Business
-
రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులు
అమెరికా అధ్యక్షుడి పీఠాన్ని రెండోసారి అధిరోహించనున్న డొనాల్డ్ట్రంప్ కూతురు ఇవాంకాట్రంప్ ఇటీవల తన పాత మాన్షన్‌ను పునరుద్దరించినట్లు తెలిపారు. ఇందుకోసం 24 మిలియన్ డాలర్లు(సుమారు రూ.199 కోట్లు) ఖర్చు చేసినట్లు ‘బెంజింగా’ అనే రియల్ ఎస్టేట్ రిసెర్చ్ సంస్థ నివేదించింది. కొత్తగా పునరుద్ధరించిన ఇవాంకా మాన్షన్ ‘బిలియనీర్ బంకర్’లో ఉంది. మియామిలో అత్యంత గుర్తించదగిన ఆధునిక భవనాల జాబితాలో తన మాన్షన్ ఒకటిగా నిలిచినట్లు బెంజింగా తెలిపింది.ఇవాంకా మాన్షన్ ఫ్లోరిడాలోని మియామి డెడ్ కౌంటీలో ఉన్న ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌లో ఉంది.ఈ ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌ను బిలియనీర్ బంకర్ అని పిలుస్తారు.ఈ ఐల్యాండ్ ఒక ప్రైవేట్, గేటెడ్ కమ్యూనిటీ. దీనికి అత్యంత భద్రత ఉంటుంది.ఫ్లోరిడా స్టేట్ పోలీసు ఫోర్స్, 24/7 ఆర్మ్డ్ మిలిటరీ దీనికి గస్తీ కాస్తోంది.ఈ ద్వీపంలో కేవలం 41 నివాస గృహాలు మాత్రమే ఉన్నాయి.ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని అత్యంత ప్రత్యేకమైన, సంపన్న వర్గాలకు చెందిందిగా ప్రసిద్ధి.ఇండియన్ క్రీక్‌లో లగ్జరీ సౌకర్యాలున్నాయి.ప్రముఖ సింగర్ జూలియో ఇగ్లేసియాస్, ఎన్ఎఫ్ఎల్ లెజెండ్ టామ్ బ్రాడీ, గిసెల్ బాండ్చెన్, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, కార్ల్ ఇకాన్లతో సహా మరికొందరు ప్రముఖులు ఇక్కడ నివాసముంటున్నారు.ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు -
ఇండియన్ ఆయిల్ చైర్మన్‌గా అరవిందర్ సింగ్ సాహ్ని
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొత్త చైర్మన్‌గా అరవిందర్ సింగ్ సాహ్ని నియమితులయ్యారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 54 సంవత్సరాల సాహ్నీ ప్రస్తుతం ఐఓసీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్– పెట్రోకెమికల్స్)గా విధులు నిర్వహిస్తున్నారు.ఆగస్టులోనే ఈ బాధ్యతలకు ఎంపికైన ఆయన, అటు తర్వాత కొద్ది నెలల్లోనే సంస్థ చైర్మన్‌గా నియమితులు కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా పదవీ విరమణ పొందే వరకూ లేదా ప్రభుత్వ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ (ఏది ముందైతే అది) సాహ్నీ ఐఓసీ చైర్మన్‌గా ఉంటారు. శ్రీకాంత్ మాధవ్ వైద్య తన పొడిగించిన పదవీకాలాన్ని ఈ ఏడాది ఆగస్టు 31న పూర్తి చేసుకున్న నాటి నుంచి ఈ ఫారŠూచ్యన్ 500 కంపెనీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. 2014 జూలైలో బీ అశోక్ తర్వాత బోర్డు అనుభవం లేకుండానే కంపెనీ ఉన్నత ఉద్యోగానికి పదోన్నది పొందిన రెండవ వ్యక్తి సాహ్ని. -
ఏఐ ప్రభావం.. వచ్చే ఏడాది జరిగేది ఇదే..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో 2025లో టెక్నాలజీ అమలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ప్రాధాన్యం పెరుగుతుందని నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్ అభిప్రాయపడ్డారు. ఏఐతో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు ఉంటాయన్న అంశంపై స్పందిస్తూ.. నైపుణ్యాల పెంపు, ఉత్పాదకత పెంపొందించడంలో ఏఐని సహాయకారిగా చూడాలన్నారు.దీన్ని అసాధారణ సాంకేతికతగా అభివర్ణించారు. దీనివల్ల ఉద్యోగాల నష్టం తక్కువేనంటూ.. ఉత్పాదకతను గణనీయంగా పెంచుతుందని, ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొనసాగాలంటే వ్యాపార సంస్థలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఇందుకు సంస్థ పరిమాణంతో సంబంధం లేదన్నారు.టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో బలమైన భాగస్వామ్యాలతోనే పెద్ద సవాళ్లను అధిగమించి, రాణించగలమన్నారు. లాంగ్వేజ్ నమూనాలను అర్థం చేసుకుని, వాటిని ఏ విధంగా వినియోగించుకోగలమో చూడాలని సూచించారు. భారత్‌లో ఏఐ మిషన్, నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా చీఫ్‌గానూ పనిచేస్తున్న గంగాధరన్ ఏటా 2,500–3,000 మేర ఉద్యోగులను పెంచుకుంటున్నట్టు చెప్పారు. బెంగళూరు, గురుగ్రామ్, పుణె, ముంబై, హైదరాబాద్‌లో ఎస్ఏపీకి కేంద్రాలున్నాయి. ఇక్కడ అత్యుత్తమ నైపుణ్యాలను గుర్తించడం తమకు కీలకమన్నారు. ఎస్ఏపీకి భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధి కేంద్రంగా ఉందని సంస్థ సీఈవో క్రిస్టియన్ క్లీన్ తెలిపారు. భవిష్యత్‌లో అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం ఎస్ఏపీకి టాప్–10 దేశాల్లో ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. -
ఎన్టీపీసీ గ్రీన్ రూ. లక్ష కోట్ల పెట్టుబడి
ముంబై: ఐపీవో బాటలో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 2026–27 నాటికి సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిలో 20 శాతం ఈక్విటీ రూపంలో రావాలంటే.. విస్తరణ కోసం రూ.20,000 కోట్ల సొంత నిధులు అవసరమవుతాయని సంస్థ సీఎండీ గుర్దీప్ సింగ్ వెల్లడించారు.రాబోయే ఐపీవో ద్వారా రూ.10,000 కోట్ల నిధులు వస్తాయని అన్నారు. కంపెనీ అంతర్గత వనరుల ద్వారా మిగిలిన మొత్తాన్ని సేకరించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ఏజెన్సీల నుండి కంపెనీ మెరుగైన క్రెడిట్ రేటింగ్‌ను పొందుతోందని, ఇది పోటీ కంపెనీలతో పోల్చినప్పుడు తక్కువ రేట్లతో రుణాన్ని అందుకునేందుకు వీలు కల్పిస్తుందని సింగ్ చెప్పారు. ఇతర విభాగాల్లోకీ ఎంట్రీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకూడదని, గ్రీన్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్ పవర్, ఎనర్జీ స్టోరేజీ విభాగాల్లో ఎంట్రీపై కూడా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌ను నెలకొల్పడానికి విశాఖపట్నం సమీపంలోని 1,200 ఎకరాల భూమిని చాలా సంవత్సరాల క్రితం ఎన్టీపీసీ తీసుకుంది. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని సింగ్ వెల్లడించారు. 2027కల్లా 19,000 మెగావాట్లు.. ప్రస్తుతం 3,220 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ.. 2025 మార్చికి 6,000 మెగావాట్లకు, 2026 మార్చి నాటికి 11,000 మెగావాట్లకు, 2027 మార్చి కల్లా 19,000 మెగావాట్లకు సామర్థ్యాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 11,000 మెగావాట్లకు సమానమైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని సింగ్ వెల్లడించారు.నవంబర్ 19 నుంచి ఐపీవో.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీవో నవంబర్ 19న ప్రారంభమై 22న ముగుస్తుంది. ఒక్కొక్కటి రూ.102–108 ప్రైస్ బ్యాండ్‌తో రూ.10,000 కోట్ల వరకు విలువైన తాజా షేర్లను జారీ చేయడానికి కంపెనీ ప్రణాళిక చేస్తోంది. ఇన్వెస్టర్లు కనీసం 138 షేర్లతో కూడిన లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి వాటాలు కావాల్సినవారు మరిన్ని లాట్స్‌కు బిడ్లు వేసుకోవచ్చు.ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 75 శాతం, నాన్–ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం వాటాలు కేటాయిస్తారు. అర్హత కలిగిన కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.5 డిస్కౌంట్‌ను ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఆఫర్ చేస్తోంది. ఉద్యోగుల కోటాకై రూ.200 కోట్ల విలువైన షేర్లను కేటాయించారు. హ్యుండై మోటార్ ఇండియా, స్విగ్గీ తర్వాత ఈ ఏడాది మూడవ అతిపెద్ద ఐపీవోగా ఇది నిలవనుంది. -
స్విగ్గీ ‘లాభాల’ డెలివరీ
ముంబై: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ షేరు లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు 17% లాభాలు డెలివరీ చేసింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.390)తో పోలిస్తే 8% ప్రీమియంతో రూ.420 వద్ద లిస్టయ్యింది. నష్టాల మార్కెట్లో ఈ షేరుకు డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో 19.50% పెరిగి రూ.466 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 17% లాభంతో రూ.456 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1.03 లక్షల కోట్లుగా నమోదైంది. → ఐపీఓ లిస్టింగ్‌తో స్విగ్గీ కంపెనీలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. పబ్లిక్ ఇష్యూ కంటే ముందే స్విగ్గీ తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈ–సాప్స్) కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. ఐపీఓ గరిష్ట ధర శ్రేణి రూ.390 ప్రకారం వీటి విలువ రూ.9,000 కోట్లుగా ఉంది. దలాల్ స్ట్రీట్‌లో షేరు రూ.420 వద్ద లిస్ట్ కావడంతో ఉద్యోగులకు కేటాయించిన షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో సుమారు 500 మంది ఉద్యోగులు ఒక్కొక్కరి దగ్గర షేర్ల విలువ రూ. కోటికి పైగా చేరింది. → స్విగ్గీ షేర్లు మార్కెట్లోకి లిస్ట్ కావడంపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. స్విగ్గీ, జొమాటోకు సంబంధించిన ఒక ఫొటోను ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ ‘నువ్వు, నేను ఈ అందమైన ప్రపంచంలో..’ అంటూ రాసుకొచ్చారు. 5 ఏళ్లలో పటిష్ట వృద్ధి: సీఈఓ శ్రీహర్ష వచ్చే 3–5 ఏళ్లలో పటిష్ట వృద్ధి పథంలో దూసుకెళ్తామని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌స్టామార్ట్ నెట్‌వర్క్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద డార్క్ స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. పెద్ద నగరాల్లో సగటు డెలివరీ సమయం 17 నిమిషాల నుంచి 12 నిమిషాలకు తగ్గిందన్నారు. -
సన్‌రూఫ్.. సూపర్ క్రేజ్!
బీచ్ రోడ్డులోనో... ఫారెస్ట్ దారిలోనో కారులో అలా ఓ లాంగ్ డ్రైవ్కెళ్లాలని ఎవరికుండదు చెప్పండి? దీంతో పాటు కారులో సన్‌రూఫ్ కూడా ఉంటే... మజామజాగా ఉంటుంది కదూ! దేశంలో కారు ప్రియుల మది దోచేస్తున్న క్రేజీ ఫీచర్ ఇది. ఒకప్పుడు లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ అదిరిపోయే ఫీచర్ ఇప్పుడు చిన్న కార్లలోనూ వచ్చి చేరుతుండటం దానికున్న క్రేజ్‌కు నిదర్శనం!దేశీ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు సన్/మూన్ రూఫ్ మాంచి ట్రెండింగ్‌లో ఉంది. యువ కస్టమర్ల జోరుతో ఈ ఫీచర్ ‘టాప్’లేపుతోంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ఎస్‌యూవీలు, సెడాన్లతో పాటు హ్యాచ్బ్యాక్స్లోనూ దీన్ని చేర్చేందుకు సై అంటున్నాయి. డిమాండ్ ‘రూఫ్’ను తాకుతుండటంతో ప్రపంచస్థాయి తయారీ సంస్థలు దీన్ని సొమ్ము చేసుకోవడానికి తహతహలాడుతున్నాయి. మార్కెట్లో అధిక వాటా కోసం భారీ పెట్టుబడులతో ఉత్పత్తి పెంచే పనిలో ఉన్నాయి. నెదర్లాండ్స్‌కు చెందిన ఇనాల్ఫా రూఫ్ సిస్టమ్స్ దాని భాగస్వామ్య సంస్థ గాబ్రియెల్ ఇండియాతో కలిసి తయారీని పరుగులు పెట్టిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో సన్‌రూఫ్‌ల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది ఈ జాయింట్ వెంచర్ (ఐజీఎస్ఎస్) లక్ష్యం. ఈ ఏడాది ఆరంభంలో చెన్నైలో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఐజీఎస్ఎస్కు ఏటా 2 లక్షల సన్‌రూఫ్‌ల తయారీ సామర్థ్యం ఉంది. హ్యుందాయ్, కియా కంపెనీలకు ఇది సన్‌రూఫ్‌లను సరఫరా చేస్తోంది. ఇక జర్మనీకి చెందిన గ్లోబల్ సన్‌రూఫ్ తయారీ దిగ్గజం వెబాస్టో కూడా తయారీ గేరు మార్చింది. ప్రస్తుతం ఏటా 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుండగా... 2027 నాటికి రెట్టింపు స్థాయిలో 9.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తోంది. ట్రెండ్ రయ్ రయ్... దేశీ వాహన రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా కొంగొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. అత్యధికంగా కారు ప్రియులు కోరుకుంటున్న ఫీచర్లలో సన్‌రూఫ్ శరవేగంగా దూసుకుపోతోందని యూనో మిండా చైర్మన్, ఎండీ ఎన్కే మిండా చెబుతున్నారు. దేశంలోని దిగ్గజ వాహన విడిభాగాల సంస్థల్లో ఇది ఒకటి. సన్‌రూఫ్‌ల తయారీ కోసం తాజాగా జపాన్‌కు చెందిన ఐసిన్ కార్ప్‌తో సాంకేతిక లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోని టాప్–10 వాహన విడిభాగాల ఉత్పత్తి కంపెనీల్లో ఐసిన్ కార్ప్ కూడా ఒకటి. కాగా, యూనో మిండా 80,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో హరియాణాలో కొత్త ప్లాంట్ నెలకొల్పుతోంది. ‘ఈ మధ్య కాలంలో సన్‌రూఫ్‌ల వాడకం ఓ రేంజ్లో పెరుగుతోంది. గతంలో బడా ఎస్‌యూవీలు, లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ట్రెండ్ మరింత జోరందుకోనుంది. ఇప్పుడు హ్యాచ్‌బ్యాక్ (చిన్న కార్లు) కస్టమర్లు సైతం ఈ ఫీచర్ కోసం ఎగబడుతుండటమే దీనికి కారణం’ అని మిండా వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరే ఇక్కడా వినూత్న ఫీచర్లు, కస్టమైజేషన్లకు ప్రాధాన్యమిచ్చే ట్రెండ్ కనిపిస్తోందన్నారు.స్టేటస్ సింబల్... ఇప్పుడు కారే కాదు అందులోని ప్రీమియం ఫీచర్లు కూడా స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. ఇందులో సన్‌రూఫ్ కూడా ఒకటి. క్రూయిజ్ కంట్రోల్, కళ్లు చెదిరే డిస్ప్లేలు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ లాంటి ఫీచర్లకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. వీటి వాడకం అరుదుగానే ఉన్నప్పటికీ, భారతీయ రోడ్డు పరిస్థితులకు పెద్దగా ఉపయోగకరం కానప్పటికీ.. కస్టమర్లు మరిన్ని ప్రీమియం ఫీచర్లు కోరుకుంటుండటంతో కార్ల కంపెనీలు వాటిని తప్పనిసరిగా అందించాల్సిన పరిస్థితి నెలకొందని జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా పేర్కొన్నారు.ప్రతి నాలుగు కార్లలో ఒకటి... జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు కార్లలో ఒక కారుకు (27.5%) ఈ లగ్జరీ ఫీచర్ ఉంది. ఐదేళ్ల క్రితం 12.7%తో పోలిస్తే కస్టమర్లు దీనికి ఎలా ఫిదా అవుతున్నారనేది ఈ జోరు చాటిచెబుతోంది. కాగా వచ్చే ఐదేళ్లలో (2029 నాటికి) ఈ విభాగంలో 17.6 శాతం వార్షిక వృద్ధి (సీఏజీఆర్) నమోదవుతుందనేది వాహన పరిశ్రమ అంచనా. ముఖ్యంగా ఎస్‌యూవీల్లో సన్‌రూఫ్ ఫీచర్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ ఏడాది జనవరి–ఆగస్ట్ మధ్య ఏకంగా 44.7% వృద్ధి ఈ విభాగంలో నమోదైంది. మరోపక్క, భారతీయ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తయారీ సంస్థలు అధునాతన గ్లాస్ టెక్నాలజీతో సన్‌రూఫ్‌లను ప్రవేశపెడుతున్నాయి. వేడిని బాగా తట్టుకోవడం, యూవీ కిరణాల నుంచి రక్షణతో పాటు సన్‌రూఫ్‌లను ‘స్మార్ట్రూఫ్’లుగా మార్చేస్తున్నాయి. పానోరమిక్ సన్‌రూఫ్‌లు కారు లోపల మరింత విశాలమైన స్పేస్ ఫీలింగ్‌ను కూడా అందిస్తాయని భాటియా చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
2047 నాటికి ఇంధన డిమాండ్ రెట్టింపు
దేశ ఇంధన డిమాండ్ 2047 నాటికి రెట్టింపు అవుతుందని పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ అన్నారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా దేశీయ డిమాండ్ 25 శాతం పెరుగుతుందన్నారు. సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్టీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) సంయుక్తంగా బెంగళూరులో నిర్వహించిన ఎనర్జీ టెక్నాలజీ మీట్ (ఈటీఎం)2024ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.‘ఎనర్జీ సెక్యూరిటీ, సుస్థిరత, సాంకేతిక ఆవిష్కరణలకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) గణాంకాల ప్రకారం 2047 నాటికి భారత ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుంది. రాబోయే రెండు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా దేశీయ ఇంధన డిమాండ్ గణనీయంగా 25 శాతం పెరుగుతుంది. నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాలను సాధించడంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) మెరుగైన విధానాలు పాటించాలి. ఇథనాల్, హైడ్రోజన్, జీవ ఇంధనాలలో పురోగతి ద్వారా వికసిత్ భారత్ సాధనలో భాగం కావాలి. ఫాజిల్ ప్యూయెల్లో కలిపే జీవ ఇంధనం మిశ్రమం రేటు ప్రస్తుతం 16.9%కి చేరుకుంది. 2030 నాటికి ఇది 20% లక్ష్యాన్ని చేరాలనే లక్ష్యం ఉంది. కానీ షెడ్యూల్ కంటే ఐదేళ్ల ముందే ఈ లక్ష్యాన్ని అధిగమించే దిశగా ముందుకు సాగుతున్నాం’ అని మంత్రి అన్నారు.ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ‘భారతదేశం 250 రూపాల్లోని ముడి చమురును ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశీయ ప్రస్తుత ముడి చమురు శుద్ధి సామర్థ్యం 258 మిలియన్ మెట్రిక్టన్స్ పర్ యానమ్(ఎంఎంటీపీఏ)గా ఉంది. రానున్న రోజుల్లో ఇది 310 ఎంఎంటీపీఏకి పెరుగుతుందని అంచనా’ అన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్‌పై స్పందిస్తూ 2027 నాటికి దేశీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ 70 బిలియన్ డాలర్లు(రూ.5.81 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ ఛైర్మన్ అండ్ డైరెక్టర్ (మార్కెటింగ్) వి.సతీష్ కుమార్ పాల్గొన్నారు. -
సృజనాత్మకతలో దూసుకుపోతున్న పరిశ్రమ
వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో దూసుకుపోతోందని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్(ఐడీజీసీ)-2024 బుధవారం 16వ ఎడిషన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో గేమింగ్ డెవలపర్లు, గేమింగ్ స్టూడియోలు, ఇతర గేమింగ్ ఔత్సాహికులు తమ ఆలోచనలు పంచుకోనున్నారు.ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ..‘ప్రభుత్వం గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ రంగంలో అధిక నాణ్యత ప్రతిభావంతులను తయారు చేసేందుకు పని చేస్తోంది. ప్రపంచ గేమింగ్ రంగంలో ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. వీడియో గేమింగ్, ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ, రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీకి మధ్య స్పష్టమైన తేడా ప్రభుత్వానికి తెలుసు. వీడియో గేమింగ్ పరిశ్రమ కంటెంట్, సృజనాత్మకతలో ముందంజలో ఉంది’ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న గేమ్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీడీఏఐ) ఛైర్పర్సన్ శ్రీధర్ ముప్పిడి మాట్లాడారు. వీడియో గేమ్ డెవలపర్లు, వీడియో గేమింగ్ స్టూడియోలు ఈ పరిశ్రమలో ఇతర వాటాదారులతో ప్రాతినిధ్యం వహించేలా అపెక్స్ బాడీగా జీడీఏఐ వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దుఈ ఈవెంట్ మొదటి రోజున 6000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం నవంబర్ 15 వరకు జరుగుతుందన్నారు. ఐజీడీసీ 2024 100+ గ్లోబల్, లోకల్ గేమింగ్ డెవలపర్లు, పబ్లిషర్లు, సందర్శకులకు వేదికగా నిలుస్తుందన్నారు. -
10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు
ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.బాలీలోని ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.ఇదీ చదవండి: గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటనబాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు. -
గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటన
ఎయిరిండియాలో విలీనానికి ముందు నడిచిన చివరి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో విమాన సిబ్బంది ‘గుడ్‌బై విస్తారా’ అంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఇటీవల నడిచిన చివరి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.కెప్టెన్ సుధాన్షు రైక్వార్, నేహల్ చేసిన ప్రకటనకు సంబంధించిన షార్ట్ క్లిప్‌ను ఎక్స్ వేదికలో పంచుకున్నారు. ‘చివరి విస్తారా సర్వీస్ బ్రాండ్‌గా మీకు అత్యుత్తమ భద్రత, సేవలను అందించే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నాం. కొన్నేళ్లుగా విస్తారా వివిధ ఖండాల్లో విస్తరించి, విభిన్న సంస్కృతులు కలిగిన ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసింది. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. అంకితభావం, భద్రత, విశ్వసనీయతతో మీకు సేవ చేయడం మా లక్ష్యం. విస్తారా చివరి సర్వీస్ ఈ రోజు మేము అదే ఉన్నత ప్రమాణానికి కట్టుబడి ఉన్నాం. గుడ్‌బై విస్తారా. మేము ఎంతో మిస్ అవుతాం’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.Captain Capt Sudhanshu Raikwar and First Officer @Nehal_404 made an emotional yet confident announcement yesterday, marking their final flight as cockpit crew with @airvistara . #Aviation #Avgeek #Pilot #vistaraflight #Vistara https://t.co/G3rvMkTSRE pic.twitter.com/OvmZSmA2JT— Aman Gulati 🇮🇳 (@iam_amangulati) November 12, 2024ఇదీ చదవండి: ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓపదేళ్లుగా కార్యకలాపాలు సాగించిన విమానయాన సంస్థ విస్తారా నవంబర్ 11 నుంచి తన సేవలు నిలిపేసింది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
ఇంటర్లో 39% మార్కులు! కట్ చేస్తే కంపెనీకి సీఈఓ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. దీపిందర్ తన బాల్యంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు.. ఇంటర్ ఫస్ట్‌ఇయర్‌లో 39 మార్కులు సాధించిన గోయల్ ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించి జొమాటోను ఎలా స్థాపించారో వివరించారు. జీవితం తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు.‘స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చాలా భయపడుతూ ఉండేవాడిని. దానికి కారణం నేను చదువులో టాప్ స్టూడెంట్ను కాదు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్షలో నేను సరైన సమాధానాలు రాయకపోయినా మా టీచర్ కావాలనే నాకు మంచి గ్రేడ్ ఇచ్చారు. దాంతో కుటుంబం, స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకున్నాను. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కొంతకాలం తర్వాత చివరి సెమిస్టర్ పరీక్షలు వచ్చాయి. అంతకుముందు వచ్చిన మార్కులు ఫేక్ అనే విషయం నాకు తెలుసు. ఈసారి ఎలాగైనా కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మళ్లీ ప్రశంసలు పొందాలనుకున్నాను. (నవ్వుతూ)మా ప్రశ్నపత్రాలు ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ వ్యక్తి వద్దకు వెళ్లి ముందస్తుగా ప్రశ్న పత్రాలను పొందడానికి ప్రయత్నించాను. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో విజయానికి షార్ట్కట్లు లేవని అర్థం చేసుకున్నాను. నేను కష్టపడి చదవడం ప్రారంభించాను. చివరి సెమిస్టర్లో క్లాస్‌లో ఐదో స్థానానికి చేరుకున్నాను. ఈ విజయం నాకు జీవితంలో ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని కలిగించింది’ఇంటర్ ఫస్టియర్‌లో 39 శాతం మార్కులే..‘కొన్ని కారణాల వల్ల నేను ఇంటర్ ఫస్టియర్(11వ తరగతి)లో 39 శాతం మార్కులే వచ్చాయి. ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ కోసం చండీగఢ్‌కు వెళ్లాను. కష్టపడి చదివి ఐఐటీ-జేఈఈ క్లియర్ చేసి ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఇక్కడ జీవితం ఎన్నో పాఠాలు నేర్పించింది. మన ఆలోచనలు ఉన్నతంగా ఉంటే ఉన్నత వ్యక్తులను కలుస్తాం. మనం ఎంచుకున్న విభాగంలో ఎప్పుడూ మొదటిస్థానంలో ఉండేందుకు కష్టపడి పని చేయాలి. ఇది నిత్య పోరాటంగా సాగాలి’ అన్నారు.డిప్రెషన్‌ను అధిగమించాలంటే..‘నేను కొన్ని కారణాల వల్ల చాలాసార్లు డిప్రెషన్‌గా ఫీల్ అవుతుంటాను. ఈ డిప్రెషన్ సైకిల్ మూడేళ్లుంటుంది. డిప్రెషన్ సైకిల్స్ నిజానికి మంచివని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవి నన్ను ఒక పాయింట్‌కి మించి మరింత ఉన్నతంగా ఆలోచించేలా చేస్తాయి. మానసిక సవాళ్లను ఎదుర్కోవడమే డిప్రెషన్‌కు సరైన చికిత్స. అందుకే మనం చేస్తున్న పనిలోనే డిప్రెషన్ తొలగించుకునేందుకు పరిష్కారాలు వెతకాలి. ప్రతి సైకిల్‌ను అధిగమించేందుకు గతంలో కంటే మరింత మెరుగ్గా ఆలోచిస్తూ పని చేస్తున్నాను’ అని అన్నారు.ముందు టొమాటో!‘ఐఐటీలో చదువు పూర్తి చేసుకున్నాక కెరియర్ ప్రారంభంలో బైన్ & కో. అనే కన్సల్టింగ్ సంస్థలో పని చేశాను. కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్పించడంలో, వ్యూహాత్మకంగా ఆలోచించేందుకు ఇది ఎంతో తోడ్పడింది. ఎలా ఆలోచించాలో, ఏం మాట్లాడాలో ఈ సంస్థ నాకు నేర్పింది. నేను ఎప్పటికీ బైన్ అండ్ కో సంస్థకు కృతజ్ఞతతో ఉంటాను. బైన్లో పని చేస్తున్న సమయంలోనే జొమాటో ఆలోచన వచ్చింది. కంపెనీ స్థాపించాలనే ఉద్దేశంతో పేరును ఖరారు చేయాలనే సందర్భంలో ‘టొమోటో’అని అనుకున్నాం. దానికి సంబంధించిన డొమైన్ పేరు ‘టొమోటో డాట్ కామ్’ను కూడా ఏర్పాటు చేశాం. కానీ చివరకు దాన్ని జొమాటోగా నిర్ణయించాం’ అన్నారు.ఇదీ చదవండి: 6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!అంతిమంగా, కొన్ని ఎదురుదెబ్బలు, తను నేర్చుకున్న జీవిత పాఠాలే జొమాటోను ఏర్పాటు చేయడానికి గోయల్‌కు ధైర్యాన్ని అందించాయి. తను కోరుకుంటే ఏదైనా చేయగలననే విశ్వాసాన్ని ఇచ్చాయి. తాత్కాలిక విజయాలకు పొంగిపోవడం, అపజయాలకు కుంగిపోకుండా జీవితంలో దీర్ఘకాల లక్ష్యాలను ఏర్పరుచుకుని దాన్ని సాధించాలనే గట్టి తపనతో ముందుకెళ్లాలి. -
6:15 గంటల్లో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 324 పాయింట్లు నష్టపోయి 23,559 వద్దకు చేరింది. సెన్సెక్స్ 984 పాయింట్లు దిగజారి 77,690 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి రోజూ సరాసరి రూ.4వేల కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీటింగ్‌లో భాగంగా 25 బేసిస్ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్ మినట్స్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.ఇదీ చదవండి: నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తిసెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్. ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎం అండ్ ఎం, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నాలుగేళ్లలో 45.7 కోట్లకు శ్రామికశక్తి
ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్న టెక్నాలజీకి అనుగుణంగా మానవ వనరుల అవసరాలు పెరుగుతున్నాయి. దాంతో రానున్న రోజుల్లో భారీగా ఉద్యోగ కల్పన జరుగుతుందని కొన్ని సంస్థలు నివేదికలు విడుదల చేస్తున్నాయి. 2028 నాటికి దేశంలోని ఉద్యోగుల సంఖ్య సుమారు 45.7 కోట్లకు చేరుతుందని సర్వీస్‌నౌ పరిశోధన సంస్థ అంచనా వేసింది. అందులో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని తెలిపింది. ఈమేరకు విడుదల చేసిన నివేదికలో కొన్ని అంశాలు పంచుకుంది.దేశంలో 2023 నాటికి మొత్తం శ్రామికశక్తి 42.3 కోట్లుగా ఉంది.2028 నాటికి అది 45.7కోట్లుకు చేరుతుంది.వచ్చే నాలుగేళ్లలో కొత్తగా 27.3 లక్షల టెక్ ఉద్యోగాలు సృష్టించబడుతాయి.ఉపాధి వృద్ధికి చాలామంది రిటైల్ రంగాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.వివిధ విభాగాల్లో సుమారు 69.6 లక్షల మంది సిబ్బంది రిటైల్ రంగంలో పనిచేసేందుకు అవసరం అవుతారు.తయారీ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు, విద్యా రంగంలో 8.4 లక్షల ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణలో 8 లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది.టెక్ సంబంధిత ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఏఐ ఆధారిత కొలువులకు ఆదరణ పెరుగుతుంది. వచ్చే నాలుగేళ్లలో 1,09,700 మంది సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలపర్లు కావాల్సి ఉంది.48,800 మంది సిస్టమ్స్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా ఇంజినీర్లు 48,500 మంది అవసరం.వెబ్ డెవలపర్లు, డేటా అనలిస్ట్‌లు, సాఫ్ట్వేర్ టెస్టర్లకు గిరాకీ ఉంది. ఈ విభాగంలో వరుసగా 48,500, 47,800, 45,300 మందికి కొలువులు లభించనున్నాయి.అదనంగా డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్‌లు, డేటాబేస్ ఆర్కిటెక్ట్‌లు, డేటా సైంటిస్టులు, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజర్లు వంటి హోదాల్లో 42,700 నుంచి 43,300 మందికి అవకాశాలు లభించనున్నాయి.ఇదీ చదవండి: దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్.. వచ్చే నెలలోనే పట్టాలపైకి..అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉపాధికి కొదువలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే కంపెనీలకు అవసరమయ్యే సరైన నైపుణ్యాలు నేర్చుకోవడం ముఖ్యమని చెబుతున్నారు. గ్రాడ్యుయేషన్‌లో చేరిన సమయం నుంచే పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకుని ఆ దిశగా స్కిల్స్ అలవరుచుకోవాలని సూచిస్తున్నారు. -
దేశంలో కొత్త రకం రైలు.. నీళ్లుంటే చాలు!
దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్-శక్తితో నడిచే రైలు అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. వచ్చే డిసెంబర్ నెలలోనే దీన్ని ఆవిష్కరించేందుకు ఇండియన్ రైల్వేస్ సిద్ధమైంది. డీజిల్ లేదా విద్యుత్‌తో పని లేకుండా నడిచే ఈ హైడ్రోజన్-ఆధారిత అద్భుతం 2030 నాటికి "నికర శూన్య కార్బన్ ఉద్గారిణి"గా మారాలన్న లక్ష్యంతో ఉన్న భారతీయ రైల్వేలకు ఒక ప్రధాన మైలురాయి కానుంది.హైడ్రోజన్‌తో నడిచే ఈ రైలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి నీటిని తన ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటుంది. ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్‌తో రసాయన చర్య ద్వారా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతో రైలు నడుస్తుంది. ఇందులో ఉప ఉత్పత్తులుగా వెలువడేవి నీరు, ఆవిరి మాత్రమే. అవసరమైన రసాయన ప్రక్రియల కోసం రైలుకు గంటకు సుమారు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది.సాంప్రదాయ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఇంజిన్ల మాదిరిగా కాకుండా ఈ వినూత్న రైలు కదలడానికి అవసరమైన విద్యుత్‌ను హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి ఉత్పత్తి చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇంధన ఘటాలు, ఆక్సిజన్‌తో కలిసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, నీరు మాత్రమే వెలువడుతాయి. అంటే పర్యావరణానికి హానికరమైన ఎటువంటి ఉద్గారాలు ఉండవు. ఈ క్లీన్ ఎనర్జీ విధానం దేశంలో భవిష్యత్ రైళ్లకు ప్రమాణాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నారు.ట్రయల్ రన్హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పురాతన పర్వత ప్రాంతాల రైల్వేలైన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే , నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వేతో పాటు దేశంలోని సుందరమైన, మారుమూల ప్రాంతాల వంటి అదనపు మార్గాలు కూడా పరిశీలనలో ఉన్నాయి.ఈ రైలు గరిష్టంగా గంటకు 140 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదని, ప్రయాణికులకు వేగవంతమైన , సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. రైలులోని హైడ్రోజన్ ఇంధన ట్యాంక్ ఒకసారి ఇంధనం నింపుకొంటే 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీంతో భవిష్యత్తులో సుదీర్ఘ మార్గాలకు కూడా ఈ రైళ్లు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఒక్కో హైడ్రోజన్ రైలు అభివృద్ధికి రూ.80 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 2025 నాటికి 35 హైడ్రోజన్ రైళ్లు వివిధ మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు. -
ప్రముఖ జ్యువెలర్స్ చొరవ.. ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’
త్రిస్సూర్: భారత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచే దిశగా ప్రముఖ జ్యువెలరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ముందడుగు వేసింది. చైర్మన్ జోస్ ఆలుక్కా 80వ పుట్టినరోజు సందర్భంగా త్రిస్సూర్ జూబ్లీ మిషన్ హాస్పిటల్ భాగస్వామ్యంతో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోటి రూపాయల ఈ సంచార వైద్య కేంద్రాన్ని ప్రముఖ నటి మంజు వారియర్ ప్రారంభించారు.ఇందులో ఈసీజీ, మల్టీ పారా మోనిటర్లు, మినీ ల్యాబ్ ఉన్నాయి. ఒకేసారి ఆరుగురు రోగులకు చికిత్స చేయవచ్చు. ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గించడం, అధునాతన వైద్యాన్ని మారుమూల ప్రజలకు చేర్చడమే ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ ముఖ్య లక్ష్యమని జోస్ ఆలుక్కా తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కాస్, పాల్ జె ఆలుక్కాస్, జాన్ ఆలుక్కాస్, జూబ్లీ మిషన్ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ సింటో కరేపరంబన్, సీఈవో డాక్టర్ బెన్నీ జోసెఫ్ నీలంకవిల్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారం మళ్లీ డౌన్.. ఇప్పుడు తులం..
Gold Price Today: దేశంలో బంగారం ధరల తగ్గుముఖం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు బుధవారం (నవంబర్ 13) పసిడి రేట్లు గణనీయంగా తగ్గాయి. గడిచిన ఐదు రోజుల్లో బంగారం తులానికి (10 గ్రాములు) రూ.2600 పైగా దిగివచ్చింది. ఈ తగ్గింపు ఇలాగే కొనసాగి ధరలు మరింత దిగిరావాలని పసిడి ప్రియులు ఆశిస్తున్నారు.దేశంలోని వివిధ ప్రాంతాలలో పసిడి ధరలు ఎంతెంత తగ్గాయో పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.400 తగ్గి రూ.70,450 లకు వచ్చేసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.440 క్షీణించి రూ. 76,850 వద్దకు దిగివచ్చింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ బంగారం ధరలు క్షీణించాయి. దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.400 తగ్గి రూ.70,600 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 తగ్గి రూ.77,000 వద్దకు క్షణించింది.సిల్వర్ రివర్స్Silver Price Today: బంగారం ధరలకు విరుద్ధంగా నేడు దేశవ్యాప్తంగా వెండి ధరలు భగ్గుమన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.1000 పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి మళ్లీ రూ.1,01,000 దగ్గరకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
EPFO: 7.66 లక్షల కంపెనీలు.. 7.37 కోట్ల మందికి పీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో సభ్యత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. ఉద్యోగులకు చందా కట్టే కంపెనీల సంఖ్య 6.6 శాతం మేర పెరిగింది. దీంతో వీటి మొత్తం సంఖ్య 7.66 లక్షలకు చేరింది. అలాగే ఉద్యోగుల చేరికలు సైతం 7.6 శాతం పెరిగి ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల సంఖ్య 7.37 కోట్లకు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు విడుదల చేసింది.2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ నెల 8న జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 109వ సమావేశం పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్‌వో కింద చందాలు జమ చేసే సంస్థలు 6.6 శాతం పెరిగి 7.66 లక్షలకు చేరాయి. చందాలు జమ చేసే సభ్యులు 7.6 శాతం పెరిగి 7.37 కోట్లుగా ఉన్నారు. మొత్తం 4.45 కోట్ల క్లెయిమ్‌లకు పరిష్కారం లభించింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!2022–23లో ఇవి 4.13 కోట్లుగా ఉన్నాయి. కొత్త కారుణ్య నియామక ముసాయిదా విధానం, 2024ను సైతం ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు కార్మిక శాఖ ప్రకటించింది. ఐటీ, మెరుగైన పరిపాలనా, ఆర్థిక సంస్కరణలపై చర్చించినట్టు.. వచ్చే కొన్ని నెలల పాటు ప్రతి నెలా సమావేశమైన సంస్కరణల పురోగతిని సమీక్షించాలని నిర్ణయించనట్టు తెలిపింది. -
ఇన్వెస్టర్లకు యూపీఐ.. సెబీ ఆదేశం
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ కోసం క్లయింట్లకు యూపీఐ ఆధారిత బ్లాక్ విధానాన్ని లేదా త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటు సదుపాయాన్ని అందించాలని క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్క్కు (క్యూఎస్బీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది.ప్రస్తుత ట్రేడింగ్ విధానంతో పాటు ఫిబ్రవరి 1 నుంచి ఈ రెండింటిలో ఒక సదుపాయాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించింది. త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటులో సేవింగ్స్ అకౌంటు, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ మూడూ కలిసి ఉంటాయి.ఇదీ చదవండి: సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరటయూపీఐ బ్లాక్ మెకానిజంలో క్లయింట్లు ట్రేడింగ్ సభ్యునికి ముందస్తుగా నిధులను బదిలీ చేయడానికి బదులుగా తమ బ్యాంకు ఖాతాలలో బ్లాక్ చేసిన నిధుల ఆధారంగా సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేయవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఐచ్ఛికంగానే ఉంది. -
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
బలహీనమైన ప్రపంచ సూచనల మధ్య భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 78,507.87 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 23,820 వద్ద ఉన్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో 16 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా, టాటా స్టీల్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా నష్టాలలో ముందుండగా, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, భారతి ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.ఇక నిఫ్టీ 50 షేర్లలో 31 షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాభాల్లో ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ ముందుండగా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, హీరోమోటోకో, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టాల్లో ముందున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)తో 2009లో విలీనమైన పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్)కు సంబంధించిన షేర్లలో 2007లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో ముకేశ్ అంబానీ మరో రెండు సంస్థలకు ఊరట లభించింది. ఇందుకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన జరిమానా విధింపును కొట్టివేస్తూ శాట్ (సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్) ఇచ్చిన రూలింగ్‌ను తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.ఈ విషయంలో సెబీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. శాట్ జారీ చేసిన ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మా జోక్యాన్ని కోరే ఈ అప్పీల్లో చట్టం ప్రమేయం లేదు. మీరు ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి వెంబడించలేరు‘ అని బెంచ్ పేర్కొంది. కేసు వివరాలు ఇవీ... » నవంబర్ 2007లో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో ఆర్పీఎల్ షేర్ల విక్రయం, కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నది కేసు సారాంశం. » 2009లో ఆర్ఐఎల్తో విలీనం అయిన లిస్టెడ్ అనుబంధ సంస్థ– ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని 2007 మార్చిలో ఆర్ఐఎల్ నిర్ణయం తీసుకుంది. » ఈ నేపథ్యంలోనే 2007 నవంబర్‌లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని, ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అదే సమయంలో కంపెనీ నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని సెబీ ఆరోపించింది.» ఈ కేసు విషయంలో సెబీ 2021 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, అలాగే ముంబై సెజ్‌ను ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేయడం గమనార్హం. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ పాత్రధారులుగా మారినట్లు ఆరోపణ.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!» అంబానీ, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌లపై 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వులను శాట్ 2023లో రద్దు చేసింది. జరిమానాకు సంబంధించి డిపాజిట్‌గా ఉంచిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని శాట్ ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఆరోపణకు మేనేజింగ్ డైరెక్టర్‌ను బాధ్యునిగా చేయలేవని పేర్కొంది. ఇద్దరు సీనియర్ అధికారులు అక్రమ లావాదేవీలు నిర్వహించారని స్పష్టమవుతోందని, ఈ విషయంలో ముకేశ్ అంబానీ పాత్ర ఉన్నట్లు సెబీ రుజువుచేయలేకపోయిందని పేర్కొంది. ఆర్‌ఐఎల్‌పై ఆరోపణలను మాత్రం శాట్ కొట్టివేయకపోవడం గమనార్హం. » కాగా, శాట్ రూలింగ్‌ను సవాలుచేస్తూ, డిసెంబర్ 2023 డిసెంబర్ 4న సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
హైదరాబాద్‌లో రూ.440 కోట్లతో ప్లాంటు విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీర్డ్ స్టోన్ తయారీలో ఉన్న పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్ సమీపంలోని ప్లాంటు విస్తరణకు రూ.440 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. మేకగూడ ప్లాంటులో ఇటలీకి చెందిన బ్రెటన్ ఎస్పీఏ సాంకేతిక సహకారంతో మూడవ లైన్‌ను జోడిస్తామని పోకర్ణ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. 2026 మార్చిలో 8.1 లక్షల చదరపు మీటర్ల సామర్థ్యం తోడవనుందని అన్నారు.మేకగూడ కేంద్రంలో 2021 మార్చిలో యూనిట్–2 అందుబాటులోకి వచ్చిందని కంపెనీ సీఈవో పరాస్ కుమార్ జైన్ చెప్పారు. కాగా, సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో పోకర్ణ లిమిటెడ్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.33 కోట్ల నుంచి రూ.45 కోట్లకు చేరింది. టర్నోవర్ రూ.197 కోట్ల నుంచి రూ.253 కోట్లకు ఎగసింది. పోకర్ణ షేరు ధర మంగళవారం 1.81% దూసుకెళ్లి రూ.1,103.20 వద్ద ముగిసింది. -
భారత మార్కెట్లోకి స్టార్‌లింక్!
న్యూఢిల్లీ: పలు దేశాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ భారతీయ విపణిలో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధంచేసుకుంటోంది. భారత చట్టాల ప్రకారం సంస్థను నడిపేందుకు స్టార్లింగ్ ముందుకు వచ్చిందని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ప్రభుత్వ సవరించిన నియమనిబంధనల ప్రకారం ఏదైనా విదేశీ కంపెనీ తమ భారతీయ యూజర్ల సమాచారాన్ని దేశీయంగానే నిల్వచేయాల్సి ఉంటుంది. ఇందుకు స్టార్‌లింక్ ఒప్పుకుందని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో స్టార్‌లింక్ ప్రతినిధులు పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.శాటిటైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల(జీఎంపీసీఎస్) లైసెన్స్ మంజూరుకు అనుసరించాల్సిన విధివిధానాలను పాటిస్తామని సంస్థ తెలిపింది. స్టార్‌లింక్ సంస్థ ఇంకా తమ సమ్మతి పత్రాలను సమర్పించాల్సి ఉంది. సమర్పణ పూర్తయితే సంస్థ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభంకానున్నాయని తెలుస్తోంది. 2022 అక్టోబర్‌లో జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం స్టార్‌లింక్ దరఖాస్తు చేసుకుంది. ఈ రంగంలోని భారత నియంత్రణసంస్థ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్–స్పేస్) సంబంధిత అనుమతులను మంజూరుచేయనుంది. ఆలోపు తమ అభ్యంతరాలపై సరైన వివరణ ఇవ్వాలని స్టార్‌లింక్‌ను ఇన్–స్పేస్ కోరింది. స్టార్‌లింక్‌కు పోటీగా మరో ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అమెజాన్ సంస్థలో భాగమైన ‘ప్రాజెక్ట్ కూపర్’సంస్థ సైతం జీఎంపీసీఎస్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది.ఈ రెండు సంస్థల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని ఇన్–స్పేస్ చైర్మన్ పవన్ గోయంకా చెప్పారు. భద్రతా నియమాలకులోబడి సంస్థ కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుందని కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం అన్నారు. అగ్రరాజ్యాధినేతగా తన సన్నిహితుడు ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో భారత్‌సహా కీలక శాటిటైల్ ఇంటర్నెట్ సేవల మార్కెట్లలో మెజారిటీ వాటా కైవసంచేసుకోవాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నారు. స్ప్రెక్టమ్ కేటాయింపులు, తుది ధరలపైనే భారత్‌లో స్టార్‌లింక్ భవితవ్వం ఆధారపడిఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పటికే భారతి గ్రూప్‌కు చెందిన వన్‌వెబ్, జియా–ఎస్ఈఎస్ సంయుక్త సంస్థ అయిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కు లైసెన్సులు ఇచ్చింది. వీటికి ఇంకా స్ప్రెక్టమ్ కేటాయింపులు జరగలేదు. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన సిఫార్సులకు ట్రాయ్ డిసెంబర్ 15వ తేదీలోపు తుదిరూపునివ్వనుంది. -
24,000 దిగువకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. దేశీయ అక్టోబర్ ద్రవ్యల్బోణ, సెపె్టంబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి దిగిరావడమూ ఒత్తిడి పెంచింది. ఫలితంగా సెన్సెక్స్ 821 పాయింట్లు నష్టపోయి 79 వేల దిగువన 78,675 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 258 పాయింట్లు క్షీణించి 24 వేల దిగువన 23,883 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్ సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, ఐటీ మినహా అన్ని రంగాల్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకులు, ఆటో, విద్యుత్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 948 పాయింట్లు క్షీణించి 78,548 వద్ద, నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 23,839 వద్ద కనిష్టాలు తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 1.25%, 1% నష్టపోయాయి. సెమికండక్టర్ల షేర్లతో పాటు చైనా మార్కెట్ వరుస పతనంతో ఆసియా మార్కెట్లు 3% పడ్డాయి. యూరప్ మార్కెట్లు 1.5% క్షీణించాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఎస్బీఐ 2.50%, ఏషియన్ పెయింట్స్ 2%, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్ 1% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి.⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళలనల తో ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీఐ 10% పతనమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, గెయిల్ 4.50%, భెల్, ఎన్ఎల్సీ 4%, ఎన్సీఎల్ 3.50% క్షీణించాయి. ⇒ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.437.24 లక్షల కోట్లకు తగ్గింది. ⇒ సాగిలిటీ ఇండియా లిస్టింగ్ నిరాశపరిచింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.30)తో పోలిస్తే 3.50% ప్రీమియంతో రూ.31 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% పెరిగి, చివరికి 2% నష్టంతో రూ.29.36 వద్ద ముగిసింది. -
ధరలకు రెక్కలు..
న్యూఢిల్లీ: భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో బెంబేలెత్తించింది. 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2%గా నమోదైంది. ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. తాజా గణాంకాల నేపథ్యంలో ఆర్బీఐ సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన కొనసాగింది. ⇒ ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెలలో 10.87 శాతం పెరిగింది. ⇒ దేశ వ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6.2% ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 6.68%గా, పట్టణ ప్రాంతాల్లో 5.62 శాతంగా నమోదయ్యింది. ⇒1,114 పట్టణ, 1,181 గ్రామీణ మార్కెట్లలో ధరలను వారంవారీగా విశ్లేషించి జాతీయ గణాంకాల కార్యాలయం నెలవారీ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల చేస్తుంది.