Hanu Raghavapudi
-
ఫీల్ గుడ్ షురూ
రామ్ పోతినేని హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేనిలు దర్శకుడు మహేశ్‌కు స్క్రిప్ట్ అందజేశారు. ‘‘యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కనున్న సినిమా ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
షూటింగ్లో ప్రభాస్.. రూ.150 కోట్లకు ఓటీటీ డీల్!
డార్లింగ్ ప్రభాస్ చకచకా ఒక్కో సినిమా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్' చివరి దశ షూటింగ్లో ఉంది. డిసెంబరు కల్లా పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు హను రాఘవపూడితో చేస్తున్న మూవీ సెట్లోకి ప్రభాస్.. శుక్రవారం అడుగుపెట్టేశాడట. కానీ అంతకు ముందే ఓటీటీ డీల్ పూర్తయినట్లు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకొచ్చింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!)ప్రభాస్.. పాన్ ఇండియా హీరో అవడం మాటేమో గానీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. 'సలార్', 'కల్కి 2898' చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్'తో పాటు ఫౌజీ (రూమర్ టైటిల్) చేస్తున్నాడు. మైత్రీ నిర్మాణంలో హను రాఘవపూడి తీస్తున్న ఈ సినిమాని రూ.150 కోట్లు ఇచ్చి ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుందట.రిలీజ్ వరకు అంటే రేటు కాస్త పెరగొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా రూ.150 కోట్లు ఇచ్చేసి ప్రభాస్ మూవీని ఓటీటీ సంస్థ కొనేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇమాన్వి హీరోయిన్ అని ఇదివరకే ప్రకటించారు. బహుశా 2026లో ఇది థియేటర్లలో రిలీజ్ కావొచ్చు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) -
దసరాకి ఖుషీ
దసరా పండగకి ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నారట ప్రభాస్. అది కూడా గ్లింప్స్ రూపంలో. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబా’లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా అంగీకరించారు. ‘స్పిరిట్’ చిత్రీకరణ వచ్చే ఏడాది ఆరంభం అవుతుందట.ఘను రాఘవపూడి దర్శకత్వంలోని సినిమా షూట్ ఆరంభమైంది. మధురైలో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనడంలేదు. రెండో షెడ్యూల్ నుంచి పాల్గొంటారట. ఈ సినిమా వీడియో గ్లింప్స్‌ని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారట. 1940ల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే మార్చికి పూర్తవుతుందని సమాచారం. -
ఎక్కడ్నుండి పట్టుకొస్తాడ్రా బాబు.. ఈ అందాలన్నీ
-
ప్రభాస్ కొత్త మూవీలో పాకిస్థాన్ నటి కూడా!
'కల్కి'తో హిట్ కొట్టిన ప్రభాస్.. కొత్త సినిమా కూడా మొదలుపెట్టేశాడు. 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకుడు. మొన్ననే పూజ జరగ్గా.. ఈ నెలలోనే షూటింగ్ ఉండొచ్చు. ఇక ఈ మూవీతో ఇమాన్వీ అనే కొత్తమ్మాయి టాలీవుడ్‌కి పరిచయం కానుంది. ఇందులోనే మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందని, అందుకోసం పాక్ బ్యూటీని తీసుకుంటారని తెలుస్తోంది. ఇది రూమర్ కాదు, నిజమేనని సమాచారం.(ఇదీ చదవండి: ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్)ప్రభాస్-హను మూవీ లాంచ్‌కి ముందు కొన్ని గాసిప్స్ వచ్చాయి. 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, ఇందులో పాన్ నటి సాజల్ అలే హీరోయిన్ అని అన్నారు. కట్ చేస్తే దిల్లీలో పుట్టి అమెరికాలో ఉంటున్న ఇమాన్వీ అనే అమ్మాయి.. ప్రభాస్‌తో కలిసి సినిమా లాంచింగ్ రోజు కనిపించింది. దీంతో పాక్ నటిది గాసిప్ అనుకున్నారు. కానీ ఈమె రోల్ కూడా ఉందని తెలుస్తోంది. కాకపోతే అనౌన్స్ చేసేవరకు అది గోప్యమేనట.2017లో వచ్చిన 'మామ్' సినిమాలో సాజల్.. శ్రీదేవి కూతురిగా నటించింది. అంతకుముందు కుచ్ అంఖహి, యాఖిన్ క సఫర్, హే దిల్ మేరా తదితర పాక్ సినిమాలు, టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే 1940 బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప్రభాస్ సినిమా తీస్తున్నారని, ఇందులో సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ హ్యాపీ అయిపోతారు!(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు) -
ప్రభాస్- హను సినిమా కార్యక్రమంలో పాల్గొన్న స్టార్స్.. వీడియో వైరల్
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న చిత్రం తాజాగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాని గుల్షన్ కుమార్, భూషణ్‌కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబుతో పాటు చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు.‘‘ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఓ వారియర్ మాత్రం వారి పోరాటం దేని కోసమో నిర్వచించగలిగాడు’’ అంటూ ఈ సినిమాని ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు హను రాఘవపూడి. చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఫిక్షనల్ కథాంశంగా ఈ సినిమా ఉంటుంది. ‘‘1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హను పవర్ఫుల్ వారియర్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఫౌజీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మిధున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: సుదీప్ ఛటర్జీ ఐఎస్సీ. -
పవర్ఫుల్ వారియర్
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న చిత్రం శనివారం ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటించనున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్‌కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు.‘‘ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఓ వారియర్ మాత్రం వారి పోరాటం దేని కోసమో నిర్వచించగలిగాడు’’ అంటూ ఈ సినిమాని ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు హను రాఘవపూడి. ‘‘1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హను పవర్ఫుల్ వారియర్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మిధున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: సుదీప్ ఛటర్జీ ఐఎస్సీ. -
ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్ విడుదల
పాన్ ఇండియా రేంజ్లో వరుస సినిమాలతో ప్రభాస్ హిట్లు అందుకుంటూనే ఉన్నాడు. రీసెంట్గా కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్.. తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. డైరెక్టర్ హను రాఘవపూడితో మూవీ లాంఛింగ్ కార్యక్రం తాజాగా జరిగింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. పూర్తిస్థాయి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తుంది. సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ షేర్ చేసింది. 1940 దశకంలో జరిగే కథ అని పోస్టర్లో తెలిపింది. పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనుందని మేకర్స్ తెలిపారు. మాతృభూమి ప్రజల కోసం ఒక యోధుడు చేసే పోరాటంగా మూవీ ఉండనుంది. ‘పరిత్రాణాయ సాధూనాం’ అంటూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పోస్టర్లో చూపించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం విశాల్ చంద్రశేఖర్ మూడు పాటలు కూడా కంపోజ్ చేసినట్లు డైరెక్టర్ ఓ సందర్భంలో చెప్పారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ప్రభాస్‌కు జోడీగా ఈ ముద్దుగుమ్మ! ఇమాన్వీ ఎవరంటే..?
-
ప్రభాస్ - హను రాఘవపూడి సినిమా..ఓపెనింగ్ ఫోటోలు వైరల్
-
ప్రభాస్ మరో కొత్త సినిమా మొదలు
ప్రభాస్ మరో కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. రీసెంట్గా 'కల్కి'తో వచ్చి రూ.1000 కోట్ల కొట్టేశాడు. ప్రస్తుతం 'రాజా సాబ్' చేస్తున్నాడు. ఇది కాకుండా సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చేయాలి. ఇవి ఉండగానే 'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్ షురూ చేశాడు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ మూవీ ప్రారంభమైంది.(ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మారాల్సిన టైమ్ వచ్చిందేమో?)శనివారం జరిగిన ఈ వేడుకకు 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వచ్చే వారం అంటే ఆగస్టు 24 నుంచి షూటింగ్ కూడా మొదలు కానుందని అంటున్నారు. అలానే ఈ సాయంత్రం 4 గంటలకు పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు.మరోవైపు ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో తీస్తున్న సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ ఫిక్స్ చేశారని, రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథని అంటున్నారు. వీటిన్నంటిపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది. అలానే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన) -
ఇక షురూ
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ‘ఫౌజి’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని, ఈ చిత్రంలోని హీరోయిన్‌పాత్రకు మృణాల్ ఠాగూర్,పాకిస్తాన్ నటి సజల్ అలీని అనుకుంటున్నారనీ ప్రచారం జరుగుతోంది.ఈ నెల మూడో వారంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుందని, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారని, మూడుపాటల పని కూడా పూర్తయిందని ఆ మధ్య హను రాఘవపూడి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ప్రభాస్, హను రాఘవపూడి మూవీ... అదిరిపోయే అప్డేట్
-
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. మూడు సినిమాలు ఒకేసారి!
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ బరిలో మాత్రం ఇతర పెద్ద సినిమాలు లేకుండా ప్లాన్ చేసుకొని సినిమాను విడుదల చేస్తున్నారు. కల్కి 2898 మూవీ కూడా ఇక్కడ సోలోగానే విడుదలై హిట్ కొట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలు కూడా దాదాపు సోలోగానే రిలీజ్ కాబోతున్నాయి. కానీ వీటి తర్వాత ఈ స్టార్ హీరోలు నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య 2026లో బక్సాఫీస్ వార్ జరిగే అవకాశం మెండుగా ఉంది.(చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్ హీరో!)కల్కి 2898 తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’గా రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది. 2025 చివరల్లో లేదా 2026 సంకాంత్రికి విడుదలయ్యే అవకాశం ఉంది. (చదవండి: నా బిడ్డను పైకి పంపించేయాలనుకున్నా.. ఏడుస్తూ భర్తకు చెప్పా: పాక్ నటి)మరోవైపు గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్..బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కలేదు. సెప్టెంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం రెహమాన్ కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరిలో ఈ చిత్రం రీలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేవర తర్వాత ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభంలో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దాదాపు ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఒకేసారి ప్రారంభం అవుతున్నాయి. పెద్ద సినిమాలు కాబట్టి ఏడాది వరకు నిర్మాణంలో ఉండడం సర్వసాధారణం. ఈ లెక్కన చూస్తే..మూడు సినిమాలు వారం అటు ఇటుగా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురు బాక్సాఫీస్ వార్‌లో ఉంటారా లేదా సోలోగానే వచ్చి హిట్ కొడతారా అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే. -
అక్టోబరులో ఆరంభం
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ మూవీ నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్న పేర్లు వినిపిస్తున్నాయి. వివేక్ సాగర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. వార్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ లవ్‌స్టోరీ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయి.దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట హను రాఘవపూడి. ప్రస్తుతం వెకేషన్ లో భాగంగా ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగొచ్చిన తర్వాత ‘రాజాసాబ్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహించే సినిమా షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది.అయితే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ అనే సినిమాకి కమిట్ అయ్యారు ప్రభాస్. ఈ సినిమా చిత్రీకరణ కూడా ఈ ఏడాది చివర్లోనే ప్రారంభం కానుందట. మరి.. హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వాల్లోని సినిమాల చిత్రీకరణలో ప్రభాస్ ఏకకాలంలో పాల్గొంటారా? లేదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
Sreeleela : రెట్రో షేడ్స్ లుక్స్‌తో శ్రీలీల.. మరో సావిత్రి అంటూ కామెంట్స్! (ఫొటోలు)
-
అందమైన ప్రేమకథతో రానున్న ప్రభాస్..!
-
హనుకి గ్రీన్ సిగ్నల్?
ప్రస్తుతం ‘సలార్’, ప్రా జెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆ సినిమా చిత్రీకరణలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కొత్త సినిమాల కోసం కథలు వింటున్నారట ప్రభాస్. ఇందులో భాగంగా దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన ఓ కథ ప్రభాస్‌కు నచ్చిందని, ఈ కథకు ప్రభాస్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో ఈ స్క్రిప్ట్‌కు హను రాఘవపూడి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతేకాదు.. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం ‘రాజా డీలక్స్’ షూటింగ్లో పాల్గొంటున్నారు ప్రభాస్. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్...
-
ఆల్జీబ్రాకు బదులు ‘హంతకుడు’ స్టోరీ రాశా.. ‘సీతారామం’ డైరెక్టర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘సీతారామం’తో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి మన బిడ్డే. కొత్తగూడెం గణేష్ టెంపుల్ గల్లీలో పుట్టి పెరిగి సినిమా ఇండస్ట్రీలో అందాల రాక్షసితో ప్రయాణం మొదలెట్టి ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల లిస్టులో చోటు సాధించారు. తాను చదివిన కాలేజీలో ఏర్పాటు చేసిన ఫంక్షన్లో పాల్గొనేందుకు చాన్నాళ్ల తర్వాత ఆయన కొత్తగూడెం వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ముచ్చటించారు. కొత్తగూడెంతో తనకున్న అనుబంధం నెమరు వేసుకున్నారు, ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.. అసలు సినిమా ఆలోచనే లేదు.. నాన్న సన్యాసిరావు సింగరేణిలో ఉద్యోగం చేసేవారు. అమ్మ సూర్యకుమారి కోర్టులో ఎంప్లాయిగా ఉండేవారు. మా ఫ్యామిలీ గణేష్ టెంపుల్ వెనుక గల్లీలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏరియాలో ఉండేది. టెన్త్ వరకు రామవరం సింగరేణి స్కూల్లో, ఇంటర్మీడియట్ కృష్ణవేణి కాలేజీలో, డిగ్రీ వివేకవర్థిని కళాశాలలో చదివాను. చిన్నప్పుడు అసలు సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచనే లేదు. అమ్మ చెప్పినట్టు బుద్ధిగా చదువుకోవడం మంచి మార్కులు తెచ్చుకోవడం మీదనే ధ్యాస ఉండేది. సినిమాలు చూడటం కూడా తక్కువే. స్వాతికిరణం చూశాక.. చిన్నతనంలో ఓసారి మా అమ్మ దుర్గా టాకీస్‌లో స్వాతికిరణం సినిమాకు తీసుకెళ్లింది. ఆ వయసులో ఆ సినిమా నాకు విపరీతంగా నచ్చేసింది. అప్పటి వరకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేని నాకు ఆ సినిమాతో ఒక్కసారిగా సినిమాకి దర్శకుడు అనే వ్యక్తి ఎవరు ? అతను ఎలా ఆలోచిస్తాడు అనే అంశాలపై ఆసక్తి పెరిగింది. వెంటనే స్వాతికిరణం దర్శకుడు కే.విశ్వనాథ్ గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఎంజీ రోడ్లో సంతోష్ వీడియో లైబ్రరీ నుంచి విశ్వనాథ్ గారి సినిమా క్యాసెట్లు అద్దెకు తీసుకెళ్లి సినిమాలో ఇంకో కోణంలో చూడటం మొదలెట్టాను. శంకరాభరణం సినిమా లెక్కలేనన్ని సార్లు చూశాను. అలా సినిమాలపై ఇష్టం పెరుగుతూ పోయింది. అయినప్పటికీ బుద్ధిగా చదువుతూనే ఎంసీఏలో ఉండగా సినిమాల్లోకి షిఫ్ట్ అయ్యాను. ఆల్జీబ్రాకు బదులు స్క్రిప్ట్ రైటింగ్.. శంకరాభరణం తర్వాత కథకుడు, దర్శకుడు కావాలనే ఆలోచనకు బీజం పడింది. ఓ వైపు క్లాసులో టీచర్లు పాఠాలు చెబుతుంటే మరోవైపు నా మనసులో కథలు అందులోని పాత్రలు మెదిలేవి. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఓ పత్రికలో కథల కాంపిటీషన్ అంటూ ప్రకటన వచ్చింది. దీంతో ఓ స్టోరీ రాసేసి ప్రైజ్ కొట్టేద్దామనుకున్నా. కాలేజీలో కోటేశ్వరరావు సార్ మ్యాథ్స్ క్లాస్ చెబుతున్నారు. నేను పైకి ఊ కొడుతూనే ‘హంతకుడు’ పేరుతో మంచి క్రైం స్టోరీ రాసేస్తున్నా. కాసేపటికి సార్‌కి డౌట్ వచ్చి నా నోట్స్ చెక్ చేశారు. అక్కడ ఆల్జీబ్రా బదులు ‘హంతకుడు’ కనిపించింది. అంతే అక్కడే సార్ వాయించేశారు. ఆ తర్వాత క్లాస్ బయట నిల్చోబెట్టారు. ఇప్పుడదొక స్వీట్ మెమరీగా మిగిలిపోయింది. ఆ తర్వాత వీపు వాయించేశారు.. ఇంటర్లోకి వచ్చాక సినిమాలపై ఇష్టం బాగా పెరిగిపోయింది. పైగా కొత్తగూడెంలో సినిమా థియేటర్లు అన్నీ కృష్ణవేణి కాలేజీకి దగ్గర్లోనే ఉండేవి. ఉదయం కాలేజీకి వెళ్లినట్టే వెళ్లి మధ్యలో క్లాసులు ఎగ్గొట్టి మా గ్యాంగ్ అంతా సినిమాలకు వెళ్లే వాళ్లం. క్లాసులో స్టూడెంట్స్ సంఖ్య తగ్గినట్టు కనిపిస్తే, కోటేశ్వరరావు సార్ సీడీ 100 బైక్ వేసుకుని థియేటర్లకు వచ్చేవారు. ప్రొజెక్టర్ రూమ్‌లో నిల్చుని స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు ? ఎక్కడ ఉన్నారో గమనించేవారు. అలా ఓసారి మేం గులాబీ సినిమా చూసేందుకు పరమేశ్వరి థియేటర్లో ఉండగా సార్ మమ్మల్ని పట్టేసుకున్నారు. ఆ తర్వాత అందరి వీపులు వాయించేశారు. దీంతో ఎప్పుడైనా కాలేజ్ టైంలో సినిమాలకు వెళితే ‘సీడీ హండ్రెడ్ బైక్ ’ వచ్చిందా అంటూ మధ్యమధ్యలో చెక్ చేసుకునే వాళ్లం. నెక్ట్స్ సినిమాలో కొత్తగూడెం.. నేను ప్రేమకథలు బాగా తీస్తానని, నాకో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ఉందనే భావన చాలా మందిలో ఉంది. వాస్తవం కంటే ఊహలు ఎప్పుడూ అందంగా ఉంటాయి. టీనేజ్‌లో కానీ కాలేజ్ డేస్‌లో కానీ నాకు లవ్‌స్టోరీస్ ఏమీ లేవు. స్టడీస్, కథలు రాయడం మీదనే ఫోకస్ ఉండేది. కాకపోతే లవ్ చేస్తే ఎలా ఉండాలనే భావనలతోనే కథలు రాసుకున్న. వాటితోనే అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు, సీతారామం వంటి సినిమాలు తీశాను. ఇప్పటి వరకు చేసినవన్నీ ఊహల్లోంచి పుట్టుకొచ్చిన కథలే. అందాల రాక్షసిలో పాత కారు, పగిలిన అద్దంలోని హీరోయిన్ కనిపించే దృశ్యం మాత్రం కొత్తగూడెం నుంచి తీసుకున్నా. నా చిన్నతనంలో గణేష్ టెంపుల్ గల్లీలో ఓ పాత కారు పార్క్ చేసి ఉండేది. కాలేజీకి, స్కూల్‌కు వెళ్లేప్పుడు ప్రతీ రోజు దాన్ని దాటుకుంటూ వెళ్లేవాణ్ని. ఆ ఒక్క సీన్‌ని సినిమాలో చూపించాను. త్వరలో మైత్రీ మూవీస్‌కి చేయబోయే సినిమాలో రియల్ లైఫ్‌లో కొత్తగూడెంలో చూసిన సంఘటనలు, ఎదురైన అనుభవాల్లో కొన్నింటిని సెల్యూలాయిడ్ తెర మీద చూపించబోతున్నాను. బ్యాడ్ బాయ్‌ని కాదండోయ్... సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నా చదువును ఏ రోజూ నిర్లక్ష్యం చేయలేదు. టెన్త్, ఇంటర్, డిగ్రీలో మంచి మార్కులే వచ్చాయి. డిగ్రీ ఫైనలియర్లో కొత్తగూడెం నుంచి ఖమ్మం షిఫ్ట్ అయ్యాను. అక్కడ బ్యాంక్ కాలనీలో ఉంటూ కవిత డిగ్రీ కాలేజీలో చదివాను. ఆ సమయంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి లెక్కల ట్యూషన్ చెప్పేవాన్ని. ఇంటర్లో పడిన పునాది గట్టిగా ఉండటంతో అది సాధ్యమైంది. స్టూడెంట్‌గా ఇంగ్లిష్తో నాకు ఎప్పుడు తిప్పలే ఉండేవి. చాతకొండ మూర్తి సార్ అయితే ‘ఇంగి్లష్లో తక్కువ మార్కులు వచ్చాయంటూ , సమాధానం సరిగా చెప్పలేదంటూ’ ఎన్నిసార్లు కొట్టారో. అప్పుడు చెప్పిన పాఠాలు, తిన్న దెబ్బలు, సినిమాలపై నాకున్న ఇంట్రెస్ట్ అన్ని కలిపి నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. -
ధనుష్ 'సార్' మూవీపై రివ్యూ ఇచ్చిన సీతారామం డైరెక్టర్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి తెలుగు చిత్రం సార్. మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ ఇందులో హీరోయిన్గా నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ఇటీవలె విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు అదిరిపోయే కలెక్షన్లను కూడా వసూలు చేస్తోందీ చిత్రం. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకున్న ధనుష్ తెలుగులో తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు.తాజాగా సినిమా సక్సెస్‌పై సీతారామం దర్శకుడు హనురాఘవపూడి ట్వీట్ చేశారు. సార్ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఎప్పటిలాగే ధనుష్ మరోసారి తన నటనతో కట్టిపడేశారు. మూవీ టీం అందరికి కంగ్రాట్స్ అంటూ ప్రశంసలు కురిపించారు. Watched #SIRMovie and must say, I'm mind-blown! Definitely, a must watch. And as always, @dhanushkraja garu steals the show. Very honest writing and screenplay by #VenkyAtluri. Congratulations @SitharaEnts on delivering a blockbuster. And @dopyuvraj terrific 👌🏻 pic.twitter.com/9mkTqHJC6s — Hanu Raghavapudi (@hanurpudi) February 24, 2023 -
అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి
సీతారామం.. ఎన్నేళ్లు గడిచిన ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే చిత్రం ఇది. అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ చిత్రం. చిన్న సినిమాగా వచ్చిన చిత్రం అంచనాలను మించి రెట్టింపు రెస్పాన్స్ అందుకుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళు చేసింది సీతారామం. చదవండి: ‘డబ్బు కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు.. నాకు అదే ముఖ్యం’ యుద్ధంలో నుంచి పుట్టిన ప్రేమకథ అంటూ వెండితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. అంతగా ప్రతి ప్రేక్షకుడి మనసును గెలిచిన ఈ చిత్రం కథ ఎక్కడిది, ఎలా వచ్చిందో తాజాగా తెలిపాడు డైరెక్టర్ హనురాఘవపూడి. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఆయన సీతారామంకు తెలుగు యాక్టర్స్‌ను తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా హనురాఘవపూడి సీతారామం విశేషాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు పుస్తకాలు చదడం అలవాటు. అలా నేను ఓ రోజు కోఠిలో సెకండ్ హ్యాండ్ పుస్తకం కొన్నాను. అందులో ఓ లెటర్ ఉంది. అది ఒపెన్ చేసి కూడా లేదు. హాస్టల్లో ఉంటున్న అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్ అది. సెలవులకు ఇంటికి రమ్మని ఆమె రాశారు. కానీ అది చదివాక నాకు ఓ ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆ లెటర్లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే? అని అనుకున్నా. ఆ ఆలోచనే ‘సీతారామం’ సినిమా రావడానికి మూలకారణం. కథ రాసుకున్న తర్వాత నిర్మాత స్వప్న గారికి చెప్పాను. ఆమె వెంటనే చేద్దాం అన్నారు. ఆ తర్వాత హీరోగా ఈ కథకు దుల్కర్ సరిగ్గా సరిపోతాడని అనిపించింది. అందుకే తనని సెలెక్ట్ చేశాం’ అని చెప్పాడు. చదవండి: హీరోయిన్ల రెమ్యునరేషన్‌పై మృణాల్ షాకింగ్ కామెంట్స్ అలాగే ‘సీత పాత్ర కోసం మృణాల్‌ను ఎంపిక చేశాం. కొత్తగా ఉండాలని అనుకుంటుంటే స్వప్న.. మృణాల్ గురించి చెప్పింది. ఆమెను చూడగానే సీతపాత్రకు సరిపోతుందని అనిపించింది. ఇక తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదంటే.. తెలుగు వాళ్ల ప్రొఫైల్స్ ఎక్కడా కనిపించలేదు. ఫలానా అమ్మాయి ఉందని తెలిస్తే తను పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు. కానీ, ఎక్కడా తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ కనిపించలేదు. తెలుగు వాళ్లు దొరికితే ఇంకా మాకే హాయి.. ఎందుకంటే వాళ్లకు భాష వచ్చి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. -
'వెయ్యి ఆడాలి.. కానీ మనం ఆడింది వందే'.. ఆసక్తిగా టీజర్
కరోనా తరువాత ఆడియెన్స్ మైండ్‌సెంట్ పూర్తిగా మారిపోయింది. సినిమాలను చూసే అభిప్రాయంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉంటే జనాలు థియేటర్లకు వస్తున్నారు. చిన్న సినిమాలైనా ఆదరిస్తున్నారు. అదే తరహాలో 'రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ బ్యానర్‌పై జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతున్న ఈ చిత్రానికి సంతోష్ మురారికర్ కథ అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశారు. టీజర్ చాలా బాగుందని.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. రెండు నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమా మీద ఆసక్తిని పెంచేసింది. 'నా పేరు కుమార్.. ఇది నా ఊరు.. వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు.. కానీ మనం ఆడింది వందే' అంటూ ప్రారంభమైన టీజర్ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ పెంచుతోంది. 'వంద మంది.. బరా బర్ వంద మందిని చూపించాలి'.. 'అన్నా ఇదంతా నిజంగా అయితదా?.. అయితది.. ఏం కావాల్నో అదే అయితది'.. 'ఈ పని ఒక్కడే చేయగలడు సర్.. అయితే ఇదంతా మీకు తెలిసే జరుగుతోందా?' అనే ఈ డైలాగ్స్‌తో సినిమా కథ ఏంటో చెప్పకనే చెప్పేశారు. అసలు ఏం జరుగుతోంది.. ఆ వంద అబద్దాలు ఏంటి? ఆ వంద మంది కలిసి చేసిన పని ఏంటి?.. తుపాకుల గూడెంలో ఏం జరుగుతోంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా సినిమా టీజర్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26న థియేటర్లోకి రానుంది. -
మరో ప్రేమకథతో రాబోతున్న ‘సీతారామం’ టీం!, ఆ నిర్మాత క్లారిటీ..
ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘సీతారామం’. యుద్దం భూమిలో పుట్టిన అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ విడుదలైన నెల దాటిన ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తోంది. అంతేకాదు ఓటీటీలో సైతం ఈమూవీ దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైంలో ప్రస్తుతం సీతారామం స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో లీడ్‌రోల్స్ పోషించిన హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ల నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ ఇదిలా ఉంటే దుల్కర్, మృణాల్ హీరోహీరోయిన్లుగా మరో చిత్రం ప్రేమకథా చిత్రం రాబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినిదత్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చెకూరుస్తున్నాయి. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సందర్భంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించారు అశ్విని దత్. ఈ సందర్భంగా సీతారామం చిత్ర విశేషాలను పంచుకున్న ఆయన వైజయంతి బ్యానర్లో మరో ప్రేమ కథ చిత్రం రాబోతుందన్నారు. అదే సీతారామం కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా హనురాఘవపూడి దర్శకత్వంలో మరో లవ్‌స్టోరీని రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. చదవండి: ఈ చిత్రంలో రజనీ నటిస్తానంటే వారి మధ్య చిక్కుకునేవారు: మణిరత్నం ఇక ఇది తెలిసి ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఓ చక్కటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ చూశామని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ అదే టీంతో సీతారామం లాంటి చిత్రం వస్తుందని చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచానాలు పెరిగిపోయాయి. మరి హనురాఘవపూడి ఈసారి ఎలాంటి ప్రేమకథతో వస్తారనేతి ఆసక్తిని సంతరించుకుంది. కాగా దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం చుప్ సెప్టెంబర్ 23 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సీతారామం మూవీతో తెలుగులో అడుగుపెట్టిన మృణాల్ వైజయంతి బ్యానర్లోనే ఓ సినిమాకు సంతకం చేసిందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
'నీతో' థియేట్రికల్ ట్రైలర్.. విడుదల చేసిన సీతారామం డైరెక్టర్
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'నీతో'. ఈ సినిమాకు బాలు శర్మ దర్శకత్వం వహించగా.. పృథ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇటీవల సక్సెస్ అయిన సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి చేతులమీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. 'మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ.. ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తు రాదు" లాంటి డైలాగ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించింది చిత్ర బృందం. ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చగా.. సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 30వ థియేటర్లలో సందడి చేయనుంది.