ప్రత్యేక నిఘా | Telangana Elections For Police Department Special Surveillance | Sakshi
Sakshi News home page

ప్రత్యేక నిఘా

Published Thu, Oct 11 2018 11:50 AM | Last Updated on Wed, Oct 17 2018 1:10 PM

Telangana Elections  For Police Department Special Surveillance - Sakshi

వరంగల్‌ క్రైం: ముందస్తు ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ సమాయత్తం అవుతోంది. పోలింగ్‌కు సుమారు రెండు నెలల సమయం ఉన్నప్పటికీ పోలీసులు పక్కా ప్రణాళిక తో ముందుకు సాగుతున్నారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థులు.. గెలుపు, ఓటములు, పార్టీలు వాటి ప్రభావంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఎప్పటికప్పుడు ఉన్నతా ధికారులకు నివేదికలు అందజేస్తున్నాయి.

వివాదాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 2014లో జరిగిన ఎన్నికల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముందుస్తుగా పోలీసు ఉన్నత అధికారులు ప్రణాళికలను రూపొందించారు. కమిషనరేట్‌లోని ప్రతిపోలీస్‌స్టేషన్‌ పరిధిలో మాజీ మావోయిస్టులు, రౌడీషీటర్లు, అక్రమ మద్యం విక్రయించి కేసుల పాలైన వారు, ఎన్నికల్లో అల్లర్లు సృష్టించి కేసులు ఉన్నవారు ఇలా.. స్టేషన్ల వారీగా లెక్కలు తీస్తున్నారు. ఒక్కొక్కరిని పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా బాధ్యత మీదే అంటూ హెచ్చరికలు చేస్తున్నారు.
 
చెక్‌ పోస్టుల ఏర్పాటు
వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఒక్కో నియోజకవర్గానికి మూడు చెక్‌పోస్టుల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతీ చెక్‌పోస్టులో పోలీసు సిబ్బందిని నియమించి ఆయా నియోజకవర్గాలకు వచ్చి పోయే వాహనాలను, వ్యక్తులను తనిఖీ చేస్తున్నా రు. వాహనాలలో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే వాటి గురించి ఆరా తీస్తున్నారు. డబ్బులకు సంబంధించి సరైన పత్రాలను ఉంటేనే వదిలి పెడుతున్నారు. లేదంటే డబ్బులను సీజ్‌ చేస్తున్నారు. అలాగే అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బెల్ట్‌షాపులపై దృష్టి..
పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బెల్ట్‌ షాపుల నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నా రు. ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతోపాటు బెల్ట్‌ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు.

ప్రచారంపై ప్రత్యేక నిఘా..
ఎన్నికల ప్రచారంపై ఇంటెలిజెన్స్‌ నిఘా వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. నియోజకవర్గాల వారీగా ప్రచారానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఉన్నతాధికారులకు వాట్సప్‌లలో పంపుతున్నారు. అలాగే ఏ నియోజవర్గంలో ఏ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ముందు ఉన్నారు.. ప్రభుత్వంపై ఎవరెవరు ఆరోపణలు చేస్తున్నారు.. అధికారుల పనితీరు ఎలా ఉంది.. అనే విషయాలపైనా సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపుతున్నారు. ప్రచారంలో అభ్యర్థులు ఇస్తున్న హామీలు, ఖర్చులపైనా దృష్టి సారించినట్లు తెలిసింది.
 
బైండోవర్లు.. కేసుల నమోదు..
ఎన్నికల్లో అలర్లు సృష్టించే వారిని, గత ఎన్నికల సమయంలో ఇబ్బందులు కలిగించిన వారిని, రౌడీషీటర్లను. మాజీ నక్సలైట్లను, బెల్టుషాపుల నిర్వాహకులను పోలీసు అధికారులు తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేయిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం మద్యం అమ్ముతున్న బెల్ట్‌షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. వెస్ట్‌జోన్‌ పరిధిలో రికార్డులలో ఉన్న 230 మంది రౌడీ షీటర్లతోపాటు గతంలో ఎన్నికలకు విఘాతం కలిగించిన వ్యక్తులను ఇప్పటికే బైండోవర్‌ చేశారు. వారి నుంచి ముందస్తుగా ‘ఇంటీరియం బాండ్‌’, రూ.లక్షతో వ్యక్తిగత పూచీకత్తు తీసుకుంటున్నారు.
 
రాత్రి 10 తర్వాత మైకుల బంద్‌

ఎన్నికలలో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమదే  బాధ్యత అంటూ వారితో రాయించుకుని కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్‌లకు అనుమతి ఇవ్వడం లేదు. అనుమతి లేని మైకులను సీజ్‌ చేస్తున్నారు. సెంట్రల్‌ జోన్‌ పరిధిలో ఇప్పటికే మద్యం అమ్మకాలు, పాత నేరస్తులపై 7 కేసులు నమోదు చేసి 24 మందిని బైండోవర్‌ చేశారు. అలాగే ఈస్ట్‌జోన్‌ పరిధిలో 17 కేసులు నమోదు కాగా 50 మందిని బైండోవర్‌ చేసినట్లు ఆయా స్టేషన్ల పోలీసులు తెలిపారు. వాహనాలను, వ్యక్తులను తనిఖీ చేస్తున్నా రు. వాహనాలలో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే వాటి గురించి ఆరా తీస్తున్నారు. డబ్బులకు సంబంధించి సరైన పత్రాలను ఉంటేనే వదిలి పెడుతున్నారు. లేదంటే డబ్బులను సీజ్‌ చేస్తున్నారు. అలాగే అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బెల్ట్‌షాపులపై దృష్టి..
పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బెల్ట్‌ షాపుల నిర్వాహకులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నా రు. ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతోపాటు బెల్ట్‌ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు.

ప్రచారంపై ప్రత్యేక నిఘా..
ఎన్నికల ప్రచారంపై ఇంటెలిజెన్స్‌ నిఘా వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. నియోజకవర్గాల వారీగా ప్రచారానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఉన్నతాధికారులకు వాట్సప్‌లలో పంపుతున్నారు. అలాగే ఏ నియోజవర్గంలో ఏ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ముందు ఉన్నారు.. ప్రభుత్వంపై ఎవరెవరు ఆరోపణలు చేస్తున్నారు.. అధికారుల పనితీరు ఎలా ఉంది.. అనే విషయాలపైనా సమాచారం సేకరించి ప్రభుత్వానికి పంపుతున్నారు. ప్రచారంలో అభ్యర్థులు ఇస్తున్న హామీలు, ఖర్చులపైనా దృష్టి సారించినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement