NRI
-
అమెరికా ఎన్నికల్లో ఎన్నారైల సత్తా.. ఎంతమంది గెలిచారంటే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని విజయాన్ని నమోదు చేసుకున్నారు. పాపులర్ ఓటింగ్ ద్వారానే ఆయన తన గెలుపును ఖరారు చేశారు. అదే సమయంలో.. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన భారత సంతతి పౌరులు (ఎన్నారై) సైతం తమ సత్తా చాటారు. అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 9 మంది భారతీయ అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. వీరిలో ఆరుగురు విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోసారి బరిలోకి దిగిన ఐదుగురు సీనియర్ నాయకులు.. విజయాన్ని దక్కించుకున్నారు.1. రాజా కృష్ణమూర్తి(51): డెమోక్రాటిక్ పార్టీకి చెందిన బలమైన నాయకుడు రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్(8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా అయిదోసారి గెలుపొందారు. 2017 నుంచి ఆయన చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2. రో ఖన్నా(48): డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రో ఖన్నా..2017 నుంచి కాలిఫోర్నియా (17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడే బరిలో దిగిన ఆయన మరోసారి గెలుపును తన ఖాతాలో వేసుకున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి అనితా చెన్ను ఓడించి విజయం సాధించారు.3. సుహాస్ సుబ్రమణ్యం(38): డెమొక్రాటిక్ అభ్యర్థిగా వర్జీనియా (10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి బరిలో దిగిన సుహాస్ సుబ్రమణ్యం.. రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ క్లాన్సీని ఓడించి విజయం సాధించారు. ప్రస్తుతం వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా వ్యవహరిస్తున్న ఆయన... డెమొక్రాట్లకు కంచుకోట రాష్ట్రంగా పేరున్న వర్జీనియా నుంచి విజయం దక్కించుకున్నారు. దీంతో వర్జీనియా నుంచి గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్‌గా సుబ్రమణ్యన్ రికార్డు సృష్టించారురు. గతంలో అధ్యక్షుడు ఒబామాకు వైట్ హౌస్ సలహాదారుగా కూడా సుహాస్ పనిచేశారు.4. శ్రీథానేదార్(69): మిచిగాన్ (13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి బరిలోకి దిగిన శ్రీ థానేదార్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన ప్రత్యర్ధి రిపబ్లికన్ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్‌ను 35 శాతం ఓట్ల తేడాతో ఓడించి, రెండవసారి గెలుపును దక్కించుకున్నారు. ఈయన 2023 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.5. డాక్టర్ అమిబెరా(59): వృత్తి పరంగా వైద్యుడు అయిన అమిబెరా.. సీనియర్ మోస్ట్ ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యుడు.2013 నుంచి కాలిఫోర్నియా(6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి బరిలోకి దిగిన అమిబెరా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై ఘన విజయాన్ని సాధించారు.6. ప్రమీలా జయపాల్(59): డెమోక్రటిక్ నేత ప్రమీలా జయపాల్ వాషింగ్టన్( 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి 2017 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ నేత డాన్ అలెగ్జాండర్‌ను ఓడించి తిరిగి ఎన్నికయ్యారు.అమిష్ షా: భారతీయ సంతతికి చెందిన అమిష్ షా... అరిజోనా(1వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అతను రిపబ్లికన్‌కు చెందిన డేవిడ్ ష్వీకర్ట్ కంటే ముందంజలో ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి వరుసగా ఏడుసార్లు విజయం దక్కించుకున్న రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ స్క్యూకెర్ట్‌తో అమిష్ తలపడుతుండడం గమనార్హం. కాగా అరిజోనా రాష్ట్ర అసెంబ్లీకి వరుసగా మూడు సార్లు(2018, 2020, 2022) ఎన్నికయ్యారు షా. -
ఎన్నారైలకు శుభవార్త: యూపీఐతో రోజుకు లక్ష పంపొచ్చు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీపి కబురు అందించింది. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్వో) ఖాతాలున్న ఎన్నారైలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఇక నుంచి రోజుకు రూ.1 లక్ష వరకు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులు, ఇతర చెల్లింపులకు నగదు పంపించవచ్చు.ఎన్నారైలు ఇక నుంచి అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి నేరుగా వారి స్మార్ట్‌ఫోన్ నుండి ఉచిత లావాదేవీల కోసం యూపీఐని ఉపయోగించవచ్చు. తద్వారా విదేశాల నుండి లావాదేవీలను నిర్వహించడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. యూఎస్, కెనడా, యూకే, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంగ్‌కాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాలోని ఎన్నారైలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. కొత్తగా నమోదైన యూపీఐ ఐడీల ద్వారా తొలి 24 గంటల్లో రూ.5,000 మాత్రమే పంపేందుకు వీలుంది. ఆ తర్వాతి రోజు నుంచి రోజుకు రూ.1 లక్ష పంపొచ్చు.ఇవీ బ్యాంకులు..యూపీఐ కోసం అంతర్జాతీయ మొబైల్ నంబర్ల అనుసంధానానికి ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ మద్దతు ఇస్తున్నాయి.అంతర్జాతీయ మొబైల్ నంబర్లకు అనుకూలమైన యూపీఐ అప్లికేషన్లలో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్, భీమ్ ఏయూ, ఫెడ్‌మొబైల్, ఐమొబైల్, భీమ్ ఇండస్ పే, ఎస్ఐబీ మిర్రర్ ప్లస్ వంటివి ఉన్నాయి. ఎన్నారైలు తమ ఎన్ఆర్ఈ మరియు ఎన్ఆర్వో ఖాతాల మధ్య, అలాగే భారత్‌లోని ఖాతాలకు యుపీఐ లావాదేవీలు చేయవచ్చు. ఎన్ఆర్వో ఖాతా నుండి ఎన్ఆర్ఈ ఖాతాకు నిధులను బదిలీ చేయలేరు. విభిన్న బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్న ఎన్నారైలు ప్రతి ఖాతాకు ప్రత్యేక యూపీఐ ఐడీ అవసరం. ఖాతా ఉమ్మడిగా ఉంటే ప్రాథమిక ఖాతాదారు మాత్రమే యూపీఐని ఉపయోగించగలరు. -
లండన్ వేదికగా ప్రారంభమైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్
నవంబర్ 5-7 వరకు లండన్‌లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో భారతదేశం పాల్గొంటుంది.ఇన్‌బౌండ్ టూరిజంను మెరుగుపరచడం , దేశాన్ని ప్రధాన ప్రపంచ ప్రయాణ గమ్యస్థానంగా ఉంచడం లక్ష్యంగా ఇందులో పాల్గొంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , భారతీయ టూరిస్ట్ పరిశ్రమకు చెందిన హోటళ్లతో సహా దాదాపు 50 మంది వాటాదారుల ప్రతినిధి బృందంతో WTMలో పాల్గొంటున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఇందులో భాగంగానే ఇన్క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకేలో భారత హై కమీషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి తెలంగాణా ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్ తో మంత్రి భేటీ అయ్యారు. తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులు, హైదరాబాద్ లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్, లండన్ ఐ తరహాలో ఐకానిక్ జాయింట్ వీల్ ఏర్పాటుపై చర్చించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.వంశీ కృష్ణ, డా. రాజేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టాంపలో నాట్స్ బోర్డ్ సమావేశం సంబరాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగు వారికి మరింత చేరువయ్యేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దృష్టిపెట్టింది. టాంపాలో జరిగిన నాట్స్ బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించింది. ముఖ్యంగా ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలను వచ్చే ఏడాది జులైలో టాంపాలో నిర్వహించనుంది.దీనికి సంబంధించిన కార్యచరణ, ప్రణాళికకు సంబంధించి నాట్స్ బోర్డ్ సభ్యులు, నాట్స్ చాప్టర్ విభాగ నాయకులు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు.. నిధుల సేకరణ, కార్యక్రమాల నిర్వహణ, స్థానిక తెలుగు సంస్థల సహకారం వంటి అంశాలపై ఈ సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే నాట్స్ కొత్త చాప్టర్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాట్స్ సభ్యత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పటిష్టమైన కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందించారు. నాట్స్ జీవిత కాల సభ్యత్వాన్ని ప్రోత్సహించేలా నాట్స్ నాయకులు కృషి చేయాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. కొత్త చాప్టర్లు నాట్స్ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫుడ్ డ్రైవ్, కాపీ విత్ కాప్, హైవే దత్తతలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అన్నారు. టాంపలో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేసేందుకు నాట్స్ చాప్టర్ నాయకులు తమ వంతు కృషి చేయాలని కోరారు. అమెరికాలో జరిగే ఈ అతి పెద్ద తెలుగు పండుగకు చాప్టర్ల నాయకులు తమ ప్రాంతాల్లో తెలుగు కుటుంబాలను ఆహ్వానించి సంబరాల సంతోషాన్ని పంచుకునే అవకాశాన్ని అందరికి కల్పించాలన్నారు. ఇంకా నాట్స్ బోర్డు సమావేశంలో నాట్స్ బోర్డ్ మాజీ చైర్ పర్సన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు గంగాధర్ దేసు, మోహనకృష్ణ మన్నవ, బాపు నూతి, శ్రీనివాస్ మంచికలపూడి, రాజేంద్ర మాదల, నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీహరి మందాడితో పాటు నాట్స్ కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.టాంప కన్వన్షన్ సెంటర్‌ను పరిశీలించిన నాట్స్ బృందంఔరా అనిపించేలా అమెరికా తెలుగు సంబరాల వేదిక. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలు ఈసారి టాంప వేదికగా జులై 4, 5, 6 తేదీల్లో జరగగున్నాయి. ఈ సంబరాలకు సంబంధించిన వేదికను నాట్స్ జాతీయ నాయకులు, టంపా నాట్స్ విభాగం బృంద సభ్యులు పరిశీలించారు. సంబరాలకు వేదిక అద్భుతంగా ఉండాలనే సంకల్పంతో నాట్స్ టంపా విభాగం 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టంపా కన్వెన్షన్ సెంటర్‌ను ఎంచుకుంది. హిల్స్‌బరో నది ఒడ్డున అద్భుతమైన ప్రకృతి రమణీయతల మధ్య ఈ కన్వెన్షన్ సెంటర్ ఉండటం పై నాట్స్ జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఈ సెంటర్ పక్కన అతిధ్యానికి తిరుగులేదనిపించేలా ఉన్న హోటల్స్, దగ్గరల్లోనే టూరిజం స్పాట్లు ఉన్నాయని నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ తెలిపారు. అమెరికాలో ఉండే ప్రతి తెలుగు కుటుంబం సంబరాల్లో పాలుపంచుకోవాలని ఈ సందర్భంగా గుత్తికొండ పిలుపునిచ్చారు. సంబరాలను దిగ్విజయం చేసేందుకు నాట్స్ సభ్యులందరం కలిసి కృషి చేద్దామని ఆయన కోరారు. హద్దులు లేని ఆనందాల కోసం ఆత్మీయ, అనుబంధాలను పంచుకునేందుకు అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారు తరలిరావాలని శ్రీనివాస్ గుత్తికొండ ఆహ్వానించారు.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల బృందం ఇదే..!నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణలో శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, భాను ధూళిపాళ్ల, రాజేష్ కాండ్రు, జగదీష్ చాపరాల, మాలినీ రెడ్డి, అచ్చిరెడ్డి, ప్రసాద్ ఆరికట్ల, విజయ్ కట్టా, సుధాకర్ మున్నంగి లు సంబరాల వివిధ కమిటీల బాధ్యతలు తీసుకుని సంబరాలను దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. బిందు బండా, సుమంత్ రామినేని, సురేష్ బుజ్జా, శ్రీనివాస్ బైరెడ్డి, మాధురి గుడ్ల, రవి కానూరి, ప్రసాద్ కొసరాజు, భరత్ ముద్దన, సతీష్ పాలకుర్తి, రవి కలిదిండి, కృష్ణ భగవరెడ్డి, శ్యామ్ తంగిరాల, మాలినీ రెడ్డి తంగిరాల, మధు తాతినేని, మాధవి యార్లగడ్డ, రామ కామిశెట్టి, అనిల్ అరమండ, భాస్కర్ సోమంచి, శివ తాళ్లూరి, ప్రసన్న కోట, ప్రహ్లాదుడు మధుసూదుని, శిరీషా దొడ్డపనేని, రవి కానూరు, కిరణ్ పొన్నం, వీర జంపాని, సుధీర్(నాని) వాలంటీర్లు ఈ సంబరాల విజయం కోసం తమ వంతు కృషి చేయనున్నారు.(చదవండి: టాంపలో ఘనంగా సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్) -
టాంపలో ఘనంగా సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు టాంప లో శంఖారావం పూరించింది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ ఏవీ ద్వారా సంబరాలు ఎలా జరగనున్నాయనేది చాటిచెప్పింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు, స్థానిక తెలుగు కళాకారులతో నృత్య ప్రదర్శనలు.. మ్యూజిక్ షోలతో టంపాలో తెలుగువారికి గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ మంచి కిక్ ఇచ్చింది. వచ్చే జులై 4, 5, 6 తేదీల్లో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు ట్రైలర్‌లా కిక్ ఆఫ్ ఈవెంట్ జరిగింది. దాదాపు 1500 మంది తెలుగువారు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. టాంప లో జరగనున్న అతి పెద్ద తెలుగు సంబరానికి అమెరికాలో ఉండే ప్రతి కుటుంబం తరలిరావాలని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ పిలుపు నిచ్చారు. తెలుగువారందరిని కలిపే వేదిక.. తెలుగువారికి సంతోషాలు పంచే వేదిక అమెరికా తెలుగు సంబరాలు అని ఈ అవకాశాన్ని ప్రతి తెలుగు కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు, సినీ స్టార్లు, సంగీత, సాహిత్య ఉద్దండులు, కళాకారులు పాల్గొనే సంబరాల్లో అమెరికాలో ఉండే తెలుగువారంతా పాల్గొనాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి పిలుపునిచ్చారు. టాంప సంబరాల గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు నాట్స్ జాతీయ నాయకులు కూడా తరలివచ్చారు.స్థానిక డ్యాన్స్ స్కూల్స్ సబ్రిన (గణేశస్తోత్రం, కౌత్వం) , సరయు, లీలా టాలీవుడ్ లేడీస్ డాన్స్, మాధురి (తిల్లానా), శివం గర్ల్స్, సరయు(తమన్ మెడ్లీ), సబ్రిన(అన్నమయ్య కీర్తన),శివం(మస్తీ) చేసిన డ్యాన్స్ అందరిలో ఉత్సాహం నింపింది. సాకేత్ కొమాండూరి, మనీషా ఈరబత్తిని, శృతి రంజనీలు తమ గాన మాధుర్యంతో చక్కటి తెలుగుపాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. సాహిత్య వింజమూరి తన యాంకరింగ్ తో ఈ ఈవెంట్లో మెప్పించారు. ఈ సారి టాంపాలో జరిగే సంబరాల ప్రత్యేకత ఏమిటీ అనే దానిపై రూపొందించిన ట్రైలర్ ని ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమన్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుని సంబరాలపై అంచనాలను పెంచింది. చక్కటి తెలుగు ఇంటి భోజనం కూడా గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు వచ్చిన తెలుగువారి చేత ఆహా అనిపించింది. అనంతరం, నాట్స్ బోర్డ్ సెక్రటరీ మధు బోడపాటి, నాట్స్ గౌరవ సభ్యులను, గత అధ్యక్షులను, డైరెక్టర్స్ ను వేదికపైకి ఆహ్వానించారు.టాంప నాట్స్ నాయకులు రాజేశ్ కాండ్రు నాట్స్ చాప్టర్ల నాయకులను, కార్యవర్గ సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించారు. అలాగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాలుపంచుకునే టాంప స్థానిక తెలుగు సంఘలైన టీఏఎఫ్, మాటా, టీజీఎల్ఎఫ్, టీటీఏ, ఎఫ్ఐఏ, హెచ్టీఎఫ్ఎల్, సస్త, ఐటీ సర్వ్ సంస్థల ప్రతినిధులను గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై పరిచయం చేశారు. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్లో ముఖ్యగా టాంప లో స్థానిక కళాకారుల డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. గ్రాండ్ కిక్ ఆఫ్ ఈవెంట్ వేదికపై థమన్‌తో పాటు ఈవెంట్‌కు వచ్చిన ప్రముఖులను నాట్స్ సత్కరించింది. నాట్స్ సభ్యులు, దాతల నుంచి అమెరికా తెలుగు సంబరాలకు 2.5 మిలియన్ డాలర్ల విరాళాలు ఇచ్చేందుకు హామీ లభించింది.(చదవండి: మానసిక ఆరోగ్యం పై నాట్స్ అవగాహన సదస్సు) -
ఘనంగా సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం దశవర్ష వార్షికోత్సవం
లోకా సమస్తాః సుఖినోభవంతు సర్వేజనా సుఖినో భవంతు అనే భావనతో పదేళ్ల క్రితం ప్రారంమైన సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం 2 నవంబర్, 2024 నాడు దశ వర్ష వార్షికోత్సవము ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా దాదాపుగా 50 మంది తెలుగు బ్రాహ్మణ రుత్వికుల ఆధ్వర్యంలో శ్రీ మహా త్రిపురసుందరీ సమేత శ్రీ ఉమా సహస్ర లింగార్చన పూర్వక హరిద్రా కుంకుమార్చన సహిత లక్ష బిల్వార్చన కార్యక్రమంలో స్వామి వారిని అర్చనకార్యక్రమాన్ని నిర్వహించారు.కార్తీక మాసం మొదటి రోజున చేపట్టిన ఈ కార్యక్రమము లిటిల్ ఇండియాలో, ఆర్య సమాజ్ వారి ప్రాంగణములో 12 గంటలు పైగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు గణపతి పూజ పుణ్యాహవచనం తో మొదలుకొని మృత్తికా శోధన కార్యక్రమంతో మహాన్యాసా పూర్వకము గా భారతదేశం నుంచి తెప్పించిన శ్రేష్ఠమైన పుట్టమన్నుతో 1136 మహా పరమశివ లింగములు చేసి వాటిని సమంత్ర పూర్వకము గా మూల మంత్రము తో ఆవరణ అర్చన చేసి ఆ తరువాత అరుణపారాయణం చేసిన పిదప ఏకాదశ వార రుద్రాభిషేకం శ్రీ రుద్ర పూర్వకము గా చేసిన అనంతరం సూక్తముల పారాయణా సహితము గా వేదోక్త శాంతులయిన దశశాంతులు తో శ్రీ సహస్ర లింగేశ్వరుని సామ్రాజ్య పట్టాభిషేకం కావించుకుని, చిన్న విరామం అనంతరం 50 మంది దంపతులు కలసి లలిత సహస్రనామములతో హరిద్రాకుంకుమార్చన చేసి, అటుపిమ్మట శివ సహస్రనామ పూర్వక లక్ష బిల్వార్చనా అంతర్గత రుద్రాక్రమార్చన పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.చివరగా షోడశ ఉపచారా పూజ, దర్భార్ సేవతో ప్రదోష వ్రతం కార్యక్రమమును ఘనంగా ముగించారు.ఈ కార్యక్రమమును సింగపూర్ బ్రాహ్మణ సమాజ బ్రహ్మలు ప్రసాద్ కప్పగంతుల, నేమాని సత్య రమేష్ మరియు రాజేష్ శ్రీధర ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించగా, భారతదేశం నుంచి వచ్చిన సలక్షణ ఘనాపాటి వంశీ(రాధే) పాల్గొని కార్యక్రమానికి సహకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని సింగపూర్‌లో తొలిసారిగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమానికి సహకరిచిన వర్కింగ్ టీం సభ్యులు గణపతి శాస్త్రి ఆకెళ్ళ, సూర్య పవన్ యనమండ్ర, వంశి కృష్ణ శిష్ట్లా , ముఖ్యదాతలు రంగనాథ్ వల్లభజోస్యుల, ఆదిత్య కర్రా , రామన్, భాను ఆకుండి, సంపూర్ణ స్వదేశ్, వీర ఫ్లవర్స్, వేద ఫ్లవర్స్ వాలంటీర్స్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే అడగగానే హాల్ ని సమకూర్చిన ఆర్యసమాజ్ వారికీ ప్రత్యేక ధన్యవాదాలా తెలిపారు. కార్యక్రమములో పాల్గొన్న రిత్విక్ లకు, భక్తులకు పెరుమాళ్ దేవాలయం నుంచి తెప్పించిన ప్రసాద వితరణ చేసారు.ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతిఒక్కరికి నిర్వాహకులు శ్రీప్రదాయ చల్లా, రాజేష్ యనమండ్ర, వేణు మాధవ్ మల్లవరపు, రత్నకుమార్ కవుటూరు పేరు పేరున ధన్యవాదములు తెలియచేసారు. -
మానసిక ఆరోగ్యం పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ న్యూజెర్సీ విభాగం తాజాగా మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సును, డిమెన్షియాపై సర్వే లను నిర్వహించింది. తొలుత నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల రట్గర్స్ యూనివర్సిటీ క్లినికల్ ఇన్స్టక్టర్, పీహెచ్డీ విద్యార్ధిని అంజు వాధవన్ లను సభకు పరిచయం చేశారు. ముఖ్యంగా విద్యార్ధులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై ఈ సదస్సు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విద్యార్ధుల తల్లిదండ్రులు విద్యార్ధుల మానసిక సమస్యలను ఎలా కనిపెట్టాలి.? ఎలా పరిష్కరించాలి.? ఒత్తిడిని జయించేలా వారికి ఎలా దిశా నిర్దేశం చేయాలనే అంశాలపై ఈ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. నమి న్యూజెర్సీ ప్రోగ్రామ్ మేనేజర్, సమాజ్ స్టేట్ వైడ్ కో ఆర్డినేటర్, మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ఈ సదస్సులో విద్యార్ధులకు, తల్లిదండ్రులకు మానసిక సమస్యలు, వాటి పరిష్కారాలపై చక్కటి అవగాహన కల్పించారు. డిమెన్షియాపై సర్వేకు నాట్స్ మద్దతుఆసియన్ అమెరికన్ డిమెన్షియా బాధితుల సంరక్షణ ఎలా ఉంది..? డిమెన్షియా బాధితులను సంరక్షించే వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.? ముఖ్యంగా మానసికంగా వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు.? అనే అంశాలపై చాంబర్లిన్ విశ్వవిద్యాలయం మరియు మెర్సర్ కౌంటీ కమ్యూనిటీ కళాశాలల విజిటింగ్ ప్రొఫెసర్, రట్గర్స్ యూనివర్సిటీ కి చెందిన పీహెచ్డీ విద్యార్ధిని అంజు వాధవన్ సర్వే చేస్తున్నారు. ఇలాంటి సర్వే ద్వారా డిమెన్షియా బాధితులకు, వారి సంరక్షకులు ఎదుర్కొనే సమస్యలపై కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి. అందుకే ఈ కార్యక్రమానికి నాట్స్ కూడా తన వంతు మద్దతు, సహకారం అందించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలితో పాటు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల, న్యూ జెర్సీ ఛాప్టర్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ టేకి, రాకేష్ వేలూరు,రామకృష్ణ బోను, సుధ బిందు, నేషనల్ విమెన్ ఎంపవర్మెంట్ టీమ్ సభ్యురాలు శ్రీదేవి జాగర్లమూడి, శ్రీదేవి పులిపాక తదితరులు ఈ సమావేశం నిర్వహణ బాధ్యత వహించారు. తెలుగు లలిత కళాసమితి ఉపాధ్యక్షుడు ప్రసాద్ ఊటుకూరు, రాణి ఊటుకూరు, పలువురు న్యూ జెర్సీ ఛాప్టర్ కమిటీల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: ఆర్ధిక అక్షరాస్యత పై నాట్స్ అవగాహన సదస్సు) -
ఆర్ధిక అక్షరాస్యత పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆన్లైన్ వేదికగా ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ మహిళా సాధికారత జాతీయ సమన్వయకర్త రాజలక్ష్మి చిలుకూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు మంచి స్పందన లభించింది. ఆర్ధిక ప్రణాళిక ఎలా ఉండాలి.? ఆర్ధిక అంశాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.? ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించే మార్గాలు ఏమిటి.? ఇలాంటి ఎన్నో అంశాలను ఆ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. వర్జీనియాకు చెందిన ఆర్థిక నిపుణులు శ్రీలత గూడూరు, ఆదాయాలు ఎలా పెంచుకోవాలి., అప్పులు, ఆదాయ వనరులు, రిటైర్మెంట్ ప్లానింగ్, బేసిక్ మనీ మేనేజ్మెంట్ వంటి వివిధ అంశాలపై సవివరంగా ఈ సదస్సులో వివరించారు. నెట్లా సంస్థ వైస్ ప్రెసిడెంట్ మార్క్ స్టిర్నెమాన్ వీలునామాలు, ట్రస్ట్‌ల యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో పాటు ఇక్కడ డాక్యుమెంటేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలిపారు. సదస్సులో పాల్గొన్న వారి ఆర్ధిక సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సుకు శ్రీనివాస్ చిలుకూరి అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఆర్ధిక అవగాహన సదస్సును విజయవంతం చేయడంలో కృషి చేసిన నాట్స్ వెబ్, మార్కెటింగ్ బృందాలు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రాజేష్ కాండ్రుతో లాస్ ఏంజిల్స్ నాట్స్ టీం సభ్యులందరికి నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సదస్సుకు సహకరించిన నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటికి నాట్స్ లాస్ ఏంజిల్స్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.(చదవండి: నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్) -
నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్
అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అన్ని రాష్ట్రాల్లోనూ చాప్టర్లను ప్రారంభిస్తూ తెలుగువారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నార్త్ కరోలినా రాష్ట్రంలో నాట్స్ తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. అపెక్స్ సీనియర్ సెంటర్లో నార్త్ కరోలినా చాప్టర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నాట్స్ జాతీయ నాయకత్వం, నాట్స్ ఇతర చాప్టర్ల నుంచి వచ్చిన నాట్స్ నాయకులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నార్త్ కరోలినా చాప్టర్ కోఆర్డినేటర్‌గా ఉమా నార్నెకు బాధ్యతలు అప్పగించారు. నార్త్ కరోలినా నాట్స్ చాప్టర్ సభ్యులుగా వేణు వెల్లంకి, రాజేష్ మన్నెపల్లి, రవితేజ కాజ, దీపికా దండు, కల్పన అధికారి, శ్రీను కాసరగడ్డ లు నాట్స్ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.భాషే రమ్యం సేవే గమ్యం అనేది నాట్స్ నినాదమని నాట్స్ దానికి తగ్గట్టే కార్యక్రమాలు చేపడుతూ తెలుగువారికి చేరువయ్యిందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తెలిపారు. నాట్స్ లక్ష్యాలను పిన్నమనేని వివరించారు. నాట్స్ అంటే అమెరికాలో తెలుగువారికి అండగా నిలిచే సంస్థగా తీర్చిదిద్దడంలో ప్రతి నాట్స్ సభ్యుడు, వాలంటీర్ కృషి ఎంతో ఉందని నాట్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ మధు కొర్రపాటి అన్నారు. నాట్స్ వైద్య శిబిరాలు, నాట్స్ హెల్ప్‌లైన్ ద్వారా అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు. నార్త్ కరోలినా లో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా నాట్స్ ఉందనే భరోసాను నార్త్ కరోలినా నాట్స్ సభ్యులు, నాయకులు కల్పించాలని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి అన్నారు. తెలుగు వారిలో ఐక్యతను పెంపొందించి వారందరిని ఒక చోట కలిపే వేదికగా నాట్స్ ఎదిగిందని అదే తరహాలో నార్త్ కరోలినాలో కూడా ఇక్కడ నాట్స్ సభ్యులు తెలుగువారికి చేరువ కావాలని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణ, సమాజ సేవే లక్ష్యాలుగా నార్త్ కరోలినా నాట్స్ విభాగం పనిచేయాలన్నారు. అందరితో కలిసి పనిచేస్తూ నాట్స్ ప్రతిష్టను పెంచాలని నాట్స్ ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ వెంకటరావు దగ్గుబాటి కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కోఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ న్యూ జెర్సీ చాప్టర్ వెబ్ చైర్ వెంకటేష్ కోడూరి, న్యూజెర్సీ చాప్టర్ ఈవెంట్ ఎగ్జిక్యూషన్ హరీష్ కొమ్మాలపాటి తదితరులు పాల్గొన్నారు. నవంబర్‌లో చేపట్టనున్న “థాంక్స్ గివింగ్ ఫుడ్ డ్రైవ్” కార్యక్రమంతో పాటు ఇతర క్రీడా పోటీల గురించి నార్త్ కరోలినా నాట్స్ టీం తెలిపింది. యువతలో సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంపొందించడం, మహిళా ఆరోగ్యంపై కార్యక్రమాలు, నిధుల సేకరణను ప్రోత్సహించడం, కొత్త దాతలు, వాలంటీర్లను ఆకర్షించడం, సోషల్ మీడియాలో ప్రచారం లాంటి అంశాలపై నాట్స్ నార్త్ కరోలినా టీం ప్రధానంగా చర్చించింది. నాట్స్ కొత్త చాఫ్టర్ తమ నగరంలో ప్రారంభం కావడంపై ఈ ప్రారంభ సభకు విచ్చేసిన నార్త్ కరోలినాలోని తెలుగు వారు హర్షం వ్యక్తం చేశారు.(చదవండి: కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు) -
తెలుగోడు.. టెక్సాస్ మేయర్ ఎన్నికల బరిలో!
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులూ.. అక్కడి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం చూస్తున్నాం. చిన్న పదవుల మొదలుకుని జడ్జిలు, చట్ట సభలు, దేశ ప్రధానుల్లాంటి ఉన్నత పదవులనూ అధిరోహిస్తున్నారు. తాజాగా.. ఓ తెలుగోడు టెక్సాస్ స్టేట్‌లో మేయర్ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ట్రాన్స్పరెన్సీ(పారదర్శకత) ఈజ్ ద గేమ్.. కార్తీక్ ఈజ్ ది నేమ్ అంటూ.. 35 ఏళ్ల యువకుడు ట్రావిస్ కౌంటీలోని ది హిల్స్ మేయర్ ఎన్నికల ప్రచారంతో హాట్ టాపిక్‌గా మారాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు(ప్రస్తుతం బాపట్ల) చెందిన కార్తీక్ నరాలశెట్టి Karthik Naralasetty.. ది హిల్స్ మేయర్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కార్తీక్.. న్యూజెర్సీ రట్టర్స్ యూనివర్సిటీలో కంప్యూటర్‌సైన్స్ డిపార్ట్మెంట్లో చేరాడు. ఆపై చదువు ఆపేసి ఇండియాకు తిరిగొచ్చి సోషల్‌బ్లడ్ పేరుతో ఓ ఎన్జీవో ఏర్పాటు చేసి.. క్రమక్రమంగా వ్యాపారవేత్తగా ఎదిగాడు. అదే టైంలో పెంపుడు జంతువులకు సంబంధించిన మరో కంపెనీ స్థాపించాడు.అమెరికాలో ఉన్న తొలినాళ్లలోనే అధితితో పరిచయం.. ఆపై వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ‘ది హిల్స్’ మేయర్ ఎన్నికలపై దృష్టి సారించాడు కార్తీక్. ఆగస్టు నుంచే ప్రచారం మొదలుపెట్టిన కార్తీక్.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన అనుభవంతో ది హిల్స్ అభివృద్ధికి దోహదపడతానని ప్రచారం చేశాడు కూడా. ది హిల్స్‌లో 2,000 జనాభా ఉంది. కేవలం ఐదు భారతీయ కుటుంబాలు మాత్రమే అక్కడ స్థిరపడ్డాయి. అయితే న్యూజెర్సీలో ఉన్న బంధువుల సహకారంతో ప్రచారం ఉధృతం చేశాడు కార్తీక్. నవంబర్ 5న ఇక్కడ మేయర్ ఎన్నిక జరగనుంది. ఒకవేళ.. కార్తీక్ ఈ ఎన్నికల్లో గెలిస్తే గనుక.. ‘ది హిల్స్’ మేయర్ పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా, తొలి భారతీయ వ్యక్తిగా నిలుస్తాడు. -
NRI: శతవసంతాల సాహితీవేత్తలకు శతకోటి వందనాలు
డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహిస్తున్న 73వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం శతజయంతులు జరుపుకుంటున్న కొంతమంది రచయితలకు నివాళులర్పిస్తూ - “శతవసంతాల సాహితీవేత్తలకు శతకోటి వందనాలు” అనే కార్యక్రమం చాలా ఆసక్తి దాయకంగా జరిగింది. తానాఅధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకు ఆత్మీయ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం అవిరళ కృషి చేసి, అమూల్యమైన జ్ఞానసంపదను మనకోసం వదిలి వెళ్ళిన, ఇటీవలే శతజయంతి సంవత్సరంలో కి అడుగుపెట్టిన, అడుగుపెట్టబోతున్న కొంతమంది సాహితీమూర్తుల జీవితవిశేషాలను స్మరించుకుని, వారికి ఘన నివాళులర్పించడం మన కనీస ధర్మం అని, వారి రచనలను చదవడం ద్వారా అలనాటి కాలమాన పరిస్థితులు, సామాజిక స్థితిగతులు తేటతెల్లంగా తెలుస్తాయి అన్నారు”. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతమంది కవులను, పండితులను ఒకేసారి ఒకేవేదిక మీద స్మరించుకుని, భావితరాల కోసం వారు వదిలి వెళ్ళిన ఈ గొప్పసంపదను ఒకసారి తడిమి చూసుకోవడం ఒక్క తానా ప్రపంచసాహిత్యవేదికకే చెల్లింది అన్నారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి, స్వయంగా సాహితీవేత్త అయిన ఆచార్య డా. వెలుదండ నిత్యానంద రావు మాట్లాడుతూ ఇదొక అపూర్వ సమ్మేళనం అని, ఈ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సాహితీమూర్తులలో కొంతమందితో తనకు ప్రత్యక్ష సాహిత్యానుబంధం కల్గిఉండడం తన అదృష్టమని, వారి సాహిత్య కృషి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని, వారందరికీ ఘన పుష్పాంజలి, గత 5 సంవత్సరాలగా వివిధ సాహిత్య అంశాలపై ప్రతి నెలా ఆఖరి ఆదివారం క్రమం తప్పకుండా నిభద్దతతో కార్యక్రమాలు చేస్తున్న తానా ప్రపంచసాహిత్యవేదికకు అభినందనలు అన్నారు”. శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సాహితీ మూర్తుల జీవితాలగురించి, వారి సాహిత్యకృషి గురించి ఈ క్రింద పేర్కొన్న విశిష్టఅతిథులు సోదాహరణంగా వివరించారు: శ్రీ గండూరి (జి.) కృష్ణ (1924-2001), ప్రముఖ పాత్రికేయులు, రచయిత గురించి - శ్రీమతి గండూరి (యామిజాల) రాజీవ, జి. కృష్ణ గారి కుమార్తె, ప్రముఖ పాత్రికేయురాలు; శ్రీ కె. ఎల్. నరసింహారావు (1924-2003), ప్రముఖ నాటకరచయిత, నటులు గురించి - శ్రీ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వాధ్యక్షులు; డా. ఆవంత్స సోమసుందర్ (1924-2016), అభ్యుదయవాద కవి, విమర్శకులు, రచయిత గురించి - ఆచార్య డా. యస్వీ సత్యనారాయణ, అభ్యుదయ రచయిత, పూర్వ ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; శ్రీ “శారద” (ఎస్. నటరాజన్) (1925-1955), ప్రముఖ తెలుగు కథారచయిత, నవలారచయిత గురిచి - శ్రీ కొత్తపల్లి రవిబాబు, “ప్రజాసాహితి” మాసపత్రిక ప్రధానసంపాదకులు; ఆచార్య డా. బిరుదురాజు రామరాజు (1925-2010), జానపద గేయసాహిత్యంలో దిట్ట, ప్రముఖరచయిత గురించి డా. సగిలి సుధారాణి, పరిశోధకురాలు-‘తమిళనాట స్త్రీల జానపద కథనాలు”, రచయిత్రి; డా. దాశరథి కృష్ణమాచార్యులు (1925–1987), ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ విముక్తి సాయుధ పోరాటయోధుడు గురించి - డా. పి. విజయకుమార్, సహాచార్యులు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం; కళాప్రపూర్ణ ఆరుద్ర (భాగవతుల సదాశివశంకర శాస్త్రి) (1925-1998), అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు గురించి - ఆచార్య డా. మేడిపల్లి రవికుమార్, ప్రముఖ సాహిత్యవిమర్శకులు, పూర్వ తెలుగువిభాగాధిపతి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి; శ్రీ కొడాలి గోపాలరావు (1925-1993), ప్రముఖ శతాథిక నాటకాల రచయిత గురించి - డా. కందిమళ్ళ సాంబశివరావు, ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ నాటకఅకాడమీ పూర్వ ఉపాధ్యక్షులు; శ్రీ ఆలూరి బైరాగి (1925-1978), ప్రముఖ కవి, కథా రచయిత, మానవతావాది గురించి – శ్రీ బండ్ల మాధవరావు, ప్రముఖ కవి, రచయిత, ‘సాహితీమిత్రులు’; శ్రీమతి బొమ్మరాజు భానుమతి (1926-20005), ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు, ఫిల్మ్ స్టూడియో అధినేత్రి గురించి - శ్రీ భరద్వాజ రంగావఝుల, ప్రముఖ పాత్రికేయులు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను స్పృశించి సభను రంజింపజేశారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును: https://youtube.com/live/gf2INE_lbpk -
శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్, అమెరికా సర్జన్ జనరల్, వైస్ అడ్మిరల్ వివేక్ మూర్తి, అంతర్జాతీయ ద్రవ్య నిధి మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ సహా 600 మందికి పైగా భారతీయ అమెరికన్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సైతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. వైట్‌హౌజ్‌లోని బ్లూ రూమ్‌లో అధ్యక్షుడు బైడెన్ ప్రమిదను వెలిగించారు. అనంతరం కిక్కిరిసిన ఈస్ట్‌రూమ్‌లో బైడెన్ మాట్లాడారు. ఈ సందర్భంగా దక్షిణాసియా అమెరికన్లను కొనియాడారు. ‘‘శ్వేతసౌధం చరిత్రలోనే అతిపెద్ద దీపావళి వేడుకలు నా హయంలో జరగడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. మా ప్రభుత్వ పాలనలో దక్షిణాసియా అమెరికన్లు కీలక పాత్ర పోషించారు. కమల హారిస్ నుంచి వివేక్ మూర్తి దాకా మీలో ఎంతో మంది నా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ అమెరికాకు మరో గొప్ప పరిపాలనావ్యవస్థను అందించారు’’ అని అన్నారు. తర్వాత ట్రంప్ పాలనపై విమర్శలు గుప్పించారు. ‘‘ 2016 నవంబర్ తర్వాత అమెరికాలో వలసదారులు ముఖ్యంగా దక్షిణాసియా అమెరికన్లపై విద్వేష మేఘాలు కమ్ముకున్నాయి. వాటిని పారదోలిన విజయగర్వంతో మేం అధికారంలోకి వచ్చాం. ఆనాడు ఉపాధ్యక్షురాలు కమలా హారిస ఇంట్లో మేం దీపావళి వేడుకలు జరుపుకున్నాం. హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కులు అందరం కలిసి దీపావలి వేడుక చేసుకున్నాం. మనందరి సమైక్య శక్తి ప్రమిదల వెలుగును అమెరికా గుర్తుంచుకుంటుంది. దక్షిణాసియా అమెరికన్లు ప్రతి అమెరికన్ జీవితాన్ని మరింత మెరుగుపరిచేందుకు కృషిచేశారు. అంతగా కష్టపడతారుకాబట్టే ఇప్పుడు అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న వర్గంగా మీరంతా నిలిచారు. ఈ వెలుగుల పథాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ఈ వెలుగు ఒకప్పుడు అనుమానపు చీకట్లో మగ్గిపోయేది. ఇప్పుడు శ్వేతసౌధంలో సగర్వంగా ప్రకాశిస్తోంది. ఇంతటి ప్రగతికి మేం సాక్ష్యంగా నిలిచాం’’ అని భారతీయులను బైడెన్ పొగిడారు. అరుదైన అవకాశం: సునీతా విలియమ్స్నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రికార్డ్ చేసిన వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీపావళి జరుపుకునే అరుదైన అవకాశం నాకు అనుకోకుండా లభించింది. దీపావళి, ఇతర భారతీయ పండుగల గురించి మాకు బోధించి భారతీయ సాంస్కృతిక మూలాలను నాకు అందించిన మా నాన్నగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ రోజు భారతీయులతో దీపావళి జరుపుకొంటున్నందుకు, భారతీయుల సహకారాన్ని గుర్తించినందుకు అధ్యక్ష్య, ఉపాధ్యక్షులకు నా ధన్యవాదాలు’’ అని సునీతా తన సందేశంలో వ్యాఖ్యానించారు. -
కెనడా డ్రీమ్స్ : వాక్-ఇన్ ఓవెన్లో శవమై తేలిన వాల్‌మార్ట్ ఉద్యోగి
కెనడాలోని హాలిఫాక్స్‌లోని వాల్‌మార్ట్ వాక్-ఇన్ బేకరీ ఓవెన్లో వాల్‌మార్ట్ ఉద్యోగి, ఇండియాకు చెందిన సిక్కు యువతి శవమై తేలడం దిగ్భ్రాంతి రేపింది. మృతురాలిని ఈ బేకరీలోనే పనిచేస్తున్న 19 ఏళ్ల గుర్ సిమ్రాన్ కౌర్‌గా మారిటైమ్ సిక్కు సొసైటీ ధృవీకరించింది. కౌర్ మృతదేహాన్ని తొలుత గుర్తించిన ఆమె తల్లి అంతులేని దుఃఖంలో మునిగిపోయింది. బతికి ఉండగానే ఓవెన్లో వేసి కాల్చారనే అనుమానాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఎన్నో కలలతో కెనడాకు వచ్చిన అందమైన యువతి అత్యంత విషాదంగా ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చింది. హాలిఫాక్స్ వాల్‌మార్ట్ ఆమె మరణంపై విచారంపై ప్రకటించింది. కాగా ఇండియాకు చెందిన కౌర్ , ఆమె తల్లి మూడేళ్ల క్రితం కెనడాకు వెళ్లారు. కౌర్ తండ్రి, సోదరుడు భారతదేశంలోనే ఉన్నారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ గత రెండేళ్లుగా మమ్‌ఫోర్డ్ రోడ్ వాల్‌మార్ట్‌లో పని చేస్తున్నారు. ఇద్దరూ స్థానిక సిక్కు కమ్యూనిటీలోమంచి పేరు తెచ్చుకున్నారు. అక్టోబర్ 19, శనివారం, కౌర్ తల్లి వాల్‌మార్ట్ స్టోర్ తెరిచి ఉండగానే బేకరీ డిపార్ట్మెంట్లో కాలిపోయిన తన బిడ్డను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఇంత విషాదకరమైన నష్టానికి క్షమించండి అంటూ మారిటైమ్ సిక్కు సొసైటీ అధ్యక్షుడు హర్జిత్ సెయాన్ ప్రకటించారు. మరోవైపు అంత్యక్రియల ఖర్చులకు సహాయం, కౌర్ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులను కెనడాకు తరలించేందుకు గోఫండ్‌బీ కేవలం 10 గంటల్లో (గురువారం మధ్యాహ్నం నాటికి దాదాపు ఒక లక్ష, 30వేల డాలర్ల ఫండ్‌ను సేకరించింది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. వాల్‌మార్ట్‌ను మూసివేశారు. కౌర్ మరణం ఎలా సంభవించిందని అనేదానిపై ఇంకా ఎలాంటి క్లూ లభించలేదని హాలిఫాక్స్ ప్రాంతీయ పోలీసు అధికారి మార్టిన్ క్రోమ్‌వెల్ చెప్పారు. కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. వాల్‌మార్ట్‌ను మూసివేశారు. -
హెచ్1బీ వీసా రెన్యువల్ కోసం తిప్పలు!
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న మనోళ్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అంటే అందరికీ కాదులెండి కొంత మందికి మాత్రమే. అమెరికా అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వీసా. ఇది లేకపోతే అక్కడికి వెళ్లడం కుదరని అందరికీ తెలుసు. యూఎస్ వీసా రావాలంటే ఎంత కష్టపడాలో తెలుకోవాలంటే.. అది దక్కించుకున్న వారిని అడిగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. యూఎస్ వీసా దక్కించుకోవడానికే కాదు.. రెన్యువల్ కూడా కష్టపడాల్సి వస్తోందట. ఈ విషయాన్ని ఓ ఎన్నారై సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వీసా రెన్యువల్ కష్టాలను పీడకలగా పేర్కొంటూ ‘రెడిట్’లో తన వ్యథను వ్యక్తపరిచాడు.హెచ్1బీ వీసా రెన్యువల్ (H1B visa renewal) కోసం ముప్పు తిప్పలు పడుతున్నట్టు అమెరికాలోని భారత పౌరుడొకరు వాపోయాడు. తనలాగే ఎవరైనా ఉంటే బాధలు పంచుకోవాలని కోరాడు. ‘నెల రోజుల నుంచి హెచ్1బీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ల కోసం వెతుకుతున్నాను. నవంబర్‌లోపు స్టాంప్ వేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాలి. కానీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ దొరికేట్టు కనబడడం లేదు. ఈ పరిస్థితి నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీసా రెన్యువల్ స్లాట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. నాలాగే ఎవరైనా ఉన్నారా? మనం ఇప్పుడు ఏం చేయాల’ని తన గోడు వెళ్లబోసుకున్నాడు.తాము కూడా వీసా రెన్యువల్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నామంటూ పలువురు ఎన్నారైలు స్పందించారు. ‘నేను కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాను. నవంబర్ లేదా డిసెంబర్ స్లాట్ల కోసం వెతుకుతున్నా.. కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు. నేను ఎలాగైనా ఇండియా వెళ్లాలి. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ త్వరలో విడుదలవుతాయని ఆశిస్తున్నాన’ని ఒకరు తెలిపారు. ‘వీసా రెన్యువల్ కోసం వేలాది మంది ఆగస్ట్ నుంచి ఎదురు చూస్తున్నారు. నవంబర్, డిసెంబర్ స్లాట్లను జూలైలో తెరిచారు. మరికొన్ని స్లాట్ కూడా త్వరలో విడుదలవుతాయి. కానీ స్లాట్లు దొరకడం కష్టమ’ని మరొకరు పేర్కొన్నారు. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ గ్యారంటీ లేకపోవడంతో తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోలేకపోతున్నామని ఇంకొరు వాపోయారు.డ్రాప్‌బాక్స్ స్కీమ్ అంటే?డ్రాప్‌బాక్స్ స్కీమ్ ప్రకారం దరఖాస్తుదారులు వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరుకాకుండా వీసా పునరుద్ధరణ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. భారత పౌరులు సమర్పించిన పత్రాలను చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ ప్రాసెస్ చేస్తుంది. రెన్యువల్ కోసం దరఖాస్తుదారులు తమ పత్రాలను భారతదేశంలోని వీసా కేంద్రాలలో ఎక్కడైనా సమర్పించేందుకు వీలుంది. అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ వీసా వినియోగదారులు తమ డ్రాప్‌బాక్స్ అపాయింట్మెంట్ల కోసం ఇండియాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ కేవలం 2 రోజుల ముందు స్లాట్లు విడుదల చేస్తోంది. దీంతో అమెరికా నుంచి ఇండియా రావడానికి హెచ్1బీ వీసా వినియోగదారులు కష్టపడాల్సి వస్తోంది. H1B Dropbox Visa Slots for India are a Nightmare!byu/AccomplishedPolicy94 inusvisaschedulingచదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్ -
చికాగో ఫ్యాన్స్ మీట్లో శృతిహాసన్ సందడి
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకుంది. సింగర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లోకనాయకుడు కమల్‌హాసన్ గారాలపట్టిగా బోల్డెంత పేరు ఉన్నప్పటికి ..తన సొంత టాలెంట్, గ్లామర్‌తో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ.. టాప్ హీరోయిన్గా వెలుగుతోంది. పలు సేవా కార్యక్రమంలో పాలుపంచుకునే శృతిహాసన్ రీసెంట్గా అమెరికాలో పర్యటించారు. చికాగోలోని ఫ్యాన్స్ మీట్లో పాల్గొని..సందడి చేశారు.సాక్షి, HR PUNDITS పార్టనర్షిప్ గా.. పక్కాలోకల్ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ లో శృతి హాసన్ బార్బీ డాల్‌గా మెరిసిపోతూ.. అభిమానులను కుష్ చేశారు. ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాసన్ ను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. వేదికపై శృతిహాసన్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాకుండా వారి కోరిక మేరకు సాంగ్స్ కూడా పాడారు. అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఫ్యాన్స్ తో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా నిర్వహకులు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. శృతి హాసన్ తన సినీ కెరీర్ కు సంబంధించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. చికాగో తనకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైనా స్టయిల్ లో సమాధానం ఇచ్చారు.ఈ ఈవెంట్ లో శృతి హాసన్ సినిమాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఆమె సినిమాలకు సంబంధించి పలు ప్రశ్నలను అభిమానులను అడిగారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి శృతిహాసన్ ఆటోగ్రాప్ చేసిన టీషర్ట్లను అందజేశారు. ఇక ప్రముఖ ఎన్నారై కె.కె. రెడ్డి.. శృతిహాన్కు సర్ప్రైజ్ గిప్ట్ ఇచ్చారు. ఇక అందమైన ఫోటో ఫ్రేమ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించిన నిర్వహకులకు.. శృతిహాసన్ కృతజ్ఞతలు తెలిపారు. -
న్యూజెర్సీలో బ్రెస్ట్ కేన్సర్‌పై నాట్స్ వాక్ అండ్ టాక్ ఈవెంట్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో బ్రెస్ట్ కేన్సర్‌పై వాక్ అండ్ టాక్ ఈవెంట్ నిర్వహించింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ మాసంగా భావించి దానిపై చైతన్యం తీసుకొస్తుంటారు. దీనిలో భాగంగానే నాట్స్ బ్రెస్ట్ కేన్సర్ పై తెలుగువారిని అప్రమత్తం చేసేందుకు ఈ వాక్ అండ్ టాక్ నిర్వహించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ పాస్ట్ చైర్ ఉమెన్ అరుణ గంటి లు సారథ్యం వహించారు. న్యూజెర్సీలో స్థానిక తెలుగు వైద్యులు బ్యూలా విజయ కోడూరి, చరిష్మా భీమినేనిలు ఇందులో పాల్గొని విలువైన సూచనలు చేశారు. ప్రతి ఎనిమిది మంది మహిళలలో ఒకరికి బ్రెస్ట్ కేన్సర్ నిర్ధారణ అవుతున్న ఈ రోజుల్లో, బ్రెస్ట్ కేన్సర్‌ని ఎలా గుర్తించాలి..? బ్రెస్ట్ కేన్సర్ పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలను, 40 ఏళ్ళ వయసు దాటిన స్త్రీలకు మామోగ్రామ్ పరీక్ష అవశ్యకతను ఈ ఈవెంట్లో చక్కగా వివరించారు. కేన్సర్‌పై మహిళల సందేహాలను నివృత్తి చేశారు. తెలుగువారి కోసం న్యూజెర్సీలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి అన్నారు. అన్నింటి కంటే ఆరోగ్యం చాలా విలువైనదని.. దానిని కాపాడుకోవడంపై అందరూ దృష్టి పెట్టాలని మందాడి కోరారు. రోజు వారీ బిజీ లైఫ్‌లో ఆరోగ్యాన్ని విస్మరించడం వల్లే అనేక వ్యాధులు చుట్టుముడుతున్నాయని అన్నారు.. ఈ సమయంలో తెలుగువారిని ఆరోగ్యం పట్ల అప్రమత్తం చేసేందుకు బ్రెస్ట్ కేన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఈ వాక్ అండ్ టాక్ నిర్వహించామని శ్రీహరి మందాడి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ మాజీ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలితో పాటు నాట్స్ న్యూజెర్సీ ఉమెన్ యెంపవర్మెంట్ టీమ్ శ్రీదేవి జాగర్లమూడి , ప్రణీత పగిడిమర్రి, ప్రసూన మద్దాలి, శ్రీదేవి పులిపాక, ఇందిరా శ్రీరామ్, స్వర్ణ గడియారం, గాయత్రి చిట్టేటి ఈవెంట్ విజయవంతంలో కీలకపాత్ర వహించారు. న్యూ జెర్సీ నాట్స్ నాయకులు రాజ్ అల్లాడ, మురళీకృష్ణ మేడిచెర్ల, కిరణ్ మందాడి, శ్రీనివాస్ మెంట, ప్రసాద్ టేకి, వెంకటేష్ కోడూరి, రాకేష్ వేలూరు, కృష్ణసాగర్ రాపర్ల, హరీష్ కొమ్మాలపాటి, రామకృష్ణ బోను పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కొరకు వాక్ అండ్ టాక్ నిర్వహించిన నాట్స్ న్యూజెర్సీ విభాగాన్ని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: -
డల్లాస్‌లో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్ టోర్నీ
అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేసే విధంగా నాట్స్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే నాట్స్ డల్లాస్ విభాగం గాంధీ జయంతి పురస్కరించుకుని వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. డల్లాస్‌లో నాట్స్ నిర్వహించిన ఈ 16వ వాలీబాల్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. దసరా పండుగ రోజు దాదాపు 200 మంది వాలీబాల్ ప్లేయర్స్ ఈ టోర్నీలో పాల్గొన్ని క్రీడా స్ఫూర్తిని చాటారు.డల్లాస్ చాప్టర్ క్రీడా కోఆర్డినేటర్లు గౌతమ్ కాశిరెడ్డి, విజయ్ బల్లా తమ అపార అనుభవం, ప్రతిభాపాటవాలు రంగరించి ప్రణాళిక నుండి కార్యాచరణ వరకు టోర్నీని దిగ్విజయం చేశారు. నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల అందించిన మద్దత్తు దిశానిర్దేశం వల్ల తమ మొదటి కార్యక్రమం ఇంత విజయవంతం అయిందని నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ స్వప్న కాట్రగడ్డ తెలిపారు. అందరి క్రీడా స్ఫూర్తి వల్ల నాట్స్ డల్లాస్ చాప్టర్ సభ్యులకు ఈ టోర్నమెంట్ మరిచిపోలేని అనుభవంగా మిగిలిందని, మరిన్ని మంచి కార్యక్రమాలు చేయటానికి ప్రోత్సాహం ఇచ్చిందని డల్లాస్ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రావణ్ నిడిగంటి అన్నారు.నాట్స్ డల్లాస్ 16వ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులను, సహకరించిన వాలంటీర్స్, వారిని ప్రోత్సహించడానికి వచ్చిన వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు డల్లాస్ చాప్టర్ టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ టోర్నమెంట్లో తలపడిన జట్లని రెండు విభాగాలుగా విభజించారు. ప్రో కేటగిరీ విభాగంలో విజేతలుగా వాలీ వోల్ఫ్స్ జట్టు, రన్నర్స్ గా వజ్రాస్ జట్టు నిలిచాయి. అలానే, అడ్వాన్స్డ్ విభాగంలో విజేతలుగా వికింగ్స్ జట్టు నిలవగా, రన్నర్స్ గా వాలీ డూడ్స్ జట్టు నిలిచింది.విజేతలకు, రన్నర్స్ కు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న నాట్స్ నాయకులు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి,నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాలలు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న విద్యార్థులు , యువతతో కూడిన జట్టులను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పెద్దవారితో పోటీపడి అత్యంత ప్రతిభని ప్రదర్శించిన 8వ తరగతి విద్యార్థి కార్తీక్ కు ప్రత్యేక గుర్తింపునిస్తూ గిఫ్ట్ కార్డుని బహుమతిగా ఇవ్వడం జరిగింది.ఇక ఈ టోర్నమెంటు నిర్వహణలో నాట్స్ డల్లాస్ చాప్టర్ టీం నుండి గౌతమ్ కాశిరెడ్డి, విజయ్ బల్లా, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు రవి తాండ్ర మరియు కిషోర్ నారెలు, డల్లాస్ చాప్టర్ సభ్యులు శ్రీధర్ విన్నమూరి, పవన్ కొతారు, త్రినాథ్ పెద్ది, వంశీ వేణాటి, కావ్య, బద్రి బియ్యపు,ఇతర సభ్యులు తమ వంతు సహకారాన్ని అందించారు.ఇదే విధంగా భవిష్యత్తులో మరెన్నో సాంసృతిక మరియు క్రీడా కార్యక్రమాలకు చేపట్టబోతున్నామని డల్లాస్ చాప్టర్ టీం తెలిపింది. ఈ టోర్నమెంట్ కు సహకరించిన దాతలు స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమి, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, మరియు ఫార్మ్2కుక్ లకు డల్లాస్ చాప్టర్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి డల్లాస్ టీంకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు
అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ని డాలస్‌లో స్థాపించి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో దశమ వార్షికోత్సవ వేడుకలు గత ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ నిర్మాణంలో సహకరించిన దాతలకు, అధికారులకు అభినందన పూర్వక విందు సమావేశం ఇర్వింగ్ నగరంలో ఉన్న విండాం హోటల్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో శ్రీకరి లంకా వీణానాదం; చక్రి పైలా శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు గాంధీ ఆశయాలపై చేసిన ప్రసంగాలు, రవీంద్ర గుడిమెళ్ళ, సమీర శ్రీపాద శిక్షణలో పాల్గొన్న సింధు గుడిమెళ్ళ, సంయుక్త గుడిమెళ్ళ, అన్షు చుండి, అయేషాని చుండి, సంహిత్ చిలకమర్రి, రిత్విక లక్కిరెడ్డి, అభినవ్ కార్తీక్ లక్కిరెడ్డి, సమన్విత మాడా, పవన్ కుమార్ గడగండ్ల, రవీంద్ర గుడిమెళ్ళ, శ్రీకర్ దేసు లు గానం చేసిన దేశభక్తి గీతాలు; సింధుజ ఘట్టమనేని శిక్షణలో పాల్గొన్న నందిత దినేష్, గ్రీష్మ అశోక్, తేజస్విని శర్వణన్, నక్షత్ర నల్లమోతు, నిత్య ఆవాల, ఆర్షియ మాచవోలు, ప్రియ దర్శిని కృష్ణమూర్తి, రుషిక కల్ల, సహన కార్తీక్, శ్రీనిత ఆర్కాటి, రియ బూర, వీక్షవ్ సురకంటి, ప్రణిత కొసరాజు, నేహశ్రీ పిల్లా, ప్రిష మదన్, సరయు తూనుగుంట్ల, అకిర తేర, నిహారిక కొండూరు, సాన్విక కొలన్పాక, ఆద్యవర్మ కొండూరు బృందం వందేమాతరం, జనగణమన గీతాలకు అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నాయకత్వానికి దశమ వార్షికోత్సవ శుభాకాంక్షలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులకు శుభాశ్సీసులు తెలియజేసిన ప్రత్యేక అతిథులుగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ ప్రోటెం డెన్నిస్ వెబ్, కౌన్సిల్ మెంబర్ అబ్దుల్ ఖబీర్, కాపెల్ నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యు, రమేశ్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ ఉపాధ్యక్షులు గోపాల్పోణంగిలను మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వాల, బోర్డు సభ్యులు మురళి వెన్నం, రన్నా జానీ, జాన్ హామండ్, కమల్ కౌశల్, బి.ఎన్ రావు, తాయాబ్ కుండావాల, సి.సి తియోఫిన్, స్వాతి షా, షబ్నం మాడ్గిల్ లు సత్కరించారు.కాపెల్ నగర కౌన్సిల్ సభ్యులు బిజూ మాత్యు మరియు రమేశ్ ప్రేమ్ కుమార్ లు కాపెల్ నగర మేయర్ మహాత్మా గాంధీ మెమోరియల్ ను అభినందిస్తూ చేసిన అధికారిక అబినందన పత్రాన్ని (ప్రోక్లమేషన్), మరియు ఇర్వింగ్ నగర మేయర్ వ్రాసిన ప్రశంసా పత్రాన్ని మేయర్ ప్రోటెం డెన్నిస్ వెబ్ లు డా. ప్రసాద్ తోటకూర కు అందజేశారు.ఇటీవలే గాంధీ మెమోరియల్ గవర్నెన్స్ బోర్డు సభ్యులుగా నియమితులైన రాంకీ చేబ్రోలు, జాన్ హామండ్, రన్నా జానీ, కిషోర్ కంచర్ల, తిరుమలరెడ్డి కుంభం, లోకేష్ నాయుడు కొణిదల, అనంత్ చౌదరి మల్లవరపు, అక్రం సయ్యద్, డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట్ల, వినోద్ ఉప్పు, రాజేంద్ర వంకావాల లను డా. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేసి తోటి సభ్యులతో కలసి వారందరినీ సన్మానించారు.మహాత్మాగాంధీ విగ్రహాన్ని తయారుచేసిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత, విజయవాడకు చెందిన బుర్రా శివ వరప్రసాద్, గుజరాత్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు జిగర్ సోనీను మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులందరూ కలసి ఘనంగా సన్మానించారు. షబ్నం మాడ్గిల్ వందన సమర్పణతో, రుచికరమైన విందు భోజనంతో ఈ దశమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.(చదవండి: కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు) -
కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో కాలేజీ అడ్మిషన్ల సంసిద్ధతపై అవగాహన సదస్సు నిర్వహించింది. విద్యార్ధులు అత్యుత్తమ కాలేజీల్లో ఎలా సీట్లు పొందాలి.? దానికి ముందుస్తుగా ఎలాంటి కసరత్తు చేయాలి.? ఎలాంటి పరీక్షలకు సిద్ధం కావాలి.? మిడిల్ స్కూల్, హైస్కూల్ స్థాయిలోనే దానిని ఎలా సన్నద్దమవ్వాలనే కీలక విషయాలపై ఈ సదస్సు ద్వారా నాట్స్ అవగాహన కల్పించింది. సెడార్ రాపిడ్స్, మారియన్, రాబిన్స్, హియావత నగరాల నుండి పలువురు భారతీయ తల్లిదండ్రులు, విద్యార్ధులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. అయోవా నాట్స్ చాప్టర్ సమన్వయకర్త శివ రామ కృష్ణారావు గోపాళం ఈ సదస్సుకు అనుసంధానకర్త వ్యవహారించారు. కృష్ణ ఆకురాతి, సాగర్ పురాణం, జగదీష్ బాబు బొగ్గరపులు ఈ సదస్సులో ఎన్నో విలువైన సూచనలు చేశారు. తల్లిదండ్రుల, విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేశారు.. విద్యార్ధుల చక్కటి భవిష్యత్తుకు బాటలు వేసే ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని శివ రామకృష్ణారావు గోపాళం తెలిపారు. తల్లిదండ్రులకు, విద్యార్ధులకు కాలేజీ ప్రవేశాలపై చక్కటి అవగాహన ఇలాంటి సదస్సుల వల్ల లభిస్తుందన్నారు. నాట్స్ తెలుగువారి కోసం కోసం ఇంత చక్కటి సదస్సును ఏర్పాటు చేసినందుకు తల్లిదండ్రులు నాట్స్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు గిరీష్ కంచర్ల, నవీన్ ఇంటూరి అవసరమైన ఆహార ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తమ వ్యక్తిగత అనుభవాలను వివరించిన హిమాన్షు భూషణ్, రవి కొంపెల్లాలకు నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. సుమన్ ఒంటేరు ఫోటోగ్రాఫింగ్, ఆడియో విజువల్ సిస్టమ్‌లలో సహాయం చేసినందుకు నాట్స్ అభినందించింది. అయోవాలో కాలేజీ ప్రిపరేషన్ అవగాహన సదస్సు విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: లండన్‌లో ఘనంగా దసరా అలాయి బలాయి) -
కెనడా, భారత్ గొడవ.. మనోళ్ల పరిస్థితి ఏంటి?
Indians in Canada: ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించి వివాదానికి తెరలేపారు. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో కెనడా చేర్చడంతో వివాదం మరింత ముదిరింది. కెనడా చర్యలకు నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. కెనడా నుంచి తమ రాయబారి, దౌత్యాధికారులను కూడా వెనక్కి రప్పించింది భారత్. దీంతో రెండు దేశాల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి.ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో భారతీయుల పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కెనడాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కెనడా ఇమ్మిగ్రెంట్స్‌లో భారతీయులు నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం. ముఖ్యంగా అధిక సంఖ్యలో ఉన్న సిక్కులు అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కెనడాలోని భారతీయులు అక్కడి ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య లావాదేవీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్నాయి. కాగా, తాజా పరిస్థితులు తమపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని కెనడాలోని భారతీయులు ఆందోళన చెందుతున్నారు. విద్య, ఉద్యోగాల కోసం కెనడా వెళ్లాలనుకునే వారు ఆలోచనలో పడ్డారు.మనోళ్లే ముందు2021 అధికారిక లెక్కల ప్రకారం.. కెనడాలో నివసిస్తున్న భారత వలసదారుల సంఖ్య 28 లక్షలు. వీరిలో భారత సంతతికి(పీఐఓ) చెందిన వారు 18 లక్షలు, ఎన్నారైలు 10 లక్షల మంది ఉన్నారు. కెనడా పౌరుల్లో 7.3 లక్షల మంది హిందువులు, 7.7 లక్షల మంది సిక్కులు ఉన్నారు. కెనడాలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా (45 శాతం) ఉన్నారు. ప్రస్తుతం 4.27 లక్షల మంది విద్యార్థులు కెనడాలో విద్యనభ్యసిస్తున్నారు. తాత్కాలిక ఉపాధి పొందుతున్న విదేశీ కార్మికుల్లోనూ మనోళ్లే (22 శాతం) ముందున్నారు. శాశ్వత నివాసం ప్రకటించిన పీఆర్ పథకం కింద అత్యధికంగా 27 శాతం మంది భారతీయులు లబ్ది పొందారు. గత 20 ఏళ్లలో కెనడాలోని భారతీయుల సంఖ్య రెండింతలు పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఆ నగరాల్లోనే ఎక్కువకెనడా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2017లో 44.3 శాతం మంది, 2018లో 49.2, 2019లో 55.8, 2020లో 58.4, 2021లో 61.1 శాతం మంది ఇండియన్స్ కెనడా పౌరసత్వం దక్కించుకున్నారు. వాంకోవర్, టొరంటో, ఒట్టావా, వినీపెగ్, కాల్గారి, మాంట్రియల్ నగరాల్లో భారతీయులు అధికంగా నివసిస్తున్నారు. కెనడాలో ఉన్న భారతీయుల్లో 50 శాతం ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో మేనేజ్మెంట్ స్థాయి జాబుల్లో ఉన్నవారు కేవలం 19 శాతం మాత్రమే. కెనడాలోని వలస భారతీయుల్లో పన్నులు చెల్లిస్తున్నవారు 42 వేల మంది వరకు ఉన్నారు.చదవండి: ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు.. భారత ఇంజనీర్ ఘనతవాణిజ్యంపై ప్రభావంభారత్, కెనడా దేశాల మధ్య 2023-24 మధ్య కాలంలో 8.9 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు, దిగుమతులు జరిగాయి. కెనడా భారత్ ఎగుమతులు 4.4 బిలియన్ డాలర్లు కాగా, కెనడా నుంచి ఇండియాకు దిగుమతులు 4.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కెనడా నుంచి భారత్‌కు ఎక్కువగా పప్పులు ఎగుమతి అవుతుంటాయి. తాజాగా రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో బయ్యర్లు ఆస్ట్రేలియా నుంచి దిగుమతులు పెంచారు. భారత్ నుంచి ఆభరణాలు, విలువైన రాళ్లు, రెడీమేడ్ దుస్తులు, ఫార్మా ఉత్పత్తులు కెనడాకు ఎగుమతి అవుతుంటాయి. కాఫీ చెయిన్ టిమ్ హార్టన్, ఫ్రోజోన్ ఫుడ్ కంపెనీ మెక్కెయిన్ సహా ఇండియాలో 600 పైగా కెనడా కంపెనీలు ఉన్నాయి. ఇండియాలో కెనడా పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు 75 బిలియన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనా. -
లండన్‌లో ఘనంగా దసరా అలాయి బలాయి
హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డపై అలాయి బలాయి సాంస్కృతికి నాంది పలికారు. ప్రతి దేశంలో ఇప్పుడు ఎన్నో కుల సంఘాలు మత సంఘాలు రాష్ట్ర సంఘాలు, జిల్లా సంఘాలు ఇలా తెలుగు వారందరూ ఏదో ఒక సంస్థ ద్వారా సంఘాల ద్వారా విడిపోయి ఉన్నారు అందరిని కులాలకు మతాలకు అతీతంగా అందరిని ఒక వేదికపై తీసుకువచ్చి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలే కలిసి ఉండాలని చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని సీక్క చంద్ర శేకర్ అన్నారు.ఈ కార్యక్రమానికి యూకే నలుముల నుండి వచ్చిన మిత్రులు వివిధ రాజకీయ పార్టీలకు, సంస్థలకు చెందిన ప్రముఖులు, డాక్టర్స్ ,ఇంజనీర్స్ వివిధ వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు అందరూ ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇలానే ప్రతి ఏడాది ఇంకా అంగరంగ వైభవంగా చేసుకోవాలని కొనియాడారు. వివిధ తెలంగాణ రుచికరమైన వంటలు ఈ కార్యక్రమం లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. సౌత్ఆల్ మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ,గారికి మొదటిగా అలయ్ బలై కండువా కప్పి ప్రారంభించడం జరిగింది. ఒక మంచి న్యూట్రల్ వేదిక (తటస్థ వేదిక)కు నాంది పలకడం కూడా ఎంతో ఆనంద దాయకం అన్ని అలై బలై సభ్యులు కొనియాడారు..ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ కూడా ఎంతో మంది మిత్రులను కలిసిన సందర్బాలు తక్కువ. దశాబ్దాల కిందటి మిత్రులను కూడా ఈ వేదిక ద్వారా కలుసుకోవడం అలాగే ఎటువంటి జెండా, అజెండా ఈ కార్యక్రమానికి లేదని ఇది కేవలం స్నేహపూర్వక కలయికే. జమ్మి ఆకు ఇచ్చి పుచ్చుకొని అందరూ అలైబలే చెప్పుకొని తారతమ్యాలను మరచి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నారని ఈ సందర్భంగా సభ్యులు అతిధులు కొనియాడారు.(చదవండి: TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు) -
అమెరికాలో రోడ్డు ప్రమాదం
రేణిగుంట/ఓజిలి: అమెరికాలోని రాండాల్ఫ్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతిచెందిన వారిలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, మరో మహిళ సాఫ్ట్వేర్ ఇంజినీర్ భార్య. కేవీబీపురం మండలం అంజూరుపాళెంలో ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పని చేస్తున్న తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామానికి చెందిన డేగపూడి భాస్కర్‌రెడ్డి, లత దంపతులకు ఇద్దరు కుమార్తెలు.శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమార్తె హరిత (30)కు కేవీబీ పురం మండలం కాళంగి ఆదరం గ్రామానికి చెందిన సాయి (32) అనే వ్యక్తితో 2022లో వివాహం జరిగింది. సాయికి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. అతనితోపాటు ఆమె కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు వెళ్లి సాఫ్ట్వేర్ కంపెనీలో తనకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమెకు ఉద్యోగ అవకాశం వచ్చి మరో వారం రోజుల్లో ఉద్యోగంలో చేరనుంది.తొట్టంబేడు మండలం పెద్దకనపర్తికి చెందిన న్యాయవాది రమే‹Ùబాబు కుమారుడు శివ (29) సాయికి స్నేహితుడు. ఇతను కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినర్. ఓజిలి మండలం రాజపాళెం గ్రామానికి చెందిన తిరుమూరు రవి, సుదర్శనమ్మ దంపతుల కుమారుడు తిరుమూరు గోపి (30) కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇతను కూడా సాయికి స్నేహితుడు. సోమవారం సాయంత్రం సాయి, అతని భార్య హరిత, స్నేహితులు శివ, గోపి కలిసి కారులో వెళుతుండగా మరో కారు వీరి కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో హరిత, శివ, గోపి మృతి చెందగా.. సాయి తీవ్రంగా గాయపడ్డాడు.అయ్యో దేవుడా.. రాత్రే వీడియో కాల్ మాట్లాడారే..మృతిచెందిన వారు ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రే తల్లిదండ్రులతో మాట్లాడారు. ‘అయ్యో దేవుడా.. రాత్రే వీడియో కాల్లో నవ్వుతూ మాట్లాడారే. కబుర్లెన్నో చెప్పారే. రోజులో ఒక్కసారైనా మాతో మాట్లాడకుండా ఉండే వారు కాదు.. దేవుడా మా బిడ్డలను తీసుకుపోయావే... మేము ఇంకెట్టా బతికేది’ అంటూ గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. హరిత, శివ మృతదేహాలు ఆదివారానికి స్వగ్రామాలకు రానున్నాయి. కాగా అమెరికాలో జరిగిన ప్రమాదం ఒకే మండలానికి చెందిన ఇద్దరిని పొట్టనపెట్టుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. -
ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు..
SpaceX Sanjeev Sharma: అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఇటీవల చేసిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది. స్టార్ఫిష్ రాకెట్‌తో పాటు స్పేస్‌లోకి దూసుకెళ్లిన బూస్టర్ తిరిగి యథాస్థానానికి వచ్చేలా చేసిన ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షించింది. స్పేస్ రీసెర్చిలో అత్యద్భుతంగా పేర్కొంటున్న ఈ ప్రయోగాన్ని సౌత్ టెక్సాస్‌లోని స్టార్‌బేస్ నుంచి స్పేస్ఎక్స్ శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు. ఈ సెంటిస్టుల బృందంలో మనదేశానికి చెందిన సంజీవ్ శర్మ కీలకపాత్ర పోషించారు. ఆయనకు సంబంధించిన లింక్డిన్ ప్రొఫైల్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.అంచెలంచెలుగా ఎదిగి..శ్రీసాయి దత్తా అనే యూజర్ సంజీవ్ శర్మకు సంబంధించిన విద్యా, ఉద్యోగ వివరాలు ఎక్స్‌లో షేర్ చేశారు. ఫ్రం ఇండియన్ రైల్వేస్ టు స్పేస్ఎక్స్’ పేరుతో ఈ వివరాలను వెల్లడించారు. ఒకప్పుడు ఇండియన్ రైల్వేలో పనిచేసిన ఆయన పస్తుతం స్పేస్ఎక్స్ సంస్థలో ప్రిన్సిపల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ రోదసి ప్రయోగాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివి.. అంచెలంచెలుగా ఎదిగి అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్నారు.అమెరికాలో ఉన్నత విద్యరూర్కీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీర్ చదువు పూర్తైన తర్వాత సంజీవ్ శర్మ 1990లో ఇండియన్ రైల్వేలో డివిజినల్ మెకానికల్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. 1994లో డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా ఆయన ప్రమోషన్ లభించింది. 2001 వరకు ఈ జాబ్‌లో ఆయన కొనసాగారు. తర్వాత రైల్వే ఉద్యోగం వదిలిపెట్టి అమెరికా వెళ్లి కొలరాడో యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు. 2003లో సీగేట్ టెక్నాలజీ కంపెనీలో స్టాఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా చేరారు. ఇదే సమయంలో మిన్నెసోటా యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీలో మరో మాస్టర్ డిగ్రీ చేశారు. 2013లో స్పేస్ఎక్స్ సంస్థలో స్ట్రక్చర్స్ గ్రూప్ డైనమిక్స్ ఇంజినీర్‌గా జాబ్ సంపాదించారు. అక్కడ ఐదేళ్లు పనిచేసిన తర్వాత 2018లో మ్యాటర్నెట్ కంపెనీకి మారారు. మళ్లీ 2022లో స్పేస్ఎక్స్కు తిరిగొచ్చారు. ‘బూస్టర్’ ప్రయోగం సక్సెస్ నేపథ్యంలో సంజీవ్ శర్మ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది."From Indian Railways to SpaceX, From Building Trains to building Starships & catching them"Podcast of Sanjeev Sharma- Principal Engineer for #Starship Dynamicshttps://t.co/mzD2QEQTWa pic.twitter.com/fbDXXJf8sx— SRI SAIDATTA (@nssdatta) October 15, 2024ఓపిక అంటే ఇది..ఇండియన్ రైల్వే నుంచి స్పేస్ఎక్స్ వరకు సాగిన సంజీవ్ శర్మ విజయ ప్రస్థానంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ రైల్వేలో 11 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత ప్రైవేట్ సంస్థకు మారడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే సౌలభ్యాలు, సౌకర్యాలను వదులుకోవడానికి చాలా మంది ఇష్టపడరని నెటిజన్ ఒకరు పేర్కొన్నారు. ‘ఓపిక అంటే ఇది. స్పేస్ఎక్స్లో చేరడానికి ముందు సంజీవ్ శర్మకు 20 సంవత్సరాల కెరీర్ ఉంద’ని మరొకరు కామెంట్ చేశారు. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంజీవ్ శర్మ ప్రమోషన్ సంపాదించారంటే ఆయన ఎంత ప్రతిభావంతుడో అర్థమవుతోందని మరో నెటిజన్ మెచ్చుకున్నారు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ వాసుల మృతి -
TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు
సౌతెండ్, యునైటెడ్ కింగ్డమ్లో TCUK ఆధ్వర్యంలొ ప్రప్రధముగా తెలంగాణ బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎస్సెక్స్ లోని సౌతెండ్, బాసిల్డ్న్ , చెల్మ్సఫోర్డ్ , తుర్రోక్ కౌన్సిల్ ఉంచి దాదాపు 450 మన తెలుగు వాళ్ళు అందరు ఒక్కదగ్గర చేరి బతుకమ్మ దసరా సంతోషంగా జరుపుకున్నారు. గుర్రం మల్లారెడ్డి, గుర్రం లావణ్య నేతృత్వంలో ఈ ఈవెంట్ స్వచ్చందంగా నిర్వహించారు.తెలంగాణ ఆడపడుచులు అందమైన బతుకమ్మ పేర్చికొని వచ్చారు. దసరా జమ్మి ఆకూ మొగవాళ్ళు ఇచ్చుకొని అలాయి బలయ్ చెప్పుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ కి సౌత్జెండ్ కౌన్సిలర్స్ క్రిస్ వెబ్‌స్టర్ , పమేలా కిన్సేల్ల, సామ్ అల్లెన్, షాహిద్ నదీమ్, జేమ్స్ మొరిషన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. చివరగా తెలంగాణ వంటకాలతో విందు ఆరగించి, దసరా, బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇలాంటి వేడుకలు భవిష్యత్తులోమరెన్నో జరగాలని అందరూ ఆకాంక్షించారు.