-
రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!
ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్‌బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్‌లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హౌస్‌లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చివరి కంటెండర్పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లవగా చివరగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్ చేస్తారో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్.. చాలామంది వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ ఇచ్చారు.గ్రూప్ గేమ్‌ను ప్రశ్నించిన గౌతమ్విష్ణుప్రియ నిఖిల్‌కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్‌ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ, రాయల్ టీమ్స్‌గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్‌కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. నా వెంట్రుక కూడా పీకలేవుపృథ్వీ.. గౌతమ్ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. విశ్వక్సేన్ ఎంట్రీమెగా చీఫ్ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్‌బాస్. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ కక్కుర్తివస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డ్యాన్స్ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్‌తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశాడు. తర్వాత అవినాష్.. విశ్వక్ దగ్గర టీషర్ట్ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
సాక్షి,కర్నూల్ : పచ్చని పందిట్లో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు స్నేహితుడి పెళ్లిలో సంతోషంగా గడిపిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తుండగా గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న వంశీ .. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో తన స్నేహితుడి పెళ్లికి వచ్చాడు. స్నేహితుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులకు కానుక ఇచ్చేందుకు పెళ్లి వేదికపైకి ఎక్కాడు. తన స్నేహితులతో కలిసి ఓ గిఫ్ట్‌ను వధూవరులకు అందించి పక్కనే నిలబడ్డాడు. స్నేహితుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ ప్యాక్‌ను వధూవరులు ఓపెన్ చేస్తుండగా..వంశీ అస్వస్థతకు గురయ్యాడు.వెంటనే అతన్ని పక్కకి తీసుకెళ్లే లోపే స్టేజిపైనే కుప్పకూలాడు.దీంతో అప్రమత్తమైన తోటి స్నేహితులు అత్యవసర చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీని పరీక్షించిన వైద్యులు అతడి అప్పటికే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. దీంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి వివాహా వేడుకలో గుండెపోటుతో యువకుడు మృతికర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు గురైన వంశీ అనే యువకుడు.వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తోటి స్నేహితులు.. కానీ అప్పటికే గుండెపోటుతో… pic.twitter.com/Ve1Epmf1fI— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
35 ఏళ్లు వచ్చాయి.. ఇంకా సింగిల్‌గా ఉంటానా?: విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించాడు. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో కోటికి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ తన రిలేషన్షిప్ స్టేటస్ బయటపెట్టాడు. తాను సింగిల్ కాదని ఒప్పేసుకున్నాడు. విజయ్ మాట్లాడుతూ.. నాకు 35 ఏళ్లు వచ్చాయి. ఇంకా సింగిల్‌గా ఉన్నానని ఎలా అనుకుంటున్నారు.ప్రేమ గురించి తెలుసుప్రేమ విషయానికి వస్తే.. ఒకరి ప్రేమ పొందితే ఎలా ఉంటుందో తెలుసు.. ఒకర్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసు. షరతుల్లేని ప్రేమ గురించి నాకు తెలియదు. నా ప్రేమ మాత్రం అంచనాలతోనే ఉంటుంది. నాది అన్‌కండిషనల్ లవ్ కాదు అని తెలిపాడు. విజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అతడు రష్మిక కోసమే చెప్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రష్మికతో లవ్!కాగా విజయ్-రష్మిక చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ అది బయటకు చెప్పడానికి మాత్రం ఇష్టపడటం లేదు. అయితే పండగలు, వెకేషన్స్ అప్పుడు మాత్రం ఒకే చోట ఫోటోలు దిగి వాటిని నెట్టింట్లో వదిలి తాము కలిసే ఉన్నట్లు హింట్లిస్తుంటారు.చదవండి: రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే? -
పుట్టిన రోజే.. ఆఖరి రోజు.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
వాషింగ్టన్ డీసీ : పుట్టిన రోజును సంతోషంగా స్నేహితులతో జరుపుకొంటూ.. అంతలోనే పుట్టిన ఓ సరదా అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటనలో విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను శోఖ సంద్రంలో ముంచింది. కండ్ల ముందే స్నేహితుడు ప్రాణ కోల్పోవడంతో పక్కనే ఉన్న స్నేహితులు ఏమీ చేయలేని స్థితిలో గుండెలవిసేలా రోదించారు. దీంతో ఉప్పల్ కళ్యాణ్ పురిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమెరికా పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.ఉప్పల్ కళ్యాణ్ పురికి చెందిన ఆర్యన్ రెడ్డి(23) అమెరికాలోని జోర్జియా స్టేట్ అట్లాంటా పట్టణంలో ఎమ్మెస్ చదువుతున్నాడు. అయితే ఈ క్రమంలో నవంబర్ 13న అతని పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే అదే రోజు తన వద్ద ఉన్న తుపాకీని క్లీన్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో తుపాకీ మిస్‌ఫైర్ అయి ఆర్యన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. ఇవాళ రాత్రి ఆర్యన్ రెడ్డి మృతదేహాన్ని తరలించనున్నారు. -
ఆమె.. ఆయనలో సగభాగం.. భర్తకు పునర్జన్మనిచ్చిన భార్య
సాక్షి, ఖమ్మం జిల్లా: వివాహం జన్మజన్మల అనుబంధమని, చెరోసగంగా భార్యాభర్తలు జీవనం సాగించడం అన్యోన్య దాంపత్యమని పెద్దలు చెబుతారు. ఈ తరహాలోనే ఓ మహిళ తన భర్తను బతికించుకునేందుకు కాలేయదానం చేసి ఆయనలో సగభాగంగా మారడమే కాదు.. కలకాలం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని పెళ్లి రోజున చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి నిలిచినట్లయింది.రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఎదురైందని వైద్యులు గుర్తించారు.ఆపై హైదరాబాద్‌లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. అంతేకాక వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీస్తుండగా లావణ్యే ముందుకొచి్చంది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంలో పరీక్షలు చేసిన వైద్యులు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65శాతం మేర తీసిన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఈనెల 16న శస్త్రచికిత్స ద్వారా శ్రీనుకు అమర్చారు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉండగా కోలుకుంటున్నారని కుటుంబీకులు తెలిపారు.భర్తకు లివర్ దానం చేసి బతికించుకున్న భార్యఖమ్మం - పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను లివర్ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా లివర్ మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. కానీ, ఎంత వెతికినా డోనర్ దొరక్కపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది. ఆమె… pic.twitter.com/Jh0mA4IyaM— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
YSRCP: పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు అదనపు బాధ్యతలు
తాడేపల్లి : ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కో-ఆర్డినేట్‌గా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.అదే సమయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి సైతం అదనపు బాధ్యతలు అప్పగించారు. వైవీ సుబ్బారెడ్డికి అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలను అప్పగించారు. -
జీతమే లేని ఉద్యోగానికి 10వేల మంది ఎగబడ్డారు
ఉద్యోగంలో చేరుతున్నామంటే.. తప్పకుండా జీతం వస్తుందని అందరికి తెలుసు. అయితే జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ ఇటీవల ఓ ప్రకటన చేస్తూ.. చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పని చేసేందుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఇందులో చేరినవారికి జీతం ఉండదు, పైగా ఉద్యోగంలో చేరిన వాళ్ళే రూ. 20 లక్షలు ఇవ్వాలని చెప్పారు.ఈ వింత ప్రకటన చూసిన చాలామంది, ఇదేం ప్రకటన అనుకునే ఉంటారనుకుంటే భావిస్తే.. ఊహకందని రీతిలో 24 గంటల్లో ఏకంగా 10వేలమంది అప్లై చేసుకున్నారు. ఈ విషయాన్ని దీపీందర్ గోయల్ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. అప్డేట్ కోసం వేచి ఉండాలని చెప్పారు.జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాబ్జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో నియామకం కాబోయే వ్యక్తి గురుగ్రామ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న కోరిక, జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే తపన ఉన్నవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిపై అప్లై చేసుకునే వారికి పూర్వానుభవం అవసరం లేదు. అంతే కాకుండా ఉద్యోగంలో చేరిన తరువాత జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు ఆధ్వర్యంలోని ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల వృద్ధి కోసం పని చేయాల్సి ఉంటుందని గోయల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి మొదటి ఏడాది జీతం ఉండదు. అయితే ఆ ఉద్యోగి రూ. 20లక్షలు ఫీడింగ్ ఇండియాకు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రెండో ఏడాది రూ. 50 లక్షలకు తగ్గకుండా వేతనం ఉంటుందని గోయల్ స్పష్టం చేశారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు రెజ్యూమె (Resume) కూడా పంపించాల్సిన అవసరమే లేదు. కేవలం 200 పదాల్లో తమ గురించి తెలియజేస్తే సరిపోతుంది.Update 2: we have over 10,000 applications, a lot of them well thought through, mixed between -1. Those who have all the money 2. Those who have some of the money 3. Those who say they don’t have the money 4. Those who really don’t have the money We will be closing the… https://t.co/8a6XhgeOGk— Deepinder Goyal (@deepigoyal) November 21, 2024 -
ఫిల్ సాల్ట్ ఊచకోత.. ఒకే ఓవర్లో 34 పరుగులు! వీడియో వైరల్
అబుదాబి టీ10 లీగ్-2024ను ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఘనంగా ఆరంభించాడు. ఈ లీగ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం సాల్ట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం షేక్ జాయెద్ స్టేడియంలో అజ్మాన్ బోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ విధ్వంసం సృష్టించాడు.80 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా అజ్మాన్ బోల్ట్స్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్‌ను ఓ ఆటఆడేసుకున్నాడు. అతడి వేసిన 5వ ఓవర్లో సాల్ట్.. 5 సిక్స్‌లు, ఓ ఫోరుతో ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. తొలి రెండు బంతులను మిడ్-వికెట్ మీదగా సిక్సర్లగా మలిచిన సాల్ట్.. ఆ తర్వాత మూడో బంతిని బౌండరీకి తరలించాడు.అనంతరం ఆఖరి మూడు బంతులను రెండు లాంగ్-ఆన్, లాంగ్-ఆఫ్ మీదగా సిక్స్‌లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసం ఫలితంగా టీమ్ అబుదాబి లక్ష్యాన్ని కేవలం 5.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి చేధించింది.చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు Salt makes it spicy! 🌶️🥵The swashbuckling English opener smacked 34 runs in an over and finished with 53* (19) leading Team Abu Dhabi to a thumping win in the #AbuDhabiT10 opener! 👊#ADT10onFanCode pic.twitter.com/V0ZiTNjldp— FanCode (@FanCode) November 21, 2024 -
లగచర్ల ఘటన.. సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఫార్మా బాధితుల అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. లగచర్ల ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించింది. ఘటన తీవ్రత నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం లా అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో కూడిన జాయింట్ టీమ్‌ను లగచర్ల పంపాలని నిర్ణయించింది.వారం రోజుల్లో ఈ అంశంపై జాయింట్ టీం నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పోలీసుల దాడిపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల భయంతో ఊరు విడిచి గ్రామస్తులు వెళ్లిపోవడం తీవ్రమైన విషయం అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈనెల 18న ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చామంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. ఆయా కమిషన్లను కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు -
IND vs AUS: అమ్మో పెర్తా? భారత్‌ను భయపెడుతున్న గత రికార్డులు
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఆరంభానికి సమయం అసన్నమైంది. శుక్రవారం(నవంబర్ 22) పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ మొదలుకానుంది.ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. పటిష్టమైన ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై దెబ్బ కొట్టాలంటే భారత్ కచ్చితంగా అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యి ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. కంగారుల దూకుడుకు ఎలా అడ్డుకుంటుందోనని అభిమానులు అతృతగా ఎదుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు భారత్ ఆర్హత సాధించాలంటే ఈ సిరీస్ కీలకం. ఈ సిరీస్‌లో 4-0 తేడాతో ఆసీస్‌ను ఓడిస్తేనే భారత్ నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు క్వాలిఫై అవుతోంది. ఇక తొలి టెస్టు జరిగే పెర్త్‌లో భారత్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.ఆసీస్‌దే పై చేయి..?పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో టీమిండియాకు పేలవ రికార్డు ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టులు జరిగాయి. అందులో టీమిండియా కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా.. ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరగా భారత్ 2018 పర్యటనలో ఈ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 146 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది.బ్యాటింగ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?ఈ ఆప్టస్ స్టేడియంలో టీమిండియా సాధించిన అత్యధిక స్కోర్ 402 పరుగులు. 1977లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు నమోదు చేసింది. ఈ వేదికలో భారత్ అత్యల్ప స్కోర్ 141 పరుగులగా ఉంది. 2018లో ఆసీస్‌తో జరిగిన టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 141 పరుగులకు మెన్ ఇన్ బ్లూ ఆలౌటైంది.విరాట్ ఒక్కడే..ఈ వేదికలో భారత్ నుంచి విరాట్ కోహ్లికి ఒక్కడికే మంచి రికార్డు ఉంది. పెర్త్‌లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన కోహ్లి.. 259 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా సునీల్ గవాస్కర్(127 పరుగులు, 1977లో) ఉన్నారు. అదేవిధంగా ఈ వేదికలో అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో భారత్ నుంచి దిగ్గజం బిషన్ సింగ్ బేడీ(10 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నారు.చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు