో ‘నిర్భయ’ సంఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఊరూరా కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. నిరసనల వేడికి ప్రభుత్వంలోనూ కొంత చలనం వచ్చింది. ఫలితంగా ‘నిర్భయ’ చట్టం అమలులోకి వచ్చింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి కనిష్టంగా ఇరవయ్యేళ్ల కఠిన కారాగార శిక్ష మొదలుకొని గరిష్టంగా యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్ష వరకు విధించేలా చట్టాన్ని కఠినతరం చేశారు. శిక్షలను కఠినతరం చేస్తే నేరాలు తగ్గుముఖం పడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం చట్టాలకు పదును పెట్టినా, మన దేశంలో మహిళల పట్ల నేరాలు ఏమాత్రం తగ్గలేదు సరికదా, నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి. ‘నిర్భయ’ సంఘటనకు ఏడాది ముందు 2011లో ది థామ్సన్ రాయిటర్స్ సంస్థ జరిపిన సర్వేలో మహిళలకు రక్షణ కరువైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉండేది. అఫ్ఘానిస్తాన్, సిరియా, పాకిస్తాన్ ఆ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండేవి. ఇదే సంస్థ ఈ ఏడాది విడుదల చేసిన జాబితా ప్రకారం మహిళలకు రక్షణ కరువైన దేశాల్లో భారత్ మొదటి స్థానానికి ఎగబాకింది. మహిళలపై లైంగిక అత్యాచారాలతో పాటు బాలికలు, మహిళల అక్రమ రవాణాలోనూ భారత్ మొదటిస్థానంలో ఉందని, మహిళలకు భారత్ ఏమాత్రం సురక్షితమైన దేశం కాదని ఈ జాబితా కుండబద్దలు కొట్టింది. చట్టాలకు పదును పెట్టినంత మాత్రాన ఫలితాలు సాధించడం సాధ్యంకాదనే చేదు నిజాన్ని ఈ జాబితా తేటతెల్లం చేస్తోంది. ‘నిర్భయ’ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా మహిళలపై దారుణమైన అఘాయిత్యాలు మరింతగా వెలుగులోకి వస్తున్నాయి. ముక్కుపచ్చలారని పసిపిల్లలు మొదలుకొని జీవిత చరమాంకానికి చేరుకున్న వృద్ధ మహిళలు సైతం దుర్మార్గుల కీచకాలకు బలైపోతున్న ఉదంతాలు నిత్యం వార్తలకెక్కుతూనే ఉన్నాయి. ‘నిర్భయ’ చట్టం తర్వాత... ‘నిర్భయ’ సంఘటన 2012 డిసెంబర్ 16న జరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించిన వివరాల ప్రకారం ఆ ఏడాది దేశవ్యాప్తంగా 24,923 అత్యాచార సంఘటనలు నమోదయ్యాయి. గత ఏడాది ఆఖరులో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2016 నాటి గణాంకాలతో నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2016లో దేశవ్యాప్తంగా 38,947 అత్యాచార సంఘటనలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రతి గంటకు సగటున 106 అత్యాచార సంఘటనలు నమోదవుతున్నాయి. ప్రతి పదిమంది బాధితుల్లో నలుగురు మైనర్ బాలికలే ఉంటున్నారని కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. మొత్తం 38,947 సంఘటనలకు గాను 36,859 సంఘటనల్లో నిందితులు బాధితులకు బంధువులు లేదా బాగా తెలిసిన వారేనని తెలిపింది. ‘నిర్భయ’ సంఘటన జరిగిన ఢిల్లీలో ఆ తర్వాతి నాలుగేళ్ల వ్యవధిలో అత్యాచార సంఘటనలు ఏకంగా 277 శాతం మేరకు పెరిగాయి. ఇతర నేరాలతో పోలిస్తే, అత్యాచార సంఘటనల్లో నిందితులకు శిక్షలు పడుతున్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎన్సీఆర్బీ వెల్లడించిన వివరాల ప్రకారం 2016లో అత్యాచార సంఘటనలకు సంబంధించి ప్రతి నలుగురు నిందితుల్లో ఒకరికి మాత్రమే శిక్ష పడిన సందర్భాలు ఉన్నాయి. ఇతర నేరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే, 2016లో మహిళల పట్ల దేశవ్యాప్తంగా 3,38,594 నేరాలు జరిగాయి. ఎన్సీఆర్బీ వివరాల ప్రకారం... 2012 నుంచి 2016 వరకు అత్యాచార సంఘటనలు ఏడాదికేడాది పెరుగుతూనే వస్తున్నట్లు నమోదైన కేసుల సంఖ్యలే చెబుతున్నాయి. గడచిన రెండేళ్లలోని పరిస్థితులను చూసుకున్నా, మహిళలపై అత్యాచారాలు, హింసాత్మక సంఘటనలు పెరుగుతూనే వస్తున్నట్లుగా మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో జమ్మూ కశ్మీర్‌లోని ఖటువాలో ఎనిమిదేళ్ల బాలికపై ఒక గుడిలో జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ‘నిర్భయ’ సంఘటన తర్వాత దాదాపు అదే స్థాయిలో నిరసనలకు దారి తీసింది. ఈ సంఘటనలో గుడి పూజారి, అతడి కొడుకు, పూజారికి సమీప బంధువైన ఒక మైనర్ బాలుడితో పాటు పోలీసులు కూడా నిందితులుగా ఉన్నారు. గత నెలలో కోల్‌కతాలో వందేళ్లు నిండిన వృద్ధురాలిపై ఒక యువకుడు అత్యాచారానికి తెగబడ్డాడు. దేశంలోని తాజా పరిస్థితులకు ఖటువా, కోల్‌కతాల్లో జరిగిన సంఘటనలు చిన్న నమూనాలు మాత్రమే. ఇలాంటి సంఘటనలు దేశం నలుమూలలా ఎక్కడో ఒక చోట ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు పూర్తి సురక్షితమైన ప్రదేశం అంటూ ఏదీ లేదు. ఇంటా బయటా ప్రతిచోటా మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. బడి, గుడి, కళాశాలలు, కార్యాలయాలు ఏవీ వీటికి మినహాయింపు కావు. మహిళల పట్ల నేరాలకు ఒడిగట్టే వారిలో కొందరు చట్టసభల్లో సైతం కొనసాగుతున్నారు. ‘నేషనల్ ఎలక్షన్ వాచ్’ వెల్లడించిన వివరాల ప్రకారం... దేశవ్యాప్తంగా 1581 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 51 మంది మహిళల పట్ల పాల్పడిన నేరాలకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్నారు. రాజకీయ పార్టీల వారీగా చూసుకుంటే, మహిళల పట్ల నేరాలకు పాల్పడిన వారిలో బీజేపీకి చెందిన చట్టసభ్యులే అత్యధికంగా 14 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో శివసేన–7, తృణమూల్ కాంగ్రెస్–6 ఉన్నాయి. అడుగడుగునా వివక్ష ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని గర్వంగా చెప్పుకుంటాం గానీ, మన ప్రజాస్వామిక స్ఫూర్తి అంతా ఎన్నికల తతంగానికే పరిమితం. జనాభాలో దాదాపు సగం ఉన్న మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న స్పృహ నేటికీ మన చట్టసభల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ కనిపించదు. ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం లేకపోవడం వల్లనే మహిళా రిజర్వేషన్ బిల్లు మూలనపడి, మహిళలకు చట్టసభల్లో సమ ప్రాధాన్యం దక్కకుండాపోయింది. చట్టసభల్లోనే పితృస్వామ్య భావజాలం ఇంత బాహాటంగా రాజ్యమేలుతుంటే ఇక మిగిలిన చోట్ల మహిళలపై వివక్ష ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవాల్సిందే. మన సమాజంలో మహిళల పట్ల గల వివక్షాపూరితమైన ధోరణి కారణంగానే మహిళలపై నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకటి కాలంలో మహిళల పట్ల వివక్ష పుట్టుక నుంచి పోయే వరకు కొనసాగేది. సాంకేతికత పెరిగి, గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ పరీక్షలు జరిపే స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాక ఇంకా పుట్టక మునుపే వారిపై వివక్ష మొదలవుతోంది. కడుపులో ఉన్నది ఆడశిశువని తేలగానే నిర్దాక్షిణ్యంగా భ్రూణహత్యలకు పాల్పడేవారి సంఖ్య మన దేశంలో తక్కువేమీ కాదు. అడ్డూ అదుపూ లేని భ్రూణహత్యల కారణంగానే గడచిన కొన్నేళ్లలో ఆడశిశువుల జననాలు తగ్గుముఖం పట్టాయి. జనాభా లింగ నిష్పత్తిలో వ్యత్యాసం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షపై నిషేధాజ్ఞలు విధించినా, గుట్టు చప్పుడు కాకుండా ఈ పరీక్షలు జరిపే స్కానింగ్ సెంటర్లు యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటూనే ఉన్నాయి. జనాభా లెక్కలను పరిశీలిస్తే దశాబ్దకాలంలోనే లింగనిష్పత్తిలో వచ్చిన మార్పులు కళ్లకు కడతాయి. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 927 మంది స్త్రీలు ఉండగా, 2011 నాటికి ప్రతి 1000 మంది పురుషులకు 914 స్త్రీలు మాత్రమే ఉన్నారు. దక్షిణాదితో పోలిస్తే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరీ దారుణం. 2011 లెక్కల ప్రకారం పంజాబ్‌లో లింగ నిష్పత్తి 1000: 793 కాగా, హర్యానాలో 1000: 820. యథేచ్ఛగా సాగిన భ్రూణహత్యల పర్యవసానమే ఇదంతానని అమర్త్యసేన్ వంటి మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో మగపిల్లాడు పుడితే వరప్రసాదంగా తలచి వేడుకలు చేసుకోవడం, ఆడపిల్ల పుడితే భారంగా తలచి కుంగిపోవడం వంటి ధోరణి వల్లనే మన దేశంలో మహిళలపై వివక్ష కొనసాగుతోందని, ముఖ్యంగా విద్య, ఆరోగ్య అంశాల్లో ఈ వివక్ష దారుణంగా ఉంటోందని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచబ్యాంకు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెండ్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) 2010లో మన దేశంలోని ఆడపిల్లలు, మగపిల్లల కార్యకలాపాలపై ఒక సర్వే నిర్వహించాయి. బడికి వెళ్లే వయసు ఉన్న వారిలో ఆడపిల్లలు రోజుకు సగటున ముప్పావు గంట సేపు ఇంటి పనుల్లో నిమగ్నమై గడుపుతూ ఉంటే, మగ పిల్లలు ఆటపాటల్లో, ఇతర వ్యాపకాల్లో గడుపుతున్నారు. మరికొన్ని దారుణాలు మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు మాత్రమే కాదు, మరిన్ని దారుణాలు కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కులం, మతం, హోదా తలకెక్కించుకున్న తల్లిదండ్రులు పిల్లల పాలిట కాలయముళ్లలా మారుతున్నారు. ఇతర కులం లేదా ఇతర మతానికి చెందిన వారిని తమ పిల్లలు ప్రేమించినట్లు తెలిసినా, ఒకవేళ వారు పారిపోయి పెళ్లిళ్లు చేసుకున్నా తల్లిదండ్రులు పరువు హత్యలకు తెగిస్తున్నారు. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అగ్రకులానికి చెందిన అమృతను ప్రేమించి పెళ్లాడటమే అతడి నేరమైంది. వారి పెళ్లిని సహించలేని అమృత తండ్రి మారుతీరావు పథకం ప్రకారం ప్రణయ్‌ని దారుణంగా చంపించాడు. ఇదివరకు ఇలాంటి పరువు హత్యలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా జరిగేవి. అక్కడ ఇప్పటికీ అలాంటి పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, కొద్ది సంవత్సరాలుగా పరువు హత్యల సంస్కృతి దక్షిణాది రాష్ట్రాలకూ పాకింది. పరువు హత్యల సంస్కృతి భారత్‌లోనే కాకుండా, పశ్చిమాసియా, దక్షిణాసియా దేశాల్లోనూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 20 వేల మంది మహిళలు పరువు హత్యలకు బలవుతున్నారని బీబీసీ ఒక కథనంలో వెల్లడించింది. ప్రేమ పేరిట అమ్మాయిలను వేధించే పోకిరీలు, తమను తిరస్కరించిన అమ్మాయిలపై యాసిడ్ దాడులకు పాల్పడటం వంటి ఘాతుకాలు జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలను చట్టం నిషేధించినా, ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాల పాలనపడిన బాలికలు ఎక్కువగా గృహహింసకు గురవుతున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంతేకాదు, మైనారిటీ తీరకుండానే గర్భం దాల్చడం వల్ల అకాలమరణాల పాలవుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టేందుకు 1929లో చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. తర్వాత 2006లో ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తూ బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. తాజా లెక్కలను చూసుకుంటే, 2011 జనాభా లెక్కల ప్రకారం దశాబ్ది వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.7 శాతం మంది బాలికలకు పద్దెనిమిదేళ్లు నిండకుండానే పెళ్లిళ్లు జరిగాయి. బాల్య వివాహాలు ఉత్తరాది రాష్ట్రాల్లోనే అత్యధికంగా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాల్య వివాహాలది ఒక ఎత్తయితే, అమ్మాయిల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా జరుగుతున్న బలవంతపు పెళ్లిళ్లకు లెక్కే లేదు. ఇలాంటి బలవంతపు పెళ్లిళ్లపై గణాంకాలు సేకరించడం సామాజిక అధ్యయన బృందాలకు సాధ్యం కాని పని. ఇక మహిళలు ఎలా ఉండాలో, వారి కట్టుబొట్టు అలవాట్లు ఎలా ఉండాలో ఆంక్షలు విధించే ఖాప్ పంచాయతీలకు దేశంలో కరువు లేదు. ఆడపిల్లలు మొబైల్ఫోన్లు వాడరాదు, జీన్స్ ధరించరాదంటూ ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ఖాప్ పంచాయతీలు ఫత్వాలు జారీ చేసిన వార్తలు అక్కడక్కడా వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఒక గ్రామ పెద్దలు మహిళలు నైటీలు ధరించి వీధుల్లోకి రావద్దంటూ హుకుం జారీ చేసిన ఉదంతం వార్తలకెక్కింది. అమ్మాయి కట్టుబొట్టు తీరు సక్రమంగా లేకపోవడం వల్లనే అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అడ్డగోలుగా వాదించే వారి సంఖ్య తక్కువ కాదు. అలాంటప్పుడు పసిపిల్లలు మొదలుకొని పండుముదుసళ్లపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్నకు అలాంటి వారి వద్ద ఎలాంటి సమాధానమూ ఉండదు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక చైతన్యంతో పాటు పాలకుల్లో గట్టి రాజకీయ సంకల్పం ఏర్పడితే తప్ప పరిస్థితుల్లో మార్పు వచ్చే సూచనలు కనిపించడం లేదు. మహిళలకు రక్షణ లేని దేశాలు భారత్ అఫ్ఘానిస్తాన్ సిరియా సోమాలియా సౌదీ అరేబియా పాకిస్తాన్ కాంగో యెమెన్ నైజీరియా అమెరికా -
జీవితంలో గరళం.. హృదయంలో అమృతం
అది నయం కాని వ్యాధి. మందులు వాడినన్ని రోజులూ జీవితాన్నిస్తుంది. ఆపేస్తే ప్రాణాలు తీసేసుకుంటుంది. అలాగని ‘నాకు ఈ వ్యాధి ఉంది’ అని ఎవ్వరికీ చెప్పుకోలేనిది. అది పెట్టే బాధ కన్నా సమాజం పెట్టే బాధ.. దానిని.. పంటిబిగువున తట్టుకుని నిలబడటం సాధ్యం కాదు. ఇలాంటి బాధను భరిస్తూ ఓ మహిళ ఒంటరి పోరాటం చేస్తోంది. తెలిసో తెలియకో భర్త చేసిన తప్పు ఆయనతో పాటు భార్యాబిడ్డలనూ వెంటాడింది. ఆ మహమ్మారి.. భర్తను బలి తీసుకున్నా, తనను బంధువుల్లో, సమాజంలో వివక్షకు గురిచేసినా ఆమె వెరవలేదు. భర్త చేసిన తప్పు వల్ల తనతో పాటు కుమార్తె అనుభవించిన క్షోభ మరెవ్వరికీ కలగకూడదని ఆమె భావించింది. హెచ్.ఐ.వి.పై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికే ఆ వ్యాధి బారిన పడ్డ వారికి ప్రభుత్వం ద్వారా అందే అన్ని రకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటోంది. హెచ్.ఐ.వి. కారణంగా కుటుంబ సభ్యులు దూరం చేసిన వారిని అక్కున చేర్చుకుని వారిని సేవా కేంద్రాలకు పంపిస్తోంది. హెచ్ఐవి, ఎయిడ్స్‌తో మరణించిన వారిని అయినవారు తీసుకెళ్లకపోతే తనే అన్నీ అయి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తోంది. ఆ ఆదర్శ మహిళే.. సుధారాణి. భర్త ద్వారా సంక్రమించింది ఆళ్లగడ్డకు చెందిన శ్రీనివాసరావు 22 ఏళ్ల క్రితం గుంటూరు సమీపంలోని ఓ గ్రామంలో టెలిఫోన్ బూత్ నిర్వహించేవారు. అందులోనే స్థానికంగా నివాసం ఉండే సుధారాణి పనిలో చేరింది. వారిద్దరి మధ్యా పరిచయం ప్రేమగా మారింది. వీరి పెళ్లికి మొదట పెద్దలు నిరాకరించినా తర్వాత ఒప్పుకున్నారు. 1997లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది. గతంలో తిరిగిన తిరుగుళ్లకు శ్రీనివాసరావుకు హెచ్.ఐ.వి. సోకింది. ఈ కారణంగా ఆయన భార్య, పిల్లలూ ఇబ్బంది బలయ్యారు. ఈ సమయంలో శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల నుంచి సుధారాణి తీవ్ర వివక్షకు గురయ్యింది. తమ వాడికి ఎలాగో వ్యాధి వచ్చింది. ఆయనతో పాటు మిమ్మల్నీ చూడాలంటే సాధ్యం కాదని వెళ్లగొట్టారు. వ్యాధితో ఏడేళ్ల పాటు బాధను అనుభవించి 2005లో శ్రీనివాసరావు మరణించాడు. భర్త దహనసంస్కారాలు, పెద్దకర్మ కార్యక్రమాలు ముగిసిన వెంటనే సుధారాణిని పుట్టింటికి పంపించేశారు. ప్రేమపెళ్లిని కాదని సుధారాణిని దూరంగా ఉంచిన ఆమె తల్లిదండ్రులు భర్త చనిపోయిన తర్వాత మాత్రం అక్కున చేర్చుకున్నారు. ఆమెకూ ఆ వ్యాధి ఉందని తెలిసినా.. మేమున్నామంటూ ఓదార్చారు. దీంతో కొండంత ధైర్యంతో సుధారాణి తన జీవితాన్ని కొనసాగించారు. వైద్యుల సలహాతో ఏఆర్టి మందులు వాడుతూ పదహారేళ్లుగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అవుట్ రీచ్ వర్కర్‌గా సేవలు తన జీవితం ఎలాగూ అస్తవ్యస్తమయ్యింది. తనలా మరొకరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని, అలాంటి వారిని అక్కున చేర్చుకుని ఆదరించాలని సుధారాణి నిర్ణయించుకున్నారు. భర్త మరణించిన తర్వాత పీపీటీసీటీ ప్లస్ ప్రోగ్రామ్‌లో భాగంగా సెయింట్ యాన్స్లో అవుట్‌రీచ్ వర్కర్‌గా చేరారు. ఇందులో భాగంగా గర్భిణిలను గుర్తించి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి హెచ్ఐవి పరీక్షలు చేయించి, ఒకవేళ వారికి హెచ్ఐవి ఉంటే బిడ్డకు ఆ వ్యాధి రాకుండా జాగ్రత్త పడేలా వైద్యులతో చికిత్స చేయిస్తున్నారు. గర్భిణిలకు బిడ్డ పుట్టిన తర్వాత కూడా 18 నెలల పాటు ఫాలో అప్ చేస్తున్నారు. బాధితుల కోసం కర్నూలుతో ‘నేస్తం’ డ్రాపింగ్ సెంటర్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్‌గా పనిచేసేందుకు 2007లో సుధారాణి కర్నూలు వచ్చారు. కర్నూలులో ‘నేస్తం ఫర్ రాయలసీమ రీజియన్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ వెల్ఫేర్ సొసైటీ’ని స్థాపించారు. డ్రాపింగ్ సెంటర్ ద్వారా హెచ్ఐవి ఉన్న వారికి ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తూ, వారు ఎవరి వల్లనైనా వివక్షకు గురవుతుంటే వెళ్లి కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు సుధారాణి. అలాగే హెచ్ఐవి/ఎయిడ్స్‌పై కళాశాలలు, పాఠశాలలు, మహిళా ప్రాంగణాల్లో ఇప్పటి వరకు 220లకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్ఐవితో ఉన్న వారికి తిరిగి చెల్లించనవసరం లేని రుణాలు ఇప్పించారు. ఇటీవలే ‘విహాన్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్’ ఏర్పాటు చేశారు. హెచ్ఐవితో జీవించే వారిని గుర్తించి, వారిని ఏఆర్టి సెంటర్‌తో లింకప్ చేసి మందులు తీసుకునేలా చేయడం, అవసరమున్న వారికి వైద్యుల వద్దకు రెఫర్ చేయడం ఈ సెంటర్ ద్వారా నిర్వహిస్తున్నారు. హెచ్ఐవితో బాధపడుతూ చురుకుగా, కాస్త ఆరోగ్యంగా ఉన్న వారితో ఇతరులు ఆ వ్యాధికి గురిగాకుండా వారితోనే చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే హెచ్ఐవి బారిన పడిన పిల్లలను ఐసీపీఎస్‌కు లింకప్ చేసి, వారికి ఏఆర్టి సెంటర్ ద్వారా మందులు అందుకునేలా చేయడంతోపాటు, నెలకు రూ.1000లు పింఛన్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికి పది వేల మంది హెచ్ఐవి బాధితులను గుర్తించి, వారిని ఏఆర్టి సెంటర్‌కు పంపించి మందులు ఇప్పించారు. అలాగే 104 మంది హెచ్ఐవి బాధిత చిన్నారులను గుర్తించి, వారి డాక్యుమెంట్లను ప్రభుత్వానికి పంపి ఒక్కొక్కరికి నెలకు రూ.500 లు ఆర్థిక సహాయం అందేలా చేశారు. శాంతి ఆశ్రమ ట్రస్ట్ వ్యవస్థాపకులు హిమాలయ గురూజీ ద్వారా ఏఆర్టి కేంద్రంలో చికిత్స పొందేందుకు వచ్చే 100 మందికి మధ్యాహ్న భోజనాన్ని ప్రతిరోజూ అందేలా చూశారు. హెచ్ఐవి కారణంగా కుటుంబసభ్యులు దూరం చేసిన వారిని కర్నూలు లోని శాంతినికేతన్, అభయగిరి సెంటర్లతో పాటు అనంతపురంలోని ఆర్డిటికి పంపిస్తున్నారు. వీరిలో ఎవరైనా చనిపోతే స్వయంగా దగ్గరుండి అంత్యక్రియలు జరిపిస్తున్నారు. – జె.కుమార్, సాక్షి, కర్నూలు నేను పడ్డ క్షోభ ఎవరూ పడకూడదనే ఆ వ్యాధి బయటపడినప్పటి నుంచి నేను, నా భర్త పడిన క్షోభ అంతా ఇంతా కాదు. ఆయన మంచాన పడ్డప్పుడు ఏ ఒక్కరూ వచ్చి చేయందించింది లేదు. సమాజంతో పాటు బంధువుల, స్నేహితులూ మమ్ములను దూరం చేశారు. ఐదేళ్ల పాటు ఆయనను కాపాడుకున్నా, చివరికి విధి గెలిచి ఆయనను మా నుంచి దూరం చేసింది. ఆ తర్వాత అమ్మ, తమ్ముడు నాకు పెద్ద దిక్కయ్యారు. సమాజం ఏమనుకున్నా ఫరవాలేదని అండగా నిలిచారు. వారి ప్రోత్సాహం వల్లే నేను ఈరోజు ఈస్థాయిలో ఉన్నాను. ఈ వ్యాధి భారిన పడిన వారు నాలాగా బాధపడకూడదని భావించి హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితులకు నా వంతు సేవ చేస్తున్నాను. – బి. సుధారాణి, నేస్తం కో ఆర్డినేటర్ -
వేర్వేరు సెక్షన్లలో హిందూ–ముస్లిం విద్యార్థులు
న్యూఢిల్లీ: మతం ఆధారంగా విద్యార్థులపై ఓ ప్రభుత్వ పాఠశాల వివక్షను చూపింది. హిందూ విద్యార్థులను ఓ సెక్షన్లో, ముస్లిం విద్యార్థులను మరో సెక్షన్లో కూర్చోబెట్టింది. ఈ ఘటన దేశరాజధానిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. బీజేపీ పాలిత ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) పరిధిలోకి వజీరాబాద్ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టిన అధ్యాపకుడు సీబీ సింగ్ సెహ్రావత్ ఈ దారుణానికి తెరతీశారు. ఓ జాతీయ ఆంగ్లపత్రికలో ఈ వ్యవహారంపై కథనం రావడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ప్రాధమిక విచారణ జరిపిన ఎన్డీఎంసీ కమిషనర్ మధుప్ వ్యాస్.. ఆరోపణలు నిజమని తేలడంతో పాఠశాల ఇన్‌చార్జ్‌ను సెహ్రావత్‌ను సస్పెండ్ చేశారు. ఇది ఊహించలేని, క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు. -
సత్యం స్వర్గమార్గం – అసత్యం నరకం
మానవుడు తన నిత్యజీవితంలో అసత్యానికి తావులేకుండా సదా సత్యమే పలకడానికి ప్రయత్నించాలి. సంకల్పం ఉంటే ఇదేమీ అసాధ్యమైన పనికాదు. కాని, ఈనాడు చాలామంది సత్యాన్ని గురించి అంతగా పట్టించుకుంటున్నట్లు గాని, సత్యాసత్యాల మధ్య విచక్షణ చూపుతున్నట్లుగాని కనిపించడం లేదు. తమకు సంబంధించినంత వరకు ఇతరులు అబద్ధమాడకూడదని, తమ విషయంలో వారు నిక్కచ్చిగా ఉండాలని కోరుకుంటారు. తాము మాత్రం ఇతరుల వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోరు. సత్యమనే ఈ మహత్తర సుగుణాన్ని గురించి దైవప్రవక్త ముహమ్మద్ (స) ప్రజలకు ఎటువంటి హెచ్చరికతో కూడిన సందేశమిచ్చారో గమనిద్దాం. ‘సత్యం మానవులను మంచివైపుకు మార్గదర్శకం చేస్తుంది. మంచి వారిని స్వర్గం వైపుకు తీసుకుపోతుంది. అలాగే, అసత్యం మానవులను చెడువైపుకు మార్గదర్శకం చేస్తుంది. చెడువారిని నరకం దాకా తోడ్కొని వెళుతుంది.’ సత్యానికి ఇంతటి మహత్తు, ప్రాముఖ్యత ఉన్నాయని అందరికీ తెలుసు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు పలికేవారు కూడా సత్యానికి మించిన సంపద మరొకటి లేదని అంగీకరిస్తారు. అయినా ఆచరణలో మాత్రం తప్పులో కాలు వేస్తుంటారు. అసత్యాన్నే ఆశ్రయిస్తారు. తిమ్మిని బమ్మిని చేసి పబ్బం గడుపుకోడానికి ప్రయత్నిస్తారు. ఈనాటి పరిస్థితుల్ని మనం కాస ్తనిశితంగా గమనిస్తే, ‘అసత్యం’ అన్నది ఈనాడు చెడు అని ఎవరూ అనుకోవడంలేదు. అది చెడుల జాబితానుండి మినహాయింపు పొంది, ఒక కళగా రూపాంతరం చెందింది. పరిస్థితి చూస్తుంటే, సత్యానికి అసత్యానికి మధ్య అసలు కాస్త కూడా తేడాయే లేనట్లు అనిపిస్తోంది. చాలామంది తమ పబ్బం గడుపుకోడానికి తమకు ప్రయోజనాన్ని, లాభాలను చేకూర్చిపెట్టే ఒక సాధనంగా అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. స్వార్థం, స్వలాభాలకోసం ఎంత పెద్ద అబద్ధం పలకడానికి కూడా ఏమాత్రం సంశయించడంలేదు. కాని, ముహమ్మద్ ప్రవక్త(స) ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధమాడవద్దని, సత్యం పలికిన కారణంగా మీరు సర్వస్వం కోల్పోయినా సరే అసత్యాన్ని ఆశ్రయించవద్దని హితవు పలికారు. ఇంట్లో పిల్లలకు సైతం ఏదైనా తెస్తానని, ఇస్తానని ఆశజూపి ఇవ్వకపోవడం కూడా తప్పే అన్నారు. ఇది కూడా అసత్యమే అవుతుందని, రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవలసి ఉంటుందని సెలవిచ్చారు. ఒకవేళ మానవ సహజ బలహీనత కారణంగా, పొరపాటున ఏదైనా అసత్యం దొర్లిపోతే, దానికి చింతించి, పశ్చాత్తాపంతో దైవాన్ని క్షమాపణ వేడుకోవాలని సూచించారు. కనుక, సాధ్యమైనంతవరకు సర్వకాల సర్వావస్థల్లో సత్యమే పలకడానికి, అబద్ధాలకు దూరంగా ఉంటూ దేవుని ప్రేమకు పాత్రులు కావడానికి ప్రయత్నిద్దాం. అబద్ధాలకోరును ప్రజలు ఎన్నటికీ నమ్మరు, విశ్వసించరు, ప్రేమించరు, ఆదరించరు, గౌరవించరు. ఇది నిజం. అల్లాహ్ మనందరికీ సదాసత్యమే పలికే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
స్త్రీలోక సంచారం
మైసూరు సమీపంలోని కృష్ణరాజనగర్ తాలూకా పరిధిలో గల ఎరెమనుగణహళ్లి గ్రామంలో ఉన్న 450 మంది జనాభాలో నయీమా ఖాన్ (8) అనే ఒక ఒక్క బాలిక ఆ గ్రామంలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలకు గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా వెళుతుండగా.. ఆమె పట్టుదలను చూసి.. ఆ ఒక్క విద్యార్థిని కోసం.. ఉర్దూ బోధించడానికి సబియా సుల్తాన్, కన్నడ బోధించడానికి నాగరాజు అనే ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఏనాడూ గైర్హాజరు కాకుండా స్కూలుకు హాజరవుతున్న విషయం వార్తల్లోకి వచ్చింది. దళిత జనాభా అధిక సంఖ్యలో ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం 40 ముస్లిం కుటుంబాలు ఉండగా, ఆ కుటుంబాలంతటికీ నయీమా ఖాన్ ఒక్కతే చదువుకుంటూ, ఆమె మూడవ తరగతి వరకు రావడానికి తోడ్పడిన ఈ పాఠశాలను ఉర్దూ భాష వ్యాప్తి కోసం ప్రభుత్వం 60 ఏళ్ల క్రితం స్థాపించింది. మిస్ ఇంగ్లండ్ ఫైనల్స్‌లో తొలిసారి హిజబ్ ధరించి పాల్గొన్న యువతిగా శారా ఇఫ్తెఖర్ అనే విద్యార్థిని రికార్డు సృష్టించారు. మిస్ ఇంగ్లండ్ పోటీలలో గతంలో క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో హిజబ్ ధరించి పాల్గొన్నవారు ఉన్నప్పటికీ, ఫైనల్స్‌లో హిజబ్‌తో పోటీకి నిలబడడం ఇదే మొదటిసారి. ఏలీ ఫ్రేజర్ అనే స్కాట్లాండ్ యువతి.. తన బాయ్‌ఫ్రెండ్ ఆవు ఒంటి మీద, ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని రాసి, ఆ ఆవును ఆమె దగ్గరికి తోలుకొచ్చి, తను ఆమె ఎదురుగా మోకాలిపై వంగి, ప్రపోజ్ చెయ్యడంతో ఆనందంతో పొంగిపోయి, వెంటనే ‘ఎస్’ చెప్పడం ఒక విశేషం అయింది. ఆమె ఈడు వాడే అయిన క్రిస్ గాస్పెల్ అనే 30 ఏళ్ల యువ రైతు, ఎంతో భిన్నంగా ఆలోచించి, తన మనోభావాలను ప్రియురాలికి వ్యక్తం చేసిన తీరుకు ముచ్చట పడిన ఇరువైపు స్నేహితులు కూడా అబ్బాయికి అమ్మాయి ఓకే చెప్పడంలో తగిన పాత్ర పోషించారు. జీవితంలోని అన్ని దశల్లోనూ స్త్రీజాతి ఎదుర్కొంటున్న వివక్షల్ని, వరకట్న వేధింపుల్ని, లైంగిక హింసల్ని, అసమానతలను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించి.. స్త్రీ తలచుకుంటే, స్త్రీ తిరగబడితే ఏ శక్తీ ఆమెను ఆపలేదని, ఆమె సహనాన్ని పరీక్షించడం మానవ జాతికే క్షేమకరం కాదనీ.. సందేశం ఇస్తూ.. తెలుగు బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ రోల్ రైడా (రాహుల్ కుమార్ వేల్పుల) దృశ్యీకరించి ‘అరుపు’ పేరుతో యూట్యూబ్‌లోకి ఆగస్టు 24 న విడుదల చేసిన వీడియో అమితమైన వీక్షకాదరణ పొందుతోంది. ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల హిట్స్‌కు చేరుకున్న ఈ 6 ని. 58 సెకన్ల వీడియోకు పాట రాసి, పెర్ఫామ్ చేసింది రైడానే కాగా, మ్యూజిక్‌ను కమ్రాన్, గాత్రాన్ని మనీషా అందించారు. దగాపడి, పడుపు వృత్తిలో కూరుకుపోయిన ఓ అమాయకపు పల్లెటూరి అమ్మాయి జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో, వాటిని ఆమె ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కొందో చూపించే ‘లవ్ సోనియా’ చిత్రం ఈ నెల 14న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయిన నేపథ్యంలో చిత్రంలో సోనియా పాత్రను పోషించిన మరాఠీ నటి మృణాళ్ ఠాకూర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇన్స్పైరింగ్గా ఉంటున్నాయి. ‘మౌనంగా ఉండమనీ, మౌనంగా భరించమనీ’ అమ్మాయిలకు నూరి పోయడం అంటే.. వారిని చేజేతులా నరక కూపంలోకి నెట్టివేయడమేనని మృణాల్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. జాతిపిత గాంధీజీ హత్యకు గురైనప్పుడు సంబరాలు జరుపుకున్నవారు ఇప్పుడు జాతిని పరిపాలిస్తున్నారని బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ఆలోచన రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముంబై, రాంచీ, హైదరాబాద్, ఫరీదాబాద్, ఢిల్లీ, థాణెలలో కొందరు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన విషయమై న్యూఢిల్లీలో శనివారం జరిగిన ‘ఇండియ¯Œ ఉమెన్ ప్రెస్ కోర్’ సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యను చేసిన స్వరా భాస్కర్.. చేతలకు శిక్ష విధించాలి కానీ, ఆలోచనలకు కాదు’ అని కూడా అంటూ హక్కుల కార్యకర్తలను సమర్థించడంతో పాటు, ఎన్డీయే ప్రభుత్వం వైఖరి మీద తన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అక్టోబర్ 12న విడుదల అవుతున్న బాలీవుడ్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా మూవీ ‘జలేబీ’ పోస్టర్లో హీరోయిన్ రియా చక్రవర్తిని, కొత్త కుర్రాడైన హీరో వరుణ్ మిత్రా ముద్దు పెట్టుకుంటున్న సన్నివేశంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బాలికలు, మహిళలపై అసంఖ్యాకంగా లైంగిక అకృత్యాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పోస్టర్లు అబ్బాయిల్లో చెడు తలంపులకు కలిగించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నాలుగిళ్లలో పని చేసి, ఏళ్ల పాటు రూపాయి రూపాయి కూడబెట్టుకుని లక్షా 39 వేలు పొదుపు చేసుకుని, నోట్ల రద్దుతో తీవ్ర మనోవేదనకు గురైన మీనాక్షి (41) అనే మహిళ ఆ నోట్లను గడువు లోపల మార్చుకోవడం తెలియక, వాటిని తీసుకెళ్లి హేమావతి నీటిలో కలిపి వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగా మాటలు రాని, ఏదీ వినిపించని మీనాక్షి.. తనకు బ్యాంకు అకౌంట్ లేకపోవడం, నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియకపోవడం, అంతకన్నా కూడా తను డబ్బు దాచిన విషయం ఎవరికీ తెలియకూడదని అనుకోవడంతో చాలాకాలం పాటు సతమతమై, గడుపు తేదీ అయిన మార్చి 31 (2017) తర్వాత కూడా ఇంట్లో నోట్లుంటే నేరమని తెలుసుకుని, ఆఖరి ప్రయత్నంగా వాటిని మార్చుకునేందుకు మాజీ ప్రధాని దేవెగౌడను, బ్యాంకు అధికారులను కూడా కలిసి, ప్రయోజనం లేక ఈ వ్యవస్థపై కోపంతో తన కష్టార్జితాన్నంతా నీటి పాలు చేసుకుందని ఆమె తల్లి లక్ష్మీదేవి (70) కంట తడి పెట్టుకున్నారు. -
స్త్రీలోక సంచారం
కార్ల అమ్మకాలు, కొనుగోళ్లలో నాలుగో వంతు మార్కెట్ మహిళలదేనని, గత ఐదేళ్లలో మహిళల కొత్త, పాత కార్ల వినియోగం 10–12 శాతం నుంచి 25 శాతానికి రెట్టింపు అయిందని తాజా సర్వేలో వెల్లడయింది. ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు మరింత సులభంగా, ఫ్రెండ్లీగా ఉండే ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల ఉత్పత్తి కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని కూడా సర్వేలు కొన్ని పెద్ద కంపెనీల పేర్లను ఉదహరించాయి. అన్ని జాతులూ కలిసిమెలిసి, స్వేచ్ఛగా జీవించే అమెరికాలో జాతి వివక్షకు చోటు లేదని ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేశారు. తమను తాము ఆధిక్యజాతిగా భావించుకుంటున్న అమెరికన్లు కొందరు వర్జీనియాలోని చార్లెట్‌విల్ పట్టణంలో పరజాతులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మళ్లీ అలాంటి ర్యాలీలే జరిగే అవకాశం ఉండటంతో స్థానికేతరులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకు ఇవాంకా ఇలా.. (తన తండ్రి మద్దతిచ్చే ఆధిక్య భావజాలానికి పూర్తి విరుద్ధంగా).. ట్వీట్ చేయడం విశేషం. ఆగస్టు 12న మరణించిన భారత సంతతి బ్రిటిష్ రచయిత, నోబెల్ గ్రహీత వి.ఎస్.నయీపాల్.. స్త్రీల రచనా సామర్థ్యం విషయంలో తేలిక భావంతో ఉండేవారనీ, స్త్రీలోలుడని, స్త్రీలపై తరచు చెయ్యి చేసుకునేవాడని.. నివాళులలో భాగంగా జాతీయ పత్రికల్లో వరదలా వచ్చిపడిన ఆయన జీవిత విశేషాలను బట్టి తెలుస్తోంది. ‘రీడర్స్ డైజెస్ట్’ మాజీ ఎడిటర్ రాహుల్ సింగ్.. నయీపాల్లోని సత్యశీలతను కొనియాడుతూ.. సంక్లిష్టమైన ఆయన వ్యక్తిగతం జీవితానికి నిదర్శనంగా.. మొదటి భార్య ప్యాట్, పెళ్లికాకుండా ఆయనతో కలిసి ఉన్న మార్గరెట్ అనే ఒక అర్జెంటీనా మహిళ, నదీరా అనే మరో పాకిస్తానీ మహిళల గురించి ప్రస్తావించడాన్ని బట్టి నయీపాల్ జీవితంలో స్త్రీలకు పెద్ద స్థానమే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు డెన్జెల్ వాషింగ్టన్.. తన కుమార్తె (ఆమె కూడా హాలీవుడ్ నటి) ఒలీవియాతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారి నడుము విరగ్గొడతానని హెచ్చరించారు. గత ఏడాది హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపులు బహిర్గతం అయిన అనంతరం ‘మీటూ’ ఉద్యమంతో బాధిత నటీమణులంతా సంఘటితం కావడంపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. మీటూ వల్ల హాలీవుడ్ ఇప్పుడు మరింత సురక్షితం అయిందని చెబుతూ, ఒకవేళ తన కూతుర్ని ఎవరైనా లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిస్తే తక్షణం వెళ్లి వారి వెన్నెముకను సున్నం చేస్తానని డెన్జెల్ అన్నారు. మేనేజ్మెంట్ డిగ్రీలు లేకపోయినప్పటికీ మహిళలు ఇంటా బయటా పనుల్ని చక్కబెట్టగలరని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. చండీగఢ్‌లో ‘భారత వికాస్ పరిషత్’ నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. ‘ఒక మహిళ బయటì పనికి వెళ్లి వస్తోందంటే ఆమె ఏకకాలంలో రెండు పనులు చేస్తున్నట్లు. ఇదే మాట పురుషుడి విషయంలో చెప్పలేం. ఎందుకంటే అతడు బయటి పని మాత్రమే చేస్తాడు తప్ప, ఇంట్లో పూచిక పుల్లంత పని కూడా అందుకోడు’ అని కిరణ్ జీ (చండీగఢ్ ఎం.పి. కిరణ్‌ఖేర్) అన్న మాటను సమర్థించారు. వయసొచ్చిన కొడుకు విషయంలో తల్లికి ఉండే భయాలు, బెంగలు, ఆరాలు, అనుమానాలు, నిఘాలు.. ఇవన్నీ కలిసి ‘మమ్మా కి పరిచాయి’ (అమ్మ నీడ) అనే థీమ్‌తో విడుదలైన ‘హెలికాప్టర్ ఇలా’ చిత్రంలోని టీజర్ సాంగ్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. తల్లిగా కాజల్, కొడుకుగా రిథీ సేన్ కనిపించే ఈ పాటలో.. కొడుకును అనుక్షణం ప్రొటక్ట్ చేసే కేరింగ్ మదర్, తల్లి పోరు పడలేక సతమతమయ్యే కొడుకు కనిపిస్తారు. ‘లండన్ లోని భారత దౌత్య కార్యాలయంలో టీమ్ ఇండియా’ అనే క్యాప్షన్‌తో ఈ నెల 8న బి.సి.సి.ఐ. (బోర్ట్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ట్విట్టర్లో పెట్టిన గ్రూప్ ఫొటోలో టీమ్ సభ్యులతో పాటు విరాక్ కోహ్లీ భార్య అనుష్కాశర్మ కూడా ఉండటంపై ‘క్రికెట్‌నీ, బాలీవుడ్‌నీ కలపకండి’ అంటూ వస్తున్న ట్రోల్స్ మీద ఎట్టకేలకు అనుష్క స్పందించారు. అయితే.. ‘ఇలాంటి ట్రోల్స్‌కి నేను స్పందించను’ అన్నంత వరకే ఆమె స్పందించారు! నేడు నటి సుహాసిని 57వ పుట్టినరోజు. భర్త మణిరత్నం.. కొడుకు నందన్.. ఇదీ ఆమె ఫ్యామిలీ. సుహాసిని నాస్తికురాలు. ‘‘నాకు దేవుడి మీద నమ్మకం లేదు. దైవ ప్రార్థనల మీద నమ్మకం లేదు. నాకు, నా కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వు దేవుడా అని గుడులకు వెళ్లడం మీద నమ్మకం లేదు’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సుహాసిని. అలాగే మల్టీ టాస్కింగ్ (ఒకేసారి అనేక పనులు నెత్తికెత్తుకునే నేర్పు) మీద కూడా ఆమెకు నమ్మకం లేదు. ‘అదెలా సాధ్యం?’ అంటారు. ‘‘ఇంట్లో పని ఇంట్లోనే. బయటి పని బయటే. ఇక్కణ్ణుంచి ఆ పని, ఆక్కణ్ణుంచి ఈ పని చెయ్యలేను’’ అని చెబుతుంటారు సుహాసిని. -
నేను ‘గే’ అని అమ్మ అన్నం పెట్టడంలేదు
సాక్షి,హైదరాబాద్ : సమాజంలో తమను కూడా మనుషులుగా గుర్తించాలని తమ హక్కులను కూడా కాపాడాలని పలువురు స్వలింగ సంపర్కులు డిమాండ్ చేశారు. ప్రపంచంలో ప్రతి ఏడాది జూన్‌లో స్వలింగ సంపర్కుల హక్కుల పోరాట మాసాన్ని నిర్వహిస్తుంటారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో లెస్బియన్లు, ట్రాన్స్జెండర్లు, గే లు, బై సెక్సువల్(ఎల్జీబీటీ) సమావేశమయ్యారు. ప్రైడ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర నలుమూలల నుంచి వచ్చిన 200 మంది ఎల్జీబీటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ హక్కులను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా తమ కుటుంబంలోనే తమను వెలివేస్తున్నారంటూ వీరు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల్లో తమను సూటిపోటి మాటలతో వేదిస్తున్నారని ఓ యువకుడు ఆరోపించాడు. తాను ‘గే’ నని తెలుసుకొని తన తల్లి వారం రోజులు అన్నం పెట్టకుండా మాడ్చారని, ఓ రూమ్‌లో వేసి బంధించారని ఇదెక్కడి అన్యాయమని ఇంకో యువకుడు ఆందోళన చెందాడు. తనలో వచ్చిన మార్పులను గమనించి తన తండ్రి తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి తరిమేశాడని, ఏం పాపం చేశానని తాను ఇప్పుడు రోడ్డునపడాల్సి వచ్చిందని ఆరోపించారు. ఇలా ఒక్కొక్కరు తమ సమస్యలపై గొంతు విప్పారు. తమకు కూడా గుర్తింపు కావాలని వీరంతా డిమాండ్ చేశారు. -
కానుకలు తీసుకోవద్దు
భువనేశ్వర్: భక్తుల నుంచి విరాళాలు, కానుకలు స్వీకరించవద్దని ప్రఖ్యాత పూరీ జగన్నాథస్వామి ఆలయంలో పనిచేసే సేవకులకు సుప్రీంకోర్టు సూచించింది. కానుకలు ఇవ్వని భక్తుల పట్ల సేవకులు వివక్ష చూపుతున్నారంటూ వచ్చిన వార్తలపై కోర్టు స్పందించింది. సూచనలను ఆలయంలోని పలు ప్రాంతాల్లో అంటించింది. సేవకులకు భక్తులు కానుకలు ఇచ్చే విధానానికి బదులుగా ఏపీలోని తిరుపతి,, జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి, గుజరాత్‌లోని సోమనాథ్, పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలలో అమల్లో ఉన్న వివిధ విధానాలను అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఒడిశా ప్రభుత్వాన్ని కోరింది. భక్తులు ఇచ్చే కానుకలపైనే తాము ఆధారపడి జీవిస్తున్నందున ఈ ఆదేశాలను పునః పరిశీలించాలంటూ కొందరు సేవకులు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. -
ఆ అధికారికి ఎయిడ్స్ బాధితులంటే వివక్ష!
కర్నూలు(హాస్పిటల్): హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితుల పట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ దేవసాగర్ వివక్ష చూపుతున్నారని మానవ హక్కుల కమిషన్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు నేస్తం పాజిటివ్ నెట్వర్క్ అధ్యక్షురాలు బి. సుధారాణి గత నెలలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ నుంచి వచ్చిన నోటీసుల మేరకు బుధవారం డాక్టర్ దేవసాగర్, సుధారాణిలను డీఎంహెచ్ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ విచారణ చేశారు. గత నెల 10వ తేదీన ‘ఇంటర్నేషనల్ క్యాండిల్ మెమోరియల్ డే’ కార్యక్రమానికి డాక్టర్ దేవసాగర్‌ను ఆహ్వానించడానికి వెళితే ‘టీబీతో కూడిన హెచ్ఐవీ బాధితులను కాకుండా హెచ్ఐవీ ఉన్న వారిని మాత్రమే పిలవాలి. వారిని కూడా తనకు దూరంగా ఉంచాలని’ దేవసాగర్ చెప్పారని సుధారాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కూడా ఆయన కార్యాలయంలోకి రానిచ్చేవారు కాదని, దూరంగా ఉండి మాట్లాడాలని చెప్పేవారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో వివక్ష ఉండకూడదని అనేక కార్యక్రమాలు తమ సంస్థ చేస్తుంటే జిల్లా అధికారే ఇలా వ్యవహరించడం బాధ కలిగించిందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై డాక్టర్ దేవసాగర్ వివరణ ఇస్తూ తాను ఏనాడూ హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్ష చూపలేదని, క్యాండిల్ లైట్ ప్రోగ్రామ్‌కు కూడా ఓపెన్ ప్లేస్‌లో నిర్వహించాలని చెప్పాను తప్ప దూరంగా ఉంచాలని అనలేదని వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఇలాంటి వివక్ష మళ్లీ పునరావృతం కాకూడదని, ఇకపై ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలని చెప్పి పంపించారు. -
కెరీర్‌గా పౌరోహిత్యం
మహిళల హక్కులు కూడా మానవ హక్కులే అనే స్పృహను పురుషాధిక్య సమాజానికి కల్పించే ప్రయత్నంలో భారతీయ మహిళ చాలాదూరమే ప్రయాణించి వచ్చింది. దైవ సన్నిధి హక్కును కూడా పొంది, ఇప్పుడు దైవార్చన హక్కును సాధించుకుంది. దేశంలోని అనేక దేవాలయాలలో ఇటీవల మహిళా పూజారులు దర్శనమిస్తున్నారు. ఉపనయనాలు కూడా జరిపిస్తున్నారు. అయితే ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.లను లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అయినట్లుగా పౌరోహిత్యంపై ఆసక్తి కనబరిచే మహిళా అభ్యర్థులు ఆ పద్ధతులు, విధానాలు ఎక్కడ నేర్చుకోవాలి? ప్రస్తుతానికైతే పుణెలోని జ్ఞాన ప్రబోధిని ఇన్స్టిట్యూట్ ఈ సంశయాన్ని పరిష్కరిస్తోంది. 20 మంది యువతులతో మొదటి బ్యాచ్‌ని ప్రారంభించిన జ్ఞాన ప్రబోధిని, త్వరలోనే రెండో విడత ప్రవేశాలకు ప్రకటన ఇవ్వబోతోంది. భక్తికి.. స్త్రీ, పురుష వివక్ష లేనప్పుడు అర్చకత్వానికి ఎందుకుండాలని ఈ సంస్థకు ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్‌గా ఉన్న మనీషా సేథ్ ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా. -
దళితులపై సర్కారు వివక్ష
ఆళ్లగడ్డ : చంద్రబాబు ప్రభుత్వం దళితులపై మరోసారి వివక్ష చూపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేత గంగుల బిజేంద్రారెడ్డి విమర్శించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభారాణి ఆత్మహత్య ఘటనపై సక్రమంగా స్పందించలేదన్నారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఐటీయూ ఆధ్వర్యంలో శోభారాణి మృతదేహంతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆమె ఇంటి నుంచి మృతదేహాన్ని తీసుకుని పట్టణ వీధుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ఎదురుగా మృతదేహాన్ని ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ శోభారాణి దళిత ఉద్యోగి అయినందునే ప్రభుత్వం ఆమె ఆత్మహత్య ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కనీసం ఆమె కుటుంబాన్ని ఆ శాఖ అధికారులు ఎవరూ పరామర్శించకపోవడం దారుణమన్నారు. నిబంధనల ప్రకారం అంత్యక్రియలకు నగదు కూడా అందజేయలేదన్నారు. శోభారాణి మృతికి కారణమైన సీడీపీఓ పద్మావతిని వెంటనే విధుల నుంచి తప్పించాలని, అంతవరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి కదిలించేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో తహసీల్దార్ లక్ష్మిదేవి, ఉప తహసీల్దార్ శ్రీనివాసులు, సీఐ శ్రీనాథరెడ్డి, ఎస్సై ప్రియతంరెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడారు. సీడీపీఓను విధుల నుంచి తప్పించనున్నట్లు తెలపడంతో పాటు అంత్యక్రియలకు నగదు అందజేయడంతో నిరసన విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీపీ బండి చంద్రుడు, సుధాకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, పత్తి నారాయణ, సింగం భరత్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, డివిజన్ కార్యదర్శి శ్రీనివాసులు, మాలమహనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
వెలివాడలో వెలుగుజాడ
‘అంటరాని’ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ తొలి రౌండ్ టేబుల్ సమావేశంలోనే ప్రతిపాదించారు. భారతదేశంలో అంటరాని కులాలు ఎదుర్కొంటున్న సమస్య ప్రధానంగా రాజకీయ పరమైనదే కానీ, సాంఘిక పరమైనది కాదని ఆయన వాదించారు. వలస పాలకుల ప్రాభవం పలచబడడం, బ్రిటిష్ ఇండియాకు రాజకీయ సంస్కరణల అవసరం చొచ్చుకు రావడం దాదాపు ఒకేసారి ఆరంభమైంది. చారిత్రక నేపథ్యాన్ని బట్టి భారతీయ సమాజం అనేక వర్గాలు, మతాలు, కులాలతో నిండిపోయింది. అసమానతలు ఉన్నాయి. కానీ రాజకీయ సంస్కరణల రథం వీరందరికీ చోటు కల్పించవలసిందే. అలాంటి దశలో దేశంలో ఉన్న ఆరు కోట్ల మంది బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా కనిపించిన వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ రామ్‌జీ అంబేడ్కర్. శతాబ్దాల బానిసత్వం తరువాత, వలస పాలన కాలంలో భారతదేశంలో కానిస్టిట్యూషనలిజమ్ పటిష్ఠ దశకు చేరుకుంటున్న కాలంలో అంబేడ్కర్ ఒక శక్తిగా ఎదిగి రావడమే చరిత్రలో ఆయనకు గొప్ప స్థానానికి అర్హుడిని చేసింది. ఆనాటి లెక్కలను బట్టి చూస్తే హిందూ సమాజంలో ప్రతి ఐదో వ్యక్తి అంటరానివాడో, బడుగు వర్గీయుడో అవుతాడు. లేదా అవుతుంది. అంబేడ్కర్‌కు ముందు ఇలాంటి వర్గాలకు అండగా నిలిచినవారు లేకపోలేదు. కానీ రాజకీయ హక్కులకు రూపం ఇస్తున్నప్పుడు అందులో దళితుల స్థానం గురించి చారిత్రకంగానే కాదు, చట్టాల నేపథ్యంతో కూడా చెప్పగల నేత అవసరం ఉంటుంది. అలాంటి నిర్మాణాత్మక పాత్రను నిర్వహించినవారు అంబేడ్కర్. దళిత జనోద్ధరణలో గాంధీజీ పాత్రను కూడా విస్మరించలేం. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అదొక చారిత్రక వాస్తవం. కానీ ఒకటి– దళిత జనోద్ధర ణ గాంధీజీకి సంబంధించినంత వరకు ఆదర్శం నుంచి ఆవిర్భవించింది. కానీ అంబేడ్కర్‌కు సంబంధించి అది అనుభవం నుంచి అంకురించింది. అంబేడ్కర్ జీవితమే ఒక చరిత్ర. అందులో అణగారిన గళాలకు నినాదాన్ని అందించిన తాత్వికత ఉంది. గొప్ప పాఠం ఉంది. అంతవరకు నిరాకరించినప్పటికీ ఆయన కాలానికి హిందూ సమాజం గుర్తించక తప్పని వాతావరణం కల్పించిన పాఠమది. అంబేడ్కర్ తాతగారు, తండ్రి రామ్‌జీ సక్పాల్ సైన్యంలో పనిచేశారు. ఆ కుటుంబం కబీర్‌ను ఆరాధించేది. తల్లి భీమాబాయి. ఆమె తండ్రి, మేనమామలు కూడా సైన్యంలో పని చేసినవారే. అలాగే కబీర్ ఆరాధకులే. అంబేడ్కర్ కుటుంబానికి ఉన్న సైనిక నేపథ్యం ఆయనకు ఒనగూర్చిన గొప్ప ఉపకారం–మంచి విద్యావకాశాలను కల్పించడం. ఆ కాలంలో సైన్యంలో పనిచేసేవారు ఎవరైనా, వారి సంతానానికి మంచి విద్య అందేది. అయినప్పటికీ వివక్షను ఎదుర్కొనక తప్పలేదు. అంబేడ్కర్ జీవితం ఎంతో సంఘర్షణను చవి చూసింది. కానీ ఆ సంఘర్షణ నుంచి సమరానికి కాకుండా సయోధ్య వైపు నడిచింది. ఇందుకు ఎన్ని కష్టాలు పడినా ఆ జీవితం ఓర్చుకుని నిలిచింది. కుటుంబానికి నేపథ్యంగా ఉన్న కబీర్ ఆరాధన, సైనిక క్రమశిక్షణ ఇందుకు కారణమనిపిస్తాయి. మార్పునకు సిద్ధపడుతున్న సమాజంలో ఆదర్శం కనిపిస్తుంది. ఆ మేరకు గాంధీజీ కృషి చరిత్రాత్మకమే. ఒక సమస్య తీవ్రతను ఇతరులకు తెలియచేయడానికి వ్యక్తుల స్వీయ అనుభవం తోడ్పడిన స్థాయిలో మరొకటేది ఉపకరించదు. దళితులకు సామాజిక న్యాయం అందించడంలో అంబేడ్కర్ దార్శనికత, అనుభవం అలాంటి పాత్రను నిర్వహించింది. ఇలాంటివి ఎన్ని చెప్పుకున్నా, సామాజిక న్యాయాన్ని కాపాడగలిగేది మాత్రం రాజ్యాంగబద్ధత. ఆ సత్యాన్ని గుర్తించడమే కాదు, తన వర్గానికి సాధించి పెట్టినవారు అంబేడ్కర్. అంబేడ్కర్ సంస్కర్త. ఆర్థికవేత్త. న్యాయ నిపుణుడు. ఉద్యమకారుడు. గొప్ప విద్యావేత్త. ప్రజాప్రతినిధి. ఇవన్నీ కూడా అంబేడ్కర్‌ను స్వతంత్ర భారత రాజ్యాంగ రచనా సారథ్యం దగ్గరకు నడిపించిన దశలుగానే కనిపిస్తాయి. గాంధీజీ, ముస్లింలీగ్ నాయకుడు మహమ్మదలీ జిన్నా చెరో వైపు లాగిన రాజ్యాంగానికి కూడా ఒక ఆకృతి ఇచ్చినవారు అంబేడ్కర్. సాంఘిక సంస్కరణలు లేకుండా రాజకీయ సంస్కరణలు చేపట్టడం ఒక ప్రహసనం తప్ప మరొకటి కాదని అంబేడ్కర్ విశ్వసించారు. ఆయన సాంఘిక సమానత్వాన్ని ఆకాంక్షించారు. సాంఘిక సమానత్వం వెల్లివిరిస్తే బ్రిటిష్ వలస ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకోవాలనుకుంటున్న స్వాతంత్య్రం దానికదే వస్తుందని ఆయన నమ్మారు. అమెరికా, ఇంగ్లండ్, జర్మనీలలో విద్యాభ్యాసం చేసి అంబేడ్కర్ 1924లో భారతదేశం తిరిగి వచ్చారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆ వెంటనే బహిష్కృత హితకారిణి సభను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆయన నిర్వహించిన కార్యక్రమాలు చరిత్రాత్మకమైనవి. కొలాబాలోని చౌదార్ చెరువు నుంచి దళితులు సొంతంగా నీరు తెచ్చుకోవడానికి ఉద్దేశించిన మహద్ మార్చ్ అందులో భాగమే. అంబేడ్కర్‌కు అత్యంత ప్రీతిపాత్రమైన అంశం రాజ్యాంగ వ్యవహారాలు. బ్రిటిష్ ఇండియాలో రాజ్యాంగ నిర్మాణానికి పెద్ద కదలిక తెచ్చిన పరిణామం సైమన్ కమిషన్ లేదా రాయల్ కమిషన్ రాక. బ్రిటిష్ ఇండియాకు రాజ్యాంగం నిర్మించడానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడానికి సైమన్ కమిషన్‌ను ఆంగ్ల ప్రభుత్వం పంపించింది. ఉదారవాద న్యాయవాది సర్ జాన్ అల్సె బ్రూక్ సైమన్ దీనికి అధ్యక్షుడు. క్లెమెంట్ అట్లీ ఒక సభ్యుడు. ఈయన తరువాత ఇంగ్లండ్ ప్రధాని అయ్యారు. ఆయన ప్రధానిగా ఉండగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. హెన్రీ లెవీ లాసన్, ఎడ్వర్డ్ కాడోగన్, వెర్నాన్ హర్ట్స్హార్న్, జార్జ్ లేన్ఫాక్స్, డొనాల్డ్ హోవర్డ్ మిగిలిన సభ్యులు. మొత్తం ఎనిమిది మంది. దీనిని భారత జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకించింది. అప్పటికే కాంగ్రెస్‌తో ముదిరిన వైరాన్ని కూడా మరచి మహమ్మదలీ జిన్నా కూడా సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. కారణం ఒక్కటే– ఆ ఎనిమిది మందిలో ఒక్కరు కూడా భారతీయుడు లేడు. అయితే ఈ కమిషన్‌ను అంబేడ్కర్ నిరాకరించలేదు. కానీ సైమన్ కమిషన్ విఫలమైంది. ఈ అనుభవాలు, అభిప్రాయాల ప్రాతిపదికగానే అంబేడ్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో తన వాదన వినిపించారు. ఆయన వాదన దేశంలోని కింది కులాల ఉనికికి సంబంధించినది. వారి హక్కులకు సంబంధించినది. శతాబ్దాలుగా బాధిస్తున్న అణచివేత నుంచి విముక్తి కోరేది. భార త దేశంలో స్వయం పాలనకు అవసరమైన రాజ్యాంగం గురించి చర్చించడానికి ఇంగ్లిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేసింది. కాబట్టి దళితుల వాణిని వినిపించడం అనివార్యం. లేబర్ పార్టీ ప్రభుత్వం, నాటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్‌డొనాల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులలోను (1930–1932) అంబేడ్కర్ పాల్గొన్నారు. నిజానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లు స్వాతంత్య్రోద్యమానికి గొప్ప మేలు చేయలేదు. మొదటి సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులు హాజరు కాలేదు. రెండో సమావేశంలో బడుగులకు ప్రత్యేక నియోజకవర్గాల విషయంలో గాంధీజీకీ, అంబేడ్కర్‌కూ పొంతన కుదరలేదు. మూడో సమావేశం నామమాత్రంగా జరిగింది. మొత్తంగా చూస్తే స్వాతంత్య్ర సముపార్జనకు ఆ సమావేశాలు గొప్పగా ఉపయోగపడ్డాయని ఎవరూ చెప్పలేరు. కానీ ఇలాంటి సమావేశాల నుంచి కూడా తన వర్గం వారికి కొంత ప్రయోజనాన్ని సాధించిన వారు అంబేడ్కర్. రెత్తమాలై శ్రీనివాస్‌తో కలసి ‘డిప్రెస్డ్ క్లాస్’ ప్రతినిధిగా అంబేడ్కర్ ఇంగ్లండ్ వెళ్లారు. ‘అంటరాని’ కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని అంబేడ్కర్ తొలి రౌండ్ టేబుల్ సమావేశంలోనే ప్రతిపాదించారు. భారతదేశంలో అంటరాని కులాలు ఎదుర్కొంటున్న సమస్య ప్రధానంగా రాజకీయ పరమైనదే కానీ, సాంఘిక పరమైనది కాదని ఆయన వాదించారు. నాటి బ్రిటిష్ ఇండియాలో అంటరాని కులాల వారు 20 శాతం ఉన్నారు. సమాజంలో ఈ స్థాయి భాగస్వాముల సమస్యను నిర్లక్ష్యం చేయడం సాధ్యం కాదని కూడా ఆయన తేల్చి చెప్పారు. అంబేడ్కర్ ఉద్దేశంలో ప్రత్యేక నియోజకవర్గాలంటే, అంటరాని కులాలు మాత్రమే తమ ప్రతినిధులను ఎన్నుకుంటాయి. కానీ దీనిని గాంధీజీ వ్యతిరేకించారు. దీని వల్ల హిందూ సమాజం చీలికల పాలవుతుందని ఆయన వాదన. మనుషుల ఆలోచనా విధానంలో మార్పు తేగలిగితే అంటరానితనం పోతుందని గాంధీ విశ్వాసం. అందుకే అంబేడ్కర్ ప్రతిపాదనను రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ వ్యతిరేకించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తి కాగానే బ్రిటిష్ ప్రధాని మెక్‌డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్‌ను ప్రకటించారు. దీని ప్రకారం ముస్లింలకు, క్రైస్తవులకు, అగ్రకుల హిందువులకు, కింది కులాల హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు అలాగే అంటరాని కులాలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఆ అవార్డ్ ప్రకటించింది. గాంధీ అలిగి ఎరవాడ (పూనా) జైలులో నిరాహార దీక్ష చేపట్టారు. దీనితో అంబేడ్కర్ గాంధీజీతో చర్చలు జరిపారు. చివరికి అంటరాని కులాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కాకుండా, హిందూ నియోజకవర్గాల నుంచే ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించడానికి నిర్ణయించారు. అధికారం, హోదా పరిధులలో అంబేడ్కర్ సేవలు ఒక తరహాకు చెందుతాయి. కానీ క్షేత్రస్థాయిలో కూడా అంబేడ్కర్ దళితులను ఏకం చేయడానికి తన వంతు కృషి చేశారు. షెడ్యూల్డ్ కులాల సమాఖ్య పేరుతో 1942లో ఆయన నాగ్‌పూర్‌లో దళిత సమ్మేళనం నిర్వహించారు. దీనికి 75,000 పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో మహిళలు పాతికవేలు. దళితుల ఆత్మ గౌరవ నినాదం ఈ సభా వేదిక నుంచే అంబేడ్కర్ ఇచ్చారు. ఈ సమాఖ్యే తరువాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా అవతరించింది. అంబేడ్కర్ జీవితంలో సంఘ సంస్కరణోద్యమం ఒకవైపు, దళితుల సంఘటన ఒకవైపు, పరిపాలన మరొకవైపు కనిపిస్తాయి. 1942లో అంబేడ్కర్ వైస్రాయ్ కౌన్సిల్లో కార్మిక వ్యవహారాలు చూశారు. ఎనిమిది గంటల పని ఆయన చలవే. భవిష్య నిధి, దినసరి భత్యం కూడా ఆయన ఆలోచనే. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, ప్రసూతి సెలవు కూడా అంబేడ్కర్ చొరవతోనే రూపు దాల్చాయి. క్రిప్స్ మిషన్ సిఫారసుల మేరకు బ్రిటిష్ ప్రభుత్వం రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేసింది. ఇది అవిభక్త భారత్‌కు ఉద్దేశించినది. వివిధ ప్రాంతాల నుంచి ఈ పరిషత్‌కు సభ్యులు ఎన్నికై వచ్చారు. కానీ అంబేడ్కర్ బొంబాయి నుంచి పోటీ చేసినా పరిషత్‌కు ఎన్నిక కాలేదు. తరువాత ముస్లిం లీగ్ మద్దతుతో బెంగాల్ నుంచి ఎన్నికయ్యారు. తీరా అంబేడ్కర్ ఎన్నికైన ప్రాంతం తరువాత పాకిస్తాన్లో కలిసిపోయింది. అనంతరం బాబూ రాజేంద్రప్రసాద్ సూచన మేరకు మహారాష్ట్ర ప్రాంతం నుంచి అంబేడ్కర్ తిరిగి ఎన్నికై పరిషత్‌కు వచ్చారు. ఆ విధంగా ఆయన రాజ్యంగ ముసాయిదా సంఘానికి అధ్యక్షులయ్యారు. ఇందులో ఏడుగురు సభ్యులు ఉన్నప్పటికి ప్ర«ధాన బాధ్యత అంబేడ్కర్ మీదే పడింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నెహ్రూ తొలి ప్రభుత్వంలో అంబేడ్కర్ న్యాయ శాఖను నిర్వహించారు. కానీ హిందూ కోడ్ బిల్లు దగ్గర అభిప్రాయ భేదాలు వచ్చి రాజీనామా చేశారు. చిత్రం ఏమిటంటే స్వతంత్ర భారతదేశంలో తొలి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. ఆ ఎన్నికలలో అంబేడ్కర్ ఉత్తర బొంబాయి నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. కానీ అంతగా పేరు ప్రఖ్యాతులు లేని కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ కాజ్రోకర్ చేతిలో ఆ దిగ్గజం ఓటమి పాలైంది. నారాయణ్ ఒకప్పుడు అంబేడ్కర్ సహాయకుడే. అదే సంవత్సరం ఆయనను రాజ్యసభకు పంపారు. తుది ఊపిరి వరకు ఆ సభ సభ్యునిగానే ఉన్నారు. మధ్యలో బొంబాయి బాంద్రా నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగితే అంబేడ్కర్ మళ్లీ లోక్‌సభకు పోటీ చేశారు. కానీ మరోసారి ఓటమి ఎదురైంది. మొత్తానికి మొదటి లోక్‌సభలో అంబేడ్కర్ వంటి న్యాయ నిపుణుడికి అవకాశం దక్కలేదు. ఇది భారత చట్టసభల చరిత్రలో కనిపించే పెద్ద వైచిత్రి. · -
‘రాణిం’చని హిచ్కి
న్యూ ఢిల్లీ : బాలీవుడ్ ‘బ్లాక్’ బ్యూటీ రాణీముఖర్జీ కాస్త విరామం తర్వాత నటించిన చిత్రం ‘హిచ్కి’. క్రిటిక్స్‌ను సైతం మెప్పించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను మాత్రం మెప్పించలేకపోయింది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.20.10 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. దేశవ్యాప్తంగా హిచ్కి.. 961 థియేటర్లలో విడుదలైంది. శనివారం రూ. 5.35 కోట్ల వసూళ్లు సాధించగా ఆదివారం రూ. 6.70 కోట్ కలెక్షన్లు రాబట్టింది. వారాంతాల్లో తప్ప మిగతా రోజుల్లో సినిమా వసూళ్లు సుమారుగా రూ. 3.30 కోట్లు మాత్రమే. బ్రాడ్ కోహెన్ పుస్తకం ‘ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్’ ఆధారంగా నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ పి.మల్హోత్ర తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాణీ నైనా మథుర్ అనే పాత్రలో నటించింది. నరాలకు సంబంధించిన వ్యాధి టౌరోట్ సిండ్రోమ్‌తో బాధపడే మహిత పాత్రలో ఆమె కనిపించింది. మాట్లాడేటప్పుడు మధ్యలో అవరోధాలు ఏర్పడటం.. విచిత్రమైన శబ్ధాలు చేయటం ఈ వ్యాధి లక్షణం. సమాజంలో ఉన్న అసమానతలు మన నిత్య జీవితంలో ఎలా భాగమయ్యాయనే అంశాన్ని కూడా ఈ చిత్రంలో చూపించారు. బాలీవుడ్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఆమీర్‌ఖాన్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు హిచ్కిపై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు కూడా. ‘మర్దాని’ (2014) చిత్రం తర్వాత రాణీ ‘హిచ్కి’తో రీఎంట్రీ ఇచ్చారు. -
భారతీయ సీనియర్లు వేధించారు!
లాస్ఏంజెలెస్: తమను బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగించారని, ఆ స్థానంలో తక్కువ అర్హతలున్న దక్షిణాసియా వాసుల్ని నియమించుకున్నారని ఆరోపిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌పై లాస్ ఏంజెలెస్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టులో ముగ్గురు మాజీ ఉద్యోగులు కేసు దాఖలు చేశారు. భారత్‌కు చెందిన పై అధికారులు, సహ ఉద్యోగులు అవమానించారని, తక్కువ రేటింగ్ ఇవ్వడంతో పాటు ప్రమోషన్లు నిరాకరించారని తమ పిటిషన్లో వారు పేర్కొన్నారు. అయితే తమపై దాఖలైన కేసు చట్టపరంగా చెల్లదని హెచ్–1బీ వీసాదారులు అత్యధికంగా పనిచేస్తున్న జాబితాలో రెండో స్థానంలో ఉన్న కాగ్నిజెంట్ కోర్టుకు తెలిపింది. ఆ ఆరోపణలు అమెరికా పౌర హక్కుల చట్టం కిందకు రావని ఆ కంపెనీ వాదిస్తోంది. ‘పౌర హక్కుల చట్టం 1964 ప్రకారం.. జాతి ఆధారంగా వివక్ష నిషేధం. అయితే దేశం ఆధారంగా వివక్ష చూపారని ఈ కేసులోని కక్షిదారులు ఆరోపించారు. అందువల్ల ఆరోపణలు చెల్లవు’ అని కోర్టుకు వెల్లడించింది. గురువారం కోర్టు తన నిర్ణయం వెలువరించనుంది. -
మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులు
శాన్ఫ్రాన్సిస్కో : ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా పేరున్న మైక్రోసాఫ్ట్‌లో కూడా మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులు, లింగ వివక్ష ఎక్కువగానే ఉంది. 2010 నుంచి 2016 వరకు లింగ వివక్ష, లైంగిక వేధింపుల కింద 238 ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు తెలిసింది. గత కొన్నేళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న మహిళలు తమపై జరుగుతున్న వేధింపులను, లింగ వివక్షపై చేసిన ఫిర్యాదులు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ ప్రతీసారి ఉద్యోగినులకు జీతాల పెంపు, ప్రమోషన్ విషయంలో అన్యాయం చేస్తుందని ఈ ఫిర్యాదుల్లో వెల్లడైంది. అయితే ఈ ఫిర్యాదులను మైక్రోసాఫ్ట్ ఖండిస్తోంది. దీనిపై 8 వేల మందికి పైగా ఉద్యోగినులతో ఒక క్లాస్ యాక్షన్ దావాను కూడా మహిళల తరుఫున వాదించే న్యాయవాదులు ఫైల్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా సమర్పించిన లీగల్ ఫైలింగ్స్ మార్చి 12న వెలుగులోకి వచ్చాయి. 238 ఫిర్యాదుల్లో 118 మంది ఫిర్యాదులు లింగ వివక్షకు సంబంధించినవే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులను కంపెనీలు ప్రైవేట్‌గా ఉంచుతాయి. దీంతో ఎన్ని ఫిర్యాదులు వెల్లువెత్తాయో చెప్పడం కూడా కష్టంగా మారుతోంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి నిరాకరించారు. ఇంకా క్లాస్ యాక్షన్ స్టేటస్‌పై అమెరికా జిల్లా జడ్జి జేమ్స్ రోబార్ట్ కూడా ఎలాంటి తీర్పు ప్రకటించలేదు. మహిళల ఫిర్యాదుల సంఖ్యను సీక్రెట్‌గా ఉంచాలని మైక్రోసాఫ్ట్ వాదిస్తోంది. భవిష్యత్తు దుర్వినియోగం అవకుండా చూడాలంటోంది. -
ఇంకెన్నాళ్లీ వివక్ష..?
సాక్షి, హైదరాబాద్ : అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగడం బాధాకరమని మెగసెసె అవార్డు గ్రహీత, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ఉద్యమకారిణి ప్రొఫెసర్ శాంతాసిన్హా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో టీపీసీసీ మహిళా విభాగం ఆ«ధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు, అవకాశాలు లభించడం లేదు. ఆర్థిక, విద్యారంగాల్లో పురోగతితోనే సరైన సమానత్వం వస్తుంది, అందుకు మహిళలు విద్యావంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటికి పంపితే అత్యాచారాలు జరుగుతాయనే అనుమానంతో చదువుకు దూరం చేసి, చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నారు. దీని కోసం చట్టాల్లో మార్పులు రావాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి తగిన చట్టాలు వచ్చాయని’ అన్నారు. టీపీసీసీ మహిళావిభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మహిళలను గౌరవిస్తుందని, మిగతా పార్టీలలో వారి పట్ల చిన్న చూపు ఉందన్నారు. టీఆర్ఎస్లో మహిళలకు గౌరవం, అవకాశం లేవని విమర్శించారు. -
నా తల సింక్‌లో ఉంచి వేణ్ణీళ్ల ట్యాప్ తిప్పాడు
ప్ర. మా పెళ్లయి యేడాది అవుతోంది. అరేంజ్డ్ మ్యారేజ్. ఆయనకు అమెరికాలో ఉద్యోగం. పెళ్లయిన నెలకు డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్లాను. ఓ పదిహేను రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత నుంచి అసలు రూపం చూపించడం మొదలుపెట్టాడు. వంట చేస్తుంటే ఉడుకుతున్న కూరలో మగ్గుడు నీళ్లు కుమ్మరించేవాడు. నేను స్నానాకి వెళితే బయట నుంచి బాత్రూమ్ డోర్ లాక్ చేసేవాడు. బాగా రెడీ అయినా తప్పే.. రెడీ కాకపోయినా తప్పే. అతని ఫ్రెండ్స్ ఇంటికి వస్తే పలకరిస్తే లైటింగ్ కొడుతున్నావా అనేవాడు. ఓసారి.. మీ అమ్మానాన్న.. అంటూ మా పేరెంట్స్‌ని తిడుతుంటే సహించలేక ఎదురు తిరిగాను. అంతే నా జుట్టుపట్టి లాగి తోసేశాడు. సోఫాకి నా తల కొట్టుకొని రక్తం వచ్చింది. అయినా ఆగకుండా... నా జుట్టు పట్టుకొని బాత్రూమ్లోకి ఈడ్చుకెళ్లి సింక్‌లో నా మెడను వంచి వేడి నీళ్ల ట్యాప్ తిప్పాడు. తట్టుకోలేక తప్పించుకునే ప్రయత్నంలో ఆయన్ని తోసేశాను. కిందపడ్డాడు. ఆవేశంతో లేచి అక్కడే ఉన్న సిజర్స్‌తో నా పెద్ద జడను కత్తిరించేశాడు. వాళ్ల వాళ్లకు ఫోన్ చేసి ‘‘నా పెళ్లాం నన్ను కొడుతోంది’’ అంటూ ఏడ్చాడు. ‘‘మీ అమ్మాయి రాక్షసి. కాపురం చేయడం నావల్ల కాదు, పంపించేస్తున్నాను’’ అని అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసి ఇండియాకు పంపించేశాడు. నేను ఆయన దగ్గరున్నది కేవలం ఆరు నెలలే. ఆయన పెట్టే హింస గురించి మా వాళ్లకు చెబితే హర్ట్ అవుతారని చెప్పకుండా దాచాను. కాని ఇక్కడికి వచ్చాక జరిగినదంతా చెప్పాను. మా పెద్దవాళ్లు నన్ను తీసుకొని హైదరాబాద్‌లోనే ఉన్న మా అత్తారింటికి వెళ్లారు. వాళ్లూ నాదే తప్పన్నట్టుగా చెప్పి మా పెద్దవాళ్లను ఇన్సల్ట్ చేశారు. మా వారికి ఫోన్ చేస్తే బూతులు తిట్టాడు మా వాళ్లను. తను ఇంకో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఆయనను ఇండియాకు రప్పించి, శిక్షించే మార్గం లేదా? నేనేం చేయాలి? – ఆరతి, హైదరాబాద్. జ. ఇదంతా డొమెస్టిక్ వయొలెన్స్ కిందకే వస్తుంది. ముందు మీరు మీ భర్త మీద కేస్ పెట్టండి. తర్వాత లుక్ అవుట్ కేస్ కింద కంప్లయింట్ ఇవ్వండి. అలాగే 498 ఏ, వయొలెన్స్, హెరాస్మెంట్ కిందా కంప్లయింట్ ఫైల్ చేయండి. మీ హజ్బెండ్ అమెరికాలో ఉన్నాడు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్‌లోని ఎన్ఆర్ఐ సెల్‌కి, ఇండియన్ ఎంబసీకి దరఖాస్తు చేయండి. అంతేకాదు మీ భర్త అమెరికాలో ఏ స్టేట్‌లో ఉంటున్నాడో ఆ స్టేట్ లా గురించి తెలుసుకొని హెరాస్‌మెంట్‌కు పాల్పడ్డాడని అక్కడి అటార్నీతో మీ భర్తకు లీగల్ నోటీస్ ఇప్పించండి. అన్నిటికన్నా ఎక్కువ వర్కవుట్ అయ్యేది లుక్ అవుట్ నోటీసే. మీ భర్త ఎప్పుడు ఇండియాకు వచ్చినా ఈ లుక్ అవుట్ నోటీస్ కింద అతనిని వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇదేకాక.. మీరు సెక్షన్ 125 కింద మెయిన్టెనెన్స్ కోసం కోర్ట్‌లో కేస్ వేసుకోవచ్చు కూడా. ఇందుకోసం చాలా తిరగాల్సి ఉంటుంది. అతనికి శిక్ష పడాలి అనుకుంటే మీకు ఈ ఓపిక అవసరం! – మమతా రఘువీర్, అడ్వకేట్, ఫౌండర్, తరుణి మాకు పంపండి: ఒక మహిళగా మీరు గృహహింస వంటి వేధింపులకు గానీ, సామాజికంగా వివక్షకుగానీ, సంబంధిత ఇతర సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యను రాసి మాకు మెయిల్ ద్వారా పంపించండి. ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మీకు తగిన సూచనలు / సలహాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మీరు మీ ప్రశ్నలను పంపాల్సిన మెయిల్ ఐడీ : nenusakthiquestions@gmail.com -
ప్రాణాంతక వివక్ష
ఏడు దశాబ్దాల స్వాతంత్య్రంలో దళిత సంక్షేమం కోసం ఎంతో చేశామని చెప్పే నాయకులకూ... దళిత కులాలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాల కొనసాగింపు ఇక అనవసరమని వాదించే మేధావులకూ కొదవ లేదు. కానీ నిలువెల్లా అసమానతలు నిండిన ఈ సమాజంలో కులం ఎలాంటి పాత్ర పోషిస్తున్నదో, ఏ పర్యవసానాలకు దారితీస్తున్నదో ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌లో దళిత కులాల్లో పుట్టడం, అందునా ఆడపిల్లగా పుట్టడం ప్రాణాంతకమవుతున్నదని గణాంక సహితంగా నిరూపించింది. ఆధిపత్య కులాల్లో పుట్టిన సగటు మహిళతో పోలిస్తే దళిత కులాల్లోని మహిళల ఆయుఃప్రమాణం 14.6 సంవత్సరాలు తక్కు వని ఆ నివేదిక చెబుతోంది. ఆధిపత్య కులాల్లోని మహిళల సగటు ఆయః ప్రమాణం 54.1 సంవత్సరాలైతే దళిత మహిళల ఆయుః ప్రమాణం 39.5 సంవ త్సరాలని తేల్చింది. రెండున్నరేళ్ల క్రితం అంటే... 2015 సెప్టెంబర్‌లో ప్రపంచ దేశాధినేతలందరూ సమావేశమై 2030 నాటికల్లా సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. పదిహేను సంవత్సరాల వ్యవధిలో ప్రపంచ దేశాలన్నీ ఈ లక్ష్యాలు సాధించాలన్నది సమితి సమావేశం ధ్యేయం. పేదరిక నిర్మూలన అందులో మొదటి లక్ష్యమైతే, ఆకలిని అంతమొందించడం, మంచి ఆరోగ్యం, ప్రామాణిక విద్య, లింగ వివక్ష అంతం, అసమానతల తగ్గింపు తదితరాలు ఇతర లక్ష్యాలు. వాటి సాధనకు వివిధ దేశాలు నిర్ణయించుకున్న కార్యాచరణ ఏమిటో, అది ఇంతవరకూ ఎలాంటి ఫలితాలనిచ్చిందో తెలుసుకోవడం...లోటుపాట్లను వెల్లడించి దిద్దుబాటు చర్య లకు సూచనలీయడం తాజా నివేదిక ఉద్దేశం. సమితి నిర్దేశించిన కాల వ్యవధిలో ఇప్పటికే రెండున్నరేళ్లు ముగిశాయి. ఇక మిగిలింది పన్నెండున్నర సంవత్సరాలు. దురదృష్టకరమైన విషయమేమంటే ఈ నివేదికను గమనించినా, మన దేశంలోని వర్తమాన స్థితిగతులను అర్ధం చేసుకున్నా 2030 కాదుగదా... 3030కి కూడా ఈ లక్ష్యాల సాధన అసాధ్యమనిపిస్తుంది. ఆడ శిశువుల్ని చిదిమేసే నరమేథం మన దేశంలో యధేచ్ఛగా సాగుతోంది. బాలిక పుడితే భారమని భావించి రోజుకు 1,370మంది ఆడశిశువుల్ని హతమారు స్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలిస్తున్న ప్రభుత్వాలున్నాయి. అయినా ఈ దుర్మార్గం ఎక్కడా తగ్గిన దాఖలాలు కనబడటం లేదు. పుట్టాక ఇంట్లోనూ, చదువు కోసం చేరింది మొద లుకొని సమాజంలోనూ ఎదుర్కొంటున్న వివక్షకు అంతూ పొంతూ ఉండటం లేదు. పుట్టిన కులాన్నిబట్టి ఈ వివక్షలో సైతం హెచ్చుతగ్గులుంటున్నాయని సమితి నివేదిక చెబుతోంది. దళిత కులాల మహిళలు ఎక్కువ వివక్ష చవిచూడవలసి వస్తున్నదని వివరిస్తోంది. ఆహారం, ఆరోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్యం, మంచినీరు వంటి సదుపాయాల లభ్యతలో ఉన్న తేడా వల్ల ఈ రెండు వర్గాల్లోని మహిళల ఆయుః ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నాయన్నది నివేదిక సారాంశం. అడుగు ముందుకే పడినట్టు కనిపిస్తుంది. ఆధునికత విస్తరిస్తోంది. అభివృద్ధి కొత్త అంచుల్ని తాకుతోంది. కానీ ఆడపిల్లపై వివక్ష మాత్రం ఎప్పటికప్పుడు రూపం మార్చుకుని స్థిరంగా ఉంది. పైగా పుట్టిన కులాన్నిబట్టి దాని తీవ్రతలో తేడా ఉంటున్నది. చదువుకోవడం మొదలుకొని అన్ని విషయాల్లోనూ దళిత, పేద కులాల మహిళలకూ, ఆధిపత్య కులాల్లోని మహిళలకూ వ్యత్యాసం ఉన్నదని నివే దిక వెల్లడించింది. ఆడపిల్ల చదువు, పెళ్లి, ఆర్థిక స్వాతంత్య్రం వగైరాలన్నీ పుట్టుకే నిర్ణయిస్తున్నదని నివేదికలోని గణాంకాలు చెబుతున్నాయి. పద్దెనిమిదేళ్లలోపునే పెళ్ల యిన మహిళలు ఆధిపత్య కులాలతో పోలిస్తే దళిత కులాల్లో అయిదు రెట్లు ఎక్కువ. బడికెళ్లడం విషయంలో ఈ తేడా మరిన్ని రెట్లు ఎక్కువ. నిజానికి ఈ నివేదిక ఇక్కడి సామాజిక వివక్షను దాని లోతుల్లోకి పోయి పరిశీలించినట్టు కనబడదు. ఆ పని చేసినట్టయితే ఇది మరింతగా తేట తెల్లమయ్యేది. రెండు రోజులక్రితం బడి పిల్లల్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చానెళ్ల ద్వారా ‘పరీక్షా పర్ చర్చా’ నిర్వహించినప్పుడు దాన్ని వీక్షించడానికి హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక పాఠశాల కమిటీ అధ్యక్షుడి ఇంట్లో గ్రామ పంచాయతీ టెలివిజన్ ఏర్పాటు చేస్తే ఆధిపత్య కులాల పిల్లల్ని లోపలా, దళిత కులాల పిల్లల్ని వెలుపల దూరంగా గుర్రాలు కట్టే స్థలంలో కూర్చోబెట్టారని మీడియాలో కథనాలొచ్చాయి. గుజరాత్‌లోని పాటన్ జిల్లాలో తమకు దక్కాల్సిన భూమికి పట్టాల్విడంలో జిల్లా యంత్రాంగం జాప్యం చేస్తున్నదని విసిగి ఒక దళిత కార్యకర్త ఆత్మాహుతికి పాల్పడ్డాడు. 2011నాటి జనాభా గణనలో వెల్లడైన సాంఘికార్థిక స్థితిగతుల ప్రకారం దేశంలో 67 శాతం దళిత కుటుంబాలకు సొంతంగా భూమి లేదు. ఆదివాసీల్లో ఈ శాతం మరింత అధికం. భూమి మీద హక్కు లేనప్పుడు ఇతర హక్కులు కూడా వారికి దక్కవు. కనుకనే ఆ వర్గాలు కనీస సదుపాయాలకు సైతం దూరంగా ఉంటున్నాయి. ప్రభుత్వాలు ఆర్భాటంగా ప్రారంభించే పథకాలు వారికి సక్రమంగా చేరడం లేదు. ఈ అసమానత ప్రభావం ఆ కులాల్లోని బాలికలు, మహిళల విషయంలో మరింత ఎక్కువగా ఉంటున్నది. ఐక్యరాజ్యసమితి నిర్దే శించిన లక్ష్యాల సాధనలో కాస్తయినా పురోగతి కనబడకపోవడానికి కారణం ప్రభుత్వాలన్నీ భూ పంపిణీని నిర్లక్ష్యం చేయడమే. నీరవ్ మోదీ లాంటి వాడు పరిశ్రమ పెడతామంటే ఎకరాలకు ఎకరాలు సంతర్పణ చేయడానికి సిద్ధపడే ప్రభు త్వాలు దళిత కుటుంబాలకు ఒకటి రెండెకరాల భూమిని ఇవ్వలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాయకష్టం తప్ప మరేమీ లేని ఆ కులాల సామాజికాభివృద్ధి సాధ్యపడేదెలా? ఐక్యరాజ్యసమితి లక్ష్య నిర్దేశం చేయడం, వాటిని సాధిస్తామని పాలకులు ప్రతినబూనడం చూడటానికి బాగానే ఉండొచ్చు. కానీ మౌలిక సమస్యల జోలికి పోనంతకాలమూ ఫలితాలు వెక్కిరిస్తూనే ఉంటాయి. మిగిలిన వ్యవధి లోనైనా ఎంతో కొంత సాధించాలంటే అందుకు నిర్దిష్ట కార్యాచరణ అవసరమని పాలకులు గుర్తించాలి. -
పవరు హత్య
చెట్టు స్త్రీలాంటిది. బీడులోంచి కూడా శక్తిని లాగి, నీడను ఇస్తుంది! అలాంటి చెట్టును ఏ ఊరు కోరుకోదు? ఏ ఊరు ఆ చెట్టును మోడువారుస్తుంది? ఏ ఊరు తన కాళ్లను తానే గొడ్డలితో నరుక్కుంటుంది? అలాంటి ఊరు ఉండదు. ఉంటే.. అది మూర్ఖత్వమే. కాదు.. కాదు.. వివక్ష. వృక్షాన్ని కూడా నిలవనివ్వకుండా పడగొట్టేయాలనుకునే వివక్ష! సర్పంచ్ ఇంటికి పాలుబోస్తే 500 జరిమానా! ఆ ఇంట్లో వాళ్లతో మాట్లాడితే జరిమానా! సర్పంచ్ భర్త బండిమీద ఎక్కితే జరిమానా! వాళ్ల పొలంలోనికి ట్రాక్టర్ తోలితే జరిమానా! పరువు హత్యల గురించి విన్నాం. ఈ ‘పవరు హత్య’ ఏంటి?! పెళ్లిలో ఎంపిక చేసుకుంటారు. అక్కడ పరువు హత్యలు జరుగుతున్నాయి. పవర్లో ఎన్నుకుంటారు. అక్కడ పవర్ హత్యలు జరుగుతున్నాయి. ఒక దళిత మహిళా సర్పంచ్ పవర్‌పై జరిగిన హత్య ఇది. చట్టం కూడా చూస్తూ కూర్చున్న కథ ఇది! గ్రామ పంచాయతీ వైపు విసురుగా వెళ్లాడు గ్రామ పెద్ద. ‘‘అరేయ్ ఆ కుర్చీ తేరా..’’ పాలేరుని గదిమి అతను తెచ్చిన కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు. పంచాయతీ సెక్రటరీని పిలిచి చెప్పాడు. ‘‘ఇక నుంచి ఏ ఫైల్ మీదా సర్పంచ్ సంతకం తీసుకోవద్దు. ఆమె ఏ కార్యక్రమాలకీ హాజరు కాకూడదు. ఆమె ఇంటికెవ్వరూ వెళ్లకూడదు. ఆమెతో ఎవ్వరూ మాట్లాడకూడదు. ఆమె భర్త బండి మీద కూడా ఎవరూ ఎక్కకూడదు..’’ హుకుం జారీ చేసి, కుర్చీలోంచి లేచి వెళ్లిపోయాడు ఆ గ్రామపెద్ద. స్త్రీ.. ఆపై దళిత స్త్రీ నిజానికి ఆ గ్రామ సర్పంచి మమత. పంచాయతీలో ఆమె నిర్ణయం ప్రకారమే అన్నీ జరగాలి. ఏ సభ జరిగినా, ఏ మీటింగ్ పెట్టినా ఆమె ఉండి తీరాలి. అలాంటిది.. సర్పంచిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటి నుంచీ గ్రామంలోని అగ్రవర్ణాలవారి నుండి వివక్ష మొదలైంది. దానికి కారణం.. మమత కుటుంబీకుల భూమిపై పెద్దవాళ్ల కన్ను పడటం. దానిని సొంతం చేసుకునేందుకు వారంతా కలిసి మమత కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టారు. పైగా.. ఏకగ్రీవ ఎన్నిక! భర్త ఎం.పి.పి.గా పని చేసినా, మమత పదవ తరగతి వరకు చదువుకోవడంతో కాస్తో కూస్తో పాలనా వ్యవహారాలను అర్థం చేసుకోగలిగింది. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. లోకల్‌గా ‘పెద్దవాళ’్ల మాట విన్నంత వరకూ ఆమెకు ఏ ఇబ్బందీ కలగలేదు. అయితే మమత కుటుంబానికి చెందిన భూమిని తమకు రాసివ్వాలనీ, అదెప్పుడో ఆమె తాత ముత్తాతలు తమకు అమ్మేశారనీ మమతను, ఆమె భర్త శ్రీనివాస్‌నీ బలవంతపెట్టారు ఊరి అగ్రవర్ణ పెద్దలు. చప్పుడు చెయ్యకుండా భూమిని అమ్మేసినట్టు సంతకం పెట్టాలని కూడా నయానా భయానా చెప్పి చూశారు. ‘సర్పంచి ఆడమనిషే కదా, మేం చెపితే వినదా’ అన్నది వాళ్ల ధీమా! గ్రామ బహిష్కారం భార్యాభర్తలిద్దరూ లొంగకపోవడంతో వాళ్ల అహంకారం బుసలు కొట్టింది. ఆడ సర్పంచినే చెప్పుచేతల్లో పెట్టుకోలేకపోతే, రేప్పొద్దున తమ పెద్దరికాన్ని ఎవరు గౌరవిస్తారు? ఊళ్లో పరువు పోదా? ఏదో ఒకటి చేసి వాళ్లని దారికి తేవాలని అనుకున్నారు పెద్దలు. ఆ రాత్రి అంతా కూర్చొని... సర్పంచిని గ్రామం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. అలా నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు దగ్గరలోని మిండోరా మండలం, బుస్సాపూర్ గ్రామ సర్పంచ్ జక్కుల మమతను వెలివేశారన్న విషయం చుట్టుపక్కల గ్రామాల్లో గుప్పుమంది. ఒక్కొక్కరూ దూరం అయ్యారు ‘‘ఆ పదకొండెకరాలు మావేనని సంతకం పెట్టండి. అంతవరకు మిమ్మల్ని గ్రామం నుంచి వెలేస్తున్నాం. ఎవ్వరూ మీతోని మాట్లాడరు. మీరు ఎవ్వరిళ్లకెళ్లొద్దు. మా కట్టుబాటు ధిక్కరిస్తే జరిమానా కట్టాల్సిందే’’ అన్న ఆ ఊరి పెద్ద హెచ్చరిక గుర్తొచ్చింది మమతకి. పొలం దున్నాలని ట్రాక్టర్ మాట్లాడితే రాత్రి వస్తానని చెప్పిన వ్యక్తి పొద్దున్నే ఫోన్ చేస్తే ‘‘నువ్విచ్చే దానికన్నా నీకు ట్రాక్టర్ తోలితే మాకయ్యే ఖర్చే ఎక్కువ’’ అన్నప్పుడు కానీ తనకు అర్థం కాలేదు.. అతను జరిమానాకు భయపడుతున్నాడని. మమతని భోజనానికి పిలిచినందుకు ఆ పిలిచిన కుటుంబంపై కూడా జరిమానా విధించారు. ఫిర్యాదు చేసినా.. చర్యల్లేవు! సమానత్వం, రాజ్యాంగం అని పెద్ద పెద్ద మాటలు చెపుతారు. కానీ ఇక్కడేం జరుగుతోంది? భర్తను నెమ్మదిగా పిలిచి చెప్పింది మమత. ‘‘పోలీసు కంప్లైంట్ ఇద్దాం’’ అని. 2018 జనవరి 7వ తేదీన స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేశారు వెలివేత మీద. పాలు కూడా పోయనివ్వడం లేదనీ, పాలుపోసే అతణ్ణి బెదిరించి మాన్పించారని ఫిర్యాదు చేశారు భార్యాభర్తలిద్దరూ. జనవరి 11న ఆర్డీవో, ఏసీపీ సహా వచ్చి గ్రామసభ పెట్టారు. మహిళా సర్పంచ్ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసినట్టు ఒప్పుకున్నారు పెద్దవాళ్లంతా. అది కుల నిర్ణయం అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఇంతవరకు దోషులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇవ్వరు.. ఇచ్చినా ఉండనివ్వరు! అవమానమిది. స్త్రీల రాజకీయ సాధికారతను గురించి గొప్పలు చెప్పే రాజ్యాధినేతలు సైతం తలలు దించుకోవాల్సిన ఘటన ఇది. ఏం చేస్తున్నారు పాలకులు? గ్రామసభలో అది నిజమని తేలినా ఎందుకు ఇంకా చర్యలు తీసుకోరు? అంటే నిర్లక్ష్యం. వాళ్లు దళితులన్న నిర్లక్ష్యం. మామూలుగానే మహిళలను రాజకీయాల్లోనికి రానివ్వరు. ఇక దళిత సర్పంచిని వేధించకుండా ఉంటారా? 33 శాతం మహిళా రిజర్వేషన్ అంటారు. కానీ ఇంత వరకు అది చట్టంగా రాలేదు. రిజర్వేషన్లు ఇచ్చిన చోటేమో ఇలా దౌర్జన్యం చేస్తారు. దీనికి ఒకటే పరిష్కారం... దామాషా ప్రాతినిధ్యం. ఓట్ల శాతాన్ని బట్టి సీట్లనివ్వడం. – కె.లలిత, సమాజిక కార్యకర్త, ‘యుగాంతర్’ సంస్థ డైరెక్టర్ స్త్రీలు రాజ్యాధికారంలో భాగం కాకూడదా? ఇది రాజ్యాంగ విరుద్ధం. భారతీయ సమాజంలో కొనసాగుతోన్న వివిధ వివక్షల్లో మహిళల అణచివేత తీవ్రంగా పరిణమిస్తోంది. పురుషాధిపత్య భావజాలం కారణంగానే ఈ అమానుషాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను కూడా పురుషాధిపత్య పెత్తందారీ సమాజం కాలరాసి, స్త్రీలను అణచివేస్తోంది. – పి. శంకర్, ప్రెసిడెంట్, దళిత బహుజన ఫ్రంట్, తెలంగాణ తక్కువ కులపోల్లని చిన్నచూపే కదా..! ఇప్పటికి నెలదాటింది. ఇంత వరకు దోషులపై చర్య తీసుకోలేదు. ఒక ఆడ మనిషి సర్పంచ్‌గా ఉండబట్టేగదా ఇట్ల జేస్తుండ్రు. అదే మగ సర్పంచ్ అయితే ఇట్ల జేస్తరా? దీనిపైన కంప్లైంట్ ఇస్తే డీఎస్పీ గూడ వచ్చి వెలివేసింది నిజమేనని జెప్పిండ్రు. ఎఫ్ఐఆర్ గూడ అయ్యింది. అయిన గూడ వాళ్లపైన ఏమీ చర్యలు దీసుకోలే. దీనికెవ్వరు సమాధానం జెప్తరు? ఇదంతా ఒక ఆడామె ఏం జెయ్యలేదనేగదా? లేకుంటే తక్కువకులపోల్లని చిన్నచూపేగదా? – మమత, బుస్సాపూర్ గ్రామ సర్పంచ్ -
వి'కక్ష'
స్త్రీ పురుషుల శారీరక, భౌతిక ప్రత్యేకతల రీత్యా స్త్రీలు ఇంటిపనికీ, పురుషులు బయటిపనికీ పరిమితమయ్యారు. కాలక్రమేణా స్త్రీలు చేసే ఇంటిశ్రమకు గుర్తింపే లేని పరిస్థితి ఏర్పడింది. శ్రమ విభజన.. పనిలో సైతం స్త్రీ పురుష అంతరాలు కొనసాగిస్తోంది. దీంతో గృహసంబంధిత పనులు స్త్రీలే చేయాలనే భావం, ఉద్యోగం పురుష లక్షణంగా పాతుకుపోయింది. పురుషులు బయటకెళ్లి సంపాదించేవారు కనుక వారికి సమాజం అధిక ప్రాధాన్యమిస్తోంది. స్త్రీలు పిల్లల పెంపకం, వంట, ఇంటిపనులకే పరిమితం. ఆమె చేస్తున్నది అనుత్పాదక పని కనుక ఆమెను ద్వితీయ శ్రేణి పౌరురాలిగా సమాజం నెట్టివేసింది. ఉత్పాదక రంగంలో ఉన్న పురుషుల శ్రమని లెక్కించొచ్చు. కానీ స్త్రీలు చేసే పనికి కొలమానం లేకుండా నిర్లక్ష్యానికి గురయ్యింది. ఈ ఆర్థికపరమైన విభజన భావనే స్త్రీ పురుష అసమానతలకు పునాది అని సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం. పెట్టుబడిదారీ సమాజం రెండు రకాలైన శ్రామికులను తయారు చేసింది. తక్కువ వేతనంతో ఎక్కువగా (పనిగంటలు) శ్రమించే వారు ఒకరకం అయితే అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితిలో ఉండి ఎక్కువ వేతనాలు పొందుతూ తక్కువ పనిగంటలు శ్రమించేవారు రెండవ రకం. (ఉదాహరణకు కన్స్ట్రక్షన్ పనిలోఉండేవారు) మొదటి రకం శ్రామికులు స్త్రీలైతే, రెండవ రకం వారు పురుషులు. ఈ విభజన పనిలో లింగ వివక్షకు ప్రత్యక్ష ఉదాహరణ. స్త్రీలపై సమాజంలో కొనసాగుతోన్న వివక్షలన్నిటికీ ఇదే మూలం. గర్భంలో వివక్ష ఆరోగ్యం, ఆహారం విషయంలో, స్త్రీల పట్ల శ్రద్ధ వహించకపోవడం వల్ల అనారోగ్యం కారణంగా ఎందరో స్త్రీలు (మిస్సింగ్ వుమన్) కనపడకుండా పోతున్నారు. ఉండాల్సిన సెక్స్ నిష్పత్తికీ, మనుగడలో ఉన్న సెక్స్ నిష్పత్తికీ మధ్యనున్న తేడానే మిస్సింగ్ వుమన్గానూ, స్త్రీలపట్ల కొనసా గుతున్న వివక్షకి కొలమానంగానూ భావిస్తున్నారు. ♦ 2001లో - 3.91కోట్లు భారత దేశంలో మిస్సింగ్ వుమన్ సంఖ్య ♦భారతదేశంలో బాలబాలికల శాతం (0–6 యేళ్లు) ప్రతి 1000 మంది బాలురకి 1991లో - 945 ,2001లో - 927 , 2011లో - 914 ♦ 7000మంది మన దేశంలో పుట్టకముందే ప్రతి రోజూ చనిపోతున్న ఆడపిల్లలు (యునెటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్(యూనిసెఫ్) రిపోర్టు ప్రకారం) ఆహారంలో వివక్ష అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో స్త్రీల ఆహారం విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ వివక్ష కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ దేశాల్లో ‘సన్ ప్రిఫరెన్స్’ అత్యధికంగా ఉంది. పురుషులకు ఈ రెండు విషయాల్లోనూ ప్రథమ ప్రాధాన్యతనిస్తున్న పరిస్థితి ఉంది. పురుషులకన్నా స్త్రీలు తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నట్టు అనేక పరిశోధనలు తేల్చి చెప్పాయి. పురుషులకన్నా స్త్రీలు 29 శాతం తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నారు. సాధారణంగా మన భారతీయ మహిళలు తీసుకుంటున్న ఆహారం 1,400 కిలో క్యాలరీలు మాత్రమే. నిజానికి ప్రతిరోజూ ఒక స్త్రీకి తక్కువలో తక్కువ అవసరమైనది 1,600 కిలో క్యాలరీలు. కానీ ప్రతి స్త్రీ అవసరమైన దానికన్నా 200 కిలో క్యాలరీలు తక్కువగా తీసుకుంటోంది. 1600 - నిజానికి ప్రతిరోజూ ఒక స్త్రీ కి తక్కువలో తక్కువ అవసరమైన కిలో క్యాలరీలు. 1400 - మన భారతీయ మహిళలు తీసుకుంటున్న ఆహారం కిలో క్యాలరీలు శ్రమలో వివక్ష ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం ఆహార ఉత్పత్తిని స్త్రీలే సృష్టిస్తున్నారు. భారతీయ స్త్రీ సగటున ప్రతిరోజూ నాలుగు గంటలపాటు లేదా తన జీవితకాలంలో 16 శాతం వంటింటిలోనే గడుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం శ్రామికుల్లో 40 శాతం మంది స్త్రీలే. ప్రత్యేకించి వ్యవసాయరంగంలో పనిచేస్తోన్న శ్రామికుల్లో 43 శాతం మంది మహిళలే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉపాధి రంగంలో స్త్రీల సంఖ్య పెరగడానికి ఫెర్టిలిటీ శాతం తగ్గడం ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు.1980–2008 సంవత్సరాల మధ్య ఉత్పాదక శ్రమ భాగస్వామ్యంలో స్త్రీ పురుష వివక్ష 32 శాతం నుంచి 26 శాతానికి తగ్గినట్టు వరల్డ్ డెవలప్మెంట్ 2012 రిపోర్టు తేల్చి చెప్పింది. ప్రతిఫలంలో వివక్ష బయటకెళ్ళి పనిచేసేవారిలో స్త్రీలకంటే పురుషులే అధికం. అయితే ప్రధానంగా పేద కుటుంబాల్లో స్త్రీలు ఉత్పాదక శ్రమలోనూ, ఇటు గృహ సంబంధమైన అనుత్పాదక శ్రమలోనూ భాగం అవుతారు. ఇలాంటి శ్రామిక కుటుంబాల్లో గృహశ్రమభారం స్త్రీలపై అదనంగా ఉంటుంది. పురుషులు ఎక్కడా ఈ శ్రమలో భాగం కారు. దీనివల్ల పురుషులకంటే స్త్రీలు అధిక గంటలు శ్రమిస్తారు. ఇటువంటి అసమాన శ్రమవిభజన ద్వారా స్త్రీలపై పడే అదనపు శ్రమ భారాన్ని ‘అక్యుములేషన్ ఆఫ్ లేబర్’ అని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, అంతర్జాతీయ మానవహక్కుల నాయకులు ఆమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. ఆదాయంలో వివక్ష కేవలం అసంఘటిత రంగంలోనే కాకుండా సంఘటిత రంగంలో సైతం వేతనాల్లో స్త్రీలు వివక్షకు గురవుతున్నారు. అది అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో కింది విధంగా ఉంది. స్త్రీపురుషుల సంపాదనలో వ్యత్యాసం అభివృద్ధి చెందిన 19 దేశాల్లో మహిళలు - 0.77% , పురుషులు - 0.23% అభివృద్ధిచెందుతోన్న 42 దేశాల్లో మహిళలు - 0.73% , పురుషులు - 0.27% స్త్రీపురుష వేతన వ్యత్యాసం అభివృద్ధి చెందిన దేశాల్లో 23 శాతం, అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో 27 శాతం గా ఉన్న విషయాన్ని పై వివరణ తెలియజేస్తోంది. అక్షరాస్యతలో వివక్ష భారత దేశంలో బాలబాలికల అక్షరాస్యతా శాతం 2001లో 75.26, 53.67 శాతం నుంచి 2011కి వచ్చేసరికి 82.14, 65.46కి పెరిగింది. అయితే మహిళల అక్షరాస్యతాశాతం దాదాపు 54 శాతంగా ఉంది. దీన్ని బట్టి కేవలం జనాభాలో సగం మంది మహిళలు మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు. విద్యకి తక్కువ ప్రాధాన్యతనిస్తున్న కారణంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో భారత దేశం 126 వ స్థానం నుంచి దిగజారి 134 స్థానానికి చేరింది. ప్రాథమిక స్థాయిలో 2009లో బాలబాలికల ఎన్రోల్మెంట్ రేటు బాలురలో 115 గానూ, బాలికల్లో 111 గానూ ఉంది. ఇదే చైనాలో అయితే బాలురలో 111 గానూ, బాలికల్లో 115గానూ ఉంది. చైనా తరువాత బాలికల్లో డ్రాపౌట్ రేట్ భారతదేశంలోనే అధికంగా ఉంది. డ్రాపౌట్ రేటు అధికంగా ఉండడానికి అనేక కారణాలున్నా ప్రధానమైనది తల్లిదండ్రుల నిరక్షరాస్యతే. వివాహాల్లో వివక్ష భారతదేశ సగటు వివాహ వయస్సు 13 నుంచి 14 మాత్రమే. చట్టప్రకారం ఇది 18 ఏళ్ళైనా, దేశంలోని ప్రతి నలుగురిలో ఒకరిది బాల్య వివాహమే. నేపాల్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరిది బాల్య వివాహమే.మనకన్నా నేపాల్ కొంత మెరుగు. అక్కడ కనీస వివాహ వయస్సు 15 ఏళ్ళు. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో యాభై శాతం మంది పదహారేళ్ళలోపే బాల్యవివాహాల బారిన పడుతున్నారు.బాల్య వివాహాలు ఆడుకునే వయస్సులోనే తల్లిగా మారుస్తున్న పరిస్థితి ఎదురవుతోంది. బాల్య వివాహాల్లో అధికమంది బాలికలు 15 ఏళ్ళలోపే బిడ్డకి తల్లులవుతున్నారు. పుట్టిన పిల్లల సంరక్షణ బాధ్యత కూడా అమ్మాయిలపై పడుతోంది. అది వారి ఆరోగ్యంపైన ప్రభావం చూపుతోంది. ఈ బాల్య వివాహాలే మాతా శిశు మరణాలకు కూడా కారణం అవుతున్నాయి. వివక్షే స్త్రీలపై హింసకు కారణం స్త్రీల పట్ల వివక్ష అంతిమంగా స్త్రీలపై హింసకు దారితీస్తుంది. ఈ హింస ఆడపిల్ల పుట్టుకతోనే ఆరంభం అవుతుంది. ఇదే హింస స్త్రీల జీవితమంతా వెంటాడుతుంది. సంపాదనలోనూ, ఆస్తిలోనూ, కుటుంబంలో ఆహారం, ఆరోగ్యం విషయంలోనూ తారతమ్యాలకు ఇదే వివక్ష కారణమౌతుంది. అది అంతిమంగా హింసకు దారితీస్తుంది. ఇలాంటి అన్ని రకాలైన వివక్షకు పేద, ధనిక దేశాల్లో తేడా ఏంలేదు. దేశాల, సమాజాల, వ్యక్తుల ఆర్థిక స్థితిపై ఈ వివక్ష ఆధారపడి లేదు. అలా వరకట్నం హింసకు ఒక పనిముట్టుగా తయారయ్యింది. గృహహింసలో వరకట్న మరణాలు చాలా తీవ్రంగా పరిణమిస్తున్నాయి. లైంగిక హింస తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి. అమ్మాయిల అక్రమ రవాణాకూ, స్త్రీలైంగిక దోపిడీకి పేదరికం ఒక కారణంగా మారుతోంది. ♦ స్త్రీలపై హింసకు అంతర్జాతీయంగా అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా పురుషాధిపత్య భావజాలం, పురుషస్వామ్యం, అసమాన ఆధిపత్యం దీనికి కారణంగా భావించాలి. అయితే స్త్రీల అవిద్య, అరకొరా చదువులు దీనికి మరి కొంత కారణం అవుతున్నాయి. ♦ ఆర్థిక స్వాతంత్య్రం, కుటుంబేతర ఆర్జిత ఉపాధి అవకాశాలూ, ఆర్థిక అసమానతలూ, ఆస్తిహక్కు, విద్యావకాశాలూ స్త్రీలు స్వతంత్రతకు ఒక మార్గం వేస్తాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతలో ఈ అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ స్త్రీల సాధికారతను సుసాధ్యం చేస్తాయి. పురుషస్వామ్యాన్నీ, పురుషాధిపత్యాన్నీ, స్త్రీలపై హింసనీ దూరంచే యడంలో ఇవే కీలక భూమిక పోషిస్తాయి. -
వైరల్ ఫోటో..వాస్తవం తెలుసుకుని రాయండి
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఓ ఫోటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ మెట్రో రైలులో ఓ మహిళ తన బిడ్డతో సీట్లో కూర్చుని.. పని మనిషిని మాత్రం కింద కూర్చోబెట్టింది. ఓ యువ జర్నలిస్ట్ ఈ ఫోటోను తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా... సదరు మహిళపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ది ప్రింట్ ఇండియా రిపోర్టర్ సన్య ధింగ్రా శనివారం సాయంత్రం మెట్రో రైల్లో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో ఓ మహిళ తన చిన్నారితో సీట్లో కూర్చొని ఉన్నారు. అయితే చిన్నారి బాగోగులు చూసుకునే ఆయా మాత్రం కిందే కూర్చుని ఉన్నారు. పక్కనే కాస్త జాగా ఉన్నప్పటికీ ఎవరూ ఆమెకు చోటు ఇవ్వలేదు. చివరకు యాజమాని అయిన మహిళ కూడా ఆమెను కూర్చొమని కోరలేదు. ఎలా ఉందో చూడండంటూ ఆ ఫోటోను సన్య తన ట్వీటర్లో పోస్టు చేశారు. ఇది ఇంతటితో ఆగలేదు. ది ప్రింట్ ఇండియా సోమవారం సంచికలో దీనిని ముఖచిత్రంగా ప్రచురించింది. విమర్శల నేపథ్యంలో చివరకు ఆ మహిళ తన బ్లాగ్‌లో స్పందించారు. తాను అపోలో ఆస్పత్రిలో పని చేసే వైద్యురాలినినని పేర్కొంటూ 8 పేరాలతో ఓ పెద్ద వ్యాసాన్నే ప్రచురించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెబుతూ మొత్తం వివరించారు. ‘‘నేను-నా బిడ్డ-ఆయా ముగ్గురం మెట్రోలో ఇంటికి బయలుదేరాం. మా దగ్గర లగేజీ చాలా ఉంది. మేం రైలు ఎక్కిన సమయంలో ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది. మహిళలంతా కిందే కూర్చుని ఉన్నారు. ఇది మాకు కొత్తేం కాదు. నా బిడ్డను నేను, ఆయా ఇద్దరం కలిసి ఆడించాం. తర్వాత కాసేపటికి మేమున్న కోచ్ కాస్త ఖాళీ అయ్యింది. ఓ మహిళ నాకు సీటు ఇచ్చి దిగిపోయారు. వెంటనే నేను, నా చిన్నారి ఆ సీట్లో కూర్చున్నాం. అప్పుడే సన్య మా కోచ్‌లోకి ఎక్కారు. అయితే అప్పటికే బాగా అలిసిపోయిన ఆయా కింద కూర్చోవటం గమనించిన సన్య.. ఆమెను పైన కూర్చొమని కోరారు. కానీ, తనకు కింద కూర్చోవటమే బాగుందని ఆయా బదులిచ్చింది.. చివరకు ఎంజీ రోడ్ స్టేషన్లో దిగి మేం ఇంటికి వెళ్లిపోయాం. సోషల్ మీడియాపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. ఎవరో చెప్పగా నేను ఆ పోస్టును చూశాను. నేనొక వైద్యురాలిని ప్రజలకు సేవ చేయటం నా కర్తవ్యం. ఆమె మా ఇంట్లో పని మనిషిగా చాలా రోజుల నుంచి చేస్తోంది. మాతోనే ఉంటుంది. మాతోనే తింటుంది. తోటి మనిషితో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు. ఆత్రుతతో అనుమతి లేకుండా సన్య నా ఫోటో తీయటం.. వాస్తవాలు ఏంటో తెలీకుండా శేఖర్ గుప్తా(ప్రముఖ జర్నలిస్ట్) కథనం రాయటం... సరికాదు. అంటూ సదరు మహిళ ఆ కథనంపై మండిపడ్డారు. సన్య చేసిన పోస్టు ఇదే! -
కేంద్ర సహకారం లేదనడం అవాస్తవం
సాక్షి, న్యూఢిల్లీ: పలు పథకాలకు నిధులు, సంస్థల మంజూరులో కేంద్రం తెలంగాణ పై వివక్ష చూపు తోందని మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రం తెలంగాణకు అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని, విద్యాసంస్థలు, కేంద్ర పథకాలకు నిధుల మంజూరులో పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యా సంస్థల ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను బుధవారం ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో ఐఐటీ పనులను, గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల న్నారు. ఇఫ్లూ వర్సిటీలో ఉద్యోగులకు కేంద్రమే 100% ప్రయోజనాలు కల్పించా లని, సెంట్రల్ వర్సిటీలో మౌలిక సదుపా యాల కల్పనకు నిధులు విడుదల చేయా లని కోరారు. సర్వశిక్షా అభియాన్, రూసా కింద తెలంగాణకు రూ.149 కోట్లు విడు దల చేసేందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. -
‘ఆరెంజ్ పాస్‌పోర్ట్’.. బీజేపీ వివక్షే: రాహుల్
న్యూఢిల్లీ: ఇమిగ్రేషన్ చెక్ అవసరం ఉన్న పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఆరెంజ్ రంగు పాస్‌పోర్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ వివక్షాపూరిత ఆలోచనా ధోరణిని ఇది సూచిస్తోందని విమర్శించారు. ‘వలస కార్మికులను రెండో తరగతి పౌరులుగా బీజేపీ పరిగణించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ చర్యలు బీజేపీ వివక్షాపూరిత ఆలోచన ధోరణిని సూచిస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు. -
సిగ్గు పడదాం దళిత కంఠంపై వెలి ఖడ్గం
మహిళ అంటే ఈ దేశంలో వివక్ష... దళితులంటే ఈ సంఘంలో వివక్ష.మరి దళిత మహిళ అయితే?... బహిష్కారం ఒక ఆయుధం.బహిష్కరించడం ఒక పంజరం... మాట చెల్లుబాటు కావడానికి ఈ జులం. పైచేయి సాధించడానికి ఈ దౌర్జన్యం... ఇంకానా... ఇప్పుడు కూడానా?... సిగ్గు పడదాం. గ్రామానికి ప్రథమ పౌరురాలు ఆమె. ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామస్తులంతా కలిసి ఓట్లేసి గెలిపించిన సర్పంచ్. అలాంటి ప్రజాప్రతినిధినే ఇప్పుడు ఆ గ్రామం నుంచి బహిష్కరించారు. సాధారణ ప్రజలకు ఏమైనా ఇబ్బందులొస్తే ముందుగా గుర్తొచ్చేది గ్రామ సర్పంచ్. మరి అలాంటి ప్రజాప్రతినిధినే ఓ భూవివాదం విషయమై గ్రామం నుంచి వెలివేయడం అమానవీయం. ఆమెతో ఆమె కుటుంబసభ్యులతో గ్రామస్తులెవరూ మాట్లాడవద్దని, ఆమె పొలాలకు ఎవరూ పనులకు వెళ్లద్దని, పండగలు, శుభకార్యాలకు పిలవొద్దని హుకూం జారీ చేశారు. కొన్ని నెలలుగా సంఘ బహిష్కరణకు గురి చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన దళిత మహిళా సర్పంచ్ జక్కుల మమత ఉదంతం ఇది. ఏం జరిగింది? బుస్సాపూర్ గ్రామ శివారులో మమత పూర్వికుల పేరుతో 3 ఎకరాల 30 గుంటల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు మమత భర్త శ్రీనివాస్ తాతల పేరుతో ఉన్నాయి. గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ భూమి ఇప్పుడు రూ.కోట్లు పలుకుతోంది. ఈ భూమిపై కొందరు గ్రామ పెద్దలు కన్నేశారు. ఎలాగైనా ఈ భూమిని మమత కుటుంబానికి దక్కకుండా చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సందర్భాన్ని అనుకూలంగా మార్చుకోవాలని ప్రణాళిక రూపొందించారు. భూమి తమది కాదని చెప్పమంటూ రెవెన్యూ రికార్డులపై ఆ మేరకు సంతకాలు పెట్టాలని పలుకుబడి కలిగిన పెద్దలు మమత భర్త శ్రీనివాస్‌పై ఒత్తిడి తెచ్చారు. ‘మీ పూర్వికులు మీ భూమిని మాకు విక్రయించారు. అందుకోసం ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో సంతకాలు చెయ్యి’ అని సర్పంచ్ భర్త శ్రీనివాస్‌పై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు శ్రీనివాస్ నిరాకరించడంతో 2017 అక్టోబర్ 29న సర్పంచ్ మమత కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేశారు. ఆమెతో, ఆమె భర్త శ్రీనివాస్‌తో ఎవరైనా మాట్లాడినా, తిరిగినా, భోజనం చేసినా రూ.ఐదు వేల జరిమానా ఉంటుందని తీర్మానం చేశారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కందూరు చేయగా.. సర్పంచ్ భర్త శ్రీనివాస్‌ను భోజనానికి పిలిచారు. మరొకరు దుర్గామాత పూజ, సత్యనారాయణ వ్రతం సందర్భంగా శ్రీనివాస్‌ను ఆహ్వానించారు. శ్రీనివాస్‌ను ఆహ్వానించిన ముగ్గురిపై గ్రామపెద్దలు ఒత్తిడి తెచ్చారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించడంతో వారు మమత కుటుంబసభ్యులను దూరంగా ఉంచారు. అభివృద్ధి పనులకూ ఆటంకాలు.. గ్రామంలోని వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులతో సర్పంచ్ మమత ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మురికి కాలువల నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులకు ఎంబీ రికార్డులు చేయకుండా గ్రామ పెద్దలు సంబంధిత అధికారులను అడ్డుకున్నారు. దీంతో మూడు నెలలుగా తమకు రావాల్సిన బిల్లులు నిలిచిపోయాయని మమత వాపోతున్నారు. గ్రామపంచాయతీ రికార్డుల్లో కూడా ఎలాంటి తీర్మానాలు చేయవద్దని పంచాయతీ సిబ్బందిని సైతం ఆదేశించారని మమత ఆవేదన వ్యక్తంచేశారు. – పాత బాలాప్రసాద్ పొలం పనులకూ ట్రాక్టర్లను రానిస్తలేరు పొలంలో నాట్లు వేసుకోవాలని అనుకున్నాం. దమ్ము కొట్టేందుకు గ్రామంలోని ఓ ట్రాక్టర్ యజమానిని అడిగితే. ఆదివారం ట్రాక్టర్ పంపుతానని చెప్పారు. 17 మంది కూలీలను కూడా పిలుచుకుని సిద్ధంగా ఉన్నాం. సర్పంచ్ పొలంలో పనికి వెళితే రూ.ఐదు వేలు జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు ట్రాక్టర్ యజమానిని హెచ్చరించడంతో ఆయన ట్రాక్టర్‌ను పంపలేదు. నిర్మల్ జిల్లా సోన్‌పేట్ నుంచి ట్రాక్టర్‌ను కిరాయికి తెచ్చుకుని నాట్లు వేసుకోవాల్సి వచ్చింది. ఇట్ల మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. – జక్కుల మమత, సర్పంచ్ -
జెండర్ వండర్
ఒకప్పుడు ఆమె పెనుగొండ శివ. ఇప్పుడు ఆపరేటర్ జానకి. ఒకప్పుడు ఆలయంలో తలదాచుకున్న అమ్మాయి. ఇప్పుడు నిలువ నీడలేని వాళ్లకు\ ఇళ్లను మంజూరు చేసే పనిలో ఉన్న ఉద్యోగిని. వివక్ష నుంచి ఉద్యోగం వరకూ.. ఇది జానకి లైఫ్ స్టోరీ.. లైవ్లీహుడ్ స్టోరీ! జానకికి ఇరవై ఆరేళ్లు. వైఎస్ఆర్ జిల్లా, చెన్నూరులో హౌసింగ్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్. ఇల్లు లేని వాళ్ల జాబితా తయారు చేసి వాళ్లు సొంతిల్లు కట్టుకోవడానికి అవసరమైన డాటా సిద్ధం చేస్తుంటుంది. పుట్టినప్పుడు ఆమెకి అమ్మానాన్నలు పెట్టిన పేరు శివ. ఇప్పుడామె జానకి. అవును... ఆమెను పుట్టినప్పుడు అందరూ అబ్బాయి అనే అనుకున్నారు. అయితే తనలో ఉన్నది అబ్బాయి కాదు, అమ్మాయి అని ఆమెకు తెలుస్తూనే ఉండేది. ఇంట్లో మాత్రం, అమ్మాయిలా కాదు అబ్బాయిలా ఉండమని అనుక్షణం ఆదేశాలు వినిపిస్తూనే ఉండేవి. ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా పదిహేనేళ్ల పోరాటం. ఆ స్థితిలో ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగిందన్నది.. ఆమె మాటల్లోనే విందాం. ‘‘మాది కర్నూలు జిల్లా చాగలమర్రి. ఇంటర్ వరకు చాగలమర్రిలోనే చదువుకున్నాను. ర్యాంక్ స్టూడెంట్‌ని. ‘చదువు బాగా వస్తోంది, డిగ్రీ ఇంగ్లిష్ మీడియంలో చేస్తే భవిష్యత్తు బాగుంటుంద’ని మా అన్న ప్రొద్దుటూరులో చేర్పించాడు. ప్రొద్దుటూరు కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ తర్వాత పీజీ చేయాలనుకున్నాను. ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకున్నాను కూడా. అప్పటికే నా జెండర్ మీద వస్తున్న సామాజిక ఒత్తిడిని తట్టుకోవడం కష్టమైంది. యూనివర్సిటీలో ర్యాగింగ్‌కు భయపడి బీఈడీ ఎంట్రన్స్ రాశాను. సీటు వచ్చింది. అధికారులకు నా పరిస్థితి చెప్పి ఇంట్లో చదువుకుని పరీక్షలు రాయడానికి అనుమతి తీసుకుని బీఈడీ పూర్తి చేశాను. అమ్మ భోరున ఏడ్చింది! నేను క్లాసులో అబ్బాయిలతో కలసి కూర్చునే వాడిని. కానీ అమ్మాయిలతోనే ఎక్కువగా స్నేహం చేసేవాడిని. ఎనిమిదో తరగతి నుంచి నాలో మార్పులు స్పష్టంగా తెలియడం మొదలైంది. ఇంట్లో చెప్పడానికి ప్రయత్నించినా కుదరలేదు. ‘అలా నడవ వద్దు, అబ్బాయిలా ఉండు’ అని ఒత్తిడి ఉండేది. డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు చీరకట్టుకోవాలనే కోరిక బలంగా కలిగింది. అప్పుడు అమ్మకు చెప్పాను. అంతే... ఒక్కసారిగా ఏడ్చేసింది. అసలే ఆమె ఆస్థమా పేషెంట్. ఆమెకు ఏమవుతుందోనని భయమేసింది నాకు. ‘ఊరి వాళ్ల ముందు తలెత్తుకునేదెలా, ఆత్మహత్య చేసుకోవడమే దారి’ అంటూ కుమిలిపోయింది అమ్మ. ఇక చేసేదేమీ లేక ఊరుకున్నాను. కానీ వయసుతోపాటు వచ్చే మార్పులు నన్ను నిలవనివ్వలేదు. ఫైనల్ ఇయర్ తర్వాత స్కాలర్షిప్ డబ్బుతో ఇల్లు వదిలి వెళ్లిపోయాను. డాక్టర్ నిర్ధారణ! ఇంటి నుంచి వెళ్లడం వెళ్లడం నేరుగా డాక్టర్ దగ్గరకెళ్లాను. పరీక్షించి నిజమేనన్నారు. ఇంకా వయసు పెరిగే కొద్దీ దేహం పూర్తిగా స్త్రీత్వం సంతరించుకుంటుందని చెప్పారు. అదే విషయం ఇంట్లో చెబితే మా అన్న నన్ను విపరీతంగా కొట్టారు. నిజానికి అన్నకు నేనంటే చాలా ప్రేమ. కానీ ఇలాంటి స్థితిని ఫేస్ చేయడానికి వాళ్లకు భయం అంతే. ఇల్లు వదిలి వచ్చాక కొన్నాళ్లు గుడిలో తలదాచుకున్నాను. లైఫ్ క్రాస్‌రోడ్స్‌లో ఉన్నట్లయింది. íపీజీ ఎంట్రన్స్ రాయడానికి కడప వెళ్లినప్పుడు నాలాంటి చాలా మంది కనిపించిన సంగతి గుర్తొచ్చి వాళ్లను కలిశాను. వాళ్లు నన్ను బాగా కలుపుకున్నారు. వాళ్లతో కలసి జీవించడానికి స్వాగతించారు. కానీ చదువు కొనసాగించాలనే కోరికను బయటపెడితే సమాజంలో ఉన్న పరిస్థితులను వివరించి, సాధ్యం కాదన్నారు. వాళ్లతోనే ఉంటూ చెవులు, ముక్కు కుట్టించుకుని, చీర కట్టుకుంటూ, చక్కగా అలంకరించుకుని స్త్రీలాగానే జీవించాను. వేడుకల్లో డాన్సులు చేశాను. జానకి అని పేరు మార్చుకున్నాను. నాకు గాయని జానకి పేరు, ఆమె పాటలు చాలా ఇష్టం. నా ఫోన్లో స్క్రీన్ మీద కూడా ఆమె ఫొటో ఉంటుంది. నాకు ఆమె పేరునే పెట్టుకున్నాను. 2012 నుంచి ఈ ఉద్యోగం వచ్చే వరకు కడపలోనే ఉన్నాను. ఆధార్ మలుపుతిప్పింది! ఆధార్ కార్డు, ఓటర్ లిస్టుల్లో ఎన్రోల్మెంట్ కోసం కలెక్టర్ ఆఫీస్‌లో క్యాంప్ పెట్టి పిలిపించారు. అప్పుడు కలెక్టర్‌గారు మాతో చాలా సేపు మాట్లాడారు. మాకు ఎదురయ్యే కష్టాలను చెప్పాం. అప్పుడు ఏం చదువుకున్నావని అడిగి, ఉద్యోగానికి అప్లయ్ చెయ్యమన్నారు. డిసెంబర్ పదవ తేదీన ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చాలా బాగుంది. ఆఫీసర్లు, తోటి ఉద్యోగులు అందరూ ప్రోత్సహిస్తున్నారు. ఇలాగే సమాజం కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మాలాంటి వాళ్లకు మా ఇళ్లలో స్థానం ఉంటుంది. సమాజం ఆమోదించనంత కాలం అమ్మానాన్నలు, అక్కచెల్లెళ్లు కూడా మమ్మల్ని ఇంట్లో ఉంచుకోవడానికి భయపడతారు. మాలాంటి వాళ్లను ఇంట్లో ఉండనిస్తే ఉద్యోగాలు, చేతనైన పనులు చేసుకుంటూ సామాజిక దాడుల బారిన పడకుండా గౌరవంగా జీవిస్తాం. అర్థం చేసుకోండి ప్లీజ్’’ అంటోంది జానకి. అమ్మ ఇంటికి రమ్మంది.. కానీ! మా అక్క అంగన్వాడీ టీచర్, అన్న బి.ఎ, బీఈడీ చేశాడు. ఇంకా ఉద్యోగం రాలేదు. తమ్ముడు ఇటీవలే సి.ఆర్.పి.ఎఫ్ ఉద్యోగంలో చేరాడు. మా అమ్మ నాతో ఏదో ఒక రకంగా మాట్లాడుతుంటుంది. ఇంట్లో అందరి క్షేమ సమాచారం చెప్తుంది. మొదట్లో ఓ సారి నన్ను ఇంటికి వచ్చేయమన్నది. నన్ను చీరకట్టుకోనిస్తేనే వస్తానని చెప్పాను. దాంతో ఊర్లో బతకనివ్వరంటూ కన్నీళ్లు పెట్టుకుంది. గంపలు అల్లి కుటుంబాన్ని పోషించి, మమ్మల్ని చదివించి ఇంతటి వాళ్లను చేసింది మా అమ్మ. ఆమె సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. నన్ను కూతురిగా స్వీకరించడానికి ఆమె సిద్ధమైతే అమ్మ దగ్గరే ఉంటాను. – జానకి, ఆంధ్రప్రదేశ్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ ఎంప్లాయీ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ -
గూగుల్‌పై సంచలన ఆరోపణలు, దావా
శాన్‌ఫ్నాన్సిస్కో: గూగుల్ పై మాజీ ఉద్యోగులు సంచలన ఆరోపణలతో దావా వేశారు. గూగుల్ విధానాల్ని ప్రశ్నించినందుకే తమ పై వేటు వేశారని ఆరోపిస్తూ ఉద్వాసనకు గురైన ఇద్దరు గూగుల్ ఇంజనీర్లు పిటిషన్ దాఖలు చేశారు. శాంటా క్లారా కౌంటీ సుపీరియర్ కోర్ట్‌లో దాదాపు 161 పేజీల ఫిర్యాదును నమోదు చేశారు. గూగుల్ నిబద్ధతను ప్రశ్నించడం వల్లే తమని తొలగించారన్నారు. కార్పోరేట్ కల్చర్, తెల్లవారిపై వివక్ష కారణంగా తమను తొలగించారని వారు విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు దారులతో పాటు కన్సర్వేటివ్ దృక్పథం ఉన్న వారి పట్ల వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందని జేమ్స్ దామోర్ (28), మరో మాజీ గూగుల్ ఇంజనీర్ మండిపడ్డారు. ఉన్నతమైన సంస్థగా వ్యవహరిస్తున్న గూగుల్ ఉదారవాద ఎజెండా నుంచి వైదొలగాలని ధైర్యం చేస్తున్న అనేక మంది ఉద్యోగులపై వేటు వేస్తోందని ఆరోపించారు. గూగుల్ సహా ఇతర ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో కన్సర్వేటివ్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే లేదా బహిరంగంగా ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న డజన్ల కొద్దీ ఉద్యోగులపై వేటుపడుతోందనీ, దీంతో మిగిలిన ఉద్యోగులు కూడా భయపడుతున్నారని దామెర్ లాయర్ రిపబ్లికన్ పార్టీ అధికారి హర్మీత్ డల్లాన్ వ్యాఖ్యానించారు. గూగుల్ ఉద్యోగం పొందడానికి అధ్యక్షుడికి ఓటు వేయలేదని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మరోవైపు దామోర్ ఆరోపణలపై తమవాదనలను కోర్టులో వినిపిస్తామని గూగుల్ చెప్పింది. అయితే అతని రాజకీయ అభిప్రాయాల నేపథ్యంలో తొలగించలేదని వెల్లడించింది. సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకే చర్య తీసుకున్నామని గూగుల్ తెలిపింది. ఏ విధమైన వేధింపులను తాము సహించమని పేర్కొంది. కాగా సిలికాన్ వ్యాలీ టెక్ నియామాకాల్లో లింగ వివక్ష ఉందన్న వాదనను సమర్ధిస్తూ ఒక లేఖ రాయడం కలకలం రేపింది. గత ఏడాది ఆగస్టు 7 న గూగుల్ అతణ్ని తొలగించింది. -
అబ్బా! వివక్ష!
వైరల్ అనగానే వైరల్ ఫీవర్ వచ్చినట్లు ఒణికిపోవడం ఇప్పుడు పాత మాట. వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విటర్లలో ఒక పోస్టు ఎక్కువ మందిని ఆకర్షించిందంటే వైరల్ అయిందనిపార్టీ చేసుకునే కాలమిది.బిల్‌గేట్స్ ఇండియన్ పేరెంటింగ్ మీద వెలిబుచ్చిన అభిప్రాయాలు అని ఒక పోస్ట్ తాజాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్‌లో బిల్‌గేట్స్ ఏమన్నారో తెలుసా?‘‘ఇండియాలో తల్లిదండ్రులకు కొడుకులంటే పరమ అసహ్యం. వాళ్లకు ఏమీ నేర్పించరు. ఒక కప్పు కాఫీ కలపడం కాదు కదా గ్యాస్ స్టవ్ కట్టేయడం కూడా రాని బడుద్దాయిల్లా తయారుచేస్తున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లలను మాత్రం అత్యంత జాగ్రత్తగా పెంచుతున్నారు. వాళ్లకు నేర్పని స్కిల్ లేదంటే అతిశయోక్తి కాదు. లైప్ స్కిల్స్‌తోపాటు ఫైన్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యంసాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలిగిన స్థైర్యం ఉండేటట్లు తయారవుతున్నారు అమ్మాయిలు. ఎటొచ్చీ అబ్బాయిలే కొరగాకుండాపోతున్నారు. వాళ్లకు తమ ప్రయాణానికి బట్టలు సర్దుకోవడం కూడా రాదు. ఏది ఏమైనా తల్లిదండ్రులకు ఇది తగదు. పిల్లలందర్నీ సమానంగా ప్రేమించాలి, సమానంగా అన్ని పనులూనేర్పించాలి. మగపిల్లలను నిస్సహాయులుగా చేయడాన్ని ప్రశ్నించాలి. ఇంట్లో మగవాళ్లకు సమాన హక్కులు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది’’. దీనిని ఎవరు రాశారో గాని, ఈ సెటైర్ భారతీయ సమాజాన్ని గిలిగింతలు పెట్టినట్లే అనిపిస్తూ అమ్మాయిల పట్ల చూపిస్తున్న వివక్షను తెలియచేస్తోంది. -
వెంట్రుకలు కథ చెప్తాయి...
కొలంబియా దేశానికి బానిసలుగా వెళ్లిన ఆఫ్రికన్లు నాలుగు వందల ఏళ్లుగా తమ తలకట్టు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ‘ఆశల ఆల్లిక’ పేరుతో ప్రతి సంవత్సరం జూలై నెలలో అక్కడ జడల పోటీ నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటిచెబుతున్నారు. జుట్టుదేముంది అనుకోవద్దు. దాని వెనుక మానవజాతికి ఉన్నంత చరిత్ర ఉంది. నల్ల జుట్టు, తెల్ల జుట్టు, రాగి రంగు జుట్టు... జుట్టు స్వభావం ఒక జాతిని నిర్దేశిస్తుంది. విభజిస్తుంది. ఒక జాతి మీద మరొక జాతిని ఆధిపత్యం చెలాయించమని కోరుతుంది. ఒక్కో దేశంలో ఒక్కో సమూహం ఈ వివక్షను ఎదుర్కొందిగానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఎదుర్కొన్నది ఆఫ్రికన్లే. అందుకే వారు ‘మా జట్టు మా సొంతం’ అంటున్నారు. కొలంబియాలో కష్టాలు: ఉత్తర, లాటిన్ అమెరికాల్లోని రాగి, బంగారు గనులు, వ్యవసాయ క్షేత్రాల్లో పని చేయడానికి ఆఫ్రికా దేశాల నుంచి నల్లవాళ్లను పట్టుకొచ్చేవారు. వీళ్లను ఇక్కడ బానిసలుగా చేసుకునేవారు. వీళ్లకు గొడ్డు చాకిరీ ఉండేది. స్త్రీలు అతి కష్టమ్మీద దొరికే తీరికలో తన పిల్లలకు జుట్టు దువ్వుకునేవారు. ఆఫ్రికన్లది రింగుల రింగుల జుట్టు. వారు జడలు కట్టిన రీతిలో జుట్టును అలంకరించుకోవడం పరిపాటి. అయితే ఇందుకు ఏమాత్రం సమయం దొరికేది కాదు. అమెరికన్ యజమానులు అందుకు అవకాశం ఇచ్చేవారు కాదు. పైగా జుట్టును జడలుగా వేసుకోవడానికి అంగీకరించేవారు కాదు. దీనికి కారణం ఏమిటంటే... బానిసలు ఈ జడలను సంకేతాలుగా ఉపయోగించుకునేవారు. ‘ఫలానా విధమైన’ జడను వేసుకుంటే ఈ రాత్రికి ఊరి నుంచి పారిపోబోతున్నట్టు అర్థం అనే సిగ్నల్ ఇచ్చే వీలుండేది. అంతే కాక చిక్కటి జడలలో తాము పని చేసే గనుల నుంచి బంగారం దాచుకునేవారు. గనుల నుంచి పారిపోతే ఆ బంగారం ఉపయోగపడుతుందని వారి ఆలోచన. అందువల్ల కూడా యజమానులు వారిని జడలు వేసుకోవడానికి వారించేవారు. ఆశల అల్లిక: 1850లలోనే కొలంబియా దేశంలో బానిసత్వం రద్దయ్యింది. అయినప్పటికీ అక్కడ ఉన్న నల్లవాళ్ల కట్టు, బొట్టు, సంస్కృతుల మీద దాడి కొనసాగింది. చూసి చూసి ఆఫ్రికన్లు తిరగబడ్డారు. సాంస్కృతిక స్వాతంత్య్రం కావాలని, ‘మా జుట్టు మా స్వేచ్ఛ’ అని చాటి చెప్పడానికి గత పదేళ్లుగా ఆ దేశంలోని నైరుతి ప్రాంత నగరమైన ‘కాలి’లో ‘ఆశల అల్లిక’ పేరుతో శిరోజాలు అల్లే పోటీని ప్రతి ఏటా జూలైలో నిర్వహిస్తున్నారు. కొలంబియాలో ఉన్న ఆఫ్రికన్ యువతులు, ఆడపిల్లలు అక్కడికి వచ్చి పోటీలో ఉత్సాహంగా పాల్గొంటారు. గంటల తరబడి తమ కేశాలను జడలు అల్లి ఆశ్చర్యకరమైన తలకట్టును ప్రదర్శిస్తారు. బహుమతులకంటే... ఈ విషయం దేశ విదేశాలలో ప్రచారమై ‘మన తల కట్టును మనం గౌరవించుకోవాలి’ అనే భావన పెరుగుతోంది. భారతదేశంలో జడ ఒక అందమైన తలకట్టు. దాని చిన్న చూపు చూసేవారు ఇలాంటి కథనాలు చూసి ఏమంటారో! -
‘సమితి’కి చేరిన సంఘర్షణ
కొత్త కోణం భారతదేశంలోని 25 కోట్ల మంది సమాన హక్కులకు దూరం కావడమే కాకుండా కనీసం మనుషులుగా కూడా పరిగణించని స్థితిలో ఉండటంపై ఐక్యరాజ్య సమితి స్పందించడం కానీ, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడం కానీ దేశ ద్రోహమో, నేరమో కాబోదు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఇదే విషయాన్ని 1947 జనవరి 17వ తేదీన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలోని భారతీయుల సమస్యలపట్ల స్పందిస్తున్న ఐక్యరాజ్య సమితి భారతదేశంలో దళితులెదుర్కొంటున్న వివక్ష పట్ల కూడా దృష్టి సారించాలని కోరారు. ఆగ్రహంతోనో, విద్వేషంతోనో మనిషిని మనిషి, గుంపుని మరో గుంపు, ఓ సమూహాన్ని మరో సమూహం హతమార్చడాన్ని వాటి వెనుకనున్న వ్యక్తిగత, లేదా సామూహిక విద్వేషాల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక జాతిని మిగిలిన అన్ని జాతులూ, అన్ని గుంపులూ, అన్ని వర్గాలూ తరతరాలుగా అవమానిస్తుంటే, అణచివేస్తోంటే, హతమారుస్తుంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రపంచ ప్రజల దృష్టికి అందని రీతిలో సాటి మనుషులను అథములనీ, పంచములనీ, పాకీలనీ, అస్పృశ్యులనీ ఛీత్కారంతో, తృణీకారంతో మానప్రాణాలను హరిస్తోంటే... పెరిగిన ఆ అంతరాలు దేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న కఠోర వాస్తవాన్ని అంగీకరించాలి. ఇప్పటి వరకు దళితుల హక్కుల హరణ గురించి సొంతగడ్డపైనే చర్చించడం జరిగింది. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో కూడా చర్చకు రావడం, కొన్ని దేశాలు దళిత హక్కులకు మద్దతును తెలియజేయడం మంచి పరిణామం. సమితిలో దళిత హక్కుల వాణి ఈనెల 4వ తేదీన ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ 27వ సమీక్షా సదస్సులో పలు దళిత, మానవ హక్కుల సంఘాలు భారతదేశంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావించాయి. 2012లో మానవ హక్కుల సంఘం 169 సిఫారసులు చేయగా అందులో దళితులకు సంబంధించి పది అంశాలు ఉన్నాయని దళిత సంఘాలు ప్రకటించాయి. భారత ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం తమ దేశంలో దళితులకు తగు రక్షణ చట్టాలున్నాయని, వాటిని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొనడం గమనార్హం. అందువల్ల దళితులకు సంబంధించిన అంశాల్ని ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదనికూడా భారత ప్రభుత్వ ప్రతినిధులు తెగేసి చెప్పారు. కానీ జెకోస్లొవేకియా, జర్మనీ, ఘనా, జపాన్, నార్వే, థాయ్‌లాండ్, అమెరికా లాంటి దేశాలు దళితుల వివక్షపై చర్చించి, తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. భారతదేశంలో ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రతి దాడివెనుక కులం ఉంటుంది. అది ఖైర్లాంజి కావచ్చు, కందమాల్ కావచ్చు. దాడులకు గురయ్యేవాళ్ళు ఎప్పుడూ ఒకే వర్గానికి చెందినవారై ఉంటారు. ఒకే జెండర్‌కి చెందినవారై ఉంటారు. అణచివేసేవారు ఎప్పుడూ అధికారంలో ఉంటారు. అందుకే ఈ దేశంలో దళితులు, స్త్రీలు, ఆదివాసీలు వ్యక్తులుగా, సామూహికంగా అంతమవుతుంటారు. సామూహిక అత్యాచారాలకు గురౌతుంటారు. ఇదే నేపథ్యంలో దేశంలో గత కొన్నేళ్లుగా నమోదవుతోన్న నేరాలను పరిశీలించాలి. ఇతర మహిళల కన్నా అధికంగా దళిత స్త్రీలలో 41.7 శాతం మంది 15 ఏళ్లలోపే భర్తల చేతిలోనూ, లేదా వేరే వ్యక్తుల చేతిలోనూ లైంగిక హింసకు గురవుతున్నారు. 2005–2006 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇదే తేల్చి చెప్పింది. సాధారణ మహిళల్లో 7.8 శాతం మంది లైంగిక హింసకు గురౌతోంటే, అది దళిత మహిళల్లో 11.0 శాతం. 2014లో దళిత స్త్రీలపై నమోదైన 2,233 అత్యాచార కేసులను బట్టి చూస్తే ప్రతిరోజూ ఆరుగురు అత్యాచారానికి గురైన వాస్తవం తెలుస్తుంది. దీనిని నేషనల్ క్రైం రిపోర్టు బ్యూరో స్పష్టం చేసింది. నమోదైన గణాంకాలను బట్టి చూస్తే దళిత స్త్రీలపై అత్యాచార కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు 2003లో 1,089 దళిత స్త్రీలపై జరిగిన అత్యాచార కేసులు నమోదైతే, 2013కి ఆ సంఖ్య 2,073కి పెరిగింది. అంటే దశాబ్దకాలంలో 47.5 శాతం పెరిగాయి. దళిత స్త్రీలపై జరిగిన అత్యాచారాలు అత్యధికంగా 81.6 శాతంగా ఉంటే ఆయా కేసుల్లో శిక్ష పడినవారు ప్రభుత్వ లెక్కల ప్రకారం 34.9 శాతం. నమోదైన కేసుల్లో ఇది సగం కూడా కాదు. దేవదాసీ, జోగిని లాంటి దళిత కమ్యూనిటీల్లో 90 శాతం మంది స్త్రీలు మూఢాచారాలకు బలౌతున్నారు. గత పదిహేనేళ్లలో 2,500 మంది దేవదాసీ లేదా జోగినీ స్త్రీలు విషాదకర పరిస్థితులలో చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం హైకమిషనర్ నావి పిల్లే దళితులైన మాన్యువల్ స్కావెంజర్స్లో 90 శాతం మంది హింస, దోపిడీ లాంటి బహుముఖ వివక్షనెదుర్కుంటున్నారని వెల్లడించారు. అలాగే అనేక రాష్ట్రాల్లో గ్రామీణ ఆరోగ్య కమిటీల్లోని సభ్యులు దళిత స్త్రీల ఆరోగ్యాన్ని గురించి విచారించిన సందర్భాలు చాలా అరుదు అని కూడా నివేదికలు చెబుతున్నాయి. జాతీయ సగటు కన్నా దళిత కుటుంబాల పిల్లల్లోనే ఎక్కువ మంది మధ్యలో బడి మానేస్తున్నవారు ఉన్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోకపోతే అందరికీ విద్య అనే నినాదం నిరర్థకంగా మారుతుందని సర్వశిక్షా అభియాన్ నివేదికలో హెచ్చరించింది. ఇప్పటికీ తాగునీరు లేదు భారత రాజ్యాంగం ప్రజలందరికీ జీవించే హక్కును కల్పించినప్పటికీ ఆచరణలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో దళితులు హత్యలకు గురౌతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. తాగడానికి సరైన నీరు కూడా దొరకని స్థితి ఇప్పటికీ గ్రామాల్లో వారు ఎదుర్కొంటున్నారు. చాలా గ్రామాల్లో ప్రజలందరూ వాడుకునే బావులు, చెరువులు ఈ రోజుకీ దళితులు అంటరానివే. మహబూబ్‌నగర్ లాంటి జిల్లాలోని ఒక గ్రామంలో దళితులు బోరుబావిని తవ్వారు. కానీ వారి నివాసాల మధ్యన తవ్విన బావినీళ్లు దళితులే తాగడానికి గానీ, బావిని తాకడానికి గానీ అనర్హులు. దళితుల హక్కులను మానవహక్కులుగా గుర్తించడం లేదని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. దళితులపై దాడులను నివారించడంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరికి ఇది పరాకాష్ట. 2015వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 707 హత్య కేసులు నమోదైతే అందులో 619 కేసుల్లో చార్జిషీట్లు నమోదైనాయి. కానీ 180 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. మహిళలపై జరిగిన అత్యాచారాల కేసులు, పరిణామాలను చూద్దాం. ఈ గణాంకాలను పరిశీలిస్తే 2015లో 2,326 అత్యాచార కేసులు నమోదైనాయి. 1891 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. అందులో కేవలం 345 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. ఇందులో చిన్న తిరకాసు కూడా ఉంది. చాలా కేసుల్లో కింది కోర్టులు శిక్షలు విధించినప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాదాపు 90 శాతం కేసుల్లోని నిందితులు నిర్దోషులుగా విడుదలవుతున్నారు. దీనికి చుండూరు కేసు ప్రబల ఉదాహరణ. దళితులను అత్యంత అమానుషంగా చంపి, గోనెసంచుల్లో మూటగట్టి పారేసిన అమానవీయ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. కానీ చివరకు నిందితులెవ్వరూ దోషులుగా తేలలేదు. ఒకవేళ వారంతా నిర్దోషులైతే దళితులను హత్యచేసినవారెవ్వరో తేల్చే బా«ధ్యతను మాత్రం కోర్టులు స్వీకరించలేదు. మహారాష్ట్రలోని ఖైర్లాంజి గ్రామంలో అత్యాచారం, హత్యలు జరిగిన కేసులో కూడా దళితులకు దక్కింది ఇలాంటి న్యాయమే. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఎటువంటి రక్షణను కల్పించడం లేదనేది ఈ సంఘటనలను బట్టి తెలుస్తోంది. భారతదేశంలో 2001 నుంచి 2015 వరకు దళితులపై జరిగిన హత్యలు, అత్యాచారాలను పరిశీలిస్తే మనకు అసలు విషయం బోధపడుతుంది. మహిళలపై జరిగిన అత్యాచారాలు రెట్టింపయ్యాయి. 2001లో దళిత మహిళలపై జరిగిన అత్యాచారాల సంఖ్య 1,316. 2015 నాటికి ఆ సంఖ్య 2,326కి పెరిగింది. దళితులపై జరిగే అత్యాచారాలపై స్పందన ఏది? ఇందులో గమనించాల్సిన విషయం మరొకటుంది. దళితేతర స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపైనా, హత్యలపైనా మధ్యతరగతి ప్రజానీకం నుంచి వస్తున్న ప్రతిఘటనకూ దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, దారుణాల సంఘటనల సందర్భంగా వస్తున్న ప్రతిఘటనకూ చాలా అంతరం ఉంది. దళితులపై జరిగే దురాగతాల పట్ల సమాజంలో కనీస ప్రతిఘటన కూడా కనిపించడంలేదని చెప్పడానికి సందేహించనక్కరలేదు. నిర్భయ లాంటి ఘటనలు జరిగినప్పుడు యువతరం కానీ, సాధారణ ప్రజానీకం కానీ తమకు తాముగా ఉద్యమంలో భాగం అయ్యింది. కానీ ఖైర్లాంజిలో దళిత స్త్రీలపై జరిగిన అత్యాచారాలు కానీ, ఛత్తీస్‌గఢ్‌లో నిత్యం ఆదివాసీలపై జరుగుతోన్న అత్యాచారాలపై కానీ, మతంపేరుతో ఒడిశాలోని కందమాల్‌లో ఎందరో దళిత మహిళలపై జరిగిన అత్యాచారాలపై కానీ పౌరసమాజం స్పందన అదే స్థాయిలో ఎందుకు లేదో అర్థం చేసుకోవచ్చు. ఈ అనుభవాలను పరిశీలిస్తే భారత ప్రభుత్వాలు దళితుల జీవించే హక్కు నుంచి మొదలు అన్ని రకాల హక్కుల పరిరక్షణలో విఫలమవుతున్నట్టు కనిపిస్తున్నది. అందువల్లనే దళిత హక్కుల సంఘాలు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాల్సి వస్తోంది. 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రకటించిన మానవహక్కుల జాబితాలో మొట్టమొదటి అంశమే ఇందుకు ఉదాహరణ. మానవులందరూ పుట్టుకతోనే స్వేచ్ఛా జీవులని, వారు గౌరవంగా అందరితో సమానంగా జీవించే హక్కును కలిగి ఉన్నారని ఆ ప్రకటనలో మొదటి ఆర్టికల్ సారాంశం. అటువంటప్పుడు భారతదేశంలోని 25 కోట్ల మంది సమాన హక్కులకు దూరం కావడమే కాకుండా కనీసం మనుషులుగా కూడా పరిగణించని స్థితిలో ఉండటంపై ఐక్యరాజ్య సమితి స్పందించడం కానీ, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడం కానీ దేశ ద్రోహమో, నేరమో కాబోదు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఇదే విషయాన్ని 1947 జనవరి 17వ తేదీన పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలోని భారతీయుల సమస్యలపట్ల స్పందిస్తున్న ఐక్యరాజ్య సమితి భారతదేశంలో దళితులెదుర్కొంటున్న వివక్ష పట్ల కూడా దృష్టి సారించాలని కోరారు. అదేవిధంగా 1917లో అమెరికాలో లాలా లజపతిరాయ్‌తో జరిగిన చర్చను ప్రస్తావిస్తూ అమెరికాలోని బానిసత్వంకన్నా వర్ణ వివక్షకన్నా అంటరానితనం పరమదుర్మార్గమైందని కూడా ఆయన పేర్కొన్నారు. బానిసలు యజమానులకు ఆస్తులుగా, సంపదలుగా ఉంటూ వారి ఇళ్లలోనే వారితో పాటు జీవిస్తారని, బానిసల ఆరోగ్యం కూడా యజమానులు బాధ్యతగా చూసుకుంటారని, కానీ మన దేశంలో దళితులను పశువులకన్నా హీనంగా, తాకడానికి కూడా వీలులేని వారిగా పరిగణించి, వారి ఉనికినే ప్రమాదంగా గుర్తించి దాడులకు దిగడం ఒక్క భారతదేశంలోనే సాధ్యమయ్యే అమానుషమని అంబేడ్కర్ ఆ రోజుల్లోనే చెప్పిన విషయాన్ని నేటికీ అనుభవిస్తున్నాం. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 మల్లెపల్లి లక్ష్మయ్య -
సర్కార్ సొంత పెత్తనం..!
► ఎస్డీఎఫ్ నిధుల విడుదలలో వివక్ష ► అధికార పార్టీ ఎమ్మెల్యేలకే నిధుల కేటాయింపు ► ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జికి నిధుల మంజూరు ► ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ ఒంగోలు టూటౌన్: జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించే ఎస్డీఎఫ్ నిధుల విడుదలలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయించి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అవమానపరుస్తోంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జిలను నియమించి వారికి ఎస్డీఎఫ్ నిధులు కేటాయించింది. ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యులను పక్కనపెట్టి ఓడిపోయిన తమ పార్టీ వారికి ప్రాధాన్యం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేయడమే కాకుండా చేసిన పనిని సమర్థించుకుంటూ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. ఎస్డీఎఫ్ నిధులకు దరఖాస్తు చేసుకున్న వారికే నిధులు కేటాయించినట్లు సర్కార్ చెప్పడం పలు విమర్శలకు తావిస్తోంది. నియోజకవర్గానికి రూ.4 కోట్లు... ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.2 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వీటితో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తూ మరో రూ.2 కోట్లు జత చేసింది. దీంతో ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న వై.పాలెం, ఎస్ఎన్ పాడు, మార్కాపురం, పర్చూరు, కనిగిరి, ఒంగోలు, కొండపి, కందుకూరు, గిద్దలూరు, చీరాల, దర్శి, అద్దంకి నియోజకవర్గాలకు ప్రభుత్వం ఎస్డీఎఫ్ (స్టేట్ డెవలప్మెంట్ ప్లాన్) నిధులు మంజూరు చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో గిద్దలూరు, అద్దంకి, పర్చూరు, ఎస్ఎన్ పాడు, కొండపి నియోజకవర్గాలకు నిధులు మంజూరయ్యాయి. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.2 కోట్లతో కలుపుకుని మొత్తం రూ.54 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాపై పగబట్టిన సీఎం... అసలే అభివృద్ధిలో వెనుకబడిన ప్రకాశం జిల్లాపై సీఎం చంద్రబాబు పగబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామాయపట్నం పోర్టుని అడ్డుకోవడం, యూనివర్సిటీ ఏర్పాటు, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమైన వాటిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. చివరకు ఎస్డీఎఫ్ నిధుల కేటాయింపులోనూ సొంతపెత్తనం చేస్తున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు నిధులు కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. అభివృద్ధి పనులను వాటాల రూపంలో దక్కించుకుంటున్న నేతలు.. నిధులు కాజేసి అరకొరగా పనులు చేసి మమ అనిపిస్తున్నారు. సీఎం తీరుతో జిల్లాకు అన్యాయం జరుగుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. -
నడుస్తున్న చరిత్ర
ఏ పోరాటమైనా మొదలైనప్పుడు దానికో అంతం ఉంటుంది. లక్ష్యం ఆ అంతానికి ఆది. లక్ష్యం మెండుగా ఉంది. పోరాటం గురి తప్పలేదు. కాని ఎందుకో పోరాటానికి అంతం రావడంలేదు. వివక్ష పోవాలని అందరూ కోరుకుంటున్నారే తప్ప అంతం చేయాలని అనుకోవడం లేదు. ఇప్పటికీ మన దేశంలో ఉన్న వివక్షకు పంచభూతాల సాక్షిగా నిలుస్తున్న కథలు ఇవి. అంతా యథార్థమే... నడుస్తున్న చరిత్రే!! జయ విజయం సాధించేనా? ఆమె పేరు జయ. పేరులో తప్ప బతుకులో జయం లేదు. భర్త అర్ధంతరంగా చనిపోయాడు. ఆరుగురు ఆడపిల్లలు. భర్త చెమట చిందించి సంపాదించిన రెండున్నర ఎకరాల భూమి తప్ప ఏమీ లేవు. మామ కూడా లేడు. అత్తది అగ్రకులం. ఆస్తి ఇవ్వడం ఇష్టం లేదు. పోలీసుల అండతో, కులం బలంతో జయపై దాడి చేయించింది. జయ బిడ్డను కిడ్నాప్ చేయించింది. అనేక రకాల హింసలు పెట్టింది. జయ భయపడలేదు. అన్న సహాయంతో కోర్టులో కేసు వేసింది. ప్రాణభయం ఉన్నా లెక్క చేయలేదు. పిల్లల్ని చదివించుకుంటూ న్యాయం కోసం పోరాడుతోంది. ఒక బిడ్డ పెళ్లి చేయగలిగింది. కుల సంఘాలని కదిలించింది. అగ్రకులం, అధికారం, పోలీసులు ఒకవైపు.. మొక్కవోని ధైర్యంతో తనే ఒక సైన్యంగా జయ ఒకవైపు! మరి రేపటి న్యాయం ఎటువైపు? తాను పుండై.. తనువు పండై ఆమె అరుణ. కులం మాదిగ. నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. తల్లిదండ్రులు దినసరి కూలీలు. అయినా పట్టుదలతో ఇంజనీరింగ్ వరకు వచ్చింది. కానీ పూర్తి చేయలేకపోయింది. పేదరికం వల్ల చదువు ముందుకు సాగలేదు. మధ్యలోనే తిరిగి తన ఊరు చేరుకుంది. ఏదైనా ఉద్యోగం చూసుకుని కుటుంబానికి ఆసరాగా నిలబడాలను కుంది. తన ఊరికి దగ్గరలోనే పోలీసు శాఖ వారు కానిస్టేబుల్ శిక్షణ ఇస్తుంటే చేరింది. ఒకనాడు ఇంటిదగ్గర దించుతానంటే సాటి మనుషులే కదా అని ఆ మగాళ్లను నమ్మి బండి ఎక్కింది. అంతే. ఊరవతలకు వెళ్లగానే వాళ్లు మృగాళ్లయ్యారు. ఆ ముగ్గురికి బలైపోయింది. వీడియో తీసారు. ఎవరికైనా చెబితే వీడియో బయట పెడతామని బెదిరించారు. అవమానం భరించలేక అమ్మమ్మ ఊరుకు పోయి చచ్చిపోవాలనుకుంది. మేనమామ ఆపాడు. విషయం తెలుసుకున్నాడు. నిందితులు దొరికారు. అప్పటికే వీడియోలు బయట పడ్డాయి. చేతులు మారాయి. అంతా అరుణనే తప్పు పట్టారు. తిరుగుబోతు అన్నారు. పేపర్లు, టీవీలు, దళిత సంఘాల వారు మొత్తుకున్నా న్యాయం జరగలేదు. అరుణ జీవచ్ఛవమై బతుకుతోంది. అంటరాని ఒంటరి పోరు ఈమె రేణుక. 20 ఏళ్ల వయసు. పెళ్లి కాలేదు. అంటరాని కులంగా అగ్రవర్ణాలు ముద్రేసిన మాదిగగా పుట్టింది. ఊరు ఆమెను ఎన్నడూ పట్టించుకోక పోయినా ఆమె ఊరును పట్టించుకుంది. పచ్చని పల్లెటూరిలో విషం చిమ్మే ఫ్యాక్టరీ వచ్చి చిచ్చుపెట్టింది. రేణుక ఊరందరినీ ఏకం చేసి ఫ్యాక్టరీకి ఎదురు తిరిగింది. జనాన్ని కూడదీసి అమ్ముడు పోయిన పెద్దలను నిలదీసింది. ఫ్యాక్టరీ తీసేయాలని పోరాడింది. ఫలితంగా దాడులు, అవమానాలు, కేసులు! అరోగ్యం పాడైపోయింది. ఊరంతా భయపడి వెనక్కి తగ్గింది. దాడులు వల్ల అయిన గాయాలు మిగిల్చిన పక్కటెముకల్లోని నొప్పితో రేణుక మాత్రం ముందుకే నడిచింది. అయినా ఆమె బలం సరిపోలేదు. అందుకే ఫ్యాక్టరీ నిర్మాణమైంది. దుర్గంధాన్ని వెదజల్లుతూ దర్జాగా నడుస్తోంది. లంచాలు తిని ఊరిని తాకట్టు పెట్టిన పెద్దలు ధీమాగా తిరుగుతున్నారు. ఈ ఒంటరి పోరాటంలో అవమానాలతో రేణుక అలసి పోయింది. పిల్లి తరిమిన కోడి పిల్లలాగా ఊరు దిగాలుగా చూస్తోంది. దళిత తల్లికి ఎంత కష్టం ఎంత కష్టం సమ్మక్క... చిన్నప్పుడే పెళ్లయింది. నలుగురు పిల్లలు. వారిలో ముగ్గురు పిల్లలు చనిపోయారు. కొడుకు ఒక్కడే మిగిలాడు. 23 ఏళ్లు వచ్చాక కొడుకు రెండు కిడ్నీలు పాడైపోయాయి! భర్త ఒక కిడ్నీ ఇచ్చినా కొడుకును బతికించుకోలేకపోయారు. భర్త కూడా దక్కలేదు. నలభై ఏళ్ల వయసులోనే అందరినీ కోల్పోయి ఒంటరిదైపోయింది సమ్మక్క. కష్టాలు అక్కడితో ఆగలేదు. ఆమెకు యాక్సిడెంట్ అయింది. తొమ్మిదినెలలు మంచం మీద నుంచి లేవలేదు. ఇల్లు అప్పులతో మునిగిపోయింది. నిలువ నీడ లేక తిరుగుతుంటే రైల్వేస్టేషన్లో ఒక వ్యక్తి సమ్మక్కను చూసి టాయిలెట్లు కడిగే పని ఇప్పించాడు. చాలీ చాలని డబ్బులతో నిండని కడుపును నీళ్లతో నింపుకుంటోంది. ఉండడానికి ఒక చూరు రాయించమని కన్నీళ్లతో అందరి కాళ్లావేళ్లా పడుతోంది సమ్మక్క. కలల పునాదుల మీద కొడుకు సమాధి ఆమె రాధిక. పుట్టింది దళిత మాల కుటుంబంలో. పెరిగింది వడ్డెరకులంలో. పెంచిన తల్లి ఉద్యోగస్తురాలు. ఆమెకు, ఆమె పిల్లలకు పుట్టెడు చాకిరీ చేస్తూ పెరిగింది. చిన్న వయసులోనే వడ్డెర కులస్తుడితో పెళ్లి జరిగింది. భర్తకు తన కులం తెలిసినప్పటి నుంచి నరకం మొదలైంది. భరించలేక విడాకులు తీసుకుంది. కుట్టు మిషన్ కుడుతూ ఒంటరిగా ముగ్గురు పిల్లల్ని పెంచింది. బిడ్డకు వడ్డెర కులస్తుడితో పెళ్లి జరిపించింది. పెద్దకొడుకు పెద్ద చదువులు చదువుతున్నాడని మురిసిపోయింది. పేదరికానికి స్వస్తి పలకొచ్చని ఆశపడింది. కానీ తన ఉసురు పోసుకున్న కులమే తన కొడుకు ప్రాణాలనూ తీసింది. అతడే రోహిత్ వేముల. తల్లి గుండె పగిలింది. కులం రాజకీయమైంది. ఒంటరి జీవితం అవమానాల, అనుమానాల పరం అయింది. అయినా ధైర్యం తెచ్చుకుని.. అనారోగ్యం, దుఃఖం వెంటాడుతున్నా కూడా తన కొడుకు లాగా మరొక బిడ్డ బలి కాకూడదని కులప్రభావ ప్రవాహానికి ఎదురీదుతోంది. పెంచుకున్న తల్లి లేదు. పంచుకున్న భర్త లేడు. కని పెంచిన కొడుకు లేడు. అయినా మనోనిబ్బరంతో కులాల కుళ్లుకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తోంది రాధిక. -
ఉద్యోగినులపై వివక్ష: ఇరకాటంలో టెక్ దిగ్గజం
అదొక పెద్ద టెక్ దిగ్గజం.. అంతర్జాతీయంగా ఆ దిగ్గజ పేరు మారు మోగుతూంటోంది. కానీ అందరికీ ఆదర్శంగా నిలువాల్సిన ఆ కంపెనీనే మహిళా ఉద్యోగులపై వివక్ష చూపుతోందట. పురుష ఉద్యోగుల కంటే మహిళా ఉద్యోగులకు గూగుల్ చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తుందని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్(డీఓఎల్) ఆరోపిస్తోంది. మహిళా ఉద్యోగులపై ఆ కంపెనీ వివక్ష చూపుతుందని పేర్కొంది. గూగుల్ లో వేతనాల చెల్లింపుల్లో అసమానతలు ఉన్నాయని డీఓఎల్ గుర్తించినట్టు గార్డియన్ రిపోర్టు చేసింది. పురుషులకు సమానంగా మహిళలు వర్క్ చేస్తున్నా గూగుల్ వారికి సరిపడ వేతనం చెల్లించడం లేదని ప్రభుత్వ ఇన్వెస్టిగేటర్లు గుర్తించినట్టు పేర్కొంది. అయితే గూగుల్ మాత్రం తాము ఎలాంటి అసమానతలు చూపించడం లేదని వాదిస్తోంది. ఈ ఆరోపణలు ప్రారంభమైన అనంతరం గూగుల్ ఈక్వల్ పే డేను ప్రకటించింది. లింగ వివక్షతను నిర్మూలించడానికి ఈక్వల్ పే డేను తీసుకొచ్చినట్టు గూగుల్ ట్వీట్ చేసింది. కానీ ఫెడరల్ ఎంప్లాయిమెంట్ చట్టాలను గూగుల్ ఉల్లంఘించిందని ప్రభుత్వం చెబుతోంది. గూగుల్ వంటి పెద్ద కంపెనీలో మహిళలపై వివక్ష చూపించడం నిజంగా చాలా తీవ్రమైన చర్యగా డీఓఎల్ పేర్కొంటోంది. ప్రతేడాది తాము వేతన చెల్లింపుల్లో సమగ్ర విచారణ చేపడతామని, కానీ ఎక్కడా కూడా వివక్ష చూపినట్టు తేలలేదని గూగుల్ అధికార ప్రతినిధి చెప్పారు. -
విద్యార్థినులపై వివక్షేం లేదు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: విద్యార్థినులపట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ)లో వైఫై సౌకర్యాన్ని విద్యార్థినులకు ఇవ్వడం లేదని, ఇతర ఇబ్బందులకు కూడా గురిచేస్తున్నారని వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘నేను బీహెచ్‌యూ నుంచి సమాచారం సేకరించాను. ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల పట్ల ఎలాంటి వివక్ష ఉన్నట్లు నాకు అనిపించలేదు’ అని అన్నారు. అబ్బాయిలతో సమానంగా విద్యార్థినులకు వైఫై సౌకర్యం అందించకపోవడంతోపాటు హాస్టల్లో మాంసాహారం తినేందుకు అనుమతివ్వడం లేదని, మెస్‌లోకి షార్ట్స్ వేసుకొని వెళ్లనివ్వడం లేదని 10గంటల తర్వాత ఫోన్లు చేసుకోనివ్వడం లేదని ఆయా పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓమంత్రి అడిగిన ప్రశ్నకు ఆయన జవదేకర్ పై విధంగా సమాధానం ఇచ్చారు. -
మంజునాథ కమిషన్ సమావేశం రసాభాస
కాకినాడ: నగరంలో బుధవారం మంజునాథ కమిషన్ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం రసాభాసగా మారింది. కాపులను బీసీలను చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ మంజునాథ్ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. కాగా, కమిషన్ చేపట్టిన కార్యక్రమాన్ని కొందరు బీసీ నేతలు బహిష్కరించారు. కాపులతో రిజర్వేషన్లపై జరిగిన చర్చల్లో వివక్ష చూపించినట్లు ఆరోపించారు. ఇరువర్గాలు వాదనలు వినిపించే విషయంలో కాపులతో ఒక విధంగా.. మిగిలిన వారితో మరోలా కమిషన్ వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉద్యోగినులకు రక్ష..లైంగిక వేధింపుల నిరోధక చట్టం
విశాఖపట్నం: పురుషులతో సమానంగా ఉద్యోగాలు, వృత్తులు చేసుకోకపోతే కుటుంబాలు సాఫీగా నడవని నేటికాలంలో మహిళా ఉద్యోగులకు వారు పనిచేసే ప్రదేశాల్లో వివక్ష, వేధింపులు అడ్డుగోడలా నిలుస్తున్నాయి. దేశంలోని మహిళా సంఘాల ఐక్య ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2010 డిసెంబర్ 7న ‘మహిళా ఉద్యోగులపై పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక బిల్లు’ను ప్రతిపాదించింది. 2013లో పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ, అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా 2013 డిసెంబర్ 9 నుంచి ఈ బిల్లు చట్టంగా మారి అమలులోకి వచ్చింది. ఉద్యోగినులకు విధులు నిర్వహించే చోట భరోసా ఇచ్చే ఈ లైంగిక వేధింపుల నిరోధక చట్టం గురించి తెలుసుకుందాం. చట్టంలోని ముఖ్యాంశాలు లైంగిక వేధింపులంటే..? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగా లైంగిక వేధింపులు అనే పదానికి నిర్వచనం ఈ చట్టంలో పొందుపరిచారు. శారీరక సంబంధం, లైంగిక చర్యలకోసం ఒత్తిడి, లేదా బతిమాలడం(విన్నపం), అసభ్య ద్వంద్వార్థాల వ్యాఖ్యానాలు, అశ్లీల చిత్రాలు చూపించడం లేదా వారి సెల్ఫోన్లకు పంపించడం వంటివన్నీ లైంగిక వేధింపులుగానే పరిగణిస్తారు. చట్టం పరిధిలోకి ఎవరొస్తారు ప్రభుత్వ/ప్రైవేట్ కార్యాలయాల్లోని ఉద్యోగినులకే కాకుండా ఆస్పత్రులు/ కార్యాలయాలకు వచ్చే మహిళలు, ఫిర్యాదుదారులు, దినసరి వేతనాల మహిళలు, వివిధ శిక్షణల నిమిత్తం హాజరైన మహిళలు, తోటి ఉద్యోగులతో ప్రయణిస్తున్న సమయంలో, క్రీడా పోటీలకు వచ్చిన మహిళలు, కార్యాలయాలు/ఇంట్లో పనిచేసే మహిళల్లో ఏ వయసువారైనా ఈ చట్టం వారికి రక్షణ కల్పిస్తుంది. కార్యాలయంలో కమిటీలు ఇలా.. ప్రతి ప్రభుత్వ/ప్రైవేటు కార్యాలయం, సంస్థల్లో మహిళా ప్రిసైడింగ్ అధికారి ఆధ్వర్యంలో మొత్తం సభ్యుల్లో సగంమంది మహిళలతో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ అంతర్గత కమిటీ జిల్లా కమిటీలో ఓ భాగంగా పనిచేయాలి.పదిమంది కన్నా తక్కువ ఉద్యోగులున్న సంస్థలు, కార్యాలయాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయడం అసాధ్యం. అందువల్ల జిల్లాస్థాయిలో సంబంధిత జిల్లా అధికారి ఈ ఫిర్యాదుల కమిటీని ఏర్పాటుచేయాలి.జిల్లా కమిటీల్లో సీనియర్ ఉద్యోగిని చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసుకోవాలి. సీనియర్ ఉద్యోగిని ముందుకు రాని పక్షంలో ఆసక్తిగల వారిని అందరి సమ్మతితో ఎంపిక చేసుకోవాలి. మహిళలకోసం పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలకు చెందినవారిని కూడా చైర్‌పర్సన్‌గా, సభ్యుల్లో ఇద్దరిని నియమించుకోవచ్చు. ఈ ఫిర్యాదుల కమిటీ బాధితురాలికి అన్ని విధాలా సహకరిస్తూ అండగా నిలుస్తుంది. ఈ అంతర్గత కమిటీ ఫిర్యాదు అందిన 15 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి.కమిటీ చేసిన సిఫార్సుల అమలుకోసం సంబంధిత కార్యాలయ అధికారికి, సంస్థ యజమానికి జిల్లా అధికారి 60 రోజుల సమయం ఇవ్వాలి.విచారణ జరుగుతున్న కాలంలో ఫిర్యాదుచేసిన మహిళను బెదిరించే, ప్రలోభపెట్టే అవకాశాలుంటాయి. అందువల్ల ఆమె స్వచ్ఛందంగా సెలవు కోరితే సంబంధిత అధికారి, యాజమాన్యం 60 రోజుల వరకూ సెలవు మంజూరు చేయాలి. సంబంధిత శాఖ యాజమాన్యం ఫిర్యాదుల కమిటీని వేయడంలో విఫలమైతే ఆ సంస్థ యాజమాన్యంపై, సంబంధిత అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. కార్యాలయ అధికారి, సంస్థ యాజయాన్య విధులు మహిళలు సురక్షితమైన వాతావరణంలో పనిచేసే అవకాశం కల్పించాలి.అంతర్గత ఫిర్యాదుల కమిటీకి సంబంధించిన నోటీసు బోర్డును అందరికీ కనిపించే ప్రదేశంలోప్రదర్శించాలి.ఉద్యోగులకు ఈ చట్టం గురించి అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.ఫిర్యాదుల కమిటీలకు సదుపాయాలు కల్పించడంతోపాటు సాక్షుల హాజరుకు సహకరించాలి. బాధిత మహిళ ఐపీసీ కింద కేసు పెట్టదలుచుకుంటే పూర్తిగా సహాయపడాలి. తప్పుడు ఫిర్యాదు చేస్తే చర్యలు సదరు తోటి ఉద్యోగి లేదా యజమానిపై ఫిర్యాదురాలు ఉద్దేశపూరకంగా లేదా తప్పుడు ఫిర్యాదు చేసినట్టు, తప్పుడు సాక్ష్యాలు, ధ్రువపత్రాలు సమర్పించినట్టు విచారణలో బహిర్గతమైతే సంబంధిత మహిళపై, ఆ సాక్షులపై ఈ చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. -
ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని వివక్ష
కట్నం కోసం వేధింపులు పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు రొంపిచెర్ల: ఆడబిడ్డకు జన్మనిచ్చాననే వివక్ష చూపడమే కాకుండా అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధిస్తున్నారని మహిళా దినోత్సవం రోజే ఓ మహిళ బుధవారం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి కథనం మేరకు.. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ లక్ష్మీనారాయణకాలనీకి చెందిన టిప్పుసుల్తాన్‌తో 2016 ఫిబ్రవరి 4న చిన్న మసీదువీధికి చెందిన హసీనాకు (21) పెద్దల సమక్షంలో నిఖా (వివాహం) చేశారు. వివాహ సమయంలో 80 గ్రాముల బంగారు నగలు, రూ.20 వేలు కట్న కానుకల కింద హసీనా కుటుంబ సభ్యులు ఇచ్చా రు. వివాహమైన మూడు నెలలకే ఆమె గర్భం దాల్చడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. వివాహేతర సంబంధం అంటగట్టి, వేధింపులకు తెరతీశారు. సీమంతం సమయంలో అదనంగా 80 గ్రాముల బంగారు నగలు ఇవ్వాలని పట్టుబట్టారు. హసీనా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఈ వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. ఆడ బిడ్డకు జన్మనిచ్చావంటూ హసీనాను తూలనాడారు. అంతేకాకుండా తన భర్తకు మరో వివాహం చేస్తానంటూ అత్త బెదిరించేందని, తన భర్త సైతం రెండో వివాహానికి సిద్ధపడ్డాడని, తాను ఇక పుట్టింటిలోనే ఉండాలంటూ అత్తింటివారు ఆంక్షలు విధించారని హసీనా వాపోయింది. తాను ప్రసవించి 4 నెలలైనా పుట్టింటిలోనే ఉన్నానని గోడు వెళ్లగక్కింది. అంతేకాకుండా దుల్హన్ పథకం ద్వారా ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.50వేలను కూడా తనను మభ్యపెట్టి మొత్తం డబ్బును అత్తింటి వారు కాజేశారని తెలిపింది. అత్త అయిషా, చిన్న మామ బావాజీ, తాత అల్లాబ„Š , తన భర్త అదనపు కట్నం కోసం వేధించారని, పోలీసులే తనకు న్యాయం చేయాలని వేడుకుంది. -
ఏపీ ప్రభుత్వంలో అడుగడుగునా మహిళలపై వివక్ష
-
మగాళ్లకూ కష్టాలున్నాయి
ఆడ, మగ తేడాలతో సమాజం వివక్ష చూపిస్తోంది. ఈ వివక్ష నచ్చడం లేదు. వంటింట్లో మహిళలు, బయట మగవాళ్లు కష్టపడుతున్నారు. భార్యకు నగలు, చీరలు, పిల్లల స్కూల్ ఫీజులు, పెట్రోల్ బిల్లు... మగాళ్లకూ ఎన్నో కష్టాలున్నాయి. మహిళల బాధలు వేరు, మగవాళ్ల బాధలు వేరు. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు ప్రతి సమస్యనూ రెండు కోణాల్లో చూడాలి. సమస్య ఉందని అమ్మాయిని బయటకు వెళ్లొద్దని చెప్పొద్దు. జాగ్రత్తగా ఉండమని చెప్పం . మహిళల పట్ల ఎలా మసలుకోవాలో మగవాళ్లకు అమ్మలే నేర్పించాలి. నిజానికి విమెన్స్ డే ఈజ్ క్రాప్. (ఈ మహిళా దినోత్సవం అనేది అనవసరమైన ఆలోచన). అన్ని రోజులూ మహిళలకు మంచి చేయాలనుకుంటే చాలు. -
పాపన్న విగ్రహాల ఏర్పాటులో వివక్ష
శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నెల్లికుదురు (మహబూబాబాద్): తెలం గాణ బహుజన విప్లవ నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్తోపాటు ఎంతో మంది తెలంగాణ పోరాట యోధుల విగ్రహాల ప్రతిష్టాపనలో అప్పటి ప్రభుత్వాలు వివక్ష చూపాయని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మేచరాజుపల్లిలో గురు వారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహా న్ని స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధు ల విగ్రహాలను ఏర్పాటు చేస్తే.. వారి స్ఫూర్తితో ఉద్యమిస్తారనుకుని వారి ఫొటో లు, విగ్రహాలను నాడు కనిపించని వ్వలేద న్నారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, రాష్ట్ర నాయకుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు. -
రైతును కరుణించని బడ్జెట్
విశ్లేషణ ఈ బలవన్మరణాల పరంపరను నిరోధించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి కారణాలు, పరిష్కారాలు చెప్పిన స్వామినాథన్ నివేదికను అమలు చేయడం నేటి అవసరం. కాబట్టి మళ్లీ కమిటీని నియమించి, అది ఇచ్చే నివేదిక కోసం వేచి ఉండడం వ్యర్థం. మోదీ ప్రభుత్వానికి రైతాంగం పట్ల శ్రద్ధాసక్తులు ఉన్నాయి. రైతుల ఆదాయాన్ని స్థిర ధరల సూచీతో పరిగణించినప్పుడు రెట్టింపు కావాలంటే కచ్చితంగా స్వామినాథన్ సిఫారసుల అమలే శరణ్యం. సమస్యలతో సతమతమవుతున్న భారత రైతాంగం ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017–2018 బడ్జెట్‌తో మరింత నిరాశకు గురైంది. పాలకులు పెద్ద పెద్ద మాటలతో ఊరించారు. దీనితో రైతులు తమకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం కార్యరూపం దాల్చడానికి అవసరమైన చర్యల గురించి బడ్జెట్లో ప్రతిపాదించలేదు. మళ్లీ కొత్త కమిటీ ఎందుకు? దేశంలో వ్యవసాయం రంగ దుస్థితికి కారణాలను, వాటిని అధిగమించడానికి మార్గాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్టు ఆ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. నిజానికి ఈ అంశాల అ«ధ్యయనం కోసమే విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ నాయత్వంలో ఒక సంఘం గతంలోనే ఏర్పాటయింది. ఆ సంఘం 2006లోనే నివేదికను కూడా ఇచ్చింది. ప్రజల ఆహార అవసరాలను తీరుస్తూ, లక్షలాది చిన్న పెద్ద పరిశ్రమలకు ముడి వస్తువులు సరఫరా చేస్తూ దేశ ప్రగతికి వ్యవసాయ రంగం ఊతమిస్తున్నా, వ్యవసాయదారుల ఆర్థిక స్థితిగతులు మాత్రం నానాటికీ తీసికట్టు అన్నట్టు తయారవుతున్నాయి. సన్నకారు, చిన్నరైతులు, కౌలు రైతులు, ఆదివాసీ రైతులు వేలాదిగా బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ వాస్తవాలను కూలంకషంగా అధ్యయనం చేసిన స్వామినాథన్ కమిటీ వివరణాత్మకమైన నివేదికనే సమర్పించింది. వ్యవసాయేతర వర్గాల ప్రజల సగటు ఆదాయంతో పోలిస్తే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నవారి ఆదాయం– దీని అనుబంధ వ్యాపకాల మీద ఆధారపడిన వారి ఆదాయంతో కలిపి – రైతు కుటుంబానికి నెలకు రూ. 3,800 మాత్రమే దక్కుతున్నాయి. అప్పుల్లో పుట్టి, అప్పుల్లోనే చనిపోతున్నా రైతాంగం దుస్థితిలో మార్పు తెచ్చేందుకు ఈ కమిటీ ఆనాడే సూచనలు చేసింది. పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అదనంగా కలిపి ధరను నిర్ణయించాలనీ, పంట ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించే తీరు సక్రమంగా లేదనీ, విధివిధానాలను సమీక్షించాలనీ కమిటీ చేసిన రెండు ప్రధాన సిఫారసులను యూపీఏ ప్రభుత్వం అమలు చేయలేదు. కానీ 2014 ఎన్నికలలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఎన్నో రైతు సంక్షేమ పథకాల గురించి హామీ ఇచ్చారు. అవన్నీ నెరవేరతాయని భారత రైతాంగం గంపెడాశతో ఉంది. అయితే రైతుల ఆదాయాన్ని పెంచడానికి నేరుగా వీలు కల్పించే స్వామినాథన్ ప్రధాన సిఫారసులను అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొనడం పెద్ద దగా. ఎవరికీ పట్టని రైతన్న గోడు కొత్త బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించినది రూ. 51,026 కోట్లు. పెరిగిన 7 శాతం ద్రవ్యోల్బణాన్ని గమనంలో ఉంచుకుని, 2016–17 సవరించిన అంచనాలు రూ. 48,072 కోట్ల కంటే ఇది 6.14 శాతం మాత్రమే ఎక్కువ. ఇక మొత్తం బడ్జెట్ కేటాయింపులలో ఇది 2.3 శాతం మాత్రమే. వ్యవసాయ రంగానికి రూ. 10 లక్షల కోట్ల మేరకు రుణ వితరణను ఆర్థికమంత్రి లక్ష్యంగా ప్రకటించారు. వ్యవసాయంలో ధర తరువాత కీలకపాత్ర రుణానిదే. 2005లో రూ. లక్ష కోట్ల నుంచి 2015–2016లో రూ. 8.5 లక్షల కోట్లకు వ్యవసాయ రుణాల కేటాయింపు కొనసాగినా ఇందులో సన్నకారు, చిన్న రైతులకు చేరింది స్వల్పం. కౌలు రైతులకు, ఆదివాసీ రైతులకు చేరింది అతి స్వల్పం. మొత్తం వ్యవసాయ రుణాల ఖాతాలలో రూ. 2లక్షలకు లోపు ప్రత్యక్ష రైతు రుణ ఖాతాలు 68 శాతం ఉండగా 2013 నాటికి 44 శాతానికి తగ్గిపోయాయి. రూ. 10లక్షల లోపు, పైన రైతు రుణ ఖాతాలు అదే సమయంలో 21 శాతం నుంచి 25 శాతం వరకు పెరిగాయి. కొద్దికాలం క్రితం వరకు ప్రాధాన్యతా రంగంలోని వ్యవసాయ రంగానికి 18 శాతం కేటాయింపులు ఉండగా అందులో సన్నకారు, చిన్న రైతులకు 8 శాతం ఇవ్వవలసి ఉంది. కానీ ఆచరణలో వారికి దక్కినది సుమారు 5 శాతం మాత్రమే. వ్యవసాయ ఆధారిత చక్కెర ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు, నూనె మిల్లులు మున్నగు ప్రాసెసింగ్ యూనిట్లకు వాటిని సరఫరా చే సే పంపిణీదారులకూ, వ్యాపారవేత్తలకూ అందజేస్తున్న రుణాలను పరోక్ష వ్యవసాయ రుణాలుగా పేర్కొంటూ వేలకువేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. 2013 నుంచి 2 కోట్ల రూపాయల లోపు కార్పొరేట్లకు, పార్టనర్షిప్ ఫారమ్స్‌కు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు ఇచ్చే రుణాలను కూడా ప్రత్యక్ష వ్యవసాయ రుణం క్రింద చూపించడం పరిపాటైంది. తాజాగా నీతి ఆయోగ్ సిఫార్సును అనుసరించి రిజర్వుబ్యాంక్ ప్రత్యక్ష, పరోక్ష వ్యవసాయ రుణాల మధ్య విభజన రేఖను చెరిపి వేసింది. పర్యవసానంగా సన్నకారు, చిన్నరైతులు, కౌలు రైతులకు రుణాలు అందటం భవిష్యత్తులో మరింత కష్టమవుతుంది. కౌలు రైతులకు, సన్న చిన్నకారు రైతులకు రుణాలు అందిం^è డానికి రైతుమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసి, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణ అర్హత కార్డులను కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అందించినా బ్యాంకులు కుంటిసాకులు చెబుతూ రుణాలు అందించేందుకు తిరస్కరిస్తూ వస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో 16.5 లక్షల కౌలు రైతులు ఉండగా, ఇప్పటికి 5 లక్షల మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చి, కేవలం రూ. 240 కోట్లను లక్ష మంది కౌలు రైతులకు బ్యాంకులు ఇచ్చాయి. వాటన్నింటి పర్యవసానంగానే మొత్తం వ్యవసాయ రుణాలలో వడ్డీ వ్యాపారుల నుంచి పొందిన రుణ శాతం 1992లో 17.5 శాతం ఉండగా 2013 నాటికి 29.6 శాతానికి పెరిగింది. దేశ వ్యాప్తంగా అందించిన వ్యవసాయ రుణాలలో 25 శాతం పట్టణాలు, మెట్రోపాలిటన్ నగరాలలో ఉన్న బ్రాంచిల ద్వారా ఇస్తున్నారు. అలాగే నేరుగా సన్న, చిన్న రైతులతో సహా సాధారణ రైతులు, కౌలు రైతులకు వ్యవసాయ అనుబంధ వ్యాపకాల కోసం ఇవ్వవలసి ఉన్న ప్రత్యక్ష వ్యవసాయ రుణాలలో 22 శాతం నగరాలు, పట్టణాలలోని బ్రాంచిల ద్వారా బట్వాడా అవుతున్నాయంటే ఎక్కువ భాగం బ్యాంకు రుణాలు గ్రామాలలోని సాధారణ రైతాంగానికి అందటం లేదన్నది సుస్పష్టం. ఫలితంగానే 1992 నుంచి 2011 వరకు 20 సంవత్సరాలలో దాదాపు 150 లక్షల మంది రైతులు వ్యవసాయ రంగాన్ని వదిలిపోయారు. దేశ వ్యాప్తంగా సగటున వంద రైతు కుటుంబాలలో 52 శాతం రుణభారంతో ఉండగా, తెలంగాణ 89, ఆంధ్రప్రదేశ్ 92 శాతాలతో అగ్రభాగాన ఉన్నాయన్న విషయం మరిచిపోరాదు. దేశవ్యాప్తంగా (బ్యాంకులు, సహకార బ్యాంకులు) ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 43.7 శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగం నుంచి వస్తూ ఉండగా, 56.3 శాతం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తీసుకోవలసి వస్తుందన్నది యధార్థం. అందువలన బడ్జెట్లో రూ. 10 లక్షల కోట్లకు పెంచినట్లు ప్రకటిస్తే సరిపోదు. కచ్చితంగా బ్యాంకు గడప ఎక్కే ప్రతి ఒక్క రైతుకు నూటికి నూరుపాళ్లు అతని ఆధార్ సమాచారంతో సాగు వివరణలను పరిగణనలో ఉంచుకొని, వ్యవసాయ అనుబంధ వ్యాపకాలను సకాలంలో స్వల్పకాలిక పంట రుణాలను, మధ్య–దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలను అందించవలసిన బాధ్యత ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంది. అలాగే అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. కొనసాగుతున్న బలవన్మరణాలు వ్యవసాయం ‘రిస్క్’తో కూడుకున్నది కాబట్టి రైతులకు రుణాలు ఇవ్వడంలో స్థానిక బ్యాంకు శాఖలు చూపుతున్న అలక్ష్య ధోరణికి రిజర్వుబ్యాంక్ అడ్డుకట్ట వేయాలి. కొన్ని ప్రముఖ పారిశ్రామిక–వాణిజ్య సంస్థల ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేవని తెలిసినా వందల, వేల కోట్ల రూపాయలు నూతనంగా మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలలో చిక్కుకుని అధిక వడ్డీలతో తలదాకా మునిగిపోతున్న లక్షలాది మంది రైతులకు ఆ రుణాలను బ్యాంకులకు బదలీ చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా (2014లో) మహారాష్ట్రలో 4,004, తెలం గాణలో 1,347, మధ్యప్రదేశ్‌లో 1,198, ఛత్తీస్‌గఢ్‌లో 954, ఆంధ్రప్రదేశ్‌లో 916, తమిళనాడులో 606 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. దేశ వ్యాప్తంగా 12,601 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో వెల్లడించింది. ఈ బలవన్మరణాల పరంపరను నిరోధించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి కారణాలు, పరిష్కారాలు చెప్పిన స్వామినాథన్ నివేదికను అమలు చేయడం నేటి అవసరం. కాబట్టి మళ్లీ కమిటీని నియమించి, అది ఇచ్చే నివేదిక కోసం వేచి ఉండడం వ్యర్థం. మోదీ ప్రభుత్వానికి రైతాంగం పట్ల శ్రద్ధాసక్తులు ఉన్నాయి. రైతుల ఆదాయాన్ని స్థిర ధరల సూచీతో పరిగణించినప్పుడు రెట్టింపు కావాలంటే కచ్చితంగా స్వామినాథన్ సిఫారసుల అమలే శరణ్యం. 1970 నాటి ధరలతో పోలిస్తే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇప్పటికి 22 రెట్లు మాత్రమే పెరిగాయి. అదే ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు సుమారు 150 రెట్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయుల వేతనాలు దాదాపు 125 నుంచి 175 రెట్లు పెరిగిన వాస్తవాలు కళ్ల ముందు ఉన్నాయి. ఇక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తమకు లభించే జీతభత్యాలను, ఇతర సౌకర్యాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. అయినా సమాజంలో ముఖ్య భాగమైన రైతులపట్ల చూపుతున్న అశాస్త్రీయ, అన్యాయ పూరితమైన వివక్షను భారత రైతాంగం ఇంకా సహిస్తూ మిన్నకుండలేదన్న వాస్తవాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. వడ్డే శోభనాద్రీశ్వరరావు (వ్యాసకర్త మాజీ వ్యవసాయ మంత్రి) ఈమెయిల్: vaddesrao@yahoo.com -
అక్షరాలు దిద్దించేటప్పుడే.. వివక్షలను చెరిపేయించాలి
రేపటికి ఏడాది! హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మరణించి ఏడాది పూర్తయినా ఇంకా న్యాయం కోసం దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యార్థిలోకం ఎదురుచూస్తూనే ఉన్నాయి! విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోన్న వివక్షని భరిస్తూ, నిర్లిప్తతను అలవాటుగా మార్చుకున్న సమాజం మేల్కొనకపోతే రోహిత్ లాంటి బలవన్మరణాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. అందుకే.. అసమానతలను పెంచి పోషించే ఈ విద్యావిధానంలో మార్పు రాకుండా విశ్వవిద్యాలయాల్లో మరణాలకు చరమగీతం పాడలేము అని అంటున్నారు పౌర హక్కుల ఉద్యమకారిణి, ప్రముఖ పాత్రికేయురాలు, గుజరాత్ అల్లర్లలో బాధితులకోసం ఏర్పాటు చేసిన ‘సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’ కార్యదర్శి తీస్తా సెతల్ వాద్. ఆమెతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. ► హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ మరణించి ఏడాది అవుతోంది! ఇప్పటికీ కేసు ముందుకు సాగకపోవడానికి కారణమేమనుకుంటున్నారు? రోహిత్ కన్నా ముందూ, రోహిత్ తరువాత కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యలు జరిగాయి. మనసుని కుదిపేసే అంశాలెన్నో ఉన్నాయి కనుకనే రోహిత్ కేసు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. జెఎన్‌యులో విద్యార్థి ఉద్యమం కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరినీ కదిలించింది. విశ్వవిద్యాలయాలను మతోన్మాద రాజకీయాలు శాసిస్తున్నంత కాలం ఉద్యమాలు తప్పవు. రోహిత్ కేసులో న్యాయం జరగకపోవడానికి కారణం స్పష్టం. మంత్రులు, రాజకీయ నాయకులు ఈ కేసులో కీలక నిందితులు. వారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. ► విశ్వవిద్యాలయాల్లో వివక్షని ఎలా అర్థం చేసుకోవాలి? ఉన్నత విశ్వవిద్యాలయాల్లో కనిపిస్తున్న వివక్షపై గతంలో థోరట్ కమిటీ చేసిన సిఫార్సులు విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోన్న అనేక అమానవీయ అంశాలను; దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివక్షను వెలుగులోనికి తెచ్చాయి. ఉన్నత విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశిస్తోన్న తొలితరం విద్యార్థులకు కావాల్సిన తోడ్పాటు అందకపోగా, వారిని యూనివర్సిటీల నుంచి వెలివేసే స్థాయికి విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు దిగజారాయి. అట్టడుగు వర్గాలనుంచి వచ్చే విద్యార్థులకు రెమెడీ క్లాసులు నిర్వహించాలని థోరట్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాల నుంచి ఏదో రకమైన వివక్షపై ఫిర్యాదులు వస్తున్నాయి. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. థోరట్ కమిటీ రిపోర్టు ఇదే చెప్పింది. 84 శాతం ఎస్సి, ఎస్టి విద్యార్థులకు రెమెడీ క్లాసుల్లేవు. ఇదే సామాజిక వర్గాల విద్యార్థుల్లో 50 శాతం మందికి ఇంటర్నల్ మార్కుల్లో కోత పెట్టినట్టు తెలింది. అద్భతమైన ప్రతిభ కలిగిన విద్యార్థులు సైతం అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సంపాదించినప్పటికీ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్న పరిస్థితికి వివక్షే కారణం. ఇది అందరికీ తెలుసు. కానీ ఎవరికీ శిక్షలుండవు. దళిత, ఆదివాసీలకు ఉన్నత విద్యావ్యవస్థల్లో అవకాశాల్ని తిరస్కరించడంలో భాగమే ఈ వివక్ష. ►పరిష్కారం ఏమిటి? ఎక్కడా థోరట్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంలేదు. విద్యార్థుల్లో స్ట్రెస్‌ని తగ్గించేందుకు, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఎక్కడా కూడా ఇంతవరకు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. గ్రామీణ ప్రాతాల నుంచి వచ్చే దళిత ఆదివాసీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ లేదు. వారికి ఇంటర్నల్స్ మార్కుల్లో కోత, తరగతి గదుల్లో అవమానాలు, ల్యాబ్స్‌లో పరికరాలు అందుబాటులో ఉంచకపోవడం, కనీసం గైడ్‌ని కేటాయించకపోవడం ఇలాంటి ఎన్నో రకాల వివక్షను ఈ వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల విద్యాస్థాయి నుంచి స్త్రీపురుష వివక్షని, కుల వివక్షని పెంచి పోషిస్తోంది మన విద్యావ్యవస్థ. అక్కడే మార్పు అవసరం. థోరట్ కమిటీ సిఫార్సులను అమలు చేయడం, దాని ఆధారంగా వివక్షారహిత విశ్వవిద్యాలయాల కోసం ఒక యాక్ట్ ని తీసుకురావడం నేటి ఆవశ్యకత. అయితే అది రోహిత్ యాక్ట్ అయినా, సమానత్వాన్ని కాంక్షించే అంబేడ్కర్ యాక్ట్ అయినా అది సమ సమాజానికి దారి ఏర్పరచాలి. ► ఇప్పటికే ఎన్నో చట్టాలున్నాయి. ఉదాహరణకు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ యాక్టు లాంటివి. రోహిత్ యాక్టు మాత్రం అమలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఏ చట్టమైనా సక్రమంగా అమలుచేయించే బాధ్యత మళ్లీ పౌరసమాజంపైనే ఉంటుంది. చట్టం అంటూ ఉంటే ప్రశ్నించే అధికారం ఉంటుంది. అందుకే రోహిత్ చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ ఉద్యమం మొత్తం రోహిత్ చట్టాన్ని ఒక్కదాన్నే కోరుకోలేదు. ఉద్యమ డిమాండ్లలో అది కూడా ఒకటి. అయితే ఎస్సి ఎస్టి అట్రాసిటీ కేసుల్లో దోషులను ఎలా తప్పిస్తున్నారో మనం రోహిత్ కేసులో స్పష్టంగా చూశాం. అదే చాలా వాటిల్లో జరుగుతోంది. ► ఎపి ప్రభుత్వం త్వరలోనే రోహిత్ దళితుడు కాదని, బీసీ అని తేల్చబోతోంది. దీనిపై మీ అభిప్రాయం? ఇది చాలా దుర్మార్గమైన విషయం. రోహిత్ తల్లి రాధిక ఒంటరి స్త్రీ. ఆమాటకొస్తే దళిత స్త్రీల పోరాటాలన్నీ ఒంటరి స్త్రీల పోరాటాలే. ఆమె సర్వస్వం త్యాగం చేసి బిడ్డల్ని పెంచి పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పించినా తల్లి కులం బిడ్డకి రాకపోవడం పురుషాధిపత్య సమాజం నిజస్వరూపం. ఏ సంబంధమూ లేని తండ్రి కులం ఎలా వర్తిస్తుందో ఎపి ప్రభుత్వానికే అర్థం కావాలి. రోహిత్ బీసీ అని తేల్చబోవడం పెద్ద రాజకీయ కుట్ర. – అత్తలూరి అరుణ తీస్తా సెతల్ వాద్ ఉద్యమకారిణి -
అగ్రకులాలకు వేధింపులా?
విశ్లేషణ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989ని మహారాష్ట్రలో అత్యాచారాల చట్టంగా పిలవడం పరిపాటి. అదే ఇప్పుడు ఆ రాష్ట్రంలో వివాదాంశంగా మారింది. ఆధిపత్య కులంగా ఉన్న మరాఠాలు తాము సైతం వెనుకబడి ఉన్నామని, తమకూ రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. దళితులు తమను వేధించడానికి అత్యాచారాల చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. చారిత్రకంగా అణచివేతకు గురవుతున్న దళితులు, తాము అత్యాచారాలకు గురవుతున్నా చాలా సందర్భాల్లో తమ కేసులను పోలీసు స్టేషన్లు నమోదు చేసుకోవడం లేదని, ఇక ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కడిది? అని ప్రశ్నిస్తున్నారు. అత్యాచారాల చట్టాన్ని దుర్వినియోగపరచినట్టు రాష్ట్ర పౌర హక్కుల పరిరక్షణ విభాగానికి ఇంతవరకు ఒక్క ఫిర్యాదైనా అందలేదు. బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో దళితులు, కలుపుకుపోయే స్వభావం లేని హిందూ మతాన్ని విడనాడి బౌద్ధాన్ని స్వీకరించినప్పటి నుంచి వారి పట్ల ద్వేష భావం ఉంది. మరఠ్వాడా విశ్వవిద్యాలయం పేరును మహా మానవుని (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్) పేరిట మార్చడానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రాజకీయ చతురుడైన శరద్ పవార్ వంటి నేతకే ఆ పేరు మార్పు కష్టమైంది. నవ బౌద్ధులు సమరశీలత కలిగినవారే అయినా అహింసావాదులు, ఆత్మగౌరవం కలిగినవారు అయిన సామాజిక వర్గం. అది, రిజర్వేషన్లను కోరుతున్న మరాఠాల మధ్య ఉన్న ఏకత్వ భావనంత బలంగా కూడా ఉంది. మరాఠాలు సామాజిక, రాజకీయ ఆధిపత్యం గల సామాజిక వర్గం. అయినా వారు తాము వెనుకబడి ఉన్నామనడానికి... వ్యవసాయ కమతాలను కోల్పోవడం, అధ్వానంగా ఉన్న పంట దిగుబడులు, ఇతరులతో పోలిస్తే ఉద్యోగిత స్థాయి అల్పంగా ఉండటం వంటి పలు కారణాలున్నాయి. రిజర్వేషన్లు కల్పించినా, కల్పించకపోయినా వారి ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి తీసుకోవలసినదే. మరాఠాల రిజర్వేషన్ల సమస్య ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది. కాబట్టి రిజర్వేషన్లు కావాలనే మరాఠాల కోరిక న్యాయబద్ధమైనదేనని రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాలను ఒప్పించాల్సి ఉంటుంది. కానీ అది అత్యాచారాల చట్టాన్ని ఉపసంహరించుకోవడం గానీ లేదా ‘‘దుర్వినియోగం’’ కాకుండా దాన్ని మార్చడం గానీ చేయలేదు. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. కాకపోతే అలా చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయవచ్చు. ఆ చట్టం పదును తగ్గించమనడం సహా ఇంకా ఏమైనా చేయాలంటే పార్లమెంటులో చట్టం చేయమని కోరగలుగుతుంది. కానీ దళితులు నిజంగానే అణచివేతకు, అత్యాచారాలకు గురువుతున్నవారు. ఓటర్లలో వారు చెçప్పుకోదగిన భాగంగా ఉన్నారు. అందువల్ల అత్యాచారాల చట్టం సవరణకు ఇతర రాష్ట్రాలు, పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశం ఉండకపోవచ్చు. మరాఠాలు కోరుతున్న కోటాలను సాధించడానికి ప్రభుత్వం చేయగలిగినదంతా చేస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మరాఠాలకు భరోసా ఇస్తున్నారు. అయితే అత్యాచారాల చట్టం విషయానికి వచ్చేసరికి ఆయన దానిలోని ఏ అంశాన్నీ నీరుగార్చేది లేదనే దృఢ వైఖరితో ఉన్నారు. అయితే, ఆ చట్టం దుర్వినియోగం కాకుండా చూడటంతో పాటూ, దళితుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ఆయన ఒక శాసనసభా కమిటీని ఏర్పాటు చేశారు. అత్యాచారాల చట్టం కఠినమైనదనడంలో సందేహం లేదు. దాన్ని మరింత బలోపేతం చేసేలా మరి కొన్ని నేరాల జాబితాను ఒక బిల్లు ద్వారా ఆ చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆ బిల్లు చట్టంగా రూపొంది కొన్ని నెలలే అయింది. తమ రాష్ట్రంలో ఏడాదికి 1,400 నుంచి 2,000 వరకు కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించారు. అయితే దళిత కార్యకర్తలు ఈ సంఖ్య మిగతా రాష్ట్రా లతో పోలిస్తే తక్కువే అంటున్నారు. ఈ చట్టాన్ని దాదాపు ఉపయోగించనే లేదన్నంత స్వల్పంగా, ఒక్క శాతం కేసులే నమోదైతే...అగ్ర కులాలను వేధించడానికి దాన్ని దుర్వినియోగం చేయడం ఎక్కడ? అని దళితుల ప్రశ్న. వేధింపులు అంటే కేసులు పెట్టడమే కాదు, ఆ చట్టం కింద కేసులు పెడతామని బెదిరించడం కూడా. ఏదేమైనా ఇప్పటికీ రాష్ట్రంలో ఈ చట్టంకింద కేసుల విచారణకు తగినన్ని ప్రత్యేక న్యాయస్థానాలే ఏర్పాటు కాలేదు. ఒక కేసును నమోదు చేశారంటే... అది ఆ వ్యక్తిని తాను అమాయకుడినని నిరూపించు కునే దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియకు కట్టిపడేస్తుంది. కానీ దాదాపుగా దళితులు ఎవరికీ తమ కేసులను కొనసాగించడానికి సరిపడేటన్ని వనరులు ఉండనే ఉండవు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
మీకెందుకు నిధులివ్వాలి?
నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వారి ప్రతిపాదనలకు నిధులిచ్చేది లేదన్న ముఖ్యమంత్రి కరెన్సీ కష్టాలను వివరించినా స్పందన శూన్యం విశాఖపట్నం :‘పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. మా వాళ్లకు మేలు చేసుకోవద్దా..? అదే పనిచేస్తున్నా.. మీరు ప్రతిపాదించిన పనులకు నిధులు ఇవ్వాలన్న రూల్ ఎక్కడా లేదు. ఇవ్వాల్సిన అవసరం లేదు... మీకు ఇచ్చే ప్రసక్తి కూడా లేదు’ సమస్యలు వివరించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు అన్న మాటలివి.. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కేటారుుంపులో జరుగుతున్న వివక్షపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సీఎంతో చర్చించిన అంశాలు, చంద్రబాబు స్పందించిన తీరును మాడుగుల, పాడేరు ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, గిడ్డి ఈశ్వరి శుక్రవారం రాత్రి సాక్షికి ఫోన్లో వివరించారు. సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలమంతా అపారుుంట్‌మెంట్ తీసుకుని మరీ సీఎంను కలిశామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలు.. ఇబ్బందులను సీఎం దష్టికి తీసుకెళ్తే కనీస స్థారుులో స్పందించలేదన్నారు. పైగా తమ విజ్ఞప్తులను పట్టించుకోనవసరం లేదనట్టుగా వ్యవహరించారని ఎమ్మెల్యేలు చెప్పారు. సీఎం దృష్టికి కరెన్సీ కష్టాలు పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న కష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. గత 15 రోజులుగా పనిపాట్లు మానుకొని గంటల తరబడి బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఏంల వద్ద పడిగాపులు పడుతున్నారని, చిన్న నోట్లు దొరక్క నరకం చూస్తున్నారని వివరించామన్నారు. నోట్ల రద్దు మంచి నిర్ణయమే అరుునప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పర్యావసానాలు ఇలాగే ఉంటాయని సీఎంకు వివరించామని, సాధ్యమైనంత త్వరగా ఈ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశామన్నారు. దీనికి సీఎం స్పందిస్తూ చూస్తాం.. చేస్తాం అంటూ బదులిచ్చారే తప్ప ప్రభుత్వపరంగా ఉపశమన చర్యలు ఏం తీసుకుంటున్నారో చెప్పలేదన్నారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని, రుణమాఫీ కాకపోవడం వలన, బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడం వలన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని సీఎం దష్టికి తీసుకెళ్తే.. అందరికీ రుణమాఫీ చేశాం.. రైతులెవరూ కష్టాల్లో లేరన్నట్టుగా మాట్లాడారని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చెప్పారు. ప్రతిపాదనలు ఇచ్చినా పట్టించుకోలేదు.. టీడీపీ ఎమ్మెల్యేలకు ఇస్తున్నట్టుగానే నియోజకవర్గాల అభివృద్ధికి తమకు కూడా నిధులు ఇవ్వాలని సీఎంను కోరామని ఎమ్మెల్యేలు వివరించారు. ఈమేరకు తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం సీఎంకు అందజేశామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాబలంతో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తాముండగా.. తమ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జీవోలు ఇచ్చి మరీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స(ఎస్డీఎఫ్)ను వారికి కేటారుుంచి.. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తమకు నిధులివ్వక పోవడం అన్యాయమని సీఎంకు వివరించామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ మీకు నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారన్నారు. ‘మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నారుు కదా.. అలాంటప్పుడు మీకెందుకు నిధులివ్వాల’ని ప్రశ్నించారని ఎమ్మెల్యే ముత్యాలనాయుడు చెప్పారు. మీరిచ్చే ప్రతిపాదనలకు నిధులిచ్చే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారని ఆయన చెప్పారు. సీఎం స్పందనపై ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేల వినతిని కనీసంగా కూడా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. సీఎం అహంకార వైఖరి మరోసారి తేటతెల్లమైందన్నారు. -
హెచ్‌సీయూలో కొనసాగుతున్న వేధింపులు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివక్షకు నిలయంగా మారుతోంది. అధికారుల వైఖరి కారణంగా ఉన్నత విద్యావంతులు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. మొన్న మాదారి వెంకటేశం, నిన్న వాసు, నేడు మోజెస్ అబ్రహం. పేర్లు వేరైనా దళితులపై వివక్ష కారణంగానే వారు అన్యాయానికి గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరి కొందరు పారిపోతున్నారు, మరికొందరు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారుల వైఖరిలో మార్పురావడం లేదు. శుక్రవారం రాత్రి మోజెస్ అబ్రహం అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నంతో వర్సిటీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. రోహిత్ వేముల ఆత్మహత్యతో వివక్షపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగినా హెచ్‌సీయూలో ఎలాంటి మార్పు రాకపోగా దళిత విద్యార్థులపై వివక్ష కొనసాగుతూనే ఉది. కొందరు విద్యార్థులు దీనిని తట్టుకోలేక, బానిసలుగా బతకలేక చావుకు సిద్ధపడుతుండగా మరి కొందరు కష్టపడి సంపాదించుకున్న సీట్లను వదిలేసి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. మరికొందరు కూలిచేసి చదివిస్తున్న తల్లిదండ్రులకు ముఖం చూపలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 2013 నవంబర్ 24న మాదారి వెంకటేశం అనే దళిత పీహెచ్‌డి స్కాలర్ ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇబ్రహీం పట్నానికి చెందిన వెంకటేశం 2011లో అడ్వాన్స్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ హై ఎనర్జీ లో పీహెచ్డీ కోర్సులో చేరాడు. వర్సిటీ నిబంధనల మేరకు అతనికి పీహెచ్‌డీలో చేరిన రోజే గైడ్‌ను కేటాయించాల్సి ఉంది. అయితే అతడికి మూడేళ్ల పాటు గైడ్‌ను ఇవ్వకపోవడంతో మనస్థాపానికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మోజెస్ అబ్రహం కూడా అదే డిపార్ట్మెంట్, అదే అంశం (ఫిజిక్స్ )పై పరిశోధన చేస్తుండటం గమనార్హం. మాదారికి ఎదురైన వేధింపులే అబ్రహంకు ఎదురయ్యాయి. దళిత క్రిస్టియనైన మోజెస్ అబ్రహం 17న హెచ్‌సియులో జరిగిన ఓ సెమినార్లో పేపర్ ప్రజెంట్ చేశాడు. అప్పటికే ప్రతి చిన్న విషయానికీ వేధిస్తున్న సూపర్వైజర్ ప్రొఫెసర్ జి.ఎస్. వైతీశ్వరన్ అబ్రహంకి గైడ్ గా ఉండనని, తక్షణమే గైడ్‌ను మార్చుకోవాలని చెప్పడంతో అతడి ఎదురుగానే బ్లేడ్‌తో ముంజేతి నరం కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడికి యూనివర్సిటీలో డాక్టర్ అనుపమ కుట్లువేసి బంజారా హిల్స్‌లోని ఆశా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని తన కారులోనే ఆసుపత్రికి తీసుకెళ్తూ కూడా సూపర్వైజర్ జిఎస్.వైతీశ్వరన్ దుర్భాషలాడినట్లు తెలిసింది. దీనికితోడు గైడ్‌గా కొనసాగేందుకు ప్రొఫెసర్ తిరస్కరించడం, ‘మీకెందుకు చదువ’ంటూ ఎద్దేవా చేయడం ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నాయని ఎఎస్ఎ నాయకుడు దొంత ప్రశాంత్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రొ వీసీగా ఉన్న బిపిన్ శ్రీవాస్తవ్ అవమానించినందునే తమిళనాడుకి చెందిన సెంథిల్ కుమార్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థి సంఘం నాయకులు సన్నంకి మున్నా, వెంకటేశ్ చౌహాన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ల్యాబ్ పరికరాలు, మెటీరియల్ ఇవ్వకుండా వేధించడం సైన్స్ డిపార్ట్మెంట్లో సర్వసాధారణమని ఆరోపించారు. ఇదిలా ఉండగా 2013లోనే వాసు అనే మరో విద్యార్థి గైడ్ వేధింపులకు తాళలేక పిహెచ్డి మూడవ సంవత్సరంలో వదిలేసి తఇతర కోర్సులకోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. -
ఒబామాపై కామెంట్స్.. చిక్కుల్లో అధికారి!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై జాతి వివక్ష పూరితమైన వ్యాఖ్యలు చేసిన కారణంగా ఓ జైలు ఉన్నతాధికారి జాబ్ కోల్పోయారు. ఫేస్బుక్లో పెట్టిన ఓ పోస్ట్ దీనికి కారమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి... డేవిడ్ బార్బర్ అనే వ్యక్తి షెల్బీ కౌంటీ కరెక్షన్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్‌గా గత పదిహేడేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. అయితే తరచుగా వివాదాస్పదమైన విషయాలను సోషల్ మీడియా వెబ్సైట్లలో పోస్ట్ చేసేవాడు. అందులోనూ అతడి ఫేస్బుక్ అప్డేట్స్ ఎవరైనా సరే చూడవచ్చు. నిరసనలో భాగంగా ఓ వ్యక్తి కు క్లక్స్ క్లాన్ మాస్క్ ధరించి వచ్చాడు. అతడికి కేకేకే అని పేరు పెట్టిన అధికారి డేవిబ్ బార్బర్.. ఇల్లీగల్ (చట్టవ్యతిరేకంగా) అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే కూడా ఆ మాస్క్ ధరించిన వ్యక్తే ఓవరాల్ అమెరికన్ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీనిపై వివాదం చెలరేగింది. దేశ అధ్యక్షుడిపైనే జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఒబామా కుటుంబం ఆరోపించింది. 'కు క్లక్స్ క్లాన్' నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్ధతుదారుడు. ఈ వివాదంపై తీవ్ర వ్యతిరేకత, ఒత్తిడి ఎదుర్కొన్న డేవిడ్ బార్బర్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ద ఫ్రీ పాట్రియట్ అనే ఫేస్బుక్ పేజీలో బార్బర్ విద్వేషపూరిత వ్యాఖ్యలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. షెల్బీ కౌంటీ కరెక్షన్స్ సెంటర్ బార్బర్‌ను ఉద్యోగం నుంచి తప్పుకోవాలని సూచించగా ఆయన జాబ్ మానేసినట్లు సమాచారం. ఇటీవల మిషెల్లీ ఒబామాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన టేలర్ కూడా జాబ్ కోల్పోయిన విషయం తెలిసిందే. -
ఆ‘దేశం’ మేరకే!
* విత్తన, ఎరువుల షాపుల్లో తనిఖీలపై వివక్ష * అధికార పార్టీ నేతల షాపుల్లో శాంపిల్స్ సేకరించని వైనం * మాచర్లలో అడ్డుకున్న టీడీపీ నేత * ఇప్పటి వరకు 560కు పైగా శాంపిల్స్ సేకరణ సాక్షి, అమరావతి బ్యూరో: నకిలీ విత్తనాలు, బయో ఉత్పత్తులను అరికట్టేందుకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చేస్తున్న తనిఖీల్లో ‘పచ్చ’పాతం చూపుతున్నారు. అధికార పార్టీ నేతల షాపుల్లో ఎటువంటి తనిఖీలు నిర్వహించడం లేదు. జిల్లాలో రెండు రోజులుగా 560 షాపులకు పైగా తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు. వీటిలో ఒక్క షాపు కూడా అధికార పార్టీ నేతలు, సానుభూతిపరులవి లేకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. నకిలీ విత్తనాలు, బయో ఉత్పత్తులను నివారించేందుకు అధికారులు, సిబ్బంది 70 బృందాలుగా ఏర్పడి జిల్లాలో రెండు రోజులుగా ఎరువులు, పురుగు మందులు, విత్తన షాపుల్లో తనిఖీలు చేస్తున్నారు. దుకాణాల్లో ఉన్న సరుకును పరిశీలించి శాంపిల్స్ తీస్తున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలను జిల్లాలో ఇన్చార్జి జేసీ ముంగా వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కృపాదాసు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 560కి పైగా శాంపిల్స్‌ను సేకరించినట్లు సమాచారం. నకిలి విత్తనాలు, బయో ఉత్పత్తులపై ప్రత్యేకంగా విచారణ బృందాలు ఏర్పాటు చేసి, అందుకు బాధ్యులైన కంపెనీలు, డిస్టిబ్యూటర్లు, డీలర్లతో పాటు వ్యవసాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారం వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్లు ధనుంజయరెడ్డి కనుసన్నల్లో సాగుతోంది. ఇప్పటికే వారు నకిలీల వ్యవహారంలో ఉన్న ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. నమూనాల సేకరణలో... ప్రకాశం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన బయో ఉత్పత్తుల షాపులు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేటలో ఉన్నాయి. అయితే ఆ షాపులకు సంబంధించిన శాంపిల్స్‌ను తీయకుండా కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి మెనేజ్ చేసినట్లు దుకాణాదారుల్లోనే చర్చ సాగుతోంది. జిల్లాలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు చెందిన బయో ఉత్పత్తులకు సంబంధించి శాంపిల్స్ తీయలేదని సమాచారం. మాచర్ల నియోజక వర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత తమకు అనుకూలంగా ఉన్న యజమానుల షాపుల్లో శాంపిల్స్ తీయకుండా స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అడ్డుకున్నట్లు తెలిసింది. షాపుల ఆకస్మిక తనిఖీల్లో సైతం వివక్ష చూపుతున్నారని, అధికార పార్టీ నేత షాపులకు సంబంధించి శాంపిల్స్ తీయక పోవడం ఏమిటనీ కొంత మంది వ్యాపారులు పెదవి విరుస్తున్నారు. నమూనాలు నిరంతం సేకరిస్తాం.. జిల్లా వ్యాప్తంగా అన్ని షాపులను తనిఖీ చేస్తున్నాం. ఇప్పటికే 500కు పైగా షాపులకు తనిఖీ చేసి షాంపిల్స్ సేకరించాం. పారదర్శకంగా అన్ని షాపులను తనిఖీ చేసి శాంపిల్స్ తీస్తున్నాం. మరో నాలుగైదు రోజులపాటు దాడులు చేస్తాం. – కృపాదాసు, జేడీఏ, వ్యవసాయశాఖ తనిఖీల పేరుతో వేధించొద్దు.. చట్ట పరిధిలోనే వ్యాపారం చేస్తున్నాం. అధికారులకు అన్ని విధాల సహకరిస్తున్నాం. తనిఖీల పేరుతో డీలర్లలను వేధించడం తగదు. రైతులు నష్టపోకుండా నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను విక్రయించేలా అసోసియేషన్ తరఫున కృషిచేస్తున్నాం. – వీవీ నాగిరెడ్డి, ఎరువులు, పురుగు మందుల డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు -
‘ఎయిడ్స్’ వివక్షకు రెండేళ్ల జైలు
♦ రూ. లక్ష జరిమానా కూడా ♦ హెచ్ఐవీ, ఎయిడ్స్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపితే 3 నెలల నుంచి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించాలని కేంద్రం నిర్ణయించింది. హెచ్ఐవీ, ఎయిడ్స్ బిల్లు 2014 (సవరణలు)కు ప్రధాని మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ముసాయిదా బిల్లు ద్వారా వ్యాధిగ్రస్తుల హక్కులను కాపాడటంతోపాటు.. వారి ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే యాంటీరిట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసుపత్రులు, విద్యాలయాలతోపాటు పలుచోట్ల హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష కనబరిస్తే శిక్ష అనుభవించక తప్పదని ఈ ముసాయిదాలో పేర్కొన్నారు. తొలి మెడికల్ పార్కుకు ఓకే.. దేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వైద్య పరికరాలను ఉత్పత్తి చేసే మెడికల్ పార్కు ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. చెన్నై దగ్గర్లోని చెంగల్పట్టు ప్రాంతంలో 300 ఎకరాలను హెచ్ఎల్ఎల్ కంపెనీకి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా భారతదేశంలో తక్కువ ధరకే ముఖ్యమైన వైద్య పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. ‘మేకిన్ ఇండియా’ ద్వారా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. -
వరద సాయంలో వివక్ష
* నీటమునిగి దెబ్బతిన్న ఇళ్లకు అందని పరిహారం * కార్యాలయాల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు * అనర్హులకు అందుతున్న సాయం దాచేపల్లి: వరద ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం నుంచి పరిహారం అందటం లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, కాలువలు పొంగి నీళ్లు ఇళ్లలోకి చేరాయి. అయితే బాధితులు కాని వారికి ప్రభుత్వం సాయం అందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వరద నష్ట పరిహారమిచ్చి ఆదుకోవాలని బాధితులు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఒకే వీధిలో నివసిస్తున్న వారిలో ఒక ఇంటికి పరిహారమిచ్చి మరో ఇంటిని వదిలేస్తున్నారు. దెబ్బతిన్న ఇళ్లకు పరిహారమేదీ ? గత వారంలో కురిసిన భారీ వర్షానికి దాచేపల్లిలోని కాటేరు వాగు పొంగి ప్రవహించటంతో వర్షపు నీరు స్థానిక ఎస్టీ, ఎస్సీ, వడ్డెర కాలనీలు, ముత్యాలంపాడు రోడ్డు, కొట్లా బజార్, పద్మాలయ స్టూడియో వీధి, శ్రీ వీర్ల అంకమ్మతల్లి దేవాలయం, చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంక్ వీధి,, దాచేపల్లి– కారంపూడి రోడ్డులను చుట్టు ముట్టాయి. ఈ వీధుల్లోని ఇళ్లలో ఐదు అడుగుల ఎత్తులో నీరు ప్రవహించాయి. నీటి ప్రవహంలో ఇళ్లలోని సామగ్రి, నిత్యావసర వస్తువులు కొట్టుకుపోయాయి. వరద ప్రభావంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ధాటికి మండల వ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి 1408 ఇళ్లలోకి నీరు చేరాయని, 331 ఇళ్లు పాక్షికంగా, 62 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. అత్యధికంగా వరద నష్టం జరిగిన దాచేపల్లిలోనే బాధితులకు సక్రమంగా పరిహారం అందలేదని ఆరోపణలు వినవస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు చెప్పిన వారి ఇళ్లను గుర్తించారని, నిజంగా దెబ్బతిన్న వారి ఇళ్లను గుర్తించలేదని బాధితులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు రోజులపాటు వర్షపు నీరు ఇళ్లలో ఉండటం వలన ఇళ్లు దెబ్బతిన్నాయని, కట్టుబట్టలతో బయటకు వచ్చిన వారికే సాయం అందించలేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ఇంటింటికీ వచ్చి పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు. ఇంట్లో నడుము లోతులోనీళ్లు.. వరద నీళ్లు ఇంట్లోకి వచ్చాయి. రెండు రోజుల పాటు ఇంట్లో నీళ్లు నడుముల ఎత్తులో నిల బడ్డాయి. ఇంట్లోకి కూడా వెళ్లలేకపోయాం. వరద వలన ఇంటి గోడలు నానిపోయి కూలేందుకు సిద్ధం గా ఉన్నాయి. మాకు నష్ట పరిహారం అందించ లేదు. బాధితులు కాని వారికి సాయం అందిస్తున్నారు. – రావూరి అన్నపూర్ణ, దాచేపల్లి సాయం కోసం ప్రదక్షిణలు.. వరద వలన నష్టపోయిన ఇళ్లకు పరిహారమిస్తారని తెలిసి నాలుగు రోజులుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. ఇంటిని చూపించి రేషన్‌కార్డు చూసి సాయం చేయాలని కోరితే ఎవరు పట్టించుకోవటం లేదు. ఇళ్లు తడిసి ముద్దయితే బియ్యం, పంచదార, నూనె, కందిపప్పు కూడా ఇవ్వలేదు. – పరిమిశెట్టి పావని, దాచేపల్లి -
వరద బాధితుల గుర్తింపులో వివక్ష
అ«ధికార పార్టీ నేతల సిఫార్సులతోనే సరుకుల పంపిణీ చందవరం (నాదెండ్ల): ఒక పక్క వరద ముంపునకు గురై నానా అవస్ధలు పడుతున్న బాధితులకు రాజకీయ పార్టీల నాయకుల వ్యవహారశైలి మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. చందవరం గ్రామంలో భారీ వర్షాలకు రక్షిత మంచినీటి చెరువు తెగి మూడు కాలనీలు నీట మునిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలలోని ఇళ్ల లోకి నీరు చేరి నానా అవస్థలు పడ్డారు. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో అధికారులు వివరాల నమోదులో వివక్ష చూపారు. మొత్తానికి 62 మందిని లబ్దిదారులుగా తేల్చారు. ఒక్కొక్కరికి ప్రభుత్వం 20 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదారతో పాటూ నూనె ప్యాకెట్ పంపిణీ చేయాలని ఆదేశించింది. సోమవారం కేవలం 11 మందికి పంపిణీ చేసిన అధికారులు, మిగిలినవి తరువాత పంపిణీ చేస్తామని చెప్పడంతో బా«ధితులు ఆందోళన చెందారు. బాధితుల పేర్లు నమోదు చేయడంలో కూడా అధికార పార్టీ నాయకులు సూచించిన వారి పేర్లనే నమోదు చేసుకున్నారని వాపోయారు. దీనిపై బాధితులు అధికారులను ప్రశ్నిస్తే జాబితా తయారు చేయడం అయిపోయిందని చేతులు దులుపుకొన్నారు. -
కారుణ్య నియామకాల్లోనూ వివక్ష
టీఎస్పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి పరిగి: కారుణ్య నియామకాల్లోనూ ప్రభుత్వాలు వివక్ష కొనసాగిస్తున్నాయని టీఎస్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మొగులయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి వెంకటయ్య అన్నారు. ఆదివారం పరిగిలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు కులం పేరుతో జరుగుతున్న వివక్షను ఖండించారు. 22 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి ఐదు సంవత్సరాల క్రితం మండలంలోని ఖుదావంద్‌పూర్‌కు చెందిన లక్ష్మయ్య అనే ఉపాధ్యాయుడు మరణిస్తే వారి కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవటం లేదన్నారు. అతను దళితుడు అయినందునే ప్రభుత్వం, అధికారులు, నాయకులు విస్మరిస్తున్నారని తెలిపారు. వెంటనే అతడి భార్యకు ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సకాలంలో ఉద్యోగం కల్పించనందున ఇప్పటికే వారి కుటుంబం ఐదు సంవత్సరాలు నష్టపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు అనంతయ్య, శ్రీనివాస్, బిచ్చయ్య, నాగవర్ధన్, కుమార్, రాజేందర్, హన్మయ్య, మంగమ్మ, యాదగిరి, రాంచంద్రయ్య, నరేందర్, లక్ష్మీనరసింహ, కరుణాకర్, లాలయ్య, రాజు పాల్గొన్నారు. -
రోహిత్ వేముల దళితుడే: పునియా
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని జాతీయ ఎస్పీ కమిషన్ ఛైర్మన్ పీఎల్ పునియా అన్నారు. రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో అవాస్తవాలు, కల్పితాలున్నాయని ఆయన గురువారమిక్కడ అన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులు, అందుకు బాధ్యులైనవారిపై తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాల్సిన కమిషన్... అతడిది ఏ కులం అనే దానిపై నివేదిక ఇవ్వడం దురదృష్టకరమన్నారు. రోహిత్ దళితుడేనని గుంటూరు కలెక్టర్, తహసీల్దార్ నిర్థారించారని, అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్న విషయాన్ని పునియా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏకసభ్య కమిషన్ వాస్తవాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా గత ఏడాది సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ సహా నలుగురు దళిత పరిశోధక విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం బహిష్కరించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, ఈ కారణంగానే వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో సైతం పేర్కొనడం యావత్ దేశాన్ని కదిలించింది. వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం యూనివర్సిటీలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపైనా, రోహిత్ ఆత్మహత్యపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ను వేసింది. ఆ కమిషన్ రోహిత్ దళితుడు కాదని నిర్ధారించడంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు నిర్దోషి అంటూ పేర్కొంది. -
రోహిత్ దళితుడు కాదు..!
-ఏకసభ్య కమిషన్ నిర్ధారణ -అప్పారావు నిర్దోషి అంటూ కితాబు సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ దళితుడు కాదని, కాబట్టి అక్కడ వివక్షకి ఆస్కారం లేదంటూ అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నిర్ధారించింది. రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఆగస్టు మొదటి వారంలో తన నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రూపన్వాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ రోహిత్ దళితుడు కాదని నిర్ధారించడంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు నిర్దోషి అంటూ పేర్కొంది. గత ఏడాది సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ సహా నలుగురు దళిత పరిశోధక విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం బహిష్కరించిన విషయం తెలిసిందే. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని, ఈ కారణంగానే వేముల రోహిత్ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ లో సైతం పేర్కొనడం యావత్ దేశాన్ని కదిలించింది. వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం యూనివర్సిటీలో దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షపైనా, రోహిత్ ఆత్మహత్యపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారుకులైన వైస్ ఛాన్సలర్ పొదలి అప్పారావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, ఎబివిపి నాయకుడు సుశీల్ కుమార్లపై విద్యార్థులు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదైన నేపధ్యంలో రోహిత్ కులం పై అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు బిజెపి చర్చ లేవనెత్తాయి. రోహిత్ దళితుడు కాదని తేల్చే ప్రయత్నం చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అశోక్ రూపన్వాల్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. అయితే ఈ కమిషన్ యూనివర్సిటీ లో వివక్ష జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. బిజెపికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, బిజెపి మంత్రులను కాపాడే లక్ష్యంతో ఈ రిపోర్టు తయారయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రోహిత్ దళితుడు కాదని, కనుక వివక్షకి తావులేదని, అలాగే వీసీ పొదిలె అప్పారావుకి రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదని, అతను నిర్దోషి అంటూ కితాబివ్వడం గమనార్హం. ఈ విషయమై రోహిత్ తల్లి రాధిక స్పందిస్తూ ‘‘నేను ఎస్సి మాల అని, నా కొడుకు కూడా అదే కులానికి చెందిన వాడని గుంటూరు కలెక్టర్, తహసీల్దార్ లు చెప్పారు. అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించింది. నా కొడుకు రోహిత్ దళితుడు కాదని ఎలా నిర్ధారిస్తారు’’ అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి బిజెపి మంత్రులను కాపాడేందుకేనని తీవ్రంగా దుయ్యబట్టారు. ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసునించి మంత్రులను, తమ అనుచరులను తప్పించేందుకు బిజెపి కుట్రగా దీన్ని అభివర్ణించారు. రోహిత్ సోదరుడు రాజా చక్రవర్తి వేముల సాక్షితో మాట్లాడుతూ ఏకసభ్య కమిషన్ ఎదుట తమ గోడు వినిపించే అవకాశం కూడా రూపన్వల్ ఇవ్వలేదని, అలాగే కులం గురించి ఒక్క ప్రశ్నకూడా తన తల్లి రాధికని గానీ, తనను గానీ అడగలేదని, అలాంటిది రోహిత్ దళితుడు కాదని ఎలా నిర్ధారణకు వస్తారన్నారు. ఏకసభ్య కమిషన్, విచారణ సందర్భంలో కూడా ఏకపక్షంగా వ్యవహరించిందని, తాము చెప్పేదేదీ వినకుండా ‘‘అవన్నీ మాకు తెలుసు, కొత్త విషయాలు చెప్పండి’’ అంటూ తమ వాదాన్ని వినిపించే అవకాశాన్ని కూడా కమిషన్ ఇవ్వలేదని రాజా తెలిపారు. నిజానికి రోహిత్ ఆత్మహత్యకు కారణమే వివక్ష అయినప్పుడు వివక్ష గురించి చెపుతుంటే చెప్పనివ్వకపోవడంలో ఆంతర్యమేమిటో తమకు అర్థం కాలేదన్నారు. ఏదేమైనా పూర్తి రిపోర్టు బయటకు వచ్చిన తరువాత జరిగిన విషయాలను సమగ్రంగా వివరిస్తామన్నారు. -
దుష్ప్రచారం తగదు
ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మెట్పల్లి: ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కోరుట్లకు బదులు మెట్‌పల్లిని రెవెన్యూ డివిజన్‌గా ముసాయిదా జాబితాలో చేర్పించానని తనపై దుష్ప్రచారం చేయడం తగదని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మెట్పల్లి, కోరుట్ల పట్టణాలు తనకు రెండు కళ్ల లాంటివని.. ఇందులో దేనిపైనా వివక్ష చూపించాల్సిన అవసరం లేదన్నారు. రాయికల్ మండలాన్ని జగిత్యాల డివిజన్‌లోనే ఉంచడంతో ప్రభుత్వం కోరుట్లకు బదులు మెట్‌పల్లిని డివిజన్‌గా ప్రకటించిందే తప్ప.. ఇందులో తన ఒత్తిడి ఎంతమాత్రం లేదన్నారు. మెట్పల్లి పట్టణంలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలను కోరుట్లకు తరలించిన ప్పుడు తాను జోక్యం చేసుకోలేదని, దీనిని అక్కడి ప్రజలు గమనించాలన్నారు. డివిజన్ విషయంలో అభిప్రాయాలు తెలపడానికి అవకాశముందని, కోరుట్లకు అన్యాయం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలేగాని ఆందోళనలు చేయడం సరికాదన్నారు. -
వితంతువులపై వివక్ష నిర్మూలనకు కృషి
బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి సంఘీభావం తెలిపిన బ్రాహ్మణ, అర్చక సంఘాలు కాజీపేట రూరల్ : సమాజంలో వితంతువులపై వివక్ష నిర్మూలనకు బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ కృషిచేస్తోందని బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవి కాస పీడీటీసీలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం, అర్చక సం ఘం అధ్యక్షుల సమక్షంలో మంగళవారం యువ వితంతువుల సమావేశం జరిగింది. 25 ఏళ్లలోపు వితంతువులు సుమారు 200 మంది పాల్గొన్నారు. రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర బ్రాహ్మ ణ సంఘ సమాఖ్య అధ్యక్షుడు వేములపల్లి జగన్మోహన్శర్మ, గ్రేటర్ వరంగల్ బ్రాహ్మణ సమితి అధ్యక్షుడు పవన్‌శర్మ, సంఘ సభ్యులు పురుషోత్తం, కిరణ్‌కుమా ర్, హన్మంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శౌరిరె డ్డి మాట్లాడుతూ వితంతువులను మానవతా దృక్పథంతో చూడాలన్నారు. వితంతువులపై వివక్ష రూపుమాపేందుకు తమ సంస్థ 12 ఏళ్లుగా కృషిచేస్తోందని చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ మూఢాచారాన్ని అరికట్టేందుకు పురోహితులు కృషిచేయాలని కోరారు. రాష్ట్ర అర్చక సంఘం అ««దl్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ పూర్వం పండితులు, పురోహితులు, నాయకులు ఉనికి కోసం కొన్ని స్వార్థ మూఢాచారాలు అమలు చేశారని తెలిపారు. వాటితో మహిళలను క్షోభకు గురిచేసేవారని అన్నారు. వితంతువులు బొట్టు, పూలు, గాజులు పెట్టుకోవచ్చని, తీసివేయాలని ఏ శాస్త్రంలోనూ లేదన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ సంఘ సమా ఖ్య అధ్యక్షుడు జగన్మోహన్శర్మ మాట్లాడుతూ యువ వితంతువులు పునర్వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస వితుం తు ప్రోగ్రాం ఆఫీసర్ మంజుల ఉపేంద్రబాబు, రాధిక, శివరాం, పుష్ప పాల్గొన్నారు. -
'వెళతావా.. పోలీసులను పిలవనా'
చికాగో: ముసుగు ధరించి వచ్చిందని ఓ ముస్లిం మహిళను అమెరికాలోని ఓ స్టోర్ సిబ్బంది బయటకు పంపించారు. బురఖా ధరించిన తమ దుకాణంలోకి రావొద్దంటూ ఆ రిటెయిల్ అవుట్ లెట్ నుంచి బయటకు పంపించి వివక్ష చూపించారు. ఇండియాలోని గ్యారీ అనే ప్రాంతానికి చెందిన సారా షఫీ అనే ముస్లిం మహిళ తమ సంప్రదాయం ప్రకారం దుస్తులు(బురఖా) వేసుకొని షాపింగ్ కు వెళ్లింది. అలా లోపలికి నాలుగు అడుగులు వేసిందో లేదో వెంటనే కౌంటర్ లో కూర్చున్న ఆమె 'మేడమ్ ముసుగుతీసేయండి లేదంటే.. మా షాపునుంచి వెళ్లిపోండి' అంటూ చెప్పింది. తన కన్నపిల్లల ముందే ఆమె ఈ అవమానం చవిచూసింది. ఆ షాపులో పనిచేసే వ్యక్తికి సారా సమాధానం ఇచ్చే క్రమంలోనే తన మొబైల్ ఫోన్ ఆన్ చేసి ఆ సంభాషణను రికార్డు చేసింది. తాను తమ సంప్రదాయ బద్ధంగానే అలా నిఖాబ్ ధరించానని చెప్పగా క్లర్క్ మాత్రం అలా కుదరదని, ఆ ముసుగు తీసేయాలని, లేదంటే వెళ్లిపోవాలని చెప్పింది. తాను అర్థం చేసుకోగలను కానీ, ఇక్కడ ఇటీవల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అందుకే ఇలా చెప్పాల్సి వస్తుందని చెప్పింది. అయితే, ఇలా ధరించడం తన హక్కు అని చెప్పగా పోలీసులను పిలవమంటారా అని హెచ్చరించింది. ఈ సంఘటన ఇప్పుడు బయటకు తెలిసి పెద్ద సంచలనంగా మారింది. -
సుశీల్ చేసిన తప్పేంటి?
రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతకం కోసం58 ఏళ్ల ఎదురు చూపులకు తెరదించడం అతను చేసిన నేరమా? వరుసగా రెండు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు అందించడం అతను చేసిన తప్పా? ఏం చేశాడని ఈ వివక్ష...? ఎందుకు సుశీల్ కుమార్‌ను ఇంత దారుణంగా అవమానించారు? దేశానికి బెర్త్ తెచ్చింది నర్సింగ్ యాదవ్ కాబట్టి... అతడినే రియో ఒలింపిక్స్‌కు పంపిస్తామంటే... సహజ న్యాయాన్ని పాటిస్తున్నారులే అని సరిపెట్టుకున్నాం... కానీ నర్సింగ్ డోపింగ్‌లో దొరికన తర్వాత అతని స్థానంలో మరో ఆటగాడిని పంపించే అవకాశం ఉన్నా... సుశీల్‌ను కాదన్నారంటే దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో మువ్వన్నెలను రెపరెపలాడించి, దేశానికి కీర్తి తెచ్చిన ఆటగాడిని ఇంత దారుణంగా అవమానిస్తారా? దేశ ప్రయోజనాల కంటే తమ స్వార్థానికే పెద్దపీట వేసే పెద్దలు ఆటను నడుపుతారా? ఒలింపిక్స్‌కు ముందు దేశంలో రె జ్లింగ్లో జరిగిన పరిణామాలు క్రీడారంగానికి ఏ మాత్రం మేలు చేసేవి కావు. సాక్షి క్రీడావిభాగం ‘లండన్‌లో దక్కని స్వర్ణాన్ని రియోలో సాధిస్తా... ‘పసిడి’ ప్రయత్నాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెడతా’ నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలుచుకున్న వెంటనే భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి. అయితే రెజ్లింగ్‌ను 2020 టోక్యో ఒలింపిక్స్ నుంచి తొలగిస్తున్నామంటూ 2013 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అయితే రెజ్లింగ్ ఒలింపిక్స్‌లో కొనసాగించాలనే పట్టుదలతో యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వచ్చింది. వెయిట్ కేటగిరీలను మార్చడం, ఈ క్రీడను సులభంగా అర్ధం చేసుకొనేలా నిబంధనలను రూపొందిం చడం, ఒలింపిక్స్‌లో పురుషులతోపాటు మహిళా రెజ్లర్లకు కూడా సమానంగా స్వర్ణాలు లభించేలా చేయడం లాంటివి ఇందులో భాగమే. ఈ మార్పులను 2016 రియో ఒలింపిక్స్ నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. దాంతో సుశీల్ పోటీపడే 66 కేజీల విభాగం, యోగేశ్వర్ దత్ పాల్గొనే 60 కేజీల విభాగం ఒలింపిక్స్‌లో లేకుండా పోయాయి. వీటి స్థానంలో కొత్తగా 65 కేజీల విభాగం వచ్చింది. లండన్ ఒలింపిక్స్‌లో 60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన యోగేశ్వర్ దత్ అవకాశాలు దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో సుశీల్ 74 కేజీల విభాగానికి మారిపోయాడు. యోగేశ్వర్ 65 కేజీల విభాగంలో పోటీపడాలని నిర్ణయించుకున్నారు. 2013 సెప్టెంబరులో నిర్వహించిన ఓటింగ్‌లో రెజ్లింగ్‌కు అత్యధిక ఓట్లు రావడంతో 2020, 2024 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఐఓసీ ప్రకటించింది. రెండో అవకాశం లేకుండా: సుశీల్ కొత్తగా మారిన 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ అప్పటికే నిలకడగా రాణిస్తున్నాడు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సుశీల్ 74 కేజీల విభాగంలో పోటీపడి స్వర్ణాన్ని సాధించాడు. అదే ఏడాది ఇంచియాన్ ఆసియా క్రీడలకు సుశీల్ దూరంగా ఉండటంతో... అతని స్థానంలో బరిలోకి దిగిన నర్సింగ్ కాంస్య పతకాన్ని నెగ్గాడు. ఆ తర్వాత సుశీల్ భుజం గాయం కారణంగా మరే అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనకున్నా ఒలింపిక్స్ సన్నాహాలను మాత్రం కొనసాగించాడు. 2015 సెప్టెంబరులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల సమయానికి సుశీల్ కోలుకోకపోవడంతో నర్సింగ్ 74 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిం చాడు. కాంస్యాన్ని సాధించడంతోపాటు భారత్‌కు ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఒకసారి ఒక వెయిట్ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్ ఖాయమైతే ఆ కేటగిరీలో ఆ దేశానికి మరోసారి పోటీపడే అవకాశం ఉండ దు. నర్సింగ్ ఒలింపిక్ బెర్త్ సంపాదించడంతో 74 కిలోల విభాగంలో సుశీల్‌కు ఒలింపిక్ బెర్త్ సాధించే అవకాశం లేకుండా పోయింది. తేడా ఎక్కడ వచ్చిదంటే: నర్సింగ్ ఒలింపిక్ బెర్త్ తెచ్చినా రెండు ఒలింపిక్ పతకాలు నెగ్గిన సుశీల్ కూడా ఇదే విభాగంలో పోటీ పడుతుండటంతో రియోకు ఎవరు వెళ్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ విషయాన్ని సుశీల్ కుమార్ వర్గం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ దృష్టికి తెచ్చింది. అప్పటికి ఒలింపిక్స్‌కు ఏడాది సమయం ఉండటంతో... రియోకు ఎవరిని పంపించాలి అనే విషయం ట్రయల్స్ ద్వారా నిర్ణయిస్తామని సుశీల్ వర్గానికి బ్రిజ్‌భూషణ్ హామీ ఇచ్చారు. దాంతో ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. అయితే 2015 డిసెంబరులో భారత్‌లో తొలిసారి ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను నిర్వహించారు. సుశీల్‌ను ఉత్తర్‌ప్రదేశ్ వారియర్స్ ఫ్రాంచైజీ రూ. 38.20 లక్షలకు కొనుగోలు చేసింది. మరోవైపు యోగేశ్వర్ దత్, ఇద్దరు విదేశీ మహిళా రెజ్లర్లకు సుశీల్ కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయడం ఆశ్చర్యపరచింది. ప్రొ రెజ్లింగ్ లీగ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు సుశీల్ గాయం కారణంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించడం తో లీగ్ నిర్వాహకులు షాక్ తిన్నారు. సుశీల్ గైర్హాజరీలో లీగ్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. సుశీల్ కారణంగానే లీగ్‌కు దెబ్బ పడిందని నిర్వాహకులతోపాటు బ్రిజ్‌భూషణ్ భావించారు. అసలు విలన్ ఆయనే: లీగ్ ముగిశాక జరిగిన ఒలింపిక్ అర్హత టోర్నీల ద్వారా భారత్‌కు ఎనిమిది బెర్త్‌లు ఖాయమయ్యాయి. మరోవైపు ఒలింపిక్స్ గడువు సమీపిస్తుండటంతో ట్రయల్స్ గురించి బ్రిజ్‌భూషణ్‌ను సుశీల్ వర్గం వాకబు చేసింది. అయితే ప్రొ రెజ్లింగ్ లీగ్ సమయంలో సుశీల్ చివరి నిమిషంలో వైదొలిగిన విషయాన్ని మనసులో పెట్టుకున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు ఒలింపిక్ బెర్త్ సంపాదించిన నర్సింగ్ యాదవే 74 కేజీల విభాగంలో పాల్గొంటాడని, గతంలోనూ బెర్త్ సాధించినవారే ఒలింపిక్స్‌కు వెళ్లారని, ట్రయల్స్ నిర్వహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ట్రయల్స్ నిర్వహిస్తామని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని సుశీల్ వర్గం గుర్తు చేసినా ఫలితం లేకపోయింది. సుశీల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం, అక్కడా అతనికి నిరాశ ఎదురుకావడంతో ఈ స్టార్ రెజ్లర్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆశలను వదులుకున్నాడు. ప్రత్యామ్నాయ అవకాశం ఉన్నా... అనుకోకుండా నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికిపోవడం... అతనిపై తాత్కాలిక నిషేధం పడటంతో 74 కేజీల విభాగంలో బెర్త్ ఖాళీ అయింది. నర్సింగ్ స్థానంలో వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటు ఉందని యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ భారత సమాఖ్యకు, ఒలింపిక్ సంఘానికి సమాచారం అందించింది. అయితే సుశీల్‌ను పంపించే అవకాశం ఉన్నా... రెజ్లింగ్ సమాఖ్య ఈ స్టార్ రెజ్లర్‌ను విస్మరించి అంతగా అనుభవం లేని ప్రవీణ్ రాణా పేరును ఖాయం చేసింది. తద్వారా సుశీల్‌ను రియోకు పంపించకూడదనే తన మాట ను బ్రిజ్‌భూషణ్ నెగ్గించుకున్నారు. నర్సింగ్పై నిజంగానే కుట్ర జరి గిందా లేదా అనే విషయంపై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశమున్నా... రెజ్లింగ్ సమాఖ్య రాజకీయాలకు సుశీల్ భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. పంతానికి పోకుండా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమాఖ్య ట్రయల్స్ నిర్వహించి ఉంటే ఈ వివాదం ఇక్కడి వరకు వచ్చేదే కాదు. మరో పతకం గెలిచే సత్తా ఉన్న సుశీల్‌ను కాదని ఒక జూనియర్‌ను పంపిస్తున్న భారత్ పతకంపై ఆశలు పెట్టుకునే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. -
దళితవాడల అభివృద్ధిలో వివక్ష
ఊట్లపల్లి(పెద్దవూర): రాష్ట్ర ప్రభుత్వం దళిత వాడల అభివృద్ధిలో వివక్ష చూపుతుందని కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు దొంతాల నాగార్జున అన్నారు. ఆదివారం మండలంలోని ఊట్లపల్లి, లింగంపల్లి, తెప్పలమడుగు, పోతునూరు గ్రామాల్లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత వాడలలో మౌలిక వసతులు లేక దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుబ్బ పరమేశ్, చిలుముల దుర్గయ్య, బొడ్లు ఎల్లయ్య, బక్కయ్య, పెదమల్లయ్య, నాగరాజు, శ్రీను, శ్రీదేవి, రాములు, రామస్వామి పాల్గొన్నారు. -
‘మహిళలపై వివక్ష దారుణం’
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహిళలపై వివక్ష చూప డం దారుణమని సర్పంచ్ల సంఘం జిల్లా అ ధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ సీపీ కార్యాల యంలో ఆయన శుక్రవారం విలేకరులతో మా ట్లాడారు. రెండేళ్లలో ఐసీడీఎస్ మొదలుకుని రెవెన్యూ వరకు అన్నింటా మహిళలకు వివక్షలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్‌లో ఆరుగురు సభ్యులను నియమించినా జిల్లాకు చెందిన వారు ఒక్కరూ లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో అంగన్వాడీ సిబ్బంది ఆకలి కేకలు ముఖ్యమంత్రితో పాటు జిల్లా మంత్రికీ వినిపించడం లేదన్నారు. మంత్రి ఇలాకాలో ఉన్న టెక్కలి ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి సేవలు నానాటికీ నీరుగారుతున్నాయని ధ్వజమెత్తారు. డ్వాక్రా మహిళలు ఇ ప్పటికే బాబును నమ్మి మోసపోయారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండవిల్లి రవి, కె.ఎల్.ప్రసాద్, గుడ్ల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు -
పట్టిసీమకు ఒక రేటు.. పోలవరానికి ఇంకోటా?
-
పట్టిసీమకు ఒక రేటు.. పోలవరానికి ఇంకోటా?
► పరిహారం విషయంలో ఎందుకు తేడా ►ముందుగా భూములు ఇచ్చినవాళ్లను అన్యాయం చేస్తున్నారు ►వాళ్లకు పరిహారం పెంచాల్సిన అవసరం లేదా ►అన్యాయం జరుగుతోందని చెబితే బురద జల్లుతున్నారు ►ముంపు మండలాల వాసుల స్థానికతను ఏం చేశారు ►ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు ►పోలవరం నిర్వాసితులకు అండగా బహిరంగ సభ కుకునూరుపల్లి: పక్కపక్కనే ఉన్న పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల పరిహారం విషయంలో వేర్వేరు ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబును వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరుపల్లిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తుంటే.. జరిగేది అన్యాయం అని చెబితే పాలకపక్షం వాళ్లు మన గోడు వినడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా గోడు వినండి, మా పరిస్థితిని చూడండి.. మేం అన్యాయంగా ఏమీ చెప్పడం లేదు, మేం అడిగేది పూర్తిగా న్యాయబద్ధమైన కోరికలే. వాటిని నెరవేర్చడానికి మనసు రాకపోవడం దారుణమని అంటున్నాం ఇక్కడికి వచ్చినపుడు భూములు కోల్పోయినవారు, ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసినవారిని ఆదుకునే విషయంలో నాలుగు అడుగులు ముందుకు వేయండి, తోడుగా నిలబడండి అని అడిగితే చంద్రబాబు ఏమన్నారో తెలుసా.. ‘పోలవరం ప్రాజెక్టు రావడం జగన్‌కు ఇష్టం లేదు’ అంటారు చంద్రబాబు అన్యాయం చేశారంటే నా మీద బురద వేయడం మామూలైపోయింది రాజధాని విషయంలో అన్యాయంగా భూములు లాక్కుని, సింగపూర్ కంపెనీలకు ఇష్టం వచ్చిన రేట్లకు ఇస్తున్నారు లంచాలు తీసుకుని వాళ్లు, మీరు వ్యాపారాలు చేస్తున్నారంటే.. అమరావతిలో రాజధాని రావడం జగన్ కు ఇష్టం లేదంటున్నారు అన్యాయం జరుగుతోంది, సరిదిద్దాలని అడిడితే బురద జల్లుతున్నారు పోలవరం రావాలన్నది రాష్ట్ర ప్రజలందరి కోరిక. అది వస్తేనే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు మొత్తం రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఆ ప్రాజెక్టు కోసం 110 కిలోమీటర్లు నేను కూడా పాదయాత్ర చేశా ఎవరూ ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు.. పోలవరం రావాలని చెప్పేవాళ్లలో అందరం ఇక్కడే ఉన్నాం పోలవరం కోసం త్యాగాలు చేసిన వీళ్లకు సరైన న్యాయం చేస్తున్నామో లేదో పాలకులు గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించాలి వీళ్లు అడిగే ఏ కోరిక అన్యాయం అనిపించడం లేదు పట్టిసీమలో 20 లక్షలిస్తున్నారు.. మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు అదే తమకు కూడా వర్తింపజేయాలని అడగడంలో తప్పేముంది చంద్రబాబును గట్టిగా అడుగుతున్నాం.. ఒకే జిల్లాలో పక్కపక్కనే ఉన్న ప్రాజెక్టులు ఒక్కోదానికి ఒక్కో ప్యాకేజి ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నా భూముల రిజిస్ట్రేషన్ రేట్లను ఒకేలా వర్తింపజేయాలి ఇక్కడ అన్నీ 1/70 భూములు ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ విలువ తక్కువ చూపిస్తారు సత్తుపల్లి, అశ్వారావుపేటలో ఎకరాకు 7 లక్షల మార్కెట్ రేటుఉంది.. పట్టిసీమలో 20 లక్షలు మీరే ఇస్తున్నారు ఇక్కడ మాత్రం భూముల విలువ ఎందుకు తగ్గిస్తున్నారు చింతలపూడి నుంచి పట్టిసీమ, పోలవరం అన్నీ పక్కపక్కనే ఉన్నాయి పట్టిసీమకు అమలుచేసిన ప్యాకేజిని అందరికీ వర్తింపజేయాలి వీళ్ల భూములు 8, 9 ఏళ్ల క్రితం ఎకరాకు 1.15 లక్షల చొప్పున ఇచ్చి అప్పట్లో తీసుకున్నారు ఇది అప్పటి రేటు.. ఇప్పుడు 20 లక్షల వరకు చేరింది. ఎక్కడైనా కొనాలంటే ఆ 20 లక్షలు పెడితే తప్ప ఎకరా భూమి కూడా దొరకట్లేదు మా పరిస్థితి ఏంటి.. కాస్తో కూస్తో మాకు కూడా పరిహారం పెంచి ఇవ్వక్కర్లేదా అని అడుగుతున్నారు ఈ ప్రాజెక్టు కోసం మొదటి వరుసలో నిలబడి భూములు ఇచ్చినవాళ్లు ఉన్నారు 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 20 నుంచి సెక్షన్ 30 వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఐదేళ్ల వరకు ఎటువంటి వినియోగం చేయకపోతే భూములను తిరిగి వెనక్కి ఇవ్వాలి. అలా కూడా అక్కర్లేదు.. తమకు పరిహారం పెంచాలని మాత్రమే వీళ్లు అడుగుతున్నారు పట్టిసీమలాగ ఎకరానికి 20 లక్షలు కూడా అడగడం లేదు, అప్పుడిచ్చిన దానికి 5 లక్షలు పెంచి ఎక్స్‌గ్రేషియా ఇస్తే చాలని చాలా న్యాయంగా అడుగుతున్నారు పోలవరం ప్రాజెక్టు అంచనా 32 వేల కోట్లు అంటున్నారు. ఇలా భూములు ఇచ్చినవాళ్లకు కాస్తో కూస్తో ఇస్తే ప్రాజెక్టు మొత్తం విలువలో అది 5 శాతం కూడా ఉండదు కదా భూములు ఇచ్చినవాళ్ల ముఖంలో చిరునవ్వు ఉండాలి, వీళ్ల త్యాగాలు మర్చిపోకూడదు భూములన్నీ కోల్పోయినా పోలవరానికి వీళ్లు అండగా నిలబడుతున్నారు పోడు భూములు, అసైన్డ్ భూములు, ఏ పేరైనా సరే.. ప్రభుత్వం మాకు ఆ భూములు ఇచ్చిన తర్వాత అవి మావే కాబట్టి ప్రైవేటు భూములకు ఇచ్చిన రేటు, పరిహారం మాకు కూడా ఇవ్వాలి కదా అని కోరుతున్నారు వాళ్లు నిరుపేదలు కాబట్టే ఆ భూములు ఇచ్చారు. అలాంటి పేదలకు కాస్తో కూస్తో ఎక్కువ ఇవ్వాలి గానీ తగ్గిస్తే ఎలా వీళ్లకు ఇస్తున్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కేవలం 2, 3 లక్షలు దాటడం లేదు.. దాంతో ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు కొత్త ఇల్లు కట్టుకోవాలంటే 5 సెంట్ల స్థలానికి కూడా సరిపడ మొత్తం రావట్లేదు. కనీసం 10 లక్షల ప్యాకేజి ఇవ్వాలని వాళ్లు అడిగేది న్యాయబద్ధంగానే ఉంది ముంపు మండలాలు ఏపీలో చేరి రెండేళ్లయింది. ఇప్పటికీ వాళ్లకు సంబంధించిన స్థానికత సమస్య తేలలేదంటే ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలి స్థానికత ఇవ్వకపోవడంతో పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంటు, ప్రభుత్వ పథకాలు అందడం లేదు పిల్లలు డీఎస్సీ రాయాలన్నా, ఇంకేం రాయాలన్నా ఏ రాష్ట్రం వాళ్లో తెలియడం లేదు ఉద్యోగాల విషయంలో కూడా తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలూ వీళ్లను కాదంటున్నాయి ప్రతి విషయంలోనూ ప్రభుత్వం చేయగలిగిన పనులు కూడా చేయడం లేదు ఇంతమంది ఉసురు పోసుకుని నువ్వు సాధించేదేంటి బాబూ? 20 మంది ఎమ్మెల్యేలకు 30 కోట్ల చొప్పున కొన్నావు.. అంటే 600 కోట్లు ఖర్చుపెట్టావు ఎక్కడికి వెళ్లినా ప్రైవేటు విమానం తప్ప మామూలు విమానం ఎక్కడం లేదు బాబు పాలనలో ఏది చూసినా టెంపరరీ బిల్డింగులే. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక నివాసం.. చివరకు చంద్రబాబు ఇళ్లకు, ఆఫీసులకు చేసిన మరమ్మతల ఖర్చు లెక్క వేసుకుంటే 100 కోట్లు అవుతుంది కన్సల్టెన్సీలకు ఇంత, నాకింత అని చెప్పి ఈ రెండేళ్లలో 300 కోట్లు ఇచ్చారు ఈ డబ్బు కాస్త ఇటువైపు మళ్లిస్తే పోలవరం ప్రాజెక్టులో ప్రతి ఒక్కరూ ఆనందంగా ముందుకు వచ్చేవాళ్లు పోలవరం ప్రాజెక్టును కూడా బాబు అడ్డగోలుగా నాశనం చేస్తున్నారు దీని గురించి కేంద్రం లేఖలు రాస్తోంది.. కాంట్రాక్టరు పనులు సరిగా చేయడంలేదని, మార్చాలని చెప్పింది చంద్రబాబు మాత్రం ఆ కాంట్రాక్టరు తన బినామీ కాబట్టి మార్చే ప్రసక్తి లేదంటున్నారు కేంద్రాన్ని మోసం చేస్తూ.. పోలవరం ప్రాజెక్టులో లంచాల కోసం సబ్ కాంట్రాక్టరును కూడా తెచ్చుకుంటున్నారు వాళ్ల ద్వారా కోట్లకు కోట్లు దండుకుంటున్నారు చివరకు కేంద్రం కూడా ఈ దోపిడీని చూసి పోలవరం ప్రాజెక్టుకు సపోర్ట్ విషయంలో నాలుగడుగులు వెనక్కి వేస్తున్నారు దేశంలోనే ఇంత దారుణమైన సీఎం ఎవరూ ఉండి ఉండరు ఈ రెండేళ్లలో బాబు చేసింది సున్నా మీరు అడుగుతున్నవన్నీ చదివాను.. అవన్నీ సమంజసమైనవే పొరపాటున ఏదైనా మీకు అందకపోతే నిరాశ పడక్కర్లేదు మీరు ప్రాజెక్టుకు తోడుగా ఉండండి.. చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం సాగదు మరో రెండేళ్లకో, సంవత్సరానికో మన ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ పూలలో పెట్టి మీకు అందించి మీ ముఖాల్లో చిరునవ్వు చూస్తా పోలవరం ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం చంద్రబాబు మీద పోరాటం మాత్రం కొనసాగిస్తాం దానికి దేవుడి దయ కావాలి.. మీరంతా చంద్రబాబు ప్రభుత్వం పోవాలని కోరుకోవాలి కడుపునిండా బాధ ఉన్నా చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయత చూపిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు -
నిధుల కేటాయింపులో వివక్ష
పైసా కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినవీ పక్కదారి {పతి రూపాయీ అమరావతికే సొంత జిల్లాపై సీఎం చంద్రబాబు వివక్ష పాటిస్తున్నారు. నిధులు ఏ మాత్రమూ కేటాయించకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారు. కరువు జిల్లాల జాబితాలో కేంద్రం ఇచ్చిన నిధులను సైతం అమరావతి దారి పట్టించి జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. చిత్తూరు: కరువు జిల్లాగా ఉన్న చిత్తూరుపై ప్రభుత్వం కరుణ చూపడం లేదు. రెండేళ్ల కాలంలో కనీస నిధులు కేటాయించకపోవడం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కేంద్రం రాయలసీమ జిల్లాల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఒక్కో జిల్లాకు రూ.100 కోట్ల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కి జిల్లాకు కేటాయించిన నిధులను అమరావతి దారి పట్టించింది. కేటాయించిన మొత్తంలో కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కరువు నివారణ కింద చెరువుల అనుసంధానం, విద్యాభివృద్ధి, మెరుగైన వైద్యం అందించడానికి ఈ నిధులు వెచ్చించాలని కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. లెక్కలెవీ.. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రకారం రాయలసీమకు రూ.1,250 కోట్లు కేంద్రం కేటాయించాల్సి ఉంది. రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం కావడంతో విభజన చట్టంలో ఈ మేరకు కేటాయింపులు ఇస్తామని పేర్కొంది. అయితే ఇచ్చిన రూ.100 కోట్లనే తప్పుదారి పట్టించిన ప్రభుత్వం మొత్తం నిధులు కేటాయిస్తే అంతా దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని అడ్డుకోవడానికి రాయలసీమ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు సగానికి పైగా ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. వైద్యం, తాగునీటి వసతి కల్పించాల్సి ఉంటుంది. -
మహిళా సమస్యలపై పోరాడాలి: భట్టి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షపై పోరాటం చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మహిళా కాం గ్రెస్ నేతలకు సూచించారు. బుధవారం గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో భట్టి మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళల సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. మహిళలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటేనే పార్టీపై విశ్వా సం, ఆదరణ పెరుగుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా ప్రత్యేక మహిళా కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని భట్టి సూచిం చారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద, మాజీ ఎమ్మెల్యే అరుణతార తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ సెల్ సమావేశం కాంగ్రెస్ మైనారిటీ సెల్ సమావేశం కూడా గాంధీభవన్‌లో జరిగింది. మైనారిటీ సెల్ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై భట్టి దిశానిర్దేశం చేశారు. మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఫకృద్దీన్ పాల్గొన్నారు. -
ట్రాన్స్ జెండర్స్‌తో ఫ్యాషన్ డిజైనింగ్
న్యూఢిల్లీ: వస్త్రాల ఫ్యాషన్ డిజైనింగ్ ప్రెజెంట్ చేయాలంటే ఎవరైనా అందమైన ముద్దుగుమ్మలనే ఎంచుకుంటారు. సిల్క్ అయినా కాటన్ అయినా.. తాము డిజైన్ చేసిన వాటిని వారితోనే కట్టించి ప్రెజెంట్ చేస్తుంటారు. అలాంటిది ట్రాన్స్ జెండర్స్ (లింగమార్పిడి చేసుకున్నవారు)తో ఆ పనిచేయించే సాహసం ఎవరైనా చేస్తారా.. కేరళకు చెందిన షర్మిల నాయర్ ఆ ధైర్యం చేశారు. 24 ఏళ్ల యువ డిజైనర్ ట్రాన్స్ జెండర్ విషయంలో సమాజం పాటిస్తున్న వివక్ష తగ్గించేందుకుగాను తన వృత్తి సహాయాన్ని తీసుకుంది. పాశ్చాత్య దేశాల్లో ట్రాన్స్ జెండర్స్ అనేది ఒక హాట్ టాపిక్. ఇక ఎక్కువ మొత్తంలో సంస్కృతి సంప్రదాయాలు పాటించే భారత్‌లో అయితే అతి సున్నితమైన విషయమే. ఇటీవల ఇండియాలో కూడా వీరి విషయంలో కాస్తంత సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. కేరళలో ట్రాన్స్ జెండర్స్‌కు న్యాయం చేసేలా ఒక కొత్త పాలసీని కూడా తీసుకొచ్చారు. ఇలాంటి సమయంలో ఒక యువ ఫ్యాషన్ డిజైనర్ ట్రాన్స్ జెండర్స్‌ను కూడా ఇతర మహిళల్లేగా గుర్తించి వారితో ఫ్యాషన్ చీరలు ప్రదర్శింపజేయడం గమనార్హం. మీకు ఎందుకు ఇలా చేయాలన్న ఆలోచన వచ్చిందన ఆమెను ప్రశ్నించగా.. గత ఏడాది సహజమైన కాటన్, సిల్క్ చీరలను ప్రమోట్ చేసేందుకు దక్షిణాధి రాష్ట్రాల్లోని పలువురు ప్రత్యేక ప్రమోట్ గర్ల్స్ కోసం తిరిగాను. ఆ సమయంలో కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ నన్ను ఆలోచించేలా చేసింది. లింగమార్పిడి చేసుకున్న వారు కూడా మహిళలే .. వారు కూడా చీరలు దరించవచ్చు. అందుకే ఎందుకు ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ ని తన డిజైనింగ్ ప్రమోట్ చేసేందుకు ఉపయోగించుకోకూడదని ఆలోచించాను. ఆ విధంగా చేశాను' అని ఆమె చెప్పారు. -
జీతంలోనూ.. అలుసే!
ఉద్యోగాల్లో ప్రారంభ స్థాయిలో ఈ వేతన వివక్ష తక్కువగానే ఉంటోంది. కానీ, సీనియర్ స్థాయికి వెళుతున్న కొద్దీ ఆడా, మగా జీతాల్లో తేడా దాదాపు 40 శాతం దాకాకనిపిస్తున్నట్లు నిపుణులు లెక్కిస్తున్నారు. చేస్తున్న పని ఒకటే! మరి జీతం మాటేమిటి? ఆడ అయినా, మగ అయినా - చేసే పని ఒకటే అయినప్పుడు, జీతం ఒకటే ఉండాలిగా! అలా ఉంటోందా? లేదని అంటున్నాయి అధ్యయనాలు. స్త్రీపురుషులు ఇద్దరికీ సమానం జీతం చెల్లించాలని ఇటీవలే ‘సమాన వేతన దినోత్సవం’ (ఈక్వల్ పే డే) జరుపుకొన్నాం. కానీ, వాస్తవంలో మాత్రం స్త్రీ పురుషులకు చెల్లిస్తున్న వేతనాల్లో చాలా తేడా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. విచిత్రం ఏమిటంటే, ఈ రకమైన ‘వేతన వివక్ష’ ప్రపంచం మొత్తంలో మన దేశంలోనే ఎక్కువ ఉంది! భారతదేశంలో ఆడ, మగ వేతనాల్లో తేడా (జెండర్ పే గ్యాప్) ఏకంగా 27 శాతం మేర ఉందని ‘మాన్స్టర్స్ సేలరీ ఇండెక్స్’ (ఎం.ఎస్.ఐ) వెల్లడించింది. మన దేశంలో మగవాళ్ళకు గంటకు రూ. 288.7 మేర వేతనం చెల్లిస్తుంటే, ఆడవాళ్ళకు మాత్రం రూ. 207.9 మాత్రమే చెల్లిస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే - ఆ యా రంగాలను బట్టి ఈ వేతన వివక్ష కూడా ఇంకా ఎక్కువే ఉంటోంది. ఉదాహరణకు, వస్తూత్పత్తి రంగంలో మగవాళ్ళకు చెల్లిస్తున్న దాని కన్నా 34.9 శాతం తక్కువ మొత్తం మహిళలకు ఇస్తున్నారు. అంటే, మిగతాచోట్లతో పోలిస్తే మహిళలకు ప్రత్యేక హక్కులు, చట్టాలు ఉన్న కర్మాగారాల్లో సైతం ఇంత తేడా ఉందన్న మాట! ఆడ, మగ వేతనాల్లో తేడా తక్కువ ఉన్నదల్లా - రవాణా, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్ రంగాల్లో! వాటిల్లో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకు 17.7 శాతం మేర తక్కువ జీతం చెల్లిస్తున్నారు. మగాడికైతే 100 డాలర్లు... మహిళకైతే 76! అందరినీ కలుపుకొనిపోతూ అభివృద్ధి సాధించడానికి మన దేశంలో ప్రయత్నాలు మొదలైనప్పటికీ, ఒకే సంస్థలో ఒకే ఉద్యోగానికి స్త్రీ కన్నా పురుషులకే ఎక్కువ జీతం ఆఫర్ చేయడమన్నది ఇప్పటికీ తరచూ జరుగుతోందని మాన్స్టర్ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న వేతన వ్యత్యాసాల వివరాల్నీ, వాటితో మన దేశ వివరాల పోలికనూ మాన్స్టర్ సంస్థ ప్రకటించలేదు. అయితే అందుబాటులో ఉన్న ఇతర అధ్యయనాలను బట్టి చూస్తే - జపాన్, కొరియాల్లో కూడా ఈ ఆడా, మగా జీతాల తేడా 25 శాతం పై మాటే. అంటే, అక్కడి కన్నా మన దేశంలోనే ఈ వివక్ష మరీ ఎక్కువగా ఉందని అర్థమవుతోంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికోలలో ఈ ‘జెండర్ పే గ్యాప్’ 20 శాతం కన్నా తక్కువ. ఉన్నంతలో న్యూజిలాండ్, స్పెయిన్లలో ఆడవాళ్ళ పరిస్థితి కొంత మెరుగట! అక్కడ వేతనాల్లో తేడా 10 శాతం కన్నా తక్కువే. ప్రపంచ బ్యాంకు గణాంకాలను బట్టి చూస్తే - ఒక పనికి సగటున ప్రతి పురుషుడికీ 100 డాలర్లు ఇస్తుంటే, అదే పనికి మహిళకు మాత్రం దాదాపు 76 డాలర్లే చెల్లిస్తున్నారు. ఎందుకీ వివక్ష? మనదేశంలో ఈ వివక్షకు ఈ వివక్షకు కారణాలేమిటన్నది కూడా మాన్స్టర్ అధ్యయనంలో కొంత పరిశీలించారు. ఉద్యోగాల్లో, సూపర్వైజర్ స్థాయి ప్రమోషన్లలో ఆడవాళ్ళ కన్నా మగాళ్ళ వైపే ఎక్కువ మొగ్గు చూపడమన్నది ఇప్పటికీ జరుగుతోందని తేల్చారు. అది కూడా ఈ వేతనాల తేడాకు కారణం కావచ్చని పేర్కొన్నారు. బిడ్డలకు జన్మనివ్వడం మొదలు అనేక ఇతర సామాజిక, సాంస్కృతిక కారణాల వల్ల స్త్రీలు తమ ఉద్యోగాల్లో తరచూ విరామం తీసుకోవడం కూడా ఈ తేడాకు కారణమవుతోందట! ఉద్యోగాల్లో ప్రారంభ స్థాయిలో ఈ వేతన వివక్ష తక్కువగానే ఉంటోంది. కానీ, సీనియర్ స్థాయికి వెళుతున్న కొద్దీ ఆడా, మగా జీతాల్లో తేడా దాదాపు 40 శాతం దాకా కనిపిస్తున్నట్లు నిపుణులు లెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, భారతీయ టెక్నాలజీ రంగానికి సంబంధించిన ఒక అధ్యయనం మరో సంగతి వెల్లడించింది. దాదాపుగా 12 ఏళ్ళ పాటు స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగం చేశారనుకుంటే, మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకు దాదాపు రూ. 3.8 లక్షల మేర తక్కువ జీతమే దక్కుతోందని ఆ అధ్యయనం పేర్కొంది. కేవలం ‘సమాన వేతన దినోత్సవా’లు జరుపుకోవడంతో తృప్తి పడకుండా, వేతనాల్లో ఉన్న తేడాను వీలైనంత తగ్గించడానికి కృషి చేయాల్సి ఉందని నిపుణులు అంగీకరిస్తున్నారు. అందు కోసం భారతీయ ఉద్యోగ విపణిలో కీలక భాగస్వాములైన మహిళలకు - పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అభ్యుదయ దృక్పథంతో పనిచేస్తున్న కొన్ని సంస్థలు మాత్రం తమ దగ్గర ఇలాంటి వేతన వివక్షలు ఏవైనా ఉంటే వాటిని తొలగించేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ‘జెండర్ పే ఆడిట్’లను కూడా నిర్వహిస్తున్నాయి. కూలీనాలీ చేసుకుంటున్న వారి దగ్గర నుంచి కమ్యూనికేషన్ రంగం దాకా అన్నిచోట్లా ఉన్న ఈ స్త్రీ పురుష వివక్షకు చరమగీతం పాడేందుకు ఇంతకు మించి సరైన తరుణం వేరొకటి ఉందంటారా? -
ఉరికంబం.. వివక్ష
ఉరితాడుకు కూడా కులం ఉన్నదని...ధనిక, పేద వివక్ష ఉన్నదని ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం రూపొందించిన నివేదిక మరోసారి ధ్రువపరిచింది. రెండున్నరేళ్లు ఎంతో శ్రమించి, దేశంలోని అనేక జైళ్లలో ఉరికంబం నీడన బతుకు లీడుస్తున్న అభాగ్యుల్ని కలిసి మాట్లాడి ఈ నివేదికను వెలువరించారు. మొత్తంగా ఉరిశిక్ష పడిన 385మందిలో 373మందికి సంబంధించిన వివరాలను ఈ నివేదిక అధ్యయనం చేసింది. మన చట్టాలు, కోర్టులు, జైళ్లు ఎలా పనిచేస్తున్నాయో... వాస్తవంగా జరుగుతున్నదేమిటో వెల్లడించి అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. ఉరిశిక్ష పడినవారు నేరస్తులా, అమాయకులా అన్న చర్చలోకి ఈ నివేదిక పోలేదు. వారు చేసిన నేరమేమీ లేదని వాదించబూనుకోలేదు. ఆ నివేదిక చేసిందల్లా వాస్తవాలను సమాజం ముందుంచడమే. నివేదిక రూపకల్పనలో పాలు పంచుకున్నవారంతా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు. ఉరిశిక్షకు అర్హమైన నేరాలేమిటో చెప్పే చట్టాలు మన దేశంలో చాలా ఉన్నాయి. భారత శిక్షాస్మృతిలోని 12 సెక్షన్లతోసహా 18 కేంద్ర చట్టాలు ఎలాంటి నేరాలకు ఉరిశిక్ష విధించవచ్చునో చెబుతున్నాయి. మొత్తంగా 59 సెక్షన్లు మరణశిక్ష విధింపునకు వీలు కల్పిస్తున్నాయి. ఇవిగాక రాష్ట్రాల్లో అనేక చట్టాలున్నాయి. మన రాజ్యాంగం ‘జీవించే హక్కు’ను వాగ్దానం చేస్తుంటే ఒక మనిషి ప్రాణం తీయడానికి ఇన్ని చట్టాలు, నిబంధనలా అని ఆశ్చర్యం కలగొచ్చు. ఇలాంటి సంశయమే ఏర్పడటం వల్ల కావొచ్చు...జస్టిస్ ఏపీ షా నేతృత్వంలోని లా కమిషన్ నిరుడు ఆగస్టులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఉరిశిక్షను మన చట్టాలనుంచి ‘దశలవారీగా’ తొలగించాలని సిఫార్సు చేసింది. ఉగ్రవాదం మినహా ఇతర నేరాలకు దీన్ని విధించరాదని పేర్కొంది. ‘అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనది’ అయినప్పుడు మాత్రమే ఉరిశిక్ష విధించాలని 1983లో ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నేర స్వభావాన్నిబట్టి... నేరస్తుణ్ణి సంస్కరించడం సాధ్యమా, కాదా అన్నదాన్నిబట్టి ఒక కేసు ‘అరుదైన కేసుల్లో అత్యంత అరుదైనద’ని నిర్ధారించుకున్న తర్వాతే ఈ శిక్ష విధించాల్సి ఉంటుంది. అయితే కింది కోర్టులు ఉరిశిక్ష విధించేటపుడు ఈ గీటురాయిని పరిగణిస్తున్నాయా? లేదనే చెప్పాలి. 2000-2015 సంవత్సరాల మధ్య మన దేశంలో కింది కోర్టులు మొత్తం 1,617మందికి ఉరిశిక్ష విధించాయి. ఉరిశిక్ష విధింపు అన్నది ఒక రకంగా ఏకపక్షమైనదేనని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీఎన్ భగవతి ఒక సందర్భంలో అభిప్రాయపడ్డారు. అది తీర్పునిచ్చే న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలకూ, వారికుండే సామాజిక చింతనకూ, వారు ముందుగా ఏర్పర్చుకునే భావాలకూ, పక్షపాత ధోరణులకూ లోబడి ఉంటుందన్నది జస్టిస్ భగవతి భావన. ఉరిశిక్షల విధింపు విషయంలో సుప్రీంకోర్టు విధించిన పరిమితులు పట్టకపోవడానికి ఇలాంటి అంశాల ప్రభావం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఉరిశిక్ష విధింపు నకు సంబంధించి మన రాజ్యాంగ నిర్ణాయక సభలో విస్తృతమైన చర్చే జరిగింది. ఆ సభలో సభ్యుడిగా ఉన్న శిబన్లాల్ సక్సేనా ఆ శిక్ష ఉండరాదని గట్టిగా వాదించారు. బ్రిటష్ పాలనలో 26 నెలలపాటు ఆయన ఉరిశిక్ష పడిన ఖైదీగా ఉన్నారు. తన సహచరులు 37మంది ఉరికంబం ఎక్కడాన్ని చూశారు. వారిలో కనీసం ఏడుగురు అసలు ఏ నేరంతోనూ సంబంధం లేనివారని సక్సేనా చెప్పారు. శిక్ష విధింపునకు అవకాశమిస్తే అమాయకులు బలైపోతారని హెచ్చరించారు. అయినా దాన్ని చివరకు పార్లమెంటు నిర్ణయానికి వదిలేశారు. ఉరిశిక్ష పడిన ఖైదీల్లో చాలామంది(74.1శాతం) ఆర్ధిక స్థోమత లేనివారని నివేదిక చెబుతోంది. అలాగే వారిలో 76 శాతంమంది(279మంది) సమాజంలో అట్టడుగు కులాలవారూ, మతపరంగా మైనారిటీలు. జాతీయ స్థాయిలో చూస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు 24.5 శాతం ఉన్నారు. అయితే మహారాష్ట్రలో 50శాతంమంది, కర్ణాటకలో 36.4 శాతం, మధ్యప్రదేశ్‌లో 36 శాతం, బిహార్‌లో 31.4 శాతం, జార్ఖండ్‌లో 30.8 శాతం మంది ఈ వర్గాలవారే. వీరిలో 85.4 శాతంమంది ఆర్ధికంగా దుర్బలులే. మరణశిక్ష పడినవారిలో మైనారిటీలు 20.7 శాతం. వీరి జనాభా నిష్పత్తిని బట్టి చూస్తే ఇది అధికం. అలాగే ఈ మైనారిటీ ఖైదీల్లో 76శాతంమంది ఆర్ధికంగా స్థోమత లేనివారు. ఉరిశిక్ష పడినవారితో జైల్లో పని చేయించరు గనుక వారికి ఎలాంటి ఆదాయమూ ఉండదు. కనుక తమ కుటుంబాలకు అంతో ఇంతో పంపడం వారికి సాధ్యంకాదు. ఆ విధంగా ఉరిశిక్ష పడిన ఖైదీల కుటుంబాలు కూడా నిస్సహాయంగా మిగిలిపోతున్నాయి. న్యాయ వాదిని నియమించుకోలేనివారికి న్యాయ సహాయం అందించడం తప్పని సరని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఉరిశిక్ష పడిన 189మంది ఖైదీల్లో 169మందికి అసలు న్యాయవాదులే లేరని తేలింది. అంటే వారిపై వచ్చిన అభియోగాల్లోని అహేతుకతను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినవారే లేరన్న మాట! కొందరు ఖైదీలు చెప్పిన మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది. ఏవో కొన్ని పత్రాలపై సంతకాలు చేయాలంటూ పోలీసులు తీసుకుపోయారని, ఆ తర్వాత ఇంటి ముఖం చూడలేదని, చివరకు ఇంత పెద్ద శిక్ష పడి దిక్కుతోచకుండా కాలం వెళ్లదీస్తున్నామని వెల్లడించినవారున్నారు. అరెస్టుకూ, న్యాయస్థానంలో హాజరు పరచడానికీ మధ్య ఎన్ని రకాల చిత్రహింసలు అనుభవించాల్సివచ్చిందో, ఎంత నరకం చవిచూడాల్సివచ్చిందో...పర్యవసానంగా చేయని తప్పును నెత్తిన వేసుకుని ఉరికి ఎలా చేరువైనామో మరికొందరు చెప్పారు. ఉరిశిక్ష పడిన ఖైదీలకు ఉండాల్సిన హక్కులు, వారు పొందగల న్యాయసహాయం వంటి అంశాలపై రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. కానీ ఆచరణలో అవి ఎలా అమలవుతున్నాయో ఇప్పుడు జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం అధ్యయనం తేటతెల్లం చేస్తోంది. ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిం చడంతోపాటు ఆ శిక్ష పడిన ఖైదీలకు కనీస హక్కులు లేకుండా చేయడంపై హక్కుల సంఘాలు చాలా కాలంనుంచి ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి సంఘాలకు ఉద్దేశాలను ఆపాదించడంలో ఉన్న శ్రద్ధ...వ్యవస్థను ప్రక్షాళన చేసుకోవడంలో లేకుండా పోయిందని తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి లోపాలను సరిదిద్దుకోవడం తక్షణావసరమని గుర్తించాలి. -
అలా చేయడానికి ఆచారాలు ఒప్పుకోవు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి మహిళా భక్తులను అనుమతించకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. శబరిమల ఆలయ బోర్డు మహిళల పట్ల వివక్ష చూపిస్తోందని పేర్కొంది. శబరిమలకు మహిళల నిరాకరణపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం పలు పశ్నలు సంధించింది. లైంగికత ఆధారంగా వివక్ష చూపిస్తారా అంటూ సూటిగా ప్రశ్నించింది. వివక్ష చూపకుండా ఆలయ ప్రతిష్ఠను కాపాడాలని సూచించింది. అయితే ఆలయ పవిత్రతను కాపాడేందుకే మహిళలను అనుమతించడం లేదని, వందల ఏళ్ల క్రితం మొదలైన ఆచారాలను కొనసాగిస్తున్నామని న్యాయస్థానానికి ఆలయ బోర్డు తెలిపింది. మహిళలకు విధించిన నిబంధనలను పురుషులకు ఎందుకు విధించరని కోర్టు ప్రశ్నించింది. స్త్రీ, పురుషులకు సమానంగా నిబంధనలు వర్తింపచేయలేమని ఆలయబోర్డు స్పష్టం చేసింది. మహిళలు రుతుక్రమంలో ఉంటారని, ఆ సమయంలో ఆలయంలో వారు పూజలు చేయడానికి ఆచారాలు ఒప్పుకోవని తెలిపింది. పవిత్రతను రుతుక్రమంతో ముడిపెడతారా, మహిళల దేహంలో చోటుచేసుకునే జీవక్రియ కారణంగా వారిపై వివక్ష చూపిస్తారా అని న్యాయస్థానం సూటిగా నిలదీసింది. -
వివక్షకు వ్యతిరేకంగా జాతీయ సదస్సు
విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షకు వ్యతిరేకంగా ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జాతీయ సదస్సు జరగనుంది. వర్సిటీలోని దళిత్-ఆదివాసీ స్టడీస్, అంబేడ్కర్ స్టడీ సెంటర్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిసున్నట్టు తెలిపారు. ICSSR ఛైర్మన్ సుఖదేవ్ థోరట్, కేంద్రప్రభుత్వ మాజీ కార్యదర్శి పిఎస్.క్రిష్ణన్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉమాచక్రవర్తి, సీనియర్ జర్నలిస్ట్ సీమా ముస్తఫా లతో కూడిన బృందం ఈ సదస్సుకి ముఖ్య అథిదులుగా హాజరుకానున్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఐఐఎంలు, ఐఐటిలతో సహా 40 ఉన్నత విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో నెలకొన్న కుల వివక్షపై సమగ్రసమాచారాన్ని సేకరించి, నిర్దిష్టమైన నివేదికను తయారుచేయడమే జాతీయ సదస్సు లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. హెచ్‌సియులో వివక్ష కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్, అతనితో పాటు మరో నలుగురు విద్యార్థుల రస్టికేషన్ నేపధ్యంలో వెల్లువెత్తిన విద్యార్థి ఉద్యమం దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లోని వివక్షను తెరపైకి తెచ్చింది. ఈ నేపధ్యంలోనే దేశంలోని పలు ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షలు వెలుగులోకి వచ్చాయి. వాటన్నింటిపై ఆయా విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులు, అధ్యాపకులు స్పష్టమైన రిపోర్టును అందించనున్నారు. ఈ సదస్సులో వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న వివక్షపై ఒక డాక్యుమెంటును రూపొందించే యోచనలో ఉన్నారు. ఈ డాక్యుమెంటరీని ఢిల్లీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని రాష్ట్ర పతి, ప్రధానులకు, అన్ని రాజకీయ పక్షాలకు అందించనున్నారు. -
‘ఆన్‌ఫ్రాంక్’ పేరు ఎపుడైనా విన్నారా?
కొత్త కోణం ఆన్‌ఫ్రాంక్ డైరీని చదివినప్పుడల్లా రెండవ ప్రపంచయుద్ధం సందర్భంగా జరిగిన నరమేధానికి కారణమైన జాత్యహంకారం వికృతరూపం గుర్తుకొస్తుంది. జాతి, వర్ణ, మత, కులపరమైన దురహంకారం ఎన్ని దారుణాలకు ఒడిగడుతుందో, ఎంతటి మారణహోమం సృష్టించగలదో అవగతమవుతుంది. ఈ నాటికీ ప్రపంచంలో ఇటువంటి ఆధిపత్య ధోరణులు, దురహంకారాలు ఇంకా బతికే ఉన్నాయన్నది వాస్తవం. దురహంకారం వివక్షకు, వివక్ష విద్వేషానికి, విద్వేషం వినాశనానికి దారితీస్తుందనేది చరిత్ర చెప్పిన సత్యం. ‘ఆన్‌ఫ్రాంక్’ పేరు ఎపుడైనా విన్నారా? అప్పుడే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్న చిన్న వయస్సులోనే ఆమె ప్రపంచ యుద్ధ బీభత్సాన్ని చూడాల్సి వచ్చింది. జర్మన్ నాజీల జాత్యహంకారాన్ని, యూదుల ఊచకోతను, ఫాసిస్టు నిరంకుశత్వాన్ని అర్థం చేసుకోవాల్సిరావడమే కాదు... స్వయంగా తాను, తన కుటుంబం గురికావాల్సి వచ్చింది. ఆటపాటలతో సాగాల్సిన ప్రాయంలో యుద్ధం మధ్య, చిన్న బ్రెడ్డు ముక్క కరువై పేగులు లుంగలు చుట్టుకుపోతుండగా... నాజీల నరమేధానికి ఏరులై పారిన యూదుల నెత్తుటి ప్రవాహాలు, శవాల గుట్టలను, నాజీల ఇనుప బూట్ల కింద నలిగిపోతున్న మాన వత్వాన్ని చూస్తూ కూడా స్వేచ్ఛా కాంక్షను, జీవితేచ్ఛను, రేపటిపై ఆశను గానం చేసింది. అందుకే ఆ చిన్నారి పసి హృదయంపై ఆ చీకటి రోజుల ముద్రలను నమోదు చేసిన ఆమె జీవితం, ప్రత్యేకించి ఆమె ‘డైరీ’ దశాబ్దాలుగా ఎందరినో ప్రభావితం చేస్తోంది. నల్ల సూరీడు నెల్సన్ మండేలా వారిలో ఒకరు. ఆయన ‘‘ఆన్‌ఫ్రాంక్ డైరీని నాతో పాటు చాలా మందిమి చదివాం. ఈ పుస్తకాన్ని నేను జైలుకు వెళ్లక ముందు చదివాను. మళ్ళీ దక్షిణాఫ్రికాలోని రాబెన్ దీవిలోని జైల్లో చదివాను. బయట చదివిన దానికి, జైల్లో ఖైదీగా చదివిన దానికి ఎంతో తేడా ఉంది. ఆ పుస్తకం నిండా మా జీవితాలే ఉన్నట్టు భావించి, దానితో మేమూ మమేకమయ్యాం. అతి చిన్న వయస్సులో ఆ అమ్మాయి చూపిన ఆత్మ విశ్వాసం నన్ను నిబ్బరంగా నిలిచేట్టు చేయగలిగింది. జర్మనీలో నాజీ జాత్యహంకారం మైనారిటీలుగా ఉన్న యూదులతో సహా లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్నది. ఆన్‌ఫ్రాంక్ ప్రదర్శించిన ధైర్యం మానవ హక్కుల ఉద్యమానికి అజరామరమైన స్ఫూర్తిని అందించింది.’’ చీకటి రోజుల్లోకి... జర్మనీకి చెందిన ఆన్ ఫ్రాంక్ పదమూడో పుట్టిన రోజు (1942 జూన్ 12) కానుకగా లభించిన చిన్న నోట్ బుక్... ఆన్ ఫ్రాంక్ డైరీగా 70 భాషల్లో కోట్లలో ప్రతులు అమ్ముడుపోయి చరిత్రను సృష్టించింది. యుద్ధం, జాత్యహంకారం పదిహేనేళ్లకే చిదిమేసిన ఆ చిన్నారి 1929లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌లో జన్మించింది. 1933 సార్వత్రిక ఎన్నికల్లో అడాల్ఫ్ హిట్లర్ నేషనలిస్టు సోషలిస్టు జర్మన్ వ ర్కర్స్ పార్టీ (నాజీ)అధికారంలోకి వచ్చింది. ఆర్యన్ జాతి మాత్రమే సంకరం కానిదని, అన్ని జాతులకన్నా అదే పవిత్ర మైనదని, పాలించే హక్కు దానిదేనని నాజీలు బహిరంగంగానే ప్రకటిం చింది. అందుకనుగుణంగా పాఠ్యాంశాలను, పుస్తకాలను, చరిత్రను తిరగ రాయించారు. ప్రత్యేకించి మైనారిటీలుగా ఉన్న యూదులపట్ల విష పూరిత ద్వేషాన్ని నింపారు, అన్ని కళలలోనూ, సంస్కృతిలోనూ జర్మన్ జాత్య హంకారాన్ని నింపారు. జర్మన్ యువతకు విపరీత జాత్యహంకారాన్ని నూరిపోసి, ఎంతటి క్రూరత్వానికైనా పాల్పడేలా వారి మనసులను కలుషితం చేశారు. వారితో హిట్లర్ ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసి... శత్రువులు, రాజకీయ ప్రత్యర్థులపై హింసను, హత్యాకాండను ప్రేరేపించాడు. 1933లోనే మొట్టమొదటి నిర్బంధ శిబిరం ప్రారంభమైంది. సరిగ్గా ఆ సమయంలోనే కుటుంబ వ్యాపారం జీవనాధారంగా బతికే యూదులైన ఆన్ ఫ్రాంక్ కుటుంబం జర్మనీ నుంచి నెదర్లాండ్స్‌కు పారిపోయింది. ఆమ్‌స్టర్‌డాంలో మళ్లీ వ్యాపారం మొదలు పెట్టిన ఆ కుటుంబం ఎంతో కాలం ప్రశాంతంగా బతికింది లేదు. 1940లో నాజీ జర్మనీ, నెదర్లాండ్స్‌ను ఆక్రమించింది. ఆన్‌ఫ్రాంక్ తండ్రి అమెరికాకు వలస వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ 1941 జూన్ నాటికే అమెరికా వలసలను నిలిపివేసింది. దీంతో ఆన్‌ఫ్రాంక్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ తన కుటుంబం అజ్ఞాతంలో బతికే ఏర్పాట్లు చేశాడు. ఒట్టో ఫ్రాంక్ పెద్ద కూతురు మార్గట్‌ను నాజీ నిర్బంధ శ్రమ శిబిరానికి పంపాలని 1942 జూలైలో సైనిక ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. దీంతో తల్లిదండ్రులు, అక్కలతో కలిసి ఆన్ 1942, జూలై 6 నుంచి 1944, ఆగష్టు 4న అరెస్టయ్యేవరకు అదే పట్టణం లోని ఒక చిన్న ఇంటిలోని రహస్యమైన అటకలాంటి ప్రదేశంలో అజ్ఞాత జీవితం గడిపారు. ఆన్ ఫ్రాంక్ డైరీ అక్కడే రూపుదిద్దుకున్నది. పసి హృదయంపై జాత్యహంకారం గురుతులు నాటి పరిస్థితులు నిష్కల్మషమైన ఒక అమాయకపు పసి హృదయంపై వేసిన ముద్రలకు మించిన సజీవ చరిత్ర రచన మరేముంటుంది? ‘‘జర్మన్లు ఆక్రమించుకోవడంతో మా బాధలు మొదలయ్యాయి. యూదులను హింసించే చట్టాలు కూడా చేశారు. యూదులు ప్రత్యేకంగా కనిపించాలి. పసుపు నక్షత్రాలు ధరించాలి. యూదులు సైకిళ్ళపైనే తిరగాలి. ట్రాములు ఎక్కకూడదు. కార్లు ఉన్నా వాటిలో తిరగరాదు. సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్యనే షాపింగ్ చేయాలి. అదీ వారికి కేటాయించిన షాపుల్లోని వస్తువులనే కొనుగోలు చేయాలి. మంగలి షాపులు, బ్యూటీ క్లినిక్‌లు కూడా అంతే. రాత్రి 8 నుంచి పొద్దున ఆరు వరకు ఇండ్ల నుంచి బయటకు రాకూడదు. సినిమాలు, నాటకాల లాంటి వినోదాలకు వెళ్ళకూడదు. ఎటువంటి క్రీడల్లో పాల్గొనరాదు. స్వంత తోటలలోనైనా, స్నేహితుల తోటలలోనైనా రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎటువంటి గోష్టులు, సమావేశాలు జరపకూడదు. యూదుల ఇళ్ళలోకి క్రైస్తవులను రానివ్వరాదు. యూదుల పిల్లలు వాళ్ళు నడిపే పాఠశాలల్లోనే చదవాలి. మీరు ఇది చెయ్య కూడదు. అది చెయ్యకూడదు. అడుగడుగునా ఆంక్షలే మమ్మల్ని వెంటాడు తున్నాయి. కానీ జీవితం సాగుతూనే ఉన్నది.’’ కిట్టీని ఉద్దేశిస్తూ ఆన్ ఫ్రాంక్ రాసింది. ఎవరో ఒకరితో మాట్లాడినట్లు రాయకపోతే తనకు బాగుండదని అభిప్రాయపడిన ఆన్ ఫ్రాంక్ ‘కిట్టీ’గా తనని తానే సంబోధించుకుంది. ‘‘కింద పెద్ద షాపుంది. దాన్ని స్టోర్‌గా వాడతారు. ఇంటి ముఖద్వారం పక్కనే ఆ షాపు తలుపుంది. ప్రవేశానికి ఎదురుగా నిటారుగా ఉన్న మెట్ల వరుస ఉంది. ఎడమవైపున్న సన్నని వరండా ఒక గదిలోకి తీసుకెళుతుంది. అదే ఫ్రాంక్ కుటుంబం బెడ్రూం. మూలనున్న తలుపు తీస్తే మరుగుదొడ్డి, మరో తలుపుతీస్తే, నేనూ, మార్గెట్ ఉండే గది. భవనానికి ముందు వైపు ఒక అటక, ఒక కొట్టు. అదీ మేముండే రహస్యమైన గృహానుబంధ భాగం (ఎనెక్స్)’’ అంటూ ఆన్ ఫ్రాంక్ తమ రహస్య నివాస స్థలాన్ని వివరించింది. ఆ ఇరుకు స్టోర్ రూంలోనే దాదాపు మూడేళ్లు ఫ్రాంక్ కుటుంబం సహా ఎనిమిది మంది ఉన్నారు. మరుగుదొడ్డి, బాత్రూంలు కూడా తాత్కాలికంగా ఏర్పర్చుకున్నవే. తిండికి, మందులకు ఎంతో అవస్థ పడ్డారు. అదే సమయంలో జర్మనీలో, నెదర్లాండ్‌లో, ఇతర యూరప్ దేశాల్లో యూదులు, ఇతర మైనారిటీ జాతులు, మతస్తులు, రాజకీయ ప్రత్యర్థులు లక్షలాది మంది జైళ్ళల్లో, నిర్బంధ శిబిరాల్లో బందీలయ్యారు. అప్పట్లో భార్యల నుంచి భర్తలను, తల్లిదండ్రుల నుంచి పిల్లలను, అక్కచెల్లెళ్ళను, అన్నదమ్ములను వేరు చేసి నిర్దాక్షిణ్యంగా, అత్యంత కిరాతకంగా హత్య చేసిన వైనం ఆ డైరీలో ఉంది. 1945లో జర్మనీ ఓటమి పొందే నాటికి దాదాపు 90 లక్షల మంది యూదులు ఊచకోతకు గురైనట్టు అంచనా. పోలండ్‌లో 1939లో 33 లక్షలుగా ఉన్న యూదు జనాభా యుద్ధం ముగిసేనాటికి 20 వేలకు పడిపో యిందంటే నాటి జాత్యహంకార విద్వేషం ఎంతటి నరమేధాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. నాజీ నరమేధంలో రాలిన శాంతి కపోతం జాత్యహంకారానికి బలైన ఐదు లక్షల మంది యూదు బాలలలో ఆన్‌ఫ్రాంక్, ఆమె అక్క మార్గెట్ ఫ్రాంక్ కూడా ఉన్నారు. రహస్య జీవితంలో ఉండగానే ఎవరో ద్రోహులు ఇచ్చిన సమాచారం వల్ల పోలీసులు, జర్మన్ సైనికులు 1944, ఆగస్టు 4న వాళ్ళు తల దాచుకున్న ఇంటిని చుట్టుముట్టి వారిని అరెస్టు చేశారు. ఆన్ ఫ్రాంక్ తల్లిదండ్రులను వేర్వేరు నిర్బంధ శిబిరాలకు తర లించారు. మార్గట్, ఆన్‌లను మరొక శిబిరంలో నిర్బంధించారు. ఆరు నెలల తర్వాత తల్లి, ఇద్దరు అక్కాచెల్లెళ్ళు టైఫస్ వ్యాధితో చనిపోయారు. 1945 సెప్టెంబర్‌లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి ఆన్ తండ్రి ఒట్టో ఫ్రాంక్ మాత్రమే సజీవంగా మిగిలాడు. 1947లో డచ్ భాషలో ఆయన ఆన్ ఫ్రాంక్ డైరీని ప్రచురించారు. అది 1952లో ఇంగ్లిష్‌లో వచ్చింది. అందులోని ఈ వాక్యాలు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి: ‘‘నేను నా తల్లి లాగా, మిగతా అందరు ఆడవాళ్ళలాగా భర్త పిల్లల కోసం మాత్రమే బతకాలను కోవడం లేదు. ఇంకా ఏదో చేయాలని ఉంది. వృధాగా బతకడం నాకిష్టం లేదు. నేను అందరికీ ఉపయోగపడాలి. సంతోషపెట్టాలి. నేను నా చావు తర్వాత కూడా బతకాలి.’’ ఆమె రాసుకున్నట్టే ఆన్ ఫ్రాంక్ ఎప్పటికీ సజీవంగానే నిలిచింది. ఆన్‌ఫ్రాంక్ డైరీని చదివినప్పుడల్లా రెండవ ప్రపంచయుద్ధం సంద ర్భంగా జరిగిన నరమేధానికి కారణమైన జాత్యహంకారం వికృతరూపం గుర్తు కొస్తుంది. జాతి, వర్ణ, మత, కుల పరమైన దురహంకారం ఎన్ని దారు ణాలకు ఒడిగడుతుందో, ఎంతటి నరమేధానికి కారణం కాగలదో అవ గతమ వుతుంది. ఈ నాటికీ ప్రపంచంలో ఇటువంటి ఆధిపత్య ధోరణులు, దురహం కారాలు ఇంకా బతికే ఉన్నాయన్నది వాస్తవం. దురహంకారం వివక్షకు, వివక్ష విద్వేషానికి, విద్వేషం వినాశనానికి దారితీస్తుందనేది చరిత్ర చెప్పిన సత్యం. ఆన్‌ఫ్రాంక్ స్ఫూర్తిగా ఆధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా మనిషి... మానవత్వం, సత్యం కోసం నిరంతరం పోరాడాల్సిన సమయమిది. మార్చి 12 ఆన్ ఫ్రాంక్ 71వ వర్ధంతి వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్: 97055 66213 -
మహిళలైతే మరొకలా..
స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్లలోనూ తప్పని వివక్ష ఇండియా నిండా ఇపుడు స్టార్టప్‌లే. వీటిలో మహిళలవీ ఎక్కువే. కానీ ఇక్కడా వివక్ష తప్పటం లేదు. గతేడాది దేశీ స్టార్టప్‌లలోకి వచ్చిన నిధుల్లో కేవలం 4.2 శాతమే మహిళల కంపెనీల్లోకి వచ్చాయి. పెపైచ్చు వెంచర్ క్యాపిటలిస్టులు మహిళల్ని అడుగుతున్న ప్రశ్నలు చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు. ఇలా... ఓ నలుగురు మహిళలకు ఎదురైన అనుభవాలు... ఈ ఉమెన్స్ డే ప్రత్యేకం... సల్వార్ కమీజ్‌లో రావాల్సింది! క్లవర్ కిడ్ సంస్థ... 2013లో ఢిల్లీలో ఆరంభమైంది. పిల్లలకు చదువుతో పాటు మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్స్, ఆటలు అందించడమే దీని పని. ఎదురైన అనుభవం: విస్తరణ కోసం నిధుల సమీకరణలో ఉండగా... ఒకరోజు రాత్రి అడ్వైజర్ నుంచి ఫోనొచ్చింది. రేపు ఏంజిల్ ఇన్వెస్టర్‌తో మీటింగ్ ఉంటుంది ప్రిపేరవమన్నాడు. ఫార్మల్ దుస్తులతో వెళ్లా. నన్ను చూడగానే... ఓరి దేవుడా! మీకు సంప్రదాయ దుస్తులంటే తెలీదా? ఇలా ఫార్మల్‌లో కాకుండా సల్వార్ కమీజ్‌లో రావాల్సింది!! అన్నారా అడ్వైజర్. దానికి నేనేమన్నానో తెలుసా? మా విజ్ఞత, విజ్ఞానం, శక్తికి కొలమానం మా విలువలు, అనుభవాలే. మా దుస్తులు కావు... అని. - షభ్నం అగర్వాల్ (30), క్లవర్కిడ్ మీరు పెళ్లి చేసుకుంటారా! ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఫిట్ సర్కిల్... స్మార్ట్ఫోన్ల ద్వారా వ్యక్తిగత, కార్పొరేట్ బృందాలకు ఫిట్నెస్ సలహాలిస్తుంది. ఈ సూచనల మేరకు ఉత్పత్తులనూ కొనుగోలు చేయొచ్చు. ఎదురైన అనుభవం: ‘‘నన్ను వెంచర్ క్యాపిటలిస్టులు అడిగిన మొదటి ప్రశ్న... మీ కో-ఫౌండర్ నీ భర్తా? అని. రెండో ప్రశ్న... భార్య, భర్తలు కో-ఫౌండర్లుగా ఉన్న కంపెనీల్లో మేం పెట్టుబడులు పెట్టం’’ అని. ఎందుకంటే భవిష్యత్తులో విడాకులు తీసుకుంటే భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందట!!. ఈ అనుభవంతో నేను చెప్పేదొక్కటే. ఇది ఇండియా. ఇక్కడి విధానం, విలువలు చాలా నమ్మకమైనవి. ప్రత్యేకమైనవి కూడా. దయచేసి విదేశీ నిబంధనలు, అలవాట్లను ఇక్కడి ప్రజలపై రుద్దకండి. - ఆర్తి గిల్ (28), ఫిట్ సర్కిల్, కో-ఫౌండర్. సహజీవనం చేస్తున్నావా! 2012లో ప్రారంభమైన లిటిల్ బ్లాక్ బుక్... ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరులో సేవలందిస్తోంది. స్థానికంగా జరిగే లైఫ్ స్టైల్ ఈవెంట్లతో పాటు స్థానిక రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, ట్రావెల్స్ సమాచారం అందిస్తుంటుంది. ఇది బీబీసీతో కలసి పనిచేస్తోంది. ఎదురైన అనుభవం: నేను నిధుల సేకరణకు వెళ్లినపుడు.... నువ్వు ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నావా? అని ఇన్వెస్టర్లు అడిగారు. నాకు కోపం వచ్చింది. కానీ, సహనాన్ని పరీక్షించేందుకే ఇలాంటి ప్రశ్నలడుగుతారని భావించి అణుచుకున్నా. వ్యక్తిగత జీవితం ప్రభావం వృత్తి పరమైన నిర్ణయాల మీద పడుతుందని అలా అడిగారట!!. నాకైతే వారు ఫండింగ్‌కు నో చెప్పటానికి చూపించిన కారణాలు చాలా సిల్లీగా అనిపించాయి. - సుచిత సల్వాన్, లిటిల్ బ్లాక్ బుక్, ఫౌండర్ వ్యాపారం చేస్తే గర్భం వద్దా? అంకితా సేఠ్, అమిత్ దామిని, ప్రణవ్ మహేశ్వరీ కలసి గతేడాది ముంబైలో... గెస్ట్‌హౌస్ అగ్రిగేటర్ ‘విస్టా రూమ్స్’ను ఆరంభించారు. ఎదురైన అనుభవం: ఒకసారి ఇన్వెస్టర్లతో మాట్లాడినపుడు... నేను విస్టా రూమ్స్ ప్రతినిధినని, ఉత్పత్తులు, మార్కెటింగ్, విస్తరణ కో-ఫౌండర్లుగా ఉన్న మగవాళ్లు చూస్తున్నారని చెప్పారు. దీంతో వాళ్లు... ‘మీరు గర్భవతి ఎప్పుడవుతారు’ అని అడిగారు. వారి మాటలు, చూపులు చూసి... వెంటనే వారి ఇన్వెస్ట్మెంట్లు వద్దన్నాం. నేను చెప్పేదేంటంటే.. ఎక్కడైనా మహిళ తన ఇష్టంతోనో, బలవంతంగానో మాతృత్వం పొందుతుంది. కానీ అది తన వ్యాపార నిర్ణయాల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించదు. - అంకితా సేఠ్ (32), విస్టా రూమ్స్ కో-ఫౌండర్ -
కంటే కూతుర్నే కనాలి
భారం కాదు.. మహాభాగ్యం ఆడపిల్ల భారం అనుకున్నది ఒకప్పుడు. ఇప్పుడు అమ్మాయే ‘మా ఇంటి మహాలక్ష్మి.’ అంటున్నారు నేటితరం తల్లిదండ్రులు. అబ్బాయి అయినా..అమ్మాయి అయినా మాకు ఒక్కటే. ఎలాంటి వివక్ష లేకుండా ఆడపిల్లను పెంచుతున్నాం అని ధీమాగా చెబుతున్నారు. అంతేకాదు..కూతుర్ని కన్నాక.. కుమారుడి కోసం ఎదురు చూడడం లేదు. వారసుడు కావాలంటూ ఆరాటపడడం లేదు. ఆడైనా..మగైనా ఒక్కరు ఉంటే చాలు మాకు అంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంతోషంగా కూతురి గురించి..ఆమె భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో ఒక్క ఆడ కూతురుతోనే సంతోషంగా జీవిస్తున్న కొన్ని జంటల గురించి .... మాకు అబ్బాయి కావాలన్న కోరిక ఎప్పుడూ కలగలేదు. ఆ లోటూ కనిపించలేదు. మా పాప స్నిగ్ధకు నాణ్యమైన చదువులు చెప్పించాలన్నది మా లక్ష్యం. మేం ఇద్దరం ప్రైవేటు ఉద్యోగులం. ఉన్నంతలోనే జీవితాన్ని గడుపుతూ.. మా పాపకు మెరుగైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఆప్యాయంగా మాట్లాడడంలోనూ, ప్రేమను పంచడంలోనూ అమ్మాయిలకు మించిన వారు లేరు. ఎంత మంది ఆడబిడ్డలు పుట్టినా.. అబ్బాయి కోసం ఎదురుచూసే పరిస్థితులు గతంలో ఉండేవి. ఇప్పుడు అందరి ఆలోచనా తీరు, జీవన విధానం, సమాజ అవసరాలు మారాయి. కొడుకులు లేకున్నా సరే.. అమ్మాయిలు ఉంటే చాలని అందరూ బలంగా ఆకాంక్షిస్తున్నారు. మేం ఇదే కోవకు చెందిన వాళ్లం. అన్ని రంగాల్లో మహిళల పాత్ర పెరిగింది. మలి దశలో కొడుకులు చేదోడు వాదోడుగా ఉంటారని ఎందరో తల్లిదండ్రులు ఆశించడం సహజం. కానీ వారి ఆశలు పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. క ళ్ల ముందు ఉండి మాట్లాడని, కనీసం ఒక్క పూట అన్నం పెట్టని కొడుకుల కంటే.. దూరంగా ఉన్న అమ్మాయిలు ఆప్యాయంగా పలకరించి.. తిన్నావా అమ్మ అంటే కడుపు నిండినంత హాయి కలుగుతుంది. అమ్మానాన్నలను భారం అనుకునే వారికంటే.. బాధ్యతగా చూసుకునే ఆడబిడ్డలు నయం. పెళ్లి సంబంధం కోసం మొన్నటి వరకు ఆస్తి, అంతస్తు, హోదాను బట్టి అమ్మాయిలను వెతికేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. చదువుకున్న అమ్మాయి అయితే చాలు.. అదే మహాభాగ్యం అని కళ్లకు అద్దుకుని సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. అమ్మానాన్నలకు ఇంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. మరో అమ్మతో సమానం! - వంగాల కవితా శ్రీధర్‌రెడ్డి, దంపతులు కూతురే మా ప్రపంచం మాకు 1992లో వివాహం అయింది. 1993లో పాప జన్మించింది. పాపైనా..బాబైనా ఒక్కరితోనే సరిపెట్టుకోవాలని ముందే అనుకున్నాం. అలాగే చేశాం. మా కూతురు గ్రీష్మే మా ప్రపంచం ఇప్పుడు. ఆమెకు బంగారు భవిష్యత్తు ఇచ్చేందుకు ఇద్దరం పాటుపడుతున్నాం. ప్రస్తుతం పాప బీటెక్ పూర్తిచేసింది. మొదట కూతురు పుట్టినప్పుడు కు.ని ఆపరేషన్ చేయించుకుంటామంటే చాలా మంది వద్దన్నారు. కొడుకు ఉండాలన్నారు. మేం వారి మాటలను పట్టించుకోలేదు. మాకు కూతురైనా..కొడుకైనా ఒక్కటే గట్టిగా చెప్పాం. ప్రస్తుతం హైటెక్ యుగంలో ఉన్నాం మనం. ఇంకా ఆడ, మగ వివక్షలు విభేదాలు చూపడం తగదు. మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారు. కాబట్టి ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఒక్కటే అని అందరూ భావించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. - ముప్పిడి సీతారాంరెడ్డి, శోభ, కందికల్ గేట్ బెంగ లేదు..భారం కాదు... కొడుకైనా... కూతురైనా ఒక్కటే. అందుకే ఒక్క కూతురితోనే సరిపెట్టుకున్నాం. మా పాప పేరు మహేశ్వరి. ఇంటర్ చదివింది. వారసుడు లేడన్న వెలితి, బెంగ మాకు ఎప్పుడూ లేదు. కూతురు భారం...కుమారుడే ముఖ్యమనే రోజులు పోయాయి. ఇప్పుడు అందరూ సమానమే. పాపను ఉన్నత చదువులు చదివించాలనేది మా లక్ష్యం. అందుకోసం శ్రమిస్తున్నాం. పాపకు ఇష్టమైన రంగాన్నే ఎంచుకోమని చెప్పాం. పూర్తి స్వేచ్ఛగా వ్యవహరిస్తాం. దీంతో మా ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఈ సంతోషంలో అన్నీ మర్చిపోతాం. మా పాపే మాకు సర్వస్వం. - పోచబోయిన శ్రీనివాస్‌యాదవ్, మంగమ్మ- సాయినగర్ పాప భవిష్యత్తే ముఖ్యం... బాబు...పాప అనేది కాదు. ఎవరైనా వారికి బంగారు భవిష్యత్తు కల్పించడమే ముఖ్యం. మాకు ఒక్కతే అమ్మాయి. పేరు. సాయి కీర్తి. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. పాపను బాగా చదివించి ప్రభుత్వ ఉ ద్యోగం చేయించాలనేది మా కల. మా కలను నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తాం. ఒకప్పుడు ఆడపిల్ల అంటే భయపడేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. వివక్ష తొలగింది. అసలు ఆడపిల్లతో అనుబంధం ఎం తో గొప్పది. అది మాటల్లో చెప్పడానికి వీలుకాదు. మా అమ్మాయికి చాలా కోరికలున్నాయి. వాటన్నింటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒక కుటుంబంలో ఏకైక సంతానంగా ఆడపిల్ల ఉన్నవారికి చదువుల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - భార్గవి, చంద్రశేఖర్, ఖాజాగూడ ఎవరైనా ఒక్కటే... మాకు అన్నీ మా మనీషానే. కూతురు, కొడుకు అనే తారతమ్యం లేదు. అందరినీ ఆమెలోనే చూసుకుంటున్నాం. నేను ప్రైవేటు స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాను. మా వారు చిరుద్యోగి. మాది పేదకుటుంబం అయినప్పటికీ ఉన్నంతో మా పాపను బాగా చదివించాలని నిర్ణయించాం. పాప ఉన్నత స్థానంలో ఉండాలనేది మా కోరిక. పేద కుటుంబాల్లో పిల్లల చదువులు కొంత భారంగా మారాయి. ఈ విషయంలో ప్రభుత్వం కొంత ఆలోచించి ఏదైనా పథకం పెడితే బావుంటుంది. ఇంట్లో ఏకైక సంతానంగా ఆడపిల్ల ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. మా పాప ఇప్పుడు ఇంటర్ చదువుతోంది. ఆమె ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తాం. - లతా శ్రీనివాస్, ఖాజాగూడ గర్వంగా ఫీలవుతున్నాం మాది ప్రేమవివాహం. మాకు ఒక్కతే పాప. పేరు జాహ్నవి నాల్గవ తరగతి చదువుతున్నది. మేం ఏనాడూ మగ పిల్లాడు లేడని బాధపడలేదు. ఆడకూతురు ఉన్నందుకు గర్వంగా ఫీలవుతున్నాం. మా వారు సాప్ట్వేర్ ఉద్యోగి. నేను ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నాను. పాపే మాకు ప్రాణం. ఆమెకు ఎలాంటి లోటు రాకుండా ఇద్దరమూ బాధ్యత తీసుకొని పెంచుతున్నాం. ఇప్పుడు సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఆడపిల్ల అంటే చులకన భావం పోయింది. అమ్మాయి అయినా..అబ్బాయి అయినా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. వారిని సమాన దృష్టితో చూస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే పేరెంట్స్‌గా మా బాధ్యత. దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తున్నాం. - సలోమి, మల్లికార్జున్ -
ఆ మరణం మాకొక పాఠం
విశ్లేషణ మార్క్సిస్టుల ప్రాధాన్యాల విషయంలో ఈ కుల వ్యతిరేక పోరాటానికి, ప్రత్యేకించి మన దేశ పరిస్థితులలో ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వలేకపోయారనే భావిస్తున్నాను. నేను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఉన్నపుడు 11 మంది ఉండేవారు. అందులో ఒక్క దళితుడు, వెనుక బడిన కులాలకు చెందినవారు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలు ఒక్కరూ లేరు. అలా అని మా రాష్ట్ర కార్యదర్శి వర్గంలో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ కులతత్వం ఉందని ఇప్పటికీ భావించలేను. అంబేడ్కర్ భావజాలం మీద తగిన అధ్యయనం, చర్చ జరగకపోయేది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య మనసున్న మనుషులందరినీ కలవరపరిచింది. అధికార దర్పం, అగ్రకుల దురహంకారం, కాసుల గల వారి కావరం; వీటికి తోడు కేంద్ర మంత్రుల అండ, మానవత్వం లేని చర్య కారణంగా రోహిత్ నేలకొరిగాడు. ఉగ్రవాదులు, జాతివిద్రోహులు విశ్వవిద్యాలయంలోకి చొరబడి దాడులకు తెగబడ్డారనీ, వారిపై చర్యలు తీసుకోవాలనీ ఒక తప్పుడు విజ్ఞాపనను ఏబీవీపీ కేంద్రమంత్రి, బీజేపీ నేత దత్తాత్రేయకు సమర్పించింది. అందులోని వాస్తవాలను పరిశీలించకుండానే సదరు అమాత్యులు, తన కవిత్వం కూడా జోడించి మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి పంపారు. ఆమె ఈ అంశాన్ని విశ్వవిద్యాలయం అధిపతులకు పంపింది. అధికారులు రోహిత్ సహా, ఐదుగురు అంబే డ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ) సభ్యుల మీద చర్య తీసు కున్నారు. హాస్టల్ నుంచి వెళ్లగొట్టడమే కాకుండా, ఇతర ఆంక్షలు కూడా విధించారు. ఇప్పుడు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయ తమ తప్పేమీ లేదని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూశాక, 73 సంవత్సరాల వయసులో, అనారోగ్యంతో ఉన్న నాకు మాత్రం రోహిత్‌కు క్షమాపణ చెప్పడం భావ్యం అనిపించింది. ‘‘రోహిత్! నాకు సిగ్గుగా ఉందయ్యా! క్షమించు. అణగారిన కులాల వారినీ, పేదలనూ అనుక్షణం అవమా నిస్తూ; వారి మీద దౌర్జన్యాలు చేస్తున్న సమాజాన్ని కూల్చి, ప్రతి వ్యక్తి ఆత్మ గౌరవంతో మనిషిగా జీవించగలిగే మరో వ్యవస్థను మీకు అందించలేకపోయినందుకు నిజంగా సిగ్గుగా ఉందయ్యా! మమ్మల్ని క్షమించు!’’ ఆర్థికాభివృద్ధిలో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉందట! అత్యధిక కోటీశ్వరులు ఉన్న ఆసియా దేశాలలో కూడా మన దేశానిదే మూడో స్థానమట! స్వచ్ఛ భారత్‌గా రూపొందుతున్నదట! మన పాలక పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ తలసరి ఆదాయంలో అడుగు నుంచి మూడో స్థానంలో ఉన్నదట. ఆ నిరుపేదలలో కష్టజీవులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు అధికులు. రోహిత్, అతనితో పాటు సస్పెండైన నలుగురు వ్యవసాయ కూలీల కుటుంబాల వాళ్లే. రోహిత్ తల్లి కొడుకు మీద గుండెల నిండా ప్రేమ నింపుకుని, తన కడుపు కట్టుకుని చదివించింది. ఆమె ఒక టైలర్. సస్పెండై ‘వెలివాడ’లో దీక్ష చేసిన ఆ ఐదుగురు దళితులే. గత దశాబ్ద కాలంలో ఇదే విశ్వవిద్యాలయంలో 11 మంది ఆత్మహత్య చేసుకుంటే, అదేమిటో; వారిలో తొమ్మండుగురు దళితులే. ఇద్దరు బాగా వెనుకబడిన కులం వారు. 2008లో ఆత్మహత్య చేసుకున్న సెంథిల్ కుమార్ అనే పరిశోధక విద్యార్థి ఎరుకుల వర్గం వాడు. కళ్లకు కట్టినట్టు ఈ వాస్తవాలు కనిపిస్తుంటే మన పాలకులు తమ దోషం ఏమీ లేదంటున్నారు. ‘రోహిత్! నీ ఆత్మహత్య ముందే తెలిసి ఉంటే చచ్చి సాధించేదేమీ ఉండదని చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పలేను. నీవు రాసిన గుండెలు పిండే లేఖ అందులో ఆకాశంలో తారగా వెలగాలన్న నీ ఆకాంక్ష తెలుసుకున్న తరువాత ఇక చెప్పవలసిందేం మిగిలింది? ‘నా పుట్టుకే నాకు విషాదమైన యాక్సిడెంట్ అన్న మాటతో మేం చేయవలసింది- నీ నుంచి నేర్చుకోవడమే!’ వర్ణ వివక్ష మీద లోపించిన దృష్టి నేను మార్క్సిస్టును. అంటే మార్క్సిజాన్ని ఇష్టపడేవాడిననే అర్థంలో! రోహిత్ అంబేడ్కర్‌ను బాగా అధ్యయనం చేసినవాడు. ఇంతకు ముందు పేర్కొన్న కుమార్ అంబేడ్కర్-పెరియార్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు చెందినవాడు. మహారాష్ట్రలో అంబేడ్కర్-ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఒక సంస్థ ఉంది. వీరంతా ఆయా నాయకుల భావజాలంతో ప్రభావితమైనవారే. అలాగే వీరంతా మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఉంటారనీ, దేశంలో మార్క్సిస్ట్ పార్టీల వ్యవహారశైలిని గమనించిన వారేననీ చెప్పగలం. వామపక్షాలు కూడా కుల వ్యతిరేక పోరాట ప్రాముఖ్యాన్ని గుర్తించాయని ఒక సందర్భంలో రోహిత్ చెప్పినా, వారిది ద్వంద్వ వైఖరి అని విమర్శించాడు. మార్క్సిస్టు పార్టీల వైఖరి సంగతేమో కానీ, నా వరకు నేను మార్క్సిస్టుల ప్రాధాన్యాల విషయంలో ఈ కుల వ్యతిరేక పోరాటానికి, ప్రత్యేకించి మన దేశ పరిస్థితులలో ఇవ్వవ లసినంత ప్రాధాన్యం ఇవ్వలేకపోయారనే భావిస్తున్నాను. నేను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గంలో ఉన్నపుడు 11 మంది ఉండేవారు. అందులో ఒక్క దళితుడు, వెనుకబడిన కులాలకు చెందినవారు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసీలు ఒక్కరూ లేరు. అలా అని మా రాష్ట్ర కార్యదర్శి వర్గంలో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ కులతత్వం ఉందని ఇప్పటికీ భావించలేను. మొత్తం మీద అంబేడ్కర్ భావజాలం మీద తగిన అధ్యయనం, చర్చ జరగకపోయేది. వర్గపోరాటమే సమాజ పరిణామక్రమంలో ఏకైక పోరాట రూపం అన్న అంశం మా ఆలోచనా ధోరణిలో కరడగట్టుకు పోయిందని చెప్పాలి. మన పార్టీలో ఏ వర్గానికి చెందినవారు, ఏఏ స్థాయిలలో నాయ కత్వం వహిస్తున్నారు? అన్న అంశాన్ని అప్పుడప్పుడు బేరీజు వేసుకుని, ఇంకా శ్రామిక వర్గం నుంచి తగిన రీతిలో, ప్రత్యక్ష శ్రామిక వర్గ పాత్ర తగినంతగా లేదు కాబట్టి, పార్టీ నాయకత్వం పెంచుకోవాలని అనుకునేవారం. కానీ ఎప్పుడూ నాయకత్వ స్థానాలలో కుల సమీకరణ గురించి చర్చించేవారమే కాదు. పైగా ఆ కుల ప్రస్తావన తేవడం అంటే శ్రామిక వర్గ ఐక్యతకు భంగం కలిగించడమేననే భావన ఉండేది. 1986-87 ప్రాంతంలో కృష్ణారావు అనే అధ్యాపకుడు (సూర్యాపేట) రాజకీయ పార్టీలలో కుల ప్రాధాన్యం-అంతర్గత ప్రజాస్వామ్యం అనే అంశం మీద పరిశోధన చేస్తూ నన్ను కలిశారు. ‘మీ రాష్ట్ర కమిటీలో, కార్యదర్శివర్గంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు ఎందరు ఉన్నారని ప్రశ్నించారు. ‘మా పార్టీలో రాజకీయ బాధ్యతల విషయంలో రిజర్వేషన్లు ఉండవు’ అని సమాధానం ఇచ్చాను. తరువాత ఎప్పుడో అంబేడ్కర్, ఇతర సామాజిక నేతలను అధ్యయనం చేసిన తరువాత అది సరైన సమాధానం కాదని కొంతవరకు గుర్తించగలిగాను. ప్రస్తుత పరిస్థితులలో మార్క్సిస్టులలో సానుకూల మార్పు వచ్చిందని మాత్రం భావిస్తున్నాను. ఉదా: సీపీఎం తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో ఇప్పుడు దాదాపు 40-45 శాతం అణచివేతకు గురవుతున్న వారికి ప్రాతినిధ్యం కనిపిస్తుంది. మార్క్సిస్టులు, సామాజిక ఉద్యమకారులు కలవాలి వర్ణ వివక్షపై జరిగిన పోరాటంలో కమ్యూనిస్టులు వ్యతిరేకంగా ఉన్నారనో, ఈ అంశం వారి దృష్టిలో లేదనో భావించడం కూడా సరికాదు. మనుస్మృతి నిర్దేశంతో దశాబ్దాలుగా దేశంలో ఉన్న ఈ అంశం మీద సర్దేశాయ్, ఈఎంఎస్ వంటి నేతలు మార్క్సిజం సాధారణత నుంచి కాకుండా, మన దేశ ప్రత్యేక అంశంగా దీనిని గుర్తించారు. మన దేశంలో బానిస వ్యవస్థ, కుల వ్యవస్థ రూపంలో ఘనీభవించిందని ఈఎంఎస్ స్పష్టం చేశారు. ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య వంటివారు దళిత, వెనుకబడిన వర్గాలపై, మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆరంభంలో పోరాడిన సంగతిని విస్మరించలేం. ఈ అణగారిన శ్రమ జీవులు పోరాటం ద్వారా ఈ వ్యవస్థను మార్చగలిగితే వర్ణ వివక్ష సైతం అంతరించి, అణచివేతల నుంచి విముక్తి కలుగుతుందన్న భావన బలంగా ఉండేది. నిజానికి పునాదులు పెకలించాలంటే, ముందు అంతస్తులు కూల్చాలి. కాబట్టి పునాది, ఉపరితల నిర్మాణం పరస్పర ఆధారితాలే. ఈ గ్రహింపుతో పాటు దశాబ్దాలుగా సాగుతున్న సామాజిక వివక్షపై కూడా వర్గ పోరాటంతో సమంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందనీ; ఈ వర్గ పోరాటం, వర్ణ (కుల) నిర్మూలనా పోరాటం కూడా పరస్పర ఆధారితాలేనన్న స్పృహతో దేశంలో కమ్యూనిస్టు పోరాటాలు విరివిగా జరిగేవి. నిజానికి ఈ పార్టీల నాయకత్వంలో సైతం ఈ స్పృహ తగినంతగా లేని ఫలితంగానే అక్కడక్కడ ఆ పార్టీలలో కులతత్వ ధోరణులు కనపడుతున్నాయి. ఇదంతా మార్క్సిస్టులను కించపరచడానికి చెబుతున్నది కాదు. వారి దృక్పథాన్ని ఇంకా సంపద్వంతం చేయడానికే. మార్క్స్ అనుయాయులు, ప్రధానంగా శ్రమజీవులూ; ఇటు సామాజిక అణచివేతను అంతమొందించేందుకు కృషి చేసిన అంబేడ్కర్, ఫూలే, పెరియార్ వంటి సామాజిక నేతల అనుయాయులూ; దేశమంటే మట్టికాదు, మనుషులని నమ్మే పోరాట శక్తులు కలసి మహత్తర పోరాటాల ద్వారా ఈ దోపిడీకీ, అణచివేతకూ చరమగీతం పాడాలి. అంబేడ్కర్‌కు కూడా కమ్యూనిస్టుల మీద ద్వేషం లేదు. కానీ దేశ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, కుల నిర్మూలన కార్యక్రమాన్ని వీరు ప్రత్యేకంగా నిర్వహించకపోవడం పట్ల ఆయన సహజంగానే నిరాశ చెందారు. కమ్యూనిజం నిరంకుశ ధోరణులకు దారి తీస్తుందని కూడా అభిప్రాయపడ్డారు. ఏఎస్ఏ అనుయాయుల విషయం కూడా అంతే. వర్గ పోరాటంతోనే కమ్యూనిస్టులు అగ్రవర్ణ దురహంకారాన్నీ, వర్ణ వివక్షను ఎదుర్కొనలేరని, ఆ మార్గంలో కుల రహిత సమాజం సాధించలేమని వారి అభిమతం. అంబేడ్కర్ ఆలోచనా విధానం, మార్క్సిజం ఇచ్చే శాస్త్రీయ సామాజిక పరిణామ అవగాహన పరస్పరం సహకరించుకుంటూ, కమ్యూనిస్టులు, సామాజిక ఉద్యమాల నేతలు కలసి పనిచేయవలసిన తరుణమిది. అదే రోహిత్‌కు మనమివ్వగలిగిన నివాళి. డా॥ఎ.పి. విఠల్, (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు, 98480 69720) -
ధరల విషయంలోనూ లింగ వివక్ష..?!
ధరల విషయంలోనూ లింగ వివక్ష కొనసాగుతోందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. దాదాపు ఒకే ఉత్పత్తి కోసం పురుషులు తక్కువ ధరను చెల్లిస్తుంటే, స్త్రీలు ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని పరిశోధనల్లో తేలింది. ఎనిమిది వందల అంశాల్లో పోల్చి చూసిన అధ్యయనకారులు... పురుషులకంటే మహిళలు ఏడుశాతం ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తున్నట్లు వెల్లడించారు. ఈ ధర వివక్ష ఒక్క రిటైల్ కు మాత్రమే కాదని నివేదికలు తెలుపుతున్నాయి. న్యూయార్క్ సిటీ వినియోగదారుల వ్యవహారాల విభాగం చేపట్టిన అధ్యయనాల్లో ధరల్లో లింగ వివక్ష కొట్టొచ్చినట్లు కనిపించింది. దాదాపుగా ఒకే ఉత్పత్తికి పురుషులకంటే మహిళలు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ నగరంలోని కొన్ని డ్రైక్లీనర్స్ దుకాణాల్లో స్త్రీ పురుషుల వస్త్రాలపై సర్వే నిర్వహించిన అధ్యయనకారులకు ధరల్లో సారూప్యత లేకపోవడం కనిపించింది. పరిమాణం ఒకేలా ఉన్నా ధరను మాత్రం పురుషులకంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తేలింది. ఒకేలాంటి రెండు వస్త్రాలను పోలిస్తే వాటిలో మహిళల వస్త్రాలకు 7.50 డాలర్లను వసూలు చేయగా... పురుషుల వస్త్రాలకు 2.85 డాలర్లు మాత్రమే వసూలు చేయడం కనిపించింది. అంటే స్త్రీలకు సంబంధించిన ఉత్పత్తులకు దాదాపు మూడు డాలర్లు ఎక్కువగా చెల్లించాల్సి వచ్చింది. ఇటువంటి వివక్ష ఒక్క డ్రైక్లీనర్స్ విషయంలోనే కాదు జీన్స్, వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులు, బొమ్మలు, స్కూటర్లు ఇలా అనేక ఉత్పత్తుల విషయంలోనూ కొనసాగుతోన్నట్లు ఈ తాజా పరిశోధనల ద్వారా తెలుస్తోంది. దీన్నిబట్టి మహిళలు 42 శాతం ఎక్కువగా ధరలు చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. అయితే వస్తువుల ధరల విషయంలోనూ లింగ వివక్ష కొనసాగుతుండటం నిజమేనని కన్జూమర్ రిపోర్ట్స్ సీనియర్ ప్రాజెక్ట్ ఎడిటర్ టోడ్ మార్క్స్ అంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా మార్క్స్ ఇదే సమస్యపై పరిశోధన నిర్వహించారు. ముఖ్యంగా మహిళలే ఇటువంటి విషయాల్లో తమను తాము తక్కువ చేసుకుంటున్నారని, అదే విషయాన్ని ప్రయోజనంగా తీసుకొని ఎక్కువ డబ్బును వసూలు చేయడం జరుగుతోందని మార్క్స్ అంటున్నారు. డ్రై క్లీనర్స్ విషయంలో పరిశీలించినప్పుడు.. స్త్రీ, పురుఫుల షర్టులకు వేరు వేరు ధరలను వసూలు చేయడం కనిపించిందని, అదే అడిగితే ఇస్త్రీ మెషీన్ల విషయంలోనూ, మహిళల టాప్ లు ఫిట్టింగ్ విషయంలోనూ అనేక తేడాలుంటాయని, అందుకే అలా వసూలు చేయాల్సివస్తుందని షాపు యజమాని సైఫ్ వివరించారని మార్క్ వెల్లడించారు. అయితే లింగ ఆధారిత ధర దోపిడీ అనేది అమెరికాలో చట్ట విరుద్ధం. దేశ వ్యాప్తంగా 1996 లో జెండర్ ట్యాక్స్ అమల్లోకొచ్చిన తర్వాత సంవత్సరానికి మహిళలు కూడ 1,351 డాలర్లు పన్ను కడుతున్నారు. అయితే చిల్లర వ్యాపారాల్లో ఈ వివక్ష నిరోధించడమే లక్ష్యంగా ఎటువంటి చట్టం లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. రిటైల్ మార్కెట్లో ధరను నిర్ణయించే వెసులుబాటు లేకపోవడమే దీనికి కారణమని ట్రేడ్ లాయర్ మైఖేల్ కోన్ అంటున్నారు. అంతేకాదు మహిళలకు సంబంధించిన వస్తువులు దిగుమతి చేసుకున్నపుడు పురుషుల ఉత్పత్తులకన్నా అధిక ఇంపోర్ట్ టాక్స్ లు పడటం కూడ దీనికి కారణమంటున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే వినియోగదారులే ముందుకు వచ్చి ప్రచారాన్ని చేపట్టాలని ఆయన సూచిస్తున్నారు. -
కంటి తుడుపు పట్టింపు
విశ్లేషణ భారత జనాభాలో రెండు శాతానికి పైగా వికలాంగులు. ఇతర దేశా లతో పోలిస్తే మన దేశంలో వికలాంగుల శాతం తక్కువే. కానీ సంఖ్య రీత్యా మూడు కోట్ల వరకు ఉన్న వివిధ రకాల వికలాంగులంటే ఓ మధ్యస్త స్థాయి దేశ జనాభా అంత. ఇదేమీ పట్టించుకోకుండా వదలేయ గలిగేది కాదు. ఆందోళన కలిగించాల్సిన వాస్తవం, ఏమైనా చేయాల్సి ఉన్న విషయం. ‘బెస్ట్’ అనే పొట్టి పేరుతో పిలిచే ముంబై ముని సిపల్ రవాణా వ్యవస్థ వైఖరి మాత్రం అందుకు విరుద్ధమనిపిస్తుంది. వికలాంగులకు ఎక్కడం, దిగ డం సులువుగా ఉండే లో-ఫ్లోర్డ్ బస్సులను ప్రవేశ పెట్టడానికి వ్యతిరేకంగా అది తీర్మానం చేసింది. ఏదో కంటి తుడుపుగా అలాంటి కొన్ని బస్సులను నడిపితే చాలనేదే దాని సాధారణ వైఖరిగా ఉంది. బస్సులన్నిటినీ వికలాంగులకు అనువైనవిగా ఉండేట్టు చేసి, తద్వారా గర్వించదగ్గ గుర్తింపును సాధించాలనే మంచి ఆలోచన మాత్రం వారికి పుట్టలేదు. పేవ్మెంట్లన్నీ రోడ్డు మీది నుంచి ఒకే ఎత్తులో ఉండేలా చేయాలనీ, బస్సుల్లోకి ఎక్కి దిగడం సులువుగా అవి పేవ్మెంట్ అంచుకు దగ్గరగా ఆగేలా చేయాలనీ తన మాతృసంస్థయైన మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబైని కోరాలనే యోచన సైతం దానికి రాలేదు. వాస్తవంలో వికలాంగులు బస్సులోకి ముందు ద్వారం గుండా ఎక్కి, దిగాల్సిందే. వారికి కేటా యించిన సీటు సరిగ్గా ముందు టైరుకు ఎగువన ఉంటుంది. వికలాంగుల పట్ల మనకున్న శ్రద్ధ ఆపాటిది... అసలంటూ అది ఉంటే. రోడ్డు పక్క పాదచారులు నడిచే బాటలు మునిసిపల్ సంస్థల ప్రమాణాలకు తగ్గట్టుండవు. అలాంటివి ఉన్న సందర్భాల్లో కూడా... ఒక్క నడవడానికి తప్ప, పార్కింగ్ నుంచి వ్యాపారాల వరకు వాటికి ఇతర ఉపయోగాలుంటాయి. ఈ నామమాత్రపు పట్టిం పునకు తగ్గట్టు 42,000 బస్సుల్లో ఓ 30 బస్సులంటే పెద్దగా లెక్కలోకొచ్చేవి కావు. వికలాంగులకు అవి మరింత ఎక్కువగా అందుబాటులో ఉండేట్టు చేయ డం ఎలా? అనేది ఎన్నడూ బహిరంగ చర్చకు రాలేదు. విమానాశ్రయంలో సైతం సమస్యను ఎదుర్కొనే వికలాంగులకు టీవీ చానల్ అందు బాటులో ఉండటం గురించి చెప్పనవసరమే లేదు. ఒక దేశంగా మనం వికలాంగుల పట్ల సాను కూల వైఖరిని చూపే బాపతు కాదు. అంధులను ‘విజ్యువల్లీ ఇంపైర్డ్’ అనీ, బధిరులను ‘హియరింగ్ -ఛాలెంజ్డ్’ అనేసి, వారికి ఆ పాటి గౌరవ ప్రదర్శన చాలని భావిస్తాం. ఇక చేతల్లోనైతే, సమస్యలనె దుర్కొనే ఈ ప్రజా సమూహం పట్ల రవ్వంత గౌరవమైనా చూపం. వారి సమస్యల పరిష్కారానికి సాధ్యమైనదంతా చేయడానికి బదులు మనం కంటి తుడుపువాదంలో లోతుగా కూరుకుపోయాం. ఉదాహరణకు, ముంబై నగర రైళ్లలో వికలాం గుల కోసం కంపార్ట్మెంట్లో ఒక భాగాన్ని రిజర్వు చేసి, కాలి నడక వంతెనలకు బాగా దగ్గరగా అవి ఆగే ఏర్పాటు చేశారు, అంతే. కిటకటలాడే జనం మధ్య నుంచి వారు ఆ కంపార్ట్మెంట్లోకి ఎక్కడం ఎలా? అసలా వంతెన మెట్లు ఎక్కి దిగేదెలా? అనేది ఎవరికీ పట్టలేదు. తమను ఎత్తుకుని మోయడానికి వాళ్లు పోర్టర్లను పెట్టుకోలేరు. ఆ రైళ్లు వర్ణనాతీత మైనంత అసాధారణంగా కిక్కిరిసి ఉంటాయని ఎవరైనా అంగీకరించాల్సిందే. అయినాగానీ, ఆరో గ్యవంతుడైన ఏ వ్యక్తీ ఆ కంపార్ట్మెంట్ను దురా క్రమించే ప్రయత్నం చేయడు. అంటే సమాజం వికలాంగుల పట్ల శ్రద్ధ చూపుతోందిగానీ, అధికా రులు, సేవలను అందించేవారికి మాత్రమే అది లేదని అర్థం. వైకల్యమంటే ఏమిటో సామాన్యునికి తెలుసు. అధికారులకు మాత్రం చాలా విషయాల్లో అదీ ఒకటి, అంతే. ఈ శతాబ్ది మొదటి దశాబ్దిలో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ పాటిల్ కారు ప్రమాదంలో గాయపడ్డారు. నెలల తరబడి ఆయన రెండు కాళ్లూ కట్లతో ఉండాల్సి వచ్చింది. సెక్రటేరియట్లో ఆయన లిఫ్ట్‌లను చేరుకోవడం కోసం వాలు దారిని (ర్యాంప్) నిర్మించారు. అసెంబ్లీ హాల్లో ట్రెజరీ బెంచీల వరకూ కూడా వాలు దారి వేశారు. కొట్ట వచ్చినట్టున్న ఈ మార్పులను చూసి ఏ సభ్యుడూ... ఆయనలాంటి మిగతా వారికి కూడా ఏ ఇబ్బందీ కలుగకుండా ఇలాంటి శ్రద్ధ చూపిస్తారా? అని అడగ లేదు. పాటిల్‌ది తాత్కాలిక వైకల్యమే. నేను ఈ విష యాన్ని లేవనెత్తేవరకు, ఆయన సైతం ప్రభుత్వ భవ నాలైనా వికలాంగులకు అనువుగా ఉండేలా చేయ డానికి నామమాత్రపు నిధులను కేటాయించలేదు. కాళ్లూచేతుల తొలగింపునకు గురైనవారి నుంచి అంధత్వం, బధిరత్వాల వరకు వైకల్యాలు విభిన్న మైన వి. అందరికీ చక్రాల కుర్చీ లేదా ఊత కర్రలు అవసరం లేకపోవచ్చు. బహుశా బ్రెయిలీ మాత్రమే వికలాంగులకు కల్పించిన ఏకైక ప్రత్యేక సదుపా యం కావచ్చు. ఆటిజం, హైపర్ యాక్టివ్ సిండ్రోమ్ మొదలైన వాటికి కూడా మద్దతు అవసరమని గుర్తించడం అవసరం. ఆటిజంతో బాధపడుతున్న బాలుడిని బయటకు తీసుకుపోవడానికి వెంట ఓ టీచర్‌ను పంపడానికి జేబులు ఖాళీ అయ్యేంత భారీ ఫీజును వసూలు చేసే ఒక స్కూలు గురించి నాకు తెలుసు! ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం సురక్షి తంగా నడవగలిగే ఫుట్‌పాత్ వంటి చిన్న సదు పాయాలను సైతం వికలాంగులకు నిరాకరి స్తున్నాయి. రోడ్డు పక్క గతుకులతో కూడిన గరుకైన పాదచారుల బాటమీద ఊతకర్రలతో నడవడాన్ని లేదా చక్రాల కుర్చీని ఉపయోగించడాన్ని ఊహించు కోండి. ఇక తెల్ల బెత్తాన్ని ఉపయోగించేవారు పడితే, ఒక్కోసారి మూతలేని మ్యాన్హోల్లోనైనా పడ వచ్చు. ఎక్కడైనా ఫుట్పాత్లుంటే, అవి కుంటి తనం, అంధత్వం లాంటివేవీ లేని సాధారణ వ్యక్తులను సైతం గాయపరచి, వైకల్యానికి గురిచేయవచ్చు. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
నిన్న జుకర్ బర్గ్, నేడు సుందర్ పిచాయ్
నిన్న ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్... తాజాగా గూగుల్ సీఈవో భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ ముస్లింలకు బాసటగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం, మైనార్టీ వర్గాలకు తాము మద్దతుగా ఉంటామని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. అమెరికాలోకి రాకుండా ముస్లింలను బ్యాన్ చేయాలని రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో గూగుల్ సీఈవో పై విధంగా స్పందించారు. ఆ వ్యాఖ్యలు సరికాదని, అసహనంపై వస్తున్న వార్తలు బాధాకరమని సుందర్ పిచాయ్ 'మీడియం'లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్...తాను భారత్ నుంచి అమెరికా వచ్చిన రోజులను గుర్తు చేస్తున్నారు.22 ఏళ్ల క్రితం భారత్ నుంచి యూఎస్ వచ్చానని, తనను అవకాశాల భూమి అమెరికా అక్కున చేర్చుకుందని తెలిపారు. ఇక్కడకు వచ్చిన తనలాంటి వారికి కేవలం అవకాశాలు మాత్రమే కాకుండా విశాలమైన హృదయంతో, సహనంతో అమెరికా తనలో ఒక భాగం చేసుకుందని తెలిపారు. అమెరికాను కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్గా పిచాయ్ పేర్కొన్నారు. ఏదైనా ఒక దేశం లేదా సంస్థ అభివృద్ధి పథంలో పయనించాలంటే అక్కడ భిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తులు, సంస్కృతులు ఉన్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. -
ఆడ పిల్ల.. అక్కర్లేని పిల్లా!
బేటీ బచావ్ ‘నీ పేరు ఏంటి?’ ‘నా పేరు... నా పేరు... ఆ....’ ‘మరి నీ పేరు’ ‘నా పేరు ....నా పేరు... ఆ....’ మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఆడపిల్లల్ని ప్రశ్నిస్తే, వారిలో చాలామంది నుంచి వచ్చే సమాధానం ఇదే! అదేంటి మీకు పేర్లు లేవా అంటే, మేం ఎందుకూ పనికిరాని వాళ్లం కదా అని అంటారు వాళ్లు. పేర్లు లేకుండా ఎలా ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తోంది కదూ. ఆశ్చర్యం వేసినా, విడ్డూరం అనుకున్నా ఇది మాత్రం నిజం. సతారా జిల్లాలో గ్రామాల్లో ఆడపిల్లలకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. ఇలా ప్రాధాన్యత లేని వారి సంఖ్య వందకు పైమాటే. మగ పిల్లల్ని మాత్రమే గారాబంగా పెంచుతున్నారు. ఇంట్లో మొదటి ఆడపిల్లనైతే బాగానే చూస్తున్నారు. రెండవ, మూడవ ఆడపిల్లల పరిస్థితి అధ్వానంగా ఉంది. వారిని కనీసం పేరు పెట్టి పిలవక పోగా, నకుష అంటున్నారు. మరాఠీలో నకుష అనే పదానికి ‘అక్కర్లేని వారు’ అని అర్థం. తల్లిదండ్రులే ఆ పిల్లల్ని ఆ విధంగా పిలుస్తుంటే, ఇంక ఇతరులకు లోకువే కదా. అందుకే ప్రభుత్వం ఆ పిల్లలను చేరదీసి వారికి ఒక శుభ ముహూర్తం నిర్ణయించి, పేర్లు పెట్టి, ఆ పేర్లు వాళ్ల చేత రాయిస్తోంది. అదొక పెద్ద వేడుకలా నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆ పిల్లలు వారి వారి పేర్లు పలకల మీద రాసి చూసుకుంటూ, ఎంతో సాధించామన్న గర్వంతో తలెత్తుకు తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అలా 265 మంది ఆడపిల్లలకు పేరు పెట్టింది. ఇంకా వందమందికి పెట్టాల్సి ఉంది. ఇక్కడ ఇంకోలా... పై పరిస్థితికి భిన్నంగా మహారాష్ట్రలోని పుణేలో డా. గణేశ్ రఖ్.. ‘బేటీ బచావ్’ నినాదంతో ఆడపిల్లలను రక్షిస్తున్నారు. తన ఆసుపత్రిలో ఆడశిశువుకు జన్మనిస్తే, వారి ఖర్చులను స్వయంగా తానే భరిస్తున్నారు. 2012లో ఆయన ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రస్తుతం 50 పడకలతో మెడికేర్ హాస్పిటల్ ఫౌండేషన్ పేరుతో నడుస్తున్న ఈ ఆసుపత్రిలో ఇప్పటికి 407 మంది ఆడ శిశువులు ఉచితంగా జన్మించారు. సమాజంలో ఆడపిల్లలపై ఉన్న వివక్ష తొలగాలంటే అన్ని రంగాల్లోనూ డాక్టర్ గణేశ్ రఖ్ లాంటి వాళ్లు ఉండాలి. -
అమెరికా ఎయిర్ లైన్స్ పై మహిళ ఫిర్యాదు
మాంట్ గొమెరీ: తనను అకారణంగా సస్పెండ్ చేశారని అమెరికాలోని ఎక్స్ ప్రెస్ జెట్ ఎయిర్ వేస్ పై ఓ ముస్లిం మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. ప్రయాణికులకు మద్యం అందించలేదన్న సాకుతో తనను ఏడాది పాటు ఉద్యోగం నుంచి తొలంగించారని ఆరోపించింది. డెట్రాయిట్ కు చెందిన షారీ స్టాన్లీ(40) ఈమేరకు సమాన ఉపాధి అవకాశాల సంఘానికి ఫిర్యాదు చేసింది. తన మత విశ్వాసాలను గౌరవించకుండా వివక్ష చూపారని పేర్కొంది. సహఉద్యోగి ఫిర్యాదు మేరకు స్టాన్లీపై చర్య తీసుకున్నారని మిచిగాన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ ప్రతినిధి లినా మార్సీ వెల్లడించారు. ఉద్యోగంలో చేరే నాటిని స్టాన్లీ- ఇస్లాంలోకి మారిందని చెప్పారు. మద్యం అందించలేదన్న కారణంతో బలవంతంగా ఏడాది పాటు జీతంలేని సెలవు ఇచ్చారని తెలిపారు. మూడేళ్లుగా ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేస్తున్న ఆమెను వివక్షకు గురిచేశారని ఆరోపించారు. అయితే తమ దగ్గర పనిచేసే ఉద్యోగులందరి విశ్వాసాలను తాము గౌరవిస్తామని ఎక్స్ ప్రెస్ జెట్ ప్రకటించింది. అట్లాంటా కేంద్రంగా పనిచేస్తున్న ఎక్స్ ప్రెస్ జెట్ ఎయిర్ వేస్ కు 388 విమానాలు ఉన్నాయి. 9 వేల మంది పనిచేస్తున్నారు. -
'కేసీఆర్ మహిళల పట్ల వివక్ష చూపుతున్నారు'
హైదరాబాద్: మహిళల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వివక్ష చూపుతున్నారని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ధ్వజమెత్తారు. కేబినెట్లో మహిళలకు చోటు కల్పించలేదని, తెలంగాణ ఏర్పడి ఏడాది గడిచినా మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ రెండురాష్ట్రాలకు ఉమ్మడి మహిళాకమిషన్ కొనసాగుతోందన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం కుంభకోణాల మయం కాగా, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మహిళల పట్ల వివక్షను చూపుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పలువురికి మంత్రి పదవులిచ్చి మహిళలకు పెద్దపీట వేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా మంత్రిపదవి కల్పించలేదన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. ఎన్నికలపుడు మహిళలను పొగిడిన కేసీఆర్ ఇప్పుడు మహిళలకు తగిన గుర్తింపునివ్వడం లేదన్నారు. ప్రజలు తిరగబడే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రాష్ర్టంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు అవినీతిరహిత పాలనను అందిస్తామని చెప్పిన నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కుంభకోణాలు చేసి అవినీతిమయమై పోయిందన్నారు. -
రిటైర్డ్ ఉద్యోగుల మీద ఎందుకీ వివక్ష?
ఆరు దశాబ్దాల కృషితో ఏర్పడింది ప్రత్యేక తెలంగాణ. ఇందుకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, రైతులు తమ వంతు కృషి చేశారు. రెండున్నర లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు కూడా ఈ ఉద్యమంలో భుజం భుజం కలిపారు. ఇందుకు వీరు ఎంతో ఆనందిస్తున్నారు. బంగారు తెలంగాణలో మిగిలిన అన్ని వర్గాలతో పాటు పదవీ విరమణ చేసిన వారి ఆకాంక్షలు కూడా నెరవేరతాయని ఆశించారు. కొన్ని వర్గాల ఉద్యోగులు, వర్గాల వారి కలలు నెరవేరాయి కూడా. కానీ రెండున్నర లక్షల మంది విశ్రాంత ఉద్యోగుల పట్ల మాత్రం కె. చంద్రశేఖరరావు ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించకపోవడం వీరిని హతాశులను చేసింది. పదవీ విరమణ చేసిన నాటికి ఉద్యోగి తీసుకుంటున్న వేతనంలో సగం పింఛనుగా చెల్లించే విషయం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో మొదలైన వివాదం నేటికీ కొనసాగడం విశ్రాంత ఉద్యోగులను మరింత కుంగదీస్తోంది. మే 25, 1998 తరువాత పదవీ విరమణ చేసిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ తేదీకి ముందు పదవీ విరమణ చేసిన వారికీ ఆ నిబంధన వర్తింపచేయాలని పదవీ విరమణ ఉద్యోగులు కోరుతున్నారు. దీనిని కూడా అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. తరువాత విశ్రాంత ఉద్యోగులు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు వెళితే, వీరి డిమాండ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వం మళ్లీ ఈ తీర్పునకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు కూడా ట్రిబ్యునల్ తీర్పునే సమర్థించింది. కానీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2004లో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. పదేళ్ల తరువాత 2014 ఏప్రిల్ 30న సుప్రీంకోర్టు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. అప్పటికే విభజన ప్రక్రియ ప్రారంభం కావడంతో గవర్నర్‌కు రిటైర్డ్ ఉద్యోగులు ఈ అంశం గురించి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సుప్రీం తీర్పును వెంటనే అమలు చేయాలని కూడా కోరడం జరిగింది. ‘ఎంప్లాయీ ఫ్రెండ్లీ తెలంగాణ ప్రభుత్వం’ ఎనిమిది మాసాలైనా ఇప్పటికీ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసే అంశం మీద జీవో జారీ చేయలేదు. సరికదా, సర్వీసు ఉద్యోగులకు ఇచ్చిన తెలంగాణ ఇంక్రిమెంట్‌ను రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వలేదు. ఇది విశ్రాంత ఉద్యోగులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నది. దీనితో పాటు పన్నెండు మాసాలు గడచిపోయినప్పటికీ పదో పీఆర్సీ సిఫారసుల అమలు కోసం కూడా ఈ వర్గం ఇప్పటికీ ఎదురు చూడవలసి వస్తున్నది. ఆ పది మాసాల బకాయిల చెల్లింపు ఏ విధంగా జరుగుతుందో కూడా తెలియడం లేదు. అడిషినల్ క్వాంటమ్ మీద పీఆర్సీ సిఫారసులను ఆమోదించాలన్న తమ విన్నపం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా అర్థం కావడం లేదు. హెల్త్ కార్డుల విషయం కూడా ఇప్పటికీ తేలలేదు. ఈ సమస్యలను పరిష్కరించి రిటైర్డ్ ఉద్యోగుల క్షోభను నివారించాలని కేసీఆర్‌ను కోరుతున్నాం. పడాల రాములు (జీటీఈఏ మాజీ ఉపాధ్యక్షులు) హైదరాబాద్ ‘పోలీస్’ సంస్కరణలు ఎక్కడ? మితిమీరిన రాజకీయ జోక్యం, పై అధికారుల ఇష్టా రాజ్య ధోరణి పోలీస్ వ్యవస్థను అభాసుపాలు చేస్తు న్నాయి. ప్రజలకూ, పోలీసులకూ మధ్య పెరుగు తున్న అంతరం మరింత విస్తరించకుండా 30 ఏళ్ల క్రితం తలపెట్టిన సంస్కరణలను అమలు చేయడం అవసరం. రెబీరో కమిషన్, మాలిమత్ కమిషన్, ధర్మ వీర్ కమిషన్, పద్మనాభయ్య కమిషన్ వంటివి అం దుకు సిఫారసులు చేశాయి. 2008లో పార్లమెంటు కూడా పోలీసు సంస్కరణల గురించి చర్చించింది. సుప్రీం కోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. అరెస్టు అధికారాన్ని పోలీసుల నుంచి నియంత్రించడం, కేసు లతో నష్టపోతే పరిహారం వంటివి ఇందులో ఉన్నా యి. వీడియో కాన్ఫరెన్స్‌తో కేసుల సత్వర పరిష్కారం కోసం కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. 1970లో ఏర్పాటైన జాతీయ పోలీస్ కమిషన్ అనేక నివేదికలు సమర్పించింది. అయినా ఇప్పటికీ ఈ వ్యవస్థను సం స్కరించవలసిన అవసరమే ఎక్కువ. పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగేటట్టు చేయాలి. ఇది ప్రజాస్వామ్య విజయానికి అవసరం. ముర్కి రామచంద్రం కోహెడ, కరీంనగర్ జిల్లా. -
హామీలపై కేంద్రాన్ని నిలదీద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షపై గట్టిగా నిలదీయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ ఎంపీలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఇప్పటికే జరిగిన భేటీలో వ్యూహరచన చేసుకున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం ఇప్పటివరకు నెరవేర్చకపోవడాన్ని తప్పుబడుతూ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అడ్డుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తెలంగాణకు ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన, ఉద్యోగుల పంపిణీలో జాప్యం, కమలనాథన్ కమిటీ పనితీరు, విభజన చట్టం మేరకు ఏర్పాటు కావాల్సిన ఐఐ ఎం, హార్టికల్చర్ వర్సిటీ వంటి అంశాలపై ఎంపీలు పట్టుబట్టనున్నారని సమాచారం. ప్రాణహితకు జాతీయ హోదా కోసం పట్టు... సాగునీటి రంగంలో గత పాలకులు ప్రదర్శించిన అలసత్వం వల్ల తెలంగాణలో వలసలు పెరిగాయన్న నిశ్చితమైన అభిప్రాయం టీఆర్ఎస్లో ఉంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడితుల గొంతు తడిపేందుకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఏపీ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, దీనిపై కేంద్రం అనుసరిస్తున్న నిర్లిప్త వైఖరిపై సభను స్తంభింపజేయాలన్న వ్యూహంతో ఆ పార్టీ ఎంపీలున్నారు. వీటితోపాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదాపైనా పట్టుబట్టాలని నిర్ణయించారు. ప్రాజెక్టులపై, అడ్డుపడుతున్న ఏపీ నిర్వాకంపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతోపాటు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని కలిసి చర్చించనున్నారు. ‘ప్రధానంగా హైకోర్టు విభజన అంశంపైనే దృష్టి పెట్టనున్నాం. అన్ని సౌకర్యాలున్నా, కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రకటనలు చేసినా, విభజనలో ఆలస్యం జరుగుతోంది. మూడు రోజుల కిందట గవర్నర్‌నూ కోరాం. ఇక్కడి వారిపై నమ్మకం లేదు. కాకుంటే మా కేసులను ఒడి శా లేదా తమిళనాడుకు మార్చాలని కూడా కోరుతాం..’ అని ఒక ఎంపీ వ్యాఖ్యానించారు. పదో షెడ్యూల్లోని సంస్థల విభజన విషయంలో బాగా ఆలస్యం జరుగుతోందని ఎంపీలు పేర్కొంటున్నారు. కేంద్రంలోని కొందరు పెద్దలు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా, తెలంగాణ అంశాలకు వ్యతిరేకంగా ఉంటున్నారన్న బలమైన అభిప్రాయంతో ఉన్న టీఆర్ఎస్ నాయకత్వం, తమ ఎంపీల ద్వారా కేంద్రంతో అమీతుమీకి సిద్ధపడుతున్నట్లు భావిస్తున్నారు. టీ ప్రభుత్వంపై టీడీపీ కుట్ర... ఎన్డీయేలో భాగస్వామ్యపక్షమైన టీడీపీ... తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతోందని ఎంపీలు విమర్శిస్తున్నారు. ‘ బేగంపేట విమానాశ్రయం నిజాం మనకు ఇచ్చిన వారసత్వ సంపద. అది తెలంగాణ సొత్తు. కానీ టీడీపీకి చెందిన పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు బేగంపేట విమానాశ్రయాన్ని సైన్యానికి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు..’ అని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. బేగంపేట విమానాశ్రయ వ్యవహారాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాలని, కేంద్రం తీరుపై నిరసన తెలపాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బయట ఎవరినీ నిందించవద్దని, ముఖ్యంగా న్యాయవ్యవస్థ విషయంలో జాగ్రత్తగా, ఆచితూచి మాట్లాడాలని కొందరు ఎంపీలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. హైకోర్టు విభజనపై సాధ్యమైనంతగా కొట్లాడాలని, ఏది మాట్లాడినా, అది పార్లమెంటు సమావేశాల్లోనే మాట్లాడాలని కూడా వీరికి సూచించారని తెలిసింది. లోక్‌సభ స్పీకర్ సోమవారం నిర్వహించనున్న అఖిలపక్ష భేటీకి హాజరవుతున్నామని, మంగళవారం నుంచి మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేస్తామని టీఆర్ఎస్ ఎంపీ ఒకరు వివరించారు. -
బానిసత్వపు సంకెళ్లు తెంచిన ధీరుడు..
భగవంతుడు సృష్టించిన మనుషులందరిలోనూ ఒకే రంగు గల రక్తం ప్రవహిస్తోంది. అయితే కొందరు పుట్టుకతో భాగ్యవంతులు, మరి కొందరు నిరుపేదలు. మనిషికి మనిషి గౌరవం ఇవ్వాల్సివస్తే ఎవరిని గౌరవించాలి? ధనవంతుడినా లేక పేదవాడినా?? లింకన్ని ప్రశ్నిస్తే.. ఎగాదిగా చూస్తాడు. ప్రతి ఒక్కరికీ ఆత్మ గౌరవం ఉంటుందంటాడు. ఇదే విషయాన్ని త్రికరణశుద్ధిగా నమ్మినవాడు అబ్రహాం లింకన్! 1861.. అమెరికా గతిని మార్చేసిన సంవత్సరం. మానవతావాది, నిస్వార్థ ప్రజాస్వామ్య నేత అబ్రహాం లింకన్ ఆ దేశ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఆయనకు ముందు 15మంది, తర్వాత 28 మంది ఆ పీఠం మీద కూర్చున్నారు. అయితే, ఎవరూ ఆయన స్థాయిని చేరుకోలేకపోయారు. ఇప్పటికీ అమెరికా ప్రజల ఆరాధ్య అధ్యక్షుడు లింకనే అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆయన అమెరిన్ల మనసులపై ముద్రవేశారు. బాల్యం.. 1809, ఫిబ్రవరి 12న అమెరికాలోని కెంటకీలో జన్మించాడు లింకన్. తండ్రి వడ్రంగి పనులు చేసేవాడు. చిన్నతనంలోనే విషజ్వరాల కారణంగా తల్లిని పోగొట్టుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగా తరచూ వలసలు వెళ్లే కుటుంబంలో పెరగడంతో పెద్దగా చదువుకోలేదు. తల్లి మరణం తర్వాత తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే సవతి తల్లి లింకన్‌పై ఎంతగానో వాత్సల్యం పెంచుకుంది. సొంతబిడ్డలాగా సాకేది. ఆమె పెంపకంలోనే లింకన్ నీతి, నిజాయతీలను బాగా ఒంటబట్టించుకున్నాడు. ‘మనిషికి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మగౌరవం’ అన్న తన తల్లి మాటలు లింకన్ మనసులో చెరగని ముద్ర వేశాయి. దుఃఖం.. పుట్టుక నుంచీ పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చిన లింకన్‌ను జీవితకాలం అది వెంటాడుతూనే వచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతూ మరణించిన తన పంతొమ్మిదేళ్ల అక్క సారాను తలచుకుంటూ లింకన్ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో అతడి మిత్రులకు బాగా తెలుసు. చదువులేనప్పటికీ వ్యాపారంలో రాణిద్దామనుకొన్నాడు. అదీ తీవ్ర నష్టాల్నే మిగిల్చింది. అప్పుల ఊబిలో ఇరుక్కున్నాడు. సవతి తల్లికి సొంత బిడ్డగా మారినా తండ్రికి మాత్రం క్రమేపీ దూరమవుతూ వచ్చాడు. రాజకీయాలు.. లింకన్ 1832లో ఇల్లినాయిస్ రాష్ట్ర శాసనసభకు పోటీచేసి ఓడిపోయాడు. అయితే 1834 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. తర్వాత కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా న్యాయవాద వృత్తిలో గడిపాడు. న్యాయశాస్త్రాన్ని తనంతట తానే అభ్యసించిన లింకన్.. న్యాయవాదిగా ఎంతో ఉన్నతస్థానానికి ఎదిగాడు. అమెరికాలోని తెల్లవారు నల్లవారిని హింసించడం లింకన్‌కు నచ్చలేదు. వారి తరఫున వకాల్తా పుచ్చుకొని ఎన్నో కేసులు వాదించాడు. ఇదే క్రమంలో మరోసారి రాజకీయాల్లోకి రావాలని 1855లో నిర్ణయించుకున్నాడు. వర్ణవివక్షపై సమరం.. ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్మినవాడు లింకన్. అందుకే నలుపు, తెలుపు భేదాలను అంగీకరించలేకపోయాడు. దేశంలో నల్లవారు బానిసత్వంలో మగ్గుతుంటే సుస్థిరత ఎక్కడుంటుందని ప్రశ్నించాడు. అందుకే.. దేశంలో బానిసత్వం, వర్ణవివక్షను రూపుమాపుతానని ప్రకటించాడు. ‘ది డివెడైడ్ స్పీచ్’ పేరుతో ఆయన చేసిన ప్రసంగం అమెరికన్ల భవిష్యత్తునే మార్చివేసింది. మనుషులంతా సమానమని, వర్ణభేదం వద్దంటూ లింకన్ ఇచ్చిన పిలుపు చాలామందిని కదిలించింది. లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యేలా చేసింది. వ్యతిరేకత.. అధ్యక్షుడైన తర్వాత లింకన్ తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. బానిసత్వాన్ని రూపుమాపాడు. దీంతో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 11 రాష్ట్రాలు లింకన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. బానిసత్వం చట్టబద్ధంగా ఉన్న ఈ రాష్ట్రాలు ‘కాన్ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’గా జట్టుకట్టి అంతర్యుద్ధానికి తెరలేపాయి. 1861 నుంచి 1865 వరకూ అంతర్యుద్ధం కొనసాగింది. ఈ తిరుగుబాటును లింకన్ అణచివేయడంతో 1865 ఏప్రిల్ 10న ముగిసింది. హత్య.. నల్లవారి అభ్యున్నతి కోసం లింకన్ మరింత ముందుకెళ్లాడు. వీరికి ఓటు హక్కు కల్పిస్తానని ప్రకటించాడు. దీంతో కొందరు శ్వేతజాతీయులు లింకన్‌పై కుట్రపన్నారు. అంతమొందించేందుకు ప్రయత్నిం చారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన లింకన్‌ను 1865 ఏప్రిల్ 15న జాన్ విల్కీస్ బూత్ అనే డ్రామా నటుడు తుపాకీతో కాల్చిచంపాడు. అమెరికా అగ్రరాజ్యంగా అవతరించేందుకు పునాదులేసిన లింకన్ మరణంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఆ దేశ చరిత్ర నుంచి ఓ దార్శనికుడు కనుమరుగయ్యాడు. ఆజానుబాహుడు.. అబ్రహాం లింకన్ ఆజానుబాహుడు. ఆరడుగుల నాలుగంగుళాల పొడవుండే ఆయన అత్యంత బలశాలి కూడా. లింకన్ కండబలం గురించి ఎన్నో ఉదాహరణలు చెబుతారు. 1834లో ఎన్నికల ప్రచారంలో లింకన్ ప్రసంగిస్తున్నప్పుడు వేదిక ముందున్న మద్దతుదారుల్లోంచి ఒక వ్యక్తి దూసుకొచ్చాడట. తనపై దాడిచేసేందుకే అని గ్రహించిన లింకన్, ఒంటి చేత్తో ఆ వ్యక్తి మెడను అందుకుని అవతల విసిరేశాడట. దీని గురించి నేటికీ కథలు కథలుగా చెప్పుకొంటారు. గొడ్డలిని ఉపయోగించడంలో లింకన్‌ది అందెవేసిన చెయ్యి. ఆయనకు అతీంద్రియ శక్తులుండేవని అమెరికన్లు విశ్వసిస్తారు. -
మ్యారీడ్ సండే.. ఫైర్డ్ మండే..
చికాగో: ఇల్లు అలకగానే పండగకాదు అనే పాత సామెత అమెరికన్ ఎల్జీబీటీ (లెస్బియాన్స్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) ల విషయంలో మరోసారి రుజువైంది. ఓ ఆదివారంనాడు ఎంతో సంతోషంగా గే పార్ట్నర్ను పెళ్లి చేసుకున్న కారణంగా సోమవారం నాటికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం అమెరికాలో! అలా పుట్టిందే మ్యారీడ్ సండే.. ఫైర్డ్ మండే ఉవాచ. ఆ విధంగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. రెండు వారాలు తిరగకముందే బుట్టదాఖలయ్యే పరిస్థితులు తలెత్తాయి. సుప్రీంకోర్టు తీర్పు మతిలేనిదని బాబీ జిందాల్ తోపాటు మరికొందరు కీలక నేతలు బాహాటంగానే విమర్శలకు దిగారు. ఆ క్రమంలోనే లూసియానా సహా 13 రాష్ట్రాల్లో సుప్రీం తీర్పు అమలు కావడంలేదు. అంతేకాదు.. సుప్రీం తీర్పు తరువాత ఎల్జీబీటీలపై వివక్ష రెట్టింపు అయిందికూడా. ఈ ఉదంతాలకు పరాకాష్టలాంటి ఘటన శనివారం టెన్నెస్సీలో చోటుచేసుకుంది. ఆ సిటీలో ప్రముఖ సంస్థగా వెలుగొందుతున్న ఓ హార్డ్‌వేర్ సంస్థ 'గేలకు ప్రవేశం లేదు' అని గేటు ముందు బోర్డు పెట్టేసింది. ఈ చర్యను గేలందరూ గర్హిస్తున్నారు. '50 ఏళ్లు పోరాడిసాధించుకున్న హక్కులు నీరుగారిపోకుండా ఉండాలంటే ఎల్జీబీటీలో మరో మహోద్యమానికి సిద్ధపడక తప్పదు' అని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రొగ్రెస్ రీసెర్చర్ సారా మెక్‌బ్రైడ్ అంటున్నారు. పలు రంగాలకు చెందిన మేధావులు ఆమె ఉవాచను సమర్ధిస్తున్నారు. -
జైళ్లలో ఖైదీల మధ్య వివక్ష
- ‘సంకెళ్ల సవ్వడి’ పుస్తకావిష్కరణలో జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి - జైళ్లలో పరిస్థితులపై వక్తల ఆవేదన హైదరాబాద్: జైళ్లలో ఖైదీల మధ్య పోలీసులు చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. మలుపు సంస్థ ఆధ్వర్యంలో హక్కుల ఉద్యమ కార్యకర్త, పుస్తక రచయిత అరుణ్ ఫరేరా రచించిన ‘సంకెళ్ల సవ్వడి’ పుస్తకావిష్కరణ సభ శనివారం హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వతపరిషత్ ఆడిటోరియంలో జరిగింది. కార్యక్రమానికి సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ రచయిత అరుఫ్ ఫరేరా జైళ్లలో తన అనుభవాలను పుస్తకంలో రాశారని చెప్పారు. రాజకీయ ఖైదీలు, సమాజాన్ని దోచుకునే ఖైదీల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందని వివరించారని పేర్కొన్నారు. అతి క్రూరమైన నేరాలు చేసినవారికి ములాఖాత్‌లో ఎంతో స్వేచ్ఛ ఉంటుందని, కానీ సాధారణ ఖైదీలను మాత్రం పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వసతులు లేక ఖైదీలు ఎంతగానో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి జైళ్లలో ఉంటుందన్నారు. అరుణ్ ఫరేరా మానవ హక్కులకు భంగం కలుగుతుందని విశ్వసిస్తేనే ఆయనపై పెట్టారని తెలిపారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ... జైళ్లలో ఉన్న పరిస్థితులను రచయిత అరుణ్ ఫరేరా ఎంతో సహనంతో రాశారన్నారు. జైళ్లలో అండా సెల్ పెట్టడం మానవత్వానికి విరుద్ధమన్నారు. ఇప్పుడున్న పార్టీలకు రాజ్యాంగ విలువలు లేవని, రాజ్యం అమానుషంగా తయారైందని రచయిత తన పుస్తకంలో చెప్పారన్నారు. సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం మాట్లాడుతూ.... జైళ్లలో ఉన్న సంఘటనలు కళ్లకు కట్టినట్లు రచయిత రాశారని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో రచయిత అరుణ్ ఫరేరా, సామాజిక, రాజ కీయ పత్రిక దస్తక్ సంపాదకులు సీమా ఆజాద్, వీక్ష ణం ప్రధాన సంపాదకులు ఎస్.వేణుగోపాల్, బాల్‌రెడ్డి, విరసంనేత వరవరరావు పాల్గొన్నారు. -
ఎందుకీ వివక్ష?
విజయనగరం క్రైం: విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు.. అడుగడుగునా వివక్ష చూపుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో కొన్ని సార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మలను వామపక్ష నాయకులు దహనం చేసిన సందర్భాల్లో పోలీసులు అడ్డుకున్నారు. కాని సోమవారం సాయంత్రం పట్టణంలోని మయూరి కూడలి వద్ద వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసినప్పుడు పోలీసులు అడ్డుకోకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యేకు లంచం ఇచ్చిన రేవంత్‌రెడ్డి తీరుకు నిరసనగా పార్వతీపురంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. అదే టీడీపీ నేతలు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసినప్పుడు అడ్డుకోకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా మారారన్న విమర్శలు రేగుతున్నాయి. అధికార పార్టీకి ఒక న్యాయమా,,? ప్రతిపక్ష పార్టీలకు మరో న్యాయామా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలను నిషేధించినపుడు అన్ని పార్టీల వారినీ సమానంగా చూడాలని, అధికార పార్టీల వారికి తొత్తులుగా మారడం సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు. -
‘ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను వివక్షకు గురికాకుండా చూడాలి’
మహబూబ్‌నగర్: ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను వివక్షకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ డాక్టర్ రాజారాం అన్నారు. నేషనల్ క్యాండిల్ లైట్ ర్యాలీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ టౌన్‌హాలు నుంచి క్లాక్‌టవర్ వరకు క్యాండిల్స్ ర్యాలీని ఏజేసీ జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు మనోధైర్యం కోల్పోకుండా ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.