Business
-
ఆర్బీఐ హెచ్చరిక: అలాంటివి నమ్మకండి
డీప్‌ఫేక్ వీడియోలు తెరమీదకు వచ్చిన సంఘటనలో గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పెట్టుబడికి సంబంధించిన సలహాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.ఈ వీడియోపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ.. పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పెట్టుబడి పథకాలను ఆర్బీఐ తీసుకొస్తున్నట్లు, అలాంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లు వీడియోలో ఉండటం గమనార్హం. ఈ వీడియోలో ఏ మాత్రం నిజం లేదని, దీనిని ఏఐ టెక్నాలజీతో క్రియేట్ చేసారని, ప్రజలు ఇలాంటివి నమ్మవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి మరో 500 శాఖలు: నిర్మలా సీతారామన్ఆర్బీఐ ఎప్పుడూ పెట్టుబడులకు సంబంధించిన సలహాలు ఇవ్వదు, కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోలను నిజమని నమ్మితే తప్పకుండా మోసపోతారు. డీప్‌ఫేక్ వీడియోలు వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు.. ప్రముఖుల డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.RBI cautions public on deepfake videos of Top Management circulated over social media giving financial advicehttps://t.co/bH5yittrIu— ReserveBankOfIndia (@RBI) November 19, 2024 -
స్మార్ట్‌ఫోన్ కంపెనీ కారు.. లక్ష మంది కొనేశారు
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'షియోమీ' (Xioami) గత ఏడాది ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ డిసెంబర్ 2024లో ఎస్‌యూ7 (SU7) పేరుతో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. షియోమీ లాంచ్ చేసిన ఈ కారును ఇప్పటికి లక్ష మంది కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..షియోమీ ఎస్‌యూ7 మార్కెట్లో అడుగు పెట్టి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు, అప్పుడే లక్ష యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది అంటే.. చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎస్‌యూ7 కారు లక్ష యూనిట్ల సేల్స్ పొందిన విషయాన్ని కంపెనీ ఫౌండర్ & సీఈఓ 'లీ జున్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేశారు. ఈ ఏడాది చివరి నాటికి షియోమీ ఎస్‌యూ7 మొత్తం 1.30 లక్షల సేల్స్ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.షియోమీ ఎస్‌యూ7షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్ అనే మూడు వెర్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.25.18 లక్షలు, రూ. 28.67 లక్షలు, రూ. 34.97 లక్షలు. ఇవి మూడు చూడటానికి చాలా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువమంది వీటిని ఇష్టపడి కొనుగోలు చేశారు. కంపెనీ కూడా తన కస్టమర్లకు డెలివరీలను వేగంగా చేయడానికి.. ఉత్పత్తిని కూడా వేగవంతం చేసింది.ఇదీ చదవండి: ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..ఆరు కలర్ ఆప్షన్లలో లభించే షియోమీ ఎస్‌యూ7 ఎలక్ట్రిక్ కారు 5.28 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ/గం కాగా.. ఇది 400 న్యూటన్ మీటర్ టార్క్, 299 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జీతో గరిష్టంగా 800కిమీ రేంజ్ అందిస్తుంది.The 100,000th Xiaomi SU7 has found its owner! She chose Radiant Purple and shared, "I’ve always been a Xiaomi Fan and picked the Pro for its smart driving and range." pic.twitter.com/c8G8GrVzwO— Lei Jun (@leijun) November 18, 2024 -
అమ్మకానికి గూగుల్ క్రోమ్?.. త్వరలో తీర్పు
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ).. గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్‌ను విక్రయించేలా దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌పై ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ వెల్లడిస్తూ.. గూగుల్ సెర్చింజన్ మార్కెట్‌పై చట్ట విరుద్ధంగా ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తోందని ఆగస్టులో ఒక న్యాయమూర్తి రూలింగ్ కూడా ఇచ్చారు. అదే జడ్జి ముందు డీఓజే ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఏఐ, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన చర్యలు తీసుకోవాలి ఇందులో పేర్కొన్నట్లు సమాచారం.గూగుల్ క్రోమ్‌ను విక్రయించమని.. గూగిల్ ప్లే నుంచి ఆండ్రాయిడ్‌ను వేరు చేయమని అడగడంతో పాటు, ప్రకటనదారులతో మరింత డేటా.. సమాచారాన్ని భాగస్వామ్యం చేయమని న్యాయమూర్తి గూగుల్‌ను అడగవచ్చు. అయితే దీనిపైన డీఓజే వ్యాఖ్యానించలేదు.గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ స్పందిస్తూ.. డీఓజే ఒక ర్యాడికల్ అజెండాను ముందుకు తెస్తోందని అన్నారు. ఇది వినియోగదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ఈ విషయం మీద న్యాయమూర్తి చివరికి ఏమి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది. గూగుల్ గుత్తాధిపత్యం నిజమే అని పరిగణలోకి తీర్పు ఇస్తే.. గూగుల్ తప్పకుండా క్రోమ్‌ను వదులుకోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. యూఎస్ ఎన్నికల ప్రచార సమయం గూగుల్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఇదీ చదవండి: 30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్గూగుల్ కేసుకు సంబంధించిన తీర్పును అమెరికన్ కోర్టు వచ్చే ఏడాది ఇచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే కంపెనీ.. క్రోమ్‌ను విక్రయించకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లను చేసుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి గూగుల్ క్రోమ్ ఈ సమస్య నుంచి బయటపడుతుందా? లేదా? అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 189.28 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 77,528.29 వద్ద, నిఫ్టీ 46.45 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,500.25 పాయింట్ల వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ట్రెంట్, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హిందాల్కో, రిలయన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్బీఐలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అనంత్-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్ విల్లా, ఫోటోలు వైరల్
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ చిన్న కొడుకు అనంత్ అంబానీకి అద్భుతమైన పెళ్లి కానుక ఇచ్చారు. అత్యంత వైభవంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహాన్ని ఇటలీలో జరిపించిన అంబానీ దంపతులు అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రెండు ప్రీ-వెడ్డింగ్ బాష్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీలోని ఓ క్రూజ్ షిప్లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. ఇందంతా ఒక ఎత్తయితే అంబానీలు తమ చిన్న కోడలు రాధికా మర్చెంట్‌కు దుబాయ్‌లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుకగా ఇచ్చారు. ఈ లగ్జరీ బంగ్లాకు సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.దుబాయ్‌లోని ఫేమస్ పామ్ జుమైరాలో ఈ విలాసవంతమైన విల్లా ఉంది. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చదరపు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్రూంలు, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. సొగసైన లివింగ్ రూమ్‌లు, బెడ్రూమ్లు విలాసవంతమైన బాత్రూమ్ల ఇలా ప్రతీది చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడ్డారట. ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్రూమ్లు, ఆకట్టుకునే ఇంటీరియర్స్‌తో విల్లా ఒక అద్భుత కళాఖండంగా ఉంటుందని సమాచారం. ఇండోర్, అవుట్డోర్ పూల్స్ ఉన్నాయి. పాంపరింగ్ సెషన్ల కోసం ప్రైవేట్ స్పా, ప్రైవేట్ సెలూన్ కూడా ఉన్నాయి. పెద్ద కోడలు శ్లోకా మెహతాకి 450 కోట్ల ఖరీదైన బంగ్లాతో పాటు రూ. 200 కోట్ల ఖరీదైన నెక్లెస్ ఇచ్చారు. ఈ ఏడాది జులై 12న రాధిక, అనంత్ అంబానీ వివాహ వేడుక చాలా గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.👉 ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదీ చదవండి: పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
ఆఫ్రికన్ దేశాలకు ఇండియన్ బైకులు: ప్యూర్ ఈవీ ప్లాన్ ఇదే..
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ''ప్యూర్ ఈవీ'' (Pure EV).. క్లారియన్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ అనుబంధ సంస్థ 'అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ'తో చేతులు కలిపింది. ఈ సహకారంతో కంపెనీ తన పరిధిని విస్తరిస్తూ.. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ ప్రాంతాల వినియోగదారులకు చెరువవుతుంది.ప్యూర్ ఈవీ, అర్వా ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్ఎల్సీ సహకారంతో.. ద్విచక్ర వాహనాల పంపిణీ, విక్రయాలను చేపట్టడం వంటివి చేస్తుంది. ఇందులో భాగంగానే కంపెనీ మొదటి బ్యాచ్‌లో 50,000 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేయనుంది. ఆ తరువాత నుంచి సంవత్సరానికి 60,000 యూనిట్లను ఎగుమతి చేయనున్నట్లు సమాచారం.ప్యూర్ ఈవీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'నిశాంత్ డొంగరి' (Nishanth Dongari) మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం కేవలం అమ్మకాలను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు చేరువవ్వడం కూడా. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాల్లో ప్యూర్ ఈవీ బ్రాండ్ వాహనాలను పరిచయం చేస్తూ.. గ్లోబల్ మార్కెట్లో కూడా మా ఉనికిని చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఇదీ చదవండి: పండుగ సీజన్: ఎంతమంది వెహికల్స్ కొన్నారో తెలుసా?ప్యూర్ ఈవీ ఎగుమతి చేయనున్న ఎలక్ట్రిక్ బైకులలో 'ఎకోడ్రిఫ్ట్' (ecoDryft), 'ఈట్రిస్ట్ ఎక్స్' (eTryst X) ఉంటాయి. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 1,19,999 (ఎక్స్ షోరూమ్), రూ. 1,49,999 (ఎక్స్ షోరూమ్). ఎకోడ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఫుల్ ఛార్జీతో 151 కిమీ రేంజ్ అందిస్తే.. ఈట్రిస్ట్ ఎక్స్ 171 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఈ రెండు బైకులు ఉత్తమంగానే ఉంటాయి. -
అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు
పునరుత్పాదక ఇంధన వనరులపై అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ సామర్థ్యంతో సోలార్, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై వచ్చే ఐదేళ్లలో 35 బిలియన్ డాలర్లు (రూ.2.94 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ ప్రకటించారు. ‘2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువ నాయకుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సీఈవో ప్యానెల్ చర్చలో భాగంగా సాగర్ అదానీ ఈ వివరాలు వెల్లడించారు.ఇదీ చదవండి: ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!గుజరాత్‌లోని ఖావ్డాలో 30,000 మెగావాట్ సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇంధన స్థిరత్వం, ఇంధన పరివర్తనం విషయంలో అదిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడుల్లో ఇది ఒకటి అవుతుందని సాగర్ అదానీ పేర్కొన్నారు. ‘‘మన దగ్గర 500 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తలసరి వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం మూడింత ఒక వంతు పరిమాణంలోనే ఉన్నాం. వచ్చే 7–8 ఏళ్లలో ప్రపంచ సగటు తలసరి విద్యుత్ వినియోగానికి చేరుకోవాలంటే మరో 1,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అవసరం. చైనా స్థాయికి చేరుకోవాలంటే మరో 1,500 మెగావాట్ల సామర్థ్యం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలకు సమాన స్థాయికి చేరుకోవాలంటే మరో 2,500–3,000 మెగావాట్ల సామర్థ్యం అవసరం అవుతుంది’’అని వివరించారు. -
ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!
అక్షరాల రూ.4.27 లక్షలు. ఇదేదో వార్షికవేతనం అనుకుంటే పొరపడినట్లే. ఇది ఎడ్యుకేషన్ ఫీజు. ‘అందులో ఏముంది ఎంబీబీఎస్ చదువుకో. ఇంజినీరింగ్ చదువుకో అంత అవుతుంది కదా’ అంటారా. ఇది కేవలం ఒకటో తరగతిలో చేరడానికి కావాల్సిన ఫీజు. అవును.. మీరు విన్నది నిజమే. వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో తన కూతురు ఒకటో తరగతి స్కూల్ ఫీజును రాషబ్ జైన్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దాంతో ఇదికాస్తా వైరల్‌గా మారింది.‘నా కుమార్తె వచ్చే ఏడాది గ్రేడ్ 1లో చేరుతుంది. అందుకోసం మా నగరంలో ప్రముఖ స్కూల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించాం. ఆ స్కూల్ ఫీజు చూసి షాకయ్యాను. ఇతర స్కూళ్లలోనూ సుమారు ఇదే తరహా ఫీజు ఉంది. ఈ స్కూల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు: రూ.2,000, అడ్మిషన్ ఫీజు: రూ.40,000, కాషన్ మనీ (వాపసు): రూ.5,000, వార్షిక పాఠశాల ఫీజు: రూ.2,52,000, బస్ ఛార్జీలు: రూ.1,08,000, పుస్తకాలు, యూనిఫాం: రూ.20,000, మొత్తం రూ.4,27,000! ఇది భారతదేశంలో నాణ్యమైన విద్య ధర. మీరు ఏటా రూ.20 లక్షలు సంపాదించినా దీన్ని భరించలేరేమో’‘మీరు నెలకు 2000 డాలర్లు(రూ.1.68 లక్షలు) సంపాదిస్తే అందులో ఆదాయపు పన్ను, జీఎస్టీ, పెట్రోల్‌పై వ్యాట్, రోడ్డు పన్ను, టోల్ ట్యాక్స్, ఫ్రొఫెషనల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్, ల్యాండ్ రిజిస్ట్రీ ఛార్జీలు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. దానికితోడు టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా ప్రీమియంలు, వృద్ధాప్య పెన్షన్ కోసం పీఎఫ్, ఎన్పీఎస్ చెల్లించాలి. రూ.20 లక్షల ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేరు. ఎలాంటి ఉచితాలు లేదా రుణ మాఫీలు పొందలేరు. అన్ని ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో ఫుడ్, బట్టలు, అద్దె, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు.. దేనిపై ఖర్చు చేయాలో నిర్ణయించుకోండి’ అంటూ పోస్ట్ చేశారు.Good education is a luxury - which middle class can not affordMy daughter will start Grade 1 next year, and this is the fee structure of one of the schools we are considering in our city. Note that other good schools also have similar fees.- Registration Charges: ₹2,000-… pic.twitter.com/TvLql7mhOZ— RJ - Rishabh Jain (@rishsamjain) November 17, 2024ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..ఈ పోస్ట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఈ ఫీజు ఇలాగే కొనసాగితే 12 సంవత్సరాలలో దాదాపు రూ.కోటి-1.2 కోట్లు ఖర్చు చేయాల్సి ఉటుంది. మధ్యతరగతి వారు ఇంత అధిక ఫీజులను భరించలేరు. ఇది తీవ్రమైన సమస్య. దీనిపై ప్రభుత్వ నియంత్రణ అవసరం’ అని రిప్లై ఇస్తున్నారు. -
వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.70,650 (22 క్యారెట్స్), రూ.77,070 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.700, రూ.760 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.760, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.70,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.77,070 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.700 పెరిగి రూ.70,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.760 పెరిగి రూ.77,220 వద్దకు చేరింది.ఇదీ చదవండి: మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్సిల్వర్ ధరలుబంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా మంగళవారం భారీగానే పెరిగాయి. సోమవారంతో పోలిస్తే ఈరోజు కేజీకి రూ.2,000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ.1,01,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
మడతెట్టే రోబో!
నిత్యం చేసే పనులను మరింత సులువుగా చేసేందుకు వీలుగా టెక్నాలజీ వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగప్రవేశం చేసిన తర్వాత మర మనుషులే మన పనులు చేస్తున్నారు. ఇటీవల పిజికల్ ఇంటెలిజెన్స్(పీఐ) అనే స్టార్టప్ కంపెనీ పీఐ-జిరో అనే రోబోను తయారు చేశారు. ఇది మనం వాడిన బట్టలను ఉతికి, మడతేస్తోంది. దాంతోపాటు మరెన్నో పనులు చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.At Physical Intelligence (π) our mission is to bring general-purpose AI into the physical world. We're excited to show the first step towards this mission - our first generalist model π₀ 🧠 🤖Paper, blog, uncut videos: https://t.co/XZ4Luk8Dci pic.twitter.com/XHCu1xZJdq— Physical Intelligence (@physical_int) October 31, 2024ఇదీ చదవండి: మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్ఈ ‘పీఐ-జిరో’ కేవలం బట్టలు ఉతికి, మతతెట్టడమే కాకుండా గుడ్లు ప్యాక్ చేయడం, కాఫీ బీన్స్ గ్రైండ్ చేయడం, టేబుల్ శుభ్రం చేయడం వంటి పనులు చేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇంటికో రోబోను పెంచుకునే రోజులు త్వరలో రాబోతున్నట్లు ఈ వీడియో చేసిన కొందరు అభిప్రాయపడుతున్నారు. -
మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్
వాట్సాప్ గోప్యత పాలసీ 2021 అప్డేట్కి సంబంధించి అనుచిత వ్యాపార విధానాలను అమలు చేసినందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ.213 కోట్ల జరిమానా విధించింది. వీటిని సరిదిద్దుకునేందుకు నిర్దిష్ట వ్యవధిలోగా తగు చర్యలు తీసుకోవాలని మెటా, వాట్సాప్‌లను ఆదేశించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.వాట్సాప్ తన ప్లాట్‌ఫాం ద్వారా సేకరించే డేటాను సర్వీస్ అందించడానికైతే తప్ప అయిదేళ్ల వరకు ప్రకటనలపరమైన అవసరాల కోసం ఇతర మెటా కంపెనీలకు షేర్ చేయకూడదని సీసీఐ పేర్కొంది. ఇతరత్రా అవసరాల కోసం షేర్ చేసుకునేటప్పుడు కచ్చితమైన వివరణ ఇవ్వాలని తెలిపింది. 2021 ఫిబ్రవరి నాటి పాలసీ అప్డేట్ ప్రకారం వాట్సాప్‌ను ఉపయోగించుకోవడాన్ని కొనసాగించాలంటే యూజర్లు తమ డేటాను మెటా కంపెనీలతో షేర్ చేసుకోవడానికి తప్పనిసరిగా అంగీకరించాలనే షరతును చేర్చారు. అంతకు ముందు ఇది ఐచ్ఛికంగానే ఉండేది. గుత్తాధిపత్యం ఉన్న మెటాతో డేటాను షేర్ చేయడాన్ని తప్పనిసరి చేయడం వల్ల ప్రకటనల మార్కెట్లో పోటీ సంస్థలకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.ఇదీ చదవండి: బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులుమెటా స్పందనడేటా షేరింగ్ విషయంలో సీసీఐ వాదనల్లో నిజం లేదని మెటా ప్రతినిధులు తెలిపారు. ఈ అంశంపై అప్పీల్‌కు వెళ్తామన్నారు. 2021 పాలసీ అప్డేట్ను సమర్థిస్తూ, వినియోగదారుల వ్యక్తిగత సందేశాల గోప్యత విధానాలను మార్చలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో యూజర్లకు ఆప్షన్ ఉన్నట్లు తెలిపారు. పాలసీని అంగీకరించనందుకు ఏ ఒక్క వినియోగదారుడి ఖాతా తొలగించలేదన్నారు. డేటా సేకరణ, దాని వినియోగంలో పారదర్శకతకు మెటా పెద్దపీట వేస్తోందని చెప్పారు. భారతదేశంలో వాట్సాప్ ఒక ప్రధాన ప్లాట్‌ఫామ్‌గా నిలిచిందని, వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు, చిన్న సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తోందని కంపెనీ పేర్కొంది. -
బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులు
కేంద్ర ప్రభుత్వ సంస్థ(సీపీఎస్ఈ)లకు మూలధన పునర్వ్యవస్థీకరణపై సవరించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ జారీ చేసింది. దీపమ్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) విడుదల చేసిన విధానాల ప్రకారం ఇకపై సీపీఎస్ఈలు తమ నికర లాభాల్లో కనీసం 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 4 శాతాన్ని(ఏది అధికమైతే దాన్ని) వార్షిక డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. ఎన్బీఎఫ్సీ తదితర ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈలు తప్పనిసరిగా నికర లాభాల్లో కనీసం 30 శాతాన్ని డివిడెండుగా చెల్లించాలి. ఇంతకుముందు 2016లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమైతే నికర లాభాల్లో 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 5 శాతాన్ని(ఏది ఎక్కువైతే అది) డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. అయితే అప్పట్లో ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. బైబ్యాక్ ఇలా..గత ఆరు నెలల్లో పుస్తక విలువ(బీవీ) కంటే షేరు మార్కెట్ విలువ తక్కువగా ఉన్న సీపీఎస్ఈ.. ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయవలసి ఉంటుంది. అయితే ఇందుకు కనీసం రూ.3,000 కోట్ల నెట్‌వర్త్, రూ.1,500 కోట్లకంటే అధికంగా నగదు, బ్యాంక్ నిల్వలు కలిగి ఉండాలి. కంపెనీ రిజర్వులు, మిగులు నిధులు చెల్లించిన ఈక్విటీ మూలధనానికి సమానంగా లేదా 20 రెట్లు అధికంగా ఉన్న కంపెనీలు బోనస్ షేర్లను జారీ చేయవలసి ఉంటుంది. గత ఆరు నెలల్లో షేరు ముఖ విలువకంటే మార్కెట్ ధర 150 రెట్లు అధికంగా పలుకుతున్న లిస్టెడ్ సీపీఎస్ఈ.. షేర్ల విభజనను చేపట్టవలసి ఉంటుంది. ఈ బాటలో షేర్ల విభజన మధ్య కనీసం మూడేళ్ల వ్యవధిని పాటించవలసి ఉంటుంది. తాజా మార్గదర్శకాలు సీపీఎస్ఈల అనుబంధ(51 శాతానికిపైగా వాటా కలిగిన) సంస్థలకు సైతం వర్తించనున్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..వీటికి మినహాయింపుదీపమ్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా రంగ కంపెనీలకు వర్తించబోవు. అంతేకాకుండా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం లాభాలను పంచిపెట్టడాన్ని నిషేధించిన సంస్థలకు సైతం మార్గదర్శకాలు అమలుకావని దీపమ్ స్పష్టం చేసింది. సవరించిన తాజా మార్గదర్శకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) నుంచి అమలవుతాయని తెలియజేసింది. సీపీఎస్ఈలు మధ్యంతర డివిడెండ్ల చెల్లింపులను ప్రతీ త్రైమాసికానికీ లేదా ఏడాదిలో రెండుసార్లు చేపట్టేందుకు వీలుంటుంది. అన్ని లిస్టెడ్ సీపీఎస్ఈలు.. వార్షిక అంచనా డివిడెండ్‌లో కనీసం 90 శాతం ఒకే దశలో లేదా దశలవారీగా చెల్లించవచ్చు. అయితే గడిచిన ఏడాదికి తుది డివిడెండ్‌ను ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) ముగిసిన వెంటనే చెల్లించవలసి ఉంటుంది. అన్‌లిస్టెడ్ సంస్థలు గతేడాది ఆడిటెడ్ ఆర్థిక ఫలితాల ఆధారంగా ఏడాదిలో ఒకసారి తుది డివిడెండుగా చెల్లించాలి. -
ఎస్బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజాగా రూ.10,000 కోట్లు సమీకరించింది. ఏడోసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ ద్వారా పెట్టుబడులు సమకూర్చుకుంది. 15 ఏళ్ల కాలపరిమితిగల వీటికి కూపన్ రేటు 7.23 శాతంకాగా.. రూ.11,500 కోట్లకుపైగా విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. నిజానికి బ్యాంక్ రూ.5,000 కోట్ల విలువైన బాండ్ల జారీకి తెరతీసింది. అధిక బిడ్డింగ్ నమోదైతే మరో రూ.5,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించేందుకు గ్రీన్‌షూ ఆప్షన్(ఓవర్ అలాట్మెంట్)ను ఎంచుకుంది. వెరసి బాండ్ ఇష్యూకి రెండు రెట్లు అధికంగా స్పందన లభించింది.ఇదీ చదవండి: లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లుబిడ్ చేసిన సంస్థలలో ప్రావిడెంట్ ఫండ్స్, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ తదితరాలున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరల హౌసింగ్ విభాగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులుగా తాజా నిధులను వినియోగించనున్నట్లు వివరించింది. ఎస్బీఐ జారీ చేసిన బాండ్లకు స్థిరత్వ ఔట్లుక్సహా ఏఏఏ రేటింగ్‌ను పొందింది. వీటి జారీతో దీర్ఘకాలిక బాండ్లపై ఇతర బ్యాంకులు సైతం దృష్టి సారించేందుకు వీలు చిక్కినట్లు ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 131 పాయింట్లు పెరిగి 23,582కు చేరింది. సెన్సెక్స్ 451 పాయింట్లు ఎగబాకి 77,783 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 73 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.4 శాతం లాభపడింది. నాస్డాక్ 0.6 శాతం ఎగబాకింది.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు మంగళవారం కొంత పెరుగుతుననట్లు తెలియజేశారు. ఫెడ్ ఛైర్మన్ జెరొమ్ పావెల్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడంతో ఇప్పటికిప్పుడే వడ్డీరేట్లను తగ్గించే అవసరం ఉండకపోవచ్చని తెలిపారు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదొడుకులతో కదలాడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. నిర్దేశిత రూ.22.07 లక్షల కోట్ల లక్ష్యాన్ని దాటేస్తాయని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. కార్పొరేట్, నాన్–కార్పొరేట్ పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో ట్యాక్స్‌పేయర్స్ లాంజ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. సీబీడీటీ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా 15.41 శాతం పెరిగి రూ.12.11 లక్షల కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళమరోవైపు, 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను విదేశీ ఆదాయం, అసెట్స్‌ను తమ ఐటీఆర్‌లలో వెల్లడించని వారు సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువుందని అగర్వాల్ పేర్కొన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాల ద్వారా విదేశీ అసెట్స్ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అందుతాయని, ఐటీఆర్‌లలో పొందుపర్చిన వివరాలతో వాటిని సరిపోల్చి చూస్తుందని తెలిపారు. అధిక విలువ అసెట్స్‌ను వెల్లడించనివారికి ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఆదాయ పన్ను చట్టంలో భాషను సరళంగా, అందరికీ అర్థమయ్యే విధంగా మార్చడంపై 6,000 పైచిలుకు సలహాలు తమకు వచ్చినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
లాజిస్టిక్స్ ఐపీవోకు స్పందన ఎలా ఉందంటే..
ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్ సేవలందించే జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి అంతంతమాత్రమే స్పందన లభించింది. ఐపీవో దరఖాస్తు చివరి రోజు సోమవారానికల్లా 1.9 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ 2.25 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 4.19 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 2.76 రెట్లు బిడ్స్ నమోదుకాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.65 రెట్లు దరఖాస్తులు లభించాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 24 శాతానికే దరఖాస్తులు అందాయి.ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.501 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. వెరసి షేరుకి రూ.259–273 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,115 కోట్లు సమీకరించింది. ఐపీవో ద్వారా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ.565 కోట్ల విలువైన 2.06 కోట్ల షేర్లను విక్రయించగా.. రూ.550 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ కొత్తగా జారీ చేసింది. ఈ నిధుల్లో రూ.200 కోట్లు మార్కెటింగ్‌కు, రూ.140 కోట్లు బ్లాక్‌బక్ ఫిన్సర్వ్ మూలధన పెట్టుబడులకు వినియోగించనుంది.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళఏరిస్ఇన్ఫ్రా ఐపీవోకు రెడీనిర్మాణ రంగ మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్లో టెక్నాలజీ ఆధారిత బీ2బీ సేవలందించే ఏరిస్ఇన్ఫ్రా సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఆగస్ట్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన కంపెనీ తాజాగా అనుమతులు పొందింది. కాగా.. ఇష్యూ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, అనుబంధ సంస్థ బిల్డ్మెక్స్ ఇన్ఫ్రాలో పెట్టుబడులకు, రుణ చెల్లింపులకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళ
బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) అక్టోబర్‌లోనూ మెరిశాయి. ఏకంగా రూ.1961 కోట్లను ఇన్వెస్టర్లు వీటిలో పెట్టుబడి పెట్టారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితులతో గత రెండేళ్లుగా బంగారం ర్యాలీ అవుతుండడం చూస్తున్నాం. దీంతో బంగారం మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.1,233 కోట్లు వచ్చాయి. దీంతో పోల్చితే అక్టోబర్‌లో 59 శాతం మేర పెట్టుబడులు పెరిగినట్టు తెలుస్తోంది. ఇక 2023 అక్టోబర్ నెలలో వచ్చిన రూ.841 కోట్ల కంటే రెట్టింపునకు పైగా అధికమయ్యాయి.గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.39,823 కోట్ల నుంచి అక్టోబర్ చివరికి రూ.44,545 కోట్లకు దూసుకుపోయాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) అక్టోబర్‌లో నికరంగా 2 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం ఫోలియోలు 59.13 లక్షలకు చేరాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో రూ.1,611 కోట్లు, జులైలో రూ.1,337 కోట్లు, జూన్‌లో రూ.726 కోట్లు, మే నెలలో రూ.396 కోట్ల చొప్పున పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు జీసీసీ రంగం!కరోనా విపత్తు, అనంతరం ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో హమాస్‌తో ఇజ్రాయెల్ పోరు ఇవన్నీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ఆర్థిక అనిశ్చితులకు దారితీయడం గమనార్హం. ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ ఏర్పడి ర్యాలీకి దారితీసింది. దీంతో 2020 జనవరి నుంచి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.24,153 కోట్లు నికరంగా వచ్చాయి. ‘యూఎస్ ఫెడ్ ఈ ఏడాది 0.75 శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో డాలర్ విలువ పెరిగింది. ఇది అంతర్జాతీయంగా బంగారం ధరలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. దీన్నుంచి ప్రయోజనం పొందాలన్న ఇన్వెస్టర్ల ఆకాంక్ష ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు పెరగడానికి దారితీసి ఉండొచ్చు’అని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!
దేశీయ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.84.38 లక్షల కోట్లు)కు చేరనుంది. అందులో పనిచేసే ప్రొఫెషనల్స్ సంఖ్య 25 లక్షలకు పెరగనుంది. భారత్‌లో జీసీసీలపై రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 1,700 పైచిలుకు జీసీసీలు ఉన్నాయి. వీటి మొత్తం వార్షిక ఆదాయం 64.6 బిలియన్ డాలర్ల పైగా ఉండగా, 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.‘భారతీయ జీసీసీలు సంఖ్యాపరంగానే కాకుండా సంక్లిష్టత, వ్యూహాత్మక ప్రాధాన్యతపరంగా కూడా ఎదుగుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో సగానికి పైగా సెంటర్స్, సాంప్రదాయ సర్వీసుల పరిధికి మించి సేవలు అందిస్తున్నాయి’ అని నివేదిక పేర్కొంది. ‘గ్లోబల్ కార్పొరేషన్ల వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా భారత్ ఎదుగుతోంది. ఈ నేపథ్యంలోనే జీసీసీ మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే సిబ్బంది సంఖ్య 25 లక్షలకు చేరనుంది’ అని పేర్కొంది. ఇదీ చదవండి: మీటింగ్‌కు రాలేదని 90 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓనివేదిక ప్రకారం.. 70 శాతం సెంటర్లు 2026 నాటికి అధునాతన కృత్రిమ మేథ సామర్థ్యాలను సంతరించుకోనున్నాయి. వీటిలో ఆపరేషనల్ అనలిటిక్స్ కోసం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మొదలుకుని ఏఐ ఆధారిత కస్టమర్ సపోర్ట్, ఆర్అండ్డీ కార్యకలాపాల వరకు వివిధ సామర్థ్యాలు ఉండనున్నాయి. తూర్పు యూరప్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు సగటున 40 శాతం తక్కువగా ఉండటం వల్ల నాణ్యత విషయంలో రాజీపడకుండా కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న 100 పైగా జీసీసీ దిగ్గజాలపై సర్వే, పరిశ్రమ నిపుణులతో ఇంటర్వ్యూలు, అధ్యయనాలు మొదలైన అంశాల ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందింది. -
నిఫ్టీకి ఏడోరోజూ నష్టాలే..
ముంబై: ఐటీ, ఆయిల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో నిఫ్టీ ఏడోరోజూ నష్టాలు చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 77,339 వద్ద స్థిరపడింది. ఈ సూచీకిది వరుసగా నాలుగోరోజూ నష్టాల ముగింపు. నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయి 23,454 వద్ద నిలిచింది. ప్రథమార్థంలో సెన్సెక్స్ 615 పాయింట్లు క్షీణించి 76,965 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు కోల్పోయి 23,350 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి.అయితే మిడ్‌సెషన్ నుంచి మెటల్, రియలీ్ట, ఆటో, సరీ్వసెస్, కన్జూమర్ బ్యాంకులు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంతమేర భర్తీ అయ్యాయి. రంగాలవారీగా.., ఐటీ ఇండెక్స్ 2.50%, ఆయిల్‌అండ్‌గ్యాస్ 2%, ఫార్మా, మీడియా సూచీలు 1% చొప్పున పతనమయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నందున తక్షణ వడ్డీరేట్ల తగ్గింపు ఇప్పట్లో అవసరం లేదంటూ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ⇒ డిసెంబర్లో ఫెడ్ రేట్ల కోత ఉండకపోవచ్చనే సంకేతాలతో టీసీఎస్, ఎంఫసీస్, ఎల్టీఐఎం షేర్లు 3% క్షీణించగా.. ఇన్ఫీ 2.50% విప్రో 2% పడ్డాయి. ⇒ డిసెంబర్ నుంచి చైనా కమోడిటీలకు సంబంధించి ఎగుమ తులపై పన్ను రాయి తీలను తగ్గించడం లేదా రద్దు చేయాలనే ప్రతిపాదనలతో మెటల్ షేర్లు మెరిశాయి. నాల్కో 9 శాతం, హిందాల్కో 4%, వేదాంత 3%, టాటా స్టీల్ 2%, ఎన్ఎండీసీ 1.50%, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఒకశాతం లాభపడ్డాయి. ⇒ ప్రభుత్వం నేచరల్ గ్యాస్ సరఫరాను నెలలో రెండోసారి తగ్గించడంతో గ్యాస్ పంపిణీ సంస్థల షేర్లు పతనమయ్యాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ 20% క్షీణించి రూ.325 వద్ద, మహానగర్ గ్యాస్ 14% పడి రూ.1,131 వద్ద ముగిశాయి. -
కిరాణాలో... ‘క్విక్’ పాగా!
న్యూఢిల్లీ: సౌకర్యవంతంగా నిమిషాల వ్యవధిలోనే సరుకులను డెలివరీ చేసే సేవలకు ఆదరణ పెరుగుతుండటంతో సాంప్రదాయ కిరాణా దుకాణాల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. ఒక సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో 46 శాతం మంది కిరాణా షాపుల నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు సర్వే నిర్వహించిన డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది.2024లో ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని అంచనా. నివేదిక ప్రకారం ఈ ఏడాది కిరాణా అమ్మకాల్లో క్విక్ కామర్స్ మార్కెట్ దాదాపు 1.28 బిలియన్ డాలర్ల వాటాను దక్కించుకోనుంది. 2024 అక్టోబర్‌లో దేశీయంగా 10 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 3,000 మంది పాల్గొన్నారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, కిరాణా దుకాణాల యజమానుల ఇంటర్వ్యూలు, బ్రోకరేజి సంస్థలు..మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. సగటు ఆర్డరు రూ. 400.. ముందుగా ప్రణాళిక వేసుకోకుండా అప్పటికప్పుడు కొనుగోలు చేసే వారికి క్విక్ కామర్స్ మాధ్యమం సౌకర్యవంతంగా ఉంటోంది. నివేదిక ప్రకారం క్విక్ కామర్స్‌ను ఉపయోగించుకునే వినియోగదారుల సగటు ఆర్డరు విలువ సుమారు రూ. 400గా ఉంటోంది. ఆన్లైన్లో నిత్యావసరాలను షాపింగ్ చేసేవారిలో 75 శాతం మంది గత ఆరు నెలల్లో గణనీయంగా ఇలాంటి కొనుగోళ్లు చేశారు. 82 శాతం మంది వినియోగదారులు కిరాణా స్టోర్స్‌లో నిత్యావసరాల కొనుగోళ్లను పావు భాగం తగ్గించుకుని, దాన్ని క్విక్ కామర్స్ వైపు మళ్లించారు.సాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘క్విక్ కామర్స్ వినియోగం అసాధారణ వేగంతో పెరిగింది. 2024లో ఇది 74% వృద్ధి నమో దు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుంది‘ అని నివేదిక పేర్కొంది. క్విక్ కామర్స్ ‘కిక్’..10–30 నిమిషాల్లో సరుకులను ఇంటి దగ్గరకే అందించే సర్వీసులను క్విక్ కామర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ మొదలైనవి టాప్‌లో ఉన్నాయి. షాపింగ్ సౌలభ్యాన్ని కోరుకునే కస్టమర్లకు వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలు అందించడంపై క్విక్ కామర్స్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. నిత్యావసరాల డెలివరీతో మొదలుపెట్టిన క్విక్ కామర్స్ సంస్థలు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులకు విస్తరించాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, కాస్మెటిక్స్, గృహోపకరణాలు, ఔషధాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, పుస్తకాలు మొదలైనవన్నీ కూడా అందిస్తున్నాయి. -
వడ్డీ రేట్లు భారమే..
ముంబై: ప్రస్తుత వడ్డీ రేట్లను ప్రజలు భారంగా భావిస్తున్నారని, కనుక వాటిని అందుబాటు స్థాయికి తీసుకురావాలంటూ బ్యాంక్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎస్బీఐ నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం భారతీయ పరిశ్రమలు కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందంటూ.. వడ్డీ రేట్లను తగ్గించడం వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడంలో సాయపడుతుందన్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని, ఈ విషయంలో ఆహారపరమైన ద్రవ్యోల్బణాన్ని అవరోధంగా చూడడం సరికాదంటూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం వ్యాఖ్యానించడం తెలిసిందే. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరడంతో ఆర్బీఐ ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం: ద్రవ్యోల్బణానికి ప్రధానంగా మూడు లేదా నాలుగు కమోడిటీలు కారణమవుతున్నాయని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. మిగిలిన ప్రధాన ఐటమ్స్ అన్నీ కూడా మూడు లేదా నాలుగు శాతం ద్రవ్యోల్బణం స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం సూచీ లేదా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆహార ధరలను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా అన్న చర్చలోకి తాను వెళ్లాలనుకోవడం లేదన్నారు. ద్రవ్యోల్బణం ఎంతో సంక్లిష్టమైనదని, సామాన్యులపై భారం మోపుతుందంటూ.. సరఫరా వైపు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. వృద్ధి మందగమనంపై ఆందోళనలు అక్కర్లేదన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు బలంగా ఉన్నట్టు కొన్ని సంకేతాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. బ్యాంక్‌లు ప్రధానంగా రుణ వితరణ కార్యకలాపాలకే పరిమితం కావాలని, బీమా తదితర ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో కస్టమర్లకు అంటగట్టొద్దని, ఇది రుణాలను భారంగా మారుస్తుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడంలో ఇది చాలా కీలకమని సీతారామన్ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలకు 2025–26లో రూ.6.12 లక్షల కోట్లు, 2026–27లో రూ.7 లక్షల కోట్ల మేర రుణ వితరణ లక్ష్యాలను నిర్దేశించినట్టు ఆమె తెలిపారు. అనైతిక విధానాలను అరికట్టండి: దాస్ముంబై: సరైన కేవైసీ ధ్రువీకరణ లేకుండా ఖాతాలు తెరవడం, అబద్ధాలు చెప్పి ఉత్పత్తులను అంటగట్టడం వంటి అనైతిక విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా బ్యాంకులు గట్టి చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఇందుకోసం అంతర్గత గవర్నెన్స్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. తమ పోర్ట్‌ఫోలియోలను క్రియాశీలకంగా సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పారు. పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పుల వల్ల తలెత్తే ముప్పులు.. సవాళ్లను ముందస్తుగా గుర్తించి, నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్ల సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా దాస్ ఈ విషయాలు తెలిపారు. -
భారత్‌లో 6 లక్షల మంది కొన్న కారు ఇదే..
అత్యంత ప్రజాదరణ పొందిన 'హ్యుందాయ్ వెన్యూ' కారును దేశీయ విఫణిలో ఆరు లక్షల మంది కొనుగోలు చేశారు. 2019లో ప్రారంభమైన ఈ ఎస్యూవీ ఐదున్నర సంవత్సరాల్లో ఈ మైలురాయిని చేరుకుంది. అత్యధికంగా 2024 ఆర్ధిక సంవత్సరంలో 1,28,897 యూనిట్లు అమ్ముడయ్యాయి.హ్యుందాయ్ వెన్యూ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత.. మొదటి ఆరు నెలల్లో 50,000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తరువాత 15 నెలల్లో లక్ష యూనిట్లు, 25 నెలల్లో రెండు లక్షల యూనిట్లు, 36 నెలల్లో మూడు లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2023 నవంబర్ నాటికి వెన్యూ సేల్స్ ఐదు లక్షల యూనిట్లు కావడం గమనార్హం. ఆ తరువాత లక్ష యూనిట్లు అమ్ముడు కావడానికి 12 నెలల సమయం పట్టింది.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..హ్యుందాయ్ వెన్యూ మొత్తం 26 వేరియంట్లు, 3 ఇంజన్లు, 3 గేర్‌బాక్స్ ఎంపికలలో లభిస్తుంది. దీని ధరలు రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. కాగా కంపెనీ 2025 వెన్యూ కారును వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కారు పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. రాబోయే 2025 వెన్యూ మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది. -
డబ్ల్యూఈఎఫ్‌లో చేరిన 'ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్'
ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఈఎఫ్)కు చెందిన ''ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్''లో చేరింది. CO2e ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పించడం వంటి వాటిని లక్ష్యంగా చేసుకుని ఏఎం గ్రీన్ డబ్ల్యూఈఎఫ్‌లో చేరింది.మూడు బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడితో.. సుమారు 10,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించడానికి ఏఎం గ్రీన్ సన్నద్ధమైంది. దీని ద్వారా స్థానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థలను పెంచడమే కాకుండా.. నిర్మాణం, పరికరాల తయారీ, గృహ నిర్మాణం వంటి పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది.ఏఎం గ్రీన్ ఛైర్మన్ 'అనిల్ చలమలశెట్టి' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా మేము అవిశ్రాంతంగా పని చేస్తున్నాము. ఇప్పుడు ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇనిషియేటివ్‌లో చేరే అవకాశం లభించింది. డబ్ల్యుఈఎఫ్ చొరవతో పాలుపంచుకోవడానికి.. క్లస్టర్ ట్రాన్సిషన్ లక్ష్యాలను నెరవేర్చడానికి ఎదురుచూస్తున్నామని అన్నారు.ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇనిషియేటివ్‌లో సభ్యునిగా.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్ డీకార్బనైజేషన్ క్లస్టర్లపై ప్రపంచవ్యాప్త పనికి మద్దతు ఇవ్వడం.. ఫోరమ్‌తో అభివృద్ధి పనులను పంచుకోవడం వంటి వాటితో పాటు ఇతర ఫోరమ్ క్లస్టర్ల నుంచి ఉత్తమ అభ్యాసాలను పొందడం లక్ష్యంగా పెట్టుకుందని చలమల శెట్టి పేర్కొన్నారు.25 పారిశ్రామిక సమూహాలతో కూడిన మా గ్లోబల్ నెట్‌వర్క్‌కు.. ఏఎం గ్రీన్ కాకినాడ క్లస్టర్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక వనరులతో.. కాకినాడ క్లస్టర్ గ్రీన్ అమ్మోనియా & హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రాంతీయంగా అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ట్రాన్సిషనింగ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కమ్యూనిటీలో భాగంగా, ఏఎం గ్రీన్ కాకినాడకు అంతర్దృష్టులను పంచుకోవడానికి.. పారిశ్రామిక డీకార్బనైజేషన్‌లో సామూహిక పురోగతికి దోహదపడే అవకాశం ఉంది, అని సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ హెడ్ & ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు 'రాబర్టో బొక్కా' అన్నారు.