Business
-
బంగారు కొండ దిగుతోంది!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. రాజధాని న్యూఢిల్లీలో గురువారం 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రా ముల బంగారం ధర రూ.700 తగ్గి రూ.77,050కి చేరింది. కాగా, 99.5 స్వచ్ఛత బంగారం ధర రూ.700 తగ్గి రూ.76,650కి దిగివచి్చంది. కిలో వెండి సైతం రూ.2,310 క్షీణించి రూ.90,190కి చేరింది. అంతర్జాతీయంగా పటిష్ట డిమాండ్‌కు తోడు పండుగ సీజన్ కారణంగా ఈ అక్టోబర్ 31న 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.82,400 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాటి నుంచి రూ.4,650 తగ్గింది. రెండు వారాల్లో 260 డాలర్లు డౌన్... అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.1గ్రాములు) ధర 45 డాలర్లు తగ్గి 2,541.70 డాలర్లకు పడింది. ఈ వార్త రాస్తున్న 9 గంటల సమయానికి 13 డాలర్ల తగ్గుదలతో రూ.2,574 వద్ద ట్రేడవుతోంది. జీవితకాల గరిష్టం 2,802 డాలర్ల నుంచి 260 డాలర్లు తగ్గింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక తర్వాత ఏకంగా 4% తగ్గింది.‘‘ట్రంప్ గెలుపుతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగకపోవచ్చు. ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో యుద్ధ ఉద్రిక్తతలు సద్దుమణగొచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చనే అశలతో డాలర్ ఇండెక్స్(107.06) అనూహ్యంగా బలపడుతోంది. దీంతో సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ట్రంప్ వాణిజ్య విధాన నిర్ణయాలు రానున్న రోజుల్లో పసిడి ధరలకు దిశానిర్ధేశం చేస్తాయి’’ అని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
పిల్లలతో నీతా అంబానీ: కొత్త పథకంతో లక్ష మందికి మేలు
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & ఛైర్పర్సన్ 'నీతా అంబానీ' బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్‌లో ప్రతి జీవితం విలువైనదని మేము విశ్వసిస్తున్నాము. ప్రతి బిడ్డ సంతోషంగా, ఆరోగ్యంగా పెద్ద కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి అర్హులు అని వ్యాఖ్యానించారు.బాలల దినోత్సవం సందర్భంగా.. కొత్త ఆరోగ్య సేవా పథకాన్ని ప్రారంభించినట్లు నీతా అంబానీ ప్రకటించారు. పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు & మహిళలపై దృష్టి సారించి, అట్టడుగు వర్గాలకు చెందిన 1,00,000 మంది వ్యక్తులకు ఎటువంటి ఖర్చు లేకుండా అవసరమైన ఆరోగ్య పరీక్షలు మరియు చికిత్సలను అందించడం ఈ చొరవ లక్ష్యం అని పేర్కొన్నారు.ఈ సంవత్సరం, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి.. మా కొత్త ఆరోగ్య సేవా ప్రణాళికను ప్రవేశపెట్టడం గర్వకారణంగా ఉందని, నీతా అంబానీ పేర్కొన్నారు. అంతే కాకుండా.. 50,000 మంది పిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు ఉచిత పరీక్షలు చేసి తగిన చికిత్సను అందించడం, 50వేల మంది మహిళలకు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్‌లతో పాటు 10,000 మంది కౌమార బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నిరోధక టీకాల వంటి వాటికి సంబంధించిన లక్ష్యాలను నీతా అంబానీ వెల్లడించారు.ప్రారంభం నుంచి రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 1,50,000 కంటే ఎక్కువమంది పిల్లలతో సహా సుమారు 27 లక్షల కంటే ఎక్కువమంది భారతీయులకు సేవలందించింది. భారతదేశంలోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌గా గుర్తింపు పొందిన ఈ సంస్థ నాణ్యమైన సేవలను అందిస్తోంది.బాలల దినోత్సవానికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నీతా అంబానీ.. పిల్లలతో ముచ్చటించడం, పిల్లకు కేక్ తినిపించడం వంటివి కూడా చూడవచ్చు. అంతే కాకుండా రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ ద్వారా మేలు పొందిన వారు సంస్థకు కృతజ్ఞతలు చెప్పడం కూడా ఇక్కడ చూడవచ్చు. -
డ్రీమ్‌హాక్ ఇండియా 2024: హైదరాబాద్‌లో గ్రాండ్ ఫినాలే..
డ్రీమ్‌హాక్ ఇండియాలో ఒమెన్ ఇంటెల్ క్యాంపస్ క్వెస్ట్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలేను హెచ్‌పీ ప్రకటించింది. గత మూడు నెలలుగా.. భారతదేశం అంతటా 1,600 జట్లకు చెందిన 8,000 మంది ప్లేయర్స్ వివిధ రౌండ్లలో పోరాడారు. కాగా ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగే గ్రాండ్ ఫినాలేలో టాప్ ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఇందులో విజేతకు రూ.5 లక్షల బహుమతిని అందజేస్తారు.గ్రాండ్ ఫినాలే నవంబర్ 15 నుంచి 17వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్లో సందర్శకులు హెచ్‌పీ ఇంటరాక్టివ్ ప్రోడక్ట్ బూత్‌లలో బ్రాండ్ గేమింగ్ సొల్యూషన్లకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ కూడా పొందవచ్చు. ఆసక్తి కలిగిన సందర్శకులు కూడా ఈ ఈవెంట్లో పాల్గొనవచ్చు. దీనికోసం టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సందర్శకులు తమ అభిమాన ప్రో ప్లేయర్లు, గేమింగ్ ఇన్ఫ్లుయెన్సర్లను కలవడానికి కూడా ఓ మంచి అవకాశాన్ని పొందుతారు.•తేదీ: 2024 నవంబర్ 15 నుంచి 17•వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్•టిక్కెట్ ప్రారంభ ధర: రూ. 1,699 -
‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’.. విజేతలు వీరే
ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ గురువారం ‘ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024’ విజేతలను ప్రకటించింది. ఎకనామిక్స్, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అనే ఆరు విభాగాలలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న వారి పేర్లను వెల్లడించింది.అవార్డు అందుకున్న వారిలో భారత్‌లోని ప్రముఖ సంస్థలకు చెందిన వారు ఇద్దరు. ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు, వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఒకరు, ఎడిన్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఒకరు ఉన్నారు. ఈ అవార్డు కింద 100,000 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు 84 లక్షల, 42 వేలు) నగదు బహుమతిని అందజేయనున్నారు. అవార్డు ప్రదానోత్సవం జనవరిలో జరగనుంది.ఇన్ఫోసిస్ ప్రైజ్ 2024 గెలుపొందిన విజేతలు:1. ఎకనామిక్స్ విభాగంలో.. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అరుణ్ చంద్రశేఖర్2. ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో.. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి శ్యామ్ గొల్లకోట.3. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో.. ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి మహమూద్ కూరియా.4. లైఫ్ సైన్సెస్ విభాగంలో.. పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు చెందిన సిద్ధేష్ కామత్5. మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగంలో.. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ నీనా గుప్తా6. ఫిజికల్ సైన్సెస్ విభాగంలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ వేదిక ఖేమానీకి బహుమతి లభించింది.కాగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను పత్రి ఏటా ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’ను అందిస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్య వంటి ఆరు విభాగాల్లో కృషి చేసిన వారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రతి కేటగిరి నుంచి గెలుపొందిన విజేతలకు ఒక బంగారు పతకంతోపాటు, ప్రశంస పత్రం, లక్ష డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం రూ. 84 లక్షల 40 వేలు), దానికి సమానమైన ప్రైజ్ పర్స్ అందిస్తారు. మానవాళికి మేలు చేసే అత్యుత్తమ పరిశోధనలను గుర్తించడం, దేశంలోని యువ పరిశోధకులకు, ఔత్సాహిక శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలవడమే ఇన్ఫోసిస్ ప్రైజ్ ప్రాథమిక లక్ష్యం.అయితే విదేశాలకు చెందిన విజేతలు బహుమతిని గెలుచుకునే సమయంలో తమకు నచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్లలో తగిన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దేశంలో గరిష్టంగా రెండు పర్యటనలలో 30 రోజులు గడవాల్సిందిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కోరుతుంది. -
రిలయన్స్, డిస్నీ విలీనం: దిగ్గజ మీడియా సంస్థగా..
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనం పూర్తయింది. ఈ విలీనం ఏకంగా రూ.70,352 కోట్ల విలువైన కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. రిలయన్స్ - డిస్నీ విలీనంతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యం అవతరించింది.జాయింట్ వెంచర్ వృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థకు నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు, వైస్ చైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ ఉంటారు. విలీన కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.34 శాతం వాటాను, వయాకామ్ 18 46.82 శాతం వాటాను, డిస్నీ 36.84 శాతం వాటాను పొందుతాయి.కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి విలీనానికి కావలసిన అనుమతులు కూడా ఇప్పటికే లభించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ విలీనం తరువాత వీటి కింద సుమారు 100 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ ఉండనున్నాయి. ఇవి ఏడాదికి 30,000 గంటల కంటే ఎక్కువ టీవీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను ఉత్పత్తి చేయగలవని సమాచారం.ఇదీ చదవండి: ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ జాయింట్ వెంచర్ భారతదేశ వినోద పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ప్రపంచ స్థాయి డిజిటల్ స్ట్రీమింగ్ సామర్థ్యాలతో పాటు డిజిటల్ ఫస్ట్ అప్రోచ్‌తో భారతీయులకు మాత్రమే కాకుండా.. ప్రవాస భారతీయులకు సరసమైన ధరలకు అసమానమైన కంటెంట్ ఆప్షన్స్ అందించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. -
రూ.74.9 లక్షల కొత్త జర్మన్ బ్రాండ్ కారు ఇదే..
బీఎండబ్ల్యూ ఇండియా '2024 ఎం340ఐ' పర్ఫామెన్స్ సెడాన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 74.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ సెడాన్ కోసం కంపెనీ దేశవ్యాప్తంగా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.2024 బీఎండబ్ల్యూ ఎం340ఐ 48వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ అసిస్ట్‌తో 374 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే.. 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఇది మెర్సిడీ బెంజ్ ఏఎంజీ సీ 43, ఆడి ఎస్5 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.కొత్త బీఎండబ్ల్యూ ఎం340ఐ సెడాన్ 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇది ఆర్కిటిక్ రేస్ బ్లూ, ఫైర్ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. డిజైన్, సేఫ్టీ పరంగా ఇది దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అంటే ఇందులో ఎలాంటి అప్డేట్స్ లేదు. -
ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా.. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా.. ఇది తప్పనిసరి. అయితే ఈ లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే.. పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి.నిజానికి 2023 జూన్ 30 నాటికి ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు ముగిసింది. గడువు లోపల లింక్ చేసుకొని వారు ఫెనాల్టీ కింద రూ.1,000 చెల్లించి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. జనవరి 29, 2024 నాటికి ఆధార్‌తో లింక్ చేయని పాన్ల సంఖ్య 11.48 కోట్లు అని ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలియజేశారు.దీంతో 2023 జులై 1 నుంచి 2024 జనవరి 31 వరకు ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం ఫెనాల్టీ కింద కేంద్రం 601.97 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే.. తరువాత లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కొంత కష్టమే.ఇదీ చదవండి: 'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో.. పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్‌ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. కాబట్టి తప్పకుండా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలి. దీని కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించి.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234H కింద రూ. 1,000 ఫెనాల్టీ చెల్లించాలి. -
మూడు కార్లకు 5 స్టార్ రేటింగ్: సేఫ్టీలో దేశీయ దిగ్గజం హవా
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న కార్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి మహీంద్రా కంపెనీకి చెందిన మూడు కార్లు చేరాయి. అవి మహీంద్రా థార్ రోక్స్, ఎక్స్‌యూవీ400, ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ. ఇవన్నీ 'భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (B-NCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకున్నాయి.మహీంద్రా థార్ రోక్స్భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో మహీంద్రా థార్ రోక్స్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 45 పాయింట్ల స్కోర్ సాధించింది.మహీంద్రా థార్ రోక్స్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్ణింగ్, 360 డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లెవల్ 2 ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఈ కారు ధరలు రూ.12.99 లక్షల నుంచి రూ. 22.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించిన మరో మహీంద్రా కారు ఎక్స్‌యూవీ400. ఈ ఎలక్ట్రిక్ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 32 పాయింట్లకు గాను 30.37 పాయింట్లు.. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్టులో 49 పాయింట్లకు 43 పాయింట్ల స్కోర్ సాధించింది.రూ. 16.74 లక్షల ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ400 మల్టిపుల్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, ఆల్ డిస్క్ బ్రేక్‌లు మొదలైనవి ఉన్నాయి.మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓమహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు కూడా భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించి, అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 32 పాయింట్లకు 29.36 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో 49 పాయింట్లకు 43 పాయింట్లు సాధించింది.మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు వంటి వాటితో పాటు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 69.52 పాయింట్లు లేదా 0.089 శాతం నష్టంతో 77,621.44 వద్ద, నిఫ్టీ 9.75 పాయిట్లు లేదా 0.041 శాతం నష్టంతో 23,549.30 వద్ద నిలిచాయి.ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, రిలయన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), నెస్లే వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!
పెళ్లి తరువాత అమ్మాయిలకు అత్తింటి పేరు వచ్చి చేరడం సాధారణం. అయితే ఇది వారి వ్యక్తిగత ఇష్లాలు, ఆచారాలను బట్టి కూడా ఉంటుంది. తాజాగా రిలయన్స్ సామ్రాజ్యాన్ని సృష్టించిన అంబానీ ఇంటి కోడలు రాధికా మర్చంట్ పేరు మార్చుకుంది. పెళ్లి తర్వాత, రాధిక మర్చంట్ తన పేరులో 'అంబానీ'ని అధికారికంగా చేర్చుకుంది. రాధికా మర్చంట్ తన భర్త అనంత్ అంబానీ ఇంటిపేరును తన పేరులో చేర్చుకోవడంతో ‘రాధిక అంబానీ’గా అవతరించింది. వ్యాపారవేత్త విరేన్ మర్చంట్ కుమార్తె అయిన రాధికా మర్చంట్ తన చిరకాల బాయ్‌ఫ్రెండ్ అనంత్ అంబానీని ఈ ఏడాది జూలైలో పెళ్లాడింది. రాధిక తన తండ్రి వ్యాపారమైన ఎన్కోర్ హెల్త్‌కేర్‌కు డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంది. ఇటీవల ఎంటర్ప్రెన్యూర్ ఇండియాతో మాట్లాడిన ఆమె తన భవిష్యత్ కెరీర్ ప్లాన్లను కూడా వివరించింది. ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లలో తమ వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించినట్లు రాధిక వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తీసుకురావాలని ఆమె భావిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి : Kartika Purnima 2024: 365 వత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయా? -
'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్
ఒకప్పుడు ఉద్యోగులు సమయంతో పనిలేకుండానే ఆఫీసుకు ముందుగా వచ్చేసి.. పని పూర్తి చేసుకుని లేటుగా కూడా ఇంటికి వెళ్లేవారు. అయితే.. ఇప్పుడున్న ఉద్యోగులలో కొంతమంది దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆఫీసులో లేట్ అయితే.. రేపు డ్యూటీకి లేటుగా వస్తామంటూ బాస్‌కు మెసేజ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఒక ఉద్యోగి.. హాయ్ సార్ & మేడమ్ నేను రేపు ఉదయం 11.30 గంటలకు ఆఫీసుకు వస్తాను. ఎందుకంటే నేను రాత్రి 8.30 గంటలకు ఆఫీసు నుంచి బయలుదేరాను, అంటూ మెసేజ్ చేశారు.ఉద్యోగి పంపిన మెసేజ్‌ను 'ఆయుషి దోషి' తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. నా జూనియర్ నాకు ఇలా మెసేజ్ చేశారు. ఇది నమ్మలేకపోతున్నాను, ఈ కాలం పిల్లలు వేరేలా ఉన్నారు. ఆఫీసు నుంచి లేటుగా వెళ్లాను, కాబట్టి లేటుగా ఆఫీసుకు వస్తాను. ఇది చూసి నాకు మాటలు రావడం లేదు అంటూ.. పేర్కొంది.సాధారణంగా ఒక రోజులో పూర్తయ్యే పనిని ఉద్యోగికి అప్పగించడం జరుగుతుంది. ఇచ్చిన పనిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటలలోపు పూర్తి చేయాలి. కానీ.. పని చేయాల్సిన సమయంలో ఉద్యోగి ఫోన్‌పై ద్రుష్టి పెడుతూ పనిని ఆలస్యం చేస్తే.. ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమవుతుందని.. ఆయుషి దోషి మరో ట్వీట్లో వెల్లడించారు.ఇదీ చదవండి: అడిగితే 'జియో హాట్‌స్టార్' ఇచ్చేస్తాం: రిలయన్స్‌కు చిన్నారుల ఆఫర్సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ మీద నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంత మంది ఉద్యోగులను కంపెనీలు దోచుకుంటున్నాయని చెబుతుంటే.. మరికొందరు ఉద్యోగులకు సమయపాలన చాలా అవసరం అని పేర్కొంటున్నారు. ఇంకొందరు ఆ ఉద్యోగి కాన్ఫిడెంట్ నచ్చిందని చెబుతున్నారు.I can’t believe my junior sent me this. Today’s kids are something else. He stayed late, so now he’s going to show up late to the office to "make up" for it. What a move!🫡🫡 i am speechless mahn. pic.twitter.com/iNf629DLwq— Adv. Ayushi Doshi (@AyushiiDoshiii) November 12, 2024 -
రూ.11తో 10 జీబీ డేటా!
రిలయన్స్ జియో వినియోగదారులకు కొత్తగా బూస్టర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువగా డేటా వాడుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. ఈమేరకు ప్లాన్ వివరాలు వెల్లడించింది.కేవలం రూ.11తో 10 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు.ఈ ఆఫర్ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది.రీఛార్జ్ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.ఈ ఆఫర్ కేవలం ఇంటర్నెట్ సర్వీసుకే పరిమతం. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులను ఇది అందించదు.నిర్ణీత సమయంపాటు హైస్పీడ్ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది.లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్లు, డౌన్లోడ్ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది.ఇదీ చదవండి: సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు? -
కార్మికశాఖ ఒప్పందం.. 5 లక్షల మందికి ప్రయోజనం
న్యూఢిల్లీ: మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, మానవ వననరుల సేవలను అందించే టీమ్‌లీజ్ ఎడ్టెక్ చేతులు కలిపాయి. యూనివర్సిటీ విద్యార్థులకు నూతన కెరీర్ అవకాశాలు కల్పించేందుకు వీలుగా అవగాహన ఒప్పందం కుదిరింది.ఉపాధి ఆధారిత డిగ్రీ కార్యక్రమాలను ఆఫర్ చేయనున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ ప్రకటించింది. కేంద్ర ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీసీ) పోర్టల్‌పై 200 వరకు ఉపాధి ఆధారిత డిగ్రీ పోగ్రామ్‌లను అందించనున్నట్టు తెలిపింది. ప్రతి ప్రోగ్రామ్ విడిగా 5 లక్షల మందికి పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలతో అధ్యయన అవకాశాలు కల్పించనుంది.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ.. టీమ్‌లీజ్ సహకారంతో అందించే డిగ్రీ ప్రోగ్రామ్‌లు అభ్యాసంతోపాటు, ప్రత్యక్ష అనుభవాన్ని సమన్వయం చేస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. -
సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు?
వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలనే వాదనలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో సీపీఐ ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరి ఏకంగా 6.1 శాతంగా నమోదైంది. అయితే అందుకు ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం పెరగడమేనని ఆర్బీఐ తెలిపింది. సీపీఐ ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయిస్తే మెరుగైన గణాంకాలు కనిపించే వీలుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆహార ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని సీపీఐలో కొనసాగించాల్సిందేనని ఇంకొందరు చెబుతున్నారు.తగ్గుతున్న పంటల సాగుదేశవ్యాప్తంగా చాలాచోట్ల విభిన్న వాతావరణ మార్పుల వల్ల ఆశించినమేర వ్యవసాయ దిగుబడి రావడంలేదు. దాంతో ఆహార పదార్థాల సప్లై-చెయిన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. దానికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు ఎత్తివేసింది. దాంతో దళారులు కృత్రిమకొరతను సృష్టించి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారు. వర్షాభావం కారణంగా మహారాష్ట్ర వంటి అధికంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో పంటసాగు వెనకబడుతుంది. వంట నూనెలకు సంబంధించి ముడిఆయిల్ దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల సుంకాన్ని పెంచింది. దాంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి. పాతస్టాక్‌ను 45 రోజుల్లో క్లియర్ చేసి కొత్త సరుకుకు ధరలు పెంచేలా నిబంధనలున్నాయి. కానీ ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే కంపెనీలు ధరల పెరుగుదలను అమలు చేశాయి.ప్రకృతి విపత్తుల వల్ల తీవ్ర నష్టంభౌగోళిక స్వరూపం ప్రకారం భారత్‌లో మొత్తం సుమారు 70 రకాల పంటలు పండించవచ్చని గతంలో పలు సర్వేలు తెలియజేశాయి. కానీ గరిష్ఠంగా దాదాపు 20 రకాల పంటలనే ఎక్కువగా పండిస్తున్నారు. అందులోనూ కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలే అధికంగా పండుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షాలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులపై ధరల ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఆహార ద్రవ్యోల్బణం కీలకంఆర్థికసర్వే సూచనల ప్రకారం ప్రభుత్వం ఆహార ద్రవ్యోల్బణాన్ని సీపీఐ నుంచి తొలగించే ఆలోచన చేయకుండా దాన్ని తగ్గించేందుకు అవసరమయ్యే మార్గాలను అన్వేషించాలని నిపుణులు కోరుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పరిగణించరు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అది కీలకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
వంద మందిలో ఒకే ఒక్కడు.. ముఖేష్ అంబానీ
వ్యాపార రంగంలో ఫార్చూన్ (Fortune) అత్యంత శక్తివంతమైన 100 మంది వ్యక్తులలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఒకరుగా నిలిచారు. ఈ జాబితాలో చోటుదక్కించుకున్న భారతీయ వ్యాపారవేత్త ఆయనొక్కరే కావడం విశేషం. శక్తిమంతుల జాబితాలో ఆయన 12వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ లిస్ట్‌లో ఆరుగురు భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారు 40 పరిశ్రమల నుండి ఉన్నారు. వీరిలో 30 నుండి 90 ఏళ్ల వరకు పలు వయసులవారు ఉన్నారు. ఇందులో వ్యవస్థాపకులు, ప్రముఖ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, ఆవిష్కర్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారు. ఇక ఇందులో స్థానం పొందిన ఐదుగురు భారతీయ సంతతి సీఈవోలలో నలుగురు టెక్ దిగ్గజాల సీఈవోలు కాగా, ఒకరు మేకప్ బ్రాండ్‌ను నడుపుతున్నారు.ఇదీ చదవండి: సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరటభారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల ఫార్చూన్ జాబితాలో జాబితాలో 3వ స్థానంలో ఉండగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈసారి టాప్ 10 అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇక అడోబ్ సీఈవో శంతను నారాయణ్ 52వ స్థానంలో, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ 69వ స్థానంలో ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా 74వ ర్యాంక్, మేకప్ బ్రాండ్ ఐస్ లిప్స్ ఫేస్ (ELF) సీఈవో తరంగ్ అమిన్ 94వ ర్యాంక్ దక్కించుకున్నారు. -
వొడాఫోన్ ఐడియా నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర నష్టం తగ్గి రూ. 7,176 కోట్లకు పరిమితమైంది. జులైలో టారిఫ్‌ల పెంపు చేపట్టడంతో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) మెరుగుపడటం ఇందుకు దోహదపడింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 8,747 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 2 శాతం స్వల్ప వృద్ధితో రూ. 10,932 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 10,716 కోట్ల టర్నోవర్ సాధించింది. ఏఆర్పీయూ 8 శాతం పుంజుకుని రూ. 166ను తాకింది. మొత్తం వినియోగదారుల సంఖ్య 20.5 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్కాగా.. మూడేళ్ల కాలంలో నెట్వర్క్ పరికరాల సరఫరా కోసం నోకియా, ఎరిక్సన్, శామ్‌సంగ్‌లతో 3.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 30,000 కోట్లు) విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. లితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 4 శాతం క్షీణించి రూ. 7.37 వద్ద ముగిసింది. -
రెండు సంస్థలదే ఆధిపత్యం!
దేశంలో మరిన్ని విమానయాన సంస్థలు కార్యకలాపాలు సాగించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం రెండు ప్రముఖ కంపెనీలే అధిక వ్యాపార వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో రెండు సంస్థలే ఆధిపత్యం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈటీ ఇండియా అసెండ్స్ ఈవెంట్లో నాయుడు పాల్గొని మాట్లాడారు.‘ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉండాలి. దాంతో వినియోగదారులకు తక్కువ ధరలకే సేవలందుతాయి. కానీ విమానయాన పరిశ్రమలో కేవలం రెండు సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రంగం ఈ సంస్థలకే పరిమితం కావడం సరైందికాదు. మరిన్ని కంపెనీలు ఈ విభాగంలో సేవలందించాలి. దాంతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందుతాయి. విమాన ప్రయాణం అందుబాటు ధరలో ఉండేలా ప్రభుత్వం టిక్కెట్ ధరలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నా ప్రభుత్వం విభిన్న పాలసీలను తయారుచేస్తోంది. ఈ రంగాన్ని మరింత ఉత్తమంగా ఎలా చేయగలమో ఆయా సంస్థలతో చర్చిస్తోంది. ఏదైనా విమానయాన సంస్థ దివాలా తీయడం లేదా పరిశ్రమను వదిలివేయడం మాకు ఇష్టం లేదు. ఈ పరిశ్రమలోకి కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రైవేట్ మూలధనం ద్వారా కార్యకలాపాలు సాగించే కొత్త కంపెనీలు దివాలా దిశగా వెళితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఎయిరిండియా గ్రూపులో ఇటీవల విస్తారా విలీనం అయింది. దాంతో దేశీయ విమానయాన మార్కెట్ వాటాలో 80 శాతం ఇండిగో, ఎయిరిండియాలే సొంతం చేసుకుంటున్నాయి. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 2023లో మరో పదేళ్ల కాలంపాటు అంటే 2033 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(ఉడాన్) పథకంలో భాగంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం, విమానయానాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
పసిడి ప్రియులకు పండగ.. మళ్లీ భారీగా తగ్గిన ధరలు
Gold Price Today: వరుస తగ్గింపులతో బంగారం.. కొనుగోలుదారులకు పండగలా మారింది. నాలుగు రోజులుగా క్రమంగా తగ్గుతున్న పసిడి ధరలు నేడు (నవంబర్ 14) మరింత భారీగా తగ్గి తులం (10 గ్రాములు) రూ.70 వేల దిగువకు వచ్చేసింది. గడిచిన ఆరు రోజుల్లో బంగారం తులానికి రూ.3800 పైగా తగ్గడంతో పసిడిప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.దేశంలోని వివిధ ప్రాంతాలలో పసిడి ధరలు ఏ స్థాయిలో తగ్గాయో పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం ధర అమాంతం రూ.1100 తగ్గి రూ.69,350 లకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా ఏకంగా రూ.1200 క్షీణించి రూ. 75,650 వద్దకు దిగివచ్చింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ తెలుగు రాష్ట్రాల స్థాయిలోనే బంగారం ధరలు క్షీణించాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.1100 తగ్గి రూ.69,500 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.1200 తగ్గి రూ.75,800 వద్దకు క్షణించింది.రూ.లక్ష దిగువకు వెండిSilver Price Today: దేశవ్యాప్తంగా నేడు వెండి ధరలు కూడా భారీ స్థాయిలో క్షీణించాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై ఏకంగా రూ.2000 తగ్గి రూ.లక్ష దిగువకు వచ్చేసింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.99,000 వద్దకు వచ్చి చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం
దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏరియల్ ట్యాక్సీలు నడిచేందుకు వీలుగా ‘వెర్టిపోర్ట్’(ఎయిర్ టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే ప్రదేశం)లను ఏర్పాటు చేసేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అంగీకారం తెలిపారు. దాంతో దుబాయ్ మొదటిసారి అర్బన్ ఏరియల్ ట్రాన్స్పోర్ట్ సేవలందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది.3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే వెర్టిపోర్ట్‌లో టేకాఫ్, ల్యాండింగ్ జోన్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, టాక్సీ పార్కింగ్ ప్రాంతాలను సిద్ధం చేయనున్నారు. ఏటా సుమారు 1,70,000 మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రపంచ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఎయిర్ కండిషన్డ్ వెర్టిపోర్ట్లను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ కంపెనీల సహకారం తీసుకోనున్నారు. జాబీ ఏవియేషన్, సైపోర్ట్ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌కు తమ సేవలందించనున్నాయి. జాబీ ఏవియేషన్ విమానాల తయారీ, కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది. స్కైపోర్ట్ మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్వహణను పర్యవేక్షిస్తుంది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కొత్త ప్రాజెక్ట్‌ను ప్రస్తుత రవాణా వ్యవస్థలతో అనుసంధానిస్తుంది. ఈ ఎయిర్‌ట్యాక్సీ సర్వీసులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులుజాబీ ఏవియేషన్ తయారు చేసిన ఏరియల్ టాక్సీ ఎస్4 మోడల్ సున్నా ఉద్గారాలతో పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనంగా ప్రసిద్ధి చెందింది. అది నిలువుగా టేకాఫ్, ల్యాండ్ అవ్వగలదు. దీని గరిష్ట వేగం 321 కిమీ/గం. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 160 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఎస్4 ఒక పైలట్, నలుగురు ప్రయాణీకులను తీసుకువెళ్లగలదు. సంప్రదాయ హెలికాప్టర్ల కంటే చాలా తక్కువ శబ్దం చేస్తూ ప్రయాణిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆర్టీఏ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జీసీఏఏ), దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (డీసీఏఏ), స్కైపోర్ట్, జాబీ ఏవియేషన్‌లు ఏరియల్ టాక్సీ సేవలకు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 23,622కు చేరింది. సెన్సెక్స్ 164 పాయింట్లు ఎగబాకి 77,825 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.48 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.02 శాతం పెరిగింది. నాస్డాక్ 0.14 శాతం దిగజారింది.ఇదీ చదవండి: రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులుదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్బీఐ తెలిపింది. శుక్రవారం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగించనున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫుడ్ డెలివరీకి కొత్త రూల్..
ఆహారోత్పత్తులు విక్రయించే ఈ–కామర్స్ కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొత్త నిబంధన విధించింది. ఏదైనా ఆహారోత్పత్తి గడువు ముగిసే తేదీకి కనీసం 30 శాతం లేదా 45 రోజులు ముందుగా కస్టమర్‌కు చేరాలని స్పష్టం చేసింది. అంటే షెల్ఫ్ లైఫ్ కనీసం 45 రోజులు ఉన్న ఉత్పత్తులను డెలివరీ చేయాల్సి ఉంటుంది.కాలం చెల్లిన, గడువు తేదీ సమీపిస్తున్న ఉత్పత్తుల డెలివరీలను కట్టడి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ & సర్టిఫికేషన్‌కి మద్దతుగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహించాలని కూడా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ సూచించినట్లు తెలుస్తోంది. కల్తీని నివారించడానికి ఆహారం, ఆహారేతర వస్తువులను వేర్వేరుగా డెలివరీ చేయాలని స్పష్టం చేసింది.గడువు ముగిసే ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించిన సమస్యలు ఇటీవల అధికమయ్యాయి. ముఖ్యంగా డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డెలివరీ అయ్యే వస్తువులపై గడువు తేదీలు ఉండటం లేదంటూ అనేక ఫిర్యాదు వచ్చాయి. డెలివరీ చేస్తున్న వస్తువులపై ఎంఆర్పీ, "బెస్ట్ బిఫోర్" తేదీలు లేకపోవడంపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గత నెలలో క్విక్-కామర్స్, ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. -
రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులు
అమెరికా అధ్యక్షుడి పీఠాన్ని రెండోసారి అధిరోహించనున్న డొనాల్డ్ట్రంప్ కూతురు ఇవాంకాట్రంప్ ఇటీవల తన పాత మాన్షన్‌ను పునరుద్దరించినట్లు తెలిపారు. ఇందుకోసం 24 మిలియన్ డాలర్లు(సుమారు రూ.199 కోట్లు) ఖర్చు చేసినట్లు ‘బెంజింగా’ అనే రియల్ ఎస్టేట్ రిసెర్చ్ సంస్థ నివేదించింది. కొత్తగా పునరుద్ధరించిన ఇవాంకా మాన్షన్ ‘బిలియనీర్ బంకర్’లో ఉంది. మియామిలో అత్యంత గుర్తించదగిన ఆధునిక భవనాల జాబితాలో తన మాన్షన్ ఒకటిగా నిలిచినట్లు బెంజింగా తెలిపింది.ఇవాంకా మాన్షన్ ఫ్లోరిడాలోని మియామి డెడ్ కౌంటీలో ఉన్న ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌లో ఉంది.ఈ ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌ను బిలియనీర్ బంకర్ అని పిలుస్తారు.ఈ ఐల్యాండ్ ఒక ప్రైవేట్, గేటెడ్ కమ్యూనిటీ. దీనికి అత్యంత భద్రత ఉంటుంది.ఫ్లోరిడా స్టేట్ పోలీసు ఫోర్స్, 24/7 ఆర్మ్డ్ మిలిటరీ దీనికి గస్తీ కాస్తోంది.ఈ ద్వీపంలో కేవలం 41 నివాస గృహాలు మాత్రమే ఉన్నాయి.ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని అత్యంత ప్రత్యేకమైన, సంపన్న వర్గాలకు చెందిందిగా ప్రసిద్ధి.ఇండియన్ క్రీక్‌లో లగ్జరీ సౌకర్యాలున్నాయి.ప్రముఖ సింగర్ జూలియో ఇగ్లేసియాస్, ఎన్ఎఫ్ఎల్ లెజెండ్ టామ్ బ్రాడీ, గిసెల్ బాండ్చెన్, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, కార్ల్ ఇకాన్లతో సహా మరికొందరు ప్రముఖులు ఇక్కడ నివాసముంటున్నారు.ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు -
ఇండియన్ ఆయిల్ చైర్మన్‌గా అరవిందర్ సింగ్ సాహ్ని
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొత్త చైర్మన్‌గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 54 సంవత్సరాల సాహ్నీ ప్రస్తుతం ఐఓసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్– పెట్రోకెమికల్స్)గా విధులు నిర్వహిస్తున్నారు.ఆగస్టులోనే ఈ బాధ్యతలకు ఎంపికైన ఆయన, అటు తర్వాత కొద్ది నెలల్లోనే సంస్థ చైర్మన్‌గా నియమితులు కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా పదవీ విరమణ పొందే వరకూ లేదా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ (ఏది ముందైతే అది) సాహ్నీ ఐఓసీ చైర్మన్‌గా ఉంటారు. శ్రీకాంత్ మాధవ్ వైద్య తన పొడిగించిన పదవీకాలాన్ని ఈ ఏడాది ఆగస్టు 31న పూర్తి చేసుకున్న నాటి నుంచి ఈ ఫారŠూచ్యన్ 500 కంపెనీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. 2014 జూలైలో బీ అశోక్ తర్వాత బోర్డు అనుభవం లేకుండానే కంపెనీ ఉన్నత ఉద్యోగానికి పదోన్నది పొందిన రెండవ వ్యక్తి సాహ్ని.