-
ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి కేసులో గ్యాంగ్ లీడర్ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనతో పాటు తక్కువ ధరకే బంగారం, నోట్ల మార్పిడి తదితర నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌లీడర్ దేవరకొండ సుదీర్ అలియాస్ అజయ్‌రెడ్డిని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో సోదాలు నిర్వహించి ఎయిర్ గన్లు 4, హ్యాండ్‌కప్స్ 4, వాకీటాకీలు 4, కత్తులు రెండు, ఫోల్డింగ్ ఐరన్ స్టిక్‌లు రెండు, జామర్స్ 2, పెద్ద సంఖ్యలో సెల్ఫోన్లు, ల్యాప్టాప్స్, నగదు రూ.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుడిపై రాష్ట్రంలోని 10 పోలీస్ స్టేషన్లలో 25 కేసులున్నాయని, కావలి టూ టౌన్ పోలీసుస్టేషన్లో సస్పెక్టెడ్ షీటు ఉందన్నారు. నిందితుడు అనుచరులతో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బంగారం, నోట్ల మార్పిడి, నకిలీ పోలీసుల అవతారంలో నేరాలు, మోసాలకు పాల్పడుతున్నాడని ఎస్పీ తెలిపారు. ఇటీవల నిందితుడి మోసాలపై పలువురు ఫిర్యాదులు చేయగా.. వాటిపై కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ హిమవతి, కావలి డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు. -
Nov 9th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions.. 09:17 PM, Nov 9, 2023 బాబు గజగజ ►స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►52రోజులపాటు జైలు జీవితం.. బయటకు వచ్చాక ఆస్పత్రుల చుట్టూ బాబు ► దిక్కుతోచని స్థితిలో టీడీపీ శ్రేణులు ►పరామర్శయాత్రని పక్కన పారేసిన సతీమణి నారా భువనేశ్వరి ►యువగళాన్ని అటకెక్కించి ఢిల్లీ పరారైన తనయుడు నారా లోకేష్ బాబు ►టెన్షన్లో నారావారు.. గందరగోళంలో పార్టీ క్యాడర్ ►స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపైనే ఆశలు పెట్టుకున్న బాబు అండ్ కో 05:59 PM, Nov 9, 2023 తెలుగుదేశం విష ప్రచారమేంటీ? అసలు నిజాలేంటీ? ►తెలుగుదేశం, ఎల్లోమీడియాలో జరుగుతున్న ప్రచారమేంటీ? ►చంద్రబాబు విజనరీ, ఆయనే హైటెక్ సిటీ కట్టాడు ►మళ్లీ చంద్రబాబు నెగ్గితే ఏపీ అభివృద్ధి చేస్తాడు ►ప్రస్తుతమున్న ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదు కింది ఫోటో చూడండి. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తోంది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ఆలోచన చంద్రబాబుది కాదు, టిడిపిది కాదు కిందివి చదివిన తర్వాత మరిన్ని విషయాలు నిర్దారించుకోండి ►విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ సీఎం జగన్ వచ్చి పూర్తి చేసాడు. ►వైజాగ్ NAD ఫ్లై ఓవర్ కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసాడు. ►బెజవాడ బెంజి సర్కిల్ మొదటి ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ వచ్చి పూర్తి చేసేసాడు. ►రెండో ఫ్లైఓవర్ కూడా సీఎం జగన్ మొదలుపెట్టి, ఏడాదిలో జగనే పూర్తి చేసాడు. ►కృష్ణా నది రిటైనింగ్ వాల్ సీఎం జగనే స్టార్ట్ చేసి పూర్తి చేసాడు. ఇంకొకటి స్టార్ట్ చేసాడు. ►తిరుపతిలోని సేతు ఫ్లైఓవర్ అందంగా సీఎం జగన్ ప్రభుత్వమే పూర్తి చేసింది ►అనంతపురం టవర్ క్లాక్ బ్రిడ్జి సీఎం జగనే మొదలుపెట్టి, పూర్తి చేసాడు. ఇవే కాదు ►భోగాపురం ఎయిర్‌పోర్టుకి అన్ని అనుమతులు సాధించి, సీఎం జగనే మొదలు పెట్టి పనులు చేస్తున్నాడు. ►వెలిగొండ18 కి.మీ. మొదటి టన్నెల్ సీఎం జగనే పూర్తి చేసాడు. రెండో టన్నెల్ కూడా జగనే పూర్తి చేయబోతున్నాడు. ►ఒక రూపు లేని పోలవరాన్ని కూడా సీఎం జగనే ఒక రూపుకు తెచ్చాడు. స్పిల్ వే, అప్పర్, లోయర్ కాఫర్ డ్యాములు సీఎం జగనే పూర్తి చేసాడు. ►అప్రోచ్, స్పిల్ పైలట్ ఛానెళ్ళు కూడా సీఎం జగనే పూర్తి చేసాడు. నిర్వాసితులకు వేల ఇల్లు ఈ ప్రభుత్వమే కట్టించింది ►16 మెడికల్ కాలేజీలు సీఎం జగనే మొదలుపెట్టాడు, 5 పూర్తి చేసాడు. ►4 పోర్టులు,10 ఫిషింగ్ హార్బర్లు సీఎం జగనే మొదలుపెట్టాడు, పనులు పరుగులు పెట్టిస్తున్నాడు. సీఎం జగన్ కాబట్టే చేస్తున్నాడు. ►ఇవే కాక, వేల పాఠశాలలను, విద్యాసంస్థలను సీఎం జగనే మార్చాడు. నాడు నేడు కింద రూపురేఖలు మొత్తం మార్చేశాడు. ►లక్షల ఇళ్లు సీఎం జగనే కట్టిస్తున్నాడు. ►వేల సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు సీఎం జగనే మొదలు పెట్టి, పూర్తి చేస్తున్నాడు. ఇలా చెప్పుకోవడానికి చంద్రబాబుకి తాత్కాలిక కట్టడాలు తప్ప, ఒక్కటి ఏదైనా ఉందా ? మరెలా విజనరీ అయ్యాడు? రాజధాని ప్రాంతంలో మొదలు పెట్టిన ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోయాడు అసలు ఎలా మోస్తున్నారు ? హైదరాబాద్ రింగు రోడ్డు, ఎయిర్‌పోర్టు నుండి ఏదీ మొదలుపెట్టింది లేదు. పూర్తి చేసిందీ లేదు కానీ అన్నీ నేనే చేసానని చెప్పుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ సంపద సృష్టిస్తాడని ప్రచారం చేస్తున్నారు. అందుకే .. జగనే చేసాడు... జగనే చేస్తాడు... ఏదైనా జగనే చేయగలడు... అన్న నమ్మకం ప్రజల్లో ఉంది ►ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేడన్నారు, చేశాడు. ►CPS రద్దు చేయలేడన్నారు, చేశాడు. PRC ఇవ్వలేడన్నారు, ఇచ్చాడు. నిశ్శబ్దంగా ఆయనే అన్నీ చేస్తాడు. జనానికి అన్నీ చేస్తున్నాడు కాబట్లే అందుకే పచ్చమీడియాకు కళ్ల మంట : YSRCP 05:46 PM, Nov 9, 2023 అసలు జనసేన ఎటు వైపు? ►ఎన్డీఏలో మేం భాగస్వామిగా ఉన్నాం : నాదెండ్ల మనోహర్ ►తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ►తెలంగాణలో బీజేపీ పొత్తుతో పోటీ చేస్తున్నాం : నాదెండ్ల మనోహర్ ►మరి, ఏపీలో మీ స్టాండ్ ఏంటీ? ►బీజేపీతో పొత్తులో ఉన్నవాళ్లు తెలుగుదేశంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ►రాజకీయ పార్టీగా మీకు కొన్ని విలువలు ఉండాలి కదా.! ►ఒక పార్టీతో అధికారికంగా పొత్తు, మరో పార్టీతో అనధికారికంగా పొత్తు ఉంటుందా? ►అసలు మీ మీద మీకు నమ్మకం లేదా? ►గోడ మీద పిల్లిలా ఎటు అవకాశం వస్తే అటు ఫిరాయిస్తారా? 05:06 PM, Nov 9, 2023 దీపావళి సెలవుల తర్వాతే బాబు క్వాష్‌పై కదలిక ►చంద్రబాబు క్వాష్‌పై సుప్రీంకోర్టు స్పష్టత ►దీపావళి సెలవుల తర్వాతే క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామన్న సుప్రీంకోర్టు ►నవంబర్ 12 నుంచి 19 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ►సుప్రీంకోర్టు సెలవుల అనంతరం క్వాష్ పిటిషన్‌పై సమయం వెచ్చించనున్న బెంచ్ ►నవంబర్ 30 లేదా డిసెంబర్ మొదటి వారంలో క్వాష్‌పై తీర్పు వచ్చే అవకాశం ►నవంబర్ 28న రాజమండ్రి జైల్లో సరెండర్ కానున్న చంద్రబాబు నాయుడు 04:55 PM, Nov 9, 2023 అయోమయంలో తెలుగుదేశం ►నవంబర్ 28న సాయంత్రం 5గంటలకు తిరిగి జైలుకు వెళ్లాల్సిన చంద్రబాబు ►ఈలోగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం కోటి ఆశలతో ఎదురుచూపులు ►ప్రస్తుతం అనారోగ్య కారణాలతో తాత్కాలిక బెయిల్ మీద ఉన్న చంద్రబాబు ►17ఏ సెక్షన్‌ను చూపించి కేసు కొట్టేయించుకోవాలన్న వ్యూహంలో బాబు లాయర్లు ►బాబు క్వాష్ పిటిషన్‌పై నవంబర్ 28 తర్వాత ఉత్తర్వులిస్తామన్న సుప్రీంకోర్టు ►అంటే చంద్రబాబు జైలుకు వెళ్లిన ఒకటి, రెండు రోజుల తర్వాత ఉత్తర్వులు వచ్చే అవకాశం ►ఒక వేళ తీర్పు అనుకూలంగా రాకపోతే చంద్రబాబు జైలుకే పరిమితం అయ్యే అవకాశం ►చంద్రబాబు బయట ఉంటేనే మ్యానిఫెస్టో విడుదల చేయాలన్న యోచనలో తెలుగుదేశం ►చంద్రబాబు చుట్టే ముడిపడి ఉన్న టిడిపి వ్యవహారాలు ►నవంబర్ 30 తర్వాతే పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటానంటోన్న లోకేష్ ►అప్పటివరకు పాదయాత్ర జోలెత్తవద్దంటున్న చినబాబు ►సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నా.. టిడిపిలో కనిపించని జోష్ 03:54 PM, Nov 9, 2023 అంటే.. నడుస్తాడా లేదా.? అన్నది లోకేష్ చెప్పాలేమో.? ►లోకేష్ పాదయాత్రపై దీపావళి తర్వాత నిర్ణయిస్తాం : అచ్చెన్నాయుడు ►చంద్రబాబు బెయిల్ విషయంలో మరింత క్లారిటీ వచ్చాక వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి సభలు పెడతాం ►ఆ ఉమ్మడి సభల్లో చంద్రబాబు, పవన్ పాల్గొంటారు : అచ్చెన్నాయుడు 01:54 PM, Nov 9, 2023 విజయవాడలో టీడీపీ -జనసేన యాక్షన్ కమిటీ భేటీ ►సంయుక్త సమావేశానికి నారా లోకేష్ హాజరు ►టిడిపి నుంచి అచ్చెన్నాయుడు, పయ్యావుల,యనమల, పితాని, నిమ్మల - జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస ►యశస్వి,బొమ్మిడినాయకర్ హాజరు ►మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటిద్దాం? ►ఉమ్మడి కార్యాచరణ ఎప్పుడు మొదలెడదాం? ►ప్రజల్లోకి ఐక్యంగా వెళ్లేందుకు ఒక కరపత్రం కావాలి కదా.! ►ఎలా ఉండాలి? ఎవరెవరు ఏం చేయాలి? రూపకల్పనపై చర్చ ►ఓట్లు, ఓటర్ల జాబితాపై ఇంటింటికి తిరగాలని ప్రణాళిక ►నియోజకవర్గాల స్ధాయిలో ఆత్మీయ సమావేశాల నిర్వహణపై నిర్ణయం 11:53 AM, Nov 9, 2023 ►ఫైబర్‌నెట్ కేసులో విచారణ వాయిదా ►ఈనెల 30కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ►ఫైబర్‌నెట్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తున్నాం: సుప్రీంకోర్టు ►స్కిల్ స్కాం క్వాష్ పిటిషన్‌లోని కొన్ని అంశాలు ఫైబర్‌నెట్ కేసుతో ముడిపడి ఉన్నాయి ►క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ చేస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం ►దీపావళి సెలవుల అనంతరం స్కిల్ కేసు తీర్పు వెలువరిస్తామన్న సుప్రీంకోర్టు ►ఆరోగ్యకారణాల రీత్యా చంద్రబాబు ఇప్పటికే బెయిల్ పై ఉన్నారన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►సుప్రీంకోర్టులో కేసు ముగిసేవరకు అరెస్టు చేయబోమన్న నిబంధన కొనసాగించాలన్న సిద్ధార్ధ లూథ్రా ►స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో తీర్పు పెండింగులో ఉన్నందున విచారణ వాయిదా ►ఫైబర్ నెట్ కేసులో నవంబర్ 30 వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దన్న సుప్రీంకోర్టు ►స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో దీపావళి సెలవుల తర్వాత తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు ►స్కిల్ స్కాం కేసులో బాబు క్వాష్ పిటిషన్‌పై ఈనెల 23లోగా తీర్పు వచ్చే అవకాశం ►కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు పెట్టుకున్న 17-ఏ పిటిషన్‌పై దీపావళి సెలవుల తర్వాత తీర్పు 11:00 AM, Nov 9, 2023 కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా ►మద్యం స్కాంలో కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌పై విచారణ ►తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ►మద్యం కుంభకోణంలో ఏ2గా ఉన్న కొల్లు రవీంద్ర 8:00 AM, Nov 9, 2023 సుప్రీంలో లిస్ట్ అయిన కేసు.. నేడు ఫైబర్ నెట్ స్కామ్‌పై విచారణ ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ స్కామ్ కేసుపై విచారణ ►11వ నెంబర్ ఐటెంగా లిస్ట్ అయిన కేసు ►ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏపీ హైకోర్ట్ ►హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసిన చంద్రబాబు ►విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►స్కిల్ స్కాం కేసులో తాము తీర్పు ఇచ్చేవరకు ఆగాలని, గత విచారణలో సూచించిన సుప్రీంకోర్టు ►స్కిల్ స్కాంలో 17A పై తీర్పు ఎప్పుడు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఏపీ సీఐడీ అభియోగాలు ►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాఫ్ట్‌కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడంపై అవినీతి ఆరోపణలు 7:30 AM, Nov 9, 2023 జనసేన పవన్‌కు బిగ్ షాక్.. ►పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన ఓయూ విద్యార్థులు ►పవన్ ఒక బ్రోకర్.. రాజకీయాల్లో ఒక ఐటమ్ స్టార్ ►ప్రజా సమస్యలపై పవన్ ఏనాడూ పోరాడలేదు. రాజకీయాల్లో పవన్ ఒక ఐటమ్ స్టార్ , ఒక బ్రోకర్ ఇక్కడ ప్రజా సమస్యలపై పవన్ ఏనాడూ పోరాడలేదు ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోం... తరిమికొడతాం - ఓయూ విద్యార్థులు pic.twitter.com/a4LZ7hJ4as — 𝙈𝙖𝙣𝙖 𝙔𝙨𝙧𝙘𝙥 (@ManaYsrcp7) November 8, 2023 6:56 AM, Nov 9, 2023 చంద్రబాబుకు సజ్జల కౌంటర్ ►మేనిఫెస్టోలో హామీల సంగతేంటి బాబు. ►బాబు మర్చిపోయినా మా దగ్గర ఆధారాలున్నాయి. 2014 టీడీపీ మేనిఫెస్టోని చంద్రబాబు అధికారంలోకి రాగానే వెబ్సైట్ నుంచి తీసేశాడు. ఆ మేనిఫెస్టోలో ఏడాదికి 12 సిలిండర్లని ఇస్తానని బాబు హామీ ఇచ్చాడు. కానీ.. గెలిచిన తర్వాత ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఏడాదికి మూడు సిలిండర్లని ఇస్తానని హామీ ఇస్తున్నాడు. బహుశా పాత హామీని అందరూ మర్చిపోయి… pic.twitter.com/N2hxwPBb31 — YSR Congress Party (@YSRCParty) November 8, 2023 6:55 AM, Nov 9, 2023 అబద్ధాలతో ఎల్లో మీడియా దోస్తీ: YSRCP ►చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎల్లో మీడియా కృషి. ►జర్నలిజం విలువలకి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు. ►కొన్నేళ్లుగా బాబు మోచేతి నీళ్ల కోసం నిస్సిగ్గుగా నిజాల్ని దాచేస్తూ.. అబద్ధాలతో దోస్తీ చేస్తున్నారు... 6:50 AM, Nov 9, 2023 నేడు టీడీపీ పీఏసీ భేటీ ►నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ భేటీ ►చంద్రబాబు నివాసంలో ఈరోజు జరగనున్న పీఏసీ భేటీ ►టీడీపీ-జనసేన జేఏసీ భేటీలో చర్చించాల్సిన అంశాలపై చర్చ ►ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పనపై కసరత్తు ►ఓటర్ల జాబితా పరిశీలనలో జనసేనతో కలిసి పని చేసేందుకు ప్రణాళికలు 6:40 AM, Nov 9, 2023 సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై బుధవారం వెలువడని తీర్పు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం ►ఈరోజు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►నవంబర్ 9వ తేదీన విచారణ చేపడతామని గత విచారణలో చంద్రబాబు లాయర్లకు చెప్పిన ద్విసభ్య ధర్మాసనం ►ఫైబర్ పిటిషన్ విచారణ కంటే ముందే స్కిల్ పిటిషన్‌పై తీర్పు ఇస్తామంటూ స్పష్టీకరణ ►ఆ లెక్కన.. నేడు తీర్పు ఇచ్చాకే పిటిషన్ విచారించాల్సి ఉన్న బెంచ్ ►లేకుంటే ఫైబర్ పిటిషన్‌పైనా విచారణ వాయిదా పడే ఛాన్స్ ►సుప్రీం పిటిషన్‌పైనే ఆధారపడిన ఏసీబీ కోర్టు పీటీ వారెంట్ నిర్ణయం ►సుప్రీం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబు(Chandrababu)పై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ► ఫైబర్ నెట్ కేసులో.. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఫైబర్ నెట్ కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ అభియోగం -
ఇసుక కుంభకోణం కేసు: చంద్రబాబు పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, గుంటూరు: ఉచిత ఇసుక విధానంతో రాష్ట్ర ఖజానాకు నష్టం కలగజేసిన సీఐడీ అభియోగాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారాయన. బుధవారం హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరగగా.. ఈ నెల 22వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఇసుక దోపిడీపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే.. రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలని, వేధించాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని ముందస్తు బెయిల్ పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ తన అభియోగాల్లో.. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి ఇసుక కుంభకోణం సాగించారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు పన్నాగం పన్నారంటూ.. ఆధారాలతోసహా బయటపెట్టింది. -
Nov 8th CBN Case Updates: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Cases Petitions.. 6:50 PM, Nov 8, 2023 అది బాబుకు మాత్రమే సొంతం ►గతంలో అబద్ధం అధికారంలో ఉంది.. ఆ అబద్ధమే చంద్రబాబు ►ఎన్నికల సమయంలో చంద్రబాబు నాలుగు మాయమాటలు చెప్తారు ►ఆ మాటలతోనే అధికారం పొందాలని చూస్తున్నారు ►బీసీ వర్గాలను అణచివేసిన వ్యక్తి చంద్రబాబు ►చంద్ర బాబు హయాంలో ఎస్సీ, మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి లేదు ►సామాజిక న్యాయం తుంగలో తొక్కిన ఘనత చంద్రబాబుదే ►ప్రజలను ఎలా మోసం చేయాలో చంద్రబాబుకి తెలిసినట్టు ఎవ్వరికీ తెలీదు పశ్చిమ గోదావరి పాలకొల్లు సామాజిక సాధికార యాత్ర సభలో వైఎస్సార్సీపీ నేతలు 6:36 PM, Nov 8, 2023 రేపు టీడీపీ పీఏసీ భేటీ ►నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ రాజకీయ కార్యాచరణ కమిటీ భేటీ ►చంద్రబాబు నివాసంలో గురువారం జరగనున్న పీఏసీ భేటీ ►టీడీపీ-జనసేన జేఏసీ భేటీలో చర్చించాల్సిన అంశాలపై చర్చ ►ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పనపై కసరత్తు ►ఓటర్ల జాబితా పరిశీలనలో జనసేనతో కలిసి పని చేసేందుకు ప్రణాళికలు 6:25 PM, Nov 8, 2023 దొంగే ‘దొంగా దొంగా..’ అన్నట్లుగా.. ►దొంగే దొంగ అన్నట్లుగా టీడీపీ నేతల తీరు ►సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,సోమిరెడ్డి,టీడీపీ నేతలు ►ఏపీలో ఓట్ల అవకతవకలంటూ కొత్త డ్రామా ►ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు ►దొంగ ఓట్లపై చర్చకు టీడీపీ సిద్ధమా? అని ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ ►తేలు కుట్టిన దొంగలా ఉంటూ.. డ్రామాలకు తెర లేపిన టీడీపీ, యెల్లో మీడియా 5:56 PM, Nov 8, 2023 చంద్రబాబు, పవన్.. ఇద్దరూ ద్రోహులే ►ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ ►చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ ►దళితుల్ని అణగదొక్కారు.. చదువుకు దూరం చేశారు ►పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందిస్తుండడంపై పవన్ కల్యాణ్ దారుణంగా మాట్లాడారు ►యూట్యూబ్ చూసి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చంటూ పవన్ హేళన చేశారు ►పవన్‌కు ఇదే నా సవాల్ ►చదువంటే.. సినిమా డైరెక్టర్ చెప్పినట్లు చేయడం కాదు పవన్! ►పవన్.. నీకు దమ్ముంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే మా పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడు 3:51 PM, Nov 8, 2023 సుప్రీంలో రేపు ఏం జరగనుందో? ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఇవాళ వెలువడని తీర్పు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం ►రేపు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►నవంబర్ 9వ తేదీన విచారణ చేపడతామని గత విచారణలో చంద్రబాబు లాయర్లకు చెప్పిన ద్విసభ్య ధర్మాసనం ►ఫైబర్ పిటిషన్ విచారణ కంటే ముందే స్కిల్ పిటిషన్‌పై తీర్పు ఇస్తామంటూ స్పష్టీకరణ ►ఆ లెక్కన.. రేపు తీర్పు ఇచ్చాకే పిటిషన్ విచారించాల్సి ఉన్న బెంచ్ ►లేకుంటే ఫైబర్ పిటిషన్‌పైనా విచారణ వాయిదా పడే ఛాన్స్ ►సుప్రీం పిటిషన్‌పైనే ఆధారపడిన ఏసీబీ కోర్టు పీటీ వారెంట్ నిర్ణయం ►సుప్రీం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబు(Chandrababu)పై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన సీఐడీ అధికారులు ► ఫైబర్ నెట్ కేసులో.. టెరాసాఫ్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఫైబర్ నెట్ కాంట్రాక్టు ఇచ్చారని సీఐడీ అభియోగం 2:34 PM, Nov 8, 2023 ఇసుక కుంభకోణం పిటిషన్ 22కి వాయిదా ►ఇసుక కుంభకోణంలో ఏ-2గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ ►ఈనెల 20 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశం ►తదుపరి విచారణ ఈనెల 22 కు వాయిదా 1:40 PM, Nov 8, 2023 ఐఆర్ఆర్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏసీబీ కోర్టు విచారణ వాయిదా ►మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని పిటిషన్ ►విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు. 11:15 AM, Nov 8, 2023 మీడియా అనే వెంటిలేటర్ ఆధారంగానే బాబు రాజకీయం: YSRCP ►మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే ఇదే మరి.. ►అసలు టీడీపీకి ఉన్నదే ఎల్లో మీడియా బలం. ►చంద్రబాబుకు ఏనాడూ ప్రజాబలం లేదు. ►ఆనాడు ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేసిన నాటి నుంచి ఇప్పటివరకూ ఎల్లో మీడియానే ఆధారం. ►మీడియా అనే వెంటిలేటర్ ఆధారంగానే చంద్రబాబు రాజకీయాలు ►వృద్ధనారి పతివ్రత అన్నట్లుగా మీరిప్పుడు నంగనాచి కబుర్లు చెబితే ఎలా? ►ప్రజల కోసం ప్రతిపక్షపాత్ర పోషిస్తాం అని చెప్పుకునే ఎన్ని చానెళ్లు, ఎన్ని పేపర్లు మీకు ఊడిగం చేయడం లేదు. ►మీ పాలనలో ఆ చానెళ్లకు దోచిపెట్టిన కాంట్రాక్టులు ఎన్ని? మీ అరాచకాలను దాచిపెట్టిన ఎల్లో ఛానెళ్ళు ఎన్ని? ►ఇవన్నీ రాష్ట్రంలోని పసి పిల్లాడికి కూడా తెలుసు. ►ఇప్పుడు కొత్తగా మీరు లోకానికి చెప్పేదేమీలేదు. ►మీ తప్పులు ఎత్తి చూపే చానల్స్ చూస్తే మీకు ఉలుకెందుకు? ►మీ అవినీతి, అరాచకాలను బయటపెట్టిన చానెళ్లు, మీకు అమ్ముడుపోని మీడియాలను ఇలాగే టార్గెట్ చేస్తారా? ►ఇదెక్కడి రాజకీయం? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?. ►టైర్లలో గాలిపోయి, కదల్లేని స్థితిలో ఉన్న టీడీపీని బతికించేందుకు ఎల్లోమీడియాకు ఇంత ఆరాటం ఎందుకో మరి! మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే ఇదే మరి.. అసలు మీ @JaiTDPకి ఉన్నదే మీడియా బలం. మీకు ఏనాడూ ప్రజాబలం లేదు. ఆనాడు ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేసిన నాటినుంచి ఇప్పటివరకూ @ncbn మీడియా అనే వెంటిలేటర్ ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నారు. వృద్ధనారి పతివ్రత అన్నట్లుగా మీరిప్పుడు నంగనాచి… https://t.co/i6Go58QrhT pic.twitter.com/fm6AJL9AOf — YSR Congress Party (@YSRCParty) November 8, 2023 11:15 AM, Nov 8, 2023 బాబు ముందస్తు బెయిల్ విచారణ మధ్యాహ్నానికి వాయిదా ►ఇసుక కుంభకోణంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు ►ఈరోజు మధ్యాహ్నం విచారించనున్న ఏపీ హైకోర్టు ►విధాన నిర్ణయాలకు నేరత్వం ఆపాదిస్తున్నారు ►17ఏ ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి ►పిటిషన్లో చంద్రబాబు నివేదన 11:00 AM, Nov 8, 2023 టెర్రాసాఫ్ట్ ఆస్తుల అటాచ్మెంట్ కేసుపై నేడు విచారణ ►ఫైబర్ నెట్ కేసులో టెర్రాసాఫ్ట్ ఆస్తుల అటాచ్మెంట్ కేసుపై నేడు విచారణ ►టెరాసాఫ్ట్ కంపెనీ ఆస్తుల అటాచ్మెంట్ పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ►ఏడు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతి ఇవ్వాలని కోరిన సీఐడీ ►సీఐడీ వేసిన పిటిషన్‌పై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ 10:50 AM, Nov 8, 2023 నేడు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ ►తాజా రాజకీయ పరిణామాలపై యాక్షన్ కమిటీ చర్చ ►రేపు విజయవాడలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ►ఎజెండా ఖరారు చేయనున్న కమిటీ ►బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంపై చర్చ ►ప్రజా సమస్యలు, ప్రభుత్వంపై పోరాడాల్సిన అంశాల పై చర్చ 10:00 AM, Nov 8, 2023 మీ క్రెడిబిలిటీ ఇదే పున్నమ్మా.. విజయసాయి సెటైర్లు ►ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి ఎంపీ విజయసాయి కౌంటర్ ►2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తే అక్కడి ప్రజలు 36 శాతం ఓట్లతో బొటాబొటిగా మిమ్మల్ని గెలిపిస్తే.. ►కేంద్ర మంత్రి అయిన తమరు చేసింది ఏంటో తెలుసా? రాష్ట్రాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేశావేమ్మా! ►మళ్లీ 2019లో అదే విశాఖ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తే మీకు వచ్చిన ఓట్లు కేవలం 2.73% అంటే 33,892 ఓట్లు. ►మొత్తం 12 లక్షల 50 వేల ఓట్లలో 33 వేల ఓట్లంటే కనీసం మన సామాజికవర్గం వాళ్ళు కూడా వేయనట్టే కదా! ►మీ క్రెడిబిలిటీ ఇదే పున్నమ్మా. ►ఒకసారి మీకు గుర్తు చేయమని ఒక విశాఖ మిత్రుడు పంపాడు. 1/2: మీపై రాష్ట్ర ప్రజలకు ఎంత నమ్మకం అంటే పురంధరేశ్వరి గారూ...2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపిగా పోటీ చేస్తే అక్కడి ప్రజలు 36 శాతం ఓట్లతో బొటాబొటిగా మిమ్మల్ని గెలిపిస్తే...కేంద్ర మంత్రి అయ్యి తమరు చేసింది ఏంటో తెలుసా? రాష్ట్రాన్ని ముక్కలు చేసి సర్వనాశనం చేశావేమ్మా! 2/2:.… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 8, 2023 8:45 AM, Nov 8, 2023 పవన్‌ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు: మహిళలు ఫైర్ ►చంద్రబాబు అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లి.. అనారోగ్యం సాకుతో బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి. ►పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ►అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన సీఎం వైఎస్ జగన్ మళ్లీ గెలుస్తారు. ►ముఖ్యమంత్రి జగనే మళ్లీ సీఎం అవుతారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లి.. అనారోగ్యం సాకుతో బెయిల్ మీద బయటకు వచ్చిన వ్యక్తి. ఇక పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన సీఎం వైయస్ జగన్ గారే మళ్లీ గెలుస్తారు. ఆయనే సీఎం అవుతారు. - మహిళ మనోగతం #PublicVoice… pic.twitter.com/q6rvvc3ffA — YSR Congress Party (@YSRCParty) November 8, 2023 పురంధేశ్వరి, బాలకృష్ణకి పోసాని కౌంటర్.. బాలకృష్ణ ఆడవాళ్ళపై దారుణమైన కామెంట్ చేశారు, బాలకృష్ణ ఏం మాట్లాడినా పురుందేశ్వరి మద్దతిస్తుంది, బాలకృష్ణ గన్ కాల్చిన ఘటన జరిగి పదహారేళ్లయింది, బాలకృష్ణకు ఎలాంటి సంస్కారం ఉందో అంతా గమనించాలి, బాలకృష్ణ మానసిక రోగి అంటూ గతంలో కొందరు మాట్లాడారు బాలకృష్ణ ఇంకా మానసిక రోగిగానే ఉన్నారు pic.twitter.com/g7qqwesbfz — YSRCP IT WING Official (@ysrcpitwingoff) November 7, 2023 8:30 AM, Nov 8, 2023 పురంధేశ్వరికి విజయసాయి కౌంటర్ ►పురంధేశ్వరి స్వార్థంతో కూడిన అవకాశవాదం ఎలా ఉంటుందంటే ఒకసారి పోటీ చేసిన ఎంపీ సీటు నుంచి మళ్లీ బరిలోకి దిగరు. ►ప్రజల మనోభావాలను పట్టించుకోరు. ►కాబట్టి రెండోసారి గెలిచే సీన్ లేదు. ►కాంగ్రెస్ టికెట్ పై బాపట్ల, విశాఖపట్నంలో వైఎస్సార్ గారి హవాలో బయటపడ్డారు. ►బీజేపీలో చేరాక రాజంపేట నుంచి పోటీ చేసి లక్షా 75 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు. పురంధేశ్వరి గారి స్వార్థంతో కూడిన అవకాశవాదం ఎలా ఉంటుందంటే ఒకసారి పోటీ చేసిన ఎంపీ సీటు నుంచి మళ్లీ బరిలోకి దిగరు. ప్రజల మనోభావాలను పట్టించుకోరు. కాబట్టి రెండోసారి గెలిచే సీన్ లేదు. కాంగ్రెస్ టికెట్ పై బాపట్ల, విశాఖపట్నంలో వైఎస్సార్ గారి హవాలో బయటపడ్డారు. బిజెపిలో చేరాక రాజంపేట… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 7, 2023 7:45 AM, Nov 8, 2023 సుప్రీంకోర్టులో నేడు క్వాష్ పిటిషన్‌పై తీర్పు? ►స్కిల్ స్కాం కేసులో నేడు అత్యంత కీలక పరిణామం ►స్కిల్ స్కాంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో తీర్పు వెల్లడించే అవకాశం! ►టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. ఇది కూడా చదవండి: స్కిల్ స్కాం కేసులో నేడు అత్యంత కీలకం?! 7:30 AM, Nov 8, 2023 స్కిల్డ్ దొంగ చంద్రబాబే!: సీఐడీ ►టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు ►డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి ►2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో బయటపడ్డ అక్రమం ►అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం ►ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్ కూడా ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసం ►రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం ►ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం ►రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ►ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారని సీఐడీ అభియోగం ►ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు ►ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు ►ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ►చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►కోర్టుల విచారణలో కీలక ఆధారాలను సమర్పించిన సీఐడీ 7:30 AM, Nov 8, 2023 ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రబాబుకి 17ఏ వర్తిస్తుంది: హరీష్ సాల్వే ►చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు ►ఈ కేసులో ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది ►రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉంది ►సెక్షన్ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది ►ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు ►రిమాండ్ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి ►విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది ►మొదట్లో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరులేదు. రిమాండ్ సమయంలో ఆయన పేరు చేర్చారు ►ఈ కేసులో చాలా మంది అధికారులను విచారించామని సీఐడీ చెప్పింది కానీ, ఒక్కరికి కూడా 17ఏ నిబంధన కింద అనుమతి తీసుకోలేదు ►నిబంధనలు పాటించలేదనడానికి ఇదే పెద్ద నిదర్శనం ►న్యాయ సమీక్ష జరిగితే కేసు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి ►జీఎస్టీ చెల్లింపుల విషయాలను ప్రభుత్వానికి ముడిపెడుతున్నారు ►ప్రభుత్వం తరఫున జరిగిన అవినీతిగా చూపుతున్నారు ►దేన్ని దేనితో ముడిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి ►2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఆధారాల కోసం వెతుకుతున్నారు ►ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రబాబుకి 17ఏ వర్తిస్తుంది. 7:15 AM, Nov 8, 2023 17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు: లాయర్ రోహత్గి ►చంద్రబాబు పిటిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు ►అక్టోబర్ 17న బలమైన వాదనలు వినిపించిన రోహత్గి ►స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం తొందరపాటు చర్యేనని రోహత్గి వాదన ►17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది ►17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి ►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు ►స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు ►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది ►అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు ►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు ►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు ►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం ►అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య ►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు ►సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం ►కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు ►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు ►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే ►పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు ►పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం ►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ►ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ►ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు ►స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది ►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు ►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు ►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు ►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు ►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది ►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి ►17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది ►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది ►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? ►స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది ►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది ►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది ►శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ►ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ►ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. ►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. ►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి ►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి ►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది ►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు ►కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు ►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి ►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు 7:10 AM, Nov 08, 2023 బాబు ర్యాలీపై ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదు ►చంద్రబాబు హైదరాబాద్ ర్యాలీ పై జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission of India-ఎన్హెచ్ఆర్సీ)లో కేసు నమోదు ►స్కిల్ స్కాం కేసులో కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు ►హైదరాబాద్ బేగంపేట నుండి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలీ చేపట్టిన బాబు ►బంజారాహిల్స్ రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని పిర్యాదు ►అంబులెన్స్ కు సైతం సైడ్ ఇవ్వకుండా ప్రాణాలతో చెలగాటం ఆడారని పిర్యాదు ►పోలీసులు చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని ఎన్హెచ్ఆర్సీకి పిర్యాదు ►ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు.. కేసు నమోదు 7:00 AM, Nov 08, 2023 అడకత్తెరలో పోకచెక్కలా మారిన పవన్ ►ఏపీలో పవన్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ►టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ ప్రకటించి దాదాపు రెండు నెలలు ►కానీ బీజేపీ మాత్రం జనసేనతోనే మా పొత్తు అని చెప్తోంది. ►మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ చేస్తోంది.. బీజేపీతో కలిసి జనసేన పోటీపడబోతోంది. ►ఈ పిచ్చి పొత్తులు అర్థంకాక జనసైనికులు ఏ జెండాని మోయాలో తెలియక బిక్కచూపులు చూస్తున్నారు. 6:40 AM, Nov 08, 2023 స్కిల్ స్కాం కేసు.. నేడు జడ్జిమెంట్ డే ►స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కీలక పరిణామం ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు తీర్పు ►సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని తొలుత ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ►సెప్టెంబర్ 22వ తేదీన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు ►స్కిల్ స్కాంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ ►తనపై నమోదు అయిన కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ ►ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ చుట్టూరానే తిరిగిన వాదనలు ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-17ఏ పైనే వాడీవేడి వాదనలు ►చంద్రబాబు తరఫున హరీష్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా తదితరుల వాదనలు ►సీఐడీ(ఏపీ ప్రభుత్వం) తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ►తీర్పు వెలువరించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం. 6:35 AM, Nov 08, 2023 గురువారం ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ ►గురువారం సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ ►ఫైబర్‌నెట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఐడీ అభియోగాలు ►టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనం దోపిడీ ►రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారు ►బాబు హయాంలో 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగింది ►2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు ►చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కామ్ ►హెరిటేజ్‌తో సంబంధాలున్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీ ►బ్లాక్ లిస్టులో ఉన్న టెరా కంపెనీకి టెండర్ ►అభ్యంతరం తెలిపిన ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ బదిలీ ►టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగింపు ►ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల ►అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి చేరిక ►ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటు!! ►అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బుల తరలింపు ►నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బు బదిలీ ►ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమకు చేరిక ►పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చివరకు చంద్రబాబు వద్దకు ►ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లే అని సీఐడీ దర్యాప్తులో వెల్లడి -
స్కిల్ స్కాం కేసులో నేడు అత్యంత కీలకం?!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్కిల్‌డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో నేడు అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోనుందా?. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులోనే చంద్రబాబును ఏపీ నేర దర్యాప్తు విభాగం (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్-సీఐడీ) అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 09వ తేదీ నుంచి 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చివరకు.. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఏపీ హైకోర్టు ఈ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని చంద్రబాబు తొలుత ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆ వెంటనే చంద్రబాబు ఆలస్యం చేయకుండా వెంటనే సుప్రీం కోర్టులో తన లాయర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయించారు. తన అరెస్ట్ అక్రమమని, సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని క్వాష్ పిటిషన్ ద్వారా సుప్రీంను అభ్యర్థించారాయన. అయితే అప్పటికే స్కిల్ కేసు కీలక దర్యాప్తు దశలో ఉండడంతో.. ఆ పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. చివరకు ఉత్కంఠకు తెర దించుతూ ఆ పిటిషన్‌ను విచారణకు చేపట్టింది ద్విసభ్య ధర్మాసనం. క్వాష్ పిటిషన్‌పై విచారణ సమయంలో.. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ(అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం) వర్తిస్తుందని ఆయన తరఫు లాయర్లు వాదించారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇది రాజకీయ కక్ష చర్యగా వాదించారాయన. అయితే.. స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదని, పైగా నిజాయితీగల ప్రజాప్రతినిధులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని.. చంద్రబాబుకి ఈ సెక్షన్ వర్తించదని ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య అని, కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదని రోహత్గీ వాదించారు. ఇదీ చదవండి: స్కిల్ స్కాం.. అంతా బాబుగారి కనికట్టు ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. నవంబర్ 20వ తేదీన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు పేర్కొంది. అదే సమయంలో స్కిల్ కేసులో చంద్రబాబు వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ కోరారు చంద్రబాబు లాయర్లు. మరోవైపు ఫైబర్‌నెట్ కేసులో ఇదే బెంచ్ ముందు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే.. స్కిల్ స్కాంలో క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన తర్వాతే ఫైబర్‌నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని బెంచ్ చంద్రబాబు లాయర్లకు స్పష్టం చేసింది. ఫైబర్‌నెట్ పిటిషన్‌ను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసిన కోర్టు.. అదే రోజున స్కిల్ స్కాం పిటిషన్ తీర్పు వెల్లడిస్తామని చెప్పింది. ఈలోపు చంద్రబాబు లాయర్ల విజ్ఞప్తితో నవంబర్ 09కి ఫైబర్‌నెట్ కేసు విచారణ వాయిదా వేసిన ధర్మాసనం.. నవంబర్ 8వ తేదీన(రేపు) చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తామని ఇరుపక్షాలకు తెలిపింది. స్కిల్ స్కాంలో.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసానికి పాల్పడ్డారని, షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి రాగా, 2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో అవినీతి బాగోతం బయటపడింది. అయితే అప్పటికే జీఎస్టీ అధికారులు అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోలేదు. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పింర్పించింది కూడా. మరోవైపు ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురిని అరెస్ట్ చేసింది కూడా. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడి పేరు నమోదు అయ్యింది. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు అయ్యాయి. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసింది.ఆపై ఏసీబీ కోర్టు ఐదు పర్యాయాలు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు ఉన్నారు. అయితే కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. -
Nov 7th : చంద్రబాబు కేసు అప్డేట్స్
Tdp Chandrababu Cases Petitions.. 06:37 PM, Nov7, 2023 బాబు ర్యాలీపై ఎన్హెచ్ఆర్సీలో కేసు నమోదు ►చంద్రబాబు హైదరాబాద్ ర్యాలీ పై జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission of India-ఎన్హెచ్ఆర్సీ)లో కేసు నమోదు ►స్కిల్ స్కాం కేసులో కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు ►హైదరాబాద్ బేగంపేట నుండి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలీ చేపట్టిన బాబు ►బంజారాహిల్స్ రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని పిర్యాదు ►అంబులెన్స్ కు సైతం సైడ్ ఇవ్వకుండా ప్రాణాలతో చెలగాటం ఆడారని పిర్యాదు ►పోలీసులు చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని ఎన్హెచ్ఆర్సీకి పిర్యాదు ►ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది ఇమ్మనేని రామారావు.. కేసు నమోదు 06:08 PM, Nov7, 2023 స్కిల్డ్ దొంగ చంద్రబాబే!: సీఐడీ ►టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు ►డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి ►2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో బయటపడ్డ అక్రమం ►అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం ►ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్ కూడా ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసం ►రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం ►ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం ►రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ►ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారని సీఐడీ అభియోగం ►ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు ►ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు ►ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ►చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►కోర్టుల విచారణలో కీలక ఆధారాలను సమర్పించిన సీఐడీ 05:40 PM, Nov7, 2023 ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రబాబుకి 17ఏ వర్తిస్తుంది: హరీష్ సాల్వే ►చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు ►ఈ కేసులో ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది ►రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకు 17ఏ ఉంది ►సెక్షన్ 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశం ఉంటుంది ►ఆధారాల సేకరణ కూడా సరైన పద్ధతిలో జరుగుతుందన్న నమ్మకం లేదు ►రిమాండ్ రిపోర్టు, కౌంటరు అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి ►విపక్ష నేతలను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోంది ►మొదట్లో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరులేదు. రిమాండ్ సమయంలో ఆయన పేరు చేర్చారు ►ఈ కేసులో చాలా మంది అధికారులను విచారించామని సీఐడీ చెప్పింది కానీ, ఒక్కరికి కూడా 17ఏ నిబంధన కింద అనుమతి తీసుకోలేదు ►నిబంధనలు పాటించలేదనడానికి ఇదే పెద్ద నిదర్శనం ►న్యాయ సమీక్ష జరిగితే కేసు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి ►జీఎస్టీ చెల్లింపుల విషయాలను ప్రభుత్వానికి ముడిపెడుతున్నారు ►ప్రభుత్వం తరఫున జరిగిన అవినీతిగా చూపుతున్నారు ►దేన్ని దేనితో ముడిపెడుతున్నారో అర్థం కాని పరిస్థితి ►2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఆధారాల కోసం వెతుకుతున్నారు ►ఎలాంటి పరిస్థితుల్లోనైనా చంద్రబాబుకి 17ఏ వర్తిస్తుంది. 05:01 PM, Nov7, 2023 17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు: లాయర్ రోహత్గి ►చంద్రబాబు పిటిషన్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో సీఐడీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు ►అక్టోబర్ 17న బలమైన వాదనలు వినిపించిన రోహత్గి ►స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేయడం తొందరపాటు చర్యేనని రోహత్గి వాదన ►17ఏ సెక్షన్ అనేది నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకే వర్తిస్తుంది ►17ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదు ►ఈ కేసులో నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి ►పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు ►స్కిల్ స్కామ్ జరిగిన 2015-16 సమయంలో.. అంటే నేరం జరిగిన సమయంలో 17ఏ సెక్షన్ లేదు ►17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది ►అవినీతి పరులకు ఈ సెక్షన్ రక్షణ కవచం కాకూడదు ►అవినీతి నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికే ఈ సెక్షన్ తెచ్చారు ►నిజాయితీ గల ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే సమయంలో భయం లేకుండా ఉండేందుకు 17-ఏ తెచ్చారు ►ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే 17-ఏ కాపాడుతుందనేది చట్టం ఉద్దేశం ►అరెస్ట్ చేసిన ఐదు రోజులకే క్వాష్ పిటిషన్ వేయడం అత్యంత తొందరపాటు చర్య ►విచారణ చేస్తున్న అధికారులకు కనీసం సమయం ఇవ్వకపోవడం కూడా సరికాదు ►సెక్షన్ 482 ప్రకారం క్వాష్ చేడయం అనేది.. అత్యంత అరుదైన కేసుల్లోనే తీసుకునే నిర్ణయం ►కేసు ట్రయల్ దశలో ఉన్నప్పుడు సెక్షన్ 482 ద్వారా క్వాష్ కోరడం సరికాదు ►గతంలో కొన్ని కేసుల్లో పీసీయాక్ట్ కొట్టేసినా సెక్షన్ 4 ప్రకారం.. ఐపీసీ సెక్షన్లపై స్పెషల్ ట్రయల్ కోర్టు విచారణ కొనసాగించవచ్చు ►ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే ►పీసీ యాక్ట్ వర్తించకపోయినా.. మిగిలిన సెక్షన్లపై విచారించొచ్చు ►పీసీ యాక్ట్ లేకపోయినా.. విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►సగం సెక్షన్లకు ఒక కోర్టులో విచారణ, మరో సగం సెక్షన్లకు మరో కోర్టులో విచారణ అనడం లా కాదు ►ఇలా భావిస్తే.. వ్యవస్థ అపహస్యం అవుతుంది ►ఇది తీవ్రమైన నేరం...విచారణ చేసే అధికారం స్పెషల్ కోర్టుకు ఉంది ►జిల్లా జడ్జికి ఉండే అధికారాలూ స్పెషల్ జడ్జికి కూడా ఉంటాయి ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. చాలా తీవ్రమైన ఆర్థిక నేరం ►ఈ కేసులో 17ఏ వర్తించినా.. మిగిలిన ఐపీసీ సెక్షన్లపై విచారించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉంది ►ఎఫ్ఐఆర్లో కాగ్నిజబుల్ అఫెన్సెస్‌కు సంబంధించిన సెక్షన్లు ఉన్నాయా? లేదా? అనేది ముఖ్యం ►ఈ విషయాన్ని మాత్రమే కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి ►ఈ కేసులో ఎఫ్ఐఆర్ కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు ►స్కిల్ స్కామ్ కేసులో వందల కోట్ల అవినీతి జరిగింది ►పక్కా ఆధారాలతో చంద్రబాబు దొరికారు ►ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ సంస్థలు విచారణ చేస్తున్నాయి ►ఇన్ని విచారణ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? ►ఈ కేసులో ఫొరెన్సిక్ నివేదిక చూస్తే షాక్‌కు గురవుతారు ►రూ. 371కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము ను లూటీ చేశారు ►అధికారులు వద్దని వారించినా.. ఇచ్చేయండి ఇచ్చేయండంటూ ఆదేశాలు జారీచేశారు ►మొత్తంగా ఈ కేసు 482సెక్షన్ కింద క్వాష్ చేయాలా? వద్దా? అనే నిర్ణయాధికారం తీసుకునే కేసు ►ఇది ఏదో ఇద్దరు గల్లా పట్టుకుని కొట్టుకున్న కేసు కాదు ►ఇది చాలా తీవ్రమైన ఆర్ధికనేరానికి సంబంధించి కేసు ►నేరం జరిగిందనే ప్రాథమిక ఆధారాలు ఉన్న కేసుల్లో... సెక్షన్ 482 కింద క్వాష్ చేయకూడదని ఎంఆర్ షా తీర్పు ఉంది ►సెక్షన్ 482కింద క్వాష్ అనేది చాలా అరుదైన కేసుల్లో మాత్రమే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి ►17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ► 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది ►2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది ►2018 జులై కంటే ముందు నేరం జరిగింది కాబట్టి 17ఏ అనేది ఈ కేసులో వర్తించదు ►2015-16లో లేని చట్టం అనేది అప్పుడు జరిగిన నేరానికి ఎలా వర్తిస్తుంది? ►స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు అవసరం ►ఒక వ్యక్తి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదయింది ►ఒక వేళ కోర్టు ఆ సెక్షన్లు తొలగించాలనుకుంటే.. మిగతా సెక్షన్ల కింద కేసు కొనసాగుతుంది ►గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇది ►శాసనవ్యవస్థ ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని దుర్వినియోగం చేసిన కేసు ఇది. అందుకే సెక్షన్ 44 PMLA పెట్టారు ►ఏసీబీ కోర్టుకు (ప్రత్యేక కోర్టు)కు కచ్చితమైన పరిధి ఉంది. ►ఎప్పుడయితే వేర్వేరు సెక్షన్ల కింద నమోదయిన నేరాలన్నీ ఒక అంశంలో నమోదయి ఉంటే.. ప్రత్యేక కోర్టుకు అధికారం ఉంటుంది. ►ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్షకూడా వేయవచ్చు. ►అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలున్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుంది. ►జీఎస్టీ,ఆదాయపన్నుతో పాటు మరికొన్ని విభాగాలు కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయి ►నేరం జరిగిందా లేదా..ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా.. అంతవరకే పరిమితం కావాలి ►అవినీతి నిరోధక,సాధారణ కేసుల్లోనూ అదే పోలీసులు విచారణ చేస్తారు ►ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారు? ►ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. 17ఏ అనేది హైబ్రిడ్ సెక్షన్..అవినీతిపరులకు ఇది రక్షణ కాకూడదన్నదే నేను చెప్పేది ►రాఫేల్ కేసులో వేసిన రివ్యూ పిటిషన్‌ను బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు డిస్మిస్ చేశారు ►కాని మరో జడ్జ్ తీర్పును అంగీకరిస్తూనే 17ఏ కీలక వ్యాఖ్యలు చేశారు ►రాఫెల్ కేసులో 17ఏపై జస్టిస్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవి ►కోర్టు విచారణకు ఆదేశించిన కేసుల్లో 17ఏ అనేది వర్తించదు 04:45 PM, Nov7, 2023 స్కిల్ స్కాం కేసు.. రేపు జడ్జిమెంట్ డే ►స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో రేపు కీలక పరిణామం ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపే తీర్పు ►సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని తొలుత ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ►సెప్టెంబర్ 22వ తేదీన క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు ►స్కిల్ స్కాంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ ►తనపై నమోదు అయిన కేసు కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ ►ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ చుట్టూరానే తిరిగిన వాదనలు ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-17ఏ పైనే వాడీవేడి వాదనలు ►చంద్రబాబు తరఫున హరీష్‌సాల్వే, సిద్ధార్థ లూథ్రా తదితరుల వాదనలు ►సీఐడీ(ఏపీ ప్రభుత్వం) తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ►తీర్పు వెలువరించనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం 4:03 PM, Nov7, 2023 దొంగ ఓట్లపై దొంగాట ఆడుతుందెవరు? ►పక్కా ప్లాన్ ప్రకారం దొంగ ఓట్లంటూ తెలుగుదేశం, పచ్చమీడియా ప్రచారం ►ఇటీవల దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు అంటూ CECకి ఫిర్యాదు చేసిన టిడిపి నేతలు ►పలు చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒక అడ్రస్ లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడితో చాలా ఓట్లు ఉన్నాయంటూ ఫిర్యాదు ►ఇదే విషయంపై దర్యాప్తులో బయటపడుతున్న అసలు నిజాలు ►టిడిపి నేతలు బలంగా ఉన్న చోట బోలెడు బోగస్ ఓట్లు ►ఇలాంటి ఓట్లను తొలగిస్తుంటే, అక్రమంగా టీడీపీ ఓట్లు తీసేస్తున్నారంటూ పచ్చమీడియా గగ్గోలు ►నిజమైన వ్యక్తుల ఓట్లు ఒక వేళ పోతే, ఆన్లైన్లో ధృవపత్రాలు పెట్టి మళ్లీ ఓటు పొందే అవకాశం ►అయినా బోగస్ ఓట్లు ఉండాలంటూ పచ్చమీడియా గగ్గోలు ►దొంగాట ఆడేది, గగ్గోలు పెట్టేది రెండూ టిడిపికి సంబంధించిన వాళ్లే 3:30 PM, Nov7, 2023 బీజేపీని పవన్ కళ్యాణ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ►తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండబోదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన బీజేపీ ►ఏపీలో కూడా పొత్తు విషయంలో ఆసక్తి కనబరచని బీజేపీ ►అయినా టీడీపీతో బీజేపీ పొత్తు కోసం నానా తంటాలు పడుతోన్న పవన్ ►మీ కోసం ఏమైనా చేస్తా.. టిడిపితో పొత్తు పెట్టుకోవాలని బీజేపీని అడుగుతోన్న పవన్ ►మీరు పొత్తు ప్రకటించకపోతే నేనేళ్లి పోతానంటున్న పవన్ ►పవన్ కళ్యాణ్‌ను అంత నమ్మదగ్గ పార్ట్నర్గా అంగీకరించని బీజేపీ ►ఏపీలో ఈ సారి టిడిపితో పొత్తు పెట్టుకోకుంటే.. బీజేపీతో కలిసి పవన్ ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతారని అంచనా ►అదే విషయాన్ని పవన్‌తో ప్రధాని మోదీ చెప్పారంటున్న బీజేపీ నేతలు ►అయినా టిడిపితో పొత్తు కావలంటూ బీజేపీపై పవన్ ఒత్తిడి తెస్తున్నారంటున్న నేతలు ►అసలు పవన్‌కు సీన్ ఎంత ఉంది? ఎంత మంది ఓట్లేస్తారు? ►సినిమా ఇమేజ్ వేరు, నిజ జీవితం వేరు? పవన్‌ను అనవసరంగా నమ్ముతున్నామా? ►సొంతంగా ఎమ్మెల్యే కాలేకపోయారు? మనకు ఓట్లేమీ తెస్తారు? (చిరకాల మిత్రులు పవన్, బాబు) 3:04 PM, Nov7, 2023 మాట్లాడితే వ్యవస్థలంటారు.. మరి మీరు చేసిందేంటీ? ►కేసులు పెట్టించుకుంటే 48 గంటలలో హైకోర్టు నుంచి బెయిల్ ఇప్పిస్తానని చెప్పింది లోకేష్ కాదా? ►ఆలయాలపై దాడులు చేసి, తిరిగి ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసి అశాంతి సృష్టించడానికి యత్నించింది టీడీపీ, జనసేన కాదా? ►అంగళ్లులో రెచ్చిపోయి కార్యకర్తలతో పోలీసులపై దాడులు చేయించింది చంద్రబాబు కాదా? ►పవన్ కళ్యాణ్ కాని, చంద్రబాబు నాయుడు కాని, లోకేష్ కాని తమ సభలలో ఎలా ప్రజలను రెచ్చగొట్టలేదా? ►ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి మీటింగ్‌లు పెట్టింది చంద్రబాబు కాదా! ►కందుకూరులో జరిగిన తొక్కిసలాటకు కాని, గుంటూరు తొక్కిసలాటకు కాని, తద్వారా పదకుండు మంది మరణానికి గాని కారణం టీడీపీ కాదా? ►వాటినన్నిటిని సమర్ధించే దుస్థితికి పవన్ కళ్యాణ్ చేరుకోవడం కనిపించడం లేదా ►వలంటీర్ల మొదలు ఎవరిని పడితే వారిని పవన్ నోటికి వచ్చినట్లు దూషించడం సరైన చర్యా! పైగా ప్రభుత్వంపై ఆరోపణా? 2:40 PM, Nov7, 2023 22కు వాయిదా ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 22కు వాయిదా ►విచారణను ఈనెల 22కు వాయిదా వేసిన హైకోర్టు ►మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల స్ఫూర్తిని పాటిస్తామన్న అడ్వకేట్ జనరల్ ►తొందరపాటు చర్యలు తీసుకునే ఉద్దేశం లేదని హామీ ఇచ్చిన ఏజీ 1:50 PM, Nov7, 2023 సోనియా, రాహుల్, బాబు.. చాలా క్లోజ్ ►కొన్నాళ్లుగా కాంగ్రెస్ అధిష్టానంతో అత్యంత సన్నిహితంగా చంద్రబాబు ►ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారును కాపాడిన చంద్రబాబు ►నాడు సభలో బలం లేకపోయినా.. చంద్రబాబు సహకారంతో నిలబడ్డ కాంగ్రెస్ సర్కారు ►సోనియా ఆదేశాలతో శంకర్రావు వేసిన కేసులో తన వాళ్లను ఇంప్లీడ్ చేసిన చంద్రబాబు ►2019కి ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కోసం కృషి చేసిన చంద్రబాబు ►పదవి పోయిన తర్వాత కూడా అదే ధోరణిని కంటిన్యూ చేసిన చంద్రబాబు ►కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో కుమ్మక్కై ఏపీకి పరిశ్రమలే రాకుండా చేసిన చంద్రబాబు ►ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు పోటీకి టిడిపిని దూరం పెట్టిన చంద్రబాబు ►చంద్రబాబుకు హైదరాబాద్‌లో అంత ప్రజాభిమానం ఉందనుకుంటే టీడీపీ ఇప్పుడు ఎందుకు పోటీచేయడం లేదు? ►సమాధానం ఒక్కటే.. కాంగ్రెస్ గెలవాలన్నదే చంద్రబాబు లక్ష్యం 1:32 PM, Nov7, 2023 తెనాలి సభతో తేటతెల్లం ►ఇన్నాళ్లు కాపు ఓటర్లు అధికమంటూ తెనాలిపై ముద్ర ►పవన్ కళ్యాణ్ అవవనిగడ్డలో జరిపిన సభకు హాజరైన జనం కంటే వైసీపీ సామాజిక సాధికార యాత్రకే జనం అధికం ►ప్రజలు కులాన్నికాదు, సంక్షేమం, అభివృద్ధిని చూస్తారని నిరూపించిన ఘటన ఇది ►కులం పేరుతో ఓటర్లను విభజించొద్దని ప్రజలు ఇచ్చిన సందేశం ఇది 1:25 PM, Nov7, 2023 కాపులను తీసుకెళ్లి TDPకి సరెండర్ చేయాలన్నది పవన్ ప్లాన్ : YSRCP ►పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు ►ఇన్నాళ్లు కాపులు సీఎం కావాలని పిలుపునిచ్చారు ►ఇప్పుడు చంద్రబాబుకు మద్ధతంటూ పొత్తు పెట్టుకున్నారు ►ఇప్పటివరకు కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న ప్రాంతాలలోనే వారాహి యాత్రలు చేశారు ►ఇప్పుడు మీరంతా టిడిపికి మద్ధతివ్వాలని ఎలా చెబుతారు? ►జనసేనను టీడీపీకి, చంద్రబాబుకు సరెండర్ చేయడమేనా పవన్ ప్లాన్? ►కాపు వర్గానికి కూడా సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న స్కీములపై ఏమంటారు? ►మీ రాజకీయ ప్రయోజనాల కోసమా కాపులతో ఆటలు? 1:37PM, Nov7, 2023 స్కిల్ స్కాం అప్డేట్స్ ►స్కిల్ స్కాం కేసులో భాస్కర్ ప్రసాద్‌కు బెయిల్! ►బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ అభయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ►సీమెన్స్ సంస్థ డైరెక్టర్ గా ఉండి ప్రాజెక్టు వ్యయం పెంచారని గతంలో సీఐడీ కేసు ►భాస్కర్ ప్రసాద్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు ►దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన భాస్కర్ ప్రసాద్ 1:35PM, Nov7, 2023 ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ►ఇసుక పాలసీపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ►ఇసుక కుంభకోణంలో ఏ2గా ఉన్న చంద్రబాబు 1:26PM, Nov7, 2023 మరి గవర్నర్‌కు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు? ►చంద్రబాబు తప్పు చేయలేదని గవర్నర్‌కు ఎందుకు బలంగా చెప్పలేదు? ►చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ►చంద్రబాబు పీఏ శ్రీనివాస్ చౌదరీ అమెరికా పారిపోయిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ►అమరావతి పేరిట భ్రమరావతిని గ్రాఫిక్స్‌లో సృష్టించామని ఎందుకు చెప్పలేదు? ►సింగపూర్ ప్రభుత్వం అని ప్రచారం చేసి ప్రైవేట్ వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఎందుకు చెప్పలేదు? ►ఫైబర్‌గ్రిడ్ పేరుతో వందల కోట్ల రుపాయలు పక్కదారి పట్టిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ►స్కిల్ స్కాంలో 13 సంతకాలు పెట్టి ఆగమేఘాల మీద చంద్రబాబు నిధులు విడుదల చేయించారని ఎందుకు చెప్పలేదు? 1:25PM, Nov7, 2023 ఏపీ గవర్నర్‌ను కలిసిన నారా లోకేష్ ►8 పేజీల వినతి పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించిన టీడీపీ ►మాపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని గవర్నర్‌కు వివరణ ►నా యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి కేసులు పెట్టారు ►మా పార్టీ టీడీపీ లెక్కలు అడుగుతున్నారు ►2014 నుంచి ఎవరెవరు ఫండ్స్ ఇచ్చారో చెప్పాలంటున్నారు 1:24PM, Nov7, 2023 ►ఆస్పత్రిలో చంద్రబాబుకు ముగిసిన చికిత్స ►కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేసిన ఎల్వీ ప్రసాద్ వైద్యులు ►2 గంటల పాటు చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ సర్జరీ ►ఆస్పత్రి నుంచి ఇంటికి చంద్రబాబు నాయుడు 1:22PM, Nov7, 2023 ►ఎల్లుండి(గురువారం) సుప్రీంకోర్టులో చంద్రబాబునాయుడు ఫైబర్ నెట్ స్కామ్ కేసు విచారణ ►జస్టిస్ అనిరుధ్ బోస్ కోర్టు లో 11 వ నెంబర్ ఐటెంగా లిస్ట్ అయిన కేసు ►ఫైబర్ నెట్ స్కాంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు ►చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఏపీ హైకోర్టు ►హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసిన చంద్రబాబు ►విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్ , జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ►స్కిల్ స్కాం కేసులో తాము తీర్పు ఇచ్చేవరకు ఆగాలని, గత విచారణలో సూచించిన సుప్రీంకోర్టు ►ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని సిఐడి అభియోగాలు ►చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ టేరా సాప్ట్ కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ►బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టడం పై అవినీతి ఆరోపణలు 1:00 PM, Nov 7, 2023 ఐఆర్ఆర్ కేసుపై విచారణ వాయిదా ►ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా ►ఈ నెల 22కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ►ఈ నెల 22 వరకు చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పిన ఏజీ ►ఏజీ హామీని రికార్డ్ చేసి కేసును వాయిదా వేసిన న్యాయమూర్తి 12:50 PM, Nov 7, 2023 ఏపీ గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు ►ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన నారా లోకేశ్, టీడీపీ నేతలు ►చంద్రబాబుపై నమోదైన కేసుల గురించి వివరణ 12:40 PM, Nov 7, 2023 ఏపీలో నకిలీ ఓట్ల వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు ►ఏపీలో నకిలీ ఓట్ల వ్యవహారంలో కీలక పరిణామం ►విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ►ఏపీలో దొంగ ఓట్లపై సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ పిటిషన్ ►గతంలో ఏపీ హైకోర్టు సీజేగా పనిచేసినందున కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నామన్న జస్టిస్ మిశ్రా 12:30 PM, Nov 7, 2023 కంటి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి చంద్రబాబు ►ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చంద్రబాబు ►కంటి ఆపరేషన్ చేయించుకోనున్న చంద్రబాబు 8:55 AM, Nov 7, 2023 ►ఎన్టీఆర్‌గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి! ►ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి...పాపం! ►73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే. ►ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా ! ఎన్టీఆర్ గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి! ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపి...పాపం! 73 ఏళ్ల వయస్సులో… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 7, 2023 8:54 AM, Nov 7, 2023 పురందేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ ►పురందేశ్వరి గారు...కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు. ►నదులన్నీ సముద్రంలో కలిసినట్లు..మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే ►మీ అంతిమ లక్ష్యం కుల "ఉద్దారణే" ►మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు... స్వార్థం తప్ప. ►ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం. పురందేశ్వరి గారు... కులం, కుటుంబం చుట్టే మీ రాజకీయాలు. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు...మీ ప్రతి కదలిక, ఆలోచన అంతా స్వార్ధ ప్రయోజనాలే. మీ అంతిమ లక్ష్యం కుల "ఉద్దారణే". మీకు సిద్దాంతం, విధానం, ప్రవర్తన, వ్యక్తిత్వం, సమాజహితం, మంచి, స్నేహం, ధర్మం, న్యాయం ఏమీ లేవు...స్వార్థం తప్ప.… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 7, 2023 7:37 AM, Nov 7, 2023 నేడు ఏపీ హైకోర్టులో ఐఆర్ఆర్ కేసు విచారణ ►చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ ►గత విచారణలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు ►చంద్రబాబుకు నేటి వరకూ మధ్యంతర బెయిల్ ►గత విచారణలో ఏసీబీ కోర్టులో విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్‌పై ఇవాల్టి వరకూ స్టే ఇచ్చిన హైకోర్టు ►ఇవాళ(నవంబర్7, మంగళవారం) ఇదే కేసులో హైకోర్టు విచారణ 7:34 AM, Nov 7, 2023 విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ►‘ఫైబర్‌నెట్’ నిందితుల ఆస్తుల అటాచ్‌కు అనుమతివ్వండి ►ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని నిన్న(సోమవారం)పిటిషన్ ఫైబర్‌నెట్ కేసులో అటాచ్‌కు నిర్ణయించిన ఆస్తుల వివరాలు ఇవి ►నిందితుడు కనుమూరి కోటేశ్వరరావు పేరిట గుంటూరులో ఉన్న 797 చ.అడుగుల ఇంటి స్థలం, ఆయన డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్ ఫైబర్ సొల్యూషన్స్‌కు విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్లో ఉన్న ఓ ఫ్లాట్. ►మరో నిందితుడు టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ టి.గోపీచంద్ పేరిట హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్ ►శ్రీనగర్ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్లు, యూసఫ్‌గూడలో ఉన్న ఫ్లాట్, ఆయన భార్య పవనదేవి పేరిట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి. 7:10 AM, Nov 7, 2023 నేడు చంద్రబాబుకు కంటి ఆపరేషన్ ► నేడు LV ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి ఆపరేషన్ ► సోమవారం AIG ఆస్పత్రిలో చికిత్సలు ► వైద్య పరీక్షలు చేయించుకుని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు 7:05 AM, Nov 7, 2023 పార్టీ సీనియర్ల తీరుపై చంద్రబాబు గుర్రు ► జైల్లో 52 రోజులుంటే పార్టీని ఎవరూ పట్టించుకోలేదని బాబు ఆవేదన ► దిక్కు, దివానం లేకుండా పార్టీని వదిలేశారని ఆవేదన ► కలవడానికి వచ్చిన సీనియర్లపై తీవ్ర ఆగ్రహం ► తాను జైల్లో ఉంటే పార్టీ పని అయిపోయిందన్న సీను ఎలా వచ్చిందని ప్రశ్నలు ► రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ నామమాత్రం ఆందోళనలతో సరిపెట్టారని ఆగ్రహం ► విడుదలైన తర్వాత అప్పటికప్పుడు జనసమీకరణ చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన. 7:00 AM, Nov 7, 2023 పురంధేశ్వరికి విజయసాయి కౌంటర్ ►స్వార్థం, కపటం పురంధేశ్వరి సహజ అభరణాలు. ►టీడీపీతో పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారు. ►బంధుత్వం మాటున ఆమె రహస్య ఎజెండా ఏమిటంటే బావ చంద్రబాబు గారి సహాయంతో ఎంపీగా గెలిచి బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారు. ►అందుకే ఆయనపై ఈగ కూడా వాలకుండా విసనకర్ర ఊపుతున్నారు. స్వార్థం, కపటం పురంధేశ్వరి సహజ అభరణాలు. టీడీపీతో పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారు. బంధుత్వం మాటున ఆమె రహస్య ఎజెండా ఏమిటంటే బావ చంద్రబాబు గారి సహాయంతో ఎంపీగా గెలిచి బిజెపి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారు. అందుకే ఆయనపై ఈగ కూడా వాలకుండా… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023 6:50 AM, Nov 7, 2023 బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP -
ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై నమోదైన ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన చంద్రబాబు నాయుడి సన్నిహితుల ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర సీఐడీ విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ ఇప్పటికే ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సీఐడీ సోమవారం ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్లోనూ ఫైబర్ నెట్ కుంభకోణం నిందితులకు సంబంధించిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాలని కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది. సీఐడీ ప్రతిపాదనల్లో ఉంది ఏంటంటే.. ►తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు ►నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు. ►మొత్తంగా అటాచ్ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి. హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో సీఐడీ ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేసింది. -
Nov 6th: చంద్రబాబు కేసు అప్డేట్స్
TDP Chandrababu Naidu Cases Updates 05:17 PM, Nov 6, 2023 తెలంగాణలో టీడీపీ.. మరొకరు అవుట్ ►తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి బిల్డర్ ప్రవీణ్ రాజీనామా ►గత 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని కోల్పోయిన మాకు కనీసం ఎవరు వస్తున్నారన్న సమాచారం కూడా తెలవడం లేదు ►హైదరాబాదుకు లోకేష్ బాబు అయినా గాని బాలకృష్ణ గాని ఎవరు వచ్చినా కనీసం సమాచారం తెలవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేసుకున్న బిల్డర్ ప్రవీణ్ ►తన రాజీనామాని ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబు నాయుడుకు పంపుతున్నట్టు తెలిపిన బిల్డర్ ప్రవీణ్ 04:20 PM, Nov 6, 2023 బాలకృష్ణకు అర్థం కావడానికి ఆలస్యమవుతోందా? ► కుటుంబసభ్యులపైనే చాణక్య నీతిని ప్రదర్శిస్తోన్న చంద్రబాబు ► అరెస్టయినపుడు రెండు రోజులు బాలకృష్ణ హడావిడి చూసి అర్జంటుగా ప్లాన్ మార్చిన బాబు ► ఇప్పటికిప్పుడు తెలంగాణకు వెళ్లి పార్టీని గెలిపించాలని బాలకృష్ణకు అసైన్మెంట్ ► బావ ఆదేశాలు అర్థం కాక.. తలపట్టుకుని హైదరాబాద్ వచ్చిన బాలకృష్ణ ► ఆ వెంటనే భీకర ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో అధికారంలోకి వస్తున్నామని ప్రకటించిన బాలకృష్ణ ► నెల గడవకముందే బాలకృష్ణ స్టేట్మెంట్ను చెత్తబుట్టలో వేసేసిన బాబు ► అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీనే చేయబోవడం లేదని పార్టీ ప్రకటన ► బాబుకు ముందే ఇవన్నీ తెలిసి మరీ బాలకృష్ణను తెలంగాణకు పంపారని పార్టీలో చర్చ ► లోకేష్‌కు ఎలాంటి కష్టం రాకుండా అన్ని అడ్డంకులు తొలగించే పనుల్లో చంద్రబాబు 04:05 PM, Nov 6, 2023 అచ్చెన్నకు వెన్నుపోటేనా? ► తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై అనుమానపు చూపులు ► అచ్చెన్నను తప్పిస్తారని పార్టీలో విస్తృత ప్రచారం ► ఇప్పటికే పార్టీ లేదు.. xx లేదు అంటూ ప్రకటనలు చేసి కెమెరాలకు చిక్కిన అచ్చెన్న ► పైకి చేస్తున్న ప్రకటనలు వేరు, అంకిత భావం వేరంటున్న చంద్రబాబు కోటరీ ► అర్జంటుగా అచ్చెన్నను పక్కనబెట్టి లోకేష్‌కు ఆ బాధ్యతలు ఇవ్వాలంటున్న కోటరీ ► లోకేష్ అయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి బెటర్ అంటోన్న కోటరీ ► ఎలాగూ తెలంగాణలో పోటీ చేయడం లేదు, పార్టీకి తెలంగాణలో చోటు కూడా లేదు ► జాతీయ హోదా ఉండదు కాబట్టి, ఏపీలోనే మార్పులు చేసుకోవాలంటున్న బాబు వర్గీయులు 03:45 PM, Nov 6, 2023 మ్యానిఫెస్టోపై టిడిపి, జనసేన మల్లగుల్లాలు ► మ్యానిఫెస్టోపై మొన్న పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు సుదీర్ఘ మంతనాలు ► ఏం చేద్దాం? మన దగ్గర ఉన్న వాగ్దానాలేంటీ? ► ఇన్నాళ్లు సర్కారు చేస్తోన్న సంక్షేమాన్ని తప్పుబట్టాం కదా? ఇప్పుడేం చెబుదాం? ► సంక్షేమం వల్ల శ్రీలంక అయిపోతుందన్నాం కదా.. ఇప్పుడు మనం మాటెలా మార్చుదాం? ► ఇప్పటికే మాట నిలబెట్టుకోలేమన్న పేరుంది, అదెలా పోగోడదాం? ► ఏమని చెబితే జనం నమ్ముతారు? ఎలా చెప్పి వారిని నమ్మించాలి? ► ఇప్పుడు అమలవుతున్న పథకాలను ఎలా తప్పుబడదాం? ► అసలు మ్యానిఫెస్టో ఇప్పుడే ఎందుకు ప్రకటించాలి? ► అనవసరంగా మ్యానిఫెస్టో ప్రస్తావన తెచ్చి ఇబ్బంది పడుతున్నామా? ► కర్ణాటకలో కాంగ్రెస్ ఇస్తోన్న పథకాలు మన దగ్గర పని చేస్తాయా? ► తెలంగాణలో జనం కాంగ్రెస్ పథకాల మీద ఆసక్తి చూపిస్తున్నారా? 03:30 PM, Nov 6, 2023 లూథ్రా గారు మీరే చెప్పండి? ► సమన్వయ సమావేశాలకు హాజరయితే కోర్టు షరతులను ఉల్లంఘించినట్టవుతుందా? ► కోర్టు షరతులను ఎలా ఉల్లంఘించాలి? సాంకేతికంగా ఎంతవరకు ముందుకెళ్లొచ్చు ► సమన్వయ కమిటీ సమావేశాలకు నేరుగా వెళ్తే కోర్టు తప్పుపడుతుందా? ► ఒకవేళ వీడియో కాన్ఫరెన్స్ మోడ్‌లో హాజరు కావొచ్చా? ► రాజకీయ చర్చలు జరిపితే ఆంక్షలు ఉల్లంఘించినట్టా? ► సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రాతో చంద్రబాబు సుదీర్ఘ చర్చలు (ఫైల్ ఫోటో : లూథ్రాతో చంద్రబాబు, లోకేష్) 03:20 PM, Nov 6, 2023 సమన్వయానికి హాజరు కావొచ్చా? లేదా? ► మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు తహతహ ► సమన్వయ కమిటీ సమావేశాలకు అర్జంటుగా వెళ్లాలని ఆరాటపడుతోన్న చంద్రబాబు ► తాను వెళ్లకపోతే.. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనలో చంద్రబాబు ► తెలుగుదేశం పార్టీ తరపున లోకేష్ మాట అంతగా వెళ్లట్లేదన్న భావనలో పార్టీ సీనియర్లు ► ఇలాగే ఉంటే.. జనసేనకు 50 సీట్లు ఇవ్వాల్సి వస్తోందన్న ఆందోళనలో చంద్రబాబు ► తాను వెళితేనే పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవచ్చన్న ఆలోచనలో చంద్రబాబు ► జనసేనను ఎంత వరకు పరిమితం చేయాలి? తమకు అవకాశం లేని సీట్లను ఎలా అప్పగించాలి? ► జనసేన తరపున కూడా టిడిపి లీడర్లనే ఎలా పోటికి దింపాలి? ► తమ వాదనకు అనుకూలంగా ఎలాంటి సర్వేలను తెర మీదికి తీసుకురావాలి? ► 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవాన్ని రాజకీయం కోసం ఎలా వాడాలి? 03:15 PM, Nov 6, 2023 మళ్లీ సమన్వయ సమావేశం ► టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ రెండో సమావేశానికి వేదిక ఖరారు ► ఈ నెల 9న టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమన్వయ కమిటీ రెండో భేటీ ► ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పనపై చర్చ 03:05 PM, Nov 6, 2023 కోవర్టు కాదు : పురందేశ్వరీ ► నేను చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి కోవర్టును కాను ► విధానపరమైన లోపాలను ఎత్తి చూపితే టీడీపీ కోవర్టు అంటారా? ► ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి : పురందేశ్వరీ 02:45 PM, Nov 6, 2023పవన్ ఎప్పటికీ CM కాలేరు : నారాయణ స్వామి ► పవన్ కళ్యాణ్ పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్ ► పవన్ కళ్యాణ్ జీవితంలో సీఎం కాలేరు ► టీడీపీ, జనసేన కు డిపాజిట్ రాదు ► పవన్ కళ్యాణ్ కులాలను రెచ్చగొడుతున్నారు ► బాబు అవినీతి పురంధేశ్వరి కి కనిపించదా ? : డిప్యూటీ సీఎం నారాయణస్వామి 02:30 PM, Nov 6, 2023 ఇంటికి బాబు, రేపు ఆపరేషన్ ► AIG ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి చంద్రబాబు ► వైద్య పరీక్షలు చేయించుకుని తన నివాసానికి చేరుకున్న చంద్రబాబు ► రేపు LV ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి ఆపరేషన్ 02:00 PM, Nov 6, 2023 అటాచ్మెంట్ కోసం పిటిషన్ ► ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ కోసం CID పిటిషన్ ► ACB కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ► చంద్రబాబు సన్నిహితులకు చెందిన 7 ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి కోరుతూ ACB కోర్టులో ఏపీ CID పిటిషన్ ► చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు సీఐడీ ప్రతిపాదన ► CID ప్రతిపాదనకు ఇప్పటికే అనుమతి ఇస్తూ హోంశాఖ ఉత్తర్వులు ► ACB కోర్టు అనుమతిస్తే అటాచ్ మెంట్ ప్రక్రియ మొదలుపెట్టనున్న CID 01:30 PM, Nov 6, 2023 పార్టీ సీనియర్ల తీరుపై చంద్రబాబు గుర్రు ► జైల్లో 52 రోజులుంటే పార్టీని ఎవరూ పట్టించుకోలేదని బాబు ఆవేదన ► దిక్కు, దివానం లేకుండా పార్టీని వదిలేశారని ఆవేదన ► కలవడానికి వచ్చిన సీనియర్లపై తీవ్ర ఆగ్రహం ► తాను జైల్లో ఉంటే పార్టీ పని అయిపోయిందన్న సీను ఎలా వచ్చిందని ప్రశ్నలు ► రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ నామమాత్రం ఆందోళనలతో సరిపెట్టారని ఆగ్రహం ► విడుదలైన తర్వాత అప్పటికప్పుడు జనసమీకరణ చేసుకోవాల్సి వచ్చిందని ఆవేదన 12:30 PM, Nov 6, 2023 ఎవరి పథకం? తెలుగుదేశం ఒక్కరిదేనా? జనసేనకు కూడా పొత్తుందా? ► హఠాత్తుగా 3 సిలిండర్ల పథకం ప్రకటించిన తెలుగుదేశం ► మాటమాత్రంగా చెప్పకుండా ప్రకటించారంటున్న జనసేన నేతలు ► మూడు సిలిండర్లు ఇస్తామన్న వాగ్దానాన్ని జనమెలా నమ్ముతారంటున్న జనసేన ► పైగా అందులో అంతగా ఆకట్టుకునే అంశమేముందని ప్రశ్న ► జైలు ముందు పొత్తు ప్రకటించిన పవన్‌ను కనీసం బ్యానర్లలోనైనా పెట్టుకోరా అంటోన్న జనసేన నేతలు 12:00 PM, Nov 6, 2023 పురంధేశ్వరికి స్ట్రాంగ్ కౌంటర్ ►పురంధేశ్వరి.. మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. ►రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి.. అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ►బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్‌గా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడా మిమ్మల్ని తీసేసారు. ►దీంతో కష్టపడి పిత్రార్జితంగా మీకు వాటా వున్న టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే.. ►మీ ఎఫెక్ట్ తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ►పాపం! రెచ్చగొడుతున్న కొందరు కులపెద్దల చేతిలో ఇరుక్కుని మీరు వ్యక్తం చేస్తున్న ఫ్రస్ట్రేషన్ కాలమే సమాధానం చెబుతుంది. 1/2: చూడు చిన్నమ్మా...పున్నమ్మా...పురందేశ్వరి! మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి...అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్ గా అట్టర్… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023 11: 47AM, Nov 6, 2023 ►ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్ పై నేడు సీఐడీ పిటిషన్ ►ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్న ఏపీ సీఐడీ ►చంద్రబాబు సన్నిహితులకు చెందిన 7 ఆస్తుల అటాచ్ మెంట్‌కు సీఐడీ ప్రతిపాదన ►సీఐడీ ప్రతిపాదనకు ఇప్పటికే అనుమతి ఇస్తూ హోంశాఖ ఉత్తర్వులు 11:45AM, Nov 6, 2023 ►గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు, మళ్లీ వైద్య పరీక్షలు ►రెండు రోజుల కింద సమగ్ర వైద్య పరీక్షలు, ఆ పరీక్షలకు కొనసాగింపుగా ఇవ్వాళ మరోసారి పరీక్షలు 11:40AM, Nov 6, 2023 ►ఈ నెల 9న జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ భేటీ ►ఉమ్మడి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని నిర్ణయం ►ఉమ్మడి పోరాటం, ఉమ్మడి మేనిఫెస్టో క్షేత్రస్థాయి నుంచి సమన్వయం వంటి మూడు అంశాలపై ప్రధానంగా చర్చ ► చంద్రబాబుపై వరుస కేసులు వంటి అంశాలపై భేటీలో చర్చ 11:30AM, Nov 6, 2023 ►టీడీపీ కేంద్ర కార్యాలయంలో భేటీకానున్న టీడీపీ-జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ ►రెండు పార్టీల నుంచి హాజరుకానున్న ఆరుగురు సభ్యులు 10:50 AM, Nov 6, 2023 చంద్రబాబు, పవన్‌లపై మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజం ►పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు తోడు దొంగలు ►2014లో పవన్ మద్దతు ఇచ్చి చంద్రబాబు ని నెగ్గింఛానని చెప్పాడు. తరువాత టీడీపీ నాయకులు అతని వల్ల మేము గెలవడం ఏంటని నానా మాటలు అన్న సంగతి మరచిపోయావ్. ►ఏ మొహం పెట్టుకొని ఉమ్మడి మ్యానిఫెస్టో పెడుతున్నారు. ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? ►చంద్రబాబుని దొంగగా కోర్టు నిర్దారిస్తే జైలుకు వెళ్లి పవన్ కాళ్ళు పట్టుకున్నాడని సామాజిక వర్గం మొత్తం సిగ్గు పడ్డ పరిస్థితి. ►పవన్ ని నమ్మి ప్రజలు ఎలా ఓటు వెయ్యాలి? ►చంద్రబాబు ఇంతవరకు ఎవరినైనా వాడుకుని వదిలేయకుండా ఉన్నాడా? అందరిని వెన్నుపోటు పొడిచిన నాయకుడు చంద్రబాబు. ►మోసానికి, ద్రోహానికి పేటెంట్ తీసుకున్న చంద్రబాబుతో పవన్ ఉమ్మడి మేనిఫెస్టో రెడీ చేస్తున్నాడు అనడం ఎంత దారుణం. ►చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదని బెయిల్ తీసుకుని విజయోత్సవం చేస్తున్నామనడం వారి అవివేకానికి నిదర్శనం. ►పవన్, చంద్రబాబు ఇద్దరికీ నీతి, నియమాలు లేవు. 9:40 AM, Nov 6, 2023 ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కుట్రలో పురంధేశ్వరిదే కీలక పాత్ర: విజయసాయి ►ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ►ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే.. ►ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురంధేశ్వరిది. ►సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబు ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు. ►"అన్న టీడీపీ" అనే పార్టీని పురంధేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగారు. ►ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్‌లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు పురంధేశ్వరి 1/3 :ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిది.… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023 8:30 AM, Nov 6, 2023 పురంధేశ్వరికి విజయసాయిరెడ్డి కౌంటర్ ►నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉంది. ►తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. ►కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారిన పురంధేశ్వరి. ►పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తున్న పురంధేశ్వరి ►ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారు. నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023 6:55 AM, Nov 6, 2023 చంద్రబాబు కన్నింగ్ ప్లాన్స్.. ►రాజమండ్రి జైలులో అనారోగ్యం అంటూ డ్రామాలు ►మధ్యంతర బెయిల్ వచ్చాక వైద్యం తప్ప అన్ని పనుల్లో బిజీ ►ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న బాబు చూసే చెప్పరేమో! ‘‘ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ ఈ సామెత బహుశా చంద్రబాబు లాంటి వ్యక్తిని చూశాకే పుట్టిందేమో. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు డ్రామాలాడిన @ncbn.. మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత వైద్యం తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాల్ని… pic.twitter.com/uFDMirCdc1 — YSR Congress Party (@YSRCParty) November 5, 2023 6:50 AM, Nov 6, 2023 అనారోగ్యమంటూ ఎల్లో బ్యాచ్ కలరింగ్.. మరి ఇదేంటీ? ►వైద్యం కోసం మధ్యంతర బెయిల్ ►రాజకీయం చక్కదిద్దే పనిలో బాబు ఫుల్ బిజీ ►అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏకం 14 గంటలు కారులో జర్నీ ►పవన్‌తో గంటల పాటు భేటీ.. ►హెల్త్ బాలేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేయగలడు? ►జైలు నుంచి బయటకు రావాలన్న డ్రామాలే తప్ప.. అనారోగ్యం కాదు! వైద్యం కోసం మధ్యంతర బెయిల్‌ను తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వచ్చిన చంద్రబాబు.. రాజకీయ కార్యకలాపాల్ని చక్కబెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. జైల్లో తీవ్ర అనారోగ్యంతో @ncbn బాధపడుతున్నట్లు @JaiTDP అండ్ కో కలరింగ్ ఇచ్చింది. కానీ.. రాజమండ్రి టు కరకట్టకి 14 గంటలు కారులో… pic.twitter.com/YX8tlcqaXN — YSR Congress Party (@YSRCParty) November 5, 2023 6:50 AM, Nov 6, 2023 బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP -
Nov 5th: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases Today Updates 05:40 PM, నవంబర్ 05, 2023 లోకేష్ ట్వీట్‌కు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని కౌంటర్ ►చంద్రబాబు హయాంలో ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో ఏం చేశారో చెప్పాలి ►ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు పెంచాలని గానీ, హాస్పిటల్ కట్టాలని గానీ ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురావాలని ఒక డాక్టర్ నియమించాలని గానీ కనీస అలోచన చంద్రబాబు హయాంలో చేయలేదు ►ఫ్యామిలీ డాక్టర్. జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి ఆలోచనలు ఎప్పుడైనా చేశారా ? ►ఈ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో పేదల వైద్యం కోసం ఏం చేశారో చెప్పాలి ►నాడు- నేడు ద్వారా 16 వేల కోట్లతో ఇప్పుడు ఏపిలో ఆసుపత్రుల ఆధునికన్నా నిర్మాణం చేపడితే లోకేష్‌కు కనిపించదా? 12:00 PM, నవంబర్ 05, 2023 పవన్‌పై మంత్రి అంబటి ఫైర్ ►కిషన్‌రెడ్డితో పవన్ భేటీ ►విలువలు లేని తమకే ఇది సాధ్యమంటూ ఫైర్ ►తెలంగాణ, ఏపీలో పవన్ వ్యవహాశైలిని తప్పు పట్టిన అంబటి ►తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో పొత్తుపై సెటైర్లు విలువలులేని తమకే ఇది సాధ్యం !@PawanKalyan pic.twitter.com/J7b7qHf5dL — Ambati Rambabu (@AmbatiRambabu) November 5, 2023 11:30 AM, నవంబర్ 05, 2023 పురంధేశ్వరికి వెల్లంపల్లి కౌంటర్ ►టీడీపీ కోవర్టుగా, తొత్తుగా పురంధేశ్వరి ►కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, హామీల గురించి మాట్లాడని పురంధేశ్వరి ►వైఎస్సార్సీపీని విమర్శంచడమే ఆమె పని ►బీజేపీతో చంద్రబాబును కలపడమే పురంధేశ్వరి లక్ష్యం. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ.. టీడీపీకి కోవర్టుగా, తొత్తుగా పనిచేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీల గురించి ఆమె ఏనాడూ మాట్లాడదు. ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం.. చంద్రబాబును బీజేపీతో కలపడమే @PurandeswariBJP లక్ష్యం. - ఎమ్మెల్యే… pic.twitter.com/ZeCX7ORgZX — YSR Congress Party (@YSRCParty) November 5, 2023 8:15 AM, నవంబర్ 05, 2023 శకుని పాత్ర పోషించిన మహిళ పురంధేశ్వరి: విజయసాయి కౌంటర్ ►ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి. ►బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం. ►తండ్రిని అవమానించిన పార్టీలో పదవులు అనుభవించిన గొప్ప కూతురు ఆమె. ►నాడు చంద్రబాబు పార్టీ నుంచి గెంటేసినా.. నేడు మాత్రం బాబు కోసం తపన ►ఏపీని విభజనలో తన వంతు శకుని పాత్ర పోషించిన మహిళ పురంధేశ్వరి ►రాష్ట్రాన్ని నాశనం చేసిన గొప్ప మహిళ పురంధేశ్వరి. 1/3: ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం. 2/3: తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందని, ఆ అవమానాల పునాదులపైనే ఏర్పాటైన టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 5, 2023 7:40 AM, నవంబర్ 05, 2023 మళ్లీ టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశం ►ఈ నెల 9న టీడీపీ-జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశం ►ఉమ్మడి కార్యాచరణ దిశగా ఏకాభిప్రాయ సాధనకు టీడీపీ-జనసేన నిర్ణయం ►ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లేందుకు కరపత్రం తీసుకురావాలని రెండు పార్టీలు నిర్ణయం ►ఉమ్మడి ఎజెండాతో కార్యక్రమాలు చేపట్టేలా అడుగులు ►ఉమ్మడిగా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని టీడీపీ-జనసేన నిర్ణయం 7:25 AM, నవంబర్ 05, 2023 బాబుపై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP 7:20 AM, నవంబర్ 05, 2023 పవన్‌తో కిషన్‌రెడ్డి భేటీ.. ►హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నివాసానికి కిషన్ రెడ్డి ►జనసేన సీట్ల సర్ధుబాటుపై చర్చలు ►ఎన్నికల్లో 11 సీట్లకు సంబంధించిన జాబితా సిద్దం చేసిన జనసేన ►శేరిలింగంపల్లి వదులుకోవాలని కోరిన కిషన్ రెడ్డి ►శేరిలింగంపల్లి బదులుగా నాంపల్లి అసెంబ్లీ సీటు ఇవ్వాలని బీజేపీ యోచన 7:15 AM, నవంబర్ 05, 2023 పురంధేశ్వరికి కౌంటర్! ►జనసేనతోనే పొత్తు అంటున్న పురంధేశ్వరి ►టీడీపీతో మాత్రమే మా పొత్తు అంటున్న జనసేన ►స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ►రేవంత్‌ను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ►వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప పార్టీలు, ప్రజలు వారికి అనవసరం. ఏం చెబుతున్నారు @PurandeswariBJP గారు.. మీరేమో జనసేనతో పొత్తు ఉందని అంటున్నారు. అటు జనసేన మాత్రం మా పొత్తు టీడీపీతో అని ఊగిసలాడుతోంది. మీ మరిది @ncbn మాత్రం తన స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ మీతో పొత్తు కోసం ఆరాటపడుతున్నారు, అక్కడ తెలంగాణలో మాత్రం బీజేపీ ని ఓడించడానికి, రేవంత్… https://t.co/9gdY7XUtep — YSR Congress Party (@YSRCParty) November 4, 2023 యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ యాత్ర ఎటు పోయింది? ►చంద్రబాబు విడుదల తర్వాత మారిన టీడీపీ తీరు ►చంద్రబాబు భార్య భువనేశ్వరి ఇక నిజం యాత్రకు ఫుల్స్టాప్ పెడతారని పార్టీలో టాక్ ►చంద్రబాబు ఇంటికొచ్చారు, నేను రాలేనని చెబుతున్నట్టు సమాచారం ►ఇప్పటికే లోకేష్ పేరుతో ఎన్నో యాత్రల ప్రచారం ►ముందు యువగళం, తర్వాత మేలుకో తెలుగోడా, ఆ తర్వాత మరొకటి ► ఢిల్లీకి వెళ్లడం, తిరిగి రావడం తప్ప ప్రజల్లోకి వెళ్లేందుకు ససేమిరా ►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్ ►ముందు తన నియోజకవర్గం ఫైనల్ చేసుకుంటానంటున్న లోకేష్ లోకేష్ కు సేఫ్ సీటు ఎక్కడ? మామకు వెన్నుపోటు తప్పదా? ► మంగళగిరివైపు చినబాబు సందేహంగా చూపులు ► తనకు సేఫ్ సీటు కావాలంటూ ముందే కమిటీకి తేల్చిచెప్పిన చినబాబు ► మంగళగిరిలో మళ్లీ ఓడితే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందన్న ఆందోళన ► లోకేష్ ముందు నాలుగు ప్రతిపాదనలు పెట్టిన టిడిపి సీనియర్లు ► ఎక్కడయితే గెలవగలవో తేల్చుకోవాలని సూచించిన టిడిపి సీనియర్లు. జనసేనలో ఏం జరుగుతోంది? ► పవన్ కళ్యాణ్ చర్యలతో విసుగు చెందుతోన్న జనసేన నాయకులు ► నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? ► పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మాకినేని శేషుకుమారి ముఖమెందుకు చాటేశారు? ► తిరుపతి జనసేన నాయకులు పసుపులేటి సురేష్, దిలీప్ సుంకర ఎందుకు దూరమయ్యారు? ► రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్ పసుపులేటి పద్మావతి ఎందుకు పార్టీవైపు చూడడం లేదు? ► జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ వెనక ఏం జరుగుతోంది? ► ఇప్పుడు జనసేనలో అధికారం ఎవరి చేతిలో ఉంది? ► జనసేన ప్రధాన కార్యాలయంలో రుక్మిణికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన బాధ్యతలేంటీ? భువనేశ్వరీ నిజం నిలిచిపోయిందా? ► రూ.3లక్షల చొప్పున ఇస్తామంటూ ఘనంగా తెలుగుదేశం ప్రకటనలు ► చంద్రబాబు కోసం చనిపోయారు కాబట్టి రూ.3లక్షలు ఇస్తామన్న భువనేశ్వరీ ► అలా ఓ నలుగురికి పంచేసరికి మారిపోయిన సీను ► చంద్రబాబు విడుదల కాగానే నిలిచిపోయిన నిజం యాత్ర ► మిగతా వాళ్లకెపుడు ఇచ్చేది మూడు లక్షల చెక్కులు? ► పాత డేట్లతో ముందే చెక్కులు ఎలా తయారు చేశారు? ► మీ నిజం యాత్రకు నిజంగానే బ్రేకులేశారా? 07:10 AM, నవంబర్ 05 2023 అదనపు షరతులు వర్తిస్తాయి ►ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి మరో ఎదురు దెబ్బ ►మధ్యంతర బెయిల్ అదనపు షరతులు కోరుతూ సీఐడీ అదనపు పిటిషన్ ►అదనపు షరతులు అక్కర్లేదంటూ చంద్రబాబు పిటిషన్ ►చంద్రబాబు లాయర్ల వాదనతో ఏకీభవించని ఏపీ హైకోర్టు ►చంద్రబాబు బహిరంగ ర్యాలీలు నిర్వహించడం, పాల్గొనడం చేయరాదు ►బహిరంగ సభల్లో కూడా పాల్గొనరాదు ►కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయకూడదు ►మేం ఇచ్చింది కేవలం మెడికల్ బెయిల్ మాత్రమే ►కస్టోడియల్ బెయిల్‌తో సమానంగా పరిగణించడానికి వీల్లేదు ►అదనపు షరతులు అవసరం లేదన్న బాబు వాదనను తిరస్కరించిన హైకోర్టు 07:00 AM, నవంబర్ 05 2023 మావనతా దృక్ఫథంతోనే బాబుకి బెయిల్ ►స్కిల్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ మీద చంద్రబాబు ►ఆరోగ్య కారణాల రీత్యా నాలుగువారాల బెయిల్ ఇచ్చిన కోర్టు ►తిరిగి నవంబర్ 28 సాయంత్రం 5గం.లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశం ►షరతులతో కూడిన బెయిల్.. ఉల్లంఘిస్తే వెంటనే రద్దు ►కంటికి సర్జరీ, ఇతర ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు ►వైద్య నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశం -
టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీఐడీ వేగం పెంచింది. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు కార్యాచరణకు ఉపక్రమించింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ శుక్రవారం నోటీసులు ఇచ్చింది. బుద్దా వెంకన్న, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో సహా 23 మంది సోషల్ మీడియాలో న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా గుర్తించిన సీఐడీ వారందరినీ విచారించాలని నిర్ణయించింది. బుచ్చయ్య చౌదరికి కూడా ఒకట్రెండురోజుల్లో నోటీసులు జారీ చేయనుంది. నిందితులతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్(ఎక్స్), గూగుల్ సంస్థలకు నోటీసులు జారీ చేసి విచారిస్తామని హైకోర్టుకు తెలిపింది. చదవండి: ర్యాలీలు అంటే.. బెయిల్ ఇచ్చే వాళ్లమా? -
తిరుపతిలో ఐటీ దాడుల కలకలం
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. తిరుపతిలో డాలర్స్ గ్రూప్‌పై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. డాలర్స్ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ డాక్టర్ సి.దివాకర్‌రెడ్డి కార్యాలయం పాటు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దివాకర్‌రెడ్డి, కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. పత్రాలను పరిశీలిస్తున్నారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, వారి బంధువుల ఇళ్లలో గురువారం ఉదయం మొదలైన ఐటీ అధికారుల సోదాలు రాత్రి తర్వాత కూడా కొనసాగాయి. గురువారం రాత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఆయన కుమారుడు జయవీర్ నివాసంలోనూ తనిఖీలు చేసి నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే సాధా రణ తనిఖీల్లో భాగంగానే వీరి ఇళ్లలో సోదాలు చేపట్టినట్టు, కొన్ని పత్రాలను ఐటీ అధికారులు పరి శీలించి వెళ్లినట్టు సమాచారం. గురువారం రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ ఆర్)కి చెందిన ఇళ్లు, విల్లా, ఫామ్‌హౌసుల్లో, బాలా పూర్లోని బడంగ్పేట్ మేయర్, పీసీసీ నేత, చిగు రింత పారిజాత నర్సింహారెడ్డి, వారి బంధువులు, అనుచరుల ఇళ్లలో ఐటీ అధికా రులు సోదాలు చేప ట్టిన విషయం తెలిసిందే. కాగా కేఎల్ఆర్ నివాసం,కార్యాలయాల్లో శుక్రవారం మరో సారి తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులు తుక్కుగూడలోని కేఎల్ఆర్ నివాసానికి చేరుకున్నారు. పలు డాక్యు మెంట్లతో పాటు కేఎల్ఆర్ను వెంటబెట్టుకుని నార్సింగ్ ఎన్సీసీ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. గంట పాటు అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడి నుంచి మాదాపూర్‌లోని కేఎల్ఆర్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి పొద్దు పోయే దాకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బడంగ్పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో గురువారం రాత్రే సోదాలు ముగిశాయి. ఇంట్లో లభించిన రూ.8 లక్షలు సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని, ఈ నెల 6న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. తమను రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఈ దాడులు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
Nov 4th : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases Today Updates 06:06 PM, నవంబర్ 04 2023 BJPని ఎలా ఒప్పిద్దాం? ► హైదరాబాద్: చంద్రబాబు, పవన్ సమావేశంలో ప్రధానంగా బీజేపీపై చర్చ ► సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, నాదెండ్ల మనోహర్ ► బీజేపీని ఎలాగైనా ఒప్పించాలని పవన్ కళ్యాణ్‌ను అడిగిన చంద్రబాబు ► బీజేపీ వస్తేనే ఏపీలో తమ పరిస్థితి బెటర్ అవుతుందని స్పష్టీకరణ ► తెలుగుదేశం, జనసేన కలిసినా.. గెలవడం కష్టమన్న అభిప్రాయం ► తెలుగుదేశం బలహీనంగా ఉందని ఇప్పటికే పలు బహిరంగ సభల్లో చెబుతోన్న పవన్ కళ్యాణ్ ► నిజమే, తెలుగుదేశం బలహీనంగా ఉంది కాబట్టే పొత్తు అంటోన్న చంద్రబాబు & కో ► అసలు తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటే సొంతంగానే పోటీ చేసేవారమన్న ఆలోచన ► బీజేపీ తమతో కలిస్తేనే ఏమైనా సీట్లు గెలవగలమన్న అభిప్రాయం ► 2014లో కూడా బీజేపీ కలిసి రావడం వల్ల ప్రయోజనం ఉందని చర్చ 05:05 PM, నవంబర్ 04 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘ భేటీ ► హైదరాబాద్: కొనసాగుతున్న చంద్రబాబు, పవన్ సమావేశం ► గంటన్నర నుంచి కొనసాగుతున్న చంద్రబాబు , పవన్ భేటీ ► తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చంద్రబాబు, పవన్ చర్చ ► తెలంగాణ ఎన్నికల్లో జనసేన కు టీడీపీ మద్దతు, క్యాడర్ ఓట్ల పై చర్చ ► ఏపీలో టీడీపీ, జనసేన సమన్వయం పై సమాలోచనలు 04:15 PM, నవంబర్ 04 2023 చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో ఏం తేల్చారు? ► హైదరాబాద్: కొనసాగుతున్న చంద్రబాబు, పవన్ సమావేశం ► తెలంగాణ ఎన్నికలు, ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చ ► తెలుగుదేశం, జనసేన విస్తృతస్థాయి సమావేశాల నిర్వహణపై ప్రస్తావన ► క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ ► ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తున్న చంద్రబాబు, పవన్ ► 10 అంశాలతో మినీ మేనిఫెస్టో రూపొందించాలనుకున్నాం, ఎందుకు ఆలస్యం? ► అసలు మేనిఫెస్టోలో ఏం పెడదాం? ► ఇన్నాళ్లు సంక్షేమ కార్యక్రమాలను విమర్శించాం కదా; ఇప్పుడు ప్రజలకు ఏం చెబుదాం? 04:00 PM, నవంబర్ 04 2023 జనసేన అభ్యర్థులు కూడా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తారా? ► ఒకే గుర్తుపై పోటీ చేద్దామన్న ప్రతిపాదన యోచనలో తెలుగుదేశం ► మీ గుర్తు అంతగా ప్రజల్లోకెళ్లలేదు కాబట్టి సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామని జనసేనకు ప్రతిపాదన ► పొత్తు ఉంటుంది, మీ అభ్యర్థులు మీకుంటారు, మా అభ్యర్థులు మాకుంటారు, అందరం సైకిల్ గుర్తుపైనే పోటీ చేద్దామన్న ప్రతిపాదన ► 1983లో సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీ పక్షాన నలుగురు ఉమ్మడి ఏపీలో పోటీచేశారు. వారంతా సైకిల్ సింబల్ పైనే పోటీచేశారంటున్న టిడిపి వర్గాలు ► తెలుగుదేశం ఆలోచనపై జనసేనలో గందరగోళం ► ఒకే గుర్తుపై పోటీ చేస్తే.. పార్టీని విలీనం చేసినట్టవుతుందన్న ఆందోళన ► ఒకే గుర్తుమీద అంతా పోటీచేస్తే సాంకేతికంగా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎన్నికైనవారంతా ఒకే పార్టీవారు అవుతారు కదా? ► చంద్రబాబును నమ్మి పూర్తిగా సరెండర్ అవుతే వెన్నుపోటు తప్పదని చరిత్ర చెబుతోంది కదా.! ► ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్‌కు రెండో ఏడాది ఇస్తారని ఇప్పుడే ఎలా నమ్ముతామంటున్న జనసేన వర్గీయులు 03:50 PM, నవంబర్ 04 2023 ఇక చేతులు కలిపేద్దామా? ► తెలుగుదేశంలో తీవ్ర అంతర్మథనం, రేవంత్ కోసం పావులు ► ఇటీవల వరుసగా జరుగుతున్న టిడిపి భేటీల్లో పార్టీ దుస్థితిపై చర్చ ► తెలంగాణలో రేవంత్ వస్తేనే ఏపీకి మనకు సాయమన్న భావనలో చంద్రబాబు ► ఎన్నికలకు ఆరు నెలలే ఉంది కాబట్టి ఇక మన స్టాండ్ బహిర్గతం చేయాలన్న యోచనలో బాబు ► తాను అరెస్ట్ అయితే పార్టీ అతలాకుతులం అయిన దుస్థితిని సీనియర్ల ముందు ప్రస్తావించిన బాబు ► ఇక మనకు మిగిలింది కాంగ్రెస్సేనన్న భావనలో బాబు, పార్టీ సీనియర్లు ► బీజేపీ ఎలాగు నమ్మదు కాబట్టి, కాంగ్రెస్ కోసం ప్రయత్నాలు చేద్దామంటున్న బాబు ► కాంగ్రెస్ పోటీ చేసే రాష్ట్రాల్లో నగదు సమకూర్చడం కోసం తెరవెనక ప్రయత్నాలు ► గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పలు రాష్ట్రాల్లో ఆర్థికంగా అండగా చంద్రబాబు నిలిచాడని పార్టీలో ప్రచారం 03:42 PM, నవంబర్ 04 2023 ఇంతకీ పవన్ కళ్యాణ్ పొత్తు బీజేపీతోనా? తెలుగుదేశంతోనా? ► తెలంగాణలో బీజేపీతో పవన్ కళ్యాణ్ చట్టాపట్టాల్ ► తెలంగాణలో కమలంతో పొత్తు, కలిసి పోటీ చేస్తోన్న జనసేన ► ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతున్న దోబూచులాట ► జనసేనతో పొత్తుకు బీజేపీ ఓకే ► తెలుగుదేశం పార్టీని మాత్రం దగ్గరకు రానివ్వబోనని చెబుతోన్న బీజేపీ ► బీజేపీకి తెలియకుండా పవన్‌కళ్యాణ్‌ను దువ్విన చంద్రబాబు ► బీజేపీకి సమాచారం ఇవ్వకుండానే జైలు ముందు పవన్ పొత్తు ప్రకటన ► ఇదే విషయంపై ఇటీవల పవన్‌ను ప్రశ్నించిన అమిత్‌షా ► జనసేన పార్టీలోనూ ఇదే గందరగోళం, ఎవరితో పొత్తు? ఎవరితో దూరం? 03:31 PM, నవంబర్ 04 2023 చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ అడగబోయే అంశాలేంటీ? ►తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు? ►జనసేనకు ఇచ్చే సీట్లలో ఏ ప్రాంతంలో ఉంటాయి? (రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాల వారీగా) ►కేవలం సామాజిక వర్గం జనాభా ప్రాతిపదికనే సీట్ల కేటాయింపు ఉంటుందా? ►పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఇస్తారా? ►జనసేన సహకరించినందుకు అయ్యే ఖర్చు ఎలా భరిస్తారు? ►కనీసం 50 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయాలి 03:20 PM, నవంబర్ 04 2023 చంద్రబాబు, పవన్ భేటీ ►హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ ►చంద్రబాబును పరామర్శించడానికి వచ్చిన పవన్ ►పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ 02:30 PM, నవంబర్ 04 2023 LV ప్రసాద్ ఆస్పత్రిలో ముగిసిన పరీక్షలు ►హైదరాబాద్: చంద్రబాబుకు ముగిసిన కంటి పరీక్షలు ►ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో గంటపాటు కంటి పరీక్షలు ►కంటి సర్జరీ మంగళవారం నిర్వహించనున్న డాక్టర్లు 01.46pm, నవంబర్ 04 2023 అసలు ఈ కేసు గురించి సీమెన్స్‌కు CID వారు లేఖ రాశారా? అచ్చెన్నాయుడు ప్రశ్న అయ్యా.. అచ్చెన్న.. కొంచెం ఈ ప్రశ్నలు, జవాబులు చదువుకోగలరు ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు లో మీరు 90 శాతం పెట్టుబడితో 10 శాతం ప్రభుత్వం పెట్టుబడితో స్కిల్ సెంటర్స్ పెట్టడానికి డిజైన్ టెక్ తో కలిసి ఒప్పందం చేసుకున్నారా..? ►సీమెన్స్ సమాధానం: అలాంటి ఒప్పందం మేము చేసుకోలేదు, 90 శాతం పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ చేసే పద్దతి మా దగ్గరలేదు.. ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా మీకు డిజైన్ టెక్ నుండి గాని స్కిల్ కార్పొరేషన్ నుండి గానీ ఏమైనా పర్చేజ్ ఆర్డర్ వచ్చిందా..? ►సీమెన్స్ సమాధానం : ఈ ప్రాజెక్టు లో భాగంగా మాకు ఎటువంటి పర్చేజ్ ఆర్డర్ రాలేదు..2015 లో డిజైన్ టెక్ నుండి 3 సార్లు మొత్తంగా 58 కోట్ల రూపాయలకు మాకు ఆర్డర్ వచ్చింది,మేము సప్ప్లై చేశాం.. ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : ప్రస్తుతం సుమన్ బోస్ ఎక్కడున్నారు?? వారు అసలు ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్ట్ ని ఒప్పందం చేసుకునే అర్హత ఉందా..? ►సీమెన్స్ సమాధానం : సుమన్ బోస్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, 2018 లో వారు మా కంపెనీలో లేరు,ఇక ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్టులను మేము చేయం,ఇలాంటి ఒప్పందం చేసుకోవదానికి సుమన్ బోస్ కి ఆ అర్హత లేదు,ఇక ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇలాంటి ఒప్పందం కూడా లేదు 1:05 PM, నవంబర్ 04 2023 బుద్ధా వెంకన్నకు CID నోటీసులు కోర్టుల మీద నోరు పారేసుకుంటారా? క్రిమినల్ కేసు పెట్టమని గత నెలలో హైకోర్టు సీరియస్ ► చంద్రబాబు అరెస్టు తర్వాత న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఎల్లో బ్యాచ్ ► నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసిన పచ్చ మీడియా, టిడిపి నేతలు ► హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలకు దిగిన గ్యాంగ్ ► తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హైకోర్టు ► టిడిపి నేతలు బుచ్చయ్య చౌదరీ, బుద్ధా వెంకన్న, రామకృష్ణ సహా 26 మందికి నోటీసులు ► ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వాలని AP DGPకి ఆదేశం ► బుద్ధా వెంకన్న ► గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ► ఎస్. రామకృష్ణ ► రామకృష్ణ గోనె ► మువ్వా తారక్ కృష్ణ యాదవ్ ► రవికుమార్ ముదిరాజు ► రుమాల రమేష్ ► ఎల్లా రావు ► కళ్యాణి ► అకౌంట్ : @NCHIRAN17457886 ► అకౌంట్ : In Jesus New Life @ NewIN34229 ► అకౌంట్ : @TrueAPDeveloper ► అకౌంట్ : Mosapu ► అకౌంట్ : Jail Jj ► అకౌంట్ : The Ark @ArkTheAce ► అకౌంట్ : @EdukondaluMupp2 ► అకౌంట్ : @Royanenenu ► అకౌంట్ : @Wish_cap ► అకౌంట్ : @Cdattu ► అకౌంట్ : @Bean9989 ► అకౌంట్ : Chary Veda ► అకౌంట్ : Paramasivaiah Gsanju Chandu ► అకౌంట్ : SriKishore Kumar ► సంస్థ : గూగుల్ ఇండియా ► సంస్థ : ట్విట్టర్ ఇండియా ► సంస్థ : ఫేస్బుక్ ఇండియా 12:35 PM, నవంబర్ 04 2023 టిడిపి వాళ్ల నోట నిజం వస్తుందా? అసలు భువనేశ్వరీ మళ్లీ యాత్ర చేపడుతుందా? చేపడితే నిజాలు చెబుతారా? 1)నా ఆస్థి లక్ష కోట్లు అని బాబు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ ఆస్తిని పాలు, పెరుగు అమ్మి సంపాదించాడా? 2)బాబు అవినీతికి నేను అడ్డు అని నాకు వెన్నుపోటు పొడిచాడు బాబు అని ఎన్టీఆర్ చెప్పింది నిజమా? కాదా? 3)మహానాడు హుండీ డబ్బులు కాజేసేవాడు బాబు అని దగ్గుపాటి పుస్తకం రాసింది నిజమా? కాదా? 4)గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబు వచ్చాడు అని హరికృష్ణ అన్నది నిజమా? కాదా? 5)బాబు జమానా అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం రాసింది నిజమా? కాదా? 6)బాబు పాలనలో అంతా అవినీతి అని , బీహార్ నయం అని జపాన్ మాకీ సంస్థ యజమాని పూమిహికో లేఖ రాసి వెళ్ళిపోయింది నిజమా? కాదా? 7)అమరావతి కాంట్రాక్టర్ ల నుంచి 600 కోట్ల సచివాలయం బిల్డింగ్ లో 119 కోట్లు (20 శాతం ) ముడుపులు బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని అమరావతి కాంట్రాక్టర్ అయిన షాపుర్జీ పల్లంజి ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ చెప్పాడు. అవును నిజమే ఆ డబ్బు బాబుకు ఇచ్చాను అని బాబు పర్సనల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు అని ఆగష్టు 4 న కేంద్ర సంస్థ ఇన్కమ్ టాక్స్ బాబుకు నోటీస్ ఇచ్చింది. నిజమా? కాదా? 8 ) 371 కోట్ల స్కిల్ కుంభకోణంలో మాకు ఎటువంటి సంబంధం లేదు అని సీమెన్స్ చెప్పింది అంటే టెండర్ లేకుండా సిమ్సన్ పేరుతో రూ.371 కోట్లు పక్కదారి పట్టించారు. ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది. ఇది నిజమా? కాదా? 9) ఓటుకు కోట్లు అంటూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రేవంత్ రెడ్డితో రూ.50 లక్షల నగదును స్టీఫెన్సన్కు ఇచ్చిన నేరంలో తెర వెనక కథనడిపింది, మనవాళ్లు బ్రీఫ్డ్మీ అన్నది చంద్రబాబు. నిజమా? కాదా? 10)బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) 2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లభ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజమా? కాదా? 11:05 AM, నవంబర్ 04 2023 బుద్ధా.. విచారణకు రండి ►తెలుగుదేశం నేత బుద్దా వెంకన్నకు సీఐడీ అధికారుల నోటీసులు ►జడ్జిలను ఇష్టానుసారంగా దూషించిన బుద్దా వెంకన్న ►ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్ లో ఉన్న బుద్దా వెంకన్న ►బుద్దా వెంకన్నకు హైదరాబాద్ వెళ్లి నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు ►హైకోర్టు ఆదేశాలతో నోటీసులు ఇస్తున్నామన్న సీఐడీ అధికారులు ►బుద్దా వెంకన్న వివరణ ఇవ్వాలని సీఐడీ ఆదేశాలు 10:55 AM, నవంబర్ 04 2023 మరికొద్దిసేపట్లో LV ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు ►కంటి వైద్య పరీక్షలకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లనున్న చంద్రబాబు ►చంద్రబాబు కంటికి ఆపరేషన్ చేయాలని ఇప్పటికే సూచించిన వైద్యులు ►హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో జరగనున్న ఆపరేషన్ 10:52 AM, నవంబర్ 04 2023 ఫైబర్ గ్రిడ్‌లో ఆస్తుల అటాచ్ ►ఫైబర్ గ్రిడ్ స్కాం కేసులో చంద్రబాబు సన్నిహితుల ఏడు స్థిరాస్తుల అటాచ్ కు ప్రతిపాదించిన సీఐడీ అధికారులు ►అనుమతి కోసం ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ 10:45 AM, నవంబర్ 04 2023 ఇసుక కేసులో విచారణ ►చంద్రబాబుపై సీఐడీ అధికారుల కేసు నమోదుపై నేడు విచారణ ►టీడీపీ హయాంలో ఇసుక అక్రమాల పై ఏపీఎండీసీ ఫిర్యాదు పై కేసు నమోదు 10:39 AM, నవంబర్ 04 2023 పురందేశ్వరిదీ వెన్నుపోటు రాజకీయమేనా? ►అమ్మా పురందేశ్వరి గారూ.. ►తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ►అది భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా ►కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారు ►అంటే... మీది కుటుంబ రాజకీయమా? ►కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? ►లేక బీజేపీని వెన్నుపోటుపొడిచే మీ రాజకీయమా? పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అమ్మా పురందేశ్వరి గారూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే... మీది కుటుంబ రాజకీయమా? కుల… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 4, 2023 08:59 AM, నవంబర్ 04 2023 బీజేపీలో ఆందోళనలు.. జనసేన సీట్లపై తెగని పంచాయతీ ►తెలంగాణలో అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తి ►ఇప్పటిదాకా 88 సీట్లకు అభ్యర్థుల ప్రకటన ►మిగతా సీట్లపై నేతల కసరత్తు ►ఇప్పటిదాకా ఏకాభిప్రాయం కుదరని సీట్లపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ►జనసేన సీట్లపై తెగని పంచాయతీ ►పలు నియోజకవర్గాల త్యాగానికి సిద్ధంగా లేని బీజేపీ కేడర్ ►ఇప్పటికే బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనలు.. ధర్నాలు ►ఏ ప్రతిపాదికన జనసేనకు సీట్లు ఇస్తున్నారని బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్న వైనం ►తలపట్టుకుంటున్న రాష్ట్ర కీలక నేతలు ►అనవసరంగా జనసేనతో పొత్తు ప్రకటన చేశామనే ఫీలింగ్‌లో నేతలు 08:22 AM, నవంబర్ 04 2023 జడ్జిలనే తిడతారా? ►చంద్రబాబు కేసుల్ని విచారణ చేసిన జడ్జిలను దూషించిన యెల్లో బ్యాచ్ ►సోషల్ మీడియాలోనూ న్యాయమూర్తిలపై దుష్ప్రచారం ►టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు ►అభియోగాల మేరకు ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులిచ్చిన సీఐడీ ►అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని వెంకన్నకు స్పష్టం ►వైద్య పరీక్షలంటూ బాస్ చంద్రబాబు తరహాలోనే హైదరాబాద్‌కి బుద్దా వెంకన్న.. స్వయంగా నోటీసులు అందించిన సీఐడీ అధికారులు 07:47 AM, నవంబర్ 04 2023 బీజేపీ ఓట్లను టీడీపీకి మళ్లిస్తున్నారే! ►బీజేపీ నేత పురంధేశ్వరిపై వైసీపి ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ ►పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారు ►ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు ►మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్...మళ్లీ బీజేపీ...ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిది ►బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమెవల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా? ►ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుంది ►ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతయతమైన పదవిలో ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తంచేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? ►మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా ►ఆ మేరకు కేంద్రానికి రాయగలరా? ►మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీరు, మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా? ►హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ►ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు? 1/4: పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు. మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్...మళ్లీ బీజేపీ...ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర… — Vijayasai Reddy V (@VSReddy_MP) November 3, 2023 07:29 AM, నవంబర్ 04 2023 చంద్రబాబు ఇంటికి కూతవేటు దూరంలోనే.. ►బాబు ఉచిత ఇసుక విధానం.. పేదల కోసం కాదు.. పెద్దల కోసం ►2014లో మహిళా సంఘాల ముసుగులో ఇసుక దోపిడీ ►పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం స్మగ్లర్ల ముఠా చేతికి ►భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడిందన్న లాయర్ శ్రావణ్‌కుమార్ ►పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కిన నటి బాబు ప్రభుత్వం ►పూడికతీత, డ్రెడ్జింగ్ పేరుతో ఇసుకను పెద్దల ముఠా దోచుకుంటుంటే ప్రేక్షకపాత్ర ►తీవ్రంగా ఆక్షేపించిన ఎన్జీటీ ►అయినా ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు.. ►ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మళ్లీ ఎన్జీటీని ఆశ్రయించిన రైతులు ►ఇసుక అక్రమ తవ్వకాలను నిగ్గుతేల్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఎన్జీటీ కమిటీ ఈ ►కమిటీ చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో 2019 జనవరి 17–18న కమిటీ పరిశీలన ►స్మగ్లర్ల ముఠా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వుతుండటాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. 2019, జనవరి 21న ఎన్జీటీకి నివేదిక సమర్పణ ►ఈ నివేదిక ఆధారంగా తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని టీడీపీ సర్కార్‌కు ఎన్జీటీ అల్టిమేటం ►ఇసుక అక్రమ తవ్వకాలతో పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.వంద కోట్ల జరిమానా ► మొత్తాన్ని ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలుచేసి చెల్లించాలని స్పష్టం ►నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏప్రిల్ 4, 2019లో ఇచ్చిన తీర్పులో ప్రస్తావన 07:16 AM, నవంబర్ 04 2023 అదనపు షరతులు వర్తిస్తాయి ►ఏపీ హైకోర్టులో చంద్రబాబుకి మరో ఎదురు దెబ్బ ►మధ్యంతర బెయిల్ అదనపు షరతులు కోరుతూ సీఐడీ అదనపు పిటిషన్ ►అదనపు షరతులు అక్కర్లేదంటూ చంద్రబాబు పిటిషన్ ►చంద్రబాబు లాయర్ల వాదనతో ఏకీభవించని ఏపీ హైకోర్టు ►చంద్రబాబు బహిరంగ ర్యాలీలు నిర్వహించడం, పాల్గొనడం చేయరాదు ►బహిరంగ సభల్లో కూడా పాల్గొనరాదు ►కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు చేయకూడదు ►మేం ఇచ్చింది కేవలం మెడికల్ బెయిల్ మాత్రమే ►కస్టోడియల్ బెయిల్‌తో సమానంగా పరిగణించడానికి వీల్లేదు ►అదనపు షరతులు అవసరం లేదన్న బాబు వాదనను తిరస్కరించిన హైకోర్టు ఇదీ చదవండి: ర్యాలీలు అంటే.. బెయిల్ ఇచ్చే వాళ్లమా? 07:08 AM, నవంబర్ 04 2023 ఇసుకాసురుడు చంద్రబాబు ►చంద్రబాబు ముఠా రూ.10 వేల కోట్ల ఇసుక దోపిడీపై కేసు నమోదు ►ఏ–1 పీతల సుజాత, ఏ–2 చంద్రబాబు, ఏ–3 చింతమనేని, ఏ–4 దేవినేని ఉమా ►నాడు ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో భారీ దోపిడీ ►ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల గండి ►గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు బేఖాతరు ►ఆర్థిక శాఖ ఆమోదం, మంత్రి మండలి తీర్మానం లేదు ►‘ప్రత్యేక మెమో’ ద్వారా దోపిడీకి రాచబాట ►ఇసుక రీచ్‌లన్నీ టీడీపీ ప్రజాప్రతినిధుల హస్తగతం ►ఎక్కడ ఎంత ఇసుక తవ్వారన్న లెక్కలు లేకుండా పక్కా స్కెచ్ 07:03 AM, నవంబర్ 04 2023 మావనతా దృక్ఫథంతోనే బాబుకి బెయిల్ ►స్కిల్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ మీద చంద్రబాబు ►ఆరోగ్య కారణాల రీత్యా నాలుగువారాల బెయిల్ ఇచ్చిన కోర్టు ►తిరిగి నవంబర్ 28 సాయంత్రం 5గం.లోపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశం ►షరతులతో కూడిన బెయిల్.. ఉల్లంఘిస్తే వెంటనే రద్దు ►కంటికి సర్జరీ, ఇతర ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు ►వైద్య నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశం -
Nov 3rd 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases, Petitions, Court Hearings And Updates 6:46 PM, నవంబర్ 03, 2023 ఇంతకీ ఈ ఏడాది చంద్రబాబు కుటుంబం ఆస్తుల లెక్కలు చెబుతారా? : YSRCP ►ప్రతీ ఏటా కుటుంబం ఆస్తుల లెక్కలు అంటూ ఓ పక్కా పకడ్బందీ స్క్రిప్ట్ విడుదల చేసే లోకేష్ ►ఈ ఏడాది జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లిన చంద్రబాబు ►చంద్రబాబు ఆస్తులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ చర్చ ►ఇన్నాళ్లు చంద్రబాబును అద్భుత స్థాయిలో కీర్తించిన ఎల్లో మీడియా ►తాజా కేసులతో బయటపడుతున్న చంద్రబాబు, కుటుంబం అసలు రంగు ►రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించానని తరచు చెప్పుకున్న చంద్రబాబు ►ఇటీవల నోరు జారి నిజాలు కొన్ని చెప్పేసిన భువనేశ్వరీ ►హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి : భువనేశ్వరి ►అంటే హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లు.! ►హెరిటేజ్ లో 20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... 70 వేల కోట్ల బ్లాక్ మార్కెట్.! ►మరి కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్‌లో ఉన్న ఆస్తుల విలువెంత.? ►లోకేష్.. ప్లీజ్ తొందరగా ప్రెస్ మీట్ పెట్టి కొన్నయినా నిజాలు చెప్పవా.? 6:06 PM, నవంబర్ 03, 2023 బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP 5:56 PM, నవంబర్ 03, 2023 యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ యాత్ర ఎటు పోయింది? ►చంద్రబాబు విడుదల తర్వాత మారిన టీడీపీ తీరు ►చంద్రబాబు భార్య భువనేశ్వరి ఇక నిజం యాత్రకు ఫుల్స్టాప్ పెడతారని పార్టీలో టాక్ ►చంద్రబాబు ఇంటికొచ్చారు, నేను రాలేనని చెబుతున్నట్టు సమాచారం ►ఇప్పటికే లోకేష్ పేరుతో ఎన్నో యాత్రల ప్రచారం ►ముందు యువగళం, తర్వాత మేలుకో తెలుగోడా, ఆ తర్వాత మరొకటి ► ఢిల్లీకి వెళ్లడం, తిరిగి రావడం తప్ప ప్రజల్లోకి వెళ్లేందుకు ససేమిరా ►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్ ►ముందు తన నియోజకవర్గం ఫైనల్ చేసుకుంటానంటున్న లోకేష్ 5:52 PM, నవంబర్ 03, 2023 లోకేష్ కు సేఫ్ సీటు ఎక్కడ? మామకు వెన్నుపోటు తప్పదా? ► మంగళగిరివైపు చినబాబు సందేహంగా చూపులు ► తనకు సేఫ్ సీటు కావాలంటూ ముందే కమిటీకి తేల్చిచెప్పిన చినబాబు ► మంగళగిరిలో మళ్లీ ఓడితే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందన్న ఆందోళన ► లోకేష్ ముందు నాలుగు ప్రతిపాదనలు పెట్టిన టిడిపి సీనియర్లు ► ఎక్కడయితే గెలవగలవో తేల్చుకోవాలని సూచించిన టిడిపి సీనియర్లు 1. హిందూపురం - సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ► హిందూపురంలో బాలకృష్ణ సీటుకు ఎసరు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ► అక్కడ టిడిపి 2019లో గెలిచింది కాబట్టి ఈ సారి అల్లుడు అడుగుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ► తానే పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన బాలకృష్ణ ► అల్లుడి కోసం త్యాగం చేస్తాడా? తండ్రి తరహాలో మామకు వెన్నుపోటు తప్పదా? 2. గుడివాడ - సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని ► గుడివాడలో తమ సామాజిక వర్గం ఉందన్న ఆలోచనలో తెలుగుదేశం ► అబ్బో.. కొడాలి నానిని తట్టుకోవడం కష్టమని తేల్చేసిన చినబాబు వర్గం ► ఘోరంగా ఓడిపోతే.. అసలుకే ఎసరు వస్తుందని స్పష్టం చేసిన చినబాబు వర్గం 3. పెనమలూరు - సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ► పెనమలూరులో ఇప్పటివరకు టిడిపి ఇన్ ఛార్జ్ బొడ్డేటి ప్రసాద్ ► పెనమలూరు అయితే తమ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారన్న యోచనలో టిడిపి సీనియర్లు ► పార్థసారథి బలంగా ఉన్నారన్న సర్వేల రిపోర్టులు చూపించిన చినబాబు వర్గం ► కృష్ణా జిల్లా అయినా పెనమలూరులో నెగ్గడం అతి కష్టం అని తేల్చిన చినబాబు వర్గం 4. విజయవాడ ఈస్ట్ - సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ► విజయవాడలో పార్టీ పరిస్థితి బాగుందన్న టిడిపి సీనియర్లు ► 2019లో ఈస్ట్ నుంచి గద్దె రామ్మెహన్ రావు గెలిచాడన్న సీనియర్లు ► ఈ నియోజకవర్గం ఎంచుకుంటే గ్యారంటీ ఉండొచ్చేమో అని సూచన ► విజయవాడ అయినా ఈస్ట్ లో కచ్చితంగా గెలిచే సీను లేదంటున్న లోకేష్ వర్గం 5:45 PM, నవంబర్ 03, 2023 దోచుకోవడం, పంచుకోవడం.. ఇవే చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం : YSRCP ► ఏపీలో ప్రతిపక్షాలు అన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి ► వారు ఎంతమంది కలిసినా… రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా.. సున్నాయే. ► ఎన్ని సున్నాలు కలిసిన వచ్చేది పెద్ద సున్నాయే. ► ఒకరైతే రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. చంద్రబాబును మోయడమే ఆయన పని. ► ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక అభ్యర్థి లేడు. ప్రతి గ్రామంలో జెండా మోసే కార్యకర్తా లేరు ► చంద్రబాబు దోచుకున్న దాంట్లో ఈయన పార్టనర్. మోసాలు చేయడంలో పార్టనర్. ► బిస్కట్ వేసినట్టు, చాక్లెట్ వేసినట్టు. సంపాదించిన సొమ్ములో భాగం పంచడం.. ► దోచుకోవడం.. పంచుకోవడం.. ఇదే వీరికి తెలిసింది ► చంద్రబాబును సమర్థించామంటే.. .ఈ రాష్ట్రంలో పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవాళ్లకు వ్యతిరేకంగా ఉండటమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పెత్తందారీ వ్యవస్థను, నయా జమీందారీ వ్యవస్థను సమర్థించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవర్గాల పిల్లలకు ఇంగ్లీషు మీడియం అందకుండా వ్యతికేకించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. డెమోగ్రఫిక్ ఇన్ బ్యాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలను సమర్థించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. కొన్ని వర్గాలు ఎప్పటికీ పేదలుగా, కూలీలుగా మిగిలివాలని సమర్థించినట్టే. ► ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానన్న పెత్తందారీ భావజాలాన్ని సమర్థించడమే. 05:10 PM, నవంబర్ 03, 2023 తెలంగాణలో కాంగ్రెస్ కోసం తెలుగుదేశం ప్రయత్నాలు ► ఆస్పత్రిలో చేరినా.. రాజకీయ మంతనాలతో బాబు బిజీ బిజీ ► తెలంగాణలో కాంగ్రెస్ గెలవడమే తమ లక్ష్యమని బాబు చెబుతున్నట్టు సమాచారం ► తెలంగాణలోని తమ పార్టీ లీడర్లందరినీ ఈ దిశగా సమాయత్తం చేస్తోన్న బాబు ► రేవంత్ రెడ్డి మనోడేనంటూ ఫోన్లో చెబుతోన్న చంద్రబాబు ► రేవంత్ గెలిస్తేనే మనకు సాయంగా నిలుస్తాడంటూ చెప్పుకొస్తోన్న చంద్రబాబు ► ఎంత డబ్బైనా ఏర్పాటు చేస్తాం, కాంగ్రెస్‌కు ఓట్లేయించాలంటూ చంద్రబాబు సూచనలు ► ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ఓటర్ల వివరాలు సేకరిస్తోన్న టిడిపి క్యాడర్ ► అవసరమయితే హైదరాబాద్‌లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేయాలన్న వ్యూహంలో టిడిపి నేతలు ► ఇప్పటికే టిడిపి కుట్రను బయటపెట్టిన BJP నేతలు ► చంద్రబాబు పూర్తిగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారన్న ఈటల 05:02 PM, నవంబర్ 03, 2023 బుద్ధా వెంకన్నకు నోటీసులు ► టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు ► చంద్రబాబు రిమాండ్ విషయంలో జడ్జి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న ► హైకోర్టు ఆదేశాల మేరకు బుద్ధా వెంకన్నకు నోటీసులిచ్చిన CID 04:30 PM, నవంబర్ 03, 2023 AIG ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జ్ ► హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జ్ ► చాంతాడంత రోగాల జాబితాతో AIGలో చేరిన చంద్రబాబు ► చంద్రబాబుకు నిన్నటి నుంచి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ► ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఇవ్వాళ చంద్రబాబుకు కంటి పరీక్షలు 03:10 PM, నవంబర్ 03, 2023 బెయిల్ వచ్చాక చంద్రబాబు డ్రామాలు బయటపడ్డాయి : మంత్రి రోజా ► రిషికొండపై టీడీపీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది ► ఉత్తరాంధ్ర, విశాఖపై టీడీపీ విషం చిమ్ముతూనే ఉంది ► టీడీపీ ఎంత గింజుకున్నా అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటుంది ► చంద్రబాబు మామని, ప్రజలనే కాదు బెయిల్ ఇచ్చిన జడ్జినీ మోసం చేశారు ► చంద్రబాబుకు లేని జబ్బులన్నీ టీడీపీ నేతలే ప్రచారం చేశారు ► బెయిల్ వచ్చాక చంద్రబాబు డ్రామాలన్నీ బయటపడ్డాయి ► లోకేష్ కి జగన్ అంటేనే కాదు... ఆయన సినిమా అన్నా భయమే ► అందుకే వ్యూహం సినిమా మీద ఫిర్యాదు చేశాడు : మంత్రి రోజా 03:10 PM, నవంబర్ 03, 2023 చంద్రబాబు కుంభకోణాలు అన్నీ ఇన్నీ కావు : సజ్జల ► చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే కేసులు పెట్టారు ► ఉచిత ఇసుక అన్నారు... ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరికిందా? ► ఉచిత ఇసుక అంటే ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలి ► కానీ పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లు పెట్టి దందా చేశారు ► ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము నొక్కేశారు ► ప్రస్తుతం ఇసుకపై ఏడాదికి రూ.765 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది ► గతంలో ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..? ► పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలా..? టీడీపీకి ఉపాధ్యక్షురాలా..? : సజ్జల 02:29PM, నవంబర్ 03, 2023 హైదరాబాద్‌లో చంద్రబాబు ర్యాలీపై నేషనల్ హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు ►పోలీసులు ర్యాలీలు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఫిర్యాదు ►అంబులెన్స్‌కు దారివ్వకుండా ప్రాణాలతో చెలగాటం ఆడారని ఫిర్యాదు ►మెడికల్ బెయిల్ పొంది ర్యాలీలో పాల్గొన్నాడని పేర్కొన్న పిటిషనర్ ►ఉద్దేశపూర్వకంగా న్యూసెన్స్ క్రియేట్ చేశారని హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు 11:55 AM నవంబర్ 03 2023 లింగమనేని పిటిషన్ కొట్టివేత ►రుషికొండ పై నిర్మాణాలు చేయొద్దని టీడీపీ నేత లింగమనేని శివరామ ప్రసాద్ పిటిషన్ ►రుషికొండపై నిర్మాణాలు అక్రమమని.. జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంలో లింగమనేని రిట్ దాఖలు ►ఎన్జీటీ, ఏపీ హైకోర్టులో రిషికొండ పై వున్న కేసులు పరిష్కారం అయ్యేవరకు ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు జరుగకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న లింగమనేని ►రిషి కొండ కేసును విచారించిన సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ►ఈ అంశంలో జోక్యం చేసుకోబోం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ►ఇది రాజకీయ ఫిర్యాదు: సీజేఐ ►ముఖ్యమంత్రిని అక్కడికి వెళ్ళొద్దని అంటారా ?: పిటిషనర్‌కు సీజే ప్రశ్న ►ఏవైనా ఉంటే హైకోర్టుకు వెళ్లాలని సూచన ►లింగమనేని శివరాం ప్రసాద్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు 11:39AM నవంబర్ 03 2023 ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు! ►హైదరాబాద్‌లో ప్రముఖ ఆస్పత్రులకు చంద్రబాబు నాయుడు ►వైద్య పరీక్షల కోసం గురువారం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరిక ►ఆస్పత్రిలో రకరకాల పరీక్షలు ►నేటి మధ్యాహ్నాం ఏఐజీని నుంచి డిశ్చార్జి అయ్యే ఛాన్స్ ►ఏఐజీ నుంచి ఆయన నేరుగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి! ►క్యాటరాక్టు సమస్యకు వైద్యులు చంద్రబాబుకు శస్త్రచికిత్స చేసే అవకాశం ►తీవ్ర అలర్జీ, ఇతర అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ 11:13AM నవంబర్ 03 2023 అదనపు షరతుల పిటిషన్ తీర్పు వెల్లడి ►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్ ►తీర్పు వెల్లడించిన ఏపీ హైకోర్టు ►స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపు ►రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపు ►చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన మాత్రం తిరస్కరణ 10:43AM నవంబర్ 03 2023 చంద్రబాబు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ►చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రమంతా అవినీతియంగా మారింది ►సీఐడీ రూ.10వేల కోట్లలు ఇసుక కుంభకోణాన్ని గుర్తించింది ►చంద్రబాబుతో పాటు అప్పటి కేబినెట్ మంత్రులపై కేసు నమోదయ్యింది ►చంద్రబాబు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ►చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను వంచించారు ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు ►చంద్రబాబు పాలనలో ప్రజలకు సరైన సంక్షేమం అందలేదు :::ఎమ్మెల్యే మల్లాది విష్ణు 10:34AM నవంబర్ 03 2023 తెలంగాణ కాషాయంలోజనసేన కుంపటి ►హస్తినకు చేరిన పంచాయితీ ►అధిష్టానం పెద్దలతో ఢిల్లీ వెళ్లి మాట్లాడిన కొండా విశ్వేశరరెడ్డి ►కూకట్పల్లి సీటు జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్ ►నిన్న నాగర్ కర్నూల్ కార్యకర్తల ఆందోళన ►ఆందోళనకు సై అంటున్న తాండూరు బీజేపీ కార్యకర్తలు ►కొండాపై నమ్మకంతో తాండూరు టికెట్ ఆశిస్తున్న రమేష్ 10:22AM నవంబర్ 03 2023 అసైన్డ్ భూములు కేసు విచారణ 10కి వాయిదా ►అసైన్డ్ భూములు కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ ►క్వాష్ పిటిషన్ల కేసులో విచారణ రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు ►అసైన్డ్ కుంభకోణంలో ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపిన సీఐడీ న్యాయవాదులు ►ఇప్పటికే ఆడియో, వీడియో క్లిప్స్ కోర్టుకు నివేదించినట్లు వెల్లడి ►చంద్రబాబు, నారాయణ తరపున కౌంటర్ దాఖలు చేసిన లాయర్లు ►ఏపీ హైకోర్టులో తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా 09:45 AM, నవంబర్ 03 2023 హైకోర్టులో షరతుల పిటిషన్‌పై నేడు తీర్పు ►స్కిల్ స్కాం కేసులో ఏపీ హైకోర్టులో సీఐడీ కంపిటిషన్ ►చంద్రబాబుకు అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ►నాలుగు వారాల బెయిల్‌కు.. ఐదు షరతులు విధించిన కోర్టు ►మరో ఐదు నిబంధనలు పెట్టాలని సీఐడీ పిటిషన్ ►ఇప్పటికే పూర్తైన వాదనలు ►నేడు నిర్ణయం ప్రకటించనున్న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 09:01 AM, నవంబర్ 03 2023 నవంబర్1 అయిపోయింది కదా ► నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో అంటూ టీడీపీ, జనసేన గత వారం ఘనంగా ప్రచారం ► అక్టోబర్ 25న రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన లోకేష్, పవన్ కళ్యాణ్ ► చంద్రబాబు జైల్లో (అక్టోబర్ 25న) ఉన్నాడు కాబట్టి మినీ మ్యానిఫెస్టో అని ప్రకటన ► ప్రకటన చేసిన పవన్‌కళ్యాణ్ ఇటలీకి జంప్, కోరస్ ఇచ్చిన లోకేష్ ఢిల్లీకి జంప్ ► జైలు నుంచి విడుదలయిన చంద్రబాబు హైదరాబాద్‌కు జంప్ ► మ్యానిఫెస్టో గురించి ఎవరయినా అడిగినా.? అంతే సంగతులు ► మ్యానిఫెస్టోను మాయం చేసిన చరిత్ర ఉన్న పార్టీలే టిడిపి, జనసేన : YSRCP 08:13 AM, నవంబర్ 03 2023 స్కిల్ కేసులో ట్విస్ట్ ►మొత్తం 12మంది ఐఏఎస్ అధికారుల్ని విచారించాలని సీఐడీకి ఫిర్యాదు ►టీడీపీ హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని ఐఏఎస్ అధికారుల్ని విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు ►సీఐడీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది ప్రసాద్ ►అజేయ కల్లం, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మీ, ప్రేమ్ చంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతిక శుక్లా, అర్జా శ్రీకాంత్, జీ.జయలక్ష్మీలను విచారించాలని ఫిర్యాదు ►ప్రస్తుత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి పై ఫిర్యాదు ►అప్పటి సీఎండీ బంగారు రాజులతో పాటు కార్పొరేషన్ లోని సీఎఫ్ఓ, సీఈవో, ఈడీలను విచారించాలన్న ఫిర్యాదుదారు 07:55 AM, నవంబర్ 03 2023 వర్మ వ్యూహానికి జడుసున్న సినబాబు ►రాం గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు సెన్సార్ చిక్కులు ►ఏపీ రాజకీయ వాస్తవ ఘటనల ఆధారంగా వ్యూహం తీసిన వర్మ ►సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డుకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ ►ఆర్జీవీ కౌంటర్ ►అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరు.. ఎన్ని వ్యూహాలు పన్నినా మా " వ్యూహం" నీ ఆపలేరు అంటూ ట్వీట్ ►నారా లోకేష్‌ను ర్యాగింగ్ చేస్తూ వరుస ట్వీట్లు Doctor gaaru ! https://t.co/pxhJL1sPwS — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2023 07:32 AM, నవంబర్ 03 2023 స్కిల్ కేసులో టీడీపీ సాంకేతిక పిటిషన్లు ►ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు పై చర్యలు తీసుకోవాలన్న పిల్ పై విచారణ ►పిల్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ►స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రెస్‌మీట్ లు ఏర్పాటు చేశారని పిల్ ►ప్రజాధనం ఎంత వృధా అయ్యిందో వివరాలు తెలపాలన్న కోర్టు ►ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదన్న పిటిషనర్ ►మరోసారి వివరాల కోసం దరఖాస్తు చేయాలన్న కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ►ప్రెస్ మీట్ల కోసం వారు ప్రజాధనం ఖర్చు చేసినట్లు ఆధారాలున్నాయా? ►ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏం మాట్లాడారో....తర్జుమా చేసి ఇవ్వండి ►పిటిషనర్ కు ధర్మాసనం ప్రశ్న ►విచారణ 8వ తేదీకి వాయిదా 07:07 AM, నవంబర్ 03 2023 నేడు ఏ కోర్టుల్లో ఏ ముందంటే.. ►ఏసీబీ కోర్టులో సీఐడీ ఫైబర్ కేసు పిటిషన్ ►ఫైబర్ గ్రిడ్ స్కా మ్ కేసులో చంద్రబాబు సన్నిహితులు ►బాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌కు సీఐడీ ప్రతిపాదన ►గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ హోం శాఖ ►నేడు స్థిరాస్తులు అటాచ్మెంట్ అనుమతి కోసం ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ►మరోవైపు.. స్కిల్ స్కాంలో సీఐడీ కండిషన్స్ పిటిషన్ ►చంద్రబాబుకు అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ►నాలుగు వారాల బెయిల్‌కు.. ఐదు షరతులు విధించిన కోర్టు ►మరో ఐదు నిబంధనలు పెట్టాలని సీఐడీ పిటిషన్ ►ఇప్పటికే పూర్తైన వాదనలు ►నేడు నిర్ణయం ప్రకటించనున్న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 06:48 AM, నవంబర్ 03 2023 చంద్రబాబుపై మరో కేసు నమోదు ► టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు ►ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు ► వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడీ ► ఏ1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు నాయుడు ► ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4 గా దేవినేని ఉమ ► ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం చేకూర్చారని ఫిర్యాదు ► ఇప్పటి వరకు చంద్రబాబుపై స్కిల్ స్కాం, ఇన్నర్‌రింగ్‌రోడ్, ఫైబర్ నెట్, అసైన్డ్ ల్యాండ్, మద్యం కేసులు ► మొత్తం 6 కేసుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు 06:40 AM, నవంబర్ 03 2023 బాబూ.. మీకో దండం.. ► చంద్రబాబు, లోకేష్‌ల నుంచి బయటకొచ్చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ► ఇవాళ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్న కాసాని ► గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక ► తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ►తెలంగాణలో పోటీ వద్దని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి ►చంద్రబాబు, లోకేష్ తీరులను తప్పుబడుతూ పార్టీకి రాజీనామా ►తెలంగాణ ఎన్నికల్లో లోకేష్ పెత్తనం ఏంటని లేఖలో ప్రశ్నించిన కాసాని ►కాసాని బయటకు రావడంతో.. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ 06:39 AM, నవంబర్ 03 2023 పొత్తుపై పునరాలోచనలో చంద్రబాబు? ► జనసేనతో పొత్తుపై చంద్రబాబు నాయుడి పునరాలోచన ►తెలుగుదేశం, జనసేన పొత్తుపై పలు సందేహాలు ► జైల్లో చంద్రబాబును కలిసి బయట పొత్తు ప్రకటించిన జనసేనాని ► ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు ► తమకు 50 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు కావాలని చెప్పిన పవన్ ► ఇప్పుడు 20 అసెంబ్లీ, 3 పార్లమెంటు ఇవ్వాలన్న యోచనలో తెలుగుదేశం ► చంద్రబాబు విడుదలైన తర్వాత కరకట్ట ఇంట్లో సుదీర్ఘంగా చర్చలు ► అన్ని చోట్లా మనమే పోటీ చేద్దామని బాబుకు చెబుతోన్న టీడీపీ నేతలు ► జనసేన సీను అంతే అయినప్పుడు మనమెందుకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటున్న టీడీపీ నేతలు ► పునరాలోచనలో పడ్డ తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ 06:30AM, నవంబర్ 3 2023 ఇవాళ చంద్రబాబు డిశ్చార్జి? ►స్కిల్ స్కామ్ మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన టీడీపీ చంద్రబాబు నాయుడు ► హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►బుధవారం రాత్రి ఇంటికి వెళ్లి మరీ చంద్రబాబును పరిశీలించిన వైద్యులు ► వైద్యుల సూచన మేరకు.. పరీక్షల కోసం నిన్న ఉదయం చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాబు ► నేటి మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే చంద్రబాబు ►టెస్టుల అనంతరం డిశ్చార్జి అయ్యే ఛాన్స్ ►వైద్య నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశం ►నాలుగు వారాల తర్వాత రాజమండ్రి జైల్లో సరెండర్ కానున్న చంద్రబాబు -
ఇసుక దందాపై కొరడా
ఎంత ఇసుక అందుబాటులో ఉంది.. ఎంత ఇసుక తవ్వుతున్నాం.. ఎంతకు అమ్ముతున్నాం.. అనే సమాచారం ఏదీ రికార్డుల్లో చూపించాల్సిన అవసరం లేకుండా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా తెరపైకి తీసుకువచ్చిందే ‘ఉచిత ఇసుక విధానం’. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఉచితం అని భ్రమ కల్పించారు. కానీ వాస్తవంగా జరిగింది వేరు. ఈ విధానం ముసుగులో రాష్ట్రంలో ఇసుక రీచ్‌లు అన్నింటినీ చంద్ర బాబు తనతోపాటు మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు. తద్వారా వారి దోపిడీకి అంతేలేకుండా పోయింది. తక్కువలో తక్కువ బాబు అండ్ కో రూ.10 వేల కోట్లు కొల్లగొట్టింది. సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఇసుక దోపిడీపై సీఐడీ కొరఢా ఝళిపించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి, సాగించిన ఇసుక కుంభకోణంపై కేసు నమోదు చేసింది. ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో పచ్చ ముఠా బరితెగించి సాగించిన ఇసుక దోపిడీ గుట్టు రట్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు పన్నిన పన్నాగం ఆధారాలతోసహా బట్టబయలు అయ్యింది. 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి గండి కొట్టడమే కాక, చంద్రబాబు ముఠా ఏకంగా రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడిందన్నది విభ్రాంతి పరుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ–1గా పీతల సుజాత (టీడీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రి), ఏ–2గా చంద్రబాబు (అప్పటి ముఖ్యమంత్రి), ఏ–3గా చింతమనేని ప్రభాకర్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే), ఏ–4గా దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో జల వనరుల శాఖ మంత్రి)తోపాటు మరికొందరిని ఏ–5గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానానికి తెలుపుతూ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 120 బి, 409 రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 (1) (డి) రెడ్‌విత్ 13 (2) ప్రకారం అభియోగం నమోదు చేశారు. అంతులేని బాబు ధన దాహం పదేళ్ల తర్వాత 2014లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి బరితెగించారు. ఆ క్రమంలో ఆయన కన్ను రాష్ట్రంలో ఇసుక రీచ్‌లపై పడింది. యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడాలని పన్నాగం రచించారు. అందుకోసం 2014 నుంచి 2016 వరకు ఓ విధానాన్ని తీసుకువచ్చి, అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు. అంతటితో ఆయన ధన దాహం తీరలేదు. దాంతో మరింతగా బరితెగించి ఇసుక దోపిడీ సాగించేలా వ్యూహం పన్నారు. అందుకోసం ప్రభుత్వ ఇసుక విధానాన్ని పునఃసమీక్షించాలని కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. అనంతరం కొత్త ఇసుక విధానాన్ని నిర్ణయిస్తూ 2016 జనవరి 15న రెండు జీవోలు (జీవో నంబర్లు 19, 20) జారీ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఇసుక దాహం తీరలేదు. బరితెగించి ఇసుక దోపిడీకి పాల్పడేందుకు మరో విధానాన్ని తీసుకురావాలని చంద్రబాబు భావించారు. ‘ఇసుకను ప్రభుత్వం అమ్మదు.. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు.. ఎవరికి వారు ఇసుక రీచ్‌లకు వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చు.. అమ్ముకోవచ్చు.. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలుగానీ, ఆంక్షలు గానీ విధించదు’ అని చెప్పారు. ఈ మేరకు 2016 మార్చి 4న ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి దొరికిన చోట దొరికినట్లు దోచుకున్నారు. ఇసుక రీచ్‌లు అన్నింటినీ చంద్రబాబు తన చేతిలోకి, మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకువచ్చారు. మెమో 3066తో కనికట్టు ► ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో గత ప్రభుత్వ పెద్దలు మాయాజాలం చేసి, భారీ అవినీతికి పాల్పడ్డారు. కొత్త ఇసుక విధానాన్ని తీసుకువస్తూ టీడీపీ ప్రభుత్వం 2016 మార్చి 4న ప్రత్యేకంగా ‘మెమో నంబరు 3066’ను జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ చంద్రబాబు, ఆయన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హస్తగతం చేసుకున్నారు. ► రాష్ట్రంలో సహజ వనరులకు సంబంధించి, అందులో రాష్ట్ర ఖజానాకు కీలకమైన ఆర్థిక వనరుకు సంబంధించి కేబినెట్ ఆమోదం లేకుండా కేవలం ఒక మెమో ద్వారా కథ నడిపించడం చంద్రబాబు అవినీతికి పరాకాష్టగా నిలిచింది. ఈ మెమో ద్వారా 2016 నుంచి 2019 వరకు అడ్డూ అదుపు లేకుండా ఇసుకను కొల్లగొట్టారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లలో ఎవరెవరు తవ్వుకోవాలో చంద్రబాబు స్వయంగా తన బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. ► అప్పటి వరకు కూలీలతో ఇసుక తవ్వకాలు సాగుతుండగా.. ఒక్కసారిగా భారీ యంత్రాలను ఇసుక తవ్వకాల కోసం తీసుకువచ్చారు. ఇతరులు ఎవరూ ఆ ఇసుక రీచ్‌ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా కట్టడి చేశారు. చంద్రబాబు ముఠా రోజూ వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుకను తవ్వేసి.. అమ్ముకోసాగింది. రాష్ట్రంలో నదుల్లో అందుబాటులో ఉన్న ఇసుక ఎంత.. రోజుకు ఎంత ఇసుక తవ్వుతున్నారు.. ఎంతకు అమ్ముతున్నారు.. ఎన్ని వేల లారీల ఇసుక రోజూ రాష్ట్రం దాటుతోందన్న లెక్కలకు అంతూపొంతూ లేకుండా పోయింది. ► శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు అంతటా యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఇసుకదోపిడీ కుట్రకు చంద్రబాబు సూత్రధారి కాగా, ఈ కుట్రలో అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు మరికొందరు ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. ► అక్రమ ఇసుక తవ్వకాలను ప్రశ్నించినందుకు తహశీల్దార్ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని మరీ దాడికి పాల్పడటం అప్పట్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇది పచ్చ ముఠాల బరితెగింపునకు నిదర్శనం. అంతగా తహశీల్దార్‌పై దాడికి పాల్పడిన తన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అప్పటి సీఎం చంద్రబాబు సమర్థించడం విస్మయ పరిచింది. తమ ఇసుక దోపిడీకి అడ్డు వస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని స్పష్టమైన సందేశం ఇచ్చేందుకే చంద్రబాబు అలా వ్యవహరించారు. టీడీపీ పెద్దల జేబులోకి రూ.10 వేల కోట్లు 2016 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక దోపిడీ విలువ ఎంతన్నది నిగ్గు తేల్చడం గనుల శాఖ అధికారులకే అంతుపట్టడం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాల ద్వారా ఖజానాకు నాలుగు రకాల ఆదాయం రావాలి. సీనరేజీ, కన్సిడరేషన్ చార్జీలు, డిస్ట్రిక్ట్ మైన్స్ ఫండ్, మెరిట్ ఫీజు చెల్లించాలి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్మార్గదర్శకాలను పాటిస్తూ కొత్త ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఆ ప్రకారం 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర ఖజానాకు రూ.766 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ప్రకారం టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2019 వరకు కనీసం రూ.వెయ్యి కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావల్సి ఉంటుందని గనుల శాఖ అంచనా వేసింది. అంటే చంద్రబాబు ‘ఉచిత ఇసుక’ అనే మోసపూరిత విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల గండిపడింది. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా తవ్విన ఇసుక ఎంతన్న అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఠా రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఇసుకను తవ్వి అమ్మేసుకుందన్నది విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిర్భీతిగా నిబంధనలు బేఖాతరు వేల కోట్ల రూపాయల ఇసుక దందా కోసం చంద్రబాబు అన్ని నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘించారు. కేవలం ఒక ‘మెమో’తో ఇసుక దోపిడీకి పాల్పడటం ఆయన కుతంత్రానికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడే రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాల కోసం విధానాలు రూపొందించాలి. ఆ మేరకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. దాంతోపాటు మరో రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఈ మూడింటిలో ఏదైనా ఒకటి కచ్చితంగా పాటించాలి. ► ఇసుక తవ్వకాల కోసం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూపొందించిన బిజినెస్ రూల్స్ (మార్గదర్శకాలు) అనుసరించాలి. ► అంతకంటే మెరుగైన విధానం రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే ఆమేరకు ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. ► ఓ విధానాన్ని రూపొందించి అందుకు కేబినెట్ ఆమోదం పొందాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మోసపూరితంగా తీసుకువచ్చిన ‘ఇసుక విధానం’ కోసం ఈ మూడు విధానాల్లో ఏ ఒక్కటీ పాటించ లేదు. అంటే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటించ లేదు. కొత్త విధానం కోసం ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోలేదు. అప్పటి కేబినెట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించ లేదు. -
చంద్రబాబుపై మరో కేసు నమోదు
సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. ఏపీఎమ్డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు.. చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి చంద్రబాబు రూ. 100 కోట్ల జరిమానా విధించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్,. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుపడ్డ ఓ మహిళా ఎమ్మార్వోపై నాటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెగబడ్డ దాష్టీకానికి అప్పట్లో యావత్తు రాష్ట్రం విస్తుబోయింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లటం ఎవ్వరూ మరిచిపోలేరు. కాకపోతే ఈ వ్యవహారంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరే అన్నిటికన్నా హైలైట్. ఇదేదో గట్టుకింద తగవు మాదిరి... వాళ్లిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేసే సిగ్గుమాలిన ప్రయత్నం చేశారు. అంతేకాని చింతమనేనిపై కేసు పెట్టడానికి మాత్రం చంద్రబాబుకు మనసొప్పలేదు. తవ్వు కోవడం.. దండకోవడం..! చంద్రబాబు హయాంలో ఇసుక దిన్నె(రీచ్)లను గ్రామైక్య సంఘాలకు అప్పగించి, తద్వారా అక్రమ రవాణికు అడ్డుకట్ట వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం బెడిసికొట్టింది. అనంతపురం జిల్లాలో మూడు చోట్ల పెన్నా, చిత్రావతి నదుల్లో ఇసుక తవ్వి అమ్ముకోవడానికి ప్రభుత్వం గ్రామైక్య సంఘాలకు అనుమతి ఇవ్వగా, ఇసుక తవ్వకాల్లో కనీస ప్రమాణాలు పాటించకుండా నదుల్లో ఇష్టానుసారం ఇసుక తవ్వేశారు.. చదవండి: తవ్వుకో.. దండుకో..! చంద్రబాబు సాక్షిగానే రెచ్చిపోయారు.. చంద్రబాబు హయాంలో గుంటూరు జిల్లాలో ప్రకృతి సహజ సంపద అయిన ఇసుకను అక్రమంగా దోచేస్తూ అప్పటి అధికార పార్టీ నేతలు జేబులు నింపుకున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, ధనార్జనే ధ్యేయంగా వీరు డ్రెడ్జర్లు, పొక్లెయినర్లతో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ దందాలో జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి, మరో ఐదుగురు సీనియర్ టీడీపీ నేతలు వారి బంధువులు, అనుచరులు ఇసుక మాఫియా నడుపుతుండటంతో అధికారులు సైతం వీరి జోలికి వెళ్లలేదు. కూలీలను తొలగించి ప్రొక్లయినర్ల ద్వారా ట్రాక్టర్లు, లారీల్లో లోడు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు దండుకున్నారు. ఇది చదవండి: పట్టపగలే దోపిడీ చెలరేగిపోయిన ఇసుకమాఫియా చంద్రబాబు హయాంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన 50 మీటర్ల దూరంలోనే అడ్డగోలుగా కృష్ణానదిలో ఇసుకను తవ్వేశారు. ఎన్జీటీ ఉత్తర్వులు బేఖాతరు చేసి మరీ ఇసుకను తవ్వేశారు. దాంతో బ్యారేజీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ప్రభుత్వ పెద్దల దన్నుతోనే ఇసుక మాఫియా అలా చెలరేగిపోవడం అప్పట్లో విస్మయానికి గురిచేసింది. ఇది చదండి: ప్రకాశం బ్యారేజీకి ముప్పు! చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు -
Nov 2nd : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases, Petitions, Court Hearings & Political Updates 17:30 PM, నవంబర్ 02 2023 BRS పార్టీలో చేరనున్న కాసాని జ్ఞానేశ్వర్ బాబూ.. మీకో దండం.. ► చంద్రబాబు, లోకేష్‌ల నుంచి బయటకొచ్చేసిన కాసాని ► రేపు ఉదయం బీఆర్ఎస్లో చేరనున్న కాసాని ► గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక ► తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. 17:00 PM, నవంబర్ 02 2023 రేపటి దాకా ఆస్పత్రిలోనే చంద్రబాబు.! ► హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ► ఉదయం 11 గంటలకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాబు ► రేపు మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే చంద్రబాబు 16:45 PM, నవంబర్ 02 2023 చంద్రబాబుపై మరో కేసు నమోదు ► టిడిపి హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు ► APMDC ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడీ ► ఏ1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు ► ఏ3గా చింతమనేని, ఏ4 గా దేవినేని ఉమ ► ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం చేకూర్చారని ఫిర్యాదు ► ఇప్పటి వరకు చంద్రబాబుపై స్కిల్ స్కాం, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్, అసైన్డ్ ల్యాండ్, మద్యం కేసులు ► మొత్తం 6 కేసుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు 15:45 PM, నవంబర్ 02 2023 జనసేనలో ఏం జరుగుతోంది? ► పవన్ కళ్యాణ్ చర్యలతో విసుగు చెందుతోన్న జనసేన నాయకులు ► నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? ► పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మాకినేని శేషుకుమారి ముఖమెందుకు చాటేశారు? ► తిరుపతి జనసేన నాయకులు పసుపులేటి సురేష్, దిలీప్ సుంకర ఎందుకు దూరమయ్యారు? ► రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్ పసుపులేటి పద్మావతి ఎందుకు పార్టీవైపు చూడడం లేదు? ► జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ వెనక ఏం జరుగుతోంది? ► ఇప్పుడు జనసేనలో అధికారం ఎవరి చేతిలో ఉంది? ► జనసేన ప్రధాన కార్యాలయంలో రుక్మిణికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన బాధ్యతలేంటీ? 15:25 PM, నవంబర్ 02 2023 నారా వారిది అబద్దాల ఫ్యాక్టరీ : YSRCP ► సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్‌కు చెప్పింది.. అబద్ధం ► పది శాతం నిధులు పెడితే.. సీమెన్స్ సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందన్నది.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నది.. అబద్ధం ►సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని చంద్రబాబు ఆరోపణ.. అబద్ధం ►48 రోజులకు పైగా జైల్లో ఉండి.. ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్తుండడం.. అబద్ధం ►చంద్రబాబు నాయుడు జైల్లో బరువు తగ్గారని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారం.. అబద్ధం ► జైల్లో సదుపాయాల గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం.. అబద్ధం ►తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ చెప్తుండడం.. అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించడం.. అబద్ధం ►తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతుండడం.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు చెప్తుండడం.. అబద్ధం 15:25 PM, నవంబర్ 02 2023 కాసాని దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన తెలుగుదేశం ► తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదని అధిష్టానాన్ని ప్రశ్నించిన కాసాని.! ► మీకో దండం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటేనా అని ప్రశ్నించిన కాసాని ► కాసాని ప్రకటనను ఇప్పటివరకు ఖండించలేకపోతోన్న తెలుగుదేశం అధిష్టానం ► ఎందుకు పోటీ చేయలేకపోతుందో చెప్పలేకపోతోన్న చంద్రబాబు, లోకేష్ ► హైదరాబాద్‌లో చాలా బలంగా ఉన్నామంటూ ర్యాలీలు చేసిన వారు పోటీకి ఎందుకు భయపడ్డారు? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో గత ఎన్నికల్లో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా బిల్డప్‌లు ఎందుకు? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► చింత చచ్చినా.. పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్ కోసం ఎందుకు కుటిల ప్రయత్నాలు ► చంద్రబాబు ఏం చేస్తున్నారో నిన్న ఢిల్లీలో బయటపెట్టిన బీజేపీ నేత ఈటల రాజేందర్ ► తెలంగాణలో చంద్రబాబును ఎవరూ నమ్మబోరన్న డాక్టర్ లక్ష్మణ్ ► బీజేపీని బ్లాక్మెయిల్ చేసేలా ఉంటోన్న చంద్రబాబు చర్యలు 15:20 PM, నవంబర్ 02 2023 బాబు విడుదల తర్వాత తేడా కొడుతున్న నెంబర్లు ► తెలుగుదేశం, జనసేన పొత్తుపై పలు సందేహాలు ► జైల్లో చంద్రబాబును కలిసి బయట పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ► ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు ► తమకు 50 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు కావాలని చెప్పిన పవన్ ► ఇప్పుడు 20 అసెంబ్లీ, 3 పార్లమెంటు ఇవ్వాలన్న యోచనలో తెలుగుదేశం ► చంద్రబాబు విడుదలైన తర్వాత కరకట్ట ఇంట్లో సుదీర్ఘంగా చర్చలు ► అన్ని చోట్లా మనమే పోటీ చేద్దామని బాబుకు చెబుతోన్న టిడిపి నేతలు ► తెలంగాణలో పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ ఇచ్చేది 10కి మించబోవంటున్న టిడిపి నేతలు ► జనసేన సీను అంతే అయినప్పుడు మనమెందుకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటున్న టిడిపి నేతలు ► పునరాలోచనలో పడ్డ తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ 15:15 PM, నవంబర్ 02 2023 భువనేశ్వరీ నిజం నిలిచిపోయిందా? ► రూ.3లక్షల చొప్పున ఇస్తామంటూ ఘనంగా తెలుగుదేశం ప్రకటనలు ► చంద్రబాబు కోసం చనిపోయారు కాబట్టి రూ.3లక్షలు ఇస్తామన్న భువనేశ్వరీ ► అలా ఓ నలుగురికి పంచేసరికి మారిపోయిన సీను ► చంద్రబాబు విడుదల కాగానే నిలిచిపోయిన నిజం యాత్ర ► మిగతా వాళ్లకెపుడు ఇచ్చేది మూడు లక్షల చెక్కులు? ► పాత డేట్లతో ముందే చెక్కులు ఎలా తయారు చేశారు? ► మీ నిజం యాత్రకు నిజంగానే బ్రేకులేశారా? 14:55 PM, నవంబర్ 02 2023 చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టిడిపి చెప్పిన రోగాల జాబితా ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, నడుము తట్టుకోలేదు, వీపరీతంగా నొప్పి ఉంది : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ ►మరి, వీటన్నింటికి సరైన ట్రీట్మెంట్ ఇప్పుడయినా చేయిస్తున్నారా? : YSRCP ►ఇన్ని సమస్యలున్నా.. చంద్రబాబు 14గంటల పాటు ర్యాలీ చేశారా? : YSRCP 14:35 PM, నవంబర్ 02 2023 మ్యానిఫెస్టోను అలా విజయవంతంగా మరిచిపోయారు.! ► నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో అంటూ టిడిపి, జనసేన గత వారం ఘనంగా ప్రచారం ► అక్టోబర్ 25న రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన లోకేష్, పవన్ కళ్యాణ్ ► చంద్రబాబు జైల్లో (అక్టోబర్ 25న) ఉన్నాడు కాబట్టి మినీ మ్యానిఫెస్టో అని ప్రకటన ► ప్రకటన చేసిన పవన్‌కళ్యాణ్ ఇటలీకి జంప్, కోరస్ ఇచ్చిన లోకేష్ ఢిల్లీకి జంప్ ► జైలు నుంచి విడుదలయిన చంద్రబాబు హైదరాబాద్‌కు జంప్ ► మ్యానిఫెస్టో గురించి ఎవరయినా అడిగినా.? అంతే సంగతులు ► మ్యానిఫెస్టోను మాయం చేసిన చరిత్ర ఉన్న పార్టీలే టిడిపి, జనసేన : YSRCP 14:29 PM, నవంబర్ 02 2023 స్కిల్ అంతా స్కామే : ఆర్థికమంత్రి బుగ్గన ►విజయవాడలో ఆర్థికమంత్రి బుగ్గన ►స్కిల్ స్కామ్ GST వల్ల బయట పడింది ►2018 లోనే మన రాష్ట్రానికి విచారణ చెయ్యమని లేఖ రాశారు ►GST, SEBI, ED విచారణ చేసిన స్కామ్ ఇది ►2017 నుండి ఈ కేసులో విచారణ జరుగుతోంది ►అలాంటి కేసు CID విచారణ చెయ్యకూడదా..? ►అసలు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా..? ►5 రోజుల్లోనే ట్రైనింగ్ సాధ్యమా..? దానిని ట్రైనింగ్ అంటారా..? ►డెమో చూపించి దాన్నే ట్రైనింగ్ అని కోట్లు కొల్లగొట్టారు..? ►370 కోట్ల కి డిజైన్ టెక్ ఈరోజు కి ఎంత ఖర్చయ్యిందో బిల్లే ఇవ్వలేదు ►సీమన్స్ కంపెనీ అసలు ఈ గ్రాంట్ ఇన్ కైండ్ అన్న పద్ధతే లేదు అని చెప్పింది ►అనంతపురం JNTU సెంటర్ లో లెక్కేస్తే 8 కోట్లు పరికరాలు ఉన్నాయి ►ఎంత చూసిన ఈ స్కామ్ లో 250 కోట్లు లెక్కలు దొరకడం లేదు ►పయ్యావుల కేశవ్ కోర్టు తేల్చేంత వరకు ఓపిక పట్టాలి ►కోర్టుకి ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా..? ►విచారణలో సేకరించిన ఆధారాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు 14:12 PM, నవంబర్ 02 2023 పయ్యావులకు బోలెడు అనుమానాలు ►స్కిల్ కేసుపై పయ్యావుల కేశవ్ పరిశోధన ►90%-10% అనేదే కాదని చెబుతున్నారు, మరో 5 రాష్ట్రాలు చేశాయి ►MOUపై తేదీ లేకుండా సంతకం పెట్టారని ఆరోపిస్తున్నారు ►ప్రధాన కంపెనీ జర్మనీలో ఉంది, సీమన్స్ కు మీరు లేఖ రాశారా? ►గ్రాంట్ ఇన్ ఎయిడ్ కు బదులు గ్రాంట్ ఇన్ కైండ్ అని రాసుకున్నారు. పదాలు మార్చినా.. ఆరోపణలు చేస్తారా? ►అయ్యా.. కేశవా.. ఇదే ఆర్గ్యుమెంట్ కోర్టు ముందు వినిపిస్తారా? : YSRCP ►ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉంటే.. 17a ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని ఎందుకు వాదిస్తున్నారు? ►తప్పు చేయలేదు అన్న ఏకవాక్యాన్ని కోర్టు ముందు ఎందుకు వినిపించడం లేదు? 14:09PM, నవంబర్ 02 2023 చంద్రబాబు కేరాఫ్ AIG ►చంద్రబాబుకు వైద్య పరీక్షలు ప్రారంభించిన ప్రత్యేక వైద్య బృందం ►ముందుగా చర్మ సంబంధ వైద్య పరీక్షలు ►దాంతో పాటు సాధారణ పరీక్షలు చేయనున్న వైద్యులు ►వెన్నుముక సంబంధిత వైద్య పరీక్షలు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు 3 నుంచి 4 గంటల సమయం 13:29PM, నవంబర్ 02 2023 టీడీపీ ఖేల్ ఖతం ►చంద్రబాబు ఒక దొంగ.. ప్రజల డబ్బులు దోచేశాడు ►దొంగ అయిన చంద్రబాబు బయటకు వస్తే జనాలు ఏం ఆదరిస్తారు? ►40ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు సింపతీ కోసం ఒక గేమ్ ఆడుతున్నాడు ►ఈ రాష్ట్రంలో అతి పెద్ద రోగిస్టు చంద్రబాబు ►అనేక రోగాలు ఉన్నాయి అని కోరితే కోర్టు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చింది ►లోకేష్ వల్ల కాకపోవడంతో పురందేశ్వరి బీజేపీ ముసుగులో బాబు కోసం పని చేస్తున్నారు ►టీడీపీ పని అయిపొయింది.. ఇక కోలుకోదు :::విజయవాడలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్లు 12:53PM, నవంబర్ 02 2023 మళ్లీ 4 వారాలకు చంద్రబాబు జైలుకే! ►చంద్రబాబు హయాంలో అడ్డగోలు అవినీతి జరిగింది ►బాబు నిజాయితీపరుడు అయితే జైలుకు ఎందుకు వెళ్లారు? ►కన్ను బాగోలేదనే బెయిల్ ఇచ్చారు ►మళ్లీ నాలుగు వారాల తర్వాత జైలుకు రమ్మన్నారు ►అనకాపల్లి సామాజిక సాధికార యాత్ర ప్రారంభ సమావేశంలో మంత్రి బొత్స వ్యాఖ్యలు ఇదీ చదవండి: బాబుకు అనారోగ్యం సాకు మాత్రమే! 12:29PM, నవంబర్ 02 2023 ఆధారాలివ్వండి ►ఏపీ హైకోర్టులో సంజయ్, పొన్నవోలుపై పిల్ ►ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ పిటిషన్ ►ప్రెస్ మీట్ల కోసం వారు ప్రజాధనం ఖర్చు చేసినట్లు ఆధారాలున్నాయా? ►ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏం మాట్లాడారో....తర్జుమా చేసి ఇవ్వండి ►పిటిషనర్ కు ధర్మాసనం ప్రశ్న ►విచారణ 8వ తేదీకి వాయిదా 12:07PM, నవంబర్ 02 2023 బాబుకు వైద్య పరీక్షలు ►హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు సుమారు 4 గంటలు పట్టే అవకాశం 11:54AM, నవంబర్ 02 2023 చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ►అరెస్ట్ తర్వాత నిన్న హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలీ ►ర్యాలీపై హైదరాబాద్ లో కేసు నమోదు ►ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు ►పనిగట్టుకుని జనసమీకరణ చేపట్టిన తెలుగుదేశం నేతలు ►చంద్రబాబు ర్యాలీ యాత్రలను సమర్థించుకున్న అచ్చెన్నాయుడు 10:30AM, నవంబర్ 02 2023 ఏఐజీ ఆసుపత్రికి నారా లోకేశ్ ►హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న నారా లోకేశ్ ►మరికాసేపట్లో ఆసుపత్రికి వెళ్లనున్న చంద్రబాబు ►చంద్రబాబు వెళ్తున్న దృష్ట్యా ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు 08:20AM, నవంబర్ 02 2023 వైద్యపరీక్షలు చేయించుకోనున్న చంద్రబాబు ►ప్రత్యేక విమానంలో నిన్న హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ►జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి ►నిన్న చంద్రబాబును కలిసిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యుల బృందం ►వైద్యుల సూచన మేరకు నేడు ఏఐజీకి ►హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వైద్య పరీక్షల నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశం 07:18AM, నవంబర్ 02 2023 ఫైబర్ నెట్ కుంభకోణంలో సీఐడీ దూకుడు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు నిర్ణయం ►ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని ప్రతిపాదన ►సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం ►అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న సీఐడీ ►టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదన ►ఆమోదిస్తూ రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు ►ఈ కేసులో ఎ 1 గా వేమూరి హరికృష్ణ, ఎ 11 గా టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్, ఎ -25 గా చంద్రబాబునాయుడి పేర్లు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో నిందితులైన టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్ కి ఆస్ధులతో పాటు పలు కంపెనీల ఆస్ధులు అటాచ్ చేయాలని ప్రతిపాదన ►తుమ్మల గోపీచంద్ మరియు ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్ ►ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇల్లులు అటాచ్ ►మొత్తంగా అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ►హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనున్న సీఐడీ ఇదీ చదవండి: చంద్రబాబు కనుసన్నల్లోనే ‘ఫైబర్ గ్రిడ్’ అక్రమాలు 07:13AM, నవంబర్ 02 2023 అదనపు షరతుల పిటిషన్‌పై నిర్ణయం రేపే ►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సీఐడీ అనుబంధ పిటిషన్ ►బెయిల్‌కు మరికొన్ని షరతులు విధించాలని కోర్టుకు విజ్ఞప్తి ►బుధవారం కొనసాగిన వాదనలు ► సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయన్న బాబు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ ►కోర్టు ఉత్తర్వులను చంద్రబాబు ఉల్లంఘించారని.. జైలు బయట మీడియా సమావేశం నిర్వహించారన్న సీఐడీ తరఫు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►ప్రత్యేక పరిస్థితుల్లోనే చంద్రబాబుకి కోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చిందని గుర్తు చేసిన ఏఏజీ ► శుక్రవారం నిర్ణయం వెల్లడిస్తామన్న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 06:59AM, నవంబర్ 02 2023 మళ్లీ ఢిల్లీకి వెళ్లిన లోకేష్‌పై సెటైర్లు ►మళ్లీ నిన్న ఢిల్లీకి వెళ్లిపోయిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు ►టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు మీద ఉన్న కేసులపై న్యాయ నిపుణులతో చర్చించేందుకేనన్న ప్రచారం ►వ్యక్తిగత పని మీద అని టీడీపీ వివరణ ►నవంబర్ 8న సుప్రీంలో క్వాష్ పిటిషన్‌పై తీర్పు.. 9న ఫైబర్కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►పదుల సంఖ్యలో పిటిషన్లపై చర్చ కోసమేనంటూ ప్రచారం ►మళ్లీ.. అరెస్ట్ భయంతోనేనంటూ సోషల్ మీడియాలో సెటైర్లు 06:49AM, నవంబర్ 02 2023 చంద్రబాబు కోసం జనాలు.. టీడీపీ నేతల తంటాలు ►జైలు జీవితం తర్వాత కరకట్ట ఇంటి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు ►యథేచ్ఛగా కోర్టు షరతులను ఉల్లంఘించిన చంద్రబాబు ►మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు చంద్రబాబు యాత్రల పేరిట హడావిడి ►నిన్న సాయంత్రం హైదరాబాద్‌కు చేరిక ►బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా టీడీపీ భారీ ర్యాలీ ►జనసమీకరణలో పోటీ పడ్డ తెలుగుదేశం నాయకులు 06:40AM, నవంబర్ 02 2023 స్కిల్డ్ దొంగ.. చంద్రబాబు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో అవినీతికి పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►సీఎంగా ఉన్న టైంలో ప్రభుత్వ ఖజానా నుంచి షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు ►కొల్లగొట్టిన రూ.371 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాకు చేరాయని ఆధారాలు సమర్పించిన సీఐడీ ►సెప్టెంబర్ 09వ తేదీన అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్టోబర్ 31 సాయంత్రం మధ్యంతర బెయిల్ మీద విడుదల ►52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ►కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలతో వరుస పిటిషన్లు ►చివరకు ఏపీ హైకోర్టులో స్వల్ఫ ఊరట ►షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ►నాలుగు వారాల తర్వాత.. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5గం.లోపు జైల్లో సరెండర్ కావాలని చంద్రబాబుకి ఆదేశం ►కేవలం మానవతా ధృక్పథం.. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇస్తున్నామన్న హైకోర్టు ►కంటి సర్జరీ కోసం బెయిల్.. ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనద్దని ఆదేశం ►షరతులు ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరిక -
Live : చంద్రబాబు కేసుల అప్డేట్స్
Chandrababu Naidu Cases, Petitions, Court Hearings Update 6:51 PM నవంబర్ 01, 2023 హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అతిక్రమించిన చంద్రబాబు ►చంద్రబాబు కాన్వాయితో సహా వందలాది వాహనాలతో ర్యాలీ ►భారీ ట్రాఫిక్ జాం వాహనదారుల తవ్ర ఇబ్బందులు ►బేగంపేట నుండి పంజాగుట్ట, బంజారాహిల్స్ భారీ ట్రాఫిక్ ►వాహనాలను అడ్డం పెట్టి నగర వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న టీడీపీ నాయకులు ►అంబులెన్స్‌కు సైతం సైడ్ ఇవ్వకుండా ర్యాలీ ►ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు 5:20 PM నవంబర్ 01, 2023 బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న చంద్రబాబు ►ఏపీ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ చంద్రబాబు ర్యాలీ ►చంద్రబాబు రాజకీయ ర్యాలీలకు అనుమతి లేదన్న హైకోర్టు ►హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని చంద్రబాబు, టీడీపీ శ్రేణులు 3:40 PM నవంబర్ 01, 2023 రామకృష్ణ కన్స్ట్రక్షన్ ఎండీ అంజనీకుమార్ పిటిషన్‌పై విచారణ ►అసైన్డ్ భూముల కేసులో అంజనీకుమార్ క్వాష్, ముందస్తు బెయిల్ పిటిషన్ ►విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 3:30 PM నవంబర్ 01, 2023 చంద్రబాబు బెయిల్ షరతుల పై హైకోర్టులో విచారణ ►బెయిల్ ఉత్తర్వుల్లో మరికొన్ని షరతులు విధించాలని సీఐడీ అనుబంధ పిటిషన్ ►కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►చంద్రబాబుకు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ►ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు ►కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదు, రాజకీయ సభలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని షరతులు ప్రతిపాదించిన సీఐడీ ►సీఐడీ కండిషన్స్‌పై కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు లాయర్లు 3:20 PM నవంబర్ 01, 2023 కాసేపట్లో హైదరాబాద్ బల్దేరనున్న చంద్రబాబు ►గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట చేరుకోనున్న చంద్రబాబు ►జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు ►రేపు సాయంత్రం వరకు చంద్రబాబుకు వైద్య పరీక్షలు 3:15 PM నవంబర్ 01, 2023 చంద్రబాబు బెయిల్ పై సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్ పై తీర్పు వాయిదా ►సీఐడీ అనుబంధ పిటిషన్ పై ఎల్లుండి తీర్పు వెల్లడించనున్న హైకోర్టు ►సీఐడీ షరతులు ప్రాథమిక హక్కులకు భంగమని చంద్రబాబు లాయర్లు వాదనలు 3:11 PM నవంబర్ 01, 2023 సీఐడీ పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ ►అసైన్డ్ భూములు కేసులో చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్లు ►ఈ కేసులో విచారణ రీ ఓపెన్ చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ►అసైన్డ్ కుంభకోణాలకు సంబంధించి ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపిన సీఐడీ న్యాయవాదులు ►ఇప్పటికే ఆడియో క్లిప్స్ కోర్టుకు నివేదించామని తెలిపిన సీఐడీ తరఫున న్యాయవాదులు ►వీడియో క్లిప్ రేపు కోర్టు సబ్మిట్ చేస్తామని తెలిపిన సీఐడీ తరఫున న్యాయవాదులు ►తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా 2:57 PM నవంబర్ 01, 2023 నారాయణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో నారాయణ ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ ►తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసిన హైకోర్టు 1:00 PM నవంబర్ 01, 2023 సాయంత్రం హైదరాబాద్‌కు చంద్రబాబు ►విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చంద్రబాబు ►మధ్యాహ్నం 3గంటలకు కరకట్ట ఇంటి నుంచి బయల్దేరనున్న బాబు ►సాయంత్రం 4.45గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాబు ►బేగంపేట నుంచి చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీకి టిడిపి సన్నాహాలు ►బలప్రదర్శన చూపించేందుకు జనసమీకరణ చేస్తోన్న తెలుగుదేశం నేతలు ►నిన్నంతా రాజమండ్రి, విజయవాడను అస్తవ్యస్తం చేసిన తెలుగుదేశం నేతలు ►కోర్టు సూచించినా మారని చంద్రబాబు తీరు ►నిన్న జైలు నుంచి బయటకు రాగానే మైక్ అందుకున్న బాబు 12:56 PM నవంబర్ 01, 2023 స్కిల్ కేసులో టిడిపి సాంకేతిక పిటిషన్లు ►ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు పై చర్యలు తీసుకోవాలన్న పిల్ పై విచారణ ►పిల్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ►స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రెస్‌మీట్ లు ఏర్పాటు చేశారని పిల్ ►ప్రజాధనం ఎంత వృధా అయ్యిందో వివరాలు తెలపాలన్న కోర్టు ►ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదన్న పిటిషనర్ ►మరోసారి వివరాల కోసం దరఖాస్తు చేయాలన్న కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ►తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా 12:45 PM నవంబర్ 01, 2023 నారాయణ పిటిషన్లు నవంబర్ 15కి వాయిదా ►అసైన్డ్ భూముల కొనుగోలులో మాజీ మంత్రి నారాయణ వేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ►కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన సీఐడీ ►తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన హైకోర్టు 12:35 PM నవంబర్ 01, 2023 సాయంత్రమే లోకేష్ రిటర్న్ జర్నీ.! ►ఢిల్లీలో నారా లోకేష్ ►వ్యక్తిగత పనులపైనే లోకేష్ ఢిల్లీకి వచ్చాడంటున్న టిడిపి వర్గాలు ►మధ్యాహ్నం లాయర్ లూథ్రాతో భేటీ కానున్న లోకేష్ ►సాయంత్రమే హైదరాబాద్ కు లోకేష్ తిరుగు ప్రయాణం 11:55 AM నవంబర్ 01, 2023 షరతుల పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ ►సీఐడీ అనుబంధ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా ►చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లో అదనపు షరతులు ఇవ్వాలని పిటిషన్ ►మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు ►కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు 11:45 AM నవంబర్ 01, 2023 కరకట్ట ఇంట్లోనే వైద్య పరీక్షలు ►చంద్రబాబుకు కరకట్ట ఇంట్లోనే వైద్య పరీక్షలు ►హైదరాబాద్ నుంచి అమరావతికి AIG వైద్య సిబ్బంది ►ప్రాధమిక పరీక్షలు, రక్తం నమూనాల సేకరణ ►మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ కు చంద్రబాబు ►హైదరాబాద్ వచ్చిన తర్వాత కంటి ఆపరేషన్ గురించి నిర్ణయం 11:40AM నవంబర్ 01, 2023 క్వాష్ పిటిషన్‌కు ముందు పురాణాలు వల్లిస్తోన్న లూథ్రా ►చంద్రబాబు లాయర్, సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా ట్వీట్ల జపం ►సిక్కుల పదో గురువు అమరపదాలను షేర్ చేసిన లూథ్రా ►గతంలోనూ కత్తులు తిప్పాలి అంటూ ట్వీట్లు చేసిన లూథ్రా The 10th guru's immortal words in Zafarnama. Translation by Navtej Sarna pic.twitter.com/p7TDmoCfl3 — Sidharth Luthra (@Luthra_Sidharth) October 31, 2023 11:32AM నవంబర్ 01, 2023 మళ్లీ ఢిల్లీకి లోకేష్.. ఇంతకీ అక్కడేం పని.? ►క్వాష్ పిటిషన్ కేసుకు సంబంధించి లాయర్లతో చర్చలంటున్న తెలుగుదేశం వర్గాలు ►లోకేష్ ఢిల్లీ టూరు వెనక మరేదో మతలబు ఉందంటున్న తెలుగు తమ్ముళ్లు ►లోకేష్ ఏమి లాయర్ కాదు, సుప్రీంకోర్టు సీనియర్లకు బ్రీఫింగ్ ఇచ్చే పరిస్థితి లేదు.! ►అయినా హస్తినలో లోకేష్‌కు ఏం పని.? ►మొన్నటి నెల రోజుల ఢిల్లీ పర్యటనలో ఏదో తేడా కొట్టిందని ప్రచారం ►లోకేష్ చేసిన పని వల్లే కేసు కాస్తా తిరకాసు అయిందని ప్రచారం ►లోకేష్‌ను నమ్ముకుని పనిలో దిగిన ఓ పెద్దమనిషికి మొత్తం కథ అడ్డం తిరిగిందని సమాచారం ►డ్యామేజీ కంట్రోల్ కోసం లోకేష్ మళ్లీ ఢిల్లీకి వెళ్లినట్టు టిడిపిలో ప్రచారం 11:11AM నవంబర్ 01, 2023 లంచ్ తర్వాత అదనపు షరతుల పిటిషన్ విచారణ ►స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ►మధ్యంతర బెయిల్‌కి అదనపు షరతులు పెట్టాలని సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు ►పిటిషన్‌పై విచారణ వాయిదా ►పాస్ ఓవర్ కోరిన న్యాయవాదులు ►మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత 2.15కి విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు ►కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు 10:55AM నవంబర్ 01, 2023 అసైన్డ్ భూములు కేసు విచారణ 10కి వాయిదా ►అసైన్డ్ భూములు కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ ►క్వాష్ పిటిషన్ల కేసులో విచారణ రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు ►అసైన్డ్ కుంభకోణంలో ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపిన సీఐడీ న్యాయవాదులు ►ఇప్పటికే ఆడియో, వీడియో క్లిప్స్ కోర్టుకు నివేదించినట్లు వెల్లడి ►చంద్రబాబు, నారాయణ తరపున కౌంటర్ దాఖలు చేసిన లాయర్లు ►ఏపీ హైకోర్టులో తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా ఇదీ చదవండి: అసైన్డ్ భూదోపిడీలో కొత్త కోణం.. గుట్టుగా జీఓ–41 జారీ 10:19AM నవంబర్ 01, 2023 స్కిల్ స్కాంలో బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎప్పుడంటే.. ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు నాయుడు ►రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ►నవంబర్ 10వ తేదీన వాదనలు వింటామని బాబు లాయర్లకు వెల్లడి ఇదీ చదవండి: స్కిల్ స్కాం.. అంతా చంద్రబాబు కనికట్టు 09:55AM నవంబర్ 01, 2023 16న టీడీపీ నేతల పిటిషన్‌పై విచారణ ► ఏపీ హైకోర్టులో టీడీపీ నేతల పిటిషన్ ► గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్షకు ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ సబ్ కమిటీని సవాలు చేస్తూ పిటిషన్ ► 1411 జీవో, 344 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు ► విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 09:29AM నవంబర్ 01, 2023 చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు ►తన హయాంలో కావాల్సిన కంపెనీలకు దోచిపెట్టిన చంద్రబాబు ►కావాల్సిన డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులు ►క్విడ్‌ప్రోకోలో భాగంగా ఎక్సైజ్ పాలసీనే మార్చేసిన నాటి ప్రభుత్వం ►రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టలరీలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు ►ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం ►ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్.. అనుమతించిన న్యాయస్థానం ►ఏ–1గా ఐఎస్ నరేష్, ఏ–2గా కొల్లు రవీంద్ర, ఏ–3గా చంద్రబాబు ►అరెస్టు చేయాలన్న ఉద్దేశంతోనే అందులో నిందితునిగా చేర్చారని చంద్రబాబు అభ్యంతరం ►హైకోర్టులో చంద్రబాబు అత్యవసరంగా లంచ్‌మోషన్ పిటిషన్ ►విచారణ జరిపిన జస్టిస్ మల్లికార్జునరావు ►28 వరకు చంద్రబాబును అరెస్టు చేయబోం ►హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరామ్ ►తదుపరి విచారణ 21కి వాయిదా 09:15AM నవంబర్ 01, 2023 ఇదెక్కడి రోగం? ►ఆస్పత్రి పేరుతో జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు విజయోత్సవాలు ►నిజం గెలిచిందంటూ రాత్రంతా ర్యాలీలు.. బాబు తీరుపై విస్తుపోతున్న ప్రజలు ►చంద్రబాబుకు షరతులతో తాత్కాలిక బెయిల్.. అదీ కంటి ఆపరేషన్ కోసం ►స్కిల్ స్కామ్ కేసు యథాతథమే.. చేసిన నేరం అలాగే ఉంది ►నిజం గెలిచిందంటూ స్వాతంత్య్ర సమర యోధుడిలా ఊరేగింపులా?.. ►తన కోసం జనం తండోపతండాలుగా వచ్చినట్లు హడావుడి ►ముందే కార్యకర్తల సమీకరణ.. రూట్ షెడ్యూల్ విడుదల ►అరెస్టయిన నాటి నుంచే టీడీపీ అధినేత డ్రామాలు ►జైలులో దోమలు.. చర్మ రోగాలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు హంగామా ►అవేమీ పారకపోవడంతో భద్రత లేదని, ప్రాణ హాని ఉందంటూ నాటకాలు ►చివరికి కంటి ఆపరేషన్ కోసం తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటూ వేడుకోలు ►మానవత్వంతో బెయిలిస్తే.. నిజం గెలిచిందంటూ టీడీపీ ఓవరాక్షన్ ఇదీ చదవండి: IRR Case.. తోడు దొంగల రింగ్ 09:10AM నవంబర్ 01, 2023 హైకోర్టు జడ్జిపై పోస్టులు.. చర్యలు తప్పవన్న సీఐడీ ►ఏపీ హైకోర్టు జడ్జి పై కొందరు సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులు పెట్టారు: సీఐడీ చీఫ్ సంజయ్ ►ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్ట ను దెబ్బ తీసే అంశం: సీఐడీ చీఫ్ సంజయ్ ►జడ్జీల పై ఎవ్వరు అసభ్యకరంగా పోస్టులు పెట్టిన తీవ్ర చర్యలు ఉంటాయి: సీఐడీ చీఫ్ సంజయ్ ►జడ్జి పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు: సీఐడీ చీఫ్ సంజయ్ ►నిందితులను పట్టుకుని కోర్టులో ప్రవేశ పెడతాం: సీఐడీ చీఫ్ సంజయ్ 09:02AM నవంబర్ 01, 2023 ఏపీ హైకోర్టులో నేడు చంద్రబాబు లాయర్ల కౌంటర్ ►స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ►ఐదు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు ►మరో 5 నిబంధనలు చేర్చాలంటూ సీఐడీ పిటిషన్ ►ఈరోజు వరకు ర్యాలీలు, మీడియాతో మాట్లాడకూడదంటూ నిన్న ఆదేశాలు జారీ చేసిన కోర్టు ►బెయిల్ షరతులపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ ►మధ్యంతర బెయిల్ కండిషన్స్ పై చంద్రబాబు లాయర్ల కౌంటర్ వేసే అవకాశం ►నిన్న జైలు బయటకు వచ్చాక చంద్రబాబు మీడియాతో మాట్లాడిన విషయాన్ని సైతం ప్రస్తావించనున్న సీఐడీ 08:59AM నవంబర్ 01, 2023 విజయవాడ సీపీకి అచ్చెన్నాయుడు సందేశం ►విజయవాడ సీపీ కాంతిరాణాకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సందేశం ►కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు ప్రయాణిస్తారని సీపీకి అచ్చెన్న స్పష్టం ►చంద్రబాబు ఎక్కడా రాజకీయ యాత్ర చేపట్టలేదని సీపీకి తెలిపిన అచ్చెన్న ►వేలాదిగా ప్రజలు వచ్చినా చంద్రబాబు వాహనం దిగలేదన్న అచ్చెన్న ►చంద్రబాబు కాన్వాయ్ వెంట వేరే వాహనాలు అనుమతించొద్దని సీఐకి తెలిపాం : అచ్చెన్న ►హైకోర్టు నిబంధనలను చంద్రబాబు తూచా తప్పకుండా పాటించామని అచ్చెన్న వెల్లడి ఫైబర్‌నెట్ కేసులో.. అస్మదీయ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపు 08:47AM నవంబర్ 01, 2023 ఏపీ హైకోర్టు జడ్జి ట్రోలింగ్ పై సీఐడీ సీరియస్ ►చంద్రబాబు కేసులో ఏపీ హైకోర్టు జడ్జిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ►కేసు నమోదు చేసిన సీఐడీ ►దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు 08:38AM నవంబర్ 01, 2023 ఢిల్లీ బయల్దేరిన నారా లోకేష్ ►చంద్రబాబు కేసుల కోసం ఢిల్లీకి నారా లోకేష్ బాబు ►సుప్రీంకోర్టులో పెండింగ్ లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ►చంద్రబాబు పై వరుస కేసుల విషయం పై ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించనున్న లోకేష్ : టిడిపి 08:12AM నవంబర్ 01, 2023 ఉండవల్లి నివాసంలో చంద్రబాబు విశ్రాంతి ►చంద్రబాబును పరామర్శించేందుకు నేతలు, కార్యకర్తలు రావొద్దని టీడీపీ విజ్ఞప్తి ►సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కు చంద్రబాబు ►రేపు హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ లో చంద్రబాబుకి వైద్య పరీక్షలు ►అనంతరం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి పరీక్షలు 08:00AM నవంబర్ 01, 2023 చంద్రబాబుకి కండిషన్లతో మధ్యంతర బెయిల్ ►స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ ►52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ►నాలుగు వారాలపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ►నవంబర్ 28వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని ఆదేశం ►అనారోగ్య కారణాల రీత్యా.. కేవలం మానవతా ధృక్పథంతో బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు ►కంటి సర్జరీ కోసమే బెయిల్ అని స్పష్టం చేసిన కోర్టు ►ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశాలు ►కాదని ఉల్లంఘిస్తే.. వెంటనే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరిక ►ట్రీట్మెంట్ వివరాలను ఎప్పటికప్పుడు ఏసీబీ కోర్టుకు సమర్పించాలని ఆదేశం ►మంగళవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు -
కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించిన చంద్రబాబు!
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తొలిరోజే కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తూనే మీడియాతో మాట్లాడారాయన. అంతేకాదు.. జనం మధ్య తిరగకూడదని, ఆస్పత్రికి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కోర్టు విధించిన షరతులనూ ఆయన ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబుకి ఉన్న అరోగ్య కారణాల రీత్యా మానవతాధృక్పథంతో నాలుగు వారాలపాటు పలు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ర్యాలీలో పాల్గొనకూడదని.. మీడియాతో మాట్లాడకూడదు.. కేసు దర్యాప్తును ఏకంగానూ ప్రభావితం చేయకూడదని తీర్పు ఉత్తర్వుల్లో జస్టిస్ మల్లికార్జునరావు స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ హైకోర్టు షరతుల్ని చంద్రబాబు లెక్కచేయలేదు. బయటకు రాగానే వెంటనే మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో.. మధ్యంతర బెయిల్ షరతుల ఉల్లంఘనను సీఐడీ న్యాయవాదులు ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారు. కేవలం కంటి సర్జరీ కోసమే ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 28వ తేదీన సాయంత్రం తిరిగి రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది. షరతులను ఉల్లంఘిస్తే మధ్యంతర బెయిల్ వెంటనే రద్దు అవుతుందని కోర్టు చంద్రబాబును హెచ్చరించింది కూడా. కోర్టును బాబు తప్పుదోవ పట్టించారు కోర్టు తీర్పును ఉల్లంఘించిన చంద్ర బాబు బెయిల్ రద్దు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చీకటిమిల్లి మంగ రాజు కోరుతున్నారు. ఆరోగ్య కారణాలు చూపి, బెయిల్ మీద వచ్చిన చంద్రబాబు.. మీడియా సమావేశంలో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారాయన. ‘‘చంద్రబాబు తనకు రోగాలు ఉన్నాయని కోర్టును తప్పుపట్టించారు. ఆరోగ్యం బాగోలేదని నాటకాలు ఆడారు. కాబట్టి, వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలి. జైలుకు పంపించాలి’’ అని చీకటిమిల్లి మంగరాజు ఒక ప్రకటనలో కోరారు. -
కిడ్నాప్ కేసులో దస్తగిరి అరెస్ట్
ఎర్రగుంట్ల: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని పోలీసులు ఓ కిడ్నాప్ కేసు వ్యవహారంలో అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో నలుగురిపై కిడ్నాప్ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు మీడియాకు తెలిపారు. వేర్వేరు కులాలకు చెందిన ఇమాంబీ, లక్ష్మీనారాయణ డిగ్రీ చదువుతోన్న సమయంలో ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో లక్ష్మీనారాయణతో కలిసి ఇమాంబీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి «విచారణ చేపట్టిన అనంతరం ఇమాంబీని సీఐ ఈశ్వరయ్య తహశీల్దార్ ఎదుట ప్రవేశపెట్టారు. ఇమాంబీ వయసు 18, లక్ష్మీనారాయణ వయసు 21 కావడంతో ఇమాంబీని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఇమాంబీ తల్లిదండ్రులు వద్దంటూ సుందరయ్య కాలనీలోని లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇమాంబీ తల్లిదండ్రులు దస్తగిరి, మరికొందరితో కలసి ఈ నెల 30న లక్ష్మీనారాయణ ఇంటికి వచ్చారు. అక్కడ ఉన్న ఇమాంబీని బలవంతంగా ఈడ్చుకుని వెళ్లారు. ఈ సమయంలో లక్ష్మీనారాయణను దస్తగిరి కులం పేరుతో దూషించాడు. అతడి వెంట ఉండే ఎస్కార్ట్ పోలీసులను ప్రొద్దుటూరుకు పోవాలంటూ తప్పుదోవ పట్టించి కడప వైపునకు బయలుదేరాడు. ఎస్కార్ట్ పోలీసులు యర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యకు సమాచారమిచ్చారు. చెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో దస్తగిరి వెళుతోన్న వాహనాలను ఆపి తనిఖీ చేయగా అందులో ఇమాంబీ ఉంది. ఘటనాస్థలికి వెళ్లి చుట్టు పక్కల వారిని విచారించగా ఇమాంబీని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లి, లక్ష్మీనారాయణను కులం పేరుతో దూషించినట్లు స్పష్టమైంది. దీంతో ఈ విషయంపై 2 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో దస్తగిరి (పులివెందుల), ఎస్ ఇమ్రాన్ (వేముల) బాష, ఎస్ రమీజా(యర్రగుంట్ల), ఎస్.అశి్వన్(పులివెందుల), ఎస్ హైదర్బీ (తొండూరు)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. -
52 రోజుల బాబు జైలు జీవితం ఇలా..
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయనకు మంగళవారం తాత్కాలిక బెయిల్ మంజూరైంది. చంద్రబాబు 52 రోజులపాటు జైలులో ఉన్నప్పటికీ ఆయన కోరిక మేరకు ఏసీతో సహా అన్ని సదుపాయాలు కల్పించారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 24 గంటలపాటు ప్రత్యేక వైద్య బృందాన్ని కేటాయించారు. రోజూ వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు కూడా ఇచ్చారు. ఇలా 52 రోజుల పాటు చంద్రబాబు జైలు జీవితం సాగింది. 53వ రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్టు నుంచి విడుదల వరకు ముఖ్య పరిణామాలు ఇలా.. ♦ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును సెపె్టంబర్ 9న అరెస్టు చేశారు. అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ♦రిమాండ్ ఖైదీగా సెప్టెంబర్ 10 అర్ధరాత్రి 1.30 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ♦ జైల్లో ఆయనకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్ కేటాయించారు. ఏ గదిలో ఉంచారో భద్రతా కారణాల రీత్యా గోప్యంగా ఉంచారు. ♦ కోర్టు ఆదేశాలతో రోజూ ఇంటి భోజనం, మందులు, అల్పాహారం ఆయన ఇంటి నుంచే అందించే వెసులుబాటు కల్పించారు. ♦మొదట సెపె్టంబరు 22 వరకు చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగించారు. ♦ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే రెండురోజుల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారించారు. అన్నింటికీ ‘తెలియదు.. గుర్తులేదు.. మరిచిపోయా’ అనే తీరులో చంద్రబాబు సమాధానం చెప్పారు. ♦ సెప్టెంబర్ 24న మరోసారి బాబుకు రిమాండ్. దీన్ని అక్టోబర్ 5 వరకు కొనసాగించారు. ♦ జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగింది. ♦ చంద్రబాబుకు ముందు నుంచే ఉన్న చర్మ సమస్య జైల్లో ఇంకా పెరిగిపోయిందని ఎల్లో మీడియా కథనాలు అల్లింది. ఆయనకు వైద్యులతో ప్రత్యేక వైద్య బందం ఏర్పాటు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో టవర్ ఏసీ వసతి కచ్చిచారు. ♦ నిత్యం మూడుసార్లు వైద్య పరీక్షలతోపాటు ఒకసారి ఆయన కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు. ♦ చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు. అక్టోబర్ 5 నుంచి 19 వరకు ఏసీబీ కోర్టు జ్యుడిíÙయల్ రిమాండ్ పొడిగించింది. ♦ వారానికి రెండుసార్లు బాబుతో ములాఖత్ అయిన ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి. ♦ బాబు ఆరోగ్యంపై టీడీపీ, ఎల్లో మీడియా 5 కిలోలు బరువు తగ్గారంటూ విష ప్రచారం. ♦ చంద్రబాబు కిలో బరువు పెరిగారని, జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉండేవారని, ఇప్పుడు 67 కిలోలు ఉన్నారని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. విడుదల సమయానికి అర కిలో పెరిగి 67.5 కిలోలకు చేరుకున్నారు. ♦ అక్టోబర్ 19 నుంచి నవంబర్ 1 వరకు చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు. ♦ తన కుడి కంటికి కాటరాక్ట్ సర్జరీ అవసరమని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు. ఆయనకు జీజీహెచ్ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు. ♦ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. -
చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది . స్కిల్ స్కాం కేసులో.. అదీ ఆరోగ్య కారణాల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈ క్రమంలో పలు షరతులు విధించింది. ‘‘చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేవలం ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనరాదు. బెయిల్ గడువు ముగిశాక నవంబర్ 28వ తేదీ సాయంత్రం లొంగిపోవాలి. చంద్రబాబు ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ మరుక్షణమే రద్దు అవుతుంది’’అని తీర్పు కాపీలో జస్టిస్ మల్లికార్జున రావు స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేవలం స్కిల్ స్కామ్ కేసులో.. అదీ కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు అయినట్లు తెలుస్తోంది. అలాగే నవంబర్ 10న ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేటికి రిమాండ్ ఖైదీగా 52 రోజులు పూర్తి చేసుకున్నారాయన. చంద్రబాబు మధ్యంతర బెయిల్ కోర్టు కాపీ కోసం క్లిక్ చేయండి -
విజయనగరం రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ
సాక్షి, విజయనగరం: విజయనగరం కంటకాపల్లి రైల్వే ప్రమాదంపై బహిరంగ విచారణ జరపనున్నారు అధికారులు. బుధవారం, గురువారం విశాఖపట్నం డివిజనల్ మేనేజర్, వాల్తేర్ కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. ఇప్పటికే అలమండ, కొత్తవలసల మధ్య ప్రత్యక్ష సాక్షుల్ని, అలాగే క్యాబిన్ ఉద్యోగుల్ని ప్రశ్నిస్తున్నారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యం కోణంలోనే విచారణ అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. విజయనగరం రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 52 మందిని క్షతగాత్రులుగా గుర్తించింది. వీరిలో ఎక్కువమంది స్వల్ప గాయాలతో బయటపడి ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు అలమండ పీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. తలకు బలమైన గాయాలైన వారు, కళ్లు దెబ్బతిన్న వారు, ఎముకలు విరిగిన వారు 29 మంది విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చేరారు. సోమవారం సీఎం జగన్ ఆస్పత్రికి వెళ్లి వాళ్లను ఓదార్చారు. నేడు క్షతగాత్రులకు శస్త్ర చికిత్సలు చేయనున్నారు వైద్యులు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి కంటకాపల్లి-అలమండ మధ్య జరిగిన ఈ దుర్ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. నెమ్మదిగా వెళ్తున్న పలాస-విశాఖ ప్యాసింజర్‌ను.. వెనుక నుంచి వేగంగా వచ్చిన రాయగఢ-విశాఖ ప్యాసింజర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 13 మంది మృతి చెందారు. నిత్యం విశాఖకు రాకపోకలు సాగించే వందలాది మంది నిత్యం ఈ రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. ఆదివారం సెలవు నేపథ్యంలో రద్దీ చాలా తక్కువగా ఉంది. లేదంటే... ఎలా ఉండేదోనని ఆ ఘటనను తలచుకొని భయభ్రాంతులకు గురవుతున్నారు. సిగ్నలింగ్ లోపమా? మానవ తప్పిదమా? విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపమా, మానవ తప్పిదమా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఒకదాని వెనుక మరొకటి ప్రయాణించే సమయంలో ముందు వెళ్లే రైలు పట్టాలు తప్పినా, ఆగిపోయినా వెనుక వచ్చే రైలు ఆగిపోయేలా సిగ్నలింగ్ వ్యవస్థ పని చేయాలి. అలాగే.. రైలు వేగం గంటకు 10, 15 కిలోమీటర్లకు పరిమితం కావాలి. విశాఖపట్నం నుంచి పలాస వెళ్లే ప్యాసింజర్ నెమ్మదిగా వెళ్లినా వెనుక వచ్చిన రాయగడ ప్యాసింజర్ అధిక వేగంతో వచ్చి ఢీకొట్టడంతోనే పెనుప్రమాదం జరిగింది. నేడు కూడా పలు రైళ్ల రద్దు కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సాధారణ ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. రిజర్వేషన్ చేయించుకున్న పలువురు ఆదివారం రాత్రి నుంచి స్టేషన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే సోమవారం సాయంత్రంలోపే కంటపల్లి వద్ద ట్రాక్ పనులు పూర్తి అయ్యాయి. దీంతో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. కానీ, ఇవాళ కూడా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్ని రైళ్ల సమయాల్లో మార్పు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇవాళ(అక్టోబర్ 31న).. హావ్‌డా-సికింద్రాబాద్(12703) ఫలక్‌నుమా, హావ్‌డా-ఎస్ఎంవీ బెంగళూరు(12245) దురంతో, షాలిమార్-హైదరాబాద్(18045) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. అలాగే.. తిరుపతి-పూరి (17480) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(08531) పాసింజర్, తిరుపతి-విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ-గుణుపూర్(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 31న రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40గంటలకు బదులు ఉదయం 10గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. -
Oct 31st 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest, Remand, Cases, Petitions, Court Hearings And Political Updates 07:05 PM, అక్టోబర్ 31, 2023 52 రోజుల ప్రస్థానం ఇది - టైంలైన్ ►రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు ►సెప్టెంబరు 9న స్కిల్ స్కాంలో అరెస్టు, అదే రోజు ఏసీబీ కోర్టు రిమాండ్ ►రిమాండ్ ఖైదీగా సెప్టెంబరు పది అర్ధరాత్రి ఒంటిగంటన్నరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబు ►జైల్లో చంద్రబాబుకు ప్రత్యేకంగా స్నేహా బ్లాక్ కేటాయింపు ►కోర్టు ఆదేశాల మేరకు ప్రతి రోజూ భోజనం, మందులు ఇంటినుంచే అందించే వెసులు బాటు ►సెప్టెంబరు 22 వరకు రిమాండ్, రెండురోజులపాటు సీఐడీ కస్టడీ విచారణ ►రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రెండురోజుల పాటు సీఐడీ అధికారులు విచారణ, తెలియదు, గుర్తులేదు అన్న చంద్రబాబు ►జైల్లో దోమలు ఉన్నాయని, చంద్రబాబుకు ముప్పు పొంచిఉందని పచ్చమీడియా విపరీతమైన ప్రచారం ►సెప్టెంబరు 24న మరోసారి చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు, అక్టోబరు ఐదువరకూ రిమాండ్ కొనసాగింపు ►చంద్రబాబుకు చర్మ వ్యాధి ఉందంటూ పచ్చమీడియా విపరీత ప్రచారం, ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు ►కోర్టు ఆదేశాలమేరకు చంద్రబాబుకు టవర్ ఏసీ ఏర్పాటు ►చంద్రబాబుకు రోజుకు మూడు సార్లు వైద్య పరీక్షలు ►ఒక వైద్య పరీక్షలో ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు ►చంద్రబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు, అక్టోబరు 5నుండి 19వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు ►వారానికి రెండుసార్లు చంద్రబాబుతో ములాఖత్ అయిన భువనేశ్వరి, లోకేష్ ,బ్రాహ్మణి ►చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం, ఐదు కిలోలు బరువు తగ్గారంటూ ఆందోళన ►చంద్రబాబు కిలో బరువు పెరిగారని, జైలుకు వచ్చినపుడు 66 కిలోలు ఉండేవారని, ఇపుడు 67 కిలోలు ఉన్నారని స్పష్టం చేసిన అధికారులు ►విడుదల సమయానికి మరో అరకిలో పెరిగి 67.5 కిలోలకు చేరుకున్నచంద్రబాబు ►అక్టోబరు 19 నుండి నవంబరు ఒకటి వరకూ చంద్రబాబు జ్యుడిషియర్ రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు ►తన కుడికంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయాలని జైలు అధికారులకు తెలిపిన చంద్రబాబు ►జీజీహెచ్ వైద్యులతో పరీక్షలు చేయించిన అధికారులు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు 06:45 PM, అక్టోబర్ 31, 2023 రాజమండ్రిలో టిడిపి అతితో గందరగోళం ►రెండు గంటలయినా రాజమండ్రి దాటని చంద్రబాబు కాన్వాయ్ ►దివాన్ చెరువు మీదుగా వేమగిరి వైపు కాన్వాయ్ ►భారీగా కార్యకర్తలను తరలించిన టిడిపి నేతలు ►టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా పోటెత్తడంతో రాజమండ్రి అస్తవ్యస్తం ►చంద్రబాబు కాన్వాయ్‌కు పోటీగా వందలాది వాహనాలను తీసుకొచ్చిన టీడీపీ నేతలు ►వందలాది వాహనాలు రావడంతో స్తంభించిపోయిన రాజమండ్రి ►తెలుగుదేశం ప్రైవేట్ వాహనాల రాకతో భారీగా ట్రాఫిక్ జామ్ ►దివాన్ చెరువు వద్ద వాహనాలను నిలపడానికి పోలీసుల ప్రయత్నం ►పోలీసుల ఆదేశాలను ధిక్కరించి ట్రాఫిక్‌కు అడ్డు తగులుతోన్న టిడిపి కార్యకర్తలు ►వేమగిరి,రావులపాలెం,పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్,గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు 06:20 PM, అక్టోబర్ 31, 2023 బాబు లాయర్ల పిటిషన్ కొట్టివేత ►చంద్రబాబు లాయర్ల పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు ►సీఐడీ అధికారుల కాల్‌డేటా స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►సీఐడీ తరపున వివేకానంద వాదనలు ►చంద్రబాబు తరపున దమ్మాలపాటి వాదనలు ►ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ►పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 05:49 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ సరే, నిజం గెలవాలి సంగతేంటీ? : మంత్రి కొట్టు సత్యనారాయణ ►విజయవాడలో మాట్లాడిన డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ పిసి ►చంద్రబాబుకు మధ్యంతర బెయిలు వచ్చింది కాబట్టి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటారా? ►టీడీపీ జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది...అలాంటి పార్టీ తెలంగాణాలో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం ఏమిటి? ►తెలంగాణాలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తేలిపోయినట్టేనా? ►సైబర్ సిటినీ తానే నిర్మించానని చెబుతున్న చంద్రబాబు తెలంగాణా ఎన్నికల్లో ఎందుకు చేతులెత్తేసారు? ►ఏపీలోనూ సొంతంగా పోటీ చేసే సత్తా లేక జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జాతీయ పార్టీగా అని ఎలా చెప్పుకుటుంది? ►ఏపీలో జనసేన-టీడీపీ పొత్తు ఎంతవరకూ నిలబడుతుందని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు.! ►మేముంటేనే మీరని జనసేన-టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి.! ►చంద్రబాబును జైల్లో పెడితే రోడ్డుపై పడుకుని పవన్ కల్యాణ్ నానా విన్యాసాలు చేశారు 05:42 PM, అక్టోబర్ 31, 2023 షరతులు బేఖాతరు ►తూర్పుగోదావరి జిల్లా : మధ్యంతర బైలుకు సంబంధించి హైకోర్టు విధించిన షరతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు ►జైలు బయటికి వచ్చిన వెంటనే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ►నిబంధనలకు విరుద్ధంగా జైలు గేటు వరకు బారికెడ్లను తోసుకొంటూ వచ్చిన టిడిపి కార్యకర్తలు ►ర్యాలీగా రాకూడదని హైకోర్టు అభ్యంతరాలు ఉన్నా పట్టించుకోకుండా జైలు బయట గేటు వద్ద నుండి కార్యకర్తల సమూహంతో రోడ్డుపైకి వచ్చిన చంద్రబాబు ►రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే రూటును బ్లాక్ చేసిన టిడిపి కార్యకర్తలు 04:40 PM, అక్టోబర్ 31, 2023 బయటకు రాగానే మైక్ అందుకున్న బాబు ►హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కేసిన చంద్రబాబు ►రాజకీయ ర్యాలీలు చేయొద్దని స్పష్టంగా చెప్పిన హైకోర్టు ►ర్యాలీల్లో ప్రసంగాలు చేయొద్దని హైకోర్టు చెప్పినా.. పట్టించుకోని చంద్రబాబు ►తనకు సంఘీభావం తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు ►ప్రత్యేకంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు : చంద్రబాబు 04:30 PM, అక్టోబర్ 31, 2023 కాసేపట్లో బెజవాడకు బాబు ►కాసేపట్లో విజయవాడకు బయల్దేరనున్న చంద్రబాబు ►రోడ్డు మార్గం ద్వారా విజయవాడ వెళ్లనున్న చంద్రబాబు ►రేపు సాయంత్రం తిరుమలకు వెళ్లాలని నిర్ణయం ►ఎల్లుండి ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్న చంద్రబాబు ►అనంతరం హైదరాబాద్ లో శస్త్ర చికిత్స చేయించుకోవాలని చంద్రబాబు యోచన 04:15 PM, అక్టోబర్ 31, 2023 జైలు నుంచి బయటికొచ్చిన చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల ►జైలు గేటు వద్ద తెలుగుదేశం నేతల కేకలు, అరుపులు ►జైలు ముందు చంద్రబాబు కోసం కుటుంబసభ్యులు, టిడిపి నేతలు ►చంద్రబాబును కలిసేందుకు నాయకుల పోటాపోటీ ►టిడిపి జెండాలు, ఫ్లెక్సీలతో జైలు ప్రాంగణాన్ని నింపేసిన టిడిపి నేతలు ►అందరిని పక్కకు జరిపి చంద్రబాబును అలింగనం చేసుకున్న అచ్చెన్నాయుడు 04:13 PM, అక్టోబర్ 31, 2023 తెలుగుదేశం నేతల ఓవరాక్షన్‌తో చంద్రబాబుకు మరిన్ని ఆంక్షలు ►రేపటి దాకా చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ►ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనద్దని హైకోర్టు ఆదేశాలు ►రేపటి వరకు చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దు : హైకోర్టు ఆదేశాలు 04:03 PM, అక్టోబర్ 31, 2023 జైలుకు చంద్రబాబు కాన్వాయ్ ►రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్న చంద్రబాబు కాన్వాయ్ ►జైలు లోపలికి వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్ ►కాసేపట్లో విడుదల కానున్న చంద్రబాబు ►సెంట్రల్ జైలు దగ్గర భారీ స్థాయిలో మోహరించిన టీడీపీ శ్రేణులు ►చంద్రబాబును చూసేందుకు భారీగా రావాలని కార్యకర్తలకు టీడీపీ పిలుపు ►పలు చోట్ల వాహనాలను ఏర్పాటు చేసి మరీ జనాలను తెస్తోన్న టీడీపీ 04:00 PM, అక్టోబర్ 31, 2023 జైలులో జరుగుతున్న బెయిల్ ప్రక్రియ ►రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►చంద్రబాబును కలిసిన లోకేష్, బ్రాహ్మణి ►విజయవాడ వరకు ఎలా వెళ్దాం? ఏం చేద్దాం? ►బయటకు తీసుకొచ్చే విషయంపై చర్చలు ►బాబు బెయిల్ కాపీలను తీసుకుని లోనికి వెళ్లిన లాయర్లు ►జైల్లో బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయనున్న లాయర్లు 03:55 PM, అక్టోబర్ 31, 2023 జైలు వద్ద భారీగా మోహరించిన తెలుగుదేశం కార్యకర్తలు ► రాజమండ్రి జైలు వద్ద నెలకొన్న పరిస్థితిపై పోలీసులు సీరియస్ ► రాజకీయాలకు జైలును అడ్డా ఎలా చేస్తారని ఆగ్రహం ► రాజమండ్రి జైలు చుట్టూ భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తు ► జాతీయ రహదారి లాలాచెరువు నుంచి సెంట్రల్ జైలు వరకు రహదారిని మూసివేత ► జైలు వద్ద ఏ ఒక్కరు అతి చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం ► శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఊరుకోబోమంటున్న అధికారులు 03:45 PM, అక్టోబర్ 31, 2023 టిడిపి తీరే అంత.! తొలి రోజే నిబంధనలు ఉల్లంఘిస్తారా? ► రాజమండ్రి జైలు వద్దకు భారీగా చేరుకుంటున్న తెలుగుదేశం శ్రేణులు ► చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలు ► చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దృష్ట్యా తెలుగుదేశం కొత్త వ్యూహం ► రాజమండ్రికి భారీగా కార్యకర్తలను తరలిస్తోన్న తెలుగుదేశం నేతలు ► ప్రతీ నియోజకవర్గం నుంచి ఇంత మంది అంటూ లెక్కలేసుకొని మరీ తరలింపు ► రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ర్యాలీ చేయాలని ప్రణాళిక ► ఇప్పటికే సోషల్ మీడియాలో మొదలైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ► బెయిల్ ఊరేగింపు అడ్డు పెట్టుకుని ఏం చేయబోతున్నారు? 03:15 PM, అక్టోబర్ 31, 2023 నిబంధనలను పెంచండి : CID పిటిషన్ ► ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు మధ్యంతర బెయిల్లో మరో 5 నిబంధనలు చేర్చాలని పిటిషన్ 1. రాజకీయ యాత్రలు, ప్రసంగాలు, సభలు పెట్టొద్దు, 2. మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు 3. కేవలం వైద్యం కోసమే బెయిల్‌ను ఉపయోగించాలి 4. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్, పబ్లిక్ ముందు మాట్లాడొద్దు 5. ఇద్దరు DSP స్థాయి అధికారులు చంద్రబాబుతో ఉంటూ కదలికలను కోర్టుకు సమర్పించాలి ఈ ఐదు షరతులు చేర్చాలని కోరుతూ సీఐడీ పిటిషన్ 03:10 PM, అక్టోబర్ 31, 2023 బాబు జెడ్ ప్లస్‌కు ఏర్పాట్లు ► రాజమండ్రి జైలు నుంచి కరకట్ట నివాసం దాకా భద్రత ►రోడ్డు మార్గంలో రాజమండ్రి నుంచి విజయవాడ కరకట్ట నివాసానికి వచ్చేందుకు ఏర్పాట్లు 03:01 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులోనూ చంద్రబాబుకు ఊరట ►మద్యం కేసులోనూ చంద్రబాబుకు హైకోర్టులో ఊరట ►చంద్రబాబును అరెస్ట్ చేయబోమని తెలిపిన ఏజీ ►హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించబోమని కోర్టుకు తెలిపిన ఏజీ ►అడ్వకేట్ జనరల్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు ►విచారణ నవంబర్ 21కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు 03:00 PM, అక్టోబర్ 31, 2023 జైలుకు చేరిన రిలీజ్ ఆర్డర్ ►రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరిన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఆర్డర్ ►కండిషన్స్ ను చంద్రబాబుకు చదివి వినిపించనున్న జైలు సూపరింటెండెంట్ ►కాసేపట్లో జైలు నుంచి బయటకు రానున్న చంద్రబాబు 03:00 PM, అక్టోబర్ 31, 2023 రిలీజ్ ఆర్డర్ తీసుకున్న TDP నేతలు ►విజయవాడ : ACB కోర్టు దగ్గర బోండా ఉమ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో ఏసీబీ కోర్టుకు ష్యూర్టీలు సమర్పించాం ►వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చాం ►చంద్రబాబు రిలీజ్ ఆర్డర్లను జైలు అధికారులకు కోర్టు మెయిల్ చేశారు ►పర్సనల్ ఆర్డర్ కూడా మేం తీసుకున్నాం ►రాజమండ్రి జైలు అధికారులకు మెయిల్ ద్వారా హైకోర్టు బెయిల్ ఆర్డర్, ఏసీబీ కోర్టు రిలీజ్ ఆర్డర్ అందాయి ►సుప్రీం కోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం రావాల్సి ఉంది ►మరో గంటన్నరలో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావొచ్చు 02:50 PM, అక్టోబర్ 31, 2023 రిలీజ్ ఆర్డర్ ఇది ►చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ACB కోర్టు రిలీజ్ ఆర్డర్ ►CrPL No.7951/2023 ప్రకారం చంద్రబాబును విడుదల చేయాలని ఉత్తర్వులు ►ప్రస్తుతం రిమాండ్ ముద్దాయి నెంబర్ 7691గా ఉన్న చంద్రబాబు 02:30 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులోనూ బెయిలివ్వండి : చంద్రబాబు లాయర్లు ►హైకోర్టులో చంద్రబాబు లాయర్ల లంచ్ మోషన్ పిటిషన్ ►మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ ►మద్యం కేసులో చంద్రబాబు ఏ3 02:30 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు వచ్చింది కండీషనల్ బెయిలే : సజ్జల ►కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు చంద్రబాబుకు కోర్ట్ బెయిల్ ఇచ్చింది ►టీడీపీ ఎందుకు సంబరాలు చేసుకుంటుందో అర్థం కావడం లేదు ►స్కిల్ కేసులో షెల్ కంపెనీలకు దారి మళ్లాయా? లేదా? ►వ్యవస్థల్ని మ్యానేజ్ చేస్తే చంద్రబాబు బయటకు వస్తారా? ►చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలి ►స్కిల్ కేసులో రూ.240 కోట్లు దారి మళ్లాయి ►రాజమండ్రి నుంచి రోడ్ షో చేస్తామంటున్నారు ►రోడ్ షోతో జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ►లయన్ ఈజ్ బ్యాక్ అని టీడీపీ గొప్పగా చెప్పుకుంటోంది ►చంద్రబాబు ఏమైనా వీర యోధుడా? ►చంద్రబాబు ఇంతకాలం వ్యవస్థల్ని మ్యానేజ్ చేశారు ►చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా ఉండదు ►చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదంటే విజయయాత్ర ఎందుకు? ►చంద్రబాబు విషయంలో ప్రభుత్వానికి కక్షసాధింపు లేదు ►చంద్రబాబు బయట ఉంటేనే పొలిటికల్ ఫైట్ నడుస్తుంది ►నిజం గెలిచిందని ఉపన్యాసాలు చేస్తుంటే జనం ఏమనుకుంటారు? 01:43 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ ప్రాసెస్ ఎక్కడివరకు వచ్చిందంటే.? ►విజయవాడ : ఎసిబి కోర్టులో హైకోర్టు ఇచ్చిన చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఆర్డర్ కాపీని అందజేసిన చంద్రబాబు న్యాయవాదులు ►ACB కోర్టుకు ష్యూరిటీలు సమర్పించిన టిడిపి నేతలు దేవినేని ఉమ, బోండా ఉమ ►చెరో రూ. లక్ష పూచీకత్తు సమర్పించిన టీడీపీ నేతలు ►మధ్యంతర బెయిల్ ఆర్డరుతో పాటు అఫిడవిట్లని ఏసీబీ కోర్టుకు సమర్పించిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►తదుపరి ఆదేశాలను రాజమండ్రి జైలు అధికారులకు మెయిల్ ద్వారా పంపుతామన్న ఏసీబీ కోర్టు ►ప్రొసీజర్ అంతా పూర్తయితే ఈ సాయంత్రానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం 01:35 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ వచ్చినా ఆగని ములాఖత్‌లు ►రాజమండ్రి జైల్లో మధ్యాహ్నం 2 గంటలకు చంద్రబాబుతో నారా లోకేశ్ ములాఖత్ ►లోకేశ్‌తో పాటు చంద్రబాబును కలవనున్న బ్రాహ్మణి ►జైల్లో చంద్రబాబును కలవనున్నతెలుగుదేశం ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి 01:25 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ షరతులతో మాత్రమే : వెల్లంపల్లి ►కోర్టు చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇచ్చింది రోగాలు ఉన్నందునే ►ప్రపంచంలో ఉన్న రోగాలన్ని చంద్రబాబుకు ఉన్నట్టు చూపించి బెయిల్ తెచ్చుకున్నారు ►చంద్రబాబుకు ఇచ్చింది కండీషన్డ్ బెయిల్ మాత్రమే.. ►తిరిగి చంద్రబాబు మరలా జైలుకు వెళ్లాల్సిందే ►చంద్రబాబు నేరం చేయలేదని వాళ్ల న్యాయవాదులు ఎక్కడా చెప్పలేదు ►అనారోగ్య కారణాలతో చంద్రబాబు కు మద్యంతర బెయిల్ వచ్చింది చంద్రబాబు రాజకీయాలకు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు ►కాసాని జ్ఞానేశ్వర్ ను ఎన్ని కల్లో పోటీ చేయిస్తామని చెప్పి మోసం చేసారు ►కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందంతో పోటీ చేయడం లేదని జెండా పీకేశారు ►బిసిలను మరోసారి చంద్రబాబు మోసం చేశాడు ►తెలంగాణాలో పోటీచేసే అవకాశం లేకుండా జెండా పీకేసిన వ్యక్తి చంద్రబాబు ►2024 లో ఏపిలోనూ టిడిపి జెండా పీకేస్తారు ►పవన్ టీడీపీతో కలిసినా ప్రయోజనం లేదు తండ్రి జైలులో ఉంటే నారా లోకేష్ ఎక్కడ ఉన్నట్టు ►విజయనగరం భువనేశ్వరి కాకుండా లోకేష్ వెళ్లచ్చుకదా.. ఎందుకు వెళ్ళలేదు..? ►లోకేష్ అసమర్ధుడని వాళ్ళ క్యాడర్ భావిస్తుంది ►ఎన్డీఆర్ చావుకు కారణమవ్వడమే కాకుండా నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు పురందేశ్వరికి చంద్రబాబు అవినీతిలో భాగస్వామ్యం ఉంది ►బిజెపి అధ్యక్షురాలిగా టిడిపి కి స్పోక్ పర్సన్ పురందేశ్వరి కొనసాగుతున్నారు ►అమిత్ షా వద్దకు లోకేష్ ను పురందేశ్వరి తీసుకెళ్లలేదా ►చంద్రబాబు ను కాపాడడానికి పురందేశ్వరి కంకణం కట్టుకున్నారు ►చంద్రబాబును జైలు నుంచి తేవాలన్నదే పురందేశ్వరి లక్ష్యం 01:15 PM, అక్టోబర్ 31, 2023 నిజం గెలవాలి యాత్ర అబద్ధమేనా? ►చంద్రబాబు విడుదలతో మారిన తెలుగుదేశం వ్యూహం ►నిజం గెలవాలి యాత్రను నిలిపివేసే యోచనలో భువనేశ్వరీ ►చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉంది: నారా భువనేశ్వరి ►నిజం గెలవాలి యాత్ర పై ఇంకా ఆలోచించలేదు : నారా భువనేశ్వరి 01:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబు బెయిల్ అనగానే పవన్ కళ్యాణ్‌లో తెగ ఉత్సాహం ►యూరప్ నుంచే ప్రెస్ నోట్ విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ►చంద్రబాబు విడుదల కోసం ఎదురుచూస్తున్నామన్న పవన్ శ్రీ @ncbn గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/Hd1xjBsOCS — JanaSena Party (@JanaSenaParty) October 31, 2023 12:55 PM, అక్టోబర్ 31, 2023 విడుదల ఎప్పుడంటే..! ►ACB కోర్టు ద్వారా జైలుకు అందనున్న హైకోర్టు ఉత్తర్వులు ►జైలు అధికారులకు కోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత ప్రారంభం కానున్న ప్రొసీడింగ్స్ ►చంద్రబాబు NSG సెక్యూరిటీ పరిధిలో ఉండడంతో SPకి సమాచారం ఇవ్వనున్న జైలు అధికారులు 12:45 PM, అక్టోబర్ 31, 2023 నవంబర్ 28న మళ్లీ జైలుకు ►చంద్రబాబు బెయిల్ గడువు నవంబర్ 28 వరకు ►నవంబర్ 28న రాజమండ్రి సెంట్రల్ జైల్లో సాయంత్రం 5గంటల్లోగా సరెండర్ కావాలి 12:40 PM, అక్టోబర్ 31, 2023 ష్యూరిటీలు సమర్పించిన బొండా, దేవినేని ►చంద్రబాబు బెయిల్ కోసం బొండా, దేవినేని ష్యూరిటీలు విజయవాడ కోర్టులో షూరిటీ సమర్పించిన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరావు 12:32 PM, అక్టోబర్ 31, 2023 జైలు నుంచి చంద్రబాబు ఎక్కడికంటే.? ► సాయంత్రం రాజమండ్రి నుంచి అమరావతికి చంద్రబాబు ► రాజమండ్రి నుంచి రోడ్డు మార్గాన అమరావతికి చంద్రబాబు ► అమరావతి నుంచి రేపు లేదా ఎల్లుండి తిరుమలకు చంద్రబాబు ► తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత హైదరబాద్ కు చంద్రబాబు ► ఆ తర్వాత హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స ► హైదరాబాద్‌లోనే స్కిన్ డాక్టర్‌తో ట్రీట్మెంట్ 12:28 PM, అక్టోబర్ 31, 2023 బెయిల్ ఇచ్చింది ఎందుకంటే.. : మంత్రి అంబటి ►చంద్రబాబు బెయిల్ పై అంబటి రాంబాబు స్పందన ►కేసులో నిర్దోషి అని చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేదు ►స్కిల్ స్కాంలో చంద్రబాబుకు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇచ్చారు ►కంటి ఆపరేషన్ చేయించుకొన్న తర్వాత జైలుకు రావాల్సిందే ►కేసు దర్యాప్తు కొనసాగుతోంది ►రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదు ►తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు ►ఇతర పార్టీ కోసం పార్టీని తాకట్టుపెట్టడం అనైతికం ►కాసాని జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయ్యింది ►చంద్రబాబును నమ్ముకున్న ఎవరికైనా వెన్నుపోటు తప్పదు 12:20 PM, అక్టోబర్ 31, 2023 మద్యం కేసులో బెయిల్ పిటిషన్ ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ ►మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ ►మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు ఇచ్చారన్న సీఐడీ అధికారుల కేసు పై హౌస్ మోషన్ పిటిషన్ ►పిటిషన్ విచారణకు అనుమతిచ్చిన ఏపీ హైకోర్టు 12:15 PM, అక్టోబర్ 31, 2023 తొలిరోజే షరతుల ఉల్లంఘనకు ప్రణాళిక ►రాజమండ్రి చేరుకున్న లోకేశ్, బ్రాహ్మణి ►కాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్ ►బెయిల్ రావడంతో సాయంత్రం 4గంటలకు జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ►ఎయిర్ పోర్టు వరకు భారీ ర్యాలీకి టీడీపీ ఏర్పాట్లు ►హైకోర్టు సూచించినా.. దానికి విరుద్ధంగా ర్యాలీకి ఏర్పాట్లు చేస్తోన్న టిడిపి 12:10 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్ కేవలం అనారోగ్య కారణాల వల్లే ►కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు ►నవంబర్ 28, 2023 మంగళవారం రోజున సా.5 గంటలకు సరెండర్ కావాలని ఆదేశం ►నవంబర్ 10న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామన్న కోర్టు ►ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరాదన్న కోర్టు ►మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనరాదన్న కోర్టు 12:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్లో షరతులు ఇవే ►చంద్రబాబుకు ఐదు షరతులతో మధ్యంతర బెయిల్ 1. రూ.లక్ష పూచీకత్తుతో పాటు ఇద్దరి షూరిటీలు సమర్పించాలి 2. నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స చేయించుకోవచ్చు 3. చికిత్స, ఆస్పత్రి వివరాలు సరెండర్ సమయంలో సీల్డ్ కవర్ లో జైలు సూపరింటెండెంట్ కు సమర్పించాలి 4. ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదు 5. నవంబర్ 28, 2023 సాయంత్రం 5 గంటల్లోపు తిరిగి సరెండర్ కావాలి 12:05 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్‌కు ష్యూరిటీలు వీళ్లే ►హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు ఇవ్వనున్న ఇద్దరు ►రూ.లక్ష బాండ్, 2 ష్యూరిటీలను ఇవ్వనున్న బోండా ఉమ, దేవినేని ఉమ ►విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న బోండా ఉమ, దేవినేని ఉమ 12:00 PM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్ ►ఐదు షరతులతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ►సాయంత్రం చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ►హైకోర్టు ఉత్తర్వులు ఏసీబీ కోర్టు ద్వారా రాజమండ్రి జైలుకు ►బెయిల్ కాపీతో రాజమండ్రి జైలుకు రానున్న చంద్రబాబు లాయర్లు ►ప్రొసీడింగ్స్ పూర్తైన తర్వాత ఎస్పీకి సమాచారమివ్వనున్న జైలు అధికారులు ►జైలు దగ్గరికి రానున్న జిల్లా పోలీసులతోపాటు NSG బృందం ►ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు 11:45 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకు బెయిల్‌పై పురందేశ్వరీ స్పందన ►చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం ►చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం మంచి పరిణామం : పురంధేశ్వరి 11:38 AM, అక్టోబర్ 31, 2023 ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో పిటిషన్ ►మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారని.. సీఐడీ అధికారుల కేసుపై లంచ్ మోషన్ పిటిషన్ ►సీఐడీ నమోదు చేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ ►లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు అనుమతిచ్చిన హైకోర్టు ►మధ్యాహ్నాం 2గం.15కి పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు ►టీడీపీ అడ్డగోలు మద్యం వ్యవహారాలపై కేసు ►తన హయాంలో కావాల్సిన కంపెనీలకు దోచిపెట్టిన చంద్రబాబు ►కావాల్సిన డిస్టిలరీలకు అడ్డగోలు అనుమతులు ►క్విడ్‌ప్రోకోలో భాగంగా ఎక్సైజ్ పాలసీనే మార్చేసిన నాటి ప్రభుత్వం ►రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టలరీలకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు ►ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం ►ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్.. అనుమతించిన న్యాయస్థానం ►ఏ–1గా ఐఎస్ నరేష్, ఏ–2గా కొల్లు రవీంద్ర, ఏ–3గా చంద్రబాబు 11:12 AM, అక్టోబర్ 31, 2023 స్కిల్డ్ దొంగ చంద్రబాబే! ►టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.371 కోట్లు కొల్లగొట్టిన వ్యవహారమే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసు ►డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర ఏజెన్సీల గుర్తింపుతో వెలుగులోకి ►2017-2018లో నకిలీ ఇన్వాయిస్లతో బయటపడ్డ అక్రమం ►అప్రమత్తం చేసినా.. అప్పుడు అధికారంలో ఉంది చంద్రబాబే కాబట్టి పట్టించుకోని వైనం ►ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అని సీఐడీ అభియోగాలు ►కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరిన బ్యాంకు స్టేట్మెంట్లు, రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ►ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ.. పలువురి అరెస్ట్ కూడా ►షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ ఘరానా మోసం ►రూ.3,300 కోట్లకు సీమెన్స్ సంస్థ - డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం ►ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగిందని మోసం ►రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం ►ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్ల రూపాయలను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారని సీఐడీ అభియోగం ►ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు ►ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు ►ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ►చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెఓంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 7691 నెంబర్‌తో కొనసాగుతున్న చంద్రబాబు ►తాజాగా.. ఇవాళ నాలుగువారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు 11:12 AM, అక్టోబర్ 31, 2023 బాబు బెయిల్‌పై అంబటి సెటైర్ ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ►కంటి శస్త్రచికిత్స కోసం బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ►షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని కోర్టు హెచ్చరిక ►నిజం గెలిచి కాదు.. చంద్రబాబుకి కళ్లు కనిపించట్లేదని కోర్టు బెయిల్ ఇచ్చిందన్న అంబటి ►ఎక్స్‌లో బాబు బెయిల్‌పై అంబటి సెటైర్ నిజం గెలిచి కాదు బాబుకు కళ్ళు కనిపించడం లేదు అని మధ్యంతర బెయిల్! — Ambati Rambabu (@AmbatiRambabu) October 31, 2023 11:01 AM, అక్టోబర్ 31, 2023 నవంబర్ 10న చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►నవంబర్ 10వ తేదీన వాదనలు వింటామన్న ఏపీ హైకోర్టు ►మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కాసేపటి కిందట తీర్పు ►నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ►ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇస్తున్నట్లు తీర్పు ►కంటి సర్జరీ కోసమే బెయిల్ ఇచ్చినట్లు వెల్లడి ►చంద్రబాబుకు కోర్టు పలు షరతులు ►రాజకీయ, మీడియా కార్యక్రమాల్లో పాల్గొనకూడదు ►కేవలం ఆస్పత్రికి మాత్రమే వెళ్లాలి ►నవంబర్ 24వ తేదీ సాయంత్రం సరెండర్ కావాలి ►కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు ►షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరిక 10:39 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు ►స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు ►నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ►రూ.లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీల్ని సమర్పించాలని ఆదేశం ►నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ ►కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు ►షరతులు ఉల్లంఘిస్తే మరుక్షణమే బెయిల్ రద్దవుతుందని హెచ్చరిక 10:15 AM, అక్టోబర్ 31, 2023 కాసేపట్లో మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు ►స్కిల్ స్కామ్‌లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ ►చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు ►కంటికి శస్త్రచికిత్స అవసరం అంటూ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►ఇప్పటికిప్పుడు శస్త్రచికిత్స అవసరం లేదని సీఐడీ తరపు లాయర్ల వాదన ►ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలన్న బాబు లాయర్లు ►చంద్రబాబు ఆరోగ్య స్థితిపై వైద్యులు ఇచ్చిన నివేదికలు కోర్టుకు సమర్పించిన సీఐడీ ►చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని, పైగా బరువు పెరిగారని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సీఐడీ లాయర్లు 09:52 AM, అక్టోబర్ 31, 2023 సీడీఆర్ పిటిషన్ తీర్పు నేడు ►సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు కేస్ అప్ డేట్ ►సీఐడీ అధికారుల కాల్ డేటా పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు ►అరెస్ట్ చేసిన అధికారుల కాల్ డేటా రికార్డ్ ను భద్రపరచాలంటూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ►అరెస్ట్ వెనుక కుట్ర కోణం ఉందంటూ బాబు లాయర్ల వాదన ►ఇతర వ్యక్తుల డైరెక్షన్లోనే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని వాదన ►కాల్ డేటా పిటిషన్ అసలు విచారణ అర్హత లేదని వాదించిన సీఐడీ తరపు న్యాయవాదులు ►అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు, భద్రతకు భంగం కలుగుతుందన్న సీఐడీ లాయర్లు ►అరెస్ట్‌లో ఎవరి ప్రమేయం లేదని సీఐడీ లాయర్ల వాదన ►వాదనలు పూర్తి.. నేడు తీర్పు వెల్లడించనున్న ఏసీబీ జడ్జి 09:22 AM, అక్టోబర్ 31, 2023 ఇంటి భోజనంతో బరువు పెరిగిన చంద్రబాబు ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►బాబు ఆరోగ్యంపై ప్రతిరోజూ హెల్త్ బులెటిన్ విడుదల ►మరోవైపు చంద్రబాబు ఆరోగ్యాన్ని సాకుగా చూపించి మధ్యంతర బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు న్యాయవాదులు ►హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఇవాళ వెలువడనున్న తీర్పు ►చంద్రబాబుకు రోజూ ఇంటి భోజనం ►జైల్లో చంద్రబాబు బరువు పెరిగారని స్పష్టం చేసిన అధికారులు ►జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉన్న చంద్రబాబు ప్రస్తుతం 67.5 కిలోలు ఉన్నారని వెల్లడి ►చంద్రబాబు కుడి కంటి క్యాటరాక్ట్ సర్జరీ అత్యవసరంగా చేయాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►ప్రస్తుతం ఇమ్మెచ్యూర్డ్ కాటరాక్ట్ ఉందని జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన రిపోర్టును సమర్పించిన జైలు అధికారులు 08:45 AM, అక్టోబర్ 31, 2023 లోకేష్ బేబీని వదలని ఆర్జీవీ ►చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ అండ్ కోను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న దర్శకుడు రాం గోపాల్ వర్మ ►తాజాగా నారా లోకేష్‌ను బేబీ అంటూ టీజింగ్ ►సీఎం జగన్‌పై నారా లోకేష్ ఎక్స్‌లో అడ్డగోలు వ్యాఖ్యలు ► గుడ్ నైట్ బేబీ అంటూ సింపుల్‌గా లోకేష్‌కు రిప్లై ఇచ్చిన ఆర్జీవీ 08:32 AM, అక్టోబర్ 31, 2023 నారా వారి లిక్కరు స్కామ్ ►చంద్రబాబుపై లిక్కర్ స్కామ్ కేసు నమోదు చేసిన సీఐడీ ►గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపనల నేపథ్యంలో కేసు నమోదు ►ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు ►ఐపీసీ సెక్షన్ 166,167,409,120(B), రెడ్ విత్ 34 మరియు సెక్షన్ 13(1)(d) రెడ్ విత్ 13(2) పిసి యాక్ట్, 1968 గా కేసు నమోదు ►కేసులో A-3 గా చంద్రబాబును చేర్చిన సీఐడీ అధికారులు ►చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు మెమో రూపంలో తెలిపిన సీఐడీ అధికారులు ►మద్యం షాపులు, మద్యం కంపెనీల కు అక్రమ దారుల్లో లబ్ది చేకూర్చిన చంద్రబాబు ప్రభుత్వం ►మద్యం షాపులు (a4) ప్రివిలైజ్ ఫీజు తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం ►ప్రతి ఏటా రూ.1,300 కోట్లు ప్రభుత్వానికి నష్టం ►2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి దాదాపు రూ.2900 కోట్ల ఆదాయం ►తెలంగాణలో ఉన్న ప్రివిలైజ్ ఫీజు.. ఏపీలో తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం ►అప్పట్లో లిక్కర్ సిండికేట్ తో కుమ్మక్కై తగ్గించేసిన చంద్రబాబు ప్రభుత్వం ►టీడీపీ ఎంపీ ఎస్పీ వై రెడ్డి సంస్థ ఎస్పీ వై ఆగ్రో ఇండస్ట్రీకి లబ్ది చేకూరుస్తూ వడ్డీ తగ్గింపు ►హైకోర్టు ఆదేశాలని అమలు చేయకుండా ఏకపక్షంగా వడ్డీ తగ్గింపు ►కేబినెట్ ఆమోదం లేకుండానే వడ్డీ తగ్గించిన చంద్రబాబు ప్రభుత్వం ►ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత హడావిడిగా లిక్కర్ కంపెనీలకు భారీగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►టీడీపీ నేతల లిక్కర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►త్రిసభ్య కమిటీ సిఫార్సులు కి విరుద్ధంగా లిక్కర్ కంపెనీలకు అనుమతులు ►మాజీ మంత్రి యనమల రామ కృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు చెందిన పీఎంకే డిస్టీలరీస్‌కి అనుమతి ►మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టీలరీస్‌కి అనుమతి ►అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►2019 ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత కొన్ని బ్రాండ్ల కు హడావుడిగా అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ►సరఫరా కంపెనీలకు భారీ లబ్ది చేకూర్చేందుకు అనుమతులు ►అన్ని వ్యవహరల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రాధమికంగా నిర్ధారించిన సీఐడీ ►బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన సీఐడీ ►ఈ కేసులో ఏ-1గా అప్పటి ఎక్సైజ్ కమీషనర్ శ్రీనివాస నరేష్, ఏ-2గా మాజీమంత్రి కొల్లు రవీంద్ర, ఏ-3గా చంద్రబాబు నాయుడు ►రెండు బేవరేజ్ లు, మూడు డిస్టిలరీలకి లబ్ది చేకూర్చడానికి క్విడ్ ప్రోకి పాల్పడినట్లు ఆరోపణలు ►2012 లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీని 2015 లో మార్చి అడ్డుకోలుగా ఈ కంపెనీలకి మేలు చేసినట్లు ఆధారాలు 07:57 AM, అక్టోబర్ 31, 2023 స్కిల్ స్కాంలో బాబు మధ్యంతర బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వ్ ► ఏపీ హైకోర్టులో టీడీపీ నేతల పిటిషన్ పై విచారణ వాయిదా ► విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ► గత ప్రభుత్వ నిర్ణయాల పునఃసమీక్షకు ప్రభుత్వం వేసిన సిట్, కేబినెట్ సబ్ కమిటీని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ ► 1411 జీవో, 344 జీవోను సవాల్ చేస్తూ పిటిషన్లు ► ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్‌తో పాటు అనుబంధ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►కంటికి శస్త్రచికిత్స అవసరమని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి ► వాదనలు పూర్తి, ఇవాళ తీర్పు 07:35 AM, అక్టోబర్ 31, 2023 పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? ►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►కాసాని జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది ►మరి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? ►ట్వీట్‌తో పవన్‌కు చురకలంటిన మంత్రి అంబటి రాంబాబు ►టీటీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చంద్రబాబు ఆదేశం ►నారా లోకేష్ కనీసం స్పందించలేదని రాజీనామా లేఖలో కాసాని విమర్శలు జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది ! పవన్ ఎప్పుడు పరిపక్వమౌతాడో ?@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) October 30, 2023 07:13 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ ►పదుల కొద్దీ పిటిషన్లతో కోర్టులను పరీక్షిస్తోన్న బాబు లాయర్లు ►వరుసగా ఎదురు దెబ్బలు.. ఎక్కడా దక్కని ఊరట ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ ►ఆపై ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు ►తాజాగా వెలుగులోకి మరో అవినీతి బాగోతం ►కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ ►మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చినందుకు చంద్రబాబుపై మరో కేసు నమోదు ►ఎన్నికల వేళ సానుభూతి కోసం కుటుంబ సభ్యుల నానా పాట్లు ►చంద్రబాబుకు లేని రోగాలను అంటగడుతూ సానుభూతి కోసం ప్రయత్నాలు ►తెలంగాణ బరి నుంచి ఓటమి భయంతో తప్పుకున్న తెలుగుదేశం ఇదీ చదవండి: IRR Case.. తోడు దొంగల రింగ్ 06:59 AM, అక్టోబర్ 31, 2023 ఖేల్ ఖతం.. దుకాణం బంద్ ►తెలంగాణలో టీడీపీ బిగ్ షాక్ ►టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా ►నారావారి తీరుపై రాజీనామా లేఖలో తీవ్ర అసంతృప్తి వెల్లగక్కిన కాసాని ►తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పకపోతే ఎలా?: కాసాని ►బాలకృష్ణ తెలంగాణలో నేనుంటా అన్నడు.. ఇప్పుడు ఏమైందో తెలియదు ►లోకేశ్ చిన్న పిల్లవాడో, పెద్దవాడో అర్థంకాదు.. 20సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు ►లోకేష్ ఎవరికి దొరకరు ►హైదరాబాద్ లోనే ఉన్నా లోకేష్ పట్టించుకోలేదు ►లోకేష్ ఇక్కడ పెత్తనం ఎందుకు చేస్తున్నారు ►తెలంగాలో పోటీ చేయవద్దని లోకేష్ ఎలా చెబుతారు ? ►ఆంధ్రాలో టీడీపీకి బీజేపీ కావాలట.. తెలంగాణలో వద్దట.. ఇదేం పద్ధతి.. ►పార్టీలో చేరినప్పుడు రామ్మోహన్‌రావుకు రూ.11 లక్షలు ఇచ్చా.. ►కాంగ్రెస్‌కు ఓటేయాలని పార్టీలోని కమ్మ వాళ్లు ప్రచారం చేస్తున్నారు 06:43 AM, అక్టోబర్ 31, 2023 మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు ►స్కిల్ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ►మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు అనుబంధ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ►చంద్రబాబు కంటి శస్త్రచికిత్స కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ ►పిటిషన్‌పై సోమవారం కొనసాగిన విచారణ.. ఇరువైపులా వాదనలు వినిపించిన లాయర్లు ►రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబుపై తప్పుడు కేసు అని బాబు తరపు లాయర్ల వాదన ►52 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు.. సీఐడీ దర్యాప్తును సాగదీస్తోంది: బాబు లాయర్లు ►అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలి: బాబు లాయర్లు ►న్యాయస్థానం ఇచ్చిన గత ఆదేశాల మేరకు చంద్రబాబు వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాం: సీఐడీ తరపు లాయర్లు ►పిటిషనర్‌కు జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం:సీఐడీ తరపు లాయర్లు ►కంటికి శస్త్రచికిత్స తక్షణం అక్కర్లేదు: సీఐడీ తరపు లాయర్లు ►చంద్రబాబుకున్న సాధారణ అనారోగ్య సమస్యలను పెద్దవి చేసి చూపుతున్నారు: సీఐడీ తరపు లాయర్లు ►వైద్య నివేదిక ప్రకారం బరువు విషయంలో పెద్ద తేడా లేదు: సీఐడీ తరపు లాయర్లు ►మధ్యంతర బెయిలు ఇవ్వొద్దు: సీఐడీ తరపు లాయర్లు ►పిటిషన్‌పై సోమవారం ముగిసిన వాదనలు ►తీర్పు రిజర్వ్.. నేడు వెల్లడించనున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 06:24 AM, అక్టోబర్ 31, 2023 చంద్రబాబుపై సీఐడీ మరో కేసు ►వెలుగులోకి నారావారి లిక్కర్ స్కామ్ ►చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ ► గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన సీఐడీ ► అవినీతి నిరోధక చట్టం కింద ( ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చంద్రబాబుపై కేసు ► మద్యం కంపెనీలకు అక్రమ అనుమతుల కేసులో A-3 గా చంద్రబాబు ► చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి తెలిపిన సీఐడీ అధికారులు ► ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి పిటిషన్ దాఖలు ► పిటిషన్ ను అనుమతించిన ఏసీబీ కోర్టు ► కేసుకు FIR నంబర్ - 18/2023 కేటాయింపు 06:15 AM, అక్టోబర్ 31, 2023 జైల్లో చంద్రబాబు @52వ రోజు ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ ►సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.371 కోట్లు సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారని అభియోగం ►ఆధారాలతో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ ►అరెస్ట్ సమయం నుంచి మొదలైన డ్రామా ►రిమాండ్ విధించిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం (ఏసీబీ కోర్టు) ►ఇప్పటిదాకా ఐదుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► రేపటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ ►రాజమండ్రి సెంట్రల్ జైలు 52వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గది.. ఇంటి భోజనం.. టవర్ ఏసీ సదుపాయం ►చంద్రబాబుకు నిత్యం ఆరోగ్య పరీక్షలు, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు ►జైలు, లోపల బయటా చంద్రబాబుకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు ఇదీ చదవండి: ఫైబర్ నెట్ కుంభకోణం సూత్రధారి బాబే -
నారా వారి లిక్కరు స్కాం
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్లో ఏ–3గా చంద్రబాబు పేరును చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ను కూడా వేసింది. న్యాయస్థానం కూడా విచారణకు అనుమతించింది. ఐపీసీ, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ (పీసీ) యాక్ట్–1988ల ప్రకారం 166, 167, 409, 120 (బి), రెడ్‌విత్ 34, 13(1)(డి), రెడ్ విత్ 13(2) సెక్షన్లతో సీఐడీ ఆయనపై ఈ కేసు నమోదు చేసింది. ఇందులో ఏ–1గా అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ శ్రీనరేష్, ఏ–2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. డిస్టిలరీస్, బేవరేజెస్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవ రెడ్డి ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదైంది. అయినవారి కోసం అడ్డదారులు..: నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కి, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకి చెందిన విశాఖ డిస్టిలరీకి, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కి చెందిన పీఎంకే డిస్టిలరీకి అప్పట్లో అడ్డగోలుగా మేలు చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. ఇందుకోసం ఏకంగా 2012 ఎక్సైజ్ పాలసీని మార్చేసింది. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి రూ.2,984 కోట్లు పన్నులు రాగా, 2015లో కొత్త పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేసింది. టర్నోవర్‌పై 8 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా 6 శాతం పన్నులను తీసేసింది. 6 నుంచి 10 శాతానికి పన్నులు పెంచాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులనూ బేఖాతరు చేసింది. ఈ విధంగా రెండు బేవరేజ్‌లు, మూడు డిస్టిలరీలకు లబ్ధిచేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రో కోకి పాల్పడినట్లు సీఐడీ తన ఎఫ్ఐఆర్లో వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం వాటిల్లుతోందని కోర్టుకు వివరించింది. కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా నిర్ణయాలు.. నిజానికి.. ఎక్సైజ్ పాలసీ సమస్యలు, ఆదాయ వివరాలను ప్రభుత్వానికి సూచించడానికి గత ఫైళ్లను తిరగేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి ఆదాయాన్ని తగ్గించి, లైసెన్సులకు ప్రయోజనం చేకూర్చేలా క్రిడ్ ప్రో కో జరిగినట్లు అధికారులు గుర్తించారు. అంతటితో ఆగక.. అందుకు సంబంధించిన వాస్తవాలపై లోతుగా అధ్యయనం చేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ఎల్ఓఐ ఇవ్వడం ద్వారా కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించారు. డీటీ నోటిఫికేషన్ తర్వాత కొత్త బ్రాండ్లను అనుమతించారని అధికారులు తెలుసుకున్నారు. సరఫరాదారులు కుట్రపూరితంగా, లైసెన్స్‌లతో కుమ్మక్కై, కొన్ని ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ లేకపోయినా కృత్రిమంగా డిమాండ్ పెంచారు. తద్వారా కార్పొరేషన్‌కు తప్పుడు అంచనాలు ఇచ్చారు. అలాగే, 2015–2019 కాలానికి సంబంధించిన వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా, పరిమాణాల వెరిఫికేషన్ కోసం ఎలాంటి యంత్రాంగం లేదు. 2019 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలకు ప్రాధాన్యత ఇస్తూ, వారి ఉత్పత్తులకు, వారి మార్కెట్ వాటాకు అనుకూలంగా హడావిడిగా ఆర్డర్లు ఇచ్చేశారు. అంతేకాక.. అవసరానికి మించి లిక్కర్ కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చి కొందరి నుంచే 70 శాతం బ్రాండ్లు కొనుగోలు చేశారు. పక్కా ప్లాన్‌తో, కొందరు అధికారుల సహకారంలో కొన్ని సంస్థలకు చట్టవిరుద్ధంగా ఆర్థిక ప్రయోజన చేకూర్చినట్లు స్పష్టమైంది. అకౌంటెంట్ జనరల్ (ఆడిట్) ఉల్లంఘన ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందనే విషయం తేటతెల్లమైంది. దీంతో తగిన ఆధారాలతో కేసు నమోదు చేసినట్లు సీఐడీ వివరించింది. కేబినెట్ ఆమోదం లేకుండా నచ్చినట్లు పాలసీ..: 2015–2017 ఎక్సైజ్ సంవత్సరాలకు సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, కొనుగోళ్ల వార్షిక లైసెన్సు రుసుం కంటే పది రెట్లు మించి ఉంటే మాత్రమే ప్రివిలేజ్ రుసుం విధించే థ్రెషోల్డ్ టెండర్ పరిమితిని పెంచాలని మొదట ప్రతిపాదించారు. కానీ, అది అమల్లోకి రాలేదు. తెలంగాణలో అమలులో ఉన్న ఈ ఫీజులు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. షాపుల కోసం పాలసీని కూడా తమకు నచ్చినట్లు ఎటువంటి చర్చలు లేకుండా, ఆర్థిక చిక్కుల గురించి ఆలోచించకుండా కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ఖరారు చేసేశారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా నిర్ణయాలు.. ఇక ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా లబ్ధిచేకూర్చింది. వాయిదా పద్ధతిలో లైసెన్స్ ఫీజు చెల్లించడానికి అనుమతించింది. ఈ ఫీజులో బకాయిలపై వడ్డీని కేవలం 18 శాతం (రూ.15 కోట్లు) మాత్రమే వసూలుచేయడానికి అనుమతించింది. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా, లైసెన్స్ ఫీజు బకాయిలపై అంతకుముందు కాలానికి చెల్లించాల్సిన వడ్డీని కూడా సడలించింది. నిజానికి ఇలా వడ్డీని వదిలేయడానికి, పరోక్షంగా మాఫీ చేయడానికి, తర్వాత చెల్లించేలా అనుమతించడానికి నిబంధనలు అంగీకరించవు. డిస్టిలరీ మంజూరుకు అనుమతి.. ఇక 2014 నవంబర్‌లో జీఓ నెంబర్ 993 ప్రకారం.. రెవెన్యూ (ఎక్సైజ్–2) డిపార్ట్మెంట్ ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పీఎంకే డిస్టిలరీస్, విశాఖ డిస్టిలరీస్, మరో మూడు ప్రైవేటు డిస్టిలరీస్‌కు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది సరఫరాదారులు..డిస్టిలరీలపై ప్రేమ.. కుట్రలో భాగంగా కొంతమంది సరఫరాదారులు, డిస్టిలరీలపై టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అమితమైన ప్రేమ కనబర్చింది. వారితో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించింది. వాటికి మార్కెట్ డిమాండ్ లేకపోయినా ఉన్నట్లుగా చూపించింది. వాస్తవ డిమాండ్, సరఫరాల డేటా ధ్రువీకరణకు ఎలాంటి యంత్రాంగం కూడా లేదు. దీనివల్ల 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు జరిగాయి. బ్రాండ్లకు అడ్డగోలు అనుమతులు.. మరోవైపు.. 2019లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా, ఎలాంటి ప్రజా ప్రయోజనం లేకపోయినా సరే అనేక బ్రాండ్లకు ఆమోదం తెలిపి తద్వారా వాటి సరఫరాదారులకు ఎక్కడలేని ప్రయోజనం చేకూర్చింది. వ్యక్తులు, సంస్థలకు ప్రయోజనాలను అందించడంవల్ల రాష్ట్ర ఖజానాకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. లోతుగా విచారణ జరపాలి : సీఐడీ ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, లైసెన్సీలకు చట్టవిరుద్ధంగా ఆర్ధిక లాభం చేకూర్చడంపై విచారణ జరగాల్సి ఉందని సీఐడీ ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని న్యాయస్థానానికి సమర్పించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కుంభకోణంపై లోతుగా విచారణ జరపాలని, బాధ్యులైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది. -
చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు
సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. కేసులో ఏ3గా చంద్రబాబును చేర్చారు. ఎఫ్ఐఆర్ కాపీ పూర్తి వివరాల కోసం చదవండి చంద్రబాబు కేసు నమోదు చేసిన అంశాన్ని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి విచారణ జరపాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఏసీబీ కోర్టు అనుమతించింది. చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారు: ఏపీబీసీఎల్ ఎండీ మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే అంశంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని ఏపీబీసీఎల్ ఎండీ పేర్కొన్నారు. రెండు బేవరేజ్‌లు, మూడు డిస్ట్రిలరీల కోసం 2012లో మద్యం పాలసీనే మార్చేశారు. 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారు. 8 శాతం వ్యాట్ కాకుండా 6 శాతం పన్నులు తీసేశారని APBCL ఎండీ ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యం కంపెనీల అనుమతుల పూర్తి కథేంటీ? 40 ఏళ్ల అనుభవం అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం విధానంలో కొత్త ఒరవడులు తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలకుగానూ ఏకంగా 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. లిక్కర్లో చంద్రబాబు తెచ్చిన బ్రాండ్లు వినూత్నం, విశేషం. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్, భూంభూం బీర్, పవర్ స్టార్ 999, లెజెండ్.. ఇవన్నీ చంద్రన్న కానుకలే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. బాబు హయాంలో మద్యం సిండికేట్లు రాజ్యమేలేవి. నలభైఐదు వేల బెల్టు షాపులతో మద్యాన్ని ఇంటింటికి సరఫరా చేసేవారు. ► చంద్రబాబు హయాంలోనే బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హేంగర్ లాంటి 254 బ్రాండ్లకు అనుమతులిచ్చారు. ఇలాంటి బ్రాండ్ల పేరుతో తన దగ్గరి నేత రుణం తీర్చుకున్నారు. ► SPY బ్రాండ్ ఎవరిదో అందరికీ తెలుసు. ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే ► విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతి ఇచ్చారు. అది టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి చెందిన కంపెనీ. చంద్రబాబు పాలన అయిపోగానే దాన్ని అమ్మేశారు. ► PMK డిస్టిలరీ పార్టీలోని ఓ సీనియర్ నేత వియ్యంకుడిందని తెలుగుదేశంలోనే ప్రచారం ఉంది ► శ్రీకృష్ణా డిస్టిలరీ కూడా రాయలసీమ టిడిపి నేతకు చెందినది ► 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదు డిస్టిలరీలే. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినవి మొత్తం 14. ► చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టిలరీలకు కు అనుమతి ఇచ్చారు. ఐదేళ్లలో 254 బ్రాండ్లు, ఏడు డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు ► ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూడీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉండగానే 2017 నవంబరు 22న అనుమతిచ్చారు. ► గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు కూడా టీడీపీ ప్రభుత్వమే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది. ► హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం చంద్రబాబు నిర్వాకమే. ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది. ► రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు కూడా చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు. ► బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు అనుమతులు పదవి నుంచి దిగిపోయే కొద్ది ముందు ఇచ్చారు. ► టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతి ఇచ్చింది.