all partys
-
Lok Sabha election 2024: అలవిగాని హామీలు
‘ఊరూరా బారు, బీరు. నెలకు 10 లీటర్ల బ్రాందీ. ఫారిన్ విస్కీ సరఫరా’, ‘ఏకంగా చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్పు’, ‘ఒక్కొక్కరి ఖాతాలో ఏటా రూ.కోటి జమ’, ‘బాల్య వివాహాలకు మద్దతు’... ఇవన్నీ ఎన్నికల్లో అభ్యర్థులు గుప్పిస్తున్న చిత్ర విచిత్రమైన హామీలు! గెలుపే లక్ష్యంగా అలవిగాని హామీలు గుప్పించే సంస్కృతి పెరుగుతోంది. కొందరు అభ్యర్థులు వార్తల్లో నిలిచేందుకు చిత్ర విచిత్రమైన వాగ్దానాలు చేస్తున్నారు... బీరు, బంగారం, రూ.10 లక్షలు వనితా రౌత్. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా చిమూర్వాసి. అఖిల భారతీయ మానవతా పార్టీ అభ్యర్థిగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో చంద్రపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గ‘మ్మత్తయిన’ హామీలతో ఫేమస్ అయ్యారామె. తనను గెలిపిస్తే ప్రతి గ్రామంలో బీర్లతో బార్ ఏర్పాటు చేయిస్తానని, ఎంపీ లాడ్స్ నిధులతో విస్కీ, బీర్లు దిగుమతి చేసుకుని మరీ ఓటర్లకు ఉచితంగా సరఫరా చేస్తానని ప్రకటించారు. ‘‘నిరుపేదలు ఎంతో కష్టించి పనిచేస్తారు. వారు మద్యం సేవించి సేదదీరుతారు. కానీ నాణ్యమైన విస్కీ, బీర్లు తాగే స్థోమత లేక దేశీయ లిక్కరే తాగుతుంటారు. అందుకే నాణ్యమైన లిక్కర్ దిగుమతి చేసుకుని వారికందించాలని అనుకుంటున్నా’’ అంటూ రౌత్ తన హామీలను సమరి్థంచుకుంటున్నారు! 2019 లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే హామీలు గుప్పించారామె. 2019 ఎన్నికల్లో తమిళనాడులోని తిరుపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఎ.ఎం.õÙక్ దావూద్ కూడా ఇలాగే ప్రతి కుటుంబానికీ నెలకు 10 లీటర్ల స్వచ్ఛమైన బ్రాందీ సరఫరా చేస్తానని హామీ ఇచ్చారు! పెళ్లి చేసుకునే ప్రతి జంటకు ఏకంగా 10 సవర్ల బంగారం, ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలిస్తానని, కుటుంబానికి నెలకు ఏకంగా రూ.25,000 ఇస్తాననీ వాగ్ధానం చేశారు! చంద్ర యాత్ర 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సౌత్ మదురై నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన శరవణన్ (33) అనే జర్నలిస్టు ఉచితంగా చంద్రుడిపైకి పంపిస్తానని, మినీ హెలికాప్టర్ ఇస్తానని, ఐఫోన్లు పంచిపెడతానని హామీలిచ్చారు. ప్రతి ఓటర్ ఖాతాలో ఏకంగా ఏటా రూ.కోటి జమ చేస్తానన్నారు! ఇంటి పనుల్లో సాయానికి గృహిణులకు ఉచిత రోబోలను అందిస్తానని, ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ పూల్తో కూడిన మూడంతస్తుల భవనం, ప్రతి మహిళకూ వివాహ సమయంలో 100 సవర్ల బంగారం, కుటుంబానికో పడవ, యువతకు వ్యాపారం ప్రారంభించేందుకు రూ.కోటి సాయం చేస్తానని వాగ్ధానం చేశారు. పైగా తన నియోజకవర్గాన్ని ఎప్పుడూ చల్లగా ఉంచేందుకు 300 అడుగుల ఎత్తులో కృత్రిమ హిమ పర్వతాన్ని ఏర్పాటు చేయిస్తానన్న హామీ నవ్వులు పూయించింది. అయితే, ‘తమిళనాడులో ప్రబలంగా ఉన్న ఉచిత తాయిలాల సంస్కృతి బారిన పడొద్దంటూ ఓటర్లలో అవగాహన కలి్పంచడమే తన లక్ష్యమని ముక్తాయించారాయన. రైతును పెళ్లాడితే.. రైతు కుమారుడిని పెళ్లాడే మహిళకు రూ.2 లక్షల సాయం చేస్తామని 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఇచి్చన హామీ తెగ వైరలైంది. ‘‘రైతుల అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు ముందుకు రావడం లేదు. అందుకే రైతుల స్వీయ గౌరవాన్ని కాపాడేందుకు ఈ హామీ ఇచ్చాం’’ అన్నారాయన. బాల్య వివాహాలకు రైట్ రైట్ 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ అభ్యర్థి శోభా చౌహాన్ ఇచ్చిన హామీ చర్చనీయంగా మారింది. ‘‘దెవాసీ సమాజంలో బాల్య వివాహాల సంస్కృతిలో పోలీసుల జోక్యాన్ని నివారిస్తాం. నన్ను గెలిపిస్తే బాల్య వివాహాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా చూస్తాం’’ అని ప్రకటించారు. మునుగోడును అమెరికా చేస్తా తెలంగాణలో 2022 మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఇచి్చన హామీ కూడా హైలైటే. తనను గెలిపిస్తే మునుగోడును అమెరికాలా మారుస్తానని, ఇతర పారీ్టలు 60 నెలల్లో చేయలేనంత అభివృద్ధిని ఆరు నెలల్లోనే చేసి చూపిస్తానని హామీ ఇచ్చారాయన. ప్రపంచవ్యాప్తంగానూ... 2012 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ న్యూ గింగ్రిచ్ విఫలయత్నం చేశారు. తనను గెలిపిస్తే 2020 కల్లా టికి చంద్రుడిపై శాశ్వత అమెరికా కాలనీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారాయన! ► అవే ఎన్నికల్లో వెర్మిన్ సుప్రీమ్ అనే ఆరి్టస్ట్ తనను గెలిపిస్తే ప్రతి అమెరికన్‌కు ఓ గుర్రాన్ని కానుకగా ఇస్తానని ప్రకటించారు. ► జింబాబ్వేలో 2018 ఎన్నికలప్పుడు ప్రజలకు ఐదేళ్లలో 15 లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ జాను–పీఎఫ్ పార్టీ హామీనిచి్చంది. అంటే సగటున రోజుకు ఏకంగా 822 ఇళ్లన్నమాట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక అసెంబ్లీ వంతు!
17వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయపక్షాలు దృష్టి సారిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు, వచ్చే ఏడాదిలో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగను న్నాయి. ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్న హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలు నమోదు చేసుకుంది. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 119 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, మిత్రపక్షాలు 108 సీట్లు గెలుచుకున్నాయి హరియాణా, ఢిల్లీలలోని మొత్తం సీట్లను(17) బీజేపీ కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో కాషాయపక్షం భాగస్వామి శివసేనకు 19 లోక్‌సభ సీట్లు దక్కాయి. బిహార్‌లోని 40 సీట్లలో ఎన్డీఏలోని బీజేపీ, జేడీయూ చెరో 16 స్థానాలు, లోక్‌జన్ శక్తి పార్టీ ఆరు సీట్లు గెలుచుకున్నాయి. ఢిల్లీలో త్రిముఖ పోటీ? వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి పాలకపక్షమైన ఆప్, కాంగ్రెస్‌లతో బీజేపీకి త్రిముఖ పోటీ తప్పదు. 2015 ఫిబ్రవరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మొత్తం 70 సీట్లలో 67 కైవసం చేసుకోగా బీజేపీ మూడు స్థానాలకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఒక్క సీటూ గెలుచుకోలేక మూడో స్థానానికి దిగజా రింది. గత నవంబర్‌లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దయినా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంకా ప్రకటించలేదు. అయిదు నెలల క్రితం రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. అయితే, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలవలేకపోయిం ది. ఛత్తీస్‌లో మొత్తం 11లో రెండు స్థానాలే సాధించగలిగింది. మధ్యప్రదేశ్‌లో సైతం కాంగ్రెస్‌కు ఒక్క సీటే దక్కింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల తీరు గమనించి కొన్ని రాష్ట్రాలకు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలెవరో అంచనా వేసి చెప్పడం కుదిరేపని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ప్రధానాంశాలు మారడమే కారణం. పార్లమెంట్ ఎన్నికల్లో పరిగణించే అంశాలకూ, అసెంబ్లీ ఎన్నికల్లో వారిని కదిలించే విషయాలకూ ఉండే తేడాల వల్ల గెలిచే పార్టీలపై జోస్యం చెప్పడం కష్టమని చండీగఢ్ విశ్లేషకుడు ఘనశ్యామ్ దేవ్ అభిప్రాయపడ్డారు. -
మాట తూటా
ఠారెత్తిస్తున్న ఎండలకి జనం మాడు పగులుతూ ఉంటే, ఎండ వేడితో పోటీ పడుతూ రాజకీయ నేతలు నిప్పు కణికల్లా విసురుతున్న మాటలతో ఎవరికి మూడుతుందో అర్థం కావడం లేదు. మరో రెండు దశల్లో ఎన్నికలు ముగుస్తాయనగా మన నేతాశ్రీలు మరుగున పడిన కుంభకోణాలను, నేతల పాత చరిత్రను తవ్వి తీస్తున్నారు. వాటినే ఎన్నికల అస్త్రాలుగా మలచుకొని గురి పెట్టి కొడుతున్నారు. ప్రధానిని కాపాలదారుడే దొంగ అని రాహుల్ గాంధీ అన్న దగ్గర్నుంచి ఇప్పుడు నరేంద్ర మోదీ హఠాత్తుగా దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని భ్రష్టాచారి నం.1 అనడంతో రాజకీయ ప్రచార వేడి రికార్డు స్థాయికి చేరుకుంది. నరేంద్ర మోదీ బోఫోర్స్ కుంభకోణాన్ని ప్రచారం బోనులోకి తీసుకువస్తే, ఫైర్ బ్రాండ్ మమతా దీదీ, గోధ్రా మత ఘర్షణల్ని ప్రస్తావిస్తూ నిప్పులు చెరుగుతున్నారు. తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్న టైపులో నేతలందరూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మీ తండ్రిని (రాజీవ్‌గాంధీ) ఆయన భజనపరులు మిస్టర్ క్లీన్ అని కీర్తిస్తున్నారు కానీ, రాజీవ్ మరణించేనాటికి నం 1 భ్రష్టాచారి (అత్యంత అవినీతి పరుడు) అని పేరు తెచ్చుకున్నారు’ – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి మోదీజీ యుద్ధం ముగిసిపోయింది. మీ ఖర్మ ఎలా ఉందో త్వరలో తేలిపోతుంది. మా తండ్రిపై మీరు చేసిన వ్యాఖ్యలతో మీ అంతరంగం తేటతెల్లమైంది. ఇక మిమ్మల్ని ఏవీ కాపాడలేవు. నేను మాత్రం మీకు ప్రేమతో ఓ పేద్ద కౌగిలింత ఇవ్వగలను. – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోదీకి ఉన్నంత అహంకారం మరెవరికీ ఉండదు. మహాభారతంలో దుర్యోధనుడు పాత్రకి అంతటి అహం ఉంది. అలాంటి అహంకారుల్ని దేశ ప్రజలు సహించరు. దీనికి దుర్యోధనుడి జీవితమే నిలువెత్తు నిదర్శనం. – ప్రియాంక గాంధీ , కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దుర్యోధనుడెవరో, అర్జునుడు ఎవరో ? తేల్చాల్సింది మీరు కాదు. దేశ ప్రజలే తేలుస్తారు. – అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నరేంద్ర మోదీని ప్రియాంక పొరపాటున దుర్యోధనుడు అన్నారు. వాస్తవానికి ఆయన ఒక తలారి (ఉరి శిక్షల్ని అమలు చేసే వ్యక్తి). ఎందరో జడ్జీలు, జర్నలిస్టుల మృతికి ప్రధానిదే బాధ్యత – రబ్రీదేవి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రైతన్నలను దోపిడీ చేసిన వ్యక్తిని ఈ చౌకీదార్ కోర్టుకు లాగాడు. ఆ వ్యక్తి ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) చుట్టూ తిరుగుతున్నాడు. బెయిల్ కోసం కోర్టుకు పోయాడు. తానేమో షెహన్షా(రారాజు) అనుకుంటాడు. ఇప్పుడు వణికిపోతున్నాడు. నేనిప్పటికే అతన్ని జైలు గుమ్మం వరకూ తీసుకువెళ్లాను. నన్ను ఆశీర్వదించండి. అతన్ని వచ్చే ఐదేళ్లలో జైలుకు పంపిస్తాను, – ప్రియాంక భర్త వాద్రాపై పరోక్షంగా మోదీ నన్ను అయిదేళ్లుగా వేధిస్తున్నారు. వివిధ విచారణ సంస్థల ద్వారా నోటీసుల మీద నోటీసులు పంపుతూ మానసికంగా వేధిస్తున్నారు. 11సార్లు నోటీసులు పంపి, ఒక్కో విడతలో 11 గంటల చొప్పున విచారించారు. అయినా ఒక్క ఆధారమూ దొరకలేదు. పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యల్ని గాలికి వదిలేసి మళ్లీ నా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు – రాబర్ట్ వాద్రా మమత పరిపాలనలో తృణమూల్ కాంగ్రెస్ బలవంతపు వసూళ్లకు పాల్పడుతోంది తృణమూల్ టోలాబాజీ ట్యాక్స్ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు – మోదీ నేను బలవంతంగా వసూళ్లు చేస్తే, మీరెవరు. మీ తల నుంచి కాళ్ల వరకు ప్రజల రక్తంతో తడిసిపోయింది కదా. ఎప్పుడు చూసినా అ ల్లర్లు, అల్లర్లు, అల్లర్లు. మోదీ ఒక అబద్ధాల కోరు, రావణ, ఎక్సపైరీ పీఎం (ఆయన ప్రధాని పదవి ఎక్స్పైర్ అయిందన్న అర్థంలో) – మమతా బెనర్జీ ఎప్పుడో పదిహేడేళ్ల క్రితం గుజరాత్ అల్లర్లు జరిగాయి. వాటిని ఇప్పుడు ప్రస్తావించడం ఏమిటి ? దాని వల్ల రాజకీయంగా తృణమూల్‌కు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది‘‘ – దిలీప్ ఘోష్, బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మోదీ భక్తులు తమ పిల్లలకి ఇంక ఇలాంటి రైమ్స్ నేర్పించాలి. మోదీ మోదీ యస్ పాపా, అభివృద్ధి జరిగిందా నో పాపా, రైతులు ఆనందంగా ఉన్నారా, నో పాపా, 10 కోట్ల ఉద్యోగాలు నో పాపా, అన్నీ కబుర్లే హహహ – తేజస్వి యాదవ్, ఆర్జేడీ నేత -
తెలుగు ఓటర్ల ప్రభావమెంత?
సాక్షి ముంబై: మహారాష్ట్రలో నాలుగో విడత, ఆఖరి దశ పోలింగ్‌కు సమయం దగ్గరపడింది. ముంబైలోని ఆరు స్థానాలతోపాటు 17 స్థానాలకు సోమవారం ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ముంబై, థాణేతోపాటు భివండీలో నివసించే తెలుగు ప్రజలు అభ్యర్థులు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. దీంతో వీరిని ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నాలు చేశాయి. తెలుగు రాజకీయ నేతలతో ప్రచారం చేయించాయి. బీజేపీ తరఫున రాపోలు ఆనంద్ భాస్కర్, బాబూ మోహన్, కాంగ్రెస్ తరఫున విజయ శాంతి, నేరెళ్ల శారద తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. మహానగరి ముంబైలో.. దక్షిణ ముంబై ఎంపీ స్థానంలోని వర్లీ, కమాటిపురా, కొలాబా, సాత్‌రాస్తా తదితర ప్రాంతాల్లో సుమారు 50 వేల మంది తెలుగు ఓటర్లున్నారు. దక్షిణమధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గంలోని ధారావి, వాడాలా, చెంబూర్, సైన్ కొలివాడా తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు సుమారు 45 వేల మంది ఉంటారు. మరోవైపు ఉత్తర ముంబైలోని బోరివలి, దహిసర్, కాందివలి తదితర ప్రాంతాల్లో సుమారు 40 వేల ఓటర్లుండగా ఉత్తర పశ్చిమ ముంబైలో సుమారు 30 వేల వరకు ఓటర్లుంటారని అంచనా. అదేవిధంగా ఉత్తర తూర్పు ముంబై, ఉత్తర మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ములూండ్, విక్రోలి, ఘాట్కోపర్, విలేపార్ల, కుర్లా, బాంద్రా తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో తెలుగు ఓటర్లున్నారు. ముఖ్యంగా దక్షిణ ముంబై, దక్షిణ మధ్య ముంబై, ఉత్తర ముంబై లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. దీంతో ఇక్కడి తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీల నేతలు ప్రత్యేక దృష్టిపెట్టారు. భివండీలో మనవాళ్లే కీలకం.! భివండీ లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. భివండీ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీలకమైన తూర్పు భివండీ, పశ్చిమ భివండీ, పశ్చిమ కళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గణనీయ సంఖ్యలో తెలుగు వారున్నారు. ఈ మూడు అసెంబ్లీ స్థానాల పరిధిలో 1.50 లక్షల మంది తెలుగు ఓటర్లుంటారు. వీరిలో తెలంగాణ వాసులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. దీంతో భివండీ లోక్‌సభ స్థానంలో అభ్యర్థుల గెలుపోటములపై తెలుగు ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. ధాణేలో కొంతమేర.. థాణే లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. థాణేలోని కిసన్‌నగర్, సిపి తలావ్, హజూరి, కల్వా, లోకమాన్యనగర్, బాల్కుమ్, గాంధీనగర్, సుభాష్‌నగర్, మీరా–భయిందర్, ఐరోలి, బేలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలున్నారు. భివండీలో బాబూమోహన్ ప్రచారం భివండీలోని తెలుగు వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ పేర్కొన్నారు. ముంబైతోపాటు భివండీలో బీజేపీ, శివసేన కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం ఇక్కడికి చేరుకున్న ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. తెలుగు భవన్, ముంౖ»ñ వర్సిటీలో తెలుగు పీఠం ఏర్పాటుతో పాటు తెలుగు ప్రజల ఇతర సమస్యలపై స్థానిక నేతలతో మాట్లాడి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. -
ఎన్నికల జాతరలో అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారం కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. సంప్రదాయ జెండాలు, ప్లెక్సీలతో పాటు బెలూన్లు, బటన్లు, టీషర్టులు, కప్పులు, కీ–చైన్లపై తమ గుర్తులను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి. వీటిపై ఆయా పార్టీల మద్దతుదారులు, యువత ఆసక్తి చూపుతుండటంతో ఆఫ్‌లైన్‌తో పాటు అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఆన్లైన్ సంస్థల్లోనూ జోరుగా అమ్మకాలు సాగుతున్నాయి. మై భీ హూ చౌకీదార్(నేనూ కాపలాదారునే) అనే బీజేపీ నినాదమున్న టీ–షర్టులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మోదీ, ప్రియాంకా గాంధీ చీరలకు డిమాండ్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రత్యేక టోపీలను తీసుకొచ్చింది. వీటికే భారీ డిమాండ్.. కాంగ్రెస్, బీజేపీ సహా వేర్వేరు రాజకీయ పార్టీల గుర్తులు, నినాదాలతో వస్తున్న టీ–షర్టులు, కప్పులు, కీచైన్లకు ఆన్లైన్లో మంచి గిరాకీ ఉందని ఆన్లైన్ రిటైల్ సంస్థ స్నాప్‌డీల్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘అభ్యర్థులు, పార్టీల చిత్రాలు ఉన్న కాఫీ మగ్గులు, పవర్ బ్యాంకులు, యూఎస్బీ డ్రైవ్స్, టీ షర్టులు, చీరలను కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో కారు, బైక్ స్టిక్కర్లు, టీషర్టులు, టోపీలు, నీటి బాటిళ్లు, కీచైన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి’ అని అన్నారు. మోదీ, రాహుల్, ప్రియాంక వంటి కీలక నేతల ముఖచిత్రాలతో ఉన్న ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని పేరొన్నారు. సదర్ బజార్లో దీటుగా అమ్మకాలు.. ఆన్లైన్ అమ్మకాలకు పోటీగా ఢిల్లీలోని సదర్ బజార్లో ఎన్నికల ఉత్పత్తుల అమ్మకాలు సాగుతున్నాయి. ఇక్కడి షాపుల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లకు చెందిన జెండాలు, బ్యాండ్లు, పార్టీ ముఖ్యనేతల చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. విక్రమ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ యజమాని హర్‌ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ప్రచార సామగ్రి అమ్మకాల్లో బీజేపీ అన్నిపార్టీల కంటే ముందంజలో ఉందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థ అమెజాన్ వెబ్సైట్లో మోదీ చీరలు రూ.700 నుంచి రూ.3,549 మధ్యలో దర్శనమిస్తున్నాయి. మరోవైపు బీజేపీ ప్రచార సామగ్రిని అమ్మేందుకు ‘నమో రథాల’ను సిద్ధం చేశామనీ, ఈసీ నుంచి అనుమతి లభించిన వెంటనే వీటిని రంగంలోకి దించుతామని బీజేపీ నేత మనోజ్ తెలిపారు. -
పార్టీల అభ్యర్థుల ‘లెక్కల’ కుస్తీలు
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోలింగ్ ఘట్టం ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఓటింగ్ తీరు తెన్నులపై ఆరా తీస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ శాతం పెరగడంతో. ఎవరికి అనుకూలమనే కోణంలో బూత్‌ల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. బూత్ స్థాయి అనుచరులతో మాట్లాడుతూ.. గెలుపోటములపై అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలపై అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొనగా, బెట్టింగుల పర్వం కూడా ఊపందుకుంటోంది. ఇదిలా ఉంటే జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఈ నెల 11న జరిగే ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై దృష్టి సారించింది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఏకంగా 8.1శాతం ఓట్లు అదనంగా పోల్ అవడంతో, పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలమనే కోణంలో పార్టీలు, అభ్యర్థులు విశ్లేషణలు సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు పోలి ంగ్ తీరుతెన్నులపై ఆరా తీస్తూ, అనుచరగణానికి ఆదేశాలు జారీ చేయడంలో అభ్యర్థులు తీరిక లేకుండా గడిపారు. శుక్రవారం రాత్రికి పో లింగ్ బూత్‌లు, మండలాల వారీగా ఓటింగ్ వివరాలు చేతికి అందడంతో అభ్యర్థులు.. బూత్‌ల వారీ విశ్లేషణలపై దృష్టి సారించారు. బూత్‌ల వా రీగా పోలైన ఓట్ల సంఖ్య, అందులో తమకు అనుకూలంగా పడే ఓట్ల సంఖ్యను విశ్లేషించుకుంటూ కీలక అనుచరులతో శనివారం తెల్లవారుజాము వరకు కసరత్తు చేశారు. తమకు పడే ఓట్ల సం ఖ్యపై ఓ అంచనాకు వచ్చిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గెలుపు ధీమా కనిపిస్తోంది. పక్షం రోజులు గా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన నేతలు శనివారం విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తూనే, తమను కలిసేందుకు వచ్చిన అనుచరులతో పోలింగ్ వివరాలపై ఆరా తీశారు. ఓట్ల లెక్కింపునకు మరో రెండు రోజులు ఉండడంతో అభ్యర్థులు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తూనే, ఫలితాలపై లెక్కలు వేసుకుంటున్నారు. జోరుగా సాగుతున్న బెట్టింగులు పోలింగ్ ఘట్టం ముగియడంతో శుక్రవారం సాయంత్రం మీడియాలో వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలి తాలపై నాయకులు, సామాన్యులనే తేడా లేకుం డా చర్చల్లో మునిగి తేలుతున్నారు. పోలీసులు, పాత్రికేయులు, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి నుంచి వివరాల సేకరణకు అభ్యర్థులతో పాటు, వివిధ రంగాలకు చెందిన వారు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు ఫలితా లపై ఎవరికి వారుగా విశ్లేషణలు చేస్తూ, బెట్టింగులకు దిగుతున్నారు. ఇందులో విదేశీ పర్యటనలు, హోటళ్లలో విందులు, నగదు తదితర కోణాల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. నియోజకవర్గాల వారీగా స్థానిక పరిస్థితులు, వివిధ వర్గాలు ఓ టింగ్ వేసిన తీరు, ఇతర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు తరలివచ్చి ఓటేసిన వారు.. ఇలా రకరకాల కోణాల్లో ఫలితం ఎలా ఉంటుందనే కోణంలో అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో నిమగ్నం శుక్రవారం రాత్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఈవీఎంలు చేరుకోగా, శనివారం పటిష్ట బందోబస్తు నడుమ కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఐదు కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. ఒక్కో లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఎం.హనుమంతరావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఆదివారం గీతం యూనివర్సిటీ ప్రాంగణంలో తులి దశ శిక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మంగళవారం ఉదయం 8 నుంచి 12 గంటల మధ్య పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. -
కాయ్.. రాజా కాయ్!
సాక్షి,ఆర్మూర్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. అభ్యర్థుల ఖరారు నుంచే పందెంరాయుళ్లకు పండగ మొదలైంది. వివిధ పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పటి నుంచే బెట్టింగ్ జరుగుతోంది. ప్రధాన కూడళ్లలో నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఎన్నికలు, అభ్యర్థుల ప్రచారం, విజయవకాశాలపైనే ప్రధానంగా చర్చించుకుంటున్నారు. మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి అభ్యర్థుల గెలుపోటములపై పందెం కడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారు కావడం, నామినేషన్ల పర్వం ముగియడం బెట్టింగ్ మరింత జోరందుకోనుంది. ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల గత చరిత్ర, ప్రస్తుత బలాబలాలు, బలహీనతలపై ప్రజలు, రాజకీయ విశ్లేషకుల మధ్య ప్రధానంగా చర్చ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఈ బెట్టింగ్ జోరు కొనసాగుతోంది. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన వీధులైన కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, గోల్‌బంగ్లా వద్ద బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. క్రికెట్ బెట్టింగ్‌లా చైన్ పద్ధతిలో కాకుండా వ్యక్తిగతంగా డబ్బుల పంపకం నిర్వహిస్తున్నారు. మెజారిటీ స్థానాలలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొనడంతో బెట్టింగ్ ఆయా పార్టీల అభ్యర్థులపైనే కాస్తున్నారు. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో ఈ బెట్టింగ్‌ల జోరు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ధన ప్రవాహం అధికంగా ఉంటుందని ప్రచారం జరుగుతుండటంతో బెట్టింగ్‌ల జోరు సైతం అదే రీతిలో పెరుగుతున్నట్లు సమాచారం. తమ అభ్యర్థులు గెలుస్తారని ఒకరు, కాదు తమ నాయకుడే గెలుస్తారని ఇంకొకరు బెట్టింగ్‌లు కట్టడం ప్రారంభించారు. ఆర్మూర్ ప్రాంతంతో పాటు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు, మట్కా, జూదం విచ్చలవిడిగా సాగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ఈజీ మనీకి అలవాటు పడ్డ బడాబాబుల బిడ్డలు ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచే ఈ బడా బాబులు అభ్యర్థుల గెలుపోటములపై చర్చించుకోవడం ప్రారంభించారు. తమ విశ్లేషణ ప్రకారం ఫలానా అభ్యర్థి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందుతాడు చూడండి అంటూ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. రూ.5వేల నుంచి మొదలు కొని రూ.లక్ష వరకు పందెం కాస్తున్నారు. రూ. లక్ష బెట్టింగ్ కాసి, విజయం సాధిస్తే అతని ప్రత్యర్థి రూ.లక్షకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వ్యాపారులు, రాజకీయ నాయకులు సైతం ఈ బెట్టింగ్‌లలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములతో పాటు రాష్ట్రంలో ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు సైతం స్వీకరిస్తాడంటూ.. కావలిస్తే బెట్ కట్టండి అంటూ ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో రాజకీయాల గురించి చర్చించుకునే వారికి, బెట్టింగ్‌లు కట్టే వారికి మంచి టైం పాస్ వ్యవహారంగా మారింది. రూ.5 వేలకు రూ.20 వేలు, రూ.లక్షకు రూ.2 లక్షలు.. ఇలా బెట్టింగ్ కాస్తూ తాము గెలుస్తాడని నమ్మిన నాయకుని విజయావకాశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. -
24న బ్లాక్‌డే
కొరిటెపాడు(గుంటూరు): ప్రత్యేక హోదా సాధనలో భాగంగా 24వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు విద్యుత్ నిలిపివేసి అన్ని వర్గాల ప్రజలు తమ నిరసన వ్యక్తం చేసి, బ్లాక్ డేను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, జనసేన, ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం అనేక రూపాల్లో ఉద్యమాలు నిర్వహించినట్టు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ప్రధాన మంత్రి మోదీ, తేవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరిని మభ్యపెట్టడానికి దీక్షలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఊపిరి ఉన్నంతవరకు హోదా సాధన లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కపట నాటకాలు కట్టిపెట్టి ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ కలసి రావాలని, లేనిపక్షంలో చరిత్ర హీనులుగా మిగిలిపోక తప్పదని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ అంకితభావంతో అందరూ బ్లాక్ డేలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్లాక్ డే విజయవంతానికి గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో ప్రచార కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సీపీఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షలు చేసి కాలయాపన చేసేదానికన్నా మోదీపై పోరాటం చేయాలని సూచించారు. అవసరమైతే సకల జనుల సమ్మెకు కూడా వెనుకాడబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవరం రోహిత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధిపత్య పోరుతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకుడు బేతంచర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ హోదా సాధన కోసం జరిగే కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని కోరారు. ఆమ్ఆద్మీ పార్టీ నాయకుడు తోట కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారని మండిపడ్డారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు సీపీఐ నాయకులు కోట మాల్యాద్రి, కె.నాగేశ్వరరావు, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఎం నాయకుడు ఎన్.భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఈ నెల 16న ఏపీ బంద్
-
ఈ నెల 16న ఏపీ బంద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాలు ఉదృతమవుతున్నాయి. హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలన్నీ దీక్షలు, నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే హోదా సాధన కోసం ఈ నెల 16న ఏపీ బంద్‌కు హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అన్నీ వామపక్షాలు మద్దతు తెలిపాయి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా బంద్ కు దిగుతున్నట్లు సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందని, బంద్‌లు చేయాలని తాము కోరుకోవడం లేదని.. రాష్ట్ర ప్రజల కోసం రోడ్డెక్కుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 16న నిర్వహించదలచిన బంద్‌లో అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్టు తెలిపారు. బంద్‌ను ఎవ్వరూ అడ్డుకోవద్దని, ప్రతి ఒక్కరూ పాల్గొని బంద్ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఏపీ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తోందని పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి భయపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారన్నారు. హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. టీడీపీ దుష్ట చర్యలను బంద్ ద్వారా ప్రజలకు తెలియచేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజా పోరాటంతోనే హోదా.. కేంద్ర ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా బంద్‌కు అన్ని పార్టీలతో పాటు సీపీఎం కూడా సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు తెలిపారు. భారతీయ జనతాపార్టీపై యుద్ధం చేస్తామని, దొంగ దీక్షలతో నరేంద్ర మోదీ అబద్ధాలకోరుగా మారిపొయారని విమర్శించారు. ప్రజాపోరాటంతోనే కేంద్రంపై పోరాడి హోదా సాధించుకుంటామన్నారు. మోదీకి ప్రధాని పదవిలో కొనసాగే అర్హతలేదని మండిపడ్డారు. బంద్‌కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రమంతా హోదా కోసం పోరాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సంతోషాల నగరమంటూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుది జపాన్ పోరాటమైతే.. తమది ఆంధ్రప్రదేశ్ పోరాటమని ఆయన తెలిపారు. మోదీ నియంతలా అడ్డుకున్నారు ఈనెల 16న చేపట్టిన ఏపీ బంద్‌కు సీపీఐ పార్టీ మద్దుతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ప్రధాని మోదీ నియంతలా అడ్డుకున్నారని ఆ పార్టీ నేత రామకృష్ణ ఆరోపించారు. ప్రధానమంత్రి నిరసన దీక్ష చేపట్టడం అన్యాయమని ఆయన అన్నారు. చంద్రబాబును ప్రజలు క్షమించరు ప్రత్యేక హోదా కోసం ఈనెల 16న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు జనచైతన్య వేదిక పూర్తి మద్దతు ప్రకటించింది. నాలుగేళ్లు రాష్ట్రంలో ప్రజానీకాన్ని ప్రత్యేక హోదా విషయంలో మభ్య పెట్టిన కేంద్ర రాష్ట్రాల వైఖరిని వ్యతిరేకించాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి కోరారు. గతంలో మాదిరిగా బంద్‌ను విఫలం చేయటానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తే ప్రజలు క్షమించరన్నారు. బంద్ సఫలం కావటానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
2019 ఎన్నికల్లో 12 సీట్లల్లో 6 సీట్లు ఇవ్వాలి
మిర్యాలగూడ టౌన్ : వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించకుంటే తగిన బుద్ధి చెప్పుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ ప్రె సిడెంట్ మేకల వెంకన్న, తెలం గాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బీసీ కులాల సంఘాల సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో 12 సీట్లల్లో 6 సీట్లు బీసీ జనా భా ప్రాతిపదికన సీట్లు పార్టీలు కేటాయిం చాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా బీసీకి ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో అంజి, శ్రీను గిరి, సత్యనారాయణ, లక్ష్మినారాయణ, కృష్ణ, , పుప్పాల సత్యం, రాచూరి మహేష్, పందిరి వేణు, కంచి సత్యనారాయణ, లోహిత్, ఆనంద్, ప్రశాంత్ ఉన్నారు. -
22న జాతీయ రహదారుల దిగ్బంధనం
చిత్తూరు కార్పొరేషన్ : ప్రత్యేక హోదా కోసం అఖిలపక్ష పార్టీలు గురువారం చేపట్టనున్న జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో సీపీఐ నాయకులు నాగరాజన్ అధ్యక్షతన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జంగాలపల్లె మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సీపీఎం నాయకులు చల్లా వెంకటయ్య, చైతన్య మాట్లాడుతూ ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలను మోసం చేసి దగా చేసిన మోదీని తెలుగు ప్రజలు క్షమించరని తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రజల కోరిక మేరకు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధించేంతవరకు పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమించడానికి నాయకులు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ఈ పోరాటంలో భాగంగానే 22న జాతీయ రహదారుల దిగ్బంధనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు గజేంద్రబాబు, లోకేష్, అక్బర్, శరవణ, మునస్వామి, విజయగౌరి తదితరులు పాల్గొన్నారు. -
బంద్ సక్సెస్
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరగడంతో గురువారం వామపక్షాలు తలపెట్టిన బంద్ జిల్లాలో విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ మద్దతు ఇచ్చి, నిరసన కార్యక్రమాలను చేపట్టడంతో బంద్ సంపూర్ణంగా జరిగింది. జిల్లా కేంద్రం నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి పట్టణాలతో పాటు అన్ని మండలాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. నెల్లూరు రూరల్: జిల్లాలో గురువారం వామపక్ష పార్టీలు నిర్వహించిన బంద్‌కు ప్రజలు పూర్తి మద్దతు తెలిపారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. విద్యాలయాలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. గురువారం జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షను వాయిదావేశారు. సినిమాహాళ్లు, హోటళ్లు, దుకాణాలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు కదలలేదు. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. టౌన్బస్సులు ఒక్కటీ తిరగలేదు. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నగరంలోని ప్రధాన కూడళ్లయిన ఆత్మకూరు బస్టాండ్, గాంధీబొమ్మ, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. జాతీయ రహదారులపై లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లు స్వచ్ఛందగా నిలిపివేసి బంద్‌కు మద్దతు తెలిపారు. వామపక్షపార్టీల నాయకులు, వైఎస్సార్ సీపీ నేతలు ప్రదర్శనగా బయలు దేరి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. బంద్‌కు అనూన్యంగా ప్రజా మద్దతు లభించడం, బంద్ విజయవంతం కావడంతో ఆలస్యంగా టీడీపీ నేతలు బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు నగరంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, నగర, రూరల్ కార్యదర్శులు మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి, సీపీఐఎంఎల్ నాయకులు సాగర్, న్యూడెమోక్రసీ నాయకులు కిశోర్‌బాబు బంద్‌ను పర్యవేక్షించారు. బంద్‌కు మద్దతుగా నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన, అనంతరం వీఆర్సీ సెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో నగరంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాభవన్ నుంచి గాంధీబొమ్మ వరకు డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య నేతృత్వంలో నిరసన ర్యాలీ జరిగింది. పొదలకూరులో నిర్వహించిన బంద్‌లో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వామపక్షాలతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పాల్గొన్నారు. -
అంతర్గత సర్వేలు.. బలాబలాలు..!
సాక్షి, యాదాద్రి : జిల్లాలో భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం ఉంది. ప్రస్తుతం ఈ ఐదు నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, బీజేపీ పక్షాలు తమ బలాబలాను బేరీజు వేసుకునేందుకు సర్వేలను ప్రారంభించాయి. ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల పని తీరుపై రెండు దఫాలు సర్వే చేయించిన విషయం తెలిసిందే. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బెంగళూరుకు చెందిన ఓ సంస్థతో నియోజకవర్గాల వారీగా సర్వే చేయించారు. బీజేపీ సైతం జాతీయస్థాయి ప్రతినిధి బృందాన్ని జిల్లాకు పంపించి సర్వే చేయించింది. అయితే సర్వేలో అందరికీ సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు వచ్చే ఎన్నికల్లో శాసనసభ స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశావహులు సైతం ఇటీవల సర్వేలు చేయించారు. తాజాగా జిల్లాలో ఓ సంస్థ ఆన్లైన్ సర్వే చేపట్టింది. వందల సంఖ్యలో శా0పిల్స్ సేకరణ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సర్వేల్లో బిజీగా ఉన్నాయి. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు, వ్యక్తిగత, పార్టీ పని తీరు, ఎన్నికల్లో ఎవరితో పోటీపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి, విజయానికి సానుకూల, వ్యతిరేక అంశాలపై సర్వేలో లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది. యువత, మహిళలు, ఉద్యోగ, వ్యాపార, మధ్య తరగతి, కులాల వారీగా, మైనార్టీ, దళిత, గిరిజన వర్గాల్లో ఆయా అభ్యర్థులు తమ అనుకూల, వ్యతిరేక అంశాలపై సర్వే చేయించారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో సేకరించిన శాంపిల్స్‌ను క్రోడీకరిస్తున్నారు. బలం, బలహీనతలను గుర్తించడంతోపాటు వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్లాన్ చేసుకుంటున్నారు. వేర్వురుగా సర్వేలు.. ఆశావహులతో పాటు రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయి సంస్థలు, విద్యార్థి సంస్థలు వేర్వేరుగా సర్వేలకు దిగుతున్నాయి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, ప్రజల ఆలోచన విధానం, ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాల పనితీరు, ఆయా పార్టీల నుంచి పోటీ చేసే ఆశావహుల పనితీరు ప్రజల్లో వారికి ఉన్న సానుకూల, వ్యతిరేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థతోపాటు, ప్రైవేట్ సంస్థలతో సర్వేలు చేయించడం జరుగుతుంది. అయితే ఆరు నెలలుగా జరిగిన వివిధ సర్వేల ఫలితాలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. ఆశావహులు సర్వే ఫలితాలను ఉత్కంఠతో పరిశీలిస్తున్నారు. -
కార్పొరేటర్లను అరెస్టు చేయాలంటూ రాస్తారోకో
హైదరాబాద్: కార్పొరేటర్లను అరెస్టు చేయాలంటూ రాస్తారోకోఅవినీతికి పాల్పడుతున్న కార్పొరేటర్లను వెంటనే అరెస్టు చేయాలంటూ అఖిలపక్షాలు రాస్తారోకో చేపట్టాయి. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో శనివారం సాయంత్రం వివిధ పార్టీల నాయకులు చేపట్టిన ఆందోళనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల అవినీతి బాగోతంపై విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళన కారులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. -
నేటి హర్తాళ్‌కు సర్వం సిద్ధం
కరెన్సీ కష్టాలపై పోరుకు రాజకీయ పక్షాల ఏర్పాట్లు అత్యవసర సేవలకు మినహాయింపు కాకినాడలో ర్యాలీ.. కలెక్టరేట్ వద్ద ధర్నా నేడు జిల్లావ్యాప్తంగా ఆందోళనలు రాజమహేంద్రవరంలో నిరసనలకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు కాకినాడ : ముందస్తు ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేసి, ప్రజలను కరెన్సీ కష్టాల్లోకి నెట్టేసిన కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్షాలు ఇచ్చిన దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం జిల్లాలో హర్తాళ్ నిర్వహించనున్నారు. దీనిని విజయవంతం చేసేందుకు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాలుసన్నద్ధమయ్యాయి. నల్లధనాన్ని వెలికి తీసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నామని, అయితే ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలకు మాత్ర మే ఈ హర్తాళ్ నిర్వహిస్తున్నామని విపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ పోరాటంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు సహా వివిధ ప్రజాసంఘాలను కూడా భాగస్వాముల్ని చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్నందున అత్యవసర సర్వీసులకు మినహాయింపునివ్వాలని నేతలు నిర్ణయించారు. జిల్లా కేంద్రమైన కాకినాడలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు నివాసం నుంచి భానుగుడి సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ చేసి, అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నారు. వామపక్షాలు కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అమలాపురంలో అన్ని రాజకీయపక్షాలూ హర్తాళ్‌ను సక్సెస్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాజమహేంద్రవరం పరిధిలో ఆయా పార్టీల నేతలు హర్తాళ్‌కు సన్నాహాలు చేస్తూండగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు ప్రకటించింది. విజయవంతం చేయండి : కన్నబాబు హర్తాళ్‌ను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ ప్రజలను కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలనే తాము ఎండగడుతున్నామని చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే ప్రతిపక్షంగా ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందువల్లనే ఆయా రాజకీయ పక్షాలను సమన్వయం చేసుకుని జిల్లాలో హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కో ఆర్డినేటర్లు ముఖ్యనేతలంతా కలిసి వచ్చే పార్టీలు, నాయకులు, ప్రజాసంఘాలతో హర్తాళ్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
గ్యాస్ నిక్షేపాల కోసం ఉద్యమించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నేతలు బోట్‌క్లబ్ (కాకినాడ) : కేజీ బేసిన్ పరిధిలోని జిల్లాలో గ్యాస్ నిక్షేపాల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉద్యమించాలని వివిధ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీవో హోంలో సీపీఎం ఆధ్వర్యాన మంగళవారం జరిగిన అఖిలపక్షం రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, కేజీ బేసిన్లో రిలయన్స్ సంస్థ అక్రమంగా రూ.11 వేల కోట్ల విలువైన గ్యాస్‌ను తరలించుకుపోయిందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దీనివల్ల జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఓఎన్జీసీకి చెందిన నిక్షేపాలను రిలయన్స్ అక్రమంగా తరలించుకుపోయినట్టు జస్టిస్ షా కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. కేజీ బేసిన్లో గ్యాస్‌ను ఇక్కడి సంస్థలకు, జిల్లా ప్రజలకు ఇవ్వకుండా అక్రమంగా తరలించుకుపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైపోయిందని విమర్శించారు. గ్యాస్ నిక్షేపాల కోసం జరిగే న్యాయమైన పోరాటానికి తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ రియలన్స్ అక్రమాలపై ఓఎన్జీసీ ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ, కేజీ బేసిన్ డి6 బ్లాక్‌లో అధిక గ్యాస్ నిక్షేపాలున్నాయన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1999లో బీజేపీ పాలకులు ఈ బ్లాక్‌లో గ్యాస్ వెలికితీసే అవకాశాన్ని రిలయన్స్‌కు ఇచ్చేలా చట్ట సవరణ చేశారన్నారు. బిడ్ దాఖలు చేసే అవకాశాన్ని కూడా గుజరాత్‌కు చెందిన జీఎస్పీసీకి బీజేపీ ధారాదత్తం చేసిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీకి వంత పాడి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ నగర కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ, షా కమిటీ రిపోర్టు బయటకు వచ్చినా పార్లమెంట్లో ఏవిధమైన ప్రస్తావనా రాకపోవడం శోచనీయమన్నారు. సీనరేజ్ కూడా ప్రభుత్వం వసూలు చేయలేకపోయిందన్నారు. జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఉద్యమాలకు అండగా నిలుస్తామన్నారు. సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు బుగతా బంగార్రాజు, సీహెచ్.నాగేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు నక్కా కిషోర్, బీఎస్పీ నాయకుడు చొల్లంగి వేణుగోపాల్, ఆర్పీఐ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు, జేఏసీ మాజీ నేత ఆచంట రామారాయుడు, బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు తూతిక విశ్వనాథం, జనవిజ్ఞాన వేదిక నగర అధ్యక్షుడు ఆలపాటి శ్రీనివాస్, కోనసీమ దళిత వేదిక కన్వీనర్ జంగా బాబూరావు తదితరులు కూడా మాట్లాడారు. జేఏసీ కార్యదర్శి పితాని త్రినాథరావు, వైఎస్సార్ సీపీ ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, ఐద్వా నాయకులు కె.సుభాషిణి, ఎస్.భవాని, ఉద్యోగ సంఘ నాయకులు పసుపులేటి శ్రీనివాస్, కె.నాగేశ్వరరావు, సరెళ్ళ చంద్రరావు, సూర్యనారాయణ, మాధవరావు, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
గద్వాల జిల్లా కాకపోతే నడిగడ్డ ఎడారే..
ధరూరు : రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్తీకరణలో భాగంగా ఏర్పాటవుతన్న కొత్త జిల్లాల్లో గద్వాలను జిల్లా చేయాలంటూ చేస్తున్న ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఆదివారం ‘మన జిల్లా.. మన ప్రాజెక్టు’ పేరుతో జూరాల ప్రాజెక్టు వద్ద జేఏసీ పిలుపు మేరకు ఆల్ పార్టీ నాయకులు, విద్యార్ధి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక నాయకుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం నిరసన ర్యాలీ చేపట్టారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కష్ణమోహన్‌రెడ్డి, గద్వాల మున్సిపల్ చైర్మన్ పద్మావతి, జేఏసీ నాయకులు వీరభద్రప్ప, నాగర్‌దొడ్డి వెంకట్రాములు మాట్లాడుతూ వనపర్తి జిల్లా ఏర్పాటుతో గద్వాల ప్రాంతం పూర్తిగా ఎడారిగా మరిపోయే పరిస్థితి ఉందన్నారు. 400 క్యూసెక్కులు ఉన్న నీటి వాటాలో ఇప్పటికే తాగు, సాగు నీటి పేరుతో జూరాల ప్రాజెక్టు నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతున్నారని ఆరోపించారు. నడిగడ్డ అభివద్ధిలో భాగంగా దివంగత ఎమ్మెల్యే పాగ పుల్లారెడ్డి ప్రాజెక్టును నిర్మించేందుకు పూనుకున్నారని, విభజనలో భాగంగా ఆ నీటిని సైతం వనపర్తికి తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. తమ వాటా తమకు ఇవ్వడంతో పాటు గద్వాలను జిల్లా చేయాలని మరో మారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు అతికూర్రెహ్మాన్, వెంకట్రాజారెడ్డి, బీజాపూర్ ఆనంద్, మధుసూదన్‌బాబు, మున్నావర్పాష, రాజశేఖరరెడ్డి, పూజారి శ్రీధర్, గడ్డం కష్ణారెడ్డి, గంజిపేట రాములు పాల్గొన్నారు. -
వనపర్తి వద్దు.. పాలమూరే ముద్దు
ఆత్మకూర్ : మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఆత్మకూర్, చిన్నచింతకుంట, అమరచింత మండలాలను విడగొట్టి వనపర్తిలో కలిపితే ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యేలు దయాకర్‌రెడ్డి, సీతమ్మ, టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మకూర్ జూనియర్ కళాశాల ఆవరణలో సర్పంచ్ గంగాధర్‌గౌడ్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో కలపకముందే ఇక్కడ ఉన్న నీటిని ఎక్కడెక్కడికో తరలించుకుపోయి అక్కడి చెరువులు, కుంటలు సైతం నింపుకొంటున్నారని విమర్శించారు. అన్ని అర్హతలున్న ఆత్మకూర్‌ను డివిజన్, నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలన్నారు. -
శాశ్వతంగా కరువు జిల్లాగా మార్చొద్దు
– ఆల్ పార్టీ సమావేశంలో వక్తల అభిప్రాయం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : మహబూబ్‌నగర్ జిల్లాను అశాస్త్రీయంగా విభజించి శాశ్వత కరువు జిల్లాగా మార్చొద్దని వక్తలు అభిప్రాయ పడ్డారు. శనివారం డీసీసీబీ సమావేశం హాల్లో టీజేఏసీ ఆధ్వర్యంలో జిల్లా విభజన శాస్త్రీయతపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నర్సిములు, కాంగ్రెస్ నాయకుడు సంజీవ్‌ముదిరాజ్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు అంబదాస్ మాట్లాడారు. అశాస్త్రీయంగా జిల్లాను విభజించి జిల్లాకు అన్యాయం చేయొద్దని కోరారు. జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టును జిల్లాకు కాకుండా చేసే కుట్రలు జరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడుతున్న అమరచింత, ఆత్మకూర్ మండలాలతోపాటు సీసీకుంట మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీంతో కనీసం జూరాల లెఫ్ట్ బ్యాంక్ జిల్లాకు వస్తుందని చెప్పారు. ప్రతిపాదిత మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క జిల్లా కేంద్రం తప్ప మిగితా నియోజకవర్గాలు పూర్గిగా కరువు చాయలు అలుముకున్న ప్రాంతాలని వివరించారు. ఈ ప్రాంతాల నుంచి అధిక శాతం వలసలు పోతారని, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ ప్రాంతం శాశ్వతంగా వలస జిల్లాగానే మారిపోతుందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన షాద్‌నగర్ నియోజకవర్గాన్ని శంషాబాద్‌కు కలపడం అన్యాయమని, దీంతో జిల్లాకు వచ్చే అదాయం కూడా పోతుందని అన్నారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై ప్రజాప్రతినిధులు గళం విప్పాలని కోరారు. జిల్లాకు జరగుతున్న అన్యాయంపై జేఏసీ ఇచ్చే ప్రతి పోరాటానికి మద్దతు ఇస్తామని వివిధ పార్టీల నాయకులు చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ తాలూకా ఇ¯Œæచార్జ్ ఎన్పీ. వెంకటేశ్, జేఏసీ నాయకులు రామకృష్ణరావు, చంద్రనాయక్, శ్రీదర్‌గౌడ్, పరమేశ్, అంబాదాస్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘పేట’ను జిల్లాగా ప్రకటించేవరకు పోరాడుతాం
– జిల్లా సాధన సమితి స్పష్టికరణ నారాయణపేట : అన్ని అర్హతలు ఉన్న నారాయణపేటను జిల్లాగా ప్రకటించేంతవరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మనోహర్‌గౌడ్, సభ్యులు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ, కాంగ్రెస్ నియోజకవర్గ సరాఫ్‌కృష్ణ, ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాంమైనోద్దీన్ చాంద్ స్పష్టం చేశారు. ‘పేట’ను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక సెంటర్ చౌక్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నల్లగుడ్డ ధరించి మౌన ప్రదర్శన నిర్వహిస్తూ నిరసన తెలిపారు. నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానిక ఆర్డీఓ చీర్ల శ్రీనివాసులకు వినతులు సమర్పించి వారు మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆశాస్త్రీయంగా ఉందని ప్రజాభిష్టానికి ఏమాత్రం పొంతన లేదన్నారు. కేవలం రాజకీయ కోణంలోనే జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆరోపించారు. అన్ని అర్హతలు ఉన్న నారాయణపేటకు తీవ్ర అన్యాయానికి గురవుతుందన్నారు. ఇప్పటికైనా ఎంపీ, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌పై ఒత్తిడితీసుకొచ్చి జిల్లా ఏర్పాటుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నింగిరెడ్డి, కొండయ్య, పేట మున్సిపల్ చైర్పర్సన్ గందె అనసూయ, టీడీపీ నాయకులు ఓంప్రకాశ్, నర్సింహరెడ్డి, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు సిద్రామప్ప, రఘువీర్‌యాదవ్, ప్రభాకర్‌వర్ధన్, కెంచె శ్రీనివాస్, బోయలక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు సుధాకర్, కెంచె నారాయణ, సాధన సమితి సభ్యులు సుదర్శన్‌రెడ్డి, వెంకోబ, రంగారెడ్డి, శ్రీనివాస్ లహోటి, దీలిప్‌కుమార్, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా సాధనకు సంయుక్త పోరాటం
అఖిల పక్షం నాయకుడు సామల మల్లేశం సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల జిల్లా ఏర్పాటుపై ఆశలు కల్పించిన ప్రభుత్వం.. ఇప్పుడు వెనక్కు తగ్గడం సరైంది కాదని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సామల మల్లేశం అన్నారు. ఆదివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అంశంపై స్థానిక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయన మౌనం వీడి జిల్లా ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆడెపు రవీందర్ మాట్లాడుతూ..అర్థం లేని నిబంధనలను సాకుగా చూపి సిరిసిల్లను జిల్లా చేయకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జిల్లా సాధన సమితి కన్వీనర్ బుస్సా వేణు మాట్లాడుతూ..ఈనెల 16న స్థానిక వస్త్ర వ్యాపార సంఘంలో అన్ని కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తున్నట్లు వెల్లడించారు. అర్బన్‌బ్యాంకు మాజీ చైర్మన్ గాజుల బాలయ్య పంద్రాగష్టు రోజున స్థానిక అంబేద్కర్ చౌక్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడ సంగీతం శ్రీనివాస్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల యాదగిరి, మండల అధ్యక్షుడు చొక్కాల రాము, జిల్లా సాధన సమితి నాయకులు కుసుమ విష్ణు, అన్నల్దాస్ వేణు, పోలు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్ భోజన దౌత్యం
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగేందుకు అధికార విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఫిబ్రవరి 26 (శుక్రవారం) అన్ని పార్టీల నాయకులను విందుకు ఆహ్వానించారు. ఇందులో మహాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మాల్వా ప్రాంత వంటకాలను వడ్డించనున్నట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. సోమవారం రాహుల్, టీఎంసీ పక్షనేత సుదీప్ బంద్యోపాధ్యాయతో భేటీ సందర్భంగా లోక్‌సభలో తమ గొంతు వినిపించే అవకాశం ఇవ్వాలని అలాగైతేనే రాజ్యసభలో ప్రభుత్వానికి సహకరిస్తామనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేదుకు ఈ భోజన దౌత్యానికి స్పీకర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. -
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
హైదరాబాద్ : అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. రైతన్నల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, ఒకేసారిగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ర్ట బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ ప్రభావంతో పలు డిపోల్లోంచి బస్సులు బయటకు రాలేదు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నా లాభం లేకపోయింది. తెల్లవారుజామునుంచే ప్రతిపక్ష నాయకులు డిపోల వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్ అదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నగరంలోని పలు డిపోల ఎదుట అఖిలపక్ష కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాలలో బంద్‌కు నాయకత్వం వహిస్తున్న పలు పార్టీల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఎంజీబీఎస్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దానం నాగేందర్, అంజన్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నేత నారాయణ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్సుఖ్నగర్ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు ఇంద్రసేనారెడ్డి సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే విధంగా జూబ్లీ బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్: కల్వకుర్తి బస్ డిపో ముందు వైఎస్ఆర్ సీపీ నేత ఎడ్మ కిష్టారెడ్డి బైఠాయించడంతో బస్సులు రోడ్డెక్కలేదు. వనపర్తి డిపో ఎదుట అఖిలపక్ష నేతలు బైఠాయించడంతో బస్సులు డిపోకే పరిమతమయ్యాయి. వరంగల్: వరంగల్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు అడ్డుకునేందుకు యత్నించడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. మెదక్: సంగారెడ్డి ఆర్టీసీ డిపో ముందు ప్రతిపక్షాల బైఠాయించాయి. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. దుబ్బాక డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. రంగారెడ్డి: బంద్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో ఎదుట కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ నాయకులు బైఠాయించారు. డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా తెల్లవారుజాము నుంచే రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్: జిల్లాలోని 11 డిపోల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హుజూరాబాద్‌లో డిపో ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ బంద్‌కు మద్దతుగా విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. నల్లగొండ: జిల్లా వ్యాప్తంగా 7 డిపోలలో బస్సులు రోడ్డేక్కలేదు. డిపోల ఎదుట అఖిలపక్షాలు బైఠాయించాయి. సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. డిపోల వద్దకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీసీఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్: ఈ జిల్లాలో బంద్ పాక్షికంగా నడుస్తోంది. బైంసా బస్ డిపో ఎదుట వామపక్షాల నేతలు బస్సులను అడ్డుకుంటున్నారు. బస్ డిపోల ఎదుట బైఠాయించిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. జిల్లాలోని 6 డిపోలకు చెందిన 680 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. -
రాష్ట్ర బంద్.. నగరంలో ఉద్రిక్తత
హైదరాబాద్ : రాష్ట్రబంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో డిపోల ఎదుట బైఠాయించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఎంజీబీఎస్ వద్ద బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు అక్కడ బైఠాయించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్ లను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడినుంచి తరలిస్తున్నారు. రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేసేంత వరకు పోరాడుతామని ఉత్తమ్ పేర్కొన్నారు. మెహిదిపట్నంలో షబ్బీర్ అలీని అరెస్ట్ చేసి బస్సులకు దారిచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ వద్ద బైఠాయించిన టీటీడీపీ, బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్ రమణ, చింతల రాంచంద్రారెడ్డి, లక్ష్మణ్, తదితరులను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి అంబర్ పేట పీఎస్‌కు తరలించారు. కూకట్పల్లి డిపో వద్ద విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలిస్తున్నారు.