Private hospitals
-
ఆరోగ్యశ్రీలోకి మరో 164 ప్రైవేటు ఆస్పత్రులు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా 164 ప్రైవేటు ఆస్పత్రులు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తులకు సూత్రప్రాయంగా అంగీకారం లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 1,042 ఆస్పత్రులు ఉండగా, అందులో 409 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. మొత్తంగా వెయ్యి ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 3 వేలకుపైగా ఆస్పత్రులు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) పొందేందుకు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ పరిధిలోకి కనీసం వెయ్యి ఆస్పత్రులను తీసుకురావాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. రెట్టింపైన ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స ఖర్చును రూ.10 లక్షలకు పెంచింది. అలాగే కొత్తగా 163 వ్యాధులను జతచేసి ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1,835 వ్యాధులను చేర్చింది. 1,375 ప్రొసీజర్లకు సంబంధించి హాస్పిటళ్లకు చెల్లిస్తున్న ధరలను 20 శాతం పెంచింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో 3,53,474 మంది చికిత్స చేయించుకున్నారు. కాగా, హాస్పిటళ్లకు సగటున ఏటా రూ.684 కోట్ల చొప్పున (నెలకు రూ.57 కోట్లు) బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెల్లిస్తే, కాంగ్రెస్ హయాంలో రూ.966.54 కోట్లు చెల్లించారు. అంటే నెలకు రూ.87 కోట్లు చెల్లించారు. -
ముహూర్తాల గండం..!
వీరఘట్టం: జనన, మరణాలు సహజమైనవి. మారిన సాంకేతిక యుగంలో జనన తేదీలను ముందే నిశ్చయిస్తున్నారు. ముహూర్తాల పిచ్చితో అమ్మ కడుపునకు గాటుపెట్టించి బిడ్డలను బలవంతంగా తీస్తున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ముప్పుతలపెడుతున్నారు. ఈ జాడ్యాన్ని కొందరు తల్లులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తుండడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రం కాసులవర్షం కురిపిస్తోంది. పుట్టుకను ముందే ఫిక్స్ చేయడం.. దీనికోసం మంచి ముహూర్తాలు చెప్పండి అంటూ పండితులు, జ్యోతిష్యుల దగ్గరకు తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నెలలు నిండకముందే కాన్పుచేయాలంటూ కొందరు గర్భిణులు ఒత్తిడిచేస్తున్నారని, ఇది ప్రమాదకరమని చెబితే వేరే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. సిజేరియన్లకే మొగ్గు.. ఒకప్పుడు సిజేరియన్ పేరు చెబితే గర్భిణులంతా భయపడిపోయేవారు. ఇప్పుడు అదే పదం మాటమాటికీ వినిపిస్తోంది. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, ఉమ్మనీరు పోతున్నప్పుడు తదితర అత్యవసర పరిస్ధితుల్లోనే ఇది వరకు సిజేరియన్ చేసేవారు. ఇప్పుడు సిజేరియన్ సాధారణ ప్రక్రియగా మారింది. సహజ కాన్పు వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో అంతా సిజేరియన్‌కే ఓటు వేస్తున్నారు. వైద్యులపై ఒత్తిడి చేస్తున్నారు. ఫలితంగా పార్వతీపురం మన్యం జిల్లాలోనూ సిజేరియన్లు సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. మారుమూల పల్లె వాసులు కూడా సిజేరియన్‌కు వెళ్తుండడం గమన్హారం. జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో సగటున 30 నుంచి 40 శాతం వరకు సిజేరియన్లుంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈశాతం మరింత ఎక్కువగా ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 12,945 మంది గర్భిణులు వైద్య రికార్డుల్లో నమోదుకాగా, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇంత వరకు 3,621 ప్రసవ ఆపరేషన్లు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో అధికం డెలివరి సమయం ముందుగా మంచి రోజుల్లోనే సిజేరియన్లు జరగడం గమనార్హం. సిజేరియన్ ఎప్పుడు అవసరం... » గర్భిణికి రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు » గర్భంలో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు » గర్భాశయ ముఖద్వారాన్ని మూయ కమ్మేయడం వంటి అత్యవసర సమయాల్లోను.. » తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్ధితుల్లో.. » తల్లికి ఇతర ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్ వంటి అనారోగ్య ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ చేస్తారు.సిజేరియన్ వల్ల కలిగే ఇబ్బందులు ఇవీ » సహజ ప్రసవ సమయంలో ప్రోలాక్టిన్ వంటి హర్మోన్లు విడుదల కావడం వల్ల బాలింతలో సహజంగానే చనుబాలు ఉత్పత్తి అవుతాయి. అదే సిజేరియన్ అయితే పిల్లలు పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం కష్టమవుతుంది. » తల్లిపాలు పట్టకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. » సిజేరియన్ సమయంలో గర్భిణి మూత్రనాళానికి, పేగులకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. » శస్త్ర చికిత్స జరిగితే నొప్పితో బాలింతలు నెలల తరబడి మంచానికి పరిమితం కావాల్సి వస్తుంది. » కదలికలు తక్కువ కావడం వల్ల హెర్నియా వంటి సమస్యలు వస్తాయి. » పీరియడ్స్ సమయంలో అధిక రక్త స్రావం వంటివి చోటు చేసుకుంటాయి.ప్రోత్సహిస్తున్న ఆస్పత్రులు కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు కూడా సిజేరియన్లను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఒక సిజేరియన్‌కు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు సుమారు రూ.40 వేలు నుంచి రూ.80 వేలు వరకు వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో 80 శాతం వరకు సిజేరియన్ కేసులే ఉంటున్నాయి. సిజేరియన్ చేస్తే ఆస్పత్రిలో ఆరు నుంచి 8 రోజుల వరకు ఉండాలి. ఖర్చు కూడా ఎక్కువే. సహజ ప్రసవానికి రూ.20 వేలు లోపు ఖర్చు అవుతోంది. తల్లీబిడ్డా రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు. సిజేరియన్లను వ్యాపారంగా మార్చేసి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుతం నమోదైన గర్భిణుల సంఖ్య 12,945ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన సిజేరియన్లు 3,621బిడ్డపైన ప్రభావం బిడ్డ జననం సహజంగా జరిగితే అది చిన్నారి మానసిక, శారీరక వికాసానికి దోహద పడుతుంది. అస హజ రీతిలో చేస్తే కత్తిగాట్లు వల్ల తల్లి పడే బాధ బిడ్డపై ప్రభావం చూపుతుంది. కీలకమైన సమయంలో ఆ పరిస్థితి శిశువు స్పందనలపై పడుతుంది. శిశువుల జ్ఞానాత్మక అభివృద్ధిలో తేడాలు అధికంగా చూపుతాయి. బిడ్డలో ఆ సమయానికి కొన్ని రకాల హార్మోన్లు అవసరమైన దాని కంటే ఎక్కువ, తక్కువగా విడుదలై భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. – డాక్టర్.రవీంద్రకుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, పాలకొండ ఏరియా ఆస్పత్రిముహూర్తాల వెర్రి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రసవాల కోసం చాలామంది గర్భిణులు ముహూర్తాలు చూసుకునే వస్తున్నారు. ప్రసవానికి సమయమున్నా ముహుర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్‌కు సిద్ధంకావడం, వైద్యులపై ఒత్తిడిచేయడం సరికాదు. బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యకరం. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేను రోజుల తేడాతో బిడ్డను బయటకుతీస్తే అనేక సమస్యలు వస్తాయి. – డాక్టర్.పి.ఉమామహేశ్వరి, మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం అది భగవంతుడి నిర్ణయం పుట్టుక అనేది సహజసిద్ధ ప్రక్రియ. చెట్టుకు పండు పండితే రాలినట్టే... తొమ్మిదినెలలు నిండాక తల్లి గర్భం నుంచి ఆరోగ్యంగా శిశువు బయటకు వస్తుంది. డెలవరీ డేట్లు ఒక రోజు అటు, ఇటు ముహూర్తం అడుగుతున్నారు. వారం, తిధి, నక్షత్రం, తారాబలం, లగ్నబలం చూసుకున్న తర్వాతనే కాన్పుకు వెళ్తున్నారు. ఓ పదేళ్ల కిందట ఈ పరిస్థితి అంతగా ఉండేది కాదు. ఇప్పుడు మంచిరోజు చూసుకుని సిజేరియన్ చేసుకుంటున్నారు. – ఎస్.వి.ఎల్.ఎన్.శర్మయాజీ,పురోహితుడు, వీరఘట్టం కడుపుకోత మంచిది కాదు చాలా మంది ముహుర్తం పెట్టి సిజేరియన్ చేయా లని చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బిడ్డను ఆ సమయంలోనే ఆపరేషన్ చేసి తీయాలని చెప్పడం కరెక్ట్ కాదు. దీనివల్ల తల్లీ బిడ్డకు ప్రమాదం. సిజేరియన్ అనేది అత్యవసరమైతేనే చేయాలి. అది కూడా సమయాన్ని బట్టి సిజేరియన్ చేస్తాం. సిజేరియన్ విషయంలో వైద్యులపై ఒత్తిడి తేరాదు. – డాక్టర్ ఎస్.భాస్కరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, పార్వతీపురం మన్యం జిల్లా -
ప్రైవేట్ ఆస్పత్రులలో మెడిసిన్ కొనుగోలు.. రాష్ట్రాలకు సుప్రీం చివాట్లు
ఢిల్లీ : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం పేదలకు అందని ద్రాక్షాగా మారింది. ఇదే అంశంపై సుప్రీం కోర్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను చివాట్లు పెట్టింది. సామాన్యులకు వైద్య సంరక్షణ,మౌలిక సదుపాయాలు కల్పిస్తూ భరోసా ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడింది. వైద్యాన్ని సామాన్యులకు దూరం చేయడమేకాదు.. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులలో చేరేలా పరోక్షంగా సులభతరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేట్ ఆస్పత్రులు తాము నిర్వహించే మెడికల్ షాపుల్లోనే మెడిసిన్లు, ఇంప్లాంట్స్, ఇతర మెడికల్ కేర్ ఉత్పుత్తులు కొనుగోలు చేయాలని పేషెంట్లను, వారి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేస్తున్నాయని పిల్లో పేర్కొన్నారు. అంతేకాదు, రోగులకు అమ్మే మెడిసిన్లను సైతం వాస్తవ ధరకంటే అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని హైలెట్ చేశారు. ఫలితంగా రోగులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర,రాష్ట్రాలు ప్రైవేట్ ఆస్పత్రులపై నియంత్రణ, దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తూ.. తమ ఫార్మసీలలో మాత్రమే మెడిసిన్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేయాలని పిల్లో కోరారు. ఆ పిల్‌పై ఇవాళ సుప్రీం కోర్టు జస్టిస్ సూర్యకాంత్, ఎన్కే సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా మేము మీతో ఏకీభవిస్తున్నాము.. అయితే దీన్ని ఎలా నియంత్రించాలి? అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.The Supreme Court is hears a Public Interest Litigation (PIL) challenging the practice of hospitals and in-house pharmacies compelling patients to purchase medicines exclusively from their designated pharmacy.Bench: Justice Surya Kant and Justice N. Kotiswar Singh pic.twitter.com/jS3RLmZBwJ— Bar and Bench (@barandbench) March 4, 2025 ఈ సందర్భంగా తమ ఫార్మసీలలోనే మెడిసిన్ తీసుకోవాలని పేషెంట్లపై ఒత్తిడి చేసే ఆస్పత్రులపై తగు చర్యలు తీసుకునేలా ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ మార్కెట్లో మెడిసిన్ తక్కువ ధరలో దొరికినప్పుడు అక్కడే కొనుగోలు చేసుకోవచ్చు. అలా కాకుండా హాస్పిటల్‌కు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు చేయాలని పేషెంట్లపై ఒత్తిడి చేయొకూడదని సూచించింది.మరోవైపు, కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్స్, వైద్య సంస్థలు పౌరులను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే అవసరాన్ని నొక్కిచెప్పింది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రులకు చెందిన ఫార్మసీలలో మెడిసిన్ కొనుగోలు అంశంపై సుప్రీం కోర్టు ఒరిస్సా, ఆరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్,రాజస్థాన్‌లకు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆయా రాష్ట్రాలు సుప్రీంలో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి.మెడిసిన్ ధరలు కేంద్రం జారీ చేసిన ధర నియంత్రణ ఆదేశాలపై ఆధారపడ్డాయని, అత్యవసర మెడిసిన్ సైతం అందుబాటులో ఉండేందుకు ధరలు నిర్ణయించబడ్డాయని తెలిపాయి. హాస్పిటల్ ఫార్మసీల నుండి మందులు కొనుగోలు చేయాలని పేషెంట్లపై ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతం చేయడంలేదు’కేంద్రం సైతం సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చింది. -
ప్రైవేటు ఆసుపత్రులు రూ.11,500 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో ఉన్న ఆసుపత్రులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4,000 పడకలను జోడించనున్నాయి. ఇందుకు సుమారు రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.64,000 కోట్ల ఆదాయం నమోదు చేసిన 91 ప్రైవేట్ ఆసుపత్రులను విశ్లేషించినట్టు వెల్లడించింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థలు దాదాపు 6,000 బెడ్స్‌ను జోడించాయి. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో జోడిస్తున్న పడకలు 2020–2024 మధ్య తోడైన వాటికి సమానంగా ఉంటుంది. ఆక్యుపెన్సీ 65–70 శాతం గరిష్ట స్థాయికి చేరుకోవడం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం నిరంతర డిమాండ్.. వెరశి ప్రైవేట్ ఆసుపత్రులు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో సగటు వార్షిక పెట్టుబడి కంటే ఇది దాదాపు 80 శాతం అధికం’ అని నివేదిక తెలిపింది. అంతర్గత వనరుల ద్వారా.. మూలధన వ్యయంలో దాదాపు నాలుగింట మూడు వంతులు అంతర్గత వనరుల ద్వారా ఆసుపత్రులు సమకూరుస్తున్నాయి. అంతేకాకుండా మెరుగైన రాబడుల కారణంగా 2022 ఆర్థిక సంవత్సరం నుండి ప్రైవేట్ ఈక్విటీ, ఈక్విటీ మార్కెట్ల నుండి గణనీయంగా రూ.55,000–60,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించాయి. కొత్త పడకలలో సగం నూతన ఆసుపత్రుల ఏర్పాటు ద్వారా సమకూరనున్నాయి. కొత్త ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో గణనీయ పెట్టుబడికి ఇది నిదర్శనం. ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల అభివృద్ధి కారణంగా దాదాపు 40 శాతం పడకలు తోడు కానున్నాయి. ప్రస్తుత సౌకర్యాలను ఆధునీకరించడం, మెరుగుపర్చడంపై సంస్థలు దృష్టి సారిస్తాయి. నిర్మాణంలో ఉన్న, చిన్న, మధ్య తరహా ఆసుపత్రులను పెద్ద కంపెనీలు స్వా«దీనం చేసుకోవడం ద్వారా మిగిలిన 10 శాతం పడకలు జతకానున్నాయని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. బలమైన పనితీరు.. వైద్య రంగం ఆదాయంలో ప్రైవేట్ ఆసుపత్రుల వాటా 63 శాతం. 2020–2024 ఆర్థిక సంవత్సరాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఆదాయంలో 18 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును, 18 శాతం ఆరోగ్యకర నిర్వహణ లాభాలను సాధించాయి. ఇది బలమైన నగదు ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆసుపత్రుల బలమైన పనితీరు, తలసరి పడకల సామర్థ్యం తక్కువగా ఉండటంతో ప్రైవేట్ ఈక్విటీ, ఐపీవోల ద్వారా గణనీయంగా పెట్టుబడులు పెరిగాయి. ఇది బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసింది. ఆసుపత్రులు వాటి క్రెడిట్ ప్రొఫైల్స్‌ను భౌతికంగా ప్రభావితం చేయకుండా ప్రతిష్టాత్మకంగా పడకల జోడింపును కొనసాగించడానికి వీలు కల్పించిందని నివేదిక వివరించింది. -
Andhra Pradesh: నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ప్రాథేయపడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ), ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సేవలను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపేశాయి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్ఎస్ కింద ఔట్‌పేషెంట్ (ఓపీ), ఇన్ పేషెంట్ (ఐపీ) ఇలా పూర్తి స్థాయిలో సేవలు నిలిచి పోవడంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ‘రూ. 3 వేల కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉంటోంది. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మందులు, సర్జికల్స్, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోతున్నాం. దీంతో విక్రేతలు సరఫరా నిలిపేశారు. వెంటనే ఆదుకుని రూ.2 వేల కోట్లు విడుదల చేసి ఆదుకోకపోతే ఈ నెల ఆరో తేదీ నుంచి సేవలు ఆపేస్తాం’ అని వారం క్రితమే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా అందిస్తున్న సేవలను ఆపేశాయి. ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడు నెలల వ్యవధిలో బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రులు నాలుగుసార్లు నోటీసులు ఇచ్చాయి. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లతోపాటు ప్రతి నెల గ్రీన్ చానెల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గత కొద్ది నెలలుగా చాలావరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఐపీ సేవలను కూడా నిలిపేశాయి. అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు పేదలు వెళుతుంటే.. ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ఉచిత వైద్యం ఆపేశాం.. మీరే చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలి’ అని నిక్కచ్చిగా ఆస్పత్రుల యజమానులు తేల్చిచెబుతున్నారు. ఓ వైపు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్–6, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తూ.. మరోవైపు ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్‌పరం చేయడం కోసం ప్రజారోగ్యంతో సైతం చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాభాపేక్షకు పెద్దపీట వేసే కంపెనీలతో బీమా కార్యక్రమం అమలు కోసం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం చర్చలకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని.. చర్చల అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చే హామీ ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని ఆశా అధ్యక్షులు డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను నిలిపేసినట్టు వివరించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కాగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం ద్వారా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020, జనవరి 1 నుంచి రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేశాయి. -
ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలు బంద్
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు) : ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో అందిస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ), ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) సేవలను నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలటీ ఆస్పత్రుల సమాఖ్య (ఆశా) ప్రకటించింది. తమకు రావాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీరాలేదని, నోటీసులో పేర్కొనట్లుగా ఈనెల 6 నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. శనివారం విజయవాడలో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశం అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ సీహెచ్ అవినాష్ మీడియాతో మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న సేవలకు ప్రతీనెలా రూ.300 కోట్లు బిల్లులు అవుతున్నాయి. మాకు రూ.3,000 కోట్ల వరకు బకాయిలున్నాయి. గతేడాది ఆగస్టులో ఈ బకాయిలపై ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తే సెప్టెంబరులో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.కానీ, ఇప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మేం సేవలు అందించలేం. పాత బకాయిలకు అదనంగా ప్రతినెలా వస్తున్న బిల్లులు తోడవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మేం ఆస్పత్రులను నిర్వహించలేం. మాకు రావాల్సిన మొత్తంలో రూ.1,500 కోట్లు వెంటనే విడుదల చేస్తే సేవలు కొనసాగిస్తాం. లేనిపక్షంలో సోమవారం నుంచి ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేస్తాం. ఆరోగ్యశ్రీలో ఉచిత ఓపీ సేవలను నిలిపివేస్తాం’.బీమా ప్యాకేజీలపై తీవ్ర అభ్యంతరం..ప్రభుత్వం కొత్తగా ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనిపై మాకు అభ్యంతరాలున్నాయి. బీమా సంస్థలకు ప్యాకేజీ రేట్లతో బిడ్డింగుకు అనుమతించారో వాటిని ముందుగా నెట్వర్క్ ఆస్పత్రులతో చర్చించకపోవడం ఆందోళన కలిగించే ఆంశం. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాం. బీమా సంస్థలకు ఏ రేట్లు చెల్లిస్తారో వెల్లడించాలి. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన సమయంలో నిరుపేదలకు మాత్రమే వర్తించడంతో సేవాభావంతో వైద్యం చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు పరిస్థితి మారింది. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం ధరలు 35 శాతం పెరగాలి. ఇప్పటివరకు పెంచకపోగా కనీసం దీనిపై ప్రభుత్వం చర్చించలేదు. ఈనెల 25లోగా మాకు రావాల్సిన బకాయిల్లో సగం మొత్తం రూ.1,500 కోట్లు చెల్లిస్తే సేవలు పునరుద్ధరిస్తాం. లేదంటే గడువు తర్వాత ఆరోగ్యశ్రీ సేవలూ నిలిపివేస్తాం. -
కార్డులు చెల్లవ్.. కాసుల వైద్యమే!
ఆరోగ్యశ్రీ అంటే రానివ్వడం లేదుతిరుపతి కొర్లగుంటలో ఉంటున్నాం. ఆటో డ్రైవర్‌గా పనిచేసే నా భర్తకు కడుపు నొప్పి రావడంతో స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లగా కడుపులో గడ్డ ఉందని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిని సంప్రదించగా ఆరోగ్యశ్రీ అయితే ఆపరేషన్ చేయమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు రూ.3 లక్షల విలువ చేసే సేవలు ఉచితంగా పొందాం. ఇప్పుడేమో ఆస్పత్రి లోపలకు కూడా అనుమతించడం లేదు. – రమణమ్మ, తిరుపతి⇒ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక కావేరి డెంగీ బారిన పడటంతో ఈ ఏడాది ఆగస్టు 23న తల్లిదండ్రులు కర్నూలులోని ఓ నెట్వర్క్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందకపోవడంతో చేతి నుంచి రూ.లక్షల్లో చెల్లించారు. బాధిత బాలిక చికిత్స పొందుతూ అదే నెల 26న మృతి చెందింది.⇒ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాగేశ్వరరావుకు కొద్ది రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. వైద్య పరీక్షలు, యాంజియో చేయాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని నాగేశ్వరరావు చెప్పడంతో.. ‘ఇక్కడ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లవు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం’ అని అనడంతో చేసేదేమీ లేక చేతి నుంచి రూ.20 వేలు చెల్లించారు.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన పామర్తి వీరవెంకట సత్యనారాయణ (55) రైతు కూలీ. ఎరువుల బస్తాతో సైకిల్‌పై వెళ్తుండగా జారి పడిపోవడంతో చువ్వలు వెన్నెముకకు గుచ్చుకుని తీవ్ర గాయాలయ్యాయి. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించలేమని చేతులెత్తేశారు. దీంతో తెలిసిన వారి వద్ద అప్పుతెచ్చి కుటుంబ సభ్యులు అరకొర వైద్యం చేయించారు. మెరుగైన వైద్యం అందక అనంతరం ఆయన మృతి చెందారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించి ఉంటే పెద్ద దిక్కును కోల్పోయే వాళ్లం కాదని సత్యనారాయణ కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెడుతున్నారు.సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ ప్రజారోగ్యానికి భరోసా కల్పించిన ఆరోగ్యశ్రీ పథకానికి సుస్తీ చేసింది. చంద్రబాబు పాలనలో 2014–19 మధ్య నెలకొన్న పరిస్థితులు మళ్లీ దాపురిస్తున్నాయి. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఒకపక్క ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం.. మరోపక్క శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో జీవన భృతి కింద గత ప్రభుత్వం అందించిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా సాయం అందక అల్లాడుతున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో బీమా కంపెనీని ప్రవేశపెట్టేందుకు ఆరునెలల్లో ఆరోగ్యశ్రీని కూటమి సర్కారు అంపశయ్య ఎక్కించింది. ఆరోగ్యశ్రీని అమలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవని టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే కుండబద్ధలు కొట్టారు. ప్రజలు ఉచిత వైద్యం కోసం రూ.25 లక్షల వరకూ పరిమితి ఉండే ఆరోగ్యశ్రీని కాకుండా.. కేంద్రం అమలు చేసే పీఎం జన్ ఆరోగ్య యోజన(ఆయుష్మాన్ భారత్) పథకాన్ని వినియోగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు టీడీపీ కూటమి ప్రభుత్వం సకాలంలో బిల్లులు విడుదల చేయడం లేదు. నెట్వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయి పడటంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. పెద్ద మొత్తంలో బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేస్తున్నాయి. దురదృష్టవశాత్తూ అనారోగ్యం పాలైతే నిరుపేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో లబ్ధిదారులు ఆస్పత్రులకు వెళితే.. ‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఉచితంగా చికిత్సలు చేయలేం..’ అని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఖరాకండిగా చెబుతున్నాయి. చికిత్స కోసం చేతి నుంచి డబ్బులు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. ఉచిత వైద్యం కలే..అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వస్తున్న రోగులు తమకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని మొత్తుకుంటున్నా ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఆలకించడం లేదు. వాస్తవానికి నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలతో పాటు వైద్య పరీక్షలు, అవసరమైన సర్జరీలు, అనంతరం వాడాల్సిన మందులను ఉచితంగా ఇవ్వాలి. కార్డుదారుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు. అయితే చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం.. నిర్వహణ భారంగా మారడంతో ఆస్పత్రులు నిక్కచ్చిగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. ఓపీ, రకరకాల పరీక్షలు, మందులు కొనాలంటూ పేదల జేబులు గుల్ల చేస్తున్నాయి. కడుపులో గడ్డ, ప్రసవం, చిన్నపాటి ఎముకల ఫ్రాక్చర్ లాంటి సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లిన వారి నుంచి కొన్ని చోట్ల రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక గుండె, న్యూరో, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత అనారోగ్య బాధితులైతే రూ.50 వేల నుంచి రూ.లక్షలకు పైబడి వసూలు చేస్తున్నారు.ప్రజారోగ్యానికి పెద్దపీటప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి అండగా నిలిచారు. కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బుల బాధితులు, సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి భరోసా కల్పించారు. వైరల్ జ్వరాలు, డెంగీ బారినపడిన వారికి పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైరల్ జ్వరాలు, డెంగీ బాధితులకు ఉచిత చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో అనారోగ్యం పాలైన ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సివస్తుంది. ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లభించకపోవడంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి.ప్రభుత్వానికి ఆస్పత్రుల లేఖ..ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో అప్లోడ్ చేసినవి, చేయాల్సినవి కలిపితే రూ.3 వేల కోట్ల వరకూ ప్రభుత్వం బిల్లులు బకాయిపడింది. నెలల తరబడి చెల్లింపులు నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి లేఖ రాసింది. త్వరితగతిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది.రోగులపై మందుల భారంరాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత వేధిస్తోంది. అనారోగ్యం బారినపడి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టే స్థోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై చంద్రబాబు సర్కారు మందుల కొనుగోళ్ల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత నెలకొంది. ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీఎస్)లలో ఉండాల్సిన మందులన్నీ అందుబాటులో ఉండటం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని జీజీహెచ్ల సూపరింటెండెంట్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చికిత్సల కోసం వచ్చిన రోగులనే మందులు, సర్జికల్ ఐటమ్స్ కొనుగోలు చేయాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. వాస్తవానికి జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు, 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే ఆ మేరకు ఎక్కడా అందుబాటులో లేవు. బీపీ, షుగర్, గ్యాస్ బాధితులకు పూర్తి స్థాయిలో మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఇచ్చే హ్యూమన్ మిక్సా్టర్డ్ ఇన్సులిన్ అందుబాటులో ఉండటం లేదు. ఏపీఎంఎస్ఐడీసీ నుంచి కొన్ని నెలలుగా సరఫరా నిలిచిపోయింది. సర్జికల్ గ్లౌజులు కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. శస్త్ర చికిత్సల సమయంలో, అనంతరం గాయాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఇచ్చే అనస్తీషియా మందుల కొరత తీవ్రంగా ఉంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి వినియోగించే స్టోమా బ్యాగ్స్, కుట్లు వేసే దారాలు, మూత్ర నమూనాలు సేకరించే బాటిల్స్ కూడా అందుబాటులో లేక వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఉచిత వైద్యం లేదన్నారుగత నెలలో వైరల్ జ్వరం వచ్చింది. ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఆస్పత్రికి వెళ్లగా ఈ సమస్యకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స లేదని చెప్పడంతో చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. రూ.20 వేలకు పైగానే ఖర్చు అయింది. – పి.వాణి, కాకినాడ జిల్లారూ.30 వేలు డిమాండ్ చేశారు ప్రమాదవశాత్తు కింద పడటంతో మోకాలికి తీవ్ర గాయమైంది. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తారని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లా. పథకం కింద ఉచితంగా సర్జరీ వర్తించినా రూ.30 వేలు అదనంగా ఇవ్వాలన్నారు. డబ్బు కట్టే స్థోమత లేక అనంతపురం జీజీహెచ్‌కు వెళ్లా. రూ.వేలు ఇవ్వాలంటే నాలాంటి పేదల పరిస్థితి ఏమిటి?– చంద్రశేఖర్, పోతులగాగేపల్లి, శ్రీసత్యసాయి జిల్లాకార్డున్నా ఆపరేషన్ చేయలేదునా భర్త రఫీ కొద్ది నెలల క్రితం ప్రమాదవశాత్తు కింద పడటంతో ఎడమచేతికి గాయమైంది. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే ఫ్రాక్చర్ అయిందన్నారు. మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఆ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ఉన్నప్పటికీ ఉచిత చికిత్సకు నిరాకరించారు. – ఆసియా, అనంతపురంఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వైద్యం బంద్!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పేద క్యాన్సర్ రోగులకు పెద్ద కష్టం వచ్చిపడింది. విశాఖలో క్యాన్సర్ చికిత్సను అందించే ప్రముఖ ఆస్పత్రి హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ద్వారా అందించే క్యాన్సర్ చికిత్సలను నిలిపివేసింది. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆస్పత్రికి భారీగా బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అధునాతన పరికరాలతోపాటు వైద్య నిపుణులు, సిబ్బంది ఉన్న ఈ ఆస్పత్రికి ప్రధానంగా ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. వారం రోజులుగా ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిపివేయడంతో పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దివంగత సీఎం వైఎస్ చొరవతో... ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు గతంలో క్యాన్సర్‌కు చికిత్స కోసం హైదరాబాద్ లేదా ముంబైకి వెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలోనే క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్ణయించారు. హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) ద్వారా 77 ఎకరాలను కేటాయించారు. రూ.540 కోట్లతో ఏర్పాటైన ఈ ప్రముఖ సంస్థలో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అధునాతన పరికరాలతోపాటు మంచి వైద్య నిపుణులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ సెంటర్ల సంయుక్త సహకారంతో ఈ క్యాన్సర్ ఆస్పత్రి 2014 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 200 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం సేవలు నిలిచిపోవడంతో క్యాన్సర్ బాధిత పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు మూడు రోజుల క్రితం మా మామయ్యని తీసుకుని ఆస్పత్రికి వెళ్లాం. క్యాన్సర్ స్టేజ్–2లో ఉందని వైద్యులు చెప్పారు. దీంతో హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు తెలిపారు. డబ్బులు చెల్లిస్తేనే సేవలు అందుతాయని సిబ్బంది చెప్పారు. చేసేదేమీ లేక వెనుదిరిగాం. ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించకపోవడం వల్లే నిలిపివేశామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. నిరుపేద రోగులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూడాలి. – ఎస్.శంకరరావు, అగనంపూడి నిర్వాసిత కాలనీ, విశాఖపట్నం -
డెంగీకి రూ. 2 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చిపిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు... ఇప్పుడు డెంగీ రోగులను దోచుకుంటున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్లేట్లెట్ సంఖ్యను కూడా తప్పుగా చూపిస్తూ బాధితులను ఏమార్చుతున్నాయి. దీంతో బాధితులు అప్పుసప్పూ చేసి అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని గతంలో వాట్సాప్ నంబర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి చర్యలేమీ చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కింద డెంగీ, చికున్‌గున్యా వంటి వాటికి తెల్ల రేషన్‌కార్డుదారులకు, ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఉచిత వైద్యం అందించాలి. కానీ ప్రభుత్వం దాన్ని కేవలం సర్కారు ఆసుపత్రులకే పరిమితం చేసింది. దీనివల్ల బాధితులకు ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని డెంగీ, చికున్‌గున్యా కేసులకు ఆరోగ్యశ్రీని వర్తింపచేయకపోవడం వల్ల బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ డెంగీకి ఆరోగ్యశ్రీని వర్తింప చేయొచ్చని, అది తమ చేతుల్లో లేదని ఆరోగ్యశ్రీ వర్గాలు చెప్పాయి. హడలిపోతున్న జనం రాష్ట్రంలో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం రాగానే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. ఈసారి అత్యధికంగా కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 3,357 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 1,276 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అధికంగా మేడ్చల్ జిల్లాలో 312, ఖమ్మం జిల్లాలో 305 డెంగీ కేసులు రికార్డు అయ్యాయి. అనేక ప్రైవేటు ఆసుపత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. నాలు గైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన ఉదంతాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చికున్‌గున్యా కేసులు 75, మలేరియా కేసులు 175 నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగీ, చికున్ గున్యా కేసుల వివరాలను సంబంధిత యాజమాన్యాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపడం లేదు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్ ప్రాంతంలో జికా వైరస్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా... ⇒ హైదరాబాద్ పరిధిలోని ఆసుపత్రులపై పేషెంట్ల లోడ్ పెరిగింది. ఇన్పేòట్లలోనూ 20 శాతం పెరిగారని డాక్టర్లు చెబుతున్నారు. గాం«దీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులకు రద్దీ ఎక్కువైంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో వైద్యుల కొరత పట్టిపీడిస్తోంది. ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో వైద్యులు పని చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 44 మంది వైద్యులకుగాను 24 మందే ఉన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పది మంది వైద్యులు ఉండాల్సిన చోట ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఆ వైద్యుడు సైతం డిప్యూటేషన్‌పై ఉన్నారు. ⇒ కరీంనగర్ జిల్లాలో జూలై మొదటి వారం నుంచే ఇంటింటి జ్వర సర్వే చేస్తున్నారు. 7,24,135 మందిని సర్వే చేశారు. ఇందులో 3,711 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది 115 డెంగీ కేసులు నమోదయ్యాయి. 25 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ⇒ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా సరిపోని పరిస్థితి. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులతో ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే బాధితులను యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. చిన్న పిల్లలైతే రోజుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు, పెద్దలకు రోజుకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ చికిత్సకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. సీరియస్ కేసుల్లోనే అధిక ఫీజుగతేడాది కంటే డెంగీ, చికున్‌గున్యా వంటి వైరల్ జ్వరాలు పెరిగాయి. దీంతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంటోంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. అలాగే డెంగీ సీరియస్‌గా మారి ఇతర అవయవాలపై ప్రభావం చూపినప్పుడు వైద్యం చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే అధిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. అంతే తప్ప సాధారణ డెంగీకి సాధారణ ఫీజే చెల్లిస్తే సరిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ 30 వేల కంటే తక్కువైతేనే వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. – డాక్టర్ కృష్ణ ప్రభాకర్, టీఎక్స్ ఆసుపత్రి, హైదరాబాద్ -
ఏజెన్సీ ‘నాడి’ పట్టేదెవరు
అందితే సర్కారు వైద్యం.. లేదంటే ఆకు పసర్లే ఆధారం అన్నట్టుగా బతికే గిరిజనులు వారు.. ఏదైనా జబ్బు వస్తే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లడానికే నానా యాతన. అక్కడ డాక్టర్ లేకుంటేనో, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటేనో.. ప్రాణాల మీద ఆశలు పోయినట్టే. పట్టణాలకు వచ్చి ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక.. దూర ప్రాంతాల్లోని పెద్దాస్పత్రులకు తరలించేలోపే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు.. ఏనాడూ ఎవరూ సరిగా పట్టించుకోని సమస్య. ప్రభుత్వాలు ఆస్పత్రులు ఏర్పాటు చేయకపోవడం.. ఆస్పత్రులు కట్టినా పోస్టులు భర్తీ చేయకపోవడం.. చేసినా ఆ వైద్యులు, సిబ్బంది ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోవడం.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడం.. ఇంకా ఎన్నాళ్లిలా గోసపడాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి నెట్వర్క్: ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించాల్సిన వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు నామ్కేవాస్తేగా మారుతున్నాయి. పీహెచ్‌సీల నుంచి వచ్చిన రోగులకు స్పెషాలిటీ సేవలు అందించాల్సింది పోయి.. బోధనాస్పత్రులకు రిఫర్ చేసేందుకే పరిమితం అవుతున్నాయి. కాదంటే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు దారి చూపిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరతే దీనికి కారణమవుతోంది. అయితే స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం, వారు ఉన్నా రేడియాలజిస్టులు, మత్తుమందు నిపుణులు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ల వంటివారు లేకపోవడంతో.. వైద్య సేవలు సరిగా అందించలేని దుస్థితి నెలకొంది.ప్రోత్సాహక నిర్ణయాలేవీ?ఏజెన్సీ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది వెనకడుగు వేస్తున్న అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇస్తే పరిస్థితి మారుతుందని, ఏపీలో వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చర్యలు బాగున్నాయని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో కాంట్రాక్టు పద్ధతిలో స్పెషలిస్టు వైద్యుల జీతభత్యాలను రూ.2.50లక్షలకు పెంచారని, బిడ్డింగ్ నెగోషియేషన్‌కు అవకాశం కల్పించారని.. దీంతో భద్రాచలం పక్కన ఉన్న అల్లూరి జిల్లాలో గైనకాలజిస్టు ఏకంగా నెలకు రూ.3.80 లక్షల జీతం అందుకోగలుతున్నారని వివరిస్తున్నాయి.డాక్టర్లు, సిబ్బంది బదిలీలతో..ఏజెన్సీ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచే సేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇష్టపడటం లేదు. సౌకర్యాలు, సదుపాయాల లేమితోపాటు వేతనాల సమస్య కూడా దీనికి కారణమవుతోంది. వైద్యవిధాన పరిషత్‌లో మైదాన, గ్రామీణ, ఏజెన్సీ అన్ని ప్రాంతాల వారికి ఒకేవిధమైన జీతభత్యాలు అందుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 శాతం అలవెన్సులు, పాత జిల్లా కేంద్రాల్లో 17శాతం అలవెన్సులు అందితే.. ఏజెన్సీ ఏరియాల్లో 11 శాతమే వస్తాయని వైద్యులు, సిబ్బంది చెప్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే.. అదనంగా అందాల్సిందిపోయి, తక్కువ వేతనం ఉండటం ఇబ్బందికరమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఏజెన్సీ ఏరియాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు చాలా మంది వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది వెళ్లిపోవడం గమనార్హం.కొన్ని ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి..భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నాలుగేళ్ల కింద 13 మంది వైద్యులు సేవలందించగా.. ఏటా వేల సంఖ్యలో కాన్పులు, సర్జరీలు జరిగేవి. ఒక్కొక్కరుగా వైద్యులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడంతో వైద్య సేవలు తగ్గిపోయాయి. సరిపడా గైనకాలజిస్టులు లేక కాన్పు కోసం వచ్చే గర్భిణులను ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఒక్కరే నేత్ర వైద్యుడు ఉన్నారు. వారానికి ఒక రోజును పూర్తిగా సర్జరీలకే కేటాయించినా.. వచ్చే డిసెంబర్ వరకు అపాయింట్మెంట్లు ఫుల్ అయ్యాయి.⇒ నాగర్‌కర్నూల్ జిల్లా టీజీవీవీపీ పరిధిలో నాలుగు ఆస్పత్రులు ఉన్నాయి. 107 మంది డాక్టర్లు పనిచేయాల్సిన చోట 36 మందే ఉన్నారు.⇒ మహబూబాబాద్ జిల్లా గార్లలో ఇటీవలి వరకు 10 మంది వైద్యులు పని చేశారు. ఇటీవలి బదిలీల్లో తొమ్మిది మంది వెళ్లిపోగా ఒక్కరే మిగిలారు.⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 173 డాక్టర్ పోస్టులకుగాను 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఆస్పత్రిలో 15 మంది పనిచేయాల్సిన చోట ఐదుగురే ఉన్నారు.⇒ ములుగు జిల్లా ఏటూరునాగారం ఆస్పత్రిలో 17 పోస్టులకుగాను నలుగురే ఉన్నారు.⇒ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆస్పత్రిలో 33 డాక్టర్ పోస్టులుండగా 11 మందే పనిచేస్తున్నారు. ఇక్కడ గైనకాలజీ, పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.ములుగు జిల్లా మంగపేట మండలం నర్సాపురానికి చెందిన వల్లె పోగు వినోద్‌బాబు కడుపునొప్పి తో బాధపడుతూ మణుగూరు ఆస్పత్రికి వెళ్లాడు. సర్జరీ సౌకర్యం లేనందున భద్రాచలం వెళ్లాలని వైద్యులు సూచించారు. అప్పు చేసి ఆటోలో భద్రాచలం వస్తే ఇక్కడ మరో ఇబ్బంది ఎదురైంది. ‘స్కానింగ్ చేసేందుకు రేడియాలజిస్టు లేడు. ఆపరేషన్‌కు సహకరించే మత్తు డాక్టర్ బదిలీ అయ్యాడు. కొత్తగూడెం వెళ్లాలంటూ వైద్యుల నుంచి సూచన వచ్చింది.కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం మోవాడ్‌కు చెందిన కుమురం లక్ష్మి జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు జ్వరం రావడంతో కాలేజీ సిబ్బంది పారాసిటమాల్ మాత్రలు ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే పరిస్థితి లేదని.. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. లక్ష్మి అదే రోజు రాత్రి మృత్యువాత పడింది.ఆసిఫాబాద్ మండలం మానక్గొందికి చెందిన మడావి రవి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఓ ఆటోడ్రైవర్ అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తలకు బలమైన గాయమవడం, చెవి నుంచి రక్తం కారుతుండటంతో వైద్యులు రవిని మంచిర్యాల ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుమురం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, న్యూరోసర్జన్, ఇతర స్పెషాలిటీ వైద్య నిపుణులు లేక.. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన నిండు గర్భిణి స్వర్ణకు రాత్రి 8 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అందుబాటులో లేక అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. ఆమెకు బీపీ ఎక్కువగా ఉందంటూ నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రికి పంపించారు. రాత్రి 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి డాక్టర్లు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చివరికి మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి ప్రసవం చేసినా తల్లీబిడ్డ ఇద్దరూ మరణించారు. ఆరు నెలల కింద ఈ ఘటన జరిగినా.. ఇప్పటికీ ఇక్కడి ఆస్పత్రుల్లో పరిస్థితులేవీ మారలేదు. -
కార్పొరేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులను నిబంధనలకు విరుద్ధంగా నడిపితే వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. వివిధ ప్రొసీజర్లకు ఎంత బిల్లు వేస్తారనేది ఆయా ఆస్పత్రులు ఆరుబయట బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసే చికిత్సలకు అయ్యే ఖర్చు కూడా తాము బోర్డులపై ప్రదర్శిస్తా మన్నారు. మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైద్య,ఆరోగ్యశాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రైవేటు హాస్పిటళ్లు, మెడికల్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లపై నిరంతర పర్యవేక్షణకు మూడు వేర్వేరు టాస్‌్కఫోర్స్‌లు నియమించబోతున్నామని వెల్లడించారు. క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ కఠినంగా అమలు చేసి, ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని నియంత్రిస్తామని తెలిపారు. ఇందుకు ఓ టాస్‌్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో నకిలీ మెడిసిన్ తయారీ, ట్రాన్స్‌పోర్టేషన్, మెడిసిన్ ధరల నియంత్రణ, మెడికల్ షాపుల్లో తనిఖీలు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు మరో టాస్క్‌ఫోర్స్, ఆహారకల్తీ చేసే వారిపై కఠిన చర్యలకు మూడో టాస్‌్కఫోర్స్ పనిచేస్తుందన్నారు. ఈ మూడు టాస్‌్కఫోర్స్‌లు నేరుగా తనకే రిపోర్ట్ చేస్తాయని చెప్పారు. ఐదేళ్లు నిండిన అందరినీ బదిలీ చేస్తాం ఐదేళ్లు నిండిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని బదిలీ చేసితీరుతామని దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ విషయంలో సంఘాల నేత లు సహా ఎవరికీ మినహాయింపు ఉండబోదన్నారు. ఆస్పత్రుల్లో పాతుకుపోయిన డాక్టర్లు, కాలేజీల్లో పాతుకుపోయిన టీచింగ్ ఫ్యాకల్టీ అందరినీ బదిలీ చేస్తామని తెలిపారు. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లను కూడా మారుస్తామన్నారు. సిటీలో పనిచేసే డాక్టర్ల కంటే, జిల్లాల్లో పనిచేసే వారికి ఎక్కువ వేతనాలు ఇస్తామని, ఇందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏలో మార్పులు చేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. త్వరలోనే జీఓ వస్తుందని చెప్పారు. 65 ఏళ్లకు అడిషనల్ డీఎంఈల రిటైర్మెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను తెలంగాణ సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్‌గా మార్చుతున్నామని మంత్రి తెలిపారు. టీవీవీపీ ఉద్యోగులందరికీ ట్రెజరీ ద్వారా జీతాలు అందజేస్తామన్నారు. ఇప్పుడు తాము టీవీవీపీ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ పోస్టులు సృష్టిస్తున్నామని చెప్పారు. అడిషనల్ డీఎంఈల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతామని మంత్రి వెల్లడించారు. ఫిర్యాదుల కోసం త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, మండలానికో పాలియేటివ్ కేర్ సెంటర్ నెలకొల్పుతామన్నారు. కార్పొరేషన్‌తో రూ. 9 వేల కోట్ల అప్పు చేశారు బీఆర్ఎస్ సర్కారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ అని పెట్టి, దాని ద్వారా బ్యాంకుల నుంచి రూ. 9 వేల కోట్ల అప్పులు చేసిందని దామోదర వెల్లడించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను తాత్కాలికంగా నిలిపివేశామని, కేసీఆర్ కిట్‌లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందన్నారు. ఆ రెండు పథకాల్లో మార్పులుచేర్పులు చేసి కొత్త రూపంలో తీసుకొస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల ప్యాకేజీలో 30 శాతం పెంచినట్టు తెలిపారు. ఇక నుంచి పేదల ఉచిత వైద్యం కోసం తెల్ల రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులంటూ కాకుండా, కేవలం ఆరోగ్యశ్రీ కార్డులనే పరిగణనలోకి తీసుకుంటామంటారు. అయితే తెల్లరేషన్ కార్డున్నవారు ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకోవాలన్నారు. డీహెచ్ పనితీరుపై అసంతృప్తి ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్‌నాయక్ పనితీరుపై మంత్రి దామోదర రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తంచేశారు. వివిధ విభాగాల అధిపతుల పనితీరును తాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానన్నారు. యాక్సిడెంట్ కేసులో లక్ష వరకు ఉచిత వైద్యం...రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 75 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడేందుకు తమిళనాడు తరహా వ్యవస్థ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. యాక్సిడెంట్లో గాయపడిన వారికి, వారి ఆర్థికస్థితితో సంబంధం లేకుండా అన్ని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో రూ.లక్ష వరకూ ఉచితంగా ట్రీట్మెంట్ అందించేలా ఈ పథకం ఉంటుందన్నారు. -
ఎంబీబీఎస్‌కు నీలం.. ఆయుర్వేదకు ఆకుపచ్చ!
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సహా ఇతర స్పెషలిస్ట్ ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రుల ముందు తప్పనిసరిగా నీలం (బ్లూ) రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు పెట్టే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని స్థానిక వైద్యులు కోరుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో రోగులు నిజమైన వైద్యులను గుర్తించేలా, ఏ తరహా వైద్యుడని తెలుసుకునేలా.. కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ ఈ చర్యలు తీసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రులు తమ ప్రత్యేకతను తెలిపే రంగు (కలర్ కోడెడ్) బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కర్ణాటక వైద్యులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అటువంటి రంగు బోర్డుల వల్ల రోగులు మోసపోరనీ, నకిలీ డాక్టర్లను పట్టుకోవచ్చని అంటున్నారు. తెలంగాణలో ఆర్ఎంపీ, పీఎంపీ ప్రాక్టీస్ చేసేవారు కూడా బోర్డులు పెట్టుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్నారని... అలాంటి వారికి ఇలాంటి నిబంధన చెక్ పెడుతుందని చెబుతున్నారు. ప్రజలకు సులభంగా కన్పించాలి కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్ ప్రకారం కలర్ కోడెడ్ బోర్డుపై తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్, ఆసుపత్రి పేరు, యజమాని, ఇతర సంబంధిత వివరాలను చూపాలి. ఆయా బోర్డులపై వారు చేసే వైద్యం, ఆ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలు ప్రదర్శించాలి. ప్రజలకు సులభంగా కనిపించేలా ఈ సమాచారాన్ని ఆసుపత్రి ఆవరణలోని ప్రముఖ ప్రదేశంలో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. దీనివల్ల అర్హత లేని ప్రాక్టీషనర్లను రోగులే గుర్తించేందుకు వీలు కలుగుతుంది. రంగు కోడెడ్ బోర్డులు పెట్టని ప్రైవేట్ ఆసుపత్రులపై అక్కడి ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టనుంది. పెద్దయెత్తున జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిబంధన తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మోసగాళ్ల నుండి రోగులను రక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణలోనూ దీన్ని అమలు చేయాలని డాక్టర్ అర్షియ కోరారు. -
పేదింటి ఆరోగ్యమే రాష్ట్ర సౌభాగ్యం
ఒక ఇంటి ఆరోగ్యం వల్ల సమాజమే ఆరోగ్యవంతమవుతుంది. సమాజం బాగుంటే రాష్ట్రం సౌభాగ్యవంతమవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలూ ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ బృహత్తర ఆలోచనే సీఎం జగన్‌ను వైద్య రంగాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేలా చేయించింది. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్న లక్ష్యంతో వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి బాటలు వేశారు. కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలను రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు అందిస్తున్నారు. రాష్ట్రంలో 10,032 డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ గ్రామీణ ఆరోగ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. ఇదే బాటలో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ క్లినిక్స్ చాలినన్ని మందులు, వైద్య పరీక్షలు, సరిపడా వైద్య సిబ్బందితో ఆత్మీయంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు వైద్య సేవలను ఉచితంగా పొందే అద్భుత వరాన్ని సీఎం జగన్ మాత్రమే అందిస్తున్నారు. అందుకే ఇది పేదల పక్షపాత ప్రభుత్వం. సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. దేశంలో సగటున కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగటున బెడ్ చార్జీ రూ.50 వేల పైమాటే. అంత సొమ్ము వెచ్చించి పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు వైద్యం పొందాలంటే సాధ్యమయ్యే పనేనా? కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా రూ.25 లక్షల వరకు ప్రభుత్వం వైద్య ఖర్చు భరిస్తోంది. దేశంలో సగటున బెడ్ ఛార్జ్ రూ.50 వేలు అవుతుందనే అంశాన్ని ఇటీవల ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ ర్యాకింగ్ ఏజెన్సీ (ఐసీఆర్ఏ) ఓ అధ్యయనంలో వెల్లడించింది. తొమ్మిది ప్రముఖ చైన్ ఆస్పత్రుల్లో రెవెన్యూపై ఐసీఆర్ఏ అధ్యయనం చేపట్టింది. ఈ క్రమంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు జబ్బు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకోవాలంటే అప్పులపాలవ్వక తప్పదు. అప్పులు పుట్టని పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఏపీలో పేద, మధ్య తరగతి కుటుంబాలను సీఎం జగన్ ప్రభుత్వం కొండంత అండగా ఉంటోంది. ఈ వర్గాలు వైద్య పరంగా ఏ ఇబ్బంది ఎదుర్కోకుండా వారి ఆరోగ్యాలకు భరోసాగా ఉంటోంది. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేసినా ఇటు ప్రభుత్వాస్పత్రుల్లో, అటు ప్రైవేట్‌లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించి బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా కాపాడుతోంది. టెరిషరీ కేర్ అభివృద్ధితో రెట్టింపు భరోసా ఓ వైపు ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ఉచితంగా వైద్య భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేసే కార్యక్రమాన్నీ సీఎం జగన్ చేపట్టారు. వైద్య రంగంలో కీలకమైన టెరిషరీ కేర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెరిషరీ కేర్‌లో పేదలకు ఆధారమైన పెద్దాస్పత్రుల్లో మానవ వనరులను పూర్తి స్థాయిలో సమకూర్చడంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తూ రూ.8 వేల కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు నేపథ్యంలో అప్పటి వరకూ జిల్లా, ఏరియా ఆస్పత్రులు ఉన్న చోట నిపుణులైన వైద్యులతో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో బోధనాస్పత్రిలో 600 వరకూ పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 10 చోట్ల కొత్తగా బోధనాస్పత్రులు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగిలిన ఏడు చోట్ల వచ్చే ఏడాది బోధనాస్పత్రులు అందుబాటులోకి రానున్నాయి. కిడ్నీ, గుండె, క్యాన్సర్ సహా ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పేదలకు చేరువ అవుతున్నాయి. 95 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ‘రక్ష’ దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో ఏకంగా 95 శాతం కుటుంబాలకు సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. రాష్ట్రంలోని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలన్నింటికి పథకం రక్షణగా నిలుస్తోంది. ఏకంగా రూ.25 లక్షల వరకూ విలువైన వైద్య సేవలను పూర్తి ఉచితంగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. రాష్ట్రంతో పాటు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని 2,331 నెట్వర్క్ ఆస్పత్రుల్లో 3,257 ప్రొసీజర్లలో లబ్దిదారులకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. అన్ని రకాల క్యాన్సర్లతో పాటు, గుండె మార్పిడి, కార్డియాలజీ, న్యూరో సంబంధిత ఖరీదైన చికిత్సలన్ని పథకం పరిధిలో ఉంటున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ 44,78,319 మందికి ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందించింది. ఇక్కడితో ఆగకుండా చికిత్స అనంతరం బాధితులకు అండగా నిలుస్తూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి భృతి రూపంలో ఆర్థికంగా చేయూతగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకూ 23 లక్షల మంది రోగులకు ఏకంగా రూ.1366 కోట్ల మేర సాయాన్ని అందించారు. గతంలో ఎన్నడూ ఎక్కడా లేనంతగా లబ్ధి ప్రస్తుతం నిరుపేద, సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు చేతి నుంచి డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే సాధ్యపడని పరిస్థితి. దురదృష్టవశాత్తూ క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బుల బారిన పడితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షల్లో డబ్బు కట్టాల్సిందే. ఈ పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించి ప్రజలకు భరోసాగా నిలవడం శుభపరిణామం. గతంలో కేవలం రేషన్ కార్డులు ఉన్న వాళ్లు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందేవారు. రేషన్ కార్డు లేని మధ్యతరగతి కుటుంబాలు వైద్యానికి చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకూ ఉచితంగా వైద్యం లభించడం గొప్ప మార్పు. – డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్, విజయవాడ -
స్వైన్ ‘ఫ్లో’: వేగంగా విస్తరిస్తున్న వైరస్.. పదేళ్లలో 8,064 మంది మృతి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్‌ఫ్లూపై ఓ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2014 సంవత్సరం నుంచి ఈ ఏడాది జూలై వరకు అంటే దాదాపు పదేళ్లలో దేశవ్యాప్తంగా 1.47 లక్షల మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకింది. అందులో 8,064 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక వెల్లడించింది. ఆ వివరాలను తెలంగాణ వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 2015 సంవత్సరంలో అత్యధికంగా దేశంలో 42,592 మందికి స్వైన్‌ఫ్లూ సోకగా, అందులో ఏకంగా 2,990 మంది చనిపోయారు. ఆ తర్వాత అత్యధికంగా 2017లో 38,811 మందికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకగా, అందులో 2,270 మంది చనిపోయినట్టు కేంద్ర నివేదిక తెలిపింది. 2014లో మాత్రం 937 మందికి స్వైన్‌ఫ్లూ రాగా, 218 మంది చనిపోయారు. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దాని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడు నెలల్లోనే 2,783 కేసులు దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఈ ఏడు నెలల కాలంలో 2,783 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, 52 మంది చనిపోయారు. గతేడాది దేశంలో 13,202 మందికి సోకగా, 410 మంది చనిపోయారు. ఇవిగాక కొందరు రోగులు నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి ఎక్కడంలేదని అంటున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు స్వైన్‌ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నాయి. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూపై నిరంతర అవగాహన కల్పించడం, నియంత్రణ చర్యలు తీసుకోవడమే పరిష్కారమని నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల చెబుతున్నారు. జాగ్రత్తలే శ్రీరామరక్ష... గుంపులున్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్ తొడుక్కోవాలి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్‌ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. బీపీ, స్థూలకాయం, షుగర్, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్‌ఫ్లూ త్వరగా సోకే అవకాశముంది. కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు... తీవ్రమైన జ్వరం వస్తుంది. దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. తలనొప్పి కూడా తీవ్రంగానే ఉంటుంది. పిల్లల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి వాంతులు కూడా అవుతాయి. నడవడమూ కష్టంగానే ఉంటుంది. ఇక పెద్దల్లో అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీనొప్పి, కడుపునొప్పి కూడా ఉంటుంది. నిరంతరాయంగా వాంతులు అవుతాయి. -
హడావిడిగా ఆరోగ్య చట్టం!
అత్యవసర సమయాల్లో రోగులు ముందుగా డబ్బు చెల్లించకపోయినా కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో తక్షణ వైద్య సేవలు అందేలా రాజస్థాన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరోగ్య హక్కు చట్టంపై (రైట్ టు హెల్త్) అక్కడి వైద్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది! ఈ చట్టాన్ని నిరసిస్తూ లక్ష మందికి పైగా ప్రైవేటు డాక్టర్లు నిరవధికంగా సమ్మెను కొనసాగిస్తున్నారు. దాదాపు మూడు వేల ప్రైవేటు ఆసుపత్రులు వైద్య సేవల్ని నిలిపివేశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ.) కూడా వైద్యుల నిరసనకు మద్దతు తెలపడంతో రాజస్థాన్‌లో గత రెండు వారాలుగా ప్రజారోగ్య వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది. అత్యవసర చికిత్స కోసం రోగులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళన విరమించేది లేదని వైద్యులు, చట్టాన్ని వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని ప్రభుత్వం పట్టుపట్టి మెట్టు దిగడం లేదు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ఆరోగ్య హక్కు చట్టాన్ని తెచ్చామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ చెబుతున్నారు. ఎప్పుడో ఇచ్చిన హామీని మళ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో నెరవేర్చడం వెనుక రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కాక, రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులన్నవే లేకుండా చేయాలన్న తలంపు కూడా ప్రభుత్వానికి ఉండివుండొచ్చని వైద్యులు ఆరోపిస్తున్నారు. మార్చి 21న రాజస్థాన్ అసెంబ్లీలో ఆరోగ్య హక్కు బిల్లు ఆమోదం పొందింది. వెనువెంటనే వైద్యుల నిరసనలు మొదలయ్యాయి. మార్చి 28న వైద్యులకు మద్దతుగా ఐ.ఎం.ఎ. రంగంలోకి దిగింది. రాజస్థాన్ తెచ్చిన ఈ కొత్త ఆరోగ్య బిల్లు ప్రకారం, ఒక వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవల కోసం వచ్చినప్పుడు ప్రైవేటు వైద్యులు వైద్య సేవల్ని నిరాకరించకూడదు. డబ్బు చెల్లించలేక పోయినా తక్షణం చికిత్సను అందించి తీరాలి. చికిత్సానంతరం ఆ బిల్లుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అత్యవసర వైద్యం నిరాకరించిన ఆసుపత్రి లేదా వైద్యుడు తొలిసారి 10 వేలు, మళ్లీ అదే తప్పు చేస్తే 25 వేలు జరిమానా చెల్లించాలి. తప్పు మీద తప్పుకు ఆ మొత్తం అలా పెరిగిపోతూ ఉంటుంది. అయితే రోగులకు ప్రభుత్వం కల్పించిన ఈ ఆరోగ్య హక్కు... వైద్యుల జీవించే హక్కును కాలరాసేలా ఉందని, రోగుల అత్యవసర పరిస్థితి ఎలాంటిదైనా కూడా తప్పనిసరిగా చికిత్సను అందించాలన్న చట్ట నిబంధన కారణంగా తమకిక కనీస విశ్రాంతి కూడా దొరకదన్నది వైద్యుల ఆందోళన. వైద్యాన్ని నిరాకరించిన డాక్టరుపై న్యాయపరమైన చర్యలకు దిగేందుకు సైతం అనుమ తిస్తున్న తాజా బిల్లు కారణంగా వైద్యులకు వేధింపులు తప్పవనీ, తమపై తప్పుడు కేసులు కూడా నమోదయ్యే ప్రమాదం ఉందనీ ప్రైవేటు వైద్యులు కలవరపడుతున్నారు. అదే సమయంలో చట్టంలోని అంశాల విషయమై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టతను డిమాండ్ చేస్తున్నారు. ఒక్కోసారి మామూలు తలనొప్పిగా అనిపించినది కూడా అత్యవసర స్థితిగా మారి మెదడులో రక్తస్రావానికి దారి తీస్తే అప్పుడేమిటి? అప్పుడు ఎంత బిల్లయినా ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందా? మరి వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చుల మాటేమిటి? తలనొప్పి, కడుపునొప్పితో వచ్చినవారికి పరీక్షలన్నీ చేశాక అది ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే ఆ వైద్య పరీక్షల ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా? బిల్లును పంపిన ఎన్నాళ్లకు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది? ఇవీ... సమ్మె బాట పట్టిన వైద్యుల ప్రాథమిక సందేహాలు. ప్రభుత్వం ఈ సందేహాలన్నిటినీ నివృత్తి చేయవలసిన అవసరం ఉంది. చట్టం ఉద్దేశం మంచిదే కావచ్చు. చట్టంలో అస్పష్టత లేనప్పుడే అది అమోద యోగ్యం అవుతుంది. దేశంలోనే తొలిసారి రాజస్థాన్ ఇలాంటి చట్టం తెచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి ప్రసాద్ లాల్ మీనా గొప్పగా చెబుతున్నారు! అయితే ఇదేమీ పూర్తిగా కొత్తది కాదు. 2021లోనే తమిళనాడు ప్రభుత్వం... అన్ని ఆసుపత్రులూ బాధితులకు విధిగా అత్యవసర వైద్య సేవలను అందించేలా ఒక పథకం ప్రవేశపెట్టింది. ఆ పథకం కింద... బిల్లు చెల్లించలేని రోగుల తరఫున ప్రభుత్వమే ఆసుపత్రులకు రీయింబర్స్ చేస్తుంది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంతో పోల్చడానికి ఈ రీయింబర్స్మెంట్ సరిపోదు. ఆరోగ్యశ్రీ పథకం వీటితో పోల్చితే అత్యంత ప్రభావవంతమైనది, విజయవంతమైనది. దీన్ని ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం మరింత మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ వైద్యరంగాన్ని కూడా బలోపేతం చేయడంతో అది అన్ని రాష్ట్రాలకూ మోడల్‌గా ఆవిర్భవించింది. రాజస్థాన్ విషయానికి వస్తే ఆరోగ్య హక్కు చట్టాన్ని అక్కడి ప్రభుత్వం హడావిడిగా తెచ్చినట్లు స్పష్టం అవుతోంది. అటు ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్టం చేయడానికి ఏ ప్రయత్నం చేయకుండా, ఇటు ఆరోగ్యశ్రీ వంటి ఒక బృహత్తర పథకాన్ని ఆలోచించకుండా, ఆ రంగానికి సంబంధించిన ప్రముఖులతో చర్చించకుండా, వైద్యుల భయాలను సంపూర్ణంగా నివృత్తి చేయకుండా, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిల్లును ఆమోదించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. బిల్లు అమలులోకి రావాలంటే గవర్నర్ ఆమోదం పొందాలి. ఆరోగ్య హక్కు చట్టం పరిధిలోకి వచ్చే ఆసుపత్రులేవో ప్రభుత్వం నిర్ణయించాలి. అప్పుడే రీయింబర్స్మెంట్ ప్రక్రియ గురించి స్పష్టత వస్తుంది. ఈ అన్ని దశలలోనూ వైద్యులతో ప్రభుత్వం తప్పక చర్చించాలి. చర్చలకు హామీ ఇస్తూ, సమ్మె విరమించి వెంటనే విధులకు హాజరవాలని వైద్యులను కోరవలసిందీ, ఇందుకు తగిన చొరవ తీసుకోవలసిందీ ప్రభుత్వమే. -
కడుపు కోత తగ్గించేలా!
రాష్ట్రలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేస్తున్న సిజేరియన్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం వైద్య శాఖ ప్రత్యేక ప్రణాళిక రచించింది. సాక్షి, అమరావతి: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతంలోపే ఉండాలి. కానీ.. మన రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన మొత్తం ప్రసవాల్లో 2021–22లో 43.82 శాతం, 2022–2023 (ఏప్రిల్ నుంచి డిసెంబర్)లో 47.39 శాతంగా నమోదైంది. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) సమాచారం ప్రకారం.. 2021–22 సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన మొత్తం ప్రసవాల్లో 50.81 శాతం సిజేరియన్లుగా నమోదయ్యాయి. 2022–23లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ పరిశీలిస్తే 55.83 శాతానికి పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాల నియంత్రణకు వైద్య శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల నియంత్రణ చర్యల్లో భాగంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా 26 జిల్లాల్లో ప్రసూతి సేవలందిస్తున్న నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిర్వహించిన సిజేరియన్ ప్రసవాలపై ఆడిట్ నిర్వహించింది. 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే 2022–23 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రంలో ప్రసూతి సేవలు అందిస్తున్న 198 ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలపై వైద్య శాఖ అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఏకంగా 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే చేసినట్టు తేలింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14, పల్నాడులో 9, అనకాపల్లిలో 7, గుంటూరులో 8 ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. 45 ఆస్పత్రుల్లో 81నుంచి 90 శాతం, 38 ఆస్పత్రుల్లో 71నుంచి 80%, 41 ఆస్పత్రుల్లో 70 శాతానికిపైగా సిజేరియన్లు చేసినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా అత్యధికంగా సిజేరియన్లు నిర్వహించిన ఆస్పత్రులను పరిశీలిస్తే.. శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 714 ప్రసవాలకు గాను.. 712 సిజేరియన్లు చేశారు. కర్నూలు జిల్లాలోని మరో ఆస్పత్రిలో 322 కాన్పులకు గాను 321, అన్నమయ్య జిల్లాలో 290 ప్రసవాలకు గాను 290 సిజేరియన్లు చేశారు. కుటుంబ సభ్యుల నుంచీ ఒత్తిడి! సిజేరియన్ చేయాలని గర్భిణుల కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండటం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే.. రెండో కాన్పు కూడా అలా చేయక తప్పడం లేదంటున్నారు. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ వైద్యులు అందుకు అంగీకరించకూడదని.. సంబంధిత కేసుల్లో ఆయా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులైతే సిజేరియన్లు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కారణాలివీ.. ► సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం. సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో అన్ని గంటలపాటు ప్రైవేట్ వైద్యులు ఓపికతో ఎదురుచూసే పరిస్థితులు లేకపోవడం. ► చిన్నపాటి నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీషియా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ► యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు నిర్వహించడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ► సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా సిజేరియన్ ప్రసవంతో సంభవించే సమస్యలపై గర్భిణి, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
కాసుల యావ.. కోతల హవా: ఎడాపెడా ‘ప్రైవేటు’ సిజేరియన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైద్యుల కాసుల కక్కుర్తి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా అధిక ఫీజుపై ఆశతో ఎడాపెడా ‘కోత’లు పెడుతున్నారు. దీనికితోడు మంచి ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలనే కొందరు భార్యాభర్తల ఆలోచన.. తమ బిడ్డ పురిటి నొప్పులు భరించ లేదనే కొందరు తల్లిదండ్రుల ఆందోళన.. సిజేరియన్లు పెరిగిపోయేందుకు దోహదపడుతోంది. సాధారణ ప్రసవాల్లో తక్కువ రక్తస్రావంతో పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం పెద్దగా ఉండదు. కేవలం వారం రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు. అదే సిజేరియన్లతో అధిక రక్తస్రావం సమస్యతో పాటు వారం నుంచి పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించి సిజేరియన్లు నివారించేందుకు ప్రయత్నించాల్సిన వైద్యులు, ఆ పని చేయకుండా వారి బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. వీధి చివర్లో ఉన్న నర్సింగ్ హోమ్‌లో సాధారణ ప్రసవానికి రూ.35 వేల నుంచి 40 వేలలోపే ఖర్చు అవుతుంది. అదే సిజేరియన్ అయితే రూ.80 వేల నుంచి రూ.లక్షకు పైగా ఖర్చు అవుతోంది. ఇక కార్పొరేట్ ఆస్పత్రి అయితే ఆ స్థాయిలోనే సాధారణ, సిజేరియన్ డెలివరీ ఫీజులు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ప్రసూతి కేంద్రాలను తనిఖీ చేసి...కడుపు కోతలకు పాల్పడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో చిన్నాచితకా నర్సింగ్‌హోమ్‌లు మొదలు కార్పొరేట్ ఆస్పత్రుల దాకా ఇష్టారాజ్యంగా మారిపోయిందనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లు ఒకింత ఎక్కువగానే ఉండటం గమనార్హం. గణాంకాలే నిదర్శనం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–నవంబర్ మధ్య మొత్తం (ఇళ్లలో, అంబులెన్సుల్లో జరిగినవి మినహాయించి) 16,321 ప్రసవాలు జరగ్గా ఇందులో సిజేరియన్లు 6,287 ఉన్నాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల విషయానికొస్తే.. మొత్తం 10,990 ప్రసవాలు జరిగితే అందులో 8 వేలకు పైగా సిజేరియన్లే కావడం గమనార్హం. అంతకుముందు 2021–22లో 19,183 ప్రసవాలు జరిగితే అందులో సిజేరియన్లు 13,895 ఉండటం ప్రైవేటు ఆస్పత్రుల తీరుకు అద్దంపడుతోంది. తల్లుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులపై చర్యలు తీసుకోనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆస్పత్రులను సీజ్ చేయడంతో పాటు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. అయినా క్షేత్రస్థాయిలో సిజేరియన్ల సంఖ్య తగ్గక పోగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే సిజేరియన్ చేయాలి కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, ఉమ్మనీరు తాగి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలి. కానీ చాలామంది వైద్యులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. కొందరు తల్లిదండ్రులు కూడా వివిధ కారణాలతో సిజేరియన్ కోరుకుంటున్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సహజ ప్రసవాల ద్వారా జన్మించిన శిశువుకు వెంటనే ముర్రుపాలు అందుతాయి. అదే సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డ మూడు నాలుగు రోజుల పాటు పోతపాల పైనే ఆధారపడాల్సి వస్తుంది. తద్వారా రోగనిరోధకశక్తిని కోల్పోతుంది. కొన్నిసార్లు వారాల తరబడి ఇంక్యుబేటర్, ఫొటోథెరపీ యూనిట్లలో ఉంచాల్సి వస్తుంది. – డాక్టర్ బాలాంబ, సీనియర్ గైనకాలజిస్టు -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐటీ దాడులు.. చాటుగా పత్రాలు తరలింపు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులపై ఐటీ అధికా రులు దాడులు చేశారు. బిలీఫ్ ఆస్పత్రి, రోహిత్ సంతాన సాఫల్య కేంద్రం, శ్రీరాం కిడ్నీ సెంటర్లలో సోదాలు చేశారు. సదరు ఆస్పత్రుల యాజ మాన్యాల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారని.. పలు పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. అయితే తనిఖీల కోసం ఐటీ బృందం రాగానే ఓ ఆస్పత్రి బాధ్యులు వెనుక భాగం నుంచి రహస్యంగా పలు పత్రాలను బయటికి తరలించడం కనిపించింది. -
స్పీడ్ పెంచిన ఐటీ.. ఖమ్మంలోనూ ఇన్‌కమ్‌టాక్స్ దాడులు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు వేగం పెంచారు. కరీంనగర్లో మంత్రి గంగులతో పాటు మైనింగ్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన అధికారులు.. ఖమ్మంపైనా దృష్టి సారించారు. ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులపై ఐటి దాడులు జరుగుతున్నాయి. చదవండి: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు ఈ ఉదయం 10 గంటల సమయంలో ఖమ్మం నగరానికి వచ్చిన ఐటీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి మూడు వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బిలీఫ్ ఆస్పత్రితో పాటు మరో రెండు ప్రైవేటు ఆసుపత్రులలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బిలీఫ్ ఆసుపత్రిలో కీలక పత్రాలు సేకరించడంతో పాటు, ఆసుపత్రి లావాదేవీలపై ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే తనిఖీలు పురైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న బిలీఫ్ ఆస్పత్రిని నాలుగేళ్ల కింద ప్రారంభించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ స్టార్ ఆస్పత్రి ప్రారంభమైంది. ఆసుపత్రి ప్రారంభోత్సవ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆసుపత్రి ప్రారంభోత్సవ వీడియో -
165 ప్రైవేటు ఆస్పత్రులు సీజ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేపట్టగా ప్రైవేటు ఆస్పత్రుల్లో పెద్దఎత్తున అవకతవకలు వెలుగుచూశాయి. అవకతవకలను అరికట్టేందుకు 3,810 ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ల్యాబ్‌లు, క్లినిక్‌లను ఆయా జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 1,163 ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 165 ఆస్పత్రులను సీజ్ చేయగా, మరో 106 ఆస్పత్రుల యాజమాన్యాలకు జరిమానాలు విధించి హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర ప్రజారోగ్య విభాగానికి నివేదిక సమర్పించగా, అధికారులు మంగళవారం గణాంకాలు విడుదల చేశారు. వామ్మో నాగర్‌కర్నూల్... అధికారులు సీజ్ చేసిన 165 ఆస్పత్రుల్లో 41 ఆస్పత్రులు నాగర్‌కర్నూల్ జిల్లాలోనివే కావడం గమనార్హం. ఈ జిల్లాలో మొత్తం 54 ఆస్పత్రులను తనిఖీ చేసిన అధికారులు అందులో 70 శాతం ఆస్పత్రులను సీజ్ చేయడాన్ని చూస్తే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అత్యధిక ఆస్పత్రులు సీజ్ చేసిన కేటగిరీలో నల్లగొండ–17, సంగారెడ్డి–16, భద్రాద్రి కొత్తగూడెం–15, హైదరాబాద్–10, రంగారెడ్డి–10 ఆస్పత్రులు ఉన్నాయి. నోటీసులు జారీ చేసిన కేటగిరీలో హైదరాబాద్–274, కరీంనగర్–124, రంగారెడ్డి –107 ఆస్పత్రులున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ నోటీసుల జారీ ప్రక్రియ సాగింది. ప్రస్తుతం నోటీసుల జారీ, సీజ్, పెనాల్టీలతో సరిపెట్టిన వైద్య, ఆరోగ్య శాఖ వాటికి సంబంధించి వచ్చిన వివరణలు, తదుపరి చర్యలకు త్వరలో మరో డ్రైవ్ చేపట్టనున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఆర్ఎంపీలు అబార్షన్లు, ప్రసవాలు చేస్తే ఊరుకోం.. క్రిమినల్ కేసులు తప్పవు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు తప్పుడు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. తప్పుడు వైద్యం, అబార్షన్లు, ప్రసవాలు, కొన్ని రకాల సర్జరీలు చేస్తూ కొందరు ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేగాకుండా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మందులను రోగులకు ఇస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానికంగా క్లినిక్‌లు పెట్టుకుని ఎలాంటి రిజిస్టర్ సర్టిఫికెట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న కేంద్రాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక వైద్యం వరకు పరిమితమయ్యే వారిని వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, బుధవారం కొందరు ఆర్ఎంపీ సంఘాల నేతలు శ్రీనివాసరావును కలిసి తమపై అనవసరంగా దాడులు జరపవద్దని కోరారు. ఆస్పత్రులపై కొనసాగుతున్న దాడులు... రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు కొనసాగుతున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించని ఆస్పత్రుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,058 ఆస్పత్రులను, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన 103 ఆస్పత్రులను సీజ్ చేశారు. 633 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 75 ఆస్పత్రులకు జరిమానాలు విధించారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా.. అత్య«ధికంగా రంగారెడ్డి జిల్లాలో 325, కరీంనగర్ జిల్లాలో 293, హైదరాబాద్‌లో 202, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 144, వికారాబాద్‌లో 109 ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. మెదక్, నల్లగొండ జిల్లాల్లో మాత్రం తనిఖీలు జరగలేదు. కాగా, చిన్న చిన్న లోపాలున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవద్దని, వారికి 15 రోజులపాటు సమయమిచ్చి తదనంతరం సరిదిద్దుకోకపోతే చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు. -
ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపుతోంది. జిల్లాల్లో ఎక్కడికక్కడ అనేక ఆసుపత్రులను సీజ్ చేస్తోంది. కొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీచేసింది. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై కొరడా ఝుళిపిస్తోంది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెమెంట్ యాక్ట్ (రిజిస్ట్రేషన్ – రెగ్యులేషన్) యాక్ట్, 2010 ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులపై పెద్దఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో కొన్ని ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. కొన్నిచోట్ల రిజిస్టర్డ్ డాక్టర్లు లేరని తెలిసింది. ఈ నేపథ్యంలో తమను కాపాడాలంటూ ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రుల చుట్టూ ఆసుపత్రుల యజమానులు తిరుగుతున్నారు. ఈ ఒక్కసారికి ఆసుపత్రులు సీజ్‌చేయకుండా చూడాలంటూ వేడుకుంటున్నారు. వైద్యబృందాలు ఇప్పటివరకు 311 ఆసుపత్రులను తనిఖీ చేసి, 21 ఆసుపత్రులను సీజ్ చేశాయి. 83 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీచేశాయి. ఏడు ఆసుపత్రులకు భారీ జరిమానాలు విధించాయి. జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూలు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, సిద్దిపేట, వనపర్తి, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో ఇంకా తనిఖీలు మొదలుకాలేదు. కొమురంభీం జిల్లాలో నాలుగింటిని, మంచిర్యాలలో 14 ఆసుపత్రులను, మేడ్చల్ మల్కాజిగిరిలో 17, నిజామాబాద్ లో 7 ఆసుపత్రులను, వరంగల్ జిల్లాలో మూడింటిని తనిఖీ చేసి, ఒక్క దానిపై కూడా చర్య తీసుకోలేదని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. అనేకచోట్ల రోగులకు సరిగా వైద్యం అందించడంలేదని తెలిసింది. అనేకచోట్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లోని డాక్టర్లను బెదిరించడానికే వైద్యబృందాలు దాడులు చేస్తున్నాయని పలువురు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనధికారిక క్లినిక్‌లు నడుపుతూ, ప్రి్రస్కిప్షన్ లేకుండా ఇంజెక్షన్లు ఇస్తున్న రిజిస్టర్ కాని ప్రైవేట్ ప్రాక్టీషనర్లపై మాత్రం ఎలాంటి దాడులు జరగడంలేదని మండిపడుతున్నారు. -
Hyderabad: డెంగీ.. కార్పొ‘రేట్’ కాటు.. హడలిపోతున్న జనం
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చి పిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు.. ఇప్పుడు డెంగీ రోగుల జేబులు గుల్ల చేస్తున్నాయి. తప్పుడు రిపోర్టుల్లో ప్లేట్లెట్ల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసరంగా ఫీజులు వసూలు చేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ పదేపదే చెబుతున్నా కొన్ని ఆసుపత్రులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తూ రోగుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతూ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఇచ్చిన వాట్సాప్ నంబర్ (9154170960)కు పలు ఫిర్యాదులు వస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. పెరుగుతున్న డెంగీ కేసులు రాష్ట్రంలో డెంగీ విజృంభించింది. కరోనా పరిస్థితుల్లో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. జ్వరం రాగానే కరోనా పరీక్షలతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. అయితే మూడేళ్ల తర్వాత ఈసారి డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 516 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. వర్షాలు తగ్గాక మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదముందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోతే ప్లేట్లెట్లు 20 వేల వరకు తగ్గినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యలున్నప్పుడు మాత్రం 50 వేల లోపునకు తగ్గితే జాగ్రత్త వహించాలి. చాలావరకు కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే చికిత్సే చాలని వైద్య నిపుణులంటున్నారు. డెంగీ లేకున్నా.. అయితే డెంగీతో తమ వద్దకు వస్తున్న రోగుల వద్ద పలు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. రోగికి 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా ఫిర్యాదులందుతున్నాయి. ఒకసారి ప్లేట్లెట్లు ఎక్కిస్తే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు బిల్లు వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆసుపత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇక డెంగీ ఉన్నా లేకున్నా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి అందడం గమనార్హం. డెంగీ లేకపోయినా, ప్లేట్లెట్ల కౌంట్ సరిపడా ఉన్నప్పటికీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రతను తగ్గించడం ఎలా? డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజిని ముంచి రోగి శరీరాన్ని తుడవాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీళ్లు, పళ్లరసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు తగ్గడం అదుపులోకి వస్తుంది. రానిపక్షంలో వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. రక్తస్రావం జరిగితే ప్రమాదకరం డెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్త స్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. అలాగే మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వాళ్లు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం లేనప్పుడు 20 వేల వరకు పడిపోయినా ప్రమాదం ఉండదు. ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. – డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, కన్సల్టెంట్ ఫిజీషియన్, సిటీ న్యూరో ఆసుపత్రి, హైదరాబాద్ ఐజీఎం పరీక్ష తప్పనిసరి డెంగీకి గురైతే ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వీటితో పాటు అధిక దాహం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో డెంగీ నిర్ధారించుకోవడానికి వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా ఐజీఎం పరీక్ష చేయించాలి. ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమాదకరం. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. -
‘కరోనా’ కక్కుర్తిని కక్కించారు!
కోవిడ్ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. నగర వైద్య చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆస్పుత్రుల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ వినతి మేరకు సిటీ ఆసుపత్రులు రోగుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇచ్చేశాయి. నగరానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్తకు అందించిన సమాచారంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స ఛార్జీలపై 2020 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత రేట్లను జారీ చేసింది చికిత్స పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు/లేబొరేటరీలు వసూలు చేసే బిల్లులపై పరిమితిని విధించింది. అయితే వాటిని ప్రైవేటు ఆసుపత్రులు ఉల్లంఘించాయి. దారి చూపిన హెల్ప్‌లైన్ రొటీన్ వార్డు అండ్ ఐసోలేషన్‌లో చేరేందుకు రోజుకు రూ.4వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.7,500, వెంటిలేటర్‌తో ఐసియూ ఐసోలేషన్‌కు రోజుకు రూ.9 వేలుగా నిర్ణయించింది. అయితే ఆసుపత్రులు మాత్రం రకరకాల పేర్లు పెట్టి అధిక ఛార్జీలు వేసి బిల్లులు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని రోగుల నుంచి పెద్ద యెత్తున ఆరోపణలొచ్చాయి. గత సంవత్సరం, కోవిడ్–19 రోగులను పదే పదే ఉల్లంఘించినందుకు కనీసం 30 ఆసుపత్రులను కోవిడ్ చికిత్సల నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఒక హెల్ప్‌లైను ఏర్పాటు చేసి, ఆసుపత్రులు ఎక్కువ వసూలు చేస్తున్నాయని భావిస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. వెల్లువెత్తిన ఫిర్యాదులు.. కరోనా చికిత్స కోసం ఆసుపత్రులు వివిధ అదనపు బిల్లులను వసూలు చేస్తున్నాయని రోగులు, బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత నెల ఆఖరు వరకు ప్రభుత్వం నిర్ణయించిన చికిత్స ఛార్జీలను ధిక్కరించినందుకు 268 ప్రైవేట్ ఆసుపత్రులపై 843 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో 87 ఫిర్యాదులకు రీఫండ్లు అందించాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి వసూలు చేసిన బిల్లులను వాపసు చేసే విషయంపై ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నగరంలోని 87 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రూ. 1.61 కోట్లకు పైగా సొమ్మును రోగులకు వెనక్కి ఇచ్చారు. అత్యధిక రిఫండ్ ఓమ్ని ఆసుపత్రిదే... కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆసుపత్రి అత్యధికంగా రూ.27,41,948 రీఫండ్ చెల్లించింది. ఉప్పల్‌లోని టీఎక్స్ హాస్పిటల్ రూ.10,85,000, కొండాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ రూ.10,82,205 రీఫండ్ చేశాయి. బంజారాహిల్స్‌లోని సెంచురీ హాస్పిటల్స్ (రూ.10 లక్షలు), ఎల్బీ నగర్‌లోని అంకురా హాస్పిటల్ (రూ.6.1 లక్షలు), ఎల్బి నగర్‌లోని దియా హాస్పిటల్ (రూ. 6 లక్షలు), హైదరాబాద్ నర్సింగ్ హోమ్ (రూ.5 లక్షలు), సెక్రటేరియట్‌లోని మెడికవర్ హాస్పిటల్ (రూ.5.7 లక్షలు), కూకట్‌పల్లిలోని ప్రతిమ హాస్పిటల్ (రూ.8.2 లక్షలు) గచ్చిబౌలిలోని సన్‌షైన్ హాస్పిటల్ (రూ.5 లక్షలు) రోగులకు రీఫండ్ చేసిన ఆసుపత్రుల్లో ఉన్నాయి. (చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!) -
కంపెనీ పేరుతో మందులు రాయొద్దు :పెద్ద అక్షరాలతో అర్థమయ్యేలా రాయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు రోగులకు అందుబాటులో ఉండా లని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పేర్కొంది. డాక్టర్ ఫీజు, కన్సల్టేషన్, రిఫండ్ వంటి వివిధ అంశాల ఆధారంగా ఫీజులు వసూలు చేయకూడదని, అలాంటి వాటితో రోగికి సంబంధం లేదని స్పష్టం చేసింది. వైద్య నియమావళిలో పలు కీలక మార్పులు చేస్తూ, వైద్య సేవలకు సంబంధించి కొత్త నిబంధనలు విధిస్తూ, వైద్యులకు పలు సూచనలు చేస్తూ.. ఎన్ఎంసీ ముసాయిదాను రూపొందించింది. ముఖ్యాంశాలివీ.. కంపెనీ పేరుతో మందులు రాయొద్దు కార్పొరేట్ ఆసుపత్రులు తాము అందించే వైద్య సేవలను మాత్రమే తెలియజేయాలి. దాని ఫీజును చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ల పేరుతో ప్రచారం చేయకూడదు. జనరిక్ పేరుతోనే మందులు రాయాలి కానీ కంపెనీ పేరుతో రాయకూడదు. మందులు రాసేటప్పుడు పెద్ద అక్షరాల్లో (క్యాపిటల్ లెటర్స్) అర్ధమయ్యేట్లు రాయాలి. ఫార్మాస్యూటికల్ కంపెనీల నుంచి డాక్టర్లు ఎలాంటి బహుమతులు పొం దకూడదు. ఐదేళ్లకోసారి ఆ మేరకు అఫిడవిట్ సమర్పించాలి. ఒకవేళ పొం దితే దాన్ని వెల్లడించాలి. కంపెనీల ప్రభావానికి లోనుకాకూడదు. కాన్ఫరెన్స్‌లు, సెమినార్లకు కూడా కంపెనీల స్పాన్సర్షిప్ తీసుకోకూడదు. ప్రాక్టీస్‌పై జీవితకాల నిషేధం! రోగులు తమకు ఏదైనా అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు, అది నిజమని తేలితే నిపుణుల కమిటీ తగిన చర్యలు చేపడుతుంది. సాధారణ తప్పు అయితే డాక్టర్‌ను మందలిస్తుంది. కొన్నిసార్లు కౌన్సెలింగ్ ఇస్తుంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తే, లైసెన్స్ ఫీజుకు పది రెట్లు జరిమానాగా విధిస్తుంది. – వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా రోగి చనిపోయినా, భారీ తప్పులు జరిగినా.. తీవ్రత ఆధారంగా అవసరమైతే ప్రాక్టీస్ చేయకుండా జీవితకాలం నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. – రోగుల విషయంలో నైతిక నియమాలను సరిగా పాటించకపోతే లైసెన్సును నెల రోజుల వరకు సస్పెండ్ చేయవచ్చు. రోగికి ప్రత్యక్షంగా హాని జరిగితే మూడు నెలల నుంచి మూడేళ్ల వరకు సస్పెండ్ చేయొచ్చు. రోగికి వాస్తవ సమాచారం ఇవ్వాలి – రోగి పరిస్థితిని ఉన్నదున్నట్టు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు చెప్పాలి. దాచిపెట్టడం కానీ, ఎక్కువ చేసిగానీ చెప్పకూడదు. యథార్థ సమాచారం ఇవ్వాలి. ఆపరేషన్ అవసరమైతే కుటుంబ సభ్యుల అనుమతితోనే చేయాలి. సర్జన్ పేరు కూడా రికార్డులో ఉండాలి. – మైనర్లకు, మానసికంగా సరిగా లేని వ్యక్తులకు ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ల కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. 8 ఏళ్లకు పైబడిన చిన్నారులైతే ఆ పిల్లలకు సంబంధిత చికిత్స వివరాలను తెలియజేయాలి. – రోగికి వైద్యం చేసిన తర్వాత వారి రికార్డులను మూడేళ్లు భద్రపరచాలి. వాటిని సంబంధిత వ్యవస్థలు ఏవైనా అడిగితే ఐదు రోజుల్లోగా ఇవ్వాలి. – నూతన నియమావళి రూపొందిన మూడేళ్ల లోపు రోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ప్రతి రికార్డును డిజిటలైజ్ చేయాలి. అలాగే రోగి వివరాలను గోప్యంగా ఉంచాలి. కొన్నిటికి మాత్రమే టెలిమెడిసిన్ – ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా టెలీ మెడిసిన్ ద్వారా మందులు ఇవ్వకూడదు. కనీసం గత ప్రిస్కిప్షన్ల వంటి ఆధారమైనా లేకుండా మందులు ఇవ్వకూడదు. – టెలీ మెడిసిన్.. వీడియో, ఆడియో, మెస్సేజ్, ఈ మెయిల్ రూపంలో జరుగుతుంది. కాబట్టి కొందరిని భౌతికంగా పరీక్షించాల్సి ఉంటే అలా చేయాల్సిందే. – ఆన్లైన్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించవచ్చు. కౌన్సిలింగ్ ఇవ్వడానికి, కొన్ని రకాల మందులు సూచించడానికి ఇది పనికి వస్తుంది. దగ్గు మందులు, నొప్పి మందులు, యాంటీ ఫంగల్, యాంటీబయోటిక్స్ వంటి మందులను ఆన్లైన్లో సూచించవచ్చు. వాట్సాప్‌లోనూ ఇవ్వొచ్చు. – వీడియో కన్సల్టేషన్‌లో చర్మ, ఆస్తమా, మధుమేహం, రక్తపోటు, క్షయ వంటి వాటికి మందులను ఇవ్వొచ్చు. ఫాలోఅప్‌లో మందులు కూడా ఇవ్వొచ్చు. – క్యాన్సర్, మెదడును ఉత్తేజపరిచే, సైకియాట్రిక్ మందులు వాట్సాప్ ద్వారా కానీ టెలీమెడిసిన్‌లో కానీ ఇవ్వొద్దు. ఆ రోగులను భౌతికంగా చూడాల్సిందే. రోగి అనుమతితోనే మీడియాలో ప్రచురించాలి – రోగికి ఏవైనా ప్రత్యేక చికిత్సలు చేసినప్పుడు వారి అనుమతి మేరకే మీడియాలో ప్రచురించాలి. – గుర్తింపులేని వైద్యులతో కలసి పని చేయకూడదు. వైద్యంతో సంబంధం లేనివారు కూడా ప్రాక్టీస్ పెడుతున్నందున వారితో కలిసి పనిచేయవద్దు. – డాక్టర్లు సెమినార్లు, సదస్సులకు హాజరవుతూ వైద్యంలో అవుతున్న అప్డేట్ ఆధారంగా ప్రతి ఐదేళ్లకోసారి 30 మార్కులు పొందాల్సి ఉంటుంది. అలా సాధిస్తేనే ఐదేళ్లకోసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేస్తారు. – ఎలాంటి గుర్తింపు లేనివారికి వారి అనుభవం ఆధారంగా (ఆర్ఎంపీల వంటి వారికి) వైద్యులు సర్టిఫికెట్లు ఇవ్వకూడదు. – వైద్యులు ఇతర రాష్ట్రాల్లో పనిచేసేందుకు ప్రస్తుతం ఎన్వోసీ త్వరగా ఇవ్వడంలేదు. దాన్ని ఇప్పుడు సరళతరం చేసి వారంలో ఇచ్చేలా మార్పు చేశారు. -
నిర్మల్ జిల్లాలో కడుపు కోతల దందా..
-
దేశంలోనే మేటిగా మన పీహెచ్‌సీలు
సాక్షి, అమరావతి: ‘ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి. వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, శానిటేషన్, రోగులకు కల్పించే సదుపాయాల్లో లోటు ఉండకూదడు. ప్రభుత్వ ఆస్పత్రిలో అడుగు పెట్టగానే.. కార్పొరేట్ ఆస్పత్రికి వచ్చామా అన్న భావన ప్రజలకు కలగాలి. అందుకు తగ్గట్టుగా ఉన్నత ప్రమాణాలు ఉండాలి’ అని వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షల్లో అధికారులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. కేవలం మాటలు చెప్పడమే కాదు.. ఆ మాటలను క్షేత్ర స్థాయిలో ఆచరింపజేయడంలో సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. దీంతో మన రాష్ట్రంలోని వైద్య రంగానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ 2016లో నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్‌క్వాస్) కార్యక్రమం కింద అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ ఆస్పత్రులకు గుర్తింపు ఇస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అత్యధిక పీహెచ్‌సీలు ఎన్‌క్వాస్ గుర్తింపు పొందటం ద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. 320 పీహెచ్‌సీలకు.. రాష్ట్రంలో 1,145 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికి 320 పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ గుర్తింపు లభించటంతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉంది. 191 పీహెచ్‌సీలతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 1,280 పీహెచ్‌సీలకు గుర్తింపు ఉండగా.. వీటిలో 25 శాతం ఆస్పత్రులు మన రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. గుర్తింపు ప్రక్రియ ఇలా.. పీహెచ్సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ), ఏరియా ఆస్పత్రి (ఏహెచ్), జిల్లా ఆస్పత్రి (డీహెచ్)లకు ఎన్‌క్వాస్ గుర్తింపు ఇస్తారు. ఆస్పత్రిని బట్టి గుర్తింపు లభించడానికి ప్రమాణాలు మారుతుంటాయి. పీహెచ్‌సీల్లో 6 డిపార్ట్మెంట్లలో 1,600 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఏరియా, సీహెచ్‌సీ, డీహెచ్‌లలో 18 డిపార్ట్మెంట్లలో, 6,625 అంశాలను పరిశీలిస్తారు. సంబంధిత ఆస్పత్రికి ఎన్‌క్వాస్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చి ఆస్పత్రుల్లో పర్యటించి ప్రమాణాలన్నింటినీ పరిశీలించిన అనంతరం గుర్తింపు ఇస్తుంది. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నొస్టిక్స్ సేవలు, మందుల లభ్యత, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, రోగులకు సౌకర్యాలు, పరిశుభ్రత, వైద్యులు, సిబ్బంది సంఖ్య వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయిస్తారు. నాడు–నేడుతో.. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు లక్ష్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా రూ.663 కోట్లతో 977 పీహెచ్‌సీలకు మరమ్మతులు, 148 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్‌సీల్లో నాడు–నేడు కింద మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్‌లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద పీహెచ్‌సీల్లో ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతుల కల్పన నేపథ్యంలోనే దేశంలోనే అత్యధిక పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ గుర్తింపు కలిగిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలవగలిగింది. -
144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
-
మహారాష్ట్రలో లాక్డౌన్?.. ఆరోగ్య శాఖ మంత్రి క్లారిటీ..
సాక్షి, ముంబై: రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచన ప్రస్తుతానికి లేదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మరోసారి స్పష్టం చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్, రాజేశ్ టోపే, సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం, తాజా పరిస్థితులపై పవార్, టోపే ఆరా తీశారు. రాష్ట్రంలో చాపకింద నీరులా రోజురోజుకూ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పవార్ వాస్తవాలు తెలుసుకునేందుకు టోపే, ఆరోగ్య శాఖ అధికారులతో స మావేశమయ్యారు. తాజా పరిస్థితులపై ప్రత్యామ్నాయ విధానాలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వ్యాక్సినేషన్, లాక్డౌన్, కరోనా ఆంక్షలు తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంక్షలు సక్రమంగా అమలు కాకపోతే నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పవార్ నిర్ధేశించారు. రోగుల సంఖ్య పెరిగితే దుకాణాలు, సంస్థలు మూసివేయాలనే దానిపై కూడా చర్చ జరిగింది. అలాగే మాల్స్, రెస్టారెంట్లలో జనసమ్మర్థంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. భౌతిక దూరం, ఇతర కరోనా నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదన్న అభిప్రాయం వ్యక్త మైంది. ఈ విషయంలో అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని, నిబంధనలు పాటించని ప్రజలు, వాణిజ్య సముదాయాల నుంచి భారీగా జరిమానాలు వసూలు చేయాలని వారు ఆదేశించా రు. కరోనా టీకా విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని, సాధ్యమైనంత త్వరలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చదవండి: మోదీ పర్యటనలో భద్రతా లోపం.. సుప్రీంలో విచారణ ఇదిలాఉండగా ముంబైలో వీకెండ్ లాక్‌డౌన్‌పై కూడా చర్చలు జరిగినప్పటికీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైద్య మంత్రి తెలిపారు. ప్రస్తుతమైతే ఎక్కడా లాక్డౌన్ విధించే అలోచన ప్రభుత్వానికి లేదని వారు పునరుద్ఘాటించారు. ఇటీవల కూడా ఆయన ఈ విషయంపై స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ముంబైలో లోకల్ రైలు ద్వారా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని భావించినప్పటికీ ప్రస్తుతానికి ఆ సేవలు నిలిపివేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కరోనా రెండు డోసుల టీకా తీసుకున్నవారినే రైళ్లలో అనుమతిస్తున్నామని, తగు జాగ్రత్తలతో రైళ్లు నడుపుతున్నామని పేర్కొన్నారు. చదవండి: విదేశీ చేతుల్లోకి ఎల్ఐసీ! కేంద్రం కసరత్తు కాగా ముంబైలోనూ, రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 80 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆక్సిజన్ డిమాండ్ మాత్రం పెరగడం లేదని మంత్రి టోపే అన్నారు. ఇదిలాఉండగా శరద్ పవార్ కరోనా టీకా తీసుకుని 9 నెలలు కావస్తోంది. దీంతో ఆయన ఈ నెల 10వ తేదీన బూస్టర్ డోసు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. -
కారణం లేకుండా ‘కోత’ వద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్ ప్రసవాలను అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇప్పటికే 65 శాతం వరకు సిజేరియన్ ద్వారానే ప్రసవాలు చేస్తున్నారు. దీంతో వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. కారణాలు లేకుండా ఏ గర్భిణికైనా ‘కోత’ ద్వారా ప్రసవం చేస్తే సదరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ఏటా 8 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా, అందులో మెజారిటీ ప్రసవాలు కోతల ద్వారానే జరుగుతున్నాయి. అందుకే ఇక ప్రతి వారం కోతల ప్రసవాలపై ఆడిట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ జరిగిన ప్రసవాల వివరాలు ఆయా జిల్లా వైద్యాధికారులకు పంపించాలి. ఎందుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది? సాధారణ ప్రసవం కాకపోవడానికి గల కారణాలను ప్రత్యేక ఫార్మాట్లో ఇచ్చిన పేపర్లో నింపి పంపించాలి. ప్రతి 15 రోజులకోసారి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్ష ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువగా రాత్రి సమయాల్లో వచ్చిన గర్భిణులకు సిజేరియన్ చేస్తున్నారు. సాధారణ ప్రసవానికి ఎక్కువ సేపు వేచిచూడాల్సి రావడం, అంతసేపు సహనంగా ఉండలేక వెంటనే ఆపరేషన్ చేసి ప్రసవం చేస్తున్నారు. దీనివల్ల తల్లికీ, బిడ్డకూ భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆడిట్ నిర్వహిస్తారు. ఎక్కడైనా అసాధారణ కోతలు నిర్వహించే ఆస్పత్రులు లేదా డాక్టర్లు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకునే వీలుంటుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ‘కోతల’ ప్రసవాలపై ఆడిట్ నిర్వహణ మొదలైంది. కోతల ప్రసవాలపైనే కాకుండా మాతృ మరణాలపైనా కారణాలు చెప్పాలని ప్రజారోగ్య సంచాలకులు ఆదేశించారు. -
Telangana: ఆరోగ్యశ్రీ అందట్లే!
రాష్ట్రవ్యాప్తంగా వందల ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సరిగా అందడం లేదు. సాధారణ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల దాకా ఇదే పరిస్థితి. ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏడాదిన్నరగా బకాయిలు రావడం లేదని, అందువల్ల నగదు రహిత సేవలు అందించలేకపోతున్నామని ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స కోసం వస్తున్నవారిని ఏదో ఒక కారణం చెప్తూ తిప్పి పంపేస్తున్నాయి. దీంతో చివరికి అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రుల తీరుపై ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) కింద కూడా నగదు రహిత వైద్య సేవలు అందడం లేదన్న ఫిర్యాదులూ వస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ మేడ్చల్‌కు చెందిన గొరుకంటి యాదగిరి కొంతకాలంగా తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నాడు. శని వారం ఉదయం ఆయనకు భరించలేని నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డును చూపించి ఔట్‌పేషెంట్ విభాగం (ఓపీడీ)లో న్యూరాలజీ వైద్యులను కలిశారు. వైద్యులు ఆయనకు బ్రెయిన్ సీటీ స్కాన్ చేయాలని, ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్ చేసుకోవాలని రిఫర్ చేశారు. కానీ సాయంత్రం దాకా వేచిచూసినా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. ఇదేమిటని అడిగితే ముందు రూ.10 వేలు కడితే జాయిన్ చేసుకుంటామన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా డబ్బులు కట్టాలంటే ఎలాగని నిలదీస్తే.. ‘ఆరోగ్యశ్రీ నుంచి వచ్చేదే తక్కువ. ఇప్పటికే బకాయిలు రావడం లేదు. నిమ్స్ ఎలా నడవాలి’ అని సిబ్బంది ప్రశ్నించ డంతో చేసేది లేక డబ్బులు కట్టి అడ్మిట్ అయ్యారు. నల్లగొండకు చెందిన రాజేందర్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల మలక్‌పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనను పరీక్షించి, సర్జరీ చేయాలని చెప్పారు. తనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని, దాని కింద అడ్మిట్ చేసుకుని చికిత్స చేయాలని రాజేందర్ కోరగా.. ఆస్పత్రి నిర్వాహకులు నిరాకరించారు. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు రావడం లేదని, డబ్బు కడితే చికిత్స చేస్తామని స్పష్టం చేశారు. చదవండి: ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు రూ. 900 కోట్లకుపైగా బకాయిలు రాష్ట్రంలో 329 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులున్నాయి. వాటిలో 41,398 పడకలు ఉన్నాయి. మొత్తం 77.19 లక్షలమంది పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. ఇక ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్)ను కూడా ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తున్నారు. రాష్ట్రం లోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందకు వస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా, ఏదైనా జబ్బు వస్తే నగదు రహిత వైద్యం పొందడానికి అవకాశం ఉంటుంది. 949 వ్యాధులకు నగదు రహిత వైద్యం అందజేయాలి. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఈ పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఒక్క 2018–19 ఏడాదిలోనే ఆరోగ్యశ్రీ కింద రూ.720 కోట్ల విలువై న చికిత్సలు జరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఏడాదిన్నరగా ఆరోగ్యశ్రీ చెల్లింపులు నిలిచిపోయాయని..ప్రభుత్వం నుంచి రూ.900 కోట్లు రావాల్సి ఉందని నెట్వర్క్ ఆస్పత్రులు వాపోతున్నాయి. దీంతో రోగులకు సేవలు అందించలేని పరిస్థితి ఉందని చెప్తున్నాయి. చదవండి: హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం..! రోగులకు తీవ్ర అవస్థలు ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల నగదు రహిత పథకం కింద వైద్య సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో ఆయా వర్గాలకు చెందిన రోగులు విలవిల్లాడుతున్నారు. ఇన్‌పేషెంట్ సేవలేకాకుండా.. ఔట్‌పేషెంట్ (ఓపీ), వైద్య పరీక్షలూ సరిగా అందక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రులు కరోనా చికిత్సల్లో ఉన్నామని, ఆరోగ్యశ్రీ కింద ఇతర చికిత్సలు చేయడం లేదని చెప్తూ రోగులను తిప్పి పంపేస్తున్నాయి. ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ గందరగోళంతోనూ.. ఆరోగ్యశ్రీతోపాటు కేంద్ర సార్వత్రిక ఆరోగ్య పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రపథకంలో 1,393 వ్యాధులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి రూ.175 కోట్ల వరకు నిధులు వస్తాయని అంచనా. ఈ రెండు పథకాలను కలిపి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ ఆచరణలో స్పష్టత ఇవ్వలేదని నెట్వర్క్ ఆస్పత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ వద్దు బాబోయ్! ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమంటూ ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది నెట్వర్క్ ఆస్పత్రులు ఈ విషయంగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆరోగ్యశ్రీ కింద నగదు రహిత చికిత్సలు చేసి, బకాయిలు రాక అప్పుల్లో కూరుకుపోయామని.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలంటూ ఆస్పత్రుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తేవని.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తీసేయాలని కోరుతుండటం విస్మయం కలిగిస్తోందని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సీఈవోలుగా ఇన్చార్జులే.. ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈవో) పోస్టును కొన్నేళ్లుగా ఇన్‌చార్జులతోనే నెట్టుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆరోగ్యశ్రీ సీఈవోగా నాన్ ఐఏఎస్‌ను నియమించారు. తర్వాత నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఆయన్ను తొలగించి ఐఏఎస్ అధికారి మాణిక్‌రాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ దీనికి ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను రెండింటినీ కలిపి నిర్వహించాలన్న నిర్ణయం నేపథ్యంలో.. పూర్తిస్థాయి సీఈవోను నియమించాల్సిన అవసరం ఉందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తిస్థాయి సీఈవో లేకపోవడం వల్ల రోజువారీగా నెట్వర్క్ ఆస్పత్రుల సమస్యలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ఆరోగ్యశ్రీ సమస్యల విషయంగా వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీని ‘సాక్షి’ప్రతినిధి సంప్రదించగా.. కావాల్సిన వివరాలేమిటో వాట్సాప్‌లో పంపాలని సూచించారు. ఈ మేరకు ఆయన వాట్సాప్‌కు సమస్యల వివరాలను పంపినా.. స్పందించలేదు. ఏడాదిన్నరగా సంక్షోభం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.900 కోట్లు బకాయి పడింది. దీనితో సాధారణ ఆస్పత్రులు ఏడాదిన్నరగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. బ్యాంకుల్లో అప్పులు తెచ్చి వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బకాయిల విషయంగా ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. ఇక ఆరోగ్యశ్రీ కింద వివిధ వ్యాధులకు ఏళ్లకింద ప్యాకేజీలను నిర్ధారించారు. ఆ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్యాకేజీ ధరలను ఏటా ఐదు శాతం పెంచాలని నిర్ణయించారు. కానీ ఆచరణలోకి రాలేదు. దీనివల్ల చికిత్సలు అందించడంలో ఇబ్బంది ఎదురవుతోంది. – డాక్టర్ వద్దిరాజు రాకేశ్, తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 3 కోట్లు బకాయిలు రావాలి మా ఆస్పత్రికి సుమారు రూ.3 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. చాలారోజులుగా బకాయిలు పేరుకుపోవడంతో ఆస్పత్రి నిర్వహణ కష్టంగా మారింది. అప్పులు తెచ్చి ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నాం. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడ్తున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ చికిత్సలు అందించలేని పరిస్థితి నెలకొంది. – జి.వెంకటేశ్వర్లు, ఎండీ, శ్రీరక్ష ఆస్పత్రి, ఖమ్మం -
ఏపీ: థర్డ్‌వేవ్‌కు 462 ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధం
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్ వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 462 ప్రైవేటు ఆస్పత్రులను కూడా సిద్ధం చేస్తోంది. ప్రైవేటులో చాలావరకు 50 నుంచి 100 పడకలలోపు ఆస్పత్రులున్నాయి. 100 పడకలకంటే ఎక్కువ ఉన్న ఆస్పత్రులు 65 ఉన్నాయి. కరోనా సేవల్లో భాగంగా ఈ ప్రైవేటు ఆస్పత్రులు 33,793 డీటైప్ ఆక్సిజన్ సిలిండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే 17,841 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. సాధారణ పడకలతోపాటు ఆక్సిజన్ పడకలు కూడా సిద్ధం చేసి ఉంచాలని ఆదేశించింది. ఎలాంటి సమయంలో రోగులు వచ్చినా సేవలు అందించాలని కోరింది. ఈ నెల చివరి నాటికి అన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది. కాగా, అత్యధికంగా గుంటూరు జిల్లాలో 63, కృష్ణా జిల్లాలో 60 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నట్టు తేలింది. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 11 మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చదువుతున్న నర్సింగ్, పారామెడికల్, ఫార్మసీ, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులను సైతం కోవిడ్ సేవల్లో వినియోగించుకోనుంది. -
వైద్య పరికరాలకు ‘చికిత్స’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాస్పత్రులకు ఆధునిక వైద్య ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా వంద రకాల పరికరాలను సర్జికల్ జాబితాలో చేర్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఏటా లక్షలాది శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. కొత్త కొత్త వైద్య పద్ధతులు వస్తున్న నేపథ్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి సమీక్ష నిర్వహించి ఆధునిక ఉపకరణాలను అందుబాటులోకి తీసుకురావాలి. కానీ 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు.. స్పెషాలిటీ వైద్యులు సర్జికల్ జాబితాపై కసరత్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా నిర్వహించిన సమీక్షలో శస్త్రచికిత్సలకు అవసరమైన 390 రకాల సర్జికల్ ఉపకరణాలతో జాబితా తయారు చేశారు. ఇందులో 100 రకాలు కొత్తగా చేర్చినవే. ప్రైవేటు ఆస్పత్రుల్లోని పరికరాల కంటే ఇవి అత్యుత్తమమైనవని వైద్యులు, అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చైనా నుంచి వచ్చిన నాసిరకం పరికరాలు వాడుతుంటారని వివరించారు. ప్రభుత్వ రేటు కాంట్రాక్టులో ఉన్నవన్నీ అమెరికా ఔషధ నియంత్రణతో పాటు డబ్ల్యూహెచ్‌వో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నవేనని తెలిపారు. జనరల్ సర్జరీ, గ్యాస్ట్రిక్, ప్రసవాల్లో వాడే పరికరాల్లో ఆధునికమైనవి ఎక్కువగా వచ్చాయని చెప్పారు. గతంలో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు శరీరంపై కోతలు ఎక్కువగా పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న గాటుతో చికిత్స చేసే ల్యాప్రోస్కోపిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వైద్య ఉపకరణాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రేటు ఎక్కువైతే పునఃసమీక్ష.. మొత్తం 390 రకాల పరికరాల్లో.. రేటు ఎక్కువగా ఉన్న వాటి విషయంలో పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. మొదటిసారిగా సర్జికల్ ఉపకరణాలను అన్ని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న స్పెషాలిటీ వైద్యుల అభిప్రాయాలు తీసుకుని మరీ నిర్ధారించారు. ఆధునిక వైద్య పరికరాలు గతంలోని రేటు కాంట్రాక్టులో లేకపోవడంతో.. ఆస్పత్రుల్లో లోకల్ పర్చేజీ కింద ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తే మరింత రేటు తగ్గుతుందని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు. ఏటా లక్షలాదిమంది సర్జరీ చేయించుకునేందుకు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారని, ఆధునిక వైద్యపరికరాలుంటే రక్తస్రావం తక్కువగా ఉండటం, త్వరగా గాయాలు మానడం, ఇన్ఫెక్షన్లు తగ్గడం వంటి ఉపయోగాలుంటాయని వైద్యులు చెప్పారు. అందరి అభిప్రాయాలతోనే.. ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుపై స్పెషాలిటీ వైద్యులు కసరత్తు చేశాకే నిర్ధారణకు వచ్చాం. బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యుల అభిప్రాయాలు తీసుకున్నాం. అందరి అభిప్రాయాల మేరకే ఉపకరణాల జాబితా తయారు చేశాం. సర్జికల్ బడ్జెట్ కొంత పెంచాల్సి ఉంది. దీని కోసం ప్రయత్నిస్తున్నాం. – డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు -
రాష్ట్రంలో అటు కరోనా.. ఇటు సీజనల్ వ్యాధుల దాడి
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరోనా భయపెడుతుంటే, మరోవైపు సీజనల్ జ్వరాలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నెలన్నర రోజుల్లో దాదాపు 10 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో అనేకమంది కరోనా రోగులుండగా.. మరింత మంది సాధారణ, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి జ్వరాలకు గురయ్యారు. కొందరికి డెంగీతో పాటు కరోనా కూడా సోకుతోందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒకే వ్యక్తికి కరోనాతోపాటు డెంగీ, మలేరియా పరీక్షలు కూడా చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 352 డెంగీ కేసులు, 374 మలేరియా కేసులు నమోదు కాగా, అందులో గత 20 రోజుల్లోనే 52 డెంగీ, 41 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు డెంగీ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంటింటా జరుపుతున్న పరీక్షల్లో లక్షలాది జ్వరం కేసులు గుర్తిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రోజుకు దాదాపు లక్షన్నర మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇలా పరీక్షలకు వచ్చే వారిలో చాలామంది జ్వరాలతోనే వస్తున్నారు. ఈ క్రమం లో హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. అలాగే మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి పది రోజుల కిందట 1,400 ఔట్పేషెంట్లు (ఓపీ) రాగా, బుధవారం 1,800 ఓపీ నమోదైంది. ఇక్కడ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 12 డెంగీ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాధారణ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం జిల్లాల్లో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చినా, అక్కడ అన్ని పరీక్షలు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చాలావరకు ప్రాథమిక ఆస్పత్రుల్లో మందులు, ఇంజెక్షన్లు ఉండటం లేదని, చీటీలు రాసి ఇచ్చి బయట తెచ్చుకోవాలని చెబుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కొన్నిచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వేలు గుంజుతున్న ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటివరకు కరోనాతో దండుకొన్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రస్తుతం సీజనల్ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రక్త పరీక్షలు, ప్లేట్లెట్ల పేరుతో బాధితుల నుంచి వేలకు వేలు గుంజుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన ఒక బాధితుడికి వింతైన అనుభవం ఎదురైంది. సాధారణ జ్వరం వచ్చిందని వెళితే సీబీపీ, ఈఎస్సార్, డెంగీ టెస్టులు చేయాలని డాక్టర్ సూచించాడు. అందుకోసం అదే ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోగా ఏకంగా రూ.9 వేల బిల్లు వేశారు. ఇక ప్లేట్లెట్లను ఎక్కిస్తే రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు హైదరాబాద్‌లో ఎన్నో ఉన్నాయి. సాధారణ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్లేట్లెట్లు 40 వేల దిగువకు పడిపోతేనే సమస్య ఉంటుందని వైద్యులు అంటున్నారు. కానీ 50 వేలున్నా తక్కువ ఉన్నాయంటూ ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత కారణంగానే రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. చలి జ్వరం వస్తే మలేరియా వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సీజనల్ జ్వరాలు పెరుగుతాయని వైద్య ఆరోగ్యశాఖ చెబుతుంది. ఏజెన్సీలో మలేరియా, ఇతర ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు అధికంగా వ్యాపిస్తాయి. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ జ్వరాలను రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు సూచిస్తున్నాయి. మలేరియా వ్యాధి సోకితే చలి, వణుకుతో మొదలై జ్వరం వస్తుంది. చలి ప్రారంభమైనప్పుడే తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా వస్తాయి. తర్వాత చలి బాగా పెరిగి ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా వణుకు తగ్గదు. జ్వర తీవ్రత తగ్గినప్పుడు విపరీతంగా చెమట పడుతుంది. ఈ జ్వరం ప్రతిరోజూ లేక రోజు విడిచి రోజు లేక నాలుగు రోజులకు ఒకసారి వస్తుంది. డెంగీలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి డెంగీలో ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది. డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా.. – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే వారికి తీవ్రతను బట్టి మూడు నుంచి ఐదు రోజులకు మందులు ఇస్తున్నారు. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో వైద్యులు సమయానికి విధులకు హాజరుకావడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇక భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా సీజనల్ వ్యాధులతో ప్రజలు వస్తున్నారు. దీంతో పడకలు సరిపోవడం లేదు. ఈ ఆసుపత్రిలో డెంగీ కిట్లు అందుబాటులో లేవు. – మహబూబ్‌నగర్‌లో జిల్లాలో కూడా విష జ్వరాలు మొదలయ్యాయి. జనరల్ ఆస్పత్రిలో వైద్యులు రెగ్యులర్‌గా వస్తున్నా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరూ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం పది మంది వరకు బాధితులు సాధారణ జ్వరాలతో ఆసుపత్రికి వస్తున్నారు. – అదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 17 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఒక మలేరియా కేసు నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో 41 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో బాధితులకు మందులు బయట కొనుక్కోవాలని చెబుతున్నట్టు సమాచారం. మంచిర్యాల జిల్లాలో 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని బాధితులు చెబుతున్నారు. – ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌లో డెంగీకి సంబంధించిన ఎలిసా టెస్ట్ అందుబాటులో ఉంది. కానీ 90 శాంపిళ్లు వచ్చినప్పుడు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దీంతో బాధితులకు సకాలంలో వైద్యం అందడం లేదు. గత రెండ్రోజుల్లో ఐదుగురికి మలేరియా పాజిటివ్‌గా తేలింది. మందులు అందుబాటులో ఉంచాలి కొత్తగూడెం ఆస్పత్రిలో జ్వరానికి సంబంధించి కొన్ని మందులు లేకపోవడం వల్ల బయట షాపులకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. – మౌనిక, కొత్తగూడెం వైద్యులు సమయపాలన పాటించాలి ఆసుపత్రి వైద్యులు సమయపాలన పాటించాల్సిన అవసరం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. – లక్ష్మి, రుద్రంపూర్ ప్లేట్లెట్ కౌంట్ మిషిన్ పనిచేయడం లేదు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో డెంగీకి సంబంధించి ప్లేట్ లెట్స్ కౌంట్ మిషన్ పనిచేయడం లేదు. దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో బాగు చేయాల్సిన అవసరం ఉంది. – పుష్ప, వెంకటాపురం టీటీ ఇంజెక్షన్లు లేవు కాలికి గాయమై కల్వకుర్తి కమ్యూనిటీ ఆసుపత్రికి వెళితే అక్కడ టీటీ ఇంజెక్షన్ కూడా అందుబాటులో లేదు. ఆసుపత్రి సిబ్బంది చీటీ రాసి ఇచ్చి తెచ్చుకోమన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారే దుకాణానికి వెళ్లి తెచ్చిచ్చారు. చదువుకున్నవారి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక నిరక్షరాస్యులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం అవుతుంది. ఉన్నతాధికారులు ఆసుపత్రిలో మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా చూడాలి. –జ్యోతి ప్రసాద్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ -
సమర్థ నిర్వహణతో 11 లక్షల డోసులు ఆదా
మూడుచోట్ల వేగంగా చిన్నారుల ఆస్పత్రులు.. ► థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. చిన్నారుల కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలి. పోలీస్ బెటాలియన్లలో కోవిడ్ కేర్ ఎక్విప్‌మెంట్‌తోపాటు వైద్యులను నియమించాలి. కమ్యూనిటీ ఆస్పత్రులు స్థాయి వరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచాలి. సబ్ సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావాలి. తద్వారా పీహెచ్‌సీల వైద్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోగులకు అందుబాటులోకి వస్తారు. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమర్థ వ్యాక్సినేషన్ ద్వారా ఎక్కువ మందికి కోవిడ్ టీకాలు ఇవ్వగలిగామని, దాదాపు 11 లక్షల డోసులు ఆదా చేయగలిగినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని చెప్పారు. 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యాక ప్రాధాన్యతగా ఉపాధ్యాయులకు టీకాలివ్వాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు 35 లక్షల వ్యాక్సిన్ డోసులు కేటాయిస్తే 4,63,590 డోసులను మాత్రమే వినియోగించుకున్నందున మిగిలిపోయిన కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ అంక్షల్లో భాగంగా ఈ నెల 22వతేదీ నుంచి రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కోవిడ్, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్ధ నిర్వహణతో టీకాల ఆదా సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కువమందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్ డోసులు 1,80,82,390. ఇంకా వినియోగించాల్సిన (బ్యాలెన్స్) డోసులు 8,65,500. ఇప్పటివరకు ఇచ్చిన డోసులు సంఖ్య 1,82,49,851. వ్యాక్సిన్లు వృథా కాకుండా సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపు 11 లక్షల డోసులు ఆదా చేయగలిగాం. విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. గత మే నెల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్ డోసులు 35 లక్షలు కాగా కేవలం 4,63,590 డోసులు మాత్రమే వినియోగం జరిగింది. అందువల్ల ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరతాం. గర్భిణిలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించి చురుగ్గా టీకాల కార్యక్రమాన్ని చేపట్టాలి. మరో వారం రాత్రి కర్ఫ్యూ కోవిడ్ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు చేయాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లపై.. రాష్ట్రంలో 50 పడకలు దాటిన ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు విషయంలో పురోగతిని ముఖ్యమంత్రి పరిశీలించారు. కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు ఈమేరకు ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఇన్సెంటివ్ ఇస్తోందని సీఎం చెప్పారు. సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్పర్సన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం.టి.కృష్ణబాబు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఏ.బాబు, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఏ.మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ ఇలా... – సోమవారం నాటికి యాక్టివ్ కేసులు 24,708 – పాజిటివిటీ రేటు 2.83 శాతం – 3 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు జిల్లాలు 8 – 3 – 5 శాతం పాజిటివిటీ రేటు జిల్లాలు 5 – రికవరీ రేటు 98.05 శాతం – నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పడకల్లో చికిత్స 94.19 శాతం – ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పడకల్లో చికిత్స 76.07 శాతం – 13వ విడత ఫీవర్ సర్వే పూర్తి – 104 కాల్ సెంటర్‌కు వస్తున్న రోజువారీ కాల్స్ 1000 లోపు బ్లాక్ ఫంగస్ తగ్గుముఖం.. –గత వారం నమోదైన కేసులు 15 – మొత్తం కేసులు 4075 –చికిత్స పొందుతున్నవారు 863 వ్యాక్సినేషన్.. –మొత్తం వ్యాక్సినేషన్ పూర్తయినవారు 1,41,42,094 –సింగిల్ డోసు పూర్తయినవారు 1,00,34,337 –రెండు డోసులు పూర్తయినవారు 41,07,757 -
ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి పక్కా రియల్ ఎస్టేట్ సంస్థల్లా వ్యవహరిస్తున్నాయని ఆక్షేపించింది. నివాస ప్రాంతాల్లో 2–3 పడక గదుల ఫ్లాట్లలో నర్సింగ్ హోమ్‌లు కొనసాగుతున్నాయని, కనీస భద్రతా ప్రమణాలు సైతం పాటించడం లేదని, రోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని మండిపడింది. అలాంటి వాటిని మూసివేయాలని ఆదేశించింది. భద్రతా ప్రమాణాలు, నిబంధనలు పాటించని హాస్పిటళ్లకు వచ్చే ఏడాది జూలై వరకూ గడువు (డెడ్‌లైన్) పొడిగిస్తూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఆసుపత్రుల్లో పాటించాల్సిన జాగ్రత్తల విషయంలో గత ఏడాది డిసెంబర్ 18న తాము ఒక ఉత్తర్వు జారీ చేశామని, అయినప్పటికీ అగ్ని ప్రమాదాలు జరిగి, రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయని పేర్కొంది. ‘‘ఆసుపత్రుల్లో లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలి. ఈ విషయంలో గడువు పొడిగించడం సరైంది కాదు. రోగులను ఆరోగ్యవంతులుగా మార్చాల్సిన ఆసుపత్రులు కరెన్సీ ముద్రించే యంత్రాలుగా మారిపోయాయి’’అని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం పేర్కొంది. నివాస ప్రాంతాల్లో ఇరుకు ఇళ్లలో హాస్పిటళ్లను కొనసాగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లోపాలను సరిదిద్దుకోవడానికి ఆసుపత్రులకు మరో ఏడాది గడువిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఈ నోటిఫికేషన్ జారీ చేయడానికి గల కారణాలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. అత్యున్నత న్యాయస్థానం ఒక ఉత్తర్వు ఇచ్చిన తర్వాత దాన్ని ఉల్లంఘిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని నిలదీసింది. ఈ నోటిఫికేషన్‌ను బట్టి 2022 జూలై దాకా నిబంధనలు పాటించనక్కర్లేదని ఆసుపత్రులకు స్వేచ్ఛ ఇచ్చారని, అంటే అప్పటిదాకా జనం చచ్చిపోవాల్సిందేనా? అని ప్రశ్నించింది. గుజరాత్లో గత ఏడాది పలు కోవిడ్ ఆసుపత్రుల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ 2020 డిసెంబర్ 18న అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఫైర్ ఆడిట్ నిర్వహించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. -
ప్రైవేట్ కోటా కోవిడ్ టీకాలు మాకివ్వండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోతున్న కరోనా వ్యాక్సిన్ల స్టాక్‌ను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. జూలైలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారని.. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారని సీఎం తెలిపారు. జూన్‌లో కూడా ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమేనని సీఎం ప్రధాని దృష్టికి తెచ్చారు. కోవిడ్ నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతామని మోదీకి తెలిపారు. కోవిడ్ నివారణ చర్యలపై వివిధ రాప్ట్రాల ముఖ్యమంత్రులతో శుక్రవారం ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. కోవిడ్ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు. రాష్ట్ర విభజనవల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నాం. అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవు. రాష్ట్ర విభజనవల్ల హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు కూడా ఏపీలో లేవు. అయినా సరే.. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాం. అలాగే, రాష్ట్రంలో ఏర్పాటుచేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయి. ఇప్పటివరకూ 12 సార్లు ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే చేశాం. లక్షణాలున్న వారిని గుర్తించి టెస్టులు చేశాం. దీనివల్ల కోవిడ్ విస్తరణను అడ్డుకోగలిగాం. కోవిడ్‌కు సరైన పరిష్కారం వ్యాక్సినేషనే. దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. అవి.. ►రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. వీటిని ఎక్కడా కొంచెం కూడా వృధా చేయకుండా పకడ్బందీగా ఉపయోగించడంవల్ల మరింత ఎక్కువ మందికి వేయగలిగాం. అంటే.. 1,68,46,210 మందికి బదులు 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు వేయగలిగాం. వ్యాక్సినేషన్లో మంచి విధానాలు అవలంబించడంవల్లే ఇంత ఎక్కువ మందికి ఇది సాధ్యమైంది. ►ఇక జూలైలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారు. అదే నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో వారు ఇవ్వలేకపోతున్నారు. అలాగే, జూన్‌లో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమే. ►ఇలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన కోవిడ్ టీకా స్టాకును తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నాం. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి మరిన్ని టీకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి మరిన్ని టీకాలు వచ్చే అవకాశం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇందుకు మార్గంసుగమం చేసింది. రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసే కరోనా టీకాల్లో 75 శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, 25 శాతం ప్రైవేట్ ఆసుపత్రులకు అందజేస్తుంది. అయితే ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు చాలా తక్కువగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సిన్లు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల నిమిత్తం కేటాయించిన టీకా డోసులు మిగిలిపోతున్నాయి. ఈ విధంగా మిగిలిన టీకాలను, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొనుక్కోవచ్చని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుని, ఆయా రాష్ట్రాల్లో మిగిలిపోతున్న ప్రైవేట్ టీకా డోసులు కొనుగోలు చేసే ఆలోచనలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉంది. టీకాల కోసం ఎదురుచూపులు తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 1.20 కోట్లకు పైగా టీకాలను సరఫరా చేసింది. జూలై నెలకు మరో 28 లక్షలు కేటాయించింది. అయితే కరోనా నేపథ్యంలో చాలామంది అర్హు లు ఇంకా టీకాల కోసం ఎదురుచూస్తున్నారు. రోజుకు దాదాపు రెండు లక్షల డోసులు వేస్తున్నా కొరత వేధిస్తూనే ఉంది. కొన్ని టీకా కేంద్రాల్లో డోసులు అసలే దొరకడం లేదు. దీంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేం ద్రం.. జనాభా, కరోనా కేసుల ప్రాతిపదికన ఇస్తుండటంతో డిమాండ్ మేరకు రాష్ట్రానికి వ్యాక్సిన్లు సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఉపకరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నా రు. ఇతర రాష్ట్రాల నుంచి టీకాలు కొనడం వల్ల తక్కువ కాలంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయడానికి వీలుపడుతుందని చెబుతున్నారు. నెలకు అదనంగా మరో ఐదారు లక్షల టీకాలకు వీలు పడుతుందని పేర్కొంటున్నారు. టీకాల షెడ్యూల్‌కు కసరత్తు రాష్ట్రంలో ప్రస్తుతం వెయ్యికి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. అయితే ఒక్కోరోజు కొన్ని కేంద్రాల్లో టీకాల కార్యక్రమా న్ని అకస్మికంగా నిలిపివేస్తున్నారు. టీకాల కొరత, కొన్నిసార్లు ఇతర కేంద్రాలకు ఎక్కువగా పంపడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇలాం టి పరిస్థితిని నివారించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఏ నెలలో ఎన్ని టీకాలు రాష్ట్రాలకు పంపాలో ఇప్పటికే నిర్ణయించి షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ ప్రకారమే రాష్ట్రాలు కూడా ప్రణాళిక రచించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. జిల్లాలు మొదలు టీకా కేంద్రాల వారీగా షెడ్యూల్ ఖరారు చేసి సరఫరా చేయాలని ఆదేశించింది. ఇలా చేయడం వల్ల ఏ టీకా కేంద్రానికి, ఏ రోజు, ఎన్ని డోసులు సరఫరా అవుతాయో స్పష్టత ఉంటుంది. దీనివల్ల లబ్ధిదారులకు కూడా ఎలాంటి ఇబ్బందీ కలగదు. కేంద్రం ఆదేశాల మేరకు షెడ్యూల్ ఖరారుకు కసరత్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 15 నుంచి దేశంలో మోడెర్నా టీకా ప్రపంచంలో పేరుపొందిన టీకాల్లో ఒకటైన మోడెర్నా ఈ నెల 15వ తేదీ నుంచి దేశంలో అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రంలో ఈ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. మోడెర్నా టీకాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోనూ అందుబాటులోకి తెస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేస్తామని అధికారులు చెబుతున్నారు. -
ఇక సాధారణ చికిత్సలు షురూ
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు తగ్గడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు ప్రారంభిస్తున్నాయి. సెకండ్ వేవ్‌లో గణనీయంగా కేసులు పెరగడంతో చాలావరకు ఆసుపత్రులు కోవిడ్ చికిత్సకే పరిమితమైన సంగతి తెలిసిందే. అత్యవసర చికిత్సలు మినహా సాధారణ వైద్య సేవలు నిలిచిపోయాయి. అత్యవసరం కాని శస్త్ర చికిత్సలను సైతం ఆస్పత్రులు వాయిదా వేస్తూ వచ్చాయి. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, కొత్తగా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైనవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు కూడా బాగా తగ్గడంతో.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ చికిత్సల పునరుద్ధరణకు అనుమతి ఇస్తూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. చిన్నచిన్న ప్రైవేట్ ఆసుపత్రులు కొన్ని కోవిడ్ చికిత్సను పూర్తిగా నిలిపివేసి సాధారణ కేసులను అడ్మిట్ చేసుకుంటున్నాయి. కరోనా చికిత్స అందిస్తున్నారంటే సాధారణ రోగులు రావడానికి వెనుకాడతారనే ఉద్దేశంతో చాలా ఆసుపత్రులు కోవిడ్ చికిత్సను విరమించుకున్నాయి. కరోనా పడకల్లో 91.11 శాతం ఖాళీ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 55,442 పడకలను కరోనా సేవల కోసం కేటాయించారు. వాటిల్లో ప్రస్తుతం 4,931 మంది కరోనా రోగులు మాత్రమే ఉన్నారు. అంటే 91.11% పడకలు ఖాళీగా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా సాధారణ ఐసొలేషన్ పడకలు 96.02 శాతం ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకు వెయ్యి లోపుగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని పడకలను ఇప్పుడు సాధారణ చికిత్సలకు కేటాయించడం ప్రారంభించారు. తమ ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు ప్రారంభించినట్లు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రచారం కూడా చేస్తున్నాయి. ఇలా కోవిడేతర రోగులు ఆసుపత్రులకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అదనపు చెల్లింపులకు కోత కరోనా కేసులు బాగా పెరిగిన సమయంలో డాక్టర్లు, నర్సులకు వేతనాలు పెంచడంతో పాటు ఇతర అలవెన్సులు ఇచ్చిన ప్రైవేట్ యాజమాన్యాలు ఇప్పుడు వాటిని గణనీయంగా తగ్గించాయి. ప్రస్తుతం కరోనా చికిత్సలో పాల్గొనే వారికి మినహా మిగిలినవారి అదనపు వేతనాల్లో కోత విధించాయి. నర్సులు, పారామెడికల్ సిబ్బందిని ప్రత్యేకంగా ఎక్కువ జీతాలతో తీసుకున్న కొన్ని యాజమాన్యాలు ప్రస్తుతం వారిని విధుల నుంచి తొలగించాయి. ‘కేరళ సహా ఇతర రాష్ట్రాల నుంచి కొందరు నర్సులను ప్రత్యేకంగా తీసుకొచ్చాం. వారిలో కొందరికి నెలకు రూ. 50 వేల వరకు ఇచ్చాం. ఇప్పుడు వారితో అవసరం లేదు. కాబట్టి వారిని పంపించాం. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెప్పాం’ అని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రులకు పోస్ట్ కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు ఆయన వివరించారు. కరోనా వైద్యం అందించే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకల తాజా పరిస్థితి 1. మొత్తం కరోనా పడకలు – 55,442 కరోనా రోగులతో ఉన్నవి – 4,931 ఖాళీగా ఉన్నవి – 50,511 2. ఇందులో సాధారణ పడకలు – 21,846 కరోనా రోగులు ఉన్నవి – 871 ఖాళీగా ఉన్నవి – 20,975 3. ఆక్సిజన్ పడకలు – 21,751 కరోనా రోగులు ఉన్నవి – 2,266 ఖాళీగా ఉన్నవి – 19,485 4. ఐసీయూ పడకలు – 11,845 కరోనా రోగులు ఉన్నవి – 1,794 ఖాళీగా ఉన్నవి – 10,051 -
సీహెచ్సీల్లోనూ కోవిడ్ చికిత్స!
సాక్షి, అమరావతి: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి ఆస్పత్రులకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులకే కోవిడ్ చికిత్సలు పరిమితమయ్యాయి. మూడో వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇకపై సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కోవిడ్ చికిత్సలు అందించేలా వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 30 నుంచి 50 పడకల వరకూ ఉంటాయి. వీటిల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యుల బృందం ఉంటుంది. 18ఏళ్ల లోపు పిల్లలకు కోవిడ్ సోకినా ఇబ్బందులు తలెత్తకుండా సీహెచ్సీల్లోనూ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల బాధితులకు సత్వరమే సమీపంలోనే సేవలు అందనున్నాయి. 24 గంటలూ కరెంటు ఉండేలా చర్యలు చేపట్టారు. వెంటనే ఆస్పత్రికి చేరుకునేలా.. సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు కలిపి 50కిపైగా ఆస్పత్రులను కోవిడ్ చికిత్సకు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇవికాకుండా 10 ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఇంతకుముందు వీటిల్లో కోవిడ్ సేవలు అందించలేదు. కొత్తగా కోవిడ్ చికిత్స కోసం వీటిని సిద్ధం చేస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు సాధారణంగా నియోజకవర్గ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా తక్షణమే ఆస్పత్రికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆస్పత్రుల్లో కొత్తగా ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, వార్డుల పునరుద్ధరణ చేపట్టారు. కోవిడ్‌కు అవసరమైన మౌలిక వసతులను అన్నిటినీ ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థంగా చికిత్స అందించేలా వసతులు కల్పిస్తున్నారు. పీడియాట్రిక్ వైద్యులు లేని చోట్ల తక్షణమే నాన్‌కోవిడ్ ఆస్పత్రులకు చెందిన పిల్లల వైద్యులను నియమిస్తారు. ఏ జిల్లాలో ఎక్కడ..? ► అనంతపురం: అనంతపురం సీడీహెచ్, గుత్తి, కల్యాణదుర్గం, మడకశిర, పెనుగొండ,ఉరవకొండ సీహెచ్‌సీలు ► తూర్పు గోదావరి: రంపచోడవరం, తుని (ఏరియా ఆస్పత్రి), అడ్డతీగల, చింతూరు, గోకవరం, పి.గన్నవరం, పెద్దాపురం, పత్తిపాడు, రాజోలు, ఏలేశ్వరం సీహెచ్‌సీలు ► గుంటూరు: చిలకలూరిపేట, సత్తెనపల్లి (ఏరియా ఆస్పత్రులు), ఫీవర్ ఆస్పత్రి ► ప్రకాశం: గిద్దలూరు,యర్రగొండపాలెం (ఏరియా ఆస్పత్రులు), డోర్నాల, కంభం సీహెచ్‌సీలు, ఎంసీహెచ్ ఒంగోలు ► చిత్తూరు: మహల్, పుత్తూరు, సత్యవేడు, వాయల్పాడు సీహెచ్‌సీలతో పాటు తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రి ► పశ్చిమ గోదావరి: భీమవరం,చింతలపూడి, నరసాపురం,పాలకొల్లు (ఏరియా ఆస్పత్రులు), కొవ్వూరు, నిడదవోలు సీహెచ్‌సీలు ► కృష్ణా: జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ (విజయవాడ), సీహెచ్‌సీ మైలవరం ► శ్రీకాకుళం: నరసన్నపేట, సీతంపేట ఏరియా ఆస్పత్రులు ► కడప: జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి (ఏరియా ఆస్పత్రులు), బద్వేల్, పోరుమామిళ్ల, వేంపల్లి, మైలవరం సీహెచ్‌సీలు ► కర్నూలు: బనగానపల్లి, ఆదోని, ఎమ్మిగనూరు సీహెచ్‌సీలు ► విశాఖపట్నం: అగనంపూడి (ఏరియా ఆస్పత్రి),చింతపల్లి, కోటపాడు, నక్కపల్లి, యలమంచిలి సీహెచ్‌సీలు -
ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్లు రాష్ట్రాలకు ఇవ్వండి
సాక్షి, అమరావతి: ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించుకోలేని కోవిడ్ వ్యాక్సిన్ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని కోరారు. భారీ స్థాయిలో వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం ప్రైవేట్ ఆస్పత్రులకు లేనందున వాటిని రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించి టీకాల కార్యక్రమం వేగవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. తగినన్ని వ్యాక్సిన్లు కేటాయిస్తే రికార్డు స్థాయిలో టీకాలిచ్చే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉందని ఇప్పటికే నిరూపించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ మంగళవారం లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇవీ... సరైన నిర్ణయం.. కరోనాపై పోరులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. దేశంలో అర్హులైన వారందరికీ జూన్ 21 నుంచి అమలు చేస్తున్న టీకాల కార్యక్రమానికి తగినన్ని వ్యాక్సిన్లు కొనుగోలు చేసి సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం సరైన విధాన నిర్ణయం తీసుకుంది. సర్వత్రా అభినందనలు అందుకుంటున్న ఈ నిర్ణయంతో వ్యాక్సినేషన్ సజావుగా సాగుతుంది. ఏపీలో విస్తృత వ్యవస్థ.. భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం మా రాష్ట్రానికి ఉందని ఇప్పటికే నిరూపించాం. జూన్ 20న ఒక్కరోజే 13,72,481 మందికి వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా మా వ్యవస్థాగత సామర్థ్యాన్ని చాటిచెప్పాం. ఏప్రిల్ 14న 6,32,7890 మందికి, మే 27న 5,79,161 మందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వలంటీర్లు, 40 వేల మంది ఆశా వర్కర్లు, 19 వేలకుపైగా ఏఎన్ఎంలు ఉండటంతోపాటు భారీ సంఖ్యలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇంతటి విస్తృతమైన వ్యవస్థ సహకారం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు భారీ పరిమాణంలో వ్యాక్సిన్లు సరఫరా చేస్తే ఇదే రీతిలో టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించగలం. రాష్ట్రాలకు ఇస్తే వేగవంతం... మే 1 నుంచి అమలు చేసిన సరళీకృత జాతీయ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విధానం ప్రకారం దేశంలో ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేట్, పారిశ్రామిక సంస్థలకు టీకాలు సరఫరా చేశారు. ప్రైవేట్ సంస్థలకు 25 శాతం వ్యాక్సిన్లు సరఫరా చేసే విధానాన్ని జూన్ 21 నుంచి అమలు చేస్తున్న జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా పొందుపరిచారు. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటివరకు 2,67,075 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేయగలిగారు. అయినప్పటికీ మా రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు జూలై కోసం 17,71,580 డోసుల వ్యాక్సిన్లు కేటాయించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో వ్యాక్సిన్లకు ఉన్న డిమాండ్‌గానీ ఆ ఆసుపత్రుల గత అనుభవాన్నిగానీ పరిశీలిస్తే అంత భారీ పరిమాణంలో వ్యాక్సిన్లను సద్వినియోగం చేసుకోలేవన్నది స్పష్టమవుతోంది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి జూన్ 24న నిర్వహించిన సమావేశంలో కూడా పలు రాష్ట్రాలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అందువల్ల ప్రైవేటు ఆసుపత్రులు వినియోగించుకోలేని వ్యాక్సిన్ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ద్వారా టీకాలు వేసేందుకు అనుమతించాలని కోరుతున్నా. దీనివల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవడమే కాకుండా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు దోహదపడుతుంది. అటువంటి నిర్ణయానికి విస్తృత ప్రజామోదం లభించడంతోపాటు మీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం
సాక్షి, అనంతపురం: ప్రైవేట్ ఆస్పత్రులో దోపిడీపై జాయింట్ కలెక్టర్ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు. హర్షిత ఆస్పత్రికి రూ.20 లక్షలు, చంద్ర ఆస్పత్రికి రూ.9 లక్షలు జరిమానా విధించారు. 14 ఆస్పత్రులకు రూ.39 లక్షలు జరిమానా విధించారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వం ఆదేశాలు పాటించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. పదేపదే అధిక ఫీజులు వసూలు చేసినట్లు తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జేసీ హెచ్చరించారు. చదవండి: ఏపీ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ ట్విన్ బ్రదర్స్... ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు -
ప్రైవేటు ఆస్పత్రుల ఫీజులు ఖరారు: ఐసీయూకు రూ.7,500
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సలకు రాష్ట్ర ప్రభు త్వం ఫీజులు ఖరారు చేసింది. గతేడాది జూన్‌లో జారీ చేసిన ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేస్తూ వైద, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం తాజా ఉత్తర్వులు జారీ చేశారు. చికిత్స సందర్భంగా నిర్వహించే కీలకమైన పరీక్షలు, పీపీఈ కిట్లు, అంబులెన్స్ తదితర వాటికి సంబంధించి ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. సాధారణ ఐసోలేషన్ వార్డులో చికిత్సకు రోజుకు రూ.4 వేలు, ఐసీయూలో రోజుకు రూ.7,500, ఐసీయూలో వెంటిలేటర్‌తో కలుపు కొని రోజుకు రూ.9 వేలు ఫీజుగా తీసుకోవాలి. అయితే ఇందులో కొన్ని పరీక్షలు కూడా కలిపి ఉంటాయి. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రొటీన్ యూరిన్ పరీక్ష, హెచ్ఐవీ, హెపటైటిస్ సీ. హెపటైటిస్ బీ, సిరమ్ క్రియేటినైన్, అల్ట్రాసౌండ్, 2డీ ఎకో, ఎక్స్ రే, ఈసీజీ పరీక్షలు ఫీజులో కలిసి ఉంటాయి. అలాగే ఆ సందర్భంగా అవసరమైన మందులు, డాక్టర్ కన్సల్టేషన్, బెడ్, భోజనం ఖర్చులు కూడా కలిసే ఉంటాయి. మూత్రనాళంలో గొట్టం ఏర్పాటు చేయడం వంటివి కూడా ఉంటాయి. ఖరీదైన మందులు ఎమ్మార్పీపైనే.. ఇక బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్లు, సెంట్రల్ లైన్, కీమోపార్ట్ ఇన్సెర్షన్, బయాప్సీ, పొట్టలో నుంచి ద్రవాన్ని తీయడం తదితరమైన వాటికి అదనంగా వసూలు చేసుకోవచ్చు. అయితే వీటికి 2019 డిసెంబర్ 31 నాటికి ఎంత ధర నిర్ధారించారో అంతే వసూలు చేయాలి. అలాగే ఇమ్యూనో గ్లోబిన్స్, మెరో పెనిమ్, పేరెంటల్ న్యూట్రిషన్, టొసిలిజుమాబ్ వంటి అధిక ధరలున్న మందులు రోగికి ఇవ్వాల్సి వస్తే అప్పుడు.. వాటికి ఎంఆర్పీ ప్రకారం వసూలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఆరోగ్య బీమాతో చేయించుకునే చికి త్సకు వర్తించవు. ఉదాహరణకు ఎవరైనా ఆరోగ్య బీమాతో ఆసుపత్రిలో చేరితే ఈ ఫీజులు వర్తించవు. ఆసుపత్రులు వారి పద్దతిలో ఆరోగ్య బీమా సంస్థల నుంచి వసూలు చేసుకోవచ్చని వైద్య వర్గాలు తెలిపాయి. సొంతంగా డబ్బులు చెల్లించి కరోనా వైద్యం చేయించుకునే వారికి మాత్రమే సర్కారు నిర్ధారించిన ఫీజులు వర్తిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తాజాగా పీపీఈ కిట్ ధర, అంబులెన్స్‌కు వసూలు చేయాల్సిన సొమ్ముపై స్పష్టత ఇచ్చారు. ఒక్కో పీపీఈ కిట్‌కు గరిష్టంగా రూ.273 మాత్రమే వసూలు చేయాలి. దూర ప్రాంతాలకు సాధారణ అంబులెన్సులో వెళ్లాల్సి వస్తే కిలోమీటరుకు గరిష్టంగా రూ.75 చొప్పున వసూలు చేయాలి. ఆక్సిజన్, ఇతర సౌకర్యాలతో కూడిన అంబులెన్సులోనైతే కిలోమీటరుకు రూ.125 చొప్పున వసూలు చేయాలి. మామూలుగా సాధారణ అంబులెన్సుకు గరిష్టంగా రూ. 2 వేలు మాత్రమే తీసుకోవాలి. ఇతర వసతులున్న అంబులెన్సులో అయితే రూ. 3 వేలు మాత్రమే వసూలు చేయాలి. ప్రభుత్వం నిర్దేశించిన ఈ ధరలను కచ్చితంగా అమలు చేయాలనీ, అధిక ధరలు వసూలు చేసినట్లుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. అనసరంగా సీటీ స్కాన్లు, టెస్టులు చేయవద్దని ఆదేశించింది. ఇదిలావుంటే ఈ ఫీజులు, ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావని కొన్ని కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొన్ని నిర్ధారణ పరీక్షల ధరలు ఇలా ఉన్నాయి... టెస్ట్ ధర (రూ.లలో) హెచ్ఆర్సీటీ 1,995 ఐఎల్–6 1,300 డిజిటల్ ఎక్స్‌రే 300 డీ డైమర్ 800 సీఆర్పీ 500 ప్రొకాల్సిటోనిన్ 1,400 ఫెర్రిటిన్ 400 ఎల్డీహెచ్ 140 పదింతల జరిమానా విధించండి: హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన వాటికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆస్పత్రులకు ఇతర రాష్ట్రాల తరహాలో పదింతలు జరిమానా విధించే అంశాన్ని పరిశీలించాలని హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జీవోకు విరుద్ధంగా ఆస్పత్రులు వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మాత్రమే పేర్కొనడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు, ల్యాబ్ పరీక్షల ఫీజులకు సంబంధించి ప్రభుత్వ జీవోపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. ప్రతి ఆస్పత్రిలో రిసెప్షన్, అకౌంట్స్ విభాగాలున్న ప్రదేశాల్లో బాగా కనిపించేలా జీవో అతికించాలని స్పష్టం చేసింది. కాగా, అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రుల నుంచి రోగులకు డబ్బు రిఫండ్ చేసేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల పై అధికారుల కొరడా
-
వ్యాక్సిన్ ధరలు కేంద్రం ఖరారు: ఎంతంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సోకకుండా వేసుకునే వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రైవేటులో వేసుకోవాలనుకునే వారు వేసుకోవచ్చని చెప్పారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధర విషయమై కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది. నిర్ధిష్ట ధర విధిస్తూ ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరలు ఇలా.. కోవిషీల్డ్ రూ.780 కోవాగ్జిన్ రూ.1,410 స్పుత్నిక్ రూ.1,145 5 శాతం జీఎస్టీ, రూ.150 సర్వీస్ ఛార్జీ అదనం నిర్దేశించిన ధరల కన్నా అదనంగా డబ్బులు వసూలు చేస్తే ఆస్పత్రులపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. అధిక ధరలు వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించింది. వ్యాక్సిన్‌పై పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధానమంత్రి సోమవారం ప్రసంగంలో స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రక్రియ చర్యలు చేపట్టింది. ఇప్పటికే వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు ఆర్డర్లు కూడా ఇచ్చేసింది. త్వరలోనే ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉచితంగా అందించనుంది. -
టీకా వివాదం.. వెనక్కి తగ్గిన అమరీందర్ సర్కార్
చండీగఢ్: ఓ వైపు జనాలు కోవిడ్ టీకాల కొరతతో ఇబ్బంది పడుతుంటే.. మరో వైపు ప్రభుత్వాలు ప్రైవేట్ ఆస్పత్రులకు టీకాలను కేటాయిస్తూ.. జనాలకు అన్యాయం చేస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో ఇదే ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీకాల దందాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పంజాబ్ సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్ కు టీకాల సరఫరా నిలిపివేసింది. ప్రభుత్వం టీకాలు మళ్లించి కోట్లు దండుకుంటున్నట్టు విపక్ష అకాలీదళ్ ఆరోపణలో నేపథ్యంలో అమరీందర్ సింగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 18-44 సంవత్సరాల వయసువారికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ప్రైవేటు హాస్పిటల్స్ ద్వారా సమకూర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై విపక్ష అకాలీదళ్ మండిపడింది. భారీ లాభాలకు కోవాగ్జిన్ టీకాలను మళ్లించిందని ఆరోపించింది. 400 రూపాయలకు వచ్చే టీకాను సర్కారు ప్రైవేటు హాస్పిటల్స్‌కు 1060 రూపాయలకుకి అమ్ముతున్నదని, ఆస్పత్రులు దానిని ప్రజలకు 1560 రూపాయలకు అమ్ముతున్నాయని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ట్విట్టర్లో ఆరోపించారు. ప్రజల్లో కూడా టీకాల వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో సర్కారు తన ఉత్తర్వులను శుక్రవారం సాయంత్రానికి ఉపసంహరించుకున్నది. ఈ వ్యవహారాన్ని గమనించిన కేంద్ర సర్కారు మొత్తం టీకాల లెక్క తెలియజేయమని పంజాబ్‌లోని అమరీందర్ సర్కారును ఆదేశించింది. చదవండి: షాకింగ్‌గా ఉంది.. ఇలా జరగాల్సింది కాదు! -
కరోనా: రాష్ట్రంలో మరో ఆరు ఆసుపత్రులపై వేటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝులిపించింది. తాజాగా మంగళవారం తెలంగాణలో కొత్తగా మరో ఆరు ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం కోవిడ్ చికిత్స అనుమతులు రద్దు చేసిన వాటిలో సికింద్రాబాద్ కిమ్స్, గచ్చిబౌలిలోని సన్‌షైన్ ఆసుపత్రి, బంజారాహిల్స్‌లోని సెంచరీ, లక్డీకపూల్‌లోని లోటస్ ఆసుపత్రి, ఎల్బీనగర్లోని మెడిసిస్, టోలీచౌకిలోని ఇంటిగ్రో ఆస్పత్రులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 22 ఆసుపత్రుల్లో కోవిడ్ ట్రీట్‌మెంటఖ రద్దు చేయగా.. ఇప్పటివరకు 113 ఆసుపత్రులకు వైద్యారోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మరో 6 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స రద్దు
సాక్షి, హైదరాబాద్: కొవిడ్ చికిత్సకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 105 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో 16 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. వీటిలో 6 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు ప్రముఖ ఆస్పత్రులు ఉన్నాయి. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని పద్మజా హాస్పిటల్, ఉప్పల్‌లోని టీఎక్స్ ఆస్పత్రి, అల్వాల్‌లోని లైఫ్‌లైన్ ఆస్పత్రి, వరంగల్‌లోని మ్యాక్స్‌క్యూర్, లలిత ఆస్పత్రులు, సంగారెడ్డిలోని సాయిశ్రీరామ్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సను రద్దు చేశారు. -
విశాఖలోని ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల పై ప్రభుత్వం దృష్టి
-
ప్రైవేట్ ఆసుపత్రులు: రెండోసారి తప్పు చేస్తే క్రిమిన్ కేసులు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో టాస్క్‌ఫోర్స్ విస్తృత తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని 35 ఆస్పత్రులకు రూ.2.86 కోట్ల జరిమానా విధించారు. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 55 ఆస్పత్రులకు రూ.3.61 కోట్ల జరిమానా విధించారు. రెండోసారి కూడా తప్పు చేస్తే క్రిమిన్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. ఏ ఆసుపత్రిలోనైనా 50 శాతం బెడ్లు ప్రభుత్వం నిర్ధేశించిన కేటగిరీలో భర్తీ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియ కోసం 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి సమాచారాన్ని అందివ్వాలన్నారు. నోడల్ అధికారులు, ఆసుపత్రి పర్యవేక్షుకులదే పూర్తి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. చదవండి: జొన్నగిరిలో మరో రెండు వజ్రాలు లభ్యం ఖాకీ దందా: చిన్నసారు.. పంచాయితీ! -
అధిక ఫీజుల వసూల్‌పై ఏపీ సర్కార్ సీరియస్
-
పది రెట్లు పెనాల్టీ.. క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: మానవత్వం మరచి కోవిడ్ రోగుల వద్ద అధిక ఫీజులు దండుకునే ప్రైవేటు ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. తీరు మార్చుకోని ప్రైవేటు ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ చికిత్సలకు, పరీక్షలకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులనే వసూలు చేయాలన్న ఆదేశాలను ఉల్లంఘిస్తూ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాంటి ఆస్పత్రులకు ఇప్పటివరకు నోటీసులు జారీ చేసి, జరిమానాలను విధిస్తూ వస్తున్నారు. అయితే, తీరు మార్చుకోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులతో దోపిడీని కొనసాగిస్తున్నాయి. ఈ విషయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి రావడంతో అలాంటి ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సింఘాల్ శుక్రవారం కీలక ఉత్తర్వులిచ్చారు. వీటి ప్రకారం.. తొలి సారి నిబంధనలను ఉల్లంఘించి, ప్రభుత్వం నిర్ధారించిన దానికన్నా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే అలాంటి ఆస్పత్రులకు పది రెట్లు పెనాల్టీ విధిస్తారు. రెండో సారి కూడా అధిక ఫీజుల వసూలుకు పాల్పడితే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, ప్రాసిక్యూట్ చేస్తారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులలో ‘ఆక్సిజన్’ ఇలా ఉండాలి.. రాష్ట్రంలోనిప్రైవేటు ఆస్పత్రులలో బెడ్ల సంఖ్య ఆధారంగా ఉండాల్సిన ఆక్సిజన్ పరికరాలకు సంబంధించి గత చట్టాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఉత్తర్వుల ప్రకారం ఇక నుంచి రాష్ట్రంలో 50 పడకలు దాటిన ఆస్పత్రులలో ఎన్ని పడకలు ఉన్నాయో అన్ని ఆక్సిజన్ సిలిండర్లను కలిగి ఉండాలి. 50 లోపు పడకలున్న ఆస్పత్రులు 40 ఆక్సిజన్ సిలిండర్లను కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఆస్పత్రిలో పడకల సంఖ్యకు సమానంగా రెగ్యులేటర్‌తో కూడిన ఆక్సిజన్ మాస్క్‌లు ఉండాలి. 100కు పైగా పడకలున్న ఆస్పత్రి 1,000 ఎల్పీఎం పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్, 50 నుంచి 100 పడకలలోపు ఆస్పత్రి 500 ఎల్పీఎం పీఎస్ఏ ప్లాంట్‌ను కలిగి ఉండాలి. ప్రతి ఆస్పత్రిలో పడకల సంఖ్యకు సమానంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను కలిగి ఉండాలని అనిల్‌కుమార్ సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కోవిడ్ చికిత్సల నుంచి.. 5 ఆస్పత్రులు ఔట్
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సలో నిర్లక్ష్యం, అడ్డగోలుగా చార్జీలు వసూలుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది. ఆయా ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సల అనుమతిని రద్దు చేసింది. కొత్తగా కోవిడ్ రోగులను చేర్చుకోవద్దని, ఇప్పటికే చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించకున్నా, నిర్లక్ష్యంగా వ్యవహరిం చినా ఆస్పత్రుల లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజా రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఆదేశాలిచ్చింది. వరుస ఫిర్యాదులతో.. కరోనా చికిత్సలో నిర్లక్ష్యం, భారీ వసూళ్లపై ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇందులో 66 ఆస్పత్రులపై ఆధారాలతో సహా అందిన 88 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. వాటిని పరిశీలించి, ఆయా ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల తీవ్రత, నోటీసుల పట్ల యాజమాన్యాల స్పందన ఆధారంగా చర్యలు చేపట్టారు. ఐదు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేశారు. ఈ జాబితాలో బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్, సనత్‌నగర్‌లోని నీలిమ హాస్పిటల్, కూకట్‌పల్లిలోని మాక్స్ హెల్త్ హాస్పిటల్, కాచిగూడలోని టీఎక్స్ హాస్పిటల్, బేగంపేట్‌లోని వీఐఎన్‌ఎన్ ఆస్పత్రి ఉన్నాయి. ఇకపై కొత్తగా కోవిడ్ రోగులను చేర్చుకోవద్దని, ఇప్పటికే చికిత్స పొందుతున్నవారికి నిబంధనల ప్రకారం చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పలు ఫిర్యాదులకు సంబంధించి మరికొన్ని ఆస్పత్రులకు కూడా అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయా ఆస్పత్రుల నుంచి వివరణ తీసుకుని పరిశీలిస్తున్నారు. సర్వీసులో నిర్లక్ష్యంతో రోగులకు చికిత్స చేయడంలో బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం చేశారంటూ నల్గొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు ఆస్పత్రికి షోకాజ్ నోటీసు ఇచ్చి, 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఆస్పత్రి యాజమాన్యం వివరణ ఇవ్వకపోవడంతో చర్యలు చేపట్టారు. అధిక వసూళ్లతో.. కరోనా బాధితుల నుంచి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ... బేగంపేటలోని వీఐఎన్‌ఎన్ హాస్పిటల్‌పై మోహసీన్ ఉస్మానీ, గౌరమ్మ, కె.సుభాష్, రామచంద్ర, సంధ్య తదితరులు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. కాచిగూడలోని టీఎక్స్ హాస్పిటల్‌పై దయాకర్, సయ్యద్ గౌసియా బేగం.. సనత్‌నగర్‌లోని నీలిమ హాస్పిటల్‌పై షేక్ గులామ్ ముస్తఫా... కూకట్‌పల్లిలోని మాక్స్ హెల్త్ హాస్పిటల్స్‌పై బాధితురాలు శశికళ వైద్యశాఖకు ఫిర్యాదులు చేశారు. వీటిపై స్పందించిన అధికారులు ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో.. కోవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేసింది. -
విరించి ఆస్పత్రిలో కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ హెల్త్ సెక్రటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మీటింగ్ ముగిసిన గంటల వ్యవధిలోనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేశారు. గతంలో కూడా విరించి ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నప్పటికి.. తీరు మార్చుకోకపోవడం గమనార్హం. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితుల నుంచి వందల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 64 ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. హైదర్‌గూడ అపోలో, కిమ్స్, సోమాజీగూడ యశోద,విరించి ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులకు, మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్పల్లి ఓమ్ని ,హైదరాబాద్ నర్సింగ్ హోమ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అధికారుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో శుక్రవారం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు హెల్త్ సెక్రటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. కరోనా చికిత్సకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితుల నుంచి వందల ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే 64 ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. హైదర్‌గూడ అపోలో, కిమ్స్, సోమాజీగూడ యశోద,విరించి ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులకు, మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్పల్లి ఓమ్ని ,హైదరాబాద్ నర్సింగ్ హోమ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. చదవండి: ఆనందయ్య మందు నేనూ ఇస్తా.. యువకుడి పోస్ట్ -
ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో అధికారుల సమావేశం
-
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
-
ఆరోగ్యశ్రీలో ఉచితం.. మిగిలిన వారికి ప్రభుత్వ ధరలే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో వైద్యం అందించాల్సిన పేషెంట్ల నుంచి డబ్బు వసూలు చేస్తే ఆయా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ హెచ్చరించారు. ఇటీవలే వివిధ వైద్య వర్గాలు, ఆస్పత్రుల యాజమాన్యాలను సంప్రదించి చికిత్సకు రేట్లు పెంచామని, వీటిని కూడా కాదని పేషెంట్ల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు డబ్బు వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీనిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పలు ఆస్పత్రులకు జరిమానా విధించామన్నారు. రోజూ నోడల్ అధికారులు ప్రైవేటు ఆస్పత్రులను పర్యవేక్షిస్తారని తెలిపారు. పలువురు నిపుణులు, వైద్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత చిన్నపిల్లల్లో కేసులు వస్తే ఎలాంటి వసతులు కల్పించాలన్న దానిపై కమిటీ వేశామన్నారు. వెంటిలేటర్లు, ప్రత్యేక వార్డులు, మరికొన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని, దీన్నిబట్టి అన్ని ఆస్పత్రుల్లో ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో లాక్డౌన్ సరిగా అమలు కానందునే పల్లెల్లో కేసులు పెరుగుతున్నాయని రాయడం అవగాహన రాహిత్యమన్నారు. పట్టణాల్లో 1.46 కోట్ల జనాభా, పల్లెల్లో 3.49 కోట్ల జనాభా ఉందని చెప్పారు. తాజాగా వచ్చిన కేసులను బట్టి చూస్తే లక్ష జనాభాకు పల్లెల్లో 248, పట్టణాల్లో 383 కేసులు వచ్చాయన్నారు. మే 16 నుంచి 22 వరకు వారం రోజుల గణాంకాల్లో ఈ మేరకు తేలిందన్నారు. ఆ వారంలో 1,42,707 కేసులు నమోదయ్యాయని, వాటిలో పట్టణాల్లో 56,058, గ్రామాల్లో 86,649 కేసులు ఉన్నాయని వివరించారు. కేసుల్ని జనాభా ప్రాతిపదికన లెక్కించాలని, అది అవగాహన లేక కొన్ని పత్రికల్లో పల్లెల్లో ఎక్కువగా కేసులు వస్తున్నట్టు రాశారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎక్కువమంది నియామకం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వైద్యశాఖలో 1,448 మందిని ఎక్కువగా నియమించినట్లు చెప్పారు. గత ఏడాది 17,315 మందిని నియమించగా, ఈ ఏడాది 18,763 మందిని నియమించినట్టు తెలిపారు. ఇందులో మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు అందరూ ఉన్నారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 23.81 లక్షల మందికి రెండు డోసులు, 36.49 లక్షల మందికి ఒక డోసు టీకా వేసినట్లు చెప్పారు. 1.41 లక్షల కోవాగ్జిన్, 13.88 లక్షల కోవిషీల్డ్ స్టాకు ఉందన్నారు. కోవాగ్జిన్ సెకండ్ డోసు వారికి, కోవిషీల్డ్ మొదటి డోసు వారికి వాడతామన్నారు. సోమవారం నాటికి ఆనందయ్య మందుపై స్పష్టత ఆనందయ్య మందు నమూనాలు హైదరాబాద్ ల్యాబొరేటరీకి, సెంట్రల్ ఆయుర్వేదిక్ ల్యాబొరేటరీకి వెళ్లాయని చెప్పారు. సోమవారం నాటికి దీనిపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ మందుల్లో వాడిన దినుసుల మిక్సింగ్ ఎలా ఉంది, మందు వాడితే నష్టం ఉందా, ఫలితాలు ఏమేరకు కనిపించాయి అన్నదానిపై మందు వాడిన వారినుంచి సమాచారం కూడా సేకరిస్తున్నారని, దీనిపై స్పష్టత రాగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. ఒకేరోజు రికార్డు స్థాయిలో 812 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రంలో సెకండ్‌వేవ్‌లో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఒకేరోజు 812 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తీసుకొచ్చామన్నారు. కేంద్రం మనకు 590 మెట్రిక్ టన్నులే కేటాయించినా అడ్‌హక్ ప్రాతిపదికన ఎక్కువ తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వారం రోజులుగా చూస్తే కేసులు తగ్గుతున్నాయని, ఐసీయూ, ఆక్సిజన్ పడకల లభ్యత చూస్తే ఇది అర్థమవుతుందని చెప్పారు. తాజాగా 3,552 ఆక్సిజన్ పడకలు, 812 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజురోజుకు అడ్మిషన్లు తగ్గుతున్నాయని, డిశ్చార్జిలు పెరుగుతున్నాయని తెలిపారు. చదవండి: కేంద్రం ఇవ్వట్లేదు.. మేమే కొంటున్నాం యాస్ బలహీనం: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు వర్షాలే -
‘ఈ ఆస్పత్రులను క్షమిస్తే భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లే’
సాక్షి, కృష్ణాజిల్లా: గుడివాడ మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రుల తీరుపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కొందరు చీడపురుగుల్లా మారి దోచుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. శవాల మీద డబ్బులు ఏరుకొనే సంస్కారహీనులను అధికారులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బలా దోచుకు తినే ఆస్పత్రులను అధికారులు ఫినిష్ చేయాలని ఆదేశించారు. ఇటువంటి ఆస్పత్రులను క్షమిస్తే, భవిష్యత్తు తరాలకు ద్రోహం చేసినట్లవుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మానవతా దృక్పథంతో ఆలోచించాలని పేర్కొన్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: మాయలేడి అరెస్టు -
రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తేకఠిన చర్యలు
-
ప్రైవేట్ ఆస్పత్రికి రూ.10 లక్షలు ఫైన్
విజయనగరం ఫోర్ట్: కోవిడ్ రోగుల నుంచి కాసుల దోపిడీకి పాల్పడే ప్రైవేటు ఆస్పత్రులకు విజయనగరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ కళ్లెం వేశారు. ఇక ముందు ఏ ఆస్పత్రి నిర్వాహకుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకుండా అధిక మొత్తంలో అపరాధ రుసుం విధించారు. విజయనగరం పట్టణంలోని కర్రల మార్కెట్ రోడ్డులో ఉన్న పీజీ స్టార్ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ వైద్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తోందంటూ జేసీతో పాటు ఆరోగ్యశ్రీ అధికారులకు ఇటీవల పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై జేసీ, జిల్లా ఆరోగ్యశ్రీ అదనపు సీఈవో మహేష్‌కుమార్‌లు విచారణ చేపట్టారు. విచారణలో అధికంగా ఫీజులు వసూలు చేసినట్టు నిర్ధారణ కావడంతో పీజీ స్టార్ ఆస్పత్రికి రూ.10 లక్షల అపరాధ రుసుం విధిస్తూ జేసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రూ.235.94 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేస్తున్న ఆస్పత్రులకు రూ.235.94 కోట్లు చెల్లించినట్టు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 719 నెట్వర్క్ ఆస్పత్రులకు ఏప్రిల్ 15 నాటికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు సమర్పించిన బిల్లులకుగాను 195.36 కోట్లు, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 584 నెట్వర్క్ ఆస్పత్రులకు మార్చి 15 నాటికి ఇచ్చిన బిల్లులకుగాను రూ.40.58 కోట్లు కలిపి మొత్తం రూ.235.94 కోట్లు చెల్లించామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసే ఆస్పత్రులకు ఎప్పటికప్పుడు నిధులు చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఆస్పత్రులకు నోటీసులు కోవిడ్ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో విజయవాడలోని నిమ్రా ఆస్పత్రి, ఆంధ్ర ఆస్పత్రులు కోవిడ్ బాధితులకు చికిత్స అందించడంలో సరిగా స్పందించడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. కోవిడ్ సమయంలో ఏ ప్రైవేటు ఆస్పత్రి అయినా పేద ప్రజలకు చికిత్సలు అందించాల్సిందేనని, ఆరోగ్యశ్రీ కింద 50 శాతం పడకలు ఇవ్వకపోయినా, చికిత్సలు చేయకపోయినా అలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
‘ప్రైవేట్’కు వ్యాక్సిన్‌పై పునరాలోచించండి
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణకు ప్రస్తుతం వ్యాక్సినేషనే శరణ్యమని, ఇలాంటి పరిస్థితిలో ప్రైవేట్ ఆస్పత్రుల వారు నేరుగా వ్యాక్సిన్ కోనుగోలు చేసుకోవడానికి కేంద్రం అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. దేశంలో వ్యాక్సిన్ సరఫరా తగినంత లేని ఈ సమయంలో ఈ నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజల భయాలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా దోపిడీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోవిడ్ నియంత్రణకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలుపుతూ.. వ్యాక్సిన్ సరఫరా విషయమై వాస్తవ పరిస్థితి వివరిస్తూ పలు సూచనలు చేశారు. ప్రధానంగా వ్యాక్సిన్ సరఫరాను కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే పరిమితం చేయాలని కోరారు. ఈ లేఖలోని వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. ప్రజలపై భారం పడుతుంది.. ► రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించాము. అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత 45 ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోస్‌ల టీకాలు పూర్తి చేసే ప్రక్రియలో ముందుకు వెళ్తున్నాము. ► మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కోవిడ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చన్న కేంద్ర నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తోంది. వాక్సిన్ల ధరల్లో తేడాలు, ఏ రేటుకు వాక్సిన్ వేయాలన్న దానిపై ఆయా ఆస్పత్రులకు వెసులుబాటు ఉండడంతో, కొన్ని ఆస్పత్రులు ఒక్కో డోస్‌కు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇది ప్రజలపై భారం వేయడమే కాకుండా, విమర్శలకు దారి తీస్తోంది. ► నిజానికి కోవిడ్ వాక్సిన్లు ప్రజలకు ఉచితంగా అందించాల్సి ఉంది. అలా వీలు కాకపోతే నామమాత్రపు ధరలో టీకా వేయాలి. 45 ఏళ్లు దాటిన వారికే రెండు డోస్‌ల వాక్సిన్ వేయడానికి సరిపడా సరఫరా ఇప్పుడు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి టీకాలు వేయడం వచ్చే కొన్ని నెలల్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అదే జరిగితే బ్లాక్ మార్కెట్‌కు బాటలు ► ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కోవిడ్ వాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం సరి కాదు. వాక్సిన్లు సేకరించే ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారం ధరలకు టీకాలు వేసే అవకాశం ఉంది. ఇది పేద ప్రజలను వాక్సిన్‌కు దూరం చేయడమే కాకుండా, డిమాండ్ పెరగడంతో వాక్సిన్ల బ్లాక్ మార్కెట్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించడం కూడా కష్టమవుతుంది. రెమ్డిసివిర్ ఇంజక్షన్ల విషయంలో ఏం జరిగిందో చూశాం. ► ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వాక్సిన్ వేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించడం అన్నది మంచి ఆలోచనే అయినా, అవసరానికి మించి వాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడే అది సబబు అవుతుంది. ► వాక్సిన్ విరివిగా అందుబాటులో ఉన్నప్పుడు ఖర్చు చేయగలిగిన స్థోమత ఉన్న వారు తమకు ఇష్టం ఉన్న ఆస్పత్రికి వెళ్లి వాక్సిన్ వేయించుకుంటారు. కానీ డిమాండ్ కంటే చాలా తక్కువగా ఇప్పుడు వాక్సిన్ ఉత్పత్తి అవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వాక్సిన్ కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. దీంతో వారు ప్రజల నుంచి ఇష్టానుసారం చార్జీ వసూలు చేసే అవకాశం ఏర్పడింది. ► ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నాను. దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ వాక్సిన్ డోస్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా వాక్సిన్ డోస్‌లు వేసే వీలుంటుంది. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని, వాక్సిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా నిరోధిస్తారని ఆశిస్తున్నాను. -
ఆరోగ్యశ్రీకి పడకలివ్వకుంటే అనుమతులు రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రైవేటు ఆస్పత్రి అయినా ఆరోగ్యశ్రీలో కోవిడ్‌కు 50 శాతం పడకలు ఇవ్వకపోతే ఆ ఆస్పత్రులకు కోవిడ్ అనుమతులతోపాటు అవసరమైతే రిజిస్ట్రేషన్ రద్దుచేస్తామని ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఉదాహరణకు కృష్ణాజిల్లాలో పేరున్న ఓ ఆస్పత్రికి మచిలీపట్నం బ్రాంచ్‌లో 130 పడకలుండగా, 5 పడకలు మాత్రమే ఆరోగ్యశ్రీకి ఇచ్చారు. అదే ఆస్పత్రికి విజయవాడ భవానీపురంలో 150 పడకలుంటే 10 పడకలు కూడా చూపించలేదు. ఇలాంటి ఆస్పత్రులు విశాఖపట్నం, కృష్ణాజిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు ఆరోగ్యశాఖకు సమాచారం వచ్చింది. దీంతో రానున్న రెండు రోజుల్లో అన్ని ఆస్పత్రుల్లోను తనిఖీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కోవిడ్ చికిత్స చేసే ఏ ఆస్పత్రిలో అయినా సరే 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాలని, కోవిడ్ సమయంలో అన్ని ఆస్పత్రులు ఇది పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ కొన్ని ఆస్పత్రులు ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టడంతో వాటిపై చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. 50 శాతం పడకలు ఇవ్వకపోయినా, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినా భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోనే చర్యలు ఎవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అలాంటి ఆస్పత్రిపై 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటాం. కోవిడ్ చికిత్సకు 50 శాతం పడకలు ఇవ్వని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్ రద్దుచేసేందుకైనా వెనుకాడేది లేదు. – డాక్టర్ ఎ.మల్లికార్జున,సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ -
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
సాక్షి, అమరావతి: కోవిడ్ రోగుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చికిత్స నిమిత్తం కోవిడ్ రోగులు చెల్లించే మొత్తాలను ఇకపై ప్రతి కోవిడ్ ఆస్పత్రిలో ఉండే నోడల్ అధికారి లేదా హెల్ప్ డెస్క్ మేనేజర్ ద్వారా చెల్లింపులు చేసే విషయాన్ని పరిశీలించాలని కోరింది. ఇందుకు తగిన విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. రోగి లేదా అతని అటెండెంట్ లేదా డబ్బు చెల్లించిన వ్యక్తి నుంచి తగిన అక్నాలడ్జ్మెంట్ తీసుకోవాలంది. దీనివల్ల డబ్బు చెల్లిస్తే తప్ప మృతదేహాలను అప్పగించేది లేదని ఆస్పత్రులు చెప్పేందుకు అవకాశం ఉండదని తెలిపింది. దుకాణాల ముందు ఓ కానిస్టేబుల్‌ను ఉంచి, జనం భౌతిక దూరం, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అదేవిధంగా కోవిడ్ కేర్ కేంద్రాలను పట్టణాల్లోనే ఏర్పాటు చేసే విషయాన్ని అధికారులతో చర్చించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌కు సూచించింది. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఏపీకి ఆక్సిజన్ కేటాయింపులను పెంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కోవిడ్ విషయంలో పలు అభ్యర్థనలతో హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. 90 వేల వయల్స్ మాత్రమే వచ్చాయి.. కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 6 వరకు ఏపీకి 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తూ వచ్చామని, తర్వాత దీన్ని 580 మెట్రిక్ టన్నులకు పెంచామని చెప్పారు. ఈ నెల 16 వరకు 2,81,257 రెమిడెసివిర్ వయల్స్‌ను ఏపీకి సరఫరా చేశామని తెలిపారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ విభేదించారు. కేవలం 90 వేల వయల్స్ మాత్రమే రాష్ట్రం అందుకుందన్నారు. 3.75 లక్షల ఇంజక్షన్లు ఇస్తామని కేంద్రం నుంచి ఇటీవలే రాష్ట్రానికి లేఖ అందిందని తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో బెడ్ల ఖాళీల వివరాలను తెలియచేసే వ్యవస్థను త్వరలో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. మరో న్యాయవాది జీఆర్ సుధాకర్ జోక్యం చేసుకుంటూ.. రాష్ట్రానికి 50 క్రయోజనిక్ ట్యాంకర్లు, 10 ఆక్సిజన్ ట్యాంకర్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసిందని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తదుపరి విచారణ సమయంలో ఈ వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
ప్రైవేట్ ఆస్పత్రులను మీ అజమాయిషీలోకి తీసుకోండి
సాక్షి, అమరావతి: కోవిడ్ బాధితులకు తగిన చికిత్స అందించేందుకు వీలుగా ప్రైవేట్ ఆస్పత్రులను తన అజమాయిషీలోకి తీసుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు కోరింది. దీనివల్ల చాలా మందికి చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. రోగులకు బెడ్ల ఖాళీల వివరాలను తెలిపేందుకు నిర్దిష్ట సమాచార వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలంది. ప్రస్తుతం ఉన్న టోల్‌ఫ్రీ నంబర్ 104తో పాటు మరో నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలంది. అలాగే హెల్త్ బులెటిన్‌ను కూడా విడుదల చేయాలంది. వ్యాక్సిన్ వేసేటప్పుడు కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్‌కు సంబంధించి దాఖలైన పలు పిల్లపై ధర్మాసనం విచారణ జరిపింది. కర్ఫ్యూ సత్ఫలితాలిస్తోంది..: ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. కరోనాను అడ్డుకోవడంలో కర్ఫ్యూ సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. కేంద్రం నుంచి తగిన సంఖ్యలో వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు రాష్ట్రానికి రావడం లేదన్నారు. 2.35 లక్షల వయల్స్ పంపుతామన్న కేంద్రం కేవలం 95 వేల వయల్స్ మాత్రమే పంపిందని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రెమ్‌డెసివిర్ కొనుగోలు చేస్తోందని, దీంతో ఎలాంటి కొరత ఉండడం లేదన్నారు. మరింత మంది రోగులకు చికిత్స అందించడానికి కోవిడ్ ఆస్పత్రులను 650 నుంచి 680కి పెంచామన్నారు. అధిక ఫీజులు గుంజుతున్న ఆస్పత్రులపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. రోగుల పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ అంబులెన్సులపై చర్యలు తీసుకోవడంతోపాటు వాటిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ స్పందిస్తూ.. ఆక్సిజన్ హేతుబద్ద సరఫరా కోసం జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఏపీకి ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. -
అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’
పరిగి మండలానికి చెందిన నరేష్ కొన్ని వారాల క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. మూడు రోజుల తర్వాత స్వల్పంగా దగ్గు మొదలైంది. ఎందుకైనా మంచిదని హిందూపురం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకున్నారు. చికిత్స కోసం వచ్చిన అతన్ని కనీసం తలెత్తి కూడా చూడని ఆ డాక్టర్.. నరేష్ చెబుతున్న జబ్బు లక్షణాలు పూర్తి కాకనే ఓ రెఫరల్ ప్రిస్కిప్షన్ చేతిలో పెట్టేశాడు. చెస్ట్ ఎక్స్‌రే, సీటీ స్కాన్, బ్లడ్ చెకప్ చేయించాలని రాసి ఉంది. అదే ఆస్పత్రిలోని డయాగ్నస్టిక్ ల్యాబ్ టెక్నీషియన్‌ను కలిసి బ్లడ్ చెకప్‌కు సంబంధించి నమూనాలు ఇచ్చి, రూ.900 బిల్లు చెల్లించాడు. డాక్టర్ సూచించిన ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి ఎక్స్‌రే కోసం రూ.350, సీటీ స్కాన్ కోసం రూ.3వేలు బిల్లు చెల్లించుకున్నాడు. ఈ మొత్తం రిపోర్టులు పరిశీలించిన తర్వాత నరేష్‌కు కరోనా సోకిందంటూ నెమ్మదిగా చెప్పిన డాక్టర్.. తనకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాప్ ద్వారా రూ.800 విలువ చేసే మందులు కొనుగోలు చేయించాడు. దగ్గు కోసం చికిత్సకు వెళితే.. కేవలం రెండు గంటల వ్యవధిలో డాక్టర్ కన్సల్టింగ్ ఫీజుతో కలిపి రూ.4,350 వరకు నరేష్ చెల్లించుకోవాల్సి వచ్చింది. తనలో ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడంతో ఎందుకైనా మంచిదని అదే రోజు తనకు తెలిసిన ఊపిరితిత్తులకు సంబంధించిన మరో ప్రైవేట్ వైద్యుడిని కలిశాడు. అతన్ని పూర్తిస్థాయిలో పరీక్షించిన అనంతరం కరోనా లేదని, ఇన్ఫెక్షన్ సోకడం వల్ల దగ్గు వస్తోందంటూ తేల్చి ఓ టానిక్, కొన్ని మందులు రాసిచ్చాడు. ఇక్కడ ఆస్పత్రి కన్సల్టెంగ్ ఫీజు, నెబులైజర్, మందులకు 1,300 ఖర్చయింది. ఇంటికెళ్లి ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ రాసిచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడడంతో ఓ రెండు రోజుల తర్వాత నరేష్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ పరిస్థితి కేవలం నరేష్ ఒక్కనిదే కాదు. సాధారణ జబ్బులతో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ తిరుతున్న వారందరూ ఈ తరహా దోపిడీకి గురవుతున్నారు. హిందూపురం టౌన్: ఆస్పత్రికి వచ్చే వారిని కచ్చితంగా సీటీ స్కానింగ్ చేయించుకోవాలని ప్రైవేట్ వైద్యులు జులుం చేస్తున్నారు. ఇలా హిందూపురం ప్రాంతంలోని చాలా ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ పేరిట పెద్ద ఎత్తున స్కామ్‌కు తెరలేపారు. కరోనా కష్టకాలంలో రోగుల్లోని భయాన్ని కొందరు డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారంగా మార్చేశారు. స్వల్పంగా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే చాలు.. అవసరం లేకున్నా వైద్య పరీక్షలు అంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. రోజుకు సగటున 70కి పైగా.. హిందూపురం జిల్లా ఆస్పత్రితో పాటు మరో మూడు ప్రైవేట్ సీటీ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో జిల్లా ఆస్పత్రిలోని సీటీ స్కానింగ్ యంత్రం పనిచేయడం లేదు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లలోనూ ఒకటి పనిచేయడం లేదు. దీంతో పనిచేస్తున్న రెండు స్కానింగ్ సెంటర్లకు కరోనా కష్ట కాలంలో భారీ డిమాండ్ నెలకొంది. గతంలో సీటీ స్కాన్‌కు రోగి అవసరాన్ని బట్టి రూ.4 వేలు నుంచి రూ.5వేల వరకూ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు వసూలు చేసుకునేవారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ.3,500 వరకూ తీసుకుంటున్నారు. ఈ లెక్కన హిందూపురంలోని స్కానింగ్ సెంటర్లలో రోజుకు 70 నుంచి 140 వరకు సీటీ స్కాన్లు నిర్వహిస్తుంటారు. జిల్లాస్పత్రిలో సీటీ స్కాన్ పనిచేయకపోవడంతో అవసరాన్ని బట్టి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు రెఫర్ చేస్తుంటారు. రెఫరల్‌కు రూ.800 కమీషన్ హిందూపురం నియోజకవర్గంతో పాటు పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల ప్రజలు అత్యవసర చికిత్సల కోసం హిందూపురంలోని ఆస్పత్రులనే ఆశ్రయిస్తుంటారు. కరోనా భయంతో కుదేలవుతున్న రోగులకు అవసరం లేకున్నా సీటీ స్కాన్లు నిర్వహిస్తూ ఆర్ఎంపీలు, ప్రైవేట్ డాక్టర్లు తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. తమ వద్దకు చికిత్స కోసం వచ్చిన రోగులకు అవసరం లేకున్నా.. ముందుగా సీటీ స్కాన్లు, బ్లడ్ చెకప్‌లు, ఎక్స్‌రేలకు డాక్టర్లు రెఫర్ చేస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య సమస్యకూ సీటీ స్కాన్ తప్పనిసరి చేసేశారు. సీటీ స్కానింగ్‌కు రెఫర్ చేసిన డాక్టర్‌కు ఒక్కో స్కాన్‌కు రూ.800 చొప్పున కమీషన్‌ను స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు అందజేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు ఇతర వైద్య పరీక్షల్లోనూ కమీషన్లను డాక్టర్లు దండుకుంటున్నారు. చివరకు మందుల కొనుగోలు విషయంలోనూ కమీషన్లు ఉండడంతో ప్రి్రస్కిప్షన్ చాలా పొడవుగా ఉంటోంది. సీటీ స్కాన్‌తో అన్నీ సమస్యలే.. అవసరం లేకున్నా సీటీ స్కాన్ చేయించడం చాలా ముప్పు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందంటున్నారు. కొంతమంది వైద్యులు ప్రతి మూడు రోజులకు ఒకసారి సీటీ స్కాన్ చేయిస్తుంటారని, దీంతో రోగి శరీరం అధిక రేడియేషన్‌కు గురికావడంతో క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు మాత్రం అదీ వైద్యులు సూచిస్తేనే సీటీ స్కాన్ చేయించుకోవాలని చెబుతున్నారు. సీటీ స్కాన్ కంటే చెస్ట్ ఎక్స్రేకే తొలి ప్రాధాన్యమివ్వాలని.. అప్పటికీ జబ్బు పరిస్థితి తేలకపోతే సీటీ స్కాన్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. ఒక సీటీ స్కాన్ 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్‌రేలతో సమానమని హెచ్చరిస్తున్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడే వారికి సీటీ స్కాన్ అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్న వారు, ఆక్సిజన్ లెవల్స్ సాధారణంగా ఉన్న వారికి సీటీ స్కాన్ అసలు అవసరం లేదని అంటున్నారు. తుంగలోకి కోవిడ్ నిబంధనలు కరోనా నిర్ధారణకు ఆర్ఎంపీలు, ప్రైవేట్ వైద్యులు సీటీ స్కాన్పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. దీంతో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ డిమాండ్‌ను అనుకూలంగా మార్చుకున్న స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కేశారు. డాక్టర్లు రాసిచ్చిన రెఫరల్ ప్రి్రస్కిప్షన్ను మళ్లీ రోగి చేతికి ఏ ఒక్క స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఇవ్వడం లేదు. కేవలం రిపోర్టులు మాత్రమే చేతిలో పెట్టేసి డబ్బు గుంజుతున్నారు. దీనికి తోడు ఒకరికి స్కాన్ చేసిన తర్వాత యంత్రాన్ని పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయడం లేదు. దీంతో తొలుత స్కాన్ చేసిన రోగికి కరోనా పాజిటివ్ ఉంటే.. తర్వాత స్కాన్ చేసిన రోగికి లేకపోయినా.. అతను కరోనా బారిన పడే ప్రమాదం లేకపోలేదు. అయితే నిర్వాహకులు ఇవేమీ పట్టించుకోకుండా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డాక్టర్ రెఫరల్ ప్రిస్కిప్షన్ లేకపోయినా.. సొంత నిర్ణయాలతో సీటీ స్కాన్లు చేసేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. డాక్టర్ సిఫారసు లేకుండా చేయరాదు అవసరం లేకున్నా స్కాన్‌కు రెఫర్ చేయడం సరికాదు. క్వాలిఫైడ్ డాక్టర్ల సిఫారసు లేకుండా సీటీ స్కాన్ చేస్తే స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. రోగులు సైతం డాక్టర్ల సలహా మేరకే స్కానింగ్ చేయించుకోవాలి. వ్యక్తిగత నిర్ణయాలు చాలా నష్టం కలిగిస్తాయి. – డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ చదవండి: ప్రాణ వాయువుకు ఫుల్‘పవర్’ నిరంతరాయంగా స్టీల్‌ప్లాంట్ ఆక్సిజన్ -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో అక్రమాలపై విజిలెన్స్ కొరడా
సాక్షి, అమరావతి: కరోనా చికిత్స పేరిట అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై విజిలెన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కొరఢా ఝులిపిస్తున్నాయి. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు 13 ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించి అక్రమాలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. వీటితోపాటు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న మరో 5 ఆస్పత్రుల నిర్వాహకులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేశాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం నిర్ధేశించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ కార్డు గల రోగులకు వైద్యం చేయకపోవడం, ఆరోగ్యశ్రీ రోగుల నుంచి కూడా బిల్లులు వసూలు చేయడం, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. గుంటూరు జిల్లా నరసారావుపేటలోని అంజిరెడ్డి ఆస్పత్రి, విశాఖపట్నంలోని ఆదిత్య, దుర్గ, వైఎస్సార్ జిల్లాలోని సంజీవిని, విజయవాడ భవానీపురంలోని ఆంధ్రా ఆస్పత్రి, కాకినాడ ఇనోదయ, కేర్ ఎమర్జెన్సీ ఆస్పత్రి, ఏలూరులోని ఆంధ్రా ఆసుపత్రి, జంగారెడ్డిగూడెంలోని చిరంజీవి ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కాగా, విశాఖలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నెల్లూరులో నలుగురిపై కేసు నమోదు చేసి, మరో కేసులో ఒకర్ని అరెస్ట్ చేశారు. విజయవాడలో నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఆయా ఆస్పత్రులపై ఐపీసీ సెక్షన్ 188, 269, 420, విపత్తుల చట్టంలోని సెక్షన్ 51(8), 51(బి), 53, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 18 (బి), ఈసీ యాక్ట్ 61, 71 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 46 ఆస్పత్రులపై కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 46 ఆస్పత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకున్నట్టు రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని అంజిరెడ్డి ఆస్పత్రిపై ఈ నెల 5న కేసు నమోదైందని, అయినా అక్రమాలకు పాల్పడటంతో మరోమారు క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు చెప్పారు. -
ఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రులపై విజిలెన్స్ దాడులు
-
అవకతవకలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై కేసులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవకతవకలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్‌లు మంగళ, బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15 ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కేవీఎన్ రాజేంద్రనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల తనిఖీల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన రోగులకు చికిత్స చేయడానికి నిరాకరించడం, ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే అధిక చార్జీల వసూలు, పేషెంట్ల సంఖ్యపై తప్పుడు సమాచారం, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల దుర్వినియోగం, అనుమతి లేకుండా కోవిడ్ చికిత్స వంటి అవకతవకలను గుర్తించినట్టు డీజీ వివరించారు. విశాఖపట్నంలోని రమ్య ఆస్పత్రి, విశాఖ జిల్లా నీరుకొండలోని అనిల్ నీరుకొండ(ఎన్ఆర్ఐ భీమిలి), గోపాలపట్నంలోని ఎస్ఆర్ ఆస్పత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని చైత్ర, విజయవాడలోని అచ్యుత ఎన్క్లేవ్, శ్రీరామ్, గుంటూరులోని విశ్వాస్ ఆస్పత్రి, చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్ ప్రసాద్, అనంతపురంలోని ఆశా ఆస్పత్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు వివరించారు. వాటిపై ఐపీసీ 188, 420, 269 సెక్షన్లు, విపత్తుల నిర్వహణ చట్టంలోని 51(ఎ), 51(బి), 53 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్‌లు ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటివరకు నిర్వహించిన దాడుల్లో అక్రమాలకు పాల్పడిన 37 ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. సోదాల్లో అవకతవకలు వెలుగుచూసిన ఆస్పత్రులకు జరిమానా, పనిష్మెంట్ ఇచ్చి వైద్య, ఆరోగ్య శాఖ పునరుద్ధరించినప్పటికీ ఆవే ఆస్పత్రులు మళ్లీ అక్రమాలకు పాల్పడితే వాటి యాజమాన్యాలను అరెస్ట్ చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. -
రాష్ట్రానికి పెద్ద వైరస్ చంద్రబాబే
కాకినాడ రూరల్: రాష్ట్రానికి పట్టిన అతి పెద్ద వైరస్ చంద్రబాబునాయుడేనని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్‌ను కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదని చెప్పారు. అవసరమైన వైద్యులను, సిబ్బందిని నియమించుకోండని జిల్లాలకే అవకాశం ఇచ్చారన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారని, ప్రతి ప్రాణాన్ని కాపాడాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని స్పష్టం చేశారు. ‘యజ్ఞం చేసేటప్పుడు భగ్నం చేసే రాక్షసుడు పక్కనే ఉంటాడని పురాణాల్లో విన్నాం. సరిగ్గా ఇలాగే కరోనాను కట్టడి చేసి, ప్రజల ప్రాణాలను కాపాడే యజ్ఞాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే.. చంద్రబాబు విష ప్రచారం చేస్తూ, లేనిపోని వదంతులను సృష్టిస్తున్నారు. జాతీయ విపత్తు వచ్చినప్పుడు యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహాయ పడాల్సింది పోయి పార్టీ నాయకులతో ధర్నాలు చేయిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. బాబు మాటలను ఎవరూ నమ్మొద్దు ► కర్నూలులో ఎన్–440కే అనే వైరస్ వచ్చి, మిగిలిన చోట్లకూ విస్తరిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీని వల్ల ఇతర రాష్ట్రాలు మనవైపు అనుమానంగా చూస్తున్నాయి. ఒకపక్క సీసీఎంబీ శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు ఆ వైరస్ వచ్చిందనడం అబద్ధమని చెప్పినా కూడా చంద్రబాబు ప్రజలను టెర్రరిస్టులా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మొద్దు. దేశంలో సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు మాత్రమే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్ల డోసులు. ఈ లెక్కన ఒక్కో వ్యక్తికి రెండు డోసుల చొప్పున నెలకు 3.5 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించగలుగుతారు. దీని ప్రకారం దేశంలోని 130 కోట్ల జనాభాకు వ్యాక్సినేషన్‌కు ఎంత సమయం పడుతుందో తెలియదా? ► వ్యాక్సిన్‌ను కేంద్రమే రాష్ట్రాలకు కేటాయిస్తోంది. ఈ రెండు సంస్థలూ జూలై, ఆగస్టు నాటికి సామర్థ్యం పెంచుకుంటామంటున్నాయి. నెలకు గరిష్టంగా 16 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తే, ఈలోగా రష్యా నుంచి స్పుత్నిక్ టీకా వస్తే దేశం, రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌కు కొన్ని నెలలు పడుతుంది. ► రాష్ట్రంలో మొత్తం అందరికీ ఉచితంగా టీకాలు వేయించేందుకయ్యే రూ.1,600 కోట్లు భరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర జనాభా 5.30 కోట్ల మందిలో 3.48 కోట్ల మంది వ్యాక్సిన్‌కు అర్హులు. రాష్ట్రానికి ఇప్పటి వరకూ వచ్చిన డోసులు 73.49 లక్షలు. అవసరమైన డోసులు 6.96 కోట్లు. ఆ కమీషన్ మీరే తీసుకుని టీకా ఇప్పించండి ► వాస్తవాలు ఇలా ఉండగా టీకాలు వేయడం లేదంటూ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మీకు అత్యంత సన్నిహితుడైన రామోజీరావు గారి కుమారుడి వియ్యంకుడి కంపెనీ భారత్ బయోటెక్ నుంచి వ్యాక్సిన్లను మీ పరపతిని ఉపయోగించి ఇప్పించాలి. అలా చేస్తే రూ.1,600 కోట్లు మీరు చెప్పిన అకౌంట్‌కు ఇస్తాం. ఇండెంట్ ఎవరికి పంపించాలో చెప్పండి. ► ఈ రోజు ఓ పచ్చపత్రికలో కమీషన్లు రావనే ఉద్దేశంతోనే టీకాలు కొనడం లేదంటూ ప్రభుత్వంపై, మంత్రులపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆ కమీషన్లు మీరే తీసుకోండి. ఇండెంట్ భారత్ బయోటెక్‌కు పంపించమంటారా? ఈనాడుకా లేక అచ్చెన్నాయుడుకా? ► రాష్ట్రంలో టీకా అవసరాలపై భారత్ బయోటెక్‌తో సీఎం వైఎస్ జగన్ స్వయంగా మాట్లాడారు. అధికారులు రవిచంద్ర, తదితరులు లేఖలు రాశారు. 3,43,930 డోసులు ఇవ్వాలని భారత్ బయోటెక్‌కు కేంద్రం చెప్పింది. అందులో 1,25,000 డోసులు సరఫరా చేస్తామని తెలియజేసింది. అలాగే కోవిషీల్డ్ 9,91,700 డోసులు అందిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది. మొదటి డోసు వేసుకున్నవారికి రెండోది వేయకపోతే పని చేయదని వారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ► ఆక్సిజన్‌ను ఒడిశాలోని అంగురు నుంచి విమానాల ద్వారా తీసుకు వస్తున్నాం. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరత లేకుండా చూస్తున్నాం. వైఎస్సార్ టెలి మెడిసిన్ పని చేస్తోంది. ఇన్ని విధాల పని చేస్తున్న ప్రభుత్వంపై విష ప్రచారం సరికాదు. మీడియా కూడా సంయమనం పాటించాలి. -
ఏపీ ఆసుపత్రుల్లో మరోసారి విజిలెన్స్ దాడులు
అమరావతి: ఏపీలోని ఆస్పత్రుల్లో విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి.అక్రమాలకు పాల్పడుతున్న నాలుగు ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొరత ఉన్నరెమిడెసివిర్ ఇంజక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసిన వాటిలో గుంటూరు నారాయణ ఆస్పత్రి, విశాఖ ఆరిలోవలోని కుమార్ ఆస్పత్రి, అనంతపురం సాయిరత్న ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం ఆస్పత్రులు ఉన్నాయి. -
అక్రమ వసూళ్లపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం
-
ప్రైవేట్ ఆస్పత్రిలో టీకా.. హెల్త్ డైరెక్టర్ కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ టీకాల పంపిణీకి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరోసారి అనుమతించింది. ప్రస్తుతం 45 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ఆదేశించింది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే టీకా ఇవ్వాలని సూచించింది.వ్యాక్సిన్లను నేరుగా కంపెనీల నుంచి సమకూర్చుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలంగాణ హెల్త్ డైరక్టర్ జీ. శ్రీనివాసరావు కోరారు. కోవిడ్ పేషంట్లకు చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రులకు తెలంగాణ హెల్త్ డైరక్టర్ పలు సూచనలను చేశారు. కోవిడ్ పేషంట్లకు ఆక్సిజన్ రేటు 94 శాతం కంటే ఎక్కువగా ఉంటే వారిని హోం ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్లకు సిఫారసు చేయాలని తెలిపారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారిని రిపోర్టులతో సంబంధం లేకుండా ఆస్పత్రుల్లో చేర్చుకోవాలన్నారు. అంతేకాకుండా ఆస్పత్రుల ఎంట్రెన్స్ వద్ద బెడ్ల వివరాల పట్టికను ఉంచాలని ప్రైవేటు ఆస్పత్రులకు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సూచించారు చదవండి: కరోనా: వీరు మరింత జాగ్రత్తగాఉండాలి! -
తెలంగాణ: ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ నిలిపివేత
-
కరోనా: 13 లక్షలు ఖర్చు చేశారు..అయినా
గీసుకొండ/వరంగల్: మెరుగైన వైద్యం అందుతుందని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన పాపానికి లక్షల్లో బిల్లు వేశారు. అయినా రోగి ప్రాణం కాపాడారా అంటే అదీ లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి పరాకాష్టగా నిలిచిన ఈ సంఘటన వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రైతు కొప్పుల మొగిలి (63) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షలతో పాటు కోవిడ్ టెస్ట్ చేయించగా స్వల్పంగా కరోనా లక్షణాలున్నాయని, ఆస్పత్రిలో చేరితే మంచిదని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో బంధువులు అతడిని వరంగల్ నగరం ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. రెండు మూడు రోజులు జనరల్ వార్డులో చికిత్స చేసిన అనంతరం ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని, ఐసీయూ వార్డులోకి మార్చాలని వైద్యులు సూచించడంతో అలాగే చేశారు. అయితే ఐసీయూలో ఉంచినా మొగిలి కోలుకోలేదు. పైగా, పేగు మెలిక పడిందని, ఆపరేషన్ చేసి సరిచేయాలని వైద్యులు చెప్పడంతో.. ఆ ఆపరేషన్ కూడా చేయించారు. అయితే, శుక్రవారం రాత్రి 9 గంటలకు చికిత్స పొందుతూ మొగిలి ఆస్పత్రిలోనే మృతిచెందాడు. చివరి బిల్లు రూ. 5.80 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయని, యాజమాన్యాన్ని బతిమిలాడగా రూ. లక్ష తగ్గించారని మృతుడి కుమారుడు రంజిత్ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన 20 రోజుల్లో సుమారు రూ.13 లక్షలు ఖర్చయ్యాయని, అయినా ప్రాణం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇదే గ్రామంలో పది రోజుల వ్యవధిలో ఆరుగురు కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. -
ప్రైవేటు ఆస్పత్రుల కొత్త ఎత్తుగడ
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలతో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లపై కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కొత్త ఎత్తుగడ వేశాయి. ఇంజక్షన్ల కొరత సృష్టించేందుకు, ఆ నెపాన్ని ప్రభుత్వంపై వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా మందుల డిపోల వద్ద ఇంజక్షన్లు కొనడం మానేశాయి. మందుల డిపోల వద్ద గత రెండు రోజుల కొనుగోళ్లలో 30 శాతం తగ్గుదల చూస్తే ఇది స్పష్టమవుతోంది. కాగా, ఇన్నాళ్లూ మందుల డిపోల వద్దకు వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రులు ఆ ఇంజక్షన్లు తెచ్చుకునేవి. బ్లాక్‌మార్కెట్ నియంత్రణకు రంగంలోకి దిగిన ఔషధ నియంత్రణ శాఖ.. నిబంధనలు కఠినం చేసింది. అలాగే ఆస్పత్రులు కొని తెచ్చుకున్న ఇంజక్షన్లు సరిపోకపోతే.. లోటు ఉన్న ఇంజక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో రెమ్‌డెసివిర్ కొరత నియంత్రణలోకి వచ్చింది. అయితే ప్రభుత్వం లోటును భర్తీ చేస్తుంటే.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు డిపోల నుంచి వారికి కావాల్సినవి కూడా కొనడం మానేశాయి. ఇలా చేసి కొరత చూపుతున్నాయని, బ్లాక్‌మార్కెట్‌కు అవకాశం ఉంటే డిపోల దగ్గర కొనేవారు అనే విమర్శలు వస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు ప్రైవేటు ఆస్పత్రులకు కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భాగస్వామ్యం అందిస్తోంది. బ్లాక్‌మార్కెట్‌ను నిలువరించేసరికి డిపోల దగ్గర కొనడం మానేశారు. ఇది సరైన పద్ధతి కాదు. బాగా నియంత్రణలోకి వచ్చిన పరిస్థితుల్లో ఇలాంటి ధోరణి వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. –రవిశంకర్ నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ -
తెలంగాణకు టీకా అందేనా ?
-
తెలంగాణకు టీకా అరకొరే.. ఆ ఆస్పత్రులకు టీకా బంద్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత కొరవడింది. ఇక్కడ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నా వ్యాక్సిన్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇది వ్యాక్సినేషన్ ప్రక్రియపై తీవ్ర ప్రభా వం చూపుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు 47 లక్షల డోసులే పంపిణీ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని రాష్ట్రాలకు కోటికిపైగా డోసులు పంపిణీ చేయగా... తెలంగాణకు ఇప్పటివరకు టీకా కేటాయింపులు అరకోటి దాటలేదు. వ్యాక్సిన్ నిల్వలను బట్టి పంపిణీ చేస్తున్న రాష్ట్ర యంత్రాంగం... ప్రస్తుతం టీకా కోటా నిల్వలు నిండుకోవడంతో పంపిణీ ప్రక్రియలో వేగాన్ని తగ్గించాల్సిన పరిస్థితి తలెత్తింది. 2 లక్షల నుంచి లక్షకు తగ్గించి... వైరస్ వ్యాప్తి వేగం పెరగడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను సైతం వైద్య, ఆరోగ్య శాఖ విస్తృతం చేసింది. టీకాల పంపిణీ ప్రారంభ సమయంలో రోజుకు 20–30 వేల మందికి వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన అధికారులు ఈ నెల 20 నుంచి ఏకంగా 2 లక్షల డోసులకు పెంచారు. 4–5 రోజులపాటు రోజుకు 2 లక్షల కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన యంత్రాంగం... టీకాల కోటా నిండుకోవడంతో గత 5 రోజులగా పంపిణీ వేగాన్ని తగ్గించి కేవలం లక్ష మందికే టీకాలు ఇస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద లక్షకు మించి టీకాల కోటా లేనట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు ఈ నెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ వైద్యశాఖ వద్ద టీకాల కోటా తగినంతగా లేనందున మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టలేమని తేల్చిచెప్పింది. ప్రస్తుతం నిల్వ ఉన్న కోటాను రెండో డోసు వేసుకొనే వారికి ఇస్తే మెరుగైన ఫలితం ఉంటుందని భావించి ఆ మేరకు చర్యలు చేపట్టింది. 45 ఏళ్లు పైబడి రెండో డోసు తీసుకొనేందుకు వచ్చే వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. అక్కడ కోటి దాటినా: కొన్ని రాష్ట్రాల్లో పలుచోట్ల టీకాల పంపిణీ విస్తృతంగా సాగుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1.61 కోట్ల డోసులు పంపిణీ చేశారు. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఇప్పటికే కోటికి పైగా డోసులు పంపిణీ చేశారు. కర్ణాటకలో కూడా దాదాపు కోటి డోసులు వేయగా... తెలంగాణలో మాత్రం అరకోటి దాటలేదు. ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వ టీకాల సరఫరా బంద్.. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ పంపిణీ నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సరఫరా చేసిన టీకా నిల్వలు ఉంటే వాటిని వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేసే ఉద్దేశంతో ఇప్పటివరకు ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం టీకా సరఫరా చేసింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం.. ఉచితంగా ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. శనివారం నుంచి 3వ దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉన్నా టీకా నిల్వలు లేని కారణంగా అమలు సాధ్యం కాదని ప్రైవేట్ ఆస్పత్రుల వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఈ నెల 3 తర్వాతే స్పష్టత వస్తుందని పేర్కొన్నాయి. కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి తమ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ఇస్తామని అపోలో వర్గాలు వెల్లడించాయి. -
‘ప్రైవేటు’ నిర్వాకం.. ఇదేంటని ప్రశ్నిస్తే వైద్యం బంద్
కడప రూరల్: కోవిడ్ బాధితులకు చికిత్స చేసే విషయంలో అక్రమాలను అధికారులు ప్రశ్నించినందుకు నిరసనగా వైఎస్సార్‌జిల్లా కేంద్రం కడపలోని 6 ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులు వైద్యం నిలిపేశాయి. ఈ ఆస్పత్రుల్లో చికిత్సకు కోవిడ్ బాధితుల నుంచి రోజుకు రూ.50 వేలు, రూ.లక్షకు పైగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్ హరికిరణ్.. జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ తదితరులతో ఆ ఆస్పత్రుల్లో తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా పలు అక్రమాలు, లోపాలు వెలుగుచూశాయి. ఆరోగ్యశ్రీ కోవిడ్ పేషెంట్ల వద్ద డబ్బులు అధికంగా వసూలు చేసినట్లు తేలడంతో రెండు ఆస్పత్రులకు జరిమానా వేశారు. అనంతరం కూడా కొన్ని ఆస్పత్రుల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం కడపలోని ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రుల యజమానులు సమావేశమయ్యారు. అధికారులు అక్రమాల గురించి ప్రశ్నించడం జీర్ణించుకోలేకపోయిన వారు.. కోవిడ్ ఆస్పత్రుల్లో కరోనా బాధితులను అడ్మిట్ చేసుకోకూడదని, వైద్యసేవలు అందించకూడదని నిర్ణయించారు. ఆస్పత్రులను మూసేసి, కోవిడ్ పేషెంట్లను చేర్చుకోబోమంటూ ముఖద్వారాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది సరికాదు..: చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి: వైఎస్సార్ జిల్లా పరిధిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ‘కరోనా కేసులను చూడం..’ అంటూ బోర్డులు పెట్టడం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్ణయంపై గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ఆస్పత్రులను శిక్షించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు బయట మార్కెట్‌కు తరలుతున్నాయని, తద్వారా నిజమైన పేదలకు అవి అందడం లేదనే విజిలెన్స్ తనిఖీలు జరిపారని, ఇవి కక్షపూరితం కాదని చెప్పారు. పేదలకు ఆరోగ్య సహాయ çసహకారాలు అందాల్సిన సమయంలో వైద్యులు చెడ్డపేరు మూటగట్టుకునే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. రాయచోటిలో కోవిడ్ ఆస్పత్రిగా మార్చిన అమరావతి ఆస్పత్రిని శానిటేషన్ పేరుతో మే 1 వరకు మూసివేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. దీనిపై పునరాలోచించాలని కోరారు. తప్పుచేసిన ఆస్పత్రి యజమానులు, వైద్యులపైన మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆయన గుర్తుచేశారు. చదవండి: ఏపీ: జర్నలిస్టుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు ‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం -
ఆరోగ్య సంరక్షణ గాల్లో దీపమేనా?
వైద్యం పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయి. ఇది పోవాలంటే, మెరుగైన వైద్యం ప్రజలకు అందాలంటే దేశంలోని ప్రతి జిల్లాలోనూ పోస్ట్ గ్రాడ్యుయేట్ రెఫరల్ ఆసుపత్రిని తప్పకుండా నెలకొల్పాలి. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. దేశంలో ప్రజారోగ్య సంరక్షణ సమర్థంగానూ, ఉచితంగానూ అందుబాటులో ఉంటున్నట్లయితే ప్రైవేట్ ఆసుపత్రుల అవసరం సామాన్యులకు ఉండదు. అలాగే ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల ప్రథమ బాధ్యతల్లో ఒకటి అనే చైతన్యం ఓటర్లలో పెంపొందాలి. కులం, తెగ, జెండర్, నేపథ్యంతో పనిలేకుండా ఏ భారతీయుడినైనా సరే వారికీ వారి కుటుంబానికి ప్రప్రథమంగా కావలసింది ఏమిటి అని అడిగితే పదిమందిలో కనీసం ఎనిమిదిమంది మంచి ఆరోగ్యం, దాంతోపాటు సంతోషం కావాలని కోరుకుంటారు. అయితే ఒక పోలింగ్ బూత్‌లోని ఏ వ్యక్తినైనా పట్టుకుని అభ్యర్థిని ఎంచుకోవడంలో అతడి లేక ఆమె ప్రధమ ప్రాధాన్యత ఏది అని అడిగారనుకోండి.. ఆరోగ్య సంరక్షణను కల్పించే అభ్యర్థి తమకు కావాలనే సమాధానం వారినుంచి కలికానిక్కూడా వినిపించదు. భారతదేశంలో ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పగూలిపోవడానికి మన ఓటర్లలోని ఈ నిర్లిప్తతే ప్రధాన కారణం. తాము ఎన్నుకుంటున్న ప్రభుత్వ ప్రధాన విధుల్లో ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, ఉండాలని మన ఓటర్లు అస్సలు ఆలోచించడం లేదు. మరిన్ని ఆసుపత్రులు నిర్మించడం, ఉన్న ఆస్పత్రులను నవీకరించి మెరుగుపర్చడం అనేది జరగకపోతే, అభివృద్ధి కావాలంటే ఓటు వేయండని రాజకీయ పార్టీల, నేతలు చెప్పే దానికి ఏమాత్రం విలువ ఉంటుంది? ఒకసారి అభివృద్ధి లేక వికాస్ అనే భావనను ఎవరికీ అర్థం కాని అమూర్త భావనగా మార్చేశాక, మన రాజకీయ నాయకులు దాన్ని వాడుకోవడంలో మీడియా సైతం బ్రహ్మాండంగా తనవంతు పాత్ర పోషిస్తోంది. పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకేసి చూద్దాం. ఈ మూడు రాష్ట్రాలకు చండీగడ్ లోని పీజీఐ ఆసుపత్రి మాత్రమే ఏకైక దిక్కుగా ఉంటోంది. దశాబ్దాలుగా ఈ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతూ ఉంటోంది. చండీగఢ్ లోని పీజీఐ ఆసుపత్రి గేటు వద్దకు చేరుకోవడానికి ముందే అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోతున్న భయానక గాథలు ఎన్నో ఎన్నెన్నో. ఒకవేళ ప్రాణాలు నిలుపుకుని వారు ఆసుపత్రిలోకి అడుగుపెడితే చికిత్సకోసం గంటలపాటు ఆసుపత్రి ప్రాంగణంలో వేచి చూడక తప్పదు. దేశవ్యాప్తంగా కూడా పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. దేశంలో ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్న ఎయిమ్స్, పీజీఐ వంటి రిఫరల్ ఆసుపత్రులు తమ సామర్థ్యానికి మించి రోగులకు సేవలందిస్తూ అలిసిపోతున్నాయి. నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ దేశంలో కలికానిక్కూడా లేదు కాబట్టే.. ఇలాంటి రిఫరల్ ఆసుపత్రులపై ఇంత అలవిమాలిన భారం పడుతోంది. చాలా ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతే ఇవ్వడం లేదు. అందువల్లనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు కనీస అవసరాలకు కూడా దూరమైపోయాయి. దేశ స్థూల దేశీయోత్పత్తిపై, ఆర్థిక వ్యవస్థపై పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల ప్రభావం ఏ స్థాయిలో ఉందనే అంశం ఇప్పటికే చాలాసార్లు వెల్లడవుతూవచ్చింది. ఇలాంటి దుష్ప్రభావం బారిన పడకుండా అభివృద్ధి చెందిన దేశాలు చాలావరకు తమ పౌరులకు ఏదో ఒక రూపంలో రక్షణ ఛత్రాన్ని ఏర్పాటు చేయగలిగాయి. అదే భారతదేశం విషయానికి వస్తే కుటుంబంలో ఒక్క సభ్యుడు తీవ్ర వ్యాధికి, అస్వస్థతకు గురైతే సంవత్సరాలుగా పొదుపు చేస్తూ వచ్చిన మొత్తాలు కరిగిపోతాయి. ఈవిధంగా ఆరోగ్య సంబంధిత వ్యయం కారణంగానే ప్రతి సంవత్సరమూ దేశ జనాభాలో 3.5 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువ స్థాయికి పడిపోతున్నారని మీడియా వార్తలు చెబుతున్నాయి. తమ ప్రియతముల, ఆప్తుల వైద్య ఖర్చులు భరించడానికి సమస్తాన్ని అమ్ముకుంటున్న, తాకట్టుపెడుతున్న కుటుంబాల గాధలు ఒకటీ రెండూ కాదు. చాలావరకు ఇలాంటి గాథలు విషాదాంతాలుగానే ముగిసిపోతుంటాయి. ఆస్తుల్ని కరగదీసినా కుటుంబం వ్యాధుల పాలైన తన ప్రియతములను కోల్పోతూనే ఉంటుంది. దేశంలోని పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల బారినపడి ఘోరంగా నలుగుతున్న బాధితుల్లో దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అందని ద్రాక్షపండుగానే ఉంటున్నాయి. పైగా అత్యుత్తమమైన టయర్ 1 ఆసుపత్రులు వీరికి అందుబాటులో ఉండటం లేదు. దీంతో అనివార్యంగా వీరు ప్రమాణాలు లేని, నాసిరకం సామగ్రితో కునారిల్లుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల బారిన పడుతున్నారు. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు రోగి కుటుంబాలనుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతూ చికిత్సను మధ్యలోనే నిలిపివేస్తున్నాయి. ఇలాంటి ఆసుపత్రుల చుట్టూ ఉంటున్న ల్యాబ్‌లు డాక్టర్ల తరపున సేవలందించే అటెండెంట్లతో నిండి పచ్చి మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ ప్రయోగశాలలు అందించే కమిషన్ల కోసం కక్కుర్తిపడుతున్న వైద్యపుంగవులు అయినదానికి కానిదానికి టెస్టుల మీద టెస్టులు రాస్తూ రోగులను ఇలాంటి ల్యాబ్‌ల బారిన పడేస్తున్నారు. కోవిడ్–19 సంక్షోభం వైద్యులు, ల్యాబ్‌లు వంటి ఈ తరహా పరాన్న జీవుల పంట పండిస్తున్నట్లుంది. భారత్ నిజమైన గ్లోబల్ లీడర్‌గా ఆవిర్భవించాలంటే ఈ సమస్యను తప్పకుండా పరిష్కరించాల్సిందే. ఉచిత, ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ అనేది ఏ రకంగానూ ఉచితంగా లభిస్తోందని చెప్పడానికి లేదు. దాన్ని ఇకనుంచి మనం ప్రీ–పెయిడ్ (ముందస్తుగా చెల్లించిన) ఆరోగ్య సంరక్షణ అని పిలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య సంరక్షణపై పెట్టే ప్రతి పైసానూ మనం ఏదో ఒకరకంగా పన్నుల నుంచే చెల్లిస్తున్నామని గ్రహించి తీరాలి. చివరకు అంగట్లో అగ్గిపెట్టె కొనుక్కునే కూలీ సైతం దానిపై పరోక్షంగా పన్ను చెల్లిస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలో పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయలను పిండుకుంటున్న ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదార్లకు కనీసమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించాల్సి ఉంటుంది. దేశంలో నెలకొల్పిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలావరకు రాజ కీయ కుటుంబాల ప్రత్యక్ష యాజమాన్యంలో ఉంటున్నాయి లేక వారు అనుమతించిన వారి యాజమాన్యంలో ఉంటున్నాయి. ఈ ఆసుపత్రులకు ఉచితంగా భూమిని అప్పగిస్తున్నారు. రాజకీయ నేతల సమ్మతి లేనిదే దేశంలో నిజమైన వాణిజ్య సంస్థలు సైతం ఇలాంటి రాయితీలను ఒక్కదాన్నైనా పొందలేవు. ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపర్చడానికి రాజకీయ వర్గానికి ఈ భారీ స్థాయి రాయితీలే అడ్డుపడుతున్నాయి. దేశంలో ప్రజారోగ్య సంరక్షణ సమర్థంగానూ, ఉచితంగానూ అందుబాటులో ఉంటున్నట్లయితే ఈ ప్రైవేట్ ఆసుపత్రులను ఉపయోగించుకునేది ఎవరు? పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య సంస్థలు (పీజీఐ) దేశంలో 1950, 60లలో ఉనికిలోకి రాగా, అప్పటినుంచి దేశ జనాభా ఎన్నో రెట్లు పెరుగుతూ వచ్చింది. ఇప్పటి వైద్య అవసరాలు తీరాలంటే కనీసం జిల్లాకు ఒక పీజీఐ స్థాయి రెఫరల్ ఆసుపత్రిని తప్పక నిర్మించాల్సి ఉంది. రెండు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. ఉచిత, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కల్పన రాజకీయ పార్టీలకు ప్రధమ ప్రాధాన్యతగా ఉండాలి. ఈ ప్రాథమిక అంశాలను మేనిఫెస్టోల్లో పొందుపర్చేవారికే ఓటువేసేలాగా మన ఓటర్లు కుల, తెగ పరమైన రాజకీయాలకు అతీతంగా పరిణితి చూపాల్సిఉంది. ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వాల ప్రథమ బాధ్యతల్లో ఒకటి అనే చైతన్యం ఓటర్లకు కలిగినప్పుడు రాజకీయ పార్టీలనుంచీ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయగలుగుతారు. ప్రజారోగ్య వ్యవస్థ కుప్పగూలిపోవడానికి బాధ్యులెవరో కూడా గ్రహించి వారే ఈ సమస్యను పరిష్కరించాలని ఓటర్లు డిమాండ్ చేయాలి. గుల్ పనాగ్ వ్యాసకర్త రచయిత్రి, నటి, వాణిజ్యవేత్త (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కరోనాపై ప్రైవేటు ఆస్పత్రుల తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే కరోనా చికిత్సలతో నిండిపోయిన ఆస్పత్రులను ఇక ముందు పెరగనున్న వ్యాక్సినేషన్ ఉక్కిరిబిక్కిరి చేయనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 18-44 ఏళ్ల మధ్య వారికి కూడా కరోనా టీకాలు వేయనుండటంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో రద్దీ మరింత పెరగనుంది. అసలే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత మొదలైన ప్రస్తుత సమయంలో.. అటు కరోనా చికిత్సలు, ఇటు వ్యాక్సినేషన్‌ను ఎలా నిర్వహించాలన్న తర్జనభర్జన కనిపిస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్లుపైబడిన వారికే టీకాలు వేస్తున్నారు. అందులో కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మరికొందరు ప్రైవేట్‌లో తీసుకుంటున్నారు. అయితే వచ్చే ఒకటో తేదీ నుంచి బహిరంగ మార్కెట్లోకి వ్యాక్సిన్ వస్తుండటంతో.. ప్రైవేట్ ఆస్పత్రులే టీకా బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్సలు, వ్యాక్సినేషన్‌ను సమన్వయం చేసుకోవడంపై ఆస్పత్రులు దృష్టిపెట్టాయి. భారీగా వ్యాక్సిన్లకు ఆర్డర్లు 18-44 ఏళ్ల మధ్య వారికి కేంద్రం ఉచితంగా టీకా వేయబోవడంలేదు. 45 ఏళ్లు పైబడినవారికే ఉచితంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే భారీగా వ్యాక్సినేషన్ కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలో 18-44 ఏళ్ల మధ్య వయసు వారు 1.82 కోట్ల మంది ఉంటారని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. ఇందులో చాలా వరకు ప్రైవే ట్లోనే టీకా పొందాల్సి ఉండనుంది. ఇంత భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోంలను సిద్ధం చేయాల్సి రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో 3 వేల ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలలో టీకాలు వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే మెడి కల్ షాపుల్లో టీకాలు అందుబాటులో ఉంచుతారని.. వాటిలో కొనుగోలు చేసి, ఆస్పత్రిలో వేయించుకోవచ్చని అంటున్నారు. లేదా ఆస్పత్రులే ప్రత్యేకం గా ఏర్పాట్లు చేసి.. వ్యాక్సిన్ వేసే అవకాశాలున్నా యి. ఇప్పటికే హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు టీకాలకు ఆర్డర్లు పెట్టినట్లు సమాచారం. ఇష్టమున్న వ్యాక్సిన్ వేసుకోవచ్చు లబ్ధిదారులు తమకు ఇష్టమైన వ్యాక్సిన్ వేసుకోవడానికి వీలు కల్పిస్తామని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు అనుమతి ఉంది. తాజాగా అనుమతి పొందిన స్పుత్నిక్ టీకాతోపాటు త్వరలో ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఫైజర్ టీకాను మైనస్ 70 నుంచి మైనస్ 80 డిగ్రీల మధ్య నిల్వ చేయాలి. ఆ మేరకు అటు కంపెనీ, ఇటు ప్రైవేట్ ఆస్పత్రులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టీకా అందుబాటులోకి వచ్చినా దాని ఖరీదు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. 28 నుంచి టీకాలకు రిజిస్ట్రేషన్లు 18-44 ఏళ్ల మధ్య వయసు వారికి వచ్చే ఒక టో తేదీ నుంచి మొదలయ్యే వ్యాక్సినేషన్‌కు సం బంధించి.. ఈ నెల 28వ తేదీ నుంచే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం 28వ తేదీలోగానే వ్యాక్సినేషన్ కేం ద్రాల వివరాలను వైద్యారోగ్యశాఖ కోవిన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉండనుంది. ఈ ప్రక్రియ మొదలు కాలేదని అధికారులు తెలిపారు. చదవండి: వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ.. చదవండి: తెలంగాణ ఆదర్శం.. వాయువేగాన ఆక్సిజన్ -
ప్రైవేట్ హాస్పిటల్ లో వసూళ్ల దందా
-
ఉన్నకాడికి ఊడ్చేసి.. చివరికి గాంధీకి
హైదరాబాద్: నిజామాబాద్‌కు చెందిన రాజేందర్ (52)కు పది రోజుల క్రితం కోవిడ్ నిర్ధారణ అయింది. చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరు రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్‌తో చికిత్సలు అందించారు. ఇందుకు రూ.4.18 లక్షల బిల్లు వేశారు. తీరా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మా వల్ల కాదంటూ చేతులెత్తేశారు. గత్యంతరం లేక చివరకు అదే వెంటిలేటర్ సహాయంతో బుధవారం రాత్రి గాంధీకి తరలించారు. ఆస్పత్రిలో చేర్చిన కొద్ది సేపటికే ఆయన మృతి చెందారు. హుజూరాబాద్‌కు చెందిన సమ్మయ్య(40)కు వారం రోజుల క్రితం కోవిడ్ నిర్ధారణ అయింది. తొలుత వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్యం అందకపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక రోజు చేర్చుకుని రూ.90 వేల బిల్లు వేశారు. తీరా తమ వల్ల కాదని, హైదరాబాద్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో ఆయన్ను బుధవారం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రెండు గంటల పాటు ఎమర్జెన్సీలో ఉంచుకున్నారు. రూ.20 వేలకుపైగా ఛార్జీ చేశారు. అనంతరం వెంటిలేటర్లు లేవని చెప్పి బయటికి పంపారు. దిక్కుతోచని స్థితిలో వారు రాత్రి 2 గంటలకు గాంధీకి చేరుకున్నారు. అప్పటికే ఆస్పత్రిలో వెంటిలేటర్లు లేకపోవడంతో ఆక్సిజన్‌పై ఉంచారు. ప్రస్తుతం ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు... ఇలా ఒక్క రాజేందర్, సమ్మయ్య మాత్రమే కాదు...కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న అనేక మందిని ఉన్నకాడికి ఊడ్చేసి..చివరి నిమిషంలో..మా వల్ల కాదంటూ..ఇలాగే వదిలించుకుంటున్నాయి. వాళ్లు దోచుకుంటే..నిందలు మాపైనా? రోగి ఆస్పత్రిలో చనిపోతే..రోగి బంధువులు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. అంతే కాదు ఆస్పత్రి ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు. బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత చికిత్సకు రోగి స్పందించడం లేదని..అయినా ఐసీయూలో ఉంచితే..వైద్య ఖర్చులు రోజుకు రూ.60 వేలకుపైగా అవుతుందని బంధువులను భయపడుతున్నారు. మెరుగైన వైద్యం అందాలంటే గాంధీకి తీసుకెళ్లడం ఒక్కటే పరిష్కారమని సూచిస్తున్నాయి. బలవంతంగా వారిని వదిలించుకుంటున్నారు. అప్పటికే వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో గాంధీ వైద్యులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇలా ఆఖరి నిమిషంలో వచ్చిన వారిలో కొంత మంది ఆస్ప్రతిలో చేరిన కొద్ది సేపటికే మృతి చెందుతుండగా...మరికొంత మంది రెండు మూడు రోజుల తర్వాత కన్ను మూస్తున్నారు. చికిత్సల పేరుతో లక్షల రూపాయలు దోచుకుంది కార్పొరేట్ ఆస్పత్రులైతే...చికిత్సల్లో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలను గాంధీ వైద్యులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వందకుపైగా అడ్మిషన్లు..20లోపే డిశ్చార్జిలు 1850 పడకలు ఉన్న గాంధీ ఆస్పత్రిలో 500 వెంటిలేటర్లు, 1250 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. ప్రస్తుతం వెంటì లేటర్లు ఖాళీ లేవు. ఆక్సిజన్ పడకలపై కూడా 250 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి నేరుగా వచ్చే కేసులతో పోలిస్తే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి రిఫరల్‌పై వస్తున్న కేసులే అధికం. నేరుగా వచ్చిన కేసులకు పడకలు కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే సోమవారం 110 మంది వస్తే..మంగళవారం 205 మంది వచ్చారు. బుధవారం 185 మంది వచ్చారు. డిశ్చార్జిలు అవుతున్న వారు కేవలం 20లోపే. కొత్తగా వెంటిలేటర్‌తో వచ్చిన వారికి చేర్చుకోలేని దుస్థితి. అనివార్య పరిస్థితుల్లో వారిని ఆక్సిజన్ పడకలపై ఉంచాల్సి వస్తుండటంతో ఊపిరాడక వారు ముందే చనిపోతున్నారు. ( చదవండి: గాంధీ ఆస్పత్రి: కరోనా బాధితులు ఫుల్, ఐసీయూ బెడ్లు నిల్ ) -
ఆస్పత్రుల్లో అధిక చార్జీలపై కఠిన చర్యలు
కర్నూలు కల్చరల్/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలు మాత్రమే వసూలు చేయాలని, అంతకుమించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హెచ్చరించారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రైవేటు ఆస్పత్రులపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్‌ను సమర్థంగా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారన్నారు. ఐదుగురు మంత్రులతో కమిటీ వేసి పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. గత సంవత్సరం కోవిడ్ కట్టడిలో సమర్థంగా పనిచేసిన టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డిని రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్‌గా నియమించారన్నారు. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు 21 మంది ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీలు వేశారన్నారు. ప్రతి జిల్లాకు కోవిడ్ స్పెషలాఫీసర్లుగా సీనియర్ అధికారులను నియమించినట్లు తెలిపారు. కోవిడ్ బాధితుల వైద్యం కోసం మందులు, ఆక్సిజన్ కొరత రానీయకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. నిబంధనలు పాటించాలి కరోనా చికిత్సలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోని ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పని చేస్తోందన్నారు. -
18 ఏళ్లు పైబడిన అందరికీ టీకా
-
18 ఏళ్లు పైబడిన అందరికీ టీకా
సాక్షి, న్యూఢిల్లీ: మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకా వేసేందుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. 45 ఏళ్లు పైబడిన వారికి ఎప్పటిలాగే ప్రభుత్వం ఉచితంగా వేస్తుంది. కానీ 18 ఏళ్ల నుంచి 45 లోపు వారికి నిర్ధిష్ట రుసుము చెల్లించడం ద్వారా టీకా వేసేందుకు ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చింది. మొత్తం వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలకు రిజర్వ్ చేసింది. బహిరంగ మార్కెట్లో కోవిడ్ వ్యాక్సిన్లను సేకరించే ప్రైవేటు ఆసుపత్రులు... తాము టీకా ప్రతి డోసుకు వసూలు చేసే చార్జీలను పారదర్శకంగా ప్రకటించాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన వ్యాక్సిన్ విధానంపై సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్కువ వ్యవధిలో గరిష్ట సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ పొందగలిగేలా ప్రభుత్వం ఏడాది నుంచి కృషి చేస్తోందని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచ రికార్డు వేగంతో ప్రజలకు టీకాలు వేస్తోందని, మరింత వేగంతో కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. జాతీయ కోవిడ్ –19 టీకా వ్యూహం ఒక క్రమబద్ధమైన, థర్డ్ పార్టీ సాయం అవసరం లేని ఎండ్ టూ ఎండ్ విధానంలో నిర్మితమైందని ప్రభుత్వం తెలిపింది. అధిక ప్రభావం ఉన్న వర్గాలకు ముందుగా తొలి రెండు విడతల్లో టీకాలకు అనుమతి ఇచ్చిన కేంద్రం ఇప్పుడు మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలకు అనుమతి ఇచ్చింది. తొలి విడతగా జనవరి 16, 2021 నుంచి ఆరోగ్య రంగ సిబ్బందికి, ఇతర ఫ్రంట్ లైన్ సిబ్బందికి టీకాకు అనుమతి ఇచ్చింది. అనంతరం మార్చి 20 నుంచి రెండో దశలో 45 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. రెండు దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడంతో పాటు తాజాగా మూడోది విదేశీ వ్యాక్సిన్ (స్పుత్నిక్)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిని భవిష్యత్తులో దేశంలో తయారు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మూడో దశలో జాతీయ టీకా వ్యూహాన్ని మరింత సరళీకరించి కవరేజీని పెంచాలని కేంద్రం నిర్ణయించింది. మూడో దశ టీకా వ్యూహం ఇలా.. ► టీకా తయారీదారులు తమ నెలవారీ సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీలో విడుదల చేసిన మోతాదుల్లో 50% కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంటుంది. మిగిలిన 50% రాష్ట్ర ప్రభుత్వాలకు, బహిరంగ మార్కెట్‌కు సరఫరా చేసేందుకు అనుమతి ఉంటుంది. ► రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగ మార్కెట్లకు సరఫరా చేసే 50 శాతం టీకాల ధరను పారదర్శకంగా మే 1కి ముందే తయారీదారులు ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ధరకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, పారిశ్రామిక సంస్థలు మొదలైనవి తయారీదారుల నుంచి టీకాలను సేకరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన 50 శాతం వాక్సిన్లు కాకుండా, ఇతర 50 శాతం నుంచే ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాక్సిన్లు సేకరించుకోవాల్సి ఉంటుంది. ఇలా 18 ఏళ్లు పైబడిన అందరికీ టీకా అందుబాటులోకి వస్తుంది. ► ప్రభుత్వం ద్వారా ఇంతకుముందులాగే ఉచితంగా టీకాలు వేయడం కొనసాగుతుంది. ఇంతకుముందు నిర్వచించిన విధంగా అర్హతగల జనాభాకు అనగా హెల్త్ కేర్ వర్కర్స్కు, ఫ్రంట్ లైన్ వర్కర్స్కు, 45 ఏళ్లు పైబడిన అందరికీ ప్రభుత్వం ఉచితంగా టీకా వేస్తుంది. ► ప్రభుత్వం అయినా, ప్రైవేటు ద్వారా అయినా టీకా వేసే ముందు అన్ని నిర్ణీత నిబంధనలు పాటించాలి. ► 50% కేంద్ర ప్రభుత్వానికి, మిగిలిన 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలన్న నిబంధన వ్యాక్సిన్ తయారీదారులందరికీ దేశమంతటా వర్తిస్తుంది. అయితే విదేశాల నుంచి దిగుమతయ్యే వ్యాక్సిన్లను వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలను కేంద్రం అనుమతిస్తుంది. ► కేంద్ర ప్రభుత్వం తమ వాటా నుంచి వ్యాక్సిన్లను యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య, పనితీరు (పరిపాలన వేగం) వంటి ప్రమాణాల ఆధారంగా రాష్ట్రాలకు కేటాయిస్తుంది. టీకా వృ«థా ఎక్కువగా ఉంటే ప్రతికూలాంశంగా పరిగణిస్తారు. ఆమేరకు కేంద్రం నుంచి వ్యాక్సిన్ల కేటాయింపు తగ్గుతుంది. ఆయా ప్రమాణాల ఆధారంగా, రాష్ట్రాల వారీగా కోటా నిర్ణయిస్తారు. ► రెండో డోస్ పెండింగ్‌లో ఉంటే దానికి తగిన ప్రాధాన్యత ఇస్తారు. ఇందుకోసం కేంద్రీకృత వ్యూహాన్ని రూపొందించి తెలియపరుస్తారు. -
టీకా ధర రూ.250, కో–విన్ యాప్ డౌన్లోడ్ ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్: దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. 60 ఏళ్లకు పైగా వయసున్న, 45 ఏళ్లకు పైగా వయసుండి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రుసుము చెల్లించి టీకా పొందవచ్చు. ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా టీకా ధరను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో డోసుకు రూ.250 వరకు వసూలు చేయొచ్చని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. అంతకుమించి వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశాయి. ఇందులో టీకా డోసు ధర రూ.150 కాగా, సర్వీసు చార్జీ రూ.100 ఉంటుంది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఇదే ధర అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్కరు రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటళ్లలో రెండు డోసులకు గాను మొత్తం రూ.500 చెల్లించాలి. రెండో దశ వ్యాక్సినేషన్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా ధరపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, అధికారులతో మాట్లాడారు. ఆన్–సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కోవిడ్–19 వ్యాక్సినేషన్ సెంటర్లుగా పనిచేస్తూ కరోనా వ్యాక్సిన్ అందజేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలను కో–విన్ 2.0 పోర్టల్, ఆరోగ్య సేతు యాప్‌లో పొందుపర్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఆయా కేంద్రాల్లో లబ్ధిదారులకు ఏ రోజు, ఏ సమయంలో వ్యాక్సిన్ ఇస్తారన్న సమాచారం ఇందులో ఉంటుందని పేర్కొంది. లబ్ధిదారులు కో–విన్ 2.0 పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా ముందుగా అపాయింట్మెంట్ పొందాలని సూచించింది. వారు తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంచుకోవచ్చని వివరించింది. ఆన్–సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా ఉందని గుర్తుచేసింది. అంటే సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి, అప్పటికప్పుడు పేరు నమోదు చేసుకొని, టీకా పొందవచ్చు. 45 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసుండి వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు ఆర్ఎంపీ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి. అలాగే మార్చి 1 నుంచి కో–విన్ 2.0 పోర్టల్ ద్వారా ముందస్తు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ టీకా ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో చేరిన 10,000 ప్రైవేట్ ఆస్పత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో(సీజీహెచ్ఎస్)లో చేరిన 600కి పైగా ఆసుపత్రులతోపాటు రాష్ట్ర ఆరోగ్య బీమాలో భాగంగా ఉన్న ఆసుపత్రుల్లో కరోనా టీకా అందజేస్తారు. రెండో దశలో టీకా అందించే అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల జాబితాను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు జాతీయ ఆరోగ్య అథారిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. వీటికి అదనంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సబ్ డివిజనల్ ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లుగా ఉపయోగించుకుంటారు. కో–విన్లో రిజిస్ట్రేషన్‌తో టీకా వ్యాక్సినేషన్ రెండో దశ మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. టీకా వేయించుకునే వారు కో–విన్ యాప్ ద్వారా ముందుగా పేరు నమోదు చేయించుకోవచ్చు. లేదా నేరుగా కోవిడ్–19 వ్యాక్సినేషన్ కేంద్రా(సీవీసీ)లకు వెళ్లి పేరు రిజిస్టర్ చేయించుకుని టీకా వేయించుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కో–విన్ యాప్‌తోపాటు ఆరోగ్య సేతు వంటి ఐటీ అప్లికేషన్ల ద్వారా పేర్లను ముందుగా నమోదు చేసుకోవచ్చు. టీకా సెషన్ ప్రాంతంలోకి లబ్ధిదారులు నేరుగా వెళ్లి రిజిస్టర్ చేయించుకోవచ్చు. కో–విన్ యాప్ 2.0 కొత్త వెర్షన్ నేడో రేపో విడుదల కానుంది. దీన్లో టీకా సెషన్ ప్రాంతం, సమయాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. లబ్ధిదారులు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల్లో ఏది కావాలో ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండదు. లబ్ధిదారులు తమ సొంత రాష్ట్రం కాకుండా వేరే ప్రాంతంలోనూ టీకా వేయించుకునేందుకు వీలుంది. 60 ఏళ్లు పైబడిన వారు గుర్తింపు కార్డును, 45 ఏళ్లు పైబడి ఇతర వ్యాధులతో బాధపడే వారు మెడికల్ సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వ్యాధుల బాధితులకు సంబంధించి 20 రకాల ఆరోగ్య పరిస్థితులను కేంద్రం గుర్తించింది. ఇందులో గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, హైపర్‌టెన్షన్ తదితరాలున్నాయి. డౌన్లోడ్ ఎలా? కో–విన్ యాప్ 2.0 వెర్షన్‌ను సోమవారం నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి గానీ యాపిల్ ప్లే స్టోర్ నుంచి గానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో యూజర్ అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, బెనిఫిషియరీ మాడ్యూల్, బెనిఫిషియరీ ఎక్నాలెడ్జ్మెంట్, స్టేటస్ అప్డేట్ అనే మాడ్యూళ్లున్నాయి. ఫ్రంట్‌లైన్ వర్కర్ల జాబితాలో లేని వారు పేరు నమోదుకు రిజిస్ట్రేషన్ మాడ్యూల్‌లోని సెల్ఫ్ రిజిస్ట్రేషన్‌లో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి దాదాపు పది ధ్రువీకరణల్లో ఏదేని ఒకటి అప్లోడ్ చేయాలి. మొబైల్ ఫోన్ నంబర్ రిజిస్టర్ చేశాక లబ్ధిదారులకు ఓటీపీ అందుతుంది. దీనిద్వారా అకౌంట్ క్రియేట్ అవుతుంది. టీకా తీసుకున్న తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ అందుతుంది. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధర ఇలా..
న్యూఢిల్లీ : ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా వ్యాక్సిన్ ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ ఒక్కో డోసును 250 రుపాయలకు అందించాలని శనివారం కేంద్రం అధికారికంగా ప్రకటించింది. అందులో 100 రూపాయలు సర్వీస్ ఛార్జ్ కాగా 150 రుపాయలుగా టీకా ఖరీదుగా పేర్కొంది. ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ వ్యాక్సిన్ ధర రూ 250కి మించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వీటిని ఆస్పత్రి వర్గాలకు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఉచితంగా వాక్సినేషన్ పంపిణీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్థానికంగా ఉన్న ప్రైవేట్ వాక్సినేషన్ కేంద్రాలకు టీకా ధరలను తెలియజేయాలని కేంద్రం పేర్కొంది. మరోవైపు తొలిదశలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్ అందించిన కేంద్రం మార్చి 1 నుంచి 65 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేట్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. ఇక తెలంగాణలో మొత్తం 1200 కేంద్రాల్లో 60 ఏళ్ళు పై బడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నారు. అందులో 200 కేంద్రాలు ప్రైవేట్‌కు చెందినవే ఉన్నాయి. చదవండి: వృద్ధులకు టీకా దరఖాస్తు ప్రారంభం -
తెలంగాణలో ‘ప్రైవేట్’ టీకా రేటెంతో..?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేసే కరోనా టీకాకు ఎంత ధర ఖరారు చేస్తారన్న దానిపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చ మొదలైంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ వర్గాలకు చెందినవారు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న 236 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా టీకా వేయించుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తప్ప ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేసేందుకు అనుమతి లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేశా యి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు చెల్లించి టీకా తీసుకోవాలని తెలిపాయి. అంతమాత్రాన వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లోకి వచ్చినట్లుగా భావించకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా ధర ఎంత ఉండవచ్చనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే రూ.300 నుంచి రూ.400 మధ్య ఉండే అవకాశముందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై నేడో రేపో స్పష్టత వస్తుందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మాత్రమే ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ కనుసన్నల్లోనే ప్రైవేట్ వ్యాక్సినేషన్! ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో టీకా కార్యక్రమాన్ని ఎవరు పర్యవేక్షిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే ఆయా ఆసుపత్రులకు ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్ నుంచే టీకాలు సరఫరా అవుతాయా లేక నేరుగా కంపెనీల నుంచే వెళతాయా అన్నదానిపైనా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వస్తాయని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోవిన్ యాప్‌ను ఆధునీకరించే పనిలో ఉంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించి, కొన్ని మార్పులు చేర్పులతో కోవిన్ యాప్ రెండో వెర్షన్‌ను తీసుకురానుంది. అది నేడో రేపో అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వారికి సరఫరా అయిన వ్యాక్సిన్ వివరాలు తప్పనిసరిగా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అర్హులైన లబ్ధిదారుల వివరాలను యాప్‌లో నమోదు చేశాకే టీకా వేయాలి. అలాగే ఏరోజు ఎన్ని టీకాలు వేశారో ఇంకెన్ని మిగిలాయో నమోదు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రైవేట్‌లోనూ పకడ్బందీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని, దీన్ని పర్యవేక్షించేందుకు కొందరు అధికారులను నియమిస్తామని కూడా ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీకా వేసే సిబ్బందికి ఈ మేరకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కేసులు నమోదైనా వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. టీకా ఉచితంగా తీసుకోండి ప్రైవేట్‌లో డబ్బులకు కరోనా టీకా వేస్తారు కాబట్టి, లబ్ధిదారులు ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేసే టీకాలనే తీసుకోవాలి. కిందిస్థాయి పీహెచ్‌సీలు మొదలు గాంధీ, ఉస్మానియా వంటి పెద్దాసుపత్రుల వరకు దాదాపు 1,250కు పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా అందుబాటులో ఉంది. మున్ముందు రాష్ట్రంలో దాదాపు 4,500కు పైగా ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ టీకా అందుబాటులో ఉంచుతాం. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు -
ప్రతి 5 నిమిషాలకు ఏడుగురి జననం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఐదు నిమిషాలకు ఏడుగురు శిశువులు కొత్త ప్రపంచానికి పరిచయమవుతున్నారు. అంటే నిమిషానికి 1.39 మంది పుడుతున్నట్టు లెక్క. సగటున రోజుకు 2,013 మంది జనాభా లెక్కల్లోకి ఎక్కుతున్నట్టు తాజా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే గడిచిన 10 నెలల్లో 6,03,977 మంది శిశువులు రాష్ట్రంలో జన్మించారు. వీళ్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జనన నమోదు పత్రాలు ఇచ్చారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో శిశువులు పుడుతున్నట్టు తేలింది. 6,03,977 ప్రసవాల్లో ఆస్పత్రుల్లో జరిగినవి 6,01,652. అంటే 99.85 శాతం మంది ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో పుట్టిన వారే. ప్రభుత్వాస్పత్రుల్లో పుట్టిన వారు 2,44,876 మంది (40.70 శాతం) ఉన్నారు. మిగతా 59.30 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో జన్మించారు. 25 వేల మందికి పైగా బరువు తక్కువ 6,03,977 మంది శిశువుల్లో 25,451 మంది 2 కేజీలు.. అంతకంటే తక్కువ బరువుతో పుట్టినట్టు గణాంకాల్లో వెల్లడైంది. ఇలాంటి బరువు తక్కువ పిల్లలు కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. చాలా మంది తల్లులు ప్రసవం అయిన గంటలోగానే తల్లిపాలు బిడ్డకు పడుతున్నారు. మొత్తం ప్రసవాల్లో 97.68 శాతం మంది తల్లులు శిశువు పుట్టిన గంటలోపే పాలు పడుతున్నారు. దీనివల్ల బిడ్డకు అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 95.86 శాతం మంది తల్లులు తమ బిడ్డకు బీసీజీ, పోలియో, తట్టు తదితర వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నట్టు వెల్లడైంది. -
సిజేరియన్ డెలివరీలపై ఆడిట్
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా కోతల ప్రసవాలు (సిజేరియన్ డెలివరీలు) ఎక్కువవుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేశాయి. మొత్తం ప్రసవాల్లో 10 నుంచి 15 శాతానికి మించి ఈ తరహా ప్రసవాలు జరగకూడదని, అలాంటిది 70 – 80 శాతం జరుగుతున్నాయని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎక్కువ సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రత్యేక ఆడిట్ జరగాలని ఆదేశించాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. భారతదేశంలో దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎక్కువ సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నట్టు తేలింది. ఈ ప్రసవాలకు విధిగా ఆడిట్ నిర్వహించాలని, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ప్రతి డాక్టరూ లెక్క చెప్పాల్సి ఉంటుంది. దీనిపై త్వరలోనే ఏపీ సర్కారు మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు శ్రుతిమించి పోయాయని సీడీసీ (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) అభిప్రాయ పడింది. రమారమి 70 శాతం సిజేరియన్ ప్రసవాలు ప్రైవేటులో నమోదవుతున్నాయి. త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్లోనూ ఈ తరహా ప్రసవాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిజేరియన్ ప్రసవాలతో రిస్కే – సిజేరియన్ ప్రసవాలతో ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే అని ప్రముఖ వైద్య విజ్ఞాన సంస్థల నిపుణులు చెబుతున్నారు. లాన్సెట్ లాంటి ప్రముఖ సైన్స్ పబ్లికేషన్ సంస్థలూ ఇదే అభిప్రాయాన్ని చెప్పాయి. – అవసరం లేకపోయినా సిజేరియన్ చేసిన మహిళలకు రెండో కాన్పులో ఇబ్బందులు వస్తున్నాయి. సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన బిడ్డ కంటే సిజేరియన్ ద్వారా పుట్టిన బిడ్డకు శ్వాస కోశ ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువ. – అనస్థీషియా (మత్తుమందు) ఇవ్వడం ద్వారా తల్లీ బిడ్డలు ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. తల్లులకూ, చిన్నారులకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువ. సిజేరియన్ ద్వారా రక్తస్రావం (బ్లీడింగ్) జరిగి ఎనీమియాకు గురవుతున్నారు. ప్రసవాలకు ఆడిట్ ముఖ్యం – రాష్ట్ర ప్రభుత్వం సిజేరియన్ ప్రసవాలను తగ్గించేందుకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ఆధారంగా వీటిని తయారు చేశారు. అవి ఇలా ఉన్నాయి. –అన్ని సౌకర్యాలతో ఉన్న ఆస్పత్రుల్లో సిజేరియన్ రేట్లను హేతుబద్దీకరించడం. – ప్రతి ఆస్పత్రిలో సిజేరియన్ ప్రసవానికి గల కారణాలను రాబట్టడం. – సిజేరియన్‌కు అవసరమైన క్లినికల్ ఆధారాలను ప్రతి ఒక్కరూ చూపించాలి. – ఆస్పత్రి యాజమాన్యం లేదా డాక్టరు విధిగా ప్రభుత్వానికి సిజేరియన్ ప్రసవం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో చెప్పాలి. – ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ చేసిన వైద్యులు తమ విభాగాధికారికి నివేదిక ఇవ్వడం. – ఆడిట్ నిర్వహణ చూస్తున్న వైద్యులు విధిగా నిబంధనలు పాటించాలి. – ప్రతి 15 రోజులకోసారి ప్రసూతి వైద్యులు, డీఎన్బీ వైద్యులతో ఆడిట్‌పై సమీక్ష నిర్వహించాలి. నెలకోసారి సిజేరియన్ ప్రసవాల నివేదిక (ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన) విడుదల చేసి, సమీక్షించాలి. -
ప్రసవాలకు ఏటా రూ.వెయ్యి కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులకు రూ.వెయ్యి కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. అనేక కుటుంబాలు భారమైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులకే మొగ్గు చూపుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని ఎక్కువ ప్రైవేటు ఆస్పత్రులు భారీగా సొమ్ము వసూలు చేస్తున్నాయి. ఎక్కువమందికి సిజేరియన్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడాదికి ఏడులక్షలకుపైగా ప్రసవాలు జరుగుతుండగా.. అందులో 40.68 శాతం ప్రసవాలు మాత్రమే ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు ఆస్పత్రుల్లోనే. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాల్లో సగటున ఒక్కోదానికి రూ.23,200 ఖర్చవుతున్నట్టు అంచనా. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో 66 శాతం వరకు కోతల కాన్పులే. ప్రభుత్వాస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో సిజేరియన్ల శాతం చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని సర్కారు కసరత్తు చేస్తోంది. మూడేళ్ల కిందట 30 శాతం మాత్రమే ఉండగా ఇప్పుడు 40.68 శాతానికి పెరిగింది. ప్రభుత్వాస్పత్రులకు ఎందుకు రావడం లేదు? ► ప్రభుత్వాస్పత్రుల్లో సకాలంలో డాక్టర్లు అందుబాటులో ఉండరు అనే భావన ఇంకా ఉంది. ► సరిగా చూడటం లేదని పేషెంట్లలో అనుమానాలున్నాయి. ► రాత్రిపూట ప్రైవేటుకు వెళ్లగానే ఫోన్‌చేస్తే డాక్టరు వచ్చి ప్రసవం చేస్తారని భావన ఉంది. ► పారిశుధ్యం నిర్వహణ సరిగా ఉండదనేది మెజారిటీ పేషెంట్ల అభిప్రాయం. ► గైనకాలజీ, మత్తు వైద్యులు, పిల్లల వైద్యులు అన్ని చోట్లా లేరు. ► నర్సులు, ఇతర సిబ్బంది పేషెంట్లను సరిగా పట్టించుకోవడం లేదనే భావన ఉంది. ప్రభుత్వాస్పత్రులకు వెళితే లాభాలేమిటి ? ► ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా సాధారణ ప్రసవానికే పెద్దపీట వేస్తారు. ► ప్రసవం అయిన వెంటనే బిడ్డకు బర్త్ రిజి్రస్టేషన్ చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థికసాయం అందుతుంది. ► రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. డిశ్చార్జి అయ్యేవరకు మందులతో సహా ఉచితమే. ► రవాణా భారం ఉండదు. ఫోన్ చేయగానే 108 వాహనం ఆస్పత్రికి చేరుస్తుంది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఇంటిదగ్గర దించుతుంది. ► పుట్టగానే బిడ్డకు వ్యాధినిరోధక టీకాలన్నీ ఉచితంగానే వేస్తారు. ప్రతి ప్రసవం విషయంలోనూ అధికారుల బాధ్యత ఉంటుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ► వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చేయడం. ► సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ముగ్గురు వైద్యనిపుణుల బృందం ఉండేలా చూడటం. ► ప్రసవానికి వచ్చేవారిని గౌరవంగా చూసేలా సిబ్బందికి ఆదేశాలు. ► ఆస్పత్రుల్లో ప్రసూతి గదులను ఉన్నతీకరించడం. ► కొన్ని ఆస్పత్రుల్లో హెచ్‌డీయూ (హై డిపెండెన్సీ యూనిట్)ల ఏర్పాటు. ► ప్రసూతితో పాటు నవజాత శిశువులకు ప్రత్యేక గదుల ఏర్పాటు -
కడుపు కోయకుండా కాన్పు చేయరు!
సాక్షి, హైదరాబాద్: అమ్మ పొట్టకు కోత తప్పడం లేదు. సిజేరియన్ లేకుండా డాక్టర్లు బిడ్డను బయటకు తీయడంలేదు. రాష్ట్రంలో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 82.4 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 తెలిపింది. ఈ మేరకు తాజాగా 31 జిల్లాల వారీగా సర్వే వివరాలను వెల్లడించింది. అత్యంత తక్కువగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 27.2 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని పేర్కొంది. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లోనైతే కరీంనగర్ జిల్లాలో ఏకంగా 92.8 శాతం సిజేరియన్ ద్వారానే బిడ్డను బయటకు తీస్తున్నారు. ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 65.8 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్లు అత్యధికంగా జనగామ జిల్లాలో 73 శాతం జరుగుతుండగా, అత్యంత తక్కువగా కొమురంభీం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16.6 శాతం జరుగుతున్నాయి. పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం.. రాష్ట్ర ప్రజలను జీవనశైలి వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి రోగాలతో హైదరాబాద్ ప్రజలు సతమతమవుతున్నారు. షుగర్ వ్యాధితో హైదరాబాద్‌లో 26.8 శాతం మంది పురుషులు బాధపడుతుండగా, మహిళల్లో 21.2 శాతం మంది మధుమేహంతో ఇబ్బందిపడుతున్నారు. అత్యంత తక్కువగా కొమ్రంభీం జిల్లాలో పురుషులు 11.6 శాతం, మహిళలు 8.4 శాతం మంది షుగర్ వ్యాధికి గురయ్యారు. అధిక రక్తపోటుతోనూ హైదరాబాద్ జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక్కడి పురుషుల్లో 41.7 శాతం మంది, మహిళల్లో 30.2 శాతం మంది బీపీతో బాధపడుతున్నారు. అత్యంత తక్కువగా నల్లగొండ జిల్లాలో పురుషులు 25.7 శాతం, మహిళలు 19.6 శాతం మంది బీపీకి గురయ్యారు. ఇక రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లల్లోనూ ఊబకాయం పెరుగుతోంది. అత్యధికంగా జనగామ జిల్లాలో 6.4 శాతం మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. తర్వాత జగిత్యాల జిల్లాలో 5.5 శాతం, హైదరాబాద్ పిల్లల్లో 4.3 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 3.7 శాతం, ఆదిలాబాద్‌లో 2.9 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 1.4 శాతం, మేడ్చల్ మల్కాజిగిరిలో 1.2 శాతం, మెదక్ జిల్లాలో 1.1 శాతం, వికారాబాద్ జిల్లాలో 0.8 శాతం పిల్లల్లో ఊబకాయం సమస్య ఉంది. -
ఈఎస్ఐ సభ్యులు నేరుగా ప్రైవేట్ ఆసుపత్రికెళ్లొచ్చు
న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ) సభ్యులు ఇకపై అత్యవసర పరిస్థితుల్లో తమ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి నేరుగా ఆరోగ్య సేవలు పొందవచ్చు. ఈ వెసులుబాటును సంస్థ యాజమాన్యం కల్పించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన ప్రకారం.. ఈఎస్ఐసీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు(లబ్ధిదారులు) తొలుత ఈఎస్ఐసీ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో చేరాల్సి ఉంటుంది. అక్కడి వైద్యుల సిఫార్సు మేరకు ప్రైవ్రేట్ హాస్పిటళ్లలో చేరొచ్చు. ఎమర్జెన్సీ కేసుల విషయంలో ఈఎస్ఐసీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండానే నేరుగా ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లి, సేవలు పొందవచ్చని టీయూసీసీ జనరల్ సెక్రెటరీ ఎస్.పి.తివారీ చెప్పారు. సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని వల్ల ఎంతోమంది లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అన్నారు. గుండె పోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉంటుందన్నారు. -
పట్టణ పేదలకు ఆరోగ్య ధీమా
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలే కాదు.. పట్టణ పేదలకూ సర్కారు ఆరోగ్య ధీమా ఇచ్చింది. పట్టణాల్లో పేదలు, మధ్యతరగతి వారు ఆస్పత్రుల ఖర్చు భరించలేనంతగా పెరగడంతో వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తూ 560 పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 1.60 కోట్ల మంది పట్టణాల్లో ఉన్నారు. అందులో 37 శాతంమంది మురికివాడల్లో ఉంటున్నారు. వైద్యం అవసరమైనవారు పెద్దాస్పత్రులకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది. ప్రైవేటు డాక్టరు దగ్గరికి వెళితే ఫీజు, వ్యాధి నిర్ధారణ పరీక్షల బిల్లులు భరించలేనంతగా ఉంటున్నాయి. దీంతో వారు ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను మరింత చితికిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. పట్టణాల్లో ఉన్న పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 260 పట్టణ ఆరోగ్యకేంద్రాలను, 71 కుటుంబ ఆరోగ్యకేంద్రాలను (మొత్తం 331) ఉన్నతీకరిస్తూ, కొత్తగా 229 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భవనాల నిర్మాణం, మరమ్మతులు, పరికరాలు, ఫర్నిచర్ కోసం రూ.416.50 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వైద్యులు, ల్యాబ్టెక్నీషియన్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, సహాయక సిబ్బంది 560 మంది వంతున, స్టాఫ్ నర్సులు 1,120 మంది ఉంటారు. దేశంలోనే మొదటిసారిగా.. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రమూ పట్టణాల్లో ప్రాథమిక ఆరోగ్యంపై ఇంత భారీస్థాయిలో ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. తొలిసారిగా 111 మున్సిపాలిటీల్లో 560 ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది మన రాష్ట్రంలోనే. స్పెషాలిటీ వైద్యానికి ఎలాగూ బోధనాస్పత్రులున్నాయి. ప్రాథమిక ఆరోగ్యం అంటే.. చిన్న జ్వరాలు, గాయాలు వంటి వాటికి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించకుండా భారీవ్యయంతో పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా 8,600కుపైగా వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేవలు ఇలా ► పట్టణాల్లో ఉన్న వారికి 15 నిమిషాల నడక దూరంలో ఆస్పత్రి ఉంటుంది. ► డాక్టరు, స్టాఫ్ నర్సుతో పాటు అత్యవసర వైద్యసేవలకోసం ఆరు పడకలుంటాయి. ► 63 రకాల రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులో.. ► ప్రస్తుతం 260 వరకు పట్టణ ఆరోగ్యకేంద్రాలు పీపీపీ పద్ధతిలో నడుస్తున్నాయి. ► వీటికోసం ఏటా రూ.150 కోట్లు ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారు. ► ఇదే రూ.150 కోట్లతో అంతకంటే మెరుగ్గా 560 కేంద్రాల్లో సేవలు అందిస్తారు. ► తాజా పట్టణ జనాభా ప్రకారం 26,500 మందికి ఒక ఆరోగ్యకేంద్రం ఉంటుంది. ► గతంలో పీపీపీ కింద అమలవుతున్న ఆరోగ్యకేంద్రాలు 79 పట్టణాల్లో మాత్రమే ఉండేవి. ► ఇప్పుడు 111 పట్టణాల్లోనూ ఆరోగ్యకేంద్రాల సేవలు అందుతాయి. -
అధిక బిల్లులు వాస్తవమే!
సాక్షి, హైదరాబాద్: కరోనా వేళ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కాసులకు కక్కుర్తి పడిన విషయం వాస్తవమేనని టాస్క్‌ఫోర్స్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఫీజుల పేరుతో బాధితుల నుంచి లక్షల రూపాయలు గుంజాయని తేల్చినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను ధిక్కరించి, అంటువ్యాధుల చట్టాన్ని అతిక్రమించినట్లు టాస్క్‌ఫోర్స్ గుర్తించినట్లు సమాచారం. కరోనా చికిత్సలో ప్రైవేట్ ఆసుపత్రుల పనిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఐఏఎస్‌లతో రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టాస్క్‌ఫోర్స్‌లో సీనియర్ ఐఏఎస్‌లు రాహుల్ బొజ్జా, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య ఉన్నారు. తాజాగా చేసిన తనిఖీలు, ఆసుపత్రుల్లో జరిగిన అక్రమ వసూళ్లపై ఈ టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి నేడో రేపో నివేదిక ఇస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఫిర్యాదులు వచ్చిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో టాస్క్‌ఫోర్స్ బృందం ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసింది. ఇప్పటివరకు ఆయా ఆసుపత్రులు చేసిన కరోనా చికిత్సలు, వాటికి వేసిన బిల్లులను, రికార్డులను ఈ బృందం క్షుణ్నంగా అధ్యయనం చేసింది. కొందరు సీనియర్ వైద్య నిపుణుల సాంకేతిక సహకారాన్ని కూడా తీసుకున్నారు. కరోనా బాధితులకు ఉన్న లక్షణాలు, ఆసుపత్రులు నిర్వహించిన చికిత్సను వైద్య నిపుణులు పరిశీలించారు. చికిత్సలో భాగంగా బాధితులకు ఉన్న లక్షణాలు, ఇచ్చిన మందులు, అనవసరంగా ఏమైనా వైద్యం చేశారా?.. వంటి వాటిని బృందం సభ్యులు సరిచూశారు. కరోనాకు వసూలు చేయాల్సిన గరిష్ట రేట్లతో పోల్చి ఏ మేరకు అధికంగా వసూలు చేశారన్న దానిపైనా పరిశీలన చేశారు. విచిత్రమేంటంటే.. కొన్ని ఆసుపత్రులైతే సర్కారు రేట్లకు ఏకంగా 15 రెట్లు కూడా అధికంగా వసూలు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ విచారణలో తేలినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన ధరలను ప్రైవేట్ ఆస్పత్రులు తమ ప్రాంగణంలో ప్రముఖంగా ప్రదర్శించాలని ఆదేశించినా కొన్నిచోట్ల లేకపోవడంపై టాస్క్‌ఫోర్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద తగు చర్యలు తీసుకునే విషయంలో కూడా టాస్క్‌ఫోర్స్ ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. కరోనా చికిత్స, భద్రతా ప్రొటోకాల్‌లను పాటిస్తున్నాయా?.. లేదా?.. కూడా పరిశీలించింది. -
కోవిడ్ పరీక్షల ధరలు తగ్గింపు
సాక్షి, అమరావతి: ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్షల ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్‌సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వమే నమూనాలను పంపిస్తే టెస్టు ధర గతంలో రూ.2,400 ఉండేది, ఇప్పుడు దాన్ని రూ.1,600 చేశారు. అదే నేరుగా ప్రైవేటు ల్యాబ్‌లే నమూనాలు సేకరించి పరీక్షిస్తే గతంలో రూ.2,900గా నిర్ణయించారు. ఇప్పుడా ధరను రూ.1,900కి కుదించారు. ఐసీఎంఆర్ అనుమతి ఉన్న ల్యాబొరేటరీల్లో మాత్రమే ఈ టెస్టులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. (చదవండి: కోవిడ్ విధుల్లో వైద్యులు మరణిస్తే..) -
నర్సింగ్.. హోంలోనే..
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్నా ఆసుపత్రులకు రోగుల తాకిడి మాత్రం తగ్గుతోంది. గత నెల 27వ తేదీ నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 57,142... సరిగ్గా నెలకు అంటే ఈ నెల 26వ తేదీ నాటికి కేసుల సంఖ్య రెండింతలు అంటే 1,14,486 పెరిగాయి. గత నెల 27వ తేదీ నాటికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పడకల సంఖ్య 4,497. సరిగ్గా నెలకు వాటి సంఖ్య రెట్టింపు అంటే 9,136 పెరిగాయి. నెల రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యాయి. సాపేక్షంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలూ రెండింతలు పెరిగాయి. ఆసుపత్రుల సంఖ్య మూడింతలయ్యాయి. అయితే ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మాత్రం తగ్గిందని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి తాజాగా సమగ్ర నివేదిక సమర్పించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కొన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పడకలకు ఇంకా డిమాండ్ కొనసాగుతోంది. గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో ఉన్న 94 ఆక్సిజన్ బెడ్లన్నీ నిండిపోయాయి. సికింద్రాబాద్‌లో ఉన్న మరో ప్రముఖ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు 71 ఉంటే, 70 నిండిపోయాయి. అందులో 35 ఐసీయూ పడకలుంటే 30 నిండిపోయాయి. 21 శాతం తగ్గిన ఇన్‌పేషెంట్లు... రాష్ట్రంలో నెల క్రితం 55 ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు జరగ్గా, ఇప్పుడు ఆ సంఖ్య 171 ఆసుపత్రులకు పెరిగింది. పడకల సంఖ్యను రెట్టింపు చేసింది. కేసులు పెరుగుతున్నా, పడకలున్నా ఆసుపత్రుల్లో చేరేవారు తక్కువయ్యారు. గత నెల 27వ తేదీ నాటి లెక్క ప్రకారం... మొత్తం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు 4,497 ఉంటే, 3,032 పడకలు కరోనా రోగులతో నిండిపోయాయి. ఇంకా 1,465 పడకలు అంటే 32.57 శాతం మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కానీ, ఈ నెల 26వ తేదీ నాటి లెక్క ప్రకారం మొత్తం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు 9,136 ఉండగా, 4,246 నిండిపోయాయి. ఇంకా 4,890 ఖాళీగా ఉన్నాయి. అంటే సగానికి మించి ఏకంగా 53.52 శాతం ఖాళీగా ఉన్నాయి. అంటే అప్పటితో పోలిస్తే ఖాళీగా ఉన్న పడకల శాతం 20.95 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారి శాతం పెరిగింది. హైదరాబాద్‌ను మినహాయిస్తే జిల్లాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. నెల క్రితం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 73.45 శాతం పడకలు ఖాళీగా ఉండగా, ఇప్పుడు 68 శాతమే ఉన్నాయి. ఇళ్లలోనే చికిత్స పొందేవారు 14% పెరుగుదల... ఇళ్లలో చికిత్స పొందే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల 27న యాక్టివ్ కేసులు 13,753 ఉండగా, అందులో ఇళ్లలో చికిత్స పొందినవారు 8,479 మంది(61 శాతం) ఉన్నారు. ఈ నెల 26వ తేదీ నాటి లెక్క ప్రకారం 27,600 యాక్టివ్ కేసులుంటే, వాటిల్లో 20,866 మంది(75 శాతం) ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. నెల రోజుల్లో ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందేవారు 14 శాతం పెరిగారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా బాధితులు ఎందుకు వెళ్లడం లేదన్న దానిపైనా ఆ శాఖ వర్గాలు అంచనా వేశాయి. ఆ కారణాలేంటంటే? ► ప్రైవేట్ ఆసుపత్రులపై జనంలో ఒకరకమైన ఏవగింపు పెరిగింది. 10–20–25 లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తుండటం. అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొనడం ► బీమా వర్తించదని చెప్పడం... డబ్బులు చెల్లించనిదే శవాలు కూడా అప్పగించకపోవడం ► ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యానికి ఖర్చు పెద్దగా ఉండదని, అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దని సర్కారు చేసిన ప్రచారం ఫలించడం ► నెల క్రితం కరోనా వచ్చిందంటే గజగజ వణికిపోయి ఆసుపత్రులకు పరుగులు పెట్టిన బాధితులు ఇప్పుడు చైతన్యవంతులవడం. సాధారణ లక్షణాలుంటే.. తెలిసిన డాక్టర్లను టెలి కన్సల్టేషన్ లేదా టెలి మెడిసిన్‌తో చికిత్స పొందుతుండటం ► మొదట్లో కరోనా అంటే జిల్లాల్లోని డాక్టర్లు కూడా భయపడిపోయారు. కానీ, ఇప్పుడు వారు కూడా కరోనా చికిత్సను నేరుగా లేదా టెలి కన్సల్టేషన్ పద్ధతిలో చికిత్స చేస్తుండటం. ► సీరియస్‌గా ఉండే కేసులు మాత్రమే ఆసుపత్రుల వరకు వెళ్తున్నాయి. కొందరైతే జ్వరం, దగ్గు వంటి కరోనా లక్షణాలు ఉంటే వెంటనే యాంటీబయోటిక్స్ సహా విటమిన్ మాత్రలు వాడుతున్నారు. -
ప్రైవేటు ఆస్పత్రుల ఇష్టారాజ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోవిడ్ మహమ్మారిని అడ్డం పెట్టుకుని వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. మానవత్వాన్ని మర్చిపోయి ధనమే పరమావధిగా వ్యవహరిస్తున్న వైద్య యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. జిల్లాలో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ రెండు ఆస్పత్రులను సీజ్ చేసింది. మరికొన్ని ఆస్పత్రులలో తనిఖీలకు రంగం సిద్ధం చేస్తోంది. ఎవరైనా ప్రైవేటు ఆస్పత్రులలో అనుమతి లేకుండా కోవిడ్ వైద్యం చేసినా, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఎక్కువ వసూలు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వైద్యానికి అనుమతి ఉన్న ఆస్పత్రులతో పాటు, ఆరోగ్యశ్రీకి అనుమతి ఉన్న ఆస్పత్రుల యాజమాన్యాలతో కలెక్టర్ రేవు ముత్యాలరాజు గురువారం సమావేశం కానున్నారు. ఏలూరు, భీమవరంలలో ఆస్పత్రుల సీజ్ ఇప్పటికే ఏలూరులోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రితో పాటు భీమవరంలోని గాయత్రీ హాస్పిటల్‌పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేసి వాటిలో అక్రమంగా కోవిడ్ చికిత్సలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో వాటిని సీజ్ చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆ ఆస్పత్రుల యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. వారు సమాధానం ఇచ్చిన తర్వాత క్రిమినల్ చర్యలకు ఉపక్రమించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. రోగుల నుంచి భారీగా డిపాజిట్లు: మురళీకృష్ణ ఆస్పత్రిలో తనిఖీలు చేసినప్పుడు ఒక్కో రోగిని చేర్చుకునే ముందు వారి వద్ద నుంచి 2 లక్షల రూపాయల వరకూ డిపాజిట్లు కట్టించుకున్నట్లు నిర్ధారణైంది. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 12 మంది వరకూ మృత్యువాత పడినట్లు సమాచారం. కనీసం వెంటిలేటర్ సదుపాయం కూడా లేకుండానే ఈ ఆస్పత్రి వైద్యం పేరుతో దోపిడీకి పాల్పడినట్లు అధికారుల తనిఖీలలో తేలింది. గాయత్రి ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల ఓ సచివాలయ ఉద్యోగి భర్త కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రి వైఫల్యం వల్లే తన భర్త చనిపోయాడంటూ ఆ మహిళ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా ప్రైవేటు వైద్యశాలల్లో అనుమతి లేకుండా కరోనా రోగులకు వైద్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా రెమిడిసివిర్ మందులు కూడా పెద్ద ఎత్తున వాడుతున్నట్లు తెలిసింది. ప్రైవేటుకు ప్రభుత్వ కిట్లు: ఇదే సమయంలో ప్రభుత్వం ఉపయోగిస్తున్న కోవిడ్–19 ఏజీ రాపిడ్ కిట్లను కూడా ప్రైవేటు ల్యాబ్‌లలో గుర్తించారు. ఈ కిట్లు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉంటాయి. ఈ కిట్లు అడ్దదారిలో ప్రైవేటు ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు వెళ్లిపోవడం వెనుక ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఉన్నట్లు స్పష్టంగా కనపడుతోంది. ఈ ఇంటిదొంగలపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ కిట్లు మాయమయ్యాయి? ఎవరు సరఫరా చేస్తున్నారు? అన్న అంశాలపై విచారణ చేస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. అయితే ల్యాబ్ నిర్వాహకులు అనుమతులు లేకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రులు అసలు కోవిడ్ పరీక్షలు చేయకుండా సీటీ స్కాన్ చేసి దాని ద్వారా కోవిడ్ వైద్యం చేసేస్తున్నారు. ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి : డీఎంహెచ్ఓ విజయవాడ కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి చేసినట్లు డీఎంహెచ్ఓ కె.సునంద తెలిపారు. ఫైర్ సేఫ్టీ లేకపోతే కొత్తగా అనుమతులు ఇవ్వబోమని, ఇప్పుడు ఉన్న ఆస్పత్రులకు కూడా ఫైర్‌సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే ఆస్పత్రులు మూసివేస్తామని హెచ్చరించారు. అనుమతి లేకుండా వైద్యం చేసినా, రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడినా ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు. -
ఈ రోగం పేరు ‘దోపిడీ వైరస్’
కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. పాజిటివ్ కేసుల సంబంధీకులను కూడా వెంటనే గుర్తిస్తూ పరీక్షలను నిర్వహిస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలకు సైతం పరీక్షలను విస్తరించింది. ఇటీవల సంజీవని వాహనం ద్వారా ప్రజల ముంగిటకే పరీక్షల ప్రక్రియను తీసుకు వచ్చింది. తీవ్రతను బట్టి వాహనాన్ని పంపించి టెస్టులు చేస్తున్నారు. కొందరు అవగాహన లోపంతో ఇప్పటికీ కోవిడ్ టెస్టులు చేయించుకోకుండా సీటీ స్కాన్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇది సరికాదని కోవిడ్ అధికారులు ఖండిస్తున్నా గోప్యత కోసం కొందరు ప్రైవేట్ ఆస్పత్రులను..ఆర్ఎంపీలను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం సకల సదుపాయాలూ కల్పించి క్లిష్టమైన కేసులకుసైతం చికిత్స అందిస్తుంటే మరోవైపు కొందరు అవగాహనా రాహిత్యంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరమొుస్తే సీటీ స్కాన్ తీయించేసుకుంటూ ప్రైవేట్ వైద్యులకు కాసులు కురిపిస్తున్నారు. సాక్షి కడప: కోవిడ్ పరీక్ష చేయించుకుని వైద్యుల పర్యవేక్షణలో తగు జాగ్రత్తలు తీసుకొని మందులు వాడితే కరోనా జలుబు లాంటిదేనని ప్రభుత్వం తొలినాళ్ల నుంచి చెబుతోంది. పైగా చాలామందికి రోగ లక్షణాలు కూడా బయటపడకుండానే కొన్ని రోజులకు నెగెటివ్ వస్తోందని వైద్య సర్వే స్పష్టం చేస్తున్నా కొందరు ఇంకా పక్కదారి పడుతున్నారు. పరీక్షలు చేయించుకుంటే కరోనా బయటపడుతుందేమో అనే భయం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. దీంతో వారు కొందరు ఆర్ఎంపీలను సంప్రదిస్తున్నారు. మిడిమిడి జ్ఞానం ఉన్న వారు సాధారణ జ్వరాన్ని కూడా కరోనా పేరు చెప్పి చెమటలు పట్టిస్తున్నారు. కనీస దయ చూపించకుండా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు. సాధారణ జ్వరంతో వెళ్లిన వారిని కూడా సీటీ స్కానింగ్ చేయించుకొని రమ్మంటున్నారు. వారు చెప్పిన డయాగ్నటిక్ సెంటరుకు పంపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో కొందరు పేరు మోసిన ఆర్ఎంపీలకు సీటీ స్కానింగ్ కమిషన్ ఆర్జన విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. జ్వరంతో తమ వద్దకు వచ్చే వారిని అవసరం ఉన్నా.. లేకున్నా అడ్డగోలుగా పరీక్షలు చేయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాకు వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి ఇచ్చింది. స్వార్థంతో కొందరు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు కోవిడ్ వైద్యం చేయడానికి ముందుకు రాలేదు. కానీ తెరచాటున వైద్యం చేస్తూ రోగి నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ముందుగా డిపాజిట్ చేయించుకొని రోజుకు రూ.20 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం. వర్షాకాలం కావడంతో జలుబు, జ్వరాలతో జనాలు బాధపడుతున్నారు. కోవిడ్ అనే భయంతో కొందరు ముందు జాగ్రత్తగా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆయాసంతో వెళ్తే చాలు కొందరు వైద్యులు సీటీ స్కానింగ్‌కు సిఫార్స్ చేస్తున్నారు. అలా దోపిడీ మొదలవుతోంది. అవసరమైన పక్షంలో స్కానింగ్ చేయడం సమంజసమే అయినా ఇది విపరీత ధోరణులకు దారి తీస్తోంది. అనుమతి లేకుండా నిర్వహణ వైద్య ఆరోగ్యశాఖ రికార్డుల్లో లేని ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో సుమారు 350కి పైగా క్లినికల్ ల్యాబ్‌లు, 80 వరకు స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అనుమతి లేకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు. ప్రస్తుత కేసుల తీవ్రత..జనం బలహీనత ఆసరాగా కొన్ని స్కానింగ్ సెంటర్లు భారీగా రేట్లు పెంచేశాయి. గతంలో రూ. 2వేలు ఉన్న సీటీ స్కానింగ్ ధరలను కొందరు ఏకంగా రూ. 4500 నుంచి రూ. 6 వేలకు పెంచారు. స్కానింగ్ కోసం ప్రజలు చెల్లించే మొత్తంలో సుమారు 60 శాతం రెఫర్ చేసిన డాక్టర్లు, ఆర్ఎంపీలకు వెళుతుందనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని పల్మనాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లకు కరోనా లక్షణాలు, తీవ్రత గురించి నిర్ధారింగలరు. వీరు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తే పర్వాలేదు. చేయకుంటే ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేయాలి. ఇవేమీ చేయకుండా తమ ఆస్పత్రులలోనే వైద్యం చేసి భారీగా ఆర్జిస్తున్నారు. ర్యాపిడ్ టెస్ట్‌కు రూ.6 వేలు కరోనా వ్యాధి నిర్ధారణ కోసం ప్రభుత్వం ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్, ట్రూనాట్ టెస్ట్‌లను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఈ మూడింటిలోనూ స్వాబ్ తీసి పరీక్ష చేస్తారు. వీటి ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగానే కోవిడ్ పాజిటివ్, నెగిటివ్‌గా నిర్ధారణ జరుగుతోంది. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లలో ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నారు. రక్త నమూనాలను సేకరించి టెస్టు నిర్వహిస్తున్నారు. దీనివల్ల వచ్చే ఫలితం నమ్మశక్యం కానిదని ప్రభుత్వంతో పాటు సీనియర్ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా యాంటీ బాడీ టెస్టు చేస్తూ రూ. వేలు దోచేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అధికారులు ఇలాంటి వాటిపై దాడులు చేయడం ప్రారంభించారు. కాగా ఇటీవల కడపలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు రాత్రి 11 గంటల ప్రాంతంలో అత్యవసర వైద్యం కోసం వెళ్లిన రోగికి ర్యాపిడ్ టెస్ట్ చేశారు. 5 నిమిషాల్లో పాజిటివ్ అని చెప్పి రూ.5 వేలు తీసుకుని రోగి పరిస్థితి కూడా తెలుసుకోకుండా గేటు నుంచే పంపించేశారు. టెస్ట్ చేసినట్లు కాగితం ముక్క ఇవ్వండని సదరు ఆస్పత్రి యాజమాన్యానికి అడిగితే ‘ఇది అనధికారికం ఇచ్చేది లేద’ని చెప్పడం కొసమెరుపు. సీటీ స్కాన్ ద్వారా కరోనాను నిర్ధారించలేం సిటీస్కానింగ్ ద్వారా కరోనా వైరస్‌ను నిర్ధారించలేమని జిల్లాలోని ప్రముఖ, సీనియర్ ప్రభుత్వ వైద్యుడు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వైరస్ తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి స్కానింగ్ చేయాల్సి వస్తుందన్నారు. స్కానింగ్ పరీక్షలనే కొలమానంగా తీసుకొని కోవిడ్ నిర్ధారణ జరగదని తెలిపారు. ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల ద్వారా కరోనాను ప్రాథమిక దశలో గుర్తించవచ్చన్నారు. వీటి ద్వారానే సకాలంలో, కచ్చితమైన ఫలితాలను తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. వైరస్ సోకిన 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే సీటీ స్కాన్‌లో తెలుసుకోవచ్చని, ఒక్కోసారి స్కానింగ్‌లో కూడా తీవ్రత కనిపించదన్నారు. వర్షాకాలం కావడంతో న్యూమోనియో ఉన్నా స్కానింగ్‌లో చూపిస్తుందన్నారు. సీటీ స్కాన్ అనేది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆసుపత్రిలో కోవిడ్ నిర్ధారణయినవారికి అవసరమైతే వైద్యులు సూచిస్తారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇదే తరహా విధానం అమలులో ఉంది. సీటీ స్కాన్‌ను కోవిడ్ నిర్ధారణకు ఎక్కడా చేయడం లేదు. ఇది సరైన ప్రక్రియ కాదు..ఇదో కార్పొరేట్ హంగామా అని కోవిడ్ స్టేట్ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. సీఓఆర్ఏడీ4..5 అంటూ కరోనా పాజిటివ్ అని చెబుతూ వ్యాపారం మొదలెట్టేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కఠినచర్యలు తప్పవు.. కరోనా వైరస్ (కోవిడ్– 19) కు ఎవరు పడితే వారు వైద్యం అందించకూడదు. అలా అందిస్తే ఆ వైద్యుడు మందుల చీటీ వివరాలను మాకు అందజేయండి. ఆ వివరాల ప్రకారం హాస్పిటల్‌ను తనిఖీ చేస్తాం. నిజమని తేలితే హాస్పిటల్‌ను సీజ్ చేస్తాం. చెస్ట్ సీటీ స్కాన్ ద్వారా కరోనా నిర్ధారణ చేయకూడదు. ర్యాపిడ్ టెస్ట్, వీఆర్డీఎల్ ద్వారా నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షల ద్వారానే వైరస్ ఉందో లేదో నిర్ధారితమవుతుంది. ఈ చెస్ట్ సిటీ స్కాన్‌లో చెస్ట్ వైరల్ న్యుమోనియా, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయో..లేవో తెలుస్తాయి. ఛాతిలో అనారోగ్య సమస్యలుంటే తెలుసుకోవడానికి సీటీ స్కాన్‌ను వినియోగిస్తే తప్పు లేదు. కానీ కరోనా నిర్ధారణకు సిటీ స్కాన్‌ను వినియోగించడం సరికాదు. ప్రభుత్వం కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. వైరస్ నివారణకు మంచి వైద్యం అందిస్తోంది. ఎవరైనా కరోనాకు వైద్యం అందిస్తామంటే నమ్మి మోసపోకండి. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి -
మూడు వారాలు.. మూడింతలు
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్స చేసే ప్రైవే ట్ ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం మూడు వారాల్లోనే మూడింతలు పెరగడం గమనార్హం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు అనుమతులు ఇవ్వాలని, ఆ మేరకు దరఖాస్తులు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా చికిత్స చేయగలిగే అవకాశం కలిగిన ఆసుపత్రులు దరఖాస్తు చేసుకుంటున్నాయి. అనంతరం ప్రభుత్వం వాటికి అనుమతులు ఇస్తోంది. జూలై 28 నాటికి ప్రైవేట్‌లో కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పడకల సంఖ్య దాదాపు రెట్టింపు ఉంది. అయితే శుక్రవారం నాటికి ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య 167కి చేరుకోగా, వీటిల్లో మొత్తం కరోనా పడకల సంఖ్య 9,048కు పెరిగింది. మరోవైపు ప్రస్తుతం 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే కరోనా చికిత్సలు చేస్తున్నారు. వీటిల్లో 7,952 కరోనా పడకలు ఉన్నాయి. తీరిన పడకల కొరత... ప్రైవేట్ ఆసుపత్రులకు విరివిగా అనుమతులు ఇవ్వడంతో రాష్ట్రంలో కరోనా బాధితులకు అవసరమైన పడకల కొరత తీరినట్లేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అన్ని జిల్లాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కరోనా వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కే పరిమితమైన కరోనా వైద్యం ఇప్పుడు జిల్లాలకూ చేరడంతో బాధితులకు ఊరట కలుగుతుందని అంటున్నారు. అంతేగాక ఆసుపత్రుల్లో తక్కువ ఫీజులకే కరోనా వైద్యం అందుబాటులోకి వస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మాత్రం ఫీజుల విషయంలో ఇంకా కఠినంగానే ఉంటున్నాయని బాధితులు చెబుతున్నారు. జూలై 28 నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు ఇలా.. ► మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులు: 57 ► వీటిలో మొత్తం పడకలు: 8,446 ► సాధారణ పడకలు: 2,532 ► ఆక్సిజన్ బెడ్లు: 4,663 ► ఐసీయూ బెడ్లు: 1,251 మొత్తం ప్రైవేట్ ఆసుపత్రులు: 55 ► వీటిలో మొత్తం పడకలు: 4,497 ► సాధారణ పడకలు: 2,010 ► ఆక్సిజన్ బెడ్లు: 1,676 ► ఐసీయూ బెడ్లు: 811 శుక్రవారం నాటికి కరోనా బెడ్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో... ► మొత్తం పడకలు: 7,952 ► చికిత్స పొందుతున్న బాధితులు: 2,385 ► ఖాళీగా ఉన్న బెడ్లు: 5,567 ప్రైవేట్ ఆసుపత్రుల్లో... ► మొత్తం పడకలు: 9,048 ► చికిత్స పొందుతున్న బాధితులు: 3,970 ► ఖాళీగా ఉన్న బెడ్లు: 5,078 ► ఖాళీ వాటిలో సాధారణ పడకలు: 1,844 ► ఆక్సిజన్ బెడ్లు: 2,197 ► ఐసీయూ బెడ్లు: 1,037 -
పడకల్లో ఆరో స్థానంలో రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని పడకల్లో తెలంగాణ దేశంలోనే ఆరో స్థానంలో నిలిచింది. వాషింగ్టన్కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ (సీడీడీఈపీ) అనే ప్రతిష్టాత్మక సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. దీని కార్యాలయం ఢిల్లీలోనూ ఉంది. ఆ సంస్థ ప్రిన్స్టన్ యూనివర్సిటీతో కలిసి కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలోని 37 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఆసుపత్రులు–పడకల పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అన్ని రకాల పడకలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీ యూ) పడకలు, వెంటిలేటర్ల సామర్థ్యాన్ని ఆ సంస్థ అంచనా వేసింది. తాజాగా ఆ నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో సుమారు 19 లక్షల సాధారణ పడకలు, 95 వేల ఐసీయూ బెడ్లు, 48 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని వివరించింది. తెలంగాణలో 5.2 శాతం పడకలు.. ఈ అధ్యయనం ప్రకారం దేశంలోని ఆసుపత్రుల్లో చాలా పడకలు, ఐసీయూలు, వెంటిలేటర్లు 7 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని సీడీడీఈపీ తెలిపింది. అందులో మొదటిస్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 14.8 శాతం, కర్ణాటకలో 13.8 శాతం, మహారాష్ట్రలో 12.2 శాతం, తమిళనాడులో 8.1 శాతం, పశ్చిమ బెంగాల్లో 5.9 శాతం ఉండగా, ఆరో స్థానంలో ఉన్న తెలంగాణలో 5.2 శాతం పడకలున్నాయి. అదేస్థాయిలో కేరళలోనూ 5.2 శాతం పడకలున్నాయి. అంటే దేశంలో ఈ ఏడు రాష్ట్రాల్లోనే 65.2 శాతం పడకలున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో పడకల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరముందని సూచించింది. రాష్ట్రంలో దాదాపు లక్ష పడకలు.. ఇక తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు 4,110 ఉన్నాయని సీడీడీఈపీ తెలిపింది. అందులో ప్రైవేట్ ఆసుపత్రులు 3,247 ఉన్నాయంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మొత్తం కలిపి 99,919 (దాదాపు లక్ష) పడకలున్నాయని పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20,983 పడకలుండగా, ప్రైవేట్‌లో 78,936 పడకలున్నాయని వివరించింది. మొత్తం 99,919 పడకల్లో ఐసీయూ బెడ్లు 4,996 ఉన్నాయని వెల్లడించింది. అందులో ప్రైవేట్‌లో ఐసీయూ పడకలు 3,947 ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,049 ఉన్నాయని తెలిపింది. ఇక వెంటిలేటర్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 525 ఉండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,973 ఉన్నాయి. మొత్తం కలిపి రాష్ట్రంలో 2,498 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రతీ వెయ్యి జనాభాకు 2.85 సాధారణ పడకలు, ప్రతీ లక్ష జనాభాకు 14.2 ఐసీయూ బెడ్లు, అలాగే ప్రతీ లక్ష జనాభాకు 7.13 వెంటిలేటర్లు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆరో స్థానం గర్వకారణం.. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో పడకల సంఖ్య దేశంలోనే ఆరో స్థానంలో ఉండటం గర్వ కారణం. వైద్య, ఆరోగ్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధను అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ సీడీడీఈపీ గుర్తించడం విశేషం. కరోనా నేపథ్యంలో చేసిన ఈ పరిశోధన తర్వాత కూడా రాష్ట్రంలో అత్యవసర పడకలు, వెంటిలేటర్లు దాదాపు రెట్టింపు సంఖ్యలో పెరిగాయి. – డాక్టర్ కిరణ్ మాదల,క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
హాట్స్పాట్లు @ ప్రైవేట్ హాస్పిటల్స్
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌కు చెందిన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కరోనా చికిత్స చేసేందుకు అనుమతి లేదు. అయినా అక్కడకు వచ్చే కరోనా అనుమానితులకు సీటీ స్కానింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స కూడా అందిస్తున్నారు. కనీస ప్రొటోకాల్స్ కూడా పాటించడం లేదు. కరోనా బాధితుడి గదిలోనే అతని కుటుంబ సభ్యులు రాత్రిళ్లు ఉండేలా అనుమతినిస్తున్నారు. అంతేకాదు సాధారణ విధులు నిర్వహించే వైద్య సిబ్బందికీ కరోనా డ్యూటీలు వేస్తున్నారు. ఇక ఆ డాక్టర్ పేరు శ్రీనివాస్ (పేరు మార్చాం). ఖమ్మంకు చెందిన ఆయనో సీనియర్ వైద్యుడు. అతనికి కరోనా చికిత్స చేసే అనుమతి లేదు. కానీ తన వద్దకు వచ్చే వారెవరికైనా అవసరం లేకున్నా కరోనా వచ్చిన వారికి ఇచ్చే మందులు వాడాలని చెబుతున్నాడు. కరోనా రానివారు 5 రోజులు, వచ్చినవారు 10 రోజులు ఈ మందులు వాడాలని చెబుతున్నాడు. పైగా వాటిని తనకు తెలిసిన వారికి మెసేజ్‌ల రూపంలో పెడుతున్నాడు. ఈ తరహా ఘటనలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు ప్రతిరోజూ వస్తున్నాయి. వీటిపై ఇప్పటికే ఆయా జిల్లాల్లో విచారణ జరిపిస్తున్నారు. అనేక ప్రైవేట్ ఆసుపత్రులు, డాక్టర్లు కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని బాధితులు సర్కారుకు విన్నవిస్తున్నారు. ఐసీఎంఆర్ ఇచ్చిన నిబంధనలను చాలా ఆసుపత్రులు, వైద్యులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలూ వస్తున్నాయి. కొన్ని ఆసుపత్రులకు కరోనా చికిత్స చేసే అనుమతి కూడా లేదు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లూ లేవు. జిల్లాల్లో సాధారణ ప్రైవేట్ ప్రాక్టీషనర్ మొదలు సీనియర్ వైద్యుల వరకు అనుమతి లేకున్నా, ప్రొటోకాల్ పాటించకుండా కరోనా వైద్యం చేస్తున్నారు. దీంతో అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా హాట్స్పాట్లుగా మారుతున్నాయి. అక్కడకు వెళ్లే సాధారణ రోగుల్లో కొందరు కరోనా బాధితులుగా మారుతున్నారు. దీంతో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ చర్యలు తీసుకోవడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. కరోనా రోగులకు సేవలు అందించే నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందిని సాధారణ రోగులకు సేవలు అందించడానికి వినియోగిస్తున్నారు. దీంతో ఆ సిబ్బందితో పాటు, ఇతర రోగులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక కౌంటర్లు ఏవి? ఆసుపత్రులను ఎలా నిర్వహించాలన్న దానిపై ఐసీఎంఆర్ గతంలో మార్గదర్శకాలు జారీచేసింది. జ్వరం సహా కరోనా లక్షణాలున్న వారి కోసం ప్రత్యేక ద్వారాలు, కౌంటర్లు పెట్టి వారిని పరీక్షించాలని సూచించింది. అందుకోసం ప్రత్యేక సిబ్బంది ఉండాలని పేర్కొంది. ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరూ మాస్కులు వాడాలని చెప్పింది. కరోనా చికిత్స చేయాల్సి వస్తే పీపీఈ కిట్లు ధరించాలని సూచించింది. కరోనా పాజిటివ్ వ్యక్తులను ఐసోలేట్ చేయడం, కరోనా బయో వేస్ట్‌ను ఇతర వేస్టేజ్‌తో కలపకుండా డిస్పోజ్ చేయడం వంటి అనేక అంశాలపై మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే ప్రతి ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. కానీ చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ఈ ప్రొటోకాల్స్‌ను పాటించడం లేదు. అలాగే చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని బాధితులు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి, బోధనాసుపత్రి వరకు అన్నింటిలో ఫీవర్ ఓపీ కౌంటర్లు ప్రత్యేకంగా నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినా అమలుకావడం లేదు. కరోనా లక్షణాలున్నవారు, లేనివారు ఒకేచోట రిసెప్షన్లో ఉంచడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ఇక కొందరు వైద్యులైతే కరోనాపై అప్డేట్ కాకుండా చాంతాడంత ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు. వాటిని వాడాలని బాధితులకు చెబుతున్నారు. అత్యవసర మందులను కూడా సాధారణ లక్షణాలు లేని కరోనా రోగులతో మింగిస్తున్నారు. దీంతో ఒక్కోసారి బాధితులు తీవ్రమైన రోగులుగా మారుతున్నారు. చివరకు పరిస్థితి సీరియస్‌గా ఉందంటూ వారిని ఆసుపత్రి నుంచి బయటకు పంపుతున్నారు. -
సగం పడకలపై చర్చలూ సగమే!
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ఆస్పత్రుల్లోని కరోనా పడకల్లో సగం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయంలో విధివిధానాల ఖరారుకు యాజమాన్యాలతో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ జరిపిన చర్చలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడ్డాయి. శనివారం మరోసారి సమావేశమై తుది నిర్ణయానికి రావాలని అధికారులు, యాజమాన్యాల ప్రతి నిధులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు వస్తుండటంతో సగం పడకలను స్వాధీనం చేసుకోవాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయడానికి ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో చర్చలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రెండు గంటలపాటు చర్చించినా ఎలాంటి నిర్ణయానికీ రాలేకపోయారు. రూ.4 లక్షలకు మించొద్దు...: ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పడకల ఫీజులు గతంలో కేటాయించినట్లుగానే ఉంటాయి. అంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లోని సాధారణ వార్డులో చికిత్సకు రూ.4 వేలు, ఐసీయూలో రూ.7,500, వెంటిలేటర్ మీద పెడితే రూ.9 వేలు రోజుకు వసూలు చేయాలన్న నిబంధన యథావిధిగానే ఉంటాయి. అయితే పీపీఈ కిట్లు, సాధారణంగా ఇచ్చే మందులు, అత్యవసరమైన అధిక ధర కలిగిన మందులు వాడితే ఎంత తీసుకోవాలన్న దానిపైనే సందిగ్ధత నెలకొందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీనిపైనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించాయి. సీటీ స్కాన్లు ఎన్ని చేస్తున్నారు? కొందరికి డయాలసిస్ చేయాల్సి వస్తే ఎంత అవుతుంది? ప్రొటోకాల్ అమలులో అయ్యే ఖర్చు ఎంత? వివిధ రకాల టెస్టులకు అవుతున్న ఖర్చు ఎంత? దాదాపు నెలకుపైగా చికిత్సలు చేస్తున్నందున అవుతున్న వాస్తవ ఖర్చు వివరాలతో ప్రతిపాదన తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కార్పొరేట్ ఆస్పత్రులను కోరాయి. ఎంత సీరియస్ కేసు అయినా 14 రోజులకు గరిష్టంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు మించి వసూలు చేయకూడదని సర్కారు భావిస్తోంది. ఆ ప్రకారం సాధారణ కరోనా కేసులకు రూ.లక్షన్నర, ఆక్సిజన్ పడకలపైకి వెళితే రూ.2 లక్షలు, వెంటిలేటర్‌పైకి వెళితే రూ.3 లక్షలు, ఒకవేళ ఇంకా సీరియస్ అయి ఒకట్రెండు రోజులు ఉంచాల్సి వస్తే రూ.4 లక్షలు కావొచ్చని.. ఏది ఏమైనా సీలింగ్ రూ.4 లక్షలకు మించి ఉండకూడదని సర్కారు కార్పొరేట్లకు తేల్చిచెప్పింది. ఇవి కేవలం కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రమే వర్తిస్తాయని, వీటిపై నిర్ణయం తీసుకున్నాక మిగిలిన ఇతర ప్రైవేటు ఆస్పత్రులను మరో రెండు మూడు రోజుల్లో పిలిచి వాటితోనూ చర్చిస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంకా తక్కువ ఫీజులనే ఖరారు చేస్తామని చెబుతున్నాయి. ఇదిలావుంటే ఇక ప్రైవేట్, కార్పొరేట్లు తాము సొంతంగా నింపుకునే సగం పడకల ఫీజులు వాటి ఇష్టానికే వదిలేస్తారని అంటున్నారు. ఒకవేళ అలా వదిలేస్తే ఒకేచోట రెండు ఫీజుల్లో భారీ తేడాతో కొందరు రోగులు కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. దీనిపై విధివిధానాల్లో స్పష్టత రానుంది. -
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ ఒక్కటి అమలు చేయలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను పీడిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన సీఎస్ సోమేశ్ కుమార్..కరోనాకు సంబంధించిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేశారా లేదా అని ప్రశ్నించగా..కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని సీఎస్ బదులిచ్చారు. ఇప్పటికే 50 ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని పేర్కొనగా..మరి మిగిలిన హాస్పిటల్స్ పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. అపోలో, బసవతారకం వంటి హాస్పిటల్స్ పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తి వివరాలతో త్వరలోనే బులిటెన్ విడుదల చేస్తున్నామని సీఎస్ సోమేష్‌కుమార్ కోర్టుకు వివరించారు. ఇక రాష్ర్టంలో 8వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించడాన్ని సవాలు చేసిన ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005 యాక్ట్ ప్రకారం పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ఇటీవలె తొలిగించారు. పెండిండ్‌లో ఉన్న జీతాలను తిరిగి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ పిటిషన్‌పై హెకోర్టులో విచారణ కొనసాగుతుంది. -
ప్రైవేట్ ఆసుపత్రులకు ఫైనల్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు.. డబ్బులు కట్టనిదే చచ్చినా శవం ఇచ్చే పరిస్థితి లేదు.. తప్పుడు రిపోర్ట్లు, అనవసర వైద్యం.. ప్రైవేట్ బీమా ఉన్నా పట్టించుకునే దిక్కులేదు.. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రజల నుంచి వెల్లువెత్తుతోన్న ఫిర్యాదులివి. వీటితోపాటు రోగి ఎలా ఉన్నాడో చెప్పే దిక్కూలేదు. ఎంతంటే అంత డబ్బులు కట్టుకుంటూ పోవడమే బాధిత కుటుంబాల పని. వారి ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచనే లేదు. కొన్ని ఆసుపత్రులైతే శవాలపై పైసలు ఏరుకుంటున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రెండు ఆసుపత్రులపై చర్యలకు దిగింది. మరికొన్ని ఆసుపత్రుల అక్రమాలపై నివేదికలు సిద్ధమయ్యాయి. వాటిపైనా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇంత జరుగుతున్నా అనేక ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల తీరు మారట్లేదు. దీంతో ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో ఒకరోజు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమై.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాలని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ నిర్ణయించారు. శవాలపై పేలాలు ఏరుకుంటారా? కరోనా మహమ్మారి కల్లోకం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 84,544కి చేరుకుంది. ఇప్పటివరకు 654 మంది చనిపోయారు. నగరాలు, పట్టణాల నుంచి పల్లెల దిశగా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా సామాజికవ్యాప్తి జరగడంతో ఇప్పుడు ప్రజలను ఆదుకోవడంపైనే ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు దృష్టిసారించాలి. కానీ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఈ కల్లోల పరిస్థితుల్లోనూ ధనార్జనను వీడట్లేదు. దీంతో సర్కారు వాటికి ముకుతాడు వేసేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. ‘సామాజిక బాధ్యతతో మెలగాల్సిన సమయమిది. ఈ పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోకపోగా ధనార్జనే ధ్యేయమా? మిమ్మల్ని ఎవరూ క్షమించర’ని అన్నట్లు తెలిసింది. ఒకానొక సందర్భంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అంటువ్యాధుల చట్టం కఠిన అమలు కేంద్ర అంటువ్యాధుల నియంత్రణ చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ తెలంగాణ అంటువ్యాధుల (కోవిడ్–19) నియంత్రణ–2020 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం మార్చిలోనే అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై సర్కారుకు సర్వాధికారాలుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం ప్రకారం ఆయా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ముకుతాడు వేయాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్), వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, కార్పొరేషన్ల కమిషనర్లకు ఈ చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపైనా సర్వాధికారాలుంటాయి. కరోనా లక్షణాలున్న కేసులను పరీక్షించడానికి, వైద్యం చేయడానికి అవసరమైనప్పుడు ముందుకు రావాలి. చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ వ్యక్తి లేదా సంస్థ శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లు పరిగణిస్తారు. దీన్ని కఠినంగా అమలు చేసి, బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా నిబంధనలను ఉల్లంఘించిన ఆసుపత్రులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. -
విజయవాడలో అనధికార ఆస్పత్రులు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో రమేశ్ ఆస్పత్రికి చెందిన ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం ఘటనతో కృష్ణా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల భద్రత చర్చనీయాంశమవుతోంది. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు చిన్నా, చితకా ఆస్పత్రులు, డెంటల్ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ కేంద్రాలు తదితరాలు కలిపి 1,018 వరకు ఉండగా.. వీటిలో 88 ప్రభుత్వ ఆస్పత్రులు, మరో 90 ఇతర ఆస్పత్రులు మినహాయిస్తే 840 ఆస్పత్రులకు అగ్నిమాపక శాఖ అనుమతుల్లేవు. చాలా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాద నియంత్రణ ఏర్పాట్లు కనిపించడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రులు మినహాయిస్తే పడకలు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులు, 25 పడకల లోపు, ఆపై ఉన్న పడకల ఆస్పత్రులు మొత్తం 930 ఉండగా వీటిలో కేవలం 90 ఆస్పత్రులకు మాత్రమే అగ్నిమాపక శాఖ ఎన్వోసీలు ఉన్నాయి. మెజార్టీ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ పంపింగ్ మోటార్లు, సంపులు లేవు. 50 శాతం ఆస్పత్రులు మాత్రమే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ లను కలిగి ఉన్నాయి. -
సర్కారుకు సగం ‘ప్రైవేటు’ పడకలు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న పడకల్లో 50శాతం బెడ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. జనరల్ వార్డుల్లోని బెడ్లతోపాటు ఐసీయూ విభాగాల్లోని 50 శాతం పడకల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్–19 బాధితులకు చికిత్స అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై ఇప్పటివరకు 1,039 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని తీవ్రంగా పరిగణిస్తూ ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్టు వివరించారు. ఇప్పటికైనా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోకుంటే తాజాగా నిర్దేశించిన కార్యాచరణను అమలు చేస్తామని తేల్చిచెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులపై వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులను పరిశీలించిన మంత్రి ఈటల.. సంబంధిత అధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అధిక బిల్లులపైనే ఎక్కువ ఫిర్యాదులు.. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల్లో ముఖ్యంగా ఎక్కువ బిల్లులు వేయడం, కొన్ని సందర్భాల్లో బిల్లులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం, రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల అడ్వాన్స్ చెల్లిస్తే తప్ప ఆస్పత్రిలో చేర్చుకోకపోవడం లేదా బెడ్లు ఖాళీ లేవని పేషెంట్లను కనీసం పరీక్ష చేయకుండానే తిప్పి పంపుతున్నారనే అంశాలతో ఉన్నాయని ఈటల చెప్పారు. అదేవిధంగా ఇన్సూరెన్స్, క్రెడిట్‌కార్డు అంగీకరించకపోవడం, డబ్బులు చెల్లించినప్పటికీ రోగులను సరిగా పట్టించుకోకపోవడం, చికిత్స జరుగుతున్న క్రమంలో మరణిస్తే పూర్తి బిల్లు చెల్లించే వరకు మృతదేహాన్ని ఇవ్వకపోవడం వంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా లేని వారి దగ్గర కూడా కరోనా ఉందా.. లేదా తెలుసుకోవడానికి పరీక్షల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికమొత్తంలో ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. ఇతర జబ్బుల కోసం చికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్‌కు వచ్చిన వారికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం కరోనా ప్యాకేజ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వాస్తవానికి కరోనా నిర్ధారణకు ర్యాపిడ్ పరీక్ష లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయని.. కానీ వీటిని పక్కనపెట్టి సీటీ స్కాన్, ఎక్స్‌రే, రక్త పరీక్షల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రక్త పరీక్ష ల్లో కూడా డీ–డిమ్మ ర్, ఎల్డీహెచ్, సీఆర్పీ, ఫెరిటిన్, ఐఎల్–6 వంటి పరీక్షలను అవసరం లేకున్నా చేస్తున్నారన్నారు. హైదరాబా ద్‌లోని దాదాపు అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు అందడంతో ప్రతి ఆస్పత్రికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరినట్లు మంత్రి తెలిపారు. ఈ వివరణలను పరిశీలించడానికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వివరణలపై విచారణ చేసి తప్పులు చేసిన ఆస్పత్రులపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద కఠిన చర్య లు తీసుకోవాలని మంత్రి సూచించారు. డాక్టర్ నరేష్ మృతి బాధాకరం: ఈటల కోవిడ్ చికిత్స అందిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నరేష్ చనిపోవడం చాలా బాధాకరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వైరస్ సోకినవారికి తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి మరీ వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారని.. వారి సేవలు వెల కట్టలేనివని అభిప్రాయపడ్డారు. డాక్టర్ నరేష్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. నరేష్ భార్యకు సముచిత స్థానం గల ఉద్యోగం కల్పించాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
వసూలు చేసింది రూ.14.5 లక్షలు చేతికి రూ.1.91 లక్షల బిల్లు
సికింద్రాబాద్ పాన్‌బజార్‌కు చెందిన ఓ వ్యక్తి(53) కోవిడ్‌తో బాధపడుతూ జూలై 24న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. హెల్త్‌కార్డుపై చికిత్సకు ఆస్పత్రి నిరాకరించింది. వైద్యులు రెండురోజులపాటు సాధారణ ఐసీయూలో ఉంచారు. 26వ తేదీ నుంచి ఆగస్టు 4 వరకు వెంటిలేటర్‌పై చికిత్స అందించగా అదేరోజు ఆయన చనిపోయారు. 12 రోజులకు రూ.14.50 లక్షల బిల్లు వసూలు చేశారు. ఇన్సూరెన్స్ సంస్థ నుంచి క్లెయిమ్ చేసుకునేందుకుగాను బిల్లు తాలూకు రశీదు ఇవ్వాలని కుటుంబసభ్యులు కోరగా రూ.1,91,700 బిల్లు ఇచ్చారు. అదేమని ప్రశ్నించగా, జీవో మేరకే బిల్లు ఇచ్చామని స్పష్టం చేసింది. ఎక్కువ మాట్లాడితే... మీ జువెలరీ షాప్‌పై ఐటీ దాడులు చేయిస్తామని ఆస్పత్రి యాజమాన్యం బాధితుడి కుటుంబ సభ్యులను బెదిరిస్తుండటం గమనార్హం. నారాయణగూడకు చెందిన ఓ వ్యక్తి(68) కూడా కోవిడ్‌తో ఇటీవల ఇదే ఆస్పత్రిలో చేరారు. 18 రోజుల చికిత్సకు రూ.18 లక్షలు చెల్లించారు. డిటైల్డ్ బిల్లు ఇవ్వాల్సిందిగా కుటుంబసభ్యులు కోరగా అలా ఇవ్వడం కుదరదని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం రశీదు ఇవ్వాలని కోరితే రూ.5 లక్షల బిల్లు ఇవ్వడంతో కుటుంబసభ్యులు విస్తుపోవాల్సి వచ్చింది. బోయినపల్లికి చెందిన ఓ ప్రముఖ బిల్డర్ కుటుంబసభ్యులు నలుగురు ఇటీవల కోవిడ్ బారిన పడి చికిత్స కోసం ఇదే ఆస్పత్రిలో చేరారు. ఇందులో బిల్డర్ తండ్రి కోవిడ్‌తో మృతి చెందగా... ముగ్గురు కోలుకున్నారు. కానీ వారికి అయిన బిల్లు చూస్తే షాక్ తప్పదు. రూ.50 లక్షలు చెల్లించగా వారికి ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన బిల్లు రూ.2 లక్షలే. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 79,495 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 45 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 627 మంది కోవిడ్‌తో మృతి చెందగా, వీరిలో 500 మందికిపైగా సిటిజనులే. ప్రభుత్వం ప్యాకేజీ నిర్ణయించిన ధరలు తమకు గిట్టుబాటు కావని కార్పొరేట్ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఈహెచ్ఎస్, జీహెచ్ఎస్, సీహెచ్ఎస్, ఈఎస్‌ఐసహా ఇతర ప్రైవేటు సంస్థల ఇన్సూరెన్సులను కలిగినవారికి ఈ ప్యాకేజీలు వర్తించవని ప్రభుత్వమే స్పష్టం చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న యాజమాన్యాలు ఐసీయూ, వెంటిలేటర్ పడకలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. రోగుల బలహీనత.. వారికి కాసులపంట అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తున్న రోగుల బలహీనతను ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. షరతులు విధిస్తున్నాయి. నగదు చెల్లించేందుకు అంగీకరించేవారికే అడ్మిషన్లు ఇస్తున్నాయి. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో రోగి నుంచి రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ‘ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం’పూర్తి బిల్లులకు రశీదులివ్వాలని కోరితే పలు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా డబ్బులు దండుకుంటున్న ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
‘సెప్టెంబర్ కల్లా కరోనా తగ్గే అవకాశం’
సాక్షి, హైదరాబాద్ : తెలలంగాణలో రోజుకు 23వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కేసు ల సంఖ్య రోజు రోజుకి తగ్గుతుందని చెప్పారు. నెలాఖరుకు నగరంలో కేసులు చాలా తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. సెప్టెంబర్ చివరికి తెలంగాణలో కరోనా పూర్తిగా తగ్గే అవకాశం ఉందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను కేటాయించిదని గుర్తు చేశారు. కొన్ని ఆస్పత్రులు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1039 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 130కి పైగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఇన్యూరెన్స్‌కు సంబంధించి 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఆస్పత్రలన్నింటికి కౌన్సిలింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రులను మూసివేడం తమ ఉద్ధేశ్యం కాదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.(చదవండి : కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి) కాగా, . రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 150 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో ప్రస్తుతం 91 ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయి. మరిన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో కరోనా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
కరోనా చికిత్సకు మరిన్ని ప్రైవేటు ఆస్పత్రులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వేగానికి కళ్లెం వేసేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు మరిన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతించాలని నిర్ణయించింది. అందుకోసం ప్రైవేటు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 150 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు అనుమతివ్వగా, అందులో ప్రస్తుతం 91 ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయి. మిగిలిన వాటిల్లో ఇంకా చికిత్సలు మొదలుకాలేదు. మరోవైపు 56 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతుండగా, ఇప్పటివరకు అంతకు మూడింతలు ప్రైవేటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇంకా హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో మరో 100 ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతిచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా చికిత్స చేయగలిగే వసతి కలిగిన ఆసుపత్రుల నుంచి దరఖాస్తులు తీసుకొని తమకు పంపాలని సర్కారు జిల్లా డీఎంహెచ్వోలను ఆదేశించింది. దీంతో ఆక్సిజన్, ఐసీయూ వసతి కలిగిన అనేక ప్రైవేటు ఆసుపత్రులు ముందుకొస్తున్నట్లు సమాచారం. 10 లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు.. కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 5 లక్షలకు పైగా ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను ప్రభుత్వం తెప్పించింది. ఇక నుంచి రోజుకు 40 వేల నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మరో 10 లక్షల కిట్లను కొనుగోలు చేయాలని శుక్రవారం నిర్ణయించారు. ఈ మేరకు కొనుగోలుకు వైద్య, ఆరోగ్య శాఖ ఇండెంట్ పెట్టింది. ఇదిలావుండగా ప్రస్తుతం 1,100 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. అలాగే నియోజకవర్గానికో మొబైల్ లేబొరేటరీ వోల్వో బస్సులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి తోడు మరికొన్ని కేంద్రాలను గుర్తించాలని వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలను ఆదేశించింది. ఉదాహరణకు కేరళ, కర్ణాటకల్లో విరివిగా ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు ముఖ్య కూడళ్లలో శాంపిల్ కలెక్షన్, టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కూడా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాక నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలు, ఆలయాలు కూడా పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి కోరాయి. అలాంటి వాటికి కేంద్రం నుం చి అనుమతి వస్తే, తెలంగాణలోనూ అలాగే టెస్టు లు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. పారామెడికల్ సిబ్బంది నియామకాలు.. అనేక టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, పరీక్షలు విరివిగా చేయాల్సి ఉండటంతో జిల్లాల్లో పారామెడికల్ సిబ్బందిని నియమించాలని సర్కారు కలెక్టర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాల్లో నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర త్రా సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలావుంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నియమించే నర్సులను ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై ప్రభుత్వం చొరవ తీసుకుని 3,311 నర్సు పోస్టులను భర్తీ చేయాలని అసోసియేషన్ సెక్రటరీ జనరల్ లక్ష్మణ్ రుడావత్ సీఎంకు రాసిన లేఖలో కోరారు. -
కాస్ట్లీ కరోనా టెస్టులు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.2,200 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా, దానికి రెట్టింపునకు మించి మరి వసూలు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కరోనా అనుమానిత లక్షణాలున్న వారు గగ్గోలు పెడుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.2,200తో పాటు కొన్ని చోట్ల వచ్చిన వ్యక్తికి ఒక పీపీఈ కిట్ వేస్తున్నారు. శాంపిల్ తీసే వ్యక్తి కూడా మరోటి వేసుకుంటున్నాడు. ఈ రెండిం టికి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం పీపీఈ కిట్ ధర రూ.300కు మించి లేదు. కానీ ఒక్కో పీపీఈ కిట్‌కు రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్లయితే సాధారణ మాస్క్ కాకుండా, తప్పనిసరిగా ఎన్–95 మాస్క్ ధరించాల్సిందేనని ఇచ్చి, దానికి కూడా రూ. 300 వసూలు చేస్తున్నా రు. ఇలా అవకాశమున్నంత మేరకు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. కిట్ తీసుకుంటేనే టెస్ట్ ఇక కిట్‌కు టెస్ట్‌కు ముడి పెట్టడం మరో ఘోరమై న దోపిడీగా బాధితులు చెబుతున్నారు. బంజారాహి ల్స్‌లో ఉన్న ఒక కార్పొరేట్ ఆసుపత్రికి ఎవరైనా కరోనా లక్షణాలున్నాయన్న అనుమానం తో టెస్ట్ కోసం వెళ్తే పరీక్ష మాత్రమే చేసి పంప డం లేదు. కరోనా కిట్‌కు రూ.13,500 చెల్లిస్తేనే టెస్ట్ చేస్తున్నారు. తమకు నెగెటివ్ వస్తే కిట్‌తో ఉపయోగమేంటని ప్రశ్నిస్తే, అది తమ ఆసుపత్రి ప్రొటోకాల్ అని చెబుతున్నారు. ఒకవేళ మున్ముందు బాధితుల ఇంట్లో ఎవరికైనాపాజిటివ్ వచ్చి సీరియస్ అయితే బెడ్ కూడా సులువుగా దొరుకుతుందని మభ్యపెడుతున్నారు. ఇలా కిట్ల కూ టెస్టులకే కాకుండా బెడ్‌కూ ముడిపెడుతూ బాధితుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. మరో ఆసుపత్రిలోనైతే ఏకంగా రూ.20 వేల హోం ఐసోలేషన్ కిట్ కొంటేనే టెస్ట్ చేస్తున్నారు. ఇక కొన్ని ఆసుపత్రులకు కరోనా టెస్ట్‌లు చేసే అనుమతి లేదు. దీంతో తమ వద్దకు వచ్చే బాధితులకు సీటీ స్కాన్ చేసి కరోనా నిర్ధారణ చేస్తున్నారు. సీటీ స్కాన్ కోసమే బాధితులు ఐదు వేల రూపాయలకు పైగా చెల్లించాల్సి వస్తుంది. చర్యలకు సిద్ధం.. రాష్ట్రంలో 23 ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టెస్టుల్లో జరుగుతున్న దోపిడీ.. కిట్ తీసుకుంటేనే టెస్ట్.. అనవసర సీటీ స్కాన్లపై వైద్య, ఆరోగ్య శాఖ సీరియస్‌గా ఉంది. దీనిపై గురువారం అధికారులు చర్చించారు. ఇలా ఇష్టారాజ్యంగా టెస్టులకు వసూళ్లు చేస్తున్న ఆసుపత్రులు, ల్యాబ్‌లపైనా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మొదట్లో టెస్టులు సక్రమంగా చేయకపోవడం, శాంపిళ్ల సేకరణలోనూ లోపాలు వంటి వాటిపై 12 లేబొరేటరీలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వేటిపైనా చర్యలు తీసుకోలేదు. దీన్నే అలుసుగా తీసుకొని కొన్ని ఆసుపత్రులు, లేబొరేటరీలు టెస్టులకు అధికంగా వసూలు చేస్తుండటంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వాటిపై నివేదిక కోరామని.. అనంతరం చర్యలు తీసుకుంటామని ఒక ఉన్నతాధికారి తెలిపారు. -
అధిక చార్జీలపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం విచారించింది. కొందరు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరలకే పలు ఆస్పత్రులకు భూమి కేటాయించిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. రాయితీ ధరలకే భూమి పొందిన అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని ఆరోపించాడు. (చదవండి: కిడ్నాప్ కథ సుఖాంతం) దీంతో షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించక పోతే మృతదేహాలను కూడా అప్పగించడం లేదని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని, భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశ్రాంత ఉద్యోగి ఓ.ఎం. దేవర ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. (‘శవాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోండి’ ) -
ప్రైవేటు ఆసుపత్రులకు మంత్రి ఈటల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల వసూళ్లపై వేల ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులతోనూ మాట్లాడానని చెప్పారు. మంగళవారం ఈటల విలేకరులతో మాట్లాడుతూ.. ‘కరోనా చికిత్సను వ్యాపార కోణంలో చూడొద్దని చెప్పా. కానీ వారు అనేక రకాలుగా వేధిస్తున్నారని ఫిర్యాదులొస్తున్నాయి. లక్షలకు లక్షలు ఫీజులు గుంజుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మృతదేహాన్ని అప్పగించడానికి కూడా రూ.4 లక్షలు కట్టాలని అడగటం మానవ సమాజానికే కళంకం. హీనమైన చర్య. పదే పదే చెప్పినా వైఖరి మార్చుకోవడం లేదు. దీనిపై కమిటీలు వేసి విచారణ జరుపుతున్నాం. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకుంటే కరోనా చికిత్స అనుమతులను రద్దు చేస్తాం. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులపై చర్యలు (సోమవారం డెక్కన్ ఆసుపత్రిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. మంగళవారం బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిపై కూడా ఫీజుల వసూళ్లకు సంబంధించి చర్యలు తీసుకుంటూ కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసింది) తీసుకున్నాం. రెండు, మూడ్రోజుల్లో మరికొన్నింటిపై చర్యలుంటాయి. ప్రస్తుతం డబ్బుల సంపాదనకు బ్లాక్ మెయిల్ చేసే సందర్భం కాదు..’అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే కరోనా టెస్టులు.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులొచ్చే అవకాశాలుంటాయని, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలొస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని ఈటల సూచించారు. ‘ఇప్పటికే ఏఎన్ఎంలు ఇంటింటికీ సర్వే చేసి లక్షణాలున్న వారిని ఆసుపత్రులకు పంపుతున్నారు. కరోనా లక్షణాలున్న వారికి చికిత్స చేయొద్దని, పీహెచ్‌సీలకు వారిని పంపాలని ఆర్ఎంపీ వైద్యులకు కూడా ఆదేశాలిచ్చాం. గ్రామాల్లో లక్షణాలున్న వారిని గుర్తిస్తే పీహెచ్‌సీలోనే టెస్టులు చేయాలి. అనారోగ్యంతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే ముందుగా చేర్చుకొని చికిత్స చేయాలి. తర్వాతే కరోనా పరీక్ష చేయించాలి. పీహెచ్సీ స్థాయిలో కూడా ఈ చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వల్ప ధరలవే. నిపుణుల కమిటీ ప్రకారం రూ.వెయ్యికి మించవు. ఇక వెంటిలేటర్ల గురించి ఆలోచించవద్దు. అంతవరకు పోయాడంటేనే మనిషి ప్రాణాపాయంలోకి వెళ్లారని అర్థం. 10 రోజుల పాటు ఒక రోగికి ఆక్సిజన్ పెడితే రూ. 2,500 మాత్రమే ఖర్చవుతుంది. ఏ ఆసుపత్రి అయినా బాధితులకు ఇచ్చే చికిత్స ఇదే.. ముదిరితేనే ఖరీదైన చికిత్స అవసరం. మందులు, వైద్యులు, ఆక్సిజన్, వెంటిలేటర్లకు కొరత లేదు. జిల్లాల్లోనూ ఐ+సోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. మంత్రులు, కలెక్టర్లు వీటిని పర్యవేక్షిస్తున్నారు..’అని వెల్లడించారు. ఫ్మాస్మా బ్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు.. లక్షణాలున్నవారు యాంటిజెన్ పరీక్షలు, లేనివారు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఈటల కోరారు. ‘ప్లాస్మా బ్యాంకు పెట్టమని సీఎం ఆదేశించారు. దాని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆర్టీ–పీసీఆర్ టెస్టులు రోజుకు ఐదారు వేలకు మించడం లేదు. గాంధీలో 2 వేల పడకలున్నాయి. అక్కడికి సీరియస్‌గా ఉన్నవారు వస్తున్నారు. గాంధీలో 500 ఐసీయూలు, 600 ఆక్సిజన్ పడకలున్నాయి. మరో 350 ఐసీయూ పడకలను సిద్ధం చేస్తున్నాం. కేంద్రాన్ని 1,400 వెంటిలేటర్లు కోరాం. కోవిడ్ కోసం స్పెషల్‌గా తయారుచేసిన వెంటిలేటర్లు వస్తున్నాయి. వరంగల్‌లో కూడా అదనపు పడకలు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా సేవలు అందిస్తున్నాం. గాంధీ, ఉస్మానియా, చెస్ట్, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులకు బల్క్ లిక్విడ్ ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. ఆరోగ్య శాఖలో సిబ్బంది వైరస్ బారిన పడితే సెలవులు అక్కర్లేదు. వారు విధుల్లో ఉన్నట్లుగానే పరిగణిస్తాం. మొదట్లో జీహెచ్ఎంసీలో ఎక్కువ కేసులుంటే, ఇప్పుడు జిల్లాల్లో పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు, ఇతర కారణాలతో చనిపోయినా శవాలను రానివ్వడం లేదు. భౌతికకాయాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందదు. మృతదేహాన్ని ప్యాక్ చేసి ఇచ్చేది మనుషులే కదా, వారికి రాని వైరస్ ఇతరులకు వస్తుందా..?’అని మంత్రి వ్యాఖ్యానించారు. సమావేశంలో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్‌పై కొరడా
-
కరోనా వేళ.. కాసుల వేట
‘కరోనా బాధితుడు: హలో..సర్, నేను కరోనాతో బాధపడుతున్నాను. మీ ఆస్పత్రిలో చేరాలనుకుంటున్నాను. బెడ్స్ ఖాళీగా ఉన్నాయా. ఆస్పత్రి సిబ్బంది: బెడ్స్ ఉన్నాయో లేదో చూడాలి. చెక్ చేసి చెబుతాం. కరోనా బాధితుడు: ఫీజు ఎంత అవుతుంది. ఎన్నిరోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. ఆస్పత్రి సిబ్బంది: అడ్మిషన్‌కి రూ.25 వేలు కట్టాలి. తర్వాత రోజుకు రూ.10 వేలు. ఎన్నిరోజులకు డిశ్చార్జ్ చేస్తామనేది చెప్పలేం. వారం రోజుల క్రితం నుంచే చేర్చుకుంటున్నాం. ఇంత వరకూ ఎవరినీ డిశ్చార్జ్ చేయలేదు. కరోనా బాధితుడు: అవసరమైతే ఆక్సిజన్ పెడతారా, ఏసీ రూమ్ ఇస్తారా. ఆస్పత్రి సిబ్బంది: ఆక్సిజన్ అన్ని బెడ్స్‌కి లేదు. నాన్ ఏసీ గదులే ఇస్తాం. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందికి, కరోనా బాధితుడికి మధ్య జరిగిన సంభాషణ ఇది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరోనా ఎంతోమంది ప్రాణాలు తీస్తుంటే.. కొందరికి మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. డబ్బు పోయినా ప్రాణం నిలుపుకోవాలని కొందరు తాపత్రయపడుతుంటే... విపత్కర పరిస్థితులను క్యాష్‌చేసుకోవడంలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు నిమగ్నమయ్యారు. నగరంలో పెద్ద ఆస్పత్రులుగా పేర్కొంటున్నవారంతా ఇదే రీతిలో దోపిడీ పర్వం కొనసాగిస్తున్న విషయం సాక్షి పరిశోధనలో వెలుగుచూసింది. కలవరపెడుతున్న వైరస్ జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. సామాజిక వ్యాప్తి కారణంగా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. బుధవారం నాటికి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 4111కు చేరింది. ఇప్పటివరకూ 23 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు సహజంగానే బాగా పెరిగాయి. చికిత్స కోసం ఎంతైనా ఖర్చుపెట్టేందుకు వెనకాడటం లేదు. అదే ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులకు వరంగా మారింది. ఇదే అదనుగా ఇష్టానుసారం ఫీజుల రూపంలో పేషెంట్ల నుంచి డబ్బు గుంజేసి... అక్రమార్జనకు తెగబడుతున్నారు. జిల్లా కేంద్రాస్పత్రితో పాటు పదకొండు ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్–19 చికిత్సకు అవకాశం కల్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో మిమ్స్ కోవిడ్ ఆస్పత్రి, ప్రభుత్వ ఆస్పత్రులు జిల్లా అధికార యంత్రాంగం ఆధీనంలో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి అందరికీ వైద్యం ఉచితంగా అందే ఏర్పాటు చేసింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రులకు కొన్ని రేట్లను కూడా నిర్ణయించింది. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీని గాలికొదిలేసి, నేరుగా డబ్బు తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని పలు వురు బాధితులు స్వయంగా సాక్షికి తెలియజేశారు. దీనికి తోడు సాక్షి స్వయంగా చేసిన పరిశోధనలోనూ ప్రైవేటు ఆస్పత్రులు అధికంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు వెలుగుచూసింది. అడ్మిషన్ కే రూ.25 వేల నుంచి రూ.45 వేలు తీసుకుంటున్నారు. ఇక రోజుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నవారున్నారు. కొన్ని ఆస్పత్రులు బిల్లు ఇవ్వండం లేదు. మరికొన్ని సగం సొమ్ముకు మాత్రమే బిల్లు ఇస్తామంటున్నాయి. దీనివల్ల బాధితుడికి ఆరోగ్యశ్రీ ఎలాగూ వర్తించకపోగా కనీసం అతను చేయించుకున్న వ్యక్తి గత ఆరోగ్య బీమా కూడా వచ్చే అవకాశాన్ని కోల్పోతున్నాడు. పరీక్షల జోరు.. ఫలితాలు బేజారు జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు, కేవలం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, సంజీవని బస్సుల ద్వారా రికార్డు స్థాయిలో 4,732 పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఆర్టీపీసీఆర్ టెస్టులు 55, ట్రూనాట్ టెస్టులు 238, ర్యాపిడ్ యాంటిజన్ కిట్ల ద్వారా 4439 పరీక్షలు నిర్వహించారు. వీటిలో ట్రూనాట్ టెస్టులద్వారా చేసిన పరీక్షల్లో 64, ర్యాపిడ్ యాంటిజన్ టెస్టుల ద్వారా 150 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం జిల్లాలో 2,462 పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 458 మంది కోవిడ్ ఆస్పత్రుల్లోనూ, 768 మంది కోవిడ్ కేర్ సెంటర్లలోను, 168 మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు. అయితే ఫరీక్షల ఫలితాల వెల్లడిలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గాజులరేగకు చెందిన ఒక వ్యక్తికి కరోనా నిర్థారణ పరీక్షలు ఈ నెల 22న నిర్వహించిన వైద్యులు, ఫలితాన్ని మాత్రం ఇప్పటి కీ వెల్లడించలేదు. అనుమానం వచ్చి ఆ వ్యక్తి గ్రామ వలంటీర్ ద్వారా ఆన్లైన్లో చెక్ చేయిస్తే పాజిటివ్ గా నమోదయ్యింది. కానీ ఆస్పత్రి నుంచి పాజిటివ్ అనే నిర్థారణ రిపోర్ట్ రానందున అతనిని కోవిడ్ ఆస్పత్రికి తరలించలేదు. నేటికీ టెస్ట్‌కు వచ్చిన వ్యక్తిగానే అతనిని ప్రభు త్వ కేంద్రాస్పత్రిలో ఉంచేశారు. పరీక్ష ఫలితం సమాచారం అతనికి రాకపోవడానికి అతని సెల్ ఫోన్ నంబర్ తప్పుగా నమోదు చేయడమే కారణంగా తెలిసింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పాజిటివ్ నిర్ధారణ అయ్యాక ఆ రోగి ప్రాథమిక కాంటాక్ట్స్‌కు పరీక్షలు చేయడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. అడిగినంత ఇచ్చి చికిత్స పొందా... నేను విజయనగరంలో ఉంటాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరేందుకు నిర్వాహకులను సంప్రదించాను. అడ్మిషన్ చేసుకోవాలంటే రూ.45 వేలు కట్టాలన్నారు. మా ఇంట్లో 60 ఏళ్లు పైబడినవారు, చిన్నపిల్లలు మొత్తం కలిపి 16 మంది ఉన్నారు. వారందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిలో వారడిగినంత డబ్బుకట్టి జాయిన్ అయ్యాను. – కరోనా బాధితుడు. కఠిన శిక్ష తప్పదు కోవిడ్ బాధితుల చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే తీసుకోవాలి. అలా కాదని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువ డబ్బు వసూలు చేస్తే కఠిన శిక్షలు తప్పవు. అలాంటి వారిపై బాధితులు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన నేరంపై సెక్షన్ 188, విపత్తు నివారణ చట్టం ప్రకారం ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులపై కేసు నమోదు చేస్తాం. నేరం రుజవైతే న్యాయస్థానంలో వారికి ఏడాదిపాటు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. – బి.రాజకుమారి, జిల్లా ఎస్పీ ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే తీసుకోవాలి ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి ప్రభుత్వం నిర్దే«శించిన ఫీజు మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నట్టయితే చర్యలు తీసుకుంటాం. కొంతమంది అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – జి.నాగభూషణరావు, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి -
ఉచిత టెస్టుల్లోనూ కాసుల వేట
వేగంగా నిర్ధారణ ఫలితం వస్తుండటంతో కరోనా లక్షణాలున్న బాధితులంతా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు మొగ్గుతున్నారు. దీన్నే కొందరు అక్రమార్కులు ధనార్జనగా మార్చుకుంటున్నారు. హైదరాబా ద్ నగరంలో 300 కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నా దాదాపు అన్నిచోట్లా జనం కిటకిటలాడుతున్నారు. పైగా వచ్చిన వారందరికీ పరీక్షలు చేయకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. తాకిడి పెరగడంతో ఆయా ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది మాట్లాడుకొని ఉచితంగా చేయాల్సిన పరీక్షలను సొమ్ము చేసుకుంటున్నారు. పైగా తమకు తెలిసిన వారి నుంచి వచ్చే విన్నపాలను ముందుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. కొంత మొత్తం చెల్లించాలని ముందే చెబు తున్నారు. విచిత్రమేంటంటే పైరవీ, ఎంతో కొంత చెల్లించనిదే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌చేసే పరిస్థితి చాలాచోట్ల లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో అటెండర్ నుం చి పైస్థాయి వరకు వచ్చిన డబ్బులు పంచుకుంటున్నారన్న ఆరోపణలు న్నాయి. కొన్నిచోట్ల తలా కొన్ని కిట్లు అనుకొని డబ్బులిచ్చినవారికి పరీక్ష లు చేసి పంపుతున్నారు. డబ్బులు చెల్లించలేనివారు లైన్లలో నిలబడి, కిట్లు అయిపోయాక వెనుదిరిగి పో తున్నారు. వాస్తవంగా యాంటిజెన్ పరీక్ష చేయాలంటే దానిక య్యే ఖర్చు ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం రూ.500. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ఉచితంగా చేయాలి. కానీ ఎక్కడా అటువం టి పరిస్థితి కనిపించట్లేదు. -
ప్రైవేటు ఆస్పత్రులకు కేసీఆర్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రైవేటు ఆస్పత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనాతో ప్రజలు హైరానా పడి ప్రైవేట్ ఆస్పత్రులకు పోవద్దని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొందని, వైరస్ విషయంలో ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాల్సిందేనని మనోధైర్యాన్ని నింపారు. రాష్ట్రంలో అంత భయంకరమైన పరిస్థితి లేదని, అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యానికి తావివ్వకూడదు సూచించారు. రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో వైద్యశాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. (సర్కార్‌కు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు) యూజీసీ స్కేలు వేతనాలు అధికారులతో సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కావాల్సిన అన్ని సౌకర్యాలు వేగంగా సమకూర్చుకున్నాం. గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లో 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో ఉన్నాయి. వైద్య కళాశాలల్లో పని చేసే అధ్యాపకులకు యూజీసీ స్కేలు వేతనాలు చెల్లిస్తాం. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాతవారితో సమానంగా వేతనాలు అందిస్తాం. ఆయుష్ అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు 65ఏళ్లకు పెంచేలా నిర్ణయం తీసుకుంటాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, పోలీసులు, మున్సిపల్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కోవిడ్ ఇన్సెంటివ్ కొనసాగిస్తాం. పీజీ పూర్తి చేసిన 1200 వైద్య విద్యార్థులను మందిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవాలి. పీహెచ్‌సీల్లో 200 మంది డాక్టర్ల నియామకాన్ని వెంటనే చేపట్టాలి. (విద్యార్థులకు శుభవార్త: కేసీఆర్ కీలక నిర్ణయం) ప్రతిపక్షాల చిల్లర విమర్శలు కరోనాపై ముందు కేంద్రమే గందరగోళ పరిస్థితుల్లో ఉండేది. దేశవ్యాప్తంగా ఆన్ లాక్ ప్రక్రియ నడుస్తోంది. అంతర్జాతీయ విమానాలు నడపాలని కూడా కేంద్రం నిర్ణయించింది. అవగాహన లేకుండా ప్రతిపక్షాలు చేసే చిల్లరమల్లర విమర్శలు పట్టించుకోవద్దు. తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడానికి వైద్యులు, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిపక్షాలు తీరు సరైనది కాదు.’ అని వ్యాఖ్యానించారు. -
కర్కోటక ఆసుపత్రులు
-
పీపీఈ కిట్ కోసం భారీగా వసూళ్లు
-
ఆక్సిజన్ పెట్టకుండానే బిల్లు!
సాక్షి, సిటీబ్యూరో: చాదర్‌ఘాట్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి నిర్వాకం ఇంకా మరిచిపోకముందే... తాజాగా గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్ ఆస్పత్రి వైద్యం పేరుతో ఎన్నారై వైద్యురాలికి షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో లేని స్పెషాలిటీ వైద్యులు వచ్చి రోగికి చికిత్సలు అందించినట్లు, ఖరీదైన మందులు వాడినట్లు, వెంటిలేటర్ అమర్చినట్లు...ఇలా ఇష్టం వచ్చినట్లు బిల్లు వేశారు. చేతికందిన బిల్లు చూసి..సదరు వైద్యురాలు షాక్‌కు గురైంది. ఇదెక్కడి ఘోరం అంటూ సెల్ఫీ వీడియో తీసి బయటికి వదలడంతో అది వైరల్ అయింది. అసలేమైందంటే... మూత్రనాళ సంబంధిత కేన్సర్‌తో బాధపడుతున్న నగరానికి చెందిన యాదగిరిరావు కేసరిని చికిత్స కోసం జూన్ 25న గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆయనతో పాటే ఆయన కుమార్తె , ఎన్నారై డాక్టర్ విజయకేసరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా ఆయనకు టెస్టులు నిర్వహించగా, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆయన కుమార్తె డాక్టర్ విజయకేసరి కూడా టెస్టు చేయించుకోగా, ఆమెకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమె కూడా ఇదే ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో అడ్మిటయింది. నిజానికి వీరిద్దరికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు లేవు. కానీ ఆస్పత్రి సిబ్బంది వారికి మెడికేషన్ ఇచ్చినట్లు, ఆక్సిజన్ పెట్టినట్లు బిల్లు వేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు బదులు ఫల్మొనాలజీ వైద్యుడిగా పేరు మార్చి అదనంగా మళ్లీ బిల్లు వేశారు. అదేమని అడిగితే.. నాలుగు రోజుల నుంచి మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు. బలవంతంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌గారు దయచేసి కాపాడండి!.. అంటూ సెల్పీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు వీడియో వైరలైంది. ఇది అనైతికంః డాక్టర్ విజయకేసరి, బాధితురాలు మా నాన్నకే కాదు నాక్కూడా ఒక్క సింప్టమ్ కూడా లేదు. నాకు ఇంజక్షన్ ఇచ్చినట్లు, ఐవీ ఇచ్చినట్లు, ఆక్సిజన్ ఇచ్చినట్లు బిల్లు వేశారు. నిజానికి విటమిన్ సి, మల్టీవిటమిన్, యాంటి బయోటిక్ టాబ్లెట్స్ మినహా మరే ఇతర మందులు కానీ, ఇంజక్షన్లు కానీ ఇవ్వలేదు. రాని డాక్టర్ల పేరుతో రూ.లక్షల్లో బిల్లు వేశారు. అదేమని ప్రశ్నిస్తే...నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు చెల్లించాలో అర్థం కావడం లేదు. ఇండియాలో ఇదెక్కడి ఘోరం? ఇంత దారుణమా? అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరికీ..14 రోజులకు రూ.2.96 లక్షలేః ఏఐజీ ఆస్పత్రి తండ్రితో పాటు డాక్టర్ విజయ కూడా కోవిడ్ పాజిటివ్‌తో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఐసోలేషన్‌లో భాగంగా తండ్రి కుమార్తెలిద్దరూ వేర్వేరు రూమ్‌లను ఎంచుకున్నారు. తాను ఎన్నారై డాక్టర్‌నని, తనకు ప్రత్యేక రూమ్ కావాలని చెప్పిరోజుకు రూ.12 వేలు అద్దె ఉన్న గదిని ఎంచుకున్నారు. తండ్రికి రూ.ఆరు వేలు ఉన్న గదిని ఎంచుకున్నారు. వీరిద్దరి రూమ్‌రెంట్, మందులు, వైద్యుల ఛార్జీ ఇలా 14 రోజులకు మొత్తం రూ.2.96 లక్షల బిల్లు మాత్రమే వచ్చింది. ఆ బిల్లు చెల్లించడం ఇష్టం లేకే ఆమె ఆస్పత్రిపై ఆరోపణలు చేస్తోందని ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. -
ఆస్పత్రుల యాజమాన్యాలతో గవర్నర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ కానున్నారు. కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆస్పత్రుల పని తీరు, చికిత్స అందిస్తున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అయితే తమకు ప్రభుత్వం విధించిన చార్జీలు సరిపోవడం లేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసిన యాజమాన్యాలు విన్నవించాయి. చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ప్రభుత్వం చార్జీలు పెంచడంతో పాటు బెడ్స్ పరిమితిని పెంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరనున్నాయి. (చదవండి: సర్కారు, గవర్నర్.. ఓ కరోనా) -
ప్రైవేటు పరీక్షలు.. తప్పుల తడకలు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ ల్యాబ్‌లలో నిర్వహిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. శాంపిల్స్‌లో ఉన్న వాస్తవ పరిస్థితికి భిన్నంగా రిపోర్టు లు ఇవ్వడంతో సర్వత్రా అయోమయం నెలకొంటోంది. అటు వైరస్ లక్షణాలున్నట్లు భావించి శాంపిల్స్ ఇచ్చినవారికి.. ఇటు వివరాలు పరిశీలిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగానికి ఈ పరిస్థితి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లెక్కకు మించి పరీక్షలు నిర్వహిస్తుండగా.. వైరస్ లేనప్పటికీ పాజిటివ్ కేసులుగా పేర్కొంటూ రిపోర్టులు ఇస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఏమిటో తెలుసుకునేందుకు ఉపక్రమించిన వైద్య, ఆరోగ్య శాఖ.. ప్రైవేటు ల్యాబ్‌లలో వసతులు, సౌకర్యా లు, పరీక్షల నిర్వహణ, రిపోర్టుల జారీ తదితర అంశాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మైక్రోబయాలజీ ప్రొఫెసర్లు, వైద్య విద్య సంచాలక కార్యాలయ నిపుణులు, ఖాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం నిపుణులతో కూడిన నాలుగు బృందాలు ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రైవేటు ల్యాబ్‌లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు అంశాలను వెలుగులోకి తెచ్చాయి. సరైన శిక్షణ లేకుండానే... రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణం గా ఈ పరీక్షలు నిర్వహించాలి. కానీ చాలాచోట్ల కనీస జాగ్రత్తలు పాటించడంలేదని తనిఖీ బృం దాలు గుర్తించాయి. పలు ల్యాబ్‌లలో శాంపిల్స్ తీసుకునే సిబ్బంది పీపీఈ కిట్లు కూడా ధరించడం లేదు. ల్యాబ్ వాతావరణం ఇబ్బందికరంగా ఉం డగా.. చాలామంది సిబ్బందికి కేబిన్లు కూడా లేవు. ప్రధానంగా పరీక్షలు నిర్వహించే సిబ్బంది సరైన అనుభవం లేకుండానే పరీక్షలు చేస్తుండటంతో ఎక్కువ కేసులు నెగిటివ్‌కు బదులు పాజి టివ్‌గా వస్తున్నట్లు తనిఖీ బృందం గుర్తించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పూల్డ్ టెస్టింగ్ విధానం పూర్తయిన తర్వాత వచ్చేవాటిలో పాజిటివ్ కేసులతో పాటు నెగిటివ్ కేసులను కూడా పాజిటివ్‌గా పే ర్కొంటున్నట్టు నిర్ధారించింది. జాగ్రత్తలు పాటిం చకపోడంతో శాంపిల్స్ కలుషితం కావడంతో పా టు నెగిటివ్ వచ్చే శాంపిల్స్ కూడా పాజిటివ్‌గా ని ర్ధారణయ్యే అవకాశముందని అంచనాకు వచ్చింది. కొన్ని ల్యాబ్‌లలో భౌతికదూరం పాటించకుం డా ఇష్టానుసారంగా శాంపిల్స్ తీసుకుంటున్నట్లు గుర్తించింది. మరికొన్ని ల్యాబ్‌లలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, పరికరాలను శుభ్రం గా ఉంచకపోడంతో పరీక్షల ఫలితాలు ప్రమాదకరంగా వచ్చే అవకాశం ఉందని కమిటీ తేల్చింది. మరింత లోతైన అధ్యయనం... వైద్య, ఆరోగ్య శాఖ నిపుణుల కమిటీ తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నిబంధనలకు విరుద్దంగా, ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు లోబడి నడుచుకోని ల్యాబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మరోవైపు ల్యాబ్‌లలో లోపాలపై లోతైన అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితులను విశ్లేషించనున్నట్లు నివేదికలో పేర్కొంది. -
మార్గదార్శకాలు బేఖాతరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు రంగంలోనూ కరోనా పరీక్షలు, చికిత్సలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని ఆసరాగా చేసుకొని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అందినకాడికి దండుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పలువురు బాధితులు మండి పడుతున్నారు. తీవ్ర వ్యాధి లక్షణాలు లేని కరోనా పాజిటివ్ వ్యక్తులు ఇళ్లలోనే ఉండి చికిత్స పొందొచ్చని ప్రభుత్వం పేర్కొన్నప్ప టికీ కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు ఫీజుల కోసం రోగులను భయపెట్టి మరీ అడ్మిట్ చేసుకుంటు న్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ కరోనా రోగికి చికిత్స అందించిన ఒక కార్పొరేట్ ఆస్పత్రి.. డిశ్చార్జి సమయంలో రూ.7.5 లక్షల బిల్లు వసూలు చేసి నట్లు తెలిసింది. మరో వైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభించిన 50 వేల కరోనా టెస్టుల ప్రత్యేక డ్రైవ్‌కు ప్రభుత్వం రెండు రోజుల విరామం (శాంపిళ్ల ఫలితాలు పెండింగ్‌లో ఉండటంతో) ప్రకటించడంతో కరోనా లక్షణాలున్న వారు ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లు వసూళ్లకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వస్తు న్నాయి. డబ్బు గుంజినా శాంపిళ్లు మాత్రం తీసుకోకుండా టోకెన్లు ఇస్తూ మర్నాడు రమ్మని చెబుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. పడకలు లేవంటూ అసత్య ప్రచారం...హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్పత్రులకు కరోనా లక్షణాలతో ప్రజలు పోటెత్తుతున్నా వైద్యులు, సిబ్బంది కొరత వల్ల చికిత్సలో జాప్యం చోటుచేసుకుంటోంది. దీన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకొనేందుకు కొన్ని ఆస్పత్రులు ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. కరోనా వార్డుల్లో పడకలున్నా అవన్నీ నిండిపోయాయని అసత్య ప్రచారం చేస్తూ అధిక మొత్తం ఇచ్చేందుకు ముందుకొచ్చే వారికి చికిత్స అందిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. తక్కువ జీతాలకు పనిచేయలేమంటూ... మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సిబ్బందికి తక్కువ జీతాలు ఇస్తుండటంతో కరోనా వార్డుల్లో వైద్య సేవలు అందించేందుకు చాలా మంది నిరాకరిస్తు న్నారు. వారిలో కొందరు ఉద్యోగాలకు రాజీనామా చేసి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సులు కరోనా విధులు చేయలేమంటూ శుక్రవారం ఆందోళనకు దిగినట్లు తెలిసింది. దీంతో ఆగమేఘాల మీద ఎం తైనా ఇచ్చి పలుచోట్ల నుంచి నర్సులను రప్పించేం దుకు యాజమాన్యం ప్రయత్నాలు మొదలు పె ట్టింది. జూబ్లీహిల్స్‌లో పేరు మోసిన కార్పొరేట్ ఆస్పత్రిలోనూ 300 మంది నర్సుల అవసరం ఉన్నా ఎవరూ ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యం లో ఆ ఆస్పత్రి స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, నర్సింగ్ సూపర్వైజర్లు, క్వాలిటీ ఎగ్జిక్యూటివ్‌లు సహా 13 రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. నర్సులకు సీనియారిటీ ఆధారంగా రూ. 35 వేల నుంచి రూ. 45 వేల వరకు జీతం ఇస్తామని పేర్కొంది. మరికొన్ని ఆస్ప త్రులైతే అవసరాన్ని బట్టి రూ. 50 వేలకు పైగా ఇచ్చేందుకు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రభు త్వ ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులకు, ఇతర పారా మెడికల్ సిబ్బందికి భారీ వేతనాలు ఉండటం, కరోనా బీమా కూడా ఉండటంతో పనిచేస్తున్నా రని, కానీ ప్రైవేటులో అటువంటి పరిస్థితి లేకపో వడంతో వైద్య సిబ్బంది వెళ్లిపోతున్నారని ఒక నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. మరోవైపు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కొంద రు వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో విధులకు వచ్చే వారి సంఖ్య తగ్గినట్లు చెబుతున్నారు. -
కరోనా చికిత్స : ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులపై పరిమితి
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల చికిత్సకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్స రేట్లను తగ్గించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ సిఫార్సు చేసింది. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ రాజధాని వాసులకు ఊరట కల్పించే సిఫార్సులు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ బెడ్‌కు రోజుకు రూ. 8000-10,000, ఐసీయూలో ఉండే రోగులకు రూ 13,000-15,000, వెంటిలేటర్‌పై చికిత్సకు రూ 15,000-18,000 వరకూ ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేయవచ్చని ఈ కమిటీ పేర్కొంది. పీపీఈ ఖర్చులు కూడా కలిపి ఈ మొత్తానికి మించి ఏ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రి వసూలు చేయరాదని సూచించింది. ప్రస్తుతం పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఐసోలేషన్ బెడ్స్‌కు రూ 25,000, ఐసీయూల్లో రోగులకు రోజుకు రూ 40,000 వసూలు చేస్తుండగా, వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు రోజుకు రూ 44,000-54,000 వరకూ వసూలు చేస్తున్నాయి. చదవండి : కరోనా ఎఫెక్ట్ : ఆ జంటకు డిజిటల్ విడాకులు -
కరోనా టెస్టుల ధరలు పెంచాలి: ప్రైవేటు ఆసుపత్రులు
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులకు ప్రభుత్వం నిర్వహించిన ధరల విషయంపై ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. బీఆర్కే భవన్లో గురువారం మంత్రి ఈటలతో ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ సభ్యులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా టెస్టులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు పెంచాలని ఆస్పత్రుల అసోసియేషన్ మంత్రి ఈటలను కోరారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల అసోసియేషన్ వినతిని ప్రభుత్వం తిరస్కరించింది. కోవిడ్-19 బాధితులకు ప్రభుత్వ రేట్ల ప్రకారమే వైద్యం చేయాలని ఈటల సూచించారు. ప్రజా వైద్యంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని కోరాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు త్వరలో చెల్లిస్తాం మంత్రి ఈటల పేర్కొన్నారు. -
కరోనా పరీక్షలు, చికిత్స : దేనికెంత..?
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు నిర్ధారించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి సోమవారం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారు. ప్యాకేజీలోకి వచ్చే అంశాలు, ప్యాకేజీయేతర అంశాలను అందులో పొందుపరిచారు. ప్యాకేజీ రోజువారీ ఫీజు (రూ.లలో) రొటీన్ వార్డ్ + ఐసోలేషన్ 4,000 ఐసీయూ (వెంటిలేటర్ లేకుండా) + ఐసోలేషన్ 7,500 ఐసీయూ (వెంటిలేటర్ సహా) + ఐసోలేషన్ 9,000 ప్యాకేజీలో లభించేవి.. ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీలన్నింట్లో రోగికి సీబీసీ, యూరిన్ రొటీన్, హైచ్ఐవీ స్పాట్, యాంటీ హెచ్ఐవీ, హెచ్‌బీఎస్, సీరం క్రియాటినైన్, యూఎస్జీ, 2డీ ఎకో, డ్రగ్స్, ఎక్స్‌రే, ఈసీజీ, కన్సల్టేషన్స్, బెడ్ చార్జెస్, మీల్స్‌తోపాటు ప్రొసిజర్స్ (రెలెస్ట్యూబ్ ఇన్సర్షన్, యూరినరీ ట్రాక్ట్ క్యాథెటరైజేషన్) సేవలు అందుతాయి. ప్యాకేజీలో లభించనివి... ► పీపీఈ కిట్లు ► ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ (సెంట్రల్ లైన్ ఇన్సర్షన్, కీమోపోర్ట్ ఇన్సర్షన్, బ్రాంకోస్కొపిక్ ప్రొసిజర్, బైయాప్సీస్, యాసిటిక్/ప్లైరల్ టాప్పింగ్. వీటికి 2019 31 డిసెంబర్ నాటి ర్యాక్ రేట్ల ఆధారంగానే చార్జీ వసూలు చేయాలి.) ► కోవిడ్–19 టెస్టింగ్ (ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం) ► హైఎండ్ డ్రగ్స్ (ఇమ్యునోగ్లోబిన్, మెరోపెనమ్, పేరంటల్ న్యూట్రిషన్, టోసిల్‌జంబ్. వీటికి ఎంఆర్పీ ధరలే వసూలు చేయాలి) ► హై ఎండ్ ఇన్వెస్టిగేషన్స్ (సీటీ స్కాన్, ఎంఆర్ఐ, పీఈటీ స్కాన్, ఇతర ల్యాబ్ పరీక్షలు) ల్యాబ్ పరీక్షలకు ఫీజులు ఇలా... కేటగిరీ ఫీజు ల్యాబ్/హాస్పిటల్ వద్ద శాంపిల్ ఇస్తే రూ. 2,200 ఇంటి వద్దకు వచ్చి శాంపిల్ సేకరిస్తే రూ. 2,800 ప్రభుత్వ మార్గదర్శకాలివీ.. ► కరోనా చికిత్స చేసే ప్రైవే టు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలను డిస్ప్లే బోర్డుల్లో తప్పకుండా ప్రదర్శిస్తూ ఆ మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలి. ► రోగులు, వారి బంధువుల కు సేవల వివరాలను వెల్లడించాలి. ► పాజిటివ్ ఉన్నప్పటికీ లక్షణాలు లేని వా ళ్లు, అతితక్కువ లక్షణాలున్న వాళ్లను ఆస్పత్రుల్లో చే ర్చుకోవద్దు. వారిని హోం ఐసోలేషన్‌కు పరిమితం చేయాలి. ► ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్ లు, ఆస్పత్రులే కరోనా పరీక్షలు నిర్వహించాలి. ► కరోనా అప్డేట్స్ను ప్రభు త్వం అభివృద్ధి చేసిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వెబ్సైట్లో సకాలంలో పొందుపరచాలి. ఇందుకు ప్రతి ల్యాబ్, ఆస్పత్రికి పరిశీలన తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్లు జారీ అవుతాయి. ► నిబంధనలకు లో బడి ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు వ్యవహరించాలి. ► కరోనా చికిత్సలు, పరీక్షలపై మార్కెటింగ్ చేసుకున్నట్లు ఫిర్యాదులొస్తే చర్యలు ఉంటాయి. ► ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు అ తిక్రమిస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. -
కరోనా పరీక్ష @ రూ. 2,200
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు సేవలకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నప్పటికీ ఫీజులను ఏ మేరకు వసూలు చేయాలనే విషయమై ప్రభుత్వం తాజాగా స్పష్టత ఇచ్చింది. అదేవిధంగా ప్రైవేటు ల్యాబ్‌లు కరోనా పరీక్షలు చేసేలా వెసులుబాటు కల్పించింది. కరోనా పరీక్షకు రూ. 2,200 ఫీజును ఖరారు చేసింది. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో అందించే చికిత్సలో భాగంగా రోజుకు ఐసోలేషన్ ఫీజు రూ. 4 వేలు, ఐసీయూలో వెంటిలేటర్ అవసరం లేకుండా రోజుకు రూ. 7,500, ఐసీయూలో వెంటిలేటర్ అవసరం ఉంటే రోజుకు రూ. 9 వేలుగా ధరలు ఖరారు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి తదితరులతో కలసి ఆయన మీడియా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నందున మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు పటాన్చెరు నియోజకవర్గంలో 50 వేల పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఈ టెస్టుల సంఖ్యను మరింత పెంచుతామన్నారు. ప్రభుత్వం కరోనా టెస్ట్‌లు చేయడం లేదంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, కానీ ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము తొలిరోజు నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్. చిత్రంలో సీఎస్ సోమేశ్‌కుమార్ భరోసా కల్పించేందుకే పరీక్షలు... కరోనా కట్టడిలో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడం, లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడం వల్లే తెలంగాణలో కేసులు తక్కువగా ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. లక్షణాల్లేని వారికి ఎలాంటి చికిత్స అందించాలి, లక్షణాలున్న వారికి ఎలాంటి చికిత్స ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టిందని, తర్వాత ఐసీఎంఆర్ సైతం రాష్ట్ర విధానాన్ని అనుసరిస్తూ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో పరిస్థితికి అనుగుణంగా పనిచేస్తోందని, లేకుంటే ఢిల్లీ, ముంబై తరహాలో హైదరాబాద్‌లో పరిస్థితి నెలకొనేదన్నారు. ప్రజల్లో భరోసా కల్పించేందుకే టెస్టుల సంఖ్యను పెంచుతున్నట్లు ఈటల చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ల్యాబ్‌లలో రోజుకు 4,500 పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందని, త్వరలో అన్ని మెడికల్ కాలేజీల్లో ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని, పరీక్షల కోసం మరో మిషన్‌ను సిద్ధం చేస్తున్నామని, దీంతో రోజుకు 7,500 పరీక్షలు నిర్వహించే స్థాయికి చేరుకుంటామన్నారు. హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని, కేసుల సంఖ్య ప్రకారం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో సమూహ వ్యాప్తి లేదని, అన్ని రకాల సర్వేలు ఇదే రిపోర్టు చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపుల తర్వాత సీఎం కేసీఆర్ లోతుగా పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులిలా.. రోజుకు ఐసోలేషన్ ఫీజు - రూ. 4,000 ఐసీయూలో వెంటిలేటర్ అవసరం లేకుండా రోజుకు.. - రూ. 7,500 ఐసీయూలో వెంటిలేటర్ అవసరం ఉంటే రోజుకు.. - రూ. 9,000 ప్రైవేటుపై టాస్క్‌ఫోర్స్... ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షలపై ఆయా యాజమాన్యాలు ప్రతిక్షణం ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని, వాటి ఆధారంగా కంటైన్మెంట్ ఏర్పాటు తదితర చర్యలు తీసుకుంటామన్నారు. ఈటల తెలిపారు. ప్రైవేటు ఆస్పతులు, ల్యాబ్‌లపై నిఘా కోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందం పనిచేస్తుందన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఈటల సూచించారు. కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రతి రంగాన్నీ రక్షించుకుంటామని, వైద్యులు, వైద్య సిబ్బందితోపాటు పోలీసులు, జర్నలిస్టులకు ప్రభుత్వం సంతృప్తికర స్థాయిలో వైద్య పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. కింగ్‌కోఠిలోని జిల్లా ఆస్పత్రికి వచ్చే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో దాదాపు 5 వేల పడకల ద్వారా ఆక్సిజన్‌తో కూడిన చికిత్స అందించే వీలుందన్నారు. సీజనల్ వ్యాధులపై పకడ్బందీ సర్వే నిర్వహించనున్నామని, ఇందుకు తాత్కాలిక పద్ధతిలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లను నియమించుకొని ఇంటింటి సర్వే చేపడతామన్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాలని, మిగతా వర్గాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సకల వసతులు ఏర్పాటు చేశామన్నారు. పడకల కొరత లేదు: సీఎస్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. పెయిడ్ పేషెంట్లు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలని, ప్రభుత్వ ఉద్యోగులు సహా ఇతర కేటగిరీ వారంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలన్నారు. ఐసీఎంఆర్ గుర్తించిన ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు అనుమతిచ్చిన నేపథ్యంలో ఎవరూ మార్కెటింగ్ చేసుకోవద్దని, అలాంటి పనులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎస్ హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలను బ్లాక్ చేయొద్దని, రోగులు, పడకల వివరాలు డిస్ప్లేలో తప్పకుండా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. యాజమాన్యాలు అన్నివేళలా పడకల వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మున్సిపల్ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్‌తోపాటు నాలుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశామన్నారు. కరోనా లక్షణాలు లేనివారు ఆస్పత్రుల్లో చేరొద్దని, హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉన్న పడకలు- 17,000 ‘ఆక్సిజన్’తో చికిత్స అందించే వీలున్న పడకలు- 5,000 -
కరోనా టైంలోనూ కాసుల కక్కుర్తి
అహ్మదాబాద్ : కరోనాతో ఓ వైపు ప్రజలు అల్లాడుతుంటే, ఇదే అదనుగా భావించి కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రం ప్రజలను దోచుకునే పనిలో పడ్డాయి. నిబంధనల్ని గాలికొదిలేసి ప్రజల నుంచి భారీగా సొమ్మ వసూలు చేసిన రెండు ప్రైవేటు సంస్థలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. కరోనా కట్టడికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులతో బెడ్లు నిండిపోయాయి. (క్వారంటైన్ సెంటరా? క్రికెట్ స్టేడియమా? ) ఈ నేపథ్యంలో వారికి 40 శాతం బెడ్లు కేటాయిస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. అయితే గుజరాత్‌లోని ఆర్దమ్ హాస్పిటల్‌తో పాటు బాడీలైన్ హాస్పిటల్లో కరోనా రోగుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్నట్లు సమాచారం అందడంతో రెండు ఆస్పత్రులపై 5 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఏడు రోజుల్లోనే ఈ మొత్తాన్ని జమ చేయాల్సిందిగా ఆదేశించారు. లేని పక్షంలో హాస్పిటల్ రిజిస్ర్టేషన్ రద్దు చేస్తామని తెలిపింది. (ఎల్జీ ఆదేశాలను అమలు చేస్తాం: కేజ్రీవాల్ ) -
కరోనా పేరిట ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ పరీక్షలకు (ఆర్టీ–పీసీఆర్ టెస్టింగ్) 4,500 రూపాయలకు మించి ఫీజు వసూలు చేయరాదని, హాండ్ శానిటైజర్లకు, సర్జికల్ మాస్క్‌లకు కలిపి 400 రూపాయలకు మించి తీసుకోరాదని భారతీయ వైద్య పరిశోధనా మండలికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాలు తెల్సినవే. కరోనా రోగులను ఆస్పత్రిలో చేర్చుకుంటే ఎంత ఫీజు ? వారు వేసుకునే ఎన్–95 మాస్క్‌లకు, గాగుల్స్‌కు ఎంత ఫీజు? మొత్తం డిశ్చార్జి అయ్యే వరకు ఎంత ఫీజు మించకూడదో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచిగానీ, కోర్టుల నుంచి గానీ దేశంలోని ప్రైవేటు ఆస్పత్రులకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. (‘6 రోజులుగా అక్కడ ఒక్కరు మరణించలేదు’) దాంతో ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు గుంజుతున్నారు. లక్షల్లో చార్జీలు వసూలు చేస్తున్నారని ‘జన్ స్వస్థ్య అభియాన్’కు చెందిన ఆరోగ్య కార్యకర్త ఇనియత్ సింగ్ కాకర్ ఆరోపించారు. ఏ జబ్బుతో రోగులు ఆస్పత్రలకు వెళ్లినా కరోనా పరీక్షలు తప్పనిసరంటూ, కరోనా లేదని నిర్ధారణ అయినా ముందు జాగ్రత్త అంటూ మాస్క్‌లను ఇస్తూ వాటికి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో కిడ్నీ జబ్బులతో బాధ పడుతున్నవారికి ఒకసారి డయాలసిస్‌కు 25 వేల రూపాయల చొప్పున వసూలు చేసిన ఆస్పత్రులు ఇప్పుడు 35 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..) -
కరోనా ఎఫెక్ట్: తమిళనాడు కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 30,152 నమోదయిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులలో కరోనా వైరస్ చికిత్సకు నిర్ణీత ధరలను నిర్ణయించింది. కరోనా లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని ఏ1, ఏ2 కేటగిరీలుగా ప్రభుత్వం వర్గీకరించింది. ఏ1,ఏ2 కేటగిరి రోగుల చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు రూ.7500 ఫీజును వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఏ3, ఏ4 కేటగిరి జనరల్ వార్డు రోగుల నుంచి రూ.5000 ఫీజును వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. కాగా ఏ1, ఏ2, ఏ3, ఏ4 కేటగిరీలకు సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రులలో ఐసీయూ విభాగానికి మాత్రం రూ.15000 వసూలు చేసుకోవచ్చని తెలిపింది. కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని బాధితుల ఫిర్యాదుతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. తమిళనాడుని కరోనా పంజా విసురుతోంది. కాగా, శనివారం ఒక్క రోజే 1,458 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఇంత వరకు 251మంది కరోనాతో చనిపోయారు. చదవండి: భారత్‌లో అమెరికా కంటే ఎక్కువ కేసులు: ట్రంప్ -
15 రోజుల్లోగా పంపేయండి
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వరాష్ట్రాలకు తరలించేందుకు 15 రోజుల గడువివ్వనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. స్వరాష్ట్రాలకు వెళ్ళే వలస కార్మికుల ఉపాధి కల్పన కోసం, వారికి ఇతర ప్రయోజనాలు చేకూర్చేందుకు వారి పేర్లను నమోదు చేయాలని కోరింది. అందుకు ఈ సమయం సరిపోతుందని కోర్టు అభిప్రాయపడింది. వలస కార్మికుల తరలింపు, వారి పేర్ల నమోదు, ఉపాధి అవకాశాల కల్పన సహా అన్నింటిపైనా జూన్ 9న ఆదేశాలివ్వనున్నట్టు ధర్మాసనం పేర్కొన్నది. వలస కార్మికుల అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారించిన సుప్రీంకోర్టు వారిని సురక్షితంగా తమతమ ప్రాంతాలకు చేర్చేందుకు గతంలో ఆదేశాలు జారీచేసింది. వలస కార్మికుల నుంచి బస్సుల్లోగానీ, రైళ్ళలోగానీ చార్జీలు వసూలు చేయరాదనీ, వారికి ఉచితంగా భోజనసదుపాయం కల్పించాలనీ సుప్రీంకోర్టు మే 28న ఆదేశించింది. తీర్పుని రిజర్వులో ఉంచిన కోర్టు, కోవిడ్ కారణంగా లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వెల్లడించాలని జస్టిస్ అశోక్ భూషణ్, ఎస్.కే.కౌల్, ఎంఆర్.షాలతో కూడిన ధర్మాసనం కోరింది. స్వరాష్ట్రాలకు చేరిన వలస కూలీలకు ఉపాధి అవకాశాల కల్పన కోసం కొత్త పథకాలు రూపకల్పన చేయాలని సూచించింది. వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు చేర్చేందుకు జూన్ 3వ తేదీ వరకు 4,200 శ్రామిక్ స్పెషల్ రైళ్ళను నడిపినట్టు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఇప్పటి వరకు కోటి మందికిపైగా వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చామనీ, 41 లక్షల మందిని బస్సుల ద్వారానూ, 57 లక్షల మందిని రైళ్ళ ద్వారా తరలించినట్టు మెహతా పేర్కొన్నారు. వలస కార్మికులకోసం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు అత్యధిక రైళ్ళను నడిపినట్టు వెల్లడించారు. ఇంకా ఎంత మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. వారిని తరలించేందుకు ఎన్ని రైళ్ళు అవసరమనే విషయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలని తుషార్ మెహతా కోర్టుకి వెల్లడించారు. ఇకముందు కూడా వలస కార్మికుల అవసరాన్ని బట్టి వారిని తరలించేందుకు రైళ్ళు నడుపుతామని కోర్టుకి హామీ ఇచ్చారు. జాతీయ మానవహక్కుల కమిషన్ సైతం కల్పించుకొని వలస కార్మికుల ప్రయోజనం కోసం చేపట్టాల్సిన కొన్ని చర్యలను వివరించింది. మొత్తం 22 లక్షల మందిలో ఇంకా 2.5 లక్షల మంది వలస కార్మికులను మాత్రమే తరలించాల్సి ఉందని గుజరాత్ పేర్కొంది. ఇంకా ఢిల్లీలో 2 లక్షల మంది వలస కార్మికులుండగా 10 వేల మంది మాత్రమే తిరిగి వెళ్లాలనుకుంటున్నారని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఢిల్లీ సరిహద్దుల నుంచి 5.50 లక్షల మంది వలస కార్మికులను తమ రాష్ట్రానికి చేర్చినట్టు ఉత్తరప్రదేశ్ విన్నవించింది. రాజస్తాన్ నుంచి 6 లక్షల మందిని, మహారాష్ట్ర నుంచి 11 లక్షల మందిని తరలించారు, ఇంకా 38 వేల మందిని తరలించాల్సి ఉంది. 28 లక్షల మంది బిహార్‌కి తిరిగి వచ్చినట్టు ఆ రాష్ట్రం పేర్కొంది. కోవిడ్‌కు ఉచిత చికిత్స చేస్తారా? ప్రభుత్వ ఆరోగ్య పథకం ‘ఆయుష్మాన్ భారత్’కింద కోవిడ్ –19 రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సుప్రీంకోర్టు ప్రైవేటు ఆసుపత్రులను ప్రశ్నించింది. దేశంలోని పేద, అట్టడుగు వర్గాల కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ఆయుష్మాన్ భారత్‌ని ప్రవేశపెట్టారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్–19 రోగులకు ఉచితంగా చికిత్స అందించాలని తాము కోరడం లేదని పేర్కొంది. కేవలం ప్రభుత్వ భూముల్లో, లేదా తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన భూముల్లో నడుస్తోన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కొందరు కోవిడ్–19 రోగులకు ఉచిత చికిత్సనందించాలని జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సారథ్యంలోని జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ రిషికేష్ రాయ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లు కొందరికైనా ఉచిత చికిత్సనందించలేవా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రైవేటు ఆసుపత్రులు కొంత సేవాభావంతో పనిచేసేలా చూడాలని అభిప్రాయపడింది. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకారం, అవే ధరలను అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు వర్తింపజేయాలని పిటిషన్ దారుడు, న్యాయవాది సచిన్ జైన్ కోర్టుకి విన్నవించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తిరిగి రెండు వారాల అనంతరం విచారించనుంది. ప్రైవేటులో కరోనా చికిత్స ఖర్చుకు పరిమితి విధించండి! ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్–19 రోగుల చికిత్సకు అయ్యే ఖర్చుపై పరిమితి విధించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సంబంధిత ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై వారంలోగా స్పందించాలని జస్టిస్ అశోక్‌భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసుకోగల స్థోమత ఉన్న వ్యక్తికి బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాల్సిన అవసరమేంటని పిటిషన్‌దారు ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు క్వారంటైన్ కేంద్రాల సంఖ్యను పెంచేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఆరోగ్య బీమా ఉన్నవారికి నగదు రహిత వైద్యం అందించాలన్నారు. -
కరోనా: ప్రైవేటులో చార్జీలపై సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా రోగుల చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేయాల్సిన ఫీజుకు పరిమితి విధింపుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, అందువల్ల చాలా మంది బాధితులకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక, వాటి సేవలు అందుబాటులో లేవని పిటిషనర్ అవిషేక్ గోయెంకా కోర్టుకు తెలిపారు. కోవిడ్ రోగుల చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజుపై అధిక పరిమితిని విధించడంపై జస్టిస్ అశోక్ భూషణ్, ఎంఆర్ షా, వి.రామసుబ్రమణియన్ ధర్మాసనం కేంద్రం స్పందనను కోరింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదిలాఉండగా, కోవిడ్ రోగుల చికిత్సపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గతంలో విచారించింది. ‘ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమిని పొందిన ప్రైవేట్, ఛారిటబుల్ ఆస్పత్రులను కోవిడ్ రోగులకు ఉచితంగా చికిత్స చేయమని కోరవచ్చా’ అని గతంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. అయితే, కోవిడ్ రోగులకు ఉచితంగా చికిత్స అందించడానికి ప్రైవేట్ ఆస్పత్రులను ఆదేశించే చట్టబద్ధమైన అధికారం తమకు లేదని ఇప్పటికే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. (చదవండి: వైరల్: మెడపై కాలేసి తొక్కిపట్టిన పోలీసు!) -
కరోనా చికిత్సకు అటువైపు వెళ్లబోము!!
న్యూఢిల్లీ: కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. కోవిడ్ చికిత్సలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సేవలపై ప్రజల అభిప్రాయం అనే అంశంపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ఫ్లాప్‌ఫాం ఈ అధ్యయనం చేసింది. ఐదు ప్రశ్నలతో కూడిన తమ స్టడీ 40 వేల మందిపై సాగిందని నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రుల అధిక చార్జీల బాదుడు తట్టుకోలేమని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే సెకండరీ కాంటాక్టు ద్వారా వైరస్ బారిన పడతామని మరో 46 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రుల చార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని.. ఒక నిర్ణీత మొత్తం ఫిక్స్ చేయాలని 61 శాతం మంది కోరుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా చికిత్సకు సరిపడా వైద్యసదుపాయాలు లేవని 32 శాతం మంది చెప్పుకొచ్చారు. ఒకవేళ కరోనా బారిన పడితే చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్తారనే ప్రశ్నకు.. 32 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులకు, 22 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రు వైపు మొగ్గు చూపారు. మరో 32 శాతం మంది అసలు ఆస్పత్రులకే వెళ్లమని అంటున్నారు. ఇంటి వద్దే చికిత్స తీసుకుంటామని, పరిస్థితి తీవ్రంగా ఉంటేనే ఆస్పత్రికి వెళ్తామని చెప్తున్నారు. 14 శాతం మంది మాత్రం కచ్చితంగా ఫలానా ఆస్పత్రికి వెళ్తామని చెప్పమలేమన్నారు. కరోనా లాక్‌డౌన్‌తో అందరి ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయని, ఖరీదైన వైద్య ఖర్చులు భరించే శక్తి లేదని తమ అధ్యయనంలో భాగమైన ప్రజలు చెప్తున్నారని లోకల్ సర్కిల్స్ జనరల్ మేనేజర్ అక్షయ్ గుప్తా వెల్లడించారు. ప్రజల అభిప్రాయాల నివేదికను కేంద్ర ఆరోగ్యశాఖకు అందించామని తెలిపారు. కాగా, దేశంలో కరోనా కేసులు బయటపడిన తొలినాళ్లలో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యానికి అనుమతించారు. అనంతరం ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ చికిత్సకు అనుమతినిచ్చారు. -
అటు చికిత్సలు.. ఇటు పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటులో కరోనా వైద్యం, నిర్ధారణ పరీక్షలపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య చికిత్సకు పచ్చజెండా ఊ పుతూ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు మార్గదర్శకాలివ్వగా, ప్రైవేటు ల్యాబొరేటరీల్లో నిర్ధారణ పరీక్షలకు అనుమతిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది. దీనిపై రెండు రకాల ప్ర ణాళికలను తయారు చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన కీలక అధికారులు చెబుతున్నా రు. అనుమతిస్తే ఏం చేయాలి? లేకుంటే ఏంట న్న దానిపై ఈ రెండు ప్రణాళికలు సిద్ధంగా ఉ న్నాయి. కొందరు వైద్యాధికారులు మాత్రం హై కోర్టు తీర్పును గౌరవించి ప్రైవేటు, కార్పొరేట్ ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడమే మంచిదని అంటున్నారు. కొందరేమో అలా అ నుమతిస్తే దుర్వినియోగం జరుగుతుందేమోనని, అనవసరంగా పరీక్షలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతేగాక పాజిటివ్ వచ్చిన వారిని, వారి కాంటాక్టులను పట్టుకోవడంలో ప్రభుత్వ పట్టు పోతుందన్న భావన కూడా నెలకొంది. ఈ రెండు అంశాలపైనే ఇప్పుడు తర్జనభర్జన పడుతున్నారు. త్వరలో దీని పై ఒక నిర్ణయం తీసుకుంటామని ఒక కీలకాధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిర్ణీత ప్రైవేటు ల్యాబొరేటరీలకు ఒకవేళ కరోనా టెస్టులకు అనుమతినిస్తే, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. ఇతర సాధారణ వైద్య పరీక్షల విషయంలో పలువురు ప్రైవే టు ల్యాబ్‌లకు వెళ్లి తమకు అవసరమైన చెకప్ లు సొంతంగా చేయించుకుంటున్నారు. వాటిని డాక్టర్లకు చూపించి వైద్యం చేయించుకుంటున్నా రు. ఆయా పరీక్షల్లో నెగిటివ్ వస్తే కొందరు డాక్టర్లను కూడా సంప్రదించడం లేదు. కానీ కరోనా పరీక్షల విషయంలో జ్వరం, జలుబు, దగ్గు వం టి అనుమానాలతో ఎవరికి వారు సొంతంగా ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లి పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించొద్దని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది. కరోనా అనుమానిత వ్యక్తులు నేరుగా ల్యాబొరేటరీకి కాకుండా, వారు తప్పక ఆసుపత్రుల్లో చేరాల్సిందేనని, అక్కడి డాక్టర్ల సూచన మేరకు మాత్రమే ప్రైవేటు ల్యాబ్‌లు పరీక్షలు చేయాలన్న షరతు విధించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఎవరికివారు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం, వారికి పాజిటివ్ లేదా నెగిటివ్ వచ్చినా తమకు ఆ సమాచారం తెలియకపోతే, వారిని వారి కాంటాక్టులను గుర్తించడంలో సమస్యలు వస్తాయన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఇక చికిత్సలు ఇప్పటికే అనేక ప్రైవేటు, కార్పొరే ట్ ఆసుపత్రుల్లో మొదలయ్యాయని వైద్య, ఆరో గ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే వాటి ల్లో నిర్వహించే చికిత్సలకు ఫీజులను ఖరారు చే యాల్సి ఉందని, దీనిపైనా ఒక నిర్ణయం తీసుకో వాలని భావిస్తున్నట్లు ఒక అధికారి వ్యాఖ్యానిం చారు. సోమవారం జరిగిన సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. రోజుకు 2,700 పరీక్షలు.. ప్రస్తుతం రాష్ట్రంలో 10 ప్రభుత్వ ఆధ్వర్యంలోని బోధనాసుపత్రులు, సంస్థల్లో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రైవేటు ల్యాబొరేటరీ లు తోడైతే పరీక్షల సామర్థ్యం మరింత పెరగనుందని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఐసీఎంఆర్ రాష్ట్రంలో 13 ప్రైవేటు ఆ సుపత్రులు, వాటికి సంబంధించిన ల్యాబ్‌లు, ఇతర డయాగ్నస్టిక్ సెంటర్లకు కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో ప్రైవేటుకు అనుమతి ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సామర్థ్యానికి మించి పరీక్షలు చేయాల్సి వచ్చినప్పుడే ప్రై వేటు రంగంలో నిర్ధారణ పరీక్షలు చేసే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వ భావన. ఇంతలో హై కోర్టు తీర్పుతో ఐసీఎంఆర్ అనుమతిచ్చిన ప్రైవే టు ల్యాబొరేటరీల్లో పరీక్షలపై ఇంకా స్పష్టత రా వాల్సి ఉంది. ఒకవేళ వాటికీ ప్రభుత్వం అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీచేస్తే, మొత్తం ప్రభు త్వ, ప్రైవేటుల్లో 23 చోట్ల కరోనా నిర్ధారణ పరీక్ష లు చేసే వీలు కలుగుతుంది. అన్నింటా కలిపి రోజుకు 2,300 నుంచి 2,700 వరకు కరోనా పరీక్షలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఐసీఎంఆర్ అనుమతి పొందినవి ఏంటంటే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఫీవర్ ఆసుపత్రి, నిమ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం), ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ, సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సీబీ నాట్ పద్ధతిలో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. సీబీ నాట్ ద్వారా సాధారణంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. కానీ దాన్ని ఇప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలకు ఉపయోగిస్తున్నారు. ఇక 13 ప్రైవేటు ల్యాబొరేటరీలు, ఆసుపత్రులకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అవి.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని ల్యాబొరేటరీ సర్వీసెస్, హిమాయత్‌నగర్‌లోని విజయ డయాగ్నస్టిక్ సెంటర్, చర్లపల్లిలోని వింటా ల్యాబ్స్, సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్, పంజగుట్టలోని డాక్టర్ రెమిడీస్ ల్యాబ్స్, మేడ్చల్‌లోని పాథ్‌కేర్ ల్యాబ్స్, శేరిలింగంపల్లిలోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్, సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లిలోని మెడిక్స్ పాథ్‌ల్యాబ్స్, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాబ్ మెడిసిన్, మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఎన్ఆర్ఐ కాలనీలోని బయోగ్నోసిస్ టెక్నాలజీస్, బంజారాహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలోని టినెట్ డయాగ్నస్టిక్స్, ఏఐజీ (ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్టో ఎంటరాలజీ) లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి అవకాశముంది. అలాగే ట్రూనాట్ పద్ధతిలో బంజారాహిల్స్ స్టార్ ఆసుపత్రిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాబ్ మెడిసిన్‌లో పరీక్షలు చేయవచ్చు. ఆ మేరకు వాటికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. వాటిల్లో కరోనా నిర్ధారణకు ఫీజు ఎంత ఉండాలన్న దానిపై గతంలోనే కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఒక్కో కరోనా పరీక్షకు రూ.4,500 వరకు వసూలు చేసుకోవచ్చని కేంద్రం గతంలో తెలిపింది. అనుమతిస్తే ఆ ప్రకారమే కరోనా నిర్ధారణ పరీక్ష ఫీజు వసూలు చేసే అవకాశముంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోని ఆరోగ్యశ్రీ పరిధిలోని పేదలకు, ఈజేహెచ్ఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, జర్నలిస్టులకు, ఇతర మెడికల్ స్కీంలలో ఉండే వారికి ఉచితంగా చేస్తారా లేదా కూడా తెలియాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
కరోనాకు ప్రైవేట్ వైద్యం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ఆసుపత్రులు/ల్యాబ్స్‌లో కరోనా వైద్య చికిత్స/పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్‌లో సౌకర్యాలను పరిశీలించిన తర్వాతే పరీక్షలు, చికిత్సలకు అనుమతివ్వాలని ఐసీఎంఆర్‌ను కూడా ఆదేశించింది. గాంధీ, నిమ్స్ వంటి నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా పరీక్షలు, చికిత్స చేయించుకోవాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. రోగి ఎక్కడ వైద్యం చేసుకోవాలో ప్రభుత్వం నిర్దేశించడం రాజ్యాంగం కల్పిం చిన వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమని, జీవించే హక్కులో భాగమే ఆరోగ్యం ఉంటుందని, జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని ధర్మాసనం పేర్కొంది. (జంతువుల నుంచే 75 శాతం ఇన్ఫెక్షన్లు) ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల సేవలు కూడా ఎంతో ముఖ్యమని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించింది. అందుకే ఐసీఎంఆర్ ప్రైవేట్ ల్యాబ్స్‌ను గుర్తించి అనుమతులు ఇచ్చిందని తెలిపింది. అనుమతిస్తే తప్పేంటి? ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు అనుమతులు ఇస్తున్నప్పుడు కరోనా వైద్యానికి అనుమతిస్తే తప్పేంటని ప్రశ్నించింది. పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లను కాదనడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం అవుతుందని తెలిపింది. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్‌లో కరోనా చికిత్స, పరీక్షలు నిర్వహించడాన్ని నిలిపేయాలంటూ గత ఏప్రిల్ 11న హైదరాబాద్ డీఎంహెచ్ఓ జారీ చేసిన ఉత్తర్వులను నగరానికి చెందిన గంటా జయకుమార్ సవాల్ చేశారు. మార్చి 21న పరీక్షలు, చికిత్సలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాకు మాత్రమే వైద్యం, పరీక్షలు చేయాలని, ఇతర రోగాలకు వైద్యం చేయకూడదని ఏప్రిల్ 11న షరతు పెట్టి ఆ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో అసలే పరీక్షలు చేయడానికి వీల్లేదని ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ధర్మాసనానికి పిల్లో పిటిషనర్ తెలిపారు. అయితే ఇది ప్రజాహిత వ్యాజ్యం కాదని, పిల్ వెనుక ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. డబ్బు చెల్లించే వ్యక్తి నచ్చిన చోట వైద్యం చేయించుకునే హక్కు ఉంటుందని, ప్రభుత్వం చెప్పిన చోటే వైద్యం చేయించుకోవాలనడం వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అవుతుందని పేర్కొంది. పరిశీలించాకే అనుమతులు.. ‘కరోనా పరీక్షలు, చికిత్స చేసే సౌకర్యాలు ఉన్న ఆసుపత్రుల నుంచి ఐసీఎంఆర్ దరఖాస్తులు స్వీకరించాలి. వాటిని వైద్య రంగ నిపుణులు పరిశీలించాలి. క్షేత్ర స్థాయిలో పరిశీలించి వైద్య నిపుణలు, ఇతర వసతులను అధ్యయనం చేశాక అనుమతి ఇవ్వాలి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అనుమతి పొందబోయే ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఐసీఎంఆర్, కేంద్ర మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలి. కరోనా ఉన్న వారికి వైద్యం చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా పరీక్షలు చేయించుకున్న వారి వివరాలతో పాటు పాజిటివ్ అని నిర్ధారణ అయిన వారి వివరాలను అనుమతి పొందబోయే ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలి’అంటూ ఐసీఎంఆర్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
ప్రైవేట్‌లోనూ కరోనా
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స చేసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీయూ లేదా వెంటిలేటర్ సౌకర్యంతోపాటు కరోనా చికిత్స అందించగలిగే స్థాయి కలిగిన ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. మిగిలిన క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్ హోంలకు మాత్రం అటువంటి వెసులుబాటు కల్పించలేదు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు విడుదల చేశారు. కరోనా రోగులకు ఇప్పటివరకు కేవలం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేసేందుకు అనుమతి ఉంది. అయితే కొన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు ఇప్పటికే కరోనా చికిత్సలు చేస్తున్నాయి. కానీ అధికారికంగా సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో ఎవరైనా వెళ్లి వాటిల్లో చికిత్స చేయించుకోవచ్చు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఆస్పత్రులను మూడు రకాలుగా వర్గీకరించారు. ఒకటి ప్రైవేటు క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు. రెండోది ఇన్–పేషెంట్ సౌకర్యంలేని నర్సింగ్ హోంలు. మూడోది ఐసీయూ లేదా వెంటిలేటర్ల సౌకర్యం ఉండి కరోనా చికిత్స అందించే సామర్థ్యం కలిగిన ఆస్పత్రులు. ఈ విభజన ప్రకారం ఆయా ఆస్పత్రులు ఏ విధమైన మార్గదర్శకాలు పాటించాలో ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా అనేక ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు వైద్య సేవలు నిలిపేశాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తున్నాయి. దీంతో సాధారణ వైద్యసేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులు తిరిగి తమ సేవలందించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. కరోనా చికిత్స చేసే ప్రైవేటు ఆస్పత్రులకు మార్గదర్శకాలు... ► కరోనా అనుమానిత రోగులు వస్తే వారి పరీక్షా ఫలితాలు వచ్చే వరకు ఐసోలేషన్ రూంలో ఉంచాలి. ► ల్యాబ్ టెక్నీషియన్లు శ్వాబ్ నమూనాలు తీసేటప్పుడు కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలి. ► కరోనా రోగుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసి, ఆస్పత్రిలో కరోనా జోన్లను ఏర్పాటు చేయాలి. ► కరోనా జోన్లో వైరస్ లక్షణాలున్న వారి కోసం ఐసీయూ, వెంటిలేటర్ల సౌకర్యాలను సిద్ధం చేయాలి. ► కరోనా జోన్లో తప్పకుండా ఆపరేషన్, పోస్ట్ ఆపరేషన్ వార్డు, లేబర్ రూం ఉండాలి. ఈ జోన్లో పనిచేసే వైద్య సిబ్బంది తప్పకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలి. ► ప్రతి కరోనా పాజిటివ్ కేసును అవసరాన్నిబట్టి కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, అనెస్తీషియనిస్టు, ఇతర సంబంధిత వైద్యులు పరీక్షించాలి. ► పాజిటివ్ రోగుల చికిత్సా విధానాలకు సంబంధించి ఐసీఎంఆర్, కేంద్ర మార్గదర్శకాలను విధిగా పాటించాలి. ► ఒకవేళ కరోనా రోగి మరణిస్తే మృతదేహాన్ని ఐసీఎంఆర్ ప్రొటోకాల్ ప్రకారం తరలించి దహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. ► ప్రతి ఆస్పత్రి విధిగా మరణాల వివరాల రిజిస్టర్‌ను నమోదు చేయాలి. అందులో కరోనా లేదా కరోనాయేతర రోగులు ఎలా చనిపోయారో వివరాలు ఉండాలి. ఆ వివరాలను జిల్లా వైద్యాధికారులకు పంపించాలి. ► టీకాల షెడ్యూల్ యథావిధిగా కొనసాగించాలి. ► ఆస్పత్రి ప్రాంగణంలో లెక్కకు మించిన రోగులు, వారి సహాయకులు ఉండకుండా చూసుకోవాలి. రొటీన్ విజిటింగ్‌కు అనుమతించొద్దు. ► రొటీన్ ఫాలో అప్ కేసుల విషయంలో టెలి మెడిసిన్ విధానాన్ని అవలంబించాలి. ► వైద్య సిబ్బందికి హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు ఇవ్వాలి. ► అన్ని ఆస్పత్రులు విధిగా ఫ్లూ, జ్వరం, తీవ్ర శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడే రోగులు, గర్భిణుల వివరాలను రిజిస్టర్లో నిత్యం నమోదు చేయాలి. వాటిని ఈ–బర్త్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ► అన్ని ఆస్పత్రులు విధిగా కరోనా పాజిటివ్ రోగుల వివరాలను నమోదు చేస్తూ వాటిని సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ► ఇన్–పేషెంట్ రోగులు, శస్త్రచికిత్సల వివరాలు కూడా నమోదు చేయాలి. వాటిని జిల్లా వైద్య, అధికార యంత్రాగానికి పంపాలి. ► కరోనా జోన్లో మాస్క్‌లు, గ్లౌజ్స్, ఫేస్ షీల్డ్, హ్యాండ్ వాషింగ్, శానిటైజర్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. భౌతికదూరం పాటించాలి. ూ వైరస్ సోకిన రోగులు, ఇతర రోగులు కలవకుండా చర్యలు చేపట్టాలి. ఈ మార్గదర్శకాలను పాటించని ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్‌హోంలకు... ► రోగుల రద్దీని నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ► అందుకోసం డాక్టర్లు గంటకు నలుగురైదుగురు రోగులను మాత్రమే చూడాలి. ూ ప్రతి రోగి పక్కన ఒక్కరినే అనుమతించాలి. భౌతిక దూరం కచ్చితంగా పాటించాలి. ► ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలి. క్లినిక్‌లోకి ప్రవేశించే ముందు సబ్బునీటితో లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి. ూ జ్వరం, జలుబు, దగ్గు వంటి అనుమానిత కేసులను కరోనా ఆస్పత్రికి తరలించాలి. అటువంటి వారి కోసం ప్రత్యేక కౌంటర్, రోగులకు ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేయాలి. ూ ఆరోగ్య సిబ్బంది పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్క్‌లు ధరించాలి. ూ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు మూడు పొరల మాస్క్‌లు, ఫేస్ షీల్డ్, గ్లౌజ్స్ మొదలైనవి ధరించాలి. ూ ప్రతి రోగిని పరీక్షించాక వైద్యులు తప్పనిసరిగా సబ్బునీరు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్తో చేతులు కడుక్కోవాలి. ూ బయో మెడికల్ వ్యర్థాల తొలగింపు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. ► చేతులు కడుక్కొనే అవకాశం, శానిటైజర్ సౌకర్యం ఆస్పత్రి ప్రతి మూలలో అందుబాటులో ఉంచాలి. ► క్లినిక్‌ను ప్రతిరోజూ బ్లీచ్ లేదా ఒక శాతం సోడియం హైపోక్లోరైడ్‌తో క్రిమిసంహారకం చేయాలి.ూ సాధ్యమైతే టెలి మెడిసిన్ సౌకర్యాన్ని వైద్యులు ఉపయోగించుకోవాలి. ► కరోనా అనుమానిత కేసులను పరీక్షల కోసం, ఇతరత్రా నిర్వహణ కోసం కరోనా ఆస్పత్రికి తరలించాలి. ► కరోనాకు చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. -
‘ప్రైవేటు’కి అనుమతిస్తే తప్పేంటి?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లోనే కరోనా పరీక్షలు, వైద్యం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టు తీర్పు వాయిదా పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు, వైద్యం చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన గంటా జయకుమార్ దాఖలు చేసిన పిల్‌పై మంగళవారం ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం తెలిపింది. ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వాసుపత్రుల కంటే మెరుగైన సౌకర్యాలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు వాటికి అనుమతి ఇస్తే తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. ఫలానా ఆస్పత్రిలోనే వైద్యం చేయాలని ప్రభుత్వం ఎలా నిర్దేశిస్తుందని, ఎక్కడ వైద్యం చేయించుకోవాలో రోగికి ఉన్న హక్కు కదా అని కూడా ప్రశ్నించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు ఐసీఎంఆర్ అనుమతిచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదనే సందేహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల లేమిపై పత్రికల్లో కథనాలు వస్తూనే ఉన్నాయని, కుక్కలు సంచరిస్తున్నట్లు, పారిశుధ్యం దారుణంగా ఉన్నట్లు కూడా వార్తలొచ్చాయని వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వానికి నమ్మకం లేదా లేక అక్కడ వైద్యం చేసే వైద్యులపై లేదా అని ధర్మాసనం నిలదీసింది. గచ్చిబౌలి స్టేడియాన్ని ఆస్పత్రిగా చేసినా అక్కడ తగినంతగా వైద్యులు, పడకలు లేవని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వాది స్తూ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యానికి అనుమతి ఇస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. రాష్ట్రంలో 12 ప్రైవేట్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించుకునేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇస్తే ప్రభుత్వం మాత్రం చేయనీయట్లేదన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, ఈ దశలో ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతిస్తే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. కరోనాకు మాత్రమే వైద్యం చేస్తే ఫర్వాలేదని, ఇతర అనారోగ్య సమస్యలతో వచ్చిన వారికీ వైద్యం చేస్తే మరింత ప్రమాదమని, అప్పుడు పరిస్థితులు ప్రభుత్వం నుంచి చేజారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్యం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా వీరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందక ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేటగిరీల వారీగా గతంలో చెల్లించిన దానికంటే స్వల్ప మొత్తంలో ప్రీమియాన్ని పెంచి, ఉద్యోగుల నగదు రహిత వైద్య పథకం (ఈహెచ్ఎస్)ను పటిష్టంగా అమలు చేస్తారు. ఈ మేరకు అన్ని ప్రైవేటు ఆస్పత్రులు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇకపై ఆస్పత్రులకు సకాలంలో నిధులు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులకు వైద్యం ఆగిపోకూడదన్న ఉద్దేశంతో ఈ నిధులను గ్రీన్‌చానెల్‌లో చేర్చారు. దీనివల్ల సకాలంలో, ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు బిల్లులు చెల్లించే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంపై పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రీమియంలో మార్పులు ఇలా... ► కొత్త ప్రీమియం రేట్ల ప్రకారం రెండు స్లాబులు నిర్ణయించారు. ► గతంలో నెలకు రూ.90 చెల్లించే ఉద్యోగులు ఇక నుంచి రూ.225 చెల్లిస్తారు. ► గతంలో నెలకు రూ.120 చెల్లించేవారు ఇప్పుడు రూ.300 చెల్లిస్తారు. ► దీని ప్రకారం ఏడాదికి ఉద్యోగుల నుంచి రూ.400 కోట్లు వస్తాయని అంచనా. అంతే మొత్తం ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. ► పెంచిన ప్రీమియం 2019, డిసెంబర్ నుంచి వర్తిస్తుంది. ► అన్ని యూనివర్సిటీలు, ఎయిడెడ్, గురుకుల పాఠశాలలు, వైద్యవిధాన పరిషత్ విభాగాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గతంలో ఈ పథకంలో లేరు. ఇప్పుడు వీరిని కూడా చేర్చారు. 9,000 మందిని పథకం పరిధిలో చేర్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే.. వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో పనిచేసే 9 వేల మంది గతంలో ఈ పథకంలో లేరు. ఎన్నోసార్లు గత ప్రభుత్వానికి విన్నవించినా స్పందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీళ్లందరినీ పథకం కిందకు తీసుకురావడంతో వారికి మెరుగైన వైద్యం అందే అవకాశం కలిగింది. –ఉల్లి కృష్ణ, అధ్యక్షులు, కె.సురేష్, ప్రధాన కార్యదర్శి (వైద్యవిధాన పరిషత్ ఉద్యోగుల సంఘం) -
ప్రైవేటు ఆసుపత్రులకు ‘కరోనా’ భయం!
‘కరోనా నేపథ్యంలో రోగులను చూడాలంటేనే భయమేస్తుంది. ఇంట్లో భార్యాపిల్లలు ఉన్నారు. ఈ సమయంలో రిస్క్ చేయడం మంచిదికాదు. అందుకే క్లినిక్ తెరవట్లేదు. బతికుంటే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటా..’ – హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు క్లినిక్‌కు చెందిన శ్వాసకోశ స్పెషలిస్ట్ వైద్యుడు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రులను కరోనా భయం వెంటాడుతోంది. ఆసుపత్రులను తెరిస్తే గుంపులుగా జనం వస్తారని, కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన యాజమాన్యాల్లో నెలకొం ది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు ప్రారంభించాలని కోరినా చాలా జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు రావట్లేదు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఓపీ సేవలు ప్రారంభించాలని అక్కడి వైద్యాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో తాము వైద్యసేవలందిస్తున్నట్టు అక్కడి ప్రముఖ వైద్యుడు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్ తెలిపారు. సిద్దిపేటలోనూ ఓపీ సేవలు నడుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో 15రోజుల క్రితమే ఓపీ సేవలు ప్రారంభించాలని అక్క డి కలెక్టర్ ఆదేశాలిచ్చారు. దీంతో అక్కడ కొన్ని ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభిం చారు. శ్వాసకోశ సంబంధ కేసుల విషయంలో మాత్రం అక్కడి ఆసుపత్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు రెండు మూడు రోజుల క్రితమే ఓపీ సేవలు ప్రారంభించగా, మరికొన్ని ఇంకా ప్రారంభించలేదు. సాధారణ రోజులతో పోలిస్తే 20–30 శాతానికి మించి రోగులు రావట్లేదని పేర్కొంది. ఓపీ వైద్య సేవలు నిర్వహిస్తున్న ఆసుపత్రులు భౌతికదూరాన్ని పాటిస్తున్నాయి. కరోనా అనుమానిత రోగులుంటే వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చెబుతున్నారు. కేంద్రం చెప్పినా కదలిక లేదు.. రోగుల వల్ల కరోనా సోకుతుందనే భయం తో చాలాచోట్ల డాక్టర్లు ఆసుపత్రులు, క్లినిక్‌లను తెరవడంలేదని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ రాష్ట్రాలకు లేఖ రాశారు. కొన్ని ఆస్పత్రులు, క్లినిక్ లు సేవలందించడానికి ముందు కరోనా పరీక్షలు చేయించుకొని రావాలని పట్టుబడుతున్నాయని, డయాలసిస్ వంటి సేవలం దించడానికి సంకోచిస్తున్నాయని ప్రీతిసూడాన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించిన ప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులయాజమాన్యాల్లో కదలిక లేదు. ఓపీ, ఐపీ సేవలు కొనసాగించాలి: ఐఎంఏ ఇన్, ఔట్ పేషెంట్ సేవల్ని యథావిధిగా కొనసాగించాలని ప్రైవేటు ఆసుపత్రులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ విభాగం సూచించింది. ఓపీ క్లినిక్‌లు కూడా తెరవాలని కోరింది. డాక్టర్లు, ఇతర సిబ్బంది రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రక్షణ పరికరాలు అందుబాటులో లేకుంటే ఆసుపత్రులు తెరవవద్దని పేర్కొంది. డాక్టర్‌కు, రోగికి మధ్య అడ్డుగా ఏదైనా ఉండేలా చూసుకోవాలని, దూరం పాటించాలని సూచించింది. కంటైన్మెంట్, రెడ్జోన్లలో మాత్రం ఆసుపత్రులు అసలు తెరవరాదని సూచించింది. లాక్డౌన్ తర్వాతే లాక్డౌన్ ముగిశాకే పూర్తిస్థాయిలో నడుపుతామని ఆసుపత్రుల ప్రతి నిధు లు చెబుతున్నారు. రోగులూ రాకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రుల డాక్టర్లు సెలవులను కుటుంబంతో గడుపుతున్నారు. లాక్డౌన్ ముగిశాక వస్తామని డాక్టర్లు అంటున్నారని ఓ కార్పొరేట్ ఆసుపత్రి తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రం లో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. 22 జిల్లాలు కరోనా రహితంగా మారుతున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఓపీ సేవలు ప్రారంభమవుతాయని అంటున్నారు. హైదరాబాద్‌లో కరోనా తీవ్రత ఉన్న ప్రాంతాల్లోని ఆసుపత్రులు, క్లినిక్‌లు ఇప్పటికిప్పుడు తెరుచుకునే పరిస్థితి కనిపించట్లేదు. -
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ నమూనాల సేకరణ
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకూ కరోనా లక్షణాలున్న వారి నమూనాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సేకరించి వైరాలజీ ల్యాబొరేటరీలకు పంపిస్తున్నారు. ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ నమూనాలు సేకరించి ల్యాబొరేటరీలకు పంపించేలా సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈవో డా.మల్లికార్జున అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ► అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులతోపాటు, నెట్వర్క్ పరిధిలో లేని ఆస్పత్రుల్లోనూ నమూనాలు సేకరించి నిర్ధారణకు పంపించవచ్చు. ► ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుసరించే శాంపిల్ తీయాలి. నిర్ధారణ కోసం దాన్ని ఇతర రాష్ట్రాలకు పంపితే పీపీఈ కిట్లు, హ్యాండిలింగ్, ప్యాకేజీ, రవాణా చార్జీల కింద రూ. 1,000 ప్రభుత్వం చెల్లిస్తుంది. ► రాష్ట్రంలోని వైరాలజీ ల్యాబొరేటరీకి నిర్ధారణకు పంపిస్తే రవాణా ఛార్జీల కింద ఒక్కో నమూనాకు రూ. 200 చెల్లిస్తుంది. ► అనుమానిత లక్షణాలున్న వారికి వైద్యమందిస్తే రూ. 16,405, పాజిటివ్ బాధితులకు చికిత్స అందిస్తే కేసును బట్టి రూ. 65 వేల నుంచి రూ. 2.20 లక్షల వరకు చెల్లించేలా ఆరోగ్యశ్రీలో చేర్చిన విషయం తెలిసిందే. ► ఎక్కడైనా వైద్యం తీసుకుంటూ పేషెంటు మృతి చెందితే ఎన్నిరోజులు వైద్యమందించారో అన్నిరోజులకు బిల్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. ► ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు, ఆరోగ్య రక్షలో ఉన్న వాళ్లందరికీ ఈ వైద్యం వర్తిస్తుంది. ► ఏరోజుకారోజు అనుమానిత లక్షణాలున్న, పాజిటివ్ వివరాలను ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్లకు ఇవ్వాలి. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులను ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చేర్చుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. కరోనాకు సంబంధించి 15 రకాల ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ ప్యాకేజీలో చేర్చింది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఆసుపత్రుల్లో చేర్చుకోవడంతో పాటు చికిత్స చేసేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కరోనా పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, ఇతర వ్యాధులతో కలిపి వైద్యానికి ధరల ప్యాకేజి నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కనీస మొత్తం గా 16 వేల నుంచి గరిష్టంగా 2.16 లక్షల వరకు చికిత్స ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రైవేట్ ఆస్పత్రులూ ప్రభుత్వ పరిధిలోకి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రులు సైతం కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ పరిధిలోని వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలను కూడా ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తుల నివారణ చట్టం 2005 (సెక్షన్ 10(2)1తో పాటు అంటువ్యాధుల నివారణ చట్టం 1897 ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రభుత్వేతర ఆస్పత్రులు, ట్రస్ట్‌ల పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రులు ఇకపై సర్కారు పరిధిలో పనిచేయాలని పేర్కొన్నారు. తొలిదశలో 450 ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. పరిస్థితులను బట్టి ఈ సంఖ్య పెంచుతారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో ఎపిడెమిక్ డిసీజ్ (కోవిడ్) రెగ్యులేషన్ 2020 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు ఇవీ... ► ప్రైవేట్/ నాన్‌గవర్నమెంట్ మెడికల్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, అందులో పనిచేసే సిబ్బంది, వసతులు, ఐసొలేషన్ పడకలు, రూములు, ఐసీయూ వార్డులు, వెంటిలేటర్లు, టెస్టింగ్ ల్యాబొరేటరీలు, ఫార్మసీలు, శవాగారాలు, ఎక్విప్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీములు ప్రభుత్వ పరిధిలో కరోనా బాధితులకు సేవలు అందించాలి. ► ఎలాంటి వసతుల వినియోగానిౖకైనా ప్రభుత్వ పరిధిలోకి వచ్చే వారికే ప్రాధాన్యం ఉండాలి ► ప్రభుత్వేతర, ప్రైవేటు సంస్థలు నిర్వహించే ఏ పనులైనా ప్రభుత్వానికి ఉపయోగపడేవి అయి ఉండాలి. జిల్లా స్థాయి సంస్థలు స్థానిక అధికారుల ఆదేశాలపై స్పందించాలి ► స్పెషలిస్టు డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్, నాన్‌మెడికల్ సిబ్బందిని ప్రభుత్వం ఎక్కడైనా నియమించవచ్చు. బాధితులందరికీ వైద్యమే లక్ష్యం విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాం. కరోనా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. చికిత్స అందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులను కూడా తీసుకోవాలని నిర్ణయించాం. – డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, స్పెషల్‌చీఫ్ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ ఆరోగ్యశ్రీ పరిధిలో లేనివి కూడా.. తొలిదశలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను కరోనా చికిత్స కోసం తీసుకుంటున్నాం. పరిస్థితిని బట్టి మండల, నియోజక వర్గ స్థాయి ఆస్పత్రులను కూడా తీసుకుంటాం. నెట్వర్క్ పరిధిలో ఉన్నా, లేకున్నా కరోనా వైద్యం కోసం ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ సిబ్బంది కూడా ప్రభుత్వ పరిధిలోనే పని చేయాలి. – డా.ఎ.మల్లికార్జున, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అంతా భాగస్వాములు కావాలి విపత్కర సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ అనే తారతమ్యం ఉండకూడదు. ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందించవచ్చు. – డా.డి.జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం -
ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ సేవలను ప్రభుత్వం రద్దు చేసింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులో రోగుల సంఖ్య పడిపోయింది. లాక్డౌన్ ప్రకటించడం, అత్యవసర కేసులు మాత్రమే తీసుకుంటుండం తో ఆస్పత్రులన్నీ ఖాళీగా కనిపించాయి. కొన్నిచోట్ల అత్యవసర కేసులను కూడా సర్కారు ఆస్పత్రుల్లో డాక్టర్లు తీసుకోలేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కింద వచ్చే వారిని కూడా నెట్వర్క్ ఆస్పత్రులు నిరాకరించాయి. వరంగల్ జిల్లాకు చెందిన 65 ఏళ్ల మహిళ గుండె వ్యాధితో అమీర్‌పేటలోని ఓ నెట్వర్క్ ప్రైవేట్ ఆస్పత్రికి రాగా, అత్యవసరమైన కేసు అయినా ఆమెను చేర్చుకోవడానికి ఆస్పత్రి వర్గాలు ముందుగా నిరాకరించాయి. వారు బతిమిలాడగా చేర్చుకున్నాయి. అలాగే ఆరోగ్యశ్రీ కింద వచ్చే పేదలకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురవుతోంది. హైదరాబాద్‌లో పడిపోయిన ఓపీ.. హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులకు రోజుకు వేలాది మంది వైద్యం కోసం వస్తుం టారు. ఒక్క గాంధీ ఆస్పత్రికే రోజుకు ఓపీ కోసం 1,500 పైగా వచ్చేవారు. ఉస్మానియా ఆస్పత్రికి 2 వేల వరకు వచ్చేవారు. నిలోఫర్ ఆస్పత్రికి వెయ్యి మందికి పైగా వస్తుంటారు. కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రులకు కనీసం 10 వేల మందికి పైగా ఓపీ కోసం వస్తుంటారని అంచనా. ఇన్‌పేషెంట్లు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కలిపి రెగ్యులర్‌గా 10 వేల మంది వరకు ఉంటారని చెబుతున్నారు. జిల్లాల్లో మరో 15 వేల మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తుంటారని చెబుతున్నారు. ఎమర్జెన్సీ కేసులను కూడా ఆస్పత్రులు నిరాకరించడంపై రోగుల్లో వ్యతిరేకత వస్తుంది. దీన్ని సాకుగా తీసుకుని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. డాక్టర్లను బాదుతున్న పోలీసులు.. లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో అత్యవసర పని మీద ఎక్కడికి వెళ్లాలన్నా పోలీసులు కనికరించట్లేదు. ఆస్పత్రులకు వెళ్లే డాక్టర్లను కూడా అడ్డుకుంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో సేవలందించే డాక్టర్లు, నర్సులకు కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కొందరు డాక్టర్లపై పోలీసులు జులుం ప్రదర్శించినట్లు వైద్య సిబ్బంది ఆరోపిస్తోంది. ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా పోలీసుల నుంచి తప్పించుకుని ఆస్పత్రికి రావడం కష్టమైపోతోంది. కీలక సమయంలో వారి సేవలను వినియోగించుకోవాల్సి ఉన్నా.. ఇలా అడ్డంకులు సృష్టించడం సమంజ సం కాదని వైద్యులు మండిపడుతున్నారు. ప్రత్యేక ఐడీలు.. సర్కారు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సు లు సహా అన్ని కేడర్ల ఉద్యోగులకు ప్రత్యేక ఐడీ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రి సిబ్బందిని కూడా అడ్డుకోవద్దని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
ఈ పది రోజులే కీలకం
సాక్షి, అమరావతి: వచ్చే పది రోజులూ అత్యంత కీలకం కానుంది. ఈ గడువులో కమ్యూనిటీ స్ప్రెడ్ (కరోనా సోకిన వ్యక్తితో ఎలాంటి సంబంధమూ లేని వ్యక్తులకు సోకడం)ను అరికట్టగలిగితే కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ చేపట్టిన చర్యలు ఒక ఎత్తు అయితే.. ఇకపై జాగ్రత్తగా ఉండటం మరో ఎత్తు అంటున్నారు. వైరస్ వ్యాప్తి అనేది సామాన్య జనంలోకి వెళ్లకుండా ఉండటమనేది పూర్తిగా ప్రజల మీదే ఆధారపడి ఉందని, వారు కనీస జాగ్రత్తలు తీసుకుంటే ఆ దశకు వెళ్లకుండా కాపాడుకునే అవకాశాలుంటాయని స్పష్టం చేస్తున్నారు. పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుంచి వచ్చినవే.. ► ఏపీలో నమోదైన పాజిటివ్ కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివే. ► ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రాకపోకలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవడం వల్ల విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య పూర్తిగా నిరోధించినట్లయ్యింది. ► ఇప్పటికే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వైద్య పరిశీలనలో ఉన్న వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించగలిగితే ప్రమాదం నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయి. ► మన రాష్ట్రానికి వివిధ దేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య సుమారు 13 వేల వరకూ ఉంది. ► ఈ నెల 29కి 6 వేల మందికి 14 రోజులు పరిశీలన పూర్తవుతుంది. మిగతా వారికి ఏప్రిల్ 3తో పూర్తవుతుంది. ► ఇది పూర్తయ్యే వరకూ వైరస్ వ్యాప్తిని నిరోధిస్తే సమస్య నుంచి గట్టెక్కినట్లే. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటే గనుక ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మన చేతుల్లో ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులెవరైనా స్వీయ నిర్బంధంలో లేకుండా ఉంటే ఇప్పటికైనా వాళ్లు ఆ చర్యలు తీసుకోవాలని వివిధ మాధ్యమాల ద్వారా ప్రజారోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది. చేపట్టిన చర్యలివీ.. ► ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, చైనా వంటి దేశాలు కరోనా హైరిస్క్ దేశాలుగా ప్రకటించబడ్డాయి. ► ఆ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం. ► విమానాల్లో వచ్చే వారిని క్వారంటైన్‌కు తరలించడం. ► తరచూ వారి నమూనాలు సేకరించి పరీక్షించడం. ►పైన పేర్కొన్న దేశాల నుంచి వచ్చిన వారు.. ఎవరెవరితో తిరిగారో జల్లెడ పట్టి గుర్తించడం. ► ఆ వ్యక్తి ఉన్న ఇంట్లో సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరిశీలన చేయడం. ► ఎవరైనా సహకరించకపోతే వారిని నిర్బంధంగానైనా తరలించడం. ఏరియా ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక పడకలు బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లోనే కాకుండా ఏరియా ఆస్పత్రుల్లోనూ కరోనా వైరస్ లక్షణాలున్న వారికి ప్రత్యేక పడకల ఏర్పాటు. ► తణుకు, తాడేపల్లి గూడెం, జంగారెడ్డి గూడెం, నూజివీడు, గుడివాడ, బాపట్ల, నరసరావుపేట, చీరాల, కందుకూరు, గూడూరు, కావలి, కుప్పం, శ్రీకాళహస్తి, పలమనేరు, నగరి, కదిరి, గుంతకల్, ఆదోని, పులివెందుల ఆస్పత్రుల్లో మొత్తం 142 ప్రత్యేక పడకల ఏర్పాటు. ►వీటితోపాటు 9 ప్రత్యేక వెంటిలేటర్ల సదుపాయం. ప్రైవేట్ యాజమాన్యాలకు శిక్షణ ► కరోనా వైరస్ లక్షణాలున్న వారికి వైద్యమందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో 900 ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశాం. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు ఈ నెల 24వ తేదీన ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. వారు నిబంధనల మేరకు రోగులకు వైద్యం అందించాల్సి ఉంటుంది. – డాక్టర్ ఎ.మల్లికార్జున, సీఈవో, ఆరోగ్యశ్రీ -
రాక్షసుల్లా తయారయ్యారు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగిని జాయిన్ చేస్తే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, రాష్ట్రంలో కొంత మంది ప్రైవేటు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. వైద్యారోగ్య శాఖ, విద్యా శాఖ పద్దులపై ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాధి తగ్గించడం కంటే మొదట ఎన్ని ఎక్కువ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రోగి చనిపోయాక కూడా రెండు మూడు రోజులు వెంటిలేటర్లపై పెట్టి డబ్బులు గుం జుతున్నారని పేర్కొన్నారు. రోగి చనిపోతే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటికి పంపించేలా చట్టం చేయాలని కోరారు. అప్పుడే ప్రజలకు నష్టం ఉండదని, మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. డయాలసిస్ సెంటర్లను ప్రారంభించాలి: రాజేందర్‌రెడ్డి వైద్యారోగ్య శాఖ పద్దులపై రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లను ప్రారంభించాలన్నారు. ఐసీయూలను ఏర్పాటు చేయాలన్నారు. పేదలు చనిపోతే తీసుకెళ్లే వాహనాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. సీఎస్ఆర్ కింద నీలోఫర్, సరోజినీదేవి ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని, క్యాన్సర్ ఆసుపత్రికి నిధులను పెంచాలని, నిమ్స్‌లో మరో 60 –70 వెంటిలేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. -
మెడికల్ టూరిజంలో ‘ప్రైవేటు’ వెనుకబాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు ఎప్పుడైనా వైద్య సదస్సులు పెడితే మెడికల్ టూరిజంలో తాము ఎంతో ఘనత సాధించినట్లు చెప్పుకొంటారు. హైదరాబాద్‌ను మెడికల్ హబ్ అని అభివర్ణిస్తుంటారు. కానీ కేంద్రం సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం మన రాష్ట్రం మెడికల్ టూరిజంలో 15వ స్థానంలో ఉంద ని పేర్కొంది. మెడికల్ టూరిజాన్ని అత్యధికంగా పెంపొందించే ప్రైవేటు ఆసుపత్రులు.. విదేశీ రోగు లను తమవైపు తిప్పుకోవడంలో, వైద్య రంగంలో వచ్చిన మార్పులపై మార్కెటింగ్ చేసుకోవడంలో విఫలమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 2018లో తెలంగాణకు 3.18 లక్షల మంది విదేశీ టూరిస్టులు రాగా, అందులో 19 వేల మంది వరకు వైద్యం కోసం వచ్చినట్లు కేంద్రం అంచనా వేసింది. అయితే అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే కాస్తంత పెరిగినా, దేశవ్యాప్త పరిస్థితితో పోలిస్తే అత్యంత తక్కువగా ఉండటం గమనార్హం. తమిళనాడు టాప్.. కేంద్ర పర్యాటక శాఖ దేశంలో ఏ రాష్ట్రాలకు ఎంతమంది పర్యాటకులు వస్తారో వెల్లడించింది. 2018లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 2.88 కోట్ల మంది విదేశీయులు వచ్చారని కేంద్రం తన నివేదికలో తెలిపింది. అందులో వైద్యం చేయించుకునేందుకు 17.32 లక్షల మంది వచ్చినట్లు అంచనా వేసింది. అంటే విదేశీ పర్యాటకుల్లో 6 శాతం వరకు వైద్యం కోసం మన దేశానికి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. అందులో తమిళనాడుకు అత్యధికంగా 60.74 లక్షల మంది పర్యాటకులు రాగా, వైద్యం కోసం వచ్చిన వారు 3.6 లక్షల మంది ఉంటారని అంచనా. విచిత్రమేంటంటే ఎంతో వెనుకబడి ఉండే బిహార్‌కు 2018లో 10.87 లక్షల మంది పర్యాటకులు వస్తే, వైద్యం కోసం వచ్చిన వారు 65 వేల మంది వరకు ఉంటారని అంచనా. ఇతర రాష్ట్రాలన్నీ కూడా మెడికల్ టూరిజంపై దృష్టి సారించాయి. అయితే కొన్ని రాష్ట్రాలకు సాధారణ పర్యాటకులు వస్తుంటారు. మెడికల్ హబ్‌గా వెలుగొందుతున్న ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలకు పర్యాటకులు వైద్యం కోసం కూడా అధికంగా వస్తుంటారు. మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం సర్వీసు ప్రొవైడర్లకు ఆర్థిక సాయం అందిస్తుంది. మెడికల్ టూరిజం ఫెయిర్స్, మెడికల్ కాన్ఫరెన్స్, వెల్నెస్ కాన్ఫరెన్స్, వెల్నెస్ ఫెయిర్స్, మెడికల్ రోడ్ షోలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తుంది. కానీ వీటిని ఉపయోగించుకోవడంలో తెలంగాణ వెనుకబడిందని నివేదిక సారాంశం. మన రాష్ట్రానికి ప్రధానంగా మోకాళ్ల చికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్, యాంజియోప్లాస్టీ, యూరాలజీ, కేన్సర్ వ్యాధుల నివారణ కోసం వస్తుంటారు. టాంజానియా, సోమాలియా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఇరాక్, దుబాయ్ వంటి దేశాల నుంచి రోగులు వస్తుంటారు. ప్రచారంలో వెనుకంజ.. హైదరాబాద్ కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు అనేకం మార్కెటింగ్ చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నాయన్న విమర్శలున్నాయి. మార్కెటింగ్‌పై కంటే ఆర్‌ఎంపీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని కొందరు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా డిజిటల్ మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు మంచి పేరు తెచ్చుకోవడంకంటే లాభాలపైనే దృష్టిసారిస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. దేశంలో అత్యధికంగా మన రాష్ట్రంలో వైద్య ఖర్చులు, ఫీజులు అధికంగా ఉన్నాయన్న భావన విదేశీయుల్లో ఉందని చెబుతున్నారు. -
ప్రమాణాలు పాటించకుంటే.. రిజిస్ట్రేషన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ రద్దు చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ను అమలు చేసేందుకు అవసరమైన నిబంధనలను ఖరారు చేసే పనిలో వైద్య ఆరోగ్యశాఖ నిమగ్నమైం ది. ఈ నిబంధనల ఖరారు కమిటీ చైర్మన్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ రమేష్‌రెడ్డి.. ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చించి తుది ముసాయిదా రూపొందించారు. గతంలో నిబంధనలున్నా ఆసుప త్రులు పట్టించుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకుండానే ఇష్టారాజ్యంగా ఆసుపత్రులను నెలకొల్పాయి. ప్రమాణాలు, నిపుణులైన వైద్య సిబ్బంది లేకపోవడంతో అనేక ఆసుపత్రులు నాసిరకంగా నడుస్తున్నాయి. జవాబుదారీతనం లేకుండా పోయిందని, దీంతో రోగులకు సరైన వైద్యం అందడంలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీని అమలుకు అవసరమైన నిబంధనలను ఖరారు చేసి ముసాయిదాను కమిటీ తయారు చేసింది. వాటిని అమలు చేసేలా త్వరలో ఉత్తర్వులు జారీకానున్నాయి. అయితే ఉత్తర్వులు నేరుగా జారీచేస్తారా? లేక మళ్లీ వాటికి అసెంబ్లీ ఆమోదం తీసుకుంటారా? అన్న విషయంపై స్పష్టత లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. డయాగ్నస్టిక్ సెంటర్లకు కూడా.. కనీస ప్రమాణాలు ఏముండాలన్న దానిపై ముసాయిదాలో స్పష్టత ఇచ్చారు. అల్లోపతితోపా టూ ఆయుష్ ఆస్పత్రుల ఏర్పాటుకు కూడా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వర్తిస్తుందని ముసాయిదా లో పేర్కొన్నారు. గతంలో డయాగ్నస్టిక్ సెంటర్లు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పరిధిలో లేవు. ఇక నుంచి వాటిని కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో వందలాది డయాగ్నస్టిక్ సెంటర్లు కనీస ప్రమాణాలు పాటించకుండానే నడుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అవిచ్చే వైద్య పరీక్షల రిపోర్టులపై అనేక అనుమానాలున్నాయి. ఆ రిపో ర్టుల ఆధారంగా వైద్యులు చికిత్స చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో రోగులకు సరైన వైద్యం అందడంలేదు. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలన్న కీలకమైన నిర్ణయాన్ని నిబంధనల్లో పొందుపరిచారు. నాలుగు రకాలుగా ఆస్పత్రులు.. ఇక ఒక ఆస్పత్రి ఏర్పాటులో మౌలిక సదుపాయాలు, పరికరాలు, మందులు, వైద్య సిబ్బంది, వాటితోపాటు నాణ్యమైన వైద్య సేవలు అందించే పరిస్థితులు ఉండాలి. వైద్య సిబ్బందికి సరైన అర్హత, శిక్షణ ఉండాలనేది మరో కీలకాంశం. క్లినిక్, పాలీక్లినిక్, నర్సింగ్ హోం, డస్పెన్సరీ తదితరమైన వాటికి కచ్చిత మైన ప్రమాణాలను నిర్దేశించారు. ఒక క్లినిక్ ఏర్పాటుకు రిసెప్షన్, వెయిటింగ్ గది అనేది కనీసం 35 చద రపు అడుగుల్లో ఉండాలి. డాక్టర్ కన్సల్టెన్సీ గది 10 చదరపు అడు గు లు ఉండాలి. స్టోర్, ఫార్మసీకి 40 చదరపు అడుగుల గది ఉండాలి. ఆస్పత్రులను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 4 రకాలుగా విభజిం చింది. హాస్పిటల్ లెవల్ 1 (ఏ), లెవల్ 2 (నా న్ టీచింగ్), లెవల్ 3 (నాన్ టీచింగ్–సూపర్ సెష్పాలిటీ సర్వీస్), లెవల్ 4 (బోధనాస్పత్రు లు) ఉంటాయి. ఆస్పత్రుల్లో పడకల మధ్య దూరం ఎంతుండాలనే విషయాన్నీ ఇందులో పొందుపరిచారు. ఇలా ప్రతి దానిపై స్పష్టత ఉండేలా ఈ నియమ నిబంధనలు ఉండబో తున్నాయి. అలాగే ఆసుపత్రుల ముందు వివిధ వైద్య చికిత్సలకయ్యే ఖర్చు, ఫీజుల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలి. -
మన ‘నైటింగేల్స్’కు కష్టాలు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ వైద్యం చేస్తే... నర్సులు సేవలు చేస్తారు. అటువంటి నర్సు లకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు తక్కు వ వేతనం ఇస్తూ వారి జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. నర్సులకు కనీసం రూ.20 వేల వేతనమివ్వాలని 2016లో కేంద్రం మార్గదర్శ కాలు విడుదల చేసింది. అలాగే 200 పడకల ఆసుపత్రుల్లోని నర్సులకు, ప్రభుత్వ ఆసు పత్రుల మాదిరిగానే జీతాలివ్వాలని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. ఆ ప్రకారం కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే కనీస వేతనాలు అమలవుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభు త్వాలు అమలుకు నోటిఫికే షన్లు ఇచ్చాయి. తమిళనాడులో రూ.17 వేల కనీస వేతనం అమలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకూ అటువంటి ప్రయత్నాలేవీ చేయడం లేదన్న విమర్శలున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో 8 గంటలకు బదులు 10–12 గంటలు పనిచేయి స్తున్నారు. వేతనాలు రూ.15 వేలు దాటడం లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాల్ ఆన్ డ్యూటీ’: కార్పొరేట్ ఆస్పత్రులు ‘కాల్ ఆన్ డ్యూటీ’పేరుతో కొత్త రకపు పద్ధతులను ప్రవేశపెట్టాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, కెనడా తదితర దేశాల్లో ఉన్న కాల్ ఆన్ డ్యూటీ పద్ధతి ఇటీవల రాష్ట్రంలో విస్తరిస్తోంది. ఆ పద్ధతి ద్వారా రోజువారీ, షిప్టుల వారీగా వేతన చెల్లింపుల ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకుంటున్నాయి. దీంతో ఇప్పటికే ఉన్న సిబ్బంది అభద్రతకు గురవుతున్నారు. అత్యవసర సేవల విభాగం ఐసీయూలో కాల్ ఆన్ డ్యూటీలో నర్సులను నియమిస్తున్నారు. ఆయా అత్యవసర విభాగాలకు కేసులు వచ్చిన సమయంలో మాత్రమే షిఫ్టుల వారీగా, రోజు వారీగా చెల్లింపు ప్రాతిపదికన అప్పటికప్పుడు ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారు. అలాంటి వారికి రోజు కూలి కొంత ఎక్కువగా ఇస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత మాత్రం లేదు. అయితే ఎక్కువ పనిగంటలు చేయాల్సి ఉంటుంది. సరాసరిగా రోజుకు ఐసీయూలో విధులు నిర్వహించేందుకు రూ.1,000, ఇన్‌వార్డులో విధులకు రూ.750, నైట్‌షిప్ట్ అయితే రూ 1,200 ఇస్తున్నట్టు సమాచారం. 2020 నర్సుల సంవత్సరం.. వచ్చే ఏడాదిని నర్సుల సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. రోగులకు ఆరోగ్య సేవలను అందించడంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపింది. అందువల్ల నర్సింగ్, మిడ్వైఫరీ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించగలమని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితులున్నాయి. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రతీ వెయ్యి మందికి ఒక డాక్టరు, ప్రతీ 400 మందికి ఒక నర్సు ఉండాలి. కానీ ఇప్పుడు ప్రతి 1,200 మందికి ఒక డాక్టరు, ప్రతీ 600 మందికి ఒక నర్సు చొప్పున ఉన్నారు. ప్రపంచంలో నర్సులను తీర్చిదిద్దుతున్న టాప్ ఐదు దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయినా ఇక్కడ నర్సులకు తీవ్ర కొరత ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19.80 లక్షల మంది నర్సులుండగా ఇంకా 20 లక్షల మంది నర్సులు అవసరం. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు 88 వేల మంది నర్సులున్నట్లు అంచనా. ఇంకా 30 వేల మంది అవసరముంది. ఇదిలావుండగా రాష్ట్రంలో సర్కారు దవాఖాన్లలో సుమారు 6 వేల నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెరిగిన అవసరాలకు అనుగుణంగా మరో 8 వేల పోస్టులు అవసరమవుతాయి. అయినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు భర్తీపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. కనీస వేతనాలు లేవు.. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులకు దారుణంగా వేతనాలు ఇస్తున్నారు. రూ.15 వేలకు మించడంలేదు. కనీసంగా రూ.20 వేలు వేతనం ఇవ్వాలన్న కేంద్రం సిఫార్సులు అమలు కావడం లేదు. దీనిపై రాష్ట్రంలో వైద్య అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో అనేక మంది నర్సింగ్ కోర్సు చదివినవారు నిరుద్యోగులుగా మారుతున్నారు. – రుడావత్ లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భర్తీ లేకపోవడం వల్లే.. చాలామంది నర్సింగ్ కోర్సు చదివి బయటకు వస్తుండటం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. జిల్లాల్లో రూ.10 వేలు, నగరాల్లో రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య మాత్రమే వేతనాలు ఇస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయడంలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో టైమింగ్స్ కూడా అదనంగా ఉంటున్నాయి. దీంతో తీవ్రమైన పని భారం పడుతోంది. – నిర్మలారాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ -
ఇష్టారాజ్యంగా సిజేరియన్లు
కంకిపాడుకు చెందిన విజయలక్ష్మి అక్టోబర్ 29న ప్రసవం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో చేరింది. బిడ్డ అడ్డం తిరిగిందని, ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు చేసేది లేక ఓకే అన్నారు. అర గంటలోనే సిజేరియన్ ప్రసవం పూర్తయింది. మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచి రూ.48 వేల బిల్లు వేసి ఇంటికి పంపారు. సాక్షి, అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల్లో సుఖప్రసవం గగనమైంది. సుఖప్రసవానికి అవకాశం ఉన్నా ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లు డబ్బు కోసం సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు తగ్గిపోతుండగా, ప్రైవేటులో మాత్రం ఏటా పెరుగుతుండటం ఆందోళన పెంచుతోంది. సిజేరియన్ ప్రసవం వల్ల తల్లీబిడ్డకు ఇబ్బందులుంటాయని తెలిసినా కొంతమంది వైద్యులు సిజేరియన్ వైపే మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి.. తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నవారికి, అధిక రక్తపోటు ఉన్నవారికి, హెచ్ఐవీ సోకిన గర్భిణులకు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ప్రసవం చేయాల్సి ఉంది. కానీ ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు ప్రసవానికి వెళ్లినా సిజేరియన్లు చేస్తున్నారు. విజయవాడలాంటి నగరాల్లో ఇదొక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు 62.16 శాతం సిజేరియన్ ప్రసవాలే జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. ప్రభుత్వాస్పత్రుల్లో తగ్గిన సిజేరియన్లు రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య సగటున 44.91 శాతంగా ఉంది. ఒకప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో కూడా సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా జరగ్గా ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గింది. 40 శాతానికి తగ్గకుండా ఉండే సిజేరియన్ ప్రసవాల సంఖ్య ఇప్పుడు 30.27 శాతానికి దిగొచ్చింది. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఏటా పెరుగుతూ ఇప్పుడా సంఖ్య 61.04 శాతానికి చేరి కలవరపెడుతోంది. అంటే.. ప్రసవానికి వచ్చిన ప్రతి వంద మందిలో 61 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక్కో సిజేరియన్‌కు కనిష్టంగా రూ.30 వేలు, గరిష్టంగా రూ.60 వేల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. సిజేరియన్లతో వచ్చే సమస్యలివే.. మొత్తం ప్రసవాల్లో గర్భిణులకు ఉన్న వివిధ రకాల అనారోగ్య సమస్యల వల్ల 15 శాతం సిజేరియన్ ప్రసవాలు అవసరమవుతాయని, అంతకుమించి జరిగితే తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. దక్షిణాది దేశాల్లో ఈ సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని తాజాగా వెల్లడించింది. - సిజేరియన్ వల్ల తల్లికి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. - అనస్థీషియా (మత్తు మందు) రియాక్షన్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్‌లోనూ అనేక రకాలు ఇబ్బందులు తలెత్తుతాయి. - రెండో ప్రెగ్నెన్సీ సమయంలో తల్లీబిడ్డకు ఇబ్బందులు తలెత్తుతాయి. - గాయం మానడానికి ఎక్కువ రోజులు సమయం పడుతుంది. - ఎక్కువగా రక్తస్రావం జరిగి కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. 20 శాతం లోపే ఉండాలి వాస్తవానికి 20 శాతం లోపే సిజేరియన్లు ఉండాలి. తల్లికీ, బిడ్డకూ రిస్క్ జరిగితే పేషెంట్లు, వారి బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో చాలామంది ప్రసూతి వైద్యులు సిజేరియన్‌కు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్లు తక్కువ. వైద్యులతో పాటు పేషెంట్ కుటుంబీకులు కూడా వాస్తవ పరిస్థితి అర్థం చేసుకుంటే సిజేరియన్లు తగ్గించవచ్చు. – డా.దుర్గాప్రసాద్, కమిషనర్, వైద్యవిధాన పరిషత్