division
-
వేదాంత విభజనకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: షేర్హోల్డర్లు, రుణదాతలు ఆమోదముద్ర వేయడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ విభజనకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో వ్యాపారాలను అల్యూమినియం, ఆయిల్ తదితర రంగాలవారీగా అయిదు కంపెనీలుగా విడదీస్తారు. డీమెర్జర్ స్కీము ప్రకారం వేదాంత షేర్హోల్డర్లకు ఒక్కో షేరుకు గాను కొత్తగా ఏర్పడే నాలుగు సంస్థలకు సంబంధించి అదనంగా ఒక్కొక్క షేరు చొప్పున లభిస్తుంది. కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునేందుకు, వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ డీమెర్జర్ ఉపయోగపడుతుందని వేదాంత వెల్లడించింది. అలాగే, ఒక్కో స్వతంత్ర కంపెనీ వేర్వేరుగా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమకూర్చుకునేందుకు, వ్యూహాత్మక భాగస్వాములతో జట్టు కట్టేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొంది. అయిదు కంపెనీలుగా విడదీసే ప్రణాళికకు 99.99 శాతం మంది షేర్హోల్డర్లు, 99.59 శాతం మంది సెక్యూర్డ్ రుణదాతలు, 99.95 శాతం మంది అన్సెక్యూర్డ్ రుణదాతలు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. గురువారం బీఎస్ఈలో వేదాంత షేర్లు దాదాపు 2.40 శాతం పెరిగి రూ. 433.55 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రాడేలో సుమారు 3 శాతం పెరిగి రూ. 435.50 స్థాయిని తాకాయి. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 3,969 కోట్లు పెరిగి రూ. 1,69,535 కోట్లకు చేరింది.ఇవీ కంపెనీలు.. విడదీత అనంతరం వేదాంత లిమిటెడ్ ప్రధానంగా వెండి, జింకు మొదలైన మెటల్స్ ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మిగతా కంపెనీల జాబితాలో వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ ఉంటాయి. టెక్నాలజీ విభాగాలతో పాటు కొత్త వ్యాపారాలకూ వేదాంత ఇన్క్యుబేటరుగా వ్యవహరిస్తుంది. -
రాష్ట్ర విభజనకు వ్యతిరేకం: బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
కలకత్తా: రాష్ట్ర విభజన కోసం జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా వ్యతిరేకిస్తున్నట్లు వెస్ట్‌బెంగాల్ అసెంబ్లీ సోమవారం(ఆగస్టు5) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ‘మేం కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని నమ్ముతున్నాం. బెంగాల్ విభజనకు జరిగే ఎలాంటి ప్రయత్నాన్నైనా వ్యతిరేకిస్తాం’అని సీఎం మమతాబెనర్జీ అన్నారు. ఈ తీర్మానానికి అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి కూడా మద్దతిచ్చారు. తాము కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఉత్తర వెస్ట్బెంగాల్ను విభజించి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ప్రతిపక్ష బీజేపీ మద్దతివ్వడంతో మూజువాణి ఓటుతో తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. -
రైలులో వదంతులు.. కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన నలుగురు
వదంతులు.. ఎంతటివారినైనా ఒకింత ఆలోచింపజేస్తాయి. అదే ప్రమాదానికి సంబంధించిన వదంతులైతే దాని పరిణాలమాలు ఊహించని విధంగా ఉంటాయి. జార్ఖండ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారుజార్ఖండ్లోని లాతేహార్‌లో రాంచీ-ససారం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నదంటూ వదంతులు వ్యాపించడంతో ఆ రైలులోని పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. ఈ సమయంలో ప్రయాణికులు అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొన్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అంబులెన్‌లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ససారం-రాంచీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ కుమాండిహ్ స్టేషన్ సమీపానికి వచ్చిన సమయంలో ఒక ప్రయాణీకుడు రైలుకు నిప్పుంటుకున్నదంటూ నానా హంగామా చేశాడు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందుకు దూకేశారు. ఈ సమయంలో ఎదురుగా ఒక గూడ్స్ రైలు వస్తోంది. దానిని ఢీకొన్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నేపధ్యంలో స్టేషన్లో ఉన్న ప్రయాణికుల్లోనూ ఆందోళన నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హిందుస్తాన్ జింక్ విభజనకు కేంద్రం నో...
న్యూఢిల్లీ: ప్రమోటర్ గ్రూప్.. వేదాంతా ప్రతిపాదిత హిందుస్తాన్ జింక్ కంపెనీ విభజనకు గనుల శాఖ నో చెప్పింది. హిందుస్తాన్ జింక్‌ను రెండు విభిన్న సంస్థలుగా విడదీసేందుకు వేదాంతా గ్రూప్ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు మైన్స్ సెక్రటరీ వీఎల్ కాంతారావు తాజాగా వెల్లడించారు. వాటాదారుగా కంపెనీ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదని తెలియజేశారు. వెరసి విభజన ప్రతిపాదనను అంగీకరించలేదని స్పష్టం చేశారు. కంపెనీలో ప్రభుత్వం 29.54 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను పెంచుకునే బాటలో జింక్, సిల్వర్‌సహా బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు హిందుస్తాన్ జింక్ ఇంతక్రితం ప్రతిపాదించింది. కాగా.. బిజినెస్‌ల విభజనకు సలహాదారు సంస్థను నియమించుకునే యోచనలో ఉన్నట్లు గతంలో హిందుస్తాన్ జింక్ ప్రకటించింది. కంపెనీ విలువను మెరుగుపరచేందుకు కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్‌లను రెండు చట్టబద్ధ కంపెనీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ఇంతక్రితం నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. -
ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనకు సంబంధించి ఎట్టకేలకు పీటముడి వీడింది. ఏపీ భవన్ విభజన అంశం పరిష్కారం అయ్యిందని తాజాగా హోం శాఖ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షన్- జీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 11.536 ఎకరాలు కేటాయించారు. ఏపీకి 5.781 ఎకరాలు ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయింపుకు సంబంధించిన కేంద్రం ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణకు 8.245ఎకరాలు కేటాయించారు. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలను కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ-ఇక్కడ క్లిక్ చేయండి -
మార్కుల డివిజన్ ప్రకటించం
సాక్షి, న్యూఢిల్లీ: 10, 12 తరగతుల మార్కుల ఫలితాల్లో ఇకపై డివిజన్, డిస్టింక్షన్‌ను ప్రకటించబోమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పేర్కొంది. మెరిట్ లిస్టును ప్రకటించే విధానానికి గతంలోనే స్వస్తి చెప్పిన బోర్డు తాజాగా డివిజన్, డిస్టింక్షన్‌పై నిర్ణయాన్ని వెలువరించింది. ఈమేరకు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం వంటివి బోర్డు ఇకపై చేయదని స్పష్టం చేశారు. ఉన్నత చదువులకు మార్కుల శాతం అవసరమనిపిస్తే సదరు సంస్థ వాటిని గణించుకోవచ్చని వివరించింది. ఒకవేళ విద్యార్థి అయిదుకు మించి సబ్జెక్టులను ఎంచుకున్నట్లయితే..వాటిలో అయిదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సంబంధిత ఉన్నత విద్యా సంస్థ లేదా యజమాని నిర్ణయం తీసుకోవచ్చని భరద్వాజ్ తెలిపారు. 10, 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలవుతాయని తెలిపారు. -
భవిష్యత్తు విభజనలపై మార్గదర్శకాలకే పరిమితం
సాక్షి, న్యూఢిల్లీ: భవిష్యత్తులో రాష్ట్రాల విభజనకు సంబంధించి మార్గదర్శకాలు మాత్రమే ఇవ్వగలమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పరమైన అంశాల్లో తాము ఎందు కు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. ఏపీ విభజనకు సంబంధించి దాఖలైన పిటిషన్లలో రాజ్యాంగ పరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని పేర్కొంది. ఒకట్రెండు అంశాలు రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణలో ఉన్నాయని గుర్తుచేసిన ధర్మాసనం.. ఆ అంశాలు ముందుగా తేలాల్సి ఉందని వ్యాఖ్యానించింది. విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తయిందని, పిటిషన్లకు సంబంధించి ఇంకేం మనుగడలో ఉందని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి దాఖలైన 26 పిటిషన్లను జస్టిస్ ఎస్.రవీంద్రభట్, జస్టిస్ అరవిందకుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. తెలంగాణకు చెందిన పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపడం సరికాదని, విభజన హామీలు అమలు చేయాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుల తరఫు సీనియర్ న్యాయవాది నిరూప్‌రెడ్డి, న్యాయవాది శ్రావణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 1953, 1956ల్లో జరిగిన విభజన శాస్త్రీయంగా జరిగిందని, కానీ 2014లో జరిగిన ఏపీ విభజన అశాస్త్రీయంగా జరిగిందని చెప్పారు. అనంతరం మరో పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదనలు వినిపించారు. నిబంధనలు పాటించకుండానే విభజన: పార్లమెంటులో తగిన నిబంధనలు పాటించకుండానే విభజన ప్రక్రియ పూర్తి చేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ఆర్టికల్ 100 ప్రకారం విభజన జరగలేదని, దీని ప్రకారం ప్రొసిడ్యూర్ ఫాలో కాలేదని, హెడ్ కౌంట్ చేయలేదని, వోటింగ్ పెట్టలేదని, కనీసం సభ్యులు ఎస్ లేదా నో చెప్పలేదని తెలిపారు. ఎంపీ అయినా తనను బయటకు పంపారని, విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందనడానికి తానే ప్రత్యక్ష సాక్షినని అరుణ్‌కుమార్ తెలిపారు. అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని పార్లమెంటు పరిగణించాలా లేదా అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ మేరకు రాష్ట్రపతికి పంపిన విజ్ఞప్తిపై ఎలాంటి నిర్ణయం లేదన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకోని రాజకీయ పరమైన అంశంలో తాము ఎందుకు జోక్యం చేసుకోవాలంటూ ప్రశ్నించింది. కాగా తొలుత దాఖలు చేసిన పిటిషన్లో తమ అభ్యర్థన మార్చుకున్నామని అరుణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి కేంద్రం సాయం అవసరముందన్నారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉన్న ఆయా అంశాలు తేలిన తర్వాతే తాము నిర్ణయం తీసుకోగలమని పిటిషనర్లకు ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
చిన్న మార్పు.. ఆ రైల్వేకు అధిక ఆదాయం తెచ్చిపెడుతోంది..
సెంట్రల్ రైల్వే పరిధిలోని ఓ రైల్వే డివిజన్ చేసిన మార్పు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. వివిధ మార్గాల్లో ఆదాయ పెంపుపై దృష్టి పెట్టిన సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్ తమ పరిధిలోని ప్రకటన హోర్డింగ్‌లను డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చడం ప్రారంభించింది. మొత్తం ఏడు హోర్డింగ్‌లను ఎల్ఈడీ డిస్ప్లే, డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చింది. దీంతో వార్షిక లైసెన్సు ఫీజులు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చిన ఈ హోర్డింగ్‌ల ద్వారా సంవత్సరానికి రూ.1.53 కోట్ల అదనపు ఆదాయం ముంబై రైల్వే డివిజన్‌కు వచ్చింది. కుర్లా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ తూర్పు వైపు, సియోన్ ఆర్ఓబీ (రెండు బోర్డులు), కంజుర్మార్గ్ రోడ్ ఆర్ఓబీ, తిలక్ నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్, సుమన్ నగర్ ఆర్యూబీ గాంట్రీ సైట్ సీ, థానే-కోప్రి ఆర్ఓబీ వద్ద ఈ డిజిటల్ ప్రకటన బోర్డులు ఉన్నాయి. ప్రకటనదారులు సాధారణ లైసెన్స్ రుసుము కంటే 1.5 రెట్లు అధికంగా చెల్లించి ఇప్పటికే ఉన్న స్టాటిక్ హోర్డింగ్‌లను ఆకర్షణీయమైన డిజిటల్ డిస్ప్లే బోర్డులుగా మార్చుకోవచ్చు. కాగా మరో నాలుగు హోర్డింగ్‌లను డిజిటల్ బిల్బోర్డ్లుగా మార్చే ప్రక్రియలో ముంబై రైల్వే డివిజన్ ఉంది. -
ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కేంద్ర రాష్ట్రాల విభాగం జాయింట్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, రావత్, హిమాన్షు కౌశిక్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. ఏపీ భవన్ విభజనపై అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా తొమ్మిదేళ్లుగా ఒకే బిల్డింగ్‌లో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఏపీ భవన్‌ను విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు పంచుకున్నాయి. తాత్కాలికంగా 58 : 42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది. చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. అయితే ఢిల్లీ ఇండియా గేట్ పక్కన 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఏపీ భవన్.. ఏడు వేల కోట్ల రూపాయల ఉమ్మడి ఆస్తి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ 20 ఎకరాల్లో ఏపీ వాటాగా 58 శాతం అంటే 11 ఎకరాలకు పైగా దక్కుతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించట్లేదు. అయితే నేటీ సమావేశంలో ఏం తేలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చదవండి: Video: కర్ణాటక ఎన్నికలు.. హోటల్లో దోసెలు వేసిన ప్రియాంక -
ఢిల్లీ: నేడు ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ సమావేశం
సాక్షి, ఢిల్లీ: నేడు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం జరుగనుంది. బుధవారం సాయంత్రం సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ విభజనపై మూడు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. అయితే, తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్దతిలో గదుల విభజన, నిర్వహణ జరుగుతోంది. కాగా, ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యానథ్ దాస్, రావత్, ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానుండగా.. తెలంగాణ సర్కార్ తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరవనున్నారు. ఇక, ఏపీ భవన్ విభజనపై తొమ్మిదేళ్లుగా సమావేశాలు జరుగుతూనే ఉన్నా కొలిక్కి రాకపోవడం గమనార్హం. -
అమెజాన్ నుంచి 100 మంది అవుట్!
అమెజాన్ లేఆఫ్స్‌లో భాగంగా తాజాగా 100 మందిని తొలగించింది. వీడియో, గేమ్ విభాగాలలో పని చేస్తున్న సుమారు 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, కంపెనీ శాన్ డియాగో స్టూడియోలో పనిచేస్తున్న సిబ్బంది ఇందులో ఉన్నారు. ఈ మేరకు కంపెనీ గేమ్స్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ హార్ట్మన్ ఏప్రిల్ 4న ఉద్యోగులకు మెమోలు పంపించారు. (ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్‌పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) ట్విచ్ స్ట్రీమింగ్ సర్వీస్‌లో భాగంగా ఉన్న క్రౌన్ చానెల్ ఎంటర్టెయిన్మెంట్ షో సహా గేమింగ్ విభాగంలో మానవ వనరుల నిర్వహణకు అమెజాన్ కంపెనీ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ట్విచ్ ఇటీవల 400 మంది ఉద్యోగులను తొలగించింది. 2012లో ఈ డివిజన్ ప్రారంభించినప్పటి నుంచి పలు సార్లు అమ్మకానికి ఉంచినా విక్రయించకుండా అలాగే కొనసాగిస్తూ వస్తోంది. అమెజాన్ ఇప్పటి వరకూ అభివృద్ధి చేసింది కేవలం ఒకే ఒక్క గేమ్. అది కూడా 2021 సెప్టెంబర్ లాంచ్ తర్వాత దాని ప్లేయర్ బేస్ బాగా క్షీణించింది. (విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు) తొలగింపులు ఉన్నప్పటికీ, శాన్ డియాగో స్టూడియోలో ప్రకటించని ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు గేమ్ ప్రీ ప్రొడక్షన్ దశలో రెట్టింపు అవుతారని హార్ట్మన్ చెప్పారు. అలాగే మాంట్రియల్‌లోని అమెజాన్ స్టూడియోలో కూడా ఓ ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా ఆన్లైన్ రోల్-ప్లేయింగ్ గేమ్ లాస్ట్ ఆర్క్ను ప్రచురించడం ద్వారా అమెజాన్ విజయాన్ని సాధించింది. థర్డ్ పార్టీ పబ్లిషింగ్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నట్లు హార్ట్మన్ పేర్కొన్నారు. NCSoft Corpతో ఇటీవలి ఒప్పందం కూడా అందులో భాగమేనని చెప్పారు. -
రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తాం : మంత్రి బొత్స సత్యనారాయణ
-
నంద్యాల డివిజన్ అటవీ శాఖ స్థాయి పెంపు
కొత్త జిల్లాలవారీగా అటవీ శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చే నల్లమల అటవీ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు జిల్లా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో 1.90 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులతో వెలసిన నల్లమలో పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులు, దుప్పులు, కర్తెలు, అడవి కుక్కలు, ఇతర వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వాటిని అనుక్షణం కాపాడేందుకు అటవీ ప్రాంతం చుట్టూ పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆళ్లగడ్డ: బ్రిటీష్ కాలం నుంచి కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లుగా ఉండేవి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నంద్యాల జిల్లా అటవీ శాఖగా ప్రభుత్వం గుర్తించింది. ఇంతవరకు ఉన్న నంద్యాల డివిజన్ కార్యాలయాన్ని జిల్లా అటవీ కార్యాలయంగా మార్చారు. కర్నూలు డివిజన్ పరిధిలోని డోన్ అటవీ రేంజ్‌ను నంద్యాల జిల్లా పరిధిలో కలిపారు. కొత్తగా రెండు రేంజ్‌లు ఇప్పటి వరకు నంద్యాల పరిధిలో రుద్రవరం, చలిమ, నంద్యాల, బండిఆత్మకూరు, ఆత్మకూరు రేంజ్‌లు ఉండగా కర్నూలు డివిజన్ నుంచి డోన్ రేంజ్‌ను నంద్యాల జిల్లాలో చేర్చడంతో మొత్తం ఆరు రేంజ్‌లు అయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం పాణ్యం, బనగానపల్లె సెక్షన్లను అటవీ రేంజ్‌లుగా స్థాయి పెంచారు. దీంతో ఇప్పుడు జిల్లా పరిధిలో రేంజ్‌ల సంఖ్య 8 పెరిగింది. ఒకే పరిపాలన కిందకు టెరిటోరియల్, లాగింగ్ గతంలో టెరిటోరియల్ ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్ డివిజన్లు విడివిడిగా ఉండేవి. కొత్త డివిజన్లు చిన్నవి కావడంతో ఈ రెండింటిని కలిపి ఒకటిగా చేశారు. దీంతో రుద్రవరం, గాజులపల్లె, పచ్చర్ల లాగింగ్ డివిజన్లు రద్దయ్యాయి. డివిజన్ల పరిధి, కలప తగ్గడంతో వీటిని మూసివేశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దానికి పరిహారంగా అడవిని పెంచడానికి ఏర్పాటైన టీజీపీ డివిజన్‌ను కూడా రద్దు చేశారు. వైల్డ్‌లైఫ్ విభాగాలు ప్రత్యేకం వన్యప్రాణి విభాగం (వైల్డ్ లైఫ్) డివిజన్లను గతంలో మాదిరిగా ప్రత్యేకంగా ఉంచారు. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్డ్ పరిధిలోని కర్నూలు, ఆత్మకూరు, గిద్దలూరు, డివిజన్లను అలాగే ఉంచారు. వీటికి టెరిటోరియల్, వైల్డ్ లైఫ్ పరిధి రెండూ ఉంటాయి. నల్లమలలో 73 పెద్ద పులులు దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టులో 73 పెద్ద పులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2018లో 47, 2020లో 63 ఉన్న పులుల సంఖ్య ప్రస్తుతానికి 73కు పెరగడానికి అటవీ శాఖ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలే కారణం. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో గడ్డి పొదలు ఏర్పడి దుప్పులు, జింకలు పెరిగాయి. దీంతో పులులకు సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నల్లమల అటవీ 300 చిరుతలు, 400 ఎలుగుబంట్లు, వేల సంఖ్యలో జింకలు, దుప్పులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. పెరిగిన సిబ్బంది నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో సిబ్బంది సంఖ్య పెరిగింది. జిల్లా పరిధిలో కొత్తగా 9 సెక్షన్లు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు సెక్షన్ల సంఖ్య 25 పెరిగింది. 45 బేస్ క్యాంపులు ఉన్నాయి. 25 మంది సెక్షన్ అధికారులతో పాటు ఒక్కో బేస్ క్యాంపులో ఐదుగురు చొప్పున మొత్తం 225 మంది సిబ్బంది ఉన్నారు. పులులు, వన్యప్రాణుల సంఖ్య పెరగడంతో మరో 100 మందిని నియమించనున్నారు. పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి ఒకవైపు వన్యప్రాణులను, మరో వైపు విలువైన అటవీ సంపదను వేటగాళ్ల బారినుంచి కాపాడేందుకు పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. పెద్ద పులులు, చిరుతల సంరక్షణకు సుశిక్షితులైన సిబ్బందిని తయారు చేసేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందు కోసం సబ్ డీఎఫ్ఓ, రేంజర్, డీఆర్వో, బీట్ అఫీసర్ తదితర స్థాయిలో ఉన్న సుమారు 50 మంది అధికారులకు, సిబ్బందికి షార్ట్ వెపన్లు అయిన ఫిస్టల్, రివాల్వర్లు అందించనున్నారు. త్వరలో వీరికి తిరుపతి పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో గన్ షూటింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వీరిని పెద్దపులు, చిరుతలు సంచరించే బేస్‌క్యాంపుల్లో నియమించనున్నారు. పర్యవేక్షణ సులభం జిల్లా కేంద్రంలో నూతనంగా జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఏర్పాటు కావడంతో పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ భూముల అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షణ పెరుగుతుంది. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. – వినీత్‌కుమార్, జిల్లా అటవీ అధికారి అడవులతోనే సమృద్ధిగా వర్షాలు అడవులు విస్తారంగా పెరిగితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో మూడేళ్లుగా అడవులు విస్తారంగా పెరిగాయి. అందులో వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. – విశ్వనాథరెడ్డి, ఓబులంపల్లె అటవీ సంరక్షణ అందరి బాధ్యత అడవుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. అన్నిరకాల వృక్షాలు, వన్యప్రాణులు ఉంటేనే అడవులు అంతరించి పోకుండా ఉంటాయి. అడవులు అంతరించిపోకుండా ఉంటేనే పర్యావరణ సాధ్యమవుతుంది. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. – బోరు రమణ, చాగలమర్రి -
బెంగాల్ విభజన ఆపేందుకు... రక్తం కూడా చిందిస్తా: మమత
ఆలీపుర్ద్వార్: పశ్చిమ బెంగాల్‌ను ముక్కలు చేసి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలన్న రాష్ట్ర బీజేపీ నేతల డిమాండ్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుమ్మెత్తిపోశారు. ‘‘ఒకసారి ప్రత్యేక గూర్ఖాలాండ్ అంటారు. మరోసారి నార్త్ బెంగాల్ కావాలంటారు. రాష్ట్రాన్ని ముక్కలు కాన్విను. అవసరమైతే అందుకోసం నా రక్తం చిందిస్తా. నా గుండెపై తుపాకీ ఎక్కుపెట్టినా ఈ నిర్ణయం మారదు’’ అని ఆలీపుర్ద్వార్లో మంగళవారం ఓ సభలో మమత అన్నారు. చదవండి: (దక్షిణాఫ్రికాను అతలాకుతలం చేసిన... గుప్తా బ్రదర్స్ చిక్కారు) -
బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించం
హస్తినాపురం: డివిజన్లోని కాలనీల ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించేది లేదని కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని నందనవనం కాలనీలో పారిశుద్ధ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కార్పొరేటర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డివిజన్లోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా అధికారులు తరచూ పరిశీలించాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ గణేశ్, జవాన్ శంకర్, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి , మల్లేశ్‌గౌడ్ , రాజుగౌడ్, మారం శ్రీధర్ పాల్గొన్నారు. -
మురుగునీటి పైప్‌లైన్ పనులు ప్రారంభం
ఆల్విన్‌కాలనీ: ఆల్విన్‌కాలనీ డివిజన్ సాయినగర్ ఈస్ట్, ఖాజా నగర్లలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన మురుగునీటి పైప్‌లైన్ పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాందీ, ఆల్విన్‌కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు, శ్రీనివాస్ గౌడ్, జీఎం ప్రభాకర్‌రావు, డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్లు ప్రియాంక, ఝాన్సీ, వర్క్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, నాయకులు సమ్మారెడ్డి, జిల్లా గణేశ్, రాజేష్ చంద్ర, కాశీనాథ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
నల్లకుంట: నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో అన్ని డివిజన్లలోని బస్తీలు, కాలనీలకు సమాన ప్రాధాన్యతది ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులతో అన్ని డివిజన్ల పరిధిలోనూ నూతన సీవరేజీ, డ్రైనేజీ పైప్‌లతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. బుధవారం నల్లకుంట డివిజన్ యాక్సిస్ బ్యాంక్ లేన్‌లో రూ.6 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ అమృతతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయా ప్రాంతాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సువర్ణ, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్, టీఆర్ఎస్ నాయకులు నరేందర్, భాస్కర్ గౌడ్, ప్రవీణ్, సాయికిరణ్, బీజేపీ నాయకులు శ్యామ్‌రాజ్, లక్ష్మణ్‌కుమార్, సుధాకర్ పాల్గొన్నారు. రోడ్ల సమగ్రాభివృద్ధికి కృషి.. అంబర్‌పేట: నియోజకవర్గంలో రోడ్ల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. బుధవారం బాగ్‌అంబర్‌పేట డివిజన్ శ్రీనివాసకాలనీలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిరి్మంచనున్న సీసీ రోడ్లను స్థానిక కార్పొరేటర్ బీ.పద్మావెంకట్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లను సైతం ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ గద్వాల జిల్లా ఇన్చార్జ్ బీ.వెంకట్‌రెడ్డి, స్థానిక బీజేపీ, టీఆర్ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. -
ఆస్తుల విభజనకు తీసుకున్న చర్యలేమిటి?: విజయసాయిరెడ్డి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూలు 9,10 కింద జాబితాలో పేర్కొన్న సంస్థలు, జాబితాలో లేని సంస్థల మొత్తం ఆస్తుల విలువ 1,42,601 కోట్ల రూపాయలు. చట్టబద్దంగా జరగాల్సిన ఈ ఆస్తుల విభజన ఇప్పటి వరకు జరగనందున దాని దుష్ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై పడింది. ఆస్తుల విభజన ప్రక్రియను వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ను ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూలు కింద పేర్కొన్న సంస్థల విభజనకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 90 ఆస్తులను రెండు రాష్ట్రాల మధ్య విభజించాలని కమిటీ సిఫార్సు చేసిందని చెప్పారు. ఈ ఆస్తులలో 68 సంస్థల విభజనకు తెలంగాణ ఎలాంటి అభ్యతరం తెలపలేదు. ఆంధ్రప్రదేశ్ 68గాను కేవలం 33 సంస్థల విభజనకు మాత్రమే అంగీకరించింది. పెండింగ్‌లో ఉన్న అన్ని ఆస్తుల విభజనకు సమగ్రమైన పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా కేసుల వారీగా మాత్రమే పరిష్కరించాలని తెలంగాణ కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి: (మనకు తెలిసిన పెద్ద నోటు 2,000.. మరి ప్రపంచంలో పెద్ద నోటేంటో తెలుసా..?) విభజన చట్టంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న 112 శిక్షణా సంస్థల విభజనకు సెక్షన్ 75 కింద ఎలాంటి విధివిధానాలను నిర్దేశించనందున సమస్య ఏర్పడినట్లు మంత్రి చెప్పారు. ఈ సంస్థలను జనాభా ప్రాతిపదికన విభజించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా భౌగోళిక విభజన ప్రాతిపదికన చేపట్టాలని తెలంగాణ కోరుతున్నట్లు నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. ఉభయ రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలను సామరస్యంగా పరిష్కరించడానికి వీలుగా హోం మంత్రిత్వ శాఖ పలుదఫాలుగా సూచనలను జారీ చేస్తోంది. అయితే ఉభయ రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం, ఆమోదం కుదిరినప్పుడు మాత్రమే ఆస్తుల విభజనపై నిర్ణయం తీసుకోవడం సాధ్యపడుతుందని మంత్రి చెప్పారు. -
ఓల్డ్ సిటీకి పోటీగా గజ్వేల్, సిద్దిపేట.. ఏ విషయంలో అంటే?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చౌర్యం, బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థత వెరసి విద్యుత్ శాఖను తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి. పలు డివిజన్లలో ఇలాంటి కారణాలతో సంస్థకు కోట్ల రూపాయలు లోటు వస్తోంది. వీటిలో ఇప్పటిదాకా ఓల్డ్ సిటీ ముందుండగా.. దీనికి పోటీగా గజ్వేల్, సిద్ది పేట కూడా ఉండటం గమనార్హం. దక్షిణ తెలంగాణ లోని 5 ఉమ్మడి జిల్లాల పరి ధిలో అత్యధిక విద్యుత్ నష్టాలు చార్మినార్, గజ్వేల్, ఆస్మాన్‌గఢ్, సిద్దిపేట డివిజన్లలో నమోదయ్యాయి. చార్మినార్ డివిజన్లో 35.73%, గజ్వేల్‌లో 35.5%, ఆస్మాన్‌గఢ్‌లో 35. 01%, సిద్దిపేటలో 32.31% సాంకేతిక, వాణిజ్య (ఏటీఅండ్‌సీ లాసెస్) నష్టాలు జరిగినట్టు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్వ హించిన తొలి త్రైమాసిక ఎనర్జీ ఆడిట్లో బహిర్గత మైంది. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ సం స్కరణల అమల్లో భాగంగా సంస్థ ఎనర్జీ ఆడిట్‌కు శ్రీకారం చుట్టింది. 2021 జూలై 1–సెప్టెంబర్ 30 మధ్య కాలానికి సంబంధించిన ఎనర్జీ ఆడిట్ నిర్వహించి గురువారం నివేదికను ప్రకటించింది. ఈ 3 నెలల్లో సంస్థ ఏటీఅండ్‌సీ నష్టాలు 10.63% ఉండ డం గమనార్హం. సాంకేతిక లోపాలతో జరిగే విద్యు త్ నష్టాలు, విద్యుత్ చౌర్యం, బిల్లింగ్ లోపాలతో జరిగే నష్టాలు, విద్యుత్ బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థతతో జరిగే నష్టాల మొత్తాన్ని సాంకేతిక పరిభాషలో ‘అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ (ఏటీఅండ్‌సీ) లాసెస్’అంటారు. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 20 సర్కిళ్లు, 50 డివిజన్లు, 1,01,32,163 మంది వినియోగదారులు ఉన్నారు. అధిక ఏటీఅండ్ సీ నష్టాలు ఇక్కడే... ► చార్మినార్ డివిజన్‌కు 198.78 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్ సరఫరా చేయగా, వినియోగదారుల మీటర్ల నుంచి తీసిన లెక్కల ప్రకా రం 122.7ఎంయూల అమ్మకాలే జరిగాయి. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల రూపంలో 76.04(38%) ఎంయూల విద్యుత్ నష్టమైంది. అయితే, ఈ జోన్ పరిధిలో మీటర్డ్ సేల్స్‌కి జారీ చేసిన బిల్లులకు 104% వసూళ్లు జరిగాయి. గృహాల నుంచి 107.47% కలెక్షన్ ఉంది. ► గజ్వేల్ డివిజన్‌కు 399.44 ఎంయూల విద్యుత్ సరఫరా కాగా, 201.9 ఎంయూలు మీటర్డ్ సేల్స్, 171.72 ఎంయూలు అన్‌మీటర్డ్ సేల్స్(మీటర్ లేని వ్యవసాయ పంప్ సెట్లకు) జరిగా యి. సాంకేతికంగా 25.7 శాతం నష్టాలు నమోద య్యాయి. మొండిబకాయిలతో ఏటీఅండ్‌సీ నష్టాలు 35.5 శాతానికి పెరిగాయి. గృహాలు 102.19%, రైతులు 64.54%, ఎల్టీ కమర్షియల్/ ఇండస్ట్రీలు 105.68%, హెచ్‌టీ కమర్షియల్/ఇండస్ట్రీలు 90.27% బిల్లులు చెల్లించగా, ఇతరులు మాత్రం 38.01 శాతమే బిల్లులు చెల్లించారు. ► దక్షిణ హైదరాబాద్ సర్కిల్ పరిధిలోని ఆస్మాన్‌గఢ్ డివిజన్‌కు 176.5 ఎంయూల విద్యుత్ సరఫరా చేయగా, 107.26 ఎంయూలకే బిల్లింగ్ జరిగింది. అంటే 69.55 ఎంయూ (39%)ల విద్యుత్ నష్టపోయింది. ఏటీఅండ్‌సీ నష్టాలు 35.01% ఉన్నాయి. ► బేగంబజార్ డివిజన్‌కు 120.95 ఎంయూల విద్యుత్ సరఫరా చేయగా, 42.05 (35శాతం) ఎంయూల నష్టం వాటిల్లింది. 78.91 ఎంయూలకు మాత్రమే బిల్లింగ్ జరిగింది. ఈ డివిజన్ పరిధిలో ఏటీఅండ్‌సీ నష్టాలు 34.01శాతం. ► సిద్దిపేట డివిజన్‌కు 341.27 ఎంయూలను సరఫరా చేస్తే మీటర్డ్ రీడింగ్ ద్వారా 158.4, అన్మీటర్డ్గా 157.55 ఎంయూలు కలిపి మొత్తం 316 ఎంయూలకు బిల్లింగ్ జరిగింది. 25.12 (7శాతం) ఎంయూలు నష్టపోయాయి. మొండి బకాయిల వల్ల 32.31 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలున్నాయి. -
బడుగులకు బాసట
రాష్ట్ర ప్రభుత్వం బడుగులకు బాసటగా నిలిచింది. వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. సంక్షేమ ఫలాలు అందరికీ చేరేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ను విభజించింది.ఎస్సీలో మెజారిటీ సామాజిక వర్గాలైన మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు చేయనుంది. దీనిపై ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఇకపై మూడు కార్పొరేషన్లు కానుంది. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ప్రజాసంకల్పయాత్రలో వై ఎస్ జగన్మోహన్రెడ్డి తమ ప్రభుత్వం అధి కారంలోకి వస్తే మాల, మాదిగలతో పాటు రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో లక్షలాది మందికి ప్రయోజనం.. జిల్లాలో షెడ్యూల్డ్ కులాల్లో 46 ఉపకులాలు న్నాయి. అందులో మాదిగ, మాల, రెల్లి, పైడి, ఆది ఆంధ్ర వారు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు) సుమారుగా 3,29,486 మంది వరకు ఉన్నారు. ఇందులో 1,62,873 పురుషులు, 1,66,613 మహిళలు న్నారు. వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు.. 25 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీస్ పోరాటం చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేశారటూ ఎస్సీ మాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం రాష్ట్రంలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేసి అమలు చేశారు. అయితే ఆ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో మళ్లీ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పథకాలు అన్ని వర్గాలకు అమలు చేస్తున్నారు. అయినా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని ఎమ్మార్పీఎస్‌లో ఓ వర్గం నేటికీ పోరాటం చేస్తూనే ఉంది. దీంతో ఎస్సీల్లో ఉన్న మాల, మాదిగల మధ్య అంతరం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మాల, మాదిగల మధ్య సఖ్యత పెంపొందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ కార్పొరేషన్‌ను మూడుగా విభజిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ల ద్వారా ఎస్సీలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు చర్యలు చేపడుతోంది. కార్పొరేషన్ విభజనపై హర్షం.. ఎస్సీల ఆర్థికాభివృద్ధికోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1974లో ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్‌ను ఆయా ఉపకులాలను విభజించాలనే డిమాండ్ ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు విస్మరించాయి. ప్రజా సంకల్పయాత్రలో జగన్మోహన్రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ విభజించాలని తామంతా విన్నవించాం. ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. రాష్ట్రంలో 59 ఉపకులాలకు నేరుగా ఆర్థిక ఫలాలు అందే విధంగా ఎస్సీ కార్పొరేషన్‌ను విభజించడం గొప్పవిషయం. మాట తప్పకుండా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న దళితులమంతా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. – బోని శివరామకృష్ణ. దళితనేత సీఎం జగనన్నకు రుణపడి ఉంటాం గతంలో ఎన్నో ప్రభుత్వాలు మాటివ్వడమే గాని హామీ నెరవేర్చిన పాపాన పోలేదు. కేవలం రాజకీయ లబ్ధికోసం మమ్మల్ని వాడుకున్నారే తప్పా ఎవరూ న్యాయం చేయలేదు. ప్రజాసంకల్పయాత్రలో విన్నవించుకున్నాం. జగనన్న ఇచ్చిన హామీ మేరకు మూడు కార్పొరేషన్లు గా విభజించి సాధ్యం కాదన్నది సుసాధ్యం చేశారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడే ఏపీ సీఎం జగనన్నకి తామంతా రుణపడి ఉంటాం. – వీజే అజయ్‌కుమార్, దళితనేత విభజనతో సంక్షేమఫలాలు కార్పొరేషన్ విభజనతో సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతా యి. జిల్లాలో దళితులం ఎక్కువగా ఉన్నా మాకు ఏ ప్రభుత్వం న్యా యం చేయలేదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయం జరిగింది. మళ్లీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే మా అభివృద్ధి జరుగుతుంది. కార్పొరేషన్ విభజనతో ఎక్కువ మందికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. – పాకా సత్యనారాయణ -
హైకోర్టు విషయంలో పబ్లిగ్గా చంద్రబాబు అబద్దాలు
-
ఎందుకీ ఆక్రోశం!
-
అక్కడ ఆందోళనలు.. ఇక్కడ సంబరాలు
-
అపోలో హాస్పిటల్స్ నుంచి అపోలో ఫార్మసీ విభజన
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్... తన ఫార్మసీ (ఔషధ విక్రయ శాలలు) రిటైల్ వ్యాపారాన్ని అపోలో ఫార్మసీస్ లిమిటెడ్ (ఏపీఎల్) పేరుతో వేరు చేయాలని నిర్ణయించింది. అపోలో మెడికల్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు ఏపీఎల్ పూర్తి అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. అపోలో మెడికల్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్‌కు 25.5 శాతం వాటా ఉంటుంది. అలాగే, జీలమ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్–1కు 19.9 శాతం, హేమెంద్ర కొఠారికి 9.9 శాతం వాటా, ఇనామ్ సెక్యూరిటీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు 44.7 శాతం చొప్పున వాటాలు ఉంటాయి. ఆరోగ్య సేవలు, ఫార్మసీ వ్యాపారాలకు సంబంధించి దీర్ఘకాలిక విధానాన్ని సమీక్షించిన అనంతరం బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. స్పష్టమైన విధానంతో పనిచేసేందుకు వీలుగా ఈ వ్యాపారాన్ని ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేయడానికి ఇది సరైన సమయమని భావించినట్టు తెలిపింది. రూ.10,000 కోట్ల ఆదాయ లక్ష్యం ఐదేళ్లలో 5,000 ఔషధ దుకాణాలు, రూ.10,000 కోట్ల ఆదాయం లక్ష్యంతో ఫార్మసీ విభాగం పనిచేయనున్నట్టు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఈ నిర్ణయంతో డిజిటల్ కామర్స్‌లోకి ప్రవేశించేందుకు వీలు కలుగుతుందని, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఏదన్నది నిర్ణయించుకునే సౌకర్యం వినియోగదారులకు లభిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 400 పట్టణాల్లో అపోలో ఫార్మసీకి 3,167 దుకాణాలు ఉన్నాయి. కంపెనీ వ్యాపారాల పునర్వ్యవస్థీకరణ అనంతరం.. ఏపీఎల్‌కు అపోలో హాస్పిటల్స్ ఔషధ సరఫరాదారుగా ఉంటుంది. తాజా నిర్ణయం అపోలో హాస్పిటల్స్ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపించదని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని తెలిపారు. -
హైకోర్టు ఉద్యోగుల విభజన షురూ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనలో అత్యంత కీలకమైన ఉద్యోగుల విభజన ప్రక్రియ షురూ అయ్యింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను హైకోర్టు గురువారం విడుదల చేసింది. గతవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) అధ్యక్షతన జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల ఫుల్‌కోర్ట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు మార్గదర్శకాల రూపకల్పన జరిగింది. మార్గదర్శకాలతోపాటు ఆప్షన్ ఫాంలను హైకోర్టు వర్గాలు ఉద్యోగులందరికీ పంపాయి. ఈ ఫాంలను ఈ నెల 15లోపు నింపి సీల్డ్ కవర్లో అందజేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల నుంచి అందుకున్న ఈ సీల్ట్ కవర్లను ఆయా సెక్షన్ల అధికారులు 15వ తేదీ సాయంత్రం 5లోపు సీజే కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ వెల్లడించారు. కేటాయింపులు ఇలా..: కేటాయింపుల్లో సీనియారిటీకి ప్రాధాన్యతనిస్తారు. తెలంగాణ హైకోర్టు లేదా ఏపీ హైకోర్టు రెండింటిలో దేనిని ఎంచుకోని ఉద్యోగులను.. వారి సర్వీసు రికార్డుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం కేటాయిస్తారు. ఈ విషయంలో సీజే తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తారు. ఆఫీస్ సబార్డినేట్స్, దఫేదార్స్, జమేదార్స్, రికార్డ్ అసిస్టెంట్స్, బైండర్స్, బుక్ బేరర్స్, లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లు, కాపీయర్ మెషీన్ ఆపరేటర్లు, అసిస్టెంట్ ఓవర్ సీర్ తదితరులను వారి ఆప్షన్ల మేర కేటాయించడం జరుగుతుంది. ఉద్యోగులు ఎంపిక చేసుకున్న హైకోర్టులో ఖాళీల కంటే ఉద్యోగులు ఎక్కువగా ఉంటే, ఆ ఖాళీల్లో భర్తీ చేయగా మిగిలిన ఉద్యోగులను ఇతర హైకోర్టులో లేదా కింది కోర్టుల్లో డిప్యుటేషన్‌పై నియమిస్తారు. భవిష్యత్‌లో హైకోర్టులో ఖాళీ అయ్యే పోస్టుల్లో వారిని నియమిస్తారు. భార్యాభర్తలిద్దరూ హైకోర్టు ఉద్యోగులైతే వారిద్దరినీ వారు ఎంచుకున్న హైకోర్టుకు కేటాయిస్తారు. హైకోర్టులో పనిచేస్తున్న ఉద్యోగి భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయి ఉంటే, అతను లేదా ఆమె ఏ రాష్ట్ర పరిధిలో పనిచేస్తుంటే ఆ ఉద్యోగిని ఆ హైకోర్టుకు కేటాయించడం జరుగుతుంది. వితంతువులైన మహిళా ఉద్యోగులను వారు ఎంపిక చేసుకున్న హైకోర్టుకు కేటాయిస్తారు. 60 శాతానికి మించి వైకల్యంతో బాధపడే ఉద్యోగులను వారి ఆప్షన్ మేర కేటాయిస్తారు. ఉద్యోగి లేదా భార్య లేదా పిల్లలు తీవ్ర అనారోగ్యంతో ఉంటే ఆ ఉద్యోగులను వారి ఆప్షన్ మేర కేటా యిస్తారు. ఈ మార్గదర్శకాలు జారీ అయ్యే నాటికి పదవీ విరమణకు రెండేళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులు వారు ఎంపిక చేసుకున్న హైకోర్టుకు కేటాయింపు చేస్తారు. ఒక హైకోర్టులో ఖాళీలు ఉండి, మరో హైకోర్టులో మిగులు ఉద్యోగులుంటే వారిని ఏదోక హైకోర్టుకు సీజే విచక్షణాధికారంతో కేటాయిస్తారు. ఈ మార్గదర్శకాలతో సంబంధం లేకుండా సీజే కేటాయింపులపై నిర్ణయం తీసుకోవచ్చు. -
మార్చి నాటికి గెయిల్ విభజన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన గ్యాస్ మార్కెటింగ్, పంపిణీ దిగ్గజం గెయిల్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికల్లా రెండు కంపెనీలుగా విభజించాలని కేంద్రం యోచిస్తోంది. గ్యాస్ మార్కెటింగ్ విభాగాన్ని ఒక కంపెనీగాను, పైప్లైన్ల నిర్వహణ విభాగాన్ని మరో సంస్థగాను ఏర్పాటు చేయనుంది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ బోర్డు (పీఎన్జీఆర్బీ) చైర్మన్ డీకే సరాఫ్ ఈ విషయం తెలిపారు. విభజన ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సరాఫ్ పేర్కొన్నారు. గెయిల్ ఇప్పటికే గ్యాస్ పైప్‌లైన్, మార్కెటింగ్ వ్యాపార విభాగాలకు సంబంధించిన ఖాతాలు వేర్వేరుగానే నిర్వహిస్తున్న నేపథ్యంలో విభజన ప్రక్రియ సులభతరంగానే ఉండగలదని ఆయన తెలిపారు. 1984లో ఓఎన్జీసీ నుంచి గ్యాస్ వ్యాపార కార్యకలాపాలను విడగొట్టి గెయిల్ ఏర్పాటు చేశారు. గ్యాస్ వినియోగాన్ని పెంచేందుకే: మరిన్ని ద్రవీకృత సహజ వాయువు టెర్మినల్స్ నిర్మించేందుకు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అవసరమయ్యే భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. అలాగే గ్యాస్ వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి గెయిల్ కార్యకలాపాల విభజన తోడ్పడగలదని భావిస్తోంది. ప్రస్తుతం చాలా మటుకు విద్యుత్ ప్లాంట్లు, సెరామిక్.. గ్లాస్ తదితర చిన్న పరిశ్రమలు ఖరీదైన, కాలుష్యకారకమైన నాఫ్తా, డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, భవిష్యత్‌లో వీటిని గ్యాస్ వైపు మళ్లించేందుకు, గెయిల్‌తో సంబంధం లేకుండా నేరుగా గ్యాస్‌ను కొనుగోలు చేసుకునేందుకు తాజా విభజన తోడ్పడగలదని కేంద్రం భావిస్తోంది. -
నేటి నుంచి డివిజన్ కేంద్రాల్లో ‘మీ కోసం’
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా వినతులు స్వీకరించే మీ కోసం(ప్రజాదర్బార్) కార్యక్రమం నేటి నుంచి డివిజన్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెలలో మొదటి సోమవారం నంద్యాలలో నిర్వహిస్తున్నారు. వచ్చే సోమవారం ఆదోని, ఆ తర్వాతి సోమవారం కర్నూలు ఆర్డీఓ కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో పాటు అన్ని శాఖల అధికారులు సోమవారం నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించే మీ కోసం కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అన్ని రకాల సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. 1 గంట నుంచి 2 వరకు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ నిర్వహిస్తారు. 3 నుంచి 6 గంటల వరకు అక్కడే మీ కోసం కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై డివిజన్ స్థాయి సదస్సు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం నిమిత్తం జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ డివిజన్ కేంద్రాల మీ కోసం కార్యక్రమ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. -
ఇరిగేషన్ కార్యాలయాల తరలింపును సహించేది లేదు
రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమే ఇరిగేషన్ కార్యాలయాల స్థలాల కబ్జాకే తరలింపు డ్రామా వైఎస్సార్ సీపీ కేంద్ర సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్షి ్మ ధవళేశ్వరం: ఇరిగేషన్ కార్యాలయాలను ధవళేశ్వరం నుంచి తరలించాలని చూస్తే సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్షి ్మ స్పష్టం చేశారు. ఆమె గురువారం వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజుతో కలిసి ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ బి.రాంబాబును కలిశారు. ఇరిగేషన్ డివిజన్ కార్యాలయాలు ఇక్కడ ఉండటం వల్ల కలిగే లాభాలను, వాస్తవ పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలపాలని జక్కంపూడి విజయలక్షి ్మ ఎస్ఈ రాంబాబును కోరారు. ఒక ప్రక్క ఉద్యోగులకు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని జీవోపై పూర్తి సమీక్ష వరకు తరలించబోమని హామి ఇచ్చినప్పటికీ తరలింపులో అధికారుల అత్యుత్సాహం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాల స్థలాలను కబ్జా చేసేందుకే 29 ఏళ్ళ క్రితం వచ్చిన జీఓను తెరమీదకు తీసుకువచ్చారని ఆమె ఆరోపించారు. ఒక పక్క ఈస్ట్రన్ డివిజన్‌కు ధవళేశ్వరంలో కార్యాలయం కడుతుండగా తరలింపు ప్రక్రియ ఏమిటని ప్రశ్నించారు.సెంట్రల్ డివిజన్ కార్యాలయ మరమ్మతులకు కూడా నిధులు విడుదల కాగా అమలాపురంలో అద్దె భవనంలోకి మార్చాలని ప్రయత్నించడం ఏమిటని ఎస్ఈని ప్రశ్నించారు. సెంట్రల్ డివిజన్లో ఉన్న మైనర్ ఇరిగేషన్ కార్యాలయాలను పెద్దాపురం డివిజన్లో కలిపేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. రైతులు,ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసే విధంగా కార్యాలయాలను తరలించాలని చూస్తే వేలాది మంది రైతులతో ఇరిగేషన్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. రైతుల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు అయినా తాను సిద్ధమేనని జక్కంపూడి విజయలక్ష్మీ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ కనీసం ఉద్యోగులకు కూడా తెలియకుండా కార్యాలయాల తరలింపునకు ప్రయత్నించారంటే అధికారుల అత్యుత్సాహం తెలుస్తోందన్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళకు తలొగ్గకుండా రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు సాధనాల చంద్రశేఖర్ (శివ), వైఎస్సార్ సీపీ నాయకులు పెన్నాడ జయప్రసాద్, గరగ శ్రీనివాసరావు, ముద్దాల అను, ఆకుల రాజా, షట్టర్ బాషా, మిరప రమేష్, గపూర్, ముత్యాల జాన్ తదితరులు పాల్గొన్నారు. -
సెంట్రల్ డివిజన్ కార్యాలయ తరలింపునకు బ్రేక్
–రైతులు ,ఉద్యోగుల పక్షాన పోరాడిన వైఎస్సార్ సీపీ –జీవోపై సమీక్ష అనంతరం నిర్ణయం ధవళేశ్వరం: సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరం నుంచి అమలాపురానికి తరలించే ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ శాఖా మంత్రి నుంచి మౌఖిక అదేశాలు అందినట్లు సమాచారం. కాటన్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ వందేళ్ళ పైబడి చరిత్ర కలిగిన సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి తరలిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. సోమ, మంగళవారాలు ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాలను బంద్ చేయించి కార్యాలయ తరలింపుతో వచ్చే నష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. సెంట్రల్ డివిజన్ కార్యాలయం అమలాపురం తరలిస్తే మైనర్ ఇరిగేషన్ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడతారని, ఉద్యోగులు పీఏవో, సీఈఎస్ఈ కార్యాలయాలకు తరచూ ధవళేశ్వరం రావాల్సి ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. వందేళ్ళ పైబడి ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాలను ప్రజాప్రతినిధుల మెప్పు కోసం ఏకపక్షంగా మారిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులు, ఉద్యోగుల పక్షాన నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ, రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు, బంద్ నిర్వహించారు. తరలింపు ప్రక్రియ నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. –ఇరిగేషన్ మంత్రిని కలిసిన ఎన్జీవో నాయకులు సెంట్రల్ డివిజన్ కార్యాలయ తరలింపు ప్రతిపాదనను విరమించాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ఆధ్వర్యంలో ఎన్జీవో నాయకులు ఇరిగేషన్ శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిశారు. కార్యాలయ తరలింపు వల్ల కలిగే నష్టాలను మంత్రికి వివరించారు. 1988 జీవోపై పూర్తిగా సమీక్షించిన అనంతరం కార్యాలయాన్ని మార్పుపై నిర్ణయం తీసుకుందామని అప్పటివరకు సెంట్రల్ డివిజన్ కార్యాలయం తరలింపు ప్రతిపాదనను నిలిపివేయాలని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులకు అదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో త్వరలో అప్పటి జీవోలో పేర్కొన్న వాటిపై సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అదేశించినట్లు తెలుస్తోంది. -
ధవళేశ్వరం టు అమలాపురం..
ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయం మార్పు ఉద్యోగులకు మాట మాత్రంగానైనా చెప్పని వైనం జిల్లాకు చెందిన ఓ మంత్రే కారణం? ఆందోళనకు సిద్ధమవుతున్న ఇరిగేషన్ ఉద్యోగులు అడిగే వాడికి చెప్పే అవసరం లేదన్నట్టుగా మొండిగా వ్యవహరించే ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటుందనడానికి ఇదో ఉదాహరణ. ఉమ్మడి రాజధానిపై పదేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు హడావుడిగా అమరావతిలో తాత్కాలికంగా నిర్మించిన కొత్త రాజధానికి ఉద్యోగులను బలవంతంగా తీసుకువచ్చారు. హడావుడి తరలింపుపై ఎంతమంది వారించినా ప్రభుత్వం ససేమిరా అంది. ఇది అసరాగా తీసుకుని...ఇప్పుడు ధవళేశ్వరంలోని ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి అమలాపురానికి ఉన్నఫళంగా మార్పుకు శ్రీకారం చుట్టింది. ఆ కార్యాలయ ఉద్యోగులకు ఈ మార్పు విషయాన్ని మాట మాత్రంగా చెప్పకపోవడం.. ప్రభుత్వ మొండి వైఖరి నిదర్శనం. ఇప్పుడు ఉద్యోగులు ఉద్యమ బాట పడతానంటున్నారు. ఇదీ ఆ కథా కమామిషు.. ధవళేశ్వరం (రాజమహేంద్రవరం రూరల్) : జిల్లాకు చెందిన ఓ మంత్రి మెప్పు కోసం వందేళ్ల పైబడి చరిత్ర కలిగిన ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మార్చేశారు. కార్యాలయ సిబ్బందికి కూడా చెప్పకుండానే గురువారం కార్యాలయ ప్రారంభ తంతును ముగించారు. మంత్రి మెప్పు కోసమే ఇరిగేషన్ ఉన్నతాధికారి కాటన్ దొర ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని ఇరిగేషన్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం మార్పుపై మైనర్ ఇరిగేషన్ రైతాంగంలోనూ ఆందోళన నెలకొంది. సెంట్రల్ డెల్టాతో పాటు మైనర్ ఇరిగేషన్ విభాగం కూడా సెంట్రల్ డివిజన్ కార్యాలయం పరిధిలోనే ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందే ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మారిస్తే మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బందులు తప్పవు. రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ధవళేశ్వరం వచ్చేవారు. ఈ కార్యాలయాన్ని అమలాపురం మారిస్తే వంద కిలోమీటర్లు వెళ్లాల్సిందే. సెంట్రల్ డివిజన్ పరిధిలో చాగల్నాడు ఎత్తిపోతల పథకం ,తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్, వెంకటనగరం పంపింగ్ స్కీమ్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్,పిఆర్ ట్యాంక్స్ ఉన్నాయి. కాటన్ దొర ఆశయానికి తూట్లు ఉభయగోదావరి జిల్లాలను ధాన్యాగారంగా మార్చిన అపర భగీరథుడు కాటన్ దొర ఆశయానికి పాలకులు తూట్లు పొడుస్తున్నారు. వందేళ్ళ క్రితం ధవళేశ్వరంలో సెంట్రల్ డివిజన్, ఈస్ట్రన్ డివిజన్, హెడ్‌వర్క్స్ డివిజన్లను అప్పట్లో ఏర్పాటు చేశారు. ధవళేశ్వరం సెంట్రల్ డివిజన్ కార్యాలయానికి సంబంధించి అమలాపురం, పి.గన్నవరం, రాజమహేంద్రవరంలోని సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయంతో పాటు మరికొన్ని కార్యాలయాల మార్పుకు 1988లో అప్పటి ప్రభుత్వం జీఓ జారీ చేసింది. అయితో న్యాయపోరాటంతో అప్పట్లో అందుకు బ్రేక్ పడింది. మంత్రి మెప్పు కోసమే! జిల్లాకు చెందిన మంత్రి మెప్పు కోసమే హడావుడిగా ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి మారుస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ఇరిగేషన్ ఉన్నతాధికారి భారీ స్కెచ్‌తో అమలాపురానికి కార్యాలయాన్ని మారుస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు కార్యాలయ మార్పుపై ఎటువంటి సమాచారం తెలీయకుండా జాగ్రత్త పడ్డారు. డివిజన్ కార్యాలయానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించేది ఒక్క ఈఈ మాత్రమేనని, అమలాపురం, పి.గన్నవరంలో సబ్‌డివిజన్ కార్యాలయ అధికారులే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారని, ఇప్పుడు ఏకంగా డివిజన్ కార్యాలయాన్నే అక్కడికు మార్చడంలో మర్మం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు కనీసం ముందుగా తెలియజేయకుండా హడావుడిగా సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురం తరలించడానికి గురువారం ప్రారంభోత్సవం చేయడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇరిగేషన్ ఉన్నతాధికారి వైఖరిపై వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విషయాన్ని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర స్థాయి నాయకుల సూచనల మేరకు అన్ని సంఘాలను కలుపుకొని ప్రత్యక్ష పోరాటానికి దిగేందుకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. సొంతం వద్దు.. అద్దె ముద్దు.. ధవళేశ్వరంలో సొంత భవనంలో ఉన్న సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని అమలాపురంలో అద్దె భవనంలోకి మార్చేందుకు అధికారులు మక్కువ చూపడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కనీసం అక్కడ పూర్తి స్థాయి సొంత భవనం కూడా లేకపోయినప్పటికీ హడావుడిగా వారం రోజుల్లో కార్యాలయం అమలాపురానికి వెళ్లిపోవాలని సూచిస్తున్న ఇరిగేషన్ ఉన్నతాధికారి అత్యుత్సాహంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆందోళన చేపడతాం.. మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి ఇబ్బంది చేకూర్చే విధంగా డివిజన్ కార్యాలయాన్ని అమలాపురానికి తరలిస్తే సహించేది లేదని వైఎస్సార్ సీసీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ అన్నారు. అమలాపురంలో సబ్ డివిజన్ కార్యాలయం ఉన్నప్పటికీ ఏకపక్షంగా ఈ కార్యాలయాన్ని తరలించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే కార్యాలయ తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అటు సెంట్రల్ డెల్టా రైతాంగానికి ఇటు మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి అందుబాటులో ఉండే ధవళేశ్వరంలోనే కార్యాలయాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులనే అమలు చేశా.. సెంట్రల్ డివిజన్ కార్యాలయం తరలింపు వ్యవహరంలో ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేశామని ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఇ రాంబాబు స్పష్టంచేశారు. ఈ ప్రతిపాదన గతంలో ఉన్నదేనని ఇందులో ఎవరి ఒత్తిడి లేదన్నారు. -
రేషన్ కార్డుల విభజన పూర్తి
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో రేషన్ కార్డుల విభజన ప్రక్రియను పౌర సరఫరాల శాఖ పూర్తి చేసింది. ఇందుకు అనుగుణంగా డిసెంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులను కేటారుుస్తూ నిర్ణయం చేసింది. 28 జిల్లాల కు రేషన్ కేటారుుంపుల ఉత్తర్వులను శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ విడుదల చేశారు. 28 జిల్లాలకు గానూ 69.73 లక్షల కార్డులకు 1,40,538 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 69 లక్షల 54వేల చక్కెర ప్యాకెట్లను, 69,72,029 ఉప్పు ప్యాకెట్లను డిసెంబర్ నెలకు కేటారుుంచారు. జిల్లాల పునర్విభజనకు ముందు 10 జిల్లాలో 85 లక్షల రేషన్ కార్డులున్నాయని, ఈ కార్డులను 31 జిల్లాలకు అనుగుణంగా విభజించామన్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 5,77,391 కార్డులుండగా, అతి తక్కువగా ఆసిఫాబాద్‌లో 1,37,585 రేషన్ కార్డులున్నారుు. నిత్యావసర సరుకుల పంపిణీలో జాప్యం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులకు సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. -
హామీలు మరిచిన సీఎంకు బుద్ధి చెబుదాం
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు - సింహా గర్జన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కర్నూలు సీక్యాంప్: ఎస్సీ వర్గీకరణకు హామీ విస్మరించిన సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు మాదిగలు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారపేటలోని సమితి కార్యాలయంలో ఆదివారం సింహగర్జన మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా వర్గీకరణ అంశం ఊసెత్తడం లేదన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఉషామెహ్రా కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ నెల 29న కర్నూలులో నిర్వహించే సింహా గర్జనకు సంబంధించిన మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాత్రిసుబ్బయ్యమాదిగ, రాష్ట్ర కార్యదర్శి దాదాపోగునవీన్, ఎమ్ఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ భానుప్రకాష్, జిల్లా అధ్యక్షుడు అరిగిలి రవి, కర్నూలు సిటీ అధ్యక్షుడు రాచపోగుల రవి తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి డివిజన్ల వారీగా ఉల్లి కొనుగోళ్లు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి విక్రయించే రైతులకు గరిష్టంగా క్వింటాకు రూ.300 మద్దతు ఇస్తుండటంతో మార్కెట్‌కు ఉల్లి పోటెత్తకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి రెవెన్యూ డివిజన్ల వారీగా రైతులు మార్కెట్‌కు ఉల్లిని తీసుకొచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో కర్నూలు రెవెన్యూ డివిజన్ రైతులు మాత్రమే మార్కెట్‌కు ఉల్లి తీసుకురాల్సి ఉంది. ఆదోని డివిజన్ రైతులు మంగళ, గురువారాల్లో.. నంద్యాల డివిజన్ రైతులు శనివారం మాత్రమే మార్కెట్‌కు దిగుబడులు తీసుకరావాలని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. -
మానవీయ కోణంలో
నిజామాబాద్ నాగారం: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగుల విభజన సందర్భంగా వారి మనోభావాలు దెబ్బ తీయకుండా విభజన చేపట్టాలని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ కోరారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3,434 పోస్టులు ఉండగా, 1134 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలని, భర్త ఎక్కడ ఉంటే భార్యకు అదే జిల్లాలో విధులు నిర్వహించేలా చూడాలని కోరారు. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులను ఇదే జిల్లాలో కొనసాగించేలా చూడాలని కోరారు. కొత్త జిల్లాలో ఉద్యోగులందరికీ 20శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలన్నారు. జిల్లాలో టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించున్నట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లాకు వెళ్లబోయే ఉద్యోగులకు త్వరలోనే ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. స.హ. చట్టం పేరుతో కొందరు ఉద్యోగులను అనవసరంగా బెదిరిస్తున్నారని, ఇలాంటివి సహించేది లేదన్నారు. ఉద్యోగులు అందరు బంగారు తెలంగాణ కోసం పనిచేస్తున్నారని అన్నారు. టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి సతీష్‌రెడ్డి, నేతలు దయానంద్, అమృత్‌కుమార్, నరేందర్, సుధాకర్, నరహరి తదితరులు పాల్గొన్నారు. -
అశాస్త్రీయంగా పునర్విభజన
హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనను అశాస్త్రీయంగా చేపడుతూ ప్రతిపక్షాలను పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో 5 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన ఆయన కొద్దిసేపు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల కోరికలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని హోదాలో హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీనాయకులు అజీజ్‌పాషా, గల్లావెంకటేశ్వర్లు, చింతి ర్యాలనాగయ్య, కస్తాల శ్రావణ్, రెడపంగ పెదవెంకటే శ్వర్లు, నందిగామ ముక్కంటి, ఇట్టిమళ్ల బెంజిమన్, దాసరి నరేందర్, దాసరి పున్నయ్య, మట్టయ్య, మందా వెంకటేశ్వర్లు, కస్తాల ముత్తయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అశాస్త్రీయంగా పునర్విభజన
హుజూర్నగర్ : తెలంగాణ ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనను అశాస్త్రీయంగా చేపడుతూ ప్రతిపక్షాలను పట్టించుకోవడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో 5 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించిన ఆయన కొద్దిసేపు దీక్ష శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలు, ప్రతిపక్షాల కోరికలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రతిపక్ష నాయకుని హోదాలో హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీనాయకులు అజీజ్‌పాషా, గల్లావెంకటేశ్వర్లు, చింతి ర్యాలనాగయ్య, కస్తాల శ్రావణ్, రెడపంగ పెదవెంకటే శ్వర్లు, నందిగామ ముక్కంటి, ఇట్టిమళ్ల బెంజిమన్, దాసరి నరేందర్, దాసరి పున్నయ్య, మట్టయ్య, మందా వెంకటేశ్వర్లు, కస్తాల ముత్తయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక
రాజాపేట : భువనగిరిలో జరిగిన డివిజన్‌స్థాయి క్రీడోత్సవాలకు రాజాపేట బాలురు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బూర్గు మహేందర్‌రెడ్డి, పీడీ సుంకి కుమారస్వామిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–17కు ఎం శ్రీనివాస్, అండర్–14 నుంచి ఎం.తరుణ్, సంతోష్, మహీపాల్లు జిల్లాస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల17, 18 తేదీలల్లో మిర్యాలగూడ మండలంలోని ముకుందాపురం ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక
రాజాపేట : భువనగిరిలో జరిగిన డివిజన్‌స్థాయి క్రీడోత్సవాలకు రాజాపేట బాలురు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బూర్గు మహేందర్‌రెడ్డి, పీడీ సుంకి కుమారస్వామిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–17కు ఎం శ్రీనివాస్, అండర్–14 నుంచి ఎం.తరుణ్, సంతోష్, మహీపాల్లు జిల్లాస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల17, 18 తేదీలల్లో మిర్యాలగూడ మండలంలోని ముకుందాపురం ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
త్వరలో కోదాడ పోలీస్ డివిజన్
ఎన్ఎస్పీ క్యాంపులోనే ఏర్పాటుకు నిర్ణయం భవనాలు పరిశీలించిన ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి కోదాడ: కోదాడ పట్టణంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు చేసేందుకు శాఖ పరంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కోదాడలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న భవనాలను డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు కోసం పరిశీలించారు. క్యాంపులో ఉన్న పాత ఎమ్మార్వో కార్యాలయంలో ప్రస్తుతం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నడుస్తోంది. ఈ భవనాన్ని ఆయన పరిశీలించారు. ఇందులో ఆర్డీఓ కార్యాలయాల ఏర్పాటుకు రెవిన్యూ అధికారులు ప్రతిపాధనలు సిద్ధం చేశారని తెలియడంతో ఇదే క్యాంపు ఆవరణలో రూరల్ పోలీస్ స్టేషన్‌కు పక్కన ఉన్న మరో భవనాన్ని పరిశీలించారు. ఈ భవనం విశాలంగా ఉండడమే కాకుండా, పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఉండడంతో పాటు సమీపంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఉండడంతో అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. భవనాల పరిశీలన పూర్తయిందని, దీనిపై కలెక్టర్‌కు నివేదిక ఇస్తామని అనుమతులు రాగానే కార్యాలయం ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలో కొత్తగా మునగాల, తుంగతుర్తిలలో కొత్త సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట ఓఎస్డీ వెంకటేశ్వర్లు, సూర్యాపేట డీఎస్పీ సునీతామోహన్, కోదాడ రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి, పట్టణ ఎస్ఐ సురేష్‌కుమార్ పాల్గొన్నారు. -
ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దు
నిజామాబాద్ నాగారం: జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులంతా పగలూరాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటే, కొంత మంది అధికారులు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై మంగళవారం టీఎన్జీవోఎస్ భవన్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆ యన మాట్లాడారు. వ్యవసాయంతో పాటు పలు శాఖల్లోని కొంత మంది అధికారులు ఉద్యోగులను కావాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సస్పెండ్ చేస్తామని బెదరిస్తున్నట్లు తెలిసిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మే రకు సెలవులతో పాటు రాత్రి కూడా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఉద్యోగులకు తాము అండగా ఉన్నామని చెప్పారు. తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోవాలి జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులు వేరే జిల్లాకు వేళ్లేందుకు తాత్కలికంగా ఆర్డర్లు తీసుకోవాలని కిషన్ సూచించారు. అక్కడ సరిపడా సిబ్బందిని నియమించిన తర్వాత మళ్లీ ఉద్యోగుల అభీష్టం మేరకు ఆయా జిల్లాల్లో విధులు నిర్వహించేలా చూస్తామన్నారు. నూతన జిల్లాలో ఏర్పడే కార్యాలయాల్లో ఉద్యోగులకు కావాల్సిన అన్ని మౌలిýS సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా నరేందర్ టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా ఎమ్బీ నరేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం నియామకపత్రం అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నగరంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆయనను ఘనంగా సత్కరించారు. ఆయన పుట్టిన రోజు కూడా కావడంతో కేక్ కేట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, రాష్ట్ర కార్యదర్శి నరేందర్, ఉపాధ్యక్షులు అమృత్‌కుమార్, నరహరి, సుధాకర్, నగర అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, సత్యనారాయణ, జగదీష్ పాల్గొన్నారు. -
ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దు
నిజామాబాద్ నాగారం: జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులంతా పగలూరాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటే, కొంత మంది అధికారులు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై మంగళవారం టీఎన్జీవోఎస్ భవన్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆ యన మాట్లాడారు. వ్యవసాయంతో పాటు పలు శాఖల్లోని కొంత మంది అధికారులు ఉద్యోగులను కావాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సస్పెండ్ చేస్తామని బెదరిస్తున్నట్లు తెలిసిందన్నారు. కలెక్టర్ ఆదేశాల మే రకు సెలవులతో పాటు రాత్రి కూడా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఉద్యోగులకు తాము అండగా ఉన్నామని చెప్పారు. తాత్కాలికంగా ఆర్డర్లు తీసుకోవాలి జిల్లాల విభజన నేపథ్యంలో ఉద్యోగులు వేరే జిల్లాకు వేళ్లేందుకు తాత్కలికంగా ఆర్డర్లు తీసుకోవాలని కిషన్ సూచించారు. అక్కడ సరిపడా సిబ్బందిని నియమించిన తర్వాత మళ్లీ ఉద్యోగుల అభీష్టం మేరకు ఆయా జిల్లాల్లో విధులు నిర్వహించేలా చూస్తామన్నారు. నూతన జిల్లాలో ఏర్పడే కార్యాలయాల్లో ఉద్యోగులకు కావాల్సిన అన్ని మౌలిýS సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా నరేందర్ టీఎన్జీవోస్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా ఎమ్బీ నరేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం నియామకపత్రం అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నగరంలోని టీఎన్జీవోస్ భవన్లో ఆయనను ఘనంగా సత్కరించారు. ఆయన పుట్టిన రోజు కూడా కావడంతో కేక్ కేట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, రాష్ట్ర కార్యదర్శి నరేందర్, ఉపాధ్యక్షులు అమృత్‌కుమార్, నరహరి, సుధాకర్, నగర అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, సత్యనారాయణ, జగదీష్ పాల్గొన్నారు. -
కాటారం డివిజన్ సాధన ఉద్యమం ఉధృతం
ప్రధాన రహదారిపై వంటావార్పుతో నిరసన కాటారం: కాటారం రెవెన్యూ డివిజన్ సాధనకోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, ఉద్యోగులు, కులసంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఎనిమిది రోజులుగా మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద నిర్వహిస్తున్న రిలేదీక్షలో భాగంగా సోమవారం మండల మున్నూరు కాపు సంఘం నాయకులు కూర్చున్నారు. ప్రధాన కూడలి వద్ద ప్రధాన రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. అఖిలపక్షం నాయకులు రోడ్డుపై వంటలుచేసి భోజనం చేశారు. అఖిలపక్షం సాధన కమిటీ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి మాట్లాడుతూ కాటారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ నాలుగు మండలాలపై ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు ఏర్పాటుచేస్తున్న ప్రభుత్వం కాటారం డివిజన్ ఏర్పాటుచేయాలని డిమాండ్‌చేశారు. దీనికోసం ఎమ్మెల్యే ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. డివిజన్ ఏర్పాటుకోసం ఎమ్మెల్యే తమతో కలిసిరావాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ అధికార ప్రతినిధి పుల్లూరి రాజేశ్వరరావు, వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ పంతకాని సమ్మయ్య, ముకాస నాయకులు దబ్బెట రాజేశ్, కొట్టె ప్రభాకర్, కొట్టె శంకరయ్య, పసుల శంకర్, చీమల రాజు, చీమల సందీప్, కొట్టె శ్రీశైలం, బెల్లంకొండ రామన్న, కొట్టె శ్రీహరి, కొట్టె బాపు, జాగర్ల అశోక్, సర్పంచ్ కాల్వ రాజయ్య పాల్గొన్నారు. -
అన్ని ఫైళ్ల జిరాక్స్ అవసరం లేదు...
హన్మకొండ అర్బన్ : జిల్లాల విభజన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లోని అన్ని రకాల ఫైళ్లు జిరాక్స్ తీయాల్సిన అవసరం లేదని.. ముఖ్యమైన ఒకటి, రెండు రకాల ఫైళ్లు మాత్రం చేస్తే సరిపోతుందని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో దశాబ్దాల కాలం నాటి ఫైళ్లతో కుస్తీ పడుతు న్న ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది. జిల్లా విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రతి శాఖలోని మొత్త ఫైళ్లు నాలుగు సెట్లు జిరాక్స్ తీసి కొత్తగా ఏర్పాడ బోయే జిల్లాలకు పంపించాలని గతంలో ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం అన్ని రకాల ఫైళ్లు వద్దు, ము ఖ్యమైన ఫైళ్లు మాత్రమే అనడంతో దాదాపు 80శాతం పనిభారం తగ్గినట్లు అధికారులు చెపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం కోర్టు కేసులకు సంబంధించినవి, స్టాక్ వివరాలకు సంబంధించి మొ త్తం రెండు కేగిరీల ఫైళ్లు మాత్రమే జిరాక్స్ తీయడంతో పాటు స్కాన్ చేయాలి. వీటితో పాటు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ‘ముఖ్యమైనవి’ అనుకున్న ఫైళ్లు కూడా ఈ జాబితాలో చేర్చా రు. అలాగే, జిరాక్స్ తీసిన, తీయని మొత్తం ఫైళ్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇక జిరాక్స్ తీసిన ఫైళ్లు సంబంధిత కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు పంపించి. మిగతా వాటిని ప్రస్తుత జిల్లా కేం ద్రంలోనే భద్రపరచాలి. భవిష్యత్‌లో అవసరముంటే కొత్త జిల్లాల వారు ఇక్కడకు వచ్చి ఆ ఫైళ్లు తీసుకువెళ్తారు. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా కార్యాలయాల్లో ఫైళ్లే దర్శనమివ్వకుండా, పనిభారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయిం తీసుకున్నట్లు సమాచారం. -
ఆచారి దీక్షకు స్పందన
కల్వకుర్తి / కల్వకుర్తి రూరల్ : రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను నెరవేర్చాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలకు స్పందన వచ్చింది. శనివారం కల్వకుర్తి పట్టణం ర్యాలీలు, నినాదాలతో దద్దరిల్లింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుర వీధుల గుండా ర్యాలీలు నిర్వహిస్తూ దీక్ష శిబిరం వద్దకు చేరుకుని మద్దతు ప్రకటించారు. ముస్లిం మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో బైక్‌లు, ఆటోలు, ఇతర వాహనాలతో ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. డ్రై వర్స్ అసోసియేషన్, పద్మశాలీసంఘంతోపాటు భవన నిర్మాణ కార్మికులు సైతం ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పాల్గొన్నారు. దుందుభీ కళాకారుల బందం దీక్ష శిబిరాన్ని ఆటపాటలతో ఉర్రూత లూగించింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. -
హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చాలి
హుజూర్నగర్ : నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఏదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో చేర్చిన కోదాడ రెవెన్యూ డివిజన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. అన్ని అర్హతలున్న హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఎందుకు ఏర్పాటు చేయడం లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. హుజూర్నగర్ పాత తాలుకాగా ఉండటంతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన డివిజనల్ కార్యాలయాలు, రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మోడల్ కోర్టు, మోడల్ సబ్ జైలు, సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయన్నారు. రెవిన్యూ డివిజన్ సాధనే లక్ష్యంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ నాయకులు గల్లా వెంకటేశ్వర్లు, ఎండి.అజీజ్‌పాషా, చింతిర్యాల నాగయ్య, రెడపంగు పెదవెంకటేశ్వర్లు, గొల్లగోపు వెంకటేశ్వర్లు, కస్తాల ముత్తయ్య, కస్తాల శ్రావణ్‌కుమార్, నందిగామ ముక్కంటి, బరిగెల చంద్రశేఖర్, ఎస్కె.అన్వర్‌పాషా, కుంభం శివ, జి. మట్టయ్య పాల్గొన్నారు. -
భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలి
రాజాపేట : రాజాపేట మండలాన్ని భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో వినాయకుడికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగాం డివిజన్లో ఆలేరు, రాజాపేట మండలాలను కలపొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చామకూరు గోపాల్‌గౌడ్, మెండు శ్రీనివాస్‌రెడ్డి, గుంటి కష్ణ, గుర్రాల బాలమల్లు, మర్ల సిద్దిఎల్లయ్య, కోరుకొప్పుల శీరీష, ఉప్పరి లావణ్య, నాయకులు దాచపల్లి శ్రీనివాస్, ఉప్పరి నరేష్, కోరుకొప్పుల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలి
రామన్నపేట రామన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని మాజీ ఎంపీపీ నీల దయాకర్, యూత్‌కాంగ్రెస్ రాష్ట్రప్రధానకార్యదర్శి వనం చంద్రశేఖర్ కోరారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం సంతకాలను సేకరించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఎ. ప్రమోదినికి వినతిపత్రం సమర్పించారు. రామన్నపేట కేంద్రంగా వలిగొండ, చౌట్పుప్పల్, మోత్కూర్,ఆత్మకూరు మండలాలతో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మినుముల వెంకటరామయ్య, కన్నెబోయిన అయిలయ్య, దొమ్మాటి లింగారెడ్డి, వనం సాయిబాబా, బొడ్డు అల్లయ్య, లవనం ఉపేందర్, సురేష్, ఎండీ జాని, మినుముల సందీప్, కుమారస్వామి, రాజశేఖర్, మోహన్, అశోక్ పాల్గొన్నారు. -
ఆలేరును డివిజన్‌గా మార్చాలని రాస్తారోకో
ఆలేరు : పట్టణంలో మూసివేసిన రైల్వేగేట్‌ను తెరిపించాలని, ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ మేరకు శనివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హన్మకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఆందోళనకారులు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైల్వేగేట్‌ను తెరిపించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే విషయం తెలుసుకున్న సీఐ రఘువీర్‌రెడ్డి, పలువురు ఎస్సైలు తమ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్‌రెడ్డి, నీలం పద్మ, కొలుపుల హరినాథ్, కె సాగర్‌రెడ్డి, మంగ నర్సింహులు, జూకంటి ఉప్పలయ్య, ఎక్బాల్, ఎజాజ్, గోద శ్రీరాములు, కావటి సిద్ధిలింగం, తునికి దశరథ, జంపాల శ్రీనివాస్, పసుపునూరి విరేశం, ఐడియా శ్రీనివాస్, రాచకొండ జనార్దన్, చామకూర అమరేందర్‌రెడ్డి, గాదపాక దానయ్య, భీజని మధు, అప్సర్ పాల్గొన్నారు. సీఐతో వాగ్వాదం... రాస్తారోకో సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దిష్టిబొమ్మను దహనం చేసేందుకు అఖిలపక్ష నాయకులు ప్రయత్నించగా వారిని యాదగిరిగుట్ట సీఐ అడ్డుకున్నారు. దీంతో కొందరు నాయకులు రహదారిపైకి దిష్టిబొమ్మను తీసుకువచ్చి దహనం చేస్తుండగా అడ్డుకోబోయారు. ఈ క్రమంలో ఎం.డి సలీం, చెక్క వెంకటేశ్, తునికి దశరథ అనే కార్యకర్తలు కిందపడిపోవడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆందోళనకారులు సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, గాయపడిన నాయకులను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పరామర్శించారు. -
జిల్లాల విభజన శాస్త్రీయంగా ఉండాలి
చిలుకూరు: జిల్లాల విభజన శాస్త్రీయంగా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బేతవోలు లో జరిగిన సీపీఐ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. విధివిధానాలు ఏమీ ప్రకటించకుండా అఖిలపక్ష నాయకులను పిలవడం సమంజసం కాదన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను ఒకే నియోజకవర్గంలో ఉంచాలన్నారు. ఇష్టానుసారంగా విభజన చేశారని విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవంను ప్రభుత్వం అధికారంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట చర్రితను ప్రజలకు తెలియజేసేందుకు సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాలో ఈ నెల 11వ తేదీన యాద్రాది నుంచి ప్రారంభమై ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, చిలుకూరు మీదుగా వెళ్లి హుజూర్‌నగర్‌లో రాత్రి ముగుస్తుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్, నాయకులు మండవ వెంకటేశ్వర్లు, నంద్యాల రామిరెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, తాళ్లూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
డివిజన్ స్థాయి క్రీడలకు విద్యార్థుల ఎంపిక
భువనగిరి అర్బన్ : మండల స్థాయి క్రీడ పోటీల్లో గెలుపొందిన అనంతారం పాఠశాలలోని విద్యార్థులు డివిజన్ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల పీఈటీ మల్లేశం తెలిపారు. శుక్రవారం మండలంలోని అనంతారం గ్రామంలోని పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అండర్–14 వాలీబాల్‌లో బాలికలు ప్ర«థమ, బాలురు ద్వితీయ స్థానాలను కైవసం చేసుకుని డివిజన్ స్థాయి క్రీడాలకు ఎంపికైనట్లు చెప్పారు. అలాగే అండర్–17 బాలుర వాలీబాల్‌లో ఎ.ప్రేమ్‌కుమార్, వి.సుభాష్‌చంద్రబోస్, బాలకల విభాగంలో ఎం.శ్రావణి, కె.పూజిత, వి.ఇందు, జి.లహరి, టి.గౌతమి, అండర్–14 బాలుర విభాగంలో ఎ.తిలక్, బి.మధు, పి.సాయికుమార్, బాలకల విభాగంలో జి.శ్రీలత, శ్రావణి, ఇ.సుస్మిత, పి.రేణుక, కె.మనీషా విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. వీరిని గ్రామ సర్పంచ్ విఠల రాఘురామయ్య, ఎంపీటీసీ శంకరయ్య, ఉప సర్పంచ్ ఒగ్గు శివకుమార్, పాఠశాల హెచ్ఎం జి.విజయ, ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
డివిజన్ సాధనకు ఉద్యమం ఉధృతం
– కల్వకుర్తిలో ఐదో రోజుకు చేరిన రిలేదీక్షలు కల్వకుర్తి రూరల్ : కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు ఆదివారం ఐదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో నాయకులు నర్సింహ, రాంరెడ్డి, రవిగౌడ్, హన్మం™Œ గౌడ్, నవీన్‌రెడ్డి, శ్రీకాంత్ తదితరులు కూర్చున్నారు. వీరికి టీఎన్జీఓ తాలూకా అధ్యక్షుడు బావండ్ల వెంకటేష్, నగర పంచాయతీ వైస్ చైర్మన్ షాహేద్, అఖిలపక్షం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ సాధనకు ఐక్యమత్యంతో చేస్తున్న పోరుకు సమాజంలోని అన్ని వర్గాల కుల సంఘాలు, ఇతరులు మద్దతుగా నిలవడం హర్షణీయమన్నారు. ఈసందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చిన్న, కష్ణ, టీడీపీ నాయకులు పాండుయాదవ్, బీజేపీ నాయకులు రాఘవేందర్, దుర్గాప్రసాద్, గంగాధర్, జగదీష్, కోఆప్షన్ ఖలీల్, బీఎస్పీ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రామన్నపేటను డివిజన్ కేంద్రంగా మార్చాలి
రామన్నపేట పాత అసెంబ్లీ నియోజకవర ్గకేంద్రమైన రామన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మార్చాలని మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. రామన్నపేట మండలం నూతనంగా ఏర్పడే యాదాద్రి జిల్లాలో కలుస్తుందని, జిల్లాకు చివర నుండే రామన్నపేట భవిష్యత్తులో ఇంకా వెనుకబడే అవకాశం ఉందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచనాదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తీర్మానించారు. మునిపంపుల వైద్యాధికారి, సిబ్బంది çసక్రమంగా విధులకు హాజరుకావడం లేదని జెడ్పీటీసీ జినుకల వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతం కావడంవల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని వైద్యాధికారి బదులివ్వడంతో ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి జోక్యంచేసుకొని మండలకేంద్రానికి 7కిలోమీటర్ల దూరంలో ఉన్న మునిపంపుల మారుమూల ప్రాంతం ఎలా అవుతుందని, అలాంటప్పుడు ఉద్యోగాలు మానుకోవాలని తీవ్రంగా స్పందించారు. రెవెన్యూ శాఖ పనితీరును వివరించేందుకు డీటీ జె.ఎల్లేశం వేదికవద్దకు రాగా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూశాఖ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తంచేస్తూ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. కాలువల ఆధునికీకరణకు రూ.350కోట్లు : ఎమ్మెల్యే భువనగిరి డివిజన్లోని నాలుగు సాగునీటి కాలువల ఆధునికీకరణకు రూ.350కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మత్తులు చేయడం జరుగుతుందని చెప్పారు. మూడవవిడత మిషన్కాకతీయపనుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఏరియా ఆసుపత్రిలో విధులపట్ల నిర్లక్ష్యం వహించే డాక్టర్లు, సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో ఎంపీడీఓ కె.జానకిరెడ్డి, వైస్‌ఎంపీపీ బద్దుల ఉమారమేష్, సభ్యులు ఆకవరపు మధుబాబు, పున్న వెంకటేశం, కూరెళ్ల నర్సింహాచారి, చల్లా వెంకట్‌రెడ్డి బండమీది సరిత, ఊట్కూరి శోభ, సాల్వేరు రోజ, బండ పద్మ, మేకల భద్రమ్మ, మంటి సరోజ, వెలిజాల లక్ష్మమ్మలతోపాటు, వివిధగ్రామాల సర్పంచ్‌లు, వివిధశాఖల అధికారులు హాజరయ్యారు. -
చిన్నది కానున్న ‘మిర్యాలగూడ’
– డివిజన్లో నాడు 11 మండలాలు – విభజనలో తొమ్మిది మండలాలతో సరి – మూడు నియోజకవర్గాల పరిధిలోకి మాడ్గులపల్లి మిర్యాలగూడ పట్టణం మిర్యాలగూడ : మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ మరింత చిన్నది కానున్నది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విభజనల అనంతరం మిర్యాలగూడ డివిజన్ చిన్నది కానున్నది. గతంలో 11 మండలాలతో ఉన్న మిర్యాలగూడ డివిజన్ నుంచి నాలుగు మండలాలను ఇతర డివిజన్లో కలుపుతున్నారు. కాగా మరో రెండు కొత్త మండలాలను చేర్చుతున్నారు. గతంలో మిర్యాలగూడ డివిజన్లో మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, హాలియా, పెద్దవూర, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, మఠంపల్లి మండలాలు ఉండేవి. కాగా వీటిలో హుజూర్నగర్, మఠంపల్లి మండలాలను నూతనంగా ఏర్పాటయ్యే కోదాడ డివిజన్లో కలుపుతుండగా నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాన్ని మాత్రం సూర్యాపేట డివిజన్లో కలుపుతున్నారు. ఇదిలా ఉండగా నూతనంగా ఏర్పడనున్న తిరుమలగిరి (సాగర్), మాడ్గులపల్లి మండలాలను మిర్యాలగూడ డివిజన్లో కలపనున్నారు. నాలుగు మండలాలను తొలగించి రెండు మండలాలను కలపడం వల్ల తొమ్మిది మండలాలకు మిర్యాలగూడ డివిజన్ పరిమితం కానున్నది. మూడు నియోజకవర్గాల పరిధిలోకి మాడ్గులపల్లి నూతనంగా ఏర్పడే మాడ్గులపల్లి మండలం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రానున్నది. ప్రస్తుతం మాడ్గులపల్లి గ్రామం తిప్పర్తి మండలంలో ఉండగా పునర్విభజనలో భాగంగా మాడ్గులపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. కానీ నూతనంగా ఏర్పడే మండలంలో తిప్పర్తి, నిడమనూరు, త్రిపురారం, వేములపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలను కలపనున్నారు. దాంతో మూడు నియోజకవర్గాలైన మిర్యాలగూడ, నాగార్జునసాగర్, నల్లగొండకు సంబంధించిన గ్రామాలు ఈ మండలంలో చేరనున్నాయి. నూతనంగా ఏర్పడే మాడ్గులపల్లి మండలంలో వేములపల్లి మండలం నుంచి కోయిలపాడు, ఆగామోత్కూర్, చిరుమర్తి, కుక్కడం, గండ్రవారిగూడెం, తోపుచర్ల, కల్వలపాలెం, నిడమనూరు మండలం నుంచి కన్నెకల్, త్రిపురారం మండలం నుంచి పూసలపాడు, గజలాపురం, పెద్దదేవులపల్లి, నర్లెకంటిగూడెం, అబంగాపురం, త్రిప్పర్తి మండలం నుంచి చెర్వుపల్లి, దాచారం, ఇందుగుల గ్రామాలను కలపనున్నారు. వేములపల్లి మండలం నుంచి మాడ్గులపల్లిలోకి కలిసే గ్రామాలు మిర్యాలగూడ నియోజకవర్గం, త్రిపురారం, నిడమనూరు మండలాల్లోని గ్రామాలు నాగార్జునసాగర్, తిప్పర్తి మండలంలోని గ్రామాలు నల్లగొండ నియోజకవర్గం నుంచి వచ్చి కలవనున్నాయి. -
రాయికల్‌ను జగిత్యాల రెవెన్యూ డివిజన్లో ఉంచాలి
రాయికల్ : రాయికల్ మండలాన్ని జగిత్యాల రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు తురగ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ, దశాబ్ద కాలంగా రాయికల్ జగిత్యాల రెవెన్యూ డివిజన్లో ఉందని మండలంలోని ప్రజలకు వర్తక, వ్యాపారపరంగా జగిత్యాలతో సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా రాయికల్ మండలాన్ని కోరుట్ల రెవెన్యూలో కలపడం సరికాదన్నారు. తహసీల్దార్ చంద్రప్రకాశ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజంగి అశోక్, వెంకటేశ్వర్‌రెడ్డి, వేణు, రాంచంద్రం, ధర్మపురి, రమేశ్, నరేశ్ పాల్గొన్నారు. -
డివిజన్.. డీల్
ఆగస్టు 10న కౌన్సిల్‌కు నిర్ణయం ప్రతీ డివిజన్‌కు రూ.30లక్షల నుంచి రూ.50లక్షలకు పెంపు మూడు నెలలకోసారి రూ.లక్ష అత్యవసర నిధులు పాత పనులకు నో చెప్పిన కార్పొరేటర్లు అధికారులు, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమీక్ష ఖమ్మం : విమర్శలు.. ప్రతి విమర్శలు.. అలక సీన్లు, బుజ్జగింపులు.. నిధులు కేటాయింపుపై పెదవి విరుపు.. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అంతరం.. అంతలోనే అధికారుల తీరుపై రహస్య సమావేశాలు.. స్పందించిన నాయకులు.. కమిషనర్ బదిలీ.. వంటి సంఘటనలతో ముడిపడి ఉన్న ఖమ్మం కార్పొరేషన్ పాలక మండలి సమావేశం ఓ కొలిక్కి వచ్చింది. కార్పొరేటర్లకు అనుకూలంగా తీర్మానాలు ఉండేలా ఆగస్టు 10వ తేదీన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సమాలోచనకు వచ్చినట్లు తెలిసింది. కౌన్సిల్ సమావేశం, ఖమ్మం నగర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తన క్యాంప్ కార్యాలయంలో మేయర్ పాపాలాల్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, విద్యుత్, రెవెన్యూ శాఖలతోపాటు కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షించారు. సమావేశపు తేదీ, నిధుల కేటాయింపు తీర్మానాలు మొదలైన విషయాలపై చర్చించారు. ఆగస్టు 10న కౌన్సిల్ సమావేశం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం తేదీ ఖరారు పలు వివాదాలకు దారి తీసింది. తీర్మానాలపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం.. కమిషనర్‌పై నాయకులకు ఫిర్యాదు చేయడం.. వారు స్పందించి కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డిని పట్టుబట్టి బదిలీ చేయించారనే వార్తలొచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో తిరిగి సమావేశం ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడ్డారు. ఏకపక్ష నిర్ణయం ఎందుకనే ఆలోచనతోపాటు స్థానిక ఎమ్మెల్యేతో సమావేశం విషయం ప్రస్తావించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే బుధవారం సమావేశం ఏర్పాటు చేసి.. అందరు కార్పొరేటర్లతో చర్చించి ఆగస్టు 10న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు, తీర్మానాలపై సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిసింది. కార్పొరేటర్లకు బొనాంజా కార్పొరేటర్లందరినీ మెప్పించే విధంగా ఎమ్మెల్యే సూచనలు చేయడంతో అధికారులు, కార్పొరేటర్ల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలిసింది. గతంలో డివిజన్ అభివృద్ధికి రూ.30లక్షలు, మొత్తం రూ.15కోట్లతో చేపట్టే పనులకు తీర్మానాలు తయారు చేశారు. అయితే రూ.30లక్షలు సరిపోవని కార్పొరేటర్లు కోరగా.. వీటిని రూ. 50లక్షలకు పెంచి మొత్తం రూ.25కోట్ల పనులకు తీర్మానాలు చేసేలా అంగీకరించారు. ఆయా డివిజన్లలో అత్యవసర పనులు చేపట్టేందుకు కార్పొరేటర్వద్ద డబ్బులు ఉండాలని, ప్రతీ మూడు నెలలకోమారు రూ.లక్ష కేటాయించి వాటిని పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా, ఇతర కార్యక్రమాలకు ఉపయోగించేలా అవకాశం కల్పించనున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత కార్పొరేటర్లకు అప్పగించడంతోపాటు డివిజన్‌కు 100 చొప్పున టీగార్డులు కొనుగోలు చేసి ఇవ్వాలనే అంశాన్ని పొందుపరిచారు. కార్పొరేటర్లు వ్యతిరేకించిన రూ.4.5కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చేపట్టిన పనులకు జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించాలనే నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు తెలిసింది. రూ.100కోట్లపై చర్చ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా ప్రతీ కార్పొరేషన్‌కు రూ.100కోట్ల కేటాయింపు జరిగితే వాటిని ఎలా ఖర్చు చేయాలనే అంశంపై చర్చ జరిగింది. ఈ నిధులతో గోళ్లపాడు చానల్ పనులు, నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డు, కొత్తబస్టాండ్ సెంటర్‌తోపాటు కూరగాయల మార్కెట్, గాంధీచౌక్ సెంటర్ సుందరీకరణ, వాటర్ ఫౌంటేన్ ఏర్పాటుతోపాటు గాంధీచౌక్ నుంచి ట్రంక్‌రోడ్డు మీదుగా కాల్వొడ్డు వరకు ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న షాదీఖానా మరమ్మతులు, కొత్త షాదీఖానా, కబేళా నిర్మాణాలు, దంసలాపురం, బల్లేపల్లి ప్రాంతాల్లో కొత్తగా రెండు శ్మశాన వాటికల కోసం స్థలం కేటాయింపునకు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కార్పొరేషన్ పరిధిలో ఉండి..lఆర్అండ్బీ రోడ్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లను ఆర్‌అండ్‌బీకి కేటాయించాలని, వీటికి ఆధునికీకరణ పనులు చేపట్టేలా మంత్రి తుమ్మలను కోరేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చేసిన సూచనలకు కార్పొరేటర్లు, అధికారులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
హైకోర్టు విభజనే పరిష్కారం:కేసీఆర్
-వాస్తవాలను కేంద్రానికి వివరించండి -గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తక్షణమే హైకోర్టు విభజనను చేపట్టేలా వాస్తవాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో హైకోర్టు విభజన వివాదం...న్యాయాధికారుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గవర్నర్‌తో భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం అరగంట సేపు గవర్నర్‌తో సమావేశమయ్యారు. వరుసగా జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు విభజనకు ముందే న్యాయాధికారుల కేటాయింపులు చేయటంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని వివరించారు. తెలంగాణకు 95 మందిని, ఏపీకి 110 మంది న్యాయాధికారులను కేటాయించగా... తెలంగాణకు ఇచ్చిన 95 మంది న్యాయాధికారుల్లో 58 మంది ఏపీకి చెందిన వారే ఉన్నారని వివరించారు. న్యాయాధికారులు, జూనియర్ జడ్జీలు, సీనియర్ జడ్జీలు.. అన్ని కేడర్లలో ఏపీకి చెందిన 143 మందిని తెలంగాణకు కేటాయించినట్లు చెప్పారు. దీంతో భవిష్యత్తులో తెలంగాణకు చెందిన న్యాయాధికారులు తీవ్రంగా నష్టపోతారని.. అందుకే ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరముందని గవర్నర్‌కు నివేదించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు తాను రాసిన లేఖ ప్రతిని, గతంలో హైకోర్టు విభజనను చేపట్టాలని పలుమార్లు కేంద్రానికి రాసిన లేఖలను, ప్రస్తుత వివాదం పూర్వాపరాలపై సిద్ధం చేసిన నివేదికను ఈ సందర్భంగా సీఎం గవర్నర్‌కు సమర్పించారు. హైకోర్టు విభజన చేపడితేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని.. అప్పటివరకు కేటాయింపులను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీకి చెందిన ఎంపీలు మంగళవారం ఢిల్లీలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడను కలిసిన సందర్భంలో ఆయన గవర్నర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో సంప్రదింపులు జరిపితే.. న్యాయ శాఖ మంత్రి మాట్లాడినా వాస్తవాలను వివరించి.. హైకోర్టు విభజనకు సహకరించాలని గవర్నర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. హైకోర్టు వివాదంతో పాటు జంట నగరాల్లో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నడం, అనుమానితులను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంఘటనపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది. -
విభజన, విలీనంపై వినతుల వెల్లువ
♦ గ్రీవెన్స్‌లో మెజార్టీ అర్జీలు ♦ వీటిపైనే వినతులు స్వీకరించిన ♦ జేసీ, అదనపు జేసీ సంగారెడ్డి జోన్ : మండలాల విలీనం, విభజనలపైనే జిల్లా నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. గ్రీవెన్స్-డేను పురస్కరించుకుని ప్రజలు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమ అభిప్రాయాలను వినతిపత్రాల రూపంలో అధికారులకు అందజేశారు. గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు జేసీ వి.వెంకటేశ్వర్లు, డీఆర్ఓ దయానంద్, ఇతర శాఖల అధికారులు స్వీకరించారు. నూతనంగా ప్రకటించనున్న మండల కేంద్రాలకు దగ్గరలోని రెవెన్యూ గ్రామాలను సమీపంలోని ప్రాతిపాదిత మండలాల్లో విలీనం చేయాలని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇతర సమస్యలపైనా వినతులు అందాయి. ⇒ రేగోడ్ మండలాన్ని పూర్తి స్థాయిలో సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ⇒ మెద క్ మండలం బూర్గుపల్లిని మండల కేంద్రం చేయడంతోపాటు కళాశాలను మంజూరు చేయాలని బూర్గుపల్లి, వాడి, రాజిపేట, కొత్తపల్లి తండాల వాసులు జేసీకి వినతి పత్రం సమర్పించారు. ⇒ శివ్వంపేట మండలం నవాబుపేట గ్రామం గుమ్మడిదలకు కేవలం 6 కి.మీ. దూరంలోనే ఉందని, దీన్ని ప్రతిపాదిత గుమ్మడిదలలో విలీనం చేయాలని సర్పంచ్ భిక్షపతి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామసభ నిర్వహించి తీర్మానం చేసిన కాపీని అధికారులకు అందజేశారు. ⇒ హత్నూర మండలం నాగారం పంచాయతీలో గల రొయ్యపల్లి, అవంచగూడ గ్రామాలను 3 కి.మీ. దూరంలో గల జిన్నారం మండలంలో విలీనం చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. ⇒ మునిపల్లి మండలంలో కంకోల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రమేశ్ యాదవ్ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ⇒ అంగవైకల్యంతో బాధ పడుతున్న దళిత వర్గానికి చెందిన తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన డప్పు మల్లమ్మ కోరారు. ⇒ సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట పరిధిలో నిర్మిస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కన గల తమ పట్టా భూముల్లో అధికారిక సమాచారం ఇవ్వకుండా విద్యుత్ స్తంభాలు, రోడ్డు నిర్మించారని, లోతైన గుంతలతో సాగుకు పనికి రాకుండా చేశారని గ్రామస్తులు అంజిరెడ్డి, యాదమ్మ, మల్లారెడ్డి, కిష్టారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. ⇒ అమ్మానాన్నలు మృతి చెందడంతో అనాథలమయ్యాం. తన తమ్ముడు నవీన్‌కు జోగిపేట, సంగారెడ్డిలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశం కల్పించాలని పుల్కల్ మండలం ముదిమాణిక్యంకు చెందిన శ్రావణ్ కోరారు. ⇒ సంగారెడ్డిలోని బొబ్బిలికుంట నుంచి కల్వకుంట పంట పొలాలకు వెళ్లే కాలువ విస్తీర్ణం 33 ఫీట్లు కాగా, ప్రస్తుతం శాంతినగర్, శ్రీ విద్యానికేతన్ పాఠశాల వద్ద పంట కాల్వలను ఆక్రమించుకుని ఇళ్లు, ప్రహరీలు నిర్మించుకున్నారని, వాటిని తొలగించాలని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ⇒ 20 గుంటల భూమిని పక్క పొలానికి చెందిన వారుఆక్రమించుకున్నారని, సాగులోకి వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దౌల్తాబాద్ మండలం చిన్నమసాన్పల్లికి చెందిన నర్సారెడ్డి ఫిర్యాదు చేశారు. ⇒ బోరుబావి, పైప్లైన్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, నష్ట పరిహారం ఇప్పించాలని బాధితుడు దుబ్బాక మండలానికి చెందిన అనంపల్లి రాజు అధికారులను కోరారు. ⇒ ఎకరా 34 గుంటల భూమిని దాయాదులు కబ్జా చేయడమే కాకుండా రికార్డుల్లోనూ మార్పులు జరిగాయని, తనకు న్యాయం చేయాలని మెదక్ మండలం పాతూర్కు చెందిన దొరబోయిన సిద్దప్ప కోరారు. -
ఏ కమిషరేట్ కావాలి?
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ విభజన వేగం పుంజుకుంది. ఇప్పటికే ఈస్ట్, వెస్ట్ కమిషనరేట్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపిన ఉన్నతాధికారులు ఇప్పుడు ఉద్యోగుల పంపకాలపై దృష్టి సారించారు. ఈ మేరకు ఎవరెవరు ఏ కమిషనరేట్లకు వెళతారని రెండు రోజుల నుంచి ఉన్నతాధికారులు సిబ్బంది నుంచి ఆప్షన్లు తీసుకుంటున్నట్లు సమాచారం. స్పెషల్ బ్రాంచ్, మినిస్టీరియల్ స్టాఫ్, సెక్యూరిటీ వింగ్, బాంబు నిర్వీర్య బృందాలు, సెక్యూరిటీ, ఆర్డ్మ్ పోలీసు విభాగాల సిబ్బందిని ఈస్ట్ లేదా వెస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. శాంతిభద్రతల విభాగంలో పని చేస్తున్న వారితో పాటు మిగతా ఫోర్స్ మాత్రం యధావిధిగా ఎక్కడ ఉన్నా వారు అక్కడే విధులు నిర్వర్తించనున్నారు. ఈస్ట్ జోన్లోకి పహాడీషరీఫ్ ఠాణా... ఈస్ట్ కమిషనరేట్లోకి ఎల్బీనగర్ జోన్ మొత్తం రానుండగా, మల్కాజిగిరి జోన్‌లోని అల్వాల్ పోలీసు స్టేషన్ మినహా మిగిలిన ఠాణాలన్నీ చేర్చాలని నిర్ణయించారు. అయితే శంషాబాద్ జోన్‌లోని పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్‌ను ఎల్బీనగర్ జోన్లోకి చేరుస్తూ ఈస్ట్‌లో కలపాలని భావిస్తున్నారు. నల్గొండ జిల్లా నుంచి చౌటుప్పల్, భువనగిరి రూరల్ అండ్ టౌన్, బీబీనగర్, వలిగొండ, పోచంపల్లి, బొమ్మాలరామారం పోలీసు స్టేషన్లు, భువనగిరి ట్రాఫిక్.... చౌటుప్పల్ ట్రాఫిక్ ఠాణాలు కూడా ఈస్ట్‌లో కలుపుతూ చేసిన ప్రతిపాదనను ఇప్పటికే డీజీపీ కార్యాలయంలోని రీ-ఆర్గనైజేషన్ వింగ్ ప్రభుత్వానికి సమర్పించింది. వెస్ట్‌లోకి అల్వాల్ పోలీసు స్టేషన్... వెస్ట్ కమిషనరేట్లోకి శంషాబాద్ జోన్, మాదాపూర్ జోన్, బాలానగర్ జోన్లు రానున్నాయి. అయితే ప్రస్తుతం మల్కాజిగిరి జోన్లో ఉన్న అల్వాల్ ఠాణాను బాలానగర్ జోన్లోకి తీసుకువస్తూ వెస్ట్‌లోనే కలపాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మెదక్ నుంచి ఆర్సీ పురం, రంగారెడ్డి నుంచి శంకరపల్లి, షాబాద్ ఠాణాలు, మహబూబ్‌నగర్ నుంచి షాద్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట్ పోలీసు స్టేషన్లు, షాద్‌నగర్ ట్రాఫిక్ ఠాణాను వెస్ట్ కమిషనరేట్‌లో కలుపుతూ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ విభజనపై ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం... లీగల్, ఫైనాన్స్‌పైనా దృష్టి సారించిందని తెలుస్తోంది. -
తెలంగాణ లాయర్ల ‘ఉద్యమ’ బాట!
చిచ్చు రేపిన న్యాయాధికారుల కేటాయింపులు సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల విభజనపై మరో ఉద్యమానికి తెలంగాణ న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ న్యాయాధికారులు ఇందుకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. భావి కార్యాచరణ కోసం తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం గురువారం జరగనుంది. జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులతో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కూడా శనివారం భేటీ జరపనుంది. తెలంగాణ న్యాయాధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. న్యాయాధికారుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించిన హైకోర్టు, కేటాయింపులను మాత్రం వాటికి విరుద్ధంగా చేసిందంటూ లాయర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన వారిలో 141 మంది ఏపీ చెందిన న్యాయాధికారులున్నారని తెలిసి కూడా హైకోర్టు ప్రాథమిక జాబితాను విడుదల చేసిందని, ఇది సరికాదన్నారు. కేటాయింపుల్లో అన్యాయంపై అంతా కలిసి తమ వాదనలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ‘‘ఈ కేటాయింపులను ఆమోదిస్తే వచ్చే రెండేళ్లల్లో ఏపీలో భారీగా ఖాళీలు ఏర్పడతాయి గానీ తెలంగాణలో మాత్రం అందుకు ఆస్కారముండదు. తెలంగాణ న్యాయాధికారులకు పదోన్నతుల్లోనూ తీరని అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేదాకా దీనిపై పోరాటం చేస్తాం’’ అని వారంటున్నారు. -
గెలిపిస్తే డివిజన్ల అభివృద్ధి
♦ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ♦ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 35,49, 50 డివిజన్లలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఖమ్మం : కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే.. డివిజన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని 35,49,50 డివిజన్లలో పోటీ చేస్తున్న గుండపూడి జయమ్మ, గుండ్ల రవికుమార్, పీట్ల పార్వతమ్మను గెలిపించాలని కోరుతూ శుక్రవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 35వ డివిజన్లోని రాపర్తినగర్ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. రాజీవ్‌నగర్, బుర్హాన్‌పురం చెరువు కట్ట, వాటర్ ట్యాంక్ ఏరియా, రామాలయం వీధుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. దినసరి కూలీలు, చాట్ బండార్ వ్యాపారులు, కార్మికులు, గృహిణులను ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. 49వ డివి జన్ పరిధిలోని దానవాయిగూడెం, కాలనీల్లో గుండ్ల రవికుమార్ తరఫున, 50డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ, రామన్నపేట కాలనీ, రామన్నపేట ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వ హించారు. ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డివిజన్ ఇన్‌చార్జ్‌లు, పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ బొర్రా రాజశేఖర్, జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాయకులు గుండపనేని నాగేశ్వరరావు, ఉపేంద్ర, అజ్మీరా లింగరాజు, సూర్యం, సాయి, పాండు, కన్నేటి వెంకన్న, టీ.ఈశ్వరాచారి, ఎం.కృష్ణారెడ్డి, జీ.అరవింద్,కన్నేటి వెంకన్న, నాయకులు ఎస్కే సోందు, మద్దినేని శ్రీనివాసరావు, బల్లెం వీర స్వామి, పల్లపు వెంకన్న, మంగల సుమన్ పాల్గొన్నారు. -
కిందిస్థాయి న్యాయ వ్యవస్థ విభజనతో మాకు సంబంధం లేదు
♦ హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం ♦ పోస్టుల భర్తీలోనూ మా పాత్ర ఉండదు ♦ విభజన కోసం హైకోర్టే స్వీయ నిబంధనలు రూపొందించుకోవాలి ♦ తెలంగాణ సర్కారు వాదనలు వింటామన్న ధర్మాసనం ♦ ఆ తరువాతే ఈ కేసులో తీర్పును వాయిదా వేస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజనతో తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన కోసం హైకోర్టే స్వీయ నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ స్వీయ నిబంధనలను తమ ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందని వివరించింది. అంతేగాకుండా కింది స్థాయి న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ ప్రక్రియలో కూడా తమ జోక్యం ఉండదని తెలిపింది. దీంతో ఈ విషయాన్ని రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన, జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ వాదనలు వినాలని భావిస్తున్నామని పేర్కొంటూ విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది.. రాష్ట్ర విభజన నేపథ్యంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన పూర్తయ్యేంత వరకు జూనియర్ సివిల్ జడ్జిల పోస్టులను భర్తీ చేయరాదంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, మరికొందరు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వాదనలు వినిపిస్తూ... కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన విషయంలో హైకోర్టు స్వీయ నిబంధనలను రూపొందించుకోవాలని, వాటిని తమ ఆమోదం కోసం పంపినప్పుడు మాత్రమే పునర్విభజన చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం తాము జోక్యం చేసుకుంటామని వివరించారు. దీంతో మరి పోస్టుల భర్తీ సంగతి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అందులోనూ తమకు ఎటువంటి పాత్ర ఉండదని నటరాజ్ చెప్పారు. అనంతరం పిటిషనర్ సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... పునర్విభజన చట్టాన్ని చూపి చేతులు దులుపుకొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన విషయంలో ఉభయ రాష్ట్రాలు తగవులాగుడుతుంటే... కేంద్రం ఏమీ పట్టనట్లు చూస్తోందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు రిజిస్ట్రీ తన వైఖరిని స్పష్టంగా చెప్పలేదని, దీనివల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ... తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి సొంత జ్యుడిషియల్ సర్వీసు నిబంధనలు వచ్చాయని, అవి అమల్లో ఉండగా ఏపీ సర్వీసు నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. ఇంప్లీడ్ పిటిషనర్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ప్రస్తుత పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తే, తరువాత వారి కేటాయింపుల సమయంలో తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశముందన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం... తెలంగాణ ప్రభుత్వ వాదనలు వింటామని, ఆ తర్వాతే ఈ వ్యవహారంలో తీర్పును వాయిదా వేస్తామని పేర్కొంటూ విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. -
ప్రభుత్వం ఎవరిపైనా విపక్ష చూపడంలేదు
-
ఆర్కేపురం డివిజన్ సమస్యలపై గ్రౌండ్ రిపోర్ట్
-
బరిలో 60 మంది మజ్లిస్ అభ్యర్థులు
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లకు గాను 60 చోట్ల ఆల్ ఇండియా మజ్లిస్- ఎ -ఇత్తేహదుల్- ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ తమ అభ్యర్థులను బరిలో దింపింది. 2009 ఎన్నికల్లో 70 డివిజన్లలో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ ఈసారి 60 డివిజన్లకే పరిమితమైంది. ప్రస్తుతం ఎన్నికల బరిలో తలపడుతున్న అభ్యర్ధులు వివరాలివీ... ఓల్డ్‌మలక్‌పేట్ -జూవేరియా ఫాతిమా, అక్బర్ బాగ్-సయ్యద్ మీనాజుద్దీన్, ఆజాంపురా-అయేషా జహాన్ నసిమ్, చావ్నీ-మహ్మద్ ముర్తుజా అలీ, డబీర్‌పురా- మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఇఫెందీ, రెయిన్ బజార్-మీర్ వాజీద్ అలీఖాన్, పత్తార్ఘట్టి-సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మొఘల్‌పురా-అమతుల్ అలీమ్, తలాబ్‌చంచలం-నస్రీన్ సుల్తానా, లలిత్‌భాగ్-మహ్మద్ అలీ షరీఫ్, కుర్మగూడ-సలీమా బేగం, సంతోష్ నగర్-మహ్మద్ ముజఫర్ హుస్సేన్, రియాసత్ నగర్-మీర్జా ముస్తాఫా బేగ్, కాంచన్ భాగ్-రే ష్మా ఫాతిమా, బార్కాస్-షబనా బేగం, చాంద్రాయణగుట్ట-అబ్దుల్ వాహెబ్, ఉప్పుగూడ-ఫహద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దద్, జంగంమెట్-మహ్మద్ అబ్దుల్ రహమాన్, ఫలక్‌నుమా-కె.తారాబాయి, నవాబ్ సాబ్‌కుంట-షిరీన్ ఖాతూన్, శాలిబండ-మహ్మద్ ముస్తాఫా అలీ, ఘన్సీబజార్- సబీనా బేగం, పురానాపూల్-సున్నం రాజమోహన్, దూద్‌బౌలి-ఎంఏ గఫార్, జహనూమా-ఖాజా ముబ్షరుద్దీన్, రామ్నాస్పురా-మహ్మద్ ముబీన్, కిషన్‌బాగ్-మహ్మద్ సలీం, సులేమాన్ నగర్-అబిదా సుల్తానా, శాస్త్రిపురం-ఎండీ మిస్బాద్దీన్, మైలార్‌దేవ్‌పల్లి-సయ్యద్ హైదర్ అలీ, అత్తాపూర్-బి.రజని, దత్తాత్రేయ నగర్-ఎమ్డీ యూసుఫ్, కార్వాన్-ఎం.రాజేందర్ యాదవ్, లంగర్‌హౌస్-అమీనాబేగం, గోల్కొండ-హఫ్సియా హన్సీఫ్, టోలిచౌకి- డాక్టర్ అయేషా హుమేరా, నానల్‌నగర్-మహ్మద్ నసీరుద్దీన్, మెహిదీపట్నం-మహ్మద్ మాజీద్ హుస్సేన్, ఆసిఫ్‌నగర్-ఫహీమినా అంజుమ్, విజయనగర్ కాలనీ-సల్మాన్ అమీన్, అహ్మద్ నగర్-అయేషా రుబీనా, రెడ్‌హిల్స్-అమేషా ఫాతిమా, మల్లేపల్లి-తరాన్నుమ్ నాజ్, జాంబాగ్-డి. మోహన్, గోల్నాక-సకీనా బేగం, అంబర్‌పేట-మహ్మద్, బోలక్పూర్-మహ్మద్ అఖిల్ హైమద్, షేక్‌పేట-మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్,సోమాజిగూడ-జి.దేవి, వెంగళరావు నగర్-ఎం.శ్యామ్ రావు, ఎర్రగడ్డ-షాహిన్ బేగం, రహమత్ నగర్- నవీన్ యాదవ్, బోరబండ-నర్సింగ్‌రావు, శేరిలింగంపల్లి-షేక్ ఖాజా హుస్సేన్, అల్లాపూర్-ఖుర్షీద్ బేగం, ఓల్డ్ బోయిన్పల్లి-మహ్మద్ ఓమెరా, గాజులరామారం-ఎండీ సమీర్ అహ్మద్, రంగారెడ్డినగర్-కె.చెన్నయ్య, మౌలాలి-రహమతున్సీసా బేగం, బౌద్ధనగర్-షబానాబేగం -
‘గ్రేటర్’పై హైడ్రామా
-
నాట్కో షేర్లు విభజన
షేరు విభజన తర్వాత తొలిసారిగా గురువారం జరిగిన ట్రేడింగ్‌లో నాట్కో ఫార్మా షేరు పరుగులు తీసింది. పది రూపాయల ముఖ విలువ కలిగిన షేరును రెండు రూపాయలుగా విభజించిన సంగతి తెలిసిందే. విభజన తర్వాత రెండు రూపాయల ముఖ విలువ కలిగిన షేర్లు గురువారం ట్రేడయ్యాయి. క్రితం ముగింపు రూ. 2,575గా ఉన్న షేరు విభజన తర్వాత రూ. 519 వద్ద నమోదయ్యింది. ఆ తర్వాత ఒకానొక దశలో 16% పెరిగి రూ. 596 వరకు పెరిగింది. చివరకు 6 శాతం లాభంతో రూ. 544 వద్ద ముగిసింది. -
'డివిజన్' ఎందుకు వద్దు?
పార్లమెంట్లో ఏం జరిగింది-7 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన ఫిబ్రవరి 18, 2014న లోక్ సభలో జరిగిన చర్చ వివరాలు మరి కొన్ని... 15.37: శరద్ యాదవ్, మరికొం దరు సభ్యులూ సభ నుంచి నిష్ర్కమించారు. ప్రొ॥సౌగత్‌రాయ్: తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద రాష్ట్రాన్ని విడగొడ్తున్నారు? భాషా ప్రయుక్త రాష్ట్రాల పునాదులనే నాశనం చేస్తున్నారా? అందుకే మేము చర్చ కావాలన్నాం. మీరు చర్చ పూర్తి చేసేశారు. ఇప్పుడు సవరణల మీద తలలు లెక్కపెడ్తున్నారు. సరైన చర్చ జరిపించండి. రూల్స్ ప్రకారం సవరణల మీద నిర్ణయం ప్రకటించండి. మీకు ఎవరో ఏదో చెప్తుంటే, ఆ ప్రకారం నడుచుకోవటం సరికాదు. స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్: 41వ సవరణ, సౌగత్‌రాయ్ ప్రతి పాదించినది, ఆమోదించబడిందా. సవరణ వీగిపోయింది. ప్రొ॥సౌగత్‌రాయ్: నాకు 'డివిజన్' కావాలి. స్పీకర్: శ్రీసౌగత్రాయ్, రూల్ 367 సబ్ రూల్ (3) ప్రకారం ఇది సరిగ్గా చేస్తున్నాం. ఏ రూలూ అతిక్రమించటం లేదు. రూల్ ప్రకారమే చేస్తున్నాం. ... అంతరాయం... స్పీకర్: నాకు తెలుసు. ఇది రూల్ ప్రకారమే జరుగుతోంది. సౌగత్‌రాయ్: ఇది పద్ధతి కాదు. మీకు తప్పుడు సలహాలిస్తు న్నారు. మేము గొర్రెలం కాదు తలలు లెక్క పెట్టడానికి. స్పీకర్: 45వ సవరణ, 7వ క్లాజ్‌కి అసదుద్దీన్ ఒవైసీ ప్రవేశ పెడ్తున్నారా? అసదుద్దీన్ ఒవైసీ: పేజీ 3లో 5 నుండి 7వ లైన్లు 'ఎప్పాయింటెడ్ డే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గవర్నర్, తెలంగాణ రాష్ట్రానికి మరో గవర్నర్ ఉండాలి'. స్పీకర్: 66 సంవత్సరాలలో, మన రాజ్యాంగం ప్రకారం ఏనాడూ రెండు రాష్ట్రాలకి ఒక గవర్నర్ అంటూ లేరు. ఒక రాష్ట్ర గవర్నర్ మరో రాష్ట్రానికి ఇన్చార్జిగా ఉన్నారు. ఇది చట్టవిరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. ఒక సూపర్ గవర్నర్ తయారు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు వాళ్ల సొంత గవర్నర్ ఎందుకుండకూడదు? మీరెందుకు తెలంగాణ ప్రజల్ని నమ్మటంలేదు? తెలంగాణను పరి పాలించే వారిని మీరెందుకు నమ్మరు? ఒక గవర్నర్ రెండు రాష్ట్రా లకెలా ఉంటారు? అందుకే నేనో సవరణ ప్రతిపాదిస్తున్నాను. 15.41: (ఈ దశలో శ్రీ సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి తన స్థానంకి వెళ్లారు) స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ సవరణ ఓటు కోసం సభ ముందుంచుతున్నాను. అసదుద్దీన్ ఒవైసీ: మేడమ్ నాకు డివిజన్ కావాలి. తలలు లెక్క పెట్టండి. 15.42: (సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి మళ్లీ స్పీకర్ టేబుల్ దగ్గరకొచ్చారు) స్పీకర్: తలలు లెక్క తీసుకుందాం. ... అంతరాయం... ది క్వశ్చన్ ఈజ్: ఎప్పాయింటెడ్ డే నుండి ప్రస్తుత గవర్నర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గానూ, తెలంగాణ రాష్ట్రానికి వేరే గవర్నరూ ఉంటారు. ఇప్పుడు అనుకూలురు తమ స్థానాల్లో నిలబడండి. ఇప్పుడు వ్యతిరేకులు తమ స్థానాల్లో నిలబడండి. వ్యతిరేకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆయ్= 24 నో 169 సవరణ వీగిపోయింది. ది క్వశ్చన్ ఈజ్ క్లాజ్ 7 బిల్లులో భాగమవుతుంది ఆమోదించబడింది. క్లాజ్ 7 బిల్లులో భాగమయింది. ... అంతరాయం... స్పీకర్: సౌగత్‌రాయ్, 42వ సవరణ, క్లాజు 8కి ప్రతిపాదిస్తు న్నారా? ప్రొ॥సౌగత్‌రాయ్: ప్రతిపాదన అభ్యర్థిస్తున్నాను. "8వ లైన్ గవర్నర్ బాధ్యత, 'లా' చూసుకోవాలి" మేడమ్, ఈ సవరణ ప్రతిపాదిస్తూనే, రూల్ 367(3) మరొక సారి ప్రస్తావిస్తాను. "క్వశ్చన్ విషయంలో స్పీకర్ నిర్ణయం సవాల్ చేయబడితే 'లాబీ'లు క్లియర్ చేయమని ఆదేశించాలి" అప్పుడు మళ్లీ ఆ క్వశ్చన్ అడగాలి. మేము మీ నిర్ణయాన్ని చాలెంజ్ చేస్తున్నాం. అందుకే ఓటింగ్ కావాలంటున్నాం. మా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తున్నాం. ఈ విభజన, దేశవ్యాప్తంగా వేర్పాటువాదాన్ని పెంచుతుంది. ఈ రోజు ఈ చర్య ఇండియా ప్రయోజనాలకే ఆటంకం. ఒక పెద్ద రాష్ట్రాన్ని విభజించటం ద్వారా ఈ ప్రభుత్వం, ఇండియా అనే ఆలోచననే సవాలు చేసే చర్యలు చేపడుతోంది. 'యూ షట్ అప్' ... అంతరాయం... ఇండియా అఖండతే సవాల్ చేయబడ్తోంది. అందుకే సవరణ ప్రతిపాదిస్తున్నాను. 15.44: సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి, మళ్లీ తన స్థానంకి వెళ్లారు. స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్ గవర్నర్ బాధ్యత చట్టబద్ధ పాలనను చూసుకోవాలి. ... అంతరాయం... ప్రొ॥సౌగత్‌రాయ్: డివిజన్ కోరుతున్నాం. ఒవైసీ: నో-మేడమ్ - మాకు డివిజన్ కావాలి. స్పీకర్: ఆల్ రైట్, లెక్క పెడదాం. గౌరవ సభ్యులారా, నా ఉద్దేశంలో అనవసరంగా డివిజన్ అడగబడుతోంది. అందువల్ల రూల్ 367 సబ్ రూల్ 3 అనుబం ధాన్ని అనుసరించి, 'ఆయ్' అనేవారు, 'నో' అనేవారు తమ స్థానాల్లో నిలబడితే లెక్క తీసుకుని సభ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. తమ స్థానాల్లో లేని సభ్యులు లెక్కలోకి రారు. 15.46: సంసుమ కునగ్గర్ బిశ్వమూర్తి స్పీకర్ టేబుల్ దగ్గర నిల్చున్నారు. స్పీకర్: ఇప్పుడు 'అనుకూలురు' నిలబడండి. వ్యతిరేకులు నిలబడండి. వ్యతిరేకులు ఎక్కువ ఉన్నారు. సవరణ వీగిపోయింది. -ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు -
ఆర్టీసీకి చైర్మన్..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి చైర్మన్‌ను నియమించే దిశగా అడుగులు పడుతున్నాయి. తీవ్ర నష్టాలు, ఆదాయం పెరగక పోవటం, కొత్తగా అప్పులు పుట్టే అవకాశం లేనంతగా గుడ్‌విల్ దెబ్బతినటం... తదితరాలతో ఆర్టీసీ కునారిల్లిపోయింది. ఈ తరుణంలో చురుకైన నేతను ఆర్టీసీకి చైర్మన్‌గా నియమిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించి వేగంగా కసరత్తు చేస్తున్న ఆయన.. పనిలోపనిగా ఆర్టీసీ చైర్మన్ విషయంలోనూ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. వాస్తవానికి ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావే సాంకేతికంగా టీఎస్ఆర్టీసీకి కూడా చైర్మన్‌గా కొనసాగుతున్నారు. సాంకేతికంగా ఇప్పటికీ ఆర్టీసీ విడిపోనందున ఆయనే చైర్మన్ హోదాలో ఉన్నారు. పాలనాపరంగా ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ విడివిడి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ నిజానికి ఇప్పటికీ ఏపీఎస్ ఆర్టీసీగానే ఉంది. ఈ విభజన తంతు కేంద్ర ఉపరితల రవాణాశాఖ పరిధిలో ఉంది. ఆస్తులు అప్పుల వాటా తేలిస్తేగాని తుది విభజన పూర్తి కాదు. ఇప్పటికీ అది పీటముడిగానే ఉంది. దీనిపై నిర్ణయం వెల్లడించాల్సిన షీలాభిడే కమిటీ గడువు ముగిసినా దాన్ని తేటతెల్లం చేయలేదు. ఫలితంగా అది గందరగోళంగా మారింది. ఈ కారణంగానే తెలంగాణ ఆర్టీసీకి ప్రత్యేకంగా పాలకమండలి కూడా ఏర్పాటు కాలేదు. ఉమ్మడి పాలకమండలిలో తెలంగాణ ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంతో... అది సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. ఈ కారణంతోనే పాలకమండలి సమావేశాలూ జరగటం లేదు. తెలంగాణ అభ్యంతరం మేరకు... తెలంగాణ ప్రాతినిధ్యం పాలకమండలిలో పెంచుకునేలా కేంద్రం కూడా ఆమోదం తెలుపుతూ లేఖ కూడా రాసింది. ఇది ఇలా ఉండగా... తెలంగాణకు సొంతంగా ఓ పాలకమండలిని ఏర్పాటు చేసి చైర్మన్ పదవిని భర్తీ చేయాలని తాజాగా ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలిసింది. కేవలం తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి సాధారణ నిర్ణయాలు తీసుకునేలా ఈ పాలకమండలి చూస్తుంది. ముఖ్యంగా నష్టాలను అధిగమించటంపై మాత్రమే దృష్టి సారిస్తుందని చెబుతున్నాయి. తీవ్ర నష్టాలతో జీతాలు చెల్లించటం కూడా కష్టంగా మారిన దుస్థితిలో ఉన్న ఆర్టీసీ ఇలాగే కొనసాగితే... బాగుచేయలేనంత దారుణంగా దెబ్బతింటుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనికి చైర్మన్‌ను నియమించటం కొంతవర కు మేలు చేస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కీలక పదవుల కోసం ముఖ్యమంత్రిపై పార్టీ నేతల నుంచి ఒత్తిడి కూడా ఉంది. ఆర్టీసీ చైర్మన్‌గిరీ ప్రముఖమైందిగా భావిస్తున్న నే తలు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నేతలను సంతృప్తి పరిచే క్రమంలో కూడా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికీ రెండు ఆర్టీసీల మధ్య బస్సు పర్మిట్ల విభజన జరగలేదు. ఫలితంగా తెలంగాణకు రావాల్సిన 550 సర్వీసులు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోనే ఉండటంతో తెలంగాణ ఆర్టీసీ రోజుకు రూ.2 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నష్టాలను అధిగమించాలంటే చైర్మన్ ఉండటం అవసరమనే ఒత్తిడి కూడా ప్రభుత్వంపై ఉండటం విశేషం. -
విద్యుత్ ఉద్యోగుల విభజనపై కదలిక
31న ఢిల్లీకి రావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం ఆదేశం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఈ నెల 31న ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇంధన శాఖ కార్యదర్శులు, జెన్కో సీఎండీలకు పిలుపు వచ్చింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నుంచి అధికారులకు లేఖలు అందాయి. ఏపీ స్థానికత కలిగి ఉండి తెలంగాణలో పనిచేస్తున్న 1,252 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు గత నెల 10న రిలీవ్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు ఉద్యోగులు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ వివాదంలో జోక్యం చేసుకోడానికి మొదట హోంశాఖ అయిష్టత వ్యక్తం చేసినా, ఎట్టకేలకు స్పందించడం విశేషం. -
'విభజన అనివార్యం అయింది'
-
ఎకరా రూ. 19.21 కోట్లు
హైదరాబాద్‌లో భూమికి రికార్డు ధర టీఎస్ఐఐసీ నుంచి 12 ఎకరాల కొనుగోలుకు ‘ఐకియా’ అంగీకారం నాలెడ్జ్ సిటీలోని నాలుగు ప్లాట్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట రాజధానిలో ‘రియల్’ బూమ్ మళ్లీ మొదలైంది! ఎకరా భూమి ఏకంగా రూ. 19.21 కోట్లు పలికిం ది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో స్తబ్దుగా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారం.. రాష్ర్ట విభజన తర్వాత కూడా ఆశించినస్థాయిలో మెరుగవలేదన్న అభిప్రాయం నెల కొన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయి ధర పలకడం విశేషం. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం నుంచి భూమిని కొనుగోలు చేసేందుకు స్వీడిష్ ఫర్నిచర్ తయారీ సంస్థ ‘ఐకియా’ ముందుకురావడం చర్చనీయాంశమైంది. వ్యాపార విస్తరణలో భాగంగా ‘ఐకియా ఇండియా’ పేరుతో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని రాయదుర్గం సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలో వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఎస్ఐఐసీ)తో ఐకియా ఇండియా ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఎకరాకురూ. 19.21 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఈ లెక్కన నాలెడ్జ్ సిటీలో దాదాపు 12.35 ఎకరాల భూమిని కొనుగోలు చేయాలని ఐకియా సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు ఐకియా ఎండీ జ్యూవెన్షియో మాజ్టూ, సీఎఫ్‌వో ప్రీట్ దూపర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. రూ. 500 కోట్ల పెట్టుబడి: వ్యాపార విస్తరణలో భాగంగా రూ. 12,500 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా వచ్చే పదేళ్లలో 25 స్టోర్స్ ఏర్పాటు చేయాలని ఐకియా నిర్ణయించింది. తొలిదశలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ. 500 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. ఈ కేంద్రంతో హైదరాబాద్‌లో 500 మందికి ప్రత్యక్షంగా, వందలాది మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. రాష్ర్ట విభజనతో హైదరాబాద్ చుట్టుపక్కల భూముల క్రయవిక్రయాలు మందగించిన నేపథ్యంలో ఐకియా తాజా ఒప్పందం రియల్ బూమ్‌కు నాంది పలికింది. గతంలో ఏపీఐఐసీ గానీ, హుడా గానీ హైదరాబాద్ పరిసరాల్లో విక్రయించిన భూములకు ఎకరా ధర రూ. 14 కోట్లు దాటలేదు. ఇప్పుడు అంతకన్నా చాలా ఎక్కువ ధర పలకడంతో దీన్ని మార్పునకు సంకేతంగా వ్యాపారులు పేర్కొంటున్నారు. -
హైకోర్టు విభజనపై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకోసం దాఖలైన వ్యాజ్యాలపై వాదనలు శుక్రవారం ముగిశాయి. ఈ వ్యాజ్యాలపై రాతపూర్వక వాదనలను స్వీకరించేందుకు వీలుగా ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోనే హైకోర్టు ఏర్పాటుకు ఆదేశాలివ్వాలంటూ ఏపీ హైకోర్టు సాధన సమితి కన్వీనర్ ప్రసాద్‌బాబు, ప్రస్తుతమున్న చోటనే 2 రాష్ట్రాల హైకోర్టులను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది టి.అమర్‌నాథ్‌గౌడ్‌లు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటినీ ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వాటిని శుక్రవారం మరోసారి విచారించింది. 1956 పునర్విభజన చట్టానికి, 2014 పునర్విభజన చట్టానికి మధ్య ఉన్న వైరుధ్యాలను ప్రసాద్‌బాబు తరఫు న్యాయవాది ఎం.వి.రాజారాం వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై వాదనలు ముగిశాయని, వాదనలు వినిపించిన వారంతా లిఖితపూర్వక వాదనల్ని కోర్టుకు సమర్పించాలని కోరింది. ఇందుకోసం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
రంగంలోకి ‘హైకోర్టు’ కమిటీ
గచ్చిబౌలి భవనాన్ని పరిశీలించిన జడ్జీలు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ఇటీవల ఏర్పాటు చేసిన న్యాయమూర్తుల కమిటీ తన పని ప్రారంభించింది. కమిటీ చైర్మన్ జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బోస్లే నేతృత్వంలో సభ్యులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి సోమవారం గచ్చిబౌలి వెళ్లి ప్రతిపాదిత హైకోర్టు భవనాన్ని పరిశీలించారు. గంటపాటు అక్కడ గడిపారు. భవనానికి సంబంధించిన డ్రాయింగ్లు, మ్యాపులను తెప్పించుకుని, వాటి ఆధారంగా అధికారులను అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రతి ఫ్లోర్‌కూ వెళ్లి అక్కడి సదుపాయాలను పరిశీలించి, వాటిపై అధికారులను ఆరా తీశారు. హైకోర్టు విభజనకు సంబంధించిన ఈ వ్యవహారాలన్నింటినీ గోప్యంగా ఉంచాలని కమిటీ నిర్ణయించింది. అవసరమైతే మరోసారి భవనాన్ని సందర్శించాలని కమిటీ భావిస్తోంది. తర్వాత దీనిపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సీజే తన అభిప్రాయాన్ని కేంద్రానికి వివరించవచ్చని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే వెళ్లొచ్చిన సీజే... గచ్చిబౌలి భవనాన్ని జస్టిస్ సేన్‌గుప్తా కూడా గత వారం స్వయంగా వెళ్లి చూసొచ్చారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డిని కూడా వెంటబెట్టుకు వెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాతే... హైకోర్టు విభజన వ్యవహారంతో పాటు, గచ్చిబౌలి భవనం తెలంగాణ హైకోర్టు ఏర్పాటునకు సరిపోతుందో లేదో తేల్చేందుకు జస్టిస్ బోస్లే నేతృత్వంలో కమిటీ వేశారు. హైకోర్టును విభజించి తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని, అందుకు గచ్చిబౌలిలో భవనం కూడా సిద్ధంగా ఉందని పేర్కొంటూ కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లేఖ రాయడం... ఈ దిశగా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు సీజేకు గౌడ లేఖ రాయడం తెలిసిందే. -
ముందు జవాబు చెప్పి మాట్లాడండి
కాంగ్రెస్ నేతలకు వెంకయ్యనాయుడు సూచన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టే కాంగ్రెస్ నేతలు.. ముందు విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామన్న అంశాన్ని ఎందుకు పెట్టలేదో చెప్పాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. దీనికి జవాబు చెప్పిన తరువాత మాట్లాడాలని సూచించారు. సహచర కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, సుధీష్ రాంబొట్లతో కలిసి ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంలో జైరాం రమేష్, ఇతర కాంగ్రెస్ నేతలు వెంకయ్యపె ఆరోపణలు చేస్తున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ముంపు మండలాలను కలిపే అంశానికి సంబంధించి ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయలేదో, ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు పెట్టలేదో చెప్పి తరువాత ఈ విషయాలపై తమ గురించి మాట్లాడాలని చెప్పారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో తాను పట్టుబట్టిన మాట వాస్తవమేనని, అది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు. భూసేకరణ చట్టం ఆర్డినెన్స్, దేశంలో పలు ప్రాంతాల్లో చర్చిలపై దాడులు, మత మార్పిడులపై కాంగ్రెస్‌తో సహా పలు ప్రత్యర్థి పార్టీలు కేంద్రంలోని తమ ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్నాయని వెంకయ్య ఆరోపించారు. దేశంలో అభివృద్ధి జరగకూడదని వారు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ దుష్పప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టి, వాస్తవాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు చెప్పారు. ప్రత్యర్థులు ఎంత స్థాయిలో అసత్య ప్రచారానికి పూనుకున్నా ప్రజల్లో ప్రధాని నరేంద్రమోదీకి ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని తెలిపారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి: కి షన్‌రెడ్డి సూర్యాపేట ఎన్‌కౌంటర్‌పై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందజేయకపోవడమే ఈ ఘటనకు కారణమన్నారు. వెంకయ్యకు బీసీ నేతల వినతి దేశంలో 56 శాతం వరకూ ఉన్న బీసీలకు చట్ట సభల్లో 15 శాతం కూడా ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్‌ను కల్పించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు బీసీ నేతలు విన్నవించారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్లో వెంకయ్యను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ నేతలు కలిశారు. -
తెలంగాణకు ‘టెస్కాబ్’
ఆప్కాబ్ విభజన.. నేటి నుంచి రెండు రాష్ట్రాలకు.. తెలంగాణ ఎండీగా నేతి మురళీధర్.. ఏపీకి నాగమల్లేశ్వర్రావు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) విభజన పూర్తయింది. ఏపీకి ఆప్కాబ్‌గానే కొనసాగనుండగా.. తెలంగాణకు తెలంగాణ స్టేట్ కో- ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్) కొత్తగా ఏర్పాటైంది. ఈ రెండు బ్యాంకులు గురువారం (ఏప్రిల్ 2వ తేదీ) నుంచి వేర్వేరుగా కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. టెస్కాబ్‌కు ఎండీగా నేతి మురళీధర్, ఆప్కాబ్‌కు నాగమల్లేశ్వర్రావు నియమితులయ్యారు. వారు గురువారం బాధ్యతలు స్వీకరిస్తారు. వారిద్దరూ ఇప్పటివరకు చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎం)గా వ్యవహరించారు. ఇక ఆప్కాబ్ పాలక మండలి మాత్రం తాత్కాలికంగా కొనసాగనుంది. విభజన నేపథ్యంలో ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి పదవీకాలం బుధవారంతో ముగిసినట్లే. దీంతో ఈ నెల 25వ తేదీలోగా టెస్కాబ్ పాలకమండలి చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. ఏపీలో ఆప్కాబ్‌కు ఈ నెలాఖరులోగా వారిని ఎన్నుకోవాలి. మరోవైపు ఆప్కాబ్ విభజన అసెంబ్లీలో జరగాలని.. జనరల్‌బాడీ, పాలకమండలిలే చేపట్టడం నిబంధనలకు విరుద్ధమంటూ ఏపీ ఉద్యోగ సంఘాలు కోర్టుకు వెళ్లగా జోక్యానికి హైకోర్టు నిరాకరించిందని చైర్మన్ వీరారెడ్డి చెప్పారు. ఆస్తులు, ఉద్యోగుల విభజన.. 1963లో ఆప్కాబ్ ఏర్పడింది. దీనికి ఉమ్మడి రాష్ట్రంలో 37 శాఖలు ఉండగా.. విభజనతో టెస్కాబ్‌కు 35, ఆప్కాబ్‌కు రెండు శాఖలు దక్కాయి. ఆ ప్రకారమే లావాదేవీలు ఉంటా యి. టెస్కాబ్‌కు హైదరాబాద్‌లోని అబిడ్స్ సమీపంలో ఉన్న ప్రస్తుత ప్రధాన కార్యాలయాన్నే కేటాయించగా.. ఆప్కాబ్‌కు తాత్కాలికంగా నారాయణగూడలో ఉన్న కార్యాల యాన్ని ఇచ్చారు. ఆప్కాబ్‌కు 231 మంది ఉద్యోగులను, టెస్కాబ్‌కు 318 ఉద్యోగులను కేటాయించారు. అడ్వాన్సులు, డిపాజిట్లు ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రానికే చెందుతాయి. రూ. 60 కోట్ల మేరకు ఉన్న ఉమ్మడిడిపాజిట్లను జనాభా నిష్పత్తి ప్రకారం రెండు బ్యాంకులకు పంచుతారు. తెలంగాణలో ఆప్కాబ్ బ్రాంచీలు 35 ఉండగా డీసీసీబీలు 9ఉన్నాయి. డీసీసీబీలకు 249 బ్రాంచీలు ఉన్నాయి. జిల్లాల్లో ప్రాథమిక సహకార సం ఘాలు (ప్యాక్స్) 789 ఉన్నాయి. 12.50 లక్షల మంది రైతులకు రూ. 4,500 కోట్ల మేరు రుణాలు ఇచ్చారు. కాగా టెస్కాబ్‌కు ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టీఎస్సీఏబీ.ఓఆర్జీ’ వెబ్‌సైట్‌ను గురువారం ఆవిష్కరించనున్నారు. పాలకమండలికి ఎన్నికలు.. టెస్కాబ్ పాలకమండ లిలో 8 మంది సభ్యులున్నారు. అందులో ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు టీఆర్ఎస్ సభ్యులున్నారు. పాలకమండలికి ఈ నెల 25వ తేదీలోగా ఎన్నికలు జరపాలి. దీంతో ఎక్కువ సభ్యులున్న కాంగ్రెస్ పార్టీనే టెస్కాబ్ను కైవసం చేసుకునే అవకాశముంది. -
విభజన ప్రక్రియను ప్రారంభించాం
హైకోర్టుకు నివేదించిన కేంద్ర న్యాయ శాఖ హైకోర్టు విభజనపై స్పందించాల్సింది ఏపీ సర్కార్, హైకోర్టులే ఇప్పటివరకూ ఏపీ నుంచి ఎటువంటి సమాచారం లేదు హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది సర్కార్ నిర్ణయమే మౌలిక సదుపాయాలు కల్పించిన వెంటనే నోటిఫికేషన్ ఇస్తాం ఆ తర్వాతే జడ్జీల చాయిస్ కోరుతామని సీజే చెప్పారు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తాము ఎటువంటి సమాచారం అందుకోలేదని హైకోర్టుకు కేంద్ర న్యాయ శాఖ నివేదించింది. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియను తాము ఇప్పటికే ప్రారంభించామని, ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో స్పందించాల్సింది ఆ రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టులేనని తెలిపింది. హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత ఏపీదేనని స్పష్టం చేసింది. హైకోర్టు విభజన విషయంలో ఏపీ ప్రభుత్వం, హైకోర్టులు నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని, మౌలిక సదుపాయాలను కల్పించిన వెంటనే తాము సంబంధిత చట్టం ప్రకారం విభజన కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన టి.ధన్‌గోపాల్‌రావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖ లు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం దానిని మరోసారి విచారించింది. గతవారం ధర్మాస నం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం తన వాదనలను వినిపిస్తూ కౌంటర్ దాఖలు చేసింది. కేంద్రం తరఫున న్యాయ శాఖ కార్యదర్శి ఎన్‌కేసీ థంగ్ ఈ కౌంటర్‌ను దాఖలు చేశారు. అలసత్వాన్ని ఆపాదించడం సరికాదు.. ‘విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయమూర్తుల సం ఖ్యను ఖరారు చేయడం.. ఉమ్మడి హైకోర్టును విభజించి, ఇప్పుడున్న చోటనే రెండు హైకోర్టులు వేర్వేరుగా పని చేసేలా చేయడం సాధ్యమేనా.. అన్న అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. హైకోర్టుకు కేటాయించిన 49 మంది న్యాయమూర్తులను ఇరు రాష్ట్రాల మధ్యా 60:40 నిష్పత్తిలో విభజించాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్యా న్యాయమూర్తుల సంఖ్యను 60:40 నిష్పత్తిలో విభజించేందుకు అంగీకరించాం. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులను గుర్తించి, వారి రాష్ట్ర కోటా ఆధారంగా కేటాయింపులు చేయాలని గత అక్టోబర్ 9న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే విషయంలో ఇద్దరూ మాట్లాడుకుని తగిన చర్యలు ప్రారంభించాలని ఏపీ సీఎం, హైకోర్టు సీజేని కోరాం. హైకోర్టు ఏర్పాటుపై తాను ఏపీ సీఎంకి లేఖ రాశానని, అయితే ఆయన నుంచి ఎటువంటి సమాధానం రాలేదని సీజే చెప్పా రు. న్యాయమూర్తుల కేటాయింపుపై తాను అందరి అభిప్రాయాలను తెలుసుకున్నానని, ఏపీ హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే న్యాయమూర్తులను ఏ రాష్ట్రంలో పనిచేయాలని భావి స్తున్నారో తెలుసుంటానని సీజే మాకు వివరించారు. హైకోర్టుకు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. హైకోర్టు విభజనలో అలసత్వం ప్రదర్శిస్తున్నామన్న పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. హైకోర్టును ఏర్పాటు విషయంలో ఏపీ సర్కార్‌గానీ, ప్రధాన న్యాయమూర్తిగానీ తమ అభిప్రాయాలను ఇప్పటివరకు చెప్పలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయండి’ అని థంగ్ ధర్మాసనాన్ని కోరారు. హైదరాబాద్‌లో ఏపీ హైకోర్టు ఏర్పాటు చట్టవిరుద్ధం: అమికస్ క్యూరీ ఈ వ్యాజ్యంలో కోర్టు సహాయకారి(అమికస్‌క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఈ.మనోహర్ వాదనలు వినిపిస్తూ, ఏపీ హైకోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్నారు. పునర్విభజన చట్టంలో అటువంటి అవకాశం లేదన్నారు. రాజ్యాంగంలోని 214 అధికరణ ప్రకారం ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండి తీరాల్సిందేనన్నారు. కేంద్ర న్యాయ మంత్రి ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఇలా లేఖ రాసినట్లు కనిపిస్తోందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. శానససభ, సచివాలయం లాగా హైకోర్టును విభజించి, ఇక్కడే రెండు హైకోర్టులు పనిచేయడం సాధ్యం కాదా? అని ప్రశ్నించింది. దీనికి మనోహర్ స్పందిస్తూ.. వాటి విభజన కూడా చట్టవిరుద్ధమన్నారు. హైదరాబాద్‌లో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
విభజన సమస్యలకు చర్చలతో పరిష్కారం
గవర్నర్ నరసింహన్ వ్యాఖ్య హైకోర్టు విభజనలో ఎలాంటి గొడవా లేదు.. విభజన చట్టంలో ఉన్నమేరకు నడచుకుంటాం రెండు రాష్ట్రాలూ అభివృద్ధిపథంలో సాగుతున్నాయి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ.. రాష్ట్రపతితోనూ సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని వివాదాస్పద అంశాలు, సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం లభించేలా చూస్తామని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ వచ్చిన గవర్నర్ నరసింహన్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల పనితీరు, రాజకీయ పరిస్థితులపై నివేదిక అందచేసినట్టు సమాచారం. సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ ఆయన సమావేశమయ్యారు. రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం తనను కలసిన విలేకరులతో గవర్నర్ మాట్లాడుతూ ఈ భేటీ సాధారణమేనని, విశేషమేమీ లేదని చెప్పారు. నివేదిక సమర్పించిన విషయమై అడగ్గా.. ‘‘నివేదిక ఇస్తున్నట్టు మీరే రాశారు. మీ దగ్గరే నివేదిక ఉంటుంది. మీరే అన్నీ రాస్తారు. మీకే తెలిసి ఉండాలి’ అంటూ ఆయన చమత్కరించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో శాంతిభద్రతల అంశాన్ని ఏపీ సీఎస్ లేవనెత్తిన విషయమై ప్రశ్నించగా.. ‘‘ఆ సమావేశానికి నేను వెళ్లలేదు. అలాంటిదేమైనా ఉంటే హోంమంత్రితో చర్చిస్తాం’’ అని నరసింహన్ చెప్పారు. విభజన చట్టంలోని 5వ షెడ్యూల్సహా ఇతర అంశాలపై చాలా వివాదాలున్నాయని అడగ్గా.. ‘‘అన్నీ మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. దానిలో పెద్ద సమస్యలేదు. హైకోర్టు విభజన విషయంలోనూ ఎలాంటి గొడవా లేదు. విభజన చట్టంలో ఉన్నమేరకు నడచుకుంటాం’’ అని గవర్నర్ బదులిచ్చారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి కేంద్ర హోంమంత్రి తనకు ఎలాంటి దిశానిర్దేశం చేయలేదని నరసింహన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం చోటుచేసుకోవడంపై కేంద్రానికి నివేదిక ఇస్తున్నారా? అని అడగ్గా.. ‘‘హౌస్‌లో స్పీకర్ సుప్రీం కదా.. నిర్ణయాలు తీసుకునేది ఆయనే. దానికి మేం ఏం చేయలేం’’ అని నరసింహన్ బదులిచ్చారు. రెండు రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతల సమస్యల్లేవని గవర్నర్ చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ప్రగతి బాగుందని, అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాది ముగిసేనాటికి.. క్షేత్రస్థాయి నుంచి రెండు రాష్ట్రాలూ మంచి ఫలితాలు సాధిస్తాయని నమ్మకముందని చెప్పారు. నేడు మోదీ, సదానంద గౌడతో గవర్నర్ భేటీ ఇదిలా ఉండగా గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడలతో మంగళవారం వేర్వేరుగా భేటీ అవనున్నారు. సదానంద గౌడతో గవర్నర్ మంగళవారం ఉదయం సమావేశమై హైకోర్టు విభజనపై చర్చించనున్నట్టు సమాచారం. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. అనంతరం గవర్నర్ హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. -
ప్రస్తుత హైకోర్టు.. తెలంగాణ ఆస్తి
కొత్తగా రావాల్సింది ఏపీకేనన్న హైకోర్టు ధర్మాసనం అప్పటివరకు రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టు తెలంగాణకు కోర్టు కావాలనడం విభజన చట్టానికి విరుద్ధం కేంద్ర న్యాయ మంత్రి రాసిన లేఖ సెక్షన్ 31కి వ్యతిరేకం మంత్రి లేఖనైనా సవరించాలి లేక పునర్విభజన చట్టాన్నైనా మార్చాలి ఇప్పటివరకు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ అందించాలని రిజిస్ట్రీకి ఆదేశం చట్టంలో నిర్దిష్ట కాలపరిమితి లేనప్పుడు జాప్యమన్న ప్రసక్తే లేదని వ్యాఖ్య హైకోర్టు విభజనపై కౌంటర్లు వేయాలని కేంద్రం, ఇరు రాష్ట్రాలకు ఆదేశం సమాధానాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటామన్న ధర్మాసనం తీర్పు ఏదైనా న్యాయవాదులు ఆందోళనలు చేపట్టరాదని హితవు జరగరానిది జరిగితే కోర్టు ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరిక విచారణలో అమికస్ క్యూరీలుగా మనోహర్, విద్యాసాగర్ నియామకం సాక్షి, హైదరాబాద్: ‘విభజన చట్టం ప్రకారం ప్రస్తుత హైకోర్టును తెలంగాణ ఆస్తిగానే భావించాలి.. కొత్తగా ఏర్పాటు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే’ అని రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు విభజన విషయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖను తప్పుబట్టింది. ఈ అంశానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను తమ ముందుంచాలని కోర్టు రిజిస్ట్రీని సోమవారం ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దీనిపై లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఇందుకోసం సీనియర్ న్యాయవాదులు ఇ.మనోహర్, జి.విద్యాసాగర్‌ను కోర్టు సహాయకులు(అమికస్ క్యూరీ)గా నియమించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రంతోపాటు ఇరు రాష్ర్ట ప్రభుత్వాలను ఆదేశించింది. హైకోర్టు విభజనకు తక్షణమే చర్యలు చేపట్టేలా కేంద్రంతోపాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త టి.ధన్‌గోపాల్‌రావు హైకోర్టులో గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీని విచారణ సందర్భంగా హైకోర్టుకు ఇటీవల కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘తెలంగాణ హైకోర్టు ఏర్పాటు విషయాన్ని పరిశీలించాలనడం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత హైకోర్టే ఇరు రాష్ట్రాలకూ ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఉన్న ప్రస్తుత హైకోర్టును చట్ట ప్రకారం తెలంగాణ ఆస్తిగా భావించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే. దీని ప్రకారం న్యాయ శాఖ మంత్రి లేఖనైనా సవరించాలి. లేకపోతే పునర్విభజన చట్టాన్నైనా సవరించాలి’ అని వ్యాఖ్యానించింది. కౌంటర్లు పరిశీలించాకే నిర్ణయం తొలుత పిటిషనర్ ధన్‌గోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనలో ఆలస్యం జరుగుతోందని, ఈ విషయంలో తక్షణమే చర్యలు చేపట్టేందుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఇందుకు పునర్విభజన చట్టంలో నిర్దిష్ట కాల పరిమితేమీ లేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పునర్విభజన చట్టంలో నిర్దిష్ట కాల పరిమితి లేనప్పుడు, ఇక ఆలస్యమన్న మాటే ఉత్పన్నం కాదని వ్యాఖ్యానించింది. వెంటనే తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడ గత వారం రాసిన లేఖ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు విషయాన్ని చూడాలని అందులో కోరినట్లు పేర్కొంటూ... ఆ లేఖను ధర్మాసనం ముందుంచారు. దాన్ని పరిశీలించిన ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఆ లేఖ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 31కి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందంటూ పలు వ్యాఖ్యలు చేసింది. ఏదేమైనా ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కౌంటర్లను పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదులను ఆదేశిస్తుండగా, ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. హైకోర్టు విభజనపై ఏపీ సర్కారు ఇప్పటికే తన అభిప్రాయాలను సుప్రీంకోర్టుకు విన్నవించినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే ఏం చెప్పినా కౌంటర్లోనే చెప్పాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ కేసులో తీర్పు ఏదైనప్పటికీ న్యాయవాదులు ఏ రకంగానూ ఆందోళనలు చేయడానికి వీల్లేదని, ఏదైనా జరగరానిది జరిగితే న్యాయవాదులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. విభజనకు సంబంధించి హైకోర్టులో జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను తమ మందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. -
ఉమ్మడి సంస్థలన్నీ మావే!
కేంద్ర హోంశాఖ సమీక్షలో తెలంగాణ ప్రభుత్వం వాదన విభజన చట్టంలోని నిబంధనను ఎత్తిచూపిన సీఎస్ రాజీవ్ శర్మ పదో షెడ్యూల్లోని సంస్థలను ఉమ్మడిగా ఉంచాలన్న ఏపీ సీఎస్ హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని విజ్ఞప్తి అన్నింటిపై న్యాయ సలహా తీసుకుంటామన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పీటముడి పడిన విభజన అంశాలపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాలతోపాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ఎవరికీ కేటాయించని సంస్థలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పదో షెడ్యూల్లోని సంస్థలు ఉమ్మడి నిర్వహణ కింద ఉండాలని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రతిపాదించగా.. రాష్ర్ట ప్రభుత్వం అందుకు విబేధించింది. భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలను ఆ ప్రాంతానికే కేటాయించాలని సీఎస్ రాజీవ్ శర్మ తన వాదన వినిపించారు. ఆయా సంస్థల పేర్లలో ‘ఏపీ’ పదం ఉన్నంత మాత్రాన.. వాటి నియంత్రణ, నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చేతిలోనే ఉంటుందని భావించరాదని స్పష్టం చేశారు. భౌగోళికంగా అవి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే కేటాయించాలని విభజన చట్టమే చెబుతోందని ప్రస్తావించారు. చట్టంలో ఎలాంటి నిబంధన లేనందున ఉమ్మడి నిర్వహణ అన్నదే ఉత్పన్నం కాదని తోసిపుచ్చారు. చట్టంలో లేని ఏ విషయంలోనూ టీ సర్కారు హక్కులు కోరడం లేదని గుర్తు చేశారు. షెడ్యూలు తొమ్మిదిలోని సంస్థలకు సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడుంటే అక్కడున్న ఆస్తులన్నీ హెడ్ క్వార్టర్ ఆస్తులుగా పరిగణించడం సరికాదన్నారు. మరోవైపు పదో షెడ్యూలులోని సంస్థలను ఉమ్మడి నిర్వహణలోనే ఉంచాలని.. ఉమ్మడి రాష్ట్రంలో ఆ సంస్థలకు సమకూరిన నిధులను న్యాయబద్ధంగా 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఉద్యోగుల విభజనను రెండు ప్రభుత్వాల పరస్పర సంప్రదింపులతో చేయాలని, సమస్యల పరిష్కారానికి వీలుగా తటస్థ అథారిటీ ఏర్పాటుకు సెక్షన్ 8 కింద నిబంధనలు రూపొందించాలని కోరింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని కూడా ఏపీ సీఎస్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ సమావేశంలో షెడ్యూల్ 7లోని సంస్థలకు సంబంధించిన నిధులపై కూడా చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల వాదనలను విన్న కేంద్ర హోంశాఖ బృందం.. ఈ వివరాలన్నీ కేంద్ర న్యాయ శాఖకు తెలియజేసి న్యాయసలహా తీసుకుంటామని చెప్పింది. సీఎస్ల మధ్య వాగ్యుద్ధం విభజన వివాదాల పరిష్కారంపై జరి గిన భేటీలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికృష్ణారావు, తెలంగాణ సీఎస్ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ సమక్షంలో ఇరువురు సీఎస్‌లూ వాడివేడిగా వాదించుకున్నారు. ఎవరు ఏమన్నారంటే.. ఏపీ సీఎస్ కృష్ణారావు 1. హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించండి. ఆంధ్ర ఉద్యోగుల్ని తెలంగాణ ఉద్యోగ సంఘాలు వివక్ష గురిచేస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిని నివారించేందుకుగాను శాంతి భద్రతలను గవర్నర్‌కే అప్పగించాలి. 2. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను టీ సర్కార్ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. అధికారులను నియమించుకుంది. 3. కాలుష్య నియంత్రణ మండలి, న్యాక్లను తెలంగాణ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. 4. పదో షెడ్యూల్లో సంస్థల నిర్వహణ, పరిశీలన ఉభయ రాష్ట్రాల యాజమాన్యంతో ఉండాలి. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ 1. ఏపీ ఉద్యోగులకు ఎలాంటి వేధింపులూ లేవు. గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించడంపై అభ్యంతరం. 2. అలా చేయలేదు. అభ్యంతరం చెబుతున్నాం. 3. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం. 4. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం. -
ఏపీకి ఇవ్వాల్సినవి ఇస్తున్నాం
విభజన చట్టంలో హామీల అమలుకు కాస్త టైం పట్టొచ్చు చంద్రబాబు విమర్శలను సమర్ధించను, తప్పుపట్టను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన అన్ని నిధులనూ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నామని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్ర అవసరాలతో పోల్చితే కేంద్రం ఇస్తున్న నిధులు తక్కువగా కనిపించి ఉండొచ్చన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పలువురు నేతలతో కలసి శనివారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో హామీల అమలుకు కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. కార్యరూపం దాల్చేందుకు సమయం పట్టొచ్చన్నారు. దీనిపై ఏపీకి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు కొనసాగుతాయని తెలిపారు. తన వంతుగా ఆయా చర్చల విషయాలను సీఎం చంద్రబాబుకు తెలియజేస్తున్నట్టు చెప్పారు. హామీల అమలుకు సంబంధించి కేంద్ర ప్రయత్నాలపై బాబుకు అవగాహన ఉందన్నారు. నిధుల కేటాయింపుపై చంద్రబాబు చేసిన విమర్శలను తాను సమర్ధించడం లేదని అలాగే తప్పుపట్టడమూ లేదని సీతారామన్ అన్నారు. కేంద్రానికి వివక్ష లేదు తెలంగాణ విషయంలోనూ కేంద్రం ఎలాం టి వివక్షా చూపబోదన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడే అంశాల్లో తప్ప రాష్ట్రాలకిచ్చే వాటాల్లో ఎలాంటి తేడా ఉండదన్నారు. 13వ ఆర్థిక సంఘం సమయంలో రాష్ట్రాలకిచ్చే 32 శాతం నిధులు, 14వ ఆర్థిక సంఘంలో 42 శాతానికి పెంచడం వల్ల కేంద్ర ఆదాయ వనరులు తగ్గిపోయాయన్నారు. తెలంగాణలో అమలు చేయాల్సిన పథకాలపై తాను ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూనే ఉన్నానన్నారు. తెలంగాణలో లాజిస్టిక్ హబ్ ఏర్పాటుపై టీ ప్రజా ప్రతినిధులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారని, దీనికి సంబంధించి కేంద్ర అధికారులు రాష్ట్రంలో పర్యటించి స్థల పరిశీలన కూడా చేశారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ధాన్యం లెవీ విధానంలో వచ్చే ఏడాది నుంచి ఎలాంటి మార్పులూ ఉండబోవని తెలిపారు. రాష్ట్రాలు తమకు తామే ధాన్యం సేకరించుకోడానికి ముందుకొస్తే ఆ రాష్ట్రంలో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని.. మిగిలిన రాష్ట్రాల్లో ఎఫ్‌సీఐ కొనుగోళ్లు యథావిధిగానే కొనసాగుతాయని చెప్పారు. నల్లధనాన్ని రప్పించడంపై మోదీ ప్రభుత్వం పురోగతి సాధిస్తూనే ఉందన్నారు. -
తెలంగాణ అప్పు రూ.80 వేల కోట్లు
2 రాష్ట్రాలమధ్య ప్రాథమికంగా అప్పుల వాటాలు పంచిన కేంద్రం విభజన నాటికి ఆడిట్ అయిన మేరకు రాష్ట్రంవాటా రూ.61,711 కోట్లు ఆడిట్ పూర్తయితే మరో రూ. 10 వేల కోట్లు పెరిగే అవకాశం తొలి ఏడాదిలో సర్కారు చేసిన అప్పు మరో రూ. 10 వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: అప్పులు.. వడ్డీల భారం తెలంగాణ రాష్ట్రాన్ని వెంటాడుతోంది. గత ఏడాది అప్పులపై వడ్డీలకు రూ.5,925 కోట్లు చెల్లించిన ప్రభుత్వం.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వడ్డీల చెల్లింపులకు రూ.7,554 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది. రాష్ట్ర పునర్విభజన నాటికి ఉన్న ఆస్తులు, అప్పుల వాటాలను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ప్రాథమికంగా పంపిణీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొత్తం అప్పులు 1,48.060.22 కోట్లు. ఈ అప్పుల పంపిణీలో తెలంగాణ వాటా రూ.61,711.50 కోట్లుగా లెక్క తేలింది. విభజన నాటికి ఆడిట్ పూర్తయిన గణాంకాలనే కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. అప్పులకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదని.. ఆడిట్ పూర్తయితే మరో రూ.10 వేల కోట్ల అప్పు తెలంగాణ వాటాకు జమ అవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి తోడు తొలి ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సర్కారు రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చింది. ఈ లెక్కన రాష్ట్రం చేసిన అప్పు రూ. 80 వేల కోట్లు దాటుతుందని అంటున్నారు. జీతాలు.. పెన్షన్ల భారం.. వేతన సవరణతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ప్రభుత్వంపై అదనపు భారం మోపాయి. గత ఏడాది ఉద్యోగుల జీతాలకు రూ.16,965.33 కోట్లు ఖర్చు చేయగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20,045.23 కోట్లు ఖర్చు అవుతుందని ఈ బడ్జెట్లో సర్కారు అంచనా వేసింది. దీంతో పాటు ఉద్యోగులకు చెల్లించే పెన్షన్లకు రూ.8,235.87 కోట్లు అవసరమని లెక్కలేసింది. అలాగే ఆహార భద్రత.. హాస్టళ్లు, మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం పంపిణీ భారం రాష్ట్ర సర్కారుకు తడిసి మోపెడవుతోంది. దీనికితోడు ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్లలో భారీగా కోతపడింది. -
పంట భూములు లాక్కోవడానికి మేం వ్యతిరేకం: జగన్
రైతులను ఇబ్బంది పెట్టే ఏ చర్యకైనా మా మద్దతు ఉండదు ‘హోదా’ను విభజన చట్టంలో చేర్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్,ఆర్థికమంత్రి జైట్లీతో జగన్ భేటీ విభజన హామీలన్నీ నెరవేర్చాలని వినతి సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి పచ్చని పంట భూములను బలవంతంగా లాక్కోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ఏ చర్యకైనా తమ పార్టీ మద్దతు ఉండబోదని ఉద్ఘాటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆదివారమిక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని జగన్ కలిశారు. ఆయన వెంట పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి. వైఎస్ అవినాశ్‌రెడ్డి ఉన్నారు. ఉదయం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిసిన అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్లమెంట్ సమావేశాలు ఈనెల 23 నుంచి మొదలవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి అంశాలను మరోసారి గుర్తుచేయడం కోసం హోంమంత్రిని కలిశాం. రాష్ట్రానికి సంబంధించిన ప్యాకేజీలు, సీఆర్డీఏ వల్ల రైతులకు జరుగుతున్న అన్యాయం, డ్యాముల్లో గేట్లు ఎత్తి భావోద్వేగాలను రెచ్చగొట్టడం వంటి అంశాలపై రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించాం. ప్రధాని, రైల్వే మంత్రి అపాయింట్మెంట్లు కూడా అడిగాం. ఈ ఎనిమిది నెలల్లో వారిని కలవడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు మేం ఢిల్లీకి వచ్చి ప్రధాని మొదలుకుని అందరినీ కలిశాం. రాష్ట్రానికి సహాయం అందించాలని వినతిపత్రాలు ఇచ్చాం. అందులో భాగంగానే ఇది మూడోసారి రావడం. బడ్జెట్ సమావేశాలు మొదలవనున్నందున మళ్లీ ఒకసారి వారికి గుర్తు చేయడం కోసం మా ధర్మం మేం చేస్తున్నాం. పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెనుకబడిన జిల్లాలు, పోలవరం ప్రాజెక్టు, జాతీయస్థాయి విద్యాసంస్థలు, రైల్వే జోన్ తదితర అంశాలపై వినతిపత్రం ఇచ్చాం’’ అని తెలిపారు. ప్రత్యేక హోదా రాకపోయినా అంతకంటే ఎక్కువ నిధులు సాధించుకుంటామని సీఎం చంద్రబాబు చెబుతున్నారు కదా.. ప్రత్యేక హోదాపై రాజ్‌నాథ్‌సింగ్ ఏమన్నారు అని విలేకరులు ప్రశ్నించగా ‘‘మేం మూడోసారి వచ్చి కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా నాలుగు అడుగులు ముందుకు వేసి కేంద్రాన్ని కోరుతున్నాం. మా ధర్మం మేం చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రయత్నం ఎలా ఉందని అడగ్గా.. ‘‘చంద్రబాబునాయుడు గారిని అడగాలి. ఆరోజు చంద్రబాబు కాంగ్రెస్, బీజేపీతో కలిసి దగ్గరుండి మరీ రాష్ట్రాన్ని విడగొట్టారు. ఎవ రూ కూడా ఆరోజు కనీసం రెండు రోజులు ఆగి ప్రతి అంశాన్నీ చట్టంలో చేర్చాలని యోచించలేదు. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండానే విడగొట్టారు. దీన్ని అప్పుడే చట్టంలో చేర్చి ఉంటే బహుశా ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ అప్పుడు మేం మొత్తుకుని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు ఆ రోజు దగ్గరుండి ఓటు వేయించారు. మొట్టమొదటి ఓటు మేమే వేశామని చేతులెత్తి చూపించారు. నిన్న వరంగల్‌కు వెళ్లినప్పుడు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం... రాష్ట్రాన్ని మేమే విడగొట్టామని చెప్పారు. విభజన సమయంలో అన్నీ హడావుడిగా చేశారు. ఈరోజు కొన్ని విషయాలు చట్టంలో కూడా లేవు కనుక... కోర్టులకెళ్లినా ఏ మేరకు న్యాయం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. అయినా ఆ రోజు ప్రధానమంత్రి సభలో ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేయాలని ప్రతిపక్షంగా మేం అభ్యర్థిస్తున్నాం’’ అని వివరించారు. ముఖ్యమంత్రికి ఏమీ ఎక్కడం లేదు.. ‘రాజధాని ప్రాంతంలో రైతుల భూములు బలవంతంగా లాగేసుకుంటున్నారు. అలాంటి వారిని ఏమైనా కేంద్రం వద్దకు తీసుకువచ్చే ఆలోచన ఉందా?’ అని విలేకరులు జగన్‌ను అడగ్గా... ‘‘సీఆర్డీఏకి సంబంధించి రైతులు ఎలా నష్టపోతున్నారు? రైతులకు ఇష్టం లేకున్నా వారిపై ఎలా ఒత్తిడి తెస్తున్నారన్న అంశాలను కూలంకశంగా వివరంగా చెప్పాం. రైతు ఒప్పుకుంటే ఫర్వాలేదు. కానీ ఒప్పుకోకున్నా అన్యాయంగా వారి వద్ద నుంచి భూములు తీసుకోవడం సరైన పద్ధతి కాదని మేం ముందు నుంచీ చెబుతున్నాం. ఇంతకు ముందు కూడా రైతులు కేంద్రం వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే మొన్న రైతులను తీసుకు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. రైతులు అంతకన్నా చేసేది ఏముంది? ఎన్నిసార్లు ఏం చేసినా మన ఖర్మ ఏందంటే.. చర్మం మందంగా ఉన్న ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. ఆ సీఎంకు ఏమీ ఎక్కడం లేదు. అది మన ఖర్మ’’ అని జగన్ మండిపడ్డారు. ‘భూసేకరణ చ ట్టం ఆర్డినెన్స్‌పై అన్నా హజారే ఈనెల 24 నుంచి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు. మీరు అందుకు మద్దతు ఇస్తారా..?’ అని ప్రశ్నించగా... ‘‘మేం మొదట్నుంచీ ఒకటే చెబుతున్నాం. అంశాలవారీగా మద్దతిస్తామని. భూసేకరణ చట్టానికి సంబంధించి మల్టీక్రాప్ ఏరియాను తీసుకోవడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుంది. సీఆర్డీఏలో అదే జరుగుతోంది. రైతుల దగ్గర నుంచి మల్టీక్రాప్ భూములను తీసుకునే కార్యక్రమం దౌర్జన్యంగా చేస్తున్నారు. కచ్చితంగా మేం దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రజలకు మంచి జరిగే విషయాల్లో కచ్చితంగా మద్దతిస్తాం. ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ అంశానికైనా మా మద్దతు ఉండదు. మిగిలిన ఇన్సూరెన్స్ బిల్లు పలు అంశాలపై పార్లమెంట్లో మా పార్టీ మద్దతు ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. -
‘విభజన’ పరిష్కారం ఇక వేగిరం!
గవర్నర్ చేతికి హైదరాబాద్ శాంతిభద్రతలు రూల్స్ జారీకి కేంద్ర హోంశాఖ సుముఖత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య విభజన వివాదాల పరిష్కారం ఇక వేగవంతం కానుంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎల్సీ గోయల్ నియామకం కావడంతో విభజన చట్టంలోని అంశాలను ఇక వేగంగా అమలుచేసే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ జె.వి.రాముడు భావిస్తున్నారు. బుధవారంనాటి ఢిల్లీ పర్యటనలో సీఎస్, డీజీపీలు ప్రత్యేకంగా హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమై విభజన అంశాలను వివరించారు. ఈ క్రమంలో గోయల్ సానుకూలంగా స్పందించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలి వరకు హోం కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామి కాలయాపన చేశారని, ఇప్పుడా పరిస్థితి ఉండదని ఏపీ కూడా భావిస్తోంది. విభ జన చట్టంలోని సెక్షన్ 8(సి) మేరకు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పదేళ్లపాటు గవర్నర్ పర్యవేక్షించాలి. దీనికి కేంద్ర హోంశాఖ రూల్స్ జారీ చేయలేదు. దీనిపై స్పందించిన గోయల్.. సాధారణ రూల్స్ జారీ చేయవచ్చని అన్నట్టు తెలిసింది. ఉద్యోగుల పంపిణీని కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల మేరకు లేదా జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సంస్థల ఆస్తుల పంపిణీ విషయంలో చట్టంలో హెడ్ క్వార్టర్స్ అని ఉండడంతో టీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ సంస్థల్లోని ఆస్తుల పంపిణీకే అంగీకరిస్తామని, మిగతా సంస్థల పంపిణీకి అంగీకరించబోమని పేర్కొంది. దీనిపై హెడ్ క్వార్ట ర్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సంస్థలే అంటే కుదరదని, ఆర్టీసీకి ఉమ్మడి రాజధానిలో బాడీ బిల్డింగ్ యూనిట్‌ను, ఆసుపత్రిని నిర్మించారు దానిలో కూడా వాటా కావాలని ఏపీ కోరుతోంది. దీనిపై కూడా కేంద్రం వివరణ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 10వ షెడ్యూల్లో 107 సంస్థలుండగా ఆ సంస్థలు పదేళ్ల పాటు ఉమ్మడి యాజమాన్యంలో పనిచేసేలా ఇరు రాష్ట్రాలూ అవగాన ఒప్పందాలు చేసుకునేలా హోంశాఖ చర్యలు చేపట్టనుంది. -
పూర్తి సాయానికి పూచీ ఏదీ?
అడ్డగోలు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరు కుపోయింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడి నిండా ఏడాది నిండలేదు. బాలా రిష్టాలు, తప్పటడుగుల దశ ఇంకా దాటనే లేదు. ఈ సమయం లోనే కేంద్రప్రభుత్వం ఎక్కువగా ఆదుకోవలసి ఉంటుంది. అది కేంద్రం బాధ్యతే కాదు. ఈ రాష్ట్ర ప్రజల హక్కు కూడా. ఆ మేరకు మునుపటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాడు పార్లమెంటు వేదికగా హామీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆశించినంత స్పందన కేంద్రం నుంచి లేకపోవటం దారుణం. వేల కోట్ల రూపాయల చేయూతకి పూచీ పడి అందులో పదో వంతు కూడా విదిల్చకపోవడం, ప్రత్యేక హోదా విష యమై మౌనం దాల్చడం, ఇతరహామీలను ఉపేక్షించడం రాష్ట్ర ప్రయో జనాలకు తీవ్ర భంగకరం. తీరా ప్రజల నుంచి ఒత్తిడి సెగ తగలడం మొదలయ్యేసరికి ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రం మంత్రులు సన్నాయి నొక్కులు మొదలెట్టారు. రాష్ట్ర భవితకు బంగారు ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం తీరా అమలు చేయాల్సిన సమయంలో బఠాణీల ప్యాకేజీతో సరిపుచ్చటానికి ప్రయత్నించడాన్ని అందరూ ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలూ రాష్ట్ర హక్కులకై కలిసి రావాలి. ఇందులో అధికార పక్షానికి, ముఖ్యమంత్రికి మరింత బాధ్యత ఉంది. - డాక్టర్ డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం -
విభజన హామీలన్నీ నెరవేరుస్తాం
పన్ను రాయితీలు ప్రారంభం మాత్రమే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్ర ఆర్థిక అంశాలపై జైట్లీతో చర్చించిన సీఎం చంద్రబాబు సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలోని అన్ని హామీలు తప్పక నెరవేరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాయితీలు సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికసాయం ఇతర అంశాలపై చర్చించారు. విభజన చట్టంలో పేర్కొన్న పలు ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లోచోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి ఏడు నెలల్లో వచ్చిన ఆదాయం, ఇతర ఆర్థిక ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. ప్రత్యేక హోదాపై అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయని సాకుగా చూపి తాత్సారం చేయడం తగదని, ఈ అంశంపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక హోదాపై అనుమానాలొస్తున్నట్లుగా పత్రికల్లో వచ్చిన కథనాలను చూపించారు. అనంతరం సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడారు. ‘నీతి ఆయోగ్ సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నేను కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక విషయాన్ని స్పష్టం చేయదలచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, విభజన సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుంది. గత వారం మేం ప్రకటించిన కొన్ని రాయితీలు ప్రారంభం మాత్రమే. మిగిలిన అన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయనడానికి అదే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు మాత్రమే అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. మేం క్రమంగా అన్నీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వీలైతే చెప్పిన దానికంటే ఎక్కువే చేసే అవకాశం ఉంది’ అని అరుణ్‌జైట్లీ చెప్పారు. సీఎం చంద్రబాబుతోపాటు అరుణ్‌జైట్లీతో భేటీలో కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, టీడీపీ ఎంపీలు తోట నర్సింహం, కొనకళ్ల నారాయణ, సీఎం రమేశ్, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు, ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ తదితరులున్నారు. జైట్లీతో భేటీ అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కి తిరిగి వెళ్లారు. -
అమ్మకానికి హౌసింగ్ భూములు!
స్థలాల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం భూములు విక్రయిస్తారనే ప్రచారం.. గృహ నిర్మాణ మండలి అధీనంలో ఉన్న స్థలాల విలువ రూ. 10 వేల కోట్లు ఇప్పటికే హైదరాబాద్‌లోని 1,800 ఎకరాల లెక్కలు సీసీఎల్ ఏకు.. ‘దిల్’కు చెందిన రూ. 6 వేల కోట్ల భూముల వివరాలు సేకరణ సాక్షి, హైదరాబాద్: ఆ సంస్థ చేతిలో ఉన్న భూముల విలువ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. పదివేల కోట్లు... ఒక్క హైదరాబాద్ పరిధిలో ఉన్న స్థలాల విలువే రూ. రెండు వేల కోట్లకు పైమాటే.. ఇంకేం ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి బంగారు బాతులా మారింది.. ఆ భూములన్నీ అమ్మేసి, నిధులన్నీ ఖజానాలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.. ఇంతకూ ఆ సంస్థ ఏదో తెలుసా..‘రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు)’ దీని పరిధిలో ఉన్న ఖాళీ స్థలాల వివరాలను ప్రభుత్వం శరవేగంగా సేకరిస్తోంది. రాజధాని చుట్టుపక్కల ఉన్న దాదాపు 1,800 ఎకరాల భూముల వివరాలు ఇప్పటికే సీసీఎల్ఏకు అందాయి. హౌసింగ్ బోర్డుకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.10వేల కోట్ల విలువైన భూములు ఉండగా... దీనికి అనుబంధంగా ఉన్న ‘దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్)’కు దాదాపు రూ. 6 వేల కోట్ల విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ మొత్తం వివరాలను ఇప్పుడు ప్రభుత్వం సేకరిస్తోంది. వీటిలో ఇప్పటికిప్పుడు గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ప్రభుత్వ మదిలో లేదు. సంక్షేమ పథకాలకు భారీగా నిధులు అవసరం ఉండటం, అందుకు సరి పడా ఆదాయ మార్గాలు లేకపోవటంతో ఈ భూముల అమ్మకం తథ్యమనే భావన వ్యక్తమవుతోంది. బోర్డు విభజన తర్వాతే.. తెలంగాణ, ఏపీల మధ్య ఇప్పటివరకు గృహనిర్మాణ మండలిని విభజించలేదు. దీంతో తొలుత దాని విభజనపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కూడా ఇదే విషయంపై చర్చించారు. వీలైనంత త్వరగా విభజన తంతు పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డులను వేరే విభాగంలో విలీనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అర్బన్ హౌసింగ్‌ను పురపాలకశాఖలో విలీనం చేయాలన్న ఓ ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉండటంతో దాన్ని కొలిక్కి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగుల్లో ఆందోళన.. ప్రభుత్వం భూముల వివరాలను సేకరిస్తుండడంపై గృహనిర్మాణ మండలి సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో, శివార్లలోని స్థలాల వివరాలను 3రోజులుగా ఉన్నతాధికారులు వెంటపడి మరీ తెప్పించుకున్నారని..వాటిని అమ్మే ఆలోచనలో ఉంటే తమ భవితవ్యమేమిటో ముందుగా చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సంస్థ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బుధవారం గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దానకిషోర్తో భేటీ అయ్యారు. గృహ నిర్మాణ మండలిని కొనసాగించని పక్షంలో తమనేం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ విషయంలో తనకూ స్పష్టత లేదని, విభజన తర్వాతే తెలుస్తుందని, ఇప్పటికిప్పుడు చెప్పటం సాధ్యం కాదని దానకిషోర్ పేర్కొనటంతో ఉద్యోగులు మరింత ఆందోళన చెందారు. తమది పెన్షనబుల్ ఉద్యోగమైనందున పింఛన్ భద్రత ఉండే నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
కోడ్‌కు ముందే పీఆర్సీ కూయాలి!
పీఆర్సీకి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ గండం! ముందే అమలు చేయకపోతే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో పీఆర్సీ అమలుకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అడ్డంకి మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెలలోనే మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగానే కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ఆ సమయంలో పీఆర్సీ అమలుచేసే పరిస్థితి ఉండదు. అదే జరిగితే ఉద్యోగులు పీఆర్సీ కోసం ఏప్రిల్ వరకు ఎదురుచూడకతప్పదు. 2013 జూలై 1 నుంచే అమల్లోకి తేవాల్సిన పీఆర్సీ ఇప్పటికే ఆలస్యమయిందన్న ఆందోళన ఉద్యోగులు, పెన్షనర్లలో ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జనవరి మూడో వారంలో పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించడంతో కొంత ఊరట చెందారు. అయితే రెండోవారంలో పీఆర్సీ నివేదికలోని సిఫారసుల పరిశీలన, ఉద్యోగ సంఘాలతో చర్చల కోసమంటూ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటుచేయడంతో మూడోవారంలో పీఆర్సీ అమల్లోకి రాలేదు. దీంతో పీఆర్సీ అమలులో జాప్యం చేస్తారేమోనన్న ఆందోళన ఉద్యోగుల్లో మళ్లీ మొదలైంది. మరోవైపు హైపవర్ కమిటీ ప్రస్తుతం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఈ సమావేశాలు ముగియనున్నాయి. సంఘాల డిమాండ్లతో కూడిన నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందజేయాలని సంఘాలు కోరుతున్నాయి. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే జారీ కానున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే పీఆర్సీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్యలు చేపట్టాలని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజనతో సంబంధం లేకుండా ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి సీఎం కేసీఆర్ పీఆర్సీని అమల్లోకి తేవాలని కోరారు. ఉద్యోగుల డిమాండ్ల మేరకు 69 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, వేతన వ్యత్యాసాలను తొలగించాలని, 2013 జూలై 1 నుంచే నగదు రూపంలో పీఆర్సీని అమల్లోకి తేవాలని కోరారు. రూ.3,500 ఏమాత్రం సరిపోవు: పోలీసు అధికారుల సంఘం ‘పోలీసు యూనిఫాం అలవెన్స్’ కింద రూ.3,500లు మాత్రమే ఇవ్వాలని పదోవేతన సవరణ సంఘం(పీఆర్సీ) తన నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేయడంపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పీఆర్సీ నివేదికలో కింది స్థాయి పోలీసులకు కేటాయింపులు సరిగా లేవని అభిప్రాయపడింది. పోలీసుల సమస్యలపై ఏ మాత్రం స్పందించలేదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన నేతృత్వంలో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు పీఆర్సీ హైపర్ కమిటీ చైర్మన్ ప్రదీప్ చంద్రను కలసి పోలీసుల సమస్యలను వివరించారు. అనంతరం ఓ ప్రకటన విడుదల చేశారు. అందులోని అంశాలు... 2005లో 8వ పీఆర్సీలో కానిస్టేబుళ్లను పైస్థాయి కేడర్‌తో సమానం చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల సీనియర్లకు అన్యాయం జరిగింది. ప్రతి 5 సంవత్సరాల సీనియారిటీకి ఓ ఇంక్రిమెంట్ చొప్పున 20 ఏళ్ల సర్వీసు ఉన్న వారికి 4 ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తేనే సీనియర్లకు న్యాయం జరుగుతుంది. కిందిస్థాయి పోలీసులకు పీఆర్సీ కేవలం రూ.300 పెట్రోల్ అలవెన్స్‌ను మాత్రమే సిఫారసు చేసింది. కనీసం నెలకు 30 లీటర్ల పెట్రోల్‌ను మంజూరు చేయాలి. ప్రస్తుతం రిస్కు అలవెన్స్‌గా రూ.150 మాత్రమే ఇస్తున్నారు. దానిని బేసిక్‌లో 15 శాతానికి పెంచాలి. ట్రాఫిక్ పోలీసులకు బేసిక్‌లో 30 శాతం పోల్యూషన్ అలవెన్స్ మంజూరు చేయాలి. కానిస్టేబుల్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న రవాణా భత్యాన్ని రూ.150 నుంచి రూ.300కు పెంచాలి. కనీస వేతనం రూ.15 వేలు ఉండాలి. పదవి విరమణ గ్యాట్యుటీని పీఆర్సీ రూ.8లక్షల నుంచి రూ.12 లక్షలకు సిఫారసు చేసింది. దానిని రూ.20లక్షలకు పెంచాలి. -
ప్రత్యేక హోదా లేదు.. నిధులూ తేలేదు
విభజన నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం రెవెన్యూ లోటుపై రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు నమ్మని కేంద్రం హామీలు అమలు చేయాలని కేంద్రానికి సీఎస్ లేఖ హైదరాబాద్: అభివృద్ధిపై ప్రచారం చేసుకోవడంలో ముందుండే రాష్ట్ర ప్రభుత్వం.. విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తామన్న నిధులు తెచ్చుకోవడంలో మాత్రం పూర్తిగా వెనుకబడింది. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై నోరుమెదపని చంద్రబాబు సర్కార్.. రావాల్సిన నిధులు రాబట్టడంలోనూ వైఫల్యం చెందింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. అయితే దానికి బదులుగా కొన్ని పథకాలకు గ్రాంటు రూపంలో కొంత, రుణం రూపంలో మరికొంత ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆ వర్గాలు చెప్పాయి. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి రూ. 24,350 కోట్ల రూపాయల సాయం అందించాలని రాష్ట్రం కోరింది. దీనిపై కూడా కేంద్రం పలు ప్రశ్నలు సంధించించి. వ్యయ వివరాలు పంపాలని కోరింది. ఆ వివరాలు పంపితే ఆయా ప్రాంతాల్లో జిల్లాకు కేవలం రూ. 75 కోట్లు మాత్రమే వస్తాయని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేంద్రం నుంచి అందాల్సిన నిధులు, అమలు చేయాల్సిన విభజన హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టకుండా.. ఎక్కువగా విదేశీ పర్యటనలతోనే కాలక్షేపం చేయడం వల్ల నిధులు రాబట్టడంలో వెనుకబడిపోయాయని ఉన్నతాధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రణాళికేతర రెవెన్యూ లోటుపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలను నమ్మని కేంద్రం కొర్రీల మీద కొర్రీలు వేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర అధికారులకు కేంద్రానికి సమాధానాలు చెప్పడమే సరిపోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం పది నెలల కాలానికి రూ. 12,000 కోట్ల రెవెన్యూ లోటు, కేంద్ర అమ్మకం పన్ను పరిహారంగా రూ. 1,500 కోట్లు.. మొత్తం రూ. 13,500 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు స్పందిస్తూ.. 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు మాత్రమే రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. అలాగే రాజధాని నిర్మాణానికి సహాయం విషయంలో కూడా సమగ్రమైన నివేదిక ఇస్తేనే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే. ఇక పారిశ్రామిక రాయితీలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సమానంగా ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిధుల దుబారాపై కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్పాదక వ్యయానికి నిధులు తగ్గించి రెవెన్యూ వ్యయానికి భారీగా వెచ్చించడమే కేంద్ర అసంతృప్తికి కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడు నెలలైనా పైసారాలేదు: సీఎస్ విభజన జరిగి ఏడు నెలలు గడిచినా ఇప్పటి వరకూ కేంద్రం నుంచి గ్రాంటుగా గానీ, రెవెన్యూ లోటు భర్తీకి సంబంధించిగానీ రాష్ట్రానికి పైసా రాలేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఆర్.పి.వాఠల్కు లేఖ రాశారు. విభజన చట్టం సెక్షన్ 46 (2)లో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని పేర్కొన్నారని ఆ లేఖలో సీఎస్ గుర్తు చేశారు. -
మొగసాల
- రచన: ఎం.వి.రమణారెడ్డి వాతావరణంలోని ఆటుపోట్లను నిబ్బరించుకునే మార్పులు ఏ జీవి సంతరించుకుందో అది మాత్రమే కాలప్రవాహంలో నిలుస్తుంది, లేనివన్నీ నశిస్తాయి. దాన్ని ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’- అంటే, ‘సమర్థతతో సాటిలేనిది మాత్రమే ప్రాణాలతో నిలవడం’ అంటారు. ‘అహం బ్రహ్మస్మి’ అంటూ కొత్తగా తయారైన క్రోమొజోమ్ సృష్టికార్యం మొదలెట్టింది. ఒక దశవరకు బాగా బలుస్తుంది, బలిసి బలిసి రెండు సమానభాగాలుగా చీలిపోతుంది. చీలిన ముక్కల్లో దేనికది విడివిడిగా జీవిస్తూ, అవి తమ వంతుగా తిరిగి రెండు రెండుగా చీలిపోతూ, దేనికది రెట్టింపు సంఖ్యను ఉత్పత్తి చేస్తూ, తరతరానికి రెండు రెట్లు, నాలుగు రెట్లు, ఎనిమిది రెట్లుగా ‘జామెట్రిక్’ పద్ధతిలో జనాభాను పెంచుకుపోతాయి. కణంలో జరిగే ఆ విభజన అస్తవ్యస్తంగా ఉండేదిగాదు; కచ్చితమైన పద్ధతిని అనుసరించేది. జీవలక్షణాలకు పునాది ‘క్రోమొజోమ్’ అయినందున, కణవిభజన దానితోనే మొదలౌతుంది. ఒకటిగావచ్చు, రెండుగావచ్చు, ఇంకా ఎక్కువగావచ్చు - ఒక కణంలో ఎన్ని క్రోమొజోమ్లు ఉంటాయో ఆ మొత్తం నిట్టనిలువుకు చీలి, ఒక సగం ఒక ధ్రువానికీ, మరో సగం రెండో ధ్రువానికీ చేరుకుంటాయి. అవి ఇరువైపులకూ చేరిపోగానే, వాటి మధ్య విభజన పొర ఏర్పడుతుంది. అది అట్టపొరలా అడ్డంగా చీలిపోయి రెండు వేరువేరు కణాలుగా ఆ భాగాలను విడదీస్తుంది. ఆ ప్రక్రియ పూర్తికాగానే, మాతృకణంలోని క్రోమొజోముల సంఖ్యలో మార్పు జరగకుండా, ఒకే మోస్తరుగా కనిపించే రెండు విభిన్నజీవులు ఉనికిలోకి వస్తాయి. తరాలు ఎన్ని మారినా ఈ ప్రాథమిక దశలోని జీవికి తండ్రీ ఉండడూ, తల్లీ ఉండదు. మరణమూ ఉండదు. చావులేదని మాటవరుసకు అనుకున్నామేగానీ, దాని కష్టాలు దానికీ ఉన్నాయి. అది ప్రాణంతో ఉండేందుకు అవసరమైన తడి ఎల్లకాలం అందుబాటులోవుండే అవకాశం లేదు. తడి తగలని తావున చిక్కుకుపోతే ఎండకూ గాలికీ ఆరిపోయి ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏ జీవికైనా ఇది ప్రకృతితో జరిగే నిత్య సంఘర్షణ. అయితే, ఆ సంఘర్షణవల్ల సృజనాత్మకమైన జీవపరిణామానికి అంకురార్పణ కూడా జరిగింది. ఎలాగంటే - కొన్ని జీవులు ఒడ్డుమీద చిక్కుబడి, ఎండ తాకిడికి వాటిలోని జీవరసం ఆరిపోవడం మొదలెట్టిందనుకోండి... అప్పుడు, మొదట వాటి వెలుపలి భాగంలోవుండే రసం చిక్కబడటంతో ఆ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అంతలో ఏదైనా నీడ వాటిమీదికి జరిగితే, ఆ నీడపాటులోని జీవులు పూర్తిగా ఆరిపోకుండా తట్టుకుంటాయి. అదృష్టం కొద్దీ వర్షం కురిసినా, అలల తాకిడి మొదలైనా వాటికి ప్రాణం దక్కుతుంది. ప్రాణం దక్కడంతోపాటు, వాటి జీవరసం వెలుపలి భాగంలో చోటుజేసుకున్న మార్పు అలాగే నిలిచిపోతుంది. క్రమంగా ఆ మార్పు వాటి సంతానానికి సంక్రమిస్తుంది. ఇదివరకటి విపత్తు మరోసారి సంభవిస్తే, వెలుపలి పొరలో జీవరసం సాంద్రంగా మారిన జీవికి ఒడిదుడుకులు తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేగాదు, వాటిల్లో కొన్నిటికి సాంద్రత పెరిగిన జీవరసం తడవ తడవకూ మరింత గట్టిపడుతూ, వేలాది తరాల తరువాత రక్షణకవచముండే కొత్త జీవుల రూపకల్పనకు పునాది ఏర్పడుతుంది. ఈ పరిణామం ప్రతి జీవిలోనూ ఒకేలా జరగదు. వాతావరణంలోని ఆటుపోట్లను నిబ్బరించుకునే మార్పులు ఏ జీవి సంతరించుకుందో అది మాత్రమే కాలప్రవాహంలో నిలుస్తుంది, లేనివన్నీ నశిస్తాయి. దాన్ని ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’- అంటే, ‘సమర్థతతో సాటిలేనిది మాత్రమే ప్రాణాలతో నిలవడం’ అంటారు. మరోవైపు నుండి చూస్తే - సమర్థత కలిగిన వాటిని మాత్రమే తనతోపాటు కొనసాగేందుకు ప్రకృతి ఎంపిక చేసుకుంటూ, లేనివాటిని తుడిచేస్తున్నది గాబట్టి, ఈ విధానాన్ని ‘నేచురల్ సెలెక్షన్’ అని కూడా అంటారు. ఈ పరిణామ సిద్ధాంత పితామహుడు ఛార్లెస్ డార్విన్ అనే బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు. ఎన్నో దృష్టాంతరాలతో తన సిద్ధాంతాన్ని నిరూపించి, జీవశాస్త్ర అభ్యాసానికి ఆయన కొత్తదారి చూపించాడు. దాంతో మానవుని చరిత్రను అధ్యయనం చేసే విధానం విప్లవాత్మకంగా పురోగమించింది. ఇంతకుముందు మనం చెప్పుకున్న జీవపదార్థాల పరిణామం తేలిగ్గా అవగాహన కలిగించేందుకు ఉద్దేశించిన నమూనా మాత్రమే గానీ శాస్త్రీయ ప్రమాణాలకు సాటిరాగలదిగాదు. పరిణామం ద్వారా సంక్రమించే మార్పులు అప్పటికప్పుడు భూతద్దంతో పసిగట్టేందుకు వీలయ్యేంత స్వల్పవ్యవధి వ్యత్యాసాలుగావు. వేల సంవత్సరాల సమయం తీసుకునేవి. వాటిల్లో భౌతికమైన మార్పులేకాదు, క్లిష్టమైన రసాయనిక పరివర్తనలు కూడా ఉంటాయి. భౌతికమైన మార్పుల్లో గుణాత్మకమైనవీ ఉంటాయి, పరిమాణాత్మకమైనవీ ఉంటాయి, సంఖ్యాపరమైనవీ ఉంటాయి. సంఖ్య విషయానికి వస్తే - ఇంతదాకా మనం ఒకే కణంగావుండే క్రిమిని గురించి మాట్లాడుకుంటూ, అది రెండు విడివిడి జీవులుగా తెగిపోవడం ద్వారా జాతిని విస్తరిస్తుందని అనుకున్నాంగదా, అంతర్గత విభజన పూర్తిగా జరిగిన తరువాత, రెండుగా విడిపోయే దశలో ఏదైనా ఆటంకం ఎదురైతే, కణాలు రెండూ అంటుకునే ఉండిపోయి రెండు కణాల జీవిగా నిలిచిపోతుంది. అలా కొంతకాలానికి బహుకణ జీవులు ఉనికిలోకి వస్తాయి. ఎక్కువైన కణాల వల్ల దాని సైజు పెరిగి, ఇరుగుపొరుగు ప్రాణులకు మింగుడుకానంత పెద్దదిగా ఏర్పడడంతో, ఆ తరహా ప్రమాదాలను అధిగమించి, ప్రకృతిలో కొనసాగే అర్హత పొందుతుంది. -
సంపూర్ణ తెలంగాణ కోసం పోరాటం
తెలంగాణ విద్యావంతుల వేదిక ముగింపు మహాసభలో ప్రొఫెసర్ కోదండరాం పౌర సమాజ పాత్ర కీలకం: ప్రొఫెసర్ హరగోపాల్ కొత్త కార్యవర్గం, ఏడుగురితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: ‘పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా ఉం డాలి. ఇలా ఉండడానికి ఉమ్మడి వ్యవస్థను విభజన చేయాలి. ఉమ్మడి రాజధాని, హైకోర్టు, కార్పొరేషన్ల విభజన జరగాలి. ఇలా.. సంపూర్ణ తెలంగాణ కోసం పోరాటం చేద్దాం..’ అని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) 5వ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. చివరిరోజైన ఆదివారం ప్రతినిధులసభ జరిగింది. అనంతరం విలేకరులతో మాట్లాడిన కోదండరాం టీవీవీ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. తెలంగాణలో అభివృద్ధి ఫలాలు అంద రికీ అందాలని, ఆ దిశగా పారిశ్రామిక, వ్యవసాయ, సామాజిక సంక్షేమ విధానాలు ఉండాలని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక రం గాల్లో తెలంగాణ ప్రజలకు అభివృద్ధి ఫలాల్లో వాటా దక్కేలా, అన్ని వర్గాల ప్రజలకు గౌరవప్రదమైన జీవితం దక్కేలా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా పోరాటం చేస్తామని కోదండరాం వివరించారు. టీవీవీ మహాసభల్లో ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ప్రసంగించారు. ప్రతినిధుల ద్వారా అందిన సమాచారం మేరకు ‘పౌరసమాజ పాత్ర ఎంతో కీలకం. ఎక్కడైనా స్వేచ్ఛగా మాట్లాడుకునే వీలుండాలి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి..’ అని ఆయన పరోక్షంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి అభిప్రాయపడ్డారు. విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రజల గొం తుకగా ఉండాలని ఆయన అభిలషించారు. ‘మేము అకడమిషన్స్.. చరిత్ర చెప్పే అవకాశం వచ్చింది. దానిని సద్వినియోగం చేస్తాం. అంతేకానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఉన్నంత మాత్రాన ప్రభుత్వంతో సంబంధం ఉందని అనుకోవద్దు..’ అని హరగోపాల్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ కూడా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. పదహారు అంశాలపై తీర్మానాలు టీవీవీ మహాసభల్లో పదహారు అంశాలపై తీర్మానాలు చేశారు. తెలంగాణలోని ప్రైవేటు పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, రైతుల ఆత్మహత్యల నివారణకు నూతన వ్యవసాయ విధానాన్ని ప్రకటించాలని వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సినీ పరిశ్రమకు రాచకొండ, ఇతర చారిత్రక ప్రదేశాల్లో భూముల కేటాయింపుపై పునరాలోచించాలని, మానవ, పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న ఫార్మాసిటీల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేసింది. రెండు రాష్ట్రాల మధ్యా ఉద్యోగుల విభజనను వెంటనే పూర్తి చేసి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, సీమాంధ్రలో విలీనం చేసిన ముంపు మండలాలను.. ఆ ప్రాంత ఆదివాసీల అభీష్టం మేరకు తెలంగాణలో ఉండేలా విభజన బిల్లును సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి పేరుతో హుస్సేన్‌సాగర్ చుట్టూ భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరింది. మిషన్ కాకతీయకు వేదిక సంపూర్ణ మద్దతు తెలిపింది. ఏడుగురితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు టీవీవీ అధ్యక్షుడిగా పనిచేసిన మల్లేపల్లి లక్ష్మయ్య ఈసారి పక్కకు తప్పుకున్నారు. కానీ, టీవీవీ విధాన నిర్ణయాలు ఖరారు చేసేందుకు, రోజువారీ కార్యక్రమాలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీకి ఆయన కన్వీనర్‌గా పనిచేయనున్నారు. కన్వీనర్ సహా ఏడుగురితో ఏర్పాటైన స్టీరింగ్ కమిటీలో ప్రొఫెసర్ కోదండరాం, ప్రస్తుత అధ్యక్షుడు రవీందర్రావు, ధర్మార్జున్, స్వర్ణలత, టి.యాదయ్య, ఆర్.విజయ్‌కుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. కాగా, 26 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు కాగా.. ఇందులో 15 మంది సభ్యులుగా ఉన్నారు. -
గందరగోళంలో ఆరోగ్యశ్రీ
ట్రస్టు విభజనపై ఇరు రాష్ట్రాల్లో సందిగ్ధం విభజన చట్టంలో లేని మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఆరు నెలలు దాటినా ‘ఆరోగ్యశ్రీ’ మాత్రం ఉమ్మడిగానే ఉండిపోయింది. రెండు రాష్ట్రాల బాధ్యతలను ఒకే ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) నిర్వహిస్తుండటంతో సమస్యలు వచ్చిపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విధానాలు, ప్రాధాన్యాలు మారిపోయాయి. ప్రభుత్వాల ఆలోచనలూ భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన ఆరోగ్యశ్రీ ట్రస్టు విభజన ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఎప్పుడు విభజిస్తారో అంతుబట్టడం లేదు. లక్షలాది మంది పేదలకు, ఉద్యోగులకు సేవలందించే ఆరోగ్యశ్రీని గాలికి వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరు రాష్ట్రాలు వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి వస్తే అందరికీ మేలు జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో ఆరోగ్యశ్రీ విభజనకు సంబంధించి స్పష్టత లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలంగాణ ఉన్నతాధికారులు అంటున్నారు. చట్టంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటే నిబంధనల ప్రకారం విభజన జరిగేది. 9వ షెడ్యూల్లో ఉంటే ఆరోగ్యశ్రీని నిట్టనిలువునా విభజించే అవకాశం ఉండేది. ఆస్తులు, సేవలు, నిధులు, సిబ్బందిని జనాభా నిష్పత్తి ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయించేవారు. ఒకవేళ పదో షెడ్యూల్లో ఉంటే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కేంద్ర కార్యాలయం ఉన్న రాష్ట్రానికే ట్రస్టును బదలాయించేవారు. ఆ ప్రకారం అది హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణకే దక్కుతుంది. ఈ రెండు షెడ్యూళ్లలో ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ఎలా విభజించాలన్న దానిపై ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం రెండు వేర్వేరు బ్యాంకు ఖాతాలు, సిబ్బంది అంతర్గత పని విభజన జరిగినా సేవలు అందించడంలో సమస్యలు వస్తున్నాయి. తాజాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం న్యాయ సలహాకు వెళ్లింది. విభజన జరగక సమస్యలు.. పేదలకు, ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య సేవలు అందించే బాధ్యతను ఆరోగ్యశ్రీనే చూసుకుంటోంది. తెల్లకార్డున్న లక్షలాది మంది పేదలు ఉచితంగా సేవలు పొందుతున్నారు. నగదు రహిత కార్డుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు కూడా సేవలు పొందుతారు. మొత్తం 938 జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో చికిత్స చేస్తారు. అయితే ఆరోగ్య సేవల విషయంలో రెండు రాష్ట్రాల్లో వేర్వేరు విధానాలను ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద ఒక్కో పేద కుటుంబానికి రూ. 2 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలుంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవల పేరుతో ఈ పరిమితిని రూ. 2.50 లక్షలకు పెంచారు. అంతేకాదు ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి సీఈవోగా ఉన్న ఐఏఎస్ అధికారిని ఏపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆయన సహజంగా ఏపీపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సీఈవోగా ఉన్నా అక్కడి అధికారి తెలంగాణలో పర్యవేక్షణ బాధ్యతలు చూడటం ఇబ్బందిగా ఉంటుందన్న వాదన కూడా ఉంది. దీంతో తెలంగాణలో పేదలు, ఉద్యోగులు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. మరోవైపు ఆరోగ్యశ్రీలో పనిచేసే ఆరోగ్యమిత్రలు జీతాలు పెంచాలని కోరుతున్నారు. వారి గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండాపోయింది. వైద్య శిబిరాలు కూడా అనుకున్నంతస్థాయిలో జరగకపోవడంతో రోగులు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పర్యవేక్షణలోపం వల్ల ఆరోగ్యశ్రీ సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. విభజన చేపట్టాలని స్వయానా సీఈవోనే ప్రభుత్వానికి విన్నవించినా ఇప్పటివరకు అడుగు ముందుకు పడలేదు. కనీసం సీఈవో పర్యవేక్షణలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రత్యేకాధికారులనైనా నియమిస్తే బాగుంటుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. న్యాయ సలహాకు వెళ్లాం రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూళ్లలో దేనిలోనూ ఆరోగ్యశ్రీ విభజనపై స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. అందువల్ల ఈ విషయంలో గందరగోళం నెలకొంది. అందుకే ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ విభజన జరగలేదు. ఈ నేపథ్యంలో న్యాయ సలహాకు వెళ్లాం. అక్కడి నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చాక విభజనపై ముందుకు వెళ్తాం. ఇప్పటికే విభజనకు సంబంధించిన ఫైలును సిద్ధం చేశాం. - సురేష్‌చందా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ర్ట విభజన (జూన్ 2, 2014) నాటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు రోగుల రిజిస్ట్రేషన్- 4.56 లక్షలు సేవలు పొందిన రోగులు- 2.92 లక్షలు జరిగిన శస్త్రచికిత్సలు, థెరపీలు ప్రభుత్వాసుపత్రులు-57 వేలు ప్రైవేటు ఆసుపత్రులు-1.16 లక్షలు విడుదలైన నిధులు ప్రభుత్వాసుపత్రులు-రూ. 160 కోట్లు ప్రైవేటు ఆసుపత్రులు - రూ. 323 కోట్లు -
సాక్షి కార్టూన్ (05-01-2015)
త్వరలో ఆర్టీసీ విభజన -
ఆర్టీసీలో స్థానికత ఆధారంగా ఉద్యోగుల పంపిణీ!
నాలుగు నుంచి పదో తరగతి చదువు ప్రామాణికం ఈడీల కమిటీతో ఎండీ వరస భేటీలు తీవ్రమవుతున్న ఈడీ జయరావు అంశం సాక్షి, హైదరాబాద్: నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీచేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్టీసీ విభజనకు సంబంధిం చి సంస్థలో అంతర్గతంగా ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల కమిటీతో సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందు లో భాగంగా సోమవారం ఓ దఫా చర్చించిన ఆయన మంగళవారం మరోసారి సమావేశమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పంపకానికి కమలనాథన్ కమిటీ విధివిధానాలను ప్రకటిం చినా, అవి ఆర్టీసీకి వర్తించనందున ఆ సంస్థకు ప్రత్యేకంగా విధివిధానాల ఖరారు తప్పనిసరైంది. ఆప్షన్‌పై గందరగోళం... పాఠశాల విద్యను ప్రామాణికంగా చేసుకుని స్థానికతను నిర్ధారించే విషయంలో రెండు ప్రాంతాల నుంచి దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ ‘ఆప్షన్’ల విషయంలోనే గందరగోళం నెలకొంది. తెలంగాణలో డిపో మేనేజర్ కేడర్‌లో దాదాపు 30 మంది ఆంధ్రాప్రాంతానికి చెందిన అధికారులు పనిచేస్తున్నారు. అంతకంటే పై కేడర్‌లో మరో 9 మంది ఉన్నారు. ఆప్షన్ సదుపాయం ఇవ్వాలని ఆంధ్రాప్రాంత అధికారులు కోరుతున్నారు. దీనికి తెలంగాణ అధికారులు ససేమిరా అంటున్నారు. సీనియర్ ఈడీ చుట్టూ వివాదం... సీనియర్ ఈడీ జయరావు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలవరం ముంపు ప్రాంతానికి చెందిన జయరావును ఆంధ్రకు కేటాయించాలని తెలంగాణ అధికారులు, తెలంగాణలోనే ఉంచాలని ఆంధ్రాప్రాంత అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన మరోవైపు వెళ్తే తమ ప్రాంతానికి ఈ పోస్టు దక్కుతుందనేది వారివారి వాదన. తన విషయాన్ని రెండు ప్రభుత్వాల ముందుంచి నిర్ణయం తీసుకోవాలన్న జయరావు వాదనను పెండింగులో పెట్టడంతో వివాదం ముదురుతోంది. తాను పుట్టింది, చది వింది తెలంగాణలోనేనని, ఓయూ ఇంజనీరింగ్ విద్యార్థినైన తనను తెలంగాణకు కేటాయించాలని జయరావు ఎండీని కోరారని తెలిసింది. తెలంగాణ ఉద్యోగుల వాదన... నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని స్థానికతను నిర్ధారించాలి. జిల్లాను యూనిట్‌గా పరిగణించొద్దు. అధికారులు, ఉద్యోగులకు ఆప్షన్ అవకాశం ఉండరాదు. స్పౌజ్ అంశాన్ని ప్రామాణికంగా చేసుకుని కేటాయింపులు జరపరాదు ఆంధ్రాప్రాంత ఉద్యోగుల వాదన.. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా గుర్తించొచ్చు. అయితే ఖమ్మం జిల్లా నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ముంపు మండలాలకు చెందిన వారికి ఆప్షన్ అవకాశం ఇవ్వాలి. మిగతా ప్రాంతంలోనికి వారికి... కుటుంబసభ్యుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు, భార్య/భర్త మరో రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న పరిస్థితి ఉంటే వారికి ఆప్షన్ అవకాశం కల్పించాలి. కమలనాథన్ కమిటీ విధివిధానాలను ఆర్టీసీకి కూడా వర్తింప చేయాలి. -
దిగివచ్చిన హిందుజా
తెలంగాణకు వాటా మేర విద్యుత్ సరఫరాకు అంగీకారం సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా మేరకు విద్యుత్ సరఫరాకు హిందుజా కంపెనీ సూత్రప్రాయంగా అంగీకరించిం ది. గతంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లోని పలు షరతులపైనే తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేసిం ది. ఎట్టకేలకు తెలంగాణ డిస్కంతో సంప్రదింపులకు ముందుకు వచ్చిన ఆ కంపెనీ ప్రతినిధులు బుధవారం టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులతో చర్చలు జరిపారు. ‘‘1998లో హిందుజా కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. అయితే 2003లో అమల్లోకి వచ్చిన విద్యుత్ చట్టం ప్రకారం కొన్ని సవరణలు చేసుకోవాల్సి ఉంది. వాటిపైనే చర్చలు జరిగాయి. పరస్పర అంగీకారం కుదిరింది. కొన్ని చిన్న చిన్న అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాటిని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తీర్పునకు లోబడి పరిష్కారం చేసుకోవాల్సి ఉంది..’’ అని చర్చల అనంతరం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. అయితే విద్యుత్ వాటాల పంపిణీ విషయంపై డిస్కం అధికార వర్గాలు మాట్లాడుతూ ‘‘హిందుజా ప్రైవేటు కంపెనీ. గతంలోనే డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గతంలో ఉన్న పీపీఏలన్నీ అమల్లోనే ఉంటాయి. ఆ కంపెనీ ఒప్పందాలకు లోబడి వ్యవహరిస్తుందనే నమ్మకం మాకుంది..’’ అని పేర్కొన్నాయి. విశాఖపట్నం సమీపంలో నిర్మించిన ఈ విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్థ్యం 1,040 మెగావాట్లు. ఇక్కడ మొదటి యూనిట్లో ఫిబ్రవరి నెలాఖరున విద్యుత్ ఉత్పాదన ప్రారంభమవుతుందని చర్చల సందర్భంగా కంపెనీ ప్రతినిధులు వెల్లడించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 520 మెగావాట్ల మొదటి యూనిట్లో ఉత్పాదన ప్రారంభమైతే... తెలంగాణకు వాటా ప్రకారం 280 మెగావాట్లు అందాలి. ఒప్పందం ప్రకారం 25 ఏళ్ల పాటు ఆ కంపెనీ విద్యుత్ సరఫరా చేయాలి. ప్లాంట్ నిర్మాణం ఆలస్యమైనందున కాల పరిమితిని తగ్గించే అంశంపై చర్చలు జరిగాయని, పీపీఏలకు కట్టుబడి ఉండాలనే వాదనతో చర్చలు ముగిశాయని తెలిసింది. -
టీచర్ పోస్టుల్లో తెలంగాణ వారికి అవకాశం లేనట్లే!
ఓపెన్ కోటా ఏపీలోని జిల్లాలకే పరిమితం? ఉన్నతాధికారులతో చర్చించాక తుది నిర్ణయం పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ ఉషారాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఏపీలో చేపట్టనున్న ఉపాధ్యా య నియామకాల్లో ఓపెన్ కోటా పోస్టుల భర్తీపై నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. రాష్ట్రంలోని 13 జిల్లాల వారికే ఈ ఓపెన్ కోటాను పరిమితం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఓ స్పష్టతకు వచ్చారు. తెలంగాణ ప్రాంతం వేరే రాష్ట్రం కావడంతో అక్కడి వారిని ఈ పోస్టులకు అనుమతించరు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశం సున్నితమైనది కావడంతో నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. టీచర్ పోస్టుల నియామకంపై మంగళవారం ఇవ్వనున్న నోటిఫికేషన్లో ఈ అంశాన్ని పొందుపరచడం లేదని తెలుస్తోంది. ప్రాధమిక విద్యాశాఖ డైరక్టరేట్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచే ఆన్లైన్ దరఖాస్తుల్లో దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక కాలమ్‌లను పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఈ కాలమ్‌ల ఆధారంగా ఏపీలోని 13 జిల్లాల వారికే ఈ పోస్టులను అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో నియామకాల సమయంలో ఓపెన్ కోటా భర్తీపై న్యాయపరమైన సమస్యలు రాకుండా కూడా జాగ్రత్తలు చేపడుతున్నారు. నేరుగా స్పష్టం చేస్తే ఇబ్బందికరమే... పోస్టులను ఏపీకే పరిమితం చేస్తే ఇతర రాష్ట్రాల వారి మాదిరిగానే తెలంగాణ రాష్ట్రం వారికి అవకాశం దక్కదు. దీన్ని నోటిఫికేషన్లోనే పెడితే ఇరు రాష్ట్రాల మధ్య మరో వివాదంగా మారుతుందని ప్రభుత్వ ముఖ్యులు భావి స్తున్నారు. ఏపీ విద్యా మంత్రి సూచనల మేరకు సాధారణ పరిపాలనా కార్యదర్శి పాణిగ్రాహి దీనిపైపై ప్రత్యేక నోట్‌ను రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావుకు సోమవారం సమర్పించారు. ‘‘ఇప్పటివరకు ఓపెన్ కోటాపై తుది నిర్ణయానికి రాలేదు. బుధవారం ఉన్నతాధికారులతో చ ర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ వి.ఉషారాణి వివరించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లలోని 9,061 పోస్టులతోపాటు మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన 1,252 పోస్టులనూ ఈ డీఎస్సీలోనే భర్తీచేయనున్నామన్నారు. పోస్టుల వివరాలు, ఇతర సమాచారాన్ని ‘‘హెచ్‌టీటీపీ://ఏపీడీఎస్సీ.సీజీజీ.జీఓవీ.ఇన్’’ అనే పొందుపరిచినట్లు వివరించారు. -
‘కంతనపల్లి ’ పనుల పర్యవేక్షణకు డివిజన్ల ఏర్పాటు
వరంగల్ రూరల్ : పీవీ.నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణకు ఒక డివిజన్‌తోపాటు 4 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏటూరునాగారంలో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంతనపల్లి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టేందుకు చింతగట్టులోని గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్ఐఎస్)లో ఇప్పటివరకు పనిచేస్తున్న ఒక డివిజన్, నాలుగు సబ్ డివిజన్ల కార్యాలయాలను కంతనపల్లి నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేయాలని జీఎల్ఐఎస్ సీఈ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు చింతగట్టు నుంచి ఏటూరునాగారం మండలానికి షిఫ్ట్ చేస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. -
సిబ్బంది విభజనకు రంగం సిద్ధం!
విధివిధానాలు రూపొందించిన ఎస్పీలు డీజీపీ అనుమతి పొందిన జాబితా ప్రకారమే ప్రక్రియ పోలీసుల్లో తీవ్ర ఆందోళన ఇప్పటికే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన కొందరు గుంటూరు పోలీస్ శాఖలో సిబ్బంది విభజనకు రంగం సిద్ధమైంది. దీనిపై గుంటూరు అర్బన్, రూరల్ పోలీస్ సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇప్పటికే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఈ విషయాన్ని అర్బన్, రూరల్ ఎస్పీలు రాజేష్‌కుమార్, పీహెచ్డీ రామక ృష్ణ సీరియస్‌గా తీసుకున్నారు. నిన్నటివరకూ ఆచితూచి అడుగులు వేయగా తాజా పరిణామంతో విభజన ప్రక్రియను వెంటనే చేపట్టి సమస్యకు తెరదించాలని నిర్ణయించుకున్నారు. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో సిబ్బంది కొరత సమస్యగా మారడం, నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో అర్బన్ ఎస్పీ దీనిపై ద ృష్టి సారించారు. రూరల్ ఎస్పీ రామక ృష్ణ, ముఖ్య అధికారులతో చ ర్చించి విభజనకు విధివిధానాలు సిద్ధం చేయాలని సూచించారు. నిబంధనల ప్రకారం పదోన్నతులు రావాలంటే రూరల్‌కు వెళ్లాలంటూ సుమారు 90 మంది కానిస్టేబుళ్లు, ఏఎస్సైలను అర్బన్ ఇన్చార్జిగా ఉన్నపుడు రూరల్ ఎస్పీ రామక ృష్ణ రూరల్ బదిలీ చేశారు. దీంతో అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్స్టేషన్లలో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. జిల్లా పరిధిలో నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సిబ్బంది కొరత వల్లే నేరాలను అదుపు చేయలేకపోతున్నామని పలువురు అధికారులు అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌కు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. దీంతో 2010 నుంచి పెండింగ్‌లో ఉన్న సిబ్బంది విభజన ప్రక్రియను పూర్తి చేయాలని, గతంలో డీజీపీ ఆమోదించిన జాబితా ప్రకారం చేపట్టాలని ఎస్పీలు నిర్ణరుుంచుకున్నారు. 2008లోనే అర్బన్, రూరల్ జిల్లాలుగా విడిపోగా ఇప్పటికీ సిబ్బంది విభజన జరగకపోవడంపై రాష్ట్ర డీజీపీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిబ్బందికి ఇబ్బందులు కలుగకుండా వారి అంగీకారం తీసుకుని అటాచ్మెంట్లు ఇవ్వాలని ఎస్పీలు యోచిస్తున్నట్టు సమాచారం. ఎస్పీలపై ఒత్తిళ్లకు యత్నాలు.. విభజన ప్రక్రియపై ఆందోళన చెందుతున్న పలువురు సిబ్బంది పోలీస్ అధికారుల సంఘంతో చర్చలు జరిపారు. కొందరు బుధవారం హైదరాబాద్ వెళ్లి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని తమ యూనియన్ల ద్వారా అక్కడి ఉన్నతాధికారులతో ఎస్పీలకు ఫోన్లు కూడా చేయించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ద్వారా ఎస్పీలపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఎవరికీ అన్యాయం జరగదు.. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విభజన ప్రక్రియ ఆగదని అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ స్పష్టం చేశారు. విభజనను నిబంధన ప్రకారం చేపడతామని, ఎవరికీ అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఎవరైనా కోర్టుకు వెళ్లినా అభ్యంతరం లేదన్నారు. రూరల్ జిల్లా నుంచి అర్బన్‌కు వచ్చేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నట్టు చెప్పారు. -
ఉద్యోగుల మధ్య చిచ్చుపెడ్తారా: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే కరెంటు, నీళ్ల విషయంలో చిచ్చు రేగుతోందని, తాజాగా ఉద్యోగుల మధ్య కూడా చిచ్చు రేపుతారా? అని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. ఉద్యోగుల విభజనలో జాప్యం, కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలపై ఆయన మండిపడ్డారు. గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, విఠల్‌తోపాటు వివిధ ఉద్యోగుల సంఘాల నాయకులు సీఎస్ రాజీవ్‌శర్మ, ఉద్యోగుల విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్‌ను కలసి వినతి పత్రాలు ఇచ్చారు. అనంతరం దేవీప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీలోగా ఉద్యోగుల విభజనను పూర్తిచేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల సమాచారం ఇవ్వడంలో ఆయా విభాగాల అధిపతులు జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. -
సమైక్య పోరులో ఎన్జీవోల పాత్ర అనిర్వచనీయం
డెప్యూటీ స్పీకర్ బుద్ధప్రసాద్ అవనిగడ్డ : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జీవోలు పోరాడిన తీరు అనిర్వచనీయమని రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక ఎన్జీవో అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం దివి యూనిట్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఎన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా అధ్యక్షుడు ఉల్లి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా రాష్ట్రం ముక్కలు కాకూడదనే సంకల్పంతో ఎన్జీవో సంఘ నాయకులు సీమాంధ్రలో నిర్వహించిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత జేఏసీ నాయకులు రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాజకీయ పదవులను చేపట్టారని, ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్షుడు అశోక్‌బాబును వివిధ పార్టీలు ఆహ్వానించినప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నారని అభినందించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఉద్యోగులంటే గతంలో తనకు సదాభిప్రాయం లేదని, సమైక్యాంధ్ర కోసం 82 రోజులపాటు వారు ఉద్యమించిన తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నానని చెప్పారు. ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పర్చూరి అశోక్‌బాబు మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి రాష్ట్రాన్ని విభజించిన పార్టీకి బుద్ధి చెప్పిన ఘనత సీమాంధ్ర ప్రజలకే దక్కుతుందన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. అనంతరం ఏపీ ఎన్జీవో అసోసియేషన్, విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన బుద్ధప్రసాద్, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు, అశోక్‌బాబులను సన్మానించారు. ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, ఎన్జీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు, ఎన్జీవో సంఘం నాయకులు దారపు శ్రీనివాస్, ఎ.విద్యాసాగర్, ఎండీ ఇక్బాల్, దివి యూనిట్ అధ్యక్షుడు బి.రాజేంద్రకుమార్, కార్యదర్శి ఎస్.వెంకట సందీప్, తూర్పు కృష్ణా నాయకుడు అబ్దుల్ అజీజ్, సన్‌ఫ్లవర్ గ్రూప్ విద్యాసంస్థల అధినేత ఎండీవీఎస్ఆర్ పున్నంరాజు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్(రాజా), పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. -
శాస్త్రీయ పరిష్కారం చూపండి
* 14వ ఆర్థిక సంఘానికి వైఎస్సార్సీపీ వినతి * నివేదిక సమర్పించిన సోమయాజులు, మిథున్‌రెడ్డి * విభజన బిల్లులో పేర్కొన్న హామీలను కేంద్రం అమలు చేయాలి * పోలవరం, దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌లకు జాతీయ హోదా ఇవ్వాలి * రాయలసీమ, ఉత్తరాంధ్రలకు తక్షణమే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి * నిధులను సమీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తాం సాక్షి ప్రతినిధి, తిరుపతి: అశాస్త్రీయ విభజనతో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న సమస్యలకు శాస్త్రీయమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డీఏ.సోమయాజులు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లోటును పూడ్చడంతోపాటు విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీలను నిలుపుకోవడానికి అవసరమైన నిధులను కేటాయించాలని, కేంద్రానికి ప్రతిపాదనలు చేయాలని 14వ ఆర్థిక సంఘాన్ని వారు కోరారు. వైవీ రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘం శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైంది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డీఏ సోమయాజులు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమావేశంలో పాల్గొని ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆర్థిక సంఘానికి తాము విన్నవించిన అంశాలను డీఏ సోమయాజులు, మిథున్‌రెడ్డి వివరించారు. ఆ అంశాలిలా ఉన్నాయి... * ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 56 ఏళ్లపాటు ఉన్న హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకృతమైంది. రక్షణశాఖ పరిశోధన కేంద్రాలు, అత్యున్నత జాతీయ విద్యాసంస్థలు, వైద్యారోగ్య సంస్థలు, ఐటీ పరిశ్రమ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటయ్యాయి. దీనివల్ల వ్యాట్ రూపంలో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 60 శాతం ఆదాయం వచ్చేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌ను కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర బడ్జెట్ లోటును పూడ్చేందుకు రూ.15,600 కోట్లను కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా అందించేలా సిఫార్సు చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరాం. * గత పదేళ్లలో సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఏడాదికి సగటున 33 నుంచి 35 శాతం ప్రణాళిక వ్యయం, 65 శాతం ప్రణాళికేతర వ్యయం ఉండేవి. మొత్తం అంచనా వ్యయంలో పెట్టుబడి వ్యయం 12 శాతంగా ఉండేది. కానీ.. 2014-15 బడ్జెట్లో ప్రణాళిక వ్యయం 23 శాతంగానూ.. ప్రణాళికేతర వ్యయం 77 శాతంగానూ పేర్కొన్నారు. ఇదే రీతిలో పెట్టుబడి 12 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గింది. బడ్జెట్లో లోటుపాట్లను సరిదిద్దాలి. * రాష్ట్రంలో రూ.1.02 లక్షల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు రూ.వెయ్యి కోట్లే కేటాయించింది. నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్క నిరుద్యోగికి నెలకు రూ.రెండు వేల చొప్పున ఇచ్చే హామీ అమలుచేస్తే ప్రణాళికేతర వ్యయం మరింత పెరుగుతుంది. కానీ.. ఆ హామీలను అమలుచేయకుండా ప్రణాళికేతర వ్యయం ఎలా పెరిగింది? రాజధానికి నిధులు సమకూర్చాలి.. * రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రమే సమకూర్చేలా చూడాలని ఆర్థిక సంఘాన్ని కోరాం. రాజ్‌భవన్, హైకోర్టు, సెక్రటేరియట్, శాసనసభ, శాసనమండలి వంటి భవనాల నిర్మాణానికి నిధులను కేంద్రమే సమకూర్చాలి. కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైతే అటవీశాఖ భూములను డీ-నోటిఫై చేసి ఇవ్వాలి. * కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో రాష్ట్రం వాటాగా 50 శాతం నిధులివ్వాలి. ఆ నిధుల కేటాయింపునకు ఇచ్చే ప్రాధాన్యత లో జనాభా(1971 లెక్కల ప్రకారం)కు 30 శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం, సొం త పన్నుల రాబడికి 20 శాతం, ప్రణాళిక వ్యయానికి 25 శాతం, ఆహారభద్రతకు రాష్ట్రం సమకూర్చే ధాన్యానికి ఐదు శాతం, పరిపాలన సంస్కరణకు ఐదు శాతం ఇవ్వాలి. * రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సంఘానికి చేసిన ప్రతిపాదనలను మేము బలపరుస్తున్నాం. కొత్త రాజధాని నిర్మాణానికి, జాతీయ విద్యా, వైద్యారోగ్య సంస్థల ఏర్పాటుకు, పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను సమీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తాం. * రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలి. కేంద్రం హామీ ఇచ్చినట్లుగా తక్షణమే రాష్ట్రానికి పదేళ్లపాటూ ప్రత్యేక ప్రతిపత్తిని ప్రకటించేలా సిఫార్సు చేయాలి. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే.. విభజన బిల్లులోని 13వ షెడ్యూలులో పేర్కొన్న మేరకు కేంద్రం రాయితీలు ఇవ్వాలి. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలివ్వాలి రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. విభజన బిల్లులో కేంద్రం ఇచ్చిన హామీని తక్షణమే అమలుచేసేలా సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. ఆ రెండు ప్రాజెక్టులను కేంద్రమే చేపట్టి.. పూర్తిచేసి దుర్భిక్ష రాయలసీమకు గోదావరి జలాలను అందించి సుభిక్షం చేయాలని విన్నవించారు. ‘‘మీరు రాయలసీమ వాసే. నా నియోజకవర్గమైన రాజంపేటలోనే మీ సొంతూరు ఉంది. ఇక్కడి ప్రజల ఇబ్బందులు మీకు తెలియనివి కావు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నీళ్లు అందాలంటే పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి.. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. కేబీకే(కోరాపూట్-బోలంగీర్-కలహండి) ప్రత్యేక ప్యాకేజీ, బుందేల్‌ఖండ్ ప్యాకేజీల తరహాలో ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి’’ అని కోరారు. ఇందుకు వైవీ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించేలా కేంద్రానికి ప్రతిపాదిస్తామని హామీ ఇచ్చారు. -
కట్కు కట్.. చెల్లుకు చెల్లు!
పీపీఏల రద్దుతో ఏపీకి ఒరిగిందేమీ లేదు ఏపీ నుంచి సీలేరు విద్యుత్ బంద్ తెలంగాణ నుంచి సాగర్, జూరాల కట్ హైదరాబాద్: విద్యుత్ కొనుగోలు ఒప్పం దాల (పీపీఏ) రద్దుతో ఆంధ్రప్రదేశ్‌కు ఒరిగిందేమీ లేదని తేలింది. పీపీఏలు, విభజన వాటాల మేరకు ప్రాంతాలవారీ కోటా విద్యుత్ సరఫరా అవుతోందని రెండు రాష్ట్రాల ఇంధన శాఖలు వేసిన లెక్కలతో తేలింది. రెండు రాష్ట్రాల ఏర్పాటు జరిగినప్పటికీ నుంచి అంటే జూన్ 2 నుంచి ఆగస్టు 4 వరకు ఏ రాష్ట్రానికి ఎంత విద్యుత్ సరఫరా అయిందనే దానిపై ఇంధనశాఖలు లెక్కలు వేశాయి. పీపీఏల రద్దుకు ముందు ఇరు ప్రాంతాలకు ఎంత వాటా ప్రకారం (తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం) విద్యుత్ సరఫరా అయిందో.. రద్దు తరువాత కూడా అదే వాటా ప్రకారం విద్యుత్ సరఫరా అయింది. వివరాలు ఇలా ఉన్నాయి... పీపీఏల రద్దు నిర్ణయం తర్వాత సీలేరు బేసిన్ నుంచి (725 మెగావాట్లు) విద్యుత్ సరఫరాను తెలంగాణకు ఏపీ నిలిపివేసింది. తద్వారా తెలంగాణకు 316 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ నష్టం వాటిల్లింది.మరోవైపు నాగార్జునసాగర్, జూరాల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో ఏపీకి వాటా ఇవ్వకుండా మొత్తం విద్యుత్‌ను తానే ఉపయోగించుకుంది. తద్వారా 200 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఏపీకి నష్టం వాటిల్లింది. విభజన సమయంలో జరిగిన పొరపాటు అంచనాలతో కేంద్ర విద్యుత్ ప్లాంట్లు (సీజీఎస్) నుంచి తెలంగాణకు 65 మెగావాట్ల విద్యుత్ అదనంగా వస్తోంది. ఈ విద్యుత్ వాస్తవానికి ఏపీకి వెళ్లాల్సి ఉంది. ఈ విద్యుత్ ప్రస్తుతం తెలంగాణకే వస్తోంది. ఇది మరో 116 ఎంయూలని ఇంధనశాఖ లెక్కల్లో తేలింది. మొత్తమ్మీద పీపీఏల రద్దుతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒరిగిన అదనపు ప్రయోజనమేమీ లేదని విద్యుత్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
సా..గుతోన్న సీజీజీ అధ్యయనం
రెండేళ్లుగా కొలిక్కిరాని నివేదిక జలమండలి ఉద్యోగుల్లో వీడని ఉత్కంఠ ఉద్యోగాలు ఉంటాయో..పోతాయో తెలియక ఆందోళన సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరానికి మంచినీటిని సరఫరా చేసే జలమండలిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) అధ్యయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగుల సంఖ్య, పని విభజన, ఖాళీల భర్తీ, అదనపు సిబ్బంది, పదోన్నతులు తదితర అంశాలపై సీజీజీ రెండేళ్లుగా చేస్తున్న అధ్యయనం ఇంకా కొలిక్కిరాలేదు. దీంతో ఉద్యోగుల్లో ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికతో తమ ఉద్యోగాలు ఉంటాయా?, ఊడతాయా?, పదోన్నతులు లభిస్తాయా లేదా ఖాళీల భర్తీ జరుగుతుందా? అన్న సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ విషయంలో ఉద్యోగుల అనుమానాలు, భయాలను నివృత్తి చేసేందుకు బోర్డు యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు ఉత్కంఠకు గురవుతున్నారు. బోర్డులో అన్ని విభాగాల్లో కలిపి సుమారు 4,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో 600 వరకు ఖాళీలున్నట్టు సమాచారం. వీటి భర్తీ విషయంలో చర్యలు తీసుకోని యాజమాన్యం సీజీజీ నివేదికతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఉద్యోగ, కార్మిక సంఘాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. భర్తీ ఎప్పుడో.. జలమండలిలో రెండునెలల క్రితం 647 జనరల్ పర్పస్ ఎంప్లాయ్, సీవరేజీ కార్మికుల భర్తీ ప్రక్రియను చేపట్టింది.వీరిలో ఇన్‌సర్వీసు అభ్యర్థులైన 500 మందికి మాత్రమే పోస్టింగ్‌లు ఇచ్చారు. మరో 147 మంది బయటి వ్యక్తులకు పోస్టింగ్ ఇచ్చే ఫైలు రెండు నెలలుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. దీంతో ఇంటర్వ్యూ, క్షేత్రస్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణులైన పలువురు నిరుద్యోగ అభ్యర్థులు పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక బోర్డు ఫైనాన్స్ విభాగం, ఇతర విభాగాల్లో మినిస్టీరియల్ ఉద్యోగాలు, మేనేజర్ పోస్టులు సుమారు 450 వరకు ఖాళీగా ఉన్నాయ. వీటి భర్తీపైనా సస్పెన్స్ కొనసాగుతోండడం గమనార్హం. నివేదికను తక్షణం బహిర్గతం చేయాలి.. ఉద్యోగుల భవితవ్యంతో సంబంధం ఉన్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదికను సాగదీయకుండా తక్షణమే ఆ నివేదికను బహిర్గతం చేయాలని ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తమ అభ్యంతరాలను, ఆందోళనను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. పలు విభాగాల్లో సిబ్బంది అదనపు పనిభారంతో సతమతమవుతున్నారని, వెంటనే ఖాళీలను భర్తీచేయాలని వారు యాజమాన్యాన్ని కోరుతున్నారు. -
ఖాళీ భూములపై కన్ను!
కంపెనీలకు కేటాయించిన భూములపై ఏపీఐఐసీ ఆరా నిరుపయోగంగా ఉంటే స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం 65 ఎకరాల భూ కేటాయింపు రద్దుకు యోచన సాక్షి, విశాఖపట్నం: పరిశ్రమల అవసరాల కోసం భూములు తీసుకుని ఆ తర్వాత వాటిలో కంపెనీలు స్థాపించని యాజమాన్యాలపై ఏపీఐఐసీ కన్నెర్ర చేస్తోంది. ఇన్నాళ్లూ కేవలం ప్రేక్షకపాత్ర వహించి, మొక్కుబడి నోటీసులతో కాలక్షేపం చేయగా, ఇప్పుడు విభజన తర్వాత భూ అవసరాలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం గతంలో భూములు తీసుకుని వినియోగించని కంపెనీల వివరాలు సేకరించింది. త్వరలో వీటన్నింటిని రద్దు చేయాలని భావిస్తోంది. ఇటీవల సర్వే చేసి జిల్లా అంతటా ఎస్ఈజెడ్లకు కేటాయించినవి కాకుండా రూ.50 కోట్లకుపైగానే విలువచేసే 65 ఎకరాల భూములున్నట్టు నిర్ధారించింది. ఆటోనగర్, పరవాడ, అనకాపల్లి ఇతర పారిశ్రామిక క్లస్టర్లలో చాలావరకు ఇవి నిరుపయోగంగా ఉండడంతో వాటన్నింటిని ఇప్పుడు వెనక్కి తీసుకోవాలని పట్టుదలతో ఉంది. అందుకోసం ప్రత్యేక బృందాలతో ఖాళీ భూములున్న కంపెనీలు, యాజమాన్యాలకు నోటీసులు పంపి రానున్న నెలలోగా వీటిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఇకపై కఠినంగా వ్యవహరించి నిర్ధారిత గడువులోగా యూనిట్లు ప్రారంభించడం, లేదా తక్షణమే వెనక్కి తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. మరోపక్క పారిశ్రామికపరంగా కీలకమైన విశాఖలో ఏపీఐఐసీకి భూ బ్యాంక్ పెద్దగా లేకపోవడం అధికారులకు సవాల్‌గా మారింది. పెద్ద కంపెనీలు విశాఖకు వచ్చి భూములు కోరినా తక్షణమే కేటాయింపులు చేయడానికి తగిన స్థలాలు లేవు. ప్రస్తుతం కేవలం 450 ఎకరాలు మాత్రమే అక్కడక్కడా ఎస్ఈజెడ్లు, ఇతర పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు అదనంగా 500 ఎకరాలు భవిష్యత్తు అవసరాలకు కావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు గతంలో కలెక్టర్‌కు లేఖ రాశారు. రెవెన్యూశాఖ ద్వారా సేకరించి అప్పగించాలని అందులో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు విభజన తర్వాత రకరకాల పర్రిశ్రమలు, విద్యాసంస్థలకు వీటి అవసరం ఉండడంతో సాధ్యమైనంత వేగంగా ఎక్కువ ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసేందుకు ఏపీఐఐసీ ప్రణాళికలు వేస్తోంది. -
దీర్ఘాయువుఎంత దూరం?
‘‘ఎలుకల్లో విజయవంతంగా వృద్ధాప్య తగ్గింపు’’ - జనవరి 28 2014, ‘సెల్’ జర్నల్ ‘‘ముదిమిలోనూ మెరుగైన ఆరోగ్యానికి కీలకం సంతులిత ఆహారం’’ - జూలై 25, 2014 ‘నేచర్’ ‘‘జీవనశైలి మార్పులతో నిండైన ఆరోగ్యం.. ఆయుష్షు!’’ - యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సెప్టెంబరు 17, 2013 ఏడాది కాలంలో వచ్చిన వేర్వేరు పరిశోధనల ఫలితాలివి. అన్నీ... అవునా? నిజమేనా? అని ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అచ్చంగా ఇలాగే జరుగుతుందా? అందరూ నిండు నూరేళ్లు నిక్షేపంగా బతికేయవచ్చా? అని ప్రశ్నించుకుంటే మాత్రం భిన్నమైన జవాబులు వస్తాయి. అయితే... ఈ పరిశోధనలు చెప్పేది ఒక్కటే. జరామరణాలను జయించాలన్న మనిషి మేధోదాహం ఇప్పుడిప్పుడే తీరేది కాదు అని. కాకపోతే నెమ్మదిగానైనా మనం ఆ దిశగా ముందుకు వెళుతూండటం కూడా విస్పష్టమే...! అరవైల్లో ఇరవై లా ఉండాలని... 70, 80 ఏళ్ల వయస్సులోనూ జబ్బులేవీ లేని జీవితం కావాలని కోరుకోని వాళ్లెవరు చెప్పండి? అందరమూ అనుకుంటాం. కానీ ఆ అవకాశం కొంతమందికే దక్కుతుంది. దీనికి మనలో చాలామంది జన్యువుల అమరిక అని.. ఆహార, వ్యవహారాలని... శారీరక శ్రమ అని రకరకాల కారణాలు చెబుతుంటాం కూడా. కానీ సైన్స్ మాత్రం ఇవన్నీ అర్ధసత్యాలేనని... అన్నింటినీ కలిపిన జీవనశైలితోనే వయసును జయించే వరం అందరికీ లభిస్తుందని వేర్వేరు పరిశోధనల ద్వారా స్పష్టం చేస్తోంది. ఇంతకీ వయసై పోవడమంటే...? వృద్ధులకు నిర్వచనం స్పష్టంగా చెప్పడం కొంచెం కష్టమే. పుట్టుక తరువాత కాలంతోపాటు శరీరంలో వచ్చే మార్పులని వికీపీడియా చెబుతుంది. ఇది బహుముఖమైందని, భౌతిక, మానసిక, సామాజిక మార్పులూ కలిసి ఉంటుందనీ అంటుంది. జీవశాస్త్రం ప్రకారం చూస్తే మాత్రం వయసు మీరడం రెండు రకాలని, ఒకటి క్రమానుగతమైంది (పుట్టిన రోజులు), రెండోది కణ విభజనకు సంబంధించినది. దీర్ఘాయువు కావాలనుకునే వారికి కణ విభజన తాలూకూ వ్యవహారం కీలకమవుతుంది. పుట్టుక మొదలుకొని మరణం వరకూ ప్రతి క్షణం శరీరంలోని కణాలు విడిపోతూ ఉంటాయన్నది మనకు తెలిసిన విషయమే. ఈ కణాల్లోని క్రోమోజోమ్లలోనే మనిషి జన్యుక్రమం (డీఎన్ఏ పోగు) ఉంటుందన్నదీ చదువుకుని ఉంటాం. కాలం గడిచే కొద్దీ ఒక కణం రెండుగా రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా... ఇలా విడిపోయే వేగం తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలోనే క్రోమోజోమ్‌ల చివర రక్షణ కవచంగా ఉండే టెలిమోర్ అనే తోకలాంటి నిర్మాణం పొడవూ తగ్గిపోతుంది. యువకులుగా ఉన్నప్పుడు టెలిమెరేస్ అనే ఎంజైమ్ పుణ్యమా అని పొడవు తగ్గడం కొంచెం నెమ్మదిగా సాగితే... ఆ తరువాత ఇది క్రమేపీ రెండుగా విడదీయలేనంత స్థాయికి తగ్గిపోతోంది. ఈ దశలో కణం విడిపోవడం ఆగిపోతుంది. ఫలితంగా కేన్సర్ మొదలుకొని అనేక వృద్ధాప్య సంబంధిత రుగ్మతలు, సమస్యలు చుట్టుముడతాయి. ఇతర కారణాల తోడైతే... మనం ఎంత కాలం జీవించి ఉంటామన్నది టెలిమోర్ల పొడవు ఒక్కటే నిర్ణయించదు. ఆక్సిడేటివ్ రస్ట్రెస్, గ్లైటేషన్ (ప్రొటీన్లు, కొవ్వులతో చక్కెరలు ఏర్పరచుకునే రసాయనిక బంధం) వంటి ఇతర కారణాలు వృద్ధాప్య సమస్యలకు కారణాలవుతాయి. గ్లైటేషన్నే ఉదాహరణగా తీసుకుందాం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోనూ ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. శరీరంలో మరీ ముఖ్యంగా రక్తంలో జరిగే గ్లైటేషన్ కారణంగా కొన్ని వ్యర్థ పదార్థాలు ఏర్పడుతుంటాయి. వీటిని అడ్వాన్స్డ్ గ్లైటేషన్ ఎండ్ ప్రొడక్ట్ క్లుప్తంగా ఏజ్లని అంటారు. శరీరంలో ఈ ఏజ్ల మోతాదు ఎక్కువైన కొద్దీ మధుమేహం, ఆర్థెరోస్క్లిరోసిస్ (రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం) వంటి వ్యాధులు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధులతోపాటు కేన్సర్‌కు కూడా కొన్ని రకాల ఏజ్‌లు కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ధూమపానం వంటి అలవాట్లతో శరీరంలో ఏజ్ల మోతాదు పెరిగిపోతుందని ఇప్పటికే స్పష్టమైంది. పరిశోధనల సారం ఏమిటి? దీర్ఘాయువుకు జన్యువులే కీలకమని చాలాకాలంగా భావించినప్పటికీ ఇటీవలి కాలంలో ఈ దృక్పథంలో స్పష్టమైన మార్పు వచ్చింది. వృద్ధాప్యాన్ని జయించే లక్ష్యంతో యుగాలుగా ఎన్నో ప్రయోగాలు జరిగినప్పటికీ గత 30 ఏళ్లలోనే మనిషి ఎంతో కొంత ప్రగతి సాధించగలిగాడు. జన్యుక్రమాన్ని తెలుసుకుని 13 ఏళ్లు మాత్రమే అవుతూంటే... టెలిమోర్ల గురించి తెలిసిందే 2009లో. గత ఏడాది జరిగిన పరిశోధనలను తీసుకుంటే.... ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో తొలిసారి ముసలితనాన్ని వెనక్కు మళ్లించవచ్చునని తెలిసింది. వయసుతోపాటు మన శరీరాల్లో తగ్గిపోయే ఒక పదార్థాన్ని మళ్లీ చేర్చడం ద్వారా ఇది సాధ్యమని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేల్చారు. గత నెలలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ‘నేచర్’లో ప్రచురించిన వ్యాసం ప్రకారం... ముసలితనంలోనూ ఆరోగ్యంగా ఉండేందుకు సంతులిత ఆహారం, వ్యాయామం అత్యంత కీలకం. దీంతోపాటు కణాలపై వయసు చూపే దుష్ర్పభావాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యమే. ఇక గత ఏడాది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనను చూద్దాం. దీని ప్రకారం... జీవనశైలిలో మార్పులతో టెలిమోర్ల పొడవును పెంచుకోవచ్చు. ఈ మార్పులు స్థూలంగా నాలుగు. మొదటిది... రోజూ వ్యాయామం చేయడం. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా లేదా ధ్యానం వంటి ప్రక్రియలను ఎంచుకోవడం రెండోది. ఇక మూడో మార్పు... ఎరుపు రంగు మాంసం ముట్టకుండా, మొక్కలు, చెట్ల నుంచి అందే ఆహారాన్ని తీసుకోవడం. చివరగా... అందరితో కలివిడిగా ఉండటం. ఈ మార్పులన్నీ చేపట్టిన వారి టెలిమోర్ పొడవు ఐదేళ్లలో పదిశాతం వరకూ పెరిగిందని, మామూలుగా ఉన్నవారిలో మాత్రం మూడు శాతం వరకూ తగ్గిందని ఈ పరిశోధన ద్వారా తెలిసింది. - గిళియార్ గోపాలకృష్ణ మయ్యా చింతల్లేని వృద్ధాప్యానికి... అరవై ఏళ్ల వయస్సును ఇరవైకి మార్చడం ఇప్పటికైతే ఎవరికైనా అసాధ్యమే. కాకపోతే వయసు పెరిగినా యువకుల్లా కనిపించేందుకు... రోగాలు రాకుండా చూసుకునేందుకు... కంటి నిండా నిద్ర, ఒంటికి తగిన వ్యాయామం, మేలు చేసే ఆహారం అనే మూడు సూత్రాలు పాటిస్తే మంచిదన్నది పరిశోధనలు స్పష్టం చేస్తున్న విషయం. ఏది ఎంత మోతాదులో ఉండాలన్నది స్పష్టంగా చెప్పలేముకానీ... అన్నీ ఎంతో కొంత ఉండటం మంచిది. ఆహారం విషయంలో ఇది మరీ ముఖ్యం. ఎముకల దృఢత్వానికి కాల్షియం మంచిదని అందరూ చెబుతూంటారు. ఇది నిజం కూడా. అయితే 30 ఏళ్ల వయసు తరువాత శరీరం కాల్షియంను పీల్చుకునే మోతాదు తగ్గుతుంది. కాబట్టి యువకుడిగా ఉన్నప్పుడే వీలైనంత ఎక్కువ కాల్షియంను నిల్వ చేసుకోవడం మేలన్నది కొందరు శాస్త్రవేత్తల అంచనా. మహిళల్లో రుతుస్రావం నిలిచిపోయిన తరువాత కాల్షియం కోల్పోయే వేగం పెరుగుతుంది కాబట్టి చిన్న వయసులోనే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వారికి ముఖ్యం. శరీర క్రియలకు మేలు చేసేవి, రోగాల నుంచి రక్షణ కల్పించే రసాయనాలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చునని సైన్స్ చెబుతుంది. ఉదాహరణకు తృణధాన్యాలను తీసుకుందాం. మనం వాడే తెల్ల బియ్యంతో పోలిస్తే కొర్ర, జొన్న, రాగుల వంటి తృణధాన్యాల్లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని అప్పుడప్పుడైనా తీసుకోవడం మంచిది. ఇక ప్యాకెట్లలో లభించే, శుద్ధి చేసిన ఆహార పదార్థాలను తగ్గించాలి. రకరకాల పండ్లు, కాయగూరలు, ఆకుకూరల మోతాదును పెంచడం ద్వారా ముసలితనాన్ని దూరం చేయవచ్చు. అరవై ఏళ్లుపైబడ్డ వారు తమ ఆహారంలో ఎక్కువ పౌష్టికత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం శరీరాన్ని చురుకుగా చేయడంతోపాటు ఆయుష్షును కూడా పెంచుతుందన్నది మనకు తెలిసిన విషయమే. అలాగని మరీ రోజూ విపరీతంగా ఎక్సర్సైజ్లు చేయాల్సిన పనిలేదని... నడక, సైక్లింగ్, ఈత వంటివి కొద్దిమోతాదులో చేపట్టినా సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మోతాదు తక్కువగా ఉన్నప్పటికీ తగినన్ని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉండేలా జాగ్రత్త పడటం ద్వారా రోగాల బారిన పడటాన్ని తగ్గించుకోవచ్చు. -
100 రోజుల్లో స్పష్టమైన విధానం
విభజన సమస్యలపై శ్వేతపత్రం విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్: విభజన వల్ల రాష్ట్రం అనేక సమస్యల్లో చిక్కుకుందని, వీటిని అధిగమించేందుకు 100 రోజుల్లో స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. అస్తవ్యస్త రాష్ట్ర విభజనతో తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టారని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన బిల్లులోని అంశాలు ప్రజల మధ్య అపోహలు, ఆందోళనలకు దారి తీస్తున్నాయన్నారు. రాజధాని ప్రాంతంపై రాజకీయాలు సరికాదని, అభివృద్ధి కావాలో రాజకీయం కావాలో తేల్చుకోవాలని అన్నారు. ’ఏపీపై రాష్ట్ర విభజన ప్రభావం’పై ఆయన ఆదివారం తన నివాసంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోటుపాట్లు గుర్తించి కేంద్రం ఏమేరకు సహకారం అందిస్తుందో చట్టంలోనే పేర్కొని ఉంటే ఇప్పుడీ సమస్యలుండేవి కావని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి సాధించేలా కేంద్రం సాయం చేయాలని కోరారు. ‘‘1956కు ముందు భద్రాచలం ఆంధ్రలో ఉండేది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం అక్కడి ముంపు ముండలాలను బిల్లులోనే చేర్చి ఉంటే ఇప్పుడు వివాదం ఉండేదికాదు. దాన్ని ఆర్డినెన్సుగా తేవడంతో ప్రజల మధ్య అపోహలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి కొందరు, ఉపాధి కోసం మరికొందరు ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో ఎఫెక్టివ్ గవర్నెన్సుకు కేంద్రం ప్రత్యేక వ్యవస్థపై ఆలోచించకపోవడం వల్ల ఇప్పుడు మరో సమస్య ఏర్పడుతోంది. రాజధాని కోసం కమిటీని ఏర్పాటు చేసి ప్రజల మధ్య కొత్త చిచ్చు పెట్టారు. రాజధానిపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసినా బాగుండేది. ఐఏఎస్, ఐపీఎస్‌ల విభజన, ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపకాలు అన్నింటినీ అస్తవ్యస్తం చేశారు. అన్నీ సమస్యలనే మిగిల్చారు’’ అని విమర్శించారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై మాట్లాడుతూ విభజన అయినందున ఏపీ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై మాట్లాడుతూ.. చట్టం ప్రకారమే నడవాలే తప్ప అందుకు భిన్నంగా ఎవరూ వెళ్లరాదని చంద్రబాబు అన్నారు. రాజధానిపై మాట్లాడుతూ.. ‘‘పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండేందుకు చట్టంలోనే అవకాశం కల్పించారు. ప్రజలకు అందుబాటులో ఉండటంలేదని, హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తున్నానని నాపై విమర్శలు వస్తున్నాయి. కానీ ఏం చేస్తాను. హైదరాబాద్‌లో నేను గెస్టుహౌస్‌లో ఉంటున్నాను. విజయవాడలో అయినా గెస్టుహౌస్‌లోనో, అద్దె ఇంటిలోనో ఉండాలి తప్ప అక్కడ ఏమీ లేదు’’ అని చెప్పారు. రాష్ట్ర రాజధానిని కర్నూలులో పెట్టాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. ‘‘మా ఊరిలో పెడితే బాగుంటుందని నాకూ అనిపిస్తుంటుంది. మా దగ్గర కల్యాణి డ్యామ్ ఉంది. భూమి కూడా ఉంది. అది మా ఊరి పక్కనే. కానీ ప్రజలకు న్యాయం చేయాలి. స్వార్థం కోసం ఆలోచించలేం. కర్నూలులో రాజధాని కావాలని కోరుతున్న వారు ఇంతకాలం అ పట్టణానికి ఏం చేశారు? రాజకీయం కావాలా? అభివృద్ధి కావాలా? అక్కడ 30 వేల ఎకరాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేసి కర్నూలుకు అనుసంధానిస్తాను. వికేంద్రీకరణ ద్వారా అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాను’’ అని బాబు చెప్పారు. ‘సాక్షి’ని అనుమతించని చంద్రబాబు సీఎం చంద్రబాబు ఆదివారం నిర్వహించిన రెండు అధికారిక మీడియా సమావేశాలకు సాక్షిని అనుమతించలేదు. ఉదయం శ్వేతపత్రం విడుదల కార్యక్రమం, సాయంత్రం గవర్నర్ సమక్షంలో కేసీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశానికి వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాలశాఖ నుంచి సాక్షికి ఆహ్వానం అం దింది. నిర్ణీత సమయానికే అక్కడికి చేరుకున్న సాక్షి సిబ్బందిని చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తూ ఒక్కొక్కరినీ లోపలికి పంపించిన సిబ్బంది సాక్షి ప్రతినిధులను మాత్రం అనుమతించలేదు. దీనిపై సాక్షి ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘సాక్షి’ మీడియాను లోపలకు అనుతించవద్దని ఆదేశాలున్నాయని భద్రతా సిబ్బంది సమాధానమిచ్చి, వైర్లెస్ సెట్ ద్వారా ఉన్నతాధికారులను సంప్రదించారు. అలా రెండు మూడుసార్లు భద్రతా సిబ్బంది ప్రయత్నించినా వేచి ఉండాలనే సమాధానం వచ్చింది. దీనిపై ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ను సంప్రదించడానికి సాక్షి ప్రతి నిధులు ఫోన్ చేయగా స్పందన రాలేదు. దీనిపై భద్రతాధికారిని ప్రశ్నించగా.. మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ను మూడుసార్లు అడిగామని, ఆయన చెబుతానంటూనే సీఎంతో మీడియా సమావేశానికి వెళ్లిపోయారని తెలిపారు. సమావేశం ముగిశాక సమాచార శాఖ కమిషనర్ దానకిషోర్‌ను సాక్షి ప్రతినిధి సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. సొంతింటి కార్యక్రమమో, పార్టీ కార్యక్రమమో అయితే నచ్చిన మీడియాను పిలుచుకొని మాట్లాడుకోవచ్చని, కానీ ప్రభుత్వ కార్యక్రమానికి రాకుండా ఒక మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదని అక్కడి భద్రతా సిబ్బందే ముక్కున వేలేసుకున్నారు. -
గ్రేటర్ త్రీ స్టార్
మారనున్న జీహెచ్ఎంసీ? సీఎం వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ విభజన అనివార్యమైతే.. ఆ తరువాతే ఎన్నికలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మూడు కార్పొరేషన్లుగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం విలేకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రస్తావించడంతో విభజనకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. వివిధ కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొనడంతో మళ్లీ ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇది జరిగిన తర్వాతే ఎన్నికలు జరిగే వీలుంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై తదితర నగరాలలో సైతం రెండు నుంచి ఐదు కార్పొరేషన్ల వరకున్నాయి. అదే తరహాలో గ్రేటర్‌ను విభజించనున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. అన్ని అంశాలను పరిశీలించి దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన సూచనా ప్రాయంగా పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కార్పొరేషన్లుగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒక్కో కార్పొరేషన్ పరిధిలో 50 నుంచి 70 వార్డులు ఉంటాయి. ఇది తర్వాతే ఇక కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు గ్రేటర్‌లోని డివిజన్లను డీ లిమిటేషన్ చేయాలని.. డివిజన్లలోని జనాభాలో వ్యత్యాసం పది శాతం కన్నా ఎక్కువగా ఉండకూడదని హైకోర్టు సూచించింది. గ్రేటర్లో జనాభా కోటిని దాటి పోవడంతో డీలిమిటేషన్ పనుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీలోని ఐదు జోనల్ కార్యాలయా ల్లో ఐఏఎస్ అధికారులను నియమించి వారికి పర్యవేక్షణ బాధ్యతలప్పగిస్తే పరిపాలన సజావుగా ఉంటుందనేది అధికారుల అభిప్రాయంగా ఉన్నప్పటికీ.. వివిధ కారణాలతో కేసీఆర్ జీహెచ్ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా చేసేయోచనలో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలతో వెల్లడవుతోంది. ఎన్నికలు ఆలస్యం.. ? జీహెచ్ఎంసీని విభజించకపోయినప్పటికీ జనాభా ప్రతిపదికన డివిజన్ల డీ లిమిటేషన్ జరగాల్సి ఉంది. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న 18 సర్కిళ్లను 30 సర్కిళ్లుగా మార్చాల్సి ఉంది. జనాభా దామాషాలో కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న 18 సర్కిళ్లలో కొన్నింట్లో ఎక్కువ జనాభా ఉండగా, మరికొన్నింటిలో తక్కువ జనాభా ఉంది. కొత్తగా ఏర్పాటయ్యే 30 సర్కిళ్లలో జనాభా దాదాపుగా సమానంగా ఉండేలా డీలిమిటేషన్ జరగాలి. జీహెచ్ఎంసీకి ఎన్నికల కన్నా ముందే ఈ ప్రక్రియ పూర్తికావాలి . ఇది పూర్తి కావాలంటే ఆరు నెలల నుంచి ఏడాది దాకా పట్టనుంది. దాంతో, మరికొంత ఆలస్యమైనా జీహెచ్ఎంసీ విభజన కూడా జరగనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
తపాలా శాఖ రెండు ముక్కలు
విభజన కసరత్తు షురూ ఏడెనిమిది నెలల్లో ‘తెలంగాణ సర్కిల్’ ఏర్పాటు ప్రస్తుత ఏపీ సర్కిల్ ఆంధ్రకు పరిమితం విజయవాడ రీజియన్ నుంచి విడిపోనున్న ఖమ్మం పోస్టు రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్స్ 58:42 నిష్పత్తిలో సిబ్బంది కేటాయింపు హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకుz. రాష్ట్రం విడిపోయినా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను విడగొట్టాల్సిన అవసరం లేదని తొలుత భావించిన కేంద్రం క్రమంగా మనసు మార్చుకుంది. రాజకీయ ఒత్తిడి పెరగడంతో వాటిని కూడా విభజించాలని నిర్ణయించింది. పైగా రెండు రాష్ట్రాలకు ఒకే చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ ఉంటే ఇబ్బంది తలెత్తుతుందన్న కారణంతోనూ తపాలా శాఖ విభజనకు కేంద్రం మొగ్గుచూపింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వేను విభజించేందుకు కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే దారిలో తపాలా శాఖను కూడా ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా ఏర్పాటు చేసేందుకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్గా రెండు రాష్ట్రాల్లో సేవలందిస్తున్న తపాలా శాఖ మరో ఏడెనిమిది నెలల్లో రెండు సర్కిళ్లుగా మారబోతోంది. సేవలపరంగా ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపకున్నా.. అంతర్గతంగా తపాలా శాఖలో భారీ మార్పుచేర్పులు చోటుచేసుకోబోతున్నాయి.ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు కలిపి చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్‌గా ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారి సుధాకర్ వ్యవహరిస్తున్నారు. ఇక ముందు ఇలాంటి మరో పోస్టును సృష్టించి ఆ ర్యాంకు అధికారిని కేంద్రం కేటాయిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం రెండు రీజియన్లున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ సిటీ రీజియన్, మిగతా తెలంగాణ జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ రీజియన్ ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 13 తపాలా డివిజన్లున్నాయి. కొత్తగా తెలంగాణ సర్కిల్ ఏర్పడితే ఈ రీజియన్లను మూడుగా విభజించే అవకాశం ఉంది. ప్రస్తుత ఏపీ సర్కిల్‌ను ఆంధ్రపదేశ్‌కు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విజయవాడ, విశాఖపట్టణం, కర్నూలు రీజియన్లున్నాయి. వీటి పరిధిలో 36 తపాలా డివిజన్లున్నాయి. హైదరాబాద్ ఆబిడ్స్‌లో ప్రస్తుతమున్న జనరల్ పోస్టాఫీసు(జీపీఓ) తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనూ కొత్తగా ప్రధాన తపాలా కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి అనుబంధంగా అక్కడే చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి కేంద్రమే నిధులు సమకూరుస్తుంది. ప్రస్తుత ఏపీ సర్కిల్ పరిధిలో 16 వేల సాధారణ పోస్టాఫీసులు, 2,500 డిపార్ట్మెంటల్ పోస్టాఫీసులున్నాయి. తెలంగాణలో ఇవి 8,500 ఉన్నాయి. విభజన తర్వాత ఏ ప్రాంతంలోవి ఆ ప్రాంతంలోనే ఉంటాయి. ప్రసుతం విజయవాడ సర్కిల్ పరిధిలో ఉన్న ఖమ్మం జిల్లాను తెలంగాణ పరిధిలోకి మార్చుతారు. దీంతో తెలంగాణ పోస్టాఫీసుల సంఖ్య కొంత పెరుగుతుంది. ఏపీ సర్కిల్ పరిధిలో ప్రస్తుతం 45 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని 58:42 నిష్పత్తిలో విభజిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మెయిల్ మోటారు సర్వీసు(ఎంఎంఎస్) తరహా వ్యవస్థలను ఆంధ్రా ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిధి విస్తృతంగా ఉన్నందున సేవలపరంగా తపాలా శాఖలో కొన్ని లోపాలు తలెత్తుతున్నాయి. విభజనతో పరిధి తగ్గి సేవలు మెరుగుపడే అవకాశముంది. అలాగే కేంద్ర బడ్జెట్లో నిధులు కూడా పెరగనున్నాయి. రెండు సర్కిళ్లకు విడివిడిగా నిధులు దక్కుతాయి. -
హైకోర్టును విభజించాల్సిందే..!
విధులు బహిష్కరించిన న్యాయవాదులు బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన పరిగి: హైకోర్టును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య విభజించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం విధులు బహిష్కరించి పరిగి కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్రం చట్టబద్ధంగా విడిపోయినా హైకోర్టును మాత్రం ఉమ్మడిగా కొనసాగించడం సమంజసం కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర సమస్యల పరిష్కారంలో అన్యాయం జరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత హైకోర్టును తెలంగాణకు కేటాయించి ఆంధ్రా సర్కారుకు మరో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బ్రహ్మం, అనంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాములు, బాలముకుందం, వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్, అందె విజయ్‌కుమార్, రాముయాదవ్, నర్సింహులు, రాంచందర్, ఇబ్రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌లో జరుగుతున్న ధర్నాకు తరలివెళ్లారు. -
గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని...
దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లుగా విడిపోయిన నేపథ్యంలో, విభ జన.. అనేక సంక్లిష్ట రాజకీయ పరిస్థితు లను తీసుకువచ్చింది. సీమాంధ్రలో రాజ ధాని ఏర్పాటుపై కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీకి రాయలసీమకు సంబంధించిన చారిత్రక వాస్తవాలు తెలియవలసిన అవసరం ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, సీమాంధ్ర ఒక రాష్ట్రంగా కొనసాగటం అని వార్యమైంది. ఈ ప్రాంతానికి రాజధానిని నిర్ణయించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ సందర్భంగా గతంలో శ్రీ కృష్ణ కమిషన్.. ‘రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు తెలంగాణ, కోస్తాంధ్రలో ఉండవచ్చు కాని, ఒక ప్రాంతంగా రాయలసీమ మొత్తంగా వెనుకబడి ఉంది..’ అని పేర్కొనడం గుర్తుంచుకోవాలి. అందుకే అయి దున్నర దశాబ్దాల పైబడిన తర్వాత కూడా వెనుకబాటు తనం నుంచి బయటపడని రాయలసీమలో రాజధానిని నిర్మిం చడం ఈ ప్రాంత మనుగడకు తప్పనిసరి. 1953లో రాయలసీమలో రాజధానిని ఏర్పర్చాక మూడేళ్లలోనే రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చినప్పుడు గ్రేటర్ రాయలసీమ వాసులు విశాల దృక్ప థంతో అంగీకరించారు. ప్రస్తుతం రాష్ట్రం రెండుగా విడిపో యింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి. దక్షిణ భారత దేశంలోనే రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. నీటిపారుదల సౌకర్యాలు, పరిశ్రమలు, రాజధాని ఏర్పాటు ద్వారానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. గతంలో గ్రేటర్ రాయలసీమ అభివృద్ధికి మద్రాసు ప్రెసిడెన్సీలో చేపట్టిన మెకంజీ పథకం, 1951 కృష్ణా, పెన్నార్ ప్రాజెక్టు, సిద్ధేశ్వరం ప్రాజెక్టు, ఖోస్లా కమిటీ ఈ ప్రాంతంలో సాగునీటి కోసం ప్రతిపాదించిన అనేక విలువైన పథకాలు నేటికీ ఆచరణకు సాధ్యం కాలేదు. తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, వెలిగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా, గాలేరు నగరితోపాటు కేసీ కెనాల్ ఆధునీకరణ పనులు కూడా నేటికీ పరిపూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ రాయలసీమవాసులు (ప్రకాశం జిల్లాలో నేడు కొనసాగు తున్న గిద్దలూరు, కంబం, మార్కాపురం, పొదిలి, దర్శి, కనిగిరి, కందుకూరు, నెల్లూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలు) రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కోరుకోవడం సమంజసమే. పైగా మార్కాపురం రెవెన్యూ డివిజన్ ప్రాంతం లోని దొనకొండ వద్ద దాదాపు 50 వేల ఎకరాల భూమి ప్రభుత్వ అధీనంలో ఉంది. ఇది నూతన రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది. కాబట్టి సారవంతమైన భూమిని వృథా చేయనవసరం లేదు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇక్కడ విమానా శ్రయం నిర్మించతలపెట్టారు. కాబట్టి అంతర్జాతీయ విమానా శ్రయానికి సీమాంధ్రలో ఎక్కడా లేని అనుకూలత ఉంది. రాజధాని ఏర్పాటు సందర్భంగా గ్రేటర్ రాయలసీమలోని ఆరు జిల్లాల పరిస్థితిపై ప్రభుత్వం చర్చించడం లేదు. పోలవరం, పులిచింతల, రాజధాని.. ఇలా అన్నింటికీ ఏలూ రు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలపైనే సీమాంధ్ర ప్రభుత్వం కేంద్రీకరించినట్లు కనబడుతోంది. భవిష్యత్తులో మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునాదులు వేయకుండా గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు జరగాలి. చంద్రబాబు పరిపాలనలో ప్రత్యేక తెలంగాణ వాదం పుట్టింది, పెరిగింది అనే అంశం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అభివృద్ధిని వికేంద్రీకరించకుండా పాలన సాగించిన పరిణామాల్లో భాగంగానే తెలంగాణ ఉద్యమం బలపడింది. కాబట్టి గతంలో జరిగిన తప్పులను సవరించాలంటే గ్రేటర్ రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలి. విశాలమైన మంచి రవాణా వ్యవస్థ, పారిశుధ్యానికి తగిన సౌకర్యాలు, విశాలమైన పార్కులు, చండీగఢ్ తరహాలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్ణయం జరగాలి. రాజధాని ఏర్పాటుకు సుదీర్ఘ కాలం పడుతుంది. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి వేల ఎకరాలను సేకరించాల్సిన అవసరం ఉంది. అంతేకాని కావాల్సింది సింగపూర్లు కాదు. 70 శాతం ప్రజలు పల్లెల్లో నివసించే మన రాష్ట్రంలో సింగపూర్ తరహా రాజధాని ఏమాత్రం ఆచరణ యోగ్యం కాదు. (వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకులు) ఇమామ్ -
ఆర్టీసీ విభజనలో వుళ్లీ కదలిక
అధికారులతో నిపుణుల కమిటీ భేటీ ఉద్యోగులు, ఆస్తులు, అప్పులపై ఆరా హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) విభజన ప్రక్రియులో వుళ్లీ కదిలిక వచ్చింది. రాష్ట్ర పునర్విభజన బిల్లులోని పదో షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజన వ్యవహారాలను పర్యవేక్షించే నిపుణుల కమిటీ వుంగళవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఆర్టీసీ ఎండీ పూర్ణచందర్ రావుతో పాటు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో భేటీ అయిన కమిటీ సభ్యులు.. సంస్థ విభజనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారుల నుంచి సేకరించారు. సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య, రెండు రాష్ట్రాల వుధ్య ఉద్యోగుల పంపిణీకి ప్రాతిపదిక, ఉన్నతస్థారుు అధికారుల కేటారుుంపు, ఆర్టీసీ డిపోల సంఖ్య, బస్సుల సంఖ్య, వాటి కేటారుుంపులు, ఆస్తులు, అప్పుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో విభజనకు సంబంధించి ఆర్టీసీ అంతర్గత కమిటీ కసరత్తు చేసి ప్రభుత్వానికి అందజేసిన నివేదికను కూడా అధికారులు కమిటీ వుుందుంచారు. ఉవ్ముడి రాజధానిగా ఉన్న హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ఆర్టీసీ ఆస్తులపై కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. -
‘భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి’
భీమవరం టౌన్ : తెలంగాణలో ఉన్న భద్రాచలం డివిజన్‌ను పూర్తిగా సీమాంధ్రలో కలి పితే తప్ప పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యం కాదని రైతు కార్యాచరణ సమితి అధికార ప్రతినిధి ఎంవీ.సూర్యనారాయణ రాజు అన్నారు. మంగళవారం భీమవరం రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవన ంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల కోసం కేటాయించిన 90 వేల ఎకరాలు భద్రాచలం డివిజన్‌లోనే ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌లో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను మాత్రమే సీమాంధ్రలో కలుపుతున్నట్లు ఉందన్నారు. ఈ మండలాల్లో నిర్వాసితులకు కేటాయించేందుకు 30 వేల ఎకరాలు మాత్రమే ఉన్నాయని, మిగతా 60 వేల ఎకరాల భూములు చర్ల, వెంకటాపురం, దమ్ముగూడెం, వాజేడు మండలాల్లో ఉన్నాయన్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ నాలుగు మండలాలు 1959 వరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికావాలంటే ఈ నాలుగు మండలాలను కూడా సీమాంధ్రలో కలపాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రులు, ఇంజినీర్లు తెలంగాణ కు చెందిన వారే కావడంతో ఆ ప్రాంతానికే ఎక్కువ ప్రయోజనం చేకూరే విధంగా వ్యవహరించారన్నారు. 6 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను కేంద్రం తీసుకుని జాతీయ హోదా కల్పించాలన్నారు. పోలవరం సాధనకు వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీ వె ళ్లి అక్కడ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీల సహకారంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో రైతు కార్యాచరణ సమితి అధ్యక్షుడు కలిదిండి గోపాల కృష్ణంరాజు, మంతెన కృష్ణంరాజు, పీవీ సీతారామరాజు, సూర్యారావు, గంటా సుందర్‌కుమార్, వడ్డి సుబ్బారావు పాల్గొన్నారు. -
గళం విప్పరేం..!
ఉత్తరాంధ్రలో అప్రాధాన్య విద్యా సంస్థలు వందల్లో సీట్లు, అరకొర ఉపాధి అవకాశాలు విద్యాశాఖ మంత్రి ఉన్నా ప్రయోజనం సున్న ఏయూక్యాంపస్ : దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం మరో పర్యాయం తేటతెల్లమవుతోంది. ఉత్తరాంధ్రకు కేంద్ర విద్యాసంస్థల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోంది. అప్రాధాన్యమైన వాటిని ఉత్తరాంధ్రకు కేటాయిస్తున్నారు. ఎక్కువ మందికి అవకాశాలు, ఉపాధిని అందించే ప్రధానమైన విద్యాసంస్థలను రాయలసీమకు తరలించుకుపోవడానికి నేతలు సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన రాజకీయ నేతలు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తుండంతో వారి పని ఇంకా సులభమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఫలానా విద్యా సంస్థలు కావాలని ఏ ఒక్క అధినేత నోరు విప్పి అడగటం లేదు. విద్యాశాఖ మంత్రి ఈ ప్రాంతం వ్యక్తి అయినప్పటికీ ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యా యం జరుగుతోంది. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతం లో పలు కేంద్రీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో ప్రస్తు తం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉత్తరాం ధ్రలో ఒక ఐఐఎం, పెట్రో వర్సిటీ, గిరిజన వర్సి టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎయిమ్స్, నిట్, వ్యవసాయ వర్సిటీ వంటివి కృష్ణా-గుంటూరు జిల్లాలకు తరలించుకు పోతున్నారు. తిరుపతి ప్రాంతంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐటీలను ఏర్పాటుచేయడానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయనే వాదనలు బలప డుతున్నాయి. ప్పటికే రాజధాని విశాఖలో ఏర్పాటుచేయరని స్పష్టమైన సంకేతాలను నేతలు పంపుతున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన విధంగానే రాజధాని చుట్టూనే ప్రధాన విద్యాకేంద్రాలను ఏర్పాటుచేయడానికి సిద్ధమవుతున్నారు. అభివృద్ధికి తోడ్పడేనా... ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పాటుచేయనున్న కేంద్రీయ విద్యాసంస్థల పరిధి పరిమితంగా ఉంటుంది. వీటిలో ఒక్కో సంస్థలో రెండు నుంచి నాలుగు కోర్సులను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విద్యనభ్యసించే విద్యార్థుల సంఖ్య సైతం రెండు నుంచి నాలుగు వందల మధ్య ఉంటుంది. వీటిలో పనిచేసే బోధనా సిబ్బంది సంఖ్య వంద నుంచి మూడు వందలలోపు, బోధనేతర సిబ్బంది వంద వరకు ఉంటారు. ఐఐఎంలో వంద నుంచి రెండు వందల మంది విద్యార్థులు ఉండే అవకాశం ఉంటుంది. పెట్రో వర్సిటీలో రెండు యూజీ, మరో రెండు పీజీ కోర్సులను నిర్వహించే అవకాశం ఉంటుంది. వీటిలో గరిష్టంలో 120 నుంచి 240 వరకు ప్రవేశాలు కల్పిస్తారు. గిరిజన వర్సిటీలో కేవలం కొన్ని ప్రత్యేక కోర్సులను నిర్వహించి, పరిమితంగా ఉంటుంది. కేంద్రీయ హోదా ఉన్నప్పటికీ చిన్నపాటి విద్యా సంస్థలను ఉత్తరాంధ్రకు కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలను ఈ సంస్థలకు కేటాయించినా ఈ ప్రాంతానికి జరిగే లబ్ధిమాత్రం స్వల్పంగానే ఉంటుంది. కేవలం కొద్ది మందికి ఉపాధి కల్పించి, పరిమితంగా పనిచేసే ఈ సంస్థలు ఎంతవరకు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎయిమ్స్, ఐఐటీల మాటేమిటి.. విద్య, వైద్య రంగాలకు విశాఖ కేంద్రంగా నిలుస్తుందని నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలుగా మారిపోతున్నాయి. జాతీయ స్థాయిలో వైద్య విద్యాసంస్థగా నిలిచే ఎయిమ్స్ తరహా వైద్య విద్యాసంస్థ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలను విశాఖలో ఎందుకు కేటాయించడం లేదనేది ప్రశ్నగా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే వ్యవస్థ అన్ని వసతులు ఉన్న కాస్మోపాలిటన్ సిటీగా పేరుగాంచిన విశాఖ ఈ విద్యా సంస్థల స్థాపనకు అన్ని విధాలా అనుకూలం అన్నది నిర్విదాంశం. ఈ దిశగా స్థానిక నేతలు కనీసం నోరుమెదపక పోవడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది. కనీసం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్నయినా కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్పుచేసే దిశగా పనిచేయాలి. -
రాజకీయ నిర్ణయం మేరకే
ఆంధ్ర కొత్త రాజధాని ఎంపికపై వెంకయ్య వెల్లడి చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక రాజధానిపై కసరత్తు కొత్త రాజధానిగా హైదరాబాద్ అంతటి నగరాన్ని ఆశించలేం {పధాని మోడీ స్మార్ట్ సిటీ ఆలోచనకు హైదరాబాద్ అనువైనది ఆంధ్ర, తెలంగాణలను కేంద్రం కన్నబిడ్డల్లా ఆదుకుంటుంది హైదరాబాద్: విభజన తరువాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక అన్నది అంతిమంగా అక్కడ ప్రభుత్వంలోకి వచ్చేవారు రాజకీయంగా తీసుకునే నిర్ణయం మేరకే జరుగుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఆయన మంత్రివర్గ విస్తరణ తరువాత రాజధానికి సంబంధించి తదుపరి చర్యలు మొదలవుతాయని చెప్పారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వెంకయ్యనాయుడు శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా లేక్‌వ్యూ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సంబంధించి ఇప్పటికే తానొకసారి చంద్రబాబుతోనూ చర్చిం చినట్టు తెలిపారు. కొత్త రాజధాని హైదరాబాద్ అంతటి నగరంగా ఉంటుం దని ఆశించ లేమని.. ఎంత మేరకు అవసరం, ఎలాంటి సౌకర్యాలు కావాలన్నదే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. అలాగని కేవలం అసెంబ్లీ, సచివాలయం, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస గృహాలకు పరిమితమై రాజధాని నగరాన్ని నిర్మిం చడం సరికాదన్నారు. రాజధానిగా ఉండే నగరానికి ఉండాల్సిన మౌలిక వసతులు, మంచినీటి సౌకర్యం వంటి అవసరాలను పరిశీలించి అధికారులు నివేదికలు సిద్ధం చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గుంటూరు-విజయవాడ, ఖాజీపేట-వరంగల్ వంటి జంట నగరాల అభివృద్ధి మంత్రిగా తన ప్రాధాన్యత అంశాల్లో ఒకటిగా చెప్పారు. ప్రధాని మోడీ ఆలోచనల్లోని స్మార్ట్ సిటీ విధానానికి హైదరాబాద్ అనువైనదిగా వెంకయ్య పేర్కొన్నారు. ఈ నగరం చుట్టూ కొన్ని చిన్న నగరాలను అభివృద్ధి చేసి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ఆలోచన ఉందన్నారు. హైదరాబాద్‌లో మెట్రో పనులు 2017 వరకు పూర్తవుతాయని, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు దీనిని విస్తరించే ఆలోచన ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాలను కన్నబిడ్డల్లా చూసుకుంటాం... అంతకుముందు పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వెంకయ్య.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం కన్నబిడ్డల మాదిరి ఆదుకుంటుందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి సాధ్యమని.. ఒకరినొకరు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఉద్యోగుల పంపిణీపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నిబంధనల మేరకు ఉద్యోగుల పంపిణీ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు జరిగిన పంపిణీ తాత్కాలికమైనదని.. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే మూడు నెలల్లో తెలియజేసి పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఎక్కడి వారు అక్కడ పనిచేయాలని కొందరు అంటున్నా రెండో ప్రాంతంలో సూపర్ న్యూమరీ పోస్టుల ఏర్పాటుకు అంగీకారం తెలిపితేనే అది సాధ్యమని చెప్పారు. ఘన స్వాగతం.. అధికారులతో సమీక్ష కేంద్రమంత్రి పదవి చేపట్టాక తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన వెంకయ్యకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయన బెంగళూరులో ఉన్నందునే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని పార్టీ నేతలు చెప్పారు. -
అనకాపల్లికి జిల్లా చాన్స?
- బెల్లంపల్లి కేంద్రంగా రూరల్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన - విశాఖను రెండుగా విభజించే అవకాశం - ఉత్తరాంధ్రలో ఇక్కడే అవకాశం అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి మరో మైలురాయికి చేరువయ్యింది. భౌగోళిక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటికే పలు ప్రాధాన్యతలను సొంతం చేసుకున్న అనకాపల్లి అన్నీ అనుకున్నట్టు జరిగితే సరికొత్త హోదా దక్కించుకోనుంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెరపైకి వచ్చిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు అనకాపల్లికి అనుకూలంగా మారనుంది. సూటిగా చెప్పాలంటే అనకాపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశాలు అధిక శాతం ఉన్నట్టు సమాచారం. సీమాంధ్రలో 13 జిల్లాలు ఉండగా, వీటిని 21 వరకు పెంచాలన్నది ప్రభుత్వ యోచన. నియోజకవర్గాలు సైతం 175 నుంచి 225 వరకు పెంచే ప్రతిపాదన ఉండడంతో జిల్లాల పెంపు అనివార్యం. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రచారం జోరందుకుంది. ఉత్తరాంధ్రలో ప్రస్తుతం మూడు జిల్లాలుండగా అదనంగా మరో జిల్లా ఏర్పాటుకానుంది. ప్రస్తుతం ఉన్న భౌగోళిక స్థితిగతుల నేపధ్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను విభజించే అవకాశం లేదు. దీంతో విశాఖ నగరాన్ని ఒక జిల్లాగాను, గ్రామీణ ప్రాంతాన్ని మరో జిల్లాగాను విభజించే ప్రయత్నాలు జోరందుకున్నాయి. అనకాపల్లి కేంద్రంగా ఈ కొత్త జిల్లా ఏర్పాటుకానుందన్నది ఉన్నతాధికారుల అభిప్రాయం. అనకాపల్లిలోఉన్న వంద పడకల ఆస్పత్రి ఇటీవలే జిల్లా స్థాయి ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయింది. మరోవైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్మాసిటీ, ఎస్ఈజెడ్లకు రవాణా పరంగా అనకాపల్లి అత్యంత కీలకం. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బెల్లం మార్కెట్, కూరగాయల వ్యాపార కలాపాల కేంద్రంగా అనకాపల్లికి ప్రత్యేకత ఉండనే ఉంది. అనకాపల్లి నుంచి వందలాది మంది ఫైనాన్స్ వ్యాపారస్తులు విశాఖపట్నానికి తరలివెళ్లడం, అక్కడ వ్యాపారస్తులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడంలో ఈ ప్రాంతానికి చెందిన ఫైనాన్స్ర్ల పాత్ర ఎనలేనిది. ఇక జాతీయ రహదారి ఆనుకుని ఉండడం, రైల్వేస్టేషన్ సదుపాయం ఉండనే ఉన్నాయి. తాజాగా అనకాపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు, అన్నిరకాల వ్యాపార కలాపాలు ఇక్కడ నిర్వహించడం కలిసొచ్చే అంశం. వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ అధికార కార్యాలయం, కార్మిక శాఖ, తూనిక లు, కొలతల శాఖ, అటవీ శాఖ కార్యాలయాలు, సీసీఎస్ మహిళా పోలీస్‌స్టేషన్‌తోపాటు జిల్లా కేంద్రానికి అవసరమైన కార్యాలయాల ఏర్పాటుకు వనరులన్ని ఉన్నాయి. అనకాపల్లి మీదుగా శారద నది ఉండడంతో నీటి వనరులకు లోటుండదు. ఆధ్యాత్మికంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబికా అమ్మవారి ఆలయం, పర్యాటక కేంద్రంగా బొజ్జన్నకొండ, తాగు, సాగునీటి వనరులను పెంపొందించుకునేందుకు సమీపంలోనే అనకాపల్లి, వాడ్రాపల్లి, కొండకర్ల ఆవ ఉండనే ఉన్నాయి. ఇన్ని అర్హతలున్న అనకాపల్లికి కొత్త జిల్లా కేంద్రంగా గుర్తింపు తెచ్చుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కావలసింది రాజకీయ పరపతి, వనరులున్న కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపనే. మరికొద్ది నెలల్లో కొత్త జిల్లా ఏర్పాటుపై పూర్తి స్పష్టత రానుంది. -
ఆశగాఆగాల్సిందే
జూన్‌లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రస్తుతం విజయోత్సవాల్లో బిజీబిజీ నియోజకవర్గాల్లో ర్యాలీలు, కార్యకర్తలతో సమావేశాలు మొక్కులు తీర్చుకోవడంలో కొందరు నిమగ్నం సాక్షి, విశాఖపట్నం: ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇంకా సమయం ఉండడంతో ఈ మధ్య కాలంలో వారు కాసింత సేదదీరుతున్నారు. నెలన్నరగా కంటిమీద కునుకులేకుండా రాత్రీపగలూ విజయం కోసం శ్రమించిన నేతలు ఫలితాల తరువాత కాసింత రిలాక్స్ అయ్యారు. ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో చాలామంది అభ్యర్థులు అసలు తాము గెలుస్తామో లేదోనని బెంగపెట్టుకున్నారు. మరికొందరైతే ఆశలు వదిలేసుకున్నారు. తీరా ఫలితాలు అనుకూలంగా రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. విజేతలు తమ అనుయాయులు, ఆత్మీకుల కార్యకర్తలతో కలిసి ఆనందక్షణాలు పంచుకుంటున్నారు. శుక్రవారం ఫలితాలు వెలువడ్డంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయాలి. కాని రాష్ట్ర విభజన జరగడంతో ప్రస్తుతం అధికారులంతా శాఖల విభజన, ఇతరత్రా ఏర్పాట్లలో ఉండడం, జూన్ 2న రెండురాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం ఉండడంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా అప్పటివరకు వాయిదా పడింది. దీంతో కొత్త ఎమ్మెల్యేలంతా జూన్ రెండో వారం వరకూ ఆగక తప్పడం లేదు. దీంతో ఈ ఖాళీ సమయంలో మండలాల వారీగా సభలు, అభినందన సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమకు ఎక్కడెక్కడ ఓట్లు తక్కువ పడ్డాయి? ఎక్కడ అనుకూలంగా పడ్డాయనేదానిపై విశ్లేషించుకుంటున్నారు. మరికొందరు రోడ్డుషోలు, విజయోత్సవాలు జరుపుతున్నారు. ఇప్పటికే విశాఖ తూర్పు, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమం,భీమిలి, గాజువాక, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, పెం దుర్తి, చోడవరం, మాడుగులలో అభ్యర్థులు తమ అనుచరులు, కార్యకర్తలతో సంబరాలు చేసుకున్నారు. సోమవారం విశాఖ దక్షిణంతోపాటు మరికొన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు, రోడ్డుషోలు నిర్వహిస్తున్నారు. కొందరు టీడీపీ అభ్యర్థులు గెలిచిన తర్వాత చంద్రబాబును కలవడానికి వెళ్లారు. గెలిచి న ఆనందం పంచుకోవడంతోబాటు మంత్రి పదవు ల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. జిల్లా నుం చి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో సీనియర్ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, అ య్యన్న పాత్రుడు, గంటా తదితరులున్నారు. కొత్త ఎమ్మెల్యే లూ బాబును కలిసి తమ అదృష్టాన్ని పరీ క్షించుకోనున్నారు. మరికొందరైతే తిరుపతి, షిర్డీ వెళ్లి మొక్కు లు తీర్చుకుంటున్నారు. మరికొందరు కొత్తగా ఎన్నికైన అభ్యర్థులు నియోజకవర్గాల్లో తాము ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేసుకుని ముందు ఏయే పనులు చేయాలనేదానిపై ప్రాథమ్యాలు ఎంచుకుం టున్నారు. అధికంగా నిధులు ఖర్చయిన యలమంచిలి, అనకాపల్లి, గాజువాక, పాయకరావుపేట, విశా ఖ ఉత్తరం, విశాఖతూర్పు నియోజకవర్గా ల్లో గె లిచి న అభ్యర్థులు మాత్రం అంచనాలు మిం చిపోయిన ఎన్నికల ఖర్చులపై కసరత్తు చేసుకుంటున్నారు. -
ప్రత్యూష్ సిన్హా నివేదిక సిద్ధం!
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రత్యూష్ సిన్హా కమిటీ సిద్ధం చేసింది. కమిటీ సభ్యులు ఈ నివేదికను మంగళవారం సాయంత్రమే ప్రధాని కార్యాలయ పరిశీలనకు పంపినట్లు తెలిసింది. అక్కడ ఆమోదం లభిస్తే 16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత అదే రోజు సాయంత్రం లేదా 17న కేంద్ర హోంశాఖ వెబ్సైట్లో మార్గదర్శకాలను అందుబాటులో ఉంచవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అఖిల భారత సర్వీసు పోస్టులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యూష్ సిన్హా కమిటీ విభజించింది. దీని ప్రకారం తెలంగాణకు 163 ఐఏఎస్, 112 ఐపీఎస్, 65 ఐఎఫ్ఎస్ పోస్టులను కేటాయించగా, ఆంధ్రప్రదేశ్‌కు 211 ఐఏఎస్, 144 ఐపీఎస్, 82 ఐఎఫ్ఎస్ పోస్టులు అవసరమని కేంద్రానికి సిఫార సు చేసింది. జిల్లాల నిష్పత్తి ఆధారంగా ఈ కేటాయింపులు జరిపిన విషయం తెలిసిందే. అధికారులను సంఖ్యాపరంగా విభజన చేసినా, ఎవరిని ఎక్కడికి పంపాలి, ఆప్షన్లు ఇవ్వాలా? వద్దా? అన్న దానిపై మంగళవారం నాటికి కసరత్తు పూర్తయింది. విభజన మార్గదర్శకాల తయారీలో పారదర్శకత, సమన్యాయానికి ప్రాధాన్యమిస్తూనే గతంలో మూడు రాష్ట్రాల విభజన సమయంలో ఉద్యోగుల విభజన చేసిన యూసీ అగర్వాల్ కమిటీ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇక విభజన అనంతరం ఏ రాష్ట్రాల్లో పనిచేస్తారన్న దానిపై అఖిల భారత సర్వీసు అధికారుల నుంచి అనధికారికంగా సీల్డ్ కవర్లో అభిప్రాయాలను ప్రత్యూష్ సిన్హా కమిటీ సేకరించింది. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని, అయితే దానిని హక్కుగా మాత్రం భావించరాదని అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే తమకు కచ్చితంగా ఆప్షన్లు ఉండి తీరాలన్న అఖిల భారత స్థాయి అధికారుల డిమాండ్ పట్ల కమిటీ ఎలా స్పందించిందన్నది తెలియరాలేదు. కన్ఫర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల విషయంలోనూ నిర్ణయం తీసుకున్నారన్నది సస్పెన్స్‌గానే ఉంది. -
ప్రస్తుత భవనాలను సీమాంధ్రకు కేటాయిస్తే ఊరుకోం..
ఇలా చేస్తే మరో ఉద్యమం.. టీఎన్జీవో, టీజీవో నేతల హెచ్చరిక సుల్తాన్‌బజార్,న్యూస్‌లైన్: విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయిస్తే సహించేదిలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. గురువారం టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు కోఠిలోని కుటుంబసంక్షేమశాఖ కమిషనర్, డీహెచ్‌లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం సంఘం ప్రతినిధులు జూపల్లి రాజేందర్, నాగరాజు, షబ్బీర్‌అహ్మద్, శ్రీనివాస్, హరి, వీరయ్య, సరళ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతున్న డీఎంఈ, డీహెచ్, వైద్యవిధానపరిషత్, కుటుంబసంక్షేమశాఖ కార్యాలయాలను విభజించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిసిందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోతున్న తరుణంలో తెలంగాణకు చెందిన కార్యాలయాలను బంజారాహిల్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు భవనాల్లోకి తరలించేందుకు సీమాంధ్ర అధికారులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి ఉండగా..వారిని ప్రస్తుతం ఉన్న కార్యాలయాల్లో కొనసాగిస్తూ తెలంగాణ కార్యాలయాలను మాత్రం అద్దె భవనాల్లోకి తరలించే చర్యలు మానుకోవాలని సూచించారు. లేకుంటే మరో ఉద్యమానికి సన్నద్ధమవుతామని వారు హెచ్చరించారు. -
విభజన ‘వారధి’
చంద్రబాబు ‘రెండు కళ్ల’ సిద్ధాంతమే ఆంధ్రప్రదేశ్‌కు శాపమైంది. ఆయనది మొదట్నుంచీ ‘విభజన’ రాగమే. ఆయన నోటి నుంచి ఒక్కరోజు కూడా సమైక్యమన్న మాటే రాలేదు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు అభ్యంతరమూ చెప్పలేదు. వైఎస్ ఉన్నంత కాలం బాబు కుయుక్తులు సాగలేదు. అనంతరం ఆయన రెచ్చిపోయారు. విభజన కుట్రలకు పదును పెంచారు. తెలుగుజాతికి ద్రోహం చేశారు. చంద్రబాబుదే విభజన పాపం మల్లు విశ్వనాథరెడ్డి సీమాంధ్రలో సగటు ఓటరుకు సింగపూర్ ఎలా ఉంటుందో తెలియదు. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అక్కడ ఏముంటుందో కూడా తెలియదు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు తాగడానికి మంచినీళ్లు లేవు. చిత్తూరు జిల్లా కుప్పం వాసులు మంచినీటి కోసం నానా తిప్పలు పడుతున్నారు. గొంతు తడుపుకునే మార్గం లేక కిలోమీటర్ల కొద్దీ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా చంద్రబాబు మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతున్నాయి. సీమాంధ్ర ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతుంటే.. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ పంచరంగుల సినిమా చూపిస్తున్నారు. విభజించేదాకా వెంటబడ్డ బాబు రాష్ట్రం విడిపోకుండా ఉంటే సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలుండేవి. చంద్రబాబుకు మాత్రం రాష్ట్రం కలిసి ఉండటం ఇష్టం లేదు. అందుకే విడగొట్టాలని పంచాయతీ పెట్టారు. రాష్ట్రాన్ని విడదీసే వరకు ఆయన విశ్రమించలేదు. కర్నాటక ప్రాజెక్టులు నిండితే గాని మన ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని విడదీస్తే తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎలా వస్తాయో అర్థంకాని పరిస్థితి. అయినా రాష్ట్రాన్ని విడగొట్టాలనే బాబు పట్టుబట్టారు. ఒక్కమాటల చెప్పాలంటే.. ‘ఇదిగో విడగొట్టమని లేఖ ఇస్తున్నా.. తీసుకోండి’ అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ తరువాత ‘ఇంకెప్పుడు విడగొడతారంటూ కేంద్రం వెంటపట్టారు. అధికారంలో ఉన్నప్పుడు మంచినీళ్లు కూడా అందించే ఏర్పాటు చేయలేని చంద్రబాబు.. అదేదో ఉట్టికి ఎగరలేనమ్మ.. అన్న తీరులో ఇప్పుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటే జనం నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ రాష్ట్ర విభజన విషయంలో మీ అభిప్రాయమేంటని అడిగినప్పుడు.. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ఆనాడు ‘మాకిష్టం లేదు.. మేం ఒప్పుకోం.. అంగీకరించే ప్రసక్తే లేదు’ అని ఒక్క మాట.. ఒకే ఒక్క మాట చెప్పి, అదేమాటపై నిలబడి ఉంటే విభజన జరిగేదే కాదు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇవ్వడంతోనే కేంద్రం ప్రభుత్వం విభజన వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించడంలో తొలి ముద్దాయి కాంగ్రెస్ అయితే మలి ముద్దాయిగా చంద్రబాబు నిలిచారు. విభజనకు టీడీపీ అనుకూలంగా ఉందని పేర్కొంటూ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇవ్వడంతో మొదలు.. విభజనకు ముందు జరిగిన ఆఖరి అఖిలపక్షం వరకు.. చంద్రబాబు విధానం విభజనకు అనుకూలంగానే సాగింది. ఏ దశలోనూ విభజనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. పైగా కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో ఢిల్లీ పెద్దలు ఆడమన్నట్లుగా ఆడారు. సీమాంధ్ర ప్రయోజనాల గురించి ఆయన కేంద్రంపై ఎన్నడూ ఒత్తిడి తేలేదు. విభజన పాపాన్ని కడిగేసుకోవడానికైనా సీమాంధ్రకు మెరుగైన ప్యాకేజీల కోసం పట్టుబట్టాల్సిన చంద్రబాబు.. సొంతలాభం కోసం సీమాంధ్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు. వెంటాడుతున్న విభజన పాపం చంద్రబాబు సహకారం వల్లనే రాష్ట్ర విభజన సులభమైందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. తనపై ఉన్న కేసులకు సంబంధించి సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవడం కోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు సహకరించారని భావిస్తున్నారు. సీమాంధ్రలో టీడీపీని విభజన పాపం వెంటాడుతోంది. విభజనకు సహకరించడంతో పాటు సీమాంధ్ర ప్రయోజనాలను గాలికి విడిచిపెట్టిన చంద్రబాబు తీరు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రజల ఆగ్రహం ఈ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయేమోనని టీడీపీ నేతలు భయపడుతున్నారు. చంద్రబాబు లేఖల చరిత్ర 2008 అక్టోబర్ 18: తెలంగాణకు టీడీపీ అనుకూలమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ 2012 సెప్టెంబర్ 26: తెలంగాణ అంశంపై తాత్సార ధోరణి తగదని, శ్రీకష్ణ కమిటీ సూచన మేరకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అక్కడికక్కడే తెలంగాణ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ. 2012 డిసెంబర్ 27: గతంలో ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోలేదని, అదే వైఖరికి కట్టుబడి ఉన్నామంటూ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు సంతకంతో ఉన్న లేఖను సమర్పించిన పార్టీ ప్రతినిధి బృందం. 2013 నవంబర్ 12: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం(జీవోఎం) ఏర్పాటు చేసిన అన్ని పార్టీల సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయిం చిన టీడీపీ.. విభజనలో గత సంప్రదాయాలు పాటించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసింది. - తెలంగాణకు అనుకూలంగా అక్టోబర్ 18, 2008న అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీకి చంద్రబాబు రాసిన లేఖ - గతంలో రాసిన లేఖను ధ్రువీకరిస్తూ 27.12.2012న కేంద్ర హోంమంత్రి షిండేకు బాబు రాసిన మరో లేఖ -
24నే వేతనాలు
- రాష్ట్ర విభజనతో ముందస్తుగా ఆదేశాలు - ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఇదే చివరి వేతనం సాక్షి, ఖమ్మం, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈనెల 24నే ఉద్యోగులకు మే నెల వేతనం అందనుంది. ఈమేరకు ముందస్తుగా ఆదేశాలు రావడంతో జిల్లా కోశాధికారి కార్యాలయం కసరత్తు చేస్తోంది. జూన్ 2 నుంచి నూతన రాష్ట్రం కానుండడంతో ఉద్యోగులకు ఇక తెలంగాణ ప్రభుత్వమే వేతనాలు చెల్లించనుంది. జిల్లాలో మొత్తం 30,782 మంది ఉద్యోగులు, 16,160 మంది పెన్షనర్లు ఉన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం వేతనం కింద రూ.103.66 కోట్లు, పెన్షనర్లకు రూ.24.98 కోట్లు చెల్లించాలి. గత నెల 7న జీఓ నెంబర్ 78ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ఈనెల 24నే.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాతా నుంచి తెలంగాణలోని ఉద్యోగులకు వేతనం చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు అందుకున్న జిల్లా కోశాధికారి కార్యాలయం అధికారులు ఉద్యోగుల జాబితా, ఖాతాలను సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఏడు రోజుల ముందే వేతనాలు చెల్లిస్తుండగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు ఇదే చివరి వేతన చెల్లింపు అవుతుంది. జూన్ రెండు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో జూన్ నెల వేతనం ఇక నూతన తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యోగులు అందుకోనున్నారు. మే 24 ఉద్యోగులకు తమ సర్వీస్‌లో గుర్తుండి పోయే రోజుగా మిగలనుంది. -
సచివాలయం విభజన కొలిక్కి
-
సచివాలయం విభజన కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర పరిపాలనకు కేంద్రబిందువుగా నిలిచే సచివాలయంలో బ్లాకుల విభజన కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండనున్నందున ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత సచివాలయం నుంచే పరిపాలన సాగించనున్నాయి. అంటే జూన్ 2వ తేదీ నుంచి సచివాలయం ఒకటే అయినా ఇద్దరేసి ముఖ్యమంత్రులు, ఒకే శాఖకు ఇద్దరేసి మంత్రులు చొప్పున దర్శనమివ్వనున్నారు. సచివాలయంలోని బ్లాకుల్లో కొన్నింటిని తెలంగాణ ప్రభుత్వానికి, కొన్ని బ్లాకులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించనున్నారు. ఈ బ్లాకుల్లో ఎవరికి ఏది కేటాయించాలనే అధికారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు చేసిన ప్రతిపాదనలకు కొన్ని మార్పుచేర్పులతో గవర్నర్ తుదిరూపు ఇచ్చినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. జూన్ 2 నుంచి సచివాలయం నుంచి రెండు రాష్ట్రాల పాలన సజావుగా సాగడానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందుగానే ఏర్పాటుచేసి సిద్ధంగా ఉంచాలనేది గవర్నర్ ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలో ఏ బ్లాకు ఎవరికి కేటాయించాలనే దానిపై ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ వివరాలివీ.. ప్రస్తుతం సీఎం కార్యాలయమున్న సి బ్లాక్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, సీఎస్‌కు, సీఎం కార్యాలయ కార్యదర్శులకు కేటాయించనున్నారు. అలాగే తెలంగాణ ఉద్యోగులకు సచివాలయంలోని సి బ్లాక్‌తోపాటు ఏ, బి, డి, నార్త్ హెచ్ బ్లాక్‌లను కేటాయించనున్నారు. తెలంగాణ సీఎం, మంత్రులు, ఉద్యోగుల రాకపోకలకు హెలిపాడ్ సమీపంలో గల స్కూల్ వద్ద గేట్ల నిర్మాణం చేయనున్నారు. సీమాంధ్ర సీఎంకు గతంలో డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సౌత్ హెచ్ బ్లాక్‌ను కేటాయించనున్నారు. ఈ బ్లాక్‌లో మూడో అంతస్తులో సీఎం కార్యాలయం ఉంటుంది. అలాగే కింద అంతస్తులో సీమాంధ్ర సీఎస్ కార్యాలయాన్ని, రెండో అంతస్తులో సీఎం కార్యాలయ అధికారులకు కేటాయిస్తారు. అక్కడే మంత్రివర్గ సమావేశ మందిరాన్నీ ఏర్పాటు చేస్తారు. సీమాంధ్ర సీఎం, మంత్రులు, ఉద్యోగులు ప్రస్తుతమున్న గేటు ద్వారా రాకపోకలు కొనసాగించనున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు, మంత్రులకోసం జె, ఎల్, కె బ్లాకుల్ని కేటాయించనున్నారు. ప్రస్తుతం గ్రీన్లాండ్స్లో గల ముఖ్యమంత్రి అధికార నివాసం, క్యాంపు కార్యాలయాన్ని తెలంగాణ సీఎంకు కేటాయిస్తారు. సీమాంధ్ర ముఖ్యమంత్రికి గ్రీన్లాండ్స్ అతిథిగృహాన్ని కేటాయించనున్నారు. ఈ కేటాయింపుల ఆధారంగా రహదారులు-భవనాల శాఖ ఆయా బ్లాకుల్లో చిన్న చిన్న నిర్మాణాలను చేయాల్సి ఉంది. -
ఈ నెలాఖరే గడువు
ఫైళ్ల విభజన పనులపై శాఖాధిపతులకు సీఎస్ స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, భవనాలు, ఇతర వస్తువుల పంపిణీలపై తుది నిర్ణయం గవర్నర్, కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి స్పష్టం చేశారు. విభజన పనులకు సంబంధించి పలు శాఖల అధికారులు, ఉద్యోగులు రూపొందిస్తున్న సమాచారాన్ని అపెక్స్ కమిటీ , అనంతరం గవర్నర్, కేంద్రం ఎదుట ఉంచుతామన్నారు. రాష్ట్ర విభజనలో కీలకాంశాలైన ఫైళ్ల విభజన, రికార్డులు, డిస్పోజల్స్ విభజన, స్థిర, చరాస్తుల విభజన, రాష్ట్ర, మల్టీ జోనల్ పోస్టుల విభజన, కోర్టు కేసులు, కాంట్రాక్టులు, చట్టాలు, నిబంధనలు, నోటిఫికేషన్లు తదితర అంశాలపై సీఎస్ బుధవారం సచివాలయంలో శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా ఫైళ్ల విభజనను ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ రాష్ట్రానికి చెందిన ఫైళ్లను ఆ రాష్ట్రానికి విభజించడంతోపాటు వివరాలను కంప్యూటర్లో నమోదు చేయాలని సూచించారు. అయితే విభజన వివరాల సేకరణకు సంబంధించి ఇదే అంతిమం కాదన్నారు. గవర్నర్, కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రతి కార్యాలయంలో ఫైళ్లను స్కానింగ్ చేయడానికి త్వరలోనే స్కానర్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. స్కానర్లు ప్రై వేట్ ఏజెన్సీలకు చెందినవి అయినందున ఫైళ్లు స్కాన్ చేసే చోట కచ్చితంగా ప్రభుత్వానికి చెందిన ఉద్యోగిని అక్కడ ఉంచాలని ఆదేశించారు. ఆ సమయంలో పెన్‌డ్రై వ్, డిస్క్ ఆప్షన్స్ లేకుండా చూడాలని సూచించారు. అన్ని ఫైళ్లు ఐటీ విభాగంలోని ప్రధాన సర్వర్‌కు వస్తాయని, అనంతరం ఫైళ్లు చూసేందుకు ఆయా శాఖలకు పాస్వర్డ్ ఇస్తామని వివరించారు. మొత్తం విభజన ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. విభజన పనులకు సంబంధించి అంశాలవారీగా అన్ని శాఖలకు గడువును సీఎస్ నిర్దేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి ఫైళ్లే అత్యధికం సచివాలయంలో అన్ని శాఖల్లో 1.80 లక్షల ఫైళ్లు ఉన్నట్లు గుర్తించారు. గత ఐదేళ్ల నాటి ప్రధానమైన ఫైళ్లు, రికార్డులు, డిస్పోజల్స్‌ను స్కానింగ్ చేసి భద్రపరచాల్సి ఉంది. 1.80 లక్షల ఫైళ్లలో అత్యధికంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధికి చెందినవే 40 వేల ఫైళ్లు ఉన్నాయి. రెవెన్యూకు చెందినవి 20 వేల ఫైళ్లు, మున్సిపల్‌కు చెందినవి 16 వేల ఫైళ్లు ఉన్నాయి. -
విభజన.. విచిత్రం
ఊరొక చోట... పేరొక చోట.. నియోజకవర్గాలు గల్లంతు పునర్విభజన అస్తవ్యస్తం ఖైరతాబాద్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ కూకట్పల్లి సగభాగం శేరిలింగంపల్లిలోనే.. సికింద్రాబాద్ దాదాపు సనత్‌నగర్‌లోకి.. సాక్షి నెట్వర్క్ : ‘గ్రేటర్’ నియోజకవర్గ పునర్విభజన గందరగోళంగా మారింది. కొత్త నియోజకవర్గాలు కొన్ని నిజంగానే వింత గొలుపుతున్నాయి. నిబంధనల్ని వెక్కిరిస్తూ ఓటర్లను గందరగోళంలో పడేస్తున్నాయి. వాస్తవానికి ఒక డివిజన్ ఒకే నియోజకవర్గంలో పూర్తిగా ఉండాలి. అంతేకాదు చుట్టూరా ఉన్న ప్రాంతాలకు సమదూరంలో నియోజకవర్గ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కానీ నగరంలో ఈ నిబంధనల్నేం పట్టించుకోలేదు. జూబ్లీహిల్స్ పేరుతో నియోజకవర్గం ఉన్నా జూబ్లీహిల్స్ ప్రాంతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో వచ్చి చేరింది. కూకట్పల్లి నియోజకవర్గం ఉన్నా.. కూకట్‌పల్లిలోని పలు ప్రాంతాలు శేరిలింగంపల్లిలోకి వెళ్లాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్ లేనే లేవు. ఇక సికింద్రాబాద్ చుట్టూరా ఉన్న ప్రాంతాలను సనత్‌నగర్‌లో కలిపేశారు. ఇలా పేరొక చోట.. ఊరొక చోట.. పెట్టి విభజన తంతు కానిచ్చేయడంతో పునర్ వ్యవస్థీకరణ జంబలకిడిపంబలా తయారైంది. రూపు.. మ్యాప్.. మారిపోయి నియోజకవర్గాల ముఖచిత్రం విచిత్రంగా తయారైంది. పునర్విభజన ఫలితంగా కూకట్పల్లి నియోజకవర్గం కకావికలైంది. విచిత్రమేమిటంటే ఇక్కడ ఒకే ఏరియా.. రెండు నియోజకవర్గాలుగా విడిపోయింది. కూకట్పల్లి నియోజకవర్గానికి గుండెకాయలాంటి కూకట్పల్లి డివిజనే రెండు నియోజకవర్గాల్లో ఉంది. పేరుకు కూకట్పల్లి ఉన్నప్పటికీ కూకట్పల్లి పరిసర ప్రాంతాలన్నీ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చాయి. ముఖ్యంగా కూకట్‌పల్లిలో సీతారామచంద్రస్వామి దేవాలయం, పాపారాయుడునగర్తోపాటు కొన్ని బస్తీలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేర్చారు. కూకట్పల్లి పరిసర ప్రాంతాలైన కూకట్పల్లి, బాగ్అమీర్, విశాల్ టవర్స్‌తోపాటు కూకట్పల్లి రెవెన్యూ గ్రామంలో ఉన్న ఆల్విన్ కాలనీ, వెంకటేశ్వర నగర్, జగద్గిరిగుట్ట పార్టులతో పాటు మరో 15 కాలనీలు శేరిలింగంపల్లిలో ఉన్నాయి. వివేకానందనగర్, హైదర్‌నగర్ డివిజన్లూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే చేరాయి. కూకట్పల్లి ప్రాంతానికి దూరంగా ఉన్న బేగంపేట, మోతీనగర్, పాతబోయిన్‌పల్లి, ప్రకాశ్‌నగర్ వంటి ప్రాంతాలు మాత్రం కూకట్పల్లి నియోజకవర్గంలోకి వచ్చాయి. బేగంపేట డివిజన్లో కొంతభాగం సనత్‌నగర్ నియోజకవర్గంలోకి రాగా.. మరికొంతభాగం కూకట్పల్లి నియోజకవర్గంలోకి వచ్చింది. వివేకానందనగర్ డివిజన్ శేరిలింగంపల్లితో పాటు కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఆవరించి ఉంది. ముక్కలైన అలియాబాద్ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అలియాబాద్ డివిజన్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఉండేది. పునర్విభజన అనంతరం ఈ డివిజన్‌ను రెండు ముక్కలు చేశారు. 18-4, 18-5 వార్డులు బహదూర్‌పురా నియోజకవర్గంలోకి, 23-4, 23-5 వార్డులు చార్మినార్ నియోజకవర్గంలోకి వచ్చాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ పరిధిలోని యాప్రాల్ డివిజన్ సగభాగం ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్లో ఉంది. అందుకే యాప్రాల్ కార్పొరేటర్ రెండు నియోజకవర్గాల రివ్యూ మీటింగ్‌లకు హాజరవుతారు. ఇక బర్కత్‌పుర డివిజన్ అంబర్‌పేట నియోజకవర్గంలో ఉంది. డివిజన్లోని రాజ్మెహాల్లా, పర్వరీష్బాగ్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. యాకుత్‌పురా, చార్మినార్ గల్లంతు జీహెచ్ఎంసీ 2009 కార్పొరేటర్ ఎన్నికలకు ముందు యాకుత్‌పురా నియోజకవర్గంలో యాకుత్‌పురా డివిజన్ ఉండేది. పునర్విభజన తర్వాత యాకుత్‌పురా డివిజన్ పేరును తొలగించి ఇందులో కొన్ని ప్రాంతాలను కుర్మగూడ డివిజన్‌గా, మరికొన్నింటిని రెయిన్‌బజార్ డివిజన్‌గా మార్చారు. ప్రస్తుతం యాకుత్‌పురా నియోజకవర్గంలో యాకుత్‌పురా పేరుతో డివిజన్ లేదు. అదేవిధంగా చార్మినార్ డివిజన్‌ను తొలగించి షాలిబండ డివిజన్లో చేర్చారు. రూపు మారిన సికింద్రాబాద్ పేరుకే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. నిజానికి ఈ నియోజకవర్గానికి సికింద్రాబాద్ ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేదు. పునర్ వ్యవస్థీకరణతో నియోజకవర్గ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. సికింద్రాబాద్ పేరుతో ఆవిర్భవించిన శాసనభ నియోజకవర్గంలో సికింద్రాబాద్ ప్రాంతాలు మచ్చుకైనా కనరావు. సికింద్రాబాద్‌కు ఐకాన్‌గా చెప్పుకునే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గాంధీ ఆసుపత్రి, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్, మహబూబ్ కళాశాల తదితరప్రాంతాలన్నీ సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. సికింద్రాబాద్ గేట్వేగా పిలిచే క్లాక్‌టవర్, గార్డెన్ ప్రాంతాలు కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లాయి. సికింద్రాబాద్‌కు శివారు ప్రాంతాలుగా ఉన్న బౌద్ధనగర్, చిలకలగూడ, సీతాఫల్మండి, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, లాలాపేట ప్రాంతాలను ఏకం చేసి సికింద్రాబాద్ శాసనసభా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని చెప్పుకోదగిన ప్రాంతాలన్నీ సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లిపోగా.. శివారు ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వస్తున్నాయి. నానాజాతి సమితిలా సనత్‌నగర్ నియోజకవర్గాల పునర్విభజన అనంతరం సనత్‌నగర్, బల్కంపేట, అమీర్‌పేట, బేగంపేట, రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేట, పద్మారావునగర్ మున్సిపల్ డివిజన్లతో సనత్‌నగర్ నియోజకవర్గం ఏర్పడింది. ఇందులో మొదటి మూడు డివిజన్లు సర్కిల్-10 (ఖైరతాబాద్) పరిధిలో ఉండగా... మరో నాలుగు డివిజన్లు సర్కిల్-18 (సికింద్రాబాద్)లో ఉన్నాయి. అయితే కొన్ని డివిజన్లు పూర్తి స్థాయిలో సనత్‌నగర్ నియోజకవర్గంలో కాకుండా కొంతభాగం ఇతర నియోజకవర్గాల్లో సైతం వ్యాపించి ఉన్నాయి. బేగంపేట డివిజన్లో కొంతపార్ట్ (బ్రాహ్మణ్‌వాడీ, అల్లంతోట బావి, శ్యాంలాల్ బిల్డింగ్స్, ప్రకాశ్‌నగర్ కొంత భాగం, భగవంతాపూర్) కూకట్పల్లి నియోజకవర్గంలో ఉండగా.. మిగతా భాగం (పాటిగడ్డ, ఓల్డ్ కస్టమ్స్ తదితర ప్రాంతాలు) సనత్‌నగర్ నియోజకవర్గం కిందికి వస్తోంది. అదేవిధంగా రాంగోపాల్‌పేట్ డివిజన్ విషయానికొస్తే ఆ డివిజన్లోని కొన్ని ప్రాంతాలు (శివాజీనగర్, కుమ్మరిగూడ, సెకండ్ బజార్) కంటోన్మెంట్ నియోజకవర్గంలో వ్యాపించాయి. -
విద్యాశాఖలో విభజన కసరత్తు
సిబ్బంది, ఫైళ్లు, ఆస్తుల విభజనపై ఉన్నత విద్యాశాఖ దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సాంకేతిక, కళాశాల, పాఠశాల విద్యాశాఖల విభజనకు కసరత్తు మొదలైంది. జూన్ 2 అపాయింటెడ్ డే కంటే ముందే విభజనకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. అలాగే రాష్ట్ర స్థాయి విద్యా, శిక్షణ సంస్థలు ఏడాది పాటు 2 రాష్ట్రాలకు సేవలందించేలా అవసరమైన చట్ట సవరణలు, ఉత్తర్వుల జారీపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా శనివారం రాష్ట్ర స్థాయి సంస్థలకు సంబంధించిన అధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విభజన ఎలా చేయాలన్న విషయంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, ఫార్మాట్లను అధికారులకు అందజేశారు. ఈనెల 20లోగా ఈ ప్రక్రియనంతా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి శనివారం విభజన కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. ఫైళ్లు, సిబ్బంది, ఆస్తుల విభ జనపై దృష్టి సారించారు. 58:42 నిష్పత్తిలో విభజన చేపట్టాలని నిర్ణయించారు. ఫైళ్లను కూడా రెండుగా విభజించడం, కంప్యూటరీకరణ, ఆన్లైన్లో పెట్టేందుకు అవసరమైన చర్యలు మొదలయ్యాయి. సాంకేతిక, కళాశాల, పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్లు రాష్ట్ర పునర్విభజన చట్టం 10వ షెడ్యూలులో పేర్కొన్న రాష్ట్రస్థాయి విద్యా, శిక్షణ సంస్థల జాబితాలో చేర్చనందున వెంటనే వీటికి సంబంధించిన విభజన పనులను చేపట్టాలని నిర్ణయించారు. అపాయింటెడ్ డే నుంచి ఈ శాఖలు రెండుగా పనిచేసేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రస్థాయి విద్యా, శిక్షణ సంస్థల జాబితాలో ఉన్న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, స్టేట్ ఆర్కివ్స్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రి ప్ట్స్ లైబ్రరీ, ఏపీ అకాడమీ ఆఫ్ సెన్సైస్, హిందీ, తెలుగు, సంస్కృత అకాడమీలు, స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఇంటర్ బోర్డు, ఆర్జీయూకేటీ, జేఎన్యూఎఫ్ఏ, శ్రీపద్మావతి మహిళా వర్సిటీ, ద్రవిడ వర్సిటీ, తెలుగు వర్సిటీ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలు రెండు రాష్ట్రాలకు సేవలందించేలా రాష్ట్ర విద్యా చట్టం, యూనివర్సిటీల చట్ట సవరణ చేయాలని యోచిస్తున్నారు. -
ఆందోళనలో అన్నదాతలు
ఆందోళనలో అన్నదాతలు వేముల, పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో రోజు రోజుకు విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. దీంతో పంటలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ ఏడాది తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు ప్రవహిం చి చెరువులు నిండాయి. దీంతో భూగర్భజలా లు పెరిగి వ్యవసాయ బోర్లలో నీరు సమృద్ధిగా వస్తోంది. ఎండిపోయిన వ్యవసాయ బోర్లకు వర్షాల రాకతో మళ్లీ ఊపిరి వచ్చింది. గత మూ డేళ్లు నష్టాలనే ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాది విస్తారంగా పంటలను సాగు చేశారు. బోర్ల కింద వేరుశనగ, ఉల్లి, నువ్వుల పంటలు విస్తారంగా సాగయ్యాయి. మూడేళ్లపాటు సాగునీరు లేక నష్టపోయిన రైతులు ఈ ఏడాది విద్యుత్ కోతలవలన నష్టపోవాల్సి వస్తోంది. రోజు రోజుకు విద్యుత్ కోతలు తీవ్రమవుతున్నాయి. ఒక్కరోజు పగలు 2గంటలు కూడా విద్యుత్ సరఫరా కావడంలేదు. రాత్రి సమయాల్లో ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. రబీ వేరుశనగ ఊడలు దిగుతుండగా.. ఉల్లి పంట గడ్డలతోనూ.. నువ్వుల పంట పూతతో ఉంది. విద్యుత్ కోతలతో పంటలకు సకాలంలో రైతులు నీటితడులను అందించలేకపోతున్నారు. దీంతో దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకసారి సరఫరాపోతే 3గంటల నుంచి 4గంటలపాటు కోత విధిస్తున్నారు. సబ్స్టేషన్ల పరిధిలో షిప్టుల వారీగా విద్యుత్ సరఫరాతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతలు ఇలాగే ఉంట ఈ ఏడాది నష్టపోతామని రైతులు మదనపడుతున్నారు. అధికమైన అప్రకటిత విద్యుత్ కోతలు సింహాద్రిపురం, న్యూస్‌లైన్ : మండలంలోని అప్రకటిత విద్యుత్ కోతలు అధికమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొం ది. మండల కేంద్రంలో కూడా మరీ పరిస్థితి దా రుణంగా ఉంది. ఈ విషయమై ఏఈ రవీంద్రప్రసాద్‌ను వివరణ కోరగా మెయిన్‌లైన్ సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. 7గంటల వ్యవసాయ విద్యుత్‌ను రైతులకు ఇబ్బంది కలగకుండా సరఫరా చేస్తామని పేర్కొన్నారు. -
ఎవరికి, ఏ మేరకు వస్తాయో తేల్చండి
ఎవరికి, ఏ మేరకు వస్తాయో తేల్చండి కర్నూలు(కలెక్టరేట్): వివాదాల్లో ఉన్న భూములు ఏ శాఖ కు ఏ మేరకు చెందుతాయో తేల్చాలని కల్టెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశించా రు. ఇందుకోసం రెవెన్యూ, ఫారెస్టు అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సంయుక్తంగా సర్వే నిర్వహించాలన్నారు. కలెక్టర్ శనివారం తనచాంబర్లో అటవీ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించా రు. వివాదాలకు సంబంధించి భూ ములు ఏ శాఖ పరిధిలోకి వస్తాయో తేల్చేందుకు జాయింట్ సర్వే అవసరమన్నారు. సర్వేకు గతంలోనే ఆదేశాలిచ్చామని చెబుతూ ఆ పనులు ఎంత వరకు వచ్చాయనే విషయాన్ని ఆరా తీశారు. సర్వేను వేగవంతం చేసి నెలరోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నంద్యాల డివిజన్‌కు సంబంధించి బనగానపల్లె మండలం చిన్నరాజు పాలెం, అవుకు మండలం మంగం పేట, చాగలమర్రి మండలం దీవన పెంట, మహానంది, బండి ఆత్మకూ రు మండలం ఓంకారం, కర్నూలు డివిజన్‌కు సంబంధించి వెలుగోడు లో భూ వివాదాలున్నాయని కలెక్టర్ తెలిపారు. అన్ని రకాల పాత రికార్డులను పరిశీలించాలని, జాయింట్ వెరిఫికేషన్ కోసం ప్రత్యే క సర్వేయర్లనుఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. సమావేశంలో జేసీ కన్నబా బు, నంద్యాల ఆర్డీఓ నరసింహు లు, డీఎఫ్ఓ చంద్రశేఖర్, సంబంధిత తహశీల్దార్లు పాల్గొన్నారు. -
విభజనపై చర్చే లక్ష్యం.. సీఎం కిరణ్
కొత్త పార్టీ పెట్టమని కొంతమంది కోరుతున్న మాట వాస్తవమే సాక్షి, హైదరాబాద్: విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరపడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని, భవిష్యత్ గురించి ఏమీ ఆలోచించడంలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. వ్యాట్ ఆదాయం పెంచడంలో భాగంగానే మంత్రి శ్రీధర్‌బాబు శాఖ మార్చానని, అది పూర్తిగా తన పరిధిలో అధికారమని, దీనిపై ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. శాసనసభ వ్యవహారాల బాధ్యతలను రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న శైలజానాథ్‌కు ఇవ్వడంతో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్న విమర్శలపై స్పందించడానికి నిరాకరించారు. నూతన సంవత్సరం సందర్భంగా సీఎం కిరణ్ బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో వూట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీలోనే తెలంగాణ నాయకులు, సీమాంధ్ర నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎవరి అభిప్రాయాలు వారు చెబుతారన్నారు. ఇప్పటి వరకు విభజనపై సభలో చర్చ జరగలేదని, దానిపై చర్చ జరిగితే ఎవరి అభిప్రాయం, ఎవరి వాదం ఏమిటనేది బయటపడుతుందని చెప్పారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు ఖండించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. వైఎస్సార్సీపీ నేతలు సభ బయట మీడియా ముందు మాట్లాడటం వల్ల లాభం ఉండదని స్పష్టంచేశారు. ‘‘మీడియా ముందు ఎన్ని మాట్లాడినా అవి రికార్డు కావు. వాటిని పార్లమెంట్ గానీ, రాష్ట్రపతి గానీ పరిగణనలోకి తీసుకోరు. అసెంబ్లీలో మాట్లాడితేనే రికార్డు అవుతుంది. ఆ రికార్డులను పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుంటుంది. సభలో చర్చించడం అంటే అభిప్రాయం చెప్పడమే అవుతుంది’’ అని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని, కేవలం పార్టీ తీసుకున్న నిర్ణయంపైనే మాట్లాడానని సీఎం వివరణ ఇచ్చారు. సమైక్య తీర్మానం చేస్తారా అని అడగ్గా.. అసెంబ్లీలో ఏ అంశంపైన చర్చ జరగాలన్నా కొన్ని సంప్రదాయాలు, నిబంధనలు ఉంటాయని, వాటి ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని బదులిచ్చారు. కొత్త పార్టీపై ఇప్పుడే ఆలోచించడంలేదని, అయితే పార్టీ పెట్టమని కొంతమంది కోరుతున్న మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి వెల్లడించారు. బంతి దగ్గరకు రాకుండానే దాన్ని ఫోర్, సిక్స్ కొట్టాలని ప్రయత్నిస్తే ఔట్ అవుతానన్నారు. సమయానుగుణంగా బంతి దగ్గరకు వచ్చాక డిఫెన్స్ ఆడాలా, ఫోర్ లేదా సిక్స్ కొట్టాలా అన్నదానిపై ఆలోచించాలని ఆయన వ్యాఖ్యానించారు. -
రాజకీయ ప్రయోజనం కోసమే విభజన
కాకినాడ, న్యూస్‌లైన్ : ముగింపు దశలో ఉన్న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ప్రజలకన్నా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధా న్య మిచ్చి రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుం దని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న సమైక్య శంఖారావం ప్రచార పోస్టర్ ను గురువారం కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించేందుకే జగన్ మోహన్‌రెడ్డి యాత్ర నిర్వహిస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారం మూడింట రెండు వంతుల మెజార్టీతోనే ఇటువంటి నిర్ణయాలు జరిగేలా చట్ట సవరణలు జరగాలన్నది తమ డిమాండ్ అన్నారు. వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టేందుకు జగన్మోహన్రెడ్డి అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారన్నారు. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకా రం రూ. 40 వేల కోట్ల వార్షిక ఆదాయం మాత్రమే ఉంటుందని, ఈ సొమ్ము జీతాలకు కూడా చాలని పరిస్థితుల్లో రాష్ట్రం ఎలా మనుగడ సాధించగలదని ప్రశ్నించారు. జిల్లా యువజన విభాగం కన్వీనర్ అనంత ఉదయ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే నీటి సమస్యలతో పాటు రైతులు, ప్రజలు, ఇతర వర్గాలు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రజల కు వివరించేందుకే జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చేపట్టారన్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, పార్టీ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, నగర యువజన విభాగం కన్వీనర్ కిశోర్ పాల్గొన్నారు. ఎస్ఈజెడ్కు భూములు కేటాయించింది చంద్రబాబే : రావూరి పిఠాపురం, న్యూస్‌లైన్ : కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్)కు భూములు కేటాయించింది టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరావు అన్నారు. పిఠాపురంలో పార్టీ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2002లో ఎస్ఈజెడ్కు 10 వేల ఎకరాల భూములు కేటాయించిన సంగతి టీడీపీ నేతలు మరచి వైఎస్సార్ కేటాయించారనడం విడ్డూరంగా ఉందన్నారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న మహానేత వైఎస్సార్ ఏలేరు ఆధునికీకరణకు నిధులు కేటాయిం చాలని అసెంబ్లీలో నిలదీశారన్నారు. అనంతరం 2009లో మఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ ఏలేరు ఆధునికీకరణకు శంకుస్థాపన చేశారన్నారు. జగన్‌ను విమర్శించే అర్హత యనమలకు లేదు : పీకేరావు అంబాజీపేట, న్యూస్‌లైన్ : రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పీకే రావు అన్నారు. అంబాజీపేటలో గురువారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యనమల తీరును దుయ్యబట్టారు. న్యాయబద్ధంగా జగన్మోహన్రెడ్డికి బెయిల్ వచ్చినప్పటికీ యనమల మాట్లాడుతున్న తీరు న్యాయ వ్యవస్థనే కించపరిచే విధంగా ఉందన్నారు. రామచంద్రపురం ఉప ఎన్నికల్లో యనమల కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావును వెన్నుపోటు పొడిచారన్నారు. వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉందన్నారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, పి.గన్నవరం మండల యూత్ కన్వీనర్ దొమ్మేటి దుర్గారావు పాల్గొన్నారు. -
రాష్ట్ర విభజన దారుణం
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతి రాజు విమర్శించారు. సోమవారం సమైక్యాం ధ్రకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ నాయకులు ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ విభజనకు పాల్పడ డం సరికాదన్నారు. దేశంలో ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆ దాయం ఎక్కువని, అందువల్లే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తోం దని విమర్శించారు. విభజన వల్ల రెండు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఆ పార్టీ పట్ణణ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ప్రజలంతా ఉద్యమాలు చేస్తుంటే... కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటి దగ్గర కు ర్చోని పనికిమాలిన కబుర్లు చెబు తున్నారని విమర్శించారు. మంత్రులు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరు గార్చ డానికే పట్టణంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు కర్రోతు వెంకటనరసింగరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్.ఎన్.ఎం. రాజు, తదితరులు పాల్గొన్నారు. -
విభజనతో లాభాల్లో ఉన్న దక్షిణ మధ్యరైల్వే...
-
జేఏసి తల పెటిన 72 గంటల బంద్ ప్రశాంతం
-
విభజన ఆగదు-సమస్యలపైనే పోరాటం
-
రాజకీయపరమైన ఒత్తిళ్లతోనే విభజన నిర్ణయం
-
ముఖ్యనేత నివేదిక వల్లే విభజన: లగడపాటి రాజగోపాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్యనేత ఇచ్చిన నివేదిక వల్లే కాంగ్రెస్ హైకమాండ్ విభజనపై తొందరపడిందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. ఆ ముఖ్య నేత ఇటీవల సోనియాగాంధీని కర్ణాటకలోని మాండ్యలో ప్రత్యేకంగా కలిసి రాష్ట్రంలో జరిగిన ఓ సభ, ఉద్యమం తాలుకు పరిస్థితులను వివరించారని చెప్పారు. ఆ నేత ఎవరో త్వరలో వెల్లడిస్తానన్నారు. ఆ నాయకుడి అభిప్రాయం ఆధారంగానే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు. లగడపాటి శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ నేత ఇచ్చిన సమాచారం తర్వాతే ఢిల్లీలో పరిణామాలు వేగంగా జరిగాయని చెప్పారు. అంతకుముందు ‘నోట్’ ఆలోచన లేని కాంగ్రెస్ హైకమాండ్.. ఆ నేత సమాచారంతో టేబుల్ నోట్‌గా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించి ఆమోదించారని వివరించారు. ‘నష్టాలు చెప్పినప్పటికీ విభజన నిర్ణయం తీసుకోవడం నీచం, బాధాకరం’ అంటూ హైకమాండ్‌పై నిప్పులుచెరిగారు. విభజనపై త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానని చెప్పారు. -
సీమాంధ్రలో మిన్నంటిన ఆందోళనలు
-
22 వేల మంది ఓటర్ల తొలగింపు
సిరిసిల్ల, న్యూస్‌లైన్: సిరిసిల్ల డివిజన్లో స్థాని కంగా ఉండని, చనిపోయిన 22 వేల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని ఆర్డీవో కె.శ్రీనివాస్ ఆదేశించారు. స్థానిక మండల పరి షత్ కార్యాలయంలో బుధవారం డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారు చేయాలని, అందుకు క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. సిరిసిల్ల మండలంలో 3322 మంది ఓటర్లకు తొలగింపు నోటీసులు ఇచ్చామని, వారి పేర్లు తొలగించాలని ఆర్డీవో తెలిపా రు. అన్ని మండలాల్లోనూ ఇలాగే ముందస్తు నోటీసులు ఇచ్చి ఐదురోజుల్లో తొలగించాలని కోరారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలోనూ వాస్తవాలు పరిశీలించాలని, రాజకీయాలకు తావి వ్వొద్దని సూచించారు. రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి ప్రతిరూపమని, అవినీతికి పాల్పడుతూ శాఖ పరువు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లావ్యాప్తంగా ఏసీబీ దాడుల్లో రెవెన్యూ శాఖ వాళ్లే ఎక్కువగా పట్టుబడుతున్నారన్నారు. భూ సం బంధ వ్యవహారాల్లో నిజాయితీగా ఉండాలని, రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని తెలిపారు. ప్రతీ అర్జీకి పక్షం రోజుల్లో దరఖాస్తుదారులకు నిర్దిష్ట సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా వందశాతం భూముల వివరాలు కంప్యూటర్లలో ఆన్లైన్ చేయాలని, ఏ రైతుకు పహణీ అవసరమున్నా మీసేవ ద్వారానే పొందేలా చూడాలని పేర్కొన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవస్థ భ్రష్టుపడుతోందని, ఈ పరిస్థితిని మార్చాలని కోరారు. కిందిస్థాయి రెవెన్యూ అధికారుల పనితీరుపై తహశీల్దార్లు నిఘా వేయాలన్నారు. ఏ స్థాయిలో తప్పులు జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ‘నిజాయితీగా ఉండండి.. బాధ్యతగా పని చేయండి.. పారదర్శకంగా వ్యవహరించండి’ అని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తహశీల్దార్లు, డెప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. -
హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది: కిరణ్‌కుమార్
హైదరాబాద్ ఏ ఒక్క ప్రాంతానికో సంబంధించినది కాదని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిదీ అని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మరోసారి నిరసన గళం వినిపించారు. ఓ ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ ఒక సమస్యను పరిష్కరించడానికి మరో పెద్ద సమస్యను సృష్టించరాదని అన్నారు. పార్టీ కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనల్ని పరిష్కరించనిదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముందుకెళ్లడం చాలా కష్టమని కిరణ్ అన్నారు. తెలంగాణపై నోట్‌ను కేంద్ర కేబినెట్ ముందు చర్చకు పెట్టిన తర్వాత అసెంబ్లీ ఆమోదం కోసం పంపుతామన్న కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటనపై పైవిధంగా స్పందించారు. తెలంగాణ ప్రకటన వెలువడ్డాక కాంగ్రెస్, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్ననిరసనల గురించి కిరణ్ ప్రస్తావించారు. కాంగ్రెస్‌తో ఘర్షణాత్మక వైఖరి అవలంభిస్తారా అన్న ప్రశ్నకు.. 'పార్టీ వ్యతిరేక వైఖరికి సంబంధించిన విషయం కాదిది. ప్రజల భయాందోళనలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. లక్షలాది ప్రజలు తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది' అని కిరణ్ బదులిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం గురించే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారన్నారు. పార్టీ కంటే రాష్ట్రం, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. విభజన వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నదీ జలాల పంపిణీతో పాటు హైదరాబాద్‌తో ఉన్న విద్య, వైద్య సదుపాయాలు, ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి చాలా సమస్యలు వస్తాయని వివరించారు. హైదరాబాద్‌లో పెట్టుబడుతు పెట్టినందువల్లే సీమాంధ్ర నాయకులు విభజనను వ్యతిరేకిస్తున్నారన్నవాదనతో ఆయన విభేదించారు. 'నేను హైదరాబాద్‌లో పుట్టి, ఇక్కడే చదువుకుని పెరిగాను. 53 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాదంటే ఎలా? హైదరాబాద్ మాదని ఎవరూ చెప్పరాదు. హైదరాబాద్ సుదీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది' అని ముఖ్యమంత్రి అన్నారు. -
విభజనపై చట్టసభల్లో చర్చ జరగాలి : జెపి
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై చట్టసభల్లో చర్చ జరగాలని లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు. రాగద్వేషాలకు అతీతంగా అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అసెంబ్లీని వెంటనే సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంక్షోభంపై సమగ్రంగా చర్చ జరగాలన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్ర విభజన సమస్యను తమ సొంత పార్టీ వ్యవహారంలా చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్రప్రభుత్వ కమిటీ లేదా సంయుక్త పార్లమెంటరి కమిటీ వేయాలని కోరారు. కేంద్రప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలు ప్రక్కన పెట్టి దేశ సమగ్రతకు కృషి చేయాలన్నారు. ఇరుప్రాంతాల మధ్య, ప్రజల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించాడానికే తెలుగు తేజం యాత్రను త్వరలోనే కొనసాగిస్తానని చెప్పారు. -
పోస్టింగ్‌లకు విభజన సెగ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:విభజన సెగ జిల్లాను తాకింది. కొత్త పోస్టింగ్‌ల్లో తెలంగాణేతరుల నియామకం అగ్గికి ఆజ్యం పోస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్న తరుణంలో కీలకమైన పదవులు సీమాంధ్రులకు కట్టబెట్టడంపై ‘టీ’ ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. అధికారుల నియామకం ‘ప్రాంతీయ’రంగు పులుముకోవడం జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సచివాలయస్థాయిలో లాబీయింగ్ నెరిపి పోస్టింగ్‌లు దక్కించుకుంటున్న అధికారులను చేరకుండా నిలువరించేందుకు... ఉద్యమాలకు దిగుతుండడంతో ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, ఉద్యానవన శాఖాధికారుల పోస్టింగ్‌లు వివాదాస్పదమయ్యాయి. సీమాంధ్రకు చెందిన అధికారులను జిల్లాలో నియమించడంపై టీఎన్జీవోలు గుర్రుమన్నాయి. కీలకమైన పోస్టింగ్‌లు వారికి కేటాయిస్తూ.. అప్రధాన శాఖల్లో తమను కుర్చోబెడుతున్నారని ఆరోపిస్తున్న ఉద్యోగసంఘాలు.. తాజా పరిణామాలను అస్త్రంగా మలుచుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అర్హులను కాదని, తెలంగాణేతరులను జిల్లాలో నియమించడాన్ని తప్పుబడుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిగా గుంటూరులో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పోస్టింగ్‌కు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ వైద్య, ఉద్యోగుల సంఘం ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ఇదే సమయంలో అన ంతపురంలో పనిచేస్తున్న ఓ డాక్టర్‌ను క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అల్వాల్ పీహెచ్‌సీకి బదిలీ చేశారు. ఈ పరిణామం టీఎన్జీవోలకు ఆగ్రహం తెప్పించింది. ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్న సమయంలో సీమాంధ్రులను జిల్లాలో నియమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలావుండగా.... జిల్లా ఉద్యాన అధికారిగా ఉమాదేవికి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అయితే, ఉమాదేవిని కాదని మరొకరికి ఈ సీటును కట్టబెట్టాలని జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్ ప్రయత్నించారు. ఈ తరుణ ంలో విభజన వాదాన్ని తెరమీదకు తేవడం ద్వారా తన డిమాండ్‌ను నెరవేర్చుకోవాలని భావించారు. ఉమాదేవిని చేరికను ఆపేందుకు ఉన్నతస్థాయిలోను పావులు కదిపినట్లు ప్రచారం జరిగింది. అయితే... ఉమాదేవి మంగళవారం కలెక్టర్ శ్రీధర్‌ను కలిసి బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. -
దళారుల దగా
కావలి, న్యూస్‌లైన్ : ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు చివరకు అప్పులే మిగులుతున్నాయి. రైతులకు గిట్టుబాటుధరను పక్కన పెడితే.. కనీసం మద్దతు ధర సైతం అమలు కాని పరిస్థితి ఉంది. నానాటికి సాగు వ్యయం పెరుగుతున్నా.. పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించి, అమలు చేయడంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టాలపాలవుతున్నారు. కష్టపడకుండానే పంటను కొన్న దళారులు, వ్యాపారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. వర్షాభావ పరిస్థితులు, కరెంట్ కోతల నేపథ్యంలో పండించిన వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు.కావలి డివిజన్లో సుమారు 20 వేల ఎకరాల్లో ఈ ఏడాది వేరు శనగ పంటను రైతులు సాగు చేశారు. కావలి రూరల్, దగదర్తి, బోగోలు, జలదంకి, కలిగిరి తదితర మండలాల్లో వేరుశనగ సాగవుతోంది. దాదాపు పంట కోతకు వచ్చింది. దీంతో దళారులు రంగ ప్రవేశం చేసి వేరుశనగ పంట ధరను దిగజార్చారు. పండించిన పంటకు దళారులు సరైన మద్దతు ధర కల్పించకపోవడంతో పెట్టిన పెట్టుబడులు చేతికి అందే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. ఒక ఎకరాకు 5 బస్తాల వరకు విత్తనాలు అవసరమవుతాయని, ఒక్కో బస్తా రూ. 2,500 చొప్పున కొనుగోలు చేశామని చెప్పారు. ప్రభుత్వం డీజిల్ ధరలను పెంచుతూ పోవడంతో ఒక ఎకరా దుక్కి దున్నాలంటే ఐదు నుంచి ఆరు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగు మందులు, ఎరువుల వాడానికి వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి తప్పడం లేదని చెబుతున్నారు. ఇలా ఒక ఎకర వేరుశనగ పంట సాగు చేయాలంటే దుక్కి దగ్గర నుంచి పంట కోత దశకు వచ్చే వరకు సుమారుగా రూ. 35 వేల నుంచి రూ.40 వేలు పె ట్టుబడి పెట్టాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఒక ఎకరాకు 30 బస్తాలు (40 కేజీల బస్తా) దిగుబడి వస్తుందని, ఒక్కో బస్తా దళారులు రూ. 1200 చొప్పున కొనుగోలు చేస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని దళారులు రోజుకొక ధర, పూటకొక మాటతో చెప్పిన రేటుకు అమ్మకాలు సాగిస్తున్నట్లు రైతులు ఆం దోళన చెందుతున్నారు. ప్రభుత్వం క్వింటాల్ వేరుశనగకాయలకు రూ.3,700 మద్దతు ధర కల్పిస్తోంది. అయితే దళారులు మాత్రం రైతుల నుంచి రూ.3 వేలకే కొనుగోలు చేస్తున్నారు. పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని క్వింటాకు కనీసం రూ. 5 వేల మద్దతు ధర కల్పిస్తే కష్టానికి ఫలం దక్కుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
నేటి నుంచి ఉపాధ్యాయుల సమ్మె
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో కొనసాగుతున్న ప్రజాఉద్యమంలో గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులూ భాగస్వాములు కానున్నారు. 13 జిల్లాల ఉపాధ్యాయ జేఏసీ నిర్ణయం మేరకు విధులు బహిష్కరించి సమైక్య గళం వినిపించేందుకు జిల్లాలో టీచర్లు సన్నద్ధమయ్యారు. దీంతో గురువారం నుంచి కనీసం 50 శాతం ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయని భావిస్తున్నారు. ఉపాధ్యాయ జేఏసీ జిల్లా కన్వీనర్ పి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కో-కన్వీనర్ కేఎస్ జవహర్ మాట్లాడుతూత గురువారం నుంచి ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ఉపాధ్యాయులు ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. జిల్లాలో సుమారు 50 శాతం మంది ఉపాధ్యాయులు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని, దశలవారీగా ప్రజల ఒత్తిడిమేరకు ఉపాధ్యాయులంతా స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో సుమారు 3వేల ప్రాథమిక పాఠశాలలు, 200 ప్రాథమికోన్నత పాఠశాలలు, 450 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 14వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, మూడున్నర లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఎంసెట్ ఆప్షన్లు వాయిదా ఎంసెట్ కౌన్సెలింగ్‌ను పోలీసుల సహకారంతో కొనసాగిస్తున్న ప్రభుత్వం కాలేజీ ఎంపిక షెడ్యూల్‌ను మాత్రం వాయిదా వేసింది. ఈనెలాఖరు వరకు సర్టిఫికెట్ల పరిశీలన మాత్రం చేయాలని భావిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీల అధ్యాపకులు కూడా విధులకు హాజరుకాకపోవటం, కొన్ని జిల్లాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ సక్రమంగా జరగకపోవటం తో గత్యంతరం లేనిస్థితిలో గురువారం నుంచి ప్రారంభిం చాల్సిన ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 27నుంచి సెకండరీ ప్రధానోపాధ్యాయుల సమ్మె పెదపాడు, న్యూస్‌లైన్ : సెకండరీ ప్రధానోపాధ్యాయులు ఈనెల 27నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు సెకండరీ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు దేవినేని వెంకటరమణ, కె.నాగేశ్వరరావు తెలిపారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి మద్దతు తెలపాలని రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు.