సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 650కు చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా నుంచి కోలుకొని118 మంది డిశ్చార్జ్ కాగా, 18 మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాపై యుద్ధానికి తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని.. ఎంతమంది రోగులకైనా చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
(ఏపీ, తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు)
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తామన్నారు. ఎంతమందికైనా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైరస్ నిర్దారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్, చికిత్సకు కావాల్సిన సదుపాయాలన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు.259 కంటైన్మెంట్ జోన్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేయనున్నామని కేసీఆర్ పేర్కొన్నారు.
(కరోనా: షాకింగ్ విషయాలు బయటపెట్టిన స్టడీ!)
Comments
Please login to add a commentAdd a comment