AL Vijay
-
మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్
తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన గతేడాది రెండో పెళ్లి చేసుకుంది. చాన్నాళ్లుగా ప్రేమించిన తర్వాత ప్రియుడు జగత్ దేశాయ్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. గత నవంబర్ 5న వివాహం జరగ్గా.. ఇప్పుడు ఏడాది పూర్తయిన సందర్భంగా అమలాపాల్ అప్పటి మధుర జ్ఞాపకాల్ని షేర్ చేసుకుంది. కేరళలోని కొచ్చిలో ఈ పెళ్లి వేడుక జరిగింది.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)ఈ పెళ్లి వీడియో అంతా బాగానే ఉంది. కాకపోతే అమలాపాల్ పరోక్షంగా తన మొదటి భర్త గురించి పరోక్షంగా కామెంట్స్ చేసింది. 'నా జీవితంలో గతంలో కొన్ని తప్పులు జరిగాయి. వాటికి థ్యాంక్స్ చెబుతున్నా. ఎందుకంటే వాటి వల్లే ఇతడు నా జీవితంలోకి వచ్చాడు' అని చెప్పుకొచ్చింది. ఈమె జీవితంలో తప్పు అంటే అది దర్శకుడు ఏఎల్ విజయ్‌తో పెళ్లే అనుకుంటా! అలానే జగత్ దగ్గర ఉంటే చాలా సేఫ్‌గా అనిపిస్తుందని కూడా చెప్పింది. అంటే ఇంతకుముందు అలా లేదనేగా!తమిళంలో నటిగా కెరీర్ ప్రారంభించిన అమలాపాల్.. 2014లో తమిళ దర్శకనిర్మాత ఏఎల్ విజయ్ను పెళ్లాడింది. కొంతకాలానికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవడమే మంచిదని నిర్ణయానికొచ్చారు. 2017లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఒంటరిగానే ఉన్న అమలాపాల్.. గతేడాది నవంబర్ 5న జగత్ దేశాయ్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) View this post on Instagram A post shared by Magic Motion Media | Photography & Films (@magicmotionmedia) -
స్టార్ హీరోయిన్ మాజీ భర్తపై దాడి చేసిన యువకుడు
హీరో విజయకాంత్ చనిపోవడంతో, ఆయనకు నివాళి అర్పించడానికి వెళ్లిన దళపతి విజయ్‌పై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. దీని గురించి అందరూ అనుకునేలోపే తాజాగా మరో సంఘటన వైరల్ అయింది. ప్రముఖ దర్శకుడు-స్టార్ హీరోయిన్ మాజీ భర్త కారుపై ఓ వ్యక్తి దాడి చేశాడు. రోడ్డుపై చాలా పెద్ద గొడవ పడ్డాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) 'నాన్న' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్.. హీరోయిన్ అమలాపాల్‌ని 2014లో పెళ్లి చేసుకున్నాడు. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడిపోయారు. ఆ తర్వాత 2019లో ఐశ్వర్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విజయ్.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్, కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన తీసిన 'మిషన్ చాప్టర్-1' సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అయితే మూడు నాలుగు రోజుల ముందు చెన్నైలో వెళ్తుండగా, ఓ వ్యక్తి వచ్చిన ఏఎల్ విజయ్ కారుపై దాడి చేశాడు. ఆ సమయంలో కారులో డైరెక్టర్ విజయ్‌తోపాటు మేనేజర్ మణివర్మ, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. కారుకి అడ్డుగా వచ్చిన ఆ వ్యక్తి.. ఏఎల్ విజయ్‌తో వాగ్వాదానికి దిగాడు. హెల్మెట్‌తో పలుమార్లు కారుపై కొట్టాడు. ఈ దాడిలో మేనేజర్‌కి స్వల్ప గాయాలైనట్లు డైరెక్టర్ చెప్పాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి.. పోలీసుల అదుపులోనే ఉన్నాడు. (ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) இயக்குனர் AL VIJAY-யிடம் மதுபோதையில் தகராறு செய்த நபர்.#ALVijay #Accident #Galatta pic.twitter.com/xuIP8J7RXJ — Galatta Media (@galattadotcom) December 27, 2023 -
మరోసారి ఆ డైరెక్టర్‌కు అనుష్క గ్రీన్ సిగ్నల్?
అందానికి ప్రతిరూపం నటి అనుష్క. ఈ బెంగళూరు బ్యూటీ తొలి రోజుల్లో యోగా టీచర్ అన్నది తెలిసిందే. ఆ తరువాత సూపర్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు కథానాయకిగా తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ప్రత్యేకతను చాటుకున్న ఈ భామ ఆదిలో అందాలారబోతకే పరిమితమైంది. అరుంధతి చిత్రంతో తనలోని నటనను నిరూపించుకున్నారు. ఆ తరువాత వరుసగా హీరోయిన్‌కు ప్రాముఖ్యత కలిగిన పాత్రలు రావడం మొదలెట్టాయి. అలా నటించిన చిత్రాలే రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి భారీ చిత్రాలు. చదవండి: ‘కట్టప్ప’ సత్యరాజ్ కూతురు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? అలా అగ్రనటిగా రాణించిన అనుష్క కోలీవుడ్‌కు రెండు చిత్రంతో పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోనూ తన అందాలతో యువతను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దైవ తిరుమగళ్, సింగం వంటి హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటిది ఇంజి ఇడుప్పళగి చిత్రంలో పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క దాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఫలితం శూన్యం. దీంతో చాలా కాలం నటనకు దూరం అయ్యారు. ఆ మధ్య తెలుగులో నవీన్ పొలిశెట్టితో కలిసి ఒక చిత్రం చేస్తున్నట్లు ప్రచారం జరిగినా, అది ఏ స్టేజీలో ఉందో తెలియని పరిస్థితి. కాగా అనుష్క మరింత లావెక్కిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యి ఆశ్చర్యపరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుష్క మళ్లీ కోలీవుడ్‌లో రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకు ముందు ఏఎల్.విజయ్ దర్శకత్వంలో దైవతిరుమగళ్ చిత్రంలో నటించారు. కాగా మరోసారి అనుష్కతో చిత్రం చేయడానికి విజయ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చదవండి: వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్ రష్మీ కొందరు దర్శకులు అనుష్కతో చిత్రాలు చేయడానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది. అందుకు కారణం తన బరువే అంటూ ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు విజయ్ దర్శకత్వంలో నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు లావుగా ఉన్న తనను గ్రాఫిక్స్ ద్వారా సన్నగా చూపించడానికి ఈ దర్శకుడు అంగీకరించినట్లు, అందుకే అనుష్క ఆయన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్‌తోనే అమీ జాక్సన్ రీఎంట్రీ..
విక్రమ్ ‘ఐ’, రజనీకాంత్ ‘2.ఓ’, రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రాలతో అమీ జాక్సన్ సుపరిచితురాలే. 2019లో ఇంగ్లీష్ వ్యాపారవేత్త జార్జ్‌ను పెళ్లాడారామె. అమీ ఓ బాబుకు జన్మనిచ్చారు. మూడేళ్ల్ల బ్రేక్ తర్వాత ఆమె తిరిగి నటిగా మేకప్ వేసుకోనున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో అరుణ్ విజయ్ హీరోగా రూపొంధనున్న ‘అచ్చమ్ ఎన్బదు ఇల్లయే’ అమీ రీ ఎంట్రీ మూవీ కానుంది. ఈ చిత్రంలో ఓ బ్రిటిష్ యువతి పాత్రలో కనిపించనున్నారు అమీ. కాగా అమీ వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన తమిళ చిత్రం ‘మద్రాస పట్టినమ్’కు దర్శకుడు అయిన ఏఎల్ విజయ్‌నే ఆమె రీ ఎంట్రీ ఫిల్మ్‌కు దర్శకుడు కావడం విశేషం. అంతేకాదు.. ‘మద్రాస పట్టినమ్’లో బ్రిటిష్ యువతిగా నటించిన అమీ ఇప్పుడు అదే దర్శకుడు తీస్తున్న ‘అచ్చమ్ ఎన్బదు..’లో కూడా సేమ్ బ్రిటిష్ యువతి పాత్రే చేస్తుండటం విశేషం. -
కంగనా ఓ గొప్ప నాయకురాలవుతుంది
‘‘తెలుగు, తమిళంలో నట వారసత్వం ఉన్నప్పటికీ గ్రూపిజమ్, గ్యాంగిజమ్ ఉండవు. అన్ని భాషలవారినీ ఆదరిస్తారు. దక్షిణాదిలో నాకు లభించిన ప్రోత్సాహం, అభిమానం చూస్తే ఇక్కడే మరికొన్ని చిత్రాల్లో నటించాలనిపిస్తోంది. విజయేంద్ర ప్రసాద్‌గారు సిఫారసు చేయకపోయి ఉంటే ‘తలైవి’ అవకాశం నాకు వచ్చేది కాదు. నేనీ పాత్రకు సరిపోతానని నమ్మి విజయ్ నన్ను ఒప్పించారు’’ అని కంగనా రనౌత్ అన్నారు. దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. జయలలిత పాత్రను కంగనా రనౌత్, ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మంగళవారం కంగనా పుట్టినరోజు సందర్భంగా ‘తలైవి’ ట్రైలర్‌ని చెన్నైలో విడుదల చేశారు. ‘‘తలైవి అంటే లీడర్.. నిజ జీవితంలోనూ కంగనా ఓ గొప్ప నాయకురాలవుతుంది’’ అన్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్. ‘‘పురుషాధిపత్యంలోంచి ఓ మహిళ ఎలా నిలబడింది? ఎలా విజయం సాధించింది? అనేది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు ఏఎల్ విజయ్. ‘‘తలైవి’ టీజర్ విడుదలయ్యాక అందరూ నా ఎంజీఆర్ లుక్‌పై ప్రశంసలు కురిపించారు.. ఎంతో కష్టపడ్డావ్ అన్నారు. కానీ నేనీ సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాను’’ అన్నారు అరవింద్ స్వామి. విష్ణు వర్ధన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ బృందా ప్రసాద్ మాట్లాడారు. చదవండి: బర్త్ డే నాడే కన్నీళ్లు పెట్టుకున్న కంగనా -
భయపెట్టారు; విడాకులపై నోరు విప్పిన అమలాపాల్..
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన యాంథాలజీ ‘పిట్ట కథలు’ చిత్రంలో నటించి మెప్పించారు అమలాపాల్. నందిని రెడ్డి దర్వకత్వం వహించిన ఈ కథలో మీరా అనే మహిళా పాత్రలో ఆమె కనిపించారు. వివాహం మీద సాంప్రదాయ ఆలోచన ఉన్న ఆధునిక మహిళ మీరా. ఆమెను భర్త నిత్యం అనుమానిస్తూ ఉంటాడు. లైంగికంగా, శారీరక వేధింపులకు గురిచేస్తుంటాడు. అయినప్పటికీ మీరా అతనితోనే జీవితం కొనసాగిస్తుంటుంది. అయితే ఈ బంధం నుంచి బయటపడాలని అనుకున్నప్పుడు ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి. చివరికి ఈ గృహహింస నుంచి తనెలా బయటపడిందనేది మీరా కథ. ఈ సిరీస్‌లోని తన నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఈ కేరళ బ్యూటీ. ఈ క్రమంలో ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ముచ్చటించారు. వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు చర్చించారు. పిట్టకథలులోని తన పాత్ర దృష్టిలో పెట్టుకొని నిజ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలను గుర్తు చేసుకొన్నారు. ‘ఏఎల్ విజయ్‌తో నెలకొన్న విభేదాల కారణంగా విడిపోవాలని అనుకొన్నప్పుడు నన్ను అందరూ భయపెట్టారు. నువ్వు ఒక అమ్మయివంటూ ఎగతాళి చేశారు. నాకు అండగా ఎవరూ నిలువడలేదు. నా కెరీర్ నాశనం అవుతుందని, సమాజం హేళన చేస్తుందని హెచ్చరించారు. నా సంతోం గురించి, నా మానసిక సంఘర్ణణను గురించి ఎవరూ పట్టించుకోలేదు’ అని అమలాపాల్ చెప్పుకొచ్చారు. కాగా 2014 తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ను ప్రేమించి పెళ్లాడిన అమలా పాల్ కొంత కాలానికే అతనితో విడిపోయారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థలతో 2017 విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమధ్య కాలంఓ మరొకరితో రిలేషన్షిప్లో ఉన్నట్లు వెల్లడించారు. తనను బాగా అర్ధం చేసుకున్న వ్యక్తి తన జీవితంలోకి వచ్చాడని చెప్పినా.. తన పేరు మాత్రం వెల్లడించలేదు. అయితే దర్శకుడితో విడాకుల అనంతరం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని టార్గెట్ చూస్తూ అనేకమంది అమలాను ట్రోల్స్ చేశారు. అయితే పట్టించుకోకుండా తన కెరీర్లో ముందుగు సాగుతున్నారు. ప్రస్తుతం అధో ఆంధా పరవాయి పోలా, ఆడు జీవితం, పరాణ్ణు పరాణ్ణు, పరాణ్ణు, కాడవెర్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. చదవండి: మాజీ ప్రియుడిపై అమలాపాల్ కేసు రన్నింగ్ బస్‌లో లిప్‌లాక్.. ‘రొమాంటిక్’గా పూరీ కొడుకు -
తలైవి: ఎంజీఆర్ లుక్ రిలీజ్
నిజ జీవిత పాత్రలు చేయాలంటే ఆషామాషీ కాదు. అందులోనూ ప్రముఖుల జీవిత కథల్లో నటించేటప్పుడు వారి హావభావాలు, ఊతపదాలు, నడత, నడక అన్నీ వారిని తలపించేలా ఉండాలి. స్వయంగా ఆ ప్రముఖులు మళ్లీ కళ్లముందు కనిపించేలా మ్యాజిక్ చేయాలి. నటుడు అరవింద్ స్వామి కూడా ఈ విషయంలో సక్సెస్ సాధించినట్లే కనిపిస్తోంది. నేడు దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రమ్(ఎంజీఆర్) వర్దంతి. ఈ సందర్భంగా 'తలైవి' సినిమాలో పురట్చి తలైవర్(విప్లవ నాయకుడు) ఎంజీఆర్ పాత్రకు సంబంధించిన ఫొటోలను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి ఒదిగిపోయారు. ఈ పాత్ర ఒప్పుకున్నప్పుడే ఆయన ‘డెంటిస్ట్’ దగ్గరకు వెళ్లి తన పళ్లు ఎంజీఆర్ పళ్లకి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయా? అని కూడా చెక్ చేసుకున్నారంటే ఆయన ఎంత పర్ఫెక్షనిస్టో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: బ్రెయిన్ డెడ్: ఏదైనా మిరాకిల్ జరగాలి) దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయ్ 'తలైవి' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తలైవిగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్, ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఈ ఏడాది విడుదల చేసిన అరవింద్ స్వామి లుక్‌కి విశేషమైన స్పందన లభించింది. తలైవి సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. విష్ణు వర్దన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాతలుగా, హితేష్ తక్కర్, తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: నేను ఎంజీఆర్ రాజకీయ వారసుడ్ని: కమల్) It was not just an honour to play the role of Puratchi Thalaivar MGR, but a great responsibility. I thank director A.L. Vijay & producers @vishinduri @shaaileshrsingh for having faith in me. I humbly post these pics in Thalaivar’s memory, today.#Thalaivi #MGR #ArvindSwamiasMGR pic.twitter.com/F4KY07Q4Dt — arvind swami (@thearvindswami) December 24, 2020 -
తండ్రి అయిన దర్శకుడు
చెన్నై: ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి ఐశ్వర్య విజయ్ శనివారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచింది. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఐశ్వర్య విజయ్ మగబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు విజయ్ సోదరుడు, నటుడు ఉదయ తెలిపారు. ‘నేను పెద్దనాన్నని అయ్యాను. ఉదయం 11.25 గంటల సమయంలో విజయ్, ఐశ్వర్య దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది’ అని ఉదయ ట్వీట్ చేశారు. (రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య) కాగా హీరోయిన్ అమలాపాల్‌తో విడాకుల అనంతరం డాక్టర్ ఆర్.ఐశ్వర్యను దర్శకుడు ఏఎల్ విజయ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ 2014లో అమలాపాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్లు వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. ఆ తరవాత వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. 2017లో విడాకులు తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం అమలాపాల్ సింగిల్‌గానే ఉన్నారు. (బాలయ్యకు మద్దతు తెలిపిన నిర్మాత) Yes..IAM A PERIYAPPA now..Brother Director VIJAY And AISHWARYA VIJAY blessed with baby boy at 11.25am ...Happppyyyyyyyy....Soooo happpy....@onlynikil — Udhaya (@ACTOR_UDHAYAA) May 30, 2020 -
దీపకు ఆ హక్కు లేదు: గౌతమ్ మీనన్
పెరంబూరు: దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ను నిషేధించాలని కోరే హక్కు ఆమె సోదరుడి కూతురు దీపకు లేదని దర్శకుడు గౌతమ్ మీనన్ పేర్కొన్నారు. ‘క్వీన్’ పేరుతో గౌతమ్ మీనన్ జయలలిత బయోపిక్‌ను వెబ్ సిరీస్‌గా రూపొందించిన సంగతి తెలిసిందే. అదే విధంగా దర్శకుడు ఏఎల్ విజయ్ ‘తలైవి’ పేరుతో జయలలిత బయోపిక్‌ను ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నటి కంగనారనౌత్ జయలలితగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. కాగా జయలలిత బయోపిక్‌ను తన అనుమతి లేకుండా నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ జయలలిత సోదరుడి కూతురు జే.దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జయలలిత బయోపిక్‌లపై నిషేధం విధించలేమని పేర్కొంటూ దీప పిటిషన్‌ను కొట్టి వేశారు.(క్వీన్ రివ్యూ: ‘అమ్మ’గా అదరగొట్టిన రమ్యకృష్ణ) ఈ క్రమంలో ఆమె మరో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి దర్శకుడు గౌతమ్‌మీనన్, దర్శకుడు విజయ్‌లకు బదులివ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా జయలలిత బయోపిక్ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. దీంతో దర్శకుడు గౌతమ్ మీనన్ తరఫు న్యాయవాది కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అందులో దీపకు జయలలిత బయోపిక్ చిత్రాలను నిషేధించాలనే అర్హతగానీ, హక్కుగానీ లేవన్నారు. జయలలిత సొంత బంధువునని చెప్పుకొనే దీప పలుమార్లు తాను జయలలితను కలుసుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యానని చెప్పారన్నారు. అయినా తాను రూపొందించిన ‘క్వీన్’ సిరిస్ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినదని, అనితా శివకుమార్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించిన సిరీస్ అని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు. -
హీరోయిన్ మాజీ భర్తకు రెండో పెళ్లి..
చెన్నై,పెరంబూరు: నటి అమలాపాల్ మాజీ భర్త, సినీ దర్శకుడు ఏఎల్.విజయ్ రెండో పెళ్లి చేసుకున్నారు. కిరీటం, మదరాసు పట్టణం, తలైవా, దైవ తిరుమగళ్, దేవీ 1, 2 వంటి పలు చిత్రాల దర్శకుడు ఏఎల్.విజయ్. ఈయనకు దైవ తిరుమగళ్ చిత్ర షూటింగ్ సమయంలో ఆ చిత్రంలో ఒక హీరోయిన్గా నటించిన అమలాపాల్‌తో పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నా రు. అయితే మూడేళ్లు తిరగకుండానే విజ య్, అమలాపాల్ మధ్య మనస్పర్థలు తలెత్తడం, విడిపోవడం జరిగిపోయింది. 2017 లో వీరిద్దరూ చట్టబద్ధంగా విడాకులు పొం దారు. ఆ తరువాత దర్శకుడిగా విజయ్, నటిగా అమలాపాల్ ఎవరి పనిలో వాళ్లు బిజీ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు విజయ్ ఇటీవల చెన్నైకి చెందిన ఐశ్వర్య అనే వైద్యురాలిని వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే విజయ్, ఐశ్వర్యను శుక్రవారం వివాహం చేసుకున్నారు. వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇరువర్గాల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా విజయ్‌కి ఆయన అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రెండో వివాహం మీ జీవితంలో సంతోషాలను కురిపించాలని కొందరంటే, గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని కొందరు శుభాకాంక్షలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతున్నారు. -
కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నా
తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారు. డాక్టర్ ఐశ్వర్యాను జూలైలో వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించారాయన. ‘నాన్న, అభినేత్రి, లక్ష్మీ (ప్రభుదేవా డ్యాన్స్ మూవీ)’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఏఎల్ విజయ్ పరిచయమే. తాజాగా పెళ్లి విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ – ‘‘జీవితంలో ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కోలా ఉంటుంది. నా జీవితంలో ఆనందం, బాధ, సక్సెస్, ఫెయిల్యూర్ అన్నీ ఉన్నాయి. అన్ని సమయాల్లో నాకు తోడుగా నిలబడిన మీడియా ఫ్రెండ్స్‌ను నా ఫ్యామిలీలా భావించాను. నా ప్రైవసీని, ఎమోషన్స్‌ను మీడియా వాళ్లు చాలా గౌరవించారు. డాక్టర్ ఆర్.ఐశ్వర్యను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాను అనే విషయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. జూలైలో కుటుంబ సభ్యుల మధ్య మా పెళ్లి వేడుక జరగనుంది. జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించబోతున్నందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అని విజయ్ తెలిపారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని, జూలై 11న పెళ్లి జరగబోతోందని సమాచారం. 2014లో నటి అమలా పాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విజయ్ 2017లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. -
డాక్టర్ ఐశ్వర్యతో విజయ్ వివాహం
మదరాసిపట్నం, శైవం సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఏఎల్ విజయ్, 2014లో నటి అమలా పాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడేళ్లలోనే అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకున్న ఈ జంట ప్రస్తుతం సినిమాలతో బిజీ అయ్యారు. అయితే కొద్ది రోజులు విజయ్ రెండో పెళ్లికి సంబంధించిన వార్తలో మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక దశలో హీరోయిన్ సాయి పల్లవితో విజయ్ వివాహం అన్న ప్రచారం కూడా జరిగింది. ఈ రూమర్స్‌కు చెక్ పెడుతూ.. విజయ్ తన వివాహానికి సంబంధిచి ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించారు. జూలై నెలలో తాను డాక్టర్ ఐశ్వర్యను వివాహమాడనున్నానని వెల్లడించారు. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా తనకు అన్ని సందర్భాల్లో సహకరించిన మీడియాకు విజయ్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
అలాంటిది ఏమీ లేదు
చెన్నైలో ఓ పుకారు మొదలైంది. కొన్ని నిమిషాల్లోనే అది ఇంతింతై ఎంతెంతో దూరం వెళ్లిపోయింది. అదేంటంటే.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్, నటి సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతున్నారని. ఆ విషయాన్ని క్లారిఫై చేసుకోవడానికి విజయ్, సాయి పల్లవితో వర్క్ చేసినవాళ్లను సంప్రదించగా ఈ వార్తలను కొట్టిపారేశారు. ‘మదరాస పట్టిణమ్, దైవ తిరుమగళ్ (తెలుగులో నాన్న), దేవి (అభినేత్రి), దియ (కణం)’ వంటి సినిమాలను తెరక్కించారు ఏఎల్ విజయ్. 2016లో విజయ్, అమలా పాల్ పెళ్లి చేసుకున్నారు. 2017లో డైవర్స్ తీసుకున్నారు. గత ఏడాది ‘దియ’ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించారు. ఆ సినిమా టైమ్‌లో వీరి మధ్య స్నేహం ఏర్పడిందట. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లికూడా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని, ఈ విషయాన్ని కొన్ని రోజుల్లో ప్రకటించాలను కుంటున్నారు’ అన్నది ప్రచారంలో ఉన్న వార్తల సారాంశం. ‘‘అటువంటిదేం లేదు. ఈ వార్త ఎక్కడ నుంచి వచ్చిందో ఐడియా లేదు. ‘దియ’ షూటింగ్ సమయంలో విజయ్‌కు రాఖీ కూడా కట్టింది సాయి పల్లవి’’ అని ఇద్దరి సన్నిహితులు చెప్పుకొచ్చారు. -
‘లక్ష్మీ’ మూవీ రివ్యూ
టైటిల్ : లక్ష్మీ జానర్ : డాన్స్ బేస్డ్ మూవీ తారాగణం : ప్రభుదేవా, దిత్య, ఐశ్వర్య రాజేష్ సంగీతం : సామ్ సీఎస్ దర్శకత్వం : ఏఎల్ విజయ్ నిర్మాత : ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్.రవీంద్రన్ తెలుగు తెర మీద డ్యాన్స్ బేస్డ్ సినిమాలు చాలానే వచ్చాయి. అదే జానర్లో తెరకెక్కిన మరో మూవీ లక్ష్మీ. ఇండియన్ డాన్సింగ్ లెజెండ్ ప్రభుదేవా ప్రధాన పాత్రలో దిత్యను పరిచయం చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన సినిమా లక్ష్మీ. అభినేత్రి, అన్న, నాన్న లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఏఎల్ విజయ్ మరోసారి తనదైన స్టైల్లో లక్ష్మీ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరి ఈ ప్రయత్నం ఎవరకు విజయవంతమైంది..? కథ ; లక్ష్మీ (దిత్య)కి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే పిచ్చి. కానీ తల్లి నందిని (ఐశ్వర్య రాజేష్)కి మాత్రం డాన్స్ అంటే గిట్టదు. అందుకే కూతుర్ని డాన్స్‌కు దూరంగా పెంచాలనుకుంటుంది. ఎలాగైనా డాన్సర్ కావాలని కలలు కంటున్న లక్ష్మీ టీవీలో ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ యాడ్ చూసి ఆ కాంపిటీషన్లో పాల్గొనాలని నిర్ణయించుకుంటుంది. అందుకే తల్లికి తెలియకుండా కాంపిటీషన్లో పాల్గొనటం కోసం ఓ రెస్టారెంట్ ఓనర్ కృష్ణ(ప్రభుదేవా) సాయం తీసుకుంటుంది. కృష్ణను తన నాన్నగా పరిచయం చేసి హైదరాబాద్ డాన్స్ అకాడమీ లో జాయినవుతుంది. అదే సమయంలో కృష్ణకు లక్ష్మీ తను ప్రేమించిన నందిని కూతురు అని తెలుస్తుంది. లక్ష్మీ స్టేజ్ ఫియర్ కారణంగా టీం క్వాలిఫయింగ్ రౌండ్ నుంచి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ లక్ష్మీ, కృష్ణ కూతురని తెలుసుకున్న సెలక్టర్ యూసుఫ్.. టీంకు కృష్ణ కోచ్‌గా ఉంటే కాంపిటీషన్ లో పాల్గొనేందుకు ఛాన్స్ ఇస్తానని చెప్తాడు. (సాక్షి రివ్యూస్) అసలు యూసుష్‌కు కృష్ణకు ఉన్న సంబంధం ఏంటి..? లక్ష్మీ టీంకు కోచ్‌గా ఉండేందుకు కృష్ణ ఒప్పుకున్నాడా..? లక్ష్మీ డాన్స్ కాంపిటీషన్లో పాల్గొంటున్న విషయం తెలిసి తల్లి నందిని ఎలా రియాక్ట్ అయ్యింది.? అన్నదే మిగతా కథ. విశ్లేషణ ; ప్రభుదేవా, కొవై సరళ లాంటి ఒకరిద్దరు తప్ప మిగతా నటీనటులంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే. ఫస్ట్ హాఫ్ లో కాసేపు సత్యం రాజేష్ నవ్వించే ప్రయత్నం చేసిన రెండు మూడు సీన్స్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ప్రధాన పాత్రలో ప్రభుదేవా అద్భుతం గా నటించాడు. అయితే గతంలో ప్రభుదేవా ఈ తరహా పాత్రలో చాలా సార్లు చూశాం అనిపిస్తుంది. మరో కీలక పాత్రలో కనిపించిన దిత్య డాన్సర్‌గానే కాదు నటిగానూ మంచి మార్కులు సాధించింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో దిత్య నటన ఆకట్టుకుంటుంది. లక్ష్మీ తల్లి పాత్రలో ఐశ్వర్య రాజేష్ హుందాగా కనిపించారు. క్లైమాక్స్ సీన్స్‌లో మంచి ఎమోషన్స్ పండించారు. గతంలో డాన్స్ బేస్డ్ సినిమాలు చాలానే వచ్చాయి. ఆ సినిమాల ప్రభావం లక్ష్మీ మీద గట్టిగానే కనిపిస్తుంది. స్టైల్, డాడీ, ఏబీసీడీ లాంటి సినిమాలు ఛాయలు చాలా చోట్ల కనిపిస్తాయి. కథా కథనాల్లో పెద్దగా కొత్తదనం కనిపించకపోయినా డాన్స్ సీక్వెన్స్‌లు ఎంగేజింగ్ గా ఉన్నాయి. చాలా వరకు టీవీలో డాన్స్ రియాలిటీ షో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ లో మాత్రం దర్శకుడు విజయ్ తన మార్క్ చూపించాడు. బలమైన ఎమోషన్స్ పండించటంలో సక్సెస్ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే డాన్స్ సీక్వెన్స్ తో పాటు క్లైమాక్స్ లో లక్ష్మీకి యాక్సిడెంట్ అవ్వటం ఆ తరువాత స్టేజ్ మీద పర్ఫామ్ చేయటం లాంటి సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. సంగీత దర్శకుడు సామ్ డాన్స్ బేస్డ్ సినిమాకు కావాల్సిన స్థాయి సంగీతమందించారు. నేపథ్య సంగీతంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన విషయం కొరియోగ్రఫి. దాదాపు అన్ని రకాల డాన్స్ ఫామ్స్‌ను పిల్లలతో చేయించారు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; డాన్స్ సీక్వెన్స్‌లు ప్రభుదేవా, దిత్య క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ; రొటీన్ కథా కథనాలు నేపథ్య సంగీతం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
థ్రిల్లింగ్ పల్లవి
-
ప్రభుదేవాతో పోటీపడి మరీ డ్యాన్సులు
సాక్షి, సినిమా : ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా వయసు పెరుగుతున్న డాన్సుల్లో ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఆయన నటించిన లక్ష్మీ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆయన వేసిన బ్రేకింగ్ స్టెప్పులు ఆకట్టుకోగా.. డాన్సింగ్ సెన్సేషన్ కిడ్ దిత్యా భాండే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డాన్స్ నేపథ్యంగానే సాగుతుందని స్పష్టమౌతోంది. బాలీవుడ్ హిట్ సిరీస్ ఏబీసీడీ తరహాలో సాగే కథనంలా కనిపిస్తున్నప్పటికీ.. చిన్నపిల్లల పోటీ అనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నారి దిత్యా భాండే పోటీ పడి మరీ ప్రభుదేవాతో డాన్సులేసింది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో ఇది తెరకెక్కగా.. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసేసుకుంది. సమ్మర్ కానుకగా లక్ష్మీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
అమలాపాల్, విజయ్‌లకు విడాకులు మంజూరు
ప్రేమించి తరువాత పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్న సినీ తారలు అమలాపాల్, ఏఎల్ విజయ్‌లు లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. 2014 జూన్ 12న ఇరు కుటుంబాల అనుమతితో ఒక్కటైన ఈ జంట కొంత కాలానికే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉండాలన్న అత్తింటివారి ఆంక్షలు నచ్చని అమలా, విడాకులు తీసుకునేందుకు మొగ్గు చూపింది. జ్యుడిషియల్ సపరేషన్ పీరియడ్‌లో భాగంగా గత ఆరు నెలలుగా దూరంగా ఉంటున్న ఈ జంటకు, మంగళవారం చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వివాహ బంధానికి దూరమైన తరువాత కెరీర్ మీద దృష్టి పెట్టిన ఇద్దరూ.., ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఇటీవల దేవీ సినిమాను డైరెక్ట్ చేసిన విజయ్, ప్రస్తుతం వనమగన్ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. హీరోయిన్గా బిజీ అవుతున్న అమలాపాల్.. హెబ్బులి, అచ్చాయన్స్, సిండరెల్లా, వడ చెన్నై, తిరుట్టు పాయలె 2, విఐపి 2 చిత్రాల్లో నటిస్తోంది. విడాకుల వివాదం తరువాత అమలాపాల్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. -
సూపర్ ఛాన్స్!?
తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో విడాకులకు ముందడుగు వేసిన తర్వాత అమలా పాల్‌కు తమిళంలో అవకాశాలు తగ్గాయనే వార్త ప్రచారంలో ఉంది. విజయ్ తండ్రి అళగప్పన్ అవకాశాలు రానివ్వకుండా చక్రం తిప్పుతున్నారని టాక్. కానీ, ఈ బ్యూటీకి సూపర్ ఛాన్స్ వచ్చిందని తాజా సమాచారం. ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసనే ఛాన్స్ వచ్చిందట. పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఆయన అల్లుడు ధనుష్ నిర్మించనున్న సినిమాలో అమలా పాల్‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. ధనుష్ హీరోగా నటించి, నిర్మించిన ‘వీఐపీ’లో ఆయన సరసన, ధనుష్ నిర్మించిన ‘అమ్మా కనక్కు’ సినిమాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహ రిస్తున్న ‘వడ చెన్నై’లోనూ అమలాపాలే నాయిక. ధనుష్, అమలాపాల్ మంచి స్నేహితులనీ.. అందుకే, మామగారికి జోడీగా చాన్స్ ఇవ్వాలనుకుంటున్నారనీ కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. -
'పెళ్లైన తర్వాత సినిమాలు చేయొద్దన్నాం'
దక్షిణాది తార అమలాపాల్ పెళ్లైన రెండేళ్లకే భర్తతో విడాకులకు సిద్ధపడింది. దర్శకుడు ఏఎల్ విజయ్ తో వివాహ బంధం తెంచుకోవాలని 28 ఏళ్ల 'నాయక్' స్టార్ నిర్ణయించింది. విడిపోవడానికి గల కారణాలను ఆమె వెల్లడించలేదు. అత్తింటి వారు పెట్టిన ఆంక్షలు నచ్చకే ఆమె విడాకులు తీసుకోవాలనుకుంటుందట. ఈ విషయాన్ని అమలాపాల్ మామ, నిర్మాత ఏఎల్ అళగప్పన్ స్వయంగా వెల్లడించారు. నటన మానేసి ఆదర్శ భారతనారిగా ఉండాలన్న తమ ఆకాంక్షను ఆమె లెక్కచేయలేదని తమిళ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 'పెళ్లైన తర్వాత కూడా అమల సినిమాలు ఒప్పుకుంది. ఇది విజయ్ కు నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇక సినిమాలు ఒప్పుకోనని చెప్పింది. కానీ ఇప్పుడు పాటలు పాడుతోంది. అంతేకాకుండా సూర్య, ధనుష్ సినిమాల్లో కూడా నటిస్తో్ంది. మా మాట వినకుండా సినిమాలు చేస్తోంది. దీని గురించి ఆమెతో విజయ్ ఏం మాట్లాడాడో మాకు తెలియదు. మా కొడుకు మాకు ముఖ్యం. అమలాపాల్, విజయ్ విడాకులు తీసుకుంటున్నట్టు వస్తున్న వార్తలు నిజమే. న్యాయపరంగా విడిపోతార'ని అళగప్పన్ చెప్పారు. -
విడాకులు నిజమేనంట..
ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలాపాల్ విడాకులు తీసుకుంటున్నారంటూ వచ్చిన రూమర్లు ఇప్పుడు నిజమేనంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. దర్శకుడు ఎఎల్ విజయ్ను ప్రేమించి పెద్దలను ఒప్పించి 2014లో వివాహం చేసుకున్నారు అమలాపాల్. అయితే రెండేళ్ల వ్యవధిలోనే వారి వివాహ బంధం బీటలు వారడం గమనార్హం. అమలాపాల్ వరుసగా సినిమాలు చేస్తుండటం ఆమె భర్తకు నచ్చడంలేదన్నది విడాకులకు కారణంగా వినిపిస్తోంది. విజయ్ మాట కాదని అమలా కొన్ని సినిమాలు ఒప్పుకోవడం విడాకుల నిర్ణయానికి దారి తీసిందట. వీరి విడాకుల విషయం స్వయంగా విజయ్ తల్లిదండ్రులు ధృవీకరించడంతో.. ఇది నిజమేనంటూ చెన్నై సినీ వర్గాలు వెల్లడించాయి. విజయ్ తల్లిదండ్రులు కూడా ఈ నిర్ణయానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. చేతి నిండా సినిమాలతో కెరీర్ బిజీగా ఉన్న సమయంలోనే అమలా వివాహం చేసుకున్నారు. విజయ్ దర్శకత్వంలో ఆమె రెండు సినిమాల్లో నటించారు. ఆ పరిచయమే ప్రేమగా మారింది. పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె తిరిగి వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. -
అవునా..! ఇది నిజమా?
మూడు ముళ్లు పడి పట్టుమని మూడేళ్లు కూడా కాలేదు. అప్పుడే, కథానాయిక అమలాపాల్, ఆమె భర్త-దర్శకుడు విజయ్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడానికి రెడీ అవుతున్నారనే వార్త చెన్నైలో చక్కర్లు కొడుతోంది. ఏ.ఎల్.విజయ్, అమలాపాల్‌ల వైవాహిక జీవితం సాఫీగా సాగడం లేదన్నది చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరు ఇళ్లల్లో నివాసం ఉంటున్నారట. వ్యక్తిగత జీవితంలో సమస్యలు మొదలవడంతో విడిపోవాలనుకుంటున్నారని సదరు వార్తల సారాంశం. అందుకే, అమలాపాల్ వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారనే వార్త కూడా వినిపిస్తోంది. వీటిపై వీరిద్దరూ స్పందించలేదు. తెలుగులో ‘బెజవాడ’, ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ తదితర సినిమాల్లో అమలాపాల్ నటించిన విషయం తెలిసిందే. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ‘దైవ తిరుమగళ్’లో (తెలుగులో ‘నాన్న’గా విడుదలైంది) ఆమె హీరోయిన్గా నటించారు. ఆ సినిమా అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత విజయ్ దర్శకత్వం వహించిన ‘తలైవా’ అనే తమిళ చిత్రంలోనూ అమలాపాల్ కథానాయికగా నటించారు. ఆ సమయంలో ప్రేమ ఇంకా బలపడింది. 2011లో ప్రేమలో పడిన వీరిద్దరూ మూడేళ్లు రహస్యంగా ప్రేమించుకున్నారు. 2014 జూన్ 12న చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. అమల క్రిస్టియన్. విజయ్ హిందువు. నిశ్చితార్థం చర్చిలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం, పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగాయి. పెళ్లయిన కొత్తలో భర్తతో కలసి దిగిన ఫొటోలను అమల సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేసేవారు. ఈ ఏడాది జనవరి 1న ఫేస్బుక్ ఫాలోయర్లకి ‘న్యూ ఇయర్ విషెస్’ చెప్పిన వీడియోలో భర్తతో కలసి కనిపించారు. ఆ తర్వాత ఈ జంట పబ్లిక్‌లో కనిపించలేదు. ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నారనడానికి ఇదో నిదర్శనం అని పరిశీలకులు అంటున్నారు. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతారా? కలిసి ఉండి, తమపై వచ్చిన వార్తలు నిజం కాదని నిరూపిస్తారా? అమలాపాల్ -
గురువు కోసం సింగిల్ సాంగ్‌లో..
గురువు కోసం సింగిల్ సాంగ్‌లో దుమ్ము రేపడానికి సిద్ధమైంది ఇంగ్లిష్ బ్యూటీ. ఆ అమ్మడు ఎవరో ఇప్పటికే చాలా మందికి అర్థం అయ్యే ఉంటుంది. ఎస్.అనతికాలంలోనే సూపర్‌స్టార్‌తో రొమాన్స్ చేసే స్థాయికి ఎదిగిన ఎమీజాక్సన్‌నే ఆ బ్యూటీ. ఇక ఆమె గురువెవరన్నది అందరికీ తెలిసిందే. 16 ఏళ్ల పరువంలోనే ఈ ముద్దుగుమ్మను మదరాసుపట్టణం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి చేసి దర్శకుడు ఏఎల్.విజయ్ను ఎమీ తన గురువుగా భావిస్తుంది. చాలా కాలం తరువాత ఏఎల్.విజయ్ కోరిక మేరకు సింగిల్‌సాంగ్ చేయడానికి సిద్ధమైంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న ఎమీ ఇప్పటి వరకూ సింగిల్ సాంగ్‌లో నటించలేదు. తొలిసారిగా తన గురువు కోసం తన సింగిల్‌సాంగ్‌లో తన కాలు కదపనుంది. సంగతేమిటంటే డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా హీరోగా నటిస్తూ సొంతంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఏఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్న కథానాయికగా నటిస్తున్నారు. హారర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి అభినుత్రి అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట చోటు చేసుకోవడంతో అందులో ప్రభుదేవాతో లెగ్ షేక్ చేయడానికి క్రేజీ నటి అవసరం అవడంతో దర్శకుడి మదిలో మెదిలిన తార ఎమీజాక్సన్. మూడు భాషల్లోనూ ఎమీకి గుర్తిం పు ఉండడంతో తనే కరెక్ట్ అని భావించిన ఏఎల్.విజయ్ వెంటనే ఎమీజాక్సన్‌కు ఫోన్ కొట్టగా గురువు కోసం వెంటనే ఓకే అనడంతో పాటు అందుకు కొన్ని డేట్స్ కేటాయించేసిందట. ప్రస్తుతం రజనీకాంత్ చిత్రం 2.ఓ చిత్రం కోసం చెన్నైలోనే మకాం పెట్టిన ఎమీ త్వరలోనే అభినేత్రి చిత్రం కోసం ప్రభుదేవాతో డాన్స్ చేయనుందని సమాచారం.ఈ చిత్రానికి ఎస్.తమన్, జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించడం మరో విశేషం. -
విశాల్‌తో మొదటిసారి..
బాహుబలి చిత్రం చాలా మందికి చాలా మేలు చేసింది. ముఖ్యంగా ఇక పనైపోయింది అనే ప్రచారం ముమ్మరంగా జరుగున్న నటి తమన్నాకు నటిగా పునర్జన్మ నిచ్చిందనే చెప్పాలి. ఆమె నట జీవితం బాహుబలికి ముందు ఆ తరువాత అని చెప్పుకునేంతగా మారి పోయింది. ప్రస్తుతం తమన్నా యమ బిజీ హీరోయిన్గా మారిపోయారు. ఇప్పుడు వరుసగా అవకాశాలు ఈ మిల్కీబ్యూటీ తలుపు తడుతున్నాయి. విశేషం ఏమిటంటే తెలుగుతో పాటు తమిళంలోనూ తను క్రేజీ కథానాయకి అయిపోయారు.ప్రస్తుతం తెలుగు,తమిళ్, హిందీ మొదలగు మూడు భాషల్లో నటిస్తూ పుల్‌జోష్‌లో ఉన్నారు. ఇటీవల ద్విభాషా చిత్రం ఊపిరితో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న తమన్నా ఇప్పుడు బాహుబలి-2, తమిళంలో విజయ్‌సేతుపతితో ధర్మదురై చిత్రాల్లో నటిస్తున్న తమన్నా హిందీలో ఒక చిత్రం చేస్తున్నారు. త్వరలో ఏఎల్.విజయ్ దర్శకత్వంలో అభినేత్రి అను త్రిభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. అజిత్ తాజా చిత్రంలోనూ తమన్నానే నాయకి అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో స్టార్ హీరో విశాల్‌తో రొమాన్స్ చేసే అవకాశం తమన్నాను వరించింది. ఇంతకు ముందు రోమియో జూలియట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎస్.నందగోపాల్ ఈ క్రేజీ కాంబినేషన్లో చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సురాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే చాలా కాలంగా హీరో పాత్రలే చేస్తానంటూ మొండి పట్టుతో ఉన్న హాస్య నటుడు వడివేలు ఈ చిత్రంలో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయనతో పాటు సూరి, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు, సంపత్ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. వినోదం మేళవించిన కమర్షియల్ అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రం మే నెల రెండో తేదీన చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
ప్రభుదేవా కాంతాలో తమన్నా!
ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా కథానాయకుడుగా నటించి చాలా కాలమైంది. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు కెళ్లి అక్కడ ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా తన చిత్రాల్లో అతిథి పాత్రల్లో మాత్రమే మెరిసేవారు. ఇక తమిళ తెరపై ఆయన నల్లపూస అయ్యారనే చెప్పాలి.అలాంటి ప్రభుదేవా తాజాగా మళ్లీ తమిళ చిత్ర పరిశ్రమపై దృష్టి సారించడం ఇక్కడి ఆయన అభిమానులకు సంతోషకరమైన విషయమే. ప్రభుదేవా ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తి వినోదన్ చిత్రంతో పాటు ప్రభుదేవా హీరోగా భోగన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాటితో పాటు తను హీరోగా మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి తమన్న నాయకిగా నటిస్తున్నారు. దీనికి ఏఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం హారర్ ఇతివృత్తంతో రూపొందుతోంది. అయితే దీనికి ఇప్పుడు కాంత అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారక పూర్వకంగా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
నటి అమలాపాల్ వివాహం