Justin Langer
-
IPL 2025: అతడే గనుక బతికి ఉంటే.. పంత్ రికార్డు బ్రేక్ చేసేవాడు!
ఆస్ట్రేలియా మాజీ హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. ఫిలిప్ హ్యూస్ గనుక బతికి ఉంటే ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టేవాడని.. కానీ తను ఇప్పుడు ఈ లోకంలో లేడంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా సౌదీ అరేబియాలో ఇటీవల ఐపీఎల్-2025 మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే.అమాంతం ఏడు కోట్లు పెంచిఇందులో భాగంగా రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీకి రాగా.. లక్నో సూపర్ జెయింట్స్ కళ్లు చెదిరే మొత్తానికి ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది. పంత్ ధర రూ. 20 కోట్లకు చేరినపుడు ఢిల్లీ రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారా పంత్‌ను తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయగా.. లక్నో అమాంతం ఏడు కోట్లు పెంచేసింది.దీంతో ఢిల్లీ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో రూ. 27 కోట్లకు రిషభ్ పంత్‌ను తమ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డు సాధించాడు. ఈ నేపథ్యంలో లక్నో జట్టు హెడ్‌కోచ్, ఆసీస్ మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ‘ది వెస్ట్ ఆస్ట్రేలియన్’కు రాసిన కాలమ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. మా ఫ్రాంఛైజీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడి సేవల కోసం ఐదు మిలియన్ డాలర్ల మేర ఖర్చు చేసింది. కేవలం ఎనిమిది వారాలకు ఇంత మొత్తం అంటే మాటలు కాదు.అతడే గనుక బతికి ఉంటేఒకవేళ హ్యూస్ గనుక బతికి ఉంటే.. ఐపీఎల్ వేలంలో అతడు కూడా భారీ ధర పలికేవాడు. కేవలం తన డైనమిక్ బ్యాటింగ్ మాత్రమే ఇందుకు కారణం కాదు.. తనలోని ఎనర్జీ కూడా ఇందుకు కారణం. కానీ.. విచారకరం ఏమిటంటే.. తను ఇప్పుడు మన మధ్యలేడు. ఎప్పటికీ వేలంలోకి రాలేడు’’ అంటూ ఆసీస్ దివంగత స్టార్ ఫిలిప్ హ్యూస్‌ను గుర్తుచేసుకున్నాడు. అదే విధంగా.. పంత్ క్రికెటింగ్ నైపుణ్యాలను కొనియాడిన లాంగర్.. ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా(2020-21)ను ఒంటిచేత్తో గెలిపించిన తీరు ఎన్నటికీ మరువలేనిదన్నాడు. కాగా 2014లో ఫిలిప్ హ్యూస్ ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచివెళ్లాడు. ఆసీస్ దేశీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో భాగంగా న్యూ సౌత్‌వేల్స్- సౌత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి బలైన హ్యూస్ఆసీస్ బౌలర్ సీన్ అబాట్ వేసిన రాకాసి బంతి హ్యూస్ మెడకు బలంగా తాకడంతో అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. నవంబరు 27న హ్యూస్ పదో వర్ధంతి జరిగింది. ఈ నేపథ్యంలో అతడిని తలచుకుంటూ జస్టిన్ లాంగర్ ఉద్వేగానికి గురయ్యాడు.కాగా న్యూ సౌత్ వేల్స్లో జన్మించిన హ్యూస్ 2009లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో 26 టెస్టులు, 25 వన్డేలు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1535, 826 పరుగులు చేశాడు. తన 26వ పుట్టినరోజు కంటే మూడు రోజుల ముందు.. క్రికెట్ ఆడుతూ తుదిశ్వాస విడిచాడు. చదవండి: ఐసీసీ దెబ్బకు దిగివచ్చిన పాకిస్తాన్.. ‘హైబ్రిడ్ మోడల్’కు ఓకే!.. కానీ.. -
BCCI: అవన్నీ అబద్ధాలే: ఆసీస్ మాజీలకు జై షా కౌంటర్
టీమిండియా కొత్త హెడ్ కోచ్ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా కొట్టిపారేశారు. ఈ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా తాము ఇంత వరకు ఎవరినీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ అతడి వారసుడిని ఎంపిక చేసే క్రమంలో దరఖాస్తులు ఆహ్వానించింది. విదేశీ కోచ్‌ల పేర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.హెడ్ కోచ్ రేసులోఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు రిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ సహా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్టీఫెన్ ఫ్లెమింగ్, శ్రీలంక లెజెండ్ మహేళ జయవర్ధనే తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో రిక్కీ పాంటింగ్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. బీసీసీఐ తనకు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించానని పేర్కొన్నాడు. మరోవైపు.. జస్టిన్ లాంగర్ సైతం కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడంటూ టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం తాను అప్లై చేసుకోనని పరోక్షంగా వెల్లడించాడు.వాళ్లకు మేమే ఆఫర్ ఇవ్వలేదురిక్కీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు. ‘‘టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం నేను గానీ, బీసీసీఐ గానీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లెవరికీ ఆఫర్ చేయలేదు.మీడియా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. జాతీయ జట్టు కోసం సరైన కోచ్‌ను ఎంపిక చేసుకోవడం క్లిష్టతరమైన ప్రక్రియ. భారత క్రికెట్ స్వరూపాన్ని చక్కగా అర్థం చేసుకోగల వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నాం.పూర్తి అవగాహన ఉన్నవాళ్లకే ప్రాధాన్యంటీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్నవారికి భారత దేశవాళీ క్రికెట్ గురించి, ఆటగాళ్ల గురించి పూర్తి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ల కోసమే మేము ఎదురుచూస్తున్నాం.భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండటం కంటే అంతర్జాతీయ క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన పదవి ఇంకోటి ఉంటుందని అనుకోను. ప్రపంచవ్యాప్తంగా టీమిండియాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత క్రికెట్ చరిత్ర, ఔన్నత్యం.. ఆట పట్ల మా అంకితభావం.. అన్నీ వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నాం.ఇలాంటి చోట జాబ్ చేయడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?. ఇలాంటి జట్టుకు గురువుగా బాధ్యతలు నిర్వర్తించే సరైన వ్యక్తి కోసం మేము జల్లెడపట్టాల్సి ఉంటుంది’’ అని జై షా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వ్యాఖ్యానించారు. చదవండి: SRH vs RR: అతడి మీదే భారం.. అలా అయితేనే సన్‌రైజర్స్ ముందుకు -
BCCI: రాహుల్ నా కళ్లు తెరిపించాడు: జస్టిన్ లాంగర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్ రేసులో వినిపిస్తున్న పేర్లలో జస్టిన్ లాంగర్ పేరు ఒకటి. గతంలో ఆస్ట్రేలియా ప్రధాన కోచ్‌గా పనిచేసిన లాంగర్.. ఆటగాళ్లతో విభేదాల నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు.ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న జస్టిన్ లాంగర్ 2024లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో జట్టుకట్టాడు. పదిహేడో సీజన్లో లక్నోకు కోచ్‌గా నియమితుడయ్యాడు ఈ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్.లాంగర్ మార్గదర్శనంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో అద్భుతాలు సాధిస్తుందనుకుంటే కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి సీజన్‌ను ముగించింది.ద్రవిడ్ వారసుడు ఎవరు?ఇదిలా ఉంటే.. బీసీసీఐ రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్ వేట మొదలుపెట్టిన నేపథ్యంలో జస్టిన్ లాంగర్, రిక్కీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తదితర విదేశీ కోచ్‌ల పేర్లు తెరమీదకు వచ్చాయి.ఈ విషయంపై స్పందించిన జస్టిన్ లాంగర్ బీబీసీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో కేఎల్ రాహుల్ తనకు వివరించాడంటూ బాంబు పేల్చాడు.అంతకు మించి.. వెయ్యి రెట్లు అధికంగా‘‘కోచ్ పాత్ర ఎలాంటిదో నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుతో గడిపినపుడే నాకు అర్థమైంది. అప్పుడు నేనైతే పూర్తిగా అలసిపోయాను. ఇక భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యత ఎలా ఉంటుందన్న విషయం గురించి నేను కేఎల్ రాహుల్‌తో మాట్లాడినపుడు ఆసక్తికర సమాధానం విన్నాను.‘ఐపీఎల్ జట్టు విషయంలో ఒత్తిడి, రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అందుకు వెయ్యి రెట్ల ఒత్తిడి, పాలిటిక్స్ టీమిండియా కోచ్‌గా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని చెప్పాడు.అంతకంటే గొప్ప సలహా మరొకటి ఉంటుందని నేను అనుకోను’’ అని జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. భారత జట్టు ప్రధాన కోచ్ పదవి విషయంలో తనకు ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చిందని తెలిపాడు. ఒక విధంగా కేఎల్ రాహుల్ తన కళ్లు తెరిపించాడని పేర్కొన్నాడు.రిక్కీ పాంటింగ్ సైతంఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ సైతం టీమిండియా హెడ్‌కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేనని పేర్కొన్న విషయం తెలిసిందే. తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనుకుంటున్నానని.. అందుకే బీసీసీఐ ఆఫర్ ఇచ్చినా తాను తిరస్కరించానని తెలిపాడు.చదవండి: IPL 2024: టైమ్‌కి చెక్ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం? -
టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
టీ20 వరల్డ్ కప్ 2024తో రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెచ్ కోచ్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయన మరోసారి దరఖాస్తు చేసుకుంటారా? లేదంటే ఆ అవకాశం మరొకరిని వరిస్తుందా?.. టీమిండియాకు కాబోయే హెడ్ కోచ్ ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఈ లోపే హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది.కొత్త కోచ్ పదవీకాలం ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు ఉంటుందని బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. అంటే కొత్తగా కోచ్ పదవికి ఎంపికయిన వ్యక్తి 2027 వన్డే ప్రపంచకప్ వరకు భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా కొనసాగుతారన్నమాట. అలాగే.. కొత్త కోచ్‌కు దరఖాస్తు చేసుకునేవాళ్ల వయసు 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. పారితోషికం అనుభవాన్ని బట్టి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. వీటితో పాటు.. మూడు ఫార్మాట్లలో జట్టుకు హెడ్ కోచ్ గా కొనసాగుతాడు. కోచ్‌కు 14-16 మంది సహాయక సిబ్బంది ఉంటారు. టీమ్ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడు. అలాగే స్పెషలిస్ట్ కోచ్‌లు, సహాయక సిబ్బంది బృందానికి నాయకత్వం వహిస్తాడు. భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యతఅర్హతలుకనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదంటే.. టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.ఐపీఎల్ జట్టు లేదా సమానమైన ఇంటర్నేషనల్ లీగ్/ఫస్ట్ క్లాస్ జట్లకు/ జాతీయ అ జట్లకు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు పనిచేసి ఉండాలి.బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.పై కండిషన్లలో ఏది ఉన్నా సరే.. దరఖాస్తు చేసుకోవచ్చు.ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్లేయర్టీమిండియా హెడ్ కోచ్ దరఖాస్తుల నేపథ్యంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ ఈ పదవిపై ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా ఉన్నాడు‘‘టీమిండియా హెచ్ కోచ్ పదవిపై నేను ఆసక్తిగా ఉన్నాను. దీని గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. ప్రతి అంతర్జాతీయ కోచ్ పై నాకు అమితమైన గౌరవం ఉంది. ఎందుకంటే అందులో ఉండే ఒత్తిడి నాకు తెలుసు. కానీ ఇండియన్ టీమ్ కోచింగ్ అద్భుతమైన జాబ్. ఈ దేశంలో ఉన్న టాలెంట్ చూసిన తర్వాత కోచ్ పదవి అనేది ఆకర్షణీయంగా కనిపిస్తోంది’’ అని లాంగర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.లాంగర్ కెరీర్జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా తరఫున 105 టెస్టులు ఆడాడు. 45 సగటుతో 7696 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ కోచ్ గా ఉన్నాడు. అతని కోచింగ్ లోనే 2021లో ఆస్ట్రేలియా తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా కోచ్ గా ఉన్నాడు. గత రెండు సీజన్లలోనూ ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరుకుంది.ఫారినర్‌కు ఛాన్స్ దక్కేనా?డంకన్ ఫ్లెచర్ తర్వాత గత పదేళ్లలో మరో విదేశీ కోచ్ ను నియమించలేదు. కుంబ్లే, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ ఈ బాధ్యతను చేపట్టారు. దీంతో.. బీసీసీఐ మరోసారి విదేశీ కోచ్ ను నియమిస్తుందా లేదా అన్నది చూడాలి. అయితే ఈసారి ఓ విదేశీ కోచ్ ను నియమించే అవకావాలను కూడా కొట్టిపారేయలేం అన్నట్లుగా బీసీసీఐ సెక్రటరీ జై షా మాటలను బట్టి అర్థమవుతోంది. -
Mayank: అభిమానులకు బ్యాడ్‌న్యూస్: ఇప్పట్లో కష్టమే!
ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ శుక్రవారం సొంత మైదానంలో మరో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో తలపడేందుకు సిద్దమైంది. అయితే, ఈ మ్యాచ్‌కు లక్నో యుంగ్ స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. తదుపరి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా 21 ఏళ్ల పేస్ సంచలనం మయాంక్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి మైదానం వీడిన మయాంక్.. తీవ్రమైన తొంటి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విలువైన ఆటగాడిని కాపాడుకోవాలని.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించిన తర్వాతే అతడిని మళ్లీ బరిలోకి దించాలని లక్నో యాజమాన్యం భావిస్తోంది. ఈ విషయం గురించి లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఏప్రిల్ 19 నాటి మ్యాచ్ కోసం మయాంక్‌ను ఫిట్‌గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. మయాంక్ లాంటి ప్రతిభావంతుడి సేవలను ప్రతీ మ్యాచ్‌లో ఉపయోగించుకోవాలని భావించడం సహజమేనన్న లాంగర్.. అన్నింటికంటే అతడి ఫిట్నెస్గా ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు మయాంక్ సిద్ధమయ్యాడని.. అయితే పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే మళ్లీ ఆడిస్తామని లాంగర్ తెలిపాడు. ఢిల్లీతో పాటు కేకేఆర్‌తో మ్యాచ్‌కు కూడా మయాంక్ దూరంగా ఉంటాడని ఈ సందర్భంగా జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. కాగా గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతున్న మయాంక్ యాదవ్ అరంగేట్రంలోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ యూపీ పేసర్ 3/27తో సత్తా చాటాడు. లక్నోను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి మరోసారి ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా వరుస మ్యాచ్‌లకు మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. అతడి స్పీడ్ డెలివరీలను చూడాలనుకున్న అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్‌న్యూస్!! చదవండి: IPL 2024 MI VS RCB: ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ముంబైకి గుడ్‌బై.. ఆ జట్టులో చేరనున్న రోహిత్ శర్మ?!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును వీడనున్నాడా? ఐపీఎల్-2025 ఆరంభానికి ముందై ఎంఐతో తెగదెంపులు చేసుకోనున్నాడా?.. అవమానాన్ని తట్టుకోలేక ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాడా?.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభమైన నాటి నుంచే హిట్‌మ్యాన్ గురించి క్రీడా వర్గాల్లో ఈ చర్చ నడుస్తూనే ఉంది. కాగా ఐపీఎల్-2024కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను భారీ ధరకు ట్రేడ్ చేసుకున్న ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదుసార్లు జట్టుకు ట్రోఫీ అందించిన రోహిత్‌ను కాదని పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. ఇందుకు బదులుగా రోహిత్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ముంబై ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయంపై తమకున్న కోపాన్ని పాండ్యాపై నేరుగానే ప్రదర్శిస్తున్నారు అభిమానులు. మైదానంలో అతడిని హేళన చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. రోహిత్ వద్దని వారించినా వారు వినే స్థితిలో లేరు. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ పట్ల కూడా హార్దిక్ ప్రవర్తన కాస్త భిన్నంగానే ఉంది. పదే పదే అతడి ఫీల్డింగ్ పొజిషన్ మార్చడంతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సేవలను కూడా సరిగ్గా వాడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడి.. నాలుగో మ్యాచ్‌లో గెలిచినా రోహిత్ ముఖంలో పెద్దగా సంతోషం కనిపించకపోవడం జట్టులోని విభేదాలను తేటతెల్లం చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఎవరూ ఊహించని జట్టులోకి రోహిత్? ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది. ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రోహిత్ శర్మను సొంతం చేసుకోనుందని అందులోని సారాంశం. ఈ వార్త పుట్టుకు రావడానికి ఓ కారణం ఉంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా లక్నో కోచ్ జస్టిన్ లాంగర్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. ఐపీఎల్లో మీరు ఏ ఆటగాడిని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. ‘‘ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలా? ఎవరి పేరైనా చెప్పవచ్చా? నేను ఎవరి పేరు చెబుతానని మీరు అనుకుంటున్నారు’’ అని లాంగర్ తిరిగి ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా.. ‘‘మేము చాలా మంది పేర్లు అనుకుంటున్నాం గానీ రోహిత్ శర్మను మీరు జట్టులో చేర్చుకోగలరా?’’ అని పేర్కొన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన లాంగర్.. ‘‘ఏంటీ రోహిత్ శర్మనా? ఒకే అతడిని ముంబై నుంచి మేము ట్రేడ్ చేసుకుంటాం. నాకు తెలిసి ఈ డీల్ మీరే కుదర్చగలరు’’ అని సరదాగా సమాధానమిచ్చాడు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాగా 2011లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన రోహిత్ శర్మ 13 సీజన్లుగా అదే జట్టుకు ఆడుతున్నాడు. కెప్టెన్‌గా ఐదుసార్లు టైటిల్ గెలిచాడు. చదవండి: రోహిత్, కోహ్లి కాదు.. భూగ్రహం మొత్తం మీద అతడే బెస్ట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'సచిన్, లారా కాదు.. నా లైఫ్‌లో నేను చూసిన బెస్ట్ ప్లేయర్ అతడే'
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లు మూడింట విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. అయితే లక్నో విజయాల వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉంది. అతడే లక్నో హెడ్ కోచ్, ఆసీస్ లెజెండరీ క్రికెటర్ జస్టిన్ లాంగర్. ఈ ఏడాది సీజన్‌తో లక్నో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన లాంగర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అయితే లాంగర్ తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన లైఫ్‌లో చూసిన అద్బుతమైన క్రికెటర్లు గురించి లాంగర్ చర్చించాడు. "ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసిన బెస్ట్ ఆటగాడు విరాట్ కోహ్లినే. ఈ విషయాన్ని నేను ఇప్పటికే చాలా సార్లు పబ్లిక్‌గా చెప్పాను. నాకు లెజండరీ క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, అలన్ బోర్డర్, మార్టిన్ క్రోవ్‌లు అంటే కూడా నాకు ఇష్టం. మార్టిన్ క్రోవ్‌కు ప్రత్యర్ధిగా కూడా నేను ఆడాను. అదేవిధంగా బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్ కూడా గొప్ప ఆటగాళ్లు. కానీ విరాట్ ఎనర్జీ వీరిందరి కంటే అద్భుతం. అతడు చాలా ఫిట్‌గా ఉన్నాడు. విరాట్ మైదానంలో వికెట్ల మధ్య పరిగెత్తడం, ఫీల్డింగ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. కాబట్టి అతని ఆట చూడటం నాకు చాలా ఇష్టం. మాతో మ్యాచ్‌లో కోహ్లిని తొందరగా ఔట్ చేయడం ఔట్ చేయడం చాలా సంతోషంగా అన్పించిందని" లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూలో లాంగర్ పేర్కొన్నాడు. -
లక్నో సూపర్ జెయింట్స్‌లో కీలక పరిణామం.. అసిస్టెంట్ కోచ్‌పై వేటు
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ విజయ్ దాహియాపై ఫ్రాంచైజీ యాజమాన్యం వేటు వేసింది. ఈ విషయాన్ని ఇరు పక్షాలు ధృవీకరించాయి. ఎల్ఎస్జీతో రెండేళ్ల బంధాన్ని తెంచుకుంటున్నట్లు దాహియా తన సోషల్‌మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించగా.. లక్నో మేనేజ్మెంట్ దాహిదాకు ఆల్ ద బెస్ట్ చెప్పింది. హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్ బాధ్యతలు చేపట్టాక లక్నో ఫ్రాంచైజీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల గౌతమ్ గంభీర్ లక్నో మెంటార్షిప్ను వదులకుని తన హోం ఫ్రాంచైజీ అయిన కేకేఆర్‌కు వెళ్లిపోగా.. లాంగర్ పట్టుబట్టి శ్రీధరన్ శ్రీరామ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా తన బృందంలో చేర్చుకున్నాడు. తాజాగా దాహియా కూడా ఫ్రాంచైజీని వీడటంతో జట్టులొ అంతర్గతంగా ఎదో జరుగుతుందని అంతా అనుకుంటున్నారు. View this post on Instagram A post shared by Vijay Dahiya (@vijay.dahiya.1973) కాగా, కొన్ని రోజుల కిందట లక్నో యాజమాన్యం ఆండీ ఫ్లవర్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో జస్టిన్ లాంగర్‌ను కూర్చోబెట్టింది. లాంగర్‌కు ఆసీస్ హెడ్ కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీంతో ఎల్ఎస్జీ యాజమాన్యం అతని కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి అక్కున చేర్చుకుంది. ఎల్ఎస్జీతో జతకట్టినప్పటి నుంచి లాంగర్ తనదైన ముద్రను వేసుకుంటున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 వేలంలోనూ అతను చాలా కీలకంగా వ్యవహరించాడు. ఈ వేలంలో లక్నో ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దాహియా స్థానంలో కొత్త అసిస్టెంట్ కోచ్‌గా సురేశ్ రైనాను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి రైనా తన స్థాయికంటే చిన్నదైన అసిస్టెంట్ కోచ్ పదవి చేపడతాడో లేదో వేచి చూడాలి. మరోవైపు రైనాను గంభీర్ స్థానంలో లక్నో మెంటార్‌గా నియమిస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. All the best for your next chapter, @vijdahiya !🙏💙 pic.twitter.com/7RhyyOuXnD — Lucknow Super Giants (@LucknowIPL) January 1, 2024 కాగా, లక్నో సూపర్ జెయింట్స్ 2022 సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు ఓ మోస్తరు ప్రదర్శనలు చేసి ఫైనల్ ఫోర్ వరకు చేరింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలో ఈ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మరోవైపు లక్నోతో పాటే ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ ఓ సారి ఛాంపియన్‌గా, మరోసారి రన్నరప్‌గా నిలిచింది. లక్నో కోచింగ్ సిబ్బంది: హెడ్‌కోచ్ : జస్టిన్ లంగర్ అసిస్టెంట్ కోచ్ : శ్రీధరన్ శ్రీరామ్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ : మోర్నీ మోర్కెల్ ఫీల్డింగ్ కోచ్ : జాంటీ రోడ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ : ప్రవీణ్ తాంబే -
ఐపీఎల్ ఒలింపిక్స్‌తో సమానం.. చాలా సంతోషంగా ఉంది: లక్నో హెడ్ కోచ్
ఐపీఎల్‌పై ఆస్ట్రేలియా మాజీ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ ఒలిపింక్స్‌తో సమానమని లాంగర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ఆండీ ప్లవర్ స్ధానాన్ని లంగర్‌తో లక్నో ఫ్రాంచైజీ భర్తీ చేసింది. ఐపీఎల్లో హెడ్‌కోచ్ పదివి చేపట్టడం లంగర్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. లంగర్‌కు కోచ్‌గా అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి నేతృత్వంలోనే ఆసీస్ తొలి టీ20 వరల్డ్‌కప్(2021)ను సొంతం చేసుకుంది. అదే విధంగా బిగ్‌బాష్ లీగ్‌లో కూడా లంగర్ కోచ్‌గా విజయవంతమయ్యాడు. ఈనేపథ్యంలో లక్నో ఫ్రాంచైకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లంగర్ మాట్లాడుతూ.. "రికీ పాటింగ్కు ఐపీఎల్ టోర్నీ అంటే చాలా ఇష్టం. అతడితో నేను ఎప్పుడు మాట్లాడిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన ప్రయాణం గురించే చెబుతూ ఉంటాడు. అదే విధంగా నా బెస్ట్ ఫ్రెండ్ టామ్ మూడీ సైతం ఐపీఎల్లో చాలా కాలంగా తన సేవలు అందిస్తున్నాడు. అతడు కూడా చాలా సార్లు ఈ టోర్నీ కోసం నాతో మాట్లాడాడు. ఐపీఎల్ అనేది ఒలింపిక్స్ క్రీడలు వంటిది. ఇది చాలా పెద్ద ఈవెంట్. ప్రతీ మ్యాచ్ ఒక అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు ఆదరణ ఉంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియాలు దద్దరిల్లిపోతాయి. ఇటువంటి లీగ్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. చదవండి: PAK vs AUS: పాకిస్తాన్‌తో మూడో టెస్టు.. ఆసీస్ జట్టు ప్రకటన! వార్నర్‌కు ఆఖరి మ్యాచ్ -
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన.. ఇకపై గంభీర్..
IPL 2024- Lucknow Super Giants: ఐపీఎల్-2024 నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ తమ కోచింగ్ సిబ్బందిని ప్రకటించింది. టీమిండియా మాజీ స్టార్ గౌతం గంభీర్‌ను గ్లోబల్ మెంటార్‌గా ప్రమోట్ చేసిన మేనేజ్మెంట్.. శ్రీధరన్ శ్రీరామ్‌ను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. హెడ్‌కోచ్ అతడే గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్పిన్ కన్సల్టెంట్‌గా పనిచేసిన శ్రీరామ్ ఎల్ఎస్జీ అసిస్టెంట్ కోచ్‌గా సేవలు అందించనున్నాడు. ఇక లక్నో ఫ్రాంఛైజీ తమ జట్టు హెడ్‌కోచ్‌గా ఇప్పటికే జస్టిన్ లాంగర్‌ను నియమించిన విషయం తెలిసిందే. అతడికి తోడుగా.. విజయ్ దహియా, ప్రవీణ్ తాంబేలతో పాటు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు మోర్నీ మోర్కెల్, జాంటీ రోడ్స్ అసిస్టెంట్ కోచ్‌లుగా పనిచేయనున్నారు. PC: LSG బంగ్లాదేశ్‌ను గెలుపుబాటలో నడిపి శ్రీధరన్ శ్రీరామ్ చేరిక లక్నో సూపర్ జెయింట్స్‌కు అదనపు బలంగా మారనుంది. 47 ఏళ్ల ఈ టీమిండియా మాజీ స్పిన్నర్ గతంలో బంగ్లాదేశ్ పురుషుల టీ20 జట్టుకు మార్గదర్శనం చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో సూపర్-12లో బంగ్లా అద్భుతంగా ఆడేలా కోచింగ్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా జట్టుకు సైతం అంతేకాదు.. ఆస్ట్రేలియా జట్టుకు సైతం శ్రీరామ్ కోచ్‌గా వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్, 2021-22 యాషెస్ సిరీస్ సమయంలో జట్టుతో ప్రయాణించాడు. అదే విధంగా.. గతంలో ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ప్లేఆఫ్స్ చేరినా.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో సీజన్ మధ్యలోనే వైదొలిగినా జట్టు ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగలిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం ఒకే ఒక్క రన్ తేడాతో టాప్-4లో నిలిచిన లక్నో కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. కోహ్లి- గంభీర్ వివాదం ఇదిలా ఉంటే.. లక్నో- ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా నవీన్ ఉల్ హక్ కారణంగా విరాట్ కోహ్లి- గంభీర్ మధ్య తలెత్తిన గొడవ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్థాయి మరిచి ప్రవర్తించిన ఈ ఇద్దరు స్టార్లపై క్రికెట్ దిగ్గజాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చదవండి: అవసరం లేదు! సంజూ శాంసన్‌ను స్వదేశానికి పంపిన బీసీసీఐ S Sriram joins to complete our coaching staff for 2024 💙 Full story 👉 https://t.co/4svdieJytL pic.twitter.com/8EgX2Pg8uP — Lucknow Super Giants (@LucknowIPL) September 9, 2023 -
IPL: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కోచ్.. ప్రకటించిన ఫ్రాంఛైజీ
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కొత్త హెడ్ కోచ్‌ను నియమించుకుంది. ప్రస్తుత కోచ్ ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ 2023 సీజన్‌తో ముగియడంతో, అతని స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఎల్ఎస్జీ యాజమాన్యం ఇవాళ (జులై 14) అధికారికంగా ప్రకటించింది. ఎల్ఎస్జీకి ఆండీ ఫ్లవర్ చేసిన సేవలను అభినందిస్తూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన మేనేజ్మెంట్.. కొత్త కోచ్ పేరును ప్రకటించింది. ఫ్లవర్ కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు సముఖత చూపని లక్నో మేనేజ్మెంట్.. మెంటార్‌గా గౌతమ్ గంభీర్ సేవలను మాత్రం ఎక్స్టెండ్ చేసింది. గంభీర్‌తో పాటు బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌ను, ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ను, అసిస్టెంట్ కోచ్‌గా విజయ్ దాహియాను కొనసాగించింది. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఓ పక్క తమతో పాటు ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓ సీజన్లో విజేతగా, మరో సీజన్లో రన్నరప్‌గా నిలువడంతో ఎల్ఎస్జీ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే హెడ్ కోచ్‌ను మార్చింది. మున్ముందు ఈ జట్టులో భారీ మార్పులు ఉంటాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను కూడా తప్పించవచ్చని ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్-2024కు మరో ఏడాది సమయం ఉంది కాబట్టి, కెప్టెన్ మార్పు విషయంలో ఎల్ఎస్జీ యాజమాన్యం ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకపోవచ్చు. లక్నో కొత్త కోచ్ విషయానికొస్తే.. 52 ఏళ్ల లాంగర్ ఆసీస్‌ను 2021 టీ20 వరల్డ్‌కప్ విజేతగా, బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా (కోచ్‌గా) నిలబెట్టాడు. కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు కలిగిన లాంగర్‌ను ఎల్ఎస్జీ యాజమాన్యం ఏరికోరి ఎంచుకుంది. 1993-2007 మధ్యకాలంలో ఆసీస్ తరఫున 105 టెస్ట్‌లు 8 వన్డేలు ఆడిన లాంగర్.. సక్సెస్ఫుల్ ఓపెనింగ్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. వన్డేల్లో పెద్దగా రాణించని లాంగర్ టెస్ట్‌ల్లో సత్తా చాటాడు. 182 ఇన్నింగ్స్‌ల్లో 23 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 45.3 సగటున 7696 పరుగులు చేశాడు. -
లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఓపెనర్..?
వచ్చే ఐపీఎల్ సీజన్ (2024) కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ జట్టు.. తమ హెడ్ కోచ్‌ను మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ 2023 సీజన్‌తోనే ముగియడంతో ఆ జట్టు కొత్త కోచ్ అన్వేషణలో పడింది. ఈ పదవి కోసం ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఆసీస్ మాజీ హెడ్ కోచ్, ఆ జట్టు మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై లాంగర్ కాని, ఎల్ఎస్జీ యాజమాన్యం కాని ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇరు వర్గాల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు క్రికెట్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే వచ్చే సీజన్ నుంచి ఎల్ఎస్జీ హెడ్ కోచ్‌గా లాంగర్ వ్యవహరించే అవకాశం ఉంది. 52 ఏళ్ల జస్టిన్ లాంగర్.. ఆసీస్‌ను 2021 టీ20 వరల్డ్‌కప్ విజేతగా, బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా (కోచ్‌గా) నిలబెట్టాడు. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. వ్యాపార దిగ్గజం సంజీవ్ గోయెంకా కొనుగోలు చేసిన ఎల్ఎస్జీ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా, మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా, విజయ్ దాహియా అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఇంగ్లండ్ తిక్క కుదిరింది.. బజ్‌బాల్ అప్రోచ్‌కు అదే విరుగుడు
బజ్‌బాల్ విధానం అంటూ టెస్ట్ క్రికెట్లో వేగం పెంచే ప్రయత్నం చేస్తూ, ఇటీవలే ఆసీస్ చేతిలో చావు దెబ్బ (యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఓటమి) తిన్న ఇంగ్లండ్ టీమ్‌ను ఉద్దేశిస్తూ ఆసీస్ మాజీ ఓపెనర్, మాజీ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ కనబర్చిన సంయమనం ఇంగ్లండ్ బజ్‌బాల్ పద్ధతికి విరుగుడు అని ఆయన అభిప్రాయపడ్డాడు. యాషెస్ తొలి టెస్ట్ ఆఖరి రోజు ఇంగ్లండ్ ఆసీస్‌ను తెగ ఇబ్బంది పెట్టిందని, అయితే కమిన్స్ క్రీజ్‌లోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నాడు. కమిన్స్ తీవ్రమైన ఒత్తిడిలో ఎంతో ఓర్పును, సహనాన్ని ప్రదర్శించి తన జట్టును విజయతీరాలకు చేర్చాడని.. ఒత్తిడిలో కమిన్స్ ప్రదర్శించిన ఆ ఓర్పు,సహనమే ఆసీస్‌ను గెలిపించిందని తెలిపాడు. కమిన్స్‌కు లయోన్ అద్భుతంగా సహకరించాడని, వారిద్దరు ఒత్తిడిని అధిగమించి, తమ జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారని పేర్కొన్నాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా గెలవడం వల్లే ఆసీస్ వరల్డ్ నంబర్ జట్టుగా చలామణి అవుతుందని, ఇందుకు యాషెస్ తొలి టెస్ట్ ఉదాహరణ అని చెప్పుకొచ్చాడు. బజ్‌బాల్‌కు విరుగుడు ఏమిటనే దానిపై గతంలో చాలా సందర్భాల్లో ప్రశ్నలు తలెత్తాయని.. ఆసీస్ కెప్టెన్ తొలి టెస్ట్‌లో బంతితో పాటు కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ ప్రశ్నకు జవాబిచ్చాడని తెలిపాడు. కాగా, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. పాట్ కమిన్స్ (0/59, 38, 4/63, 44 నాటౌట్) ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆసీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. వికెట్లు చేతిలో ఉన్నా, తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఇంగ్లండ్ చేతులు కాల్చుకోగా.. తమ ముందు బజ్‌బాల్ గిజ్బాల్ జాన్తానై అంటూ ఆసీస్.. ఇంగ్లండ్ ఎత్తుగడను తిప్పికొట్టింది. ఛేదనలో కమిన్స్ ప్రదర్శించిన ఓర్పు, సంయమనం ఇంగ్లండ్ బజ్‌బాల్ అప్రోచ్‌ను తుంగలో తొక్కి ఆసీస్‌కు చారిత్రక విజయాన్ని అందించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ జూన్ 28 నుంచి లార్డ్స్ వేదికగా జరుగనుంది. -
'నెంబర్ వన్ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు'
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్ క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ తీరును ఎండగట్టాడు. అవసరం ఉన్నప్పుడు వాడుకున్నారని.. మరో అవకాశం ఇవ్వాలని అడిగితే పదవి నుంచి తొలగించారంటూ అసహనం వ్యక్తం చేశాడు. విషయంలోకి వెళితే.. 2021లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్‌ను ఎగురేసుకుపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. దీని వెనకాల ప్రధాన కారణం అప్పటి కోచ్ జస్టిన్ లాంగర్. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 4-0తేడాతో గెలవడంలోనూ లాంగర్‌దే ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చు. అతని హయాంలోనే ఆస్ట్రేలియా మళ్లీ టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుంది. ఇప్పటికీ ఆస్ట్రేలియానే టెస్టుల్లో నెంబర్‌వన్‌గా ఉంది. ఎంత కాదన్నా కోచ్, ఆటగాళ్లు కలిస్తేనే ఇది సాధ్యమవుతుంది. అలా ఏడాది వ్యవధిలో రెండు గొప్ప ఫీట్లు సాధించిన కోచ్‌గా లాంగర్ పేరు గడించాడు. ఆ తర్వాత తన పదవిని పొడిగించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం లాంగర్ పదవిని మరో ఆరు నెలల పాటు మాత్రమే పొడిగించింది. పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిన సమయంలోనే లాంగర్‌ను తొలగించి ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను కొత్త కోచ్‌గా ఎంపిక చేసింది. అలా లాంగర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియాతో బంధం ముగిసింది. తాజాగా తనకు జరిగిన అన్యాయంపై లాంగర్ డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో స్పందించాడు.''తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు పిరికివాళ్లని.. కానీ మెజారిటీ ఆటగాళ్లు మద్దతు ఇచ్చారు. పాట్ కమిన్స్ సహా కొందరు ఆటగాళ్లు నా ముందు మంచిగా నటించి వెనుక మత్రం గోతులు తవ్వినట్లుగా అనిపించింది. కోచ్‌గా నేను నచ్చకపోతే ముఖం మీద చెప్పాల్సింది.. ఇలా వెనుక మాట్లాడడం తగదు. కోచ్‌కు, ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న మనస్పర్థలు రావడం కామన్. నాకు తెలియకుండా పాట్ కమిన్స్ లాంటి కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం మాలో జరిగిన కొన్ని విషయాలను లీక్ చేశారు. ఇది నా దృష్టిలో పెద్ద తప్పు. ఇక నేను పదవికి రాజీనామా చేసే సమయానికి జట్టు నెంబర్‌వన్‌లో ఉంది. దానిని కూడా సరిగ్గా ఎంజాయ్ చేయకుండానే నన్ను కోచ్ పదవి నుంచి తప్పించారు.'' అంటూ పేర్కొన్నాడు. చదవండి: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు సరికొత్త ఫార్మాట్లో 2024 టి20 వరల్డ్‌కప్ -
లాంగర్ రాజీనామా.. ఆస్ట్రేలియా కొత్త కోచ్ ఎవరంటే!
Australia Cricket Team New Head Coach: జస్టిన్ లాంగర్ రాజీనామా నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అతడి స్థానంలో తాత్కాలిక హెడ్‌కోచ్‌ను నియమించింది. ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొంది. ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా అధికారిక ప్రకటన చేసింది. కాగా ఆసీస్ కోచ్‌గా కొనసాగాలని భావించిన జస్టిన్ లాంగర్ విజ్ఞప్తి పట్ల బోర్డు సానుకూలంగా స్పందించలేదు. దీంతో అతడు తన పదవి నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో ఆండ్రూకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. ఇక ఆస్ట్రేలియా తరఫున 2009లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆండ్రూ అదే ఏడాది తన చివరి మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో టీమిండియాతో 2009లో జరిగిన సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళరూకు ప్రాతినిథ్యం వహించాడు. 2013లో ఆండ్రూ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. చదవండి: Justin Langer: ఆసీస్ హెడ్‌కోచ్‌కు షాకిచ్చిన బోర్డు.. టీ20 వరల్డ్‌కప్, యాషెస్ విజయాలు.. అయినా తప్పని రాజీనామా U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! JUST IN: @CricketAus confirms Andrew McDonald has been appointed interim head coach of the Aussie men's team. More to come. — cricket.com.au (@cricketcomau) February 5, 2022 -
Justin Langer: ఆసీస్ హెడ్‌కోచ్‌కు షాకిచ్చిన బోర్డు.. రాజీనామా చేయక తప్పలేదు!
Justin Langer Resigns As Australia Coach: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్‌గా కొనసాగాలని భావించిన జస్టిన్ లాంగర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తానెంతగానో ప్రేమించే హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేయక తప్పలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో అనేక చర్చల అనంతరం.. జస్టిన్ లాంగర్ తన పదవి నుంచి వైదొలిగినట్లు అతడి మేనేజ్మెంట్ కంపెనీ డీఎస్ఈజీ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు... ‘‘మా క్లైంట్ జస్టిన్ లాంగర్.. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియాతో నిన్నటి చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నారు’’ అని పేర్కొంది. కాగా ఆసీస్ క్రికెట్ బోర్డుతో కుదిరిన ఒప్పందం ప్రకారం జస్టిన్ లాంగర్ జూన్ వరకు తన పదవిలో కొనసాగాల్సి ఉంది. అయితే, దీర్ఘకాలం పాటు పదవీ కాలాన్ని పొడిగించాలని కోరగా... బోర్డు అందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ క్రమంలో సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లే, సీఏ నేషనల్ టీమ్స్ హెడ్ బెన్ ఒలివిర్తో ఈ విషయం గురించి చర్చించగా.. సానుకూల ఫలితం రాలేదు. దీంతో లాంగర్ రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే... ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్, ప్రస్తుత టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ సహా పలువురు కీలక ఆటగాళ్లతో లాంగర్‌కు అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. చదవండి: సాండ్విచ్ కూడా తినడానికి అవకాశం ఇవ్వలేదు.. కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా? ఈ క్రమంలో ఆటగాళ్లతో విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటాడని, అంతా తాను చెప్పినట్లే జరగాలనే నియంతృత్వ ధోరణితో ఉంటాడని ఆటగాళ్లు అతడి వ్యవహారశైలిపై మండిపడినట్లు సమాచారం. ఆయనతో తమకు పొసగడం లేదంటూ కోచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పడంతో ఆయనను కొనసాగించేందుకు బోర్డు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా లాంగర్ మార్గదర్శనంలో ఆస్ట్రేలియా తొలిసారిగా టీ20 వరల్డ్‌కప్ చాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన యాషెస్ సిరీస్‌లోనూ 4-0 తేడాతో ట్రోఫీని కైవసం చేసుకుంది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
3 ఫార్మాట్లలో కొనసాగుతా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడమే లక్ష్యం: హెడ్‌కోచ్
Justin Langer: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియాకు మరోసారి మహర్దశ నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్-2021 ట్రోఫీ గెలిచి కొత్త చాంపియన్‌గా అవతరించింది ఆసీస్. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఏకంగా ట్రోఫీ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోనూ అదరగొడుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై తొలి రెండు టెస్టులలో ఏకపక్ష విజయం సాధించి.. సిరీస్ కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. వీటన్నింటిలో హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్ పాత్ర ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాల్ టాంపరింగ్(దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో) ఉదంతం తర్వాత ఆ అప్రదిష్టను చెరిపేసుకునేలా ఆట తీరుతో విమర్శకులకు సమాధానాలు ఇచ్చేలా జట్టును ప్రోత్సహించాడు. విజయాల బాట పట్టించి చాంపియన్‌గా నిలిపాడు. ఇక రానున్న రెండేళ్ల పాటు కంగారూలు బిజీబిజీగా గడుపనున్న సంగతి తెలిసిందే. అంతేగాక పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్-2022 టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 2023 వరల్డ్‌కప్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన జస్టిన్ లాంగర్ మూడు ఫార్మాట్లకు కోచ్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ‘‘వేరే ఆలోచనకు తావే లేదు. అవును.. నేను మూడు ఫార్మాట్లలో కొనసాగుతాను. గత నాలుగేళ్లుగా మా జట్టు నిలకడైన ప్రదర్శన కనబరుస్తోంది. హెడ్‌కోచ్‌గా నా పనిని నేను ప్రేమిస్తున్నాను. మావాళ్లు చాలా బాగా ఆడుతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వారితో మమేకం కావడం నాకు ఎంతో సంతోషం. ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని భావిస్తున్నా’’ అని లాంగర్ చెప్పుకొచ్చాడు. 2022, 2023 ప్రపంచకప్‌లతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నాడు. కాంట్రాక్ట్ పొడిగించాలనుకుంటున్నట్లు పరోక్షంగా తన మనసులోని మాటను వెల్లడించాడు. చదవండి: Kapil Dev: కపిల్‌లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్ గెలుస్తారు! రోహిత్.. ఇంకా కోహ్లి... IPL 2022- SRH: సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా బ్రియన్ లారా.. కొత్త సిబ్బంది వీళ్లే.. పరిచయం చేసిన ఫ్రాంఛైజీ -
T20 World Cup: గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా
మాథ్యూ హేడెన్.. జస్టిన్ లాంగర్.. వీరిద్దరు ఒకప్పుడు ఆసీస్‌కు ఓపెనింగ్ జోడీ. 2000 దశకంలో వీరు ఆసీస్ క్రికెట్‌ను ఒక ఊపు ఊపేశారు. ప్రధానంగా టెస్టుల్లో ఈ జోడీ అత్యంత భయంకరమైన జోడీగా గుర్తింపు పొందింది. టెస్టుల్లో ఆసీస్‌కు అత్యుత్తమ ఓపెనింగ్ ద్వయంగా నిలిచింది. టెస్టు క్రికెట్లో ఈ జోడి ఆసీస్ తరఫున నాల్గో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను నమోదు చేయడం వారు సక్సెస్ఫుల్ జోడీగా చెప్పడానికి ఒక ఉదాహరణ. 2004లో శ్రీలంకపై చేసిన 255 పరుగుల వీరి తొలి వికెట్ అత్యుత్తమ భాగస్వామ్యం. ఇదిలా ఉంచితే, వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడ్డారు. కానీ ముఖాముఖి పోరులో కాదు.. కోచ్‌లుగా అమీతుమీ తేల్చకున్నారు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా మాథ్యూ హేడెన్ పాకిస్తాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తుంటే, ఆసీస్‌కు జస్టిన్ లాంగర్ కోచ్‌గా ఉన్నాడు. కాగా, గురువారం జరిగిన సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌పై ఆసీస్ విజయం సాధించడంతో లాంగర్‌దే పైచేయి అయ్యింది. పాకిస్తాన్‌పై ఆసీస్ విజయం సాధించడంతో ఫైనల్లోకి ప్రవేశించింది. 2010 తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ఈ పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌లో ఆసీస్ రెండుసార్లు మాత్రమే తుది పోరుకు అర్హత సాధించింది. మరొకవైపు ఈ వరల్డ్‌కప్‌లో బ్యాటింగ్‌లో పాకిస్తాన్ రాణించడంతో హేడెన్ హీరో అయ్యాడు. తొలి మ్యాచ్ మొదలుకొని చూస్తే పాకిస్తాన్ బ్యాటింగ్ పదును పెరిగింది. ఇది గత పాకిస్తాన్ క్రికెట్ జట్టేనే అన్నట్లుగా మెరిసింది. ఇందుకు హేడెన్ ప్రధాన కారణమనే చర్చ తెరపైకి వచ్చింది. హేడెన్ బ్యాటింగ్ వ్యూహాలతోనే పాకిస్తాన్ అద్బుతమైన ఫలితాలు సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 12 జట్లు తలపడే టీ 20వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు సెమీస్‌కు చేరుతుందనే అంచనాలు పెద్దగా లేవు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఘోరమైన ప్రదర్శన కారణంతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడమే ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేకపోవడానికి కారణం. కానీ అంచనాలను తలక్రిందులు చేస్తూ పాకిస్తాన్ సెమీస్‌కు రావడమే కాకుండా, బెస్ట్ ఆఫ్ ఫోర్లో గట్టిపోటీ ఇచ్చింది. ఈ వరల్డ్‌కప్ సెమీ ఫైనల్లో తొలుత ఆ జట్టు బ్యాటింగ్ చేసిన తీరు పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుతుందని అంతా అనుకున్నారు. బోర్డుపై 177 పరుగుల టార్గెట్‌ను ఉంచడంతో పాకిస్తాన్ విజయం సాధిస్తుందని సగటు అభిమాని భావించాడు. కానీ మాథ్యూ వేడ్, స్టోయినిస్‌ల మెరుపు ఇన్నింగ్స్‌లు ఆసీస్‌ను గెలిపించాయి. ఒకవేళ నిన్నటి మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుచుంటే ఆ క్రెడిట్ కచ్చితంగా హేడెన్ ఖాతాలోకి వెళ్లేది. కానీ ఆసీస్ ఫైనల్‌కు చేరడంతో మిత్రడు హేడెన్‌పై లాంగర్‌దే ఆధిక్యమైంది. దీంతో ‘ఎవరు గెలిస్తే ఏముంది’.. గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా అని హేడెన్ సర్దిచెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఆ స్లో ఓవర్‌రేట్ మా కొంపముంచింది: లాంగర్
సిడ్నీ: టీమిండియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మా కొంపముంచిందంటూ ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. ఆ మ్యాచ్‌లో మా బౌలర్లు గంటలో 15 ఓవర్లు వేయాల్సి ఉండగా.. రెండు ఓవర్లు తక్కువగా వేశారు. దాంతో మాపై స్లో ఓవర్ రేట్ నమోదైంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మేము నాలుగు పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అప్పటికీ ఈ విషయంపై మా జట్టు మేనేజర్ గెవిన్ డెవోయ్‌తో పాటు ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్‌తో చర్చించాను. స్లో ఓవర్ రేట్ వల్ల పాయింట్లు కోల్పోయే అవకాశం ఉందని.. అది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నా. ఇదే విషయంలో ఆసీస్ బౌలర్లను కూడా హెచ్చరించా. సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లో స్లో ఓవర్‌రేట్ కాకుండా చూసుకోవాలని తెలిపా. కానీ అనూహ్యంగా కరోనా కారణంగా దక్షిణాఫ్రికా టూర్ రద్దవడం మాకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఆ సిరీస్ రద్దు కావడం.. టీమిండియాతో జరిగిన సిరీస్‌ను మేం చేజార్చుకోవడంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అర్హతకు మరింత దూరం కావాల్సి వచ్చింది. అంటూ తెలిపాడు. ఇదిలా ఉంచితే.. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయం సాధించడం ద్వారా టెస్టుల్లో అగ్రస్థానంలో నిలవడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. జూన్‌లో సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఎదుర్కోనుంది. అయితే డబ్ల్యూటీసీ పట్టికలో పీసీటీ పాయింట్ల పరంగా చూస్తే టీమిండియా 72 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ 70 శాతంతో రెండో స్థానంలో.. ఆసీస్ 69.2 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. పాయింట్ల పరంగా చూస్తే.. కివీస్‌కు, ఆసీస్‌కు 0.8 శాతం తేడా మాత్రమే ఉంది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం... అనుకున్న సమయానికి ఒక ఓవర్ తక్కువ వేస్తే.. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు రెండు ఫెనాల్టీ పాయింట్లు విధిస్తారు. ఆ విధంగా ఆసీస్ రెండు ఓవర్లు తక్కువ వేయడంతో మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానాతో పాటు నాలుగు ఫెనాల్టీ పాయింట్లు దక్కించుకుంది. చదవండి: 'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి' ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! -
'ఆ వార్తలు నా కుటుంబాన్ని బాధించాయి'
సిడ్నీ: టీమిండియాతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోపీని 2-1 తేడాతో ఆసీస్ ఓడిపోయిన తర్వాత ఆ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్లతో లాంగర్‌కు పొసగడం లేదని.. అతని ప్రవర్తనతో వారు ఇబ్బందులకు గురవుతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో లాంగర్ ఆటగాళ్లతో ముభావంగా ఉండడం... తాను ఏం చెబితే అది చేయాలని.. ముఖ్యంగా గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో బౌలింగ్ విషయంలో జోక్యం చేసుకొని అనవసర సలహాలు ఇచ్చేవాడని.. ఆసీస్ బౌలర్లు కూడా అతని తీరుతో సంతృప్తిగా లేరంటూ పేర్కొంది. ఈ విషయాలను తాను సీరియస్‌గా తీసుకున్నానని.. జట్టుతో తనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తానని లాంగర్ అప్పట్లో స్పందించాడు. అయితే తాజాగా ఆటగాళ్లతో కోచ్‌గా తన ప్రవర్తన బాలేదంటూ మీడియాలో మరోసారి వార్తలు లీక్ అవడం తనను బాధించిందని లాంగర్ తెలిపాడు. ఈ వార్తలతో తాను మానసికంగా కుంగిపోతున్నానని.. నా ఫ్యామిలీకి ఈ విషయాలు తెలిసి బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ''నా వరకు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. ఎన్నో ఏళ్లు ఆటగాడిగా జట్టుకు సేవలందించా. ఆటగాడిగా ఉన్నప్పుడు రాని విమర్శలు కోచ్ పదవిలో ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. టెస్టు సిరీస్ ముగిసిన రెండు వారాలకు ఆటగాళ్లతో నా ప్రవర్తన బాలేదంటూ వార్తలు వచ్చాయి. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఆటగాళ్లు లేక అసిస్టెంట్ కోచ్ నా వద్దకు వచ్చి సమస్యను చెప్తే సరిపోతుంది. ఈ విషయం వాళ్లకు అప్పుడే చెప్పా. నేను ఎక్కడ పనిచేసినా నిజాయితీతో ఉంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. బహుశా నేను ఏంచుకన్న దారి ఆటగాళ్లకు నచ్చలేదు. అందుకే వారు నాతో సరిగా ఉండలేకపోయారు. అయితే పదే పదే అదే విషయాన్ని గుర్తు చేస్తూ మీడియాలో కథనాలు లీక్ అవడం భాదించింది. చివరకు నా భార్య కూడా ఇన్ని అవమానాలు పడుతూ ఆసీస్ సీనియర్ జట్టుకు కోచ్‌గా పనిచేయడం అవసరమా అని ప్రశ్నించింది. నేను మాట్లాడే మాటలు సూటిగా ఉండొచ్చు.. కానీ నాకు మనసు ఉంటుంది. పైకి అది గట్టిగా కనిపించినా.. లోపల మాత్రం చాలా బాధ ఉంది. ఆటగాళ్లతో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను ఎప్పటికి సిద్ధమే'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా? ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! -
కోచ్‌గా నా బాధ్యత నిర్వర్తించడం తప్పా?
బ్రిస్బేన్: ఆసీస్ యువ ఆటగాడు మార్నస్ లబుషేన్‌తో వివాదంపై ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. గబ్బా వేదికగా జరిగిన నాలుగోటెస్టులో లబుషేన్ తన జేబులో సాండ్విచ్ తీసుకురావడంపై లాంగర్ అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఆసీస్ జట్టులోని పలువురు ఆటగాళ్లు లాంగర్ ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. లాంగర్ ఒక స్కూల్ హెడ్‌మాస్టర్‌లాగా ప్రవర్తిస్తున్నాడని.. అతనితో తమకు పొసగడం లేదంటూ పరోక్ష్య వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సిడ్నీ హెరాల్డ్ పత్రిక ఆసీస్ జట్టులో విభేదాలు వచ్చాయని.. దీనికి కారణం లాంగర్ అంటూ పేర్కొంది. పత్రికలో వచ్చిన కథనంపై లాంగర్ స్పందిస్తూ.. అవన్నీ తప్పుడు కథనాలని.. వాటిలో నిజం లేదని తేల్చి చెప్పాడు.చదవండి: ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! అయితే తాజాగా తనను కనీసం సాండ్విచ్ కూడా తినడానికి అవకాశం ఇవ్వలేదంటూ లబుషేన్ పేర్కొనడంతో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో లాంగర్ మళ్లీ స్పందిస్తూ.. ' మ్యాచ్ సమయంలో లబుషేన్‌కు సాండ్విచ్ తినొద్దు అని మాత్రమే చెప్పా.. ఎందుకంటే అప్పటికే ఆటకు 40 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు.. అప్పుడు తినకుండా.. దానిని జేబులో పెట్టుకొని ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించాను. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కోచ్‌గా నా జట్టును ఉన్నతస్థానంలో నిలిపాలని ఆశిస్తుంటా. అందుకే కాస్త క్రమశిక్షణగా మెలిగి ఉండొచ్చు. అంతమాత్రానికే కొందరు ఆటగాళ్లు నన్ను తప్పుబడుతూ బ్యాడ్ చేయాలని చూస్తున్నారు.చదవండి: ధోనీ అరుదైన రికార్డు.. తొలి క్రికెటర్‌గా! నేను చేసే పనులు కొందరికి నచ్చకపోవచ్చు.. కానీ కోచ్‌గా నా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి.బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి ఎలాంటి వస్తువులు తీసుకురావడానికి అనుమతి లేదని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. అదే నిబంధనను నేను లబుషేన్ విషయంలో అమలు చేశాను. కొన్నిసార్లు నేను కోపంగా ప్రవర్తించి ఉండొచ్చు.. అలా అని ప్రతీసారి అదే విషయాన్ని గుర్తుచేస్తు తప్పుబట్టడం సరికాదు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా 2018 బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత లాంగర్ ఆసీస్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఎంపికయిన సంగతి తెలిసిందే. కాగా టీమిండియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తేడాతో కోల్పోవడంపై ఆసీస్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.చదవండి: అతడి కెప్టెన్సీలో టీమిండియా స్వేచ్ఛగా ఆడుతుంది -
ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే!
మెల్బోర్న్: ఆసీస్ జట్టులో విభేదాలు ఉన్నాయని.. దానికి కారణం ఆ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ అని సిడ్నీ హెరాల్డ్ ప్రతిక పేర్కొంది. కోచ్ వ్యవహారశైలితో ఆటగాళ్లు ఇబ్బందులకు గురవుతున్నారని.. దీంతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లు లాంగర్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లుగా రాసుకొచ్చింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో కోచ్ లాంగర్ స్పందించాడు. 'ఆటగాళ్లతో విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదు. అయినా ఇందులో నిజమెంతనేది నేను పట్టించుకోను. ఆటగాళ్లు తమ తిండి విషయాల్లో ఒకరు కావాలనుకుంటే నా పని నేను చేసినట్లు కాదు. ఇటీవలే టీమిండియాతో జరిగిన గబ్బా టెస్టులో మా ఆటగాడు సాండ్విచ్ తినడానికి మైదానంలోకి తీసుకువచ్చాడు. గత అనుభవాల దృష్యా ఆసీస్ ఆటగాళ్లపై నిరంతరం నిఘా ఉందని.. జేబులో ఏదైనా తీసుకెళ్తే అది ప్రమాదంగా మారే అవకాశం ఉందని.. తీసుకురావద్దని అతనికి చెప్పా. దీనిని కూడా తప్పే అంటే ఇంకేం చేయలేను.చదవండి: దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే ఇక బౌలింగ్ వ్యవహారాల్లో తలదూర్చకపోవడానికి కారణం ఉంది. బౌలింగ్ కోచ్ ఉన్నప్పుడు అతనే బౌలర్లను పర్యవేక్షిస్తాడు. పైగా నేనెప్పుడు బౌలర్ల సమావేశానికి హాజరుకాను.. కానీ కొన్ని నెలలుగా వాటిలో కూడా మార్పులు చోటుచేసుకోవడంతో దానిపై దృష్టి పెట్టాల్సి వచ్చిందంటూ' చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పటికే టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన ఆసీస్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా కోచ్ లాంగర్ వివాదం ఎక్కడికి తీసుకెళుతుందో వేచి చూడాలి. చదవండి: ఐపీఎల్లో ఆడేందుకు నేను సిద్ధం -
పాపం లాంగర్.. ఓడిపోయాకా తెలిసొచ్చినట్లుంది
బ్రిస్బేన్: గబ్బా వేదికగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ విధించిన 328 పరుగులు భారీ లక్ష్యాన్ని భారత్ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్ల నుంచి టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ కూడా టీమిండియాను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (అద్భుత విజయం : బీసీసీఐ భారీ నజరానా) 'ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు టీమిండియాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఈరోజు భారత ఆటతీరు ఔట్ స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఈ ఓటమితో మాకు గుణపాఠం కలిగింది. 150 కోట్ల మంది బలమున్న టీమిండియాను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదనేది ఈరోజే తెలిసొచ్చింది. కీలక ఆటగాళ్ల గైర్హాజరీలోనూ టీమిండియా అద్బుత ప్రదర్శనతో 2-1 తేడాతో సిరీస్‌ను ఎగురేసుకుపోయింది. ఏది ఏమైనా ఇండియా-ఆసీస్ టెస్టు సిరీస్ మాత్రం మరుపురానిదిగా నిలిచిందనడంలో సందేహం లేదు.. మ్యాచ్‌ల్లో గెలుపోటములు అనేవి సహజం.. ఈ విజయంతో టెస్టు క్రికెట్‌కున్న విలువేంటో మరోసారి కనిపించింది. (చారిత్రాత్మక విజయం : నీతా అంబానీ ప్రశంసలు ) రిషబ్ పంత్ లాంటి ఆటగాడు టీమిండియాకు దొరకడం అదృష్టం.. అసలు ఏ మాత్రం భయం అనేది లేకుండా పంత్ సాగించిన ఇన్నింగ్స్ చూస్తే.. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ హెడ్డింగేలో ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తుకు తెచ్చకునేలా చేసింది. శుబ్‌మన్ గిల్ కూడా మంచి బ్యాటింగ్ కనబరిచాడు. కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడిన గిల్‌కు టెస్టు క్రికెట్లో మంచి భవిష్యత్తు ఉంది.'అని చెప్పుకొచ్చాడు. లాంగర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీమిండియా మ్యాచ్ గెలిచాకా లాంగర్‌కు విషయం అర్థమయినట్లుంది అంటూ కామెంట్స్ జతచేశారు. 🗣 "Pant's innings reminded me a bit of Ben Stokes at Headingley actually. 🗣 "You can never take anything for granted. Never ever underestimate the Indians." - Justin Langer talks to @haydostweets about the series #AUSvIND pic.twitter.com/lnbnjqWjmg — 7Cricket (@7Cricket) January 19, 2021 -
ఇదంతా ఐపీఎల్ వల్లే జరిగింది
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్, టీమిండియాల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఇరు జట్ల ఆటగాళ్లు గాయపడడం వెనుక ప్రధాన కారణం ఐపీఎల్ అని లాంగర్ పేర్కొన్నాడు. ఎప్పుడు సమయానికి జరిగే ఐపీఎల్ గతేడాది కరోనాతో ఆలస్యంగా ప్రారంభకావడంతోనే ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారని తెలిపాడు. అయితే తాను ఐపీఎల్‌ను తప్పు బట్టడం లేదని.. కేవలం ఐపీఎల్ ప్రారంభించిన సమయాన్ని మాత్రమే తప్పుబడుతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. (చదవండి: పాపం పకోవ్‌స్కీ.. మళ్లీ ఔట్!) మూడో టెస్టు అనంతరం ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు. 'ఈసారి ఆసీస్, టీమిండియాల మధ్య జరుగుతున్న సిరీస్ నాకు కాస్త విచిత్రంగా కనిపిస్తుంది. వన్డే సిరీస్‌తో మొదలైన గాయాల బెడద ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొదట మా జట్టు ఆటగాళ్లు గాయాల బారీన పడగా.. ఇప్పుడు టీమిండియా వంతు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. వన్డే సిరీస్, టీ20 సందర్భంగా మా జట్టు తరపున డేవిడ్ వార్నర్, మార్కస్ స్టొయినిస్‌లు గాయపడగా.. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే కామెరాన్ గ్రీన్, విల్ పకోవ్‌స్కీ లాంటి వారు గాయాలతో ఇబ్బంది పడ్డారు. (చదవండి: 'ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్ధం') తాజాగా టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లలో షమీ మొదలుకొని ఉమేశ్, జడేజా, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రాలు గాయపడ్డారు. దీంతో పాటు తొడ కండరాలు పట్టేయడంతో టీమిండియా కీలక స్పిన్నర్ అశ్విన్ నాలుగో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఐపీఎల్ వల్లే జరిగింది. ఐపీఎల్ ఆలస్యంగా జరగడం వల్లే ఇలా జరిగిందనేది నా అభిప్రాయం. ఇలాంటి పెద్ద సిరీస్‌కు ముందు ఐపీఎల్ సరికాదు. ఐపీఎల్ అంటే నాకూ ఇష్టమే. ఇంగ్లిష్ కౌంటీ ఎలాగైతే ప్లేయర్స్‌కు ఉపయోగపడేదో.. ఇప్పుడు ఐపీఎల్ కూడా అంతే ' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇరు జట్ల మధ్య జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. -
ఆ స్థానంలో నన్ను ఊహించుకోలేను: ఆసీస్ కోచ్
సిడ్నీ: చెత్త ప్రదరర్శన కారణంగా ప్రత్యర్థి జట్టు ఎదుర్కొంటున్న బాధను అర్థం చేసుకోగలనని, అయితే వారి కోచ్ స్థానంలో మాత్రం తనను ఊహించుకోలేనని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. ప్రస్తుతం టీమిండియాపై ఒత్తిడి ఉందని, అది తమ జట్టుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. క్రిస్మస్ వీకెండ్‌ను తాము సంతోషంగా గడుపుతామని చెప్పుకొచ్చాడు. కాగా ఆసీస్‌తో అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. పింక్ బాల్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆట ముగించి చెత్త రికార్డు నమోదు చేసింది. ఇక ఇన్నింగ్స్‌లో ఒక్క ఆటగాడు కూడా డబుల్ డిజిట్ దాటకపోవడం 96 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే తొలిసారి కావడంతో కోహ్లి సేనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇందుకు బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి వైదొలగాలంటూ నెటిజన్లు మండిపడ్డారు. అతడిపై విమర్శలు గుప్పించారు. కాగా సోని నెట్వర్క్ నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న లాంగర్‌కు ఈ అంశం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. రవిశాస్త్రి స్థానంలో మీరుంటే ఏం చేసేవారు అని అడుగగా.. ‘‘అసలు ఆ విషయంతో నాకు సంబంధం లేదు. ఇప్పటికే నాకున్న ఒత్తిళ్లు చాలు. అయితే వారి బాధను నేను సహానుభూతి చెందగలను. ఇక ఇప్పుడు టీమిండియాపై ఒత్తిడి ఉందనేది వాస్తవం’’ అని పేర్కొన్నాడు. (చదవండి: టీమిండియా మా రికార్డును బ్రేక్ చేసింది: అక్తర్) వాళ్లిద్దరూ లేకపోవడం మంచిదే ఇక కోహ్లి, షమీ గైర్హాజరీ తమకు లాభిస్తుందన్న లాంగర్.. తదుపరి మ్యాచ్‌కు తాము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నామని తెలిపాడు. ‘‘ఏ ఆటలోనైనా స్టార్లు లేకుంటే ప్రత్యర్థి జట్టుకు ఉపయోగకరమే కదా. విరాట్ కోహ్లి గొప్ప ఆటగాడు. షమీ కూడా మంచి ప్లేయర్. వాళ్లు లేకపోవడం మాకు సానుకూలాంశమే. ఇక రెండో టెస్టులో మొదటి రోజు నుంచే రహానే(తాత్కాలిక కెప్టెన్)పై ఒత్తిడి పెంచుతూ ముందుకు సాగుతాం’’ అని పేర్కొన్నాడు.